వినియోగదారుల హక్కులకు కాపాడేందుకు నడుం బిగించింది న్యూయార్క్ చట్టసభ. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో ఎంతో కాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపే దిశగా తొలిసారిగా అడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఫెయిర్ రిపేర్ యాక్ట్‌ను అమలు కోసం చట్టాన్ని సిద్ధం చేసింది.
డిజిటల్ ఎలక్ట్రానిక్ వస్తువులకు ఏ చిన్న సమస్య వచ్చినా తిరిగి మాన్యుఫ్యాక్చరర్ సూచించి చోటే రిపేర్ చేయించుకోవాల్సి వస్తోంది. బయట చేయిస్తే వారంటీ, గ్యారంటీలు లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సార్లు రిపేర్ ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో వినియోగదారులు అనివార్యంగా తయారీదారు మీదే ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి అనేక సమస్యలకు చెక్ పెట్టే దిశగా న్యూయార్క్ చట్టసభ నడుం బిగించింది.
న్యూయార్క్ చట్టసభ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తయారీదారులు ఏదైనా ప్రొడక్టును మార్కెట్‌లోకి తెచ్చినప్పుడు అందులో తలెత్తే సమస్యలు వాటికి పరిష్కారాలను కూడా సూచించాల్సి ఉంటుంది. కొనుగోలుదారులు రిపేర్ల కోసం తయారీదారులతో పాటు స్థానికంగా ఉండే రిపేర్ షాప్‌లను కూడా ఆశ్రయించవచ్చు. సాధ్యమైతే అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా వాళ్లే పరిష్కారం వెతుక్కొవచ్చు. అంతేకాదు రిపేరుకు అవసరమైన విడి భాగాలు, ఇతర టూల్స్ అమ్మకంపై తయారీదారులు విధించిన ఆంక్షలు కూడా తొలగిపోతాయి.
చదవండి: అమెజాన్‌కి గుడ్‌బై చెప్పిన డేవ్‌క్లార్క్.. వీడిన 23 ఏళ్ల బంధం..
Comments
Please login to add a commentAdd a comment