సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మధ్యంతర నివేదికను ధరణి కమిటీని అందజేసింది. 2020 ఆర్వోఆర్ చట్టంలో లోపాలు ఉన్నాయని సీఎంకు ధరణి కమిటీ నివేదించింది.
సీఎం రేవంత్ మాట్లాడుతూ, ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. 2.45 లక్షల పెండింగ్ సమస్యలను మార్చి మొదటి వారంలో అన్ని ఎమ్మార్వో ఆఫీస్‌లలో సమస్యల పరిష్కారం చూపాలన్నారు. హడావుడి నిర్ణయాలతో కొత్త చిక్కులు వచ్చాయని, ధరణి కమిటీ పూర్తి స్థాయి నివేదిక తర్వాత శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటామన్నారు. 35 మ్యాడ్యూల్స్ ఉన్నప్పటికీ దేనికి దరఖాస్తు చేసుకోవాలో తెలియని పరిస్థితి ఉందని, రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్‌ల శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని సీఎం అన్నారు.
కాగా, ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ)కి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆ పోర్టల్‌ను నిర్వహిస్తోన్న ప్రైవేటు ఏజెన్సీ కాలపరిమితి కూడా ముగియడంతో ఈ బాధ్యతలను ఎన్‌ఐసీకి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతలతో పాటు ధరణి ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారంలోనూ వేగంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదీ చదవండి: తుది దశకు బీజేపీ అభ్యర్థుల జాబితా!
Comments
Please login to add a commentAdd a comment