వ్యాపారంలో ఉన్న ఏ కంపెనీకైనా బ్రాండ్ ఇమేజ్ అనేది ఎంతో ముఖ్యం. ఆ బ్రాండ్ ఇమేజ్‌ని కాపాడుకునేందుకు కంపెనీలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తాయి. అయితే ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లే కోట్లు పెట్టి సంపాదించిన బ్రాండ్ ఇమేజ్‌కి తూట్లు పొడుస్తాయి. తాజాగా ఇలాంటి పరిస్థితి హెచ్ అండ్ ఎం సంస్థకి ఎదురైంది.
మాజీ ఉద్యోగి అసంతృప్తి
న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) సమీపంలో హెచ్ అండ్ ఎం సంస్థకి అవుట్‌లెట్ స్టోర్ ఉంది. కొంత కాలంగా అక్కడ పని చేసిన ఓ ఉద్యోగి ఇటీవల అక్కడ జాబ్ మానేసింది. అక్కడ పని చేయడం ఇష్టం లేక ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. అయితే అక్కడితో ఆమె అసంతృప్తి ఆగిపోలేదు.
ఇంత అధ్వన్నమా ?
న్యూయార్క్ డబ్ల్యూటీసీ సమీపంలో ఉన్న హెచ్ అండ్ ఎం స్టోర్ నిర్వహాణ ఎంత అధ్వన్నంగా ఉందో చూడండి. అక్కడ హ్యంగర్లకు తగించిన హుడీ షర్ట్స్ మీద పురుగులు గుడ్లు పెడుతున్నాయి.. అయినా సరే ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ ఆమె పర్సనల్ అకౌంట్‌లో ట్వీట్ చేసింది.
సెగ తగిలింది
నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. వేల మంది ఆ ట్వీట్‌ను చూసి స్పందించారు. హెచ్ అండ్ ఎం సిబ్బంది నిర్వాకంపై దుమ్మేతి పోశారు. వందల సంఖ్యలో రీట్వీట్లు కొట్టారు. దీంతో దాని ఎఫెక్ట్ హెచ్ అండ్ ఎం యాజమాన్యానికి తాకింది.
స్టోర్ మూసేస్తున్నాం
తమ బ్రాండ్ ఇమేజ్‌కి గండి పడుతున్న విషయం గుర్తించిన హెచ్ అండ్ ఎం రంగంలోకి దిగింది. తమ కస్టమర్లు, సిబ్బంది రక్షణ మాకు ఎంతో ముఖ్యమంటూ హెచ్ అండ్ ఎం స్పందిస్తూ.. డబ్ల్యూటీసీ సమీపంలో ఉన్న స్టోర్‌ను తక్షణమే మూసేస్తున్నట్టు ప్రకటించింది. జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడతామంటూ తేల్చి చెప్పింది.
క్షమించండి
తాను చేసిన చిన్న ట్వీట్ ఇంత పెద్ద దుమారం రేపుతుందని ఊహించలేదంటూ హెచ్ అండ్ ఎం మాజీ ఉద్యోగి మరో ట్వీట్ చేశారు. ఆపద సమయంలో స్టోర్ మేనేజర్, సిబ్బంది తనకు అండగా ఉన్నారని, కానీ తన ట్వీట్ వాళ్లని ఇబ్బందులకు గురి చేసిందని పేర్కొంది. తనను క్షమించాంటూ హెచ్ అండ్ ఎం సిబ్బందికి కోరింది.
I work at the H&M in the Oculus at World Trade & today a customer discovered lice on a rack of hoodies. They’re not closing the store nor are they notifying employees of the problem. The section was just blocked off. pic.twitter.com/eAIlOxfmJu
— Choy Choy 🎋 (@Madesonee_) December 29, 2021
చదవండి: బక్కచిక్కిన కిమ్ నోట ‘జీవన్మరణ పోరాట’ మాట.. ఉ.కొ. దీనస్థితికి నిదర్శనమిది!
Comments
Please login to add a commentAdd a comment