సాక్షి, పశ్చిమ గోదావరి : కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద శ్రీధరణి అనే యువతి ఆదివారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. యువతితో పాటు ఉన్న ఆమె స్నేహితుడు దౌలూరి నవీన్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో నవీన్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ కుటుంబ సభ్యులను మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి బుధవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసుల పనితీరుపై మండిపడ్డారు. (ప్రేమికులే వాడి టార్గెట్)
శ్రీధరణి హత్య జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి హత్య కేసులో ఆమె ప్రియుడు నవీన్ పాత్రపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. శ్రీధరణిని బయటికి తీసుకెళ్లాడు గనుక నవీన్ కూడా నిందితుడేనని అభిప్రాయపడ్డారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయకపోతే పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment