Brand image
-
ఛీ.. ఛీ.. ఇదేం మేనేజ్మెంట్! అక్కడ పురుగులు గుడ్లు పెడుతున్నాయ్!!
వ్యాపారంలో ఉన్న ఏ కంపెనీకైనా బ్రాండ్ ఇమేజ్ అనేది ఎంతో ముఖ్యం. ఆ బ్రాండ్ ఇమేజ్‌ని కాపాడుకునేందుకు కంపెనీలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తాయి. అయితే ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లే కోట్లు పెట్టి సంపాదించిన బ్రాండ్ ఇమేజ్‌కి తూట్లు పొడుస్తాయి. తాజాగా ఇలాంటి పరిస్థితి హెచ్ అండ్ ఎం సంస్థకి ఎదురైంది. మాజీ ఉద్యోగి అసంతృప్తి న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) సమీపంలో హెచ్ అండ్ ఎం సంస్థకి అవుట్లెట్ స్టోర్ ఉంది. కొంత కాలంగా అక్కడ పని చేసిన ఓ ఉద్యోగి ఇటీవల అక్కడ జాబ్ మానేసింది. అక్కడ పని చేయడం ఇష్టం లేక ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. అయితే అక్కడితో ఆమె అసంతృప్తి ఆగిపోలేదు. ఇంత అధ్వన్నమా ? న్యూయార్క్ డబ్ల్యూటీసీ సమీపంలో ఉన్న హెచ్ అండ్ ఎం స్టోర్ నిర్వహాణ ఎంత అధ్వన్నంగా ఉందో చూడండి. అక్కడ హ్యంగర్లకు తగించిన హుడీ షర్ట్స్ మీద పురుగులు గుడ్లు పెడుతున్నాయి.. అయినా సరే ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ ఆమె పర్సనల్ అకౌంట్లో ట్వీట్ చేసింది. సెగ తగిలింది నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. వేల మంది ఆ ట్వీట్‌ను చూసి స్పందించారు. హెచ్ అండ్ ఎం సిబ్బంది నిర్వాకంపై దుమ్మేతి పోశారు. వందల సంఖ్యలో రీట్వీట్లు కొట్టారు. దీంతో దాని ఎఫెక్ట్ హెచ్ అండ్ ఎం యాజమాన్యానికి తాకింది. స్టోర్ మూసేస్తున్నాం తమ బ్రాండ్ ఇమేజ్‌కి గండి పడుతున్న విషయం గుర్తించిన హెచ్ అండ్ ఎం రంగంలోకి దిగింది. తమ కస్టమర్లు, సిబ్బంది రక్షణ మాకు ఎంతో ముఖ్యమంటూ హెచ్ అండ్ ఎం స్పందిస్తూ.. డబ్ల్యూటీసీ సమీపంలో ఉన్న స్టోర్‌ను తక్షణమే మూసేస్తున్నట్టు ప్రకటించింది. జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడతామంటూ తేల్చి చెప్పింది. క్షమించండి తాను చేసిన చిన్న ట్వీట్ ఇంత పెద్ద దుమారం రేపుతుందని ఊహించలేదంటూ హెచ్ అండ్ ఎం మాజీ ఉద్యోగి మరో ట్వీట్ చేశారు. ఆపద సమయంలో స్టోర్ మేనేజర్, సిబ్బంది తనకు అండగా ఉన్నారని, కానీ తన ట్వీట్ వాళ్లని ఇబ్బందులకు గురి చేసిందని పేర్కొంది. తనను క్షమించాంటూ హెచ్ అండ్ ఎం సిబ్బందికి కోరింది. I work at the H&M in the Oculus at World Trade & today a customer discovered lice on a rack of hoodies. They’re not closing the store nor are they notifying employees of the problem. The section was just blocked off. pic.twitter.com/eAIlOxfmJu — Choy Choy 🎋 (@Madesonee_) December 29, 2021 చదవండి: బక్కచిక్కిన కిమ్ నోట ‘జీవన్మరణ పోరాట’ మాట.. ఉ.కొ. దీనస్థితికి నిదర్శనమిది! -
ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ప్రిన్స్ మహేశ్.. అదిరింది సార్!
పోలీస్ ఆఫీసర్‌గా తనదైన ముద్ర చూపించిన సీనియర్ ఐఏఎస్ అధికారి, అడిషనల్ డీజీపీ సజ్జనార్ ఇప్పుడు టీఎస్ఆర్టీసీ ఎండీగా తన మార్క్ చూపిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందివ్వడంతో పాటు ఆర్టీసీ బ్రాండ్ ఇమేజ్ పెంచడం, ఆదాయం సమకూర్చే పనిలో ఉన్నారు. ఇందుకోసం సమకాలీన అంశాలను సమర్థంగా ఉపయోగించుకుంటున్నారు. ఫ్యూయల్ ఛార్జెస్ గత కొంత కాలంగా డీజిల్, పెట్రోలు ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యులతో పాటు ఆర్టీసీకి ఈ పెరిగిన ధరలు గుదిబండలా మారాయి. అయితే ఇలా పెరుగుతున్న ధరలను సైతం ఆర్టీసీకి ఆదాయంగా ఎలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. దీని కోసం ట్విట్టర్ వేదికగా ప్రత్యేక ప్రచారం ప్రారంభించారు. సూపర్‌స్టార్ మహేశ్‌ను అందులో పరోక్ష భాగస్వామిగా మార్చారు. ఆర్టీసీ వైపు ప్రయాణికులను ఆకర్షించేలా ప్రిన్స్ మహేశ్ చిత్రాల్లోని ఫోటోలకు అదిరిపోయే క్యాప్షన్ జోడించి మీమ్ రూపొందించారు. దాన్ని తన అధికారిక ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేశారు. Travel in #TSRTC Safely with less cost#sundayvibes @urstrulyMahesh @puvvada_ajay @Govardhan_MLA @RGVzoomin @DarshanDevaiahB @HUMTA_hmdagov @airnews_hyd @maheshbTOI @balaexpressTNIE @V6_Suresh @PranitaRavi @baraju_SuperHit @abntelugutv @AbhiramNetha @iAbhinayD @Telugu360 @TSRTCHQ pic.twitter.com/hvQVZytMNe — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 31, 2021 ఆకట్టుకునేలా సూపర్ స్టార్ మహేశ్ ఫోటోలతో రూపొందిన మీమ్‌లో బైకులో లీటరు పెట్రోలు కొట్టిస్తే సిటీ మొత్తం తిరగలేకపోవచ్చు కానీ లీటరు పెట్రోలు కంటే తక్కువ ధరలో లభిస్తున్న టీ24 టిక్కెట్టుతో సిటీ మొత్తం ప్రయాణించవచ్చని చెబుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో ఫ్యూయల్ ఛార్జీలు పెరిగితే ప్రయాణికులపై భారం మోపేందుకు ఆసక్తి చూపించేవారని. కానీ సజ్జనార్ అందుకు భిన్నంగా అవరోధాలను అవకాశాలుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. బ్రాండ్ ఇమేజ్ పదవీ బాధ్యతలు స్వీకరించింది మొదలు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఒడ్డున పడేసేందుకు సజ్జనార్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పండగ సమయాల్లో స్పెషల్ పేరుతో ఆర్టీసీ చేసే అదనపు ఛార్జీల వడ్డన కార్యక్రమానికి స్వస్థి పలికారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ బ్రాండ్ ఇమేజ్ పెరగడమే కాకుండా ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల ధరల దోపిడి నుంచి ప్రయాణికులక ఊరట లభించింది. అంతేకాదు టీఎస్ ఆర్టీసీ బస్ స్టేషన్లలో మిల్క్ ఫీడింగ్ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ప్రయాణికులకు ఆర్టీసీ మాది అనే భావన కలిగిస్తున్నాయి. ఇప్పటికీ మిల్క్ ఫీడింగ్ కియోస్క్ ఎంజీబీఎస్‌లో మొదలవగా మిగిలిన స్టేషన్లకు త్వరలో విస్తరించనున్నారు. An attempt to make bus depots more #commuter friendly. Milk feeding kiosk was set up at #MGBS bus station very soon same will be installed across other #busstands through out #Telangana@DrTamilisaiGuv @Govardhan_MLA @TSRTCHQ @Telugu360 @baraju_SuperHit #TSRTC #mondaythoughts pic.twitter.com/yyF5LuRCua — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 1, 2021 స్వయంగా స్వయంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రయాణికులు అడుగుతున్న పశ్నలకు సమాధానం చెబుతూనే వారు లేవనెత్తుతున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతకు ముందు ఆర్టీసీ బస్సులో మహిళలు, వృద్ధులకు సీటు ఇవ్వాలని చెబుతూ స్కూల్ పిల్లలతో రూపొందించిన వీడియో సైతం టీఎస్ ఆర్టీసీ విలువని మరింతగా పెంచింది. అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ నైతిక విలువలు పెంచే ఏకైక ప్రదేశం మన #TSRTC బస్సు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేద్దాం. నైతిక విలువలను పెంచుకుందాం@puvvada_ajay @Govardhan_MLA @TSRTCHQ @ChaiBisket @Kurmanath @imvangasandeep @HiHyderabad #Moralvalues #motivation #WednesdayMotivation pic.twitter.com/bOdUViKZYP — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 27, 2021 చదవండి: పెట్రో, డీజిల్ ధరల పెరుగుదల: సీఎన్జీపై బాదుడు -
మహీంద్రా సంచలన నిర్ణయం.. త్వరలో హైపర్ కార్
ట్రాక్టర్ల తయారీ నుంచి మొదలు పెట్టి ఎస్‌యూవీల వరకు వాహన తయారీ రంగంలో స్వదేశి సంస్థగా చెరగని ముద్ర వేసిన మహీంద్రా మరో సంచలనానికి తెరలేపింది. ఏషియా ఆటోమోబైల్ కంపెనీలకు వెనక్కి నెట్టి హైపర్ కారు తయారీపై ఫోకస్ పెట్టింది. బ్రాండ్ ఇమేజ్ ఆటోమొబైల్ మార్కెట్లో పట్టు పెంచుకోవడంతో పాటు బ్రాండ్ ఇమేజ్‌ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే పనిలో పడింది మహీంద్రా. తమ కంపెనీ నుంచి ట్రాక్టర్లు, జీపులు మొదలు హైపర్ కార్ల వరకు అన్నీ దొరుకుతాయనే మెసేజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా హై ఎండ్ లగ్జరీ కార్ల సెగ్మెంట్లో రెనాల్ట్, ఫోర్డ్‌లతో కలిసి ముందుకు సాగాలపి ఇప్పటికే డిసైడ్ అయ్యింది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పినిన్‌ఫరినా హైపర్ కార్ల తయారీలో ఘన చరిత్ర కలిగిన ఫినిన్‌ఫరినాతో జట్టు కట్టేందుకు మహీంద్రా సిద్ధమైందంటూ బ్లూబ్‌బర్గ్ మీడియా ప్రచురించింది. దీని ప్రకారం రాబోయే రెండేళ్లలో మహీంద్రా, ఫినిన్‌ఫరినా సంస్థలు సంయుక్తంగా హైపర్ కారుని మార్కెట్లోకి తేనున్నాయి. బటిస్టా జెనివాలో 2019లో జరిగిన ఆటో ఎక్స్‌ప్లోలో ఫినిన్‌ఫరినా బటిస్టా కాన్సెప్టు కారును తొలిసారి ప్రదర్శించింది. 2020లో మార్కెట్లోకి తెస్తామని తెలిపింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా కారు తయారీ పనులకు బ్రేకులు పడ్డాయి. తాజాగా ఈ సంస్థ 2022 ప్రథమార్థంలో కారును తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కారు తయారీలో భాగస్వామ్యం కావాలని మహీంద్రా యోచిస్తోంది. ఫీచర్లు అన్నీ అనుకూలిస్తే మహీంద్రా - ఫినిన్‌ఫరినాల ఆధ్వర్యంలో రాబోయే హైపర్కారుని పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్‌గా తయారు చేయబోతున్నారు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ధర మహీంద్రా- ఫినిన్ఫరినాలు సంయుక్తంగా మార్కెట్లోకి తెచ్చే అవకాశం ఉన్న ఈ హైపర్ కారు ధర 2.3 మిలియన్ డాలర్లుగా ఉండవచ్చని అంచనా. ఇప్పటికే ఈ కారుకు సంబంధించి తొలి ఐదు బుకింగ్స్ పూర్తయ్యాయి. కేవలం 150 కార్లు మాత్రమే తయారు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. చదవండి : Mahindra XUV700: బుకింగ్స్ ప్రారంభం.. ముందు వచ్చిన వారికే ఆ ఆఫర్ -
మన పత్తికి బ్రాండ్ ఇమేజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పండే పత్తి దేశంలో కెల్లా అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని, ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఇక్కడి దూది పింజ పొడవు దేశంలో కెల్లా పొడవుగా వస్తోందని, గట్టితనం కూడా ఎక్కువని పేర్కొన్నారు. అత్యంత నాణ్యతతో కూడిన తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేందుకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి, వాటిని ప్రచారం చేయడానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని కోరారు. దీనికోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిపుణులతో చర్చించాలని సూచించారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా మరింత డిమాండ్ రావడానికి అనుగుణంగా పత్తిని శుద్ధి చేయడం, ప్యాక్ చేయడం వంటి పనులను జాగ్రత్తగా నిర్వహించే విషయంలో రైతులకు సూచనలు ఇవ్వాలని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ విస్తరణపై ప్రగతిభవన్‌లో సోమవారం సీఎం సమీక్షించారు. ‘దేశంలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతోంది. పత్తికి దేశీయంగా, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది. సాగునీటి ద్వారా సాగు చేసే భూముల్లో పంట మరింత బాగా వస్తుంది. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎక్కువ కట్టుకున్నందున సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కాబట్టి కాల్వల కింద పత్తిని సాగు చేస్తే మరింత లాభసాటిగా ఉంటుంది’అని సీఎం అన్నారు. ‘పత్తికి మంచి మార్కెట్ రావడానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. తెలంగాణ ఏర్పడక ముందు జిన్నింగ్ మిల్లుల సంఖ్య 60 మాత్రమే ఉంటే, వాటిని 300కు పెంచేలా చర్యలు తీసుకుంది. పత్తి ఎక్కువ పండే ప్రాంతా ల్లో జిన్నింగ్ మిల్లులు నెలకొల్పేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది’అని వివరించారు. ‘పత్తి సాగులో అనేక కొత్త పద్ధతులు వచ్చాయి. కొత్త వంగడాలు కూడా వచ్చాయి. ఒకేసారి పంట వచ్చే విత్తనాలు వస్తున్నాయి. వాటిని తెలంగాణలో పండించాలి’అని సీఎం సూచించారు. ‘రైతులు లాభసాటి పంటలనే పండిం చేలా చర్యలు ప్రారంభించాం. రైతులు కూడా ప్రభుత్వ సూచనలు పాటించి నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం. మార్కెట్లో పత్తికి, నూనె గింజలకు, పప్పులకు డిమాండ్ ఉంది. కూరగాయలకు కూడా మంచి ధర వస్తుంది. వాటిని ఎక్కువగా పండించాలి. కందుల విస్తీర్ణం 20 లక్షలకు పెంచాలి. ఆయిల్ పామ్ విస్తీర్ణం 8 లక్షలకు పెరగాలి’అని కేసీఆర్ ఆకాంక్షించారు. కాగా, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థకు ‘అగ్రికల్చర్ టుడే’అవార్డులు వచ్చినందుకు ఆ సంస్థ ఎండీ కేశవులును ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు. రూ. 4,800 కోట్లతో ఆయిల్ పామ్ సాగు ప్రణాళిక రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రూ.4,800 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఆమోదించారు. రైతులకు 50% సబ్సిడీ ఇచ్చి ఆయిల్ పామ్ సాగు చేయించనున్నట్లు సీఎం వెల్లడించారు. నిత్యం సాగునీటి వసతి కలిగిన ప్రాంతాల్లోనే ఆయిల్ పామ్ సాగు చేయడం సాధ్యమవుతుందని, రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతి, నిరంతర విద్యుత్ సరఫరా వల్ల ఆ సదుపాయాన్ని రైతులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 25 జిల్లాలను ఆయిల్ పామ్ సాగుకు అనువైనవిగా నేషనల్ రీ అసెస్మెంట్ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిందని సీఎం వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగు–ముఖ్యాంశాలు ► దేశానికి 22 మిలియన్ టన్నుల ఆయిల్ కావాలి. కానీ దేశంలో 7 మిలియన్ టన్నుల ఆయిల్ తీయడానికి అవసరమయ్యే నూనె గింజలు మాత్రమే పండిస్తున్నాం. ఏటా 15 మిలియన్ టన్నుల నూనె దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల ఏటా రూ.70 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ► దేశంలో 8 లక్షల ఎకరాల్లోనే ఆయిల్ పామ్ సాగవుతోంది. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలి. ► రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం పెరగడంతో పాటు, నిరం తర విద్యుత్ సరఫరా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆయిల్ పామ్ సాగు చేయడానికి రాష్ట్రం అనువైందిగా గుర్తించాయి. ► రాష్ట్రంలోని నిర్మల్, మహబూబాబాద్, కామారెడ్డి, వరంగల్ రూరల్, నిజామాబాద్, సిద్దిపేట, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచి ర్యా ల, ఆసిఫాబాద్, సూర్యాపేట, ములుగు, నల్లగొండ, జనగామ, వరంగల్ అర్బన్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, సిరిసిల్ల, గద్వాల, మహబూబ్‌నగర్, కొత్తగూడెం జిల్లాల్లో 8,14,270 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని నిర్ణయించారు. ► మూడేళ్ల పాటు అంతర పంట వేసుకోవచ్చు. నాలుగో ఏడాది నుంచి ఆయిల్ పామ్ పంట వస్తుంది. 30 ఏళ్ల పాటు పంట వస్తుంది. ఆయిల్ పామ్ పంటలో అంతర పంటగా కొకొవా కూడా పండించవచ్చు. తోట చుట్టూ టిష్యూ కల్చర్ టేకు, శ్రీగంధం సాగు చేయొచ్చు. ► ఎకరానికి 10–12 టన్నుల గెలలు వస్తాయి. ► ఎకరానికి రైతుకు ఏడాదికి నికరంగా లక్ష రూపాయల ఆదాయం వస్తుంది. ► ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.12,800 ఉంది. ► రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్‌తో పాటు 14 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ సొంత ఖర్చులతో నర్స రీలు, ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టబోతున్నాయి. ప్రతీ కంపెనీకి సాగు చేసే ప్రాంతాలను జోన్లుగా విభజించి, వారికి అప్పగిస్తారు. -
‘బ్రాండ్ మోదీ’ హాట్ కేక్
మార్కెటింగ్కైనా, ఎన్నికల వ్యూహాలకైనా బ్రాండింగే ముఖ్యం. మరి ఆ రెండూ కలిపి రాజకీయాన్ని మార్కెట్ రంగం లోకి తెస్తే ఇక తిరుగేముంది? వైవిధ్యమైన ప్రచారంలో ముందుండే బీజేపీ ఈసారీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరునే ఒక బ్రాండ్‌గా ప్రచారం చేస్తోంది. ఈ కామర్స్ వెబ్‌సైట్స్ పేటీఎం, అమెజాన్, మోదీ మొబైల్ అప్లికేషన్‌లోని ఉన్న ఫ్లిప్‌కార్ట్ సైట్లో అమ్మకానికి ఉంచిన వస్తువులపై మోదీ బొమ్మలే కనిపిస్తున్నాయి. బనియన్లు, బొమ్మలు, కాఫీకప్పులు, టీషర్ట్లు, చివరికి చీరల్నీ వదిలి పెట్టలేదు. అన్నిటిపై మోదీ ఫొటోలే ముద్రించి సేల్కు పెట్టింది. యూత్ వీటిని పోటీ పడి కొంటోంది.. ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో జనవరిలో రూ.5 కోట్ల విలువైన మోదీ బ్రాండెడ్ వస్తువులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇక బీజేపీ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ ఈ వస్తువులని అమ్మకానికి ఉంచారు. మోదీ, కమలం గుర్తు ముద్రించి ఉన్న వస్తువుల్ని కొనాలనే ఆసక్తి ఉంటే బీజేపీ కార్యాలయాల్ని కూడా సంప్రదించవచ్చు. ఈ వస్తువుల్లో మోదీ టీ షర్ట్లకి డిమాండ్ ఉంది. ఇక మోదీ చీరల్ని గుజరాత్ మహిళలు ఎగబడి కొంటున్నారు. వెయ్యి నుంచి రూ.1500కే ఇవి అమెజాన్, స్నాప్‌డీల్ సైట్లలో లభిస్తున్నాయి. గత ఏడాది ధంతేరాస్ సమయంలో మోదీ బొమ్మ ముద్రించిన బంగారు బిస్కెట్లను గుజరాత్లో ఒక దుకాణం విక్రయించి వార్తల్లోకెక్కింది. మరిప్పుడు ఈ ఎన్నికల ‘సేల్స్’ బీజేపీకి ఎంత కలిసివస్తుందో చూడాలి. -
హిందూపురానికి బ్రాండ్ ఇమేజ్ను పెంచాలి
హిందూపురం అర్బన్: హిందూపురం అంటే పారిశ్రామికాభివృద్ధికి పెట్టిందిపేరుగా బ్రాండ్ ఇమేజ్ను పెంచాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉందని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. వన్‌టౌన్ పోలీçసుస్టేషన్‌లో శనివారం డీఎస్పీ కరీముల్లాషరీఫ్ అధ్యక్షతన శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హిందూపురంలో అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉన్నప్పుడే పట్టణాభివృద్ధి చెందుతుందన్నారు. హిందూముస్లింలు సోదరభావంతో ఐక్యతగా వినాయకచవితి, బక్రీద్‌లను శాంతియుత వాతావరణంలో సంతోషంగా జరుపుకుందామన్నారు. ఇందుకోసం శాంతికమిటీలను ఏర్పాటు చేశాం వాట్సాప్ గ్రూపులు కూడా కల్పించామన్నారు. డీఎస్పీ కరీముల్లా షరీఫ్, సీఐ ఇదురుబాషా మాట్లాడుతూ వినాయక విగ్రహాల ఏర్పాటు నిర్వాహకులు పోలీసుల సూచనల మేరకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మైకు గట్టిగా పెట్టడం, ఊరేగింపులకు ఇబ్బందికరమైన ఎతైన విగ్రహాలు ఏర్పాటు చేయడం వంటివి వద్దన్నారు. కార్యక్రమంలో ముత్తవల్లి తల్హాఖాన్, కౌన్సిలర్ రోషన్‌వలి, నాయకులు భాస్కర్, రాయల్‌గోపాల్, కమిటీసభ్యులు కౌన్సిలర్ జబివుల్లా, రైల్వే శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం : రోడ్డుప్రమాదాలను పూర్తిగా నియంత్రించడానికి తీవ్రంగా కృషిచేస్తున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. శనివారం హిందూపురం విచ్చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రోడ్డుప్రమాదాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు పెంచుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా అనంతపురం, హిందూపురం కేంద్రాల్లో అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తర్వాత అన్ని ప్రధాన పట్టణాల్లో ప్రారంభిస్తామన్నారు. కొడికొండ, తూమకుంట సరిహద్దు ప్రాంతాల్లో అక్రమరవాణా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నివారణకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో రాజకీయహత్యలు పెరిగాయని చెప్పగా జరిగిన హత్యల్లో రాజకీయ కోణాలు లేవని మాదన్న హత్యపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందన్నారు. -
బ్రాండ్ ఇమేజ్‌కు ‘టాటా’
సాక్షి, బిజినెస్ విభాగం : టాటా గ్రూప్‌లో సంక్షోభానికి రతన్‌టాటా-సైరస్ మిస్త్రీల మధ్య ఏర్పడిన వ్యక్తిగత విబేధాలే కారణమన్నది మెల్లగా స్పష్టమవుతోంది. ఇంటిపేరు కూడా కలిసిన వారసుడు రతన్‌టాటా... గ్రూప్‌లో అతిపెద్ద వాటాదారుకు వారసుడు సైరస్ మిస్త్రీ... ఇద్దరిలో ఎవరూ కూడా వందేళ్ల టాటా గ్రూప్ ఇమేజ్ను పట్టించుకోలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. కుటుంబ అధిపత్యం ఉన్న కార్పొరేట్ కంపెనీలు కూడా ఏ సీఈఓనూ, ఎండీనీ బయటకు పంపించని రీతిలో మిస్త్రీని టాటాలు అగౌరవ పరిచి ఉద్వాసన చెప్పారన్నది నిస్సందేహం. ఇక ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డుకు రాసిన లేఖలో రతన్‌పై చేసిన తీవ్ర ఆరోపణలు గ్రూప్ స్థాయిని మరింత దిగజార్చాయి. రతన్- సైరస్ మిస్త్రీ ఇద్దరూ ఒకరిపై ఒకరు బురద చల్లుకునే స్థితికి వచ్చేశారంటే వ్యక్తిగత విబేధాలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. టాటా గ్రూప్ వెతలకు బాధ్యులెవరు? ఇక్కడ గమనించాల్సిందొకటుంది. మిస్త్రీ లేఖలో చేసిన ఆరోపణల్లో వ్యక్తిగతమైనవి పక్కనబెడితే ప్రధానమైనది గ్రూప్ రుణభారం పెరిగిపోయిందనేది. కోరస్ స్టీల్ కొనుగోలు, ముంద్రా ప్రాజెక్టులో టాటా పవర్ పెట్టిన పెట్టుబడులు, ఇండియన్ హోటల్స్ విదేశాల్లో భారీ ధరకు కొన్న హోటళ్లు... వాటన్నిటితో రూ.1.18 లక్షల కోట్లు రైటాఫ్ చేయాల్సి ఉంటుందని మిస్త్రీ పేర్కొన్నారు. నిజానికివన్నీ రతన్ టాటా హయాంలో జరిగినవే. కానీ ఆ మూడు రంగాల పనితీరూ కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా బాగులేదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నపుడు, ఆయా రంగాల వృద్ధి జోరుగా వున్నపుడు చేసిన టేకోవర్లు అవి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యాపారాలు బాగులేనపుడు... మిస్త్రీ వాటిని చక్కదిద్దలేకపోయారని నిందించటమూ సరికాదు. ఉక్కుకు డిమాండ్ లేనంత మాత్రాన మిట్టల్ ఉక్కు వ్యాపారాన్ని వదిలేశారా? అనిల్ అంబానీ, అదానీలు పవర్ వ్యాపారాన్ని అమ్ముకున్నారా? అలాంటిది వందేళ్లుగా 100 రకాల వ్యాపారాన్ని చేస్తూ...ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్న టాటా గ్రూప్ వీటిని వదిలించుకోవాల్సిన పనిలేదన్నది రతన్ వాదన కావొచ్చు. గ్రూప్ ప్రమోటర్లయిన టాటా ట్రస్టులు.. తన పనితీరునే ప్రామాణికంగా చూస్తున్నపుడు ఈ వ్యాపారాల నుంచి వైదొలిగి.. గ్రూప్ రుణభారాన్ని తగ్గించే ప్రయత్నా ల్ని చేయటం తప్పు కాదన్నది మిస్త్రీ మాట. ఈ లెక్కన గ్రూప్ వెతలకు ఇద్దరినీ బాధ్యులుగా చూడలేం. ఆ ‘తీరే’ ఇబ్బందికరం... పనితీరు నచ్చనంత మాత్రాన ఏ కంపెనీ సీఈఓకూ హఠాత్తుగా ఉద్వాసన చెప్పరు. గౌరవంగా వైదొలిగే మార్గాన్ని కల్పిస్తారు. తాజా పరిణామాలు చూస్తే... మిస్త్రీ తీరు కొన్నాళ్లుగా రతన్ టాటాకు నచ్చకపోయి ఉండొచ్చు. కానీ తొలగింపు నిర్ణయం ఆకస్మికమేనని స్పష్టమవుతోంది. మిస్త్రీ తాజా లేఖ దీనికి అద్దం పడుతోంది. నిజానికి ఈ తొలగింపునకు రతన్ టాటాలో పెరిగిన వ్యక్తిగత విద్వేషమే కారణమై ఉండొచ్చని మిస్త్రీ లేఖ చెబుతోంది. రతన్ టాటాపై ఆయన చేసిన వ్యక్తిగత ఆరోపణలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఇక టాటా సన్స్ బోర్డు సమావేశం జరుగుతున్నపుడు డెరైక్టర్లు బోర్డు రూమ్ నుంచి వెలుపలికి వెళ్లి రతన్ టాటాకు ఫోన్లు చేసేవారని, ఇవి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు దారితీస్తాయన్న తీవ్ర ఆరోపణను కూడా మిస్త్రీ సంధించారు. ఇవన్నీ వీరిద్దరి మధ్య ఉన్న అగాథాన్ని బయటపెట్టేవే. అ అగాథం సంగతెలా ఉన్నా... మిస్త్రీ లేఖతో కొంత మిస్టరీ వీడింది. బ్రాండ్ పరువు బజారులో పడింది. -
ఫస్ట్ ఎయిడ్ కిట్.. అడ్రస్ నిల్!
జిల్లాలో అత్యధిక శాతం ఆర్టీసీ బస్సుల్లో ఖాళీగా బాక్సులు కిట్ల జాడే లేదు ప్రయాణికులకు తక్షణ వైద్యం లేనట్టే జిల్లాలో అన్ని డిపోల్లో ఇదే పరిస్థితి కొత్త బస్సులకే కిట్లు పరిమితం ‘సాక్షి’ విజిట్‌లో వాస్తవాలు వెలుగులోకి కోట్లు కుమ్మరించి బ్రాండ్ ఇమేజ్ కోసం కృషి చేస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు సౌకర్యాల కల్పనను మాత్రం విస్మరిస్తోంది. అమరావతి రాజధానికి కొత్త బస్సుల మంజూరు, విజయవాడ బస్‌స్టేషన్‌లో ఆధునిక వసతుల పేరుతో సినిమా థియేటర్ల నిర్మాణం, ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు, సీటింగ్ సౌకర్యాలు, ఏసీ లాంజ్‌ల నిర్మాణానికి కోట్లు కుమ్మరిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా బస్సుల్లో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు మాత్రం పట్టించుకోవటం లేదు. బస్సుల్లో ప్రథమ చికిత్సా కిట్లు భూతద్దం పెట్టి వెతికినా బస్సుల్లో కనిపించని పరిస్థితి నెలకొంది. జిల్లాలో దాదాపు 60 శాతం బస్సుల్లో ఈ పరిస్థితి నెలకొనటం ఆర్టీసీ పనితీరుకు నిదర్శనం. జిల్లాలో శనివారం సాక్షి విజిట్ నిర్వహించగా ఈ విషయం తేటతెల్లమైంది. విజయవాడ : ఆర్టీసీ కృష్ణా రీజియన్ పరిధిలో జిల్లాలో 14 బస్ డిపోలు, 36 బస్టాండ్లు ఉన్నాయి. రోజుకు రూ.5 కోట్లకు పైగా ఆదాయంతో ఆర్టీసీ బస్టాండ్లు నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో మొత్తం 1349 బస్సులు ఉన్నాయి. వాటిలో 250 అద్దె ప్రాతిపదికన నడుస్తుండగా.. మిగిలినవి సొంత బస్సులు. వాటిలో 59 ఏసీ సర్వీసులు, 154 సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి. ఇవి కాకుండా నిత్యం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు, రాయలసీమకు, బెంగళూరుకు వెళ్లే బస్సులు అన్ని కలుపుకొని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి నిత్యం 3,200 వరకు బస్సులు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని నగరాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు ‘తెలుగు వెలుగు’ పాసింజర్ బస్సులు ఉన్నాయి. జిల్లాలో 5 నుంచి 10 శాతం గ్రామాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. సగటున 75 నుంచి 80 శాతం ఆక్యుపెన్సీతో ఇవి నడుస్తున్నాయి. టిక్కెట్లపై సెస్ రూపంలో విజయవాడ రీజియన్‌కు ఏటా కోట్లలో ఆదాయం వస్తుంది. కిట్ల జాడేదీ? జిల్లాలో 60 శాతం బస్సుల్లో కిట్ల జాడే కనిపించటం లేదు. ప్రస్తుతం జిల్లాలో 300 వరకు బస్సుల్లో మాత్రం బాక్సులు ఉన్నాయి. వాటిలోనూ ఈ ఏడాది సుమారు 270 బస్సుల్ని పలు దఫాలుగా కొనుగోలు చేశారు. దీంతో అన్ని ఏసీ బస్సుల్లో మాత్రమే కిట్లు అందుబాటులో ఉన్నాయి. బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో మాత్రమే ఈ విషయం పట్టించుకుంటున్న రవాణా శాఖ ఆ తర్వాత విస్మరిస్తోంది. నిర్వహణ చూడాల్సిన ఆర్టీసీ కూడా పట్టించుకోవడం లేదు. దీంతో బస్సుల్లో ప్రథమ చికిత్సా కిట్లను ఏర్పాటుచేసే బాక్సులు అలంకారప్రాయంగా మారాయి. కిట్‌లో ఇవి ఉండాలి... రవాణా శాఖ నిబంధనల ప్రకారం ప్రతి బస్సులో ప్రథమ చికిత్స బాక్సులు ఉండాలి. అందులో ప్రథమ చికిత్సకు అవసరమైన కిట్లు ఏర్పాటుచేయాలి. కిట్‌లో దూది, టించర్, బ్యాండేజీలు, గాయాలైనప్పుడు కట్టే వూండ్ క్లాత్, చిన్నపాటి గాయాలకు సంబంధించిన ఆయింట్మెంట్లు ఉండాలి. అవన్నీ కాలం చెల్లని మందులై ఉండటం తప్పనిసరి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫస్ట్ ఎయిడ్ కిట్‌లోని మందుల్ని మార్చాలి. ఇది రవాణా శాఖ ప్రాథమిక నిబంధన. భద్రత ఏదీ? వేసవి తీవ్రత పెరిగింది. జిల్లాలో సగటున 42 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదవుతోంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ సమయంలో జిల్లాలోని అన్ని డిపోల్లో కలిపి సుమారు 350 సర్వీసులు నడుస్తున్నాయి. శుక్రవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బస్సులో ప్రయాణిస్తున్న తిరుపతయ్య అనే వ్యక్తి వడదెబ్బ తగిలి బస్సులోనే మృతి చెందాడు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. మే నెలలో 48 డిగ్రీలకూ చేరవచ్చు. ఇలాంటి తరుణంలో కనీసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం కొద్దిపాటి సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉంది. ఆవైపు ఆర్టీసీ సంస్థ దృష్టి సారించాలి. -
మేడిన్ తెలంగాణ
-
మేడిన్ తెలంగాణ
* బ్రాండ్ ఇమేజ్ లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానం * తయారీ రంగంపైనే రాష్ర్ట ప్రభుత్వం ప్రధాన దృష్టి * పారిశ్రామికాభివృద్ధి, నైపుణ్యాల పెంపు, ఉపాధి కల్పనలే ధ్యేయం * ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీగా రాయితీలు * ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు అదనపు ప్రోత్సాహకాలు * మహిళల కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కులు * పెట్టుబడిదారులకు అండగా పలు కార్యక్రమాలు * టీ-ఐడియా, టీ-ప్రైడ్, టీ-హార్ట్, టీ-అసిస్ట్లకు శ్రీకారం * రాష్ర్ట సమగ్రాభివృద్ధి దిశగా ‘టీఎస్-ఐపాస్’ ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ ఇమేజ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించింది. పారిశ్రామికరంగానికి ఊతమిస్తూ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే దీని లక్ష్యం. ఇందులోభాగంగా పోటీతత్వాన్ని పెంచి పరిశ్రమల అభివృద్ధికి పూర్తి స్థాయిలో తోడ్పడేందుకు సర్కారు సిద్ధమైంది. కీలకమైన తయారీ రంగంపై దృష్టి కేంద్రీకరించి, గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు నైపుణ్యాలను మెరుగుపరచాలని సంకల్పించింది. విస్తృత కసరత్తు తర్వాత రూపుదాల్చిన నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఉత్పత్తి రంగంలో రాష్ర్ట వృద్ధి రేటు జాతీయ సగటుకన్నా నాలుగైదు శాతం అధికంగా ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ దిశలో తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్(తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం) బిల్లును శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తూ, పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పిస్తూ.. రాష్ర్ట సమగ్రాభివృద్ధికి దోహదపడేలా అనేక అంశాలను పొందుపరిచారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు అందుతాయి. భౌగోళిక స్ధితి, వనరులు, నైపుణ్యాలు, ముడిసరుకు లభ్యత, తయారీ విధానాలను బట్టి తెలంగాణలో పెట్టుబడులకు అత్యధిక ప్రాధాన్యమున్న 14 రంగాలను ప్రభుత్వం గుర్తించింది. లైఫ్ సెన్సైస్, ఐటీ హార్డ్‌వేర్, ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఏవియేషన్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, జౌళి-దుస్తులు, ప్లాస్టిక్స్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, ఇంజనీరింగ్ కేపిటల్ గూడ్స్, రత్నాలు, నగలు, వ్యర్థాల నిర్వహణ, సంప్రదాయేతర ఇంధనం, సోలార్ పార్కులు, ఖనిజాలు, కలప ఆధారిత పరిశ్రమలు, రవాణా లాజిస్టిక్ హబ్, ఇన్‌ల్యాండ్ పోర్టు, కంటైనర్ డిపో వంటివి ఈ కోవలో ఉన్నాయి. ప్రతి రంగానికి ప్రత్యేక ప్రధా న కార్యదర్శి లేదా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుకానుంది. ఆయా రంగాలకు అనువైన ప్రాం తాల్లో పారిశ్రామిక పార్కులను నెలకొల్పుతారు. టీ-ఐడియా స్కీమ్‌తో ప్రోత్సాహకాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పలు రాయితీలను కల్పిస్తూ టీ- ఐడియా(తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్) స్కీమ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్, భూమి ధరలో రిబేటు, భూ మార్పిడి రేటు తగ్గింపు, విద్యుత్ రీయింబర్స్మెంట్, పెట్టుబడిలో సబ్సిడీ, వ్యాట్ రీయింబర్స్మెంట్, వడ్డీ సబ్సిడీ, మొదటితరం పారిశ్రామికవేత్తలకు ప్రారంభ పెట్టుబడి, శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి వ్యయం రీయింబర్స్మెంట్, నాణ్యత/పేటెంట్ మద్దతు, నిర్దిష్ట ఉత్పత్తి చర్యలు, మౌలిక సదుపాయాల అభివద్ధి వ్యయం రీయింబర్స్మెంట్ వంటివి ఈ స్కీం ద్వారా లభిస్తాయి. అవినీతికి, అవకతవకలకు తావు లేకుంగా ఈ ప్రోత్సాహకాల మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు టీ-ప్రైడ్..మహిళలకు స్పెషల్ పార్క్‌లు ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక మద్దతు అందించనుంది. టీ ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇంకుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్) పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. సబ్ ప్లాన్ నిధులను నేరుగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయంగా అందిస్తుంది. వారు చెల్లించాల్సిన మార్జిన్ సొమ్మును కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. పారిశ్రామిక పార్కుల్లో ప్లాట్ల కేటాయింపులో ప్రాధాన్యత, నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ, క్రిసిల్ రేటింగ్ ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా సబ్సిడీ వంటి పలు ప్రయోజనాలు కూడా వారికి దక్కుతాయి. రవాణారంగం మినహా సేవారంగం యూనిట్ల కు వడ్డీ సబ్సిడీ అమలు చేస్తారు. సీజీటీ ఎం ఎస్ఈ తరహా పథకం, పరిశ్రమల ప్రణాళికలు, పర్యవేక్షణకు గాను రాష్ట్ర, జిల్లా కమిటీల్లో దళిత ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థలకు ప్రమేయం కల్పిస్తారు. ఇక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ మినహా ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా మహిళల కోసం ఒకటి లేదా 2 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుకానున్నాయి. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల గుర్తింపు, శిక్షణ, ప్రతిపాదనల తయారీలో ప్రభుత్వంతో భాగస్వామ్యంగా ఉండేం దుకు సీఓడబ్ల్యూఈ, ఏఎల్ఈఏపీ, ఫిక్కీ-ఎఫ్ఎల్వో సంస్థలను ఆహ్వానిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాల మహిళలకే ప్రాధాన్యత ఉంటుంది. చిన్న, మధ్య, మైక్రో పరిశ్రమలపై ఫోకస్ ఇండస్ట్రియల్ పార్కుల్లో ప్లాట్లు, షెడ్ల కేటాయింపు. ప్రారంభ నష్టాలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక నిధి, రిజిస్ట్రేషన్లలో సాయం, దొంగతనాల నిర్మూలన , టెక్నాలజీతో పాటు అధునికీకరణకు ప్రత్యేక నిధి. సొంత స్థలంలో ఉన్న యూనిట్లకు స్థల మార్పిడి చార్జీల చెల్లింపు, మార్కెటింగ్ కోసం ప్రదర్శనలు సదస్సులకు సాయం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అవసరాలకు స్పందించేందుకు సలహా కమిటీ ఏర్పాటుకానుంది. ప్రత్యేక రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమి టీ. సంక్షోభంతో ఖాయిలా పడ్డ పరిశ్రమలకు సాయంగా కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని కూడా సర్కారు నిర్ణయించింది. వీటి ఏర్పాటు, నిర్వహణ కోసం రాష్ర్ట స్థాయి కమిటీ ఒకటి ఆర్బీఐతో సంధానకర్తగా వ్యవహరిస్తుంది. ఆరు కారిడార్లలో అభివృద్ధి జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఆరు పారిశ్రామిక కారిడార్లను అభివద్ధి చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను, రెండో దశలో హైదరాబాద్-మంచిర్యాల,హైదరాబాద్-నల్గొండ, హైదరాబాద్-ఖమ్మం కారిడార్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో రాష్ట్రం లోని ప్రతి జిల్లా కేంద్రాన్ని హైస్పీడ్ రైలు, రోడ్డు నెట్వర్క్ ద్వారా అనుసంధానం చేస్తుంది. ప్రతి జిల్లాలో 2 ఇండస్ట్రియల్ పార్కులను నెలకొల్పుతుంది. ఇక హైదరాబాద్‌లోని బడా పరిశ్రమలు అంతర్జాతీయస్థాయిలో పోటీ పడేలా చేసేం దుకు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్(ఆర్ఐసీహెచ్-రిచ్)ను ఏర్పాటు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమలయ్యేవి.. ఫార్మాసిటీ, కెమికల్ సిటీ, హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ అభివద్ధి, తెలంగాణలో జౌళి నిలయంగా వరంగల్ అభివద్ధి, ఆహార ప్రాసెసింగ్, విత్తన ఉత్పత్తి ప్రారంభ చర్యలు, పార్కులతో పాటు చిన్న టౌన్‌షిప్‌లు, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు నేరుగా రుణ సదుపాయం, వెంచర్ పెట్టుబడి, పారిశ్రామిక ఉత్పత్తులు, ఉత్పాదకతపై అంతర్రాష్ట్ర వ్యాట్ హేతుబద్ధీకరణ, లేబర్ చట్టాలతోపాటు పాత పారిశ్రామికరంగ నిబంధనలను సమీక్షించి సంస్కరించడం వంటి చర్యలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం చేపట్టనుంది. పారిశ్రామిక భూ బ్యాంక్ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలకు అనువైన 20 లక్షల ఎకరాల భూమిని పారిశ్రామిక భూమి బ్యాంకుగా సర్కారు గుర్తించింది. దీన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ)కు బదిలీ చేస్తుంది. పార్కు ల్లో మౌలిక సదుపాయాలన్నీ కల్పించే బాధ్యత ఆ కార్పొరేషన్‌దే. ఈ పార్కులను రహదారులు, రైల్వే, ఎయిర్‌పోర్టులకు అనుసంధానం చేసేలా రోడ్లు నిర్మిస్తారు. వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా అందుబాటులో ఉన్న నీటి వనరుల నుంచి పది శాతం కోటాను పారిశ్రామిక అవసరాలకు వినియోగించనుంది. పార్కులకు నిరంతర వి ద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా డిస్కం ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. సాంప్రదాయేతర ఇంధనాన్ని వాడే పరిశ్రమలకు, ఆ ఇంధనాన్ని సరఫరా చేసే వారికీతగిన ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించింది. భారీ పార్కుల్లో ప్రైవేట్ మర్చం ట్ పవర్ ప్లాంట్లను నెలకొల్పేందుకు చర్యలు చేపట్టనుంది. జాయింట్ వెంచర్ లేదా పీపీపీ పద్ధతిలో ఉమ్మడి మురుగునీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటునూ ప్రతిపాదించింది. అలాగే ఇండస్ట్రియల్ టౌన్షిప్ల్లోనే ఉద్యోగులు, కార్మికుల గృహ వసతికి వీలుగా మాస్టర్ ప్లాన్‌ను రూపొం దిస్తోంది. పరిశ్రమలకు అనువైన వాతావరణం కల్పించేందుకు పారిశ్రామిక ప్రాంత స్థానిక సంస్థను ఏర్పాటు చేస్తారు. టీస్ఐఐసీ ఏర్పాటు చేసే కొత్త పార్కులన్నీ దీని పరిధిలోకే వస్తాయి. హస్తకళలకు టీ-హార్ట్, శిక్షణకు టీ-అసిస్ట్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తెలంగాణ హస్త కళలు, సంప్రదాయ కళల ఉత్పత్తులను చేపట్టడంతోపాటు కళాకారులకు ఆదాయం వచ్చే మార్గాలపైనా రాష్ర్ట ప్రభుత్వం దృష్టి సారించింది. నిర్మల్ పెయింటింగ్స్, డోక్రా మెటల్‌వర్క్, పెంబర్తి ఇత్తడి సామాను, బిద్రీ వేర్, పోచంపల్లి ఇకత్, గద్వాల్ చీరలు, వరంగల్ తివాచీలు, జౌళి ఉత్పత్తులను గుర్తించి, వాటి మార్కెటింగ్ కోసం ‘రాష్ట్ర హస్తకళలు, చేతి పనివాళ్ల సాంకేతిక విజ్ఞాన పునరుద్ధరణ(టీ-హార్ట్)’ పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టనుంది. అలాగే పారిశ్రామిక రంగంలో ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగుల నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణ స్టేట్ యాక్సిలరేటెడ్ ఎస్ఎస్ఐ స్కిల్స్ ట్రైనింగ్(టీ-అసిస్ట్) కార్యక్రమాన్ని పరిశ్రమల శాఖ చేపట్టనుంది. విధానాన్ని ఉల్లంఘిస్తే చర్యలు టీఎస్-ఐపాస్ విధానం కింద సమాచార హక్కు తరహాలోనే పెట్టుబడిదారులకు తమ దరఖాస్తుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అనుమతి హక్కు కల్పిస్తారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరిగితే అధికారులకు జరిమానాలు విధిస్తారు. ప్రభుత్వ శాఖల్లో జాప్యా న్ని, అవినీతిని నిరోధించేందుకు పారిశ్రామికవేత్తలకు సహయకారిగా హెల్ప్‌డెస్క్, గ్రీవెన్స్ సెల్ అందుబాటులో ఉంటుంది. అవినీతి, అక్రమార్జనకు తావు లేకుండా అన్ని శాఖలు పారదర్శకంగా పని చేస్తాయి. సిబ్బంది చేసే తప్పులకు ఆయా శాఖల అధికారులు బాధ్యులవుతారు. విధానాన్ని ఉల్లంఘించే ఉద్యోగులపై కఠినమైన చర్యలుంటాయి. కారణం లేకుండా పరిశ్రమల్లో ఆకస్మిక తనిఖీలు ఉండవు.మూడునాలుగేళ్లకోసారి తనిఖీ చేసే పద్ధతి ఉంటుంది. పరిశ్రమల రెన్యువల్స్‌కు హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ ఈ-హెల్ప్‌లైన్, హెల్ప్ డెస్క్‌లు ఉంటాయి. పరిశ్రమల శాఖ వ్యవహార లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటా యి. పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీలో సిటిజన్ చార్టర్లు అమలవుతాయి. గడువు దాటితే భూముల రద్దే భారీ ప్రాజెక్టులకు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కమిటీ(ఎస్ఐపీసీ), మైక్రో, చిన్న మధ్యతరహా ప్రాజెక్టులకు జిల్లా పారిశ్రామిక అభివృద్ధి కమిటీ భూ కేటాయింపులు చేస్తుంది. పారిశ్రామికవేత్తలు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఆ పరిశ్రమలకు ఎంత భూమి అవసరమవుతుందో నిపుణుల కమిటీ మదింపు చేస్తుంది. ఆ సిఫారసుల ఆధారంగానే భూమిని కేటాయిస్తారు. భూ విలువను నిర్ధారించేందుకు కమిటీ ఉంటుంది. టీఎస్ఐఐసీ ఈ భూమిని సదరు కంపెనీకి మార్ట్గేజ్ చేస్తుంది. దీంతో పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు వీలవుతుంది. ప్రాజెక్టు పూర్తయి.. ఉత్పత్తి ప్రారంభమైతేనే ఆ భూమిపై పెట్టుబడిదారులకు హక్కు సొంతమవుతుంది. నిర్ణీత కాల వ్యవధి ప్రణాళికను దరఖాస్తుదారులు ముందే తెలియజేయాలి. ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తే వారికి దక్కిన భూ కేటాయింపు రద్దవుతుంది. ప్రైవేటు భూముల్లోనూ పరిశ్రమల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. భూ బదలాయింపునకు వెసులుబాటు కల్పిస్తుంది. పారిశ్రామిక విధానంపై డిక్కీ హర్షం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానాన్ని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డీఐసీసీఐ) స్వాగతించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఛాంబర్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు పి.శ్రీనివాస కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు కల్పించే విధానాన్ని తెచ్చినందుకు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. -
బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకే..
‘మెట్రో’ వివాదంపై కేంద్రానికి తెలంగాణ సర్కారు వివరణ ఎల్అండ్టీ రాసిన లేఖ లీక్ ఆంధ్రా లాబీ, మద్దతుదారుల కుట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి సమస్యలూ లేవు ఎలాంటి అనుమతులు కూడా పెండింగ్‌లో లేవని వెల్లడి నేడు కేంద్ర అధికారులతో సమీక్ష న్యూఢిల్లీ: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను నష్టపరిచేందుకే ఎల్అండ్టీ రాసిన లేఖను ఆంధ్రా లాబీ లీక్ చేసిందని, అది కూడా వారికి మద్దతిస్తున్న వాళ్లకు ఇచ్చిందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి వెల్లడించింది. ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సమస్యలూ లేవని స్పష్టం చేసింది. సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, సలహాదారు బి.వి. పాపారావు కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్‌కుమార్ సేథ్, ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేం దర్ మిశ్రాను వేర్వేరుగా కలసి మెట్రో వివాదంపై వివరణ ఇచ్చారు. దేశంలో ఎల్అండ్టీ చేపట్టిన ఇతర ప్రాజెక్టులన్నింటి కంటే హైదరాబాద్ మెట్రో పనులు వేగంగా నడుస్తున్నాయని వారు తెలిపారు. లక్ష్యానికి అనుగుణంగానే ప్రాజెక్టు పురోగతిలో ఉందని వివరించారు. ఈ మెట్రోరైలు ప్రాజెక్టుపై ఇటీవల వివాదాలు కమ్ముకున్న నేపథ్యంలో బి.వి.పాపారావు కేంద్ర అధికారులకు కూలంకషంగా దీనిపై వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు పురోగతిని రాజీవ్‌శర్మ వివరిం చారు. ‘మెట్రో’కు ప్రభుత్వం తరఫున ఎలాంటి సమస్యలూ లేవని, తమ తరఫు నుంచి అనుమతులేవీ పెండింగ్‌లో లేవని స్పష్టం చేశారు. అలాగే రాజీవ్‌శర్మ, పాపారావు సోమవారం సాయంత్రం రైల్వే బోర్డు అధికారులను కలిశారు. అంతకంటే ముందు సీఎస్ రాజీవ్ శర్మ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో భేటీ కాగా... ఈ ప్రాజెక్టుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నేడు మరో సమీక్ష! సీఎస్ రాజీవ్‌శర్మ, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, ఎల్అండ్టీ మెట్రోరైల్ ఎండీ గాడ్గిల్, హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ ప్రాజెక్టు పరిస్థితిపై మంగళవారం సమీక్షించనున్నారు. టేకోవర్ యోచనలో సర్కారు మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వమే టేకోవర్ చేస్తే ఎలా ఉంటుందనే దిశగా తెలంగాణ సర్కారు యోచిస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వమే టేకోవర్ చేయాలంటూ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ లేఖ రాయడంతో పాటు.. అలైన్మెంట్ మార్పు విషయంలో ప్రభుత్వానికి, ఆ సంస్థకు తలెత్తుతున్న అభిప్రాయభేదాల నేపథ్యంలో ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రాజెక్టు నుంచి తప్పుకొంటామంటూ, ప్రభుత్వమే టేకోవర్ చేయాలంటూ ఈ నెల 10న ప్రభుత్వానికి ఎల్అండ్టీ రాసిన లేఖ లీక్ కావడంతో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తనతో భేటీ అయిన ఎల్అండ్టీ మెట్రో ఎండీ గాడ్గిల్‌తో... ‘మీ నిర్ణయానికి స్వాగతం. మంచిది..’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీ మెట్రో గురు శ్రీధరన్ సలహాలు కూడా తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వవర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. మెట్రో రెండో దశపై చర్చల కోసం ఢిల్లీకి వెళ్లిన సీఎస్ రాజీవ్‌శర్మ, సలహాదారు పాపారావులు కేంద్ర కేబినెట్ కార్యదర్శితో మాట్లాడినప్పుడు.. ఈ టేకోవర్ ప్రస్తావన కూడా వచ్చినట్లు సమాచారం. అలాగే మెట్రోకు సంబంధించిన ఒకరిద్దరు ముఖ్యులను మారిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వవర్గాల్లో ఉన్నట్లు తెలిసింది. -
‘హైటెక్’ రోడ్లపైకి వోల్వో బస్సులు
త్వరలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక వోల్వో బస్సులు నగరంలో పరుగులు తీయనున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా, ప్రజా రవాణాను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం నగరంలో 80 వోల్వో బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొదట దిల్సుఖ్నగర్-పటాన్చెరు (218డీ), ఉప్పల్-కొండాపూర్ (113 కే/ఎల్) రూట్లలో నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా ఒక్కో బస్సుకు రూ.కోటి వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మొదటి విడత 20 బస్సులు ప్రస్తుతం ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్‌భవన్‌కు చేరుకున్నాయి. ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. అగ్ని ప్రమాదాలను పసిగట్టే పరిజ్ఞానం ఈ బస్సుల్లో ఇంజన్ వద్ద ప్రత్యేకంగా ‘ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్’ అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేశారు. ఇవి ఇంజన్లో తలెత్తే లోపాలను పసిగట్టడంతో పాటు పొగ, మంటలు వెలువడితే.. వెంటనే గుర్తించి ఆర్పేస్తాయి. ఇప్పటి వరకు మంటలను గుర్తించి హెచ్చరించే అలార్మింగ్ వ్యవస్థ మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే భారత్ స్టేజ్-4 టెక్నాలజీకి చెందిన ఈ బస్సుల్లో ప్రమాదకరమైన నైట్రస్ ఆక్సైడ్ వంటి కాలుష్య కారకాలను హానిరహిత వాయువులు (నైట్రోజన్, ఆక్సిజన్)గా మార్చే లిక్విడ్ అమ్మోనియా స్ప్రే ఉంటుంది. సెలైన్సర్లో యాడ్ బ్లూ ద్వారా ఈ అమ్మోనియాను స్ప్రే చేస్తారు. ఒక్క అడుగు ఎత్తులో.. వోల్వో బస్సులో 32 సీట్లు ఉంటాయి. ప్రయాణికులు నిల్చునేందుకు ఎక్కువ స్పేస్ ఇచ్చారు మహిళలు, వృద్ధులు, పిల్లలు తేలికగా ఎక్కి దిగేందుకు వీలుగా ఒక్క అడుగు ఎత్తులోనే ఫుట్‌బోర్డు ఉంటుంది వీల్‌చైర్‌తో సహా బస్సులోకి ఎక్కేందుకు ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేశారు ఫ్యాబ్రిక్ కుషన్ సీట్లు.. ప్రయాణాన్ని కుదుపులు లేకుండా చేస్తాయి 290 హార్స్పవర్ సామర్థ్యం కలిగిన ఇంజన్ ఈ బస్సు ప్రత్యేకత. దీనివల్ల ఏసీ సరఫరాలో అంతరాయం ఉండదు బస్సు లోపల, వెనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వెహికిల్ ట్రాకింగ్ పరిజ్ఞానం ఈ బస్సు సొంతం. -
రూ.6750 కోట్లతో సుజలం
గోదావరి, కృష్ణా మూడోదశ పనులు సహా బ్రాండ్ ఇమేజ్ పెంపుపై దృష్టి తాగునీటి వసతులకు రూ.5500 కోట్లు ఇవ్వండి కలుషిత జలాల నివారణకు రూ.1250 కోట్లు కేటాయించండి పురాతన పైపులైన్లు మారిస్తేనే మంచినీరు ప్రభుత్వానికి జల మండలి నివేదిక నేడు సీఎం సమీక్ష? సాక్షి, సిటీ బ్యూరో: గ్రేటర్‌ను విశ్వ విఖ్యాత నగరంగా తీర్చిదిద్దాలన్నా... అంతర్జాతీయ విపణిలో నగర బ్రాండ్ ఇమేజ్ పెరగాలన్నా2017 నాటికి నగరంలోని అన్ని ప్రాంతాలకు పుష్కలంగా మంచినీటిని సరఫరా చేయాలి. ఇందుకు రూ.5500 కోట్లు అవసరం (మొత్తం రూ. 6750 కోట్లు). మరోవైపు కలుషిత జలాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాల్సి ఉంది. దీనికి రూ.1250 కోట్లు అవసరం. ఇదే అంశాన్ని జలమండలి ప్రభుత్వానికి నివేదించింది. మంచినీటి ఎద్దడితో జనం పడుతున్న అవస్థలు, పాతనగరం సహా నిత్యం ఏదో ఒక చోట తెలెత్తుతోన్న కలుషిత జలాల సమస్య... పరిష్కార మార్గాలు, బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు జలమండలి పరంగా తీసుకోవాల్సిన చర్యలు, కృష్ణా మూడో దశ, గోదావరి మంచినీటి పథకం పనుల పురోగతి... అందుకు ప్రభుత్వ పరంగా కావాల్సిన సహకారం, అవసరమైన నిధులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. మంచినీటికి రూ.5500 కోట్లు... 2017 నాటికి గ్రేటర్ జనాభా అనూహ్యంగా పెరగనుంది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి, జూరాల మంచినీటిపై ఆధారపడి నూతనంగా కొన్ని నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది. రాబోయే మూడేళ్లలో నగరానికి అదనంగా 10 టీఎంసీల నీటిని ఆయా జలాశయాల నుంచి తరలించాల్సి ఉంది. దీనికి రూ.5500 కోట్లు అవసరమని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జలమండలి కోరింది. కలుషిత జలాల నుంచి విముక్తికి... కలుషిత జలాల నుంచి నగర వాసులకు విముక్తి కల్పించాలంటే నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 1156 కిలోమీటర్ల మేర పురాతన మంచినీటి పైపులైన్లను మార్చాల్సిందేనని, ఇందుకు రూ.1250 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి జలమండలి నివేదించినట్లు తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగర వాసులకు సురక్షిత మంచి నీరందించేందుకు రూపొందించిన వాటర్ సేఫ్టీ ప్లాన్(రక్షిత మంచినీటి ప్రణాళిక)కు గత ప్రభుత్వాలు కేవలం రూ.37 కోట్లు మాత్రమే కేటాయించడంతో పురాతన పైపులైన్లను మార్చలేకపోయినట్లు నివేదికలో పొందుపరిచారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సైతం ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం విషయంలో స్పందిస్తూ.. నగర ప్రజలకు రక్షిత మంచి నీరందించడం జలమండలి బాధ్యతని పేర్కొన్న విషయాన్నీ నివేదికలో ప్రస్తావించారు. ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయిస్తేనే గ్రేటర్ సిటిజనులకుకలుషిత జలాల ముప్పు తప్పుతుందని నిపుణులు స్పష్టం చేస్తుండడం ఇక్కడ గమనార్హం. పాత పైపులతోనే ఈ దుస్థితి... గ్రేటర్‌లోని జలమండలి పరిధిలో8.10 లక్షల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. నగరం నలుమూలలా ఉన్న నల్లాలకు మంచినీటిని సరఫరా చేసేందుకు 600 కిలోమీటర్ల మేర భారీ మంచినీటి సరఫరా పైపులైన్లు ఉన్నాయి. వీటి ద్వారా కాలనీలు, బస్తీలకు తాగునీరందించేందుకు మరో 7980 కిలోమీటర్ల మేర పంపిణీ (డిస్ట్రిబ్యూటరీ) పైపులైన్లు ఉన్నాయి. వీటిలో 30 ఏళ్లకు పైబడిన పురాతన లైన్లు 1156 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. ఇందులో ఆర్సీసీ, ఏసీ, పీవీసీ, హెచ్డీపీఈ, జీఐ రకం పైపులే అత్యధికం. వీటి కాల పరిమితి ముగిసిపోవడంతోతరచూ ఏదో ఒక చోట లీకేజీలు చోటుచేసుకుంటున్నాయి. వాటి పక్కనే ఉన్న మురుగునీటి పైపులైన్ల నుంచి వెలువడే వ్యర్థజలాలు మంచినీటి పైపులైన్లలోకి చేరుతున్నాయి. దీంతో పాతనగరంలోని అనేక ప్రాంతాలకు తరచూ రంగుమారి, దుర్వాసన వెదజల్లే జలాలు సరఫరా అవుతున్నాయి. ఇదే తరహాలో 2009లో జరిగిన భోలక్‌పూర్ ఘటనలో కలుషిత జలాలు సరఫరా అయిన కారణంగా 14 మంది మత్యువాత పడిన విషయాన్నీ నివేదికలో ప్రస్తావించారు. ఈ పరిస్థితి సమూలంగా మారాలంటే పురాతన పైపులైన్లను తక్షణం మార్చాల్సిందేనని సూచించారు. రిజర్వాయర్లకూ చికిత్స చేయాల్సిందే.. కలుషిత జలాల సమస్య తీరాలంటే సుదూర ప్రాంతాల నుంచి నగరానికి తరలిస్తున్న కృష్ణా, మంజీర, సింగూరు జలాలతో పాటు జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాలను నిల్వ చేస్తున్న పురాతన మంచినీటి స్టోరేజీ రిజర్వాయర్లను సైతం పునర్నిర్మించాలని జలమండలి నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఎర్రగడ్డ, మారేడ్‌పల్లి, తార్నాక, బంజారా సెకెండ్ స్టేజి, అల్వాల్, లింగంపల్లి, హైదర్‌నగర్ పురాతన రిజర్వాయర్ల స్థానే కొత్తవి నిర్మాణానికి మరో రూ.100 కోట్లు అవసరమవుతాయని నివేదికలో పేర్కొన్నారు. పైపులైన్లు మార్చాల్సిన ప్రదేశాలివే.. భోలక్‌పూర్, కవాడిగూడ, గాంధీనగర్, చార్మినార్, బహూదూర్‌పురా, చాంద్రాయణ గుట్ట, కట్టెలమండి, వినాయక్ వీధి, కుల్సుంపురా, చాదర్‌ఘాట్, దారుషిఫా, మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, నాంపల్లి, ఛత్రినాక, ఫలక్‌నుమా, జహానుమా, కార్వాన్, పత్తర్‌ఘట్టీ, డబీర్‌పురా పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీల్లో తక్షణం పురాతన పైపులైన్లు మార్చాల్సి ఉందని జలమండలి నివేదికలో పొందుపరిచింది. ప్రాజెక్టు పనులపైనా సీఎం సమీక్ష.. గ్రేటర్ బ్రాండ్ ఇమేజ్ను పెంచాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్న ప్రభుత్వం.. మరోవైపు ప్రజల దాహార్తిని తీర్చే కీలక మంచినీటి పథకాలను సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనుల పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలను సైతం జలమండలి నివేదికలో పొందుపరిచింది. ఆ ప్రాజెక్టుల పురోగతిని పరిశీలిస్తే... కృష్ణా మూడో దశ.. నల్లగొండ జిల్లా కోదండపూర్ నుంచి నగర శివారులోని సాహెబ్‌నగర్ వరకు సుమారు రూ.1670 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టినకృష్ణా మూడో దశ పనులు ఇప్పటివరకు 70 శాతం మేర పూర్తయినట్లు జలమండలి నివేదించింది. పథకంలో భాగంగా చేపట్టిన రిజర్వాయర్ల నిర్మాణ పురోగతి బాగుందని పేర్కొంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఈ పథకాన్ని పూర్తి చేస్తామని తెలిపింది. గోదావరి మంచినీటి పథకం... కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివారులోని శామీర్‌పేట్ వరకు రూ.3800 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన గోదావరి మంచినీటి పథకం పనులు ఇప్పటివరకు 70 శాతం పూర్తయినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ పథకానికి ఎదురవుతున్న అడ్డంకులు, ప్రభుత్వ పరంగా కావాల్సిన సహకారం తదితర అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా శామీర్‌పేట్ ప్రాంతంలో హెరిటేజ్ రాక్ క్లియరెన్స్‌ను మంజూరు చేయాలని కోరారు. ఈ ఏడాది బడ్జెట్లో ఈ పథకానికి రూ.260 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి రింగ్ మెయిన్ పనులు... రూ.350 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన గోదావరి రింగ్ మెయిన్ పనులకు బడ్జెట్లో పూర్తి స్థాయిలో కేటాయింపులు జరపాలని కోరారు. -
‘రిలయన్స్’ మూగబోయింది
అద్దంకి: రిలయన్స్.. ఈ పేరు వినగానే బ్రాండ్ ఇమేజ్ గుర్తుకొస్తుంది. ఆ సంస్థకు చెందిన ఎలాంటి ఉత్పత్తులైనా నాణ్యంగా ఉంటాయని అందరి నమ్మకం. అయితే దీనికి రివర్స్‌గేర్ పడినట్లయింది. 15 రోజులుగా రిలయన్స్ మొబైల్, నెట్ కనెక్షన్‌కు సంబంధించిన నెట్‌వర్క్‌లు నిలిచిపోవడమే దీనికి కారణం. గతంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన ప్రతినిధులు అద్దంకిలో విస్తృత ప్రచారం చేపట్టారు. రిలియన్స్ సిమ్ కార్డులు, నెట్ మోడెమ్‌లను ఏజెంట్ల సాయంతో.. కొన్ని చోట్ల సంస్థ తరఫునే నేరుగా విక్రయించారు. సంస్థకు మంచిపేరు ఉండటంతో అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రీపెయిడ్ కార్డులు, మోడెమ్‌లు వేలాదిగా అమ్ముడుపోయాయి. కొంతమంది అయితే నెల, మూడు నెలలు, ఏడాది ప్యాకేజీలున్న మోడెమ్‌లకు ఎక్కువ మొత్తం ఖర్చు చేసి తీసుకున్నారు. ఇలా నియోజకవర్గంలోని 103 గ్రామాల్లో రిలయన్స్ నెట్వర్క్ విస్తరించింది. మొదట్లో బాగానే ఉన్నా.. ఏడాది నుంచి సిగ్నల్ వ్యవస్థలో లోపాలు తలెత్తడం ప్రారంభమైంది. నెల రోజులు నెట్వర్క్ బాగుంటే.. ఆ తర్వాత నాలుగైదు రోజులు సమస్యరావడం, మళ్లీ సర్దుకోవడం జరుగుతోంది. అప్పటి నుంచే వినియోగదారులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అత్యవసర సమాచారం ఫోన్లో చేరవేయాలన్నా.. నెట్ ఉపయోగించాలన్నా ఇబ్బందులు ఎదుర్కోవడం మామూలైంది. సమస్య ఎవరికి చెప్పుకోవాలో.. ఎవరు పరిష్కరిస్తారో తెలియని పరిస్థితి. ఇప్పుడైతే ఏకంగా 15 రోజుల నుంచి సిగ్నల్స్ లేక ఫోన్లు, మోడెమ్‌లు మూగబోయాయి. ఈ దెబ్బకు ఇతర నెట్వర్క్ సేవలు వినియోగించుకొనేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. టవర్స్ తొలగిస్తున్నారా? పక్షం రోజులుగా రిలయన్స్‌తో విసిగిపోయిన ప్రజలు.. ఆ సంస్థకు చెందిన సిగ్నల్ టవర్లను ఎత్తివేస్తున్నారంటూ చర్చించుకుంటున్నారు. ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఎవరికివారు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో ఎక్కువ మొత్తం చెల్లించి ప్యాకేజీలు తీసుకున్నవారు లబోదిబోమంటున్నారు. దీనిపై రిలయన్స్ సంస్థ ఒంగోలు బాధ్యుడు రమణను ఫోన్లో సంప్రదించగా.. టవర్స్ బాగానే పని చేస్తున్నాయన్నారు. ఆ తర్వాత తేరుకొని.. అద్దంకిలోనే కాకుండా, మొత్తంమీద 74 టవర్లు పని చేయడంలేదని తెలిపారు. అందుకే సిగ్నల్స్ సరిగా రావడంలేదని రెండు రోజల్లో మరమ్మతులు చేయిస్తామని చెప్పారు.