తెలంగాణ పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టాన్ని పూర్తిగా మార్చే యోచనలో ప్రభుత్వం
ధరణి కమిటీ సూచించిన అనేక సవరణలు చేసేకన్నా కొత్త చట్టమే మంచిదనే భావన
ఆర్డినెన్స్ తీసుకురావాలనుకున్నా అసెంబ్లీ ప్రోరోగ్ కాకపోవడంతో ఉపసంహరణ
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే కొత్త చట్టం?
అధికార వికేంద్రీకరణకు పక్కాగా చట్టబద్ధత
అప్పటివరకు వెసులుబాటు కోసమే ధరణి స్పెషల్ డ్రైవ్
తాత్కాలిక ఏర్పాటు కోసమే వికేంద్రీకరణ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం (రికార్డ్ ఆఫ్ రైట్స్)–2020 స్థానంలో కొత్త రెవెన్యూ చట్టం రానున్నట్టు సమాచారం. ధరణి పోర్టల్ ద్వారా రైతు లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ చట్టం అడ్డంకిగా మారిందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కొత్త చట్టం ప్రవేశపెట్టాలని సర్కారు భావి స్తోందని సమాచారం.
ప్రస్తుత చట్టంలోని అనేక అంశాలకు సవరణలు సూచిస్తూ, ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ 20 పేజీల ముసాయిదాను రూపొందించిందని, అయితే అన్ని సవరణలతో అతుకుల బొంత లాంటి చట్టాన్ని మను గడలో ఉంచడానికి బదులు కొత్త చట్టాన్ని తీసుకురావడమే మంచిదని ప్రభుత్వం భావించిందనే చర్చ రెవెన్యూ వర్గా ల్లో జరుగుతోంది. దీనిపై ఆర్డినెన్స్ తేవాలనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో జరిగినా, అసెంబ్లీ ప్రొరోగ్ కానందున ఆర్డినెన్స్ చేసే అవకాశం లేదన్న న్యాయ నిపుణుల అభిప్రా యంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్టు తెలు స్తోంది. అయితే అప్పటివరకు ధరణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా స్పెషల్ డ్రైవ్ ద్వారా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని, అధికారాల వికేంద్రీకరణ ఉత్తర్వులిచ్చిందని సమాచారం.
తహసీల్దార్లలో నైరాశ్యం
అధికారాల వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన ఉత్త ర్వులు తహసీల్దార్లలో నైరాశ్యానికి కారణమయ్యాయి. వికేంద్రీకరణ పేరుతో కలెక్టర్లకే ఎక్కువ అధికారాలు కట్టబె ట్టారని వారంటున్నారు. గతంలో తమకు ఉన్న అధికారా లనే మళ్లీ ఇచ్చారని, వారసత్వ హక్కుల సంక్రమణ, జీపీ ఏ, ఎస్‌పీఏల ఆధారంగా పట్టాలు చేసే అధికారం ఇప్పుడు కూడా తమకే ఉందని, మళ్లీ ఆ అధికారాలనే ఇచ్చి వికేంద్రీ కరణ అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమ వద్ద సిబ్బంది లేరని, ఇలాంటి పరిస్థితుల్లో వారం రోజుల సమయం ఇచ్చి అన్ని దరఖాస్తులూ పరిష్కరించాలంటే ఎలా సాధ్యమనే చర్చ కూడా రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. హడావుడిలో తప్పులు జరిగితే సమస్య మళ్లీ మొదటి కొచ్చినట్టే కదా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
వికేంద్రీకరణ తాత్కాలికమే!
అయితే ప్రస్తుతం చేపట్టిన అధికార వికేంద్రీకరణ, స్పెషల్ డ్రైవ్‌లు తాత్కాలికమేనని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ధర ణి కమిటీ సూచన మేరకు తాత్కాలికంగానే ఈ ఏర్పాట్లు చేశామని, కొత్త ఆర్‌వోఆర్ చట్టంలో అధికార వికేంద్రీకరణ కు చట్టబద్ధత కల్పిస్తామని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబు తున్నారు. మరోవైపు కలెక్టర్లు తీసుకునే నిర్ణయాలను కూడా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్–1908లోని 166బీ నిబంధన ప్రకారం సవాల్ చేయవచ్చని అంటున్నారు. ప్రస్తుతం చేసిన అధికారాల పంపిణీ కూడా తాత్కాలికమేనని, ఆర్‌వో ఆర్ కొత్త చట్టంలో పకడ్బందీగా వికేంద్రీకరణ ఉంటుందని పేర్కొంటున్నారు. తహశీల్దార్లకు అధికారాల విస్తృత పంపిణీ అవకాశం ప్రస్తుతానికి లేదని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నా యి.
అయితే ధరణి దరఖాస్తుల పరిష్కారంలో తహశీల్దార్ నివేదికలే ప్రాతిపదికలని, ఆ నివేదికల ఆధారంగానే ఉన్న తాధికారులు దరఖాస్తులను పరిష్కరిస్తారని ధరణి కమిటీ సభ్యుడొకరు చెప్పారు. ఈ మేరకు తహశీల్దార్లు క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంటుందని, గతంలో మాదిరి కాకుండా దరఖాస్తుల ఆమోదం, తిరస్కారం కోసం కచ్చితంగా కార ణాలతో కూడిన రాతపూర్వక ఉత్తర్వులివ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ఎవరైనా రైతులు తమకు నష్టం కలిగిందని భావిస్తే రెవెన్యూ అధికారు లిచ్చే రాతపూర్వక ఉత్తర్వులపై కోర్టులను ఆశ్రయించే వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈనెల 1వ తేదీనుంచి 9వ తేదీ వరకు నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌తో ధరణి దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోదని, ఈ డ్రైవ్‌లో తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ కూడా మరోమారు ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment