తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా | Telangana Assembly Sessions On 2nd August Live Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

Published Fri, Aug 2 2024 8:36 AM | Last Updated on Fri, Aug 2 2024 8:49 PM

Telangana Assembly Sessions On 2nd August Live Updates

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అప్‌డేట్స్‌..

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

తొమ్మిది రోజుల పాటు సాగిన శాసన సభ సమావేశాలు
32ప్రశ్నలు సమాధానాలు ఇచ్చిన శాసన సభ...8ప్రశ్నలకు సమాధానం రాలేదని తెలిపిన స్పీకర్
ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపనున్నా మంత్రులు
23 జులై నుంచి ఆగస్టు 2వరకు జరిగిన శాసన సభ
65 గంటల 33 నిమిషాలు సాగినా శాసన సభ
132 ప్రసంగాలు సభలో  ఎమ్మెల్యేలు  చేసినట్లు స్పీకర్ ప్రకటన
గవర్నమెంట్ రెజల్యూషన్ 1, 5 బిల్లు ఆమోదం, 2 షాట్ డిస్కషన్, 3 మోషన్స్ పై చర్చ జరిగినట్లు ప్రకటన
శాసన సభలో ఒక ప్రభుత్వ స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు తెలిపిన స్పీకర్

👉హైదరాబాద్‌ అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ

ఔటర్‌ లోపల ఉన్న నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్‌
నగరాభివృద్ధికి హైడ్రాను సిద్ధం చేస్తున్నాం
హైదరాబాద్‌ రోడ్లపై నీరు ఆగకుండా ఉండేందుకు వాటర్‌ హార్వెస్టింగ్‌లను ఏర్పాటు చేస్తాం
మూసీని సబర్మతి, లండన్‌ థీమ్స్ తరహాలో డెవలప్‌ చేస్తాం
త్వరలోనే మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్‌లను నియమిస్తాం

👉 ధరణి పేరుతో పేద రైతులకు అన్యాయం చేశారు: మంత్రి సీతక్క

ధరణి తెచ్చి రైతుల్లో భయం కల్పించారు
ధరణి పేరుతో పేద రైతులకు అన్యాయం చేశారు
భూములు అమ్ముకున్న వారికి తిరిగి పట్టాలు ఇచ్చారు
బీఆర్‌ఎస్‌ నాయకులు తమ పేరు మీద భూములు రాసుకుని రైతు బంధు ఎంజాయ్ చేశారు
ములుగుకి వస్తే తప్పులను నిరుపిస్తా
పేద రైతుల హత్యలు, అత్మ హత్యలకు ధరణే కారణం
గత ప్రభుత్వం ధరణితో రెవెన్యూ తప్పులను సరిద్ధిద్దలేదు
ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు
పేదల అసైన్డ్ ల్యాండ్ గుంజుకున్నారు
వందల ఎకరాల్లో ఫార్మ్ హౌస్‌లు కట్టుకున్నారు
రైతుల ఆవేదన తొలగించేలా, భూముల పై హక్కులు కల్పిస్తూ సమగ్ర చట్టం తీసుకొస్తాం
త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకు రావాలని ప్రజలు ఆడుగుతున్నారు
రైతులకు భరోసా కల్పించేందుకు కొత్త చట్టం తీస్తున్నాం

👉మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కామెంట్స్‌

  • దేశంలో పేదవాడికి అండగా ఉన్నది ఇందిరమ్మ మాత్రమే.
  • భూ రికార్డులను డిజిటలైజ్ చేసింది కూడా వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే.
  • 2006లో వైఎస్సార్ పోడు భూములకు పట్టాలిచ్చారు.
  • భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేసింది.
  • ధరణి పేరుతో బీఆర్ఎస్ దగా చేసింది.
  • తెలంగాణ ప్రజల ఆస్తులను సింగపూర్ కంపెనీ చేతిలో పెట్టారు.
  • కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక పోయినట్టుగా ధరణి ఉంది.
  • బీఆర్‌ఎస్‌ నిర్వాకం రైతుల పాలిట శాపంగా మారింది.
  • సింగపూర్‌ కంపెనీకి తెలంగాణ భూములను కేసీఆర్‌ తాకట్టు పెట్టారు.
  • సాదాబైనామాల కరెక్షన్ కోసం 9 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కానీ, ధరణిలో ఆ  ఆప్షనే లేదు.
  • ఏదైనా ఒక సర్వే నెంబర్‌లో కొంత భూమిపై వివాదం ఉంటే మొత్తం సర్వే భూమిపై ఆంక్షలు పెట్టారు.
  • ధరణి చట్టం మూడు తలలతో మొదలై 33 తలలతో అవతరించింది.
  • కలెక్టర్లు అప్రూవల్ చేసిన అప్లికేషన్లు మళ్ళీ చూడాలనుకున్నా కలెక్టర్లకు యాక్సెస్ ఇవ్వలేదు.
  • కేసీఆర్ ఎవరి మాట వినలేదు, నేను బీఆర్ఎస్ ఉన్నప్పుడు చెప్పి చూశాను..పట్టించుకోలేదు.
  • కేసీఆర్, ఓ అధికారి కూర్చొని ధరణిని నడిపించారు
  • కారణాలు లేకుండా గతంలో అప్లికేషన్‌ రిజక్ట్‌ చేసేవారు. 

 

👉సివిల్ కోర్టు సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్..

  • 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్ట్
  • రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయంలో ఎక్కువగా ఉంది
  • సాగునీటి ప్రాజెక్టులపై గత ఐదేళ్లలో ఎక్కువ ఖర్చులు చేశారు(పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం)
  • 1983 - 2018 మధ్య కాలంలో 20 సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం ప్రారంభం అయితే వాటిపై 1లక్ష 73వేల కోట్లు
  • మొదటి అంచనా వ్యయం 1 లక్ష కోట్లు నుండి 2 లక్షల కోట్లకు పెరిగింది.
  • ద్రవ్యలోటు పరిమితులకు లోబడి ఉంది
  • ఇచ్చిన రుణాలు అడ్వాన్సులు భారీగా ఉన్నాయి.
  • వాటా అత్యధికంగా ఉన్నాయి
  • కాళేశ్వరం మిషన్ భగీరథకే ఎక్కువ రుణాలు తీసుకున్న రుణాలు చెల్లించడానికే ఎక్కువ ఖర్చులు
  • కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను మళ్ళీ చెల్లించడానికి ఇబ్బంది
  • 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి కన్నా 6శాతం ఎక్కువ రుణాలు తీసుకున్న గత ప్రభుత్వం
  • గత సంవత్సరం బడ్జెట్‌లో పన్నెతర రాబడి అంచనాలు ఎక్కువగా వేశారు
  • ఎస్సీ అభివృద్ధి నిధుల్లో 58శాతం, ఎస్టీలో నిధుల్లో 38శాతం వినియోగం కాలేదు
  • ఖర్చు అయిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులను దారి మళ్లించారు
  • సొంత ఆదాయం కంటే.. రుణాలపై ఎక్కువగా ఆధారపడింది
  • ఇప్పుడున్న రుణాలు తీర్చేందుకు రానున్న పదేళ్లలో 2లక్షల 86వేల కోట్లు సమీకరించాల్సి ఉంటుంది
  • ఇచ్చిన రుణాలను జప్తు చేసిన రెవెన్యూ రుణాలను ఎక్కువ చేసిన చూపిన ప్రభుత్వం
  • 2022 మార్చి నాటికి హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌పై కాగ్ రిపోర్ట్.
  • జిల్లా ఆసుపత్రులలో అగ్నిప్రమాద నివారణ పరికరాలు లేవు.
  • మందుల అవసరాలపై రెండు సంవత్సరాలకు ఒకసారి సమీక్ష చేయాల్సి ఉన్నా.. 2015,19లో మాత్రమే సమీక్ష చేసారు.
  • ఆసుపత్రులలో అవసరమైన మేరకు మందులను అందుబాటులో ఉంచడం లేదు.
  • 2017-18 ప్రధాన మంత్రి మాతృ వందన కింద వచ్చిన 65 కోట్ల నిధులు 2022 జూన్ నాటికి ఉపయోగించకపోవడంతో నిధులు కేంద్ర ఖాతాలోనే ఉన్నాయి.
     

 

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కామెంట్స్‌..

  • మొన్న అసెంబ్లీలో జరిగిన వీడియోలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది.
  • ఇది దుర్మార్గపు చర్య.
  • ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదు.

 

మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కామెంట్స్‌..

  • పార్లమెంట్ పరిధిలో ఎవరైనా ఫోటోలు వీడియోలు తీస్తే కఠిన చర్యలు ఉన్నాయి.
  • ఒకరోజు జరిగిన ఘటనపై ఫోటోలు వీడియోలు తీస్తే వెంటనే డిలీట్ చేయించారు.
  • పార్లమెంటు పరిధిలో ఫోటోలు వీడియోలు నిషేధం ఉన్నాయి.

 

కేటీఆర్ కామెంట్స్‌..

  • సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారు.
  • పోస్టులు డిలీట్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.
  • ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు కూడా లోపల విజువల్స్ చూపించటం లేదు.
  • మంత్రులు రన్నింగ్ కామెంట్రీ చేస్తే ఎలా?
  • పార్లమెంట్‌లో వీడియో లు, ఫోటోలు తీస్తున్నారు.
  • అక్కడ జరిగే నిరసనలు జరిగేవి అన్ని చిత్రీకరిస్తున్నారు.
  • ఒక్కసారి గమనించాలి.

 

మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్‌..

  • అసెంబ్లీ విషయంలో మంత్రి సీతక్కపై మార్ఫింగ్ వీడియోలు ప్రచారం జరిగాయి.
  • మంత్రి సీతక్క మార్ఫింగ్ వీడియోలపై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది ప్రతిపక్షం చెప్పాలి.
     

 

👉మార్ఫింగ్‌ వీడియోలపై స్పీకర్‌ సీరియస్‌

👉మార్ఫింగ్‌ వీడియోలు చేస్తే కఠిన చర్యలు

👉అసెంబ్లీలో వీడియోలు మార్ఫింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు
 

మంత్రి శ్రీధర్‌ బాబు కామెంట్స్‌..

  • కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు చేస్తుంది.
  • కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా ఉండే విచారణ చేస్తున్నాం.
  • కొత్త చట్టాలపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయబోతున్నాం.
  • ఇప్పటికే కొన్ని రాష్ట్రానికి చట్టాలపై ఆ అభిప్రాయాలు తెలిపాయి.
  • సైబర్ క్రైమ్ అరాచకాలను అరికట్టేందుకు కొత్త చట్టాలను తేవడానికి వెనుకాడబోము.
  • సైబర్ క్రైమ్ అరాచకాలు తారాస్థాయికి పోయాయి.
  • సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోల ప్రచారం చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయి.
  • కేటీఆర్ అడిగినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై విచారణ చేస్తాం.
  • సభా ప్రాంగణంలో సభను అప్రతిష్టపాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం.
  • లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించే విధంగా ఎవరు చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటాం.
  • క్రిమినల్ చట్టాలపై అందరి అభిప్రాయాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది.

 

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి కామెంట్స్‌..

  • సివిల్ కోర్టు సవరణ బిల్లును సమర్ధిస్తూ కొన్ని సూచనలు చేస్తున్న.
  • ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెంచాలి
  • కొత్తగా ఏర్పడిన జిల్లాలో కోర్టులకు సొంత భవనాలు లేవు
  • అద్దె భవనాల్లో కోర్టులు నిర్వహించడం బాధాకరం
  • నియోజకవర్గాల్లో జూనియర్ సివిల్ కోర్టులు లేవు
  • కేసులు సత్వర పరిష్కారం కావాలంటే జూనియర్ సివిల్ కోర్టులు పెంచాలి
  • కోర్టుల అంశంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది
  • గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దాలి


ఎమ్మెల్యే కూనంనేని కామెంట్స్‌..

  • కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు రాజ్యమేలుతున్నారు.
  • పోలీసు వ్యవస్థ పాత సీసాలో పాత సారా టైప్ నడుస్తోంది.
  • బీఆర్ఎస్ వదిలేసిన చెప్పుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాళ్లు పెడుతోంది.
  • ఎన్ని ప్రభుత్వాలు మారిన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమాలకు అడ్డంకులు చెప్పలేదు.
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా సుందర విజ్ఞాన కేంద్రంలో ఏదైనా కార్యక్రమం పెట్టాలంటే అనుమతి తీసుకోవాలని అంటున్నారు.
  • అరెస్టులు భారీగా జరుగుతున్నాయి అక్రమంగా లోపల వేస్తున్నారు.
  • రాజ ద్రోహం కింద... దేశద్రోహం అని పేరు మారింది అంతే.
  • కేంద్రం చట్టాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
  • సామాన్య కార్మికులు పేదవాళ్లు ధర్నాలు చేసే అవకాశం లేదు..
  • ముఖ్యమంత్రి సామాన్య కార్యకర్తలకు, పేదవాళ్లకు అవకాశం కల్పించాలి.
  • హరగోపాల్ లాంటి వాళ్ళు కార్యక్రమాలు పెడితే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
     

మంత్రి పొన్నం కామెంట్స్‌..

  • సభలో రన్నింగ్‌ కామెంట్రీ ఆపాలి.
  • సోషల్‌ మీడియాలో కావాలనే ట్రోలింగ్‌ చేస్తున్నారు.
  • సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులు, వస్తున్న ఫేక్ వీడియోలపై చర్యలు తీసుకోవాలి..
  • రవాణా శాఖ మంత్రిగా మొన్న కూడా అసెంబ్లీలో ఇప్పటి వరకు 70 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు..
  • కొంతమంది కావాలనే వీడియోలు క్రియేట్ చేసి మహిళలను అవమానిస్తున్నారు..
  • అలాంటి వారిపై పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలి..
  • నిన్న నేను మాట్లాడుతుంటే కావాలని వీడియో ఎడిట్ చేసి  వైరల్ చేశారు.
  • గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వందల మంది మీద కేసుకు కేసులు పెట్టారు..
  • నా కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటున్నారు..
  • ఒక గిరిజన మహిళా మంత్రి శాసన సభలో మాట్లాడిని దాన్ని కూడా వైరల్ చేస్తున్నారు..
  • నిన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ నాతో మాట్లాడుతుంటే దానిని అసభ్యంగా ఎడిట్ చేశారు .
  • బావ స్వేచ్ఛ ఉండాలి.. కానీ ఎదుటి వ్యక్తిని అవమానించే విధంగా ఉంటే ఎట్లా..
  • సభలో జరిగిన అంశాలను కించపరిచి అవమానపరిచే విధంగా వీడియోలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి..

కేటీఆర్‌ కామెంట్స్‌..

  • రాష్ట్రంలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలి.
  • బాధితులకు త్వరగా న్యాయం జరగాలి.

👉అసెంబ్లీ పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్‌

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందో లేదో కానీ మీరు అమెరికా వెళ్లి వచ్చే వరకు సభ్యత్వం రద్దు అయ్యేలా ఉంది.
  • ముఖ్యమంత్రి బెదిరిస్తే బయటపడే వాళ్ళు లేరు.
  • సబితా ఇంద్రారెడ్డిని అవమానించినందుకు చేసిన సీఎం క్షమాపణ చెప్పాలి..
  • అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం ఉంటాదో లేదో చూసుకో ముఖ్యమంత్రి..
  • ఖమ్మం, నల్గొండ మంత్రులు మీ సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారు
  • అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదు.
  • హుజురాబాద్ ప్రజలకు రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలి.
  • హుజురాబాద్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం స్పందించలేదు.
  • నా జీతం నుంచి 4 లక్షలు ఇచ్చాను వాళ్లకు.
  • హుజురాబాద్‌లో పొన్నం ప్రభాకర్ మిత్రుడు ప్రెస్ వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు.

 

👉తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నేడు తొమ్మిదో రోజు కాగా, ఈ సెషన్‌కు ఇదే చివరిరోజు కూడా. ఈరోజు ముఖ్యంగా మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చించనున్నారు.

👉నేటి సమావేశంలో భాగంగా ధరణి పోర్టల్‌పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చించనున్నారు. అలాగే, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నారు. అంతేకాకుండా.. త్వరలో ప్రజలకు తెల్ల రేషన్​ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించనున్నారు.

👉ఇక, నిన్న అసెంబ్లీలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ నేడు ఉద్యోగాలకు సంబంధించి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనున్నట్టు తెలిపారు. 
అలాగే ప్రజలకు తెల్ల రేషన్‌కార్డులు ఇచ్చే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామన్నారు. పేదలకు రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని తెలిపారు. రేషన్‌కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

👉మరోవైపు.. నిన్న అసెంబ్లీ వద్ద నిరసనల కారణంగా బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో, నేడు బీఆర్‌ఎస్‌ నేతలు సభకు హాజరవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement