
చట్టసభలపై ప్రజలకు నమ్మకం పోతోంది
చట్టసభలపట్ల దేశ ప్రజలకు నమ్మకం పోతోందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఆవేదన వ్యక్తం చేశారు.
లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహజన్
గాంధీనగర్: చట్టసభలపట్ల దేశ ప్రజలకు నమ్మకం పోతోందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో జరిగిన 78వ ఆలిండియా ప్రిసైండింగ్ ఆఫీసర్ల సమావేశంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. ప్రజాధనం వృథా తప్ప చట్టసభల్లో నిర్ధిష్టంగా ఏమీ జరగడంలేదని ప్రజలు భావిస్తున్నారని, దీంతో వాటిపట్ల నమ్మకం సడలుతోందని, పార్లమెంటును స్తంభించే సందర్భాలు పెరుగుతుండడం బాధాకరమని పేర్కొన్నారు. చట్టసభల్లో చర్చ అర్థవంతంగా సాగేవిధంగా స్పీకర్లు కృషి చేయాలని, తమఅధికారాలను ఉపయోగించాలని సూచించారు.