సాక్షి, హైదరాబాద్: ధరణి పునర్నిర్మాణ కమిటీ సమావేశంలో భాగంగా పలు సమస్యలను జిల్లా కలెక్టర్లు కమిటీ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ధరణి విషయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలకు తమను భాద్యులు చేయవద్దని కమిటీకి మొర పెట్టుకున్నారు. ధరణితో పాటు రెవెన్యూ వ్యవస్థలోని లోపాలకు తమను బాధ్యులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలోని అంశాలకు తమను బాధ్యులను చేయడం సరికాదంటున్న కలెక్టర్లు ధరణి కమిటీ దృష్టి తీసుకువచ్చారు.
తెలంగాణ సెక్రటేరియట్‌లో ధరణి కమిటీ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ధరణి వాస్తవ పరిస్థితులను కలెక్టర్లు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం ధరణి కమిటీ సమావేశంలో రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం , నిజామబాద్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
చదవండి: ‘కాంగ్రెస్ పార్టీకే రేవంత్ ముఖ్యమంత్రా?.. తెలంగాణకు కాదా?’
Comments
Please login to add a commentAdd a comment