
కామవరపుకోట మండలం గుంటుపల్లి బౌద్ధ గుహల గేట్లు మూసివేసిన దృశ్యం
పశ్చిమగోదావరి, కామవరపుకోట: ప్రఖ్యాతిగాంచిన గుంటపల్లి బౌద్ధ గుహలు మూతపడ్డాయి. గత నెల 24న శ్రీధరణి హత్య ఘటన అనంతరం గుంటుపల్లి బౌద్ధ గుహల సందర్శనను అధికారులు నిలిపివేశారు. హత్య ఘటన నేపథ్యంలో పోలీసులు ఆధారాల సేకరణ తదితర విషయాలతో సందర్శనను ఆపేశారు. క్లూస్ టీమ్‌తో పాటు మహిళా కమిషన్ సభ్యులు, ఇతర అధికారులు ఈ ప్రాంతానికి వస్తున్నారు. సందర్శకులు ఈ ప్రాంతానికి వస్తే రద్దీ పెరగడంతో పాటు ఆధారాలు కనుమరుగయ్యే అవకాశం ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బౌద్ధ గుహలను మూసివేసినట్టు సిబ్బంది తెలిపారు. తిరిగి ఉత్తర్వులు ఇచ్చే వరకు సందర్శకులను అనుమతించమని వారు చెప్పారు.