CCLA Commissioner
-
ధరణి సమస్యలకు చెక్.. కలెక్టర్లకు నవీన్ మిట్టల్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.20 లక్షల పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరలో పరిష్కరించాలని కలెక్టర్లకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. ధరణి సమస్యలపై శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెలాఖరులోగా వీలైనన్ని దరఖాస్తులు పరిష్కరించాలని స్పష్టం చేశారు.పాస్ బుక్ డేటా కరెక్షన్‌లోనే ఎక్కువ దరఖాస్తులు ఉన్నాయి. ధరణిలో 188 టెక్నికల్ సమస్యలు గుర్తించాం. అందులో 163 టెక్నికల్ సమస్యలను పరిష్కరించాం. వారం పది రోజుల్లో మరోసారి భేటీ అవుతాం. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పెండింగ్ దరఖాస్తులు పెరిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో, అతి తక్కువ ములుగులో పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి. కలెక్టర్లతో పాటు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవో లు, తహసీల్దార్లకు ధరణిపై టెక్నికల్ సమస్యలను క్లియర్ చేశాం’’ అని నవీన్ మిట్టల్ వెల్లడించారు. -
జిల్లాల కలెక్టర్లతో CCLA కమిషనర్ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్
-
వీఆర్వోల ‘సర్దుబాటు’
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను ఇతర ప్రభుత్వశాఖల్లో సర్దుబాటు చేసే ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్వోల పూర్తి వివరాలను భూపరి పాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) కార్యాల యం మళ్లీ సేకరిస్తోంది. మూడు ఫార్మాట్లలో వారి సమగ్ర సమాచారాన్ని పంపాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది. వీఆర్వోలందరి వివరాలను 18 కాలమ్‌ల ఫార్మాట్లో పంపాలని, వారిపై ఉన్న కేసులు, సస్పెన్షన్లు, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నవారి వివరాలు మరో ఫార్మాట్లో, వీఆర్వోల కులం, మతం, విద్యార్హతలు, ఉద్యోగ ఎంపికల గురించి ఇంకో ఫార్మాట్లో నమోదు చేసి పంపాలని కలెక్టర్లకు సూచించింది. వీలైనంత త్వరగా ఈ వివ రాలను చేరవేయాలని ఆ లేఖలో పేర్కొంది. కాగా, వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్ల హోదాలో పలు ప్రభుత్వశాఖల్లో సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారి సర్వీసు, విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖలకు ఇవ్వాలని, ఆ తర్వాత వారికి పదోన్నతుల ప్రకియ్ర చేపట్టాలని యోచిస్తున్నామని సీసీఎల్ఏ వర్గాలు తెలిపాయి. డైరెక్ట్ రిక్రూటీ వీఆర్వోలను రెవెన్యూలోనే కొనసాగించాలని ఆలోచిస్తున్నట్టు వెల్లడించాయి. తప్పులున్నాయి.. సరిపోలడంలేదు వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 5,485 మంది వీఆర్వోలు పనిచేస్తున్నారు. ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత వీరందరి వివరాలను ఇప్పటికే రెండుసార్లు సీసీఎల్ఏ వర్గాలు తెప్పించుకున్నాయి. గత ఏడాది డిసెంబర్లో తెప్పించిన వివరాల్లో వీఆర్వోల విద్యార్హత, కులం, ఉద్యోగ ఎంపికలకు సంబంధిం చిన వివరాలు సరిగా లేవని, ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో తెప్పించిన వివరాల్లో డిసెంబర్లో వచ్చిన సమాచారానికి, మళ్లీ పంపిన సమాచా రానికి తేడా ఉందని గుర్తించాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి వీఆర్వోల వివరాలను సమగ్రంగా పంపాలని జిల్లా కలెక్టర్లను కోరుతూ సీసీఎల్ఏ లేఖలు రాయడం గమనార్హం. -
పనిచేస్తుంటే.. ఫైళ్లెందుకు కదలవ్..!
భూపరిపాలన కార్యాలయ సిబ్బందిని ప్రశ్నించిన సీసీఎల్ఏ సాక్షి, హైదరాబాద్: ‘‘మీరంతా బాగా పనిచేస్తున్నట్లయితే ఫైళ్లెందుకు ముందుకు కదలడం లేదు’’ అని భూపరిపాలన కార్యాలయ సిబ్బందిని ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) రేమండ్ పీటర్ ప్రశ్నించారు. భూపరిపాలన కార్యాలయంలోని వివిధ సెక్షన్లలో మొత్తం 16 వేల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఆయా ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఫైళ్లు రాయడం, వ్యక్తిగత రిజిస్టర్లను నిర్వహించడం.. తదితర అంశాలపై సిబ్బందికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రేమండ్ పీటర్ మాట్లాడుతూ.. త్వరలోనే సీసీఎల్ఏ కార్యాలయాన్ని ఈ-ఆఫీస్‌గా మార్చబోతున్నామని, దీని ద్వారా ఫైళ్ల సర్క్యులేషన్లో జాప్యాన్ని నివారించడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు వీలవుతుందని అన్నారు. -
సీసీఎల్ఏ కమిషనర్(అప్పీల్)గా అధర్‌సిన్హా
సాక్షి, హైదరాబాద్: సీసీఎల్ఏలో ప్రత్యేక కమిషనర్‌గా ఉన్న అధర్‌సిన్హా హోదాను రాష్ర్టప్రభుత్వం పెంచింది. ఆయనకు కమిషనర్(అప్పీల్) బాధ్యతలను కూడా అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాధ్యతలను ఎం.దానకిషోర్‌కు అదనంగా అప్పగించింది. వెయిటింగ్లో ఉన్న జి.వెంకటరామరెడ్డిని నీటిపారుదల శాఖ భూసేకరణ, ఆర్ఆర్ డెరైక్టర్‌గా నియమించారు. వ్యవసాయశాఖ డెరైక్టర్‌గా జి.డి. ప్రియదర్శినిని నియమించారు. అంతకుముందు ఇదే పోస్టులో ఎంవీ రెడ్డిని నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం రద్దు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్‌గా అనితా రామచంద్రన్‌ను నియమించారు. అపార్డ్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను కూడా ఆమెకు అప్పగించారు.