Act
-
తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయని ‘ఎక్స్’ వేదికగా అన్నారు. ‘‘పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు.. హక్కులను అడిగితే బెదిరింపులు.. పోరాడితే సస్పెన్షన్లు.. ఇది నియంతృత్వ రాజ్యం.. నిర్బంధాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం. పోరాటం తెలంగాణకు కొత్తకాదు.. ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉన్నది. ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తాం.. ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతాం’’అని పేర్కొన్నారు.పోరాడి సాధించుకొని.. పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి..ప్రజాస్వామిక తెలంగాణలో..మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయి..ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు...హక్కులను అడిగితే బెదిరింపులు..పోరాడితే… pic.twitter.com/vmFnf0zmoP— KTR (@KTRBRS) November 2, 2024 -
Gift Deed: ముందే పకడ్బందీగా రాసుకోవాలి
నాకు, నా భార్యకి కలిపి కొంత ఆస్తి ఉండేది. వయసు అయిపోతుంది అని మా ఇద్దరి పిల్లలకి సమానంగా పంచుతూ గిఫ్ట్ డీడ్ చేశాము. అందులో ప్రస్తుతం మేము ఉంటున్న ఇల్లు కూడా వుంది. గిఫ్ట్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది. మా పిల్లల మధ్య వచ్చిన మనస్పర్థల వల్ల మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పరస్పరం తగాదా పడుతున్నారు. మాకు ఇదంతా చాల ఇబ్బందిగా మారింది. మేము ఇచ్చిన గిఫ్టు తిరిగి తీసుకోవాలి అనుకుంటున్నాము. పరిష్కారం తెలుపగలరు.– నరసింహ శర్మ, గుంటూరుట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ (ఆస్తి బదిలీ చట్టం) ప్రకారం ఒకసారి ఆస్తిని బదిలీ చేసిన తర్వాత, అది గిఫ్ట్ (బహుమతి) అయినప్పటికీ, సాధారణ పరిస్థితులలో రీవోకేషన్ (రద్దు చేయటం) సాధ్యపడదు. ఒకవేళ మీరు గిఫ్ట్‌గా ఇస్తున్న ఆస్తిని ఏదైనా కారణంచేత భవిష్యత్తులో తిరిగి తీసుకోవాలి అని మీరు అనుకుంటే, అలాంటి నిబంధనని, ఎలాంటి పరిస్థితులలో తిరిగి తీసుకోవచ్చు అన్న అంశాలను గిఫ్ట్ డీడ్ లో పొందుపరచవలసి ఉంటుంది. అలా రద్దు చేసుకోవచ్చు అని మీరు పేర్కొన్న సందర్భం ఎదురైతే, రద్దునకు తగు చర్యలు చట్టపరంగా తీసుకోవచ్చు. మీరు సీనియర్ సిటిజన్ అని అర్థం అవుతోంది. అందుకే మీకు అదనంగా తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం కింద కూడా కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు కనుక, మీరు చేసిన గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పత్రంలో సదరు ‘గిఫ్టు తల్లిదండ్రులు, వయో వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం నిబంధనలకు లోబడి ఉంటుంది’ అనే అర్థం వచ్చేట్టు రాసుకుని వుంటే గనుక, మీరు ఇచ్చిన గిఫ్టును సులభంగా రద్దు చేసుకోవచ్చు లేదా ఉపసంహరించవచ్చు అంటే తిరిగి వెనక్కి తీసుకోవచ్చు. అలా కాకపోయినా తిరిగి తీసుకునే అవకాశం ఉందా లేదా అనే విషయం, కేవలం మీ పత్రాలు చూసిన తర్వాత మాత్రమే చెప్పగలం.తల్లిదండ్రులు – వయోవృద్ధులు తమ పిల్లలకి, కుటుంబ సభ్యులకు, మరే ఇతర వారసులకు లేదా మీరు ఆస్తి గిఫ్టు గా ఇవ్వాలి అనుకునే ఎవరికైనా సరే, గిఫ్టు డీడ్ (బహుమాన పత్రం/ఒప్పందం) లో కనీసం పైన పేర్కొన్న చట్టానికి ఆ గిఫ్టు లోబడి ఉంటుంది అని రాసుకోవటం ఉత్తమం. మీ వారసులు ఏదో చేస్తారు అని కాదు కానీ, మీ ప్రయోజనార్థం ఈ సూచన ఇస్తున్నాను.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
వీలునామాను మార్చవచ్చా? ఎన్నిసార్లు మార్చవచ్చు!
నేను ఇదివరకే వీలునామా రాసి ఉంచాను. అలా వీలునామా రాసిన విషయం నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకి చెప్పి ఉంచాను. ఇప్పుడు ఆ వీలునామాను మార్చాలను కుంటున్నాను. వీలవుతుందా? – పి. కోటేశ్వరరావు, విజయవాడమీరు సంపాదించిన ఆస్తులపై, మీకు సంక్రమించిన ఆస్తులపై వీలునామా రాయడం అనేది మీ హక్కు. మీ జీవిత కాలంలో మీ వీలునామాని మీరు కావాలి అంటే మార్చుకోవచ్చు. అయితే అలా మార్చుకోవాలి అనుకున్నప్పుడు గతంలోనే మీరు వీలునామా రాసిన విషయాన్ని, అందులోని అంశాలను, వివరాలను ప్రస్తావిస్తూ, పాత వీలునామా ఇక చెల్లదు అని మీరు రాయబోయే వీలునామాలో పేర్కొనాల్సి ఉంటుంది. మీ వీలునామాలో మీరు కావాలి అంటే ‘మరలా ఒకసారి కూడా వీలునామా మార్చవచ్చును’ అని, అలా మార్చక΄ోతే ఇదే ఆఖరి వీలునామా అవుతుంది అని కూడా రాయించవచ్చు.మీరు వీలునామా రాసిన విషయాన్ని ఇప్పటికే మీ బంధుమిత్రులకు, స్నేహితులకు చెప్పాను అని అన్నారు. అలాంటి వీలునామాలు చట్టరీత్యా చెల్లినప్పటికీ మీ తదనంతరం మీ ఆస్తిలో భాగం కోరుకునే వారు ఎవరైనా ఆ వీలునామా సరైనది కాదు అని లేదా మరొక కారణం చూపి లేని΄ోని కేసులు వేయవచ్చు. సొంతంగా రాసుకున్న వీలునామాలలో కచ్చితంగా ΄÷ందుపరచవలసిన కొన్ని అంశాలను విస్మరించడం తరచుగా చూస్తుంటాం. అలాంటి వీలునామాలు కోర్టు కేసులలో బలమైన అంశాలుగా పరిగణించబడవు. వీలునామాలో మీరు పేర్కొనే వారసులు ఒకవేళ మైనర్ అయితే, వారికి గార్డియన్‌ను నియమించటం, శానిటీ ఓత్ (చిత్తశుద్ధి ప్రమాణం/ధ్రువీకరణ) చేయటం, అచ్చుతప్పులు లేకుండా రాయటం, ఆస్తి వివరాలను క్షుణ్ణంగా వివరించటం వంటి అంశాలు వీలునామా చెల్లుబాటునకు అవసరం. అలా లీగల్ గా చెల్లుబడి అయేలా మెరుగైన వీలునామాను మీ దగ్గరలోని లాయర్‌తో రాయించుకుని, వీలునామాలో మీరు పొందుపరచాలి అనుకున్న నిబంధనలు ఏవైనా ఉంటే అవి చట్టరీత్యా చెల్లుతాయా లేదా అనే అంశాలను కూడా అడిగి తెలుసుకోవడం మంచిది. మరో ముఖ్య విషయం ఏమిటంటే, మీరు రాసిన వీలునామాను రిజిస్టర్ చేయించుకోవడం ఉత్తమం. అలా రిజిస్ట్రేషన్ చేయించిన వీలునామా అయితే మీ తదనంతరం కూడా అందరికీ అన్ని విధాలా మేలు చేస్తుంది. మీరు అనుకున్న విధంగా మీ వీలునామా అమలుకు నోచుకుంటుంది.– శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshi.family3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
భూంకాల్ పోరాటం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాజ్యసంక్ర మణ సిద్ధాంతం, సైన్యసహకార పద్ధతి వంటి కుట్రపూరిత విధానాలతో బస్తర్ రాజ్యాన్ని కూడా ప్రిన్సిలీ స్టేట్‌గా బ్రిటీషర్లు మార్చారు. రాజును నామమాత్రం చేస్తూ పరోక్షంగా పాలన సాగించా రు. ఈ క్రమంలో 1878లో బ్రిటీష్ ప్రభుత్వం రిజ ర్వ్ ఫారెస్ట్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో బస్తర్ అడవుల్లో 66 శాతం భూభాగంపై ఆదివాసీ లు హక్కులు కోల్పోయారు. రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించిన ప్రదేశాల్లో కర్ర పుల్ల తీసుకెళ్లాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. మరోవైపు బ్రిటీ షర్ల కాలంలో బస్తర్ పాలకుడిగా ఉన్న భైరామ్ దేవ్ కుష్ఠువ్యాధి బారిన పడ్డారు. దీంతో ఆయన్ను పదవి నుంచి దూరంగా ఉంచి అతని కొడుకైన రుద్ర ప్రతాప్‌దేవ్‌ని 1891లో రాజుగా బ్రిటీష్ సర్కార్ గుర్తించింది. అయితే మేజర్ అయ్యేంత వరకు ఆయనకు పట్టాభిషేకం చేసే అవకాశం లేదు. అలా రాజుతోపాటు రాజకుటుంబంలో ప్రధాన పదవుల్లో ఉన్నవారు తమ అ«ధికారాలు కోల్పోయారు. ఇలా బ్రిటీషర్ల ఆధిపత్య ధోరణి కారణంగా ఇటు రాజవంశానికే కాక అటు ఆదివాసీలకు ఇక్కట్లు మొదలయ్యాయి. తిరుగుబాటుకు పిలుపు1909 అక్టోబర్‌లో జరిగిన దసరా వేడుకల్లో రిజర్వ్ ఫారెస్ట్ చట్టం, దాన్ని అమలు చేస్తున్న బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం చేయాలంటూ బస్తర్ రాజ్య మాజీ దివాన్ లాల్ కాళీంద్రసింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానికంగా పేరున్న ఆదివాసీ నేత గుండాధుర్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఫారెస్ట్ చట్టం కారణంగా తాము పడుతున్న బాధలను ఊరూరా ప్రచారం చేస్తూ తిరుగుబాటుకు ప్రజలను సిద్ధం చేశారు. ప్రతీ ఇంటి నుంచి ఒకరు పోరాటానికి రావాలని, ఆయుధాలు పట్టలేనివారు రాళ్లు, కర్రలు, కారం పొడి అయినా అందించాలని స్ఫూర్తి నింపారు. 1909 అక్టోబర్ నుంచి 1910 ఫిబ్రవరి మొదటివారం నాటికి బస్తర్‌లో అటవీ గ్రామాలన్నీ పోరాటానికి సంసిద్ధమయ్యాయి. ముఖ్యంగా బస్తర్‌లో ఉత్తర ప్రాంతమైన కాంకేర్ నిప్పు కణికలా మారింది.మూడు రోజుల్లోనే....1910 ఫిబ్రవరి 4న కుకనార్‌లో గుండాధూర్ నాయకత్వంలో ఆదివాసీలు బ్రిటీష్ అధికార కార్యాలయాలు, గోదాములు, మార్కెట్, ప్రభుత్వ అధికారుల ఇళ్లపై మెరుపుదాడులు జరిపారు. కేవలం మూడురోజుల్లోనే బస్తర్‌లోని 84 పరగణాల్లో 46 పరగణాలు తిరుగుబాటుదారుల అధీనంలోకి వచ్చాయి. కాంకేర్ ప్రాంతంలో బ్రిటీష్ అధికారులు, వ్యాపారులు ఇళ్లు వదిలి పారిపోయారు. దండకారణ్యంలో భూకంపం లాంటి తిరుగుబాటు వచ్చిందని తక్షణ సాయం అవసరమంటూ బ్రిటీష్ ప్రభుత్వానికి అప్పటి మహారాజు రుద్ర ప్రతాప్‌దేవ్ టెలిగ్రామ్ పంపారు. దీంతో ఈ పోరాటానికి భూంకాల్ పోరాటమని పేరు వచ్చింది. గుండాధూర్ చిక్కలేదుభూంకాల్ విప్లవాన్ని అణచివేసే పనిని కెప్టెన్ గేర్‌కు బ్రిటీష్ సర్కార్ అప్పగించింది. పదిరోజులు బ్రిటీష్, బస్తర్ స్టేట్ సైన్యాలు అడవుల్లో గాలించినా విప్లవకారుల్లో కేవలం 15 మందినే పట్టుకోగలిగారు. మరోవైపు తనను పట్టుకునేందుకు వచ్చిన కెప్టెన్ గేర్‌పైనే నేరుగా దాడి చేసి బ్రిటీషర్ల వెన్నులో గుండాధూర్ వణుకు పుట్టించాడు. తృటిలో కెప్టెన్ గేర్ ఆ దాడి నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడు కున్నాడు. దీంతో బెంగాల్, జైపూర్ రాజ్యాల నుంచి అదనపు బలగాలను బస్తర్‌కు రప్పించారు. ఆ తర్వాత గుంఢాదూర్‌కు నమ్మకస్తుడైన సోనుమాంఝీ ద్వారా కోవర్టు ఆపరేషన్ జరిపి 1910 మార్చి 25 రాత్రి గుంఢాధూర్ ఆయన సహచరులు బస చేసిన అటవీ ప్రాంతంపై బ్రిటీష్ సైన్యం దాడి జరిపింది. ఇందులో 21 మంది చనిపోగా మరో ఏడుగురు పట్టుబడ్డారు. కెప్టెన్ గేర్ ఎంతగా ప్రయత్నించినా ఆదివాసీ పోరాట యోధుడు గుండాధూర్ మాత్రం చిక్కలేదు. మెరుపు తిరుగుబాటుతో బ్రిటీషర్లకు చుక్కలు చూపించిన బస్తర్ ఆదివాసీలు ఆ తర్వాత తమ హక్కుల కోసం స్వతంత్ర భారత దేశంలో ఏర్పడిన ప్రభుత్వంతోనూ ఘర్షణ పడ్డారు. ఈ పోరులో తాము దైవంగా భావించే మహారాజునే కోల్పోయారు. -
త్వరలోనే డేటా రక్షణ నిబంధనలు
న్యూఢిల్లీ: వ్యక్తిగత డిజిటల్ డేటా పరిరక్షణ చట్టం ముసాయిదా నిబంధనలను నెలరోజుల్లోనే విడుదల చేస్తామని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. ప్రభుత్వం తొలుత డిజిటల్‌గా ఈ చట్టం అమలుపై దృష్టి పెట్టినట్టు.. అందుకు అనుగుణంగా నిబంధనలు రూపొందించినట్టు చెప్పారు.‘‘కార్యాచరణ సిద్ధమైంది. సంప్రదింపుల కోసం ముసాయిదా నిబంధనలను నెల రోజుల్లోపు ప్రజల ముందు ఉంచుతాం’’ అని మీడియా ప్రతినిధులకు వైష్ణవ్ తెలిపారు. నిబంధనలకు సంబంధించి భాష సరళతరంగా ఉంటుందన్నారు. గోప్యత హక్కు అన్నది ప్రాథమిక హక్కుల్లో భాగమేనంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఆరేళ్ల తర్వాత.. 2023 ఆగస్ట్ 9న ‘ద డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు’కు పార్లమెంట్ ఆమోదం తెలపడం గమనార్హం.ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు యూజర్ల వ్యక్తిగత డేటా దుర్వినియోగాన్ని ఈ చట్టం అడ్డుకుంటుంది. వ్యక్తిగత డేటా సేకరణ, ప్రాసెసింగ్‌కు సంబంధించి నిబంధనలను కచ్చితగా అమలు చేయాల్సి ఉంటుంది. డేటా ఉల్లంఘన చోటుచేసుకుంటే రూ.250 కోట్ల వరకు జరిమాన చెల్లించే నిబంధన సైతం ఈ చట్టంలో భాగంగా ఉంది. -
కొత్త చట్టమే..! భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సర్కారు చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రస్తుతమున్న ఆర్వోఆర్ చట్టం ఉపయోగ పడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్–2020) చట్టాన్ని పూర్తిగా మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. పాత చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకురానుంది. అనేక అంశాల్లో స్పష్టతనిస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం. ముసాయిదా చట్టం సిద్ధమవుతోందని, వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి ఆమోదం తెలిపే బిల్లును తీసుకువస్తారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. కొత్త చట్టమే ఉత్తమం! గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను అమల్లోకి తెస్తున్న సందర్భంగా, ఇంతకుముందున్న చట్టం స్థానంలో ఆర్వోఆర్–2020 చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం నియమించిన ప్రత్యేక కమిటీ ఈ చట్టాన్ని అధ్యయనం చేసింది. ఈ చట్టం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని, చాలా అంశాలపై ఇది స్పష్టత ఇవ్వడం లేదని, దీని ద్వారా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా, కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయని కమిటీలోని నిపుణులు అభిప్రాయపడ్డారు. పాత చట్టంలో చేయాల్సిన సవరణల గురించి పలు సిఫారసులు చేశారు. లేనిపక్షంలో పూర్తిగా కొత్త చట్టాన్నైనా తీసుకురావాలంటూ ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలోనే లోపభూయిష్టమైన పాత చట్టానికి మార్పులు చేయడం కన్నా తమ ముద్ర ఉండే విధంగా కొత్త చట్టాన్ని తీసుకురావడమే సమంజసమనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వచి్చనట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పాత చట్టంలోని కొన్ని అంశాలను తీసుకుంటూనే, అవసరమైన కీలక సవరణలు చేస్తూ రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్–2024) చట్టాన్ని రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. ముసాయిదా చట్టంపై న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత రాష్ట్ర కేబినెట్లో ఆమోదించి, ఆ తర్వాత జూలైలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదం పొందేలా ప్రభుత్వం కసరత్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కీలకాంశాల్లో మార్పులతో.. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్వోఆర్ చట్టంలోని కీలకాంశాల్లో మార్పులు చేస్తూ కొత్త చట్టం తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా భూసమస్యల పరిష్కారం కోసం పలు స్థాయిల్లోని అధికారులకు ఉండే అధికారాల వికేంద్రీకరణపై కొత్త చట్టంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు ఎలాంటి అధికారాలు ఇవ్వాలి, ఆయా స్థాయిల్లోని అధికారులు ఎలాంటి నిర్ణయాలకు బాధ్యత వహిస్తారనే అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా పార్ట్–బీలో పెట్టిన 18 లక్షల ఎకరాలు, సాదాబైనామాల కింద లావాదేవీలు జరిగి పాస్ పుస్తకాలు రాని 9 లక్షల ఎకరాల భూములకు పరిష్కారం చూపించే దిశలో చట్టం రూపొందుతోందని తెలుస్తోంది. అసైన్డ్, భూదాన్ కంగాళీకీ చెక్!అసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూములకు సంబంధించిన కంగాళీ కూడా లేకుండా అన్ని సమస్యలకు పరిష్కారం చూపే విధంగా పాత చట్టాన్ని మార్చి కొత్త చట్టాన్ని తయారుచేస్తున్నారని, రెవెన్యూ ట్రిబ్యునళ్ల పునరుద్ధరణ లాంటి కీలక అంశాలు కొత్త చట్టంలో ఉంటాయని తెలుస్తోంది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసే అధికారాలను జాయింట్ సబ్ రిజి్రస్టార్ హోదాలో తహసీల్దార్లకే ఉంచాలా లేక డిప్యూటీ తహసీల్దార్లకు అప్పజెప్పాలా అన్న దానిపై కూడా కొత్త చట్టంలో స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం. కాగా ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించనున్నట్లు తెలిసింది. -
ఏఐతో వై-ఫై స్పీడ్ పెంచేందుకు పెట్టుబడులు
యాక్ట్ ఫైబర్‌నెట్ కంపెనీ..నెట్వర్క్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ స్టార్టప్ అప్రెకామ్లో పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించింది. యాక్ట్ ఫైబర్‌నెట్ తమ కస్టమర్లకు అందిస్తున్న హోమ్ వై-ఫై సదుపాయాన్ని మరింత మెరుగుపరిచేందుకు, నెట్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు.ఈ సందర్భంగా యాక్ట్ ఫైబర్‌నెట్ సీఈఓ బాల మల్లాది మాట్లాడుతూ..‘అప్రెకామ్ అధునాతన సాంకేతికతను యాక్ట్ ఫైబర్‌నెట్ వై-ఫై టెక్నాలజీకు అనుసంధానం చేయనున్నాం. ఇది వై-ఫై పనితీరులో వేగాన్ని పెంచుతుంది. రియల్‌టైమ్ నెట్వర్క్ విజిబిలిటీని అందిస్తుంది. ఇకపై కస్టమర్లకు మరింత ఉత్తమమైన నెట్ సేవలందుతాయి. అప్రెకామ్ తయారుచేసిన ఏఐ ఆధారిత సెల్ఫ్ ఆప్టిమైజింగ్ టెక్నాలజీ, అధునాతన వై-ఫై అనాలసిస్ కంపెనీ నెట్‌వర్క్‌ను నిరంతరం ఆప్టిమైజ్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.బెంగళూరుకు చెందిన యాక్ట్ ఫైబర్‌నెట్ దేశంలోని అతిపెద్ద వైర్డ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటిగా ఉంది. ఈ సంస్థ 25 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2.2 మిలియన్ కస్టమర్లకు సేవలు అందిస్తోంది. -
Rave Party: రేవ్ పార్టీ అంటే ఏంటి? మత్తు, మందు..ఇంకా?
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన రేవ్‌పార్టీలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులతో పాటు నటీనటులు పట్టుబడ్డారన్న వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సెలబ్రిటీలు సినిమా స్టార్స్స్పై పదే పదే ఎందుకు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలు రేవ్‌పార్టీ అంటే ఏమిటి? కేవలం చిందు మందుతోపాటు, నిషేధిత మత్తుమందులు కూడా ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.రేవ్ పార్టీలు రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ప్రధానంగా బడాబాబుల బిడ్డలు, సెలబ్రిటీల పిల్లలు రేవ్ పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పలువురితోపాటు, ఇటీవల ప్రముఖ ఎల్విష్ యాదవ్‌పై ఆరోపణలు నమోదైనాయి. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ అంటే ఏంటి? సెలబ్రిటీలకు ఎందుకంత క్రేజ్ విదేశాలతో పాటు, ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ-ఎన్‌సిఆర్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో రేవ్ పార్టీలు పరిపాటి. ఈమధ్య కాలంలో ఈసంస్కృతికి హైదరాబాద్ నగరంలో కూడా విస్తరించింది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM) ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవ్ పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి. సాధారణంగా రేవ్ పార్టీలు చాలా ఖరీదైన వ్యవహారం. ఇక్కడ గోప్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే డబ్బున్నోళ్లు, సెలబ్రిటీలు, సినీతారలు ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడికి క్యూ కడతారు. డ్యాన్స్, ఫన్, ఫుడ్, మద్యంతోపాటు, డ్రగ్స్‌కూడా ఇక్కడ యధేచ్ఛగా లభ్యమవుతాయి. రేవ్ పార్టీలు కాస్తా డ్రగ్స్ పార్టీలుగా మారిపోతున్నాయి. ఫుడ్, కూల్‌డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా, కొకైన్, హషిష్, చరాస్, ఎల్ఎస్డి, మెఫెడ్రోన్ తదితర డ్రగ్స్ కూడా దొరుకుతాయని సమాచారం.. కొన్ని రేవ్ పార్టీలలో లైంగిక కార్యకలాపాల కోసం ‘రూమ్స్’ కూడా ఉంటాయట. మాదకద్రవ్యాలు తీసుకునేవారికి, విక్రయించేవారికి ఇది సురక్షితమైన ప్రదేశంగా భావిస్తారు.రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది. హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు. తరువాత ఇటువంటి పార్టీల ధోరణి అనేక నగరాల్లో పెరుగుతూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్ లోని కులు లోయ, బెంగుళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్స్పాట్లుగా నిలిచాయి.60వ దశకంలో యూరోపియన్ దేశాలలో పార్టీలంటే కేవలం మద్యానికి మాత్రమే. కానీ 80వ దశకంలో రేవ్ పార్టీ రూపమే పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రేవ్ పార్టీల ధోరణి ప్రారంభమైంది. లండన్‌లో ఇటువంటి ఉద్వేగభరితమైన పార్టీలను ‘రేవ్ పార్టీలు’ అని పిలుస్తారు. యుఎస్ లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్ ప్రకారం.. రేవ్ పార్టీ 80ల నాటి డ్యాన్స్ పార్టీల నుంచి ఉద్భవించింది. డ్యాన్స్ పార్టీ కాస్తా రేవ్ పార్టీగా మారి పోయింది. మన దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక(ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం గంజాయికి కొకైన్, MDMA, LSD మొదలైన మత్తుపదార్థాలు , మాదకద్రవ్యాల వాడకం నిషేధం. -
ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య మా బంధువు ఒకాయన తరచుగా మీ సేవ కేంద్రానికి వెళుతున్నారు. ఎందుకు? అని అడిగితే.. ఆయన చెప్పిన విషయం ఆశ్చర్యం కలిగించింది. తన పొలం, స్థలాల వంటివి తన పేరనే ఉన్నాయా?లేవా? అన్నది చూసుకోవడానికి అని చెప్పారు. ఈసీ తీసుకోవడానికి వెళ్తున్నా అని అన్నారు. అలా ఎందుకు ఒక్కసారి రిజిస్టర్ అయ్యాక ఎక్కడి వెళతాయని అన్నాను. ఆయన చెప్పిన సమాధానం విని ఆశ్చర్యం వేసింది.ప్రభుత్వం ఏదో చట్టం తెచ్చిందట. మా భూములు మాకు ఉండవట. ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని కాపీలు ఇస్తారట!.. ఇలా చెబుతూ పోయాడు. అదంతా విని ‘అలా ఎందుకు జరుగుతుంది?’ అని అడిగా. దానికి అతను వివరణ ఇచ్చాడు. అప్పుడు అర్ధం అయింది. ఆయన ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన అబద్దపు వార్తల ప్రభావానికి లోనయ్యాడని. ఒక మంచి పని చేయాలంటే ఒప్పించడానికి చాలా కష్టపడాలి. అదే ఒక వదంతి సృష్టించడం ఎంత తేలికో చూడండి. దేశంలో కాని, ప్రపంచంలోకాని ఏ ప్రభుత్వం అయినా ఎవరి ప్రైవేటు ఆస్తులను లాక్కోవడానికి చట్టం తీసుకు వస్తుందా? విద్యాధికుడు అయిన ఆయనే ఇంత అపోహపడితే ,సామాన్య ప్రజలు ఇంకెత అపార్ధం చేసుకుంటారు.టైటిలింగ్ చట్టం వస్తే ఎవరి భూములు ఉండవని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా నీచమైన అబద్దాలు రాయడానికి సిగ్గు పడడం లేదు. టీడీపీ మేనిఫెస్టోని జనం నమ్మడం లేదని, ఇలాంటి అబద్దాలు ప్రచారంచేస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే పదో తరగతి మాత్రమే చదివిన వ్యక్తి కనుక ఆయన జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారులే అని అనుకోవచ్చు. కానీ ఎమ్.ఎ. చేసిన చంద్రబాబు నాయుడు వంటివారు కూడా ఇలా ప్రచారం చేయడం ఏమిటి?ఆయన నాయకత్వం వహించే తెలుగుదేశం పార్టీ ఈ అసత్యాలను ప్రజలలో ఎందుకు విస్తరిస్తోంది. సుమారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదహారు ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి దుర్మార్గపు ప్రచారాలు చేయవచ్చా? అంటే ఏమి చెబుతాం. ఔఆయనది ఎప్పుడూ కుట్ర స్వభావమే. తాను అధికారంలో ఉంటే అన్ని సంస్కరణలు తనవే అంటారు.ప్రతిపక్షంలో ఉంటే ఏ సంస్కరణ చేపట్టకూడదని అంటారు.తన వ్యతిరేక ప్రభుత్వం ఉంటే ,ఆ సంస్కరణలపై విషం కక్కుతారు. ఈయన రాజకీయ నేత, కుట్రలకు అలవాటుపడిన మనిషి కనుక ఇలా చేస్తున్నారులే అని అనుకోవచ్చు. కానీ, ఏభై ఏళ్లుగా ప్రజలకు తమ పత్రికల ద్వారా ,ఆ తర్వాత రెండు దశాబ్దాలుగా టీవీల ద్వారా విజ్ఞానం అందిస్తున్నామని ప్రచారం చేసుకునే ఈనాడు అధినేత రామోజీరావు ఇలాంటి దరిద్రపు ప్రచారం చేస్తున్నారు? అబద్దం అని తెలిసి కూడా ఇలాంటి చెత్త వార్తలు రాయవచ్చా? అంటే ఆ విజ్ఞతను రామోజీ ఎప్పుడో కోల్పోయారు. ఏపీ ప్రజలలో జగన్‌పై ఉన్న అభిమానాన్ని ఎలాగొలా మార్చాలని, జగన్ కు అనుకూలంగా ఉన్న ప్రజాభిప్రాయాన్ని మార్చాలన్న దుర్మార్గపు ఆలోచనే రామోజీరావులో ఉండడమే ఇందుకు కారణం. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎప్పుడూ అలాంటి నీచపు ఆలోచనలతో ఉంటారు కనుక చెప్పుకోనవసరం లేదు.వాస్తవం ఏమిటంటే టైటిలింగ్ చట్టం ఇంకా అమలులోకి రాలేదు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ చట్టాన్ని ఆమోదించారు. కానీ ఇంకా మార్గదర్శక సూత్రాలను సిద్దం చేయలేదు. పైగా కోర్టులో స్టే ఉంది. రైతుల,భూ యజమానుల హక్కులను రక్షించి,వారికి అధునాతన టెక్నాలజీలో భూముల వివరాలను నమోదు చేయడానికి ఉద్దేశించినది ఈ చట్టం. కేంద్ర ప్రభుత్వం పలు కమిటీలు వేసి, వారు చేసిన సిఫారసుల మేరకు ఈ మోడల్ చట్టాన్ని రూపొందించింది.దీని ప్రకారం.. రాష్ట్రాలలో ఉన్న భూ వివాదాలు తగ్గించవచ్చు. ఒకసారి భూముల సర్వే జరిగి వివిధ శాఖల సమన్వయంతో రికార్డులలోకి వివరాలు ఎక్కితే భూ యజమానికి పూర్తి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అంతే తప్ప ఎవరి భూమి ప్రభుత్వం తీసుకోలేదు.భూములు, రిజిస్ట్రేషన్ ల రంగంలో నిపుణులైన కొందరు దీనిని అధ్యయనం చేసి,ఈ చట్టం తీసుకురావడం దేశానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఒకవేళ ఏవైనా చిన్న,పెద్ద అనుమానాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చు.అలాకాకుండా అసలు ఈ చట్టాన్నే వ్యతిరేకిస్తూ ఎన్నికల సమయంలో ప్రజలలో అపోహలు సృష్టించడానికి టిడిపి,ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలు ప్రయత్నించడం అంటే ఎపి ప్రజలకు ద్రోహం చేయడమే.ఈ చట్టం వస్తే వీరు తమ బినామీ,కబ్జా భూముల బాగోతం బయటకు సస్తుందని భయపడుతుండవచ్చు.ఒకసారి గతంలో చంద్రబాబు ఏమి చెప్పేవారో గుర్తుకు చేసుకోండి. ఆయన 1995 లో ఎన్టీఆర్‌ను పడగొట్టి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత తాను సంస్కరణవాదినని ప్రచారం చేసుకున్నారు. సచివాలయంలో కంప్యూటర్లు ప్రవేశపెట్టిన వ్యక్తినని చెప్పుకునేవారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో భూముల రిజిస్ట్రేషన్ ను కంప్యూటర్ ద్వారా చేసేవారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి సంస్కరణలు తీసుకు వచ్చింది. అయితే చంద్రబాబు తన టైమ్ లో ఏమి చేసినా తన ఘనత అని,అదే ఎదుటివారు ఏమైనా చేస్తుంటే బురద చల్లుతుంటారు.ఉదాహరణకు కేంద్రం తీసుకువచ్చిన చట్టం ప్రకారం విద్యుత్ రంగంలో కొన్ని మార్పులు తీసుకురావడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. అప్పుడు ఆ చట్ట సవరణ చేసిన కేంద్రం కన్నా,తానే అవన్ని కనిపెట్టానని చెప్పుకునేవారు.రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలు లేదని అనేవారు.ప్రభుత్వరంగంలో కార్పొరేషన్ లు వృధా అని చెప్పేవారు. తన మనసులో మాట పుస్తకంలో ఇలాంటివి అనేకం ఉన్నాయి. కాని అదే పెద్దమనిషి ప్రతిపక్షంలోకి రాగానే పూర్తిగా రివర్స్‌గా మాట్లాడుతున్నారు. మరో ఉదాహరణ చూస్తే.. కేంద్రం ఆదేశాల ప్రకారం జగన్ ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టింది. ఇదే చంద్రబాబు ఏమని ప్రచారం చేశారో తెలుసా?మోటార్లకు మీటర్లు అంటే రైతులకు ఉరి వేయడమే అని అన్నారు. పోనీ దానికే కట్టుబడి ఉన్నారా అంటే అదేమి లేదు. ఆ చట్టం తీసుకు వచ్చిన కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఆ ఊసు ఎత్తడం లేదు. ఎల్లో మీడియా కూడా దీని గురించి ప్రచారం ఆపేసింది.అలాగే ఇప్పుడు కేంద్రం తీసుకు వచ్చిన ఈ చట్టం ఇంకా ఏపీలో అమలులోకి రాకముందే పచ్చి అబద్దాలను వీరంతా కలిపి ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారు. అదృష్టవశాత్తు చంద్రబాబు చెప్పేవాటిని ప్రజలు నమ్మడం లేదు కాబట్టి సరిపోయింది. రామోజీ , రాధాకృష్ణలు రాసే వార్తలను జనం విశ్వసించడం లేదు కనుక సరిపోయింది. లేకుంటే ఏపీ సమాజం అంతా తీవ్ర అలజడికి గురి అయ్యేది. అయినా వీరు రాసే అబద్దాలను నమ్మేవారు కొద్ది మంది ఉండకపోరు. ఒక చదువుకున్న వ్యక్తి అనుభవాన్ని గమనిస్తే,ఇలాంటి వారు కూడా ఉండవచ్చన్న భావన కలుగుతుంది. వీరిలో అత్యధికులు తెలుగుదేశం వారే. వారే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి రాసే చెత్తవార్తలు రాసి నమ్మి టెన్షన్ పడుతున్నారు.31 లక్షల ఇళ్ల స్థలాలు, కొన్ని లక్షల ఎకరాల చుక్కల భూములు.. తదితరాలను చట్టబద్దం చేసి పేద ప్రజలకు, అర్హులైన వాళ్లకు అందించిన జగన్ భూములు లాక్కొంటారని ఎంత దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారో చూడండి.ఏ సంస్కరణ అయినా, ఏ టెక్నాలజీ అయినా ప్రజలకు మంచి చేయడానికే ప్రభుత్వాలు తీసుకు వస్తాయి. అంతే తప్ప వారికి నష్టం చేయాలని ఎందుకు అనుకుంటాయి?. ఒకప్పుడు పీవీ నరసింహారావు ఆర్ధిక సంస్కరణలు తీసుకు వచ్చినప్పుడు వామపక్షాలు సీపీఐ, సీపీఎం వంటివి తీవ్రంగా వ్యతిరేకించేవి. బీజేపీ కూడా విమర్శలు చేసేది. కానీ బీజేపీ ఆధ్వర్యంలోని వాజ్ పేయి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ సంస్కరణలు అనుసరిస్తున్నట్లు ప్రకటించింది. మోదీ ప్రభుత్వం అయితే ఏకంగా భారతరత్న బిరుదును ఇచ్చింది.ఒకప్పుడు కంప్యూటర్లు లేని రోజుల్లో తెల్ల కాగితాల మీద పెన్నుతో ఏ విషయం అయినా రాయవలసి వచ్చేది. కంప్యూటర్లు వచ్చాక మొత్తం జన జీవితాలే మారిపోయాయి. కంప్యూటర్లనే అంతా వాడడం ఆరంభం అయింది. మొదట్లో ఈ కంప్యూటర్లను వ్యతిరేకించినవారు పెద్ద సంఖ్యలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ కంప్యూటర్ లేని జీవితాన్ని ఊహించగలమా? ఉమ్మడి ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పౌరులు రిజిస్టర్ చేసుకున్న డాక్యుమెంట్లన్నిటీ స్కాన్ చేసి కంప్యూటర్ లోకి ఎక్కిస్తున్నారు.దీనివల్ల రికార్డులకు భద్రత పెరిగింది.అయితే ఇప్పటికే రిజిస్ట్రేషన్ లలో మోసాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టడానికి ఒకసారి రిజిస్టర్ అయిన భూమిని సంబంధిత యజమానికి సంబంధం లేకుండా మరెవరూ రిజిస్టర్ చేయడానికి వీలులేని విధంగా టైటిలింగ్ చట్టం ఉపయోగపడుతుంది.ప్రతి భూమికి ఒక నెంబర్ ఇస్తారు.దాని ఆధారంగా లావాదేవీలు జరుపుకోవచ్చు. ఇందుకోసం ఇప్పటికే ఏపీలో భూముల సర్వే జరుగుతోంది. ఇదంతా అయిన తర్వాత కాని టైటిలింగ్ చట్టం అమలు చేయవలసి ఉంటుంది. అయినా ప్రజలలో అనవసర అనుమానాలను విపక్షం, ఎల్లో మీడియా కల్పిస్తున్నందున ,అసలు ఈ చట్టాన్ని ఇప్పట్లో అమలు చేయబోమని,దేశం అంతటా దీనిపై అన్ని రాష్ట్రాలు ఒక అభిప్రాయానికి వచ్చాక అమలు చేస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పాలి.గతంలో బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే, ఆ డిపాజిట్లకు సర్టిఫికెట్ లు ఇచ్చేవారు. వాటిని మనం భద్రపరుచుకోవల్సి ఉండేది. ఇప్పుడు బ్యాంకులు సర్టిఫికెట్ ల బదులు రశీదులు ఇస్తున్నాయి. అవి కేవలం మన సంతృప్తి కోసమే. ఎందుకంటే మనం డిపాజిట్ మెచ్యూర్ అయ్యే డేట్ మర్చిపోయినా, బ్యాంకుల నుంచి ఆటోమాటిక్ గా మెస్సేజ్ రావడం, మనం ఆ డిపాజిట్ తీసుకోవడం జరుగుతోంది. ఎంత మార్పో ఆలొచించండి. ఒకప్పుడు ఏ కంపెనీ షేర్లను అయినా అప్లై చేసుకుంటే అవి సర్టిఫికెట్ రూపంలో వచ్చేవి. ఆ షేర్లను మనం అమ్మితే వాటిని కొనుగోలుదారుకు పంపవలసి ఉండేది. కాని ఇప్పుడు అసలు షేర్లు ఎలా ఉంటాయో కూడా ఎవరూ చూడనక్కర్లేదు. అన్ని డిజిటల్ లాకర్ లలోనే ఉంటున్నాయి. కొన్ని ట్రేడింగ్ కంపెనీలు వీటిని నిర్వహిస్తున్నాయి. మరి నా షేర్ సర్టిఫికెట్ ను ఇవ్వకుండా కాపీ ఇస్తారా? అని ఎవరైనా అడిగితే అతనిని అయోమయం వ్యక్తిగా చూస్తారు.అలాగే.. ఇప్పుడు భూముల రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఒరిజినల్‌వి కాదని కొందరు ప్రచారం చేస్తున్నారు. కంపెనీల షేర్ల మాదిరి భూములు కూడా కంప్యూటర్లలో ఈ చట్టం కింద పరిరక్షణలో ఉంటాయి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాపీ తీసుకోవచ్చు. నిరభ్యంతరంగా లావాదేవీలు జరుపుకోవచ్చు.ఇంకో ఉదాహరణ చెప్పాలి. గతంలో పత్రికలు తమ దిన సంచికలను జాగ్రత్తగా స్టోర్ చేసేవి. అవన్ని దుమ్ముకొట్టుకుపోయేవి.చెదలు పట్టి పాడైపోతుండేవి. మరి ఇప్పుడు వాటన్నిటిని డిజిటలైజ్ చేస్తున్నారు. పలు లైబ్రరీలు కూడా ఇలాగే వివిధ పత్రికలను డిజిటలైజ్ చేసి అందుబాటులో ఉంచుతున్నారు. అలాకాదు.ఒరిజినల్ పాత పేపర్లు కావాలని ఎవరైనా అడిగితే ఏమి చెబుతాం?. పాతకాలపు మనిషి అని నవ్వుకుంటారు.కొన్ని సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు తయారు చేసేవారు లేకపోవడంతో భూ వివాదాలు పెరిగాయి. నకిలీలు, కబ్జాలు, రాజకీయ జోక్యం పెరిగిపోయింది..వీటన్నింటిని అరికట్టడానికి లాండ్ టైటిలింగ్ చట్టం ఉపయోగపడుతుంది.ఇక ఈ-స్టాంపింగ్ వ్యవస్థపై కూడా ఈనాడు పత్రిక దారుణమైన అబద్దాలు రాసింది. ఇప్పటికే పన్నెండు రాష్ట్రాలలో ఈ-స్టాంపింగ్ వ్యవస్థ అమలులో ఉంది. తెల్గీ స్టాంప్ కుంభకోణం తర్వాత కేంద్రం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న స్టాంప్ పేపర్ల కంటే ఎక్కువ భద్రత తో ఈ-స్టాంపింగ్ వ్యవస్థను కేంద్రం తెచ్చింది.ఈ ప్రభుత్వం కూడా దీనిపై ప్రయోగాలు చేస్తుంటే ,కొందరు స్వార్ధపరులు దీనికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ స్టాంపులు జిరాక్స్ కాపీలు కావని ,నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్ల కంటే ఎక్కువ సేఫ్ అని వారు అంటున్నారు.ఏపీలో ఏ అభివృద్ది జరిగినా, ఏ సంస్కరణ తెచ్చినా ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాటికి వ్యతిరేకంగా పచ్చి అబద్దాలు రాయడం,దానిని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు అందుకోవడం నిత్యకృత్యం అయింది. వలంటీర్ల వ్యవస్థపై వీరంతా ఎంత విషం చిమ్మారో చూశాం. ఇప్పుడు అదే వ్యవస్థ తాము కొనసాగిస్తామని,ఇంకా ఎక్కువ జీతాలు ఇస్తామని చెబుతున్నారు. గ్రామ ,వార్డు సచివాలయాలతో గ్రామ పంచాయతీలకు నష్టం అని ప్రచారం చేశారు. ఇప్పుడు వృద్దుల పెన్షన్లు వారి ద్వారానే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏ సంస్కరణ తెచ్చినా విషం కక్కుతున్న వీళ్లిద్దరి పట్ల ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి ఇలాంటివారిని నమ్మి మోసపోయారు. మరోసారి మోసపోతే కోలుకోవడం కష్టమే అవుతుందని చెప్పక తప్పదు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ట్యాపింగ్ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన అక్రమఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ (ఐటీఏ)ను కూడా జత చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నా రు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైనప్పుడు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల అరెస్టు సమ యంలో ఈ చట్టంలోని సెక్షన్ల మేరకు ఆరోపణలు లేవు. తాజాగా ఈ చట్టాన్ని జోడించిన అధికారులు ఈ మేరకు నాంపల్లి కోర్టుకు మెమో ద్వారా సమాచారమిచ్చా రు. మరోపక్క ఈ కేసులో నిందితులపై నేరం నిరూపించ డానికి అవసరమైన చర్యలను సిట్ అధికారులు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎస్ఐబీలో ఎలక్ట్రీషియన్‌గా పని చేసిన టీఎస్ఎస్పీ కానిస్టేబుల్‌ను సాక్షిగా చేర్చారు. ఐటీఏ ఉండాలన్న న్యాయ నిపుణులు ట్యాపింగ్‌పై ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్ రావు, ఇతరులపై ఈ నెల 10న కేసు నమోదైంది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) పోలీసులు మూడు చట్టాల్లోని తొమ్మిది సెక్షన్ల కింద ఆరోపణలు చేశారు. ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల్లోని సెక్షన్లు చేర్చారు. కాగా ఈ నెల 13న ప్రణీత్ అరెస్టు తర్వాత కోర్టులో రిమాండ్ కేసు డైరీని సమర్పించిన అధికారులు.. ఇందులో ఓ సెక్షన్ తగ్గించి ఎనిమిదింటి కిందే ఆరోపణలు చేశారు. తొలుత చేర్చిన ఐపీసీలోని 120 బీ (కుట్ర), 34 (ఒకే ఉద్దేశంతో చేసే ఉమ్మడి చర్య) రెండు సెక్షన్లలో.. 120 బీ సెక్షన్లను తొలగించారు. అయితే నిందితులపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కింద అభియోగాలు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఐటీఏను జోడించి, అందులోని సెక్షన్లు వర్తింపజేయాలని న్యాయ నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ పిటిషన్లతో పాటు ఈ చట్టాన్ని జోడిస్తూ మెమోను కూడా అధికారులు కోర్టులో దాఖలు చేశారు. కీలకం కానున్న హెడ్ కానిస్టేబుల్ కృష్ణ హార్డ్‌డిస్క్‌ల విధ్వంసంలో ప్రణీత్‌రావుతో కలిసి పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ కైతోజు కృష్ణను ఈ కేసులో సాక్షిగా చేర్చారు. నాటి ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు గత ఏడాది డిసెంబర్ 4న అర్ధరాత్రి కృష్ణతో కలిసే ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లాడు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్‌తో పాటు అధికారిక ట్యాపింగ్‌లు జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలను కృష్ణ ద్వారా ఆఫ్ చేయించాడు. అతని సహాయంతో వార్ రూమ్‌లోని 17 కంప్యూటర్లలో ఉన్న వాటితో పాటు విడిగా భద్రపరిచిన 50 హార్డ్ డిస్క్ల్నీ ఎలక్ట్రిక్ కట్టర్ వినియోగించి ధ్వంసం చేశాడు. ఈ కారణంగానే సిట్ అధికారులు కృష్ణను సాక్షిగా చేర్చారు. త్వరలో ఇతడితో న్యాయస్థానంలో స్టేట్మెంట్ రికార్డు చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే సిట్ కృష్ణ వాంగ్మూలం నమోదు చేయగా.. భవిష్యత్తులో అతను సాక్ష్యం చెప్పకుండా ఎదురుతిరిగే అవకాశం లేకుండా ఈ చర్య తీసుకోనున్నారు. ఎస్ఐబీలో నడిచిన ఓఎస్డీల రాజ్యం.. ఎస్ఐబీని చాలాకాలం పాటు పదవీ విరమణ పొంది ఓఎస్డీలుగా పనిచేస్తున్న వాళ్లే నడిపినట్లు తెలిసింది. ఇలాంటి దాదాపు 15 మంది అధికారులను ఆధారంగా చేసుకుని కథ నడిపినట్లు సమాచారం. ఓ మాజీ డీఐజీ, ముగ్గురు మాజీ ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీలు ఇందులో కీలకంగా పనిచేశారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మారిన తరవాత ప్రభాకర్‌రావుతో పాటే వీళ్లు కూడా రాజీనామా చేసి వెళ్లిపోయారు. సాధారణంగా ఎస్ఐబీ లాంటి సున్నిత విభాగాల్లో మాజీ అధికారులను, ప్రైవేట్ వ్యక్తులను కీలక స్థానాల్లో ఉంచరని, అయితే ప్రభాకర్‌రావు స్వయంగా ఓఎస్డీ కావడంతో ఎస్ఐబీలో ఓఎస్డీలతో పాటు ప్రైవేట్ వ్యక్తుల రాజ్యం నడిచిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోపక్క ప్రణీత్‌రావుకు ట్యాపింగ్ వ్యవహారంలో ఐదుగురు ఇన్స్పెక్టర్లు సహకరించినట్లు సిట్ తేల్చింది. ఆ అధికారులకు త్వరలో నోటీసులు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు త్వరలో డీజీపీ, అదనపు డీజీపీ స్థాయి అధికారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రధాన కార్యాలయం లక్డీకాపూల్‌లో ఉన్నప్ప టికీ... గ్రీన్‌ల్యాండ్స్‌లోని ఎస్ఐబీ కార్యాలయంలో కూడా ఆయనకు ఓ ఛాంబర్ ఉంది. గడిచిన కొన్నేళ్లుగా నిఘా విభాగాధిపతి అక్కడకు రాక పోవడంతో ప్రణీత్ రావు ఈ ఛాంబర్‌తో పాటు పక్కన ఉన్న రూమ్‌ను తన అక్రమ ట్యాపింగ్ వ్యవహారాల కోసం వార్‌రూమ్‌గా వినియోగించుకున్నట్లు తేలింది. ఆ చాంబర్ ఇతరులు విని యోగించాంటే కచ్చితంగా నిఘా విభాగాధిపతి, డీజీపీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్పట్లో ఏ కారణం చెప్పి ఈ అనుమతి తీసుకు న్నారు? ట్యాపింగ్ వ్యవహారాలు తెలిసే అను మతి ఇచ్చారా? లాంటి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి గాను వీరికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. -
కొత్త రెవెన్యూ చట్టం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం (రికార్డ్ ఆఫ్ రైట్స్)–2020 స్థానంలో కొత్త రెవెన్యూ చట్టం రానున్నట్టు సమాచారం. ధరణి పోర్టల్ ద్వారా రైతు లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ చట్టం అడ్డంకిగా మారిందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కొత్త చట్టం ప్రవేశపెట్టాలని సర్కారు భావి స్తోందని సమాచారం. ప్రస్తుత చట్టంలోని అనేక అంశాలకు సవరణలు సూచిస్తూ, ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ 20 పేజీల ముసాయిదాను రూపొందించిందని, అయితే అన్ని సవరణలతో అతుకుల బొంత లాంటి చట్టాన్ని మను గడలో ఉంచడానికి బదులు కొత్త చట్టాన్ని తీసుకురావడమే మంచిదని ప్రభుత్వం భావించిందనే చర్చ రెవెన్యూ వర్గా ల్లో జరుగుతోంది. దీనిపై ఆర్డినెన్స్ తేవాలనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో జరిగినా, అసెంబ్లీ ప్రొరోగ్ కానందున ఆర్డినెన్స్ చేసే అవకాశం లేదన్న న్యాయ నిపుణుల అభిప్రా యంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్టు తెలు స్తోంది. అయితే అప్పటివరకు ధరణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా స్పెషల్ డ్రైవ్ ద్వారా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని, అధికారాల వికేంద్రీకరణ ఉత్తర్వులిచ్చిందని సమాచారం. తహసీల్దార్లలో నైరాశ్యం అధికారాల వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన ఉత్త ర్వులు తహసీల్దార్లలో నైరాశ్యానికి కారణమయ్యాయి. వికేంద్రీకరణ పేరుతో కలెక్టర్లకే ఎక్కువ అధికారాలు కట్టబె ట్టారని వారంటున్నారు. గతంలో తమకు ఉన్న అధికారా లనే మళ్లీ ఇచ్చారని, వారసత్వ హక్కుల సంక్రమణ, జీపీ ఏ, ఎస్‌పీఏల ఆధారంగా పట్టాలు చేసే అధికారం ఇప్పుడు కూడా తమకే ఉందని, మళ్లీ ఆ అధికారాలనే ఇచ్చి వికేంద్రీ కరణ అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమ వద్ద సిబ్బంది లేరని, ఇలాంటి పరిస్థితుల్లో వారం రోజుల సమయం ఇచ్చి అన్ని దరఖాస్తులూ పరిష్కరించాలంటే ఎలా సాధ్యమనే చర్చ కూడా రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. హడావుడిలో తప్పులు జరిగితే సమస్య మళ్లీ మొదటి కొచ్చినట్టే కదా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వికేంద్రీకరణ తాత్కాలికమే! అయితే ప్రస్తుతం చేపట్టిన అధికార వికేంద్రీకరణ, స్పెషల్ డ్రైవ్‌లు తాత్కాలికమేనని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ధర ణి కమిటీ సూచన మేరకు తాత్కాలికంగానే ఈ ఏర్పాట్లు చేశామని, కొత్త ఆర్వోఆర్ చట్టంలో అధికార వికేంద్రీకరణ కు చట్టబద్ధత కల్పిస్తామని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబు తున్నారు. మరోవైపు కలెక్టర్లు తీసుకునే నిర్ణయాలను కూడా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్–1908లోని 166బీ నిబంధన ప్రకారం సవాల్ చేయవచ్చని అంటున్నారు. ప్రస్తుతం చేసిన అధికారాల పంపిణీ కూడా తాత్కాలికమేనని, ఆర్వో ఆర్ కొత్త చట్టంలో పకడ్బందీగా వికేంద్రీకరణ ఉంటుందని పేర్కొంటున్నారు. తహశీల్దార్లకు అధికారాల విస్తృత పంపిణీ అవకాశం ప్రస్తుతానికి లేదని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నా యి. అయితే ధరణి దరఖాస్తుల పరిష్కారంలో తహశీల్దార్ నివేదికలే ప్రాతిపదికలని, ఆ నివేదికల ఆధారంగానే ఉన్న తాధికారులు దరఖాస్తులను పరిష్కరిస్తారని ధరణి కమిటీ సభ్యుడొకరు చెప్పారు. ఈ మేరకు తహశీల్దార్లు క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంటుందని, గతంలో మాదిరి కాకుండా దరఖాస్తుల ఆమోదం, తిరస్కారం కోసం కచ్చితంగా కార ణాలతో కూడిన రాతపూర్వక ఉత్తర్వులివ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ఎవరైనా రైతులు తమకు నష్టం కలిగిందని భావిస్తే రెవెన్యూ అధికారు లిచ్చే రాతపూర్వక ఉత్తర్వులపై కోర్టులను ఆశ్రయించే వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈనెల 1వ తేదీనుంచి 9వ తేదీ వరకు నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌తో ధరణి దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోదని, ఈ డ్రైవ్‌లో తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ కూడా మరోమారు ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. -
పాడి రైతుకు సంపూర్ణ రక్షణ
సాక్షి, అమరావతి: పాల సేకరణ, విక్రయాల్లో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023 అమలుకు రంగం సిద్ధమైంది. చట్టం అమలుకు అవసరమైన ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపకల్పన చేసింది. నియమ, నిబంధనలతో ఇటీవలే అధికారిక గెజిట్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రతిరోజు 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. స్థానికంగా 1.42 కోట్ల లీటర్ల పాలు వినియోగమవుతుండగా, ఆర్గనైజ్డ్ డెయిరీలు 21.6 లక్షల లీటర్లు, ప్రైవేటు డెయిరీలు 47.6 లక్షల లీటర్లు సేకరిస్తున్నాయి. మిగిలిన పాలు వివిధ రూపాల్లో మార్కెట్‌కి వస్తుంటాయి. పాల సేకరణలో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తూనికలు–కొలతల చట్టం ప్రకారం తనిఖీ చేసే అధికారాలను స్థానిక పశు వైద్యులకు అప్పగించారు. అయితే మోసాలకు పాల్పడినట్టు నిర్ధారణ జరిగినప్పుడు మిల్క్ ఎనలైజర్స్, ఇతర పరికరాలను సీజ్ చేయడం, బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తేవి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ దేశంలోనే తొలిసారి పటిష్టమైన పాలసేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చట్టం అమలు బాధ్యత వీరిదే.. చట్టం అమలు, పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో మిల్క్ కమిషనర్‌గా, కార్యనిర్వాహక అధికారిగా పశుసంవర్ధక శాఖ సంచాలకులు వ్యవహరించనుండగా, జిల్లా స్థాయిలో ఆథరైజ్డ్ ఆఫీసర్స్‌గా జిల్లా పశుసంవర్ధక శాఖాధికారులు, మిల్క్ ఇన్స్పెక్టర్లుగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, ఏవీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్లు వ్యవహరించనున్నారు. వీరు చట్టప్రకారం మిల్క్ ఎనలైజర్స్‌తో పాటు పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు పనిచేసేలా పర్యవేక్షిస్తారు. పాలనాణ్యత పాటించకపోతే ఫుడ్ సేఫ్టీ, నాణ్యత ప్రమాణాల యాక్టు 2006 ప్రకారం చర్యలు తీసుకుంటారు. పాలల్లో ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి నిర్దేశించిన రేటు చార్ట్ ప్రకారం పాడి రైతుకు మద్దతు ధర దక్కేలా పర్యవేక్షిస్తారు. ఇందుకోసం సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. చట్టం అమలుపై రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్స్‌కు ఇటీవలే శిక్షణ కూడా పూర్తి చేశారు. వీరి ద్వారా మండల స్థాయిలో మిల్క్ ఇన్స్పెక్టర్లుగా వ్యవహరించనున్న అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. మిల్క్ ఎనలైజర్స్కు లైసెన్సింగ్ తప్పనిసరి మిల్క్ ఎనలైజర్స్ కలిగి ఉన్న వారు రూ.1,000 చెల్లించి సంబంధిత ఆథరైజ్డ్ అధికారి నుంచి లైసెన్సు పొందాలి. ఆ తర్వాత ఏటా లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి. అదే తయారీ దారులు, డీలర్లు ప్రతీ 2 ఏళ్లకోసారి రూ. 2 లక్షలు చెల్లించి మిల్క్ కమిషనర్ ద్వారా లైసెన్సు పొందాల్సి ఉంటుంది. లైసెన్స్ పొందిన తర్వాత మిల్క్ ఎనలైజర్స్‌ను 30 రోజులలోపు వారి పరిధిలోని మిల్క్ ఇన్స్పెక్టర్ వద్ద రూ. 500 చెల్లించి కనీసం ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేలా వెరిఫికేషన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. మిల్క్ ఎనలైజర్ లైసెన్స్, వెరిఫికేషన్ సర్టిఫికెట్‌ను పాలసేకరణ కేంద్రంలో ప్రదర్శించాలి. రికార్డులు, రిజిష్టర్లు విధిగా నిర్వహించాలి. క్రమం తప్పకుండా తనిఖీలు.. చట్టం ప్రకారం మిల్క్ ఇన్స్పెక్టర్లు.. పాల సేకరణ కేంద్రాలు, డెయిరీల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తారు. తేడా ఉన్నట్టుగా గుర్తిస్తే జరిమానా, లైసెన్సు రద్దు, కేసుల నమోదు వంటి చర్యలు తీసుకుంటారు. కల్తీ జరిగినట్టు గుర్తిస్తే తగిన చర్యల కోసం ఆహార భద్రత అధికారికి సమాచారమిస్తారు. మిల్క్ యూనియన్, డెయిరీ నిర్ధారించిన రేట్ చార్జి ప్రకారం పాలుపోసే వారికి పాలసేకరణ ధర చెల్లిస్తున్నదీ లేనిదీ కూడా పరిశీలిస్తారు. జిల్లా స్థాయిలో ఆథరైజ్డ్ అధికారిగా వ్యవహరించే అధికారులు ఈ మిల్క్ ఇన్స్పెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. మోసాలు, కల్తీలు జరిగినట్టుగా గుర్తిస్తే సంబంధిత రికార్డులు సహా ఆయా యూనిట్లను సీజ్ చేస్తారు. శిక్షార్హమైన నేరాలకు చట్టం ప్రకారం జరిమానాలు, కారాగార శిక్షలు విధిస్తారు. -
రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు: మంత్రి ధర్మాన ప్రసాదరావు
సాక్షి, తాడేపల్లి: భారతదేశంలో భూమిపై హక్కులు అనే విధానంపై క్లారిటీ కోసం గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. 1989లో కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్ డీసీ వైద్య ద్వారా కమిషన్ నియమించి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో నివేదిక కోరారని చెప్పారు. ఆ కమిషన్ మన దేశంలో టైటిల్‌కి గ్యారెంటీ ఉండే వ్యవస్థ తీసుకురావాలని సిఫారసు ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తానంతట తానుగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురాలేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని ప్లానింగ్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం 30 ఏళ్లుగా అధ్యయనం చేస్తోందని అన్నారు. శిస్తు వసూలు చేసుకోవడానికి 1బీ, అడంగల్ వంటివి మత్రమే తెచ్చారని తెలిపారు. భూమిపై ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రాజెక్టులు టేకప్ చేసేలోపు కొన్ని వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పారు. అందుకే దేశవ్యాప్తంగా 2019లోనే టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రప్రభుత్భం ప్రయత్నించిందని గుర్తుచేశారు. టైటిలింగ్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని, అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించిందని అన్నారు. నీతి ఆయోగ్ సూచనలమేరకు 2019లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపారని తెలిపారు. రెండుసార్లు వెనక్కి వెళ్లొచ్చి.. 2023లో ఆమోదం పొందిందని చెప్పారు. దేశంలోనే సివిల్ కోర్టుల్లోని వివాదాల్లో 66శాతం భూములకు సంబంధించిందేనని చెప్పారు. ఆ 66 శాతంలో లక్ష ఆదాయంలోపు ఉన్నవారి కేసులో 90 శాతం ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం 60 శాతం హత్యలు భూ వివాదాలు వల్ల జరుగుతున్నాయని అన్నారు. దేశ ప్రజల క్షేమం కోసం ఒక ప్రయత్నం జరుగుతుందని, 17 వేల గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల అప్డేషన్, సర్వే జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని, వివాదాలు లేని రికార్డులు తయారవుతాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఏపీలో జరుగుతున్న సర్వే గురించి తెలుసుకుంటున్నారని అన్నారు. రికార్డులన్నీ అప్ డేట్ అయ్యాక, సర్వే పూర్తయ్యాక చట్టం నోటిఫై చేస్తామని చెప్పారు. ఇదంతా అయ్యేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు చట్టాన్ని ఆగమేఘాలమీద అమలు చేయడం లేదని అన్నారు. అన్నీ చట్ట ప్రకారం జరుగుతాయని, న్యాయస్థానాలు ఇచ్చే సలహాలు తీసుకుంటామని చెప్పారు. ఇంకా ఎలాంటి రూల్స్ విధించాలో కసరత్తు జరుగుతోందని తెలిపారు. భారత ప్రభుత్వం అధ్యయనం చేసిన అంశాల్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే టేకప్ చేసిందని పేర్కొన్నారు. రూల్ ఫ్రెమ్ చేసేటప్పుడు అందరి సలహాలు పాటిస్తామని అన్నారు. న్యాయవాదులు విధులకు హాజరు కావాలని, దేశంలో కంక్లూజివ్ టైటిల్ ఇవ్వడం విశేషమని తెలిపారు. చదవండి: ప్రతి ధర్నాకు ఓ రేటు... అదే వాళ్ల రూటు -
‘నిర్భయ’కు 11 ఏళ్లు... మహిళల భద్రతకు భరోసా ఏది?
అది దేశరాజధాని ఢిల్లీ.. 2012, డిసెంబరు 16.. రాత్రివేళ ఓ ప్రైవేట్ బస్సులో చోటుచేసుకున్న దారుణ అత్యాచార ఘటన భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్నీ కుదిపేసింది. ఈ నేపధ్యంలో ఢిల్లీని అత్యాచారాల క్యాపిటల్‌గా అభివర్ణించారు. నాడు అత్యంత క్రూరంగా జరిగిన అత్యాచార ఘటన దేశంలోని ప్రతీఒక్కరినీ కంటతడి పెట్టించింది. డిసెంబరు నాటి వణికించే చలిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయ కామాంధుల చేతుల్లో చిగురుటాకులా వణికిపోయింది. ఈ నేపధ్యంలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశంలోని ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. ఈ దారుణ అత్యాచారం దరిమిలా దేశంలో మహిళల రక్షణ విషయంలో పెను మార్పులు వచ్చాయి. దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం అనేక చర్యలు చేపట్టారు. నిర్భయ అత్యాచార ఘటన దర్యాప్తు అనంతరం జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సిఫార్సులు అమలయ్యాయి. దేశంలోని ప్రతీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యాచార బాధితుల కోసం వన్ స్టాప్ సెంటర్లు, హెల్ప్లైన్లు ప్రారంభించారు. నిర్భయ ఫండ్ విడుదల చేశారు. నిర్భయ స్క్వాడ్, నిర్భయ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల పాటు నిర్భయ కేసు విచారణ కొనసాగగా దోషులైన ముఖేష్, పవన్, అక్షయ్, వినయ్‌లను 2020, మార్చి లో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. ఒక మైనర్‌కు విముక్తి లభించగా, మరో నిందితుడు రామ్ సింగ్ విచారణ సమయంలో జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్భయ ఘటన, కేసు దర్యాప్తు, దోషులకు శిక్ష అమలు తర్వాత దేశంలో అత్యాచార ఘటనలు తగ్గుముఖం పట్టివుంటాయని అందరూ భావించివుంటారు. అయితే దీనికి భిన్నమైన పరిస్థితులు దేశంలో తాండవిస్తున్నాయి. ప్రముఖ జాతీయ ఏజెన్సీ ఎన్సీఆర్బీ.. నిర్భయ ఘటన అనంతరం గత 11 ఏళ్లలో దేశంలో చోటుచేసుకున్న అత్యాచార గణాంకాల వివరాలను విడుదల చేసింది. ఇవి మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయని పలువురు అంటున్నారు. సంవత్సరం అత్యాచారం కేసులు 2022 31,516 2021 31,677 2020 28,046 2019 32,032 2018 33,356 2017 32,559 2016 38,947 2015 34,651 2014 36,735 2013 33,707 2012 24,923 నిర్భయ లాంటి హృదయ విదారక అత్యాచార ఘటనల తర్వాత కూడా దేశంలో మహిళల భద్రత విషయంలో ఆశించినంత మార్పు రాలేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదిక ప్రకారం.. గత ఏడాది దేశంలో మొత్తం 31,516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతిరోజూ దాదాపు 87 మంది , ప్రతి గంటకు మూడు నుంచి నలుగులు బాలికలు లేదా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఈ నివేదిక ప్రకారం అత్యాచార ఘటనల విషయంలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. గత ఏడాదిలో అత్యధికంగా 5,399 అత్యాచార కేసులు ఇక్కడ నమోదయ్యాయి. ఢిల్లీలో 1212 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ.. -
అమల్లోకి ఏపీ భూ హక్కుల చట్టం
సాక్షి, అమరావతి: దేశంలోనే మొట్ట మొదటిసారిగా రాష్ట్రంలో భూ హక్కుల చట్టం (ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్) అమల్లోకి వచ్చింది. ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం 2023ని ఈ సంవత్సరం అక్టోబర్ 31 నుంచి అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 512 జారీ చేసింది. దాని గెజిట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. ఇటీవలే ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ప్రభుత్వం అమ ల్లోకి తీసుకువచ్చింది. భూ యజమానులు, కొను గోలుదారులకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఇచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి చట్టం లేదు. భూ హ క్కుల చట్టం ప్రకారం స్థిరాస్థి హక్కుల రిజిస్టర్ త యారు చేస్తారు. స్థిరాస్థిని యజమాని తప్ప వేరే ఎవరూ విక్రయించే అవకాశం ఉండదు. రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్థుల శాశ్వత రిజిస్టర్, వివాద రిజిష్టర్ తో పాటు కొనుగోలు రిజిస్టర్ రూపొందిస్తారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. ఆ అధికారి కింద మండల స్థాయిలో లాండ్ టైట్లింగ్ అధికారులను నియమిస్తారు. భూమి హక్కులను రిజిస్టర్ చేసే బాధ్యత ల్యాండ్ టైట్లింగ్ అధికారికే ఉంటుంది. పలు దశల తర్వాత టైట్లింగ్ అధికారి భూముల యజమానులను శాశ్వత హక్కుదారులు గా గుర్తించి రిజిస్టర్లో నమోదు చేస్తారు. వీటిపై ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ ట్రిబ్యు నళ్లలో తేల్చుకోవడం తప్ప కోర్టుకు వెళ్లడానికి అవ కాశం ఉండదు. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు లపై నే హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది. -
రష్మిక ఫేక్ వీడియో : సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం మరోసారి రెడ్ సిగ్నల్
న్యూఢిల్లీ: తప్పుడు సమాచార వ్యాప్తికి సంబంధించి నటి రష్మిక మందన్నకు చెందినడీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 66డీ ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్ష, జరిమానా తప్పదంటూ రిమైండర్ జారీ చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో డీప్‌ఫేక్‌లకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను, ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలను తాజా సర్క్యులేషన్లో మరోసారి గుర్తు చేసింది. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66డీ ప్రకారం కంప్యూటర్ వనరులను ఉపయోగించి ఎవరైనా వ్యక్తుల పట్ల మోసపూరితంగా వ్యవహరించినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా నేరం రుజువైతే మూడేళ్ల దాకా జైలు శిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా ఉంటుంది. ప్రభుత్వం, లేదా బాధిత వ్యక్తులు కోరిన వెంటనే సోషల్ మీడియా వెబ్ సైట్లు ఆయా కంటెంట్ వివరాలను 36 గంటల్లోగా తొలగించాల్సి ఉంటుంది. IT మధ్యవర్తి నియమాల ప్రకారం, సోషల్ మీడియా సంస్థలు 10 రకాల కంటెంట్‌కి సంబంధించిన పోస్టులను తప్పక తొలగించాలి. ముఖ్యంగా దేశ సమగ్రత, శాంతి భద్రతలు, సార్వభౌమత్వం, విదేశాలతో సంబంధాలు, ఇతర దేశాలను అవమానించడం, నేరాలకు పాల్పడేందుకు ప్రోత్సహించే చర్యలు, ఒక వ్యక్తి లేదా ప్రభుత్వాన్ని కించపర్చేలా మాట్లాడడం నేరంగా పరిగణిస్తారు. అలాగే అసభ్యకరమైన కంటెంట్, లింగ విద్వేషం రెచ్చగొట్టే పోస్టులు, ఇతరుల ప్రైవసీని దెబ్బ తీసే కంటెంట్, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేలా ప్రోత్సహించడం, జాతి, మతం, రంగును అవమానించడం, భారతీయ చట్టాలలో నేరంగా వెల్లడించిన పనులను ప్రోత్సహించే కంటెంట్ వంటివి ఎవరైనా పోస్ట్ చేస్తే వాటిని వెంటనే తొలగించాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ ప్రభుత్వం కోరితే ఆ సమాచారాన్ని ముందుగా పోస్ట్ చేసిన వ్యక్తి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. కాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో స్పందించిన కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఫేక్ న్యూస్, డీప్‌ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయులకు భద్రత, విశ్వాసం కల్పించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇవ్వడం తోపాటు ఇలాంటి ఫేక్ వీడియోపై సోషల్ మీడియా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
సమస్య తొమ్మిది నెలలేనా?
ఇటీవలే ఓ వివాహిత 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గర్భం దాల్చిన తొలినాళ్లలోనే అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కొంతమంది మహిళలు న్యాయ, వైద్యపరమైన అడ్డంకులను దాటలేకపోతున్నారు. వేర్వేరు పరిస్థితుల కారణంగా మహిళలకు లేటైనా అబార్షన్ అవసరమవుతుంది. సరైన సమయంలో వైద్యం అందకపోవడం, లైంగికదాడి, గృహహింస, జైలు వంటివి ఎన్నో దీనికి కారణాలు. గర్భం ధరించిన తరువాత పరిస్థితుల్లో వచ్చే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాల ప్రకారం... ప్రభుత్వాలు అబార్షన్‌ను నేరంగా పరిగణించడాన్ని నిలిపి వేయాలి. గర్భం వయసుపై పరిమితులు తొలగించాలి. ప్రత్యేక పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకునే విషయంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం 2021లో ఒక తీర్పునిచ్చింది. పిండం వయసు గరిష్ఠంగా 24 వారా లున్నా పీడిత మహిళలు అబార్షన్ చేయించుకునేందుకు వీలు కల్పించింది. వైకల్యమున్నప్పుడు మాత్రమే మెడికల్ బోర్డు సిఫారసుతో అబార్ష¯Œ కు అనుమతించే పాత చట్టం నుంచి వీరికి విముక్తిని ప్రసాదించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల ముందు అబార్షన్‌కు అనుమతించే విషయంపై అనేక పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఈ మార్పులు వచ్చాయి. అంతకుముందు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) యాక్ట్ (1971) ప్రకారం, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు (ఆర్ఎంపీలు) గర్భం ధరించిన 20 వారాల వరకూ అబార్షన్ చేసేందుకు అనుమతులుండేవి. 2021 నాటి సవరణ తీర్పు తరువాత కూడా చాలామంది మహిళలు వైద్యులు అబార్షన్‌కు నిరాకరించిన సందర్భాల్లో... కోర్టు నిర్దేశించిన సమయం దాటినా అఅబార్షన్కు అనుమతించాలని కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవలే ఓ వివాహిత మహిళ 26 వారాల వయసున్న గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, విచారణ తరువాత కోర్టు అందుకు నిరాకరించడం తెలిసిన విషయాలే. పాలిచ్చే సమయంలో కొంతకాలం రుతుస్రావం జరగదు. అయితే ఈ మహిళ పాలిచ్చే సమ యంలోనే గర్భం ధరించింది. ఇది సహజం అనుకోవడంతో గర్భం ధరించినట్లు గుర్తించలేకపోయింది. ఏడాది క్రితమే బిడ్డకు జన్మనిచ్చి పోస్ట్‌పార్టమ్ సైకోసిస్‌కు చికిత్స తీసుకుంటున్న ఈ మహిళ మరోసారి గర్భం ధరించడం గమనార్హం. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్న ధర్మాసనం అంతకుముందు పిటీషన్‌ను అనుమతిస్తూ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ను ప్రక్రియ చేపట్టాలని నిర్దేశించింది. 2021 సవరణలకు ముందు అబార్షన్ కోసం కోర్టుకు ఎక్కిన కేసుల్లో అత్యధికం మానభంగం లేదా పిండాల వైకల్యం ఉన్నవారికి సంబంధించినవి. పైగా చాలావాటిల్లో గర్భం వయసు 20 వారాల కంటే ఎక్కువే. వేర్వేరు పరిస్థితుల కారణంగా మహిళలకు కొంచెం లేటైనా అబార్షన్ అనేది అవసరమవుతుంది. తొలినాళ్లలోనే అబార్షన్ చేసేందుకు వైద్యపరంగా అవకాశాల్లేకపోవడం వీటిల్లో ఒకటి. లైంగిక దాడి, గృహహింస, జైలు వంటివి ఇతర కారణాలు. గర్భం ధరించిన తరువాత పరిస్థితుల్లో వచ్చే మార్పులు (భాగస్వామి సాయం లేక పోవడం, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉద్యోగం వంటివి), శారీరక, మానసిక ఆరోగ్యం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసు కోవాల్సి ఉంటుంది. మెనోపాజ్ లేదా లాక్టేషనల్ అమెనోరియా (పాలిచ్చే సమయంలో రుతుస్రావం నిలిచిపోవడం) కూడా అబార్షన్‌కు తగిన కారణాలని చెప్పాలి. అబార్షన్లకు సంబంధించి 2021 నాటి సుప్రీంకోర్టు సవరణ గర్భం తాలూకూ వయో పరిమితిని పెంచింది మినహా ఇతర మార్పులేవీ చేయలేదు. దీనివల్ల ప్రయోజనం కొద్దిమందికే. తల్లి ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి వస్తే ఓ ఆర్ఎంపీ ఏ దశలోనైనా గర్భాన్ని తొలగించేందుకు అవకాశం ఉండగా చాలామంది కేసుల భయంతో ఆ పని చేసేందుకు జంకు తున్నారు. ఫలితంగా మహిళలు గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. కోర్టులకు వెళ్లడం ఇష్టం లేని వారైతే గర్భాన్ని కొనసాగిస్తున్నారు లేదా ముతక పద్ధతులతో అబార్షన్ కు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గర్భం దాల్చిన తొలినాళ్లలోనే అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కొంతమంది మహిళలు న్యాయ, వైద్యపరమైన అడ్డంకులను దాటలేకపోతున్నారు. పలుమార్లు వైద్యపరీక్షల అవసరం ఉండటం కూడా ప్రతిబంధకంగా మారుతోంది. ఒకవేళ న్యాయ స్థానాన్ని ఆశ్రయించినా న్యాయవాదుల ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎదుర్కోవడం కూడా ఒక సమస్య. గత వారం సుప్రీంకోర్టులోనూ ఇలాంటి స్థితి ఎదురు కావడం చెప్పుకోవాల్సిన అంశం. అబార్షన్ కోరిన మహిళ మానసిక పరిస్థితి బాగాలేదనీ, కౌన్సెలింగ్ తీసు కోవాలనీ పలుమార్లు న్యాయవాదులు సూచించారు. ఇంతటి కష్టా నికి, ఇబ్బందికి ఓర్చినా తుది ఫలితం అనుకూలంగా ఉంటుందన్న గ్యారెంటీ లేకపోవడం గమనార్హం. అయితే ఒక్క విషయం. ఇతర దేశాలతో పోలిస్తే అబార్షన్‌కు సంబంధించి భారతీయ చట్టాలు కొంత ఉదారంగానే ఉన్నాయని చెప్పాలి. అయినా అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలు, అబార్షన్‌లో అత్యుత్తమ విధానాల విషయంలో మాత్రం అంత గొప్పగా ఏమీ లేవన్నదీ సుస్పష్టం. గత ఏడాది ‘ఎక్స్’ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి మధ్య జరిగిన ఒక కేసు విషయంలో వైద్యపరమైన చట్టాలను అవసరాలకు తగ్గట్టుగా అర్థ వివరణ తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు సూచించింది. ఆ కేసులో 24 వారాల వయసు గర్భంతో ఉన్న అవివాహిత మహిళకు అబార్షన్ చేయించుకునే హక్కు కల్పించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆ మహిళకు ఉన్న హక్కుల ఆధారంగా వైద్యపరమైన పరీక్షలకు అతీతంగా నిర్ణయం తీసుకోవడం, ఎంటీపీ చట్టాలపై లక్ష్యాధారిత అర్థ వివరణ తీసు కోవడం గమనార్హం. మహిళల వాస్తవిక జీవన పరిస్థితులు, సామాజిక వాస్తవాలను అర్థం చేసుకుని మరీ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవాలి. అబార్షన్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం... ప్రభుత్వాలు అబార్షన్‌ను నేరంగా పరిగణించడాన్ని నిలిపివేయాలి. గర్భం వయసుపై పరిమితులు, ఇతర నియంత్రణలను కూడా తొలగించాలి. దీనివల్ల అందరికీ వివక్ష లేని అబార్షన్ సేవలు అందుతాయి. ఏ సమయంలోనైనా సురక్షితంగా గర్భాన్ని తొలగించేందుకు ఉన్న పద్ధతులను ఉపయోగించాలని కూడా ఈ మార్గదర్శకాలు సూచించాయి. అబార్షన్ పై అడ్డంకులు విధాన పరమైన అడ్డంకులుగా మారుతున్నాయనీ, ఏ రకమైన శాస్త్రీయ ఆధా రాలు లేనివిగా మారాయనీ కూడా అవి వ్యాఖ్యానించాయి. గత వారం జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్నల ముందు విచారణకు వచ్చిన కేసులో జస్టిస్ నాగరత్న, జస్టిస్ హిమా కోహ్లీ తీర్పుతో విభేదించిన విషయం తెలిసిందే. ‘ఎక్స్’ కేసును ప్రస్తావించిన జస్టిస్ నాగరత్న గర్భం విషయంలో ఆ మహిళకు ఉన్న హక్కును గుర్తు చేశారు. మహిళ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆ గర్భం అవాంఛితమైతే తొలగించుకునే హక్కు ఆ మహిళకు ఉందని స్పష్టం చేశారు. గర్భాన్ని కొనసాగించాలని కోరడం ఆ మహిళ ఆరో గ్యాన్ని పణంగా పెట్టడం అవుతుందనీ, ఇది ఆర్టికల్ 21, 15 (3)లను అతిక్రమించినట్లు అనీ వివరించారు. అయితే చివరకు ఈ మహిళకు ‘ఎక్స్’ మాదిరిగా అబార్షన్ చేయించుకునే అవకాశం కలగకపోవడం గమనార్హం. ‘ఎక్స్’ కేసులో అవాంఛిత గర్భం తాలూకూ ప్రభావాన్ని అర్థం చేసుకున్న కోర్టు... ఇంకో మహిళ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించింది. అబార్షన్‌ను తొమ్మిది నెలల వ్యవహారా నికి పరిమితం చేసేసింది. అవాంఛిత గర్భం కారణంగా ఆ మహిళ కాన్పు తరువాత కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నది గుర్తించకపోవడం దురదృష్టకరం. వాదనల సందర్భంగానూ న్యాయమూర్తులు, ప్రభుత్వం పలుమార్లు ఈ కేసుకు ఇతర కేసులకు మధ్య తేడాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. అబార్షన్‌కు గల కార ణాల విలువ ఒకరికి ఎక్కువ? ఇంకొరికి తక్కువగా ఉంటాయా? -వ్యాసకర్త బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ) బోధకులు -
లంచం తీసుకున్న చట్టసభ సభ్యులకు విచారణ నుంచి మినహాయింపు ఉండదు
న్యూఢిల్లీ: చట్టసభ సభ్యుడు లంచం తీసుకొంటే తదుపరి విచారణ నుంచి అతడు ఎలాంటి మినహాయింపు, వెసులుబాటు పొందలేడని, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినప్పటికీ చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నప్పటికీ చట్ట ప్రకారం విచారించి, శిక్ష విధించాలని చెప్పారు. లంచం ఇచి్చనా, తీసుకున్నా అవినీతి నిరోధక చట్టం కింద విచారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్టసభల్లో మాట్లాడడానికి, ఓటు వేయడానికి లంచం తీసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి వెసులుబాటు ఉంటుందంటూ 1998 నాటి జేఎంఎం ముడుపుల కేసులో నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కొన్ని వర్గాల విజ్ఞప్తి మేరకు ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పున:పరిశీలిస్తోంది. భాగస్వామ్యపక్షాల వాదనలు వింటోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపించారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నట్లు ఒక్క సంఘటన బయటపడినా సరే విచారణ చేపట్టాలని తుషార్ మెహతా అన్నారు. లంచం స్వీకరించిన పార్లమెంట్ సభ్యుడికి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 105, 194 కింద విచారణ నుంచి వెసులుబాటు కలి్పంచవద్దని కోర్టును కోరారు. పార్లమెంట్ సభ్యుడికి కలి్పంచిన వెసులుబాట్లు, ఇచి్చన మినహాయింపులు అతడి వ్యక్తిగత అవసరాల కోసం కాదని గుర్తుచేశారు. చట్టసభ సభ్యుడిగా బాధ్యతలను నిర్భయంగా నిర్వర్తించడానికే వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. -
ఇక పేదల ఇళ్ల స్థలాలకూ ‘భూదాన్’ భూములు
సాక్షి, అమరావతి: పేదలకు మేలు చేయడమే లక్ష్యంగా భూములకు సంబంధించి పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భూదాన్ బోర్డు విషయంలోనూ అదే ఒరవడిని కొనసాగించింది. భూదాన్ బోర్డుకి సైతం పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే అధికారాన్ని ఇచ్చింది. ఇందుకోసం 1965 ఏపీ భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని సవరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. భూస్వాములు తమకున్న భూమిలో కొంత పేదలకు ఇవ్వాలని కోరుతూ 1950వ దశకంలో గాంధేయవాది ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమాన్ని చేపట్టారు. ఆయన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పలువురు భూమిని దానం చేశారు. ఇలా సంపన్నులు దానం చేసిన భూములను పేదలకు పంచే విధానాన్ని సూచిస్తూ కేంద్రం భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని రూపొందించగా దానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలు చట్టాలను చేసుకున్నాయి. మన రాష్ట్రం కూడా 1965లో ఏపీ భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని చేసింది. దాని ప్రకారం భూదాన్ యజ్ఞ బోర్డును నియమించి దాని ద్వారా భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారాలు నడిపారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని భూదాన్ భూముల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భూముల వ్యవహారాలన్నింటినీ పరిష్కరించేందుకు ఒక క్రమపద్ధతిలో పనిచేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం భూదాన్ భూముల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్‌ను నియమించింది. అలాగే భూదాన్ భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి ద్వారా పేదలకు ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో తాజాగా భూదాన్ చట్టాన్ని సవరించింది. ఆచార్య వినోబా భావే లేకపోతే ఆయన నామినేట్ చేసిన వ్యక్తి సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు భూదాన్ బోర్డు చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను నియమించాలి. ఇవీ సవరణలు గత చట్టంలో భూదాన్ భూమిని వ్యవసాయం, ప్రభుత్వం, స్థానిక సంస్థలు, సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగించాలని నిర్దేశించారు. తాజా సవరణలో సామాజిక ప్రయోజనంతోపాటే బలహీనవర్గాలు, పేదల ఇళ్ల స్థలాల కోసం భూమిని కేటాయించే అధికారాలను భూదాన్ బోర్డుకి ఇచ్చారు. గతంలో ఇళ్ల స్థలాలకు కోసం భూదాన్ భూములను వినియోగించే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు వాటికి వినియోగించే అవకాశం ఏర్పడింది. వినోబా భావే మృతి చెందిన 41 సంవత్సరాలు దాటిపోవడంతో ఆయన ఎవరిని నామినేట్ చేశారనే దానిపై స్పష్టత లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఒకటి, రెండు సంస్థలు భూదాన్ బోర్డులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడడంతో పలు రాష్ట్రాలు చట్టాలను సవరించుకున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ప్రభుత్వమే భూదాన్ బోర్డు చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను నియమించేలా చట్టంలో మార్పు చేశారు. భూదాన్ భూమిని పొందిన వ్యక్తి వరుసగా రెండు సాగు సంవత్సరాలు వ్యవసాయం చేయకపోతే ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారంతోపాటు భూమి పొందిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తులు భూమిపై ఉన్నప్పుడు వారి నుంచి భూమిని తిరిగి తీసుకునే అధికారాన్ని తహసీల్దార్‌కు ఇస్తూ ఇప్పుడు చట్టంలో అవకాశం కల్పించారు. తద్వారా అన్యాక్రాంతమైన భూదాన్ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలు ఏర్పడింది. అర్బన్ ప్రాంతాల్లో వ్వవసాయం చేయకుండా ఆగిపోయిన భూదాన్ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశాన్ని చట్టంలో కల్పించారు. పేదలకు ఇంకా మంచి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఎప్పుడూ పేదల గురించే ఆలోచిస్తారనడానికి ఈ చట్ట సవరణ ఒక ఉదాహరణ. భూదాన్ భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి ద్వారా పేదలకు ఇంకా మంచి చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ భూముల వివరాలన్నింటినీ సేకరిస్తున్నాం. సీఎం ఆలోచనలకు అనుగుణంగా భూదాన్ భూములపై నిర్ణయాలు తీసుకుంటాం. – తాడి విజయభాస్కర్‌రెడ్డి, ఛైర్మన్, ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డు -
డేటా భద్రత నిబంధనలు: తేడా వస్తే రూ. 250 కోట్ల వరకు జరిమానా
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత చట్ట నిబంధనలకు అనుగుణంగా తమ సిస్టమ్స్‌ను సరిచేసు కునేందుకు వ్యాపార సంస్థలకు కొంత సమయం ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇది సుమారు ఏడాది పాటు ఉండొచ్చని పరిశ్రమ వర్గాలతో సమావేశం సందర్భంగా ఆయన విలేకరులకు చెప్పారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఫిర్యాదుల పరిష్కారానికి అప్పీలేట్ అథారిటీ అయిన డేటా ప్రొటెక్షన్ బోర్డు (డీపీబీ)ని వచ్చే 30 రోజుల్లోగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి తెలిపారు. డేటా భద్రత బోర్డుతో పాటు మార్గదర్శకాలు మొదలైనవన్నీ నెల రోజుల్లోగా సిద్ధం కాగలవని మంత్రి తెలిపారు. మెటా, లెనొవొ, డెల్, నెట్‌ఫ్లిక్స్ సహా పలు కంపెనీలకు చెందిన 125 మంది పైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పౌరుల వ్యక్తిగత డేటాను ఆన్లైన్ వేదికలు దుర్వినియోగం చేయకుండా కట్టడి చేసే దిశగా డేటా భద్రత చట్టాన్ని రూపొందించారు. దీనికవసరమైన 25 నియమాలలో చాలా వరకు ముసాయిదా రూపొందించబడి సిద్ధంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు గతంలో చెప్పారు. సమ్మతి ఆధారిత యంత్రాంగం ద్వారా వినియోగదారుల డేటాను సేకరించడం కంపెనీలకు చట్టం తప్పనిసరి చేసింది, అయితే కొన్ని చట్టబద్ధమైన ఉపయోగాల కోసం, చట్టం కొన్ని సడలింపులను అందిస్తుంది. అమల్లో విఫలమైన సంస్థలకు రూ. 250 కోట్ల వరకు జరిమానా విధించవచ్చని చట్టంలో ప్రతిపాదనలు ఉన్నాయి. అంతేకాదు 500 కోట్లకు పెంచవచ్చని కూడా పేర్కొన్నారు. -
విద్యుత్ సవరణ బిల్లును అడ్డుకోవాలి
హిమాయత్‌నగర్: దేశంలోని కొన్ని కార్పొరేట్ శక్తులకు లాభాలు అందించే సరుకుగా విద్యుత్ మారిందని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో 7 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం ‘2022 విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిద్దాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాలను ఎండగడదాం’అనే అంశంపై రాష్ట్ర సదస్సును నిర్వహించారు. అంతకముందు బషీర్‌బాగ్ విద్యుత్ కాల్పుల్లో మృతి చెందిన అమరులకు నివాళులర్వించారు. ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చలపతిరావు, రాష్ట్ర కార్యదర్శి ప్రసదన్న, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురగరి, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఏఐఎఫ్బీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసా ద్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ సవరణ బిల్లు–2022 అనే ది కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమేనన్నారు.ఈ బిల్లు వల్ల విద్యుత్ చార్జీలు సామన్య వినియోగ దారులకు అందుబాటులో లేనివిధంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పేదప్రజలు, రైతులు, ప్రజా వినియోగ రంగాలకు ఇచ్చే సబ్సిడీలు క్రమంగా రద్దు అవుతున్నాయన్నారు. ప్రజా వ్యతిరేక విద్యుత్ సవరణ బిల్లు–2022ను ఉపసంహరించుకోవాలని,విద్యుత్ చట్టం–2003ను రద్దు చేయాలని, ప్రీపెయిడ్ మీటర్ల యోచనను విరమించుకోవాలని, 100 యూనిట్లు లోపు గృహవినియోగదారులకు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలంటూ ఈ సదస్సు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, సుకన్య, తేజ, భరత్, హేమలత పాల్గొన్నారు. -
ఢిల్లీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఐఏఎస్‌లు సహా ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలపై కేంద్రానికి అధికారాలు కట్టబెట్టిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసు బిల్లు చట్టంగా మారింది. ఈసారి వర్షాకాలం సమావేశాల్లో వివాదాస్పద బిల్లులైన ఢిల్లీ సర్వీసు బిల్లు, డిజిటల్ డేటా బిల్లుల్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ఆమోదించారు. వీటితో పాటు జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు , జన విశ్వాస్ (సవరణ) బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేశారు. వీటిలో ఢిల్లీ పాలనాధికారాల బిల్లు (జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు), డిజిటల్ డేటా (డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు) బిల్లులపై పార్లమెంటులో విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అధికారాలన్నీ కేంద్రానికే కట్టబెడుతూ ఆర్డినెన్స్ తెచ్చింది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లుని మొదట లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభ ఆమోదించాయి. ఇప్పుడు రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారింది. అదే విధంగా డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును మణిపూర్ అంశంపై ప్రతిపక్షాల నినాదాల మధ్య మూజువాణి ఓటుతో ఉభయ సభలు ఆమోదించాయి. ఈ బిల్లులో విపక్ష పార్టీలు కొన్ని సవరణలు సూచించినా ప్రభుత్వం చేపట్టలేదు. బిల్లులో కేంద్ర ప్రభుత్వం సహా కొందరికి మినహాయింపులు ఇవ్వడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. -
ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా..ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘రాష్ట్రంలో వరద కారణంగా ఇంతవరకు ఎంతమంది చనిపోయారు? డిజాస్టర్ చట్టం ప్రకారం ఎంతమందిని రక్షించారు? గోదావరి తీర ప్రాంత గ్రామాల రక్షణకు ఏం చర్యలు చేపట్టారు? బాధితులకు కనీస సౌకర్యాలు అందిస్తున్నారా? వరదలపై వార్‌రూమ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎన్నికలప్పుడు ఏర్పాటు చేస్తారు కానీ.. వరదలు లాంటి అత్యవసర సమయంలో ఏర్పాటు చేయరా?..’అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఓ నివేదికను సోమవారం అందజేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో వెల్లడించడం లేదని, రక్షణ చర్యలు తీసుకునేలా రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పడం లేదు.. ‘వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించింది. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో వరదల కారణంగా 19 మంది మృతి చెందారని పత్రికల్లో వస్తున్న వార్తలు తెలియజేస్తున్నాయి. వరదలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని కేంద్రం మరోసారి తెలియజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరదల నుంచి ప్రజలను రక్షించడానికి ఏం చర్యలు తీసుకున్నారు? ఎంత మంది మరణించారు? లాంటి వివరాలను వెల్లడించడం లేదు. కడెం ప్రాజెక్టు వద్ద తీవ్ర భయానక పరిస్థితి కొనసాగుతోంది. ప్రాజెక్టు తెగితే వందల గ్రామాలు నీట మునగడంతో పాటు లక్షల మంది నిరాశ్రయులుగా మారే అవకాశం ఉంది..’అంటూ న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, పల్లె ప్రదీప్‌కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ‘వరద బాధితులకు తక్షణమే కనీస సౌకర్యాలు అందేలా ఏర్పాట్లు చేయాలి. కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని భద్రతా చట్ట ప్రకారం చర్యలు చేపట్టి వెంటనే రక్షించాలి. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలి..’అని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదు పరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. -
ఎమ్మెల్యే సాహసం.. సముద్రంలోకి దూకి ముగ్గురిని రక్షించాడు
పరిస్థితిని అంచనా వేయకుండా సముద్రంలోకి దిగిన నలుగురు యువకులను అలలు ముంచెత్తాయి. ఆ ధాటికి మునిగిపోతూ కేకలు వేశారు వాళ్లు. ఆ పరిస్థితుల్లో అక్కడ కొందరు గుమిగూడగా.. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఒకరు సాహసం ప్రదర్శించారు. సముద్రానికి ఎదురీదిన ఆయన.. ఆ తర్వాత ఓ బోటు సాయంతో ముగ్గురిని స్వయంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. గుజరాత్ అమ్రేలి జిల్లాలో పట్వా గ్రామ సమీపంలోని సముద్ర తీరానికి బుధవారం మధ్యాహ్నం నలుగురు యువకులు ఈతలకు వెళ్లారు. అయితే వాతావరణంలోని మార్పులతో అలలు పోటెత్తాయి. దీంతో వాళ్లు మునిగిపోసాగారు. ఈలోపు రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. అయితే ఆ సమయంలో అక్కడ కొందరు గుమిగూడగా.. అక్కడే ఉన్న ఎమ్మెల్యే హీరా సోలంకి మాత్రం ఆలస్యం చేయలేదు. అలలతో పోటెత్తిన సముద్రానికి ఎదురీదారాయన. ఈలోపు కొందరు యువకులు ఆయనకు సాయానికి రాగా.. బోట్ సాయంతో సముద్రంలోకి వెళ్లారు. స్వయంగా నీళ్లలో దూకి ముగ్గురు యువకులను రక్షించారు. మరో యువకుడు అలల ధాటికి కొట్టుకునిపోగా.. సాయంత్రానికి మృతదేహం దొరికింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజుల నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు హీరా సోలంకి. ఆలస్యం చేయకుండా సాహసం ప్రదర్శించి ముగ్గురి ప్రాణాలు నిలబెట్టిన ఎమ్మెల్యేపై రియల్ హీరో అంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదీ చదవండి: కన్నకూతురిని పాతికసార్లు పొడిచాడు! -
ఉగ్రవాదులపై అటవీ చట్టం!
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు ఈ నెల 9న హైదరాబాద్‌తో పాటు భోపాల్‌లో అరెస్టు చేసిన ఉగ్రవాదులపై అటవీ శాఖ చట్టం కిందా అభియో గాలు చేయనున్నారు. భోపాల్‌కు చెందిన ఓ పర్యావరణవేత్త ఇచ్చిన సూచన మేరకు ఏటీఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంబంధిత కేసుల్లో పోలీసులు సాధారణంగా.. చట్ట విరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం–1967లోని వివిధ సెక్షన్ల కింద ఆరోపణలు చేస్తారు. ఆ ఉగ్రవాదుల వ్యవహారశైలి, చేసిన విధ్వంసాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), ఆయుధ చట్టం, పేలుడు పదార్థాల చట్టంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ల కిందా ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్–¿ోపాల్ మాడ్యుల్స్‌పై మాత్రం అటవీ చట్టంలోని సెక్షన్లనూ జోడించాలని మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ నిర్ణయించింది. ఈ ఉగ్రవాదులు భోపాల్ శివార్లలోని రైసెన్ అడవుల్లో తుపాకీ కాల్చడాన్ని ప్రాక్టీసు చేశారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన సలీం తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. అటవీ చట్టాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లోకి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించడం నేరం. అలా వెళ్లడమే కాకుండా నిషిద్ధ ప్రాంతంలో తుపాకులు వాడినందుకు వీరిపై అటవీ చట్టాల ప్రకారం ఆరోపణలు చేయడమే కాదు, అభియోగాలు సైతం మోపి విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ ఏటీఎస్‌కు శుక్రవారం ఓ లేఖ అందింది. భోపాల్‌కు చెందిన ఓ పర్యావరణవేత్త దీన్ని రాశారు. ఈ లేఖను పరిగణనలోకి తీసుకున్న ఏటీఎస్ ఆ చట్టంలోని సెక్షన్లను చేర్చాలని నిర్ణయించింది. 10 మంది పోలీసు కస్టడీ పొడిగింపు హైదరాబాద్, భోపాల్‌లలో అరెస్టు చేసిన 16 మంది ఉగ్రవాదుల పోలీసు కస్టడీ గడువు శుక్రవారంతో ముగియడంతో ఏటీఎస్ అధికారులు వీరిని భోపాల్‌లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీ గడువు మరో పది రోజులు పొడిగించాలని కోరారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి రఘువీర్ యాదవ్ 10 మంది కస్టడీని ఈ నెల 24 వరకు పొడిగించారు. ఆరుగురికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కస్టడీ పొడిగించిన వారిలో సలీం, రెహా్మన్, యాసిర్ ఖాన్ తదితరులు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. వీరిని మరోసారి హైదరాబాద్‌కు తీసుకువస్తారా? సిద్దిపేటలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.