new law
-
అప్పీల్‌కు అవకాశం.. ఉచిత న్యాయ సహాయం..
సాక్షి, హైదరాబాద్: ముసాయిదాలో పెట్టిన కొన్ని నిబంధనలను మారుస్తూ, కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ ‘రికార్డ్ ఆఫ్ రైట్స్–2024’బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనిని ‘తెలంగాణ భూభారతి (రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం–2024’గా పిలుస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన ప్రభుత్వం దీనికి సంబంధించిన ముసాయిదాను విడుదల చేసింది. అందులో 20 సెక్షన్లు ఉండగా.. తాజాగా సవరణలు, మార్పులతో అసెంబ్లీ ముందు పెట్టిన బిల్లులో 23 సెక్షన్లు ఉన్నాయి.ల్యాండ్ ట్రిబ్యునళ్ల ఏర్పాటు, పహాణీలో సాగుదారుకాలమ్, రెవెన్యూ మాన్యు వల్ రికార్డుల నిర్వహణ, ఉచిత న్యాయ సహాయం, ఇప్పటివరకు దరఖాస్తులు అందిన సాదాబైనామాల క్రమబద్ధీకరణ, తప్పుచేసిన అధికారులకు శిక్షలు, కోర్టుకు వెళ్లడంపై స్పష్టత వంటి కొత్త నిబంధనలను దీనిలో చేర్చారు. ధరణిలో ఉన్న వివరాలు తాత్కాలికంగానే భూభారతిలోకి వస్తాయని... రానున్న రోజుల్లో ఈ రికార్డుల సంపూర్ణ ప్రక్షాళన ఉంటుందని అందులో పేర్కొన్నారు. ముసాయిదాలో పేర్కొన్న విధంగా మ్యుటేషన్ చేసే అధికారం ఆర్డీవోలకు, రిజి్రస్టేషన్ తర్వాత మ్యుటేషన్ సమయంలో విచారణ, తప్పులుంటే మ్యుటేషన్ నిలిపివేత, పరిష్కార బాధ్యతలు కలెక్టర్ల నుంచి ఆర్డీవోలకు బదలాయింపు, ప్రతి భూకమతానికి భూదార్, ఆబాదీలకూ హక్కుల రికార్డు, హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదు, భూముల రీసర్వే వంటివి కొనసాగించారు. మళ్లీ రెవెన్యూ ట్రిబ్యునళ్లు భూభారతి ద్వారా రెవెన్యూ ట్రిబ్యునళ్లు మళ్లీ ఏర్పా టు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఈ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయ వచ్చు. ఎన్ని, ఏ స్థాయిలో ఏర్పాటు చేయాలన్న వె సులుబాటు ప్రభుత్వానికే ఉంటుంది. అవి ఏర్పాట య్యేంత వరకు సీసీఎల్ఏనే ల్యాండ్ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు. తహసీల్దార్లు, సబ్రిజి్రస్టార్లు తీసు కునే నిర్ణయాలపై 60 రోజుల్లోగా ఆర్డీవోకు దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్డీవోల నిర్ణయాలపై 60 రోజుల్లోగా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. భూదార్ కార్డుల జారీ, పట్టాదారు పాసు పుస్తకాల జారీకి సంబంధించిన అప్పీళ్లను ఆర్డీవోకు చేసుకోవాలి.ఈ క్రమంలో ఆర్డీవోలు తీసుకునే నిర్ణయంతో విభేదిస్తే.. 30 రోజుల్లోపు కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవాలి. కలెక్టర్ల నిర్ణయాలతో విభేదిస్తే 30 రోజుల్లోపు ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ విషయంలో ట్రిబ్యునల్ తీసుకునే నిర్ణయమే ఫైనల్. ట్రిబ్యునల్స్ లేదా అప్పిలేట్ అథారిటీలకు అప్పీల్ చేసుకునే పరిస్థితి లేని రైతులకు ప్రభుత్వం ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుంది. కోర్టుకు వెళ్లడంపై స్పష్టత.. సర్వే నంబర్లను అవసరానికి అనుగుణంగా సబ్ డివిజన్ చేసుకునేందుకు ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్, అసైన్డ్, లావణి భూముల వివాదాలపై సుమోటోగా, లేదంటే ఏదైనా దరఖాస్తు ద్వారా తీసుకుని విచారించి రికార్డులను సరిచేసే అధికారం, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమి బదిలీ తిరిగి ప్రభుత్వానికి దఖలు పరుచుకునే అధికారం భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)కు ఉంటుంది.అప్పిలేట్ అథారిటీలు, రివిజన్ అథారిటీలకు సివిల్ కోర్టులకుండే అధికారాలను ఈ చట్టం ద్వారా కల్పిస్తున్నారు. భూరికార్డులను తారుమారు చేసిన, హక్కుల రికార్డు విషయంలో తప్పులు చేసిన అధికారులను సరీ్వసు నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇక కేవలం యాజమాన్య హక్కుల గురించి మాత్రమే సివిల్ కోర్టులకు వెళ్లాల్సి ఉంటుందని... రికార్డుల్లో సవరణలు, తప్పొప్పుల గురించి కోర్టుకు వెళ్లడం కుదరదని ఈ చట్టంలో స్పష్టం చేశారు.వైఎస్ హయాంలో పెట్టిన పేరు.. ‘భూభారతి’తెలంగాణలో అమల్లోకి రానున్న కొత్త ఆర్వోఆర్ చట్టానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన ఒక భూసంబంధిత ప్రాజెక్టు పేరును ఖరారు చేయడం గమనార్హం. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే తొలి భూరికార్డుల ఆధునీకరణ పైలట్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించారు. ఆ ప్రాజెక్టుకు ‘భూభారతి’అని పేరుపెట్టారు. తాజాగా కొత్త చట్టానికి భూమాత, భూభారతి, వెబ్‌ల్యాండ్, మాభూమి అని నాలుగు పేర్లను ప్రతిపాదించారు. ఇందులో ప్రభుత్వం భూభారతిని ఖరారు చేసింది. సర్క్యులేషన్ విధానంలో మంత్రివర్గ ఆమోదం తీసుకుని ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ చట్టం ఎందుకు తెస్తున్నామంటే!కొత్త చట్టాన్ని తెచ్చేందుకు కారణాలను అసెంబ్లీలో పెట్టిన బిల్లులో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 2020 అక్టోబర్ 29 నుంచి అమల్లోకి వచ్చిన ప్రస్తుత చట్టం కారణంగా భూయజమా నులకు ఇబ్బంది కలిగిందని, ధరణి పోర్టల్‌లో లెక్కలేనన్ని పొరపాట్లు ఉన్నాయని పేర్కొంది. ఆ పొరపాట్లను సరిదిద్దే వెసులుబాటును ఆ చట్టం కల్పించలేదని, భూమి రికార్డులను సరిదిద్దుకునేందుకు సివిల్ కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితులను కలి్పంచిందని తెలిపింది. సాదాబైనామాల క్రమబద్ధికరణకు కావాల్సిన వెసులుబాటు అందులో లేదని పేర్కొంది.సభ ముందు ఉంచిన కొత్త చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు, భూ ముల వివాదాలు తగ్గుతాయని.. ప్రజలు వారి ఆ స్తులు, భూములను వారి అవసరాలకు వినియోగించుకునేందుకు, వారికి ఆర్థిక స్థిరత్వం కలిగించేందుకు ఉపయోగపడుతుందని ప్రభు త్వం తెలిపింది.ప్రభుత్వ భూముల రక్షణ, సులభతరంగా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూరికార్డుల పోర్టల్ నిర్వహణ, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, ప్రతి భూమికి భూదార్ నంబర్, కార్డుల జారీ, వ్యవసాయేతర భూములు, ఆబాదీల హ క్కుల కోసం రికార్డు తయారీ, హక్కుల రికార్డులో మ్యుటేషన్ పద్ధతిని సరిదిద్దడం, భూరికార్డుల పో ర్టల్లో నమోదైన తప్పులను సరిచేసే వ్యవస్థను నెలకొల్పడం, పార్ట్–బీలో పెట్టిన భూముల సమస్యలను పరిష్కరించడం, ప్రస్తుత రికార్డులను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు భూముల రీసర్వే నిర్వహించి కొత్త రికార్డు తయారు చేయడమే లక్ష్యంగా కొత్త చట్టాన్ని తెస్తున్నామని స్పష్టం చేసింది.24 సార్లు సవరణలు చేసి.. సభ ముందుకు..భూభారతి చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. ఈ ఏడాది ఆగస్టు 2న ముసాయిదాను విడుదల చేసింది. అన్ని వర్గాల నుంచి ఆన్లైన్ ద్వారా సలహాలు, సూచనలు స్వీకరించింది. జిల్లాస్థాయిలో సదస్సులు నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకుంది. ఆయా అంశాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి.. ముసాయిదాను 14 సార్లు సవరించింది. సీఎం, రెవెన్యూ మంత్రి, ఉన్నతాధికారులతో చర్చిస్తూ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టడానికి కొన్ని గంటల ముందు వరకు కూడా సవరించుకుంటూ వచ్చారు.మొత్తంగా 24 సార్లు సవరించి.. 24వ ముసాయిదాను ఫైనల్ చేసి భూభారతి–2024 చట్టం బిల్లును అసెంబ్లీ ఆమోదానికి ఉంచారు. అటు ముసాయిదా, ఇటు అసెంబ్లీ ముందు పెట్టిన బిల్లు రూపకల్పనలో భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్ ప్రత్యేక కృషి చేయగా... రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్, సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.లచ్చిరెడ్డి కీలకపాత్ర పోషించారు. -
ఆలయంపై దాడి ఘటన.. కెనడాలో అమల్లోకి కొత్త చట్టాలు
ఒట్టావా: హిందూ భక్తులపై సిక్కు వేర్పాటు వాదుల దాడి ఘటనలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాడులు పునరావృతం కాకుండా కొత్త చట్టాల్ని అమల్లోకి తెచ్చింది. బ్రాంప్టన్‌లో ప్రార్థనా స్థలాల 100 మీటర్ల పరిసర ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలపై నిషేదం విధిస్తూ స్థానిక (బైలా) చట్టాన్ని అమలు చేసినట్లు బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ప్రకటించారు. ఈ చట్టంపై సిటీ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని చెప్పారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు.ఈ నెల ప్రారంభంలో బ్రాంప్టన్‌లోని హిందూ సభ దేవాలయ ప్రాంగణంలో సిక్కు వేర్పాటువాదులు ఖలిస్థానీ జెండాలతో రెచ్చిపోయారు. దేవాలయానికి వస్తున్న హిందూ భక్తులపై కర్రలతో దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తున్న వీడియోలో వైరల్‌గా మారాయి.ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులపై దాడి ఘటనలో కెనడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎక్స్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం ఈ దాడిని ఖండించారు. ప్రతి ఒక్క కెనడియన్ తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా, సురక్షితంగా అనుసరించే హక్కు ఉందని అన్నారు. -
‘ఉన్నావ్, హత్రాస్ ఘటనల్లో ఏం న్యాయం చేశారు?’
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై బెంగాల్లో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం మంగళవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి.. అత్యాచార నిరోధక బిల్లును ఆమోదించింది. ఈ సందర్భంగా మహిళలపై హత్యాచార నేరాలు జరగకుండా ఉండేందుకు సామాజిక సంస్కరణలు అవసరమని సీఎం మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఆర్జీకర్ హత్యాచార ఘటనపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను అసెంబ్లీ సాక్షిగా మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. మహిళలపై ఇటువంటి దారుణ ఘటనలు ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగాయని, బీజేపీ పాలిత గుజరాత్, యూపీలో బాధితులకు న్యాయం ఏళ్లతరబడి కూడా అందడం లేదని ప్రస్తావించారామె. ఘటనలు జరిగి ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికీ బాధితుల కుటుంబాలకు న్యాయం జరగలేదు. 2020లో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 20 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం, 2013లో బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థినిపై హత్యాచారం, గత వారం బీజేపీ పాలిత రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రభుత్వ హాస్పిటల్ ఓ చిన్నారిపై జరిగిన అత్యాచారం జరిగాయి. ఆయా ఘటనల్లో ఏం న్యాయం చేశారో బీజేపీ వాళ్లు చెప్పగలరా? అని ప్రశ్నించారామె. అదేవిధంగా బెంగాల్‌లోని నార్త్ పరగణాలలో జరిగిన హత్యాచారం కేసులో శిక్ష విధించాలని తాము డిమాండ్ చేస్తున్నామని, కానీ ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని గుర్తు చేశారు. ఇదే కేసులో కలకత్తా హైకోర్టు ఒక నిందితుడిని నిర్దోషిగా ప్రకటించి, మరో ఇద్దరి మరణశిక్షను తగ్గించిన తర్వాత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారామె. ఉన్నావ్, హత్రాస్ దారుణ ఘటనల్లో బాధితురాలికి న్యాయం జరగలేదని మాత్రం ఎవరూ మాట్లాడరని బీజేపీ నేతలపై ఆమె మండిపడ్డారు.వాస్తవానికి.. మహిళలపై దారుణమైన నేరాలు, లైంగిక దాడులు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, గుజరాత్లో ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. ఆ రాష్ట్రాలో జరిగిన ఘటనలకు న్యాయం జరగటం లేదని, పశ్చిమ బెంగాల్లో కోర్టు న్యాయం లభిస్తోందని తెలిపారు. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలను తీసుకురాని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు.. మహిళలపై దారుణాలు జరుగుతున్న బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారామె. మీరు(బీజేపీ) తమకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లే తాను కూడా ప్రధానమంత్రికి, హోంమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీదీ సర్కార్ తెచ్చిన కొత్త చట్టానికి ‘అపరాజిత’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.Kolkata: At the West Bengal Assembly, CM Mamata Banerjee says, "...I express my condolences to the girl who was raped, murdered and to her family. When the RG Kar incident took place on the night of 9th August, I was in Jhargram. On 10th August, the body was found, and on 12th… pic.twitter.com/TjTZS1gJnc— ANI (@ANI) September 3, 2024#WATCH | Kolkata: At the West Bengal Assembly, CM Mamata Banerjee says, "...I had written two letters to the Prime Minister, but I did not get any reply from him, rather I got a reply from the Minister of Women and Child Development, but I also replied to his reply and informed… pic.twitter.com/XKmSOWDj3B— ANI (@ANI) September 3, 2024 -
లవ్ జిహాద్‌కు జీవిత ఖైదు: అసోం
గువాహటి: హిందూ అమ్మాయిలను ముస్లింలుగా మారుస్తున్న ‘లవ్ జిహాద్’ దోషులకు యావజ్జీవ ఖైదు పడేలా కొత్త చట్టం తెస్తామని బీజేపీ పాలిత అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం ప్రకటించారు. ‘‘ఎన్నికల వాగ్దానాలనే నెరవేర్చబోతున్నాం. లవ్ జిహాద్‌తో సంబంధమున్న వారికి జీవితఖైదు తప్పదు. ఇకపై అసోంంలో పుట్టిన వారినే స్థానికులుగా గుర్తిస్తాం. వారికే ప్రభుత్వ ఉద్యోగాల అర్హత ఉంటుంది’’ అన్నారు. -
కొత్త రెవెన్యూ చట్టం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం (రికార్డ్ ఆఫ్ రైట్స్)–2020 స్థానంలో కొత్త రెవెన్యూ చట్టం రానున్నట్టు సమాచారం. ధరణి పోర్టల్ ద్వారా రైతు లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ చట్టం అడ్డంకిగా మారిందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కొత్త చట్టం ప్రవేశపెట్టాలని సర్కారు భావి స్తోందని సమాచారం. ప్రస్తుత చట్టంలోని అనేక అంశాలకు సవరణలు సూచిస్తూ, ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ 20 పేజీల ముసాయిదాను రూపొందించిందని, అయితే అన్ని సవరణలతో అతుకుల బొంత లాంటి చట్టాన్ని మను గడలో ఉంచడానికి బదులు కొత్త చట్టాన్ని తీసుకురావడమే మంచిదని ప్రభుత్వం భావించిందనే చర్చ రెవెన్యూ వర్గా ల్లో జరుగుతోంది. దీనిపై ఆర్డినెన్స్ తేవాలనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో జరిగినా, అసెంబ్లీ ప్రొరోగ్ కానందున ఆర్డినెన్స్ చేసే అవకాశం లేదన్న న్యాయ నిపుణుల అభిప్రా యంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్టు తెలు స్తోంది. అయితే అప్పటివరకు ధరణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా స్పెషల్ డ్రైవ్ ద్వారా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని, అధికారాల వికేంద్రీకరణ ఉత్తర్వులిచ్చిందని సమాచారం. తహసీల్దార్లలో నైరాశ్యం అధికారాల వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన ఉత్త ర్వులు తహసీల్దార్లలో నైరాశ్యానికి కారణమయ్యాయి. వికేంద్రీకరణ పేరుతో కలెక్టర్లకే ఎక్కువ అధికారాలు కట్టబె ట్టారని వారంటున్నారు. గతంలో తమకు ఉన్న అధికారా లనే మళ్లీ ఇచ్చారని, వారసత్వ హక్కుల సంక్రమణ, జీపీ ఏ, ఎస్‌పీఏల ఆధారంగా పట్టాలు చేసే అధికారం ఇప్పుడు కూడా తమకే ఉందని, మళ్లీ ఆ అధికారాలనే ఇచ్చి వికేంద్రీ కరణ అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమ వద్ద సిబ్బంది లేరని, ఇలాంటి పరిస్థితుల్లో వారం రోజుల సమయం ఇచ్చి అన్ని దరఖాస్తులూ పరిష్కరించాలంటే ఎలా సాధ్యమనే చర్చ కూడా రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. హడావుడిలో తప్పులు జరిగితే సమస్య మళ్లీ మొదటి కొచ్చినట్టే కదా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వికేంద్రీకరణ తాత్కాలికమే! అయితే ప్రస్తుతం చేపట్టిన అధికార వికేంద్రీకరణ, స్పెషల్ డ్రైవ్‌లు తాత్కాలికమేనని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ధర ణి కమిటీ సూచన మేరకు తాత్కాలికంగానే ఈ ఏర్పాట్లు చేశామని, కొత్త ఆర్వోఆర్ చట్టంలో అధికార వికేంద్రీకరణ కు చట్టబద్ధత కల్పిస్తామని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబు తున్నారు. మరోవైపు కలెక్టర్లు తీసుకునే నిర్ణయాలను కూడా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్–1908లోని 166బీ నిబంధన ప్రకారం సవాల్ చేయవచ్చని అంటున్నారు. ప్రస్తుతం చేసిన అధికారాల పంపిణీ కూడా తాత్కాలికమేనని, ఆర్వో ఆర్ కొత్త చట్టంలో పకడ్బందీగా వికేంద్రీకరణ ఉంటుందని పేర్కొంటున్నారు. తహశీల్దార్లకు అధికారాల విస్తృత పంపిణీ అవకాశం ప్రస్తుతానికి లేదని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నా యి. అయితే ధరణి దరఖాస్తుల పరిష్కారంలో తహశీల్దార్ నివేదికలే ప్రాతిపదికలని, ఆ నివేదికల ఆధారంగానే ఉన్న తాధికారులు దరఖాస్తులను పరిష్కరిస్తారని ధరణి కమిటీ సభ్యుడొకరు చెప్పారు. ఈ మేరకు తహశీల్దార్లు క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంటుందని, గతంలో మాదిరి కాకుండా దరఖాస్తుల ఆమోదం, తిరస్కారం కోసం కచ్చితంగా కార ణాలతో కూడిన రాతపూర్వక ఉత్తర్వులివ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ఎవరైనా రైతులు తమకు నష్టం కలిగిందని భావిస్తే రెవెన్యూ అధికారు లిచ్చే రాతపూర్వక ఉత్తర్వులపై కోర్టులను ఆశ్రయించే వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈనెల 1వ తేదీనుంచి 9వ తేదీ వరకు నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌తో ధరణి దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోదని, ఈ డ్రైవ్‌లో తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ కూడా మరోమారు ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. -
Uttarakhand: భూములు కొనేందుకు వారికి నో !
డెహ్రాడూన్: పర్యాటక రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో భూములు కొనాలనుకుంటున్నారా. అయితే ఇక అది కుదరకపోవచ్చు. రాష్ట్రంలోని గ్రామీణ కొండ ప్రాంతాల్లో రాష్ట్రం బయటివారు భూములు కొనకుండా సీఎం పుష్కర్ సింగ్ దామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం త్వరలో ఒక చట్టం తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇదే తరహాలో చట్టం తీసుకువచ్చిన మరో పర్యాటక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ స్ఫూర్తిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఉత్తరాఖండ్ గ్రామీణ కొండ ప్రాంతాల్లో భూముల కొనుగోలుపై పరిమితులు విధించే విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రం బయటివారు పూర్తిగా భూములు కొనుగోలు చేయకుండా నిరోధించడం, పట్టణ ప్రాంతాల్లో భూముల కొనుగోలుపై పరిమితులు విధించాలని కమిటీ తన నివేదికలో సిఫారసు చేసింది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు. బయటివారు భూములు కొనుగోలు చేయడంపై స్థానికుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతోనే ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చేందుకు నిర్ణయించిందని తెలుస్తోంది. అయితే భూ చట్టాల్లో మార్పులు చేయడం ఉత్తరాఖండ్‌లో ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రంలో భూముల కొనుగోలుపై ఆంక్షలు విధించడం పెట్టుబడుల పేరు చెప్పి మళ్లీ వాటిని ఎత్తివేయడం చేస్తూనే వస్తుండడం విశేషం. ఇదీచదవండి..రామ మందిర వేడుకకు మమతా బెనర్జీ దూరం? -
మూడు క్రిమినల్ చట్టాల సవరణ బిల్లులకు ఉభయసభలు ఆమోదం
సాక్షి న్యూఢిల్లీ: మూడు క్రిమినల్ చట్టాల సవరణ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య అధినీయం బిల్లుకు గురువారం పెద్దల సభలో ఆమోదం లభించింది. ఇప్పటికే ఈ బిల్లులను లోక్‌సభ ఆమోదించగా.. నేడు రాజ్యసభలో హోమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. తాజాగా పెద్దల సభలోనూ ఆమోదం లభించడంతో రాష్ట్రపతి ఆమోదం అనంతరం త్వరలోనే చట్టరూపం దాల్చనున్నాయి. బ్రిటిష్ కాలంనాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో ఈ కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి. పార్లమెంట్లో బిల్లుల ఆమోదంపై ప్రధాని మోదీ ప్రసంగించారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష బిల్లులకు పార్లమెంట్ ఆమోదం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఈ బిల్లులతో బ్రిటిష్ చట్టాలకు చెల్లు చీటీ పాడి.. ప్రజా సంక్షేమం, సేవలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. సంస్కరణలు తీసుకురావాలన్న తమ సంకల్పానికి ఈ బిల్లులు ఒక సంకేతమని చెప్పారు. ఈ కొత్త బిల్లులతో పోలీసింగ్, దర్యాప్తు విధానాలలో మరింత సాంకేతికత, ఫోరెన్సిక్ సైన్స్‌ను ఉపయోగిస్తారని మోదీ పేర్కొన్నారు. ఈ బిల్లులతో పేదలకు అణిచివేతకు గురైన వర్గాలకు రక్షణ దొరుకుతుందదని.. అదే సమయంలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై, ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపుతుందని తెలిపారు. రాజద్రోహం చట్టాలకు ముగింపు పలికామని అన్నారు. ఇక రాజ్యసభలో క్రిమినల్ చట్టాల సవరణ బిల్లులపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి సమాధానమిచ్చారు. కొత్త చట్టాలు కేవలం శిక్షలు విధించడమే మాత్రమే కాకుండా న్యాయాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందించినట్లు పేర్కొన్నారు. పేదలకు సత్వర న్యాయం అందించేందుకు కొత్త చట్టాలు దోహదపడతాయన్నారు. అనంతరం రాజ్యసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రకటించారు. అయితే షెడ్యూల్‌కు ఒక రోజు ముందే లోక్‌సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా పడ్డాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సెషన్ లో 146 మంది వివక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. చదవండి: రాహుల్‌పై చర్యలు తీసుకోండి.. ఈసీకి హైకోర్టు ఆదేశం -
377, 497 సెక్షన్లు మళ్లీనా?
కొత్త నేర న్యాయ బిల్లులపై సమీక్ష చేపట్టిన పార్లమెంటరీ ప్యానెల్.. పలు కీలకాంశాలపై ముఖ్యమైన సవరణలను తెరపైకి తెచ్చింది. స్వలింగ సంపర్కం (సెక్షన్ 377, వివాహేతర సంబంధాలు (సెక్షన్ 497)లను మళ్లీ నేరాలుగా పరిగణించే అంశాన్ని పరిశీలించేలా ముసాయిదా నివేదికను రూపొందించింది. ఈ రెండు సెక్షన్లను గతంలో సుప్రీం కోర్టు కొట్టేసిన సంగతి విదితమే. బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ శుక్రవారం సమావేశం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు తెచ్చేంiదుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త చట్టంలో.. ఐపీసీలో సెక్షన్ 497ను రీ క్రిమినలైజ్ చేయాలని.. ఈ మేరకు ఇప్పుడున్న ఐపీసీకి సవరణ చేయాలని సదరు ప్యానెల్ ప్రతిపాదించింది. అంతేకాదు.. ప్రతిపాదిత సవరణలో లింగ-తటస్థ (gender-neutral ) నిబంధనను ప్రవేశపెట్టడం కూడా ఉంది. వివాహేతర సంబంధం నేరం కాదంటూ 2018 సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. ఓ ప్రవాస భారతీయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. వ్యభిచారం నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ‘‘మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లింది, అది రాజ్యాంగ విరుద్ధం’’ అని ప్రకటించింది. బ్రిటిష్ కాలం నాటి వ్యభిచార వ్యతిరేక చట్టం మగవారు మహిళలను తమ సొంత ఆస్తిగా పరిగణించేలా ఉంది, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేది’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కని, ఈ విషయంలో ఆమెకు షరతులు పెట్టలేమని స్పష్టం చేసింది. అయితే.... వివాహేతర సంబంధం నేరం కాకపోయినా, నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి వివాహాన్ని రద్దు చేసుకోవచ్చని వివరణ ఇచ్చింది. వివాహేతర సంబంధాన్ని సామాజిక తప్పుగా పరిగణించడాన్ని కొనసాగించాలని, వివాహ రద్దు లేదా విడాకులకు దానిని పరిగణనలోకి తీసుకోవచ్చని తెలిపింది. సెక్షన్ 497 ఏం చెప్పింది భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని 497వ సెక్షన్ వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొంది. ‘మరొకరి భార్య అని తెలిసి, ఆ భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగారం జరపడం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధానికి సంబంధించిన నేరం’ అని ఆ సెక్షన్ నిర్వచిస్తోంది. ఆ నేరానికి పురుషుడికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా.. లేదా రెండూ విధించవచ్చు. ఇలాంటి కేసుల్లో మహిళను శిక్షించడానికి వీల్లేదని సెక్షన్ 497 స్పష్టం చేస్తోంది. అయితే, ఈ చట్టం ప్రకారం వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను కాని, భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళనుకాని ప్రాసిక్యూట్ చేసే హక్కు భార్యకు లేదు. 2023లో సవరణ.. అయితే.. 2023లో సెక్షన్ 497 రద్దు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని మార్పులు చేసింది. సాయుధ దళాల సిబ్బందిలో వ్యభిచారాన్ని నేరంగానే పరిగణించవచ్చునని తీర్పునిచ్చింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మునుపటి తీర్పునకు సవరణ చేసింది. ఐపీసీ 377 సెక్షన్ కూడా.. భారత న్యాయసంహిత ముసాయిదా నివేదికలో.. ఐపీసీ 377 సెక్షన్ నేరంగా పరిగణించే అంశాన్ని పునరుద్ధరించడంపై కూడా స్టాండింగ్ కమిటీ ప్రతిపాదన చేసింది. 2018లో సుప్రీం కోర్టు 377 సెక్షన్ చెల్లుబాటు కాదంటూ సంచలన తీర్పు ఇచ్చిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2018)లో జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. * ఇద్దరు మేజర్ల మధ్య స్వలింగ సంపర్కం నేరంగా పేర్కొనే ఐపీసీ సెక్షన్ 377 చెల్లుబాటు కాదు. * ఇద్దరు మేజర్ల మధ్య ఇష్టపూర్వక స్వలింగ సంపర్కం తప్పు కాదు. * రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19, 21 ప్రకారం లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్ (ఎల్జీబీటీక్యూ)లకు తమకు ఇష్టమైన లైంగిక ధోరణులను అనుసరించే స్వేచ్ఛ ఉంది. 377 సెక్షన్ రద్దు తర్వాత.. ఆ తరహా నేరాల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో.. పురుషులు, మహిళలు, ట్రాన్స్‌పర్సన్‌లతో కూడిన అంగీకారరహిత లైంగిక కార్యకలాపాలను నేరంగా పరిగణించాలని పార్లమెంట్ ప్యానెల్ తాజాగా సిఫార్సు చేసింది. అలాగే పశుత్వ చర్యలను (అసహజ శృంగారం) కూడా నేరంగా పరిగణించాలని సిఫార్సు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
రాత్రికి రాత్రే వయసు తగ్గిపోయింది!
రాత్రికి రాత్రే వయసు ఏకంగా ఒకటి నుంచి రెండేళ్లు తగ్గిపోయింది. అదీ ఒకరిద్దరికీ కాదు. ఏకంగా 5 కోట్ల మందికి!. ఇదేం జంబలకిడి పంబ మాయ కాదు. కొత్తగా తీసుకొచ్చిన చట్టం మూలంగా అక్కడి ప్రజల వయసు అలా ఆటోమేటిక్‌గా తగ్గిపోవాల్సి వచ్చింది. ఇంతకీ ఏమా చట్టం? ఎవరా ప్రజలు?.. ఎందుకు మార్చాల్సి వచ్చింది తెలియాలంటే.. దక్షిణ కొరియా.. జనాభా దాదాపు ఐదున్నర కోట్ల దాకా ఉంటుంది. కానీ, వాళ్లను వయసెంత అని అడిగితే మాత్రం మూడు రకాల సమాధానాలు ఇస్తుంటారు. దాని వల్ల ఆ దేశంలో అన్నింటా గందరగోళమే!. అందుకు కారణం.. మూడు విధాలుగా వాళ్ల వయసును లెక్కించడం. ► సౌత్ కొరియాలో ఇప్పటివరకూ.. సంప్రదాయ పద్దతిలో వయసు లెక్కింపు విధానంతో పాటు కేలండర్ ఏజ్, ఇంటర్నేషనల్ ఏజ్ అనే మూడు రకాల పద్ధతులను వాడుతూ వచ్చారు. కొరియన్ సంప్రదాయం ప్రకారం.. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే వయసు లెక్కింపు మొదలవుతుంది. అలాగే.. జనవరి 1వ తేదీ నుంచి(కేలండర్ ఏజ్) ప్రకారం ఒక వయసు(అంటే ఒకవేళ బిడ్డ డిసెంబర్ 31వ తేదీన పుట్టినా కూడా.. ఆ మరుసటి రోజు నుంచి ఆ బిడ్డ వయసును రెండేళ్లుగా గుర్తిస్తారు) ఒక వయసు, ఇక ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌కు తగ్గట్లుగా అంటే అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి వయసు లెక్కింపు(డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా).. ఇలా మూడు రకాలుగా ఉంటూ వచ్చింది. ► ఉదాహరణకు ఒక వ్యక్తి 2003 జూన్ 30వ తేదీన పుట్టాడనుకోండి.. ఆ వ్యక్తికి 29 జూన్ 2023 నాటికి ఇంటర్నేషనల్ ఏజ్ బర్త్ ప్రకారం 19 ఏళ్లు, అదే కౌంటింగ్ ఏజ్ విధానంలో 20, కొరియన్ ఏజ్ విధానంలో 21 ఏళ్లు ఉండేది. దీనివల్ల చదువు మొదలు ఉద్యోగాల దాకా అన్నింటా చాలా ఏళ్లుగా గందరగోళం ఏర్పడుతూ వస్తోంది. పైగా ఈ తరహా విధానాల వల్ల ప్రభుత్వాలపై ఆర్థికంగా పెను భారం పడుతూ వచ్చింది ఇంతకాలం. ► దీనికి తెర దించేందుకు.. ఇక నుంచి అంతర్జాతీయ విధానాన్ని.. అంటే అన్ని దేశాల్లో ఎలా అనుసరిస్తారో అలా పుట్టిన తేదీ నుంచి(డేట్ ఆఫ్ బర్త్) విధానాన్ని అనుసరిస్తారు. ఇందుకోసం చేసిన చట్టం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. సో.. ఇప్పటి నుంచి పుట్టిన తేదీ ప్రకారమే అక్కడి ప్రజలు జీవనం కొనసాగించనున్నారు. ► దక్షిణ కొరియాకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక యూన్ సుక్ యోల్ సంస్కరణల వైపుగా అడుగులేయడం మొదలుపెట్టారు. సాంప్రదాయ వయస్సు-గణన పద్ధతులు వల్ల అనవసరమైన సామాజిక, ఆర్థిక వ్యయాలు ఏర్పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. ఇక నుంచి కొత్త చట్టం అమలు మూలంగా అన్ని జ్యుడీషియల్, అడ్మినిస్ట్రేటివ్ విషయాల్లో అంతర్జాతీయ వయసు లెక్కింపు విధానాన్నే అను సరిస్తారని, దీనివల్ల సామాజిక గందరగోళాలు, వివాదాలు తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ► ఈ చట్టాన్ని పోయిన ఏడాది డిసెంబర్ లోనే పార్లమెంట్ ఆమోదించింది. అలాగే పబ్లిక్ ఒపీనియన్లో భాగంగా సర్కారు నిర్ణయానికి ఏకంగా 86.2% దేశ ప్రజలు మద్దతు ప్రకటించారు. మిగతా సర్వేల్లోనూ.. ప్రతీ నలుగురిలో ముగ్గురు డేట్ ఆఫ్ బర్త్ వయసు గణన వైపే మొగ్గు చూపించారు. గతంలో చాలా దేశాలు సంప్రదాయ వయసు లెక్కింపు విధానాలను పాటించేవి. అందులో తూర్పు ఏషియా దేశాలు ప్రముఖంగా ఉండేవి. అయితే వీటిలో చాలావరకు వాటిని వదిలేసి.. గ్లోబల్ స్టాండర్డ్‌ను పాటిస్తూ వస్తున్నాయి. జపాన్ 1950లో, ఉత్తర కొరియా 1980 దాకా సంప్రదాయ వయసు లెక్కింపు విధానాలనే పాటిస్తూ ఉండేవి. ఇదీ చదవండి: డైనోసార్లు మనకు కాస్త దగ్గరే! -
యువత సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం
వెల్లింగ్టన్: ఆరోగ్యాన్ని హరించే పొగాకు వినియోగాన్ని అరికట్టడానికి న్యూజిలాండ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం కొత్తగా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం యువత ఇకపై సిగరెట్లు కొనడానికి వీల్లేదు. వారు సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం విధించారు. 2009 జనవరి 1న, ఆ తర్వాత జన్మించినవారంతా సిగరెట్లకు దూరంగా ఉండాలి. వారికి ఎవరైనా సిగరెట్లు విక్రయిస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. కొత్త చట్టం వల్ల సిగరెట్లు కొనేవారి సంఖ్య ప్రతిఏటా తగ్గిపోతుందని, తద్వారా దేశం పొగాకు రహితంగా మారుతుందని న్యూజిలాండ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలో సిగరెట్లు విక్రయించేందుకు అనుమతి ఉన్న రిటైలర్ల సంఖ్యను కొత్త చట్టం కింద 6,000 నుంచి 600కు కుదించింది. సిగరెట్లలో నికోటిన్ పరిమాణాన్ని తగ్గించింది. ఉపయోగించినవారిని భౌతికంగా అంతం చేసే సిగరెట్లను విక్రయించడానికి అనుమతించడంలో అర్థం లేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఆయేషా వెరాల్ చెప్పారు. ఇదీ చదవండి: అనంత శక్తిని ఒడిసిపట్టే... దారి దొరికింది! -
కొత్త సెజ్ చట్టంతో బహుళ ప్రయోజనాలు
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రతిపాదిత ప్రత్యేక ఆర్థిక జోన్ల (సెజ్) కొత్త చట్టం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ప్రత్యేక ఆర్థిక జోన్లకు సంబంధించి ప్రస్తుత చట్టం స్థానంలో తీసుకువస్తున్న కొత్త చట్టంతో వ్యవస్థలో అన్ని అనుమతులు, విధి విధానాలు, కార్యకలాపాలు సింగిల్ విండో కింద జరుగుతాయని, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక రంగం పురోగతికి కొత్త చట్టం దోహదపడుతుందని ఆయన అన్నారు. సెజ్‌లను నియంత్రించే ప్రస్తుత చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం మంగళవారం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్స్(డీఈఎస్‌హెచ్)లో రాష్ట్రాలను భాగస్వాములు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత సెజ్ యాక్ట్‌ను 2006లో తీసుకువచ్చారు. ఎగుమతుల పెరుగుదల, మౌలిక రంగం పురోగతి, ఉపాధి కల్పన ఈ చట్టం ప్రధాన లక్ష్యం. అయితే కనీస ప్రత్యామ్నాయ పన్ను విధింపు, పన్ను ప్రోత్సాహకాల తొలగింపు వంటి చర్యల తర్వాత ఈ జోన్ల ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. కొత్త చట్టంతో తిరిగి సెస్‌లకు బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని, దేశాభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తాయని సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. సెజ్ 2.0 ముసాయిదా యాక్ట్ తయారీ పక్రియలో ఉందని, వచ్చే కొద్ది నెలల్లో ప్రస్తుత సెజ్ యాక్ట్ స్థాయిలో ఇది అమల్లోకి వచ్చే చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్ ఎగుమతుల్లో దాదాపు 20 శాతం సెజ్‌ల వాటా కావడం గమనార్హం. -
చైనా చట్టం... దేని కోసం?
వారం రోజుల క్రితం... గత శనివారం చైనా చేసిన కొత్త చట్టం అది. ఈ ఏడాది మార్చిలో ప్రతిపాదించి, ఏడు నెలల్లో ఆమోదమే పొందిన ఆ సరిహద్దు చట్టం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీజింగ్ ‘సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రత సమున్నతం. వాటిని ఉల్లంఘించడానికి వీల్లేదు’ అని 62 క్లాజులతో కూడిన ఈ 7 అధ్యాయాల కొత్త ‘భూ సరిహద్దు చట్టం’ పేర్కొంటోంది. భారత్ కోసమే ఈ చట్టం చేసినట్టు పైకి కనిపించకపోయినా, దీని పర్యవసానాలపై అనేక అనుమానాలు రేగుతున్నాయి. అక్టోబర్ 23న చైనా జాతీయ చట్టసభ ‘నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్’ అంగీకరించిన ఈ చట్టానికి, ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అదే రోజు ఆమోదముద్ర వేశారు. ఆ చట్టం పూర్తిగా ‘ఏకపక్ష చర్య’ అనీ, ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సరిహద్దుల నిర్వహణలో ఉన్న ద్వైపాక్షిక ఏర్పాట్లపై ఇది దుష్ప్రభావం చూపుతుందనీ భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చైనా మాత్రం ‘ఇప్పుడున్న సరిహద్దు ఒప్పందాల అమలులో ఈ చట్టం ప్రభావమేమీ ఉండదు’ అంటూ కొట్టిపారేస్తోంది. ఇప్పటికే 17 నెలలుగా రెండు దేశాల సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభన నెలకొంది. కొత్త చట్టం పరిష్కారానికి మరిన్ని అడ్డంకులు సృష్టిస్తుందన్నది పెద్ద భయం. భారత్‌తో సరిహద్దు వివాదాల పరిష్కారంలో చైనా ఇటీవల అనుసరిస్తున్న మొండి వైఖరి ఈ భయాలకు మరింత ఆజ్యం పోస్తోంది. భారత్ సహా మొత్తం 14 దేశాలతో... 22,457 కి.మీ. మేర చైనాకు భూ సరిహద్దు ఉంది. ఆ దేశానికి మంగోలియా, రష్యాల తర్వాత మూడో సుదీర్ఘమైన సరిహద్దు భారత్‌తోనే నెలకొంది. ఆ రెండు దేశాలతో చైనాకు సరిహద్దు సమస్యలేమీ లేవు. భారత్ తర్వాత చైనాకు భూ సరిహద్దు తగాదాలున్నది 477 కి.మీ. మేర హద్దులు పంచుకుంటున్న భూటాన్‌తోనే. సరిహద్దు చర్చలను వేగిరం చేయడానికి భూటాన్ ఈ నెలలోనే చైనాతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అదీ మనకు కొంత దెబ్బే. ఇక, మిగిలిందల్లా మనమే. ‘వాస్తవాధీన రేఖ’ (ఎల్ఏసీ) వెంట 3,488 కిలోమీటర్ల పొడవునా చైనాతో భారత్‌కు సరిహద్దు వివాదం ఉంది. తూర్పు లద్దాఖ్‌లో గత ఏడాది మే 5 నాటి ఘటనలు, వెంటనే జూన్ 15న గాల్వన్ లోయ పరిణామాలతో పీటముడి బిగిసింది. భారత భూభాగంపై చైనా తిష్ఠ వేసింది. పరిష్కారానికి సైనిక, దౌత్యస్థాయి చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఏదీ తేలకుండానే చైనా కొత్త చట్టం తెచ్చింది. భారత, చైనాల సరిహద్దు సమస్య సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో ఇప్పటికి 20 విడతలుగా చర్చలు జరిగాయి. తుది పరిష్కారం మాటెలా ఉన్నా, ముందుగా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి కొనసాగించడం అవసరమని ఇరుపక్షాలూ అంగీకరించాయి. కానీ, ఇప్పుడీ చట్టం కింద చైనా తప్పుకు తిరుగుతుంది. వివాదాస్పద ప్రాంతాలను సైతం ఈ చట్టం కింద చైనా తన భూభాగమనే అంటుంది. ఆ మాట మనం అంగీకరించం. 1963 నాటి ఒప్పందం కింద అక్సాయ్‌చిన్ ప్రాంతంలోని షక్స్గమ్ లోయను సైతం చైనాకు పాక్ అప్పగించింది. కానీ, అది చట్ట విరుద్దమనీ, అక్సాయ్‌చిన్ సహా జమ్మూ కశ్మీర్ మొత్తం మనదేననీ భారత్ ప్రకటించింది. ఇప్పుడు అదీ చిక్కు. హోమ్ శాఖ, రక్షణ శాఖల్లో సరిహద్దుల నిర్వహణ బాధ్యత ఎవరిదనే స్పష్టత మన దగ్గర కొరవడుతుంటే, చైనా ఈ కొత్త చట్టంతో తమ హద్దుల బాధ్యత పూర్తిగా ఆర్మీ మీద పెడుతుంది. దీంతో, చర్చలు క్లిష్టమైపోతాయి. వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇక చైనా సైనిక ఉపసంహరణ కష్టమే. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే ఈ సరికొత్త ‘చైనా భూ సరిహద్దు చట్టం’ ఆ దేశ యుద్ధోన్మాదానికీ, ఆక్రమణవాదానికీ సంకేతమని విశ్లేషకుల విమర్శ. ఆ మాటకొస్తే, ఎల్ఏసీ వెంట అన్ని సెక్టార్ల ప్రాంతాల్లోనూ చైనా 2016 నుంచి పటిష్ఠమైన సరిహద్దు రక్షణ గ్రామాలను నిర్మిస్తోంది. ఈ ఏడాది జూలైలో అరుణాచల్ ప్రదేశ్‌కు దగ్గరలో టిబెట్‌లో కట్టిన ఓ గ్రామాన్ని షీ జిన్‌పింగ్ స్వయంగా సందర్శించారు. అసలీ పౌర ఆవాసాల నిర్మాణం, పౌరుల ఉనికి చైనా భారీ వ్యూహం. ఈ సరిహద్దు గ్రామాలను పౌర, సైనిక అవసరాలు రెంటికీ చైనా వాడుకో నుంది. ఈ గ్రామాలు ఆర్మీకి గస్తీ స్థానాలుగా ఉపకరిస్తాయి. మరోపక్క దెమ్చోక్ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి ‘కొత్త పౌరులు’ ఎల్ఏసీ వెంట భారత భూభాగంలో గుడారాలు వేసుకున్నారు. చైనా జనాభా ఇలా మన ప్రాంతాల్లోకి ఎగబాకితే కష్టమే. భవిష్యత్తులో సరిహద్దుల గురించి భారత్ చర్చిం చడం మొదలుపెడితే, ‘ఆ ప్రాంతం మాదే. మా జనాభా అక్కడున్నార’ని చైనా వాదించే ప్రమాదం ఉంది. అంటే, సరిహద్దు వెంట వివాదాస్పద భూభాగాల్లో శాశ్వత వసతి సౌకర్యాలు, నియంత్రణ వ్యవస్థలు నిర్మించి, ఆ భూభాగాలు తమవేనంటూ చైనా చట్టబద్ధం చేయనుందన్న మాట. భారత్, భూటాన్‌ల విషయంలో సరిహద్దుల వెంట చట్టబద్ధంగా బలగాలను చైనా వాడే వీలు కల్పిస్తోందీ చట్టం. అలా ఈ చట్టంతో ఇన్నాళ్ళ భారత, చైనా సరిహద్దు చర్చల వ్యవస్థకు దాదాపు తెరపడినట్టే. చైనా మరింత చొచ్చుకురాకుండా అడ్డుకోవడానికి ఎల్ఏసీ వెంట దీర్ఘకాలం పాటు, భారీయెత్తున సైనిక బలగాలను భారత్ మోహరించాల్సి వస్తుంది. ఇది మరింత శ్రమ, ఖర్చు. అలాగే, సరిహద్దు సమస్యలతో ద్వైపాక్షిక సంబంధాలను ముడిపెడుతున్న భారత్ వాదనను ఈ కొత్త చట్టంతో చైనా తోసిపుచ్చినట్టయింది. ఇప్పుడిక జగమొండి చైనాతో తాత్కాలిక ఒప్పందం కుదుర్చు కొనే ఆచరణాత్మక వ్యూహాలను భారత్ ఆలోచించక తప్పదు! -
Abortion Rights: టెక్సాస్ కొత్త అబార్షన్ చట్టానికి మహిళల నిరసన సెగ..!!
అబార్షన్ (గర్భస్రావం) పై ఆంక్షలను విధించడాన్ని నిరసిస్తూ అమెరికా దేశవ్యాప్తంగా వేలాది మహిళలు రోడ్డెక్కారు. చట్టప్రకారం తమకు దక్కవలసిన హక్కులను కొనసాగించాలని టెక్సాస్ నగర వీధుల్లో ప్లకార్డులతో నినదిస్తున్నారు. దీంతో 50 రాష్ట్రల్లో మహిళల నిరసనల సెగలు మిన్నంటాయి. గత నెలలో టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో గవర్నర్ గ్రెగ్ అబాట్ సంతకం చేసిన ‘హార్ట్ బీట్’ చట్టాన్ని వందలాది మంది వ్యతిరేకిస్తున్నారు. అమల్లోకొచ్చిన ఈ చట్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏమిటీ చట్టం? టెక్సస్ కొత్త చట్టం ప్రకారం.. గర్భస్థ పిండం గుండె కొట్టుకోవడం ప్రారంభమైతే అబార్షన్ చేయించుకోవడం నిషేదం. సాధారణంగా గర్భంలో 6 వారాలకు పిండం గుండె కొట్టుకోవడం మొదలౌతుంది (చాలా మంది మహిళలు తాము గర్భవతులని తెలియక ముందే 85 నుంచి 95 శాతం ముందుగానే అబార్షన్లు అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు). అత్యచార బాధితులు, అక్రమ సంబంధం ద్వారా గర్భవతులైన వారికి కూడా ఈ చట్టం నుంచి ఎటువంటి మినహాయింపు లేదు. అంతేకాకుండా ఈ నిషేధాన్ని అతిక్రమించి అబార్షన్‌కు పాల్పడినట్లు రుజువుచేసిన వారికి అక్కడి ప్రభుత్వం పది వేల డాలర్లు రివార్డు కూడా ప్రకటించింది. ఇది అత్యంత నిర్భందమైనదని, ఈ చట్లాన్ని రద్దు చేయాలంటూ అక్కడి మహిళలు ఆందోళనలు చేపట్టారు. మిసిసిసీలో ఈ చట్టముంది ఐతే వాషింగ్టన్ నిరసనకారులు రెండు రోజులు ముందుగానే యూఎస్ సుప్రీంకోర్టులో ఈ చట్టం రూపొందకుండా పిటిషన్ వేశారు. 1973లో రో వర్సెస్ వేడ్ మిసిసిసీ కేసులో ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ ఈ చట్టం రూపొందకుండా అడ్గుకునేందుకు ప్రయత్నించారు. ఈ మిసిసిసీ కేసులో 15 వారాల తరువాత మహిళలు అబార్షన్ చేయించుకోకూడదనే నిబంధన ఉంది. సెప్టెంబర్ 1 నుంచి.. ఒక వేళ న్యాయస్థానం ముందుగానే ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలుచేయడానికి రాజ్యంగ బద్ధంగా రాష్ట్రాలకు సర్వహక్కులు ఇవ్వబడతాయి. కాగా ఈ చట్టానికి వ్యతిరేకంగా వచ్చిన పిటీషన్లన్నింటినీ న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో సెప్టెంబర్ 1 నుంచి ఈ చట్టం అమల్లోకొచ్చింది. ఐతే అనతి కాలంలోనే ఈ చట్టం వివాదాస్పదంగా మారింది. రెండోసారి.. కాగా 2017 మార్చిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు మొదటి సారి ర్యాలీ చేపట్టారు. అదే స్థాయిలో ఇప్పుడు రెండో సారి నిరసనల గళం వినబడుతోందని ఉమెన్ మార్చ్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ రాచెల్ ఓ లియరీ కార్మొనా అన్నారు. చదవండి: కాలిఫోర్నియా బీచ్‌లో ముడిచమురు లీక్.. పర్యావరణానికి తీవ్ర నష్టం! -
మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం
సాక్షి, న్యూఢిల్లీ: మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం నూతన చట్టాన్ని తీసుకురానుంది. ఈ బిల్లుపై ముసాయిదా విడుదల చేసిన కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ భాగస్వాముల నుంచి సూచనలు సలహాలు కోరింది. 2018లో ముసాయిదా బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో ప్రవేశపెట్టలేదు. ఆ సమయంలో లేవనెత్తిన ఆందోళనలకు నూతన ముసాయిదాలో పరిష్కారం చూపారని నిపుణులు చెబుతున్నారు. భాగస్వాముల నుంచి సూచనలు సలహాలు వచ్చిన అనంతరం కేంద్ర మంత్రివర్గానికి ఆపై పార్లమెంటులోనూ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. మానవ అక్రమ రవాణా చేసే వారికి పదేళ్ల వరకూ జైలు శిక్ష పడేలా కేంద్రం ఈ చట్టాన్ని రూపొందించింది. బాధితులకు పునరావాస చర్యలు ఏ విధంగా తీసుకోవాలో కూడా చట్టం స్పష్టత ఇచ్చింది. చట్టం ప్రకారం నిందితులను దర్యాప్తు చేయడానికిప్రత్యేక ఏజెన్సీనికేంద్రం ఏర్పాటు చేయాలని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రతి జిల్లాలోనూ సెషన్స్ కోర్టులను ప్రత్యేక కోర్టుగా పరిగణించాలి. గెజిటెడ్ అధికారి స్థాయి పోలీసు అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలి. చట్టం అమలుకు ప్రభుత్వాలు యాంటీ ట్రాఫికింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలి. దీన్ని బాధితుల పునరావాసానికి వినియోగించాలి. బాధితులు వేరే జిల్లా,రాష్ట్రానికి చెందిన వారైతే మెరుగైన భద్రత కోసం జిల్లా కమిటీ వారిని అవసరమైతే సొంత ప్రాంతానికి పంపొచ్చు. బాధితులు ఇతర దేశానికి చెందిన వారైతే ఆ సమయంలో ఉన్న చట్టాలు అనుసరించి రాష్ట్ర కమిటీ వారిని వారి దేశానికి పంపొచ్చు. చట్టం అమలుకు సంబంధించి చట్టానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ ద్వారా నిబంధనలు పేర్కొనాలి. అనంతరం రాష్ట్రంలోని ఉభయసభల్లోనూ ఆమోదం పొందాలి. డిస్ట్రిక్ట్ యాంటీ ట్రాఫికింగ్ కమిటీ చైర్పర్సన్: జిల్లా కలెక్టర్ సభ్యుడు/సభ్యురాలు: ముగ్గురిలో ఇద్దరు సామాజిక కార్యకర్తలు. వీరిలో మహిళ సభ్యురాలిని జిల్లా న్యాయమూర్తి నియమించాలి. జిల్లా న్యాయ సేవల అథారిటీ నుంచి ఒకరిని జిల్లా న్యాయమూర్తి నామినేట్ చేయాలి. సామాజిక న్యాయ లేదా మహిళ శిశు అభివృద్ధి విభాగం నుంచి జిల్లా అధికారి సభ్య కార్యదర్శిగా ఉంటారు. ప్రతి నెలా కమిటీ సమావేశం కావాలి. స్టేట్ యాంటీ ట్రాఫికింగ్ కమిటీ చైర్పర్సన్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులు: ఎనిమిది మంది. మహిళ, శిశు అభివృద్ధి, హోం, కార్మిక, ఆరోగ్య విభాగాల కార్యదర్శులు డీజీపీ, రాష్ట్ర న్యాయసేవల అథారిటీ కార్యదర్శిలతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించిన ఇద్దరు సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. సెంట్రల్ యాంటీ ట్రాఫికింగ్ అడ్వైజరీ బోర్డు మహిళ, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ బోర్డు ఏర్పాటు చేయాలి. చట్టం అమలును ఈ బోర్డు పర్యవేక్షించాలి. రక్షణ గృహాలు: బాధితులకు తక్షణ సహాయం అందించడానికి ప్రభుత్వం నేరుగా లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా రక్షణ గృహాలు ఏర్పాటు చేయాలి. బాధితులకు నివాసం, ఆహారం, దుస్తులు, కౌన్సిలింగ్, ఆరోగ్య రక్షణ ఈ గృహాల్లో కల్పించాలి. ప్రత్యేక గృహాలు: దీర్ఘకాలంగా బాధితులకు పునరావాసం కల్పించడానికి జిల్లాకి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రత్యేక గృహాలు వీరి కోసం ఏర్పాటు చేయాలి. రక్షణ, ప్రత్యేక గృహాలను చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలి. బాధితులకు ప్రత్యేంగా లైంగిక దాడులకు గురైన మహిళలకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకురావాలి. నేరం.. శిక్ష ► బాధితులకు ఆశ్రయంకల్పించే విషయంలో రక్షణ, ప్రత్యేక గృహాల ఇన్‌ఛార్జి నిబంధనలు ఉల్లంఘిస్తే ఏడాదిపాటు జైలు, రూ.లక్ష తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. ► చట్టం ప్రకారం బాధితులు, సాక్షుల పేర్లు, ఫొటోలు ఏ మాధ్యమం ద్వారానైనా ప్రచురించిన ప్రసారం చేసినా చర్యలు తీసుకుంటారు. బాధ్యులకు ఆరు నెలల వరకూ జైలు లేదా రూ.లక్షల వరకు జరిమానా లేదా రెండింటిని విధిస్తారు. ► అక్రమ రవాణా చేయడానికి మాదకద్రవ్యాలు, మద్యం, సైకోట్రోపిక్ పదార్ధాలను నిందితులు వినియోగించినట్లు రుజువైతే పదేళ్లు వరకూ జైలు, రూ.లక్ష తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. రసాయనాలు, హర్మోన్ల ఇంజక్షన్లు నిందితులు ఉపయోగించినట్లు తేలితే పదేళ్ల వరకూ జైలు, రూ.లక్ష తక్కువకాకుండా జరిమానా విధిస్తారు. ► ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లైతే వారికి మూడు నెలల వరకూ జైలు, రూ.20 వేల వరకూ జరిమానా లేదారెండు విధించొచ్చు. ► నిందితులు బెయిల్ లేదా సొంత పూచీకత్తుపై విడుదల అవుతుంటే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాన్ని అడ్డుకోవచ్చు. ఈ సమయంలో బెయిలు ఇస్తే నిందితుడు ఎలాంటి నేరానికి పాల్పడే అవకాశం లేదని కోర్టు నమ్మితే బెయిలు ఇవ్వొచ్చు. -
ఖతర్‌లో కనీస వేతన పరిమితి పెంపు
మోర్తాడ్(బాల్కొండ): విదేశీ వలస కార్మికుల కష్టాలను గుర్తించిన ఖతర్ ప్రభుత్వం కనీస వేతన పరిమితిని పెంచుతూ కొత్త చట్టం రూపొందిం చింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ప్రతి కంపెనీ వలస కార్మికులకు నెలకు వెయ్యి రియాళ్ల కనీస వేతనం (మన కరెన్సీలో రూ.20 వేలు) చెల్లించడంతో పాటు భోజనం, వసతి కోసం మరో ఎనిమిది వందల రియాళ్లు ఇవ్వాలని ఖతర్ ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కార్మిక శాఖ జారీ చేసింది. ప్రస్తుతం ఖతర్‌లో ఉపాధి పొందుతున్న విదేశీ వలస కార్మికులకు నెలకు 500 రియాళ్ల నుంచి 700 రియాళ్ల వరకు వేతనం చెలిస్తున్నారు. కొన్ని కంపెనీలు తమ క్యాంపులలో కార్మికులకు వసతి కల్పిస్తుండగా మరి కొన్ని కంపెనీలు మాత్రం కార్మికుల వసతి, ఇతర సదుపాయాల గురించి పట్టించుకోవడంలేదు. కాగా, వలస కార్మికులకు తక్కువ వేతనం చెల్లించడం వల్ల వారి శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదని భావించిన ఖతర్ ప్రభుత్వం కనీస వేతన పరిమితిని పెంచింది. 2020 ఆగస్టులోనే కనీస వేతన పరిమితి పెంచిన ఖతర్ ప్రభుత్వం, ఇందుకు సంబంధించిన చట్టాన్ని ఈనెల 20 నుంచి అమలులోకి తీసుకురానుంది. ఈ చట్టం ప్రకారం వలస కార్మికులకు ఆయా కంపెనీలు వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తే ప్రతి నెలా వెయ్యి రియాళ్ల కనీస వేతనం చెల్లించాలి. ఒక వేళ వసతి, భోజన సదుపాయాలను కల్పించకపోతే అదనంగా 800 రియాళ్లను చెల్లించాలని ఖతర్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఖతర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే కొన్ని కంపెనీలు అమలులోకి తీసుకువచ్చాయి. కాగా ఇప్పటి వరకు కనీస వేతన పరిమితిని అమలు చేయని కంపెనీలు ఈనెల 20 నుంచి కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. కనీస వేతన పరిమితిని పెంచుతూ ఖతర్ ప్రభుత్వం చట్టం రూపొందించడం వల్ల వలస కార్మికులకు ఎంతో మేలు కలుగుతుందని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. చదవండి: పది నెలలుగా ఇంటి కూరగాయలే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ మళ్లీ వచ్చేస్తోంది.. -
ఎట్టకేలకు కాలుష్యంపై చట్టం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈమధ్య కాలుష్యం గురించి ప్రస్తావిస్తూ భారత్‌ను రోత దేశమని వ్యాఖ్యానించిందుకు కొందరు నొచ్చుకుని వుండొచ్చుగానీ మన దేశంలో కాలుష్యం తీవ్రత చాలా చాలా ఎక్కువగా వుంది. గత బుధవారం విడుదలైన 2019కి సంబంధించిన వాయుకాలుష్యం గణాంకాలు గుబులు పుట్టిస్తాయి. నిరుడు కేవలం వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 4,76,000మంది నెలలోపు వయసున్న పిల్లలు మరణిస్తే అందులో 1,16,000మంది భారత్‌కు చెందినవారని ఆ నివేదిక తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో నైజీరియా(67,900మంది), పాకిస్తాన్ (56,500మంది), ఇథియోపియా(22,900మంది) వున్నాయి. ఈ నేపథ్యంలో వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు సమగ్రమైన చట్టం తీసుకురాబోతున్నామని సోమవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఇచ్చిన హామీ హర్షించదగ్గది. ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టం కాపీని నాలుగు రోజుల్లో సర్వోన్నత న్యాయస్థానానికి అందజేస్తామని కూడా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హామీ ఇచ్చారు. వాస్తవానికి ఢిల్లీ పరిసరాల్లో వున్న రాష్ట్రాలు వాయు కాలుష్య నివారణకు, ముఖ్యంగా అక్కడ పంట వ్యర్థాలను రైతులు తగులబెట్టకుండా నివారించేందుకు తీసుకుంటున్న చర్యల్ని పర్యవేక్షించి నివేదిక ఇచ్చేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలో కమిటీని నియమిస్తూ ఈనెల 16న ఉత్తర్వులిచ్చింది. కేంద్రం ఇచ్చిన తాజా హామీతో ఆ కమిటీని ప్రస్తుతానికి నిలిపివేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. కాలుష్యం కార ణంగా పౌరుల ప్రాణాలకు కలుగుతున్న ముప్పు అసాధారణమైనది. వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం గాలిలో వుండే అతి సూక్ష్మ ధూళి కణాలు(పీఎం2.5) ప్రతి ఘనపు మీటరులోనూ 25 మైక్రోగ్రాములు మించకూడదు. దీని ప్రాతిపదికగా వాయు నాణ్యత సూచీ ఏ ప్రాంతంలో ఎలా వుందన్నది లెక్కేస్తారు. సాధారణంగా ఈ సూచీలో ఏ ప్రాంతమైనా 300 పాయింట్లు మించిందంటే అది ‘రెడ్ జోన్’లో వున్నట్టు లెక్క. మన దేశ రాజధాని నగరం ఈ పరిమితిని చాన్నాళ్లక్రితమే దాటింది. అంటే అక్కడి వాతావరణంలో పీఎం 2.5 కణాలు ఒక ఘనపు మీటర్లో 300 మైక్రో గ్రాములను మించిపోయాయి. వుండాల్సినదానికన్నా ఇది 12 రెట్లు ఎక్కువ! వాయు కాలుష్యం వల్ల మొత్తం 87 రకాల వ్యాధులబారిన పడే అవకాశం వున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో హెచ్చరించింది. గర్భిణులు కలుషిత వాయువు పీల్చడంవల్ల గర్భంలో వుండే పిండంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నెలలు నిండకుండానే శిశు జననం, ఆ శిశువులు తక్కువ బరువుండటం, వారి ఊపిరితిత్తులు బలంగా లేకపోవడం వంటి సమస్యలు తప్పవు. ఇక ఇంచు మించు అన్ని వయసులవారూ శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియా, గుండెపోటు, కేన్సర్, మధు మేహం, రక్తంలో గడ్డలు ఏర్పడటం తదితర వ్యాధులబారిన పడే ప్రమాదం వుంటుంది. తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ వెలువరించిన నివేదిక ప్రకారం వాయు కాలుష్యానికీ, కరోనా మరణాల తీవ్రతకూ సంబంధం వున్నదని వెల్లడైంది. వాతావరణంలో కేవలం ఒక మైక్రో గ్రాము కాలుష్యం పెరిగితే కరోనా వ్యాధిగ్రస్తుల్లో మరణాల సంఖ్య పెరుగుతుందని ఒక అంచనా. కరోనా వ్యాధివల్ల దెబ్బతినేది ప్రధానంగా ఊపిరితిత్తులు గనుక వాయు కాలుష్యంతో అవి మరింత పాడయ్యే ప్రమాదం వుంటుంది. వాయు కాలుష్యం వల్ల మన దేశంలో సగటు ఆయుఃప్రమాణం 5.2 ఏళ్లు తగ్గుతోందని షికాగో విశ్వవిద్యాలయ ఇంధన విధాన సంస్థ (ఎపిక్) నివేదిక అంచనా వేసింది. ఢిల్లీలో ఇప్పుడున్న కాలుష్య స్థాయినిబట్టి చూస్తే ఈ ఆయుర్దాయం 9.4 ఏళ్లు తగ్గుతుందని ఆ నివేదిక తెలిపింది. ఆ తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్ వుంది. అక్కడ 8.6 ఏళ్ల ఆయుర్దాయం తగ్గుతోంది. మొత్తంమీద ఉత్తరాది రాష్ట్రాల్లోని 25 కోట్లమంది ఈ వాయు కాలుష్యం కారణంగా వివిధ వ్యాధుల బారినపడి తమ ఆయుర్దాయంకన్నా ఎనిమిదేళ్లముందే జీవితం నుంచి నిష్క్రమిస్తున్నారు. మన దేశ జనాభాలో 84 శాతంమంది వాయు కాలుష్యం అధికంగా వుండే ప్రాంతా ల్లోనే జీవనం సాగిస్తున్నా రని, వారిలో సగంమంది కాలుష్య సంబంధ వ్యాధులబారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండేళ్లక్రితం తెలిపింది. ఈ వ్యాధులు మన ఆర్థిక వ్యవస్థను కూడా తీవ్రంగా కుంగదీస్తున్నాయి. జనం తమ సంపాదనలో అధిక భాగం ఆరోగ్యంపై ఖర్చుపెట్టాల్సివస్తోంది. అంతేగాక శ్రమించే సామర్థ్యాన్ని ఆ వ్యాధులు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. పర్యవసానంగా ఉత్పాదకత ఆమేరకు తగ్గు తోంది. ప్రపంచబ్యాంకు ప్రకారం మన జీడీపీలో 8.5 శాతాన్ని వాయు కాలుష్యం మింగేస్తోంది. కనుకనే వాయు కాలుష్యంపై సమగ్రమైన చట్టం తీసుకురావడం అత్యవసరం. అయితే ఢిల్లీ పరిసర ప్రాంతాల వాయు కాలుష్యానికి కేవలం పంట వ్యర్థాలను తగలబెట్టడం ఒక్కటే కారణం కాదు. అది దాదాపు 19 శాతం కాలుష్యానికి కారణమవుతోంది. రహదార్లపై లేచే ధూళి కణాల వాటా కాలుష్యంలో 36–66 శాతం మధ్య వుంటున్నదని గణాంకాలు వివరిస్తున్నాయి. కనుక కేవలం పంట వ్యర్థాలను తగలబెట్టడం ఒక్కటే మొత్తం కాలుష్యానికి కారణమని భావించరాదు. పంట వ్యర్థాలను తగలబెట్టే అలవాటు రైతులతో మాన్పించడానికి సుప్రీంకోర్టు రెండేళ్లక్రితం కొన్ని సూచనలు చేసింది. వారికి ప్రోత్సాహకాలివ్వాలని సూచించింది. కానీ పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లు ఆ పని చేసిన దాఖలా లేదు. కేసులతో, చట్టాలతో రైతుల్ని బెదిరించి దారికి తీసుకురావడం అసాధ్యం. రైతులు సరే... వాహనకాలుష్యం, పారిశ్రామిక కాలుష్యం వగైరాల విషయంలో ఏం చేస్తారు? ముందుచూపులేని అభివృద్ధి విధానాలు మనల్ని ఈ ప్రమాదపుటంచులకు నెట్టాయి. పరిశ్రమలు, వాహనాలు వదిలే ఉద్గారాల్లోని నైట్రేట్లు, సల్ఫేట్లు, కాడ్మియం, పాదరసంవంటివి మనిషి ఊపిరి తిత్తుల్లోకి జొరబడి చడీచప్పుడు లేకుండా ప్రాణాలు తోడేస్తున్నాయి. కాలుష్య నివారణ చట్టం ముసాయిదాను ఈ సమస్యలన్నిటినీ దృష్టిలో వుంచుకొని రూపొందించాలి. -
మూక హత్యల నిరోధంపై నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న మూక హత్యల నిరోధానికి నూతన చట్టం తీసుకువచ్చే ప్రతిపాదనపై హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గుబ నేతృత్వంలోని కమిటీ మంత్రుల బృందానికి నివేదిక సమర్పించింది. సోషల్ మీడియా వేదికలపై విద్వేష ప్రచారం, వదంతులు వ్యాప్తి చేయడాన్ని నివారించేందుకూ ఈ కమిటీ పలు మార్గదర్శకాలు జారీచేసింది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలోని మంత్రుల బృందం కమిటీ సూచించిన మార్గదర్శకాలను పరిశీలిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా ఈ కమిటీ పలు సోషల్ మీడియా వేదికల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి, అభ్యంతరకర కంటెంట్‌పై ప్రజలు ఫిర్యాదులు నమోదు చేసేందుకు ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. కంటెంట్ పర్యవేక్షణ, సైబర్ పోలీసింగ్‌కు ప్రత్యేక చర్యలు అవసరమని స్పష్టం చేసింది. మూక హత్యలను నివారించేందుకు నూతన చట్టం తీసుకువచ్చే ప్రతిపాదన పరిశీలించాలని సుప్రీం కోర్టు ఇటీవల పార్లమెంట్‌ను కోరిన క్రమంలో ఈ అంశంపై మంత్రుల బృందం, కార్యదర్శుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ మార్గదర్శకాలను మంత్రుల బృందం పరిశీలించి తుదినిర్ణయం కోసం ప్రదాని నరేంద్ర మోదీకి తమ సిఫార్సులను నివేదిస్తుందని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
నీరవ్ మోదీ, విజయ్ మాల్యాకు గట్టి షాక్?
న్యూఢిల్లీ : కోట్లకు కోట్లు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి లేదా బ్యాంకులను మోసం చేసి విదేశాలకు చెక్కేస్తున్న రుణ ఎగవేతదారులకు ప్రభుత్వం షాకివ్వబోతుంది. ఆర్థిక నేరగాళ్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చట్టం తీసుకొస్తోంది. ''ది ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్లు'' పేరుతో దీన్ని త్వరలోనే ప్రవేశపెట్టబోతుంది. ఈ చట్టం ద్వారా నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వారు బ్యాంకులకు భారీగా కన్నం వేసి విదేశాలకు పారిపోతే, వారి ఆస్తులను అమ్మే చట్టం. స్పెషల్ కోర్టు ద్వారా అన్ని బకాయిలను వెంటనే రికవరీ చేసుకునేలా ఈ బిల్లు సహకరించనుంది. విదేశాలకు పారిపోయినప్పటికీ, వారు ఏం దాచలేరని కచ్చితంగా ఇక్కడ అన్ని ఆస్తులను విక్రయించే అధికారం దక్కించుకునేలా ఈ బిల్లు తోడ్పడనుంది. గత సెప్టెంబర్‌లోనే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ డ్రాఫ్ట్‌ను ఆమోదించింది. పీఎన్బీ స్కాం నేపథ్యంలో ఈ బిల్లును పాస్ చేయాలని మోదీ ప్రభుత్వం చూస్తోంది. మార్చి 6 నుంచి జరుగబోతున్న తదుపరి బడ్జెట్ సెషన్లలో దీన్ని ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్కసారి ఈ బిల్లు ఆమోదిస్తే, దర్యాప్తు సంస్థ విదేశాలకు పారిపోయిన రుణ ఎగవేతదారులు, బ్యాంకులకు మోసాలకు పాల్పడిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను ఎలాంటి దాడులు చేయకుండానే స్వాధీనం చేసుకోవచ్చు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కూడా ఈ చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది. అసాధారణ లావాదేవీలను గుర్తించి, అథారిటీలకు అలర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా బ్యాంకింగ్ రెగ్యులేటర్స్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌దే. ఎగవేత కంపెనీల వ్యాపార నమూనాల మార్పులపై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఎప్పడికప్పుడు దృష్టిసారించాలి. అంతేకాక ఎగవేత కంపెనీ ప్రమోటర్లపై చర్యలు మాత్రమే కాక, వారి విదేశీ ప్రయాణాలను నిలువరించేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ, విదేశాలకు పారిపోవడంతో ప్రభుత్వం అలాంటి వ్యక్తులపై గట్టి చర్యలు తీసుకునేందుకు ఈ బిల్లును తీసుకొస్తోంది. విజయ్ మాల్యా కూడా ఇలానే రూ.9000 కోట్లను బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేశాడు. అయితే ఎవరు ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్ : సంబంధిత నేరం కింద ఏ వ్యక్తికైనా అరెస్ట్ వారెంట్ జారీ అయి, అతను క్రిమినల్ ప్రొసిక్యూషన్ తప్పించుకోవడానికి భారత్‌ను వీడి వెళ్లితే అతణ్ని ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్‌గా గుర్తిస్తారు. ఈ డ్రాఫ్ట్ బిల్లులో పేర్కొన్న నేరాల్లో ఉద్దేశ్యపూర్వకంగా రుణాన్ని ఎగవేతదారులు, మోసం, ఫోర్జరీ, ఎలక్ట్రానిక్ రికార్డుల తప్పుడు డాక్యుమెంట్లు, సుంకాలు ఎగవేత, డిపాజిట్లు తిరిగి చెల్లించనని ఉన్నాయి. -
వింత : ఫోన్లు చూస్తూ నడిస్తే జరిమానా
హవాయి: హువాయిలోని హోనోలులు నగరంలో నడిచేప్పుడు ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు చూడటంపై నిషేధం విధించారు. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. బుధవారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఎవరైనా నడిచేప్పుడు ఫోన్ చూస్తూ కన్పించారో వారికి 35 డాలర్ల జరిమానా విధించనున్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2,200. ప్రజల భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు హోనోలులు అధికారులు చెబుతున్నారు. ఇటీవల అమెరికాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్క 2016లోనే 5,987 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది రోడ్డుపై వస్తున్న వాహనాలను చూసుకోకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. రోడ్లపై ఫోన్లు వాడటంతో ఎదురుగా వస్తున్న వాటిని పట్టించుకోవట్లేదని అధికారులు అంటున్నారు. వీటిని నివారించేందుకే కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. -
ఇక బాదుడే..!
తణుకు: మందుబాబులూ జర జాగ్రత్త... ఇకపై మద్యం తాగి వాహనం నడుపుతూ తనిఖీల్లో పోలీసులకు చిక్కారో వాళ్లు వేసే జరిమానాలకు తాగిన మందుకు ఎక్కిన మత్తు దిగిపోవడం ఖాయం. మీ ఇంట్లో పిల్లలకు మైనార్టీ తీరకుండానే వాహనం చేతికిచ్చారో మీరు బుక్కవుతారు. ఎందుకంటే మైనార్టీ తీరకుండా వాహనం నడిపితే పోలీసులు వేసే జరిమానాలు భారీగానే ఉండబోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం త్వరలో కొత్త మోటారు వాహన చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే చట్టం అమల్లోకి వస్తే నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాల నుంచి తప్పించుకోలేరు. జిల్లాలో ఇప్పటికే రవాణా, పోలీసు శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తూ భారీ ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. జిల్లాలో సరాసరి నెలకు 45 వేల కేసులు నమోదవుతుండగా సుమారు రూ.కోటి వరకు జరిమానాల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వస్తే జరిమానాల ద్వారా వచ్చే ఆదాయం రెట్టింపవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో వాహన ప్రమాదంలో మృతి చెందిన బాధితులకు మాత్రం ప్రస్తుతం అందుతున్న పరిహారం రూ.25 వేల నుంచి రూ.2 లక్షలకు చేరనుంది. ఈ చట్టం ద్వారా 2020 నాటికి యాభైశాతం రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. భారీమొత్తంలో జరిమానాలు ఇటీవలకాలంలో పెరుగుతోన్న రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మోటారు వాహనాల సవరణల బిల్లు2017 రాజ్యసభలో ఆమోదించడానికి కృషి చేస్తోంది. ఇప్పటికే లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. రాజ్యసభలో కూడా ఆమోదం పొంది అమల్లోకి వస్తే ఉల్లంఘనలపై భారీగా జరిమానాలు, శిక్షలు అమలు కానున్నాయి. తాజా చట్టం ప్రకారం ఇకముందు భారీ జరిమానాలతో వాత పెట్టనున్నారు. ప్రస్తుతం మందుతాగి వాహనాలు నడిపిన వారికి జరిమానాలు, కేసుల నమోదుతో పాటు అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. అయితే తాజా చట్టం ప్రకారం ప్రకారం ప్రస్తుతం ఉన్న రూ.2 వేల జరిమానా కనీస మొత్తంగా రూ.10 వేలకు పెరగనుంది. నిర్లక్ష్యంగా వాహనం నడిపేవారికి ప్రస్తుతం విధిస్తున్న రూ.వెయ్యి ఇకపై రూ.5 వేలు కానుంది. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే ఇప్పుడు రూ.500 జరిమానా విధిస్తున్నారు. రాబోయేరోజుల్లో రూ.5 వేలు వడ్డన తప్పదు. అతివేగంతో వాహనం నడిపితే విధించే రూ.400 జరిమానా రూ.2 వేలకు పెరగనుంది. వాహనం నడుపుతూ సెల్ మాట్లాడితే ఇకపై రూ.5 వేలు జరిమానా చెల్లించాల్సి రానుంది. సాయం అందిస్తే పారితోషికం రోడ్డు ప్రమాదం జరిగితే బాధితులకు సాయం అందించిన పాపానికి ఇన్నాళ్లు వారిని సాక్ష్యం పేరుతో పోలీసుస్టేషన్, న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి ఉండేది. కొత్త చట్టంలో వారికి ఉపశమనం కల్పించారు. సహాయం చేసేందుకు ముందుకు వచ్చే గుడ్ సమారిటన్లకు అభయం చేకూర్చేలా వారికి పారితోషికం అందించేలా సవరణలు చేశారు. వారితో కేసులకు సంబంధం లేకుండా చూస్తారు. ప్రమాదంలో సాయం చేసిన వారు ఎవరనేది పోలీసులకు లేదా వైద్య సిబ్బందికి వెల్లడించడం గుడ్సమరిటన్ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 2 లక్షల పరిహారం అందించనుంది. ఇప్పటి వరకు రూ. 25 వేలు ఇస్తుండగా ప్రమాదంలో బాధితులకు ఆసరాగా నిలిచేందుకు మోటారు వాహనాల ప్రమాద నిధిని ఏర్పాటు చేయనున్నారు. ప్రమాద బాధితులకు గరిష్టంగా ఆర్నెల్ల లోపు బీమా సొమ్ము అందించాల్సి ఉంటుంది. ప్రమాద తీవ్రతను బట్టి పరిహారం పెరిగే అవకాశమూ ఉంటుంది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్‌కు, డ్రైవింగ్ లైసెన్సు పొందడానికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయనున్నారు. మరోవైపు డ్రైవింగ్ లైసెన్సు కాలపరిమితి ముగిసిన తర్వాత నెలలోపు మాత్రమే దాన్ని రెన్యువల్ చేయించుకోవాల్సి వచ్చేది. ఈ గడువును ఏడాది వరకు పొడిగించనున్నారు. -
కొత్త బెయిల్ ప్రతిపాదనకు స్వస్తి
న్యూఢిల్లీ: బెయిల్ మంజూరుకు కొన్ని నిబంధనలతో కొత్త చట్టం తీసుకురావాలని ఏడాది క్రితం చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. నేరశిక్షాస్మృతి(సీఆర్పీసీ)కి సవరణలు చేస్తే బెయిల్ మంజూరులో ప్రతిబంధకాలు తొలగిపోతాయని, కొత్త చట్టం అవసరం లేదని భావిస్తోంది. ఒక హక్కుగా బెయిల్ ఇవ్వాలని, నిందితుడు సాక్ష్యాలను తారుమారుచేసి, మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశముంటేనే నిరాకరించాలని పేర్కొంటూ కొత్త చట్టం తేవాలని న్యాయ కమిషన్ చెప్పింది. ఈ అంశాన్ని పునఃపరిశీలించిన ప్రభుత్వం కొత్త చట్టం అవసరం లేదని నిర్ణయించినట్లు తెలిపింది. -
నిర్వాసితులకే ఖర్చు ఎక్కువ
♦ ‘పోలవరం’ ముంపు బాధితుల పునరావాసం, భూమికే సింహభాగం నిధులు వ్యయం: సీఎం ♦ కొత్త చట్టం ప్రకారం పరిహారమివ్వలేం ♦ ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నాం సాక్షి ప్రతినిధి, ఏలూరు/కాకినాడ/చింతూరు: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కంటే ముంపు బాధితులకు పునరావాస చర్యలు, భూమికి భూమి, తదితర కార్యక్రమాలకే ఎక్కువ ఖర్చవుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. విలీన మండలాలైన తూర్పుగోదావరి జిల్లా చింతూరు, పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం కివ్వాకలో బుధవారం వేర్వేరుగా జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినందున అవసరమైన నిధుల విడుదలకు కేంద్రం సహకరించాలని కోరారు. ఆ రుణాలు చెల్లించలేం..: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో గతంలో పరిహారం పొందిన వారికి ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం తిరిగి పరిహారం చెల్లించే అవకాశం లేదని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికీ పరి హారం అందని వారికి మాత్రమే 2013 చట్టం ప్రకారం పరిహారం అందజేస్తామన్నారు. దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగా వెనుకబడి ఉందని సీఎం చెప్పారు. అంతకుముందు చింతూరు కేంద్రంగా చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొత్త ఐటీడీఏని సీఎం ప్రారంభించారు. అన్నీ చేస్తా.. కూర్చో: చింతూరు సభలో ‘పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ భాగమని చెబుతున్నారు.. అలాంటప్పుడు పట్టిసీమలో అమలు చేసిన ప్యాకేజీనే పోలవరం నిర్వాసితులకు ఇవ్వండి.. హామీలు కాదు ఆచరణలో చూపించండి’ అని పోలవరం నిర్వాసితుల సంఘం నాయకుడొకరు చేసిన నినాదాలు ముఖ్యమంత్రికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ‘అన్నీ చేస్తా.. కూర్చో, నువ్వు కూర్చో! అక్కడ కాదు ఇక్కడికి (వేదిక పైకి) వచ్చి చెప్పు. ఇలా రెచ్చగొట్టేవారు ఉంటారని ముందే చెప్పా’ అని తీవ్రస్వరంతో అంటూ ప్రసంగాన్ని సీఎం ముగించారు. దళిత సంఘాల ఆందోళన చింతూరు మెయిన్‌రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహానికి సీఎంతో పూలమాల వేయించడానికి దళిత సంఘాల నాయకులు ఏర్పాటు చేశారు. అయితే సీఎం అక్కడ ఆగకుండా పది అడుగుల దూరంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆగి పూలమాల వేశారు. దీంతో నిరాశ చెందిన దళిత సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత నిరసన ప్రదర్శన నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. -
పోరాటాలతో పదునెక్కిన చట్టం
కారంచేడు హత్యాకాండ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధానికి కొత్త చట్టం తేవాలనే డిమాండు పుట్టింది. ఆనాటి ప్రజా ఉద్యమం, రాజకీయ ఐక్యతలే 1989 చట్టానికి జన్మనిచ్చాయి. చుండూరు ఉద్యమం తర్వాత, 1994లో గానీ దానికి మార్గదర్శక సూత్రాలు రూపొందలేదు. ఆ చట్టం అమలులోని సమస్యలు తొలగేలా మార్పుల కోసం మరో ఉద్యమం సాగించాల్సి వచ్చింది. అలా ప్రజా ఉద్యమాల ఫలితంగానే నేటి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల చట్టం సవరణలు జరిగాయి. చిత్తశుద్ధితో ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. చుండూరు దళితుల నరమేధం జరిగి సరిగ్గా ఈ రోజుకి 24 ఏళ్ళు. కులాధి పత్యం న్యాయం పొరలను కమ్మేయగా... బాధితులకు న్యాయం అందినట్టే అందీ, అందకుండా పోయింది. అయితేనేం, అంతిమ విజయ కాంక్షతో నెత్తురు మరుగుతూనే ఉంది. గుంటూరు జిల్లా చుండూరులో ఈ రోజున దళి తులు సమావేశమై, అంతిమ విజయం తమదేనన్న ధీమాతో భవిష్యత్ పోరా టానికి సన్నద్ధం అవుతున్నారు. సరిగ్గా ఇదే సమయానికి, ఆగస్టు 4న ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టానికి చేసిన సవరణల బిల్లును లోక్‌సభ ఆమో దించడం ఆహ్వానించదగిన విషయం. 1989 నాటి ఆ చట్టం కొన్ని సవరణ లతో 1994 నుంచి పూర్తి స్థాయి ఆచరణలోకి వచ్చింది. అయితే ఇంకా అం దులో ఉన్న కొన్ని లోపాల వలన ఎస్సీ, ఎస్టీలపై దాడులకు, అత్యాచారాలకు, హత్యలకు పాల్పడేవారు, వారికి వత్తాసు పలికే అధికారులు చట్టం నుంచి తప్పించుకొంటున్నారు. ఆ లోపాలను సరిదిద్దాలని గత పదేళ్ళుగా సాగిస్తున్న ఉద్యమం నేటికి ఫలించింది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ 2 ప్రభు త్వ హయాంలోనే ఈ సవరణల బిల్లుకు రూపకల్పన జరిగింది. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని పార్ల మెంటరీ సంయుక్త సంఘానికి నివేదించింది. సుదీర్ఘ చర్చల అనంతరం అది 2014, డిసెంబర్లో ఆ బిల్లుకు ఆమోదం తెలిపింది. గత బడ్జెట్ సమావేశా ల్లోనే పార్లమెంటులో ప్రవేశ పెడతారనుకున్న బిల్లు ఎట్టకేలకు ఈ వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ ఆమోదం పొందింది. ఉద్యమాలతోనే రక్షణ చట్టాలు 1989 నాటి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కన్నా ముందు షెడ్యూల్డ్ కులాలు, తెగల రక్షణకు రాజ్యాంగంలో పొందుపర్చిన వివిధ అధికరణాలకు, ముఖ్యంగా ఆర్టికల్ 17కు అనుగుణంగా అంటరానితనం నిషేధం కోసం ‘‘అంటరానితనం నేరాల చట్టం 1955’’ అమల్లోకి వచ్చింది. దీన్ని 1976లో ‘‘పౌరహక్కుల రక్షణ చట్టం’’గా మార్చారు. ఇందులో కూడా కొన్ని లోపాలు న్నాయని, ముఖ్యంగా ఇండియన్ పీనల్ కోడ్‌కు అనుగుణంగా ఇది లేదని భావించి 1989లో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 1985 జూలై 17న జరిగిన కారంచేడు హత్యాకాండ దేశంలోనే సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో ‘‘పౌరహక్కుల రక్షణ చట్టం’’ ఎస్సీ, ఎస్టీలపై హత్యాకాండ, అత్యాచారాలను నిరోధించడానికి సరిపోవడంలేదని, నూతన చట్టం తేవాలని కారంచేడు ఉద్యమం డిమాండ్ చేసింది. రాజకీయా లకు అతీతంగా పార్లమెంటులో ఎస్సీ, ఎస్టీ సభ్యులంతా ఆ మారణకాండకు వ్యతిరేకంగా నిలిచారు. ఉవ్వెత్తున ఎగిసిన ప్రజాఉద్యమం, రాజకీయ ఐక్యత కలసి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టానికి జన్మనిచ్చాయి. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం 1989లోనే జరిగినా, 1991 ఆగస్టు 6న చుండూరు మారణకాండ జరిగే నాటికి కూడా దాని అమలుకు మార్గదర్శక సూత్రాలు రూపొందలేదు. ఆ తర్వాత మూడేళ్లు దాటాక, అదీ చుండూరు మారణకాండకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఆ విషయమై విమర్శలు వెల్లువెత్తిన తర్వాతే, 1994లోగానీ మార్గదర్శక సూత్రాలు రూపొం దలేదు. ఆ తర్వాతా అచరణలో చాలా సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా మారుతున్న పరిస్థితులను బట్టి నేరాల స్వరూపం మారింది. కేసుల నమోదు, పరిశోధన, విచారణలో అలసత్వం పేరుకుపోయింది. బాధితులకు పునరా వాసం, రక్షణలో కూడా చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఎస్సీ, ఎస్టీ అత్యాచా రాల నిరోధక చట్టం అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు నిండిన సంద ర్భంగా 2009 జూన్‌లో ఒక జాతీయ స్థాయి సమావేశం జరిగింది. అది, 1989 చట్టం అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను చర్చించి, ఆ చట్టంలో కొన్ని మార్పులు జరగాలని భావించింది. అలా మరో ఉద్యమం రూపుదిద్దుకుంది. దాదాపు 600 సంస్థలతో అందుకోసం జాతీయ స్థాయి వేదిక ఏర్పడింది. దాదాపు ఆరేళ్లు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం సాగింది. 18 రాష్ట్రాల్లో వందకు పైగా సమావేశాలు జరిగాయి. 2011లో జాతీయ న్యాయసంస్థలో 70 మంది న్యాయమూర్తులతో జరిగిన సదస్సు ప్రత్యేకించి ప్రభుత్వంపైన, ఇతర విభా గాలపైన బలమైన ప్రభావాన్ని కలుగజేసింది. 2012, నవంబర్ 26న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో దాదాపు 50 వేల మందితో జరిగిన బ్రహ్మాండమైన ప్రదర్శన ఈ డిమాండ్ పట్ల ప్రగాఢ ఆకాంక్షను వ్యక్తీక రించింది. గత అనుభవాల దృష్ట్యా ఈ చట్టం పటిష్టంగా అమలు జరగడానికి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. అలా ప్రజల నుంచి, ప్రజా ఉద్యమం నుంచి వచ్చిన కొన్ని ముఖ్య డిమాండ్లే నేడు చట్ట సవరణలుగా రూపుదిద్దుకున్నాయి. చట్టం పరిధి విస్తృతమైంది దేశంలో పలు సామాజిక, ఆర్థిక , రాజకీయ మార్పులు వస్తున్నా, కొత్త రూపా ల్లో అంటరానితనం పుట్టుకొస్తూనే ఉంది. గత చట్టంలో లేని కుల వివక్ష, అణ చివేతకు సంబంధించిన అనేక అంశాలను చేర్చి, అలాంటి ఘటనలు నేరా లుగా మార్చారు. ఎస్సీ, ఎస్టీలకు చెప్పుల దండలు వేయడం, వారి బట్టలు ఊడదీయడం, వారిని నగ్నంగా, అర్ధనగ్నంగా ఊరేగించడం, వారి భూము లను ఆక్రమించుకోవడం, భూమి నుంచి వెళ్లగొట్టడం, ఓటు వేయకుండా నిరోధించడం, గృహాలను, ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయడం, వారి మహి ళలను లైంగికంగా వేధింపులకు గురిచేయడం, అవమానించడం తదితర మైనవి వాటిలో ముఖ్యమైనవి. గతంలో సాధారణ నేరాల పేరిట పలు సంద ర్భాల్లో అత్యాచారాల నిరోధక చట్టాన్ని ఉపయోగించేవారు కారు. తాజా సవ రణలతో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, ఎన్నికైన ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులను వారి విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం, దాడిచేసి గాయపర్చడం, బెదిరించడం, బహిష్కరణకు గురి చేయడం లాంటివి తీవ్ర నేరాలవుతాయి. దళితులు, ఆదివాసీలు వారి వనరు లను, సామాజిక వనరులను ఉపయోగించుకోకుండా అడ్డుకోవడం, శ్మశానా లలోనికి రానివ్వకపోవడం, పెళ్ళి ఊరేగింపులపై నిషేధం, సైకిల్, మోటారు సైకిల్ నడపడాన్ని అడ్డగించడం, చెప్పులు వేసుకొన్న దళితులను కొట్టడం, తిట్టడం, వారిని దేవాలయాలు తదితర బహిరంగ స్థలాలలోకి ప్రవేశించ కుండా నిరోధించడం లాంటి వాటిని నేరాలుగా పరిగణించేలా చట్టాన్ని బలో పేతం చేశారు. ఎస్సీ, ఎస్టీలను కిడ్నాప్ చేయడం, వారిపై రాళ్ళు రువ్వడం, గుంపులుగా ఏర్పడి బెదిరించడం వంటి వాటిని గతంలో సామాన్య నేరా లుగా చూసేవారు. ఇప్పుడది కుదరదు. అవి కూడా ఇప్పుడు అత్యాచారాల నిరోధక చట్టం పరిధిలోకే వస్తాయి. ఉపేక్ష, సాచివేతలకు చెల్లుచీటీ ఈ చట్టంలోని సెక్షన్ 4పై చాలా రోజులుగానే చర్చ జరుగుతున్నది. చాలా మంది పోలీసు అధికారులు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసులలో డబ్బులు లాగి, కేసులను ఎత్తివేయడానికి రాజీ కుదిర్చే వాళ్ళు. ఈ సవరణల వల్ల ఇక అది కుదరదు. ఈ కేసులను పరిశోధించే పోలీసు అధికారుల తీరుతెన్నులను ప్రత్యేక కోర్టులు సమగ్రంగా సమీక్షిస్తాయి. తప్పు జరిగినట్టు భావిస్తే కోర్టులే నేరుగా శిక్షిస్తాయి. దీనికి ఎటువంటి ముందస్తు ఫిర్యాదు అక్కర్లేదు. నేరం జరిగినా కేసులు నమోదు చేయకపోవడాన్ని, పరిశోధనలో జాప్యాన్ని సైతం ఈ చట్టం ఉపేక్షించదు. కేసు నమోదైన రోజు నుంచి 120 రోజుల లోపునే తీర్పులు వెలువడాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీలపై నేరాల విచారణకు నియమించే (డిజిగ్నేటెడ్) కోర్టులు ఇతర కేసులను కూడా విచారించాల్సి ఉండేది. వాటిని అత్యాచార నిరోధక చట్ట సంబంధమైన కేసు లను మాత్రమే విచారించే ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ కోర్టులుగా మార్చారు. అలాగే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా ప్రత్యేకంగా నియమిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా తీర్పులు వెలువడితే, హైకోర్టు, సుప్రీంకోర్టులలో ఆ కేసుల విచారణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక బాధితులకు, సాక్షులకు ప్రత్యేక రక్షణలు కల్పించారు. ఉదాహరణకు నిందితులకు బెయిల్ ఇస్తే బాధితులకు, సాక్షులకు తెలపాలి. నడుస్తున్న కేసు గురించి పూర్తి వివరాలను కోర్టే వీరికి అందించాలి. బాధితులు, సాక్షులపై దాడులు జరగకుండా ప్రభుత్వం తగు భద్రతను కల్పించాలి. బాధితుల తరఫున పనిచేస్తున్న సంఘాలను విశ్వా సంలోకి తీసుకొని, ఈ విషయాలన్నింటినీ వాటికి తెలియజేయాలి. గతంలో కులం తెలియక జరిగిన నేరాలనే సాకుతో అత్యాచార నిరోధక చట్టం వర్తిం పజేయకుండా దోషులను వదిలేసేవారు. మహారాష్ట్ర ఖైర్లాంజి దారుణ ఘట నపై కూడా కోర్టు ఇదే వైఖరిని అవలంబించింది. ఇకపై అటువంటి అవకాశం లేకుండా ఈ సవరణ చూస్తుంది. బాధితుల కులం నిందితులకు తెలిస్తే చాలు ఆ నేరం చట్టం పరిధిలోకి వస్తుంది. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలను నిరోధించడానికి ఈ చట్ట సవరణ మరింత తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. దళిత ఉద్యమాన్ని సజీ వంగా ఉంచి అత్యాచారాల నిరోధానికి అహరహం పోరాడుతూ, దళిత సమా జంలో నిత్య చైతన్యాన్ని నింపాల్సిన బాధ్యత దళిత కార్యకర్తలపై ఇంకా ఉంది. నూతన సవరణలతో పదునెక్కిన ఈ చట్టంపై విస్తృతంగా చర్చలు జరిపి, సమాజం మరింత సానుకూలంగా స్పందిస్తే తరతరాలుగా దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న మారణకాండకు ముగింపు పలికే దిశగా ఇదొక ముందడుగవుతుంది. అయితే చిత్తశుద్ధితో ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య -
చెత్త బయట వేస్తే జరిమానా
స్వచ్ఛ భారత్ పటిష్ట అమలుకు కొత్త చట్టం న్యూఢిల్లీ: ఆరు బయట చెత్త వేస్తున్నారా? ఎక్కడ పడితే అక్కడ మూత్రం పోస్తున్నారా? పాన్లు నమిలి రోడ్డుపై ఉమ్మి వేస్తున్నారా? అయితే ఇకపై జాగ్రత్తగా ఉండండి. లేదంటే జరిమానా, శిక్ష తప్పదు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ కేంద్రం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే. దీన్ని పటిష్టంగా అమలు చేసేందుకు న్యాయపరమైన మద్దతు ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు న్యాయ శాఖ బిల్లును తయారు చేస్తోంది. కానీ పారిశుద్ధ్యం, పరిశుభ్రత అంశాలు రాష్ట్రాల పరిధిలోనివి కావడంతో చట్టం అమలు సాధ్యం కాకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చట్టంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కేంద్రం వెలుసుబాటు కల్పిస్తోంది. అయితే పరిశుభ్రత, పారిశుద్ధ్యం అనే వాటికి పరిధి ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. ఏదైనా ఒక ప్రాంతంలో స్వైన్‌ఫ్లూ వస్తే అది దేశం మొత్తం వ్యాపిస్తుందని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అక్కడికక్కడే చలానాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు అప్పటికప్పుడు చలానాల రూపంలో జరిమానా విధిస్తున్నట్లే దీని విషయంలో కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత విషయంలో నిబంధనలు అతిక్రమించిన వారికి అక్కడికక్కడే జరిమానా వేయనున్నారు. -
కొత్త చట్టం ప్రకారం పరిహారమివ్వండి
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు మార్గాల్లో రోడ్ల విస్తరణతో స్థలాలు కోల్పోయిన బాధితులకు హైకోర్టు ఊరటనిచ్చింది. స్థలాలు కోల్పోయిన వారికి 2014లో కొత్తగా అమల్లోకి వచ్చిన భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని నిర్ణయించాలంటూ మంగళవారం తీర్పు ఇచ్చింది. పరిహారాన్ని నిర్ణయించే ముందు బాధితుల వాదనలు విని, ఒక నిర్దిష్ట గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలంటూ న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు భూ సేకరణ అధికారులను ఆదేశించారు. మెట్రో రైలు నిర్మాణ మార్గాల్లో పలుచోట్ల అధికారులు భూ సేకరణ చేపట్టి, వాటికి ఈ ఏడాదిలో పరిహారం కూడా చెల్లించిన విషయం తెలిసిందే. అయితే పరిహారం తక్కువగా ఇచ్చారని, నిబంధనల మేరకు చెల్లించలేదని పేర్కొంటూ భూములు కోల్పోయినవారు పెద్ద సంఖ్యలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై వాదనలు విన్న న్యాయమూర్తి మంగళవారం తీర్పునిచ్చారు. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని నిర్ణయించాలని భూ సేకరణ అధికారులను ఆదేశించారు. నిర్దిష్ట గడువును నిర్ణయించుకుని, ఆలోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.