నేడు కాంగ్రెస్‌ చలో రాజ్‌భవన్‌.. ర్యాలీలో రేవంత్‌, భట్టి సహా.. | Congress Leaders Chalo Raj Bhavan Program In Telangana | Sakshi
Sakshi News home page

నేడు కాంగ్రెస్‌ చలో రాజ్‌భవన్‌.. ర్యాలీలో రేవంత్‌, భట్టి సహా..

Published Wed, Dec 18 2024 7:21 AM | Last Updated on Wed, Dec 18 2024 7:54 AM

Congress Leaders Chalo Raj Bhavan Program In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం జరగనుంది. ఈ నిరసనల్లో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఇందిరా పార్క్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు కాంగ్రెస్‌ నేతలు ర్యాలీగా వెళ్లనున్నారు.

దేశంలో అదానీ, మణిపూర్‌ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై ఏఐసీసీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అమెరికాలో గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాన్ని, పరువును దెబ్బతీశాయని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. అవినీతి, మోసం, మనీలాండరింగ్, మార్కెట్ మానిప్యులేషన్ లాంటి అంశాలలో అదానీ  దేశ ప్రతిష్టను దెబ్బతీశారని తీవ్ర విమర్శలు చేశారు. మణిపూర్‌లో వరుసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలపై మోదీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నేడు నిరసనల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా.. ఉదయం 11 గంటలకు చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్‌ చేసింది. నిరసనల్లో భాగంగా కాంగ్రెస్‌ నేతలు.. ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్‌భవన్‌ వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్‌ మున్షీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement