సీఎం రేవంత్‌ కామెంట్స్‌.. అసెంబ్లీలో గందరగోళం | Telangana Assembly Sessions 31st July Live Updates | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ కామెంట్స్‌.. అసెంబ్లీలో గందరగోళం

Published Wed, Jul 31 2024 8:02 AM | Last Updated on Wed, Jul 31 2024 6:21 PM

Telangana Assembly Sessions 31st July Live Updates

Live Updates..

శాసనసభ రేపు ఉదయం10 గంటలకు వాయిదా

ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన శాసనసభ

ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానం

  • బీఆర్ఎస్ నిరసనల మధ్యలోనే ద్రవ్య వినిమయ బిల్లుపై సమాధానం ఇస్తున్న డిప్యూటీ సీఎం. 
  • బీఆర్ఎస్ నిరసన కరెక్ట్ కాదు. 
  • నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ వైఖరి అవలంబించలేదు.
  • బీఆర్ఎస్ నిరసనల మధ్యలోనే ద్రవ్య వినిమయ బిల్లు పాస్ చేసిన ప్రభుత్వం

బీఆర్ఎస్ నిరసనల మధ్య కొనసాగుతున్న తెలంగాణ శాసనసభ.

  • ద్రవ్య వినిమయ బిల్లుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో మాట్లాడిస్తున్న ప్రభుత్వం.
  • స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
  • సభా నాయకుడు ఎవరి పేరును ప్రస్తావించలేదు-మంత్రి శ్రీధర్ బాబు.
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేయడం కరెక్ట్ కాదు.
  • ఎంఐఎం, బీజేపీ మాట్లాడకపోతే  తర్వాత వారికి అవకాశం ఇవ్వాలని కోరిన మంత్రి.

మాట్లాడే అవకాశం నేను ఇస్తాను నిరసన ఆపాలి: స్పీకర్

  • మాట్లాడే అవకాశం ఇస్తా అన్నా కూడా ఎందుకు ఆందోళన చేస్తున్నారు.
  • సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇస్తాను.
  • వివేక్ వెంకటస్వామి మాట్లాడిన తర్వాత అవకాశం ఇస్తాను.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రుల భేటీ

  •  సీఎం భేటీ కంటే ముందు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయిన డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్ బాబు
  • స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో భేటీ అయిన సీఎం రేవంత్, మంత్రులు.. సభలో BRS ఆందోళన చేయనున్న నేపథ్యంలో స్పీకర్‌తో భేటీ
     
  • ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డికి సీఎం క్షమాపణ చేప్పే వరకు నిరసన చేయాలని బీఆర్‌ఎస్‌ పట్టు

👉సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ..

👉సీఎం రేవంత్‌ కామెంట్స్‌లో సభలో గందరగోళం నెలకొంది. 

👉బీఆర్‌ఎస్‌ నేతలు స్పీకర్‌ వెల్‌లోకి దూసుకొచ్చారు. 

👉బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

👉సభ నుంచి ముఖ్యమంత్రి వెళ్లిపోవడంపై బీఆర్ఎస్ నిరసన.

👉ప్రతిపక్ష పార్టీ తలపై ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసి సభ నుంచి వెళ్లిపోయారంటూ టిఆర్ఎస్ నిరసన.

👉అధికార విపక్షాల నిరసనల మధ్య శాసనసభ 15 నిమిషాలు వాయిదా

👉అసెంబ్లీ లాబీలో సబిత ఇంద్రారెడ్డి చిట్ చాట్

  • రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది నేనే.
  • ఈరోజు సీఎం సీట్లో కూర్చోబెట్టాను.
  • ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి , రేవంత్ రెడ్డి నా కుమారుడికి టికెట్ రానివ్వలేదు.
  • మహిళలను ఇలానేనా అవమానించేది.
  • లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని మాట్లాడితే, నన్ను టార్గెట్ చేశారు.

👉అసెంబ్లీ లాబీలో కేటీఆర్ చిట్ చాట్

  • సబిత ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం
  • అక్కలను నమ్ముకుంటే ముంచుతారు అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు
  • సబిత ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి.
  • భట్టి విక్రమార్క కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తునట్లు అనిపిస్తుంది
     

👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్‌..

  • కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి ప్రాధాన్యత ఇచ్చింది.
  • పదేండ్లు మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది.
  • 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు.
  • కాంగ్రెస్ పార్టీ దళిత నేతగా ఉన్న నాకు సీఎల్పీ, ఎల్‌ఓపీగా బాధ్యతలు ఇచ్చారు.
  • సబితా ఇంద్రారెడ్డి రెడ్డి నా వెనుక ఉండి నన్ను సీఎల్పీ, ఎల్ఓపీగా కాకుండా అధికారం కోసం పార్టీ మారారు.
  • సబితా ఇంద్రారెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నారు.
  • కాంగ్రెస్ పార్టీ పరువు తీసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు సబితా ఇంద్రారెడ్డి.
  • డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై మరోసారి ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్
  • స్పీకర్ పోడియం ముందు వచ్చి నిరసన చేస్తున్న ఎమ్మెల్యేలు.
  • మహిళా నాయకురాళ్లపై మంత్రులుగా ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటున్న బీఆర్ఎస్.

 

👉కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలకు కన్నీరు పెట్టిన సబితా ఇంద్రారెడ్డి.

  • అసెంబ్లీలో సబిత భావోద్వేగం.
  • నన్ను ఎందుకు టార్గెట్‌ చేశారు.
  • రేవంత్‌ ఏ పార్టీ నుంచి వచ్చారు.
  • కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.
  • పార్టీ మార్పులపై చర్చ జరగాలి.
  • రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి నేనే ఆహ్వానించాను.
  • ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు పార్టీలు మారి రాలేదా?
  • అక్కడున్న కాకి మా ఇంటి మీద వాడితే కాల్చుతా అన్నారు రేవంత్ రెడ్డి.
  • రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది నేనే.
  • ఒక ఆడబిడ్డకు బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా?
  • సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు టార్గెట్ చేశారు?
  • వెనక కూర్చున్న అక్కలు ఎవరిని మోసం చేశారు?
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి భవిష్యత్తు చూపించాం.
  • ముఖ్యమంత్రి ఎవరిని అవమానిస్తున్నారు ఆలోచన చేసుకోవాలి?
  • ఆడిబిడ్డలాగా ఉన్న మేము ఎవరిని మోసం చేసాము?
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి?

 

👉రేవంత్ రెడ్డి కామెంట్స్‌..

  • అక్కగా నేను సబితా ఇంద్రారెడ్డిని నమ్మాను.
  • నన్ను మల్కాజిగిరిలో పోటీ చేయమని చెప్పి.. కాంగ్రెస్‌ను వదిలి బీఆర్ఎస్‌లోకి వెళ్లారు.
  • ఒకవైపు నన్ను మల్కాజిగిరిలో పోటీ చేయమని.. మరోవైపు కేసీఆర్ మాటలు నమ్మి ఆ పార్టీలో చేరారు.
  • మల్కాజ్‌గిరిలో పోటీ చేయమని, బీఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవి పొందారు.
  • రాజ్ భవన్ వెళ్లి వచ్చాక అన్ని అంశాలపై సమాధానాలు చెప్తా అన్ని విషయాలు బయటపెడతాను.


👉 బీఆర్‌ఎస్‌ నేతల నిరసన..

  • స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనపై స్పీకర్ ఆగ్రహం.
  • రెండు గంటలు సమయం ఇచ్చిన చైర్‌కు బీఆర్ఎస్ మర్యాద ఇవ్వడం లేదు.
  • మహిళలను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదు
  • ఎంత అవకాశం ఇచ్చిన నిరసన చేయడం సరైన పద్ధతి కాదు.

 

👉సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‌..

  • కేటీఆర్ మేము కలసి వస్తాం అని చెప్తున్నారు.
  • కానీ ప్రతిపక్ష నేత సభకు రావడం లేదు..
  • కాంగ్రెస్‌లో ఉండి ఇక్కడ ముంచి అక్కడి వెళ్లారు.
  • మీ వెనుకాలా కూర్చున్న అక్కలను నమ్ముకుంటే అంతే సంగతి.
  • వాళ్ల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్‌లో నిలబడాల్సి వస్తుంది.
  • బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు.
  • ప్రభుత్వానికి సహాకరించేది ఉంటే ప్రతిపక్ష నేత సభకు రావాలి.
  • మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదని మమ్మల్ని అంటున్నారు.
  • 2014 నుంచి 19 వరకు ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు.
  • కాంగ్రెస్‌లో ఉండి ఇక్కడ ముంచి అక్కడి వెళ్లారు.
  • బీఆర్‌ఎస్‌ నేతల వెనుక ఉన్న అక్కలను నమ్మితే అంతే..
  • వాళ్ల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్‌లో నిలబడాల్సి వస్తుంది.
  • బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు.
  • సబితను సొంత అక్కగానే భావించాను.

 

👉 సీతక్క కామెంట్స్‌..

  • మీతో వస్తాం తమ్ముడు అని చెప్పి మోసం చేశారు.
  • రాహుల్‌ గాంధీ దగ్గర అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకున్నారు.
  • పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని సబితా ఇంద్రారెడ్డితో ఫిర్యాదు చేయించారు.
  • ఒక్కరిద్దరు మహిళా సభ్యులు మీతో వస్తామని చెప్పి మోసం చేశారు.
  • ఆమెను చేర్చుకున్నప్పుడు రాజీనామా చేశారు.
  • అందుకే బాధతో సీఎం ఇలా మాట్లాడారు.


👉కేటీఆర్‌ కామెంట్స్‌..

  • కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా ఎల్ఆర్ఎస్  ఉచితంగా చేయాలి.
  • కేసీఆర్ పథకాలు పేర్లు మార్చినా పర్లేదు కానీ కొనసాగించాలి.
  • పెండింగ్ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలి.
  • ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయాలు చేద్దాం.. ఇప్పుడు అభివృద్ధి చేద్దాం.
  • మాపై కోపం ఉంటే మమ్ములను తిట్టండి.. కానీ ఉద్యమం కోసం పుట్టిన పార్టీని తిట్టకండి.
  • ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మౌనంగా భరించం.
  • ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతి పెడతాం అని కాళోజి వ్యాఖ్యలను కొనసాగిస్తాం.
     

👉కేటీఆర్ మాజీ మంత్రి

  • రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు.
  • 48 గంటల్లో నాలుగు అత్యాచారాలు జరుగుతున్నాయి.
  • అదానీ కంపెనీ పై కేంద్ర కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే.. అదే అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకుంటున్నారు.
  • ఆటో కార్మికులు రైతులు 383, ఆటో కార్మికులు 53, నేతనులు 15 మంది మరణించారు వాళ్లను ప్రభుత్వం ఆదుకోవాలి
  • మూసి నది అభివృద్ధి కోసం లక్షన్నర రూపాయలతో ప్రణాళికలు అని ప్రచారం జరుగుతోంది.
  • నా ప్రభుత్వంలో మూసీ నది అభివృద్ధి పనులను మొదలుపెట్టాం.

 

మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్‌.. 

  • మూసీ నది పై ఖర్చుల విషయంలో తప్పుడు ప్రచారాలను నమోదు
  • మూసీ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.
  • ఇప్పుడు డిపిఆర్ పరిధిలోనే ఉన్నాయి.
  • అభివృద్ధి చేస్తాం.. అని తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.

 

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్‌..

  • మూసీ అభివృద్ధి కోసం అందరం కలిసి పని చేద్దాం.
  • ఎన్ని వేల కోట్లు అయినా అభివృద్ధి అనేది మంచిదే.
  • అభివృద్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు సహకరించాలి.

 

👉కేటీఆర్‌ కామెంట్స్‌..

  • పాలసీలు తెస్తాము అంటుంది.. కానీ, కేసీఆర్‌పై ఝలసీ పాలసీ తప్ప ఏమీ కనిపించడం లేదు.
  • నా ఇంటలిజెన్స్ ఏంటో ప్రజలకు తెలుసు.
  • నేను చదువుకున్నాను. పోటీ పరీక్షలు రాశాను.
  • హైదరాబాద్‌, గుంటూరులో చదువుకున్నారు.
  • విదేశాల్లో కూడా చదివాను.
  • అమెరికాలో ఉద్యోగం చేసిన అదే ఉద్యోగం పేరుతో హైదరాబాద్ వచ్చాను.
  • ముఖ్యమంత్రి ఎక్కడ చదివారో.. ఆయన గతమెంటో బయట వేరే మాట్లాడుకుంటున్నారు.
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 17 సంవత్సరాలుగా నాకు తెలుసు.
  • పదిహేళ్లుగా కొంత చెడింది అంతే తప్ప నాకు మంచి మిత్రుడు.
  • సౌత్ తెలంగాణ అభివృద్ధి జరిగితే సంతోషం.
  • ప్రోటోకాల్ పాటిస్తే ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటాము.
  • రాష్ట్రంలో పొలిటికల్‌ దాడులు జరుగుతున్నాయి.
  • సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే దాడి చేస్తున్నారు.
  • దావోస్‌కు వెళ్తున్న సీఎం రేవంత్‌కు అభినందనలు.
  • పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాను.
  • బోగస్‌ పెట్టుబడులను నమ్మకూడదని సూచిస్తున్నాను.
  • అదానీని రాహుల్‌ వ్యతిరేకిస్తుంటే రేవంత్‌ వెల్‌కమ్‌ చెబుతున్నారు. 
     

రేవంత్ కౌంటర్‌..

  • నేను ప్రభుత్వ స్కూళ్లలో మా జిల్లా, హైదరాబాదులోనే చదువుకున్నాను.
  • గుంటూరు పోలేదు అక్కడ చదువుకోలేదు.
  • నేను ఇక్కడ ఉద్యోగాలు చేసేందుకు కూడా అర్హుడేని.

 

👉సీఎం రేవంత్‌ కామెంట్స్‌..

  • కేటీఆర్‌ సూచనల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
  • పదేళ్ల పాలన చేసిన వారు పదినెలలు పూర్తి చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
  • టూరిజం హబ్‌ క్రియేట్‌ చేస్తామంటున్నాం.
  • బతుకమ్మ చీరల డబ్బులు బకాయి పెడితే మేం చెల్లించాం.
  • బతుకమ్మ చీరల కాంట్రాక్ట్‌ బినామీలకు అప్పగించారు.
  • సూరత్‌ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్‌ కొట్టేశారు.
  • దీనివెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందిరికీ తెలియాలి.
  • మేము ఎప్పుడూ మీలాగా పాతబస్తీని ఇస్తాంబుల్‌ చేస్తామని చెప్పలేదు.
  • ఎంఎంటీఎస్‌ను విమానాశ్రయం వరకు వేస్తామంటే అనుమతి ఎందుకివ్వలేదు.
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం.
  • హుస్సేన్‌సాగర్‌ నీళ్లను కొబ్బరినీళ్లలాగా మార్చుతామనలేదు.
  • ఓల్డ్‌ సిటీని ఇస్తాంబుల్‌, కరీంనగర్‌ న్యూయార్క్‌ చేస్తామన్నారు.
  • గతంలో కేసీఆర్‌ చెప్పినట్టు మేము చెప్పలేదు.
  • ఎంఎంటీస్‌ పనులు చేపట్టకపోవడం వెనుక కుట్ర ఉంది.
  • ముచ్చర్ల భూసేకరణపై కేటీఆర్‌ రెచ్చగొడుతున్నారు.
  • అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంలను నిర్మిస్తాం.
  • సిరాజ్‌, నిఖత్‌ జరీన్‌కు గ్రూప్‌-1 జాబ్‌ ఇవ్వాలని నిర్ణయించాం.
  • నిఖత్‌ జరీన్‌కు ఉద్యోగం ఇస్తానని జాబ్‌ ఇవ్వలేదు.
  • నేత కార్మికులకు పని కల్పించామని అబద్ధాలు చెప్పారు.
  • పాలసీలు మార్చింది గత ప్రభుత్వమే.
  • ముచ్చర్లలో గొప్ప నగరం నిర్మిస్తాం.
  • పది నెలలు నిండని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారు
  • మహేశ్వరంలో భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇప్పటికే వచ్చాయి.
  • ఆజామాబాద్‌లో రేపు ఇన్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన ప్రారంభమవుతుంది.
  • హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు చేస్తామని అన్నాము.
  • తాగుబోతులకు అడ్డాగా ఉన్న స్టేడియంలో మారుతున్నాయి.
  • అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్
  • ధరణిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకురాబోతుంది.
  • కేటీఆర్ రెండు గంటలు మాట్లాడి రాజకీయ కోణంలో విషం చిమ్ముతున్నారు.
  • గత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజలకు ఉపయోగపడే పాలసీలను కొనసాగిస్తాం.
  • పదేళ్లు పాలించారు కాబట్టి తెలంగాణపై ఒక అభిప్రాయం ఉంటుంది.
     

 

👉కేటీఆర్‌పై సీతక్క ఫైర్

  • గత పదేండ్లు బీఆర్ఎస్ పాలన కోట శ్రీనివాస్ కోడి కూర కథలాగా ఉంది.
  • లక్షలాది పేదలు ఇండ్లు లేక బాధపడుతున్నారు
  • బీఆర్ఎస్ పదేండ్లలో ఎవరికి ఇండ్లు ఇచ్చారు
  • బంగారు తెలంగాణ, ధనిక రాష్ట్రం అని చెప్తుంటే నిజమని అన్నారు
  • ఉద్యోగాల విషయంలో కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వొస్తుంది
  • మేం ప్రకటించిన పథకాలకు కొంత పెంచి ప్రకటించారు. అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా?
  • మా పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం బాధ కలుగుతుంది
  • ఇచ్చిన ప్రతి మాట కచ్చితంగా చేస్తాం
  • అబద్ధాలు అద్భుతంగా చెప్పడంలో కేటీఆర్ దిట్ట..
  • పదేళ్లలో ఉద్యోగాలు ఇస్తే.. ఉస్మానియా యూనివర్శిటీకి ఎందుకు వెళ్ళలేదు.
  • డబుల్ పెన్షన్ తీసుకుంటున్న లక్ష్మమ్మ నుంచి రికవారి చేశారు.. మా దృష్టికి రాలేదు.
  • మీ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లు కూడా పెన్షన్ తీసుకున్నారు.
  • సాగు చేసుకుంటున్న  రైతులకు ధరణిలో లేదని రైతుబంధు రాకుండా చేశారు.
  • ప్రతి రోజూ ధనిక రాష్ట్రం.. బంగారు తెలంగాణ అంటే.. బయట ఉన్న మేము నిజమే అనుకున్నాం.
  • మరీ మా మానిఫెస్టో చూసి.. గ్యాస్ సిలిండర్‌ మేము 500 అంటే.. మీరు నాలుగు వందలకే అన్నారు.
  • ఇలా ఎన్నో పథకాలు పెంచి ప్రజలను మోసం చేద్దాం అనుకున్నారా?.
  • అద్భుతంగా ధనిక రాష్ట్రాల్లో రైతులు, ప్రజలకు పథకాలు అందిద్దాం అనుకున్నాం.
  • కానీ పదేళ్లు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు.
  • తప్పకుండా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తాం.

 

👉మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్‌..

  • బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మలేదు.
  • కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టింది అయినా ప్రజలు నమ్మలేదు.
  • మేము 2000 అంటే 2016లో అన్నారు అయినా ప్రజలు నమ్మలేదు.
  • 2018లో బీఆర్‌ఎస్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు.
  • అందుకే 2023లో బీఆర్ఎస్‌ను ప్రతిపక్షంలో కూర్చుని పెట్టారు.
  • కేటీఆర్ సభలో సత్యదూరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
  • కాంగ్రెస్ మొదటి బడ్జెట్‌కే ప్రతిపక్ష బీఆర్ఎస్ భయపడుతోంది.
  • ఇప్పుడే ఇంత భయపడితే ఇంకా నాలుగు సంవత్సరాలు మిగిలి ఉంది.

 

👉 కేటీఆర్ కామెంట్స్‌..

  • రైతు భరోసా బీఆర్ఎస్ 10,000 అంటే కాంగ్రెస్ 15,000 అన్నది.
  • బడ్జెట్లో రైతు భరోసాకు నిధులు ఎందుకు కేటాయించలేదు?
  • రైతులకు 72 వేల కోట్లు రైతుబంధు వేస్తే.. 25000 దుర్వినియోగం అని గగ్గోలు పెడుతున్నారు.
  • కౌలు రైతులకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
  • కౌలు రైతులు కళ్ళల్లో వత్తులు పెట్టుకొని చూస్తున్నారు.
  • అన్ని వడ్లకు 500 బోనస్ అన్నారు.. ఇస్తామనేది సన్న ఒడ్లు మాత్రమే అంటున్నారు.
  • ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ ఫసల్ బీమా యోజన బెకార్ అన్నది‌.
  • సొంత రాష్ట్రం గుజరాత్ ఫసల్ బీమా యోజనలోకి వెళ్లలేదు.
  • ఫసల్ బీమా యోజన మంచిది కాదు అందుకే మేము వెళ్ళలేదు.
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఫసల్ బీమా యోజనలో ఎందుకు చేరుతుందో సమాధానం చెప్పాలి.
  • కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే 16,000 కోట్లు అయ్యాయి.
  • లక్షన్నర వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే 12,000 కోట్లు ఎందుకు అవుతుంది?
  • రుణమాఫీ లబ్ధిదారుల కోతలు కాంగ్రెస్ ప్రభుత్వం కోస్తోంది.
  • ప్రతి విషయంలో కేంద్రంతో తలపడతారు.
  • పీఎం కిసాన్ కండిషన్ పెట్టి రుణమాఫీ ఎలా చేస్తారు?
  • కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసింది.
  • కోటి మందిని కోటీశ్వరులను చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది చేసి తీరాల్సిందే.
  • ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వాలి వాళ్లంతా ఎదురుచూస్తున్నారు.
  • కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వాలి.
  • ప్రతి ఆడబిడ్డకు స్కూటీ ఇస్తా అన్నారు కానీ వాళ్లపై లాఠీలు జులిపిస్తున్నారు.
  • జేఎన్టీయూ హాస్టల్ లో తయారుచేసిన సాంబార్లో ఎలుకలు ఈతలు కొడుతున్నాయి.
     

👉 కేటీఆర్‌ కామెంట్స్‌..

  • రాష్ట్రాన్ని అప్పులపాలు చేశామని తప్పుడు ప్రచారం చేశారు. 
  • రాష్ట్రాన్ని క్యాన్సర్‌, ఎయిడ్స్‌ పేషంట్‌లా పోల్చడం సరికాదు. 
  • ఓట్లకు ముందు అభయహస్తం, ఓట్ల తర్వాత శూన్యహస్తం. 
  • హామీల పత్రాలకు పాతర.. శ్వేతపత్రాల జాతర. 
  • గ్యారెంటీలకు టాటా, లంకెబిందెల వేట
  • విపక్షంలో ఉండగా తెలంగాణ అభివృద్ధిని భట్టి ప్రశంసించారు.
  • ముఖ్యమంత్రి సీట్లోకి భట్టి వెళ్లాలని కోరుకుంటున్నాను.
  • కాంగ్రెస్‌ నాయకులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.
  • ఎన్నో రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మెరుగ్గా ఉంది.
  •  మా హయాంలో సంపదను పెంచాం.
  • కరోనా లాంటి సమయంలోనూ జీతాలు ఆపలేదు.
  • మా పాలనలో రాష్ట్ర సంపద, జీఎస్‌డీపీ పెరిగింది.
  • తెలంగాణ అభివృద్ధి గురించి సోషియో ఎకానమీ అవుట్‌ లుక్‌లో ప్రభుత్వమే చెప్పింది.
  • తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని ప్రభుతమే చెప్పింది.
  • దేశ జీడీపీలో తెలంగాణ రాష్ట్ర పాత్ర పెరిగిందని మీరే చెప్పారు. 
  •  మంత్రులు సభలో చెప్పిన మాటలు తప్పా?
  • బడ్జెట్‌లో ఉన్న లెక్కలు తప్పా చెప్పాలి.
  • లెక్కలతో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు.
  • నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం.
  • ఎన్నో రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అభివృద్ధి అద్భుతం.
  • తెలంగాణ దివాళా తీసిందని అనటం ఎంతవరకు సమంజసం. 

     

భట్టి కామెంట్స్‌..

  • గత ప్రభుత్వంపై సెటైర్లు.
  • రెవెన్యూ రిస్పిట్స్‌ అద్భుతంగా ఉన్నాయి.
  • 2021 నుంచి 2023-24 వరకు ఒకటో తేదీన ఇచ్చే జీతాలు 15వ తేదీ వరకు ఎందుకు జీతాలు ఇవ్వలేదు?
  • ఎందుకు పెండింగ్‌ పెట్టారు?.
  • ఆ నిధులన్నీ ఎటు వెళ్లాయి. 
     

👉 ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.

👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. నేటి సమావేశాల్లో ‍ప్రభుత్వం మరికొన్ని బిల్లులను ప్రవేశపెట్టనుంది.

👉నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం శాసనసభ బిల్లును ఆమోదించనుంది. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం ప్రభుత్వం  2,91,159 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది.

👉డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ప్రారంభిస్తారు.

👉బడ్జెట్‌పై పూర్తిస్థాయిలో వివరణను ఆర్థిక మంత్రి భట్టి సభకు తెలియజేస్తారు.

👉ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రతిపక్ష పార్టీల సభ్యులు చర్చించనున్నారు. అలాగే, ప్రభుత్వ వివరణ ఇవ్వనుంది.

👉అనంతరం ద్రవ్య వినిమయ బిల్లు 2024-25ను సభ ఆమోదించనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement