‘హైటెక్’ రోడ్లపైకి వోల్వో బస్సులు | 'High-tech' roads Volvo | Sakshi
Sakshi News home page

‘హైటెక్’ రోడ్లపైకి వోల్వో బస్సులు

Published Tue, Sep 2 2014 3:52 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

‘హైటెక్’ రోడ్లపైకి వోల్వో బస్సులు - Sakshi

‘హైటెక్’ రోడ్లపైకి వోల్వో బస్సులు

  • త్వరలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
  • సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక వోల్వో బస్సులు నగరంలో పరుగులు తీయనున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా, ప్రజా రవాణాను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం నగరంలో 80 వోల్వో బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

    మొదట దిల్‌సుఖ్‌నగర్-పటాన్‌చెరు (218డీ), ఉప్పల్-కొండాపూర్ (113 కే/ఎల్) రూట్లలో నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో భాగంగా ఒక్కో బస్సుకు రూ.కోటి వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మొదటి విడత 20 బస్సులు ప్రస్తుతం ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్‌భవన్‌కు చేరుకున్నాయి. ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.
     
    అగ్ని ప్రమాదాలను పసిగట్టే పరిజ్ఞానం
     
    ఈ బస్సుల్లో ఇంజన్ వద్ద ప్రత్యేకంగా ‘ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్’ అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేశారు. ఇవి ఇంజన్‌లో తలెత్తే లోపాలను పసిగట్టడంతో పాటు పొగ, మంటలు వెలువడితే.. వెంటనే గుర్తించి ఆర్పేస్తాయి. ఇప్పటి వరకు మంటలను గుర్తించి హెచ్చరించే అలార్మింగ్ వ్యవస్థ మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే భారత్ స్టేజ్-4 టెక్నాలజీకి చెందిన ఈ బస్సుల్లో ప్రమాదకరమైన నైట్రస్ ఆక్సైడ్ వంటి కాలుష్య కారకాలను హానిరహిత వాయువులు (నైట్రోజన్, ఆక్సిజన్)గా మార్చే లిక్విడ్ అమ్మోనియా స్ప్రే ఉంటుంది. సెలైన్సర్‌లో యాడ్ బ్లూ ద్వారా ఈ అమ్మోనియాను స్ప్రే చేస్తారు.
     
    ఒక్క అడుగు ఎత్తులో..


    వోల్వో బస్సులో 32 సీట్లు ఉంటాయి. ప్రయాణికులు నిల్చునేందుకు ఎక్కువ స్పేస్ ఇచ్చారు
         
    మహిళలు, వృద్ధులు, పిల్లలు తేలికగా ఎక్కి దిగేందుకు వీలుగా ఒక్క అడుగు ఎత్తులోనే ఫుట్‌బోర్డు ఉంటుంది
         
    వీల్‌చైర్‌తో సహా బస్సులోకి ఎక్కేందుకు ప్రత్యేక ర్యాంప్  ఏర్పాటు చేశారు
         
    ఫ్యాబ్రిక్ కుషన్ సీట్లు.. ప్రయాణాన్ని కుదుపులు లేకుండా చేస్తాయి
         
    290 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన ఇంజన్ ఈ బస్సు ప్రత్యేకత. దీనివల్ల ఏసీ సరఫరాలో అంతరాయం ఉండదు
         
    బస్సు లోపల, వెనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వెహికిల్ ట్రాకింగ్ పరిజ్ఞానం ఈ బస్సు సొంతం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement