
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.20 లక్షల పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరలో పరిష్కరించాలని కలెక్టర్లకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. ధరణి సమస్యలపై శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెలాఖరులోగా వీలైనన్ని దరఖాస్తులు పరిష్కరించాలని స్పష్టం చేశారు.
పాస్ బుక్ డేటా కరెక్షన్‌లోనే ఎక్కువ దరఖాస్తులు ఉన్నాయి. ధరణిలో 188 టెక్నికల్ సమస్యలు గుర్తించాం. అందులో 163 టెక్నికల్ సమస్యలను పరిష్కరించాం. వారం పది రోజుల్లో మరోసారి భేటీ అవుతాం. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పెండింగ్ దరఖాస్తులు పెరిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో, అతి తక్కువ ములుగులో పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి. కలెక్టర్లతో పాటు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవో లు, తహసీల్దార్లకు ధరణిపై టెక్నికల్ సమస్యలను క్లియర్ చేశాం’’ అని నవీన్ మిట్టల్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment