World's Richest City: ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులు ఏ నగరంలో ఉన్నారో తెలుసా? | World's Richest City Has Over 3 Lakh Millionaires Says Report - Sakshi
Sakshi News home page

ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులు ఏ నగరంలో ఉన్నారో తెలుసా?

Published Wed, Apr 19 2023 10:35 AM | Last Updated on Wed, Apr 19 2023 1:07 PM

World Richest City Has Over 3 Lakh Millionaires Said Henley And Partners - Sakshi

కుబేరులు అనగానే మన దృష్టి వారి సంపదవైపే వెళుతుంది. ఆసక్తి ఉంటే వారి కంపెనీలు.. వాళ్లు ఏం చదువుకుకున్నారు. రోజుకి ఎంత ఆర్జిస్తున్నారు?వంటి వివరాలను తెలుసుకుంటాం. కానీ, వాళ్లు ఎక్కుడ? ఏ ప్రాంతంలో  ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారా?  

ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులు ఎంత మంది ఉన్నారో గుర్తించే హెన్లీ అండ్‌ పార్ట్‌నర్‌ సంస్థ ‘మోస్ట్‌ మిలియనీర్‌ ఇన్‌ 2023’పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌లో అమెరికా న్యూయార్క్‌ సిటీలోనే ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులు ఉన్నట్లు తెలిపింది. దీంతో న్యూయార్క్‌ నగరం మరోసారి అత్యధిక ధనవంతులు జాబితాలో మరోసారి స్థానం దక్కించుకుంది. 

ఈ నగరంలో 3,40,000 మంది మిలియనీర్లు ఉండగా.. తర్వాత టోక్యోలో 290,300 మంది, శాన్ ఫ్రాన్సిస్కో 285,000మంది ఉన్నారు. ఈ నివేదిక ప్రపంచంలో ఎక్కువ సంపద కలిగిన ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సీఐఎస్‌(Commonwealth of Independent States), తూర్పు ఆసియా, యూరప్, మిడిల్‌ ఈస్ట్‌, నార్త్‌ అమెరికా, దక్షిణాసియా , ఆగ్నేయాసియాలలో మొత్తం  97 నగరాల్లో ఈ డేటాను సేకరించింది. వాటి ఆధారంగా ఏ ప్రాంతంలో ఎంతమంది మిలియనీర్లు ఉన్నారో నిర్ధారించింది. 

ఇక న్యూయార్క్, ది బే ఏరియా, లాస్ ఏంజిల్స్,చికాగో నగరాలు అమెరికాలో మిలియనీర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల విభాగంలో ఆధిపత్యం చెలాయించాయి. చైనాకు చెందిన రెండు నగరాలు బీజింగ్, షాంఘైలు సైతం అదే జాబితాలో ఉన్నాయి.

రెసిడెంట్ హైనెట్‌వర్త్‌ జాబితాలో(HNWI) 258,000 మందితో లండన్ ఈ సంవత్సరం నాల్గవ స్థానానికి పడిపోయింది, 240,100 మందితో  సింగపూర్ తర్వాతి స్థానంలో ఉంది. 2000లో లండన్ లక్షాధికారులలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది, కానీ గత 20 ఏళ్లలో ఇది జాబితా నుండి పడిపోయింది.

ది బిగ్‌ యాపిల్‌గా పేరు గడించిన న్యూయార్క్ నగరంలో 3,40,000 మంది మిలియనీర్లు, 724 సెంటీ-మిలియనీర్లు, 58 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇక బ్రాంక్స్, బ్రూక్లిన్, మాన్‌హట్టన్, క్వీన్స్, స్టాటెన్ ఐలాండ్‌లు, మాన్‌హాటన్‌లోని 5వ అవెన్యూతో సహా ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన నివాసాలున్న కాలనీలుగా గుర్తింపు పొందాయి. ఇక్కడ ప్రధాన అపార్ట్‌మెంట్ ధరలు చదరపు మీటరుకు 27వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉండవచ్చు’ అని హెన్లీ అండ్‌ పార్ట్‌నర్‌ నివేదిక హైలెట్‌ చేసింది. 

చదవండి👉 అవధుల్లేని అభిమానం అంటే ఇదేనేమో..టిమ్‌ కుక్‌కు ఇంతకన్నా ఏం కావాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement