dharani
-
ఫోరెన్సిక్ ఆడిటింగ్‌పై‘రెవెన్యూ’లో గుబులు
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి పోర్టల్ పేరుతో గత ప్రభుత్వంలోని పెద్దలు అక్రమాలకు పాల్పడ్డారు. అర్ధరాత్రి భూముల రికార్డులు మార్చేశారు. ఇదో పెద్ద ఆర్థిక నేరం. ఈ అక్రమాల నిగ్గు తేల్చేందుకు ధరణి పోర్టల్ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ జరుపుతాం..’ ఇది ఇటీవల ముగిసిన శాసనసభ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన. ఈ ప్రకటన రెవెన్యూ శాఖలో గుబులు రేపుతోంది. ఫోరెన్సిక్ ఆడిటింగ్ ఎలా ఉంటుంది? ఏఏ లావాదేవీలపై ఆడిటింగ్ చేస్తారు? ఎవరిని బాధ్యులుగా తేలుస్తారు? ఎప్పుడు ఏం జరుగుతుంది? అనే అంశాలు ఇప్పుడు రెవెన్యూ శాఖ పరిధిలో హాట్‌టాపిక్‌గా మారాయి. అసలేంటీ... ఆడిటింగ్?: ఆన్‌లైన్‌తో ముడిపడి ఉన్న ప్రతి వ్యవస్థలో జరిగే లావాదేవీలను డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఆధారంగా సరి పోల్చడాన్ని ఫోరెన్సిక్ ఆడిటింగ్ కింద పరిగణించవచ్చు. ఇందుకోసం ట్రాన్సాక్షన్ హిస్టరీ (లావాదేవీ జరిగిన తీరు)ని పరిగణనలోకి తీసుకుంటారు. లావాదేవీ ఎక్కడ, ఎలా జరిగింది? ఏ రికార్డుల ఆధారంగా నిర్వహించారు? ఎవరెవరు ఏ సమయంలో జరిపారు? ఆ కంప్యూటర్ ఐపీ అడ్రస్ ఏంటి?... ఇలా సదరు లావాదేవీ జరిగిన తీరును కూలంకశంగా పరిశీలించి నిబంధనల మేరకు జరిగిందా లేక నిబంధనలు ఉల్లంఘించారా అన్నది నిగ్గు తేల్చడమే ఈ ఆడిటింగ్ ప్రధాన ఉద్దేశమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన దాన్ని బట్టి ఇప్పుడు ధరణి పోర్టల్ లావాదేవీలను కూడా డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ లేదా ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా మదింపు చేయనున్నారు. ఆ లావాదేవీల్లో ఎవరెవరు భాగస్వాములయ్యారనే దాన్ని ఈ ఆడిటింగ్ కీలకంగా పరిగణించనుంది. క్రయ, విక్రయదారుల నుంచి ధరణి ఆపరేటర్, తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, సీసీఎల్ఏ వరకు ఎవరి పాత్ర ఏంటన్న దానిపై ఫోకస్ చేస్తారని తెలుస్తోంది.పాత రికార్డులు... కొత్త లావాదేవీలు ధరణి పోర్టల్ వేదికగా నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో అక్రమ లావాదేవీలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. రాత్రికిరాత్రి నిషేధిత జాబితాను అన్‌లాక్ చేసి వారికి కావాల్సిన సర్వే నంబర్‌ను తొలగించి మళ్లీ ఆ జాబితాను లాక్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితా భూములే టార్గెట్‌గా ఈ ఆడిటింగ్ జరగొచ్చనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటికి ఉన్న రికార్డుల వివరాలు, పోర్టల్‌లో నమోదు చేసిన వివరాలు, ఈ రికార్డుల ఆధారంగా జరిపిన లావాదేవీలు ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో కీలకమవుతాయని రెవెన్యూ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ‘పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటికి నిషేధిత జాబితా కింద ఉన్న భూముల రికార్డులు తీసుకుంటారు. ఆ తర్వాత ధరణి పోర్టల్‌లో నమోదైన వివరాలను సరిచూస్తారు. ఈ క్రమంలో సందేహాస్పదంగా ఉన్న లావాదేవీలను మరింత లోతుగా పరిశీలించి నిగ్గు తేలుస్తారు’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి చెప్పారు. ట్రాన్సిట్ పీరియడ్ పూర్తి కాగానే...! ఫోరెన్సిక్ ఆడిటింగ్‌ను రెవెన్యూ శాఖ ముఖ్యఅధికారులతో చేయిస్తారా? లేక ఇతర శాఖల్లోని ముఖ్య అధికారులతో కలిపి చేయిస్తారా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై వచ్చే నెలలో విధాన ప్రకటన చేసే అవకాశం ఉంది. వాస్తవానికి, ధరణి పోర్టల్ నిర్వహణను ప్రస్తుత ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగించింది. గతంలో ఈ పోర్టల్ నిర్వహించిన టెర్రాసిస్ నుంచి ఎన్ఐసీ ఈ బాధ్యతలు తీసుకుంటోంది.ఈ క్రమంలో టెర్రాసిస్ నుంచి పోర్టల్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఎన్ఐసీ తీసుకుంటోంది. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. ఈ వివరాల పంపిణీ (ట్రాన్సిట్) కోసం ప్రభుత్వం ఇచ్చిన రెండు నెలల గడువు.. డిసెంబర్ 31తో ముగియనుంది. అంటే జనవరి 1 నుంచి భూభారతి (ధరణి స్థానంలో) పోర్టల్‌ను ఎన్ఐసీ నిర్వహించనుంది. ఫోరెన్సిక్ ఆడిట్లో వచ్చిన సమాచారం ఆధారంగా ‘సిట్’ను ఏర్పాటు చేయొచ్చని, తద్వారా ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారన్న అంశాలను తేలుస్తారని చెబుతున్నారు. తహశీల్దార్ల డిజిటల్ సంతకాలు ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత భూ సమస్యల పరిష్కార బాధ్యతలు కలెక్టర్లకు అప్పగించారు. కానీ సదరు పరిష్కారాలను ధ్రువీకరిస్తూ సవరించే రికార్డులపై తహశీల్దార్ల డిజిటల్ సంతకాలే నమోదు చేశారు. ఈ విషయంలో పలుమార్లు తహశీల్దార్ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కనీసం తమ ప్రమేయం లేకుండా తీసుకునే నిర్ణయాలను తమ డిజిటల్ సంతకాలతో ధ్రువీకరించడమేంటని, వెంటనే తమ సంతకాలు తొలగించాలని కూడా డిమాండ్ చేశాయి. కానీ, అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఈ డిజిటల్ సంతకాలేం చేస్తాయోననే గుబులు తహశీల్దార్లలో మొదలైంది.ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పనిచేసిన తహశీల్దార్లు ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనతో ఉన్నారు. ఇదిలాఉంటే.. అసలు తహశీల్దార్ల డిజిటల్ సంతకాలు కూడా లేకుండా రాత్రికిరాత్రే డాక్యుమెంట్లు మారిపోయాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ ఆడిటింగ్‌ను ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందో.. ఏం తేలుస్తుందో.. ఎవరిని బాధ్యులను చేస్తుందో... అనే అంశాలు ఇప్పుడు రెవెన్యూ శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
ధరణి లావాదేవీలపై ‘ఫోరెన్సిక్ ఆడిట్’
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ అందుబాటులోకి వచి్చన తర్వాత జరిగిన భూముల లావాదేవీలపై ‘ఫోరెన్సిక్ ఆడిట్’నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొల్లగొట్టిన భూముల వివరాలను ఈ ఆడిటింగ్ ద్వారా కూలంకషంగా పరిశీలిస్తామని చెప్పారు. భూభారతి బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ధరణి పోర్టల్ ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఈ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఇందుకు స్పందించిన మంత్రి పొంగులేటి.. ‘మాకు, బీఆర్ఎస్కు ఏదో లోపాయికారీ ఒప్పందం ఉందన్నట్టు బీజేఎల్పీ నేత మాట్లాడుతున్నారు. మా నిజాయితీ, చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిస్తాం. పదేళ్ల పాటు పేద ప్రజలను మోసం చేసి గుంజుకున్న ఆస్తులను, భూములను తిరిగి వారికి ఇప్పి స్తాం’అని వెల్లడించారు. ఆ తర్వాత కూడా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫోరెన్సిక్ ఆడిట్ సరిపోదని, సీబీఐ విచారణ జరిపించాలని, లేదంటే సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే అక్రమాలు తేలుతాయన్నారు. మంత్రి బదులిస్తూ ఫోరెన్సిక్ ఆడిటింగ్‌పై ప్రాథమిక నివేదిక వచి్చన తర్వాత ఏం చేయాలన్నది పరిశీలిస్తామని, సీఎంతో పాటు మంత్రిమండలిలో చర్చించి, స్పీకర్ అనుమతితో అసెంబ్లీలో ప్రకటిస్తామని చెప్పారు. కేసీఆర్ టేబుల్‌పై ఆ పుస్తకం కనిపించేది.. ప్రముఖ న్యాయకోవిదుడు పడాల రామిరెడ్డి భూ సంస్కరణలపై రాసిన పుస్తకం ఎప్పుడూ కేసీఆర్ టేబుల్‌పై కనిపించేదని మంత్రి పొంగులేటి అంటూ, తన సెల్ ఫోన్లోని ఆ ఫొటోను ప్రదర్శించారు. అలాంటి పుస్తకాలు చదివిన ఆయన రూపొందించే ధరణి అద్భుతంగా ఉంటుందనుకున్నానని, కానీ ప్రజా కంటకంగా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు రోజుకో వేషం, రోజుకో డ్రామా వేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు.స్పీకర్ పోడియంపైకి కాగితాలు, పుస్తకాలు విసిరివేయడం, బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు వేలు చూపిస్తూ బెదిరించడం లాంటివి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కూడా దాడి చేయాలనే ఉద్దేశంతో తన సీటు వద్దకు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెదిరించారని పేర్కొన్నారు. ఈ దొరలను ప్రజలు రాష్ట్రంలో ఉండనీయబోరని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. సభలో గూండాయిజం ప్రదర్శించిన వారిపై స్పీకర్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ కాపలా కుక్క కాదు.. వేటకుక్క..తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని ఉద్య మ సమయంలో కేసీఆర్ చెప్పారని, అయితే ఆయన వేటకుక్కలా రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. భూభారతి బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం ముందు నిరసన తెలుపుతున్న సమయంలో ఆయన జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలతో ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్, ప్రతిపక్షంలోనూ అబద్ధాలతో కాలం గడపాలనుకుంటోంది. కీలకమైన రెవెన్యూ చట్టంపై చర్చ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన అనుభవంతో సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నా, ప్రతిపక్ష నేత సభలో కనిపించరు.అధికారంలో ఉన్నప్పటి తరహాలో నే ప్రతిపక్షంలో కూడా బీఆర్ఎస్ అరాచకంగా వ్యవహరిస్తోంది. ధరణితో లక్షల మంది ఇబ్బందికి గురికాగా, బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎలాంటి సమస్యల్లేవని బుకాయించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన 73 ఏళ్ల మద్దెల కృష్ణయ్య అనే దళిత రైతు 35 ఏళ్ల క్రితం కొన్న ఏడెకరాల భూమి ధరణి పుణ్యాన వేరే వారి పేరిట మారటంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి’ అని పొంగులేటి ధ్వజమెత్తారు. -
మన రాష్ట్ర అగ్రిమెంట్ పలు దేశాలకు మారింది
-
ఇందిరాగాంధీ హయాంలో అసైన్డ్ ల్యాండ్ పంపణీ జరిగింది: CM Revanth
-
ధరణి పోర్టల్ పై పొంగులేటి సంచలన కామెంట్స్..
-
డిసెంబర్ 1 నుంచి NIC ధరణి బాధ్యతలు చూస్తోంది
-
ధరణితో రైతులకు అన్యాయం
యాదగిరిగుట్ట: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో నిజమైన రైతులకు అన్యాయం చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిన భూములను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు మల్లన్నసాగర్ నుంచి తాగునీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టు కోసం యాదగిరిగుట్టలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ పైలాన్ పనులకు శుక్రవారం మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సీతక్క శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములు భారీగా కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు రైతుల భూములు అడుగుతుంటే బీఆర్ఎస్ నేతలు అడ్డుకొంటున్నారని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేదలకు పంచిన 20 వేల ఎకరాల భూములను బీఆర్ఎస్ పాలనలో కేవలం రూ.5 లక్షలు, రూ.6 లక్షలకు ఎకరం చొప్పున గుంజుకున్నారని ధ్వజమెత్తారు. నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో రూ.2,000 కోట్లతో అభివృద్ధి పనులను ఉత్సవాల్లాగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మేడిగడ్డలాగే బీఆర్ఎస్ సర్కారు కూలింది: కోమటిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని, వారికి మతి భ్రమించిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మేడిగడ్డ కూలినట్టే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయిందని చురకలంటించారు. డిసెంబర్ 6వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా బ్రాహ్మణ వెల్లంల డి్రస్టిబ్యూటరీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతకుముందు మంత్రులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం పాల్గొన్నారు. -
సమగ్ర సర్వే: మా అప్పులు తీరుస్తారా? మీకెందుకు చెప్పాలి?
‘‘మా ఆస్తుల వివరాలు, వార్షికాదాయం లెక్కలు ఎందుకు? స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతా వివరాలతో ఏం చేస్తారు? ధరణి పాస్‌బుక్ నంబర్ ఎందుకు చెప్పాలి? మేం ఎక్కడ రుణం తీసుకుంటే, ఎందుకోసం తీసుకుంటే ప్రభుత్వానికి ఎందుకు? వీటితో మాకొచ్చే ప్రయోజనం ఏంటి? రైతుబంధు రానప్పుడు భూముల వివరాలు ఎందుకు అడుగుతున్నారు? ఇల్లు ఎన్ని గజాల్లో ఉంటే ఏం చేస్తారు?.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం వెళ్తున్న ఎన్యూమరేటర్లకు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలివి. అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారో, ఏ వివరాలు చెబితే ఏ పథకాలకు కోతపెడతారో, రేషన్‌కార్డు ఏమైనా రద్దు చేస్తారోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వివరాలు, ఉద్యోగం, వ్యాపారం వంటి వివరాలు చెప్పడానికి ముందుకురాని పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలనలో వెల్లడైన అంశాలివీ..సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాల సేకరణ గందరగోళంగా మారింది. పేర్లు, కులం, వృత్తి వంటి కొన్ని సాధారణ వివరాలను వెల్లడిస్తున్న జనం.. ఆర్థికపర అంశాలను వెల్లడించేందుకు ఇష్టపడటం లేదు. ప్రజల నుంచి సరైన సమాధానాలు రాకపోవడం, కొన్ని అంశాల్లో సందేహాలు వ్యక్తం చేస్తూ ఎదురు ప్రశ్నలు వేస్తుండటం, వారికి సర్దిచెప్పాల్సి రావడంతో సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు.మరోవైపు పేద వర్గాల నుంచి మాత్రం సర్వేకు మంచి స్పందన కనిపిస్తోంది. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు కావాలంటూ పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రక్రియలో భాగంగా... ఈ నెల 6వ తేదీ నుంచి ఇళ్లను గుర్తించి స్టిక్కర్లు వేసిన సంగతి తెలిసిందే. శనివారం నుంచి ఎన్యూమరేటర్లు ఆ ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలను సేకరించి, సర్వే ఫారాల్లో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. కాలమ్ నంబర్ 19 నుంచి తిప్పలు! రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు (56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు) ఉన్నాయి. సర్వే బుక్లెట్ రెండు భాగాలుగా ఉంది. మొదటి విభాగం (పార్ట్–1)లో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి, రిజర్వేషన్లు, రాజకీయాలు, వలసలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. సాధారణ వివరాలను వెల్లడించేందుకు ప్రజలు సిద్ధంగానే ఉన్నా.. కాలమ్ నంబర్ 19 నుంచి వస్తున్న పలు ప్రశ్నలు ఆందోళన రేపుతున్నాయి.ప్రధానంగా వ్యాపారం వార్షిక టర్నోవర్, వార్షికాదాయం, ఆదాయ పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతా సమాచారం, భూములు, ధరణి పాసు పుస్తకం వివరాలు, భూమి కొనుగోలు కోసం వనరులకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించేందుకు చాలా మంది విముఖత చూపుతున్నారు. అదేవిధంగా రిజర్వేషన్ ఫలాలు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వివరాలను అడిగినప్పుడు.. ఆ వివరాలు ఎందుకని ఎదురు ప్రశ్నలు ఎన్యూమరేటర్లకు ఎదురవుతున్నాయి. ‘ఆర్థిక స్థితిగతుల’పై ఆందోళన సర్వే ప్రశ్నావళి రెండో విభాగం (పార్ట్–2)లో కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలు అడిగినప్పుడు ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. వాటికి సరైన సమాధానం రావడం లేదని ఎన్యూమరేటర్లు చెప్తు న్నారు. రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశు సంపద, స్థిరాస్తి, వాహనాలు, రేషన్‌కార్డు, నివాస గృహానికి సంబంధించిన సమాచారాన్ని చెప్పేందుకు ఇష్టపడటం లేదని అంటున్నారు. బ్యాంకు రుణాలు, అప్పులు, ఆస్తులకు సంబంధించిన ప్ర శ్నలు అడుగుతున్నప్పుడు ప్రజల నుంచి ఎదురు ప్రశ్నలు వస్తున్నాయని వివరిస్తున్నారు. ‘మేం రుణాలు చెల్లించకుంటే ప్రభు త్వం చెల్లిస్తుందా? ఆస్తుల వివరాలు మేమెందుకు చెప్పాలి? మా కున్న అప్పులకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఆదాయం వి వరాలు చెబితే పథకాలు వస్తాయా? ఉన్నవాటికి కోతపెడతారా?’ అని ప్రజలు నిలదీస్తున్నారని ఎన్యూమరేటర్లు వాపోతున్నారు. శనివారమూ కొనసాగిన స్టిక్కరింగ్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఈ నెల 6వ తేదీనే ప్రారంభమైంది. 6, 7, 8వ తేదీల్లో ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతంలోని ఇళ్లను పరిశీలించి యజమానులు, అద్దెదారుల వివరాలను తెలుసుకుని, స్టిక్కర్లు అంటించాలని, 9వ తేదీ నుంచి సర్వే ఫారాల్లో వివరాల నమోదు చేపట్టాలని నిర్ణయించారు. కానీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నాలుగో రోజు కూడా స్టిక్కరింగ్ ప్రక్రియే కొనసాగింది. ఇళ్లకు తాళం ఉండటం, యజమానులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఇళ్ల విజిటింగ్, స్టిక్కరింగ్ ప్రక్రియలో జాప్యం జరిగినట్లు ఎన్యూమరేటర్లు చెప్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్టిక్కరింగ్ ప్రక్రియ పూర్తయిందని.. ఆదివారం నుంచి సర్వే ఫారాల్లో వివరాల నమోదు కొనసాగుతుందని ప్రణాళిక శాఖ వర్గాలు వెల్లడించాయి. వివరాల సేకరణలో తిప్పలు సర్వేలో ఒక్కో ఇంటికి సంబంధించి 75 ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టడం, 43 ప్రశ్నలకు బుక్లెట్ చూసుకుని కోడింగ్ వేయడం వేయడం ఎన్యూమరేటర్లకు తలకు మించిన భారమవుతోంది. పట్టణాలు, గ్రామాల్లో 150 నుంచి 175 వరకు ఇళ్లను ఎన్యూమరేషన్ బ్లాక్‌గా విభజించి ఒక్కో ఎన్యూమరేటర్‌కు అప్పగించారు. రోజుకు 10 ఇళ్లలో సర్వే చేయాలని ఆదేశించారు. కానీ చాలా ప్రాంతాల్లో తొలిరోజు ఐదు, ఆరు ఇళ్ల సర్వేనే పూర్తయింది. కుటుంబాలు ఎక్కువగా ఉన్న ఇళ్లలో అయితే గంటకుపైనే సమయం పడుతోందని.. మధ్యాహ్నం నుంచి కాకుండా రోజంతా చేస్తేనే సర్వే పూర్తవుతుందని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. వివరాలు సేకరిస్తూ ఫామ్ నింపడం కష్టంగా ఉండటంతో కుటుంబ సభ్యులను సహాయకులుగా తీసుకెళుతున్నట్టు చెప్తున్నారు. ఇళ్లకు తాళాలతో ఇబ్బంది పంటల కోతల సమయం కావడంతో ఎన్యూమరేటర్లు ఎప్పుడు వస్తారో తెలియక రైతులు, కూలీలు పనులకు వెళ్తున్నారు. దీనితో సర్వే కోసం వెళ్తున్న ఎన్యూమరేటర్లకు తాళాలు వేసిన ఇళ్లు దర్శనమిస్తున్నాయి. పట్టణాల్లో ఇళ్లలో ఎవరో ఒకరు ఉంటుండటంతో సర్వే ముందుకుసాగుతోంది. తాళాలు వేసిన ఇళ్లను గుర్తుంచుకుని మళ్లీ రావడం ఇబ్బందేనని ఎన్యూమరేటర్లు చెప్తున్నారు.జిల్లాల వారీగా ‘సర్వే’ తీరును పరిశీలిస్తే.. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8,53,950 ఇళ్లు ఉండగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో శనివారం రాత్రి వరకు స్టిక్కరింగ్ పూర్తి కాలేదు. వ్యవసాయ సీజన్ కావడంతో రైతులు, కూలీలు పొలాలకు వెళ్లడంతో చాలా ఇళ్లకు తాళం వేసి ఉంది. కొందరు ఇళ్ల యజమానులు వ్యక్తిగత వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. భద్రాద్రి జిల్లాలో సర్వే ఫామ్‌లు ఆలస్యంగా చేరాయి. ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే ఆ వివరాలు చెప్పలేదు. గొత్తికోయలకు ఆధార్‌కార్డులు, ఓటరు కార్డులు ఉన్నా కులం సర్టిఫికెట్లు లేక సర్వేలో ఏం రాయాలో స్పష్టత లేకుండా పోయింది. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది ఆదాయ వివరాలను సరిగ్గా చెప్పలేదు. ధరణి సమాచారం అడిగిన ఎన్యుమరేటర్లకు ‘మీకెందుకు?’అనే ప్రశ్న ఎదురైంది. రోజువారీ కూలీలు మొదటిరోజు పనులు వదులుకుని ఇంటి వద్దే ఉన్నా ఎన్యుమరేటర్లు రాక విసుగుపడటం కనిపించింది. ఇంటి నిర్మాణం, విస్తీర్ణంపై సమాధానాలు రాలేదు. ఐటీ రిటర్నులు, వడ్డీ వ్యాపారులు, కులాంతర వివాహాల సమాచారం రాబట్టలేకపోతున్నారు. ⇒ కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో శనివారం కూడా స్టిక్కరింగే కొనసాగింది. పలుచోట్ల కొందరు ఇంటికి స్టిక్కర్లు వేయవద్దంటూ నిరాకరించారు. ⇒ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్రాల కొరతతో సర్వే ఆలస్యంగా మొదలైంది. ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు పది గృహాలను అప్పగించగా.. సమయం సరిపోక 5, 6 ఇళ్లే సర్వే చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో శనివారం రాత్రి వరకు కూడా స్టిక్కరింగ్ కొనసాగింది. రెండో శనివారం కావడంతో ఆరీ్పలు, ఉపాధ్యాయులు సర్వేకు హాజరుకాలేదు. బోధన్ నియోజకవర్గంలో సర్వే స్టిక్కర్లు వేయలేదని స్థానికులు చెప్పారు. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11,17,467 ఇళ్లు ఉండగా.. 8,231 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు, ఆస్తుల వివరాలను చెప్పడం లేదు. ఆధార్ నంబర్, పాస్‌బుక్ వివరాలు ఇచ్చేందుకు కూడా వెనకాడుతున్నారు. పట్టణాల్లో దాదాపు అన్ని వివరాలు చెబుతున్నా ఉద్యోగం, ఆస్తి వివరాలు దాటవేస్తున్నారు. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8.5 లక్షల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. పలువురు ఆస్తులు, భూములు, ఓపెన్ ప్లాట్ల వివరాలు చెప్పడం లేదు. ఇంట్లో ఉద్యోగం చేసే వారి వివరాలు చెప్పడం లేదు. ఉమ్మడి కుటుంబాల్లోని వారు వేర్వేరుగా వివరాలు నమోదు చేయాలని కోరుతున్నారు. ధరణి పాస్ బుక్ నంబర్, ఆధార్ కార్డులు వెతకడం, పట్టాపాస్ బుక్‌లు బ్యాంకుల్లో ఉండటంతో వివరాల నమోదులో జాప్యం జరుగుతోంది. బెల్లంపల్లిలో చాలాచోట్ల వార్డు కౌన్సిలర్లు, నాయకులు అందరినీ ఒకేచోటకు పిలిపించి.. వివరాలు నమోదు చేయించారు. ⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 9,67,871 కుటుంబాలు ఉన్నాయి. రుణాలు, భూములు, ఆస్తి వివరాలు చెప్పడానికి చాలామంది ముందుకురాలేదు. బీసీ–ఈ, సీ సరి్టఫికెట్లు తీసుకున్న వారు చెప్పడానికి వెనుకంజ వేశారు. కొందరు మహిళా టీచర్లు తమ భర్త, పిల్లలను సహాయకులుగా తెచ్చుకున్నారు.రైతు భరోసా లేదు.. నేనెందుకు చెప్పాలి?వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిరి్నబావి ప్రాంతంలో నరిగె ఐలయ్య ఇంటికి సర్వే కోసం ఎన్యూమరేటర్ వెళ్లారు. కొన్నింటికి సమాధానాలు చెప్పిన ఐలయ్య.. వ్యక్తిగత ఆస్తుల విషయంలో సరిగా స్పందించలేదు. రైతు భరోసా రానప్పుడు భూమి వివరాలు ఎందుకని ఎదురు ప్రశ్నించారు. పింఛన్ ఎప్పుడు ఇస్తారని ఆరా తీశారు. ఎన్యూమరేటర్ సర్దిచెప్పడంతో చివరకు భూమి వివరాలు చెప్పినా.. ఈ కుటుంబం వద్దే రెండు గంటలు గడిచిపోయింది.అరగంట నుంచి గంట వరకు పడుతోంది.. మాకు రోజుకు 20 కుటుంబాల చొప్పున సర్వే చేయాలంటూ బుక్లెట్లు ఇచ్చారు. ప్రశ్నలు అడగడం, వాటి కోడ్ కోసం బుక్లెట్ చూడటం ఇబ్బందిగా ఉంది. డైరెక్ట్‌గా ఫామ్‌లోనే నమోదు చేసేలా ఉంటే బాగుండేది. సర్వేపై ప్రజలకు అవగాహన లేక సమాధానాలు చెప్పడానికి ఆలోచిస్తున్నారు. ఒక కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉంటే అరగంట నుంచి గంట వరకు సమయం పడుతోంది. – ఎన్.పారిజాత, ఎన్యుమరేటర్, నకిరేకల్, నల్లగొండ జిల్లావివరాలు చెప్పేందుకు వెనకాడుతున్నారు ఇంటి యజమానిని ప్రశ్నలన్నీ అడిగి పూర్తి చేయడానికి చా లా సమయం పడుతోంది. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. అవగాహన లేకపోవడంతో ఆస్తులకు సంబంధించిన వివరాలు చెప్పడానికి వెనుకాడుతున్నారు. కొన్ని ఇళ్ల వద్ద గంట దాకా సమయం పడుతోంది. సర్వే కోసం మరికొంత సమయం ఇవ్వాలి. – వేలిశెట్టి నరసింహారావు, ఎన్యుమరేటర్, వైరా, ఖమ్మం జిల్లా -
ఒకటే చట్టం... ఒకటే మాడ్యూల్
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లోని అన్ని మాడ్యూళ్లను రద్దు చేసి ఒకటే మాడ్యూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న అన్ని రెవెన్యూ చట్టాల స్థానంలో ఒకటే చట్టాన్ని (రెవెన్యూ కోడ్) అమల్లోకి తెచ్చేందుకు కూడా కసరత్తు చేస్తోంది. ధరణి పోర్టల్ పునరి్మర్మాణ కమిటీతోపాటు గతంలో నల్సార్ విశ్వవిద్యాలయం చేసిన సిఫార్సు మేరకు రెవెన్యూ కోడ్‌ను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఈ కోడ్ ముసాయిదా తయారీలో నిమగ్నమైన రెవెన్యూ వర్గాలు త్వరలోనే ముసాయిదా చట్టాన్ని ప్రభుత్వ పరిశీలనకు పంపనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో 124 రెవెన్యూ చట్టాలు, నియమాలు అమల్లో ఉన్నాయి. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)తోపాటు సర్వే, భూ రికార్డుల నిర్వహణ, సీలింగ్, కౌలు, రెవెన్యూ రికవరీ, భూ ఆక్రమణ నిరోధం, రెవెన్యూ పరిపాలన, భూదాన్, ఇనాం, వదిలివేయబడిన భూములు, భూవివాదాల పరిష్కారం... ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న అన్ని చట్టాలు ప్రస్తుతం కూడా అమల్లో ఉన్నాయి. అయితే వాటన్నింటినీ తెలంగాణకు వర్తింపజేయాల్సిన అవసరం లేదని.. వాటిలో 20కిపైగా కాలంచెల్లిన చట్టాలున్నా యని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో భూచట్టాల నిపుణులు పేర్కొన్నారు.కానీ ప్రభు త్వం దీన్ని పెడచెవిన పెట్టింది. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పాటయ్యాక రెవెన్యూ వ్యవస్థ అమల్లో గందరగోళాన్ని నివారించేందుకు ఒకటే రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తేవాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాలంచెల్లిన ఆ చట్టాలను రద్దు చేయడంతోపాటు అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న 5 వేల భూ చట్టాలను అధ్యయనం చేసి అందులో అవసరమైన చట్టాలను తెలంగాణకు వర్తింపజేస్తూ రెవెన్యూ కోడ్‌లో పొందుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులకూ సులభతరం... నిజాం హయాంలో తెలంగాణ ప్రాంత భూపరిపాలన, రెవెన్యూ వ్యవస్థ అమలు కోసం భూమి రెవెన్యూ చట్టం–1907 పేరుతో సమగ్ర చట్టం అమల్లో ఉండేది. తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో కలిశాక ఈ చట్టం స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తూ 124 చట్టాలుగా మార్చారని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు రెవెన్యూ కోడ్ అమల్లోకి వస్తే భూమి సమస్యల పరిష్కారం సంబంధిత అధికారులకు సులభతరం కావడంతోపాటు భూమి హక్కులను కాపాడుకునే విషయంలో రైతులకు కూడా స్పష్టత వస్తుందని అంటున్నారు.ఏ చట్టం ద్వారా ఏ సమస్య పరిష్కారమవుతుంది, ఏ అధికారి వద్దకు వెళ్లాలనే విషయంలో కూడా అన్నదాతలకు గందరగోళం పోతుందని చెబుతున్నారు. యూపీలో 2016లోనే ఈ కోడ్ అమల్లోకి వచ్చిందని, ప్రస్తుతం ఒడిశాలోనూ కోడ్ అమలు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా రెవెన్యూ కోడ్ అమల్లోకి వస్తే భూమి సమస్యలు, రైతుల ఇబ్బందుల పరిష్కారానికి సమగ్ర వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. సౌకర్యవంతంగా ఉంటుంది దేశవ్యాప్తంగా 5 వేలకుపైగా భూ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల భౌగోళిక, సామాజిక పరిస్థితుల ఆధారంగా ఆయా రాష్ట్రాలు తగిన చట్టాలను అమలు చేసుకుంటున్నాయి. యూపీలో రెవెన్యూ కోడ్ అమల్లోకి వచ్చాక అక్కడ మారిన పరిస్థితుల గురించి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చాం. ప్రతి రాష్ట్రంలో రెవెన్యూ కోడ్ అమల్లోకి వస్తే భూచట్టాల్లో ఉన్న గందరగోళం పోతుంది. – ఎం. సునీల్‌కుమార్, భూచట్టాల నిపుణులు -
థర్డ్ పార్టీతో ధరణి మదింపు!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌ను థర్డ్ ఫార్టీతో ఆడిటింగ్ (మదింపు) చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు చేసింది. ఫోరెన్సిక్‌తో పాటు కమ్యూనిటీ ఆడిటింగ్ చేయించడం ద్వారా ఈ పోర్టల్‌లో భూముల రికార్డులు ఏమైనా తారుమారయ్యాయేమో గుర్తించాలని సూచించింది. ఈ పోర్టల్ ద్వారా భూముల రికార్డుల నిర్వహణ గత నాలుగేళ్లుగా ప్రైవేటు కంపెనీ చేతుల్లో ఉన్నందున అనధికారికంగా రికార్డుల మార్పు జరిగిందేమో పరిశీలించాలని ఇటీవల ప్రభుత్వానికి ఇచి్చన నివేదికలో కోరినట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన ఈ పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని వేలాది ఎకరాల భూముల రికార్డులు మారిపోయాయని, అర్ధరాత్రి రికార్డుల మార్పిడి జరిగిందన్న రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ధరణి పోర్టల్ పునరి్నర్మాణ కమిటీ చేసిన సిఫారసు ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు పద్ధతుల్లోనూ చేయడం మంచిది ఆడిటింగ్‌ను రెండు పద్ధతుల్లోనూ నిర్వహించాలని కమిటీ ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది. ఫోరెన్సిక్‌తో పాటు కమ్యూనిటీ ఆడిటింగ్ చేపట్టాలని, ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో భాగంగా ధరణి పోర్టల్‌లో రికార్డుల నమోదుతో పాటు మారి్పడి లావాదేవీలను సాఫ్ట్వేర్, సైబర్ క్రైమ్ నిపుణులతో మదింపు చేయించాలని సూచించినట్టు సమాచారం. ఇక, గ్రామాలకు వెళ్లి కమ్యూనిటీ ఆడిటింగ్ చేయాలని, ప్రతి రైతు యాజమాన్య హక్కుల రికార్డులను మాన్యువల్ పద్ధతిలో సరిచూడాలని సిఫారసు చేసింది.ఇందుకోసం మూడు, నాలుగు నెలల కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉంటుందని భూ నిపుణులు చెపుతున్నారు. కమ్యూనిటీ ఆడిటింగ్ నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో రైతులు ధరణి పోర్టల్ ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వస్తా యని, అదే విధంగా ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న భూసమస్యల దరఖాస్తులకు కూడా పరిష్కారం లభిస్తుందని కమిటీ పేర్కొన్నట్టు తెలిసింది. భూరికార్డులు అనధికారికంగా మార్చి ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముందనే కోణంలో కమిటీ ఈ ఆడిటింగ్‌లకు సిఫారసు చేసినట్టు సమాచారం. ఆ మూడు రికార్డులు చూడండి ఆడిటింగ్‌లో భాగంగా మూడు రికార్డులను పరిశీలించాలని ధరణి కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాక ముందు భూ యాజమాన్య హక్కుల రికార్డు డేటా, 2017లో నిర్వహించిన భూరికార్డుల ప్రక్షాళన ద్వారా వచ్చిన రికార్డుల డేటా, ఆ తర్వాత ధరణి పోర్టల్‌లో నమోదు చేసిన డేటాలను పరిశీలించాలని, అప్పుడే అనధికారిక మార్పులు జరిగాయో లేదో తేలుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచి్చన తర్వాత జరిగిన రికార్డుల మారి్పడి లావాదేవీలను కూడా పరిశీలించాల్సి ఉంటుందని, గతంలో ఏడాదికోమారు జమాబందీ ప్రక్రియ ద్వారా భూమి రికార్డులను పరిశీలించే వారని, ఇప్పుడు ఆ పద్ధతి అమల్లో లేనందున ఆడిటింగ్ నిర్వహించడం ద్వారా జమాబందీ నిర్వహించినట్టు కూడా అవుతుందని ఆ నివేదికలో కమిటీ అభిప్రాయపడ్డట్టు తెలిసింది. -
ధరణి పేరుతో పెద్దాయన దగా చేశారు
సాక్షి, హైదరాబాద్: ధరణి పేరుతో పెద్దాయన రాష్ట్ర ప్రజలను దగా చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. 2020లో తెచ్చిన ఈ పోర్టల్ వల్ల ప్రజలు ఎంతగానో నష్టపోయా రన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ‘తెలంగాణ భూ హక్కులు–సంస్కరణలు’ అనే అంశంపై జరిగిన లఘుచర్చలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఆ పెద్దమనిషి చేసిన పాప ఫలితాన్ని తెలంగాణ ప్రజానీకం అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు.ముఖ్యమంత్రిగా 1973లో పీవీ నరసింహారావు భూపరిమితి చట్టం తెచ్చి భూస్వాముల వద్ద ఉన్న భూములను పేదలకు పంచారన్నారు. 2006లో వైఎస్.రాజశేఖరరెడ్డి తొలిసా రిగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడుభూ ములకు పట్టాలిచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికీ గిరిజనులు వైఎస్ పట్టా భూములుగానే చెప్పుకుంటున్నార న్నారు. ఎవరి సూచనలు, అభిప్రాయా లను తీసుకోకుండా పెద్దాయన, ఆయన తొత్తుగా ఉన్న ఓ అధికారి కూర్చొని చేసిన చట్టం ధరణి అని...ఇప్పటికీ 1.18 లక్షల భూ ఫిర్యాదులు పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు.ధరణి పేరుతో పేదల దగ్గరి నుంచి గత ప్రభుత్వం లాక్కొన్న ఆస్తులను తిరిగి పేదలకు పంచుతామని, మాయమైపోయిన లక్షల ఎకరాలను అర్హులైన వారికి ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ ధరణి వల్ల రెవెన్యూ వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ నవాబ్ నాటి దోపిడీని తలపించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణితో రైతులను దోపిడీ చేసిందన్నారు. «ధరణి.. ఓ విప్లవం: పల్లారాష్ట్రంలో భూ వివాదాలు లేకుండా చేయాలనే కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తీసు కొచ్చారని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అందరితో చర్చించిన తర్వాతే ధరణి తెచ్చారని, నాలుగు గో డల మధ్య తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలున్న 18 లక్షల ఎకరాలను పార్ట్ బీలో చేరిస్తే, అందులో కూడా 10 లక్షల ఎకరాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమైనట్టు చెప్పారు. వివిధ కారణాల వల్ల కొన్ని భూము లు నిషేధిత జాబితాలోకి వెళ్లాయన్నారు.రైతుల ఆత్మహత్యలు, హత్యలకు ధరణే కారణం: సీతక్కధరణి ఎంతో అద్భుతంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెబుతుండగా మంత్రి సీతక్క కలగజేసుకున్నారు. ధరణి అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని, రైతుల ఆత్మహత్యలు, హత్యలు పెరిగాయని చెప్పారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను తుంగలో తొక్కారని, దీంతో పేదలు భూముల్లో ఫాంహౌస్‌లు వెలిశాయని చెప్పారు. భూమిని ఎవరు సాగుచేస్తున్నారో తెలిపే కాలమ్‌ను తొలగించారని విమర్శించారు.సోమేశ్‌కుమార్ మాయలో కేసీఆర్ పడ్డారు: కూనంనేని ధరణితో గ్రామాల్లో అల్లకల్లోల పరిస్థితి ఏర్ప డిందని, ప్రజలకు పనికి రాని ఈ పోర్టల్‌ను రద్దు చేయడం సరైందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమేశ్‌కుమార్ మాయలో పడిన కేసీఆర్ ధరణితో ప్రజలకు ఎన్నో ఇబ్బందులు కలిగించారని చెప్పారు. కాంగ్రెస్ చేపట్టే సంస్కరణల్లో కాస్తు కాలమ్ పెట్టాలని, కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలన్నారు.అవినీతిపరుల పేర్లు ఎందుకు చెప్పడం లేదు: మహేశ్వర్‌రెడ్డి ధరణితో లక్షల ఎకరాల భూములు మాయమ య్యాయని, రూ.2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించిందని, ఆ వివరాలు ఇప్పుడు ఎందుకు బయటపె ట్టడం లేదని బీజేపీ పక్షనేత మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ధరణితో లాభపడ్డ బీఆర్ఎస్ నాయకుల పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ధరణి అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు.వక్ఫ్ భూములను పరిరక్షించిన వైఎస్: అక్బరుద్దీన్ ఒవైసీ అనేక లోపాలతో తీసుకొ చ్చిన ధరణి పోర్టల్ కారణంగానే బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిందని, అదే కాంగ్రెస్ విజయానికి కారణమైందని ఎంఐఎం పక్షనేత అక్బరు ద్దీన్ ఒవైసీ అన్నారు. ధరణి తో ఎంతోమంది అక్రమంగా ప్రభుత్వ, పేదల భూములను తమ పేరిట చేసుకున్నారని, అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపాలని కోరారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వక్ఫ్ భూముల పరిరక్షణకు ఎన్నో చర్యలు తీసుకున్నారని, ఆయన గొప్ప నేత అని అక్బరుద్దీన్ గుర్తు చేసుకున్నారు. రెండోసారి వక్ఫ్‌బోర్డు భూములను సర్వే చేయించింది వైఎస్ అని చెప్పారు. -
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అప్డేట్స్..తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదాతొమ్మిది రోజుల పాటు సాగిన శాసన సభ సమావేశాలు32ప్రశ్నలు సమాధానాలు ఇచ్చిన శాసన సభ...8ప్రశ్నలకు సమాధానం రాలేదని తెలిపిన స్పీకర్ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపనున్నా మంత్రులు23 జులై నుంచి ఆగస్టు 2వరకు జరిగిన శాసన సభ65 గంటల 33 నిమిషాలు సాగినా శాసన సభ132 ప్రసంగాలు సభలో ఎమ్మెల్యేలు చేసినట్లు స్పీకర్ ప్రకటనగవర్నమెంట్ రెజల్యూషన్ 1, 5 బిల్లు ఆమోదం, 2 షాట్ డిస్కషన్, 3 మోషన్స్ పై చర్చ జరిగినట్లు ప్రకటనశాసన సభలో ఒక ప్రభుత్వ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిపిన స్పీకర్👉హైదరాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చఔటర్ లోపల ఉన్న నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్నగరాభివృద్ధికి హైడ్రాను సిద్ధం చేస్తున్నాంహైదరాబాద్ రోడ్లపై నీరు ఆగకుండా ఉండేందుకు వాటర్ హార్వెస్టింగ్‌లను ఏర్పాటు చేస్తాంమూసీని సబర్మతి, లండన్ థీమ్స్ తరహాలో డెవలప్ చేస్తాంత్వరలోనే మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్లను నియమిస్తాం👉 ధరణి పేరుతో పేద రైతులకు అన్యాయం చేశారు: మంత్రి సీతక్కధరణి తెచ్చి రైతుల్లో భయం కల్పించారుధరణి పేరుతో పేద రైతులకు అన్యాయం చేశారుభూములు అమ్ముకున్న వారికి తిరిగి పట్టాలు ఇచ్చారుబీఆర్ఎస్ నాయకులు తమ పేరు మీద భూములు రాసుకుని రైతు బంధు ఎంజాయ్ చేశారుములుగుకి వస్తే తప్పులను నిరుపిస్తాపేద రైతుల హత్యలు, అత్మ హత్యలకు ధరణే కారణంగత ప్రభుత్వం ధరణితో రెవెన్యూ తప్పులను సరిద్ధిద్దలేదుఇప్పుడు ల్యాండ్ సీలింగ్ చట్టానికి తూట్లు పొడుస్తున్నారుపేదల అసైన్డ్ ల్యాండ్ గుంజుకున్నారువందల ఎకరాల్లో ఫార్మ్ హౌస్‌లు కట్టుకున్నారురైతుల ఆవేదన తొలగించేలా, భూముల పై హక్కులు కల్పిస్తూ సమగ్ర చట్టం తీసుకొస్తాంత్వరలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకు రావాలని ప్రజలు ఆడుగుతున్నారురైతులకు భరోసా కల్పించేందుకు కొత్త చట్టం తీస్తున్నాం👉మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కామెంట్స్దేశంలో పేదవాడికి అండగా ఉన్నది ఇందిరమ్మ మాత్రమే.భూ రికార్డులను డిజిటలైజ్ చేసింది కూడా వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే.2006లో వైఎస్సార్ పోడు భూములకు పట్టాలిచ్చారు.భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేసింది.ధరణి పేరుతో బీఆర్ఎస్ దగా చేసింది.తెలంగాణ ప్రజల ఆస్తులను సింగపూర్ కంపెనీ చేతిలో పెట్టారు.కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక పోయినట్టుగా ధరణి ఉంది.బీఆర్ఎస్ నిర్వాకం రైతుల పాలిట శాపంగా మారింది.సింగపూర్ కంపెనీకి తెలంగాణ భూములను కేసీఆర్ తాకట్టు పెట్టారు.సాదాబైనామాల కరెక్షన్ కోసం 9 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కానీ, ధరణిలో ఆ ఆప్షనే లేదు.ఏదైనా ఒక సర్వే నెంబర్లో కొంత భూమిపై వివాదం ఉంటే మొత్తం సర్వే భూమిపై ఆంక్షలు పెట్టారు.ధరణి చట్టం మూడు తలలతో మొదలై 33 తలలతో అవతరించింది.కలెక్టర్లు అప్రూవల్ చేసిన అప్లికేషన్లు మళ్ళీ చూడాలనుకున్నా కలెక్టర్లకు యాక్సెస్ ఇవ్వలేదు.కేసీఆర్ ఎవరి మాట వినలేదు, నేను బీఆర్ఎస్ ఉన్నప్పుడు చెప్పి చూశాను..పట్టించుకోలేదు.కేసీఆర్, ఓ అధికారి కూర్చొని ధరణిని నడిపించారుకారణాలు లేకుండా గతంలో అప్లికేషన్ రిజక్ట్ చేసేవారు. 👉సివిల్ కోర్టు సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదంఅసెంబ్లీలో కాగ్ రిపోర్ట్..2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్ట్రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయంలో ఎక్కువగా ఉందిసాగునీటి ప్రాజెక్టులపై గత ఐదేళ్లలో ఎక్కువ ఖర్చులు చేశారు(పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం)1983 - 2018 మధ్య కాలంలో 20 సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం ప్రారంభం అయితే వాటిపై 1లక్ష 73వేల కోట్లుమొదటి అంచనా వ్యయం 1 లక్ష కోట్లు నుండి 2 లక్షల కోట్లకు పెరిగింది.ద్రవ్యలోటు పరిమితులకు లోబడి ఉందిఇచ్చిన రుణాలు అడ్వాన్సులు భారీగా ఉన్నాయి.వాటా అత్యధికంగా ఉన్నాయికాళేశ్వరం మిషన్ భగీరథకే ఎక్కువ రుణాలు తీసుకున్న రుణాలు చెల్లించడానికే ఎక్కువ ఖర్చులుకార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను మళ్ళీ చెల్లించడానికి ఇబ్బంది15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి కన్నా 6శాతం ఎక్కువ రుణాలు తీసుకున్న గత ప్రభుత్వంగత సంవత్సరం బడ్జెట్లో పన్నెతర రాబడి అంచనాలు ఎక్కువగా వేశారుఎస్సీ అభివృద్ధి నిధుల్లో 58శాతం, ఎస్టీలో నిధుల్లో 38శాతం వినియోగం కాలేదుఖర్చు అయిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులను దారి మళ్లించారుసొంత ఆదాయం కంటే.. రుణాలపై ఎక్కువగా ఆధారపడిందిఇప్పుడున్న రుణాలు తీర్చేందుకు రానున్న పదేళ్లలో 2లక్షల 86వేల కోట్లు సమీకరించాల్సి ఉంటుందిఇచ్చిన రుణాలను జప్తు చేసిన రెవెన్యూ రుణాలను ఎక్కువ చేసిన చూపిన ప్రభుత్వం2022 మార్చి నాటికి హెల్త్ డిపార్ట్‌మెంట్‌పై కాగ్ రిపోర్ట్.జిల్లా ఆసుపత్రులలో అగ్నిప్రమాద నివారణ పరికరాలు లేవు.మందుల అవసరాలపై రెండు సంవత్సరాలకు ఒకసారి సమీక్ష చేయాల్సి ఉన్నా.. 2015,19లో మాత్రమే సమీక్ష చేసారు.ఆసుపత్రులలో అవసరమైన మేరకు మందులను అందుబాటులో ఉంచడం లేదు.2017-18 ప్రధాన మంత్రి మాతృ వందన కింద వచ్చిన 65 కోట్ల నిధులు 2022 జూన్ నాటికి ఉపయోగించకపోవడంతో నిధులు కేంద్ర ఖాతాలోనే ఉన్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కామెంట్స్..మొన్న అసెంబ్లీలో జరిగిన వీడియోలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది.ఇది దుర్మార్గపు చర్య.ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్..పార్లమెంట్ పరిధిలో ఎవరైనా ఫోటోలు వీడియోలు తీస్తే కఠిన చర్యలు ఉన్నాయి.ఒకరోజు జరిగిన ఘటనపై ఫోటోలు వీడియోలు తీస్తే వెంటనే డిలీట్ చేయించారు.పార్లమెంటు పరిధిలో ఫోటోలు వీడియోలు నిషేధం ఉన్నాయి. కేటీఆర్ కామెంట్స్..సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారు.పోస్టులు డిలీట్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు కూడా లోపల విజువల్స్ చూపించటం లేదు.మంత్రులు రన్నింగ్ కామెంట్రీ చేస్తే ఎలా?పార్లమెంట్లో వీడియో లు, ఫోటోలు తీస్తున్నారు.అక్కడ జరిగే నిరసనలు జరిగేవి అన్ని చిత్రీకరిస్తున్నారు.ఒక్కసారి గమనించాలి. మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..అసెంబ్లీ విషయంలో మంత్రి సీతక్కపై మార్ఫింగ్ వీడియోలు ప్రచారం జరిగాయి.మంత్రి సీతక్క మార్ఫింగ్ వీడియోలపై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది ప్రతిపక్షం చెప్పాలి. 👉మార్ఫింగ్ వీడియోలపై స్పీకర్ సీరియస్👉మార్ఫింగ్ వీడియోలు చేస్తే కఠిన చర్యలు👉అసెంబ్లీలో వీడియోలు మార్ఫింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు చేస్తుంది.కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా ఉండే విచారణ చేస్తున్నాం.కొత్త చట్టాలపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయబోతున్నాం.ఇప్పటికే కొన్ని రాష్ట్రానికి చట్టాలపై ఆ అభిప్రాయాలు తెలిపాయి.సైబర్ క్రైమ్ అరాచకాలను అరికట్టేందుకు కొత్త చట్టాలను తేవడానికి వెనుకాడబోము.సైబర్ క్రైమ్ అరాచకాలు తారాస్థాయికి పోయాయి.సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోల ప్రచారం చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయి.కేటీఆర్ అడిగినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై విచారణ చేస్తాం.సభా ప్రాంగణంలో సభను అప్రతిష్టపాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం.లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించే విధంగా ఎవరు చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటాం.క్రిమినల్ చట్టాలపై అందరి అభిప్రాయాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి కామెంట్స్..సివిల్ కోర్టు సవరణ బిల్లును సమర్ధిస్తూ కొన్ని సూచనలు చేస్తున్న.ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెంచాలికొత్తగా ఏర్పడిన జిల్లాలో కోర్టులకు సొంత భవనాలు లేవుఅద్దె భవనాల్లో కోర్టులు నిర్వహించడం బాధాకరంనియోజకవర్గాల్లో జూనియర్ సివిల్ కోర్టులు లేవుకేసులు సత్వర పరిష్కారం కావాలంటే జూనియర్ సివిల్ కోర్టులు పెంచాలికోర్టుల అంశంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందిగత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దాలిఎమ్మెల్యే కూనంనేని కామెంట్స్..కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు రాజ్యమేలుతున్నారు.పోలీసు వ్యవస్థ పాత సీసాలో పాత సారా టైప్ నడుస్తోంది.బీఆర్ఎస్ వదిలేసిన చెప్పుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాళ్లు పెడుతోంది.ఎన్ని ప్రభుత్వాలు మారిన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమాలకు అడ్డంకులు చెప్పలేదు.కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా సుందర విజ్ఞాన కేంద్రంలో ఏదైనా కార్యక్రమం పెట్టాలంటే అనుమతి తీసుకోవాలని అంటున్నారు.అరెస్టులు భారీగా జరుగుతున్నాయి అక్రమంగా లోపల వేస్తున్నారు.రాజ ద్రోహం కింద... దేశద్రోహం అని పేరు మారింది అంతే.కేంద్రం చట్టాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.సామాన్య కార్మికులు పేదవాళ్లు ధర్నాలు చేసే అవకాశం లేదు..ముఖ్యమంత్రి సామాన్య కార్యకర్తలకు, పేదవాళ్లకు అవకాశం కల్పించాలి.హరగోపాల్ లాంటి వాళ్ళు కార్యక్రమాలు పెడితే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మంత్రి పొన్నం కామెంట్స్..సభలో రన్నింగ్ కామెంట్రీ ఆపాలి.సోషల్ మీడియాలో కావాలనే ట్రోలింగ్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులు, వస్తున్న ఫేక్ వీడియోలపై చర్యలు తీసుకోవాలి..రవాణా శాఖ మంత్రిగా మొన్న కూడా అసెంబ్లీలో ఇప్పటి వరకు 70 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు..కొంతమంది కావాలనే వీడియోలు క్రియేట్ చేసి మహిళలను అవమానిస్తున్నారు..అలాంటి వారిపై పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలి..నిన్న నేను మాట్లాడుతుంటే కావాలని వీడియో ఎడిట్ చేసి వైరల్ చేశారు.గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వందల మంది మీద కేసుకు కేసులు పెట్టారు..నా కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటున్నారు..ఒక గిరిజన మహిళా మంత్రి శాసన సభలో మాట్లాడిని దాన్ని కూడా వైరల్ చేస్తున్నారు..నిన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ నాతో మాట్లాడుతుంటే దానిని అసభ్యంగా ఎడిట్ చేశారు .బావ స్వేచ్ఛ ఉండాలి.. కానీ ఎదుటి వ్యక్తిని అవమానించే విధంగా ఉంటే ఎట్లా..సభలో జరిగిన అంశాలను కించపరిచి అవమానపరిచే విధంగా వీడియోలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి..కేటీఆర్ కామెంట్స్..రాష్ట్రంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి.బాధితులకు త్వరగా న్యాయం జరగాలి.👉అసెంబ్లీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్బీఆర్ఎస్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందో లేదో కానీ మీరు అమెరికా వెళ్లి వచ్చే వరకు సభ్యత్వం రద్దు అయ్యేలా ఉంది.ముఖ్యమంత్రి బెదిరిస్తే బయటపడే వాళ్ళు లేరు.సబితా ఇంద్రారెడ్డిని అవమానించినందుకు చేసిన సీఎం క్షమాపణ చెప్పాలి..అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం ఉంటాదో లేదో చూసుకో ముఖ్యమంత్రి..ఖమ్మం, నల్గొండ మంత్రులు మీ సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారుఅసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదు.హుజురాబాద్ ప్రజలకు రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలి.హుజురాబాద్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం స్పందించలేదు.నా జీతం నుంచి 4 లక్షలు ఇచ్చాను వాళ్లకు.హుజురాబాద్‌లో పొన్నం ప్రభాకర్ మిత్రుడు ప్రెస్ వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. 👉తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నేడు తొమ్మిదో రోజు కాగా, ఈ సెషన్‌కు ఇదే చివరిరోజు కూడా. ఈరోజు ముఖ్యంగా మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చించనున్నారు.👉నేటి సమావేశంలో భాగంగా ధరణి పోర్టల్‌పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చించనున్నారు. అలాగే, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నారు. అంతేకాకుండా.. త్వరలో ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించనున్నారు.👉ఇక, నిన్న అసెంబ్లీలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ నేడు ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. అలాగే ప్రజలకు తెల్ల రేషన్‌కార్డులు ఇచ్చే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామన్నారు. పేదలకు రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని తెలిపారు. రేషన్‌కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.👉మరోవైపు.. నిన్న అసెంబ్లీ వద్ద నిరసనల కారణంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, నేడు బీఆర్ఎస్ నేతలు సభకు హాజరవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. -
ధరణిపై ప్రజల్లోకి ఆర్వోఆర్ ముసాయిదా
సాక్షి, హైదరాబాద్: రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్ట ముసాయిదాను ప్రజల్లో ఉంచి వారి అభిప్రాయాలు, సలహాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. చట్టం చేసే ముందు పార్లమెంటరీ పద్ధతిని అనుసరించాలని, మరీ ముఖ్యంగా భూ సమస్యల విషయంలో ప్రజలు, రైతుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ముందుకెళ్లడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకురావాల నుకుంటున్న ఆర్వోఆర్ కొత్త చట్టం విషయంలో విస్తృత సంప్రదింపులు జరపాలని, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాతే కొత్త చట్టాన్ని అమల్లోకి తేవాలని చెప్పారు.సచివాలయంలో సీఎం అధ్యక్షతన శుక్రవారం ధరణి సమస్యలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు మరింత లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. ఒకప్పుడు గ్రామస్థాయిలోనే అందుబాటులో ఉండే రికార్డులు చట్టాల మార్పుతో క్రమంగా మండల కేంద్రానికి, తర్వాత జిల్లా కేంద్రానికి, రాష్ట్ర స్థాయికి వెళ్లిపోయి ప్రజలకు దూరమయ్యాయని అన్నారు.గతంలో భూ సమస్యల పరిష్కారానికి అప్పీలు చేసుకునే అవకాశం ఉండేదని, ధరణితో గ్రామ, మండల స్థాయిలో ఏ సమస్యకు పరిష్కారం లేకుండాపోయిందని, సమస్త అధికారాలు జిల్లా కలెక్టర్‌కు అప్పగించారని వెల్లడించారు. కలెక్టర్లు తీసుకునే ఏ నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం లేకుండా ధరణిని రూపొందించారని, ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించినప్పుడే రైతులకు స్వాంతన కలుగుతుందని రేవంత్ చెప్పారు.భూదాన్, పోరంబోకు, బంచరాయి, ఇనాం, కాందిశీకుల భూముల సమస్యలున్న ఓ మండలాన్ని ఎంపిక చేసుకొని, అక్కడ ఎదురవుతున్న సమస్యలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందిస్తే ఆ సమస్యలపైనా పూర్తి స్పష్టత వస్తుందన్నారు. అవసరాన్ని బట్టి అసెంబ్లీలో చర్చించి ఈ భూములపై తుది నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సమీక్షలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మాజీ మంత్రి కె. జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్‌పీటర్, మధుసూదన్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.నేత కార్మికులకు ఉపాధి: సీఎం రేవంత్చేనేత, పవర్లూమ్ కార్మికుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టీజీసీవో) కార్యకలాపాలపై సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 తర్వాత అన్ని ప్రభుత్వ విభాగాల్లో యూనిఫాం వస్త్రాలు కొనుగోలు చేసే వారితో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ, పోలీసు, ఆరోగ్య విభాగాల్లోనూ ప్రభుత్వ సంస్థల నుంచే వస్త్రం సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.సాదాబైనామా... చేద్దామా.. వద్దా?సాదాబైనామాల పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చ జరిగి నట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 9.24 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో కొత్త ఆర్వోఆర్ చట్టంలో ఈ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి తగిన మార్గం కనుగొనాలనే చర్చ వచ్చింది. అయితే, ఒకరిద్దరు అధికా రులు ఇందుకు అభ్యంతరం చెప్పినట్టు తెలిసింది.సాదాబై నామాలను ఇప్పటికే పలుమార్లు పరిష్కరించామని, ఇంకా అవసరం లేదని, ఒకవేళ చేసినా దుర్వినియోగం జరుగుతుందని, లేదంటే ప్రస్తుత రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేసి వారికి హక్కులు కల్పించాలని చెప్పినట్టు తెలిసింది. ఈ అభిప్రాయాలతో విభేదించిన రెవెన్యూమంత్రి పొంగులేటి ఎట్టి పరిస్థితుల్లోనూ సాదాబైనామా దరఖాస్తులను పరిష్క రించాల్సిందేనని, తాను నియోజకవర్గానికి వెళ్లినప్పుడు వచ్చే భూసమస్యల్లో ఇవి కూడా ప్రధానంగా ఉంటున్నాయని చెప్పారు. -
రూటు మారినా.. జర్నీ అదే!
సాక్షి, హైదరాబాద్: ధరణి దరఖాస్తుల పరిష్కార రూటు మారింది. గతంలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారానికి ఏ దరఖాస్తు వచ్చినా, ఆ దరఖాస్తు కేవలం కలెక్టర్ లాగిన్‌లో మాత్రమే కనిపించేది. కలెక్టర్ వేలిముద్రతో తన లాగిన్‌ను ఓపెన్ చేసి సదరు దరఖాస్తును కిందిస్థాయికి పంపాల్సి వచ్చేది. కానీ తాజాగా ధరణి పోర్టల్‌లో ఓ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ధరణి కింద ఏ దరఖాస్తు వచ్చినా అది తహసీల్దార్‌కు కనిపించేలా, తహసీల్దార్ ఆ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం కోసం పైఅధికారులకు పంపేలా లాగిన్ లభించింది. ప్రయోజనం లేదంటున్న తహసీల్దార్లు దరఖాస్తు పరిష్కారం చేసే రూటు మారింది కానీ ఆ పరిష్కారం కోసం సదరు దరఖాస్తు చేయాల్సిన ప్రయాణం (జర్నీ) మాత్రం మారలేదని, అలాంటప్పుడు రూటు మార్చడం వల్ల ఒనగూరే ప్రయోజనం కూడా ఏమీ లేదని తహసీల్దార్లు చెబుతున్నారు. ⇒ ప్రస్తుతమున్న విధానంలో ధరణి దరఖాస్తులను తహసీల్దార్ ఓపెన్ చేసినా..ఆన్లైన్, ఆఫ్‌లైన్ రికార్డులను ఆర్డీఓ, జేసీ,కలెక్టర్లకు నాలుగు స్థాయిల్లో పంపాలని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఆన్లైన్లో, ప్రింట్లు తీసి ఆఫ్‌లైన్‌లో పంపాల్సి వస్తోందని వాపోతున్నారు. ⇒ఇలా కాకుండా ఆన్లైన్లో దరఖాస్తు పరిశీలించిన తర్వాత ఆన్లైన్లోనే రిమార్క్స్ పంపితే సరిపోతుందని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లతో కూడిన ఆఫ్‌లైన్ రికార్డును నిక్షిప్తం చేసి సదరు దరఖాస్తులకు పరిష్కారం చూపెడితే బాగుంటుందని వారంటున్నారు. ⇒నాలుగుసార్లు ఆన్లైన్లో, నాలుగుసార్లు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చక్కర్లు కొట్టిన తర్వాత పరిష్కారానికి ప్రత్యేక ఫైల్‌పెట్టి మళ్లీ ఆన్లైన్లో పరిష్కరించాల్సి వస్తుందని, ఈ పద్ధతిలో మార్పు తీసుకురావడంపై ఉన్నతస్థాయిలో సమీక్ష జరగాల్సి ఉందని వారంటున్నారు. ⇒ ఆ మార్పు జరిగినప్పుడే ధరణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు. మూడు వారికి... రెండు వీరికి.. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా క్షేత్రస్థాయిలో ఉండే తహసీల్దార్లు, ఆర్డీఓలకు ప్రస్తుతం చాలా తక్కువ అధికారాలున్నాయి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ), గ్రీవెన్స్ ల్యాండ్మ్యాటర్స్ (కులం, ఆధార్‌కార్డుల్లో తప్పులు నమోదు, పేర్లలో అక్షర దోషాలు సవరించడం) లాంటి అధికారాలు తహసీల్దార్లకు ఉండగా, కోర్టు కేసుల సమాచారం, పాస్‌బుక్ లేకుండా నాలా, సంస్థాగత పాస్బుక్కులిచ్చే అధికారాలు మాత్రం ఆర్డీఓలకు ఉన్నాయి.ఈ అధికారాలు మినహా అన్ని అంశాల్లో నిర్ణయాలు తీసుకునే బాధ్యతలు ఇప్పటికీ కలెక్టర్లకు ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా వికేంద్రీకరణ వీలున్నంత త్వరగా జరగాలని, క్షేత్రస్థాయిలో పరిష్కారం కాగలిగిన దరఖాస్తులను అక్కడే పరిష్కరించే అధికారాలు సదరు సిబ్బందికి కలి్పంచినప్పుడే ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. నేడు వీడియో కాన్ఫరెన్స్‌లు ధరణి దరఖాస్తుల పురోగతిపై రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్‌మిత్తల్ శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి నిర్వహించనున్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు సిరిసిల్ల, భూపాలపల్లి, జగిత్యాల, మహబూబ్‌నగర్, మంచిర్యాల, వికారాబాద్, వనపర్తి, వరంగల్, ములుగు, నిర్మల్ జిల్లాలు, 12 నుంచి ఒంటి గంట వరకు మిగిలిన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని సీఎంఆర్ఓ పీడీ వి. లచి్చరెడ్డి విడుదల చేసిన షెడ్యూల్లో పేర్కొన్నారు. -
ధరణి సమస్యలకు చెక్.. కలెక్టర్లకు నవీన్ మిట్టల్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.20 లక్షల పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరలో పరిష్కరించాలని కలెక్టర్లకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. ధరణి సమస్యలపై శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెలాఖరులోగా వీలైనన్ని దరఖాస్తులు పరిష్కరించాలని స్పష్టం చేశారు.పాస్ బుక్ డేటా కరెక్షన్‌లోనే ఎక్కువ దరఖాస్తులు ఉన్నాయి. ధరణిలో 188 టెక్నికల్ సమస్యలు గుర్తించాం. అందులో 163 టెక్నికల్ సమస్యలను పరిష్కరించాం. వారం పది రోజుల్లో మరోసారి భేటీ అవుతాం. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పెండింగ్ దరఖాస్తులు పెరిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో, అతి తక్కువ ములుగులో పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి. కలెక్టర్లతో పాటు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవో లు, తహసీల్దార్లకు ధరణిపై టెక్నికల్ సమస్యలను క్లియర్ చేశాం’’ అని నవీన్ మిట్టల్ వెల్లడించారు. -
ధరణిలో గోల్మాల్.. మణికొండలో భారీ భూకబ్జా!
హైదరాబాద్, సాక్షి: మణికొండ పోకల్‌వాడలో భారీ భూదందా వెలుగు చూసింది. ధరణిలో గోల్మాల్ చేసి వెయ్యి కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశారు. కలెక్టర్లంతా ఎన్నికల హడావిడిలో ఉండగా.. ధరణి నుంచి పాస్‌బుక్‌లు జారీ అయ్యాయి. ధరణి ఉద్యోగులు చేతి వాటం ప్రదర్శించి ఈ స్కామ్‌కు పాల్పడ్డారు. ఎమ్మార్వో ఫిర్యాదు చేయడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది.ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఐదెకరాల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ధరణి ఉద్యోగులతో రూ.3 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. కొంత డబ్బు తీసుకున్న తర్వాతే రంగారెడ్డి ఇద్దరు కలెక్టర్ల సంతకాలతో పాస్‌బుక్‌లు జారీ చేశారు. అయితే.. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న ల్యాండ్‌కు పాస్ బుక్‌లు జారీ కావడంతో ఎమ్మార్వో ఖంగుతిన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు ధరణి ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. భూమిని తమ పేరు మీద రిజిస్టర్ చేసుకున్న ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపైనా సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
ఇలాగైతే ఎప్పటికయ్యేనో?
సాక్షి, హైదరాబాద్: ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం నిర్వహిస్తోన్న స్పెషల్ డ్రైవ్ ఈనెల 9వ తేదీ(శనివారం) తర్వాత కూడా కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 1వ తేదీ నుంచి నిర్వహిస్తోన్న స్పెషల్ డ్రైవ్‌లో కేవలం 31 శాతం దరఖాస్తులు మాత్రమే క్లియర్ అయిన నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు కార్యాచరణ కొనసాగుతుందని రెవెన్యూ, ధరణి పునర్మి ర్మాణ కమిటీ వర్గాలు చెపుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న 2,46,536 దరఖాస్తులకు గాను ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 76,382 దరఖాస్తులను క్లియర్ చేయగా, మరో 1,70,154 దరఖాస్తులపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, 9 రోజుల తర్వాత పెండింగ్‌లో ఒక్క దరఖాస్తు కూడా ఉండకూడదని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఉండడం, రికార్డుల పరిశీలనలో జాప్యం జరుగుతుండడంతో పాటు 8, 9 తేదీల్లో సెలవులు రావడంతో ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో ఈనెల 9 తర్వాత కూడా ఈ డ్రైవ్‌ను కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 6 శాతం.... 85 శాతం జిల్లాల వారీగా పరిశీలిస్తే పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారంలో జగిత్యాల ముందంజలో ఉంది. ఇక్కడ 85 శాతం దరఖాస్తులపై రెవెన్యూ వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 69 శాతం దరఖాస్తులు క్లియర్ అయ్యాయి. నారాయణపేట (65), పెద్దపల్లి (65), భద్రాద్రి కొత్తగూడెం (62), వరంగల్ (56), జనగామ (56), రాజన్న సిరిసిల్ల (52), సిద్ధిపేట, హనుమకొండ (51) జిల్లాల్లో 50 శాతానికి పైగా దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ఇక, అత్యల్పంగా మహబూబ్‌నగర్ జిల్లాలో కేవలం 6 శాతమే పరిష్కారం కాగా, కరీంనగర్లోనూ 6 శాతం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 7, రంగారెడ్డిలో 9 శాతం దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. మాడ్యూళ్ల వారీగా చూస్తే కీలకమైన రెండు మాడ్యూళ్లలో దరఖాస్తుల క్లియరెన్స్ నత్తనడకనే సాగుతున్నట్టు అర్థమవుతోంది. టీఎం15 కింద ల్యాండ్ మ్యాటర్స్ సమస్యల పరిష్కారానికి గాను 40,605 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా 43 శాతం అంటే 17,372 దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. ఇంకా 23,233 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరో కీలకమైన టీఎం 33 మాడ్యూల్లో 1,01,132 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, 27,047 దరఖాస్తులు పరిష్కారం చేయగా, 74,085 పెండింగ్‌లోనే ఉండడం గమనార్హం. ఇది నిరంతర ప్రక్రియ: ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి ‘ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ఆగదు. స్పెషల్ డ్రైవ్ కోసం ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లోనూ ఇదే విషయాన్ని పేర్కొన్నాం. ఈనెల 9వ తేదీ తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల కోడ్ వచ్చినా దీనిపై ఎలాంటి ప్రభావం ఉండదు. రెవెన్యూ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ కొందరు ధరణి దరఖాస్తుల పరిశీలనలో పాలు పంచుకుంటారు. -
కొత్త రెవెన్యూ చట్టం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం (రికార్డ్ ఆఫ్ రైట్స్)–2020 స్థానంలో కొత్త రెవెన్యూ చట్టం రానున్నట్టు సమాచారం. ధరణి పోర్టల్ ద్వారా రైతు లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ చట్టం అడ్డంకిగా మారిందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కొత్త చట్టం ప్రవేశపెట్టాలని సర్కారు భావి స్తోందని సమాచారం. ప్రస్తుత చట్టంలోని అనేక అంశాలకు సవరణలు సూచిస్తూ, ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ 20 పేజీల ముసాయిదాను రూపొందించిందని, అయితే అన్ని సవరణలతో అతుకుల బొంత లాంటి చట్టాన్ని మను గడలో ఉంచడానికి బదులు కొత్త చట్టాన్ని తీసుకురావడమే మంచిదని ప్రభుత్వం భావించిందనే చర్చ రెవెన్యూ వర్గా ల్లో జరుగుతోంది. దీనిపై ఆర్డినెన్స్ తేవాలనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో జరిగినా, అసెంబ్లీ ప్రొరోగ్ కానందున ఆర్డినెన్స్ చేసే అవకాశం లేదన్న న్యాయ నిపుణుల అభిప్రా యంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్టు తెలు స్తోంది. అయితే అప్పటివరకు ధరణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా స్పెషల్ డ్రైవ్ ద్వారా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని, అధికారాల వికేంద్రీకరణ ఉత్తర్వులిచ్చిందని సమాచారం. తహసీల్దార్లలో నైరాశ్యం అధికారాల వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన ఉత్త ర్వులు తహసీల్దార్లలో నైరాశ్యానికి కారణమయ్యాయి. వికేంద్రీకరణ పేరుతో కలెక్టర్లకే ఎక్కువ అధికారాలు కట్టబె ట్టారని వారంటున్నారు. గతంలో తమకు ఉన్న అధికారా లనే మళ్లీ ఇచ్చారని, వారసత్వ హక్కుల సంక్రమణ, జీపీ ఏ, ఎస్‌పీఏల ఆధారంగా పట్టాలు చేసే అధికారం ఇప్పుడు కూడా తమకే ఉందని, మళ్లీ ఆ అధికారాలనే ఇచ్చి వికేంద్రీ కరణ అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమ వద్ద సిబ్బంది లేరని, ఇలాంటి పరిస్థితుల్లో వారం రోజుల సమయం ఇచ్చి అన్ని దరఖాస్తులూ పరిష్కరించాలంటే ఎలా సాధ్యమనే చర్చ కూడా రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. హడావుడిలో తప్పులు జరిగితే సమస్య మళ్లీ మొదటి కొచ్చినట్టే కదా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వికేంద్రీకరణ తాత్కాలికమే! అయితే ప్రస్తుతం చేపట్టిన అధికార వికేంద్రీకరణ, స్పెషల్ డ్రైవ్‌లు తాత్కాలికమేనని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ధర ణి కమిటీ సూచన మేరకు తాత్కాలికంగానే ఈ ఏర్పాట్లు చేశామని, కొత్త ఆర్వోఆర్ చట్టంలో అధికార వికేంద్రీకరణ కు చట్టబద్ధత కల్పిస్తామని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబు తున్నారు. మరోవైపు కలెక్టర్లు తీసుకునే నిర్ణయాలను కూడా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్–1908లోని 166బీ నిబంధన ప్రకారం సవాల్ చేయవచ్చని అంటున్నారు. ప్రస్తుతం చేసిన అధికారాల పంపిణీ కూడా తాత్కాలికమేనని, ఆర్వో ఆర్ కొత్త చట్టంలో పకడ్బందీగా వికేంద్రీకరణ ఉంటుందని పేర్కొంటున్నారు. తహశీల్దార్లకు అధికారాల విస్తృత పంపిణీ అవకాశం ప్రస్తుతానికి లేదని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నా యి. అయితే ధరణి దరఖాస్తుల పరిష్కారంలో తహశీల్దార్ నివేదికలే ప్రాతిపదికలని, ఆ నివేదికల ఆధారంగానే ఉన్న తాధికారులు దరఖాస్తులను పరిష్కరిస్తారని ధరణి కమిటీ సభ్యుడొకరు చెప్పారు. ఈ మేరకు తహశీల్దార్లు క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంటుందని, గతంలో మాదిరి కాకుండా దరఖాస్తుల ఆమోదం, తిరస్కారం కోసం కచ్చితంగా కార ణాలతో కూడిన రాతపూర్వక ఉత్తర్వులివ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ఎవరైనా రైతులు తమకు నష్టం కలిగిందని భావిస్తే రెవెన్యూ అధికారు లిచ్చే రాతపూర్వక ఉత్తర్వులపై కోర్టులను ఆశ్రయించే వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈనెల 1వ తేదీనుంచి 9వ తేదీ వరకు నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌తో ధరణి దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోదని, ఈ డ్రైవ్‌లో తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ కూడా మరోమారు ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. -
నేటి నుంచే ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్!
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి’పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న లక్షలాది దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శుక్రవారం (మార్చి 1) నుంచి ఈనెల 9వ తేదీ వరకు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పెండింగ్‌లో ఉన్న సుమారు 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహణ కోసం భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్‌మిట్టల్ గురువారం మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు వ్యక్తిగతంగా చొరవ చూపి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ‘ధరణి’దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు తహసీల్ కార్యాలయ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. ►తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ టీమ్‌లలో తహసీల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న రెవెన్యూ సిబ్బందితోపాటు పారాలీగల్ వలంటీర్లు, కమ్యూనిటీ సర్వేయర్లు, వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులను నియమించాలి. వారికి దీనికి అవసరమైన శిక్షణను కూడా ఇప్పించాలి. ►పెండింగ్ దరఖాస్తులను మాడ్యూళ్లు లేదా గ్రామాల వారీగా ఈ బృందాలకు అప్పగించాలి. ►దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని వీఆర్వోల ద్వారా లేదంటే వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా సదరు దరఖాస్తుదారులకు పంపాలి. ►సేత్వార్, ఖస్రా, సీస్లా పహాణి, ఇతర పాత పహాణీలు, పాత 1బీ రిజిస్టర్లు, ధరణిలో అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా పెండింగ్ దరఖాస్తులను, వాటితోపాటు వచి్చన డాక్యుమెంట్లను ఈ బృందాలు పరిశీలించాలి. అసైన్డ్, ఇనామ్, పీవోటీ, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూముల వివరాలను కూడా క్షుణ్నంగా తనిఖీ చేయాలి. ►అవసరమనుకుంటే ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరపాలి. స్థానికంగా సదరు భూముల గురించి విచారించాలి. చివరిగా నివేదికను రూపొందించి.. సదరు దరఖాస్తును ఆమోదించాలా, తిరస్కరించాలా అన్నది పొందుపర్చాలి. ► ప్రత్యేక బృందాల నివేదికలను తహసీల్దార్లు పైస్థాయి అధికారులకు పంపాలి. వారు వాటిని పరిశీలించి దరఖాస్తు ఆమోదానికి లేదా తిరస్కారానికి గల కారణాలను తెలియజేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ►ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అన్ని దరఖాస్తులను పరిష్కరించాలి. ఒక్కటి కూడా పెండింగ్‌లో ఉండకూడదు. ఇందుకు కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
తహసీల్దార్ నుంచి సీసీఎల్ఏ వరకు..
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికార వికేంద్రీకరణ పూర్తయింది. తహసీల్దార్ల నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) వరకు పలు రకాల దరఖాస్తు లను పరిష్కరించే అధికారాలను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ స్థాయి అధికారులకు ఏయే దర ఖాస్తులను పరిష్కరించేఅధికారం ఇవ్వాలో నిర్దేశిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిట్టల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిలో ధరణి పోర్టల్ దరఖాస్తులను పరిష్కారించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయా స్థాయిల్లోని అధికారులు వారికి కేటాయించిన మాడ్యూళ్లలోని దరఖాస్తుల పరిష్కారంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అన్నీ భద్రపర్చాల్సిందే.. క్షేత్రస్థాయిలో తహసీల్దార్ల నేతృత్వంలో కలెక్టర్లు కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీలు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లను పరిశీలించనున్నాయి. ఒకవేళ దరఖాస్తుదారుడు తగిన డాక్యుమెంట్లను సమర్పించని పక్షంలో వాటిని తెప్పించుకోవాల్సి ఉంటుంది. పెండింగ్ దరఖాస్తులన్నింటినీ వేగంగా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఏ దరఖాస్తునూ పెండింగ్‌లో లేకుండా చర్యలకు ఉపక్రమించాలి. ప్రతి లావాదేవీని ఎలక్ట్రానిక్ రికార్డ్ చేసి భద్రపర్చాలి. ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దరఖాస్తుల పరిష్కారాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. తిరస్కరిస్తే కారణాలు చెప్పాలి.. తహసీల్దార్ స్థాయిలో దరఖాస్తుల పరిష్కారానికి సేత్వార్, ఖాస్రా పహాణీ, సేస్లా పహాణీ, ఆర్వోఆర్ రికార్డులను సరిచూసుకోవాలి. ఫీల్డ్ లెవల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే అందుకు కారణాలను తెలపాలి. ఆర్డీవో స్థాయి అధికారికి టీఎం 33లోని డేటా కరెక్షన్, మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణం, సర్వే నంబర్ల మిస్సింగ్‌ల పరిష్కార బాధ్యతలు అప్పగించారు. వారికి ఎకరం రూ. 5 లక్షలోపు ఉన్న భూములు, ఏరియాలకు సంబంధించిన అధికారం కట్టబెట్టారు. ఆర్డీవోలు తహసీల్దార్ ద్వారా విచారణ జరపాలి. తహసీల్దార్ ఇచ్చింన నివేదికలు, ఆర్డర్లను పున:పరిశీలించాలి. అన్ని స్థాయిల్లో సమస్యలు, పెండింగ్‌ల పరిష్కారానికి ఈ దఫా నిర్ణీత కాలపరిమితి నిర్దేశించారు. తహసీల్దార్, ఆర్డీవోల స్థాయిల్లో జరుగుతున్న పురోగతిని కలెక్టర్లు, జిల్లాలవారీ పురోగతిని సీసీఎల్ఏ పర్యవేక్షించాల్సి ఉంటుంది. -
ధరణి దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు విడుదల
-
ధరణిపై సంచలన నిర్ణయాల దిశగా ప్రభుత్వం అడుగులు!
హైదరాబాద్, సాక్షి: ధరణి ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే ధరణిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇతర వ్యక్తుల పేర్లపై రిజిస్టర్ అయిన ప్రభుత్వ భూముల వివరాలతో శ్వేత పత్రం ఉండనుందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఇక.. ధరణిపై తాజా రివ్యూలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న 2.45లక్షల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధరణిపై ఏర్పాటైన కమిటీ చేసిన సూచనలకు అనుగుణంగా విధివిధానాలను రూపొందించాలని, రైతులు ఇబ్బందిపడకుండా దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ధరణిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది. పోర్టల్‌ను పరిశీలించిన కమిటీ.. పూర్తిగా పోర్టల్ పునర్మిర్మాణం అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే సాంకేతిక సమస్యల పరిష్కారం దిశగానే కాకుండా.. చట్టాల్ని మార్చాల్సిన అవసరమూ ఉందని కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. ఇక.. ఈ కమిటీ సూచనలకు తగ్గట్లుగా నిర్ణయాలు ఉంటాయని తొలి నుంచి ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ధరణి సమస్యల పరిష్కారానికి మార్చిలో సదస్సులు నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి నుంచి 7వ తేదీ వరకు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఇరిగేషన్, పవర్‌పై శ్వేతపత్రాలు విడుదల చేసి బీఆర్ఎస్ను ఇరుకునపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. -
‘ధరణి’ దరఖాస్తులను పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి’పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న 2.45లక్షల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధరణిపై ఏర్పాటైన కమిటీ చేసిన సూచనలకు అనుగుణంగా విధివిధానాలను రూపొందించాలని, రైతులు ఇబ్బందిపడకుండా దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. తహసీల్దార్ కార్యాలయాల స్థాయిలో మార్చి తొలివారంలోనే దరఖాస్తుల పరిష్కారానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం సీఎం రేవంత్ రాష్ట్ర సచివాలయంలో ధరణి పోర్టల్‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, నవీన్ మిట్టల్, మధుసూదన్, రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, సీఎం ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ వి.లచ్చిరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధరణి కమిటీ ప్రాథమిక నివేదికను అందజేయగా.. కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ ఆ వివరాలతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్వోఆర్ చట్టంలోనే లోపాలు.. రాష్ట్రంలో 2020లో అమల్లోకి వచ్చిన కొత్త ఆర్వోఆర్ చట్టంలోనే లోపాలున్నాయని, ఆ చట్టమే అన్ని అనర్థాలకు మూలమని ధరణి కమిటీ సభ్యులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనతో చిక్కులు వచ్చాయని, ఆ రికార్డులనే ప్రామాణికంగా తీసుకోవడంతో భూసమస్యలు, భూరికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని వివరించారు. లక్షలాదిగా సమస్యలు పేరుకుపోయాయని, రికార్డుల్లో చిన్న అక్షర దోషమున్నా సవరించుకునేందుకు జిల్లా కలెక్టర్ వరకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ధరణి పోర్టల్‌లో 35 మాడ్యూల్స్ ఉన్నా.. ఎలాంటి సమస్యకు ఏ మాడ్యూల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేక రైతులు ఇబ్బందిపడుతున్నారని సీఎంకు వివరించారు. ఇప్పటికే లక్షలాది మంది రైతులు పెట్టుకున్న దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని.. దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి రావడం రైతులకు భారంగా మారిందని తెలిపారు. ప్రస్తుత ధరణి పోర్టల్‌ను రైతులకు ఇబ్బంది లేకుండా మార్చాలంటే.. కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని సవరించాలని, లేదా మరో కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా.. రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపంతో.. నిషేధిత జాబితాలోని భూముల క్రయవిక్రయ లావాదేవీలు జరగడం, ఈ రికార్డుల ఆధారంగా రైతుబంధు జమచేయడంతో జరిగిన కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అంశాలపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. తుది నివేదిక ఆధారంగా శాశ్వత చర్యలు వీలును బట్టి కొత్త ఆర్వోఆర్ చట్టానికి సవరణలు చేద్దామని.. లేదంటే మరో కొత్త చట్టం తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిద్దామని సమీక్షలో సీఎం రేవంత్ చెప్పారు. ధరణి కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే భూముల సమస్యలపై శాశ్వత పరిష్కార చర్య లు తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడున్న సమస్యల పరిష్కారం కోసం తీసుకునే నిర్ణయాలతో.. భవిష్యత్తులో కొత్త సమస్యలు రాకూడదన్నారు. ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా దోషరహితంగా భూరికార్డులు తయారుచేసేలా చర్యలు తీసుకుందామన్నారు. ఇందుకోసం లోతు గా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఇదే సమయంలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఎన్ఐసీకా... సీజీజీకా? సమీక్షలో భాగంగా ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్య తలను ఎవరికి అప్పగించాలన్న అంశంపైనా చర్చ జరిగింది. ప్రస్తుతం పోర్టల్‌ను నిర్వహిస్తున్న ప్రైవే టు ఏజెన్సీ కాలపరిమితి కూడా ముగుస్తున్న నేపథ్యంలో.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) లేదా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు అప్పగించే విషయాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు సమాచారం. ధరణి పార్ట్–బీ లో చేర్చిన 13.5లక్షల ఎకరాల భూముల విషయంపైనా సమీక్షలో చర్చించారు. ఈ భూముల సమస్య ను పరిష్కరించేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎట్లా పరిష్కరిస్తారు? ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో అగ్రికల్చర్ ఆఫీసర్, పారాలీగల్ వలంటీర్, ఒక సర్వేయర్‌తో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తారు. ఆ హెల్ప్‌డెస్క్ సదరు మండలం పరిధిలోని ధరణి దరఖాస్తులన్నింటినీ పరిశీలించి నివేదిక ఇస్తుంది. తహసీల్దార్లు ఆ నివేదిక మేరకు తమ స్థాయిలో సమస్యలను వెంటనే పరిష్కరిస్తారు. లేకుంటే ఉన్నతాధికారులకు (ఆర్డీవోలు/కలెక్టర్లకు) సిఫార్సు చేస్తారు. ఇందుకు సంబంధించిన సర్క్యులర్ ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. గోప్యంగా ఉండాల్సిన వివరాలు.. ప్రైవేటుకు ఎలా? సమీక్షలో భాగంగా ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న ప్రైవేటు ఏజెన్సీ వ్యవహారశైలిపై చాలాసేపు చర్చ జరిగింది. బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన పోర్టల్‌ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు అప్పగించాల్సి వచ్చిందని రెవెన్యూ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన లక్షలాది మంది రైతుల భూరికార్డుల డేటా, వారి ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు ప్రైవేటు ఏజెన్సీ చేతుల్లోకి.. తద్వారా విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు భూరికార్డులు సురక్షితంగా ఉన్నట్టా లేనట్టా? డేటాకు భద్రత ఉందా అని నిలదీశారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ అధికారులు మాట్లాడుతూ.. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్డింగ్‌ల ఆధారంగా అప్పటి ప్రభుత్వం ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీకి ధరణి పోర్టల్ డిజైన్, డెవలప్మెంట్ బాధ్యతలను అప్పగించిందని వివరించారు. తర్వాత ఆ కంపెనీ దివాలా తీయడం, టెరాసిస్గా పేరు మార్చుకోవడం, డైరెక్టర్లు మారిపోవడం, ఆ తర్వాత మళ్లీ వాటాలు అమ్ముకుని ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా రూపాంతరం చెందడం వంటి పరిణామాలు జరిగాయని తెలిపారు. అయితే ఇలా బిడ్ దక్కించుకున్న కంపెనీ ఇష్టానుసారం పేర్లు మార్చుకుని కొత్త కంపెనీలను తెస్తే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని రేవంత్ ప్రశ్నించారు. భూరికార్డుల డేటాను ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా నిబంధనలు ఎక్కడున్నాయని రెవెన్యూ అధికారులను నిలదీశారు. రూ.116 కోట్లకు ధరణి పోర్టల్ నిర్వహణ టెండర్లు దక్కించుకున్న కంపెనీ.. తమ వాటాలను ఏకంగా రూ.1,200 కోట్లకు అమ్ముకోవడం విస్మయం కలిగించిందన్నారు. రికార్డులు వారి వద్దే ఉన్నందున విలువైన భూముల యజమానుల పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గతంలో ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేశారు. అసలు ధరణి పోర్టల్ నిర్వహణపై ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకు నియంత్రణ ఉందా? అని ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటి నేపథ్యంలో సదరు ప్రైవేట్ ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
సీఎం రేవంత్‌రెడ్డికి ధరణి కమిటీ మధ్యంతర నివేదిక
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మధ్యంతర నివేదికను ధరణి కమిటీని అందజేసింది. 2020 ఆర్వోఆర్ చట్టంలో లోపాలు ఉన్నాయని సీఎంకు ధరణి కమిటీ నివేదించింది. సీఎం రేవంత్ మాట్లాడుతూ, ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. 2.45 లక్షల పెండింగ్ సమస్యలను మార్చి మొదటి వారంలో అన్ని ఎమ్మార్వో ఆఫీస్‌లలో సమస్యల పరిష్కారం చూపాలన్నారు. హడావుడి నిర్ణయాలతో కొత్త చిక్కులు వచ్చాయని, ధరణి కమిటీ పూర్తి స్థాయి నివేదిక తర్వాత శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటామన్నారు. 35 మ్యాడ్యూల్స్ ఉన్నప్పటికీ దేనికి దరఖాస్తు చేసుకోవాలో తెలియని పరిస్థితి ఉందని, రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని సీఎం అన్నారు. కాగా, ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆ పోర్టల్‌ను నిర్వహిస్తోన్న ప్రైవేటు ఏజెన్సీ కాలపరిమితి కూడా ముగియడంతో ఈ బాధ్యతలను ఎన్ఐసీకి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతలతో పాటు ధరణి ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారంలోనూ వేగంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదీ చదవండి: తుది దశకు బీజేపీ అభ్యర్థుల జాబితా! -
ఎన్ఐసీ చేతికి ధరణి?
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆ పోర్టల్‌ను నిర్వహిస్తోన్న ప్రైవేటు ఏజెన్సీ కాలపరిమితి కూడా ముగియడంతో ఈ బాధ్యతలను ఎన్ఐసీకి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతలతో పాటు ధరణి ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారంలోనూ వేగంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధరణి కమిటీ సభ్యులు, రెవెన్యూ అధికారులు, వక్ఫ్, దేవాదాయ, అటవీశాఖల అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్‌పీటర్, నవీన్‌మిత్తల్, మధుసూదన్ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే 22 అంశాలతో నివేదికను ప్రభుత్వానికి ఇచి్చనట్టు తెలుస్తోంది. ఈ అంశాలపై శనివారం జరగనున్న సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. చేవ్రాలే... ప్రాతిపదిక ఈ సమావేశంలో భాగంగా ధరణి పోర్టల్ ద్వారా వచ్చి పెండింగ్‌లో ఉన్న 2.46లక్షల దరఖాస్తులను ఎలా పరిష్కరించాలి? భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పార్ట్–బిలో చేర్చిన 13.5లక్షల ఎకరాల కు సంబంధించిన భూముల సమస్యలను ఎలా నివృత్తి చేయాలి? అన్న దానిపై నిర్ణయాలు తీసుకో నున్నారు. దీంతో పాటు ధరణి సమస్యల పరిష్కారానికి ఆన్లైన్లో ఉన్న అస్తవ్యస్త రికార్డులను కాకుండా మాన్యువల్ పహాణీలను ప్రాతిపదికగా తీసుకునే అంశంపై కూడా చర్చించనున్నారు. రెవెన్యూ–అటవీ, రెవెన్యూ–దేవాదాయ, రెవెన్యూ–వక్ఫ్ శాఖల మధ్య అంతరాలు ఉన్న భూములపై కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలిసింది. వీటితో పాటు ధరణి దరఖాస్తులు జిల్లా కలెక్టర్ స్థాయిలో కాకుండా ఆర్డీవో, తహశీల్దార్ స్థాయిలోనే పరిష్కారమయ్యేలా అధికార వికేంద్రీకరణపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్వోఆర్ చట్టంలో ఎలాగూ ఈ అధికారాలు కలెక్టర్లకు బదలాయించకపోవడంతో చట్ట సవరణ కూడా అవసరం లేదని, అధికారిక ఉత్తర్వులతో ఈ వికేంద్రీకరణ సాధ్యమవుతుందని భావిస్తున్నారు. మొత్తంగా నేడు జరగనున్న కీలక సమీక్షలో ధరణి పోర్టల్‌కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. -
నేడు ధరణి పోర్టల్‌పై మధ్యంతర నివేదిక!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ బుధవారం తన మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు తెలిసింది. వివిధ ప్రభుత్వ శాఖలు, రెవెన్యూ వర్గాలు, పోర్టల్ నిర్వహణ కంపెనీలతో ప్రాథమికంగా జరిపిన చర్చల అనంతరం రూపొందించిన ప్రాథమిక స్థాయి నివేదికను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమర్పించే అవకాశమున్నట్లు సమాచారం. బుధవారం సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, టీఎస్ఐఐసీతో కమిటీ భేటీ ముగిసిన తర్వాత మంత్రికి నివేదికను సమర్పించనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి జిల్లాలకు వెళ్లి క్ష్రేత్రస్థాయిలో వస్తున్న సమస్యలను తెలుసుకున్న తర్వాత మధ్యంతర నివేదిక ఇవ్వాలని సభ్యులు భావించారు. కానీ ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో బుధవారం నాడే సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అదే జరిగితే అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదికపై కూడా చర్చించే అవకాశముందని చెబుతున్నారు. ధరణిపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి చెప్పిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై భూ వివాదం ఆరోపణలు
-
ధరణి: కలెక్టర్ల మొర.. మమ్మల్ని బాధ్యులను చేయడం సరికాదు!
సాక్షి, హైదరాబాద్: ధరణి పునర్నిర్మాణ కమిటీ సమావేశంలో భాగంగా పలు సమస్యలను జిల్లా కలెక్టర్లు కమిటీ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ధరణి విషయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలకు తమను భాద్యులు చేయవద్దని కమిటీకి మొర పెట్టుకున్నారు. ధరణితో పాటు రెవెన్యూ వ్యవస్థలోని లోపాలకు తమను బాధ్యులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలోని అంశాలకు తమను బాధ్యులను చేయడం సరికాదంటున్న కలెక్టర్లు ధరణి కమిటీ దృష్టి తీసుకువచ్చారు. తెలంగాణ సెక్రటేరియట్లో ధరణి కమిటీ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ధరణి వాస్తవ పరిస్థితులను కలెక్టర్లు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం ధరణి కమిటీ సమావేశంలో రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం , నిజామబాద్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. చదవండి: ‘కాంగ్రెస్ పార్టీకే రేవంత్ ముఖ్యమంత్రా?.. తెలంగాణకు కాదా?’ -
ప్రజల వద్దకు ‘ధరణి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులు ధరణి పోర్టల్ కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, వారి సలహాలు, సూచనలు, అభిప్రాయాల మేరకు ముందుకెళ్లాలని ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం నియమించిన కమిటీ నిర్ణయించింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సునిశిత అధ్యయనం చేయాలని, వారి వద్దకు వెళ్లి ప్రత్యేక ఫార్మాట్లో వారి మనోగతం తెలుసుకుని క్రోడీకరించాలని ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చింది. అయితే నేరుగా ప్రజల వద్దకు వెళ్లాలా? గ్రామసభల ద్వారా వారి నుంచి సమస్యలు తెలుసుకోవాలా? లేదంటే అభిప్రాయ సేకరణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలా? అలా ఏర్పాటు చేయాల్సి వస్తే ఏయే స్థాయిల్లో, ఏ పద్ధతుల్లో అభిప్రాయాలు తెలుసుకోవాలన్న దానిపై కమిటీ సభ్యులు విస్తృతంగా చర్చించారు. ఈ విషయంలో కమిటీ తుది నిర్ణయానికి రాలేదు కానీ, ప్రాంతాల వారీగా రైతుల సమస్యలు తెలుసుకుని వారి అభిప్రాయాలు, ఆలోచనల మేరకు పని చేయాలని మాత్రం నిర్ణయించింది. అలాగే ఈ పోర్టల్ ద్వారా రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులేంటి? కమిటీ ఎలా ముందుకెళ్లాలి? రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి? చట్టాల పరిధి ఏంటి? చట్టాల మార్పునకు అవకాశాలెలా ఉన్నాయి? ఇతర రాష్ట్రాల్లో భూసమస్యలను పరిష్కరిస్తున్న తీరు తదితర అంశాలపై సభ్యులు 2 గంటలకు పైగా చర్చించారు. గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, మధుసూదన్, మెంబర్ కనీ్వనర్ నవీన్ మిత్తల్‌తో పాటు సీఎంఆర్వో పీడీ వి.లచ్చిరెడ్డిలు పాల్గొన్నారు. సభ్యులందరూ విడివిడిగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. కమిటీ పనితీరు ఎలా ఉండాలన్న దానిపై ఓ అవగాహనకు వచ్చిన సభ్యు లు.. ఈనెల 17న మరోమారు భేటీ అయి తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించారు. 15 రోజుల్లో తొలిదఫా సూచనలు ధరణి పునర్నిర్మాణం కోసం అవసరమైన నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ఒక్కసారే తుది నివేదిక కాకుండా పలు దఫాలుగా మధ్యంతర నివేదికలు సమర్పించాలని, తొలిదఫా సలహాలు, సూచనలు 10–15 రోజుల్లో ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించారు. నాంపల్లిలోని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం కేంద్రంగానే కమిటీ పనిచేయాలని, ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. రైతుల ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారానికి సంబంధించిన అంశంపై ప్రత్యేక చర్చ జరిగినట్టు తెలిసింది. గతంలో రైతుల వినతులను పట్టించుకోలేదని, కలెక్టర్ స్థాయిలో నిర్ణయాధికారాలున్న నేపథ్యంలో సమస్యలు పరిష్కారం కాక చాలా ఇబ్బందులు పడ్డారని, ఈ నేపథ్యంలో గ్రీవెన్స్ పరిష్కార అధికారాలను వికేంద్రీకరణ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై సభ్యులు చర్చించారు. గ్రీవెన్స్‌తో పాటు సాంకేతిక పరమైన సమస్యలను ఎలా డీల్ చేయాలన్నది కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. మొత్తం మీద ధరణి పోర్టల్‌తో సంబంధముండే అన్ని భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని, ఇతర రాష్ట్రాల్లో భూసమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత కార్యాచరణను అమలు చేయాలని నిర్ణయించారు. కాగా ‘పునర్నిర్మాణమంటే చాలా పెద్ద టాస్క్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మేం టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడే పరిస్థితి లేదు. ట్వంటీ ట్వంటీ ఆడాల్సిందే. ట్వంటీ ట్వంటీలో ప్రతి బంతిని కీలకంగా పరిగణించినట్టు గానే మేం ప్రతి అంశాన్ని కీలకంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిందే..’ అని సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. గత తప్పులు పునరావృతం కానివ్వం: కోదండరెడ్డి సమావేశానంతరం ధరణి కమిటీ సభ్యులు సునీల్‌కుమార్, మధుసూదన్, లచ్చిరెడ్డిలతో కలిసి కోదండరెడ్డి విలేకరులతో మాట్లాడారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అన్ని అంశాలను సవరించి త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. పోర్టల్ ఎవరు నిర్వహిస్తే బాగుంటుందన్న దానిపై కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ముందుకెళతామని, సీఎం రేవంత్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. -
21న కలెక్టర్ల కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో తొలిసారి సమావేశం కానున్నారు. ఈనెల 21న జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశానికి సిద్ధంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ కార్యాలయం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వ ఆలోచనా విధానాలను స్పష్టం చేయడంతో పాటు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసేందుకు గాను ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు సీఎంవో వర్గాలు చెపుతున్నాయి. ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ధరణి పోర్టల్‌పై కీలక సమీక్ష ఉంటుందని, పలు భూ సంబంధిత అంశాలు, జీవో 58, 59 అమలు, ప్రజా వాణి కార్యక్రమం పట్టణాలు, జిల్లా కేంద్రాలకు విస్తరించడం, గృహలక్ష్మి పథకం కింద ఇళ్లు కట్టు కునేందుకు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాల ఖరారు, రైతు భరోసా అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, కౌలు రైతుల గుర్తింపు కోసం అనుసరించాల్సిన పద్ధతి.. తదితర అంశాలపై చర్చ ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా గృహలక్ష్మి పథకాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఉండి, ఇళ్లు లేని పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించాలని సీఎం రేవంత్ యోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండ్ల స్థలాల గుర్తింపు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల పంపిణీ కోసం మార్గదర్శకాల ఖరారుపై కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలకు విస్తరించాలని, వారంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో కూడా నిర్వహించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. అందులో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు, క్షేత్రస్థాయిలో ఏయే అధికారులు ప్రజావాణిని ఏయే వారాల్లో నిర్వహించాలనే దానిపై కూడా కలెక్టర్ల భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. -
ధరణి పోర్టల్ పై సీఎం రేవంత్..ఆ నిధులు ఎక్కడ..?
-
TS: ధరణిపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణిపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ధరణి లోటుపాట్లపై వారం, పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలన్న సీఎం.. ధరణి యాప్ భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డాటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. భూ సమగ్ర సర్వే చేయడంపై అధికారులను అడిగిన సీఎం.. భూ నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ధరణి సమస్యలు.. వాటి పరిష్కారంపై చర్చించారు. గ్రామ సదస్సులు, రికార్డ్స్ సవరణ ఎందుకు చేయడం లేదని సీఎం ప్రశ్నించారు. కిషన్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి ఫోన్ కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని సీఎం కోరారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: ప్రజా భవన్ ఇక డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసం -
‘ధరణి’ పోర్టల్‌లో దొంగలు పడ్డారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌లో దొంగలు పడ్డారు. జిల్లా కలెక్టర్ సహా తహసీల్దార్లంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండగా.. సదరు వెబ్‌సైట్‌ను పర్యవేక్షిస్తున్న ఇద్దరు వ్యక్తులు అడ్డదారులు తొక్కారు. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 మధ్య రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ తంతులో భారీగా భూములు చేతులు మారినట్లు తెలుస్తోంది. కలెక్టర్ పరిశీలన, అనుమతి లేకుండా దరఖాస్తులకు ఆమోదం (డిజిటల్ సంతకంతో) తెలిపినట్లు సమాచారం. ఇలా నిషేధిత జాబితాలో ఉన్న 98 దరఖాస్తులను ఈ తరహాలో జాబితా నుంచి తొలగిస్తూ అక్రమాలకు పాల్పడినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ అంశంపై పోలీసులు కూడా విచారణ ప్రారంభించినట్లు అధికారవర్గాలు ధ్రువీకరించాయి. సాంకేతికతను అడ్డుపెట్టుకుని నడిపిన ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించిన ఇద్దరు ఉద్యోగులకు ఇంటిదొంగలు ఎవరైనా సాయపడ్డారా? ఈ భూ బాగోతంలో ఇతరుల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు. 28 రోజుల్లో 98 దరఖాస్తులకు ఆమోదం ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై అప్పటి జిల్లా కలెక్టర్ హరీశ్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ అక్టోబర్ 11న వేటు వేసింది. ఆ తర్వాత ఆయన స్థానంలో కొత్తగా భారతీ హోళికేరి కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ వెంటనే జిల్లా ఎన్నికల అధికారిగా ఆమె బిజీగా మారారు. ధరణి పోర్టల్‌కు వచ్చిన దరఖాస్తులను పక్కన పెట్టి.. పూర్తిగా ఎన్నికలపైనే దృష్టిని కేంద్రీకరించారు. ఇదే అదనుగా భావించిన ధరణి సిబ్బంది భారీ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. జిల్లాలో పలు చోట్ల ఉన్న భూదాన్ భూములను పట్టా భూములుగా మారుస్తూ ఆమోదముద్ర వేసినట్లు తేలింది. నిజానికి ఏదైనా ధరణి దరఖాస్తును ఆమోదించాలన్నా.. తిరస్కరించాలన్నా.. క్షేత్రస్థాయి రిపోర్టులే కీలకం. కానీ అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 మధ్యన ఎలాంటి రిపోర్టులు లేకుండానే సుమారు వంద అర్జీలకు ఆమోదం లభించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు.. దర్యాప్తు ముమ్మరం కోర్టు కేసులు, అసైన్డ్, భూదాన్, మ్యూటేషన్లు, పాసు పుస్తకాల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన వివాదాస్పద భూ సమస్యల అప్లికేషన్లకు పోర్టల్‌లో ఆమోదం రావడంపై కొందరు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. ఇంటి దొంగలే ఈ ఉదంతానికి పాల్పడినట్లు తేలింది. దీంతో ఉన్నతాధికారులు ధరణి సమన్వయకర్త నరేశ్, ఆపరేటర్ మహేశ్‌లను సస్పెండ్ చేశారు. ఈ అంశంపై లోతైన దర్యాప్తు జరపాల్సిందిగా కోరుతూ ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇందులో కేవలం సమన్వయకర్త, ఆపరేటర్ల పాత్ర మాత్రమే ఉందా? లేక జిల్లా ఉన్నతాధికారులు, ఇతర అధికారుల పాత్ర ఏమైనా ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్ తెచ్చేది భూమాత కాదు..భూమేత : కేసీఆర్
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్ : కాంగ్రెస్ ధరణిని రద్దు చేసి దాని ప్లేస్‌లో భూమాత అనే స్కీమ్ తీసుకొస్తారట కాంగ్రెస్ వాళ్లు తెచ్చేది భూమాత కాదు భూమేత అని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఛాన్సిస్తే మళ్లీ ఆగమాగమే అని ప్రజలను హెచ్చరించారు. ఎన్నికలు రాగానే అబద్ధాలు ప్రచారం చేస్తారు. ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలి. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి చూడండి. నీటి, కరెంట్ కష్టాలు తీర్చుకున్నాం. పెన్షన్లు తమాషాకు ఇవ్వడం లేదు. ఎంతో ఆలోచించిన తర్వాత రెండు వేలకు పెంచుకున్నం. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణప్రజల కోసం. 15 ఏళ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లు తెచ్చుకున్నాం అధికారంలో ఉన్నపుడు ఏం చేయకుండా కాంగ్రెస్ నేతలు మళ్లీ చాన్సివ్వమని అడుగుతున్నారు. 33 పార్టీలు మద్దతు ఇచ్చాక తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో కనీసం తాగునీరు సరిగా ఇవ్వలేదు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి చావులే కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్కౌంటర్లే కదా. రైతుబంధు ఉండాలా వద్దా. బీఆర్ఎస్ మళ్లీ వస్తే రైతుబంధు రూ.16 వేలు చేస్తాం. బీఆర్ఎస్ పాలనలో కంటి వెలుగు ద్వారా 3 కోట్ల మందికి పరీక్షలు చేయించాం. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించాం. స్టేషన్ ఘన్‌పూర్‌లో 1.10 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం. తాము మోసపోయామని కర్ణాటక రైతులు తెలంగాణలో ఆందోళన చేస్తున్నారు’ అని కేసీఆర్ తెలిపారు. ఇదీచదవండి..మేడ్చల్.. ఇక్కడ గెలిస్తే మంత్రి అయినట్టే -
కాళేశ్వరం కంటే ధరణి పెద్ద కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధరణి పోర్టల్ పేరుతో భారీ భూ కుంభకోణ జరిగిందని, ఇది కాళేశ్వరం కుంభకోణం కంటే పెద్దదని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ధరణి కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి భూ యజమానులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 30న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ సర్కార్ ధరణిని సర్వరోగ నివారిణి అని గొప్పగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. గ్రామాల్లో రెవెన్యూ రికార్డులను నిర్వహించాల్సిన వీఆర్వోల వ్యవస్థను లేకుండా చేసి, ఆ భూ రికార్డులను ప్రభుత్వం తీసేసుకుని వాటిని ఎవరికీ అందకుండా చేశారని ఆరోపించారు. ధరణిలో రెవెన్యూ రికార్డులను మార్చేసి.. పట్టేదార్, పొసెషన్ (అనుభవదారు)ల స్థానంలో బినామీ, అక్రమ చొరబాటుదారు అని పేర్లు చేర్చారన్నారు. భూ రికార్డులను పూర్తిగా గందరగోళం చేశాక కేంద్రం ఇచ్చిన నిబంధనలను బేఖాతరు చేస్తూ కొత్త రూల్స్ తీసుకొచ్చారని ఆరోపించారు. దీంతో భారీమొత్తంలో భూ రికార్డులు తారుమారయ్యాయని ఆరోపణలు వచ్చాయన్నారు. విదేశీ కంపెనీ చేతిలోకి ధరణి వివరాలు విశ్వసనీయ వర్గాలు, నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. ఓ విదేశీ కంపెనీ రూపొందించిన యాప్ (మొబైల్ అప్లికేషన్) ధరణిలోని డిజిటల్ డాక్యుమెంట్స్‌ను యాక్సెస్ చేసినట్లు తెలుస్తోందని జవదేకర్ అన్నారు. ప్రభుత్వ డేటాను ఓ ప్రైవేటు కంపెనీ పరిశీలించడం సాధ్యం కాదనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే తెలంగాణలో మాత్రం దీనికి విరుద్ధంగా ప్రభుత్వ కీలక డేటా ఓ ప్రైవేటు కంపెనీకి అందుబాటులో ఉందని ఆరోపించారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా, గ్రామసభలను నిర్వహించకుండా భూ రికార్డుల వ్యవస్థను తారుమారు చేశారని ధ్వజమెత్తారు. దీంతో భూములకు సంబంధించిన చాలా సర్వే నంబర్లు గల్లంతయ్యాయని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. లక్షల ఎకరాలను నిషేధిత విభాగంలో చూపిస్తున్నారన్నారు. -
రోజుకు 5,500 రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజుకు సగటున 5,500 వరకు రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా జరిగే వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లతో పాటు ధరణి పోర్టల్ ద్వారా నిర్వహించే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కలిపి ఈ ఆర్థిక సంవత్సంలో ఇప్పటివరకు (ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబర్ 20 వరకు) 9.5లక్షల వరకు లావాదేవీలు జరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వ్యవసాయేతర లావాదేవీలు 5.26లక్షల పైచిలుకు కాగా, వ్యవసాయ భూముల లావాదేవీలు 4.23లక్షలు కావడం గమనార్హం. ఈ లావాదేవీలపై గత ఐదు నెలల (ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) కాలంలో రూ.7 వేల కోట్లు ఖజానాకు సమకూరింది. ఇందులో వ్యవసాయేర లావాదేవీల ద్వారా రూ.5000 కోట్ల వరకు రాగా, ధరణి పోర్టల్ ద్వారా రూ.1700 కోట్ల వరకు వచ్చి ఉంటుందని, ఇక సొసైటీలు, మ్యారేజీ రిజిస్ట్రేషన్లు, ఈసీ సర్టిఫికెట్లు తదితర లావాదేవీలు కలిపి ఆ మొత్తం రూ.7వేల కోటుŠల్ దాటి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచే రూ.1,703 కోట్ల ఆదాయం ఇక, జిల్లాల వారీ రిజిస్ట్రేషన్ల విషయానికి వస్తే రాష్ట్రంలోని 12 రిజిస్ట్రేషన్ జిల్లాల్లో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోనే జరుగుతున్నాయి. ఈ జిల్లా రిజిస్ట్రేర్ పరిధిలో ఆగస్టు నాటికి 1.07లక్షల డాక్యుమెంట్ల లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.1,703 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం దాటిన జిల్లాల్లో మేడ్చల్ కూడా ఉంది. ఇక్కడ 70వేలకు పైగా లావాదేవీలు జరగ్గా రూ.1,100 కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉంటుందని అంచనా. ఇక, రాష్ట్రంలో అతి తక్కువగా హైదరాబాద్–1 పరిధిలో లావాదేవీలు జరిగాయి. ఇక్కడ గత ఐదు నెలల్లో 9,148 లావాదేవీలు మాత్రమే జరిగాయి. కానీ ఆదాయం మాత్రం రూ. 185 కోట్ల వరకు వచ్చింది. అదే వరంగల్ జిల్లా రిజిస్ట్రేర్ కార్యాలయ పరిధిలో 40వేలకు పైగా లావాదేవీలు జరిగినా వచ్చింది అంతే రూ.188 కోట్లు కావడం గమనార్హం. అంటే హైదరాబాద్–1 పరిధిలో ఒక్కో లావాదేవీ ద్వారా సగటు ఆదాయం రూ. 2.02 లక్షలు వస్తే, వరంగల్ జిల్లాలో మాత్రం రూ.40 వేలు మాత్రమే వచ్చిందని అర్థమవుతోంది. బంజారాహిల్స్ టాప్..ఆదిలాబాద్ లాస్ట్ అన్ని జిల్లాల కంటే ఎక్కువగా సగటు డాక్యుమెంట్ ఆదాయం బంజారాహిల్స్ (హైదరాబాద్–2) జిల్లా పరిధిలో నమోదవుతోంది. ఖరీదైన ప్రాంతంగా పేరొందిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే లావాదేవీల ద్వారా ఒక్కో డాక్యుమెంట్‌కు సగటున రూ.2.3లక్షలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఇక్కడ 16,707 లావాదేవీలు జరిగాయని, తద్వారా రూ. 396.56 కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, డాక్యుమెంట్ సగటు ఆదాయం అతితక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో వస్తోంది. ఇక్కడ సగటున ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.23వేలకు కొంచెం అటూ ఇటుగా ఆదాయం వస్తోంది. డాక్యుమెంట్ల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి ప్రథమ స్థానంలో ఉండగా, ఖమ్మం చివరి స్థానంలో ఉంది. ఖమ్మం జిల్లా రిజిస్ట్రేర్ కార్యాలయ పరిధిలో గత ఐదు నెలల కాలంలో కేవలం 20వేల పైచిలుకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. -
ఉచిత విద్యుత్ మా పాలసీ
సాక్షి, హైదరాబాద్: ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మా ప్రభుత్వ పాలసీ. ఈ విషయానికి సంబంధించి కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు. వాటిని నేను పట్టించుకోను. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పథకం నిలబడాలి. గ్రామీణ ప్రాంతాలు, రైతులు బాధలు తొలగిపోయి వంద శాతం బాగుండాలి..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. భూముల డిజిటలైజేషన్ కోసం తెచ్చిన ధరణిని సమస్యగా చిత్రీకరించేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయని విమర్శించారు. ధరణితో భూముల మీద యజమానులకు సంపూర్ణ అధికారం వచ్చిందని చెప్పారు. ఈ అధికారాన్ని మీ వద్దే పెట్టుకుంటారా? లేక వదిలేసుకుంటారా? అనేది మీరే నిర్ణయించుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో భారత్ రాష్ట్ర సమితిలో చేరారు. అనిల్‌కుమార్ రెడ్డితో పాటు ఆయన వెంట వచ్చిన అనుచరులకు కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లోతుగా ఆలోచించిన తర్వాతే.. ‘తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర సాధనను ఒక టాస్క్‌గా తీసుకుని పనిచేశాం. మాకు రాజకీయం ఒక టాస్క్ లాంటిది. నేను సిద్దిపేట శాసనసభ్యుడిగా పనిచేసిన నాటి నుంచి మొదలుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కరెంటు విషయంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణనాతీతం. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అధికారులతో జరిపిన చర్చల ద్వారా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర మౌలిక వసతుల్లో సమతుల్యత సాధించాం. ప్రభుత్వ సంపూర్ణ మద్దతు ఉంటే 24 గంటల ఉచిత విద్యుత్ సాధ్యమవుతుందనే అధికారుల వాదనకు కట్టుబడి, పూర్తిస్థాయిలో అండగా నిలిచి ఏడెనిమిది నెలల్లోనే విద్యుత్ సరఫరా లేక ఏర్పడిన దుష్పరిణామాలను సరిదిద్దాం.ఏడు గంటల పాటు ఒకేమారు వ్యవసాయ అవసరాలకు విద్యుత్ ఇవ్వడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకునే 24 గంటల కరెంటుకు మొగ్గు చూపాం. గ్రిడ్ కుప్పకూలకుండా అవసరమైన సమయంలో విద్యుత్ కొనుగోలుకు అవసరమైన విచక్షణాధికారం అధికారులకు ఇవ్వడంతో పాటు సాంకేతిక అంశాలపై అవగాహన ఉండదనే ఉద్దేశంతో ట్రాన్స్‌కో, జెన్కో తదితర సంస్థల నుంచి ఐఏఎస్ అధికారులను తొలగించాం. విద్యుత్ అంశంపై ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించిన తర్వాతే తొమ్మిదేళ్లుగా అమలు చేస్తున్నాం. మూడు గంటల కరెంటు అంటే రైతులు తిడుతున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోలు అంశంపై ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా గ్రామీణ ప్రాంతాలు కుదుటపడే వరకు కొనసాగిస్తాం. దీంతో ఆర్థికాభివృద్ధి జరిగి తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రస్థానానికి చేరుతుంది. ధాన్యం ప్రాసెసింగ్.. జపాన్ కంపెనీతో చర్చలు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, చెక్‌డ్యాంలు తదితరాలతో భూగర్భ జలాలు పెరిగి పంటల దిగుబడి పెరిగింది. తెలంగాణలో ఇసుక పండినట్లు 3 కోట్ల టన్నుల ధాన్యం వస్తుండటంతో గిర్నీల సామర్ధ్యం కూడా సరిపోవడం లేదు. 2.5 కోట్ల టన్నుల ధాన్యం ప్రాసెసింగ్ కోసం జపాన్ సటాకా కంపెనీతో మాట్లాడుతున్నాం. నేను రైతుబిడ్డగా సిద్దిపేట మార్కెట్లో పడిగాపులు పడిన రోజులను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తున్నాం..’అని సీఎం చెప్పారు. భూములపై సర్వాధికారాలు యజమానులకు.. ‘వీఆర్వోలు భూముల వివరాలు గందరగోళం చేశారు. ధరణి ద్వారా భూముల డిజిటలైజేషన్‌తో వాటిపై సర్వాధికారాలు యజమానుల చేతికి వచ్చాయి. రాష్ట్రంలోని 2.76 కోట్ల ఎకరాల్లో 1.56 కోట్ల భూమి ఇప్పటికే ధరణిలోకి వచ్చింది. ధరణి మూలంగా రైతుబంధు, భూమికి రక్షణ, ధాన్యం కొనుగోలు వంటివి సులభంగా సాధ్యమవుతాయి. ఇప్పుడు రాష్ట్రంలో భూముల విలువ ఎంతో పెరిగింది. ధరణి లేకపోతే శాంతిభద్రతల సమస్యలు తలెత్తేవి. కొందరు చెప్తున్నట్లు ధరణి తీసేస్తే మళ్లీ లంచాలు మొదలవుతాయి..’అని కేసీఆర్ అన్నారు. జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్లండి ‘భువనగిరిలో ఇద్దరూ పోటీ పడి డబ్బులు తగలేయొద్దు. చెరి ఒక పదవి తీసుకుని జోడెడ్ల బండిలా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లండి.. అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, అనిల్ కుమార్‌రెడ్డికి చెప్పా. కోడె లేగల మాదిరిగా వెలపల, దాపల సమానంగా ఉంటే కచ్చురంగా బాగా ముందుకు పోతుంది. అనిల్‌కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు నాదే బాధ్యత. నాకు ఫిబ్రవరిలో 70 ఏళ్లు వస్తాయి. రేపటి తెలంగాణను పాలించేది మీరే. దారి చూపించి వెళతా..’అని కేసీఆర్ అన్నారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు ప్రభు త్వ విప్‌లు బాల్క సుమన్, గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, కె.ప్రభాకర్‌రెడ్డి, గ్యాదరి కిషోర్, భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో రెండేళ్లలో ఉచిత విద్యుత్: కేసీఆర్ మహారాష్ట్రలో రైతు ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మహారాష్ట్రలోని వివిధ పారీ్టలకు చెందిన 76 మంది సర్పంచ్‌లు కూడా సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయంతో పాటు అనేక రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచామని సీఎం చెప్పారు. మహారాష్ట్రలో కూడా రైతులు, ప్రజల జీవన ప్రమాణాలు మారాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించాల్సిందిగా సర్పంచ్‌లకు సూచించారు. వారిని తెలంగాణ గ్రామాల పర్యటనకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ఆదేశించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో మహారాష్ట్ర అమరావతి డివిజన్ నుంచి బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతో పాటు రైతు సంఘటన, వంచిత్ బహుజన్ అఘాడీ, షెట్కారీ సంఘటనతో పాటు వివిధ పారీ్టలకు చెందిన 76 మంది సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, మహారాష్ట్ర మీడియా యూనియన్ ప్రతినిధులు ఉన్నారు. -
ధరణితో రైతుల హక్కులకు విఘాతం
చందంపేట: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌లో మార్పులు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భట్టి పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర శుక్రవారం నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా భట్టి.. రైతులు, ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చందంపేట మండలంలోని గన్నెర్లపల్లి గ్రామంలో కూలీలు పత్తి విత్తనాలు విత్తుతున్న సమయంలో ఆయన వారితో కలసి విత్తనాలు నాటారు. అనంతరం భట్టి ఇదే గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధరణి అనే పోర్టల్‌ను తీసుకొచ్చి.. కబ్జాలో ఉన్న రైతుల పేర్లు తీసేసి గతంలో ఎప్పుడో దొరలు, 70 ఏళ్ల క్రితం ఉన్న భూస్వాముల పేర్లు మళ్లీ ధరణి సాఫ్ట్‌వేర్‌లో చూపిస్తున్నారని, దీంతో 70 ఏళ్లుగా భూమి సేద్యం చేసుకుంటూ కాస్తులో ఉన్న రైతుల పేర్లు లేకుండా పోయాయని అన్నారు. ఫలితంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణిలో మార్పులు చేస్తామని తాము మాట్లాడుతుంటే అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ మతిభ్రమించి సన్నాసులు.. అని మాట్లాడుతున్నారని, వారు ధరణితో ఎవరికి న్యాయం చేశారో చెప్పాలని నిలదీశారు. తాను పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న క్రమంలో ధరణి వల్ల భూములపై హక్కులను కోల్పోయిన రైతులు తన వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రైతుల సమస్యలపై స్పందించకుండా.. సన్నాసి యాత్రలు అంటూ తమపై విమర్శలు చేయడం తగదని, దీనిని వారి సభ్యత, సంస్కారాలకే వదిలేస్తున్నానని అన్నారు. తనకు సభ్యత, సంస్కారం ఉంది కాబట్టే కేసీఆర్‌గారు, కేటీఆర్‌గారు అని సంబోధిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చి దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వచ్చే ఎన్నికల్లో తగిన శాస్తి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నేతల అవినీతి బాగోతం బట్టబయలు అవుతుందన్నారు. మంత్రి కేటీఆర్ బహుళ జాతి కంపెనీలకు దళారీగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 1,000 కిలోమీటర్లకు చేరిన భట్టి యాత్ర సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా దేవరకొండకు చేరుకుంది. దీంతో ఆయన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం దేవరకొండ పట్టణంలోని డిండి చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. -
‘ధరణి’ని కాదు.. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలి: సీఎం కేసీఆర్
సాక్షి, నిర్మల్: ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ అవాకులు చవాకులు పేలుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని.. ధరణి పోర్ట్‌లను బంగాళాఖాతంలో వేస్తామన్న దుర్మార్గులను బంగాళా ఖాతంలో పడేయాలని ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం ఎల్లపెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరుపై ధ్వజమెత్తారు. ధరణి ఉండలా, వద్దా? ధరణి తీసేస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు ఎలా పడతాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే.. బ్యాంకు నుంచి మీకు మెస్సేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. రైతు చనిపోతే ఏవిధంగా రైతు బీమా వస్తుందని నిలదీశారు. అందుకే ధరణి పోర్టల్ ఉండలా, వద్దా మీరే చెప్పండంటూ ప్రజలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. గతంలో రెవెన్యూ శాఖలో భయంకరమైన దోపిడీ జరిగేదని ఎవరి భూమి ఎవరి చేతుల్లో ఉండేదో తెలిసేది కాదన్నారు. నిన్న ఉన్న భూమి తెల్లవారే సరికి పహనీలు మారిపోయేవన్నారు. వరాల జల్లు నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు భారీగా నిధులు మంజూరు చేశారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయితీలకు రూ 10 లక్షలు ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఇవి కాకుండా నిర్మల్ జిల్లాలో 19 మండల కేంద్రాలకు రూ. 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. చదవండి: నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ నిర్మల్‌కు ఇంజనీరింగ్ కళాశాల బాసరా సరస్వతి దేవాలయాన్ని పెద్దగా అభివృద్ధి చేసుకుందామని, అద్భుత ఆలయం నిర్మించుకుందామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఓ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తున్నట్లు పేర్కన్నారు. ఒకనాడు మారుమూల జిల్లా, అడవి జిల్లా అని పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని కొత్తగా మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయి. 8న చెరువుల పండగ ‘కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రాంరాం చెబతారు. కాంగ్రెస్ పాలన మనం చూడలేదా. ధరణి పోర్టల్‌ను తీసేస్తే మళ్లీ ఎన్ని రోజులు తిరగాలి. మనకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. రైతు బంధు, దళిత బంధు రాంరాం అనే వాళ్లు కావాలా? ఒకప్పుడు కరెంట్ ఎప్పుడ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. ఇప్పుడు రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్. సాగు, తాగు నీరుసమస్య తీర్చుకున్నాం. ఈనెల 8న చెరువుల పండగ జరుపుకోవాలి. దేశంలోనూ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ రావాలి ఫుడ్ ప్రాసెసింగ్‌పై ఫోకస్ మహారాష్ట్ర రైతులు మన దగ్గర అర ఎకరం కొని వాళ్ల పొలాలకు నీళ్లు తీసుకెళ్తున్నారు. మహారాష్ట్రలో కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుతున్నారు. అధికారానికి దూరమైన వాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారు. త్వరలోనే ఎస్ఆర్ఎస్పీ ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లు అందిస్తాం. ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్‌పై ఫోకస్ పెడతాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రం ఇలాగే సుభిక్షంగా ఉండాలంటే మీ ఆశీస్సులు కావాలి. -
సమగ్ర భూచట్టం..రెవెన్యూ కోడ్ తేవాలంటున్న నిపుణులు!
రాష్ట్రంలో భూముల వివాదాలు, సమస్యలను పరిష్కరించడం కోసం సమగ్ర చట్టాన్ని అమల్లోకి తెచ్చే అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న 124 భూ చట్టాలన్నింటినీ కలిపి.. రెవెన్యూ కోడ్ (ఒకే చట్టం)గా రూపొందించాలని భూచట్టాల నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని.. ఇది అమల్లోకి వస్తేనే రాష్ట్రంలోని భూముల పరిపాలన, హక్కుల కల్పన, వివాదాల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చినా.. దాన్ని కేవలం ఒక్క భూహక్కుల రికార్డుల చట్టం–1971ని సవరించి తెచ్చుకున్నామని గుర్తు చేస్తున్నారు. దీనితోపాటు ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని భూచట్టాలను కలిపి కొత్తగా సమగ్ర చట్టాన్ని తెస్తేనే ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా ‘కోడ్’ ప్రయత్నాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2016లోనే రెవెన్యూ కోడ్‌ను అమల్లోకి తెచ్చారు. అది దేశంలోనే మార్గదర్శకంగా నిలిచిందని.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కూడా దాదాపు ఒకే తరహా చట్టంతో రెవెన్యూ పాలన చేస్తున్నాయని భూచట్టాల నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఒడిశాలోనూ కొత్త సమగ్ర చట్టం కోసం ఇటీవలే మంత్రులు, సీనియర్ అధికారులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేస్తున్నారు. దేశమంతా రెవెన్యూ కోడ్ వైపు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో.. తెలంగాణలోనూ ఆ దిశలో ప్రయత్నాలు మళ్లీ ప్రారంభం కావాలని కోరుతున్నారు. ప్రస్తుతమున్న ఆర్ఓఆర్, కౌలుచట్టం, ఇనామ్‌ల రద్దు, అసైన్డ్ భూముల చట్టం వంటివన్నీ రద్దు చేసి ఒకే చట్టాన్ని తీసుకుని రావాలని ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక కూడా అందించారు. రాష్ట్రం ఏర్పాటైన మొదట్లోనే.. వాస్తవానికి తెలంగాణలో సమగ్ర రెవెన్యూ చట్టాన్ని రూపొందించుకునే ప్రయత్నం రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే మొదలైంది. నాటికి ఉన్న రెవెన్యూ చట్టాలన్నింటినీ సమీక్షించి కొత్త చట్టాన్ని రూపొందించే బాధ్యతను నల్సార్ విశ్వవిద్యాలయానికి అప్పగిస్తూ 2015లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవో మేరకు రెవెన్యూ చట్టాలను పునఃసమీక్షించిన నల్సార్ వర్సిటీ 30 పేజీలతో కూడిన సమగ్ర భూచట్టాల ముసాయిదాను ప్రభుత్వానికి అందజేసింది. ప్రస్తుతం ఈ ముసాయిదా కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో.. భూ వి వాదాలు తగ్గేలా, పాలన సులభతరం చేసేలా, గందరగోళానికి తావులేకుండా ఉండే సమగ్ర భూచట్టాన్నిరూపొందించాలనే డిమాండ్ వినిపిస్తోంది. హక్కుల చిక్కులు తీర్చేదిశగా.. భూచట్టాల నిపుణులు చేస్తున్న సూచనలివీ.. భూసమస్యలు పరిష్కారం కావాలంటే సర్వే తప్పనిసరి. ఒకప్పుడు సర్వేకు ఏళ్లు పట్టేది. కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చాలా తక్కువ సమయంలోనే సర్వే చేయవచ్చు. ఇందుకోసం సర్వే, హద్దుల చట్టం–1923 స్థానంలో కొత్త చట్టం తేవాలి. ఈ సర్వే పూర్తయ్యేలోపు భూలావాదేవీ జరిగిన ప్రతిసారీ సంబంధిత భూమిలో సర్వే జరగాలి. సర్వేయర్ల కొరతను నివారించేందుకు లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి.. వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలి. – భూమి హక్కులకు ప్రభుత్వమే పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తేవాలి. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ కొత్త చట్టం చేయాలి. – భూసంబంధిత అంశాల విషయంలో ఒకే చట్టం ఉండి.. ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళంగా ఉన్నప్పుడే ప్రయోజనం ఉంటుంది. అమలు చేసే వారికీ సులభంగా ఉంటుంది. అన్ని భూచట్టాలను కలిపి రెవెన్యూ కోడ్‌గా రూపొందించాలి. – ధరణి పోర్టల్‌లో సమస్యలు పరిష్కారం కావాలంటే ఆ రికార్డులన్నింటినీ కాగితాల్లోకి ఎక్కించాలి. ప్రజల భాగస్వామ్యంతో సర్వే నంబర్ల వారీగా సమస్యలు గుర్తించి.. గ్రామంలోనే రెవెన్యూ కోర్టు పెట్టి వాటిని పరిష్కరించాలి. – భూవివాదాల పరిష్కార చట్టాన్ని తెచ్చి జిల్లాకో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. రిటైర్డ్ జడ్జి లేదా రెవెన్యూ నిపుణుల నేతృత్వంలో అవి పనిచేయాలి. – కౌలు రైతుల కష్టాలు తీరాలంటే కచి్చతంగా చట్టాల్లో మార్పు రావాలి. పోడు సాగు చేస్తున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలి. – పేదలకు భూసమస్యలు, వివాదాలు వచ్చినప్పుడు వాటిని కోర్టుల్లో పరిష్కరించుకోవడంలో సాయం అందించేందుకు పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. – భూమిలేని నిరుపేద కుటుంబాలకు భూములు ఇచ్చే మార్గాలు వెతకాలి. భూవిధానం, వినియోగం ప్రజలకు మేలు కలిగేలా ఉండాలి. ఇందుకోసం భూపరిపాలనను మెరుగుపర్చాలి. భూఅకాడమీ ఏర్పాటు చేసి భూపరిపాలనలో సిబ్బంది కొరత లేకుండా నియామకాలు జరపాలి. – ఈ అన్ని చర్యలు తీసుకునేందుకు వీలుగా భూకమిషన్ను ఏర్పాటు చేయాలి. రైతులు, సామాన్య ప్రజల డిమాండ్లు ఇవీ.. – భూములను రీసర్వే చేయాలి. భూరికార్డులను సవరించి అందరికీ అందుబాటులో ఉంచాలి. – పేదలకు భూములను పంపిణీ చేయాలి. కౌలు దారులకు రుణఅర్హత కార్డులు ఇవ్వాలి. – సాదాబైనామా భూములను క్రమబదీ్ధకరించాలి. పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి. – రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న భూవివాదాలను పరిష్కరించి సాగులో ఉన్న వారికి పట్టాలివ్వాలి. ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ అధికారి ఉండాలి. – అన్యాక్రాంతమైన గిరిజన, అసైన్డ్ భూములను తిరిగి ఇప్పించాలి. మహిళలకు భూహక్కులు కలి్పంచాలి. పారాలీగల్ వ్యవస్థను బలోపేతం చేయాలి. ధరణితోపాటు ఇతర సమస్యలూ ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే కేవలం ధరణి పోర్టల్‌ను సరిచేస్తే భూవివాదాలన్నీ సమసిపోతాయనే అభిప్రాయం కనిపిస్తోంది. కానీ ధరణి మాత్రమే సర్వరోగ నివారిణి కాదు. దాని చుట్టూనే చర్చ జరగడం సమంజసం కాదు. తెలంగాణ ఏర్పాటవుతున్న సమయంలోనే ‘ల్యాండ్ క్యారవాన్’ పేరుతో రాష్ట్రంలో దాదాపు మూడువేల కిలోమీటర్లు ప్రయాణించి పదివేల మందికిపైగా రైతులను, భూయజమానులను కలిసి నివేదిక రూపొందించాం. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలన్నింటినీ కలిపి ఒకే చట్టం (రెవెన్యూ కోడ్)గా రూపొందించడం, భూములను రీసర్వే చేయడం, జిల్లాకో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం, టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావడం ఈ నివేదికలో ప్రధానమైనవి. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. – భూమి సునీల్, భూ చట్టాల నిపుణుడు -
కేటీఆర్ వెయ్యి ఎకరాల భూ కుంభకోణం చేశారు: రేవంత్ ఫైర్
సాక్షి, ఖమ్మం: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే జోడో యాత్రలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 111 జీవో ప్రకారం కేటీఆర్ వెయ్యి ఎకరాల కుంభకోణం చేశారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తోట చంద్రశేఖర్‌కు కేటాయించిన భూములపై విచారణ చేయాలి. సీఎం కేసీఆర్ నీతిమండుడైతే విచారణకు సిద్ధం కావాలి. పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ ఎందుకు ఇవ్వలేదు. రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు.. ఆరోగ్యశ్రీ కింద 850 కోట్ల బకాయి ఉంది. రైతులకు అనుకూలమైన విధానాలను కాంగ్రెస్ తెచ్చింది. కేసీఆర్ ఆడంబరంగా ఉచిత్ విద్యుత్ అన్నాడు.. కానీ ఇవ్వడంలేదు. ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి 50 శాతం కమీషన్లు తీసుకున్నాడు. విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేశాడు. 2014 నుండి నేటి వరకు ఉచిత విద్యుత్ 20 వేల కోట్లు మొండి బకాయిగా మారింది. విద్యుత్ కార్యాలయం ఎర్రమంజిల్‌తో పాటు అన్ని తనాఖాలో ఉన్నాయి. యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా సొంత మనుషులకు ఇప్పించి కుంభకోణాలకు పాల్పడ్డారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. మేము అధికారంలోకి వచ్చాక భూముల సంగతి తెలుస్తాము అంటూ కామెంట్స్ చేశారు. -
చెప్పేదొకటి... చేసేదొకటి
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల జాబితాలో మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ కొత్త మలుపు తిరిగింది. ఈ ప్రక్రియలో మౌఖికంగా చెప్పి మార్పులు చేయిస్తున్నారని, తద్వారా భవిష్యత్తులో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని తహసీల్దార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో లిఖితపూర్వక ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం ఇచ్చిన ఈ ఆదేశాల సర్క్యులర్‌ను ఈనెల 3నే జారీ చేసినట్లు ఉన్నా, శనివారం ఉదయమే తహసీల్దార్లకు అందజేయడం గమనార్హం. కోర్టు కేసులు, భూసేకరణలో భాగంగా తీసుకున్న భూములు, అసైన్డ్, సీలింగ్, దేవాదాయ, వక్ఫ్, ఇనాం భూముల విషయంలో ఏ నిబంధనలను ప్రాతిపదికగా తీసుకుని మార్పులు చేయాలో ఈ సర్క్యులర్‌లో వివరించారు. ఆచరణలో ఏదీ.. ఈ సర్క్యులర్‌లో రెవెన్యూ చట్టాలు చెబుతున్న నిబంధనలను ఉటంకించారే తప్ప ఆచరణలో వీటిని ఏమాత్రం పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సీసీఎల్ఏ కార్యాలయం వేదికగా వారంపాటు జరిగిన కసరత్తుకు, ఈ సర్క్యులర్‌లో పేర్కొన్న నిబంధనలకు తేడా ఉందని సాక్షాత్తు ఈ ప్రక్రియలో పాల్గొన్న తహసీల్దార్లే చెబుతున్నారు. ఇనాం భూముల విషయంలో స్వాధీన హక్కుల ధ్రువపత్ర (ఓఆర్సీ) రిజిస్టర్‌ను పరిశీలించాలని నిబంధనలు చెబుతుంటే, ఓఆర్సీతో పనిలేదని, ఓఆర్సీ రిజిస్టర్లో సర్వే నంబర్ లేకపోయినా పాసు పుస్తకం ఉంది కాబట్టి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సీసీఎల్ఏ ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసైన్మెంట్ రిజిస్టర్లో నమోదై ఉన్న భూముల సర్వే నంబర్లు పహాణీలో పట్టా అని ఉంటే అసైన్డ్ కాకుండా పట్టా కింద పరిగణించాలని, పొరపాటున పహాణీలో పట్టా అని నమోదై ఉన్నా పట్టాగానే పరిగణించాలని సీసీఎల్ఏ అధికారులు చెబుతున్నారని తహసీల్దార్లు వాపోతున్నారు. అయితే, ఈ ప్రక్రియలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న కారిజ్ ఖాతా భూముల విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో శిస్తు చెల్లించలేని భూములు పట్టా అయినప్పటికీ కారిజ్ ఖాతాలో చేర్చారని, ఆ ఖాతాలోని భూములనే పేదలకు అసైన్ చేశారని తెలుస్తోంది. పేదలకు అసైన్ చేసిన భూముల విషయంలో అసైన్మెంట్ చట్టం ప్రకారమే లావాదేవీలు నిర్వహించే వీలుండగా, కారిజ్ ఖాతాలో ఉన్న భూమి వివరాలు పహాణీలో పట్టా అని ఉన్నందున వాటిని కూడా అసైన్డ్ భూమి నుంచి తొలగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. -
Dharani Website Issues: పల్లెబాట పడితేనే 'ధరణి' దారికి
సాక్షి, హైదరాబాద్: ఒక్కో గ్రామంలో కనీసం 200 సమస్యలు. గ్రామీణ ప్రజలకు న్యాయ సహాయం అందించేందుకు గాను ఓ స్వచ్ఛంద సంస్థ ఇటీవల రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఉన్న నాలుగు గ్రామాల్లో పర్యటిస్తే.. ధరణి పోర్టల్‌కు సంబంధించి వెలుగుచూసిన సమస్యల సంఖ్య ఇది. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలోని 12 వేలకు పైగా ఉన్న గ్రామాల్లో 24 లక్షలకు పైగానే సమస్యలు ఉండే అవకాశం ఉందని భూచట్టాల నిపుణుల అంచనా. ఈ సమస్యలకు ధరణి పోర్టల్‌లో పరిష్కారం లేదని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పారదర్శక నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో కార్యాచరణ ద్వారానే అది సాధ్యమవుతుందని వారంటున్నారు. గురువారం రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో ధరణి పోర్టల్ సమస్యలపై చర్చించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. రెండేళ్లుగా రైతుల పాట్లు రాష్ట్రంలోని భూములకు సంబంధించిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు సులభతరమైన భూసేవలను అందించేందుకు గాను ప్రభుత్వం ధరణి పేరిట పోర్టల్‌ను తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా, ఈ పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలు, పరిష్కారం చూపని మాడ్యూళ్లు, క్షేత్రస్థాయిలో పరిష్కార వ్యవస్థలు లేకపోవడంతో దాదాపు రెండేళ్లుగా రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయిలో ప్రయత్నిస్తోందే తప్ప శాస్త్రీయ పరిశీలన జరపడం లేదనే విమర్శలున్నాయి. రైతాంగం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. కొన్నిటికి పరిష్కార మాడ్యూళ్లే లేవు? రైతుల ఇక్కట్ల నేపథ్యంలో ధరణి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సిద్దిపేట జిల్లాలోని ములుగు మండల కేంద్రాన్ని పైలట్‌గా ఎంచుకుంది. ఈ గ్రామంలో మొత్తం 277 సమస్యలున్నాయని గుర్తించగా, ఇందులో 140 సమస్యల పరిష్కారానికి అసలు ధరణి పోర్టల్‌లో మాడ్యూళ్లే లేవని భూనిపుణులు చెపుతున్నారు. కానీ ఈ సమస్యలన్నీ దాదాపు పరిష్కారమయ్యాయని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. తాత్కాలిక ఉపశమనమే! ధరణి పోర్టల్‌లో ఎదురయ్యే సమస్యలపై చేసుకునే దరఖాస్తులను పరిష్కరించే బాధ్యత జిల్లా కలెక్టర్లకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం క్షేత్రస్థాయిలో ఎమ్మార్వోలు, ఆర్డీవోలు ఇచ్చే సమాచారం మేరకు కలెక్టర్లు నిర్ణయం తీసుకుని సమస్యలను పరిష్కరిస్తున్నారు, లేదంటే తిరస్కరిస్తున్నారు. కానీ ఈ సమస్యలు పరిష్కరించినా లేదా తిరస్కరించినా.. ఆ మేరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదు. కంప్యూటర్లోనే ఆమోదించి, లేదంటే తిరస్కరించి ఆ మేరకు ధరణి రికార్డులను మార్చేస్తున్నారు. ఈ విధంగా చేయడం తాత్కాలిక ఉపశమనమే కానీ చట్టాల ముందు కలెక్టర్లకు కట్టబెట్టిన ఈ అధికారాలు నిలబడవని నిపుణులు అంటున్నారు. భూరికార్డుల్లో జరిగిన మార్పులకు లిఖితపూర్వక ఆదేశాలు లేదా ఉత్తర్వులు లేనిదే అవి చెల్లుబాటు కావనేది భూ చట్టాల నిపుణుల వాదన. 2020 సంవత్సరంలో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో ఈ మేరకు కలెక్టర్లకు అధికారాలు కట్టబెట్టే నిబంధన ఎక్కడా లేదని వారంటున్నారు. సాదాబైనామాలకైనా చట్ట సవరణ చేయాల్సిందే.. ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా కానీ, చట్టాన్ని సవరించి కానీ.. ఏదో స్థాయిలోని అధికారికి తగిన అధికారాలు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. సదరు అధికారులు గ్రామాలకు వెళ్లి సర్వే నంబర్ల వారీగా దరఖాస్తులను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేసినప్పుడే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. ఇక సాదాబైనామాల అంశాన్ని పరిష్కరించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న భూ హక్కుల (ఆర్వోఆర్) చట్టానికి తప్పనిసరిగా సవరణ జరగాల్సిందేనని పేర్కొంటున్నారు. పాత చట్టం (1971 ఆర్వోఆర్) అమల్లో ఉన్నప్పుడు వచ్చిన సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాన్న కోర్టు.. కొత్త చట్టం (2020) వచ్చాక స్వీకరించిన దరఖాస్తులపై స్టే విధించింది. కొత్త చట్టంలో సాదాబైనామాల పరిష్కారానికి ఎలాంటి నిబంధన పొందుపరచక పోవడమే ఇందుకు కారణం. అయితే కోర్టు చెప్పినట్టు పాత చట్టం ఉన్నప్పుడు వచ్చిన 2.4 లక్షల సాదాబైనామాలను పరిష్కరించాలన్నా చట్ట సవరణ చేయాల్సిందేనని నిపుణులు అంటున్నారు. గ్రామాలకు వెళ్లి పరిష్కరించడమే ఉత్తమం భూసమస్యల పరిష్కారానికి గ్రామాలే సరైన వేదికలని గత 20 ఏళ్ల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. 2004–05 మధ్య కాలంలో గ్రామ రెవెన్యూ అదాలత్‌లను నిర్వహించారు. ఆ తర్వాత 2005–07 మధ్య కాలంలో గ్రామ రెవెన్యూ కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ కోర్టుల ద్వారానే భూసమస్యలను పరిష్కరించాలని, ఎమ్మార్వో స్థాయిలో 75 శాతం, ఆర్డీవో స్థాయిలో 50 శాతం సమస్యలను.. గ్రామ రెవెన్యూ కోర్టులను ఏర్పాటు చేసి పరిష్కరించాలని అప్పట్లో జీవో కూడా ఇచ్చారు. ఆ తర్వాత రైతుల పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లపై యూనిక్ కోడ్ వేసేందుకు గాను రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు వెళ్లింది. ఆ తర్వాత రఘువీరారెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు మూడు నెలల పాటు గ్రామాల్లో ప్రత్యేక రెవెన్యూ సదస్సులు రెండేళ్ల పాటు వరుసగా నిర్వహిస్తే ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ పరిశీలిస్తే క్షేత్రస్థాయికి అంటే గ్రామ స్థాయికి వెళ్లి ధరణి సమస్యలను పరిష్కరించడమే ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి భూ కమతానికి భూ కిట్ ఇవ్వాలి క్షేత్రస్థాయిలో భూసమస్యల పరిష్కారానికి కనీసం 6–8 నెలల సమయం పడుతుంది. సర్వే నంబర్లు, భూయజమానులు, సమస్యలను గుర్తించేందుకు రెండు నెలలు, ఆ తర్వాత సమస్యల పరిష్కారానికి దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు 2 నెలలు, వాటిని గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో పరిష్కరించేందుకు మరో 2–4 నెలలు పడుతుంది. ప్రతి భూకమతానికి భూకిట్ (పహాణీ నకలు, 1బీ నకలు, టిప్పన్, గ్రామ పటం, సేత్వార్, పాస్‌బుక్, టైటిల్ డీడ్) ఇచ్చినప్పుడే భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించినట్టవుతుంది. ఇందుకోసం ఆర్వోఆర్ చట్టానికి సవరణ చేయడం, రికార్డుల సవరణ అధికారాలను కట్టబెట్టడం, గ్రామస్థాయికి రెవెన్యూ యంత్రాంగం వెళ్లడం చాలా కీలకం. ఈ దిశలో మంత్రివర్గం ఆలోచించాలి. – భూమి సునీల్, భూమి చట్టాల నిపుణుడు చదవండి: డీజీపీ కుర్చీ ఎవరికి?.. రేసులో ఆ ముగ్గురు..! -
కేంద్రం నిధులు బొక్కేస్తున్న కేసీఆర్
సాక్షి, యాదాద్రి/చౌటుప్పల్: కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కేసీఆర్ బొక్కేస్తుండటం వల్లే మీ వరకు రావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలనుద్దేశించి అన్నారు. పేదల భూములను లాక్కునేందుకే కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చారన్నారు. ప్రభుత్వం లాక్కున్న భూములను రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే తిరిగి పేదలకు పంచుతామని వెల్లడించారు. మేము ఎన్నికల కోసం రాలేదని, ఇక్కడ ప్రజా సంగ్రామయాత్ర మొదలయ్యాకే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా మంగళవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా తాళ్లసింగారంలో ‘చాయ్ పే చర్చా’, లింగోజిగూడెంలో రచ్చబండ కార్యక్ర మాలను నిర్వహించారు. ఈ ప్రాంతంలో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలతో జనం ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరెంట్(పవర్) ఇవ్వని కేసీఆర్ పవర్‌ను కట్ చేద్దామని చెప్పారు. కాగా, తాళ్లసింగారంలో నిర్వహించిన చాయ్‌పే చర్చలో పలు వురు మహిళలు మాట్లాడుతూ.. గ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని, ధరలు తగ్గించిన పార్టీకే ఓటేస్తామ న్నారు. సంజయ్ బదులిస్తూ.. గ్యాస్ విషయంలో పెద్దగా భారం పడటం లేదని, నెలకు రూ.30 మాత్రమే భారం పడుతోందని చెప్పారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన నేపథ్యంలోనే ధరలు పెరిగాయని వెల్లడించారు. రైతు సమస్యలపై రచ్చబండ.. కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేయడంలేదని, ధరణిలో అవి నీతి, రెవెన్యూ వ్యవస్థలో లంచాలు పెరిగాయని రైతులు బండి సంజయ్ దృష్టికి తెచ్చారు. కొన్ని కెమికల్ కంపెనీలు కాలు ష్యం వెదజల్లుతున్నాయని, ఈ ప్రాంతంలో పంటలు పండే పరిస్థితి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లింగోజి గూడెం గ్రామస్తులు బండి సంజయ్ వద్ద వాపోయారు. 7వ రోజు 12.6 కిలోమీటర్లు యాత్ర.. సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర 7వ రోజైన మంగళవారం 12.6 కిలోమీటర్లు సాగింది. ఉదయం చౌటుప్పల్ మండలం తాళ్లసింగారంలో ప్రారంభమై.. వివిధ గ్రామాల మీదుగా నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లికి చేరుకుంది. మన జెండా గొప్పతనాన్ని ప్రపంచమే గుర్తించింది.. మన జాతీయ జెండా గొప్పతనాన్ని యావత్ ప్రపంచ మంతా గుర్తించిందని బండి అన్నారు. ఆజాదీకా అమృత్ మహో త్సవాలను పురస్కరించుకొని మంగళవారం యాదాద్రి భువ నగిరి జిల్లా చౌటుప్పల్‌లో స్వాతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపా ధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనో హర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు. చదవండి: మునుగోడులో టీఆర్ఎస్ దిద్దుబాటు -
ఎవుసం బాగుండాలే... రైతన్న బాగుపడాలే
ఇప్పటివరకు రెండు విడతలుగా పాదయాత్ర చేసిన. మూడో విడత పాదయాత్ర ఆగస్ట్ 2న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహా దేవాలయం నుంచి వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి దేవాలయం వరకు కొనసాగనున్నది. ప్రజా సమ స్యలను తెలుసుకోవడం, ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇవ్వడం, యావత్ తెలంగాణ ప్రజలపట్ల కేసీఆర్ సర్కార్ అను సరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అనే విశ్వాసాన్ని ప్రజల్లో నింపడమే ఈ పాదయాత్ర లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న రైతాంగం కోసం ‘ఫసల్ బీమా యోజన’ పథకం తీసుకువచ్చింది. దీని వల్ల అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభ వించినప్పుడు రైతాంగానికి సత్వరమే నష్టపరిహారం చెల్లించే వీలు ఉంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదు. రైతుల పట్ల కేసీఆర్ చిత్తశుద్ధికి ఇదే నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులున్నరు. కౌలు రైతులకు ఎటువంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. కౌలు రైతుకు ‘రైతు బంధు’ పథకం ఎటూ అమలు కాకపోయినా... ఉచిత ఎరువులు, సబ్సిడీ రుణాల వంటి సౌకర్యాలన్నా ఉండాలి కదా. కౌలు రైతులు గుర్తింపు కార్డులతో నాబార్డు నుంచి రుణాలు పొందే సౌకర్యం ఉన్నా ప్రభుత్వం అందుకు సహకరించడం లేదు. ఏక కాలంలో లక్ష రూపాయల వరకూ ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తమని కేసీఆర్ ఎన్నికల్లో వాగ్దానం చేసిన్రు. ఆ హామీ ఇప్పటికీ సంపూర్ణంగా అమలు కాలే. లక్ష లోపు రుణమాఫీ కావాల్సిన వారు ఇప్పటికే 31 లక్షల మంది ఉన్నరు. రూ. 25 వేల నుండి రూ. 50 వేల వరకు రుణమాఫీ కావాల్సిన వారు 5.72 లక్షలు, రూ. 50 వేల నుంచి 75 వేల వరకు రుణమాఫీ కావాల్సిన రైతులు 7 లక్షల మంది ఉన్నరు. రైతన్నలను మరింత వణికిస్తున్న సమస్య ‘ధరణి’. రైతాంగం ఎదుర్కొంటున్న మొత్తం సమస్యలకు ‘జిందాతిలిస్మాత్’లా ధరణి పోర్టల్ పనిచేస్తదని కేసీఆర్ డాంబికాలు పలికిన్రు. కానీ ఆచరణలో ధరణి పేరెత్తితే రైతులు హడలెత్తి పోతున్నారు. పాస్‌పుస్తకం చేతిలో ఉన్నా, ఆ భూమికి యజమాని తామేనా? కాదా? అన్న రీతిలో రైతన్నల దుఃస్థితి నెలకొన్నది. అసైన్డ్ భూములను సైతం ప్రభుత్వం వదలడం లేదు. అసైన్డ్ భూముల్లో వెంచర్లు వేస్తూ ప్రభుత్వం పేదల ఉసురు తీస్తున్నది. ఒక్క ‘రైతుబంధు’ ఇచ్చి అన్ని సబ్సిడీలు బంద్ పెట్టిన ఘనత కేసీఆర్‌దే. ట్రాక్టర్ల సబ్సిడీ బంద్. వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ బంద్. ‘రైతునే రాజు చేస్తా, బంగారు తెలంగాణలో ఎరువు లన్నీ ఉచితంగా అందిస్తాన’న్న కేసీఆర్ మాటలు నీటి మూటలయ్యాయి. ఇక పోడు రైతుల సమస్యలు చెప్పనలవి కాదు. ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా కుర్చీ వేసుకుని పోడుభూముల పట్టా సమస్యలను పరిష్క రిస్తామని చెప్పిన్రు. పోడుభూముల సమస్య పరిష్కారం కాకుం డానే అదే భూముల్లో ఫారెస్ట్ అధికారులు వన సంరక్షణ పేరుతో మొక్కలు నాటుతుంటే కేసీఆర్ గుడ్లు అప్ప గించి చూస్తున్రు. రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ళ విష యంలో కేంద్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించినా రాష్ట్రప్రభుత్వం ఆ సమస్యను రాజకీయం చేయాలను కున్నది. ఎఫ్‌సీఐ సోదాల్లో బయటపడ్డ రైస్‌మిల్లర్ల అక్ర మాలను కప్పిపుచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. గన్నీబ్యాగుల కొనుగోలు నుంచి ధాన్యం నిల్వ వరకూ ప్రతిపైసా కేంద్రమే చెల్లిస్తున్నా ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రప్రభుత్వం నానా యాగీ చేసింది. ‘వరేస్తే ఉరే’ అంటూ కేసీఆర్ చేసిన ప్రకటన వల్ల యాసంగిలో 14 లక్షల ఎకరాలలో రైతులు వరిపంట వేయక నష్టపోయారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటల విషయంలోనూ ప్రభుత్వం తగిన సూచనలు ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల యాసంగి పంటను దళారులు కోరిన రేటుకే రైతులు అమ్ము కోవాల్సిన దుఃస్థితిని కేసీఆర్ కల్పించిన్రు. రైతు బంధుకు సకాలంలో నిధులియ్యరు. కుంటిసాకులు చెప్పి రైతుల బీమాను పక్కాగా అమలు చేయరు. రైతు రుణ మాఫీ ఊసే ఎత్తరు. కాళేశ్వరం పేరుతో ఖజానా ఖాళీ చేసిన కేసీఆర్ సర్కార్ మొన్నటి వరదల్లో మేడిగడ్డ సహా ఇతర లిఫ్టుల పరిస్థితి చూసి, ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లియ్యడానికి నానా తిప్పలు పడుతున్నది. గిట్టుబాటు ధర అడిగిన రైతులకు బేడీలు వేసి జైళ్లకు పంపిన ఘనమైన చరిత్ర కూడా కేసీఆర్ ప్రభుత్వానిదే. కేసీఆర్ ప్రజలకు చేసింది శుష్కవాగ్దానాలు, శూన్య హస్తం తప్ప వేరే ఏమీ కనిపించవు. తెలంగాణ రైతాంగం పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు బీజేపీ ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’ చేపట్టింది. రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నీరు గారుస్తున్నది. రైతాంగం పట్ల కేసీఆర్ తీరును ప్రశ్నించేందుకు ఈ ప్రజా సంగ్రామ పాదయాత్రను ఒక అవకాశంగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమమే ధ్యేయంగా సాగనున్న ఈ ప్రజా సంగ్రామ పాద యాత్రకు తెలంగాణ రైతాంగం అంతా బాసటగా నిల వాలని కోరుతున్నాం. ఎవుసం బాగుండాలే, రైతన్న బాగు పడాలే... అదే బీజేపీ లక్ష్యం. అందుకే నా పాదయాత్ర! - బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు -
‘ధరణి’ని బంగాళాఖాతంలో కలుపుతాం
సాక్షి, హైదరాబాద్/ కవాడిగూడ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళా ఖాతంలో కలుపుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ సర్కారు ధరణి పేరుతో పేద రైతుల భూములను లాక్కుంటూ వారిని రోడ్డుపాలు చేస్తోందని, ఆ పోర్టల్ రద్దయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ధరణిపై రచ్చ బండ కార్యక్రమం నిర్వహించారు. చదవండి: కాంగ్రెస్‌లో ‘కుర్చీ’లాట! దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా ప్రాజెక్టుల పేరుతో లాక్కోవడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణలో భూమే ఆత్మగౌరవంగా రైతులు బతుకుతున్నారన్నారు. టీ ఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తూ నిరంకుశ పాలన చేస్తోందని ఆరోపించారు. కోట్ల విలువైన భూముల ను టీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొడుతోందని మండిపడ్డారు. వైఎస్ సర్కార్ పంచి పెడితే.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకువచ్చి, గిరిజనులకు ఐదు లక్షల ఎకరాల భూములను పంచిపెడితే ఇప్పుడు ఆ భూములను లాక్కునే ప్రయత్నాలు సాగుతున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పేద ప్రజల ఆత్మగౌరవమైన భూమిని గుంజుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. భూమిపై హక్కు కలిగి ఉన్న రైతులకు పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కబ్జా చేస్తున్న వైనాన్ని రైతులు ప్రశ్నిస్తే వారిపై పాశవికంగా దాడులు చేసి, మహిళలను.. చంటిపిల్లలను సైతం జైలుకు పంపిస్తున్న నీచమైన ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, వారి భూములను కాపాడే బాధ్యత పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. చదవండి: ఘాటెక్కి.. చప్పబడ్డ విష్ణు విందు రికార్డులు మాయం సచివాలయాన్ని కూలగొట్టి రెవెన్యూ రికార్డులన్నీ మాయం చేశారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ మాయమాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అన్నారు. లక్ష్మాపూర్ గ్రామంలో 800 మందికి పట్టాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ కొట్లాడి 200 మందికి పట్టాలు ఇప్పించిందన్నారు. వరంగల్ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ధరణిని వెంటనే రద్దు చేయాలని, రెవెన్యూ రికార్డులను ప్రజల వద్ద ఉంచాలని, పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ గిరిజనులకు భూమిపై హక్కు కల్పించాలని తీర్మానాలు చేశారు. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అ ధ్యక్షుడు అవినాష్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించ గా.. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, పార్టీ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, వి. హను మంతరావు, మధుయాïష్కీ, సీతక్క, రాములు నాయక్, విజయారెడ్డి, తంగిశెట్టి జగదీశ్వర్‌రావు, నల్లబెల్లి అంజిరెడ్డి, సూర్యప్రకాశ్ ముదిరాజ్ పాల్గొన్నారు. -
పాస్‌పుస్తకంలో ‘పాట్ ఖరాబ్’
సాక్షి, హైదరాబాద్: రికార్డుల పరంగా వ్యవసాయ భూమిగా నమోదై, సాగు భూమిలోనే ఉన్నప్పటికీ సాగు చేయకుండా, ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్న భూమి లెక్కలు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ భూముల్లో ఉండి వ్యవసాయం జరగని భూమి విస్తీర్ణాన్ని ‘పాట్ ఖరాబ్’పేరుతో రెవెన్యూ రికార్డుల్లో పొందుపర్చనుంది. సేత్వార్ (గ్రామస్థాయి రికార్డు)/రెవెన్యూ రికార్డులే కాకుండా.. ఆ వివరాలను రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల్లో, ధరణి పోర్టల్‌లో కూడా నమోదు చేయనుంది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ తాజా ఉత్తర్వులు రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. రైతుబంధు కింద పెట్టుబడి సాయం కచ్చితంగా సాగు జరుగుతున్న విస్తీర్ణానికే ఇవ్వడం ద్వారా పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు రైతుబంధు భారాన్ని కూడా కొంతమేర తగ్గించుకునే వ్యూహంలో భాగంగానే ఈ ఉత్తర్వులు వెలువరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని వివరాలూ నమోదు చేయాల్సిందే.. ♦తాజా ఉత్తర్వుల ప్రకారం.. సేత్వార్/రెవెన్యూ రికార్డుల్లో పాట్ ఖరాబ్‌గా రికార్డయిన వివరాలు పొందుపర్చాలి. ♦వ్యవసాయ భూముల్లో ఉన్న రాళ్లు, నీటి నిల్వ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, కట్టలు, సాగునీటి చానళ్లు, వాగు, వర్రెలను నమోదు చేయాలి. ♦ఎడ్ల కొట్టాలు, పేడ గొయ్యిలు, దిబ్బలున్న ప్రాంతాలు, భవనాలు, అనుబంధ ప్రదేశాల వివరాలను పొందుపర్చాలి. ఆ భూమిలో ఉన్న చెట్ల వివరాలను (ప్రైవేట్ ఫారెస్ట్) కూడా పేర్కొనాలి. ♦ట్రాక్టర్ షెడ్లుగా, నూర్పిడి ప్రాంతంగా ఎంత భూమిని వినియోగిస్తున్నారనేది కూడా తెలియజేయాలి. వరదలు, భూమి కోత, భూకంపాలు సంభవించినప్పుడు సాగుకు పనికిరాకుండా పోయిన భూముల వివరాలను పొందుపర్చాలి. అదే విధంగా వ్యవసాయ భూముల్లో ట్రాక్టర్లు, కోతయంత్రాలు వెళ్లే దారులు, వర్షపు నీటి గుంతల వివరాలను ఇవ్వాలి. ♦ఇలా అన్ని వివరాలతో స్థానిక ఆర్డీవోకు పట్టాదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాస్‌పుస్తకం వివరాలతో పాటు ఈ సమాచారాన్ని కూడా దరఖాస్తుల్లో పేర్కొనాలి. వీటిపై ఆర్డీవో క్షేత్రస్థాయిలో విచారణ చేస్తారు. సర్వే నిర్వహించి పాస్‌పుస్తకంలో వ్యవసాయ భూమిగా నమోదై ఉన్న భూమిలో.. ఎంత భూమి పాట్ ఖరాబ్ కిందకు వస్తుందో నిర్ధారిస్తారు. ఆ భూమిని ఎందుకు వినియోగిస్తున్నారనే వివరాలను కూడా సేకరిస్తారు. ఈ మేరకు ఆర్డీవో ఉత్తర్వులిచ్చిన తర్వాత పాట్ ఖరాబ్ వివరాలను పాస్‌పుస్తకంలో, ధరణి పోర్టల్‌లో పొందుపర్చనున్నారు. -
దారికొచ్చిన ‘ధరణి’..! వెబ్సైట్లో కొత్త ఆప్షన్లు
మోర్తాడ్ బాల్కొండ/నిజామాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, తక్షణ మ్యుటేషన్ కోసం రూపొందించిన ధరణి వెబ్సైట్లో కొత్త ఆప్షన్లను ఇచ్చారు. ఫలితంగా కొంత కాలంగా పరిష్కారం కాని అనేక సమస్యలకు దారి చూపడానికి అవకాశం ఏర్పడిందని అధికార యంత్రాంగం చెబుతుంది. ధరణి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి ఏడాదిన్నర కాలం అవుతుంది. కొన్ని ఆప్షన్లను ఇవ్వడంతో కేవలం డిజిటల్ పట్టా పాసు పుస్తకం ఉండి ఎలాంటి తప్పు లు లేని భూమి పట్టా మార్పిడి మాత్రమే జరిగింది. చదవండి👉 Teenmar Mallanna: బీజేపీకి తీన్మార్ మల్లన్న గుడ్ పార్ట్–బీలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించి పట్టా పాసు పుస్తకాలను జారీ చేయడం, పట్టా మార్పిడి చేయడం వీలు పడలేదు. కొన్ని ఆప్షన్లు ఇచ్చి ప్రధాన ఆప్షన్లను ఇవ్వకపోవడంతో భూముల పట్టా మార్పిడి జరగకపోవడం, వివాదాలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. ధరణిలో తాజాగా పాస్ బుక్కులలో పేర్ల మార్పు, భూమి స్వభావం, వర్గీకరణ, భూమి రకం, విస్తీర్ణం లెక్కలను సరి చేయడం, మిస్సింగ్ సర్వే నంబర్లను గుర్తించి వాటిని ఎక్కించడం, సబ్ డివిజన్ల చేర్పు, నేషనల్ ఖాతా నుంచి పట్టా భూమి మార్పు, భూమి అనుభవంలో మార్పులకు అవకాశం ఏర్పడింది. ఇలా పలురకాల ఆప్షన్లను ఇవ్వడంతో అనేక సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి మా ర్గం సుగమమైందని తహసీల్దార్లు చెబుతున్నారు. చదవండి👉🏻 దయాకర్‌కు నోటీసులు.. మదన్మోహన్కు హెచ్చరిక కొత్త ఆప్షన్లను పరిశీలిస్తున్నాం ధరణిలో ఇచ్చిన కొత్త ఆప్షన్లను పరిశీలిస్తున్నాం. గతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఎంత మేరకు పరిష్కరించవచ్చో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కొత్త ఆప్షన్లతో ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. – శ్రీధర్, తహసీల్దార్, మోర్తాడ్ -
పహాణీ.. ఏడేళ్ల పరేషానీ!
సాక్షి, హైదరాబాద్: పహాణీ.. అత్యంత కీలకమైన ఓ భూ రికార్డు. సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్లలో ఉండే భూమి విస్తీర్ణం, యజమాని పేరు, హక్కులు సంక్రమించిన విధానం, భూమి రకం లాంటి వివరాలన్నీ ఇందులో ఉంటాయి. బ్యాంకులు ఇచ్చే తనఖా రుణాలు, టైటిల్ క్లియరెన్స్‌లు, కోర్టు కేసుల విషయంలో ఇది ప్రధాన భూమిక పోషిస్తుంది. యాజమాన్య హక్కుల కల్పనకు దీనిని మాతృకగా పరిగణిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పహాణీలకు సంబంధించిన ఏడేళ్ల రికార్డులు అందుబాటులో లేకపోవడం రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పులు తెచ్చి పెడుతోంది. 2011 నుంచి 2018 వరకు తయారైన కంప్యూటరైజ్డ్ పహాణీలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకపోవడంతో సమస్యలు వస్తున్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 2018 నుంచి భూరికార్డుల ప్రక్షాళన ద్వారా సేకరించిన రికార్డులు అందుబాటులో ఉన్నా అంతకుముందు ఏడేళ్ల పహాణీలు లేకపోవడంతో చాలా సమస్యలు పరిష్కారం కాక పెండింగ్ జాబితాలోనే ఉండిపోతున్నాయి. 2011 వరకు కాగితాల్లోనే.. ప్రతి రెవెన్యూ గ్రామానికి పహాణీలు తయారు చేయడం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో భూరికార్డులకు 1954–55 పహాణీలను కీలక ఆధారంగా రెవెన్యూ శాఖ పరిగణిస్తోంది. అప్పటి నుంచి 2004 వరకు ప్రతియేటా రెవెన్యూ వర్గాలు గ్రామ పహాణీలను మాన్యువల్‌గా తయారు చేశాయి. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి కంప్యూటరైజ్డ్ పహాణీల తయారీ ప్రారంభమైంది. పైలట్‌గా చేపట్టిన ఈ ప్రక్రియలోనే కొన్ని సమస్యలు ఎదురుకావడంతో 2011 వరకు రెవెన్యూ యంత్రాంగం ప్రతి ఏటా మాన్యువల్ పహాణీలు రాసింది. తర్వాత మాన్యువల్ పహాణీలు రాయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో 2011–12 నుంచి కాగితపు పహాణీలు రాయడం మానేశారు. అప్పటి నుంచి కంప్యూటర్లోనే ఈ పహాణీ రికార్డులు రూపొందించేవారు. 2011 నుంచి 2018 వరకు జరిగిన ఈ ప్రక్రియను జాతీయ స్థాయి సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) నిర్వహించింది. 2018లో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ) ప్రారంభం కావడంతో అప్పటినుంచి మిగతా భూరికార్డులతో పాటు పహాణీలను ఎల్‌ఆర్‌యూపీ పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. ఇక 2020 నవంబర్‌లో ధరణి పోర్టల్ అందుబాటులోకి రావడంతో ఎల్‌ఆర్‌యూపీ పోర్టల్ డేటా అంతటినీ ధరణి పోర్టల్‌లోకి బదిలీ చేశారు. ఈ ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను టెండర్ ప్రక్రియ ద్వారా ఐఎల్ఎఫ్ఎస్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ధరణి అందుబాటులోకి వచి్చనా.. 2020లో ధరణి అందుబాటులోకి వచ్చినా 2011 నుంచి 2018 వరకు రూపొందించిన పహాణీ రికార్డులు మాత్రం ఎన్ఐసీ వద్దనే ఉన్నాయి. ఈ డేటాను అటు రెవెన్యూ శాఖకు కానీ, ఇటు ధరణి పోర్టల్‌ను నిర్వహించే ఐఎల్ఎఫ్ఎస్ అనే ప్రైవేటు సంస్థకు గానీ ఎన్ఐసీ ఇవ్వలేదు. తాము ఒకవేళ ఈ డేటాను బదిలీ చేస్తే తమ వద్ద ఉండే సర్వర్లలో ఇకపై వాటిని స్టోరేజీ చేయబోమని ఎన్ఐసీ తేల్చి చెప్పింది. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. డేటాను బదిలీ చేయడంతో పాటు ఎన్ఐసీ సర్వర్లలో స్టోర్ చేయా లని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సర్వర్ల సమస్య తలెత్తదని వాదించింది. ఈ వాదనను పట్టించుకోని ఎన్ఐసీ ఇప్పటివరకు 2011–18 మధ్య తయారు చేసిన ఆన్లైన్ పహాణీ రికార్డులను ప్రభుత్వానికి ఇవ్వలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆ మధ్య కాలంలో జరిగిన లావాదేవీల ద్వారా మారిన భూ యాజమాన్య హక్కుల వివరాలు అందుబాటులో లేకుండా పోయాయని అంటున్నా యి. ఈ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో సదరు భూములపై యాజమాన్య హక్కులను నిర్ధారించి టైటిల్ క్లియరెన్స్ ఇవ్వలేకపోతున్నామని రెవెన్యూ శాఖకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇక బ్యాంకులు అప్పులు ఇవ్వాలన్నా, సివిల్ కోర్టుల్లోని కేసులు తేలాలన్నా గత 13 ఏళ్ల పహాణీ రికార్డులను ఆధారంగా తీసుకుంటాయని, ఇప్పడు ఆ రికార్డులు లేకపోవడంతో ఇ బ్బందులు వస్తున్నాయని రెవెన్యూ వర్గాలంటు న్నాయి. చాలావరకు కోర్టు కేసులు పెండింగ్‌లోనే ఉంటుండగా, కొన్ని సందర్భాల్లో యజమాని సైతం తన భూములపై హక్కును కోల్పోవాల్సి వస్తోంది. 2011–18 మధ్య రూపొందించిన ఆన్లైన్ పహాణీలను త్వరగా అందుబాటులోకి తేవ డం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గందరగోళానికి తెరదింపాలని రెవెన్యూ వర్గాలు కోరుతున్నాయి. -
భూములపై త్రిముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. ఈ విషయంలో త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లేందుకు అవసరమైన సమస్త సమాచా రాన్ని సేకరిస్తోంది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, కొన్ని రకాల భూముల స్వాధీనంతో పాటు ధరణి రికార్డుల్లో ఉన్న తప్పులను సరిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని రకాల భూముల వివరాలను పక్కాగా క్రోడీకరించే పని మొదలుపెట్టింది. రాష్ట్రం లోని అన్ని రకాల భూముల వివరాలను నిర్దేశించిన ఫార్మాట్లో పంపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. మొత్తం 9 రకాల భూముల వివరాలను మండలాలు, సర్వే నంబర్ల వారీగా పంపాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వివరాలన్నింటినీ ఇంటిస్థలాల అంశంపై మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ముందుంచాల్సి ఉన్నందున అత్యవసరంగా ఈ వివరాలను పంపాలని కోరారు. ఈ లేఖకు జత చేసిన ఫార్మాట్లో ప్రతి కేటగిరీ భూమికి సంబం ధించిన ధర (చదరపు అడుగుకు)ను పేర్కొనాలని, లబ్ధిదారుల సంఖ్యతోపాటు ప్రస్తుత పరిస్థితి, సిఫారసులను కూడా జత పర్చాలని కోరడంతో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తోందని, అందులో భాగంగానే ఈ వివరాలను అడిగిందనే చర్చ జరుగుతోంది. గ్రామకంఠం నుంచి సీలింగ్ భూముల వరకు ప్రభుత్వం మొత్తం తొమ్మిది కేటగిరీల కింద సమా చారాన్ని కోరింది. ఇందులో సీలింగ్ భూములు, 2008లో విడుదల చేసిన జీవో నం:166 ప్రకారం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, జీవో 58, 59ల కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, అసైన్డ్ భూములు, దేవాదాయ, వక్ఫ్, అటవీ, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన భూములు, కోర్టు కేసుల్లో ఉన్న భూములు, గ్రామకంఠాలు, ప్రభు త్వం లీజుకిచ్చిన భూములు ఉన్నాయి. వీటితో పాటు రైతులు ధరణి పోర్టల్ ద్వారా క్రయ విక్రయాలు జరుపుకునేందుకు వీల్లేకుండా నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లలో గల ప్రభుత్వ, పట్టా భూముల వివరాలను పంపాలని కూడా ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. వేల సర్వే నంబర్లలోని పట్టా భూములు నిషేధిత జాబితాలో ఉండగా రైతులు వీటిని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. గత రెండు, మూడు నెలల క్రితం వరకు ఈ విషయంలో ఏం చేయాలో రెవెన్యూ వర్గాలకు కూడా అంతు చిక్కలేదు. మొత్తానికి ఇటీవల ఈ జాబితా నుంచి పట్టా భూములను తొలగించుకునేందుకు ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం రైతులకు కల్పించారు. కానీ ఆ దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర జాప్యం, కొన్ని కేసుల్లో అన్యాయం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మండలాల వారీగా. సర్వే నంబర్ల వారీగా ఈ భూముల వివరాలను సేకరించి వాటిని ధరణి పోర్టల్‌లో తాజాగా నమోదు చేసి తప్పులు సరిదిద్దే క్రమంలోనే ఈ వివరాలను ప్రభుత్వం అడిగిందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు దేవాదాయ, అటవీ శాఖలతో చాలామంది పట్టాదారులకు సమస్యలున్నాయి. గతంలో పట్టా భూములుగా ఉన్న వాటిని ఉన్నట్టుండి ధరణి పోర్టల్‌లో అటవీ, దేవాదాయ భూముల జాబితాలో చేర్చారు. తాజాగా వీటి వివరాలను సేకరిస్తుండటంతో ఈ రెండు కేటగిరీల్లోని పట్టాదారుల భూములకు విముక్తి కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామ కంఠాలపై అటోఇటో! రాష్ట్రంలోని భూముల విషయంలో ఎదురవుతున్న మరో ప్రధాన సమస్య గ్రామ కంఠాలు. ఈ భూములు పట్టా భూములతో సమానమని, ఈ భూముల్లో నిర్మాణాలున్నా లేకపోయినా కబ్జాలో ఉన్నవారికి హక్కులు ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు గతంలో చెప్పింది. కానీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు పర్చలేదు. హైదరాబాద్ శివార్లలోని నానక్‌రాంగూడ, బాలానగర్, ఉప్పల్, ఖాజాగూడ, మజీద్గూడ లాంటి ప్రాంతాల్లో గ్రామ కంఠం భూములున్నాయి. ఇప్పుడు వీటి ధర చాలా ఎక్కువగా ఉంది. అయితే ఎంతోకొంత నష్టపరిహారం ఇచ్చి వీటిని స్వాధీనం చేసుకునేందుకు 2018లో అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి చేసిన ప్రతిపాదన ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. సీలింగ్, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ, స్వాధీనం! ఇక రాష్ట్రంలోని ఆరు లక్షల ఎకరాలకు పైగా ఉన్న సీలింగ్ భూముల్లో పేదలు కొన్నిచోట్ల ఇళ్లు నిర్మించుకోగా, కొన్నిచోట్ల ఇంటి స్థలాలుగా కబ్జాలో ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల విషయంలోనూ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ భూముల్లో లక్ష ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని రెవెన్యూ వర్గాలు గతంలోనే నిర్ధారించాయి. అసలు ప్రభుత్వం ఎవరికి అసైన్ చేసింది, ఎవరి కబ్జాలో ఇప్పుడు ఆ భూమి ఉంది, కబ్జాలో ఉన్న వారి సామాజిక హోదా ఏంటనే అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరించింది. హైదరాబాద్ శివార్లలోని కోకాపేట, శంషాబాద్ తదితర మండలాల్లో ఉన్న అసైన్డ్ భూములను పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుని అమ్మాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీంతో ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో ప్రభుత్వం వివరాలను సేకరిస్తోందనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద 58, 59 జీవోల కింద దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ, సీలింగ్, అసైన్డ్ భూముల్లోని నిర్మాణాలు, స్థలాల క్రమబద్ధీకరణతో పాటు అవసరమైన గ్రామకంఠాలు, అసైన్డ్ భూములను పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకోవడం, తాజా వివరాలను ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేసి తప్పులను సరిదిద్దడమే లక్ష్యంగా ఈ వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
భూ పరిపాలనా రంగంలో అతిపెద్ద సంస్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భూపరిపాలనా రంగంలో వచ్చిన అతి పెద్ద సంస్కరణ ధరణి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం సచివాలయంలో పలు శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతోనే ధరణి సాధ్యమైందని, ఈ సాహసాన్ని కేసీఆర్ తప్ప ఎవరూ చేయలేరని కొనియాడారు. సంవత్సర కాలంలో ఊహించినదాని కన్నా విజయవంతమైందని, 5.14 కోట్ల మంది ధరణి పోర్టల్‌ను చూడటం, 10 లక్షలకు పైగా లావాదేవీలు జరగడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న విప్లవాత్మక పథకాల కారణంగా రాష్ట్రంలోని భూముల ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయని, ఈ పరిస్థితుల్లో ధరణి పోర్టల్ కారణంగా భూ రికార్డులు పటిష్టంగా మారాయని, రికార్డులను తారుమారు చేసే పరిస్థితి లేకుండా భూములు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఇప్పుడు 574 తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు ప్రారంభించినట్లు చెప్పారు. ధరణి విజయవంతం కావడంలో సీనియర్ అధికారులు, ఐటీ నిపుణుల శ్రమ ఉందని, రెవెన్యూ ఉద్యోగులు కూడా ఈ విజయంలో కీలక భూమిక పోషించారని ప్రశంసించారు. ఏడాది కాలంలో ధరణి సాధించిన విజయాలతో కూడిన పుస్తకాన్ని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆవిష్కరించారు. సమావేశంలో పలు శాఖల కార్యదర్శులు సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్.ఎం.రిజ్వీ, రాహుల్ బొజ్జా, శేషాద్రి, రఘునందన్‌రావు, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ కమిషనర్ శరత్, సీసీఎల్ఏ ప్రత్యేక అధికారి సత్యశారద తదితరులు పాల్గొన్నారు. -
ధరణికి నేటితో ఏడాది.. సీఎం కేసీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల లావాదేవీల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ నేటితో ఏడాది పూర్తి చేసుకుంటోంది. గతేడాది అక్టోబర్ 29న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పోర్టల్ ప్రారంభమైంది. అయితే పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అధికారిక కార్యకలాపాలు మాత్రం నవంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాదిలో మొత్తం 10.45 లక్షలకు పైగా ధరణి ద్వారా వ్యవసాయ భూముల లావాదేవీలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. ఇందులో భూముల రిజిస్ట్రేషన్లు 75 శాతం ఉండగా, 25 శాతం మేర మ్యుటేషన్లు, పంపకాలు, వారసత్వ హక్కులు, వ్యవసాయేతర భూములుగా మార్చే కార్యకలాపాలు జరిగాయని ధరణి పోర్టల్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం దరఖాస్తుల్లో ఇప్పటివరకు 96 శాతం దరఖాస్తులు పరిష్కారం కాగా, 4 శాతం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మొత్తమ్మీద ఈ ఏడాది జరిగిన ధరణి పోర్టల్ లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చినట్లు సీసీఎల్ఏ వర్గాలు చెబుతున్నాయి. కొంచెం ఇష్టం.. ఇంకొంచెం కష్టం అవినీతికి, ఆలస్యానికి తావు లేకుండా వ్యవసాయ భూముల క్రయవిక్రయాల లావాదేవీలను పారదర్శకంగా జరపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా మిశ్రమ ఫలితాలు వస్తున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా, వీలున్నంత త్వరగా లావాదేవీలు పూర్తి చేయడం, ఈ లావాదేవీల ద్వారా రైతు ఇంటికే నేరుగా హక్కు పత్రాలు పంపే విషయంలో ధరణి సమర్థంగానే పనిచేస్తోందనే అభిప్రాయం ఉంది. చదవండి: (కర్నూలు జిల్లా 'మిర్చి' రైతులకు మంచిరోజులు..) అయితే సమన్వయ లోపం, సాంకేతిక సమస్యల కారణంగా రైతాంగం ధరణి పోర్టల్ ద్వారా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దరఖాస్తుల పరిష్కారానికి చాలా సమయం తీసుకుంటోంది. దరఖాస్తుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన మూడంచెల వ్యవస్థ, కలెక్టర్ల పని ఒత్తిడి లాంటి అంశాల కారణంగా ఎడతెగని జాప్యం జరుగుతుండటం, ధరణి పోర్టల్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టకపోవడం వల్ల ఆలస్యం జరుగుతోందని రైతులు చెబుతున్నారు. పోర్టల్ ద్వారా సమస్యలను పరిష్కరించే అధికారం కలెక్టర్లకే కట్టబెట్టడం ప్రధాన సమస్యగా మారిందని చెప్పొచ్చు. మొత్తం మీద పారదర్శకతను తీసుకొచ్చే క్రమంలో ధరణి వ్యవస్థ ప్రస్తుతానికి బాలారిష్టాలను దాటే దశలో ఉందని, దీనిపై ప్రభుత్వం మరింత దృష్టి సారించి పనిచేస్తే వీలున్నంత త్వరలోనే వ్యవసాయ భూముల లావాదేవీలు మరింత పారదర్శకంగా నిర్వహించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త చట్టానికీ ఏడాది కాగా, గతంలో ఉన్న చట్టానికి మార్పులు చేసుకుని భూ హక్కులు, పాసుపుస్తకాల చట్టం–2020 (ఆర్వోఆర్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం కూడా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ చట్టాన్ని 2020 అక్టోబర్ 29 నుంచి అమల్లోకి తెస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అదే ఏడాది అక్టోబర్ 28న నోటిఫికేషన్ జారీ చేశారు. అంతకుముందు సెప్టెంబర్ 9న ఈ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సీఎం అభినందనలు ధరణి పోర్టల్ సేవలను ఏడాది కాలంగా విజయవంతంగా అమలు చేస్తున్న సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం, అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం కేసీఆర్ అభినందించారు. ధరణి పోర్టల్ అందిస్తున్న పారదర్శక, అవాంతరాలు లేని సేవల కారణంగా ప్రజలు, ముఖ్యంగా వ్యవసాయదారులు, రైతులు ఎంతో ప్రయోజనం పొందారని గురువారం ఓ ప్రకటనలో ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ధరణి మరిన్ని విజయాలు సాధిస్తుందని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, ధరణిని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు గాను రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్లు, తహశీల్దార్లను సీఎస్ సోమేశ్ కుమార్ మరొక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
వైరల్: ధవణి దీనంగా.. ప్లీజ్ సీఎం తాతా వాటిని పూడ్చండి..
బెంగళూరు: నగరంలోని రోడ్లపై గుంతలను పూడ్చాలంటూ ఏడేళ్ల బాలిక కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి విజ్ఞప్తి చేసింది. వివరాల్లోకెళ్తే.. తుమకూరు జిల్లా తిప్టూర్ మండలం హెగ్గనహళ్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 2వ తరగతి విద్యార్థిని ధవణి నగరంలో గుంతల తొలగింపు కోసం తాను పొదుపు చేసిన పాకెట్ మనీని ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో ద్వారా వివరించింది. 73 సెకన్ల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 'సీఎం తాతా.. మన బెంగుళూరులో రోడ్లు సరిగా లేవు. కొందరు కుటుంబ సభ్యులు పనికి వెళ్తారు. ఇంట్లో మిగిలిన వారు వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే, మా నాన్న క్షేమంగా ఇంటికి తిరిగొస్తారని నేను వేచి ఉంటాను. దయచేసి గుంతలను పూడ్చి వారి ప్రాణాలను కాపాడండి' అని కోరింది. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఓ ప్రమాదంలో తన తల్లికి కాలు విరిగిపోయి కుటుంబం పడుతున్న ఇబ్బందులను గుర్తుకు చేసుకుంది. ఇటీవల పశ్చిమ బెంగళూరులో జరిగిన ఓ ప్రమాదంలో 65 ఏళ్ల దివ్యాంగుడు మరణించిన ఘటన కలిచివేసినట్లు చెప్పుకొచ్చింది. తాత, ఈ కుటుంబాలు వారి మరణాలను ఎలా ఎదుర్కోవాలో దయచేసి మాకు చెప్పండి' అంటూ ధవణి దీనంగా అడుగుతోంది. అయితే ఈ విషయంపై ధవణిని సంప్రదించగా.. 'అనేక మంది గుంతల కారణంగా బైక్‌పై నుంచి పడి ప్రాణాలు కోల్పోవడం తను వీడియో తీసినట్లు వివరించింది. లైబ్రరీలో వార్తా పత్రికలు చదువుతున్నప్పుడు రోడ్లు సరిగా లేక చాలా మంది ప్రాణాలు కోల్పోయారని కూడా తను తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చింది. వీటిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే.. తనే ఒక్కొక్కటిగా పూడ్చడం ప్రారంభిస్తానని' ధవణి చెప్తోంది. చదవండి: (అమిత్ షా బర్త్‌డే రోజు ట్రెండ్ అయిన అంకుశం రామిరెడ్డి.. వైరల్ ట్వీట్) -
ఉప సంఘమైనా పరిష్కరిస్తుందా!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ ఏర్పాటు చేసి రైతుల సమస్యలు 94 శాతం పరిష్కరించినట్లు ప్రకటించింది. వాస్తవానికి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి వేల మంది రైతులు కోర్టుల చుట్టూ, తహసీల్ కార్యాలయాల చుట్టూ ప్రతి రోజు తిరుగుతూనే ఉన్నారు. తమ సమస్య పరిష్కారం కాకపోతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ కోర్టులలో ఉన్న 16,130 కేసులు ట్రిబ్యునల్స్ పరిష్కరిస్తాయని ప్రభుత్వం చేసిన ప్రకటన కాగితాలకే పరిమితం అయ్యింది. ఈ కేసులన్నీ తిరిగి సివిల్ కోర్టులకు వెళ్ళాయి. 6,18,360 సాదాబైనామాలు పరిష్కారానికి నోచుకోలేదు. నిజాం కాలం నుండి తెలంగాణలో తెల్లకాగితాలపై క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. పాస్‌బుక్కులలో 2,65,653 తప్పిదాలు ఉన్నట్లు ప్రభుత్వమే చెప్పింది. పాసుబుక్కులో ‘చనిపోయిన వారిపేర్లు ఉండడం, ఆధార్ తప్పుగా నమోదు, ఫొటోలు తప్పుగా పెట్టడం, తండ్రి పేరు, పట్టాదార్ పేరు తప్పుగా రాయడం, భూ విస్తీర్ణం ఎక్కువ, తక్కువ రాయడం, సర్వే నెంబర్ తప్పుగా రాయడం, అసైన్డ్ భూములు మార్పు చేయడం, అటవీశాఖ వివాదాస్పద భూములు రాయడం, రెండు ఖాతాలు రాయడం’’ తదితర తప్పులు ఉన్నట్లు ప్రభుత్వమే చెబుతున్నది. ఈ పొరపాట్లపై ప్రజలలో పెరిగిన అసంతృప్తిని గమనించి ఇంత కాలం తర్వాత ధరణి పోర్టల్‌పై సలహాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఉప సంఘాన్ని వేశారు. టీ. హరీశ్‌రావు, వి. ప్రశాంత్ రెడ్డి, టి. శ్రీనివాస్ గౌడ్, జి. జగదీశ్వర్‌రెడ్డి, ఎస్. నిరంజన్ రెడ్డి, పి. సబితా ఇంద్రారెడ్డితో కూడిన ఈ కమిటీ సమస్యకు పరిష్కారం చూపుతుందా! తహసీల్దార్ మొదలు కలెక్టర్ వరకు రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి సుముఖతగా లేరు. ప్రభుత్వ విధానాలు అమ లుజరపటానికి చట్టాలు మార్చాలని సలహాలు ఇస్తున్నారు. పాసుబుక్కుల చట్టం 1971 సెక్షన్ 26ను పూర్తిగా రద్దు చేసి సవరణ పెట్టారు. ఆ సవరణ ప్రకారం సాగు కాలం తొలగిం చడంతో రెవెన్యూ రికార్డులలో భూములు అమ్ముకున్నవారే తిరిగి పట్టాదారులయ్యారు. మ్యుటేషన్ జరగకపోవడంతో కొనుగోలు చేసిన వారు హక్కులు కోల్పోయారు. జాగీర్దారుల భూములు ప్రభుత్వాలకే చెందుతాయని సవరణ చట్టం చెప్పింది. వారసత్వ భూములు చార్జీలు చెల్లించి మ్యుటేషన్ చేయించుకోవాలని చట్టసవరణ చేశారు. తగాదా భూములను, కోర్టు కేసులలో ఉన్నవాటిని పార్ట్ బీలో చేర్చారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ‘నిషేధ పుస్తకం సెక్షన్ 22ఎ పేరుతో’ పెట్టారు. భూమిలో కొంత భాగం అమ్ముకోగా మిగిలిన భూమిని కూడా నిషేధ పుస్తకంలో పెట్టారు. పట్టా భూములను కూడా నిషేధ పుస్తకంలో పెట్టడం జరిగింది. రెవెన్యూ అధికారులు చేసిన తప్పుల వలన తగాదా లేని భూములు కూడా నిషేధ పుస్తకం లోకి వెళ్లాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి 2014లో భూములు సర్వే చేస్తానని ప్రకటించి ఇప్పటికి ఏడేళ్లు గడిచాయి. డిజిటల్ సర్వే చేస్తానని చెప్పారు. టోల్ నెంబర్ 1800 425 8838 కూడా ప్రకటించారు. ప్రభుత్వం గతంలో ఒకే రోజు సమగ్ర సర్వే చేసి రికార్డులు తయారుచేసింది. కానీ డిజిటల్ సర్వే పేర కాలయాపన చేస్తున్నది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిరంతరం సాగుతుంటాయి. కొనుగోళ్లకు అనుకూలంగా రెవెన్యూ చట్టాన్ని మార్చారే తప్ప భూయజమానుల ప్రయోజనాలను కాంక్షించి చట్టాల సవరణ జరగలేదు. ఒకేఒక్క చట్ట సవరణను (1971 పాసుపుస్తకాల చట్టం, సెక్షన్ 26) మాత్రమే మార్చారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన అర్హులు 2017 వరకు పట్టాలు మార్పిడి చేయించుకోవచ్చని ప్రభుత్వం చట్టసవరణ చేసింది. కానీ రాష్ట్రంలో ఈ రోజుకు 2.80 లక్షల ఎకరాల అసైన్డ్ భూమిని 82వేల మంది కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ సర్వేలో తేలింది. కానీ కొనుగోలు చేసిన వారిలో అర్హులను గుర్తించి వారికి పట్టాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటి? అక్రమంగా కొనుగోలు చేసిన వారిని రక్షించడానికే ఈ జాప్యం. లక్షలాది ఎకరాల భూములు అటవీ, రెవెన్యూ శాఖల మధ్య తగాదాలలో ఉన్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతాలలో 1963 డిసెంబర్ 1కి ముందు కొనుగోలు చేసిన గిరిజనేతరులకు భూమిపై హక్కు ఉంటుంది. కానీ ఈ చట్టాన్ని కూడా అమలుచేయలేదు. 1967 అటవీ చట్టం ప్రకారం రెవెన్యూ భూమిని అడవి భూమిగా మార్చాలంటే ఈ చట్టంలోని సెక్షన్ 4 నుండి సెక్షన్ 15 వరకు అమలుచేయాలి. అవేవీ లేకుండానే అటవీ అధికారులు రైతులపై దాడులు చేస్తున్నారు. ఇది ధరణీ చట్టానికి అనుకూలం కాదు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ చట్టాన్ని సమూలంగా మార్చుతానని, రైతుల ప్రయోజనాలు, వారి హక్కులు కాపాడుతానని, చేసిన వాగ్దానం అమలుచేయలేదు. ప్రభుత్వ భూ సేకరణకు ధరణి ద్వారా భూములు సేకరించడం సుగమం చేసుకుంది. అలాగే ఇతర దేశాలలో, ఇతర ప్రాంతాలలో ఉన్నవారు భూములు కొనుగోలు చేయడానికి ఈ చట్ట సవరణ తోడ్పడుతున్నది. కానీ సాగు చేసుకుంటున్న భూ యజమానులకు మాత్రం ఈ చట్టం పనికి రావడం లేదు. అవినీతి అధికారులు మరో రూపంలో పట్టాదారులను, సాగుదారులను అనేక ఇబ్బందుల పాలు చేస్తున్నారు. వేల కేసులు సివిల్ కోర్టుల నుండి హైకోర్టుల వరకు పెండింగ్‌లో కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెం బర్ నెలల్లో గ్రామ సర్వే చేసి రికార్డులను అప్డేట్ చేయాలి. కానీ ధరణీలో సెక్షన్ 26 సవరణతో ఆ బాధ్యత నుండి ప్రభుత్వం, రెవెన్యూ శాఖ తప్పుకొని భూ యజమానిపై పెట్టారు. భూ యజమాని నిర్దిష్ట చార్జీలు చెల్లించి మార్చుకోవాలి. ప్రభుత్వం ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీల ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసిన ప్రయత్నం తప్ప సమస్యల పరిష్కారానికి కాదన్నది అచరణలో రుజువైంది. ప్రభుత్వం వేసిన కమిటీ ఈ సమస్యలన్నింటిని చర్చించి పరిష్కారం చూపాలి. అందుకు అవసరమైన రెవెన్యూ చట్టాలను సవరించాలి. భూయాజమానుల అందోళలను తొలగించాలి. భూయజమాని భూమి అమ్ముకోవడంలోకానీ, అభివృద్ధి చేసుకోవడంలో కానీ గతంలో ఏ అటంకాలూ రాలేదు. అందువల్ల ధరణీ అమలులో వస్తున్న ఇబ్బందులను తొలగించే విధంగా కమిటీ దోహదపడుతుందని ఆశిద్దాం. -సారంపల్లి మల్లారెడ్డి వ్యాసకర్త ఆర్థిక, వ్యవసాయ రంగ నిపుణులు మొబైల్: 94900 98666 -
Dharani Portal: ధరణిలో కాగితాలే ప్రామాణికం
సాక్షి, హైదరాబాద్: సర్వే నంబర్ తప్పులు, గల్లంతు, భూముల వర్గీక రణ, సంక్రమించిన విధానంలో జరిగిన పొరపాట్లు, విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, పేరు వివరాల్లో తప్పొప్పులు, ఆధార్ నమోదు, డిజిటల్ సంతకాలు, పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాలు, నిషేధిత భూముల జాబితాలో పట్టా భూములు.. ఇవి ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని వ్యవ సాయ భూముల విషయంలో రైతులు ఎదుర్కొం టున్న ప్రధాన సమస్యలు. కాగా ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యల విష యమై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలకాంశాలపై దృష్టి సారించాల్సి ఉందని భూచట్టాల నిపుణులు అంటున్నారు. కంప్యూటర్ రికార్డు సరిగా ఉండాలంటే దాన్ని సరిచూసుకునే మాన్యువల్ రికార్డు (కాగిత రూపంలోని పత్రాలు) కూడా ఉం టేనే సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. కంప్యూటర్ రికార్డుకు ప్రామాణికంగా మరో రికార్డు లేకుండా ఇది సాధ్యం కాదని, 2004లో భూరికార్డుల కంప్యూటరీకరణ మొదలయినప్పటి నుంచీ ఈ విషయంలోనే సమస్యలు వస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. గ్రామ పహాణీలు మాన్యువల్‌గా రాయాల్సిందే ముఖ్యంగా పాత మాన్యువల్ పహాణీలు క్షేత్రస్థాయి సమాచారానికి సరిపోలేలా లేవని నిపుణులు చెబుతున్నారు. భూరికార్డుల ప్రక్షాళన చేయకముందు సీఎం కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారని, ఒక్కసారయినా మన పహాణీని మనం రాసుకుంటేనే ఈ పీడ పోతుందని ఆయన చెప్పిన ఆ మాట అమల్లోకి రాకపోవడమే ప్రధాన సమస్యగా మారిందన్నది వారి వాదన. వారి సూచన ప్రకారం.. ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న మెజార్టీ సమస్యలను గ్రామస్థాయిలోనే గుర్తించి పరిష్కారం కూడా చూపవచ్చు. ఇందుకోసం గ్రామ పహాణీని మాన్యువల్‌గా రాసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న పహాణీలను గ్రామసభ ముందుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించి సవరించిన పహాణీ నకలును తయారు చేయాల్సి ఉంటుంది. ఈ నకలును కంప్యూటర్లో రికార్డు చేయాలి. అప్పుడే ఒక గ్రామంలో ఎదురయ్యే భూ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించవచ్చు. సర్వే నంబర్ల వారీగా జరిగిన తప్పులను గుర్తించవచ్చు. ప్రతి ఎంట్రీని పరిశీలించి ఆ తప్పులకు సంబంధించిన సాక్ష్యాలను కూడా గ్రామాల్లోనే సేకరించవచ్చు. అంటే ఒక్కసారయినా మాన్యువల్‌గా పహాణీ రికార్డులను రాయాల్సిందేనన్నమాట. భూ సర్వేతోనే వివాదాలకు పరిష్కారం అలాగే కాలానుగుణంగా భూరికార్డుల సవరణలను పరిశీలించి, పరిష్కరించే ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నది భూచట్టాల నిపుణుల అభిప్రాయంగా కనిపిస్తోంది. అంటే ప్రతి యేటా లేదా రెండేళ్లకోసారి గ్రామాలకు వెళ్లి భూరికార్డులను పరిశీలించి సవరించిన రికార్డులకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే మాన్యువల్ రికార్డు క్షేత్రస్థాయి కొలతలతో సరిపోలాల్సి ఉంటుంది. ఇది జరగాలంటే భూముల సర్వే ఖచ్చితంగా నిర్వహించాల్సిందేనని, భూముల సర్వేతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులంటున్నారు. కలెక్టర్ల టైటిళ్లకు చట్టబద్ధత ఎంత? ప్రస్తుత ధరణి వ్యవస్థ ప్రకారం సాదాబైనామాలతో సహా అన్ని రకాల భూ సంబంధిత ఫిర్యాదుల (గ్రీవెన్సులు) పరిష్కారం కలెక్టర్లే చేయాల్సి వస్తోంది. వీఆర్వో, ఎమ్మార్వో, ఆర్డీవో, జేసీలు చేసే పనులన్నింటినీ కలిపి కలెక్టర్లు చేస్తున్నారు. అయితే, ఒక్క నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూముల విషయంలో తప్ప కలెక్టర్లు ఇచ్చే టైటిళ్లకు చట్టబద్ధత ఉండదని నిపుణులు వాదిస్తున్నారు. చట్టంలో లేనప్పుడు ఏ అధికారంతో కలెక్టర్లు సమస్యలు పరిష్కరిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–1971 ప్రకారం మ్యుటేషన్‌పై తహశీల్దార్లకు, రికార్డుల్లో తప్పుల సవరణపై ఆర్డీవోలకు, వాటిని సరిచూసేందుకు జేసీలకు అధికారముండేది. కానీ కొత్తగా తెచ్చిన రెవెన్యూ చట్టంలో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని మాత్రమే తహశీల్దార్లకు కట్టబెట్టారు. కానీ, ఇతర ఏ అంశంలోనూ రెవెన్యూ వర్గాలకు భూ సమస్యల పరిష్కారంపై అధికారం ఇవ్వలేదు. కలెక్టర్ల అధికారాలను ప్రస్తావించలేదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సందర్భాల్లో కలెక్టర్లు ఇచ్చే టైటిల్ గ్యారంటీ కోర్టుల్లో నిలబడదన్నది వారి వాదనగా ఉంది. కలగాపులగంతోనే సమస్యల తీవ్రత వాస్తవానికి ధరణి పోర్టల్‌లో నమోదు చేసిన రికార్డులు రెవెన్యూ వర్గాల వద్ద అందుబాటులో ఉన్న మాన్యువల్ పహాణీ ఆధారంగా చేసినవి కావు. వెబ్‌ల్యాండ్, భూరికార్డుల ప్రక్షాళన యాప్, మా భూమి పోర్టల్, రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న 22(ఏ) జాబితా, గ్రామాలకు వెళ్లినప్పుడు రెవెన్యూ వర్గాలు అరకొరగా ఇచ్చిన సమాచారాన్ని కలగాపులగం చేసి ధరణి పోర్టల్‌లో నమోదు చేయడంతో రోజురోజుకూ ఈ సమస్యల తీవ్రత పెరిగిపోతోంది. ధరణి వ్యవస్థ ఏర్పాటు మంచిదే అయినా, భూలావాదేవీలకు పారదర్శక నిర్వహణకు ఈ పోర్టల్ ఆస్కారమిచ్చేదే అయినా రోజులు గడిచే కొద్దీ సమస్యలు పెరిగిపోయేందుకు ఇదే కారణమవుతోందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మళ్లీ గ్రామాలకు వెళ్లి మాన్యువల్ పహాణీలను తయారు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. నిపుణుల సూచనలివే. ► భూరికార్డుల ప్రక్షాళన పేరిట 2007 సెప్టెంబర్ నుంచి 100 రోజుల ప్రణాళికతో చేపట్టిన విధంగానే మరోమారు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని భూసమస్యల పరిష్కారం కోసం గ్రామాలకు వెళ్లాలి. అక్కడ గ్రామ పహాణీని పరిశీలించి సవరించిన రికార్డులను ఆరా తీసి అక్కడికక్కడే సమస్యలతో పాటు వాటి పరిష్కారాలను గుర్తించాలి. సవరించిన పహాణీకి గ్రామసభ ఆమోదం పొంది దాన్ని మాన్యువల్‌గా తయారు చేయాలి. ఆ మాన్యువల్ రికార్డు ఆధారంగానే ధరణి పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. ► భూవివాదాల పరిష్కారానికి డివిజనల్, జిల్లా స్థాయిలో ప్రత్యేక అథారిటీలుండాలి. రెవెన్యూ కోర్టులా లేక ఇంకేదైనా పేరు పెట్టినా కనీసం జిల్లా స్థాయిలో అయినా ఈ వ్యవస్థ ఉండాల్సిందే. ► భాగ పంపకాలు లేదా భూయాజమాన్య హక్కుల వివాదాలను మాత్రమే సివిల్ కోర్టులకు పంపాలి. మిగిలిన అన్ని అంశాలను రెవెన్యూ వర్గాలు లేదా రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసే కోర్టులే పరిష్కరించాలి. ► సాదాబైనామాల సమస్యల పరిష్కారానికి గాను కొత్త ఆర్వోఆర్ చట్టంలో సవరణలు తీసుకురావాలి. ఈ చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు చట్టబద్దత లేదు. 9లక్షలకు పైగా ఉన్న సాదాబైనామాలను క్రమబద్ధీకరించి ఈ సమస్యను పరిష్కరించాలంటే ఆ అధికారం తహశీల్దార్లకు ఇచ్చి ఆజమాయిషీని కలెక్టర్ల పర్యవేక్షణలో ఉంచేలా చట్టాన్ని సవరించాలి. ► ధరణి పోర్టల్‌లో కనిపించే నిషేధిత భూముల జాబితాలో వివరాలు సరిగా నమోదు కాలేదు. తహశీల్దార్ దగ్గర, సబ్‌రిజిస్ట్రార్, కలెక్టర్ల వద్ద ఉండే నిషేధిత జాబితాల్లో తేడాలున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి తుది జాబితాను మళ్లీ ప్రచురించాలి. కంప్యూటర్లే సరిచేస్తాయనుకోవడం తప్పు భూముల రికార్డులన్నింటినీ కంప్యూటర్లే సరిచేస్తాయనుకోవడం తప్పు. కంప్యూటర్ రికార్డులు సరిగా ఉండాలంటే మానవ ప్రమేయంతో కూడిన కాగితం రికార్డులు ఉండాల్సిందే. తప్పులున్న రికార్డులను కంప్యూటర్లో పెట్టి ఇప్పుడు సరిచేసుకుంటూ పోతామంటే ఎలా సాధ్యమవుతుంది? సరిచేసిన రికార్డులను కంప్యూటర్లో పెట్టకపోతే వాటిని అది సరిచేయదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే సరిచేసిన మంచి భూరికార్డును కంప్యూటర్లో పెట్టాలి. భూసమస్యల పరిష్కారంలో పేదలకు న్యాయ సహాయం చేసేందుకు పారాలీగల్ వ్యవస్థను పునరుద్ధరించాలి. – ఎం.సునీల్‌కుమార్, భూచట్టాల నిపుణులు చదవండి: బతుకమ్మ వేడుల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై -
అసైన్డ్‌కు ‘ధరణి’ చిక్కులు.. ఆప్షన్లు రాలేదా? మరి ఎలా?
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో అసైన్డ్ భూములకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు జరగడం లేదు. అసైన్డ్ భూములను అమ్ముకునేందుకు, దానం చేసేందుకు వీలు లేని నేపథ్యంలో ఆ మేరకు లావాదేవీలపై మాత్రమే నిషేధం విధించాల్సి ఉండగా ధరణి పోర్టల్‌లో అసైన్డ్ భూములకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలు బంద్ అయ్యాయి. కనీసం అసైనీ చనిపోతే సదరు లబ్ధిదారుని వారసునికి ఆ భూమిపై హక్కులు బదిలీ చేసుకునేందుకు కూడా వీలు లేకుండాపోవడంతో రాష్ట్రంలోని పేద రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అయితే, తమ చేతిలో ఏమీ లేదని, సీసీఎల్ఏ స్థాయిలో రావాల్సిన ఆప్షన్లు ఇంకా ఇవ్వలేదని తహసీల్దార్లు చేతులెత్తేస్తున్నారు. అన్నీ సమస్యలే.. వాస్తవానికి, రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు దాదాపు 25 లక్షల ఎకరాలను అసైన్డ్ చట్టం కింద పంపిణీ చేశారు. ఈ భూముల్లో కొన్ని కబ్జాలకు గురికాగా, రైతుల చేతిలో ఉన్న భూములకు కూడా లావాదేవీలు జరగక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఈ భూములకు సంబంధించి దాదాపు 30 శాతం లబ్ధిదారులకు పాస్‌పుస్తకాలు లేవని రెవెన్యూ వర్గాలే అంటున్నాయి. లబ్ధిదారుల పేర్లు ధరణి పోర్టల్‌లో నమోదయ్యాయి కానీ, పాస్‌పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్ల డిజిటల్ సంతకాలకు అవకాశం లేకుండా పోయింది. పాస్‌పుస్తకాలు లేని కారణంగా పేద రైతాంగానికి ప్రభుత్వం అందజేసే రైతుబంధు రావడం లేదు. ఈ రైతులు పంటలు సాగు చేసుకునేందుకు కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వని పరిస్థితి. అసైన్డ్ మార్టిగేజ్ ఆప్షన్ అందుబాటులోకి రాకపోవడంతో కోఆపరేటివ్ సొసైటీల్లో తనఖా పెట్టి రుణాలు తెచ్చుకునే అవకాశం కూడా లేకుండాపోయింది. వీటికితోడు రికార్డుల్లో తప్పుల సవరణ, మార్పులుచేర్పుల ఆప్షన్‌ను కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. క్రమబద్ధీకరణ ఎప్పుడో? అసైన్డ్ భూముల (బదలాయింపు నిషేధ) చట్టం–1977 ప్రకారమే రాష్ట్రంలోని 6–7 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను అమ్ముకునే వీలుందని భూ చట్టాల నిపుణులు చెపుతున్నారు. ఈ చట్టంలోనే ఆరు రకాల మినహాయింపులు ఇచ్చారని, ఆ భూములను అమ్ముకునే వీలు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం కూడా అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై గతంలో ఆలోచన చేసింది. అసైన్డ్ భూముల్లో ఎంత మేరకు లబ్ధిదారుల చేతుల్లో ఉన్నాయి? ఎన్ని ఎకరాలు థర్డ్ పార్టీల చేతుల్లో ఉన్నాయి? తదితర వివరాలను ఏడాది క్రితమే తెప్పించుకుంది. కానీ, క్రమబద్ధీకరణపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణ, నిషేధిత చట్టం వర్తించని భూములను అమ్ముకునే అవకాశం కల్పించడంతోపాటు ధరణి పోర్టల్ ద్వారా అసైన్డ్ భూముల లావాదేవీలు గాడిలో పడేలా చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతోంది. -
తహసీల్దార్ .. పనితో బేజార్
‘‘మీ సేవ కేంద్రాల నుంచి ఒక్క ధరణి పోర్టల్‌కు సంబంధించినవే వారానికి కనీసం 100 నుంచి 300 వరకు దరఖాస్తులు వస్తున్నాయని, వీటన్నింటినీ పరిశీలించి రికార్డులు తయారు చేయడానికే తమకు సమయం సరిపోవడం లేదని తహసీల్దార్లు అంటున్నారు..’’ ‘‘ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునళ్ల ద్వారా పరిష్కరించాల్సిన భూ సమస్యలు కోర్టు ఉత్తర్వులతో మళ్లీ విచారించాల్సి రావడంతో ఆయా కేసులకు సంబంధించిన రిపోర్టులు ఇచ్చే పనిని కూడా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు.. తహసీల్దార్లకే అప్పజెబుతున్నారు..’’ ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యల పరిష్కారం ఈ పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు బాధ్యత కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల నిర్వహణ, వ్యాక్సిన్‌పై అవగాహన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రొటోకాల్ విధులు సాక్షి, హైదరాబాద్: ఒక్కటి కాదు, రెండు కాదు.. అనేక బాధ్యతలతో రాష్ట్రంలోని తహసీల్దార్లు తీవ్ర పని ఒత్తిడికి లోనవుతున్నారు. ఒకదానిపై మరొకటిగా మీద పడుతున్న పనులు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బాధ్యతలన్నీ సమన్వయం చేసుకోవడం కష్టతరమవుతోంది. ధరణి పోర్టల్ ద్వారా భూసమస్యల పరిష్కారం నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని బాధ్యతలూ రెవెన్యూ సిబ్బందిపైనే పెట్టడంతో అన్నింటినీ సమన్వయపర్చుకోవడం కష్టతరమవుతోంది. ముఖ్యంగా ధరణి సమస్యల పరిష్కారం తహసీల్దార్లకు తలకు మించిన భారంగా పరిణమించింది. ఈ సమస్యల పరిష్కారం కోసం రికార్డులు తనిఖీ చేసి, స్వయం అధీకృత (అటెస్టెడ్) కాపీలు తయారు చేసేందుకే ఉన్న సమయం సరిపోతోందని తహసీల్దార్లు వాపోతున్నారు. మరోవైపు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, కోవిడ్ బాధ్యతలు, ధాన్యం కొనుగోళ్లు, ప్రకృతి వనాల భూసేకరణ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, ప్రొటోకాల్ విధులు...ఇలా లెక్కకు మిక్కిలి పనులు అప్పగించడంతో ఒత్తిడికి గురవుతున్నామని చెబుతున్నారు. పని ఒత్తిడి తగ్గించేలా, ఆయా పనులకు తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు కూడా ధరణి పోర్టల్ ద్వారా భూసమస్యల పరిష్కారానికి తోడు ఈ పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కూడా తహసీల్దార్లే చేయాల్సి వస్తోంది. తహసీల్దార్ విధులు నిర్వహిస్తూనే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి వస్తోందని, తమకుండే సాధారణ పని బాధ్యతలకు తోడు వీటిని సమన్వయం చేసుకోవడం కష్టతరమవుతోందనేది తహసీల్దార్ల వాదన. ఇంకా ఎన్నో... అదనంగా ప్రభుత్వం కొత్తగా మరిన్ని బాధ్యతలను తహసీల్దార్లకు అప్పజెప్పింది. ముఖ్యంగా కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల ఎంపిక, అక్కడ అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవడం, వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం, కోవిడ్ నిర్ధారణ కేంద్రాల వద్ద జన సమ్మర్ధ నియంత్రణ బాధ్యతలను కూడా రెవెన్యూకే ఇవ్వడంతో తహసీల్దార్లు ఆయా మండలాల్లోని వీఆర్ఏలు, వీఆర్వోలతో ఈ పనులు చేయిస్తూ పర్యవేక్షించాల్సి వస్తోంది. మరోవైపు రబీ ధాన్యం కొనుగోళ్లు పేరుకే పౌరసరఫరాల శాఖ ద్వారా చేస్తున్నా అన్ని పనులూ రెవెన్యూ సిబ్బందే చూసుకోవాల్సి వస్తోందని, ఈ పనిని కూడా జిల్లా కలెక్టర్లు తమకే అప్పగించారని తహసీల్దార్లు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎంపిక, మద్దతు ధర అందేలా చూడడం, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం, కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చూడడం, ప్యాడీ క్లీనర్లు, మంచినీళ్లు లాంటి కనీస సౌకర్యాల కల్పన పనులు కూడా తహసీల్దార్లకే అప్పగించడం గమనార్హం. దీనికి తోడు పల్లె ప్రకృతి వనాలకు భూసేకరణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు లాంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, ప్రొటోకాల్ విధులు వారే చేయాల్సి వస్తోంది. ఇక ధరణి ద్వారా మరిన్ని ఆప్షన్లు ఇస్తే దరఖాస్తులు ఇంకా పెరుగుతాయని, అప్పుడు ఈ రికార్డులు తయారు చేసుకోవడం తప్ప ఎలాంటి పనులూ చేయలేమని అంటున్నారు. పని భారంతో తప్పులు జరుగుతాయేమోననే ఆందోళన ఎక్కువ అవుతోందని, ముఖ్యంగా భూముల విషయంలో పొరపాట్లు జరిగితే ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని, ప్రభుత్వం ఈ విషయంలో తగిన విధంగా ఆలోచించి ధరణి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కొన్ని బాధ్యతల నుంచి తమను తప్పించాలని తహసీల్దార్లు కోరుతున్నారు. పేరుకే కలెక్టర్లు.. చేసేదంతా తహసీల్దార్లే... ధరణి పోర్టల్ ద్వారా భూసమస్యల పరిష్కారం విషయంలో తహసీల్దార్లను జిల్లాల కలెక్టర్లు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని సమాచారం. ఈ పోర్టల్ ద్వారా 11 రకాల సమస్యలు పరిష్కరించుకునేందుకు గత వారం రోజులుగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆధార్‌లో తప్పులు, ఆధార్ అనుసంధానం, తండ్రి/భర్త పేరులో మార్పు, ఫోటో తప్పులు, లింగ నమోదులో తప్పులు, కులం తప్పులు, సర్వే నంబర్ల మిస్సింగ్, భూసేకరణ పద్ధతుల్లో మార్పు, భూమి స్వభావ రికార్డు సరిచేయడం, భూ వర్గీకరణ, డిజిటల్ సంతకాలు... ఇలా 11 రకాల సమస్యల పరిష్కారానికి భూ యజమానులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులు నేరుగా తహసీల్దార్లకు వస్తాయి. కానీ, వీటిపై నిర్ణయం తీసుకునే అధికారం తహసీల్దార్లకు లేదు. కేవలం వీటిని తనిఖీ చేసి రిపోర్టు ఇస్తే జిల్లా కలెక్టర్లే నేరుగా ఆన్లైన్లో సరిచేస్తారు. అయితే కలెక్టర్లు కూడా పని ఒత్తిడితో భారమంతా తమపై వేసి చేతులు దులుపుకుంటున్నారని, తగిన సమయం ఇవ్వకుండా ఒత్తిడికి గురిచేస్తున్నారని తహసీల్దార్లు వాపోతున్నారు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం మీ సేవ నుంచి దరఖాస్తు వస్తే ఆ దరఖాస్తుతో పాటు అందుకు సంబంధించిన సాక్ష్యాలను సిటిజన్ లాగిన్‌లో డౌన్లోడ్ చేసుకుని, రికార్డులను పరిశీలించి, జిరాక్సులు తీసి, ప్రతి దానికి ఫార్మాట్ రూపంలో సమాధానమిస్తూ వాటిని మళ్లీ తామే అటెస్ట్ చేస్తూ ఆర్డీవోలకు ఆఫ్‌లైన్‌లో సమర్పించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఆ తర్వాత వాటిని ఆర్డీవోలు కూడా పరిశీలించి, ప్రతి సమస్యకూ ఓ ప్రొసీడింగ్ ఇచ్చి కౌంటర్ సంతకం పెట్టి వాటిని కలెక్టరేట్లో సమర్పిస్తేనే ధరణి సమస్యలను కలెక్టర్లు ఆన్లైన్లో పరిష్కరిస్తున్నారు. ఆ విధంగా కలెక్టర్లు ఓకే చేసిన దరఖాస్తులు తిరిగి తమ వద్దకు వస్తే వాటికి పూర్తి బాధ్యత వహిస్తూ తహసీల్దార్లే సంతకాలు చేయాల్సి వస్తోంది. ఇలా ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో వారానికి కనీసం 100 నుంచి 300 వరకు దరఖాస్తులు వస్తున్నాయని, వీటన్నింటినీ పరిశీలించి రికార్డులు తయారు చేయడానికే తమకు సమయం సరిపోడం లేదంటున్నారు. ఇక, ప్రభుత్వ భూముల నిర్ధారణ కోసం అయితే 1954 కంటే ముందు నుంచి రికార్డులన్నింటినీ (పహాణీలు) పరిశీలించాల్సి వస్తోందని, కలెక్టర్లు మాత్రం అన్ని బాధ్యతలూ తమపై వేసి త్వరగా పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు ఇవ్వాలి రాష్ట్రంలోని తహసీల్దార్లకు ఇప్పుడు 24 గంటల సమయం సరిపోవడం లేదు. ప్రభుత్వం అప్పగించిన పనులు చేయడంలో మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షల మేరకు పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక్క తహసీల్దార్ ఇన్ని పనులు చేయడం చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించాల్సిన సమస్యల భారమంతా మాపై వేసి కలెక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. పని ఒత్తిడి తగ్గించేలా, తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే అప్పగించిన పనులను సజావుగా పూర్తి చేయగలం. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేస్తున్న రెవెన్యూ సిబ్బందికి శని, ఆదివారాలు సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. - వంగా రవీందర్‌రెడ్డి, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు -
చిక్కుముడులు వీడినట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల విషయంలో మూడు కీలక సమస్యల ముడి వీడిందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. గురువారం ప్రగతిభవన్‌లో పలు జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో ధరణి పోర్టల్‌లోని సమస్యలపై సమావేశం నిర్వహించారు. అనంతరం.. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో మ్యుటేషన్, పార్ట్–బీ, సాదాబైనామాల ద్వారా క్రయ విక్రయా లు జరిగిన భూముల సమస్య పరిష్కారమైనట్టేనని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సీఎంతో జరిగిన సమావేశంలో భాగంగా సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డిలు 19 అంశాలపై క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను, రైతు లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారని, వారు చెప్పిన అంశాలపై సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ భూముల విషయంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇటు ఈ సమావేశం మూడున్నర గంటలకుపైగా జరగడం గమనార్హం. చదవండి: (సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం) మ్యుటేషన్ సమస్యలకు మోక్షం.. గతంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు ఆ భూముల మ్యుటేషన్లను తహసీల్దార్లు చేసేవారు. ఇప్పుడు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను తహసీల్దార్లే చేసేందుకు వీలుగా ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. కొత్త పద్ధతిలో ప్రారంభమైన తర్వాత కూడా పాత పద్ధతిలో జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన భూముల మ్యుటేషన్‌ను కొత్త పోర్టల్ అనుమతించడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల రిజిస్ట్రేషన్ లావాదేవీలకు సం బంధించిన మ్యుటేషన్లు 4 నెలల నుంచి పెండింగ్‌లో పడ్డాయి. ఇప్పుడు వీటిని పరిష్కరించేందుకు అనుమతినివ్వడం తో వీలున్నంత త్వరలోనే ఈ భూముల మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. పార్ట్–బీలో చేర్చిన భూములు 16 లక్షల ఎకరాలకుపైగా ఉన్నాయి. చదవండి: (2021లో ప్రముఖుల లక్ష్యాలేంటో ఓ లుక్కేద్దాం..) ఇప్పుడు కోర్టు కేసుల్లో ఉన్నవి మినహా అన్నింటినీ పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇందుకు ఆరు నెలల సమయం ఇచ్చారు. ప్రభుత్వ భూములు, చెరువు ఎఫ్.టి.ఎల్, దేవాదాయ, వక్ఫ్, అటవీ భూ ములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ చేయవద్దని సీఎం ఆదేశించిన నేపథ్యంలో పార్ట్–బీలో పెట్టిన ఆ భూముల సమస్యల పరిష్కారానికి సమయం పడుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో సరిహద్దు వివాదాలు, వారసత్వ పంచాయతీలు, ఇతర సమస్యలుండి కోర్టులకు వెళ్లని భూములకు సంబంధించి 1.25 లక్షల ఎకరాల్లో సమస్య ఉందని, ఇందులో 70 వేల ఎకరాలకు ఇప్పటికే పాసు పుస్తకాలు ఇచ్చామని, మిగిలిన 45 వేల ఎకరాలకు త్వరలో మోక్షం కలుగుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అలాగే 22 (ఏ) జాబితాలోని కొన్ని సర్వే నంబర్లలో ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులభూములు కూడా ఉన్నాయి. వీటికి ఏండ్ల తరబడి రిజిస్ట్రేషన్లు జరగ డం లేదు. ఈ నేపథ్యంలో ఆ భూములను గుర్తించి యాజమాన్య హక్కులు ఖరారు చేయాలని సీఎం ఆదేశించడంతో వేలాది ఎకరాల్లో సాగు చేసుకుంటున్న రైతులకు ఊరట కలగనుంది. 9 లక్షలకు పైగానే.. రాష్ట్రం ఏర్పాటైన నాటికి తెల్లకాగితాత లు, ఇతర ఒప్పందాల ద్వారా చేతులు మారిన సాదాబైనామాల భూముల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించి వాటికి కొనుగోలుదారుల పేరిట పాస్ పుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షలకు పైగా దరఖాస్తులు కూడా వచ్చాయి. కానీ, ఇప్పటివరకు వాటి విషయంలో పురోగతి లేకుండా పోయింది. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో కూడా ఆ సమస్య పరిష్కారం కాక కబ్జాలో ఉన్న, సాగు చేసుకుంటున్న రైతులకు ఇప్పుడు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఊరట కలగనుంది. ఈ దరఖాస్తులను పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించడంతో త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని సీసీఎల్ఏ వర్గాలు చెబుతున్నాయి. -
సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూవివాదాలు, ఇతర వ్యవహారాల్లో జిల్లా కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంచ లన నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్లే ఈ బాధ్యత లను పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ భూముల విషయంలో నెలకొన్న కొద్దిపాటి సందిగ్ధతలను జిల్లా కలెక్టర్లు 2 నెలల వ్యవధిలో పరిష్కరిస్తారని ప్రకటించారు. ధరణి పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత మెరుగుపరుస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ధరణి పోర్టల్ నిర్వహణ, ఇంకా మెరుగు పర్చాల్సిన అంశాలపై గురువారం ఆయన ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవసరమైతే క్షేత్రస్థాయి విచారణ.. ‘కోర్టుల విచారణలో ఉన్నవి మినహా, భూరికార్డుల సమగ్ర సర్వే సందర్భంగా పార్ట్–బీలో చేర్చిన భూములకు సంబంధించిన అంశాల న్నింటినీ కలెక్టర్లు 60 రోజుల్లో పరిష్కరించాలి. అవసరమైన సంద ర్భాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్ణయాలు తీసుకో వాలి. యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి. రెవెన్యూ కోర్టుల్లోని వివాదాలను పరిష్కరించడానికి జిల్లాకు ఒకటి చొప్పున కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. సరిహద్దు వివాదాలున్న చోట జిల్లా కలెక్టర్లు సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించాలి. చదవండి: (‘ఆయుష్మాన్’తో ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యం) ధరణి పోర్టల్ రాకముందు రిజిస్ట్రేషన్ అయిన భూములను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ఆధారంగా, కొన్నవారి పేరిట జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మ్యుటేషన్ చేయాలి. మీ–సేవ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తులు స్వీకరించి, స్లాట్లు కేటాయించాలి.. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి. క్రమబద్ధీకరించిన సాదాబైనామాల ప్రకారం భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలి. పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వాలి’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధరణిలో కొత్తగా కోర్టు పోర్టల్.. ‘కోర్టుల ద్వారా, కలెక్టర్ల ఆధ్వర్యంలోని ట్రిబ్యునళ్ల ద్వారా వచ్చిన అధికారిక తీర్పుల ప్రకారం ధరణిలో భూములకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు చేపట్టాలి. కోర్టు పోర్టల్‌ను ధరణిలో చేర్చాలి. సేత్వార్ వ్యత్యాసాలపై కలెక్టర్లు విచారణ జరిపి, తుది నిర్ణయం తీసుకోవాలి. ఆ వివరాలను ధరణిలో నమోదు చేసి, పాసుబుక్కులు ఇవ్వాలి. కొన్నిచోట్ల ఒకే సర్వే నంబరులో ప్రభుత్వ, ప్రైవేటు భూములున్నాయి. ఆ సర్వే నంబరును నిషేధిత జాబితా (22/ఏ) లో పెట్టారు. అలా పెట్టిన చోట్ల కలెక్టర్లు విచారణ జరిపి, ఏది ప్రభుత్వ భూమో, ఏది ప్రైవేటు భూమో నిర్ణయించాలి. అర్హుల వివరాలను ధరణిలో చేర్చి, పాస్ పుస్తకాలు ఇవ్వాలి..’అని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. సమావేశంలో విస్తృత చర్చ అనంతరం సీఎం కేసీఆర్ జారీ చేసిన ఆదేశాలివే.. ►1/70 చట్టం అమలులో లేని ప్రాంతాల్లో ఆ చట్టం కింద నమోదైన కేసులను పరిష్కరించాలి. 1/70 చట్టం అమలులో ఉన్న ప్రాంతాల్లో భూములపై ఆ ప్రాంత ఎస్టీల హక్కులు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి. ►ధరణి పోర్టల్ ద్వారా లీజ్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి. ►‘నాలా’ద్వారా కన్వర్ట్ అయిన భూముల వివరాలను ధరణిలో నమోదు చేసి, వాటికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. ►అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ చేసుకోవడానికి ధరణి పోర్టల్ ద్వారా అవకాశమివ్వాలి. ►వ్యవసాయ భూమల లీజు డీడ్, ఎక్సే్చంజ్ డీడ్ల రిజిస్ట్రేషన్లకు ధరణిలో అవకాశం కల్పించాలి. ►వ్యవసాయ భూముల్లో నెలకొల్పే సంస్థలు, కంపెనీలు ఆ భూములు అమ్ముకునేందుకు, కొనుక్కునేందుకు ధరణిలో తక్షణం అవకాశం కల్పించాలి. ►పాస్‌పోర్టు నంబరు నమోదు చేసుకుని ఎన్ఆర్ఐల భూములు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించాలి. ►ఈసీల మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్లను ఆన్లైన్లో ప్రింట్ తీసుకునే అవకాశం కల్పించాలి. ►ఏదైనా అనివార్య కారణాల వల్ల స్లాట్ బుక్ చేసుకున్న రోజు రాని వారికి స్లాట్ రద్దు చేసుకోవడానికి, మరో రోజు బుక్ చేసుకునేందుకు అవకాశమివ్వాలి. స్లాట్ బుకింగ్ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి ఇవ్వాలి. ►స్లాట్ బుక్ చేసుకునేప్పుడు వివరాలు తప్పుగా నమోదైతే, స్లాట్ బుక్ చేసుకున్న చోటే వాటిని సవరించుకునేందుకు రిజిస్ట్రేషన్ కన్నా ముందు అవకాశం కల్పించాలి. ►చట్టబద్ధ వారసుల పేర్లను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో అనుమతిదారుల (కన్సెంటింగ్ పార్టీ) కేటగిరీ కింద నమోదు చేసుకునే ఆప్షన్ కల్పించాలి. ►మైనర్ల పేరిట భూములు రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో మైనర్లు, సంరక్షుల పేర పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలి. ►ప్రభుత్వం అసైన్ చేసిన భూములు అనుభవిస్తున్న రైతులు మరణిస్తే, వారి చట్టబద్ధ వారసులకు ఆ భూములను బదలాయించాలి. ►పట్టాదార్ పాసుబుక్కులు పోయినట్లయితే, వాటి స్థానంలో ‘ట్రూ కాపీ’తీసుకునే అవకాశం కల్పించాలి. ►ప్రభుత్వ భూములు, చెరువు ఎఫ్.టి.ఎల్. భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ చేయవద్దు. ►ఇనాం భూములను సాగు చేసుకుంటున్న హక్కుదారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చి, ఆ వివరాలను ధరణిలో నమోదు చేయాలి. ►ధరణిలో స్లాట్ బుక్ కాకపోతే, ఎందుకు కావడం లేదనే విషయం దరఖాస్తుదారుడికి తెలిపే ఆప్షన్ ధరణిలో ఉండాలి. రైతులకు ఇబ్బంది ఉండొద్దనే ‘ధరణి’: సీఎం కేసీఆర్ వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండవద్దనే ఉద్దేశంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. 2 నెలల వ్యవధిలోనే లక్షా 6 వేల మంది ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకోగా వారిలో 80 వేల మంది రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు ఐదెకరాల లోపు వారే ఉన్నారని, అలాంటి చిన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూములు రిజిస్టర్ చేయించుకుని, మ్యుటేషన్ చేయించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీఎస్ సోమేశ్ కుమార్, రెవెన్యూ వ్యవహారాల నిపుణులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రామయ్య, సుందర్ అబ్నార్, రఫత్ అలీ, జిల్లా కలెక్టర్లు వెంకట్రాంరెడ్డి, హనుమంతరావు, ప్రశాంత్ పాటిల్, నారాయణరెడ్డి, శశాంక్ పాల్గొన్నారు. -
ధరణి ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: ధరణిలో ఆస్తుల నమోదుపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. నవంబరు 3న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం వెకేట్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, సాగు భూముల యజమానుల ఆధార్, కులం వివరాలకు ఒత్తిడి చేయొద్దని నవంబరు 3న హైకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. సాగు భూములపై సబ్సిడీ పథకాలు అమలులో ఉన్నందున ఆధార్ వివరాలు అడగొచ్చని, ఆధార్‌ను గుర్తింపు కార్డు పరిగణనలోకి తీసుకోవచ్చని చట్టం చెబుతోందని ప్రభుత్వం.. హైకోర్టుకు వివరించింది. వెకేట్ పిటిషన్‌పై అభ్యంతరాలను ఈనెల 31లోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ధరణిపై పిటిషన్ల విచారణ ఈనెల 31కి కోర్టు వాయిదా వేసింది. -
ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు
-
29న ‘ధరణి’ ప్రారంభోత్సవం
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి’పోర్టల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ముహూర్తా న్ని ఖరారు చేసింది. ఈ నెల 29న మధ్యా హ్నం 12.30కు సీఎం కేసీఆర్ ఈ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఈ నెల 25న దసరా రోజున ధరణి పోర్టల్‌ను ప్రారంభించాలని తొలుత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాగా, సాంకేతిక సమస్యలు, వరద సహాయక చర్యల్లో అధికారులు నిమగ్నం కావడంతో ముహూర్తాన్ని 29కు మార్చారు. ఆ రోజు నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసా య భూముల రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నా యి. ప్రస్తుతానికి సాగుభూముల రిజి స్ట్రేషన్లే ప్రారంభించనున్న సర్కారు.. రాష్ట్ర వ్యాప్తంగా 570 మండ లాల్లో దీనికి శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్‌లో వ్యవసాయ భూములు లేనం దున.. దీని నుంచి మినహాయించారు. -
అన్నీ సవ్యంగా ఉంటే అరగంటలో పాస్‌బుక్
సాక్షి, హైదరాబాద్: దసరా నుంచి ‘ధరణి’పోర్టల్ అందుబాటులోకి రానుంది. కేవలం అరగంటలోపే రిజి్రస్టేషన్ ప్రక్రియ పూర్తయి పట్టాదారు పాస్‌పుస్తకం రైతు చేతికందనుంది. రిజి్రస్టేషన్ సహా రెవెన్యూ రికార్డుల అప్డేషన్, మ్యుటేషన్ (హక్కు బదలాయింపు) అక్కడికక్కడే పూర్తి కానున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన భూ హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం–2020తో ఇది సాధ్యం కానుంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీళ్లలో చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఆ మేరకు ప్రయోగాత్మకంగా రిజి్రస్టేషన్ల ప్రక్రి యను పరిశీలించింది. సాంకేతిక సమస్యలను కూడా అధిగమించడంతో విజయదశమి నుం చి తహసీళ్లలో రిజిస్ట్రేషన్లకు పచ్చజెండా ఊపింది. రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు పూరించ డం నుంచి స్లాట్ బుకింగ్ వరకు వివిధ దశల్లో సమాచారాన్ని క్రయ, విక్రయదారులు ఆన్లైన్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. పారదర్శకంగా, సులభతరంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రి య జరిగేలా, దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసే లా రెవెన్యూశాఖ ధరణి పోర్టల్‌ను రూపొందించింది. డాక్యుమెంట్ రైటర్లతో పనిలేకుండా.. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు స్లాట్ బుక్ చేసుకొని రిజి్రస్టేషన్ కోసం తహసీల్‌కు వెళ్లేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను తీర్చిదిద్దింది. ఆన్లైన్ పరిజ్ఞానంలేని రైతులు మాత్రం మళ్లీ డాక్యుమెంట్ రైటర్లనో, ఈ–సేవ కేంద్రాల్లో వేరే ఎవరి సాయమో పొందాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అంతేగాకుండా రిజి్రస్టేషన్ సమయంలో పాన్‌కార్డు నంబర్‌ను నమోదు చేయాలి. లేనిపక్షంలో ఫారం 60, 61 డిక్లరేషన్ సమరి్పంచాల్సి వుంటుంది. హైదరాబాద్ మినహా 570 తహసీళ్లలో ఈ నెల 25వ తేదీ నుంచి సాగు భూముల రిజి్రస్టేషన్లు తహసీళ్లలో జరుగనున్నాయి. వారసత్వ బదిలీ, క్రయవిక్రయాలు, భాగపంపిణీ, బహుమతి, కోర్టు డిక్రీ ద్వారా వచ్చే హక్కులకు సంబంధించి రిజి్రస్టేషన్లు తహసీల్దార్లు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సాగు భూములు లేని హైదరాబాద్ జిల్లాను మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లో ఈ రిజి్రస్టేషన్ల ప్రక్రియను దసరా నాడు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయాలకు సాంకేతిక, మౌలిక వసతులను కలి్పంచడమే గాకుండా... గత రెండు రోజులుగా రిజి్రస్టేషన్ల నిర్వహణపై తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లు, ఆపరేటర్లకు శిక్షణ కూడా ఇచి్చంది. ప్రమాణపత్రం తప్పనిసరి క్రయ, విక్రయదారులిద్దరూ రిజిస్ట్రేషన్ సమయంలో ప్రమాణపత్రం (అఫిడవిట్) సమరి్పంచాల్సి ఉంటుంది. ఇందులో పరస్పర అంగీకారం మేరకే లావాదేవీలు జరిగినట్లు ఇద్దరు తమ సమ్మతిని తెలియజేయాల్సివుంటుంది. క్రయ, విక్రయదారులు చేయాల్సింది ఇది ► ధరణి పోర్టల్‌లోకి వెళ్లి స్లాట్‌బుక్ చేసుకోవాలి. ► రైతుల మొబైల్ నంబర్‌కు వచి్చన ఓటీపీని నమోదు చేయాలి. ► రిజి్రస్టేషన్ దరఖాస్తు పూర్తి చేయాలి. ► రైతు పాస్బుక్కు సంబంధించిన సమాచారం, సర్వే నంబర్ల వివరాలు, ఆ భూమి మార్కెట్ వ్యాల్యూ, భూమి సరిహద్దులను... ధరణి పోర్టల్‌లోనే దరఖాస్తులో నమోదు చేయాలి. ► క్రయ విక్రయదారుల పేర్లు, ఆధార్ నంబర్, కుటుంబసభ్యుల వివరాలు, వయస్సు, వృత్తి, కులం, పాన్‌కార్డు నంబర్ లేదా ఫారం 60, 61, ఇతర వివరాలు ఇంగ్లి‹Ùలో నమోదు చేయాలి. ► తద్వారా లభించిన వివరాల సంక్షిప్త పట్టిక మేరకు ఈ–చలాన్ జనరేట్ చేసుకోవాలి. ఆన్లైన్లోనే రిజి్రస్టేషన్ ఫీజులను చెల్లించాలి. ► సాక్షుల వివరాలు నమోదు చేయాలి. ► ఈ అన్ని వివరాలతో రూపొందించిన దస్తావేజును ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. అప్పుడు క్రయ, విక్రయదారులు కోరుకున్న సమయం మేరకు స్లాట్‌బుక్ అవుతుంది. ఈ మేరకు ధరణిలోనే ఆన్లైన్ రసీదు కూడా వస్తుంది. దీంతో క్రయ, విక్రయదారుల పని పూర్తవుతుంది. రెవెన్యూ అధికారులు ఏం చేస్తారంటే.. ⇒ రసీదు జారీ అయిన వెంటనే రెవెన్యూ అధికారుల పని మొదలవుతుంది. ⇒ డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్) లాగిన్ ద్వారా... సాక్షుల పరిశీలన, నమోదు పూర్తయిన వెంటనే రిజిస్ట్రేషన్ లావాదేవీలకు అవసరమైన అందరి వ్యక్తుల బయోమెట్రిక్, ఫొటోలను డీఈవో ఆన్లైన్లో తీసుకుంటారు. ⇒ ఆ తర్వాత తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజి్రస్టార్ లాగిన్ ద్వారా ఆ రిజి్రస్టేషన్‌కు సంబంధించిన దరఖాస్తు, స్టాంపు డ్యూటీ వివరాలు, బయోమెట్రిక్, ఈ–చలాన్ తదితర వివరాలను పరిశీలించి రిజి్రస్టేషన్‌కు అనుమతి ఇస్తారు. ⇒ తహసీల్దార్ అనుమతించిన మరుక్షణమే దస్తావేజుకు నంబర్ కేటాయించబడుతుంది. ⇒ మళ్లీ డీఈవో ద్వారా ఎండార్స్మెంట్ జరుగుతుంది. అప్పుడు సదరు దస్తావేజు స్కానింగ్ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియతో రిజి్రస్టేషన్ డాక్యుమెంట్ తయారవుతుంది. ఈ డాక్యుమెంట్‌ను డీఈవో ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ⇒ మళ్లీ తహసీల్దార్ లేదా జాయింట్ సబ్ రిజి్రస్టార్ తన లాగిన్ ద్వారా మ్యుటేషన్, డిజిటల్ సంతకం ప్రక్రియను పూర్తి చేస్తారు. ⇒ ఇది పూర్తయిన వెంటనే డాక్యుమెంట్ ప్రింట్ ఆప్షన్ నొక్కడంతో సదరు రిజి్రస్టేషన్‌కు సంబంధించిన కొత్త పాస్‌పుస్తకం వస్తుంది. దీంతో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. -
ఆస్తుల వివరాలను నమోదు చేసుకున్న కేసీఆర్
సాక్షి, సిద్దిపేట : తెలంగాణ వ్యాప్తంగా ఆస్తుల ఆన్లైన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పలు కీలక సంస్కరణల్లో భాగంగా గ్రామ స్థాయి నుంచి నివాస వివరాలను గ్రామ అధికారులు నమోదు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆస్తులను నమోదు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన నివాసంలో ఆస్తుల వివరాలను శనివారం సీఎం స్వయంగా వెల్లడించారు. గృహ వివరాలతో పాటు వ్యవసాయేతర వివరాలను ఎర్రవల్లి గ్రామ కార్యదర్శి సిద్దేశ్వర్‌కు తెలియజేశారు. తనకున్న ఆస్తి వివరాల పత్రాలను చూపెట్టి ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు. సాధారణ పౌరుడిగానే అంగు ఆర్భాటాలు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తులను వివరించారు. ఈనెల 15లోపు ప్రతిఒక్కరు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సీఎం సూచించారు. (వెంటాడుతున్న గతం.. ఓటమి తప్పదా?) ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘గ్రామీణ, పుర ప్రజలు తమ స్థిరాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఆస్తులపై ప్రజలకు హక్కు, భద్రత కల్పించేందుకే ఈ కార్యక్రమం. ఆస్తుల నమోదు అనేది దేశంలోనే మొట్టమొదటి, అతి పెద్ద ప్రయత్నం. సాగుభూముల తరహాలోనే వ్యవసాయేతర భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తాం’’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆస్తులపై ప్రజలకు హక్కు, భద్రత కల్పించేందుకు వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబం స్థిరాస్తుల వివరాలను విధిగా నమోదు చేసుకోవాలన్నారు. ఆస్తుల నమోదు అనేది దేశంలోనే మొట్టమొదటి అతి పెద్ద ప్రయత్నమని చెప్పారు. సాగు భూముల తరహాలోనే వ్యవసాయేతర భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. మరోవైపు దసరా నాటికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పునఃప్రారంభించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం కార్డ్ విధానంలో అమలవుతున్న రిజిస్ట్రేషన్ల విధానాన్ని ధరణి పోర్టల్‌లోకి మార్చే ప్రక్రియలో సబ్ రిజిస్ట్రార్లు బిజీగా ఉన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. సర్వే నంబర్, ఇంటి నంబర్లవారీగా భూములు, ఆస్తుల విలువలను వాటి ఎదుటి కాలమ్‌లో నమోదు చేస్తున్నారు. రెండు వారాల క్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ మంగళవారం నాటికి పూర్తి కానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్థానిక సంస్థలు కూడా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల నమోదు ప్రక్రియను ‘ధరణి’లోకి అప్లోడ్ చేసే ప్రక్రియను సమాంతరంగా చేపడుతున్నాయి. -
యజమాని ఫొటో, ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరి..
సాక్షి, హైదరాబాద్: ఆస్తుల నమోదు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. వ్యవసాయేతర ఆస్తులకు కూడా పాస్ పుస్తకాలు (మెరూన్ రంగు) ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ప్రతి ఇంటి సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తోంది. కేవలం ఇళ్లే కాకుండా.. వ్యవసాయ పొలాల వద్ద ఉన్న కట్టడాల వివరాలను సేకరిస్తోంది. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలకు వేర్వేరుగా ధరణి పోర్టళ్లను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చిన సర్కారు.. ఈ దసరా నాడు ఈ పోర్టళ్లను ప్రారంభించాలని ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఆ రోజు నుంచి సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీళ్లలో.. వ్యవసాయేతర ఆస్తులను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేయనుంది. ఈ క్రమంలోనే వ్యవసాయేతర ఆస్తుల వివరాలను పకడ్బందీగా సేకరించడమే కాకుండా ధరణి పోర్టల్‌లో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. 60 లక్షల కట్టడాలు..! రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,751 గ్రామ పంచాయతీల్లో సుమారు 60 లక్షల కట్టడాలుంటాయని పంచాయతీరాజ్ శాఖ అంచనా వేసింది. ఈ ఆస్తుల వివరాలన్నింటినీ ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ–పంచాయతీ వెబ్సైట్లో పొందుపరిచింది. ఆస్తుల నమోదుకు ముందు.. రివిజన్ రిజిష్టర్‌లో 53.23 లక్షల కట్టడాలున్నట్లు లెక్క తేలగా.. కొత్త కట్టడాలతో కలుపుకొని ఈ సంఖ్య 60 లక్షలకు చేరింది. ఈ మేరకు ఈ–పంచాయతీ పోర్టల్‌లో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని మ్యాపింగ్ చేయడంలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్తున్నారు. ఈ వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ న్యాప్ (నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్)లో నమోదు చేస్తున్నారు. అయితే, వివరాల నమోదుకు సాంకేతిక సమస్యలు ప్రతిబంధకంగా మారాయి. ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం.. ఇంటర్నెట్ సమస్య.. సర్వర్ డౌన్‌తో యాప్‌లో సమాచారం నమోదు చేయడం కార్యదర్శులకు పెద్ద సవాల్‌గా మారింది. దీనికి తోడు గ్రామాల్లోని ప్రజానీకం వ్యవసాయ పనులకు వెళ్లిపోతుండటంతో సమాచార సేకరణపై ప్రభావం చూపుతోంది. కుటుంబ యజమాని ఫొటో, ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరి చేయడం కూడా తలనొప్పిగా తయారైంది. దీంతో సమాచారాన్ని యాప్‌లో అప్లోడ్ చేయడంలో జాప్యం జరుగుతోంది. రోజుకు 70 ఇళ్ల సమాచారాన్ని అప్డేట్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించిన 30 ఇళ్లు కూడా దాటడం లేదు. ఈ క్రమంలోనే సోమవారం నాటికి 10 లక్షల ఇళ్ల సమాచారాన్ని యాప్‌లో నిక్షిప్తం చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. వారం పది రోజుల్లో మొత్తం ఇళ్ల సమాచార సేకరణ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తొలుత ఆస్తుల నమోదులో కొంత ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమించామని, నమోదు ప్రక్రియ గాడిలో పడిందని అభిప్రాయపడ్డారు. (చదవండి: ఆస్తుల గణనకు సాంకేతిక సమస్యలు) -
దసరాకు ధరణి
సాక్షి, హైదరాబాద్: వచ్చే దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభిం చాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజు (అక్టోబర్ 25)న ప్రజలు మంచి ముహూర్తంగా భావిస్తున్నందున.. ఆ రోజు సీఎం కేసీఆర్ స్వయంగా ధరణి పోర్టల్‌ను ప్రారంభిస్తారు. ధరణి పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను ఆలోపుగానే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయించనున్నట్లు సీఎం చెప్పారు. అదే రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. ధరణి పోర్టల్‌కు అవసరమైన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, బ్యాండ్ విడ్త్‌లను సిద్ధం చేయాలని కోరారు. మారిన రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యుటేషన్ వివరాలను పోర్టల్‌కు అప్డేట్ చేయడం తదితర అంశాలపై, విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లకు అవసరమైన శిక్షణ ఇవ్వ నున్నట్లు సీఎం వెల్లడించారు. డెమో ట్రయల్స్ కూడా నిర్వ హించి అధికారులకు అవ గాహన కల్పించాలని నిర్ణ యించినట్లు చెప్పారు. ప్రతి మండలానికి, ప్రతి సబ్ రిజి స్ట్రార్ కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్ల నియామకాన్ని పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్స్‌కు లైసెన్సులు ఇచ్చి వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దసరా లోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటా ధరణి పోర్టల్‌లో ఎంటర్ చేయాలని అధికారులను కోరారు. ఆ తర్వాత జరిగే మార్పులు చేర్పులు వెంటవెంటనే నమోదు చేయడం జరుగుతుందని సీఎం చెప్పారు. దసరా రోజున పోర్టల్ ప్రారంభిస్తున్నందున అదే రోజు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ఈ లోగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ వ్యవహారాలు జరగవని స్పష్టం చేశారు. ఆస్తులన్నీ ఆన్ లైన్ ! భూముల, స్థలాల భద్రతకు ఢోకా ఉండదదకూడదని భావించిన సర్కారు.. స్థిరాస్తులన్నింటినీ ఆన్ లైన్ లో నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి ఆస్తిని ఆన్ లైన్ లో అప్డేట్ చేయడానికి పక్షం రోజుల గడువు నిర్దేశించింది. ఆస్తులను ఆన్ లైన్ లో నూరు శాతం నమోదు చేసిన తర్వాతే ధరణి కార్యకలాపాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇంతకు ముందే స్పష్టం చేశారు. రికార్డుల్లో ఏ మాత్రం తప్పులు దొర్లినా మొదటికే మోసం వస్తుందని చెప్పిన ఆయన.. ధరణి ప్రారంభించాలనే తొందరలో తప్పులకు తావివ్వకూడదని సూచించారు. దీంతో మూడు రోజులుగా నగర/పురపాలక సంస్థలు, గ్రామ పంచాయతీల్లో ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ప్రభుత్వం నిర్దేశించిన 15 రోజుల గడువు సరిపోయే పరిస్థితి కనిపించడంలేదు. ఈ క్రమంలో తొలుత నిర్మాణాలను ఆన్ లైన్ లో నమోదు చేసి.. ఖాళీ స్థలాలను ఆ తర్వాత పొందుపరచాలని యంత్రాంగం భావిస్తోంది. -
దసరా రోజున ధరణి పోర్టల్: సీఎం కేసీఆర్
-
దసరా రోజున ధరణి పోర్టల్: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజును ప్రజలు మంచి మహుర్తంగా భావిస్తున్నందున సీఎం కేసీఆర్ స్వయంగా ధరణి పోర్టల్ ప్రారంభించనున్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను దసరా లోపే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ కు అవసరమైన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, బ్యాండ్ విడ్త్ లను సిద్ధం చేయాలని చెప్పారు. కాగా మారిన రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యుటేషన్ చేయడం, ధరణి పోర్టల్ కు వివరాలను అప్ డేట్ చేయడం తదితర అంశాలు, విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ లకు శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు. డెమో ట్రయల్స్ నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ప్రతి మండలం, ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ నియామకాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయించనున్నట్లు సిఎం తెలిపారు. అదే రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలోడాక్యుమెంట్ రైటర్స్‌కు లైసెన్సులు ఇచ్చి వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దసరా లోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటాను ధరణి పోర్టల్ లో ఎంటర్ చేయాలని అధికారులను కోరారు. ఆ తర్వాత జరిగే మార్పు చేర్పులు వెంటనే నమోదు చేయడం జరుగుతుందని సీఎం తెలిపారు. దసరా రోజున పోర్టల్ ప్రారంభిస్తునందున అదే రోజు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని సీఎం పేర్కొన్నారు. ఈలోగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు కానీ, ఎలాంటి రెవెన్యూ వ్యవహారాలు కానీ జరగవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. -
ధరణి పోర్టల్‌పై కేసీఆర్ సమీక్ష..
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్షించారు. 15 రోజుల్లోగా ఆన్లైన్లో ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్మెంట్ల వివరాలు నమోదు చేయాలని కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు నమోదు కాని వాటిని కూడా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి. అయితే 100శాతం ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్మెంట్లు ఆన్లైన్ చేయాల్సిందేనని కేసీఆర్ తెలిపారు. ప్రజలు తమ ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. -
ఆకలి తీర్చడంలో వింధ్య పర్వతం
అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు.. అలాంటి అన్నం, కూరలను వృథాగా పారవేసే వారి వద్దకు వెళ్లి.. ఆ ఆహారపదార్థాలను సేకరించి, ఆకలితో అలమటించే అభాగ్యులకు అందిస్తూ.. వారి ఆకలి తీర్చుతోంది సిరిసిల్లకు చెందిన ధరణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు వింధ్యారాణి. చేసేది చిరుద్యోగమైనా, మంచి మనసున్న మారాణి వింధ్యారాణి సిరిసిల్లలోని పేదవర్గాలకు విందు భోజనాన్ని వడ్డించే అక్షయపాత్ర అయింది.. బట్టల సేకరణతో శ్రీకారం... సిరిసిల్లలో 2004లో ‘ధరణి’ స్వచ్ఛంద సంస్థను వింధ్యారాణి మరి కొందరితో కలిసి ప్రారంభించారు. సామాజికంగా సేవ చేసేందుకు ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల గాంధీచౌక్‌లో పెద్ద బాక్స్(అట్టపెట్టె)ను ఏర్పాటు చేసి మీ పిల్లలకు సరిపోని(పట్టని) డ్రెస్‌లను ఈ డబ్బాలో వేయండి.. ఆ దుస్తులను పేద పిల్లలకు మేం అందిస్తామని బోర్డు ఏర్పాటు చేశారు. ధరణి సంస్థ ఏర్పాటు చేసిన ఈ డబ్బాలో చాలామంది కొత్త కొత్త డ్రెస్‌లను వేశారు. మంచి మంచి చీరలను మహిళలు స్వచ్ఛందంగా వేశారు. ఇలా వచ్చిన బట్టలను సిరిసిల్ల కార్మికవాడల్లో నిరుపేదలకు పంపిణీ చేశారు. 300 మంది పిల్లలకు డ్రెస్‌లు, మరో 120 మంది మహిళలకు చీరలు అందించారు. బట్టలు పాతవే కావచ్చు. కానీ ఎంతోమందికి అవి కొత్తబట్టలయ్యాయి. అలా ఒక చిన్న ఐడియాతో పేదలకు బట్టలు అందించింది ధరణి సంస్థ. రైస్ బకెట్ పేరుతో సిరిసిల్ల పట్టణంలోని భావనారుషి నగర్‌లోని ఇళ్ల నుంచి బియ్యం సేకరించారు. పది కిలోల చొప్పున 50 కుటుంబాలకు బియ్యం అందించి పేదల ఆకలి తీర్చారు. ఇలా అట్టడుగున ఉన్న నిరుపేదలకు ఉచితంగా సేవలు అందిస్తూ.. ధరణి సంస్థ ముందుకు సాగుతోంది. 15ఏళ్లుగా సిరిసిల్లలో ధరణి సంస్థ మానవీయ కోణంలో సాయం అందింది. భోజనం మిగులు.. లేదు దిగులు... ఊరిలో ఏ ఫంక్షన్లో ఆహారం మిగిలినా ‘ధరణి’ సంస్థకు ఫోన్ వస్తుంది. సమాచారం అందగానే పరుగున వెళ్లి ప్రత్యేక పాత్రల్లో సేకరించడం.. ఆటోలో తీసుకెళ్లి కార్మికవాడల్లోని పేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది. శుభకార్యాల్లో మిగిలిన ఆ అన్నం, ఆ కూరలను తీసుకెళ్లి కార్మికవాడల్లో పంపిణీ చేయడం పెద్ద శ్రమతో కూడిన పని అయినా నాలుగేళ్లుగా 30 వేల మందికి విందుభోజనాలు అందించిన ఘనత ధరణి సంస్థది. ఇటీవల విందుభోజనాన్ని అడవుల్లో ఆకలితో అలమటించే వన్యప్రాణులకు సైతం అందించారు. గంభీరావుపేట మండలం గోరింటాల అడవుల్లో కోతులకు ఆహారాన్ని అందించడం విశేషం. ఆర్డీవో భిక్షానాయక్ ప్రేరణ... 2015లో సిరిసిల్ల ఆర్డీవోగా పని చేసిన భిక్షానాయక్ ఆలోచనకు ధరణి సంస్థ ఆచరణ రూపమిచ్చింది. సిరిసిల్లలోని ఫంక్షన్ హాల్స్‌లో ధరణి సంస్థ ఫోన్ నంబర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఏ ఫంక్షన్లో ఆహారం మిగిలినా అది పేదల కడుపు నింపేందుకు ఈ సంస్థ శ్రమిస్తుంది. అయిన వారి ఆదరణకు దూరమైన వృద్ధులకు దుస్తులు అందిస్తూ.. స్వీట్లు పంపిణీ చేస్తూ.. ఆసరాగా ఉంటుంది ధరణి సంస్థ. మహిళా దినోత్సవం, హరితహారం, ఎయిడ్స్ బాధిత పిల్లలకు సాయం చేయడంలోనూ ముందుంది. ఓ మహిళ నాయకత్వంలో ధరణి సంస్థ పేదల సేవలో ముందుకెళ్లడం విశేషం. సిరిసిల్లలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేసే వింధ్యారాణి ధరణి సంస్థ ద్వారా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 2018 జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు అప్పటి రాష్ట్రమంత్రి కేటీఆర్, అప్పటి జిల్లాకలెక్టర్ కృష్ణభాస్కర్ చేతుల మీదుగా రూ.51,000 నగదు పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వింధ్యారాణిని అభినందించారు. నగదు పురస్కారంగా వచ్చిన ఆ మొత్తంతో ఆటోను కొనుగోలు చేసి ధరణి సంస్థ సేవలను విస్తరించేందుకు వినియోగించడం విశేషం. జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో నిరుపేదల సేవలో ముందుకు సాగుతున్న ‘ధరణి’ సంస్థ మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని ఆశిద్దాం. – వూరడి మల్లికార్జున్, సాక్షి, సిరిసిల్ల పేదల కళ్లలో ఆనందం చూస్తున్న.. మా సంస్థ అందిస్తున్న సేవలు చిన్నవే అయినా.. పేదల కళ్లలో ఆనందం చూస్తున్న. అందరి సహకారంతో ముందుకు సాగుతున్నాం. ధరణి సంస్థ నిర్వహణలో నా భర్త జయసింహారెడ్డి సహకరిస్తున్నారు. సంస్థలోని ఇతర సభ్యులు సమయం కేటాయిస్తున్నారు. దీంతో బాగా పని చేయగలుగుతున్నాం. – కె. వింధ్యారాణి, సంస్థ అధ్యక్షురాలు -
సినిమాల ప్రభావంతో రెచ్చిపోతున్నారు
పశ్చిమగోదావరి: సంచలనం సృష్టించిన శ్రీధరణి హత్య కేసులో నిందితులను శుక్రవారం పోలీస్ కస్టడీకి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఏడు రోజులు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించిందన్నారు. నిందితులు 32 కేసుల్లో ఉన్నారని, అయితే ఏడు కేసులు నమోదయ్యాయన్నారు. పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో కేసులు ఉన్నాయని, నిందితుల నుంచి అన్ని కేసులకు సంబంధించి వివరాలు సేకరిస్తామన్నారు. నిందితులను విచారించే సమయంలో వీడియో రికార్డింగ్ చేస్తామని, వారు కేసుల నుంచి తప్పించుకోకుండా అన్ని సాక్షాధారాలతో పాటు సాంకేతిక ఆధారాలు కూడా సేకరిస్తామన్నారు. నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేశామన్నారు. యువతలు ఒంటరి ప్రాంతాలకు వెళ్లరాదని, దీనిపై తల్లితండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సినిమాల ప్రభావంతో దుండగులు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు. యువతులపై అత్యాచారం జరిగితే చెప్పుకోలేని స్థితిలో ఉండటం వల్ల దీనిని అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్నారన్నారు. -
శ్రీధరణి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ధర్నా
పశ్చిమగోదావరి, భీమడోలు: శ్రీధరణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ పీడీఎస్‌యూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం భీమడోలు అగ్నిమాపక కేంద్రం వద్ద ధర్నా జరిగింది. శ్రీధరణిని హత్య చేసిన దుండగులను శిక్షించాలని, గీతాం జలి విద్యాసంస్థల యాజమాన్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, హత్య జరిగి రోజులు గడుస్తున్నా ఆమె తల్లిదండ్రులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తొలుత భీమడోలులో విద్యార్థులు, నాయకులు ప్రదర్శన నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని మాట్లాడుతూ హత్య జరిగిన తర్వాత లైంగికదాడి జరగలేదని పోలీసులు చెప్పారని, అయితే దుండగులను పట్టుకుని మీడియా ముందు హాజరపరిచేటప్పుడు శ్రీధరణిపై లైంగికదాడి జరిగిందని చెప్పడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ప్రధాన సాక్షి నవీన్‌ను విచారణ చేయకపోవడం వల్ల శ్రీధరణి మృతికి కారణం ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉందన్నారు. మరోవైపు ఎన్సీసీ తరగతుల పేరుతో అదనపు తరగతులు నిర్వహించడమే ఈ ఘటనకు కారణమని విమర్శించారు. దీనికి కారణమైన గీతాంజలి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలా రోజులు గడుస్తున్నా శ్రీధరణి తల్లిదండ్రులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీధరణి కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ జిల్లా కోశాధికారి బి.వినోద్, జిల్లా కమిటీ సభ్యుడు ఎస్కే ఇమ్రాన్, నాయకులు బి.రాకేష్, ఎం.మహేష్, డి.త్రినాధ్, ఎం.సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
అంకమరావు కన్ను పడిందా.. ఇక కాటికే..
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: సంచలనం రేపిన శ్రీధరణి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు నిందితులు చెబుతున్న విషయాలు కళ్లు బైర్లు కమ్మేలా చేశాయి. ఈ కేసులో నిందితులు నరరూప రాక్షసులని సాక్షాత్తు పోలీసు అధికారులే చెప్పే స్థాయిలో నిందితుల ఘాతుకాలు ఉన్నాయి. దండుపాళ్యం సినిమాను తలపించేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో అరాచకాలు చేసిన నలుగరు గ్యాంగ్‌ను ఎస్పీ ఎం.రవిప్రకాష్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆదివారం ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో డీఎస్పీ మురళీకృష్ణతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఆ రోజు ఏం జరిగిందంటే.. శ్రీధరణి, నవీన్ ఇద్దరూ బౌద్ధారామాల పర్యాటక కేంద్రానికి ఈ నెల 24 ఉదయం 10.30 గంటలకు వెళ్లారు. వారిద్దరూ కొండ పైభాగం నుంచి సుమారు 500 మీటర్ల మేర లోపలికి ఎవ్వరూ లేని నిర్జన ప్రదేశంలోకి వెళ్లారు. యువ జంటల కోసం వేచి చూస్తున్న నిందితులు కృష్ణాజిల్లా మైలవరం సంద్రాల గ్రామానికి చెందిన పొట్లూరి అంకమరావు అలియాస్ రాజు (28), జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన తుపాకుల సోమయ్య (22), తుపాకుల గంగయ్య (20), మాణికం నాగరాజు (20) ఆ ప్రేమజంట ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ముందుగా నవీన్‌ను రాజు కర్రతో తలపై బలంగా కొట్టాడు, మరో ఇద్దరు కర్రతో దాడి చేశారు. నవీన్ తలకు తీవ్రగాయం కావటంతో స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం శ్రీధరణిపై రాజు లైంగిక దాడి చేశారు. అత్యాచారం చేసిన తరువాత తనను వదిలిపెట్టాలని ఆమె కాళ్లు పట్టుకుని బతిమిలాడినా వాళ్లు కనికరించలేదు. వదిలేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తారనే భయంతో శ్రీధరణిని కర్రతో తలపై బలంగా కొట్టటంతో ఆమె మృతిచెందింది. మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగిన ఈ ఘటన సమయంలో సెక్యూరిటీ వస్తున్నట్టు అలికిడి రావటంతో నిందితులు పారిపోయారు. కేసును ఛేదించింది ఇలా.. ఎస్పీ ఆదేశాల మేరకు తడికలపూడి ఎస్ఐ సతీష్‌కుమార్, చింతలపూడి సీఐ విల్సన్, భీమడోలు సీఐ కొండలరావు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న నవీన్‌ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐపీసీ 302, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ఏఎస్పీ ఈశ్వరరావు, డీఎస్పీ మురళీకృష్ణ, సీఐలు కొండలరావు, విల్సన్ ఆధ్వర్యంలో ఆరు బృందాలు ముమ్మరంగా గాలించాయి. బౌద్ధారామం సెక్యూరిటీ గార్డులు, పరిసర గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు, మామిడితోటల కాపలాదారులు ఇలా అందరి నుంచి వివరాలు సేకరించారు. వేటగాళ్ళ మాదిరిగా ఉన్నారని వారంతా చెప్పిన ఆనవాళ్ళు ఒకటే కావటంతో ఆదిశగా దర్యాప్తు చేశారు. ఈ ప్రాంతంలో 30 మంది వరకూ పిట్టలు కొట్టేవారు ఉన్నారనీ తెలుసుకున్నారు. వారిలో 12 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. చివరికి అనుమానితుడుగా ఉన్న అంకమరావు అలియాస్ రాజును అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన ముగ్గురూ బయటకు వచ్చారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. దండుపాళ్యం తరహా గ్యాంగ్ శ్రీధరణి హత్య, లైంగికదాడి కేసులో నిందితులైన నలుగురు వ్యక్తులను విచారణ చేయగా పోలీసులకు విస్తుగొలిపే వాస్తవాలు తెలిసాయి. ప్రధాన నిందితుడు పొట్లూరి అంకమరావు తొలుత 2017 డిసెంబర్ లో ఒక యువ జంటపై లైంగికదాడి చేయటంతోపాటు వారినుంచి డబ్బు లాక్కున్నాడు. మరోసారి ఇదే తరహాలో ప్రేమ జంటపై దాడి చేశాడు. వీరెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటంతో అదే అదనుగా తీసుకున్నారు. తన బావమరుదులైన తుపాకుల సోమయ్య, గంగయ్య, మాణికం నాగరాజుతో కలిసి దండుపాళ్యం గ్యాంగ్‌గా మారిపోయారు. రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తెలంగాణ ఖమ్మం జిల్లాల్లో ఈ తరహాలో యువ జంటలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడడం, విచక్షణారహితంగా కొట్టి, లైంగికదాడులు చేస్తూ వచ్చారు. కన్ను పడిందో..కాటికి పోవాల్సిందే... నరరూప రాక్షసులుగా మారిన ఈ నలుగురు గ్యాంగ్ ...అందమైన యువతులను టార్గెట్‌గా చేస్తారు. బౌద్ధారామాల వంటి పర్యాటక ప్రాంతాలు, పార్కులు, తోటలు వంటి ప్రాంతాల్లో రెక్కీ చేస్తుంటారు. అంకమరావు కన్ను పడిందా.. ఇక కాటికి పోవాల్సిందేనని పోలీసులు అన్నారు. మూడు, నాలుగు జంటలు ఉంటే వాటిలో అందమైన యువతులను లక్ష్యంగా చేసుకుని యువకుడిని చావగొడతారు. అనంతరం యువతితో కామవాంఛ తీర్చుకుంటారు. వారి నుంచి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, డబ్బును దొంగిలించుకుపోతారు. ఇలా నాలుగు జిల్లాల పరిధిలో 2017 నుంచీ సుమారు 32 మంది యువతులపై లైంగిక దాడులకు తెగబడ్డారు. ఇక నాలుగు హత్యలు కూడా చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. వారు విచక్షణారహితంగా జంతువులను వేటాడినట్లు యువకులపై దాడి చేయటంతో ముగ్గురు యువకులు మృతిచెందారు. ఇక జిల్లాలో శ్రీధరణి హత్య నాలుగవది. 7 కేసులు నమోదయ్యాయి. వీటిలో కృష్జా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒకటి, నూజివీడులో రెండు, ఖమ్మంలో ఒకటి, గుంటూరు జిల్లాలో ఒకటి, పశ్చిమలో రెండు కేసులు నమోదు అయ్యాయి. 2017 డిసెంబర్ నుంచీ మొదలు పెట్టిన ఈ దాడులు ప్రతి 10 రోజులకు ఒకసారి చేస్తూనే ఉంటున్నారు. నెల, రెండు నెలలు దాడులకు విరామం ఇస్తూ మళ్ళీ వరుసగా లైంగిక దాడులకు తెగబడేవారు. -
శ్రీధరణి హత్యకేసు : బయటపడ్డ సంచలన నిజాలు
సాక్షి, ఏలూరు : శ్రీధరణి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన నలుగురు నిందితులను జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. పొట్లూరి రాజు అనే నిందితుడు తుపాకుల సోమయ్య, గంగయ్య, నాగరాజులతో కలిసి ఈ నేరాన్ని చేశారని తెలిపారు. నవీన్‌పై మొదటగా కర్రతో దాడి చేశారని.. అనంతరం ధరణిపై అత్యాచారం చేసి.. ఆమెను కూడా కర్రతో కొట్టి చంపారని తెలిపారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఈ గ్యాంగ్ వరుసగా అత్యాచారాలు చేసిందని, ఒంటరిగా తిరిగే యువతులు, జంటలే లక్ష్యంగా చేసుకునే ఈ గ్యాంగ్.. ఇప్పటివరకు 32 నేరాలు చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ప్రతి నేరం ముందు మూడు రోజుల పాటు ఈ గ్యాంగ్ రెక్కీ నిర్వహించేదన్నారు. ప్రధానంగా ఆదివారం ఒంటరిగా వచ్చే ప్రేమ జంటల్నే ఈ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకుంటూ నేరాలకు పాల్పడుతుందన్నారు. ఇప్పటివరకు ముగ్గురు యువకులు, ఓ యువతిని హత్య చేశారన్నారు. ఖమ్మం, నూజివీడు, ఇబ్రహీంపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వీరిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. చదవండి : శ్రీధరణి హత్య.. నవీన్ పైనే అనుమానంగా ఉంది ప్రేమికులే వాడి టార్గెట్ ప్రేమజంటపై దాడి: ప్రేమికుడిపై అనుమానం శ్రీధరణి హత్యకేసులో పురోగతి ఏదీ -
శ్రీధరణి హత్య కేసు: వెలుగులోకి సంచలన నిజాలు
-
మూతపడ్డ గుంటుపల్లి బౌద్ధ గుహలు
పశ్చిమగోదావరి, కామవరపుకోట: ప్రఖ్యాతిగాంచిన గుంటపల్లి బౌద్ధ గుహలు మూతపడ్డాయి. గత నెల 24న శ్రీధరణి హత్య ఘటన అనంతరం గుంటుపల్లి బౌద్ధ గుహల సందర్శనను అధికారులు నిలిపివేశారు. హత్య ఘటన నేపథ్యంలో పోలీసులు ఆధారాల సేకరణ తదితర విషయాలతో సందర్శనను ఆపేశారు. క్లూస్ టీమ్‌తో పాటు మహిళా కమిషన్ సభ్యులు, ఇతర అధికారులు ఈ ప్రాంతానికి వస్తున్నారు. సందర్శకులు ఈ ప్రాంతానికి వస్తే రద్దీ పెరగడంతో పాటు ఆధారాలు కనుమరుగయ్యే అవకాశం ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బౌద్ధ గుహలను మూసివేసినట్టు సిబ్బంది తెలిపారు. తిరిగి ఉత్తర్వులు ఇచ్చే వరకు సందర్శకులను అనుమతించమని వారు చెప్పారు. -
శ్రీధరణి హత్యకేసులో పురోగతి ఏదీ
ఏలూరు టౌన్ : శ్రీధరణి హత్య కేసులో పోలీసు అధికారుల పురోగతి కనిపించటంలేదని, కేసు దర్యాప్తులో అలసత్వం వహిస్తే పోలీసులపైనా చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో ఇటీవల హత్యకు గురైన శ్రీధరణి కేసుకు సంబంధించి బుధవారం రాజకుమారి భీమడోలు మండలం ఎంఎం పురం గ్రామంలోని శ్రీధరణి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంత రం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఘటనలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న నవీన్‌కుమార్‌ను ఆమె పరామర్శించారు. తలకు తీవ్రగాయాలెన నవీన్ నుంచి వైద్యుల సమక్షంలో వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనకేమీ గుర్తురావటంలేదని, పోలీసులకు ముం దు నుంచి చెప్పే సమాధానమే రాజకుమారికీ అతడు చెప్పాడు. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నవీన్ కూడా నేరస్తుడే అనంతరం మహిళా కమిషన్ చైర్మన్ రాజకుమారి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు నవీన్కుమార్పైనా అనుమానాలు ఉన్నాయని, ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడని అనుకుంటున్నట్టు తెలిపారు. శ్రీధరణిని అక్కడకు తీసుకువెళ్లాడు కాబట్టి నవీన్ కూడా నేరస్తుడే అవుతాడన్నారు. ఘటన జరిగి నాలుగురోజులు కావస్తున్నా నేరస్తులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. ఆడపిల్లలు కూడా తమ హద్దుల్లో ఉండాలని, గుడ్డిగా ప్రేమపేరుతో నమ్మి మోసపోవద్దని హితవుపలికారు. పర్యాటక కేంద్రమైన బౌద్ధారామాల వద్ద భద్రత, రక్షణ లేకపోవటం దారుణమన్నారు. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వాసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్, న్యూరోసర్జన్ డాక్టర్ వి జయప్రసాద్, ఐసీడీఎస్ జేడీ విజయకుమారి, మహిళా కమిషన్ డైరెక్టర్ డాక్టర్ రాజ్యలక్ష్మి, ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఉన్నారు. శ్రీధరణి కుటుంబాన్ని ఆదుకుంటాం భీమడోలు: తెర్లి శ్రీధరణి అనే యువతి దారుణ హత్యకు గురికాగా ఆమె కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. పూళ్ల పంచాయతీ శివారు ఎంఎం పురంలో శ్రీధరణి కుటుంబాన్ని బుధవారం ఆమె పరామర్శించారు. ఈసందర్భంగా శ్రీధరణి తల్లిదండ్రులు అప్పారావు, అలివేలు మంగ చైర్పర్సన్ రాజకుమారి కాళ్లపై çపడి తమకు న్యాయం చేయాలని కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కుటుంబానికి వచ్చిన కష్టం మరో ఆడబిడ్డ కుటుంబానికి రాకూడదంటూ బోరుమన్నారు. గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బా«ధిత కు టుంబాన్ని చైర్పర్సన్ రాజకుమారి ఓదార్చారు. ప్రభుత్వ పరంగా పక్కా ఇల్లు అందిస్తామని, ఆర్థిక సాయం చేస్తామన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకూ పె చ్చుమీరుతున్న అఘాయిత్యాలను తీవ్రంగా ఖండించారు. తెనాలి, తాడేపల్లిలో ఘటనలు, ఏలూరులో తాజా ఘటన బా«ధిస్తున్నాయన్నారు. ఇలాంటి ఘటనలను కమిషన్ సహించేది లేదన్నారు. దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించమని హెచ్చరించారు. దోషులను 24 గంటల్లో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించారు. బెయిల్ రాకుండా చూడాలన్నారు. నిందితుడికి నెల రోజుల్లో శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కళాశాలలు, వసతి గృహల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని యాజమాన్యాలను ఆదేశిం చామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మరింత ని ఘా పెంచుతామన్నారు. రాష్ట్ర కమిషన్ సభ్యురా లు రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ కె.విజయకుమారి, కమిషన్ అధికారులు సూయజ్, డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీఐ ఎస్‌సీహెచ్ కొండలరావు, ఎస్సై ఐ.వీర్రాజు, పీఓ ఏలూరు తులసి తదితరులు పాల్గొన్నారు. -
కన్ను పడిందంటే కాటికే..
-
‘దండుపాళ్యం’ ప్రేరణ.. రాజు కంటబడితే..!!
సాక్షి, పశ్చిమ గోదావరి : కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద జరిగిన తెర్రి శ్రీధరణి(18) హత్యోదంతంలో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. దండుపాళ్యం సినిమాతో ప్రభావితమైన కృష్ణాజిల్లా మైలవరం మండలం చండ్రాల గ్రామానికి చెందిన పొట్లూరు రాజు సైకోగా మారాడని.. ప్రేమ జంటలపై దాడులు చేస్తూ సీరియల్ కిల్లర్‌గా అవతరించినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇప్పటివరకు 14 మంది యువతులపై అత్యాచారాలు చేశాడని పోలీసులు తెలిపారు. వారిలో నలుగురిని అత్యాచారం అనంతరం రాజు దారుణంగా హత్యచేసినట్టు వెల్లడించారు. కన్ను పడిందంటే కాటికే.. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన యువతిని రాజు పెళ్లి చేసుకున్నాడు. 6 నెలల క్రితం జి.కొత్తపల్లికి మకాం మార్చాడు. జీడితోటలకు కాపలాదారుడుగా ఉంటూ అక్కడి అటవీ ప్రాంతంలో పక్ష్లులను, జంతువులనూ వేటాడుతుంటాడు. ఈ క్రమంలో తారసపడ్డ ప్రేమజంటల్ని బెదిరించి డబ్బు వసూలు చేస్తాడు. యువతిపై కన్నుపడిందంటే డబ్బులిచ్చినా తీసుకోడు. చంపుతానని బెదిరించి అత్యాచారానికి ఒడిగడుతాడు. ఎదురు తిరిగితే ప్రాణాలు తీస్తాడు. (ప్రేమికులే వాడి టార్గెట్) చనిపోయాడనుకుని.. గత ఆదివారం గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద హత్యకు గురైన శ్రీధరణిని కూడా తీవ్రంగా గాయపరిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. శ్రీధరణి, ఆమె ప్రియుడు దౌలూరి నవీన్ బౌద్ధారామాల వద్ద తారసపడడంతో వారిని బెదిరించి డబ్బు వసూలు చేశాడు. అనంతరం వారిపై దాడికి దిగాడు. తలపై బలంగా మోదడంతో నవీన్, శ్రీధరణి స్పృహతప్పి పడిపోయారు. కాసేపటికి శ్రీధరణి నేలపై పాక్కుంటూ తప్పించుకోవాలని చూడడంతో ఆమె కాళ్లు విరిచేశాడు. అనంతర అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో యువతి మరణించింది. నవీన్ కూడా చనిపోయాడు అనుకుని రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం నవీన్ ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని తలపై 40 కుట్లు వేశారు. దౌలూరి నవీన్, మృతి చెందిన తెర్రి శ్రీధరణి ఒక్క కేసుకూడా లేదు.. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. ధరణిని హత్య చేసిన తరువాత ఆమె ఫోన్ తీసుకుని వెళ్లిపోయిన రాజు, నేరుగా జి.కొత్తపల్లిలోని అత్తవారి ఇంటికి చేరుకున్నాడు. మృతురాలి ఫోన్లోని సిమ్ కార్డును తీసి పడేసి, తన సిమ్ కార్డును వేసి ఫోన్‌ను వాడటం మొదలు పెట్టాడు. ఆ ఫోన్‌ను అమ్ముతానంటూ ఒక సెల్ షాపు వద్దకు వెళ్లగా, వ్యాపారి ఫోన్ కొనేందుకు నిరాకరించాడు. మొబైల్ డంపింగ్ పరిజ్ఞానంతో రాజును గుర్తించారు. పోలీసుల విచారణలో తొలుత రాజు సహకరించలేదు. అయితే, తమదైన శైలిలో మరోసారి ప్రయత్నించడంతో ఈ సీరియల్ కిల్లర్ తను చేసిన నేరాల చిట్టా విప్పాడని పోలీసులు చెప్పారు. కాగా, ఇంతవరకు రాజుపై ఒక్క కేసుకూడా నమోదు కాకపోవడంపై పోలీసులు దిగ్భాంతి చెందారు. జీలకర్ర గూడెంలో శ్రీధరణి హత్య నాలుగోది. అంతకు ముందు నూజివీడు, మైలవరం, మచిలీపట్నంలలో మరో ముగ్గురు యువతులను రాజు అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
శ్రీధరణి హత్య.. నవీన్ పైనే అనుమానంగా ఉంది
సాక్షి, పశ్చిమ గోదావరి : కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద శ్రీధరణి అనే యువతి ఆదివారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. యువతితో పాటు ఉన్న ఆమె స్నేహితుడు దౌలూరి నవీన్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో నవీన్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ కుటుంబ సభ్యులను మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి బుధవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసుల పనితీరుపై మండిపడ్డారు. (ప్రేమికులే వాడి టార్గెట్) శ్రీధరణి హత్య జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి హత్య కేసులో ఆమె ప్రియుడు నవీన్ పాత్రపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. శ్రీధరణిని బయటికి తీసుకెళ్లాడు గనుక నవీన్ కూడా నిందితుడేనని అభిప్రాయపడ్డారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయకపోతే పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.