సీసీఎల్‌ఏ కమిషనర్(అప్పీల్)గా అధర్‌సిన్హా | adhar sinha ccla commissioner | Sakshi
Sakshi News home page

సీసీఎల్‌ఏ కమిషనర్(అప్పీల్)గా అధర్‌సిన్హా

Published Sat, Jan 24 2015 12:56 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM

సీసీఎల్‌ఏ కమిషనర్(అప్పీల్)గా అధర్‌సిన్హా - Sakshi

సీసీఎల్‌ఏ కమిషనర్(అప్పీల్)గా అధర్‌సిన్హా

సాక్షి, హైదరాబాద్: సీసీఎల్‌ఏలో ప్రత్యేక కమిషనర్‌గా ఉన్న అధర్‌సిన్హా హోదాను రాష్ర్టప్రభుత్వం పెంచింది. ఆయనకు కమిషనర్(అప్పీల్) బాధ్యతలను కూడా అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాధ్యతలను ఎం.దానకిషోర్‌కు అదనంగా అప్పగించింది. వెయిటింగ్‌లో ఉన్న జి.వెంకటరామరెడ్డిని నీటిపారుదల శాఖ భూసేకరణ, ఆర్‌ఆర్ డెరైక్టర్‌గా నియమించారు.

వ్యవసాయశాఖ డెరైక్టర్‌గా జి.డి. ప్రియదర్శినిని నియమించారు. అంతకుముందు ఇదే పోస్టులో ఎంవీ రెడ్డిని నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం రద్దు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్‌గా అనితా రామచంద్రన్‌ను నియమించారు. అపార్డ్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను కూడా ఆమెకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement