
మార్కెటింగ్‌కైనా, ఎన్నికల వ్యూహాలకైనా బ్రాండింగే ముఖ్యం. మరి ఆ రెండూ కలిపి రాజకీయాన్ని మార్కెట్ రంగం లోకి తెస్తే ఇక తిరుగేముంది? వైవిధ్యమైన ప్రచారంలో ముందుండే బీజేపీ ఈసారీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరునే ఒక బ్రాండ్‌గా ప్రచారం చేస్తోంది. ఈ కామర్స్ వెబ్‌సైట్స్ పేటీఎం, అమెజాన్, మోదీ మొబైల్ అప్లికేషన్‌లోని ఉన్న ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో అమ్మకానికి ఉంచిన వస్తువులపై మోదీ బొమ్మలే కనిపిస్తున్నాయి. బనియన్లు, బొమ్మలు, కాఫీకప్పులు, టీషర్ట్‌లు, చివరికి చీరల్నీ వదిలి పెట్టలేదు.
అన్నిటిపై మోదీ ఫొటోలే ముద్రించి సేల్‌కు పెట్టింది. యూత్ వీటిని పోటీ పడి కొంటోంది.. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో జనవరిలో రూ.5 కోట్ల విలువైన మోదీ బ్రాండెడ్ వస్తువులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇక బీజేపీ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ ఈ వస్తువులని అమ్మకానికి ఉంచారు. మోదీ, కమలం గుర్తు ముద్రించి ఉన్న వస్తువుల్ని కొనాలనే ఆసక్తి ఉంటే బీజేపీ కార్యాలయాల్ని కూడా సంప్రదించవచ్చు. ఈ వస్తువుల్లో మోదీ టీ షర్ట్‌లకి డిమాండ్ ఉంది. ఇక మోదీ చీరల్ని గుజరాత్ మహిళలు ఎగబడి కొంటున్నారు. వెయ్యి నుంచి రూ.1500కే ఇవి అమెజాన్, స్నాప్‌డీల్ సైట్‌లలో లభిస్తున్నాయి. గత ఏడాది ధంతేరాస్ సమయంలో మోదీ బొమ్మ ముద్రించిన బంగారు బిస్కెట్‌లను గుజరాత్‌లో ఒక దుకాణం విక్రయించి వార్తల్లోకెక్కింది. మరిప్పుడు ఈ ఎన్నికల ‘సేల్స్’ బీజేపీకి ఎంత కలిసివస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment