committee
-
‘ఎమ్మార్ ప్రాపర్టీస్’పై న్యాయ నిపుణుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీ వివాదాలను పరిష్కరించేందుకు న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ అంశంలో 2015లో అప్పటి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిటీకి తోడు అదనంగా ఈ న్యాయ నిపుణుల కమిటీ పనిచేస్తుందన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీ వ్యవహారం వివిధ దర్యాప్తు ఏజెన్సీల కేసులు, చార్జిషీట్లు, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్ ఒప్పందాల డాక్యుమెంట్లు, కోర్టు కేసుల వివరాలతోపాటు కేంద్ర ప్రభుత్వ సూచనలన్నీ క్షుణ్నంగా పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వివిధ కేసుల మూలంగా పెండింగ్‌లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి.. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మార్ ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. న్యాయ వివాదాలను అధ్యయనం చేయడానికి, సామరస్యపూర్వక పరిష్కారానికి యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో ఒక న్యాయ సంస్థ (లీగల్ ఏజెన్సీ)ను ఏర్పాటు చేస్తామని ఎమ్మార్ ప్రతినిధులు ప్రతిపాదించారు. దీనికి సీఎం సమ్మతిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ లీగల్ ఏజెన్సీతోనూ సంప్రదింపులు జరిపి తగు సూచనలు ఇస్తుందన్నారు. ఎమ్మార్‌పై దర్యాప్తులు, విచారణలు: 2001లో ఉమ్మడి రాష్ట్రంలో దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీ హైదరాబాద్‌లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సు, విల్లాలు తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. ఏపీఐఐసీతో ఆ సంస్థ చేసుకున్న ఒప్పందాల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు అప్పట్లో సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏళ్ల తరబడి విచారణలు కొనసాగుతున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015 అక్టోబర్‌లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు సంబంధించిన ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారథ్యంలో ఐదుగురు కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది. -
MATA అధ్యక్షుడిగా రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి
డల్లాస్, టెక్సాస్: అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం 'మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA)' నూతన అధ్యక్షునిగా రమణ కృష్ణకిరణ్ దుద్దాగి ప్రమాణ స్వీకారం చేశారు. డల్లాస్‌లో జరిగిన 'మాటా' నూతన బోర్డు సమావేశంలో రమణ కృష్ణకిరణ్ దుద్దాగి బాధ్యతలు స్వీకరించారు. 2025-2026 వ్యవధికి రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి అధ్యక్షునిగా కొనసాగుతారు.ఈ సందర్భంగా 'మాటా' వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని సలహా మండలి సభ్యుడిగా (Advisory Council Member) బాధ్యతలు స్వీకరించారు. MATA అభివృద్ధి, లక్ష్యాల సాధన కోసం శ్రీనివాస్ గనగోని అనుభవం, మార్గదర్శకత్వం కొనసాగతుందని ఈ సందర్భంగా నూతన బోర్డు తెలిపింది. తెలుగు సమాజ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మాటా సంఘం నూతన నాయకత్వ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తన పదవీకాలంలో MATA అనూహ్యమైన అభివృద్ధి సాధించి, అనేక సమాజాలకు చేరుకుని అవిస్మరణీయమైన ప్రభావాన్ని చూపిందని ఆయన గుర్తుచేశారు. శ్రీనివాస్ గనగోని సలహా మండలి సభ్యులుగా(Advisory Council Member) బాధ్యతలు స్వీకరించి, MATA భవిష్యత్తును మరింత ముందుకు నడిపేందుకు తన అనుభవాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించనున్నారు. 'ది ల్యాండ్' మ్యాగజైన్ (The Land Magazine) వారి 2024-25 "Person of the Year" టైటిల్‌కు ఎంపికై, సత్య నాదెళ్ల, పవన్ కళ్యాణ్ వంటి మహోన్నత వ్యక్తులతో పాటు పురస్కారాన్ని అందుకోవడం, సమాజంపై ఆయన చేసిన గొప్ప ప్రభావానికి ఘనత చాటి చెబుతోంది.అనంతరం వ్యవస్థాపకులు, సలహా మండలి సభ్యులు ప్రదీప్ సమల, జితేందర్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. వారు మాటా పాటించే ముఖ్యమైన విలువలను గురించి తెలుపుతూ, సమాజ సేవ, నాయకత్వంలోని సవాళ్లు, అవకాశాలను వివరించారు. జితేందర్ రెడ్డి 'మాటా' భవిష్యత్ మార్గాన్ని స్పష్టం చేస్తూ, కొత్త నాయకత్వ బృందాన్ని మరింత ముందుకు సాగమని ప్రోత్సహించారు.సేవ, సంస్కృతి, సమానత్వంపై దృష్టిఅధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి భవిష్యత్ కార్యాచరణ విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. ఈ పదవీకాలంలో కీలకమైన ఐదు లక్ష్యాలపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. సేవ: అమెరికాలోని అన్ని తెలుగు కుటుంబాలకు అండగా నిలిచేలా సేవా కార్యక్రమాలను విస్తరించడం. సంస్కృతి: తెలుగు వారసత్వాన్ని కాపాడుతూ, సంస్కృతిని ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం. సమనత్వం: కొత్త ఛాప్టర్లను ప్రారంభించి, సభ్యులకు సమాన అవకాశాలను కల్పించడం.యువశక్తి: యువ నాయకత్వానికి సరైన వేదికలను అందించడం.మహిళా నాయకత్వం: మాటాలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం.ఈ కార్యక్రమంలో 'మాటా' 2026 మహాసభ (MATA Convention) నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఇది తెలుగు సంస్కృతి, వ్యాపారం, యువజన నాయకత్వం, మహిళా సాధికారత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రాముఖ్యత కలిగిన సమ్మేళనం కానుంది. అలాగే, ఇదే వేదికపై 'మాటా ముచ్చట' అనే త్రైమాసిక వార్తా పత్రిక ప్రారంభించారు. ఇది సంస్థ విజయాలను, భవిష్యత్తు కార్యక్రమాలను సభ్యులకు తెలియజేస్తుంది.ఎగ్జిక్యూటివ్ కమిటీ: ప్రెసిడెంట్: రమణ కృష్ణ కిరణ్ దుద్దగి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: ప్రవీణ్ గూడూరు, సెక్రటరీ: విజయ్ భాస్కర్ కలాల్, ట్రెజరర్: శ్రీధర్ గూడాల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: నగేష్ చిలకపాటి, నేషనల్ కోఆర్డినేటర్: టోనీ జన్ను, జాయింట్ సెక్రటరీ: రాజ్ ఆనందేషి, కోమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్: స్వాతి కళ్యాణ రెడ్డి, ప్రోగ్రామ్స్ & ఈవెంట్స్ డైరెక్టర్ బెల్లంకొండ, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్: మహేందర్ నరాల, అడిషనల్ సెక్రటరీ: శ్రీధర్ పెంట్యాల, స్పిరిచువల్ & మెంబర్షిప్ డైరెక్టర్: శిరీషా గుండపనేని, హెల్త్ & వెల్నెస్ డైరెక్టర్: డా. సరస్వతి లక్కసాని, పబ్లిసిటీ పీఆర్ మీడియా: ప్రశాంత్ శ్రీపేరంబుదురు, స్పోర్ట్స్ డైరెక్టర్: సురేష్ ఖజానీ, ఇండియా కోఆర్డినేటర్: డాక్టర్ విజయ్భాకర్ బొలగాం.బోర్డు అఫ్ డైరెక్టర్స్: మల్లిక్ బొల్లా, శ్రీనివాస్ తాటిపాముల, శ్రీనివాస్ గండె, ప్రసాద్ వావిలాల, విజయ్ గడ్డం, రామ్ మోహన్ చిన్నాల, బిందు గొంగటి, హరికృష్ణ నరుకుళ్లపాటి, జ్యోతి బాబు అవుల (జేబీ), బాబా సొంటియాన, రంగ సూరా రెడ్డి, మహేంద్ర గజేంద్ర.హానోరారి అడ్విసోర్స్: డాక్టర్ స్టాన్లీ రెడ్డి, దాము గేదెల, ప్రసాద్ కునిశెట్టి, పవన్ దర్శి, జైదీప్ రెడ్డి, శేఖర్ వెంపరాల, డాక్టర్ హరి ఎప్పనపల్లి, ప్రేమ రొద్దం, బాబురావు సామల, వెంకటేష్ ముత్యాల, నందు బలిజ, డాక్టర్ సునీల్ పారిఖ్, అనిల్ గ్రాంధి, బాలాజీ జిల్లా, రఘు వీరమల్లు, గంగాధర్ వుప్పల. తదితరులు బాధ్యతలు స్వీకరించారు.ఈ వేడుకలో 250 మందికి పైగా సభ్యులు పాల్గొని కొత్త నాయకత్వ బృందానికి మద్దతు తెలిపారు. 'మాటా' వ్యవస్థాపకులు, సలహా మండలి, గౌరవ సలహాదారులు, కార్యవర్గం, బోర్డు సభ్యులు, ప్రాంతీయ ప్రతినిధులు, ఇతర నాయకులు ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా 'మాటా' కొత్త బోర్డు సభ్యులు.. "మనం కలిసే ఎదుగుదాం, మనం కలిసి మార్పు తీసుకువద్దాం..! జయహో మాటా..!" అంటూ నినదించారు. 'మాటా' సేవ, సంస్కృతి, సమానత్వం అనే ప్రధాన విలువలను పాటిస్తూ, అమెరికాలోని తెలుగు సమాజానికి మరింత మద్దతుగా నిలిచేందుకు కృషి చేస్తోంది. -
కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్?
ఢిల్లీ: భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా, నూతన సీఈసీని ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీలో ప్రధాని మోదీ, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘల్, ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు.ఈ కమిటీ సభ్యులు కొత్త సీఈసీని ఎంపిక చేయనున్నారు. నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్ కుమార్.. కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కాగా, మంగళవారం రిటైర్డ్ కానున్న రాజీవ్ కుమార్ సీఈసీగా మే 15, 2022న బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సహా అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలోనే జరిగాయి.ఎన్నికల కమిషనర్.. బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ రాజీవ్ కుమార్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ఎన్నికలు కొత్త సీఈసీ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి.ఇదీ చదవండి: ఢిల్లీ సీఎం ఎంపికలో సర్ప్రైజింగ్ నిర్ణయం! -
కృష్ణా జలాల తాత్కాలిక పంపిణీ బాధ్యత మళ్లీ త్రిసభ్య కమిటీకే
-
యాహ్యా సిన్వార్ మృతి.. హమాస్‌కు చీఫ్ లేనట్లే!
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇటీవల హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతిచెందారు. దీంతో హామాస్‌ను ఎవరు నడిపిస్తారనే అంశంపై చర్చ జరగుతోంది. అయితే చీఫ్ లేకుండా.. దోహ కేంద్రంగా పాలక కమిటీని నియమించే అవకాశం ఉన్నట్లు హమాస్ వర్గాలు తెలిపాయి. మార్చిలో జరగనున్న ఎన్నికల వరకు దివంగత చీఫ్ యాహ్యా సిన్వార్‌కు వారసుడిని నియమించకూడదని హమాస్ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. టెహ్రాన్‌లో రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య అనంతరం ఆగస్టులో ఏర్పడిన ఐదుగురు సభ్యుల కమిటీ హమాస్ గ్రూప్ నాయకత్వాన్ని తీసుకుంది. ఇక.. సిన్వార్ మృతికి ముందు.. గాజాలో ఉన్న ఆయనతో కమ్యూనికేట్ కావటంలో తీవ్ర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హమాస్ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.2017లో హమాస్ గ్రూప్ గాజా చీఫ్‌గా నియమించబడిన సిన్వార్.. జూలైలో హనియే హత్య అనంతరం హమాస్ గ్రూప్ మొత్తానికి చీఫ్‌గా నియమితులయ్యారు. గాజాకు ఖలీల్ అల్-హయ్యా, వెస్ట్ బ్యాంక్‌కు జహెర్ జబరిన్, విదేశాలలో ఉన్న పాలస్తీనియన్ల కోసం ఖలీద్ మెషాల్ చెందిన ప్రతినిధులతో పాలక కమిటీని రూపొందించినట్లు తెలుస్తోంది.ఇక.. ఈ పాలక కమిటీలో హమాస్ షూరా సలహా మండలి అధిపతి మహమ్మద్ దర్విష్, పొలిటికల్ బ్యూరో కార్యదర్శి కూడా ఉన్నారు. అయితే.. వీరిని భద్రతా కారణాల దృష్ట్యా గుర్తించకపోవటం గమనార్హం. కమిటీలోని ప్రస్తుత సభ్యులందరూ ఖతార్‌లో ఉన్నారు. యుద్ధం, అసాధారణమైన పరిస్థితులలో దాడులు, భవిష్యత్తు ప్రణాళికలను నిర్వహించటంపై ఈ కమిటీ బాధ్యత వహిస్తుంది. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ పాలక కమిటీకి అధికారం ఉంటుంది.చదవండి: ఇజ్రాయెల్ దాడులు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్ -
రైతు సమస్యలపై కమిటీ ఏర్పాటు: సుప్రీం
ఢిల్లీ: కనీస మద్దతు ధర, రైతుల ఇతర సమస్యల పరిష్కారానికి సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు సమస్యల పరిష్కారం కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సోమవారం ప్రకటించింది. శంభు సరిహద్దు వద్ద ఉన్న రైతుల దిగ్బంధాన్ని తొలగించాలన్న పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాలపై హర్యానా రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రైతు సమస్యల పరిష్కారానికి పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ అధ్యక్షతన సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. వారంలోగా రైతులతో తొలి చర్చలు జరపాలని కమిటీని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఇక.. రైతులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఢిల్లీ శివారులోని శంభు సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి పంటలకు మద్దతు ధర, ఇతర సమస్యలను పరిష్కారించాలని శంభు బోర్డర్లో రైతులు చేపట్టిన నిరసనలు ఇటీవల 200 రోజులను పూర్తి చేసుకున్నాయి. ఈ నిరసనలో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. -
దేశంలో వైద్య సిబ్బంది భదత్ర కోసం కేంద్ర కమిటీ
న్యూఢిల్లీ: కోల్‌కతా యువవైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత.. దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన బాట పట్టారు. తమపై దాడుల్ని అరికట్టాలంటూ నిరసనలతో రోడ్డెక్కారు. దేశవ్యాప్తంగా ఓపీ సేవలు నిలిపేసి 24 గంటల సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో డాక్టర్ల భద్రత కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ ఫెడరేషన్,ఇండియన్ మెడికల్ అసోషియేషన్, ఢిల్లీ రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ ప్రతినిధులు, కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అధికారుల్ని కలిశారు. ఈ నేపథ్యంలోనే ఈ భద్రతా హామీ ప్రకటన వెలువడింది. ‘‘వైద్య రంగానికి చెందిన ప్రతినిధులు మమ్మల్ని కలిశారు. తమపై జరుగుతున్న దాడులపై వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత, రక్షణ కల్పన ప్రధానాంశాలుగా ప్రస్తావించారు. కేంద్రం ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించదు. ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైద్య వృత్తిలో ఉన్న వాళ్ల భద్రత కోసం ఎలాంటి ప్రమాణాలు పాటించాలి? అనేది ఆ కమిటీ మాకు సూచిస్తుంది. దానిని బట్టి విధివిధానాలను రూపొందిస్తాం. ఇప్పటికే దేశంలో 26 రాష్ట్రాలు వైద్య సిబ్బంది రక్షణ చట్టాల్ని రూపొందించినట్లు మా దృష్టికి వచ్చింది. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది భద్రత కోసం అన్ని విధాల కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం’’ అని తన ప్రకటనలో ఆరోగ్య మంతత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో.. ఒకవైపు దేశంలో డెంగీ, మలేరియా కేసులు పెరిగిపోతున్నాయని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిరసనలకు దిగిన వైద్యులు తమ విధులకు హాజరు కావాలని తన ప్రకటనలో విజ్ఞప్తిచేసింది. వారం కిందట పశ్చిమ బెంగాల్ కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో యువ వైద్యురాలిని అత్యంత కిరాతంగా లైంగిక దాడి జరిపిన హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. వైద్య రంగ సిబ్బంది నేరుగా నిరసనలు తెలుపుతుండగా.. ప్రముఖులు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్టుల ద్వారా ఘటనను ఖండిస్తూ వస్తున్నారు. -
'త్వరలోనే ఆ సినిమా చూస్తా'.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్!
నిహారిక తొలిసారి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. ఈ నెల 10న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతా కొత్త నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. త్వరలోనే కమిటీ కుర్రోళ్లు సినిమా చూస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు.కాగా.. ఈ చిత్రానికి ప్రశంసలతో పాటు సినిమాకు మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సినీతారలు సైతం కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని కొనియాడారు. వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం తొలి రోజున రూ.1.63 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ మూవీలో నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ అంతా కొత్తవారే కావడం విశేషం. ఈ చిత్రానికి యదువంశీ దర్శకత్వం వహించారు.Hearing great things about #CommitteeKurrollu!Congratulations @IamNiharikaK on your debut production and the entire team on its success! Look forward to watching it soon 👍👍 @yadhuvamsi92 @eduroluraju @anudeepdev— Mahesh Babu (@urstrulyMahesh) August 12, 2024 -
పార్లమెంట్ అభ్యర్థులతో భేటీ అయిన కురియన్ కమిటీ
-
గాంధీ భవన్ కు చేరుకున్న కురియన్ కమిటీ
-
ఫలితాలపై పోస్ట్‌మార్టమ్.. గాంధీభవన్‌లో కురియన్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో ఏఐసీసీ ఏర్పాటు చేసిన త్రీ మెన్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. అభ్యర్థులతో విడివిడిగా మాట్లాడుతున్న కురియన్ కమిటీ.. ఒక్కో అభ్యర్థికి 30 నిమిషాలు సమయం కేటాయించింది. తమ వాదన సైతం కురియన్ కమిటీకి వినిపిస్తామంటున్నారు టికెట్ రాని నేతలు.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది.మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో నిజనిర్ధారణ కమిటీలు వేసింది. కురియన్‌తో పాటు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్‌లతో తెలంగాణ కమిటీ ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాల్లో కురియన్ కమిటీ తిరగనుంది.పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందారు? పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాల్లో వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? లోపాలు ఏంటి? వంటి అంశాలపై కురియన్ కమిటీ ఆరా తీస్తోంది. ఓటమికి కారణాలపై వివరాలను కురియన్ కమిటీ అభ్యర్థుల నుంచి సేకరిస్తోంది. -
గాంధీ భవన్ కు కురియన్ కమిటీ
-
తమిళనాట కల్తీ మద్యం కాటు..
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణపురం ప్రాంతం కల్తీ మద్యం బాధితుల రోదనలతో ప్రతిధ్వనిస్తోంది. కల్తీ మద్యం కాటుకు బలైన వారి సంఖ్య 18 నుంచి గురువారం 40కి చేరుకుంది. ఆస్పత్రుల పాలైన బాధితుల సంఖ్య 116కు పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ చెప్పారు. కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోవడం, పెద్ద సంఖ్యలో బాధితులు ఆస్పత్రి పాలైన ఘటన తనకు తీవ్ర వేదన కలిగించిందని సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారని సీఎం చెప్పారు. ఎక్కువ శాతం మిథనాల్ కలిపిన సారాయి తాగడం వల్లే మరణాలు సంభవించినట్లు తేలిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చొప్పున సాయం అందజేస్తామని ప్రకటించారు. పెద్ద సంఖ్యలో సంభవించిన మరణాలకు కారణాలను కనుగొనడంతోపాటు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ బి.గోకుల్దాస్ సారథ్యంలో ఏకసభ్య కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు.16 మంది పరిస్థితి విషమంబుధవారం తమ ఆస్పత్రిలో చేరిన 19 మంది కల్తీ మద్యం బాధితుల్లో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. జిప్మర్తోపాటు సేలం, కళ్లకురిచ్చి, విల్లుపురం ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 34 మంది పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. కల్లకురిచ్చి ఘటనపై సీబీసీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టి ఇప్పటి వరకు 200 లీటర్ల కల్తీ మద్యం పట్టుకున్నారు. అందులో ప్రమాదకర స్థాయిలో మిథనాల్ ఉన్నట్లు తేలింది. -
బెంగాల్లో హింసపై బీజేపీ కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: పశి్చమ బెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో ఎంపీలు బిప్లబ్ కుమార్ దేబ్ కన్వీనర్‌గా, రవిశంకర్ ప్రసాద్, బ్రిజ్ లాల్, కవితా పటీదార్ సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. -
మేడిగడ్డ డిజైన్లలో వైరుధ్యాలెందుకు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పోల్చితే మేడిగడ్డ బ్యారేజీ నిర్మిత స్థలంతోపాటు ర్యాఫ్ట్–ఎగువ/దిగువ కాటాఫ్ వాల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లలో వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయని నీటిపారుదల శాఖలో కీలకమైన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. ఈ విషయంలో సీడీవో తీసుకున్న అంతర్గత నిర్ణయాలకు సంబంధించిన నోట్స్‌ను అందించాలని కోరింది. ‘‘కాఫర్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా నది గర్భంలో పాతిన షీట్‌పైల్స్‌ను మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తిగా తొలగించారా? లేదా? కుంగిపోయిన ఏడో బ్లాక్ పునాదులకు ఎదురుగా కొంతభాగంలో షీట్‌పైల్స్‌ను అలానే వదిలేశారా? అక్కడ భూమి కోతకు గురికావడానికి ఇదే కారణమా?’’ అని నిలదీసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ.. 52 ప్రశ్నలతో సీడీవో విభాగానికి ప్రశ్నావళి అందించి, త్వరగా బదులివ్వాలని కోరింది. ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లపై ఫోకస్ మేడిగడ్డ బ్యారేజీల పునాది (ర్యాఫ్ట్), సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, నిర్మాణంపై అయ్యర్ కమిటీ ప్రధాన దృష్టిసారించింది. బ్యారేజీల్లో లోపాలకు ఇవి కూడా ముఖ్యకారణం కావచ్చన్న చర్చ ఉంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగువ/దిగువ కాటాఫ్లు–ర్యాఫ్ట్ల మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్‌ను అందించాలని సీడీవోను కమిటీ కోరింది. ‘‘జాయింట్లలో లాకింగ్ ఏర్పాట్లున్నాయా? బ్యారేజీలకు రక్షణ కల్పించాల్సిన అప్రాన్ దెబ్బతిని ర్యాఫ్ట్ కుంగిపోతే, సెకెంట్ పైల్స్–ర్యాఫ్ట్ మధ్య జాయింట్లు విరిగిపోవా? మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్ 2.5 మీటర్ల మందం ఉంటే.. ర్యాఫ్ట్–సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్‌గా వేసిన శ్లాబు మందం 1.5 మీటర్లు మాత్రమే ఉంది. నీటి ఒత్తిడిని జాయింట్ ఎలా తట్టుకుంటుంది?.’’ అని ప్రశ్నించింది. దృఢమైన రాతిపై కటాఫ్వాల్స్ను నిర్మిస్తే.. ర్యాఫ్ట్ కుంగిపోయేందుకు ఉన్న అవకాశాలను ఊహించలేదా? అని అడిగింది. బ్యారేజీలను తేలియాడే కట్టడాలుగా డిజైన్ చేశారా? స్థిరంగా ఉండేలా చేశారా అని ప్రశ్నించింది. సీడీవోలో ఎవరేం చేస్తారు? సీడీవోలో చీఫ్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారాల శ్రేణి, బాధ్యతలను, విభాగం నిర్మాణ క్రమాన్ని తెలపాలని కమిటీ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పనలో సీడీవో పాత్ర, ఇతర వివరాలు ఇవ్వాలని అడిగింది. ‘‘బ్యారేజీలకు పరీక్షలను సంతృప్తికర స్థాయిలో జరిపారా? మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్లు చేశారా? లోటుపాట్లు ఏమైనా గుర్తించారా?’’ అని ప్రశ్నించింది. డీపీఆర్, ఆ తర్వాత నిర్మాణ దశల్లో ప్రతి బ్యారేజీ విషయంలో నిర్వహించిన సబ్ సర్ఫేస్ జియోలాజికల్/జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ల వివరాలను అందించాలని కోరింది. డిజైన్ ఉల్లంఘనలేమిటి ? సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్‌ను ఉల్లంఘించి ప్రాజెక్టు నిర్మాణ విభాగం జరిపిన నిర్మాణాలేమిటో తెలపాలని నిపుణుల కమిటీ కోరింది. లేఖలు/ సవరణ డ్రాయింగ్స్ ద్వారా ఆ ఉల్లంఘనలకు తర్వాతి కాలంలో అనుమతి ఇచ్చారా? ఇస్తే ఆ సవరణ డ్రాయింగ్స్ జాబితా ఇవ్వండి అని అడిగింది. ‘‘సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ జారీ చేయడానికి ముందే నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించాయా? దీనివల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో డ్రాయింగ్స్‌ను మళ్లీ సవరించాలనే ఒత్తిడిని సీడీవో ఎదుర్కోవాల్సి వచ్చిందా? బ్యారేజీల నిర్మాణానికి పరిశీలించిన ప్రత్యామ్నాయ స్థలాలేవి? ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు’’ అని ప్రశ్నించింది. బ్యారేజీల గేట్ల నుంచి విడుదలయ్యే వరదతో దిగువన భూమి కోతకు గురవకుండా తగిన మోతాదులో నీరుండేలా టెయిల్ పాండ్‌ను డిజైన్ చేశారా అని.. నిబంధనల ప్రకారమే గేట్లను ఆపరేట్ చేశారా? వివరాలు ఇవ్వాలని కోరింది. -
కాళేశ్వరం అధికారులపై NDSA కమిటీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన అధికారులు, ఇంజనీర్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ చీఫ్, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సీరియస్ అయ్యారు. శనివారం ప్రాజెక్టు పరిశీలన అనంతరం జలసౌధలో జరిగిన కీలక సమావేశంలో ఇది చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు తెలుసుకునే క్రమంలో అధికారుల తీరుపై అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భేటీలో కమిటీ అడిగిన ప్రశ్నలకు.. కొంతమంది అధికారులు క్లారిటీ లేని సమాధానాలిచ్చారు. అలాగే పలు ప్రశ్నలకు సమాధానాలు లేవంటూ నేరుగా చెప్పడంతో కమిటీ నిర్ఘాంతపోయింది. ఈ క్రమంలో.. ఇంజనీర్లు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకోవడంతో చంద్రశేఖర్ అయ్యర్ వాళ్లపై గరం అయ్యారు. ఇలా సమావేశంలో మూడుసార్లు ఆయన అధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం. ఈ మీటింగ్‌లో నీటిపారుదల శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులతో పాటు ఈ మూడు బ్యారేజీలకు పని చేసిన వర్క్ ఏజెన్సీలు పాల్గొన్నాయి. అలాగే.. 2016 నుంచి ప్రస్తుతం (ఈనెల 8వ తేదీ దాకా) బ్యారేజీల ఇన్వెస్టిగేషన్, హైడ్రాలజీ, మోడల్ స్టడీస్, డిజైన్లు, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో పాల్గొన్నవారు.. ఆయా విభాగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారితోపాటు బదిలీ అయినవారు, పదవీ విరమణ చేసినవారు కూడా విధిగా ఈ మీటింగ్‌కు హాజరు కావడంతో ఎన్డీఎస్ఏ కమిటీ కీలక సమాచారాన్నే రాబట్టే ప్రయత్ని చేసినట్లు స్పష్టమవుతోంది. ఇక తమ పర్యటన నేటితో ముగియడంతో ఆరుగురు సభ్యులతో కూడిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) కమిటీ బృందం ఢిల్లీకి పయనం అయ్యింది. అంతకు ముందు.. గురు, శుక్ర వారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కమిటీ సందర్శించింది. భద్రత నడుమ.. కుంగిన ప్రాంతాలను పరిశీలించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించింది. నాలుగు నెలల్లో ఈ కమిటీ తమ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. -
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర కమిటీ
-
సీఎం రేవంత్‌రెడ్డికి ధరణి కమిటీ మధ్యంతర నివేదిక
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మధ్యంతర నివేదికను ధరణి కమిటీని అందజేసింది. 2020 ఆర్వోఆర్ చట్టంలో లోపాలు ఉన్నాయని సీఎంకు ధరణి కమిటీ నివేదించింది. సీఎం రేవంత్ మాట్లాడుతూ, ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. 2.45 లక్షల పెండింగ్ సమస్యలను మార్చి మొదటి వారంలో అన్ని ఎమ్మార్వో ఆఫీస్‌లలో సమస్యల పరిష్కారం చూపాలన్నారు. హడావుడి నిర్ణయాలతో కొత్త చిక్కులు వచ్చాయని, ధరణి కమిటీ పూర్తి స్థాయి నివేదిక తర్వాత శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటామన్నారు. 35 మ్యాడ్యూల్స్ ఉన్నప్పటికీ దేనికి దరఖాస్తు చేసుకోవాలో తెలియని పరిస్థితి ఉందని, రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని సీఎం అన్నారు. కాగా, ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆ పోర్టల్‌ను నిర్వహిస్తోన్న ప్రైవేటు ఏజెన్సీ కాలపరిమితి కూడా ముగియడంతో ఈ బాధ్యతలను ఎన్ఐసీకి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతలతో పాటు ధరణి ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారంలోనూ వేగంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదీ చదవండి: తుది దశకు బీజేపీ అభ్యర్థుల జాబితా! -
ఎన్ఐసీ చేతికి ధరణి?
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆ పోర్టల్‌ను నిర్వహిస్తోన్న ప్రైవేటు ఏజెన్సీ కాలపరిమితి కూడా ముగియడంతో ఈ బాధ్యతలను ఎన్ఐసీకి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతలతో పాటు ధరణి ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారంలోనూ వేగంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధరణి కమిటీ సభ్యులు, రెవెన్యూ అధికారులు, వక్ఫ్, దేవాదాయ, అటవీశాఖల అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్‌పీటర్, నవీన్‌మిత్తల్, మధుసూదన్ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే 22 అంశాలతో నివేదికను ప్రభుత్వానికి ఇచి్చనట్టు తెలుస్తోంది. ఈ అంశాలపై శనివారం జరగనున్న సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. చేవ్రాలే... ప్రాతిపదిక ఈ సమావేశంలో భాగంగా ధరణి పోర్టల్ ద్వారా వచ్చి పెండింగ్‌లో ఉన్న 2.46లక్షల దరఖాస్తులను ఎలా పరిష్కరించాలి? భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పార్ట్–బిలో చేర్చిన 13.5లక్షల ఎకరాల కు సంబంధించిన భూముల సమస్యలను ఎలా నివృత్తి చేయాలి? అన్న దానిపై నిర్ణయాలు తీసుకో నున్నారు. దీంతో పాటు ధరణి సమస్యల పరిష్కారానికి ఆన్లైన్లో ఉన్న అస్తవ్యస్త రికార్డులను కాకుండా మాన్యువల్ పహాణీలను ప్రాతిపదికగా తీసుకునే అంశంపై కూడా చర్చించనున్నారు. రెవెన్యూ–అటవీ, రెవెన్యూ–దేవాదాయ, రెవెన్యూ–వక్ఫ్ శాఖల మధ్య అంతరాలు ఉన్న భూములపై కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలిసింది. వీటితో పాటు ధరణి దరఖాస్తులు జిల్లా కలెక్టర్ స్థాయిలో కాకుండా ఆర్డీవో, తహశీల్దార్ స్థాయిలోనే పరిష్కారమయ్యేలా అధికార వికేంద్రీకరణపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్వోఆర్ చట్టంలో ఎలాగూ ఈ అధికారాలు కలెక్టర్లకు బదలాయించకపోవడంతో చట్ట సవరణ కూడా అవసరం లేదని, అధికారిక ఉత్తర్వులతో ఈ వికేంద్రీకరణ సాధ్యమవుతుందని భావిస్తున్నారు. మొత్తంగా నేడు జరగనున్న కీలక సమీక్షలో ధరణి పోర్టల్‌కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. -
విసిగిస్తున్న కాల్స్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ప్రమోషనల్ లేదా అవాంఛిత కాల్స్ సమస్య పరిష్కారానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఫిబ్రవరి 14న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో టెలికం శాఖ, ఆర్థిక సర్వీసుల విభాగం, గృహ .. పట్టణ వ్యవహారాల శాఖ, రిజర్వ్ బ్యాంక్, బీమా రంగ నియంత్రణ .. అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ), టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) సహా పరిశ్రమ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. మరోవైపు, అవాంఛిత కాల్స్ అనేవి యూజర్ల గోప్యతకు మాత్రమే కాకుండా వారి హక్కులకు కూడా భంగం కలిగిస్తాయని సమావేశంలో పాల్గొన్న వారు అభిప్రాయపడినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సేవల సంస్థలు.. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి ఇలాంటి కాల్స్ ఎక్కువగా ఉంటున్నాయని గుర్తించినట్లు తెలిపింది. అంతే కాకుండా కస్టమర్లను పోంజీ స్కీములు, క్రిప్టో పెట్టుబడుల వైపు ఆకర్షించేందుకు స్పామ్ కాలర్లు ఇప్పుడు వాట్సాప్ మొదలైన యాప్స్ ద్వారా ఇంటర్నెట్ కాల్స్ కూడా చేస్తున్నట్లు వివరించింది. రిజిస్టర్డ్ టెలీమార్కెటర్ల నుంచి స్పామ్ మెసేజీలు, అవాంఛిత కాల్స్ సమస్యను పరిష్కరించేందుకు టెలికం శాఖ, ట్రాయ్ ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. -
SC: ఎస్సీ వర్గీకరణకు కేంద్ర కమిటీ ఏర్పాటు
ఢిల్లీ: ఎస్సీల(Scheduled Castes communities) వర్గీకరణ విషయంలో కేంద్రం ముందడుగు వేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం, న్యాయ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో..పరేడ్ గ్రౌండ్స్‌లో ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ సమయంలో కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నెల 22న కమిటీ తొలిసారి భేటీ కానున్నట్లు సమాచారం. On the directions of PM, a Committee of Secretaries constituted under the Chairmanship of Cabinet Secretary to examine the administrative steps that can be taken to safeguard the interests of Scheduled Castes communities, like the Madigas and other such groups, who have… — ANI (@ANI) January 19, 2024 -
జమిలి ఎన్నికలు... కోవింద్ కమిటీకి 5,000 సూచనలు
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఏర్పాటైన ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ కమిటీకి ప్రజల నుంచి ఇప్పటిదాకా 5,000 పై చిలుకు సలహాలు, సూచనలు అందినట్టు సమాచారం. కమిటీ దీనిపై గతవారం సలహాలను ఆహా్వనించడం తెలిసిందే. జనవరి 15 దాకా అందే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. గత సెపె్టంబర్లో ఏర్పాటైన కోవింద్ కమిటీ ఇప్పటిదాకా రెండుసార్లు సమావేశమైంది. జమిలి ఎన్నికలపై సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ ఆరు జాతీయ, 33 గుర్తింపు పొందిన పారీ్టలకు లేఖలు రాసింది. లా కమిషన్‌తో సమావేశమై అభిప్రాయాలను తెలుసుకుంది. జమిలి ప్రతిపాదనను, కోవింద్ కమిటీ ఏర్పాటును కాంగ్రెస్, పలు ఇతర విపక్షాలు ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. -
‘అద్దె బస్సు’ డిమాండ్లు పరిశీలిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అద్దె బస్సు నిర్వాహకుల డిమాండ్లను పరిశీలించి వాటి అమలు సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. వారం రోజుల్లో నివేదికను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చాక రద్దీ విపరీతంగా పెరగటంతో ఐదు రకాల సమస్యలు ఎదురవుతు న్నాయని, వాటిని పరిష్కరించాలంటూ కొద్దిరోజులుగా అద్దె బస్సు యజ మానులు కోరుతున్నారు. అయినా ఆర్టీసీ స్పందించటం లేదని ఆరో పిస్తూ శుక్రవారం నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. గురువారం ఉదయం అద్దె బస్సు యజమానుల సంఘం ప్రతినిధులు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ అయి సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఆయన వెంటనే ఎండీతో మాట్లాడి, సంఘం ప్రతినిధులతో చర్చించాలని స్పష్టం చేశారు. చర్చలు జరిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంత్రి ఆదేశాల మేరకు బస్‌భవన్‌లో ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులతో కలిసి సంఘం ప్రతినిధులతో చర్చించారు. బస్సుల్లో రద్దీ ఎక్కువై డీజిల్ వినియోగం పెరిగినందున కేఎంపీల్ను జిల్లా సర్వీసుల్లో 4.50కి, సిటీలో 4కు మార్చాలని, టైర్లు ఎక్కువగా అరుగుతున్నందున ఆర్టీసీకి అందించే బల్క్ ధరలకే తమకూ కొత్త టైర్లు కేటాయించాలని, ఓవర్ లోడింగ్‌తో నిర్వహణ ఖర్చులు పెరిగినందున అద్దె మొత్తాన్ని రూ.3 చొప్పున పెంచాలని వారు కోరారు. దీనిపై కమిటీ వేసి అమలు సాధ్యాసాధ్యా లపై నిర్ణయం తీసుకుంటామని ఎండీ సజ్జనార్ వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు సమ్మె ప్రతిపాదనను సంఘం ప్రతినిధులు విరమించుకున్నట్టు సమావేశానంతరం ఎండీ ప్రకటించారు. యధావిధిగా బస్సులు నడుస్తాయని, సంక్రాంతికి ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉంటాయని, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఇబ్బందుల్లేకుండా కొనసాగుతుందని వెల్లడించారు. సమావేశంలో ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, వినోద్, అధికారులు మైపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి సహా పలువురు బస్సు యజమానుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణపై కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. శుక్రవారం కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా, ఇతర సీనియర్ అధికారులతో ఈ మేరకు ఆయన కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ఇటీవల హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వరూప మహాసభలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనడం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణకు, మాదిగల సాధికారతకు సాధ్యమైన మార్గాలపై కేంద్రం త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఎమ్మారీ్పఎస్ పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా మందకృష్ణ చేస్తున్న ప్రతి పోరాటానికీ బీజేపీ మద్దతుగా నిలించిందని ఆయన పేర్కొన్నారు. ‘‘మీది న్యాయ పోరాటం. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలనే మాదిగ ఉప కులాల కోరిక అత్యంత న్యాయమైనది. మీకు జరుగుతున్న అన్యాయానికి వీలైనంత త్వరగా అడ్డుకట్ట వేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. ఇందుకోసం వెంటనే కమిటీ వేస్తామని హమీ ఇస్తున్నా. ఈ విషయమై సుప్రీంకోర్టులో కూడా ఇప్పటికే న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది’’ అని ఆయన చెప్పారు. కాగా, నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ శనివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ చర్చనీయంగా మారింది. -
కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీపై కేంద్రం ఆందోళన.. ఆరుగురు నిపుణులతో కమిటీ
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీ పై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం హైదరాబాద్‌లోని రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులతో నిపుణుల కమిటీ సమావేశం కానున్నారు. రేపు(మంగళవారం) కాళేశ్వరం డ్యామ్‌ను కేంద్ర బృందం సందర్శించనుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి అధికారుల బృందం నివేదిక సమర్పించనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ మరికాస్త కుంగింది. శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి, 7వ బ్లాక్‌లోని 20వ పియర్ వద్ద దిగువన పగుళ్లు ఏర్పడ్డాయి. దీనితో బ్యారేజీపై ఉన్న వంతెన కుంగి ప్రమాదకరంగా మారింది. వంతెనపై సైడ్ బర్మ్ గోడ, ప్లాట్‌ఫారంతోపాటు రోడ్డు సుమారు 2, 3 ఫీట్ల మేర కుంగిపోయాయి. దీనితో బ్యారేజీ గేట్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని అంచనా. చదవండి: సీఎం కేసీఆర్ ధైర్యం అదేనా? -
నేటి నుంచి విశాఖలో త్రిసభ్య కమిటీ పర్యటన
విశాఖపట్నం: నీతి అయోగ్ గ్రోత్ హబ్ సిటీ, రాజధాని వసతులు, సౌకర్యాల పరిశీలనకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ బృందం సోమవారం నుంచి విశాఖలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. విశాఖలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో రుషికొండలోని ఐటీ హిల్స్‌లో ఏర్పాట్లను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్‌లతో ఓ బృందాన్ని నియమించిందని ఈ కమిటీ ఇప్పటికే పని ప్రారంభించిందనీ.. క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించనుందని తెలిపారు. -
5న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: వర్షాభావ పరిస్థితులవల్ల దిగువ కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి నిల్వలు కనిష్టంగా ఉన్న నేపథ్యంలో మే 31 వరకూ తాగునీటి అవసరాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లో అక్టోబర్ 5న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని కృష్ణా బోర్డు నిర్వహించనుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి మే 31 వరకూ తాగునీటి అవసరాలకు ఎన్ని నీళ్లు అవసరమో అక్టోబర్ 3లోగా ప్రతిపాదనలు పంపాలని రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు కోరింది. కమిటీలో సభ్యులందరూ ఈ సమావేశంలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి లభ్యతను బట్టి, రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకుని నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డుకు సిఫార్సు చేయడానికి సభ్య కార్యదర్శి కన్వీనర్‌గా రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా త్రిసభ్య కమిటీని కృష్ణాబోర్డు ఛైర్మన్ ఏర్పాటుచేశారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో మొదటిసారిగా జూలైలో సమావేశమైన త్రిసభ్య కమిటీ.. తాగునీటి అవసరాల కోసం రెండు ప్రాజెక్టుల నుంచి 12.7 టీఎంసీలను విడుదల చేయాలని సిఫార్సు చేయడంతో ఆ మేరకు నీటి విడుదల ఉత్తర్వులను జూలై 21న కృష్ణా బోర్డు జారీచేసింది. ఆ తర్వాత ఆగస్టు 21, 24న త్రిసభ్య కమిటీ రెండోసారి సమావేశమైంది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటినిల్వ తక్కువగా ఉన్న నేపథ్యంలో.. తాగునీటి అవసరాల కోసం నిల్వచేయాలని రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. తాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలపై సంప్రదింపులు జరపకపోవడంతో అప్పట్లో నీటి విడుదల ఉత్తర్వులను కృష్ణాబోర్డు జారీచేయలేదు. ఇదే అంశాన్ని కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ దృష్టికి సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తీసుకెళ్లారు. తక్షణమే త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించి.. రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలను చర్చించి.. నీటి కేటాయింపులకు సిఫార్సు చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్ ఆదేశించారు. దాంతో అక్టోబర్ 5న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తెలిపారు. -
అవి డొల్ల కమిటీలేనా?
సాక్షి, హైదరాబాద్: సంస్థాగతంగా పార్టీ పటిష్టతకు, ఎన్నికల్లో బూత్‌ల వారీగా పైచేయి సాధనకు పోలింగ్‌బూత్ కమిటీలే కీలకమని బీజేపీ గట్టిగా విశ్వసిస్తోంది. అయితే పార్టీకి పోలింగ్‌బూత్ కమిటీలే బలమనుకుంటే.. చాలా చోట్ల బూత్‌కమిటీ అధ్యక్షులే లేరని, కమిటీ సభ్యుల్లో చాలా మంది చురుకుగా పనిచేయడం లేదని ముఖ్యనేతల పరిశీలనలో వెల్లడైనట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు పర్యటించిన సందర్భంగా వారు రూపొందించిన నివేదికల్లోనూ ఇదే విషయం బయట పడిందని వెల్లడైంది. ఈ నివేదికలు, ఇతరత్రా అందిన సమాచారం మేరకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితి, పోలింగ్ బూత్ కమిటీల తీరు గురించి క్రాస్ చెక్ చేసినపుడు కూడా ఇదే విషయం తేలడంతో పార్టీ ముఖ్యనేతలకు కలవరం మొదలైందని సమాచారం. బూత్ కమిటీల్లో చాలాచోట్ల పోలింగ్ బూత్ అధ్యక్షులే లేరని, ఈ జాబితాల్లో పేర్లు ఉన్న వారిలో చాలామంది ప్రస్తుతం చురుకుగా పనిచేయకపోవడం, పలుచోట్ల బూత్ కమిటీ సభ్యులు కూడా మొక్కుబడిగా పనిచేయడం, పార్టీలో లేనివారి పేర్లు కమిటీల్లో చోటుచేసుకోవడం వంటివి బయటపడడంతో అర్జంట్‌గా ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు నాయకత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి పరిశీలనకు 450 మంది.. రాష్ట్రంలో బూత్‌కమిటీల నియామకానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. ఈ నెల 26 నుంచి 19 రోజులపాటు రాష్ట్రంలో మూడుచోట్ల నుంచి బస్సు (రథ)యాత్రలు ప్రారంభించి, అక్టోబర్ 14న హైదరాబాద్‌లో ముగింపు సందర్భంగా ప్రధాని మోదీని ఆహ్వానించి బహిరంగసభ నిర్వహించాలని ముఖ్యనేతలు నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉండగా పోలింగ్ బూత్‌కమిటీలు సరిగా లేకపోవడమే దీనికి కారణమని విశ్వసనీయ సమాచారం. బూత్ కమిటీలు సక్రమంగా లేకుండా బస్సుయాత్రలు ఎలా విజయవంతం అవుతాయని బన్సల్ రాష్ట్రనేతలను నిలదీసినట్టు తెలిసింది. దీనిని సీరియస్ తీసుకున్న బన్సల్.. ఈ నెల 26 నుంచి వచ్చేనెల 2 దాకా రెండేసి మండలాల చొప్పున పరిశీలించి నివేదికల సమర్పణకు 450 మందిని క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధం చేసినట్టు పార్టీవర్గాల సమాచారం. వారికి అప్పగించిన మండలాలలో బూత్ కమిటీ అధ్యక్షుడు ఉన్నాడా, కమిటీలు ఉన్నాయా, శక్తి కేంద్ర ఇన్చార్జి ఉన్నాడా, మండల కమిటీ ఉందా, ఎంత మందితో ఉంది.. వంటి అంశాలను వారు లోతుగా పరిశీలించనున్నారు. రాష్ట్ర పార్టీ సిద్ధం చేసిన నమూనాకు అనుగుణంగా పోలింగ్‌బూత్ అధ్యక్షులు, కమిటీలపై వీరు నివేదికను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జిలతో మాట్లాడిన బన్సల్.. రాజకీయ కార్యక్రమాలను తగ్గించి సంస్థాగత విషయాలపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్టు తెలిసింది. చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని పక్షంలో పార్టీ మండలా«ద్యక్షులను కూడా మార్చాలని, బూత్‌కమిటీలకు కొత్త అధ్యక్షులను నియమించాలని ఆయన సూచించినట్టు తెలిసింది. -
'ఒకే దేశం ఒకే ఎన్నికలు' కమిటీ మొదటి సమావేశానికి డేట్ ఫిక్స్!
న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే ఎన్నికలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన వేసిన కమిటీ తొలిసారి అధికారికంగా సమావేశం కానుంది. ఈ సమావేశానికి సెప్టెంబర్ 23న ముహూర్తం ఖరారైంది. ముహూర్తం ఫిక్స్.. కొద్ది రోజుల క్రితం ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చిన కేంద్రం అనుకుందే తడవు హుటాహుటిన ఈ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాయాలు గురించి అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని కీలక సభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, న్యాయశాఖ కార్యదర్శి నితిన్ చంద్ర సహా ఇతర ముఖ్య నేతలు సెప్టెంబర్ 6న సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి అధికారిక సమావేశాన్ని సెప్టెంబర్ 23న నిర్వహించాలని నిర్ణయించింది కమిటీ. కమిటీ కర్తవ్యం ఏమిటి? అయితే ఈ నెల 23న జరిగే సమావేశంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయమై ప్రాధమిక కార్యాచరణ గురించి చర్చించనున్నారు. దీని కోసం రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా ఒకవేళ ఉంటే వాటి గురించి పూర్తిస్థాయి అధ్యయనం చేసి కేంద్రానికి నివేదించనున్నారు. రాజ్యాంగంతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం లేదా ఇతర చట్టాల సవరణలు చేయాల్సి ఉందా అన్న అంశాలపై కూడా గురించి చర్చించనున్నారు. ఉన్నతస్థాయి కమిటీ.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షత వహించనున్న ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ లోక్‌సభ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, మాజీ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్, మాజీ లోక్‌సభ సెక్రెటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి సభ్యులుగా ఉన్నారు. కేంద్ర న్యాయ శాఖా మంత్రి అర్జున్ మేఘవాల్ ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశాలకు హాజరు కానుండగా న్యాయ శాఖ కార్యదర్శి నితిన్ చంద్ర ఈ ప్యానెల్‌కు సెక్రెటరీగా వ్యవహరించనున్నారు. పార్లమెంట్ సెషన్ ముగిసిన వెంటనే! ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు పూర్తైన మరుసటి రోజునే ఈ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏకకాలంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడంపైనే ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరగనుందని పుకార్లు చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ కమిటీ సమావేశాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. #WATCH | On the 'One Nation, One Election' committee, former President and chairman of the committee, Ram Nath Kovind says "The First meeting will take place on 23rd September" pic.twitter.com/FU1gvzMi7j — ANI (@ANI) September 16, 2023 ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? -
తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఒక్క శాతమే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయని తెలిసే తెలంగాణ ప్రకటించారని, సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారంటే భారతదేశానికి బ్రిటిష్ వారు స్వాతంత్య్రం ఇచ్చారని చెప్పినంత దరిద్రంగా ఉంటుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడారో కేటీఆర్ తెలుసుకుని మాట్లాడాలని, పనికిమాలిన మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదని, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజమని నాడు కేసీఆర్ ఆన్ రికార్డు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఎంపీ కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తెలంగాణ కావాలని.. ‘మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ. వైఎస్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నాతో సహా 41 మంది ఎమ్మెల్యేలం తెలంగాణ కావాలని అడిగినందుకే ప్రణబ్‌ముఖర్జీ కమిటీ వేశారు. అప్పుడు కేటీఆర్ రాజకీయాల్లో లేడు. అమెరికాలో ఉన్నాడు. ఆ తర్వాత కేసీఆర్‌కు చంద్రబాబు మంత్రిపదవి ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఊరుకోం.’ అని కోమటిరెడ్డి హెచ్చరించారు. వాళ్లకు టికెట్లు క్యాన్సిల్ చేయండి కట్టె పట్టుకుని తెలంగాణ ఉద్యమకారులను కొట్టిన దానం నాగేందర్, కేసీఆర్‌ను ఫుట్బాల్లా తంతానన్న తలసాని శ్రీనివాస్‌యాదవ్, పట్నం మహేందర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ... ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా చాలా ఉందని, ఈ మంత్రులను ముందు కేబినెట్ నుంచి తొలగించి, తెలంగాణ ఉద్యమ ద్రోహులకు ఇచ్చిన టికెట్లను క్యాన్సిల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బానిసత్వ పార్టీ ఎవరిదో అందరికీ తెలుసునని, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి మహమూద్‌అలీలు ప్రగతిభవన్ వరకు వస్తే 100 కిలోమీటర్ల స్పీడ్‌తో వెనక్కు పంపింది ఎవరని ప్రశ్నించారు. ప్రగతిభవన్ లోపలికి రానివ్వకపోతే ఏడ్చానని రాజేందర్ చెప్పారని గుర్తు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు సర్పంచ్ కూడా ఆయనను సులువుగా కలవగలిగేవారని చెప్పారు. ఎన్నికల ఆలస్యంపై కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం రాష్ట్రంలో ఎన్నికలు ఆలస్యమవుతాయని, ఫిబ్రవరి వరకు తీసుకెళ్తారని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పద మని కోమటిరెడ్డి చెప్పారు. బీజేపీతో అమిత్‌షాతో భేటీ అయి కవితను జైలుకు పంపవద్దని ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇప్పుడు ఆయన ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తాయని చెప్పకపోతే తమకు తెలియదా? అని వ్యాఖ్యానించారు. -
బీజేపీ ఇన్చార్జీ కమిటీల నియామకం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర బీజేపీ వివిధ కమిటీల నియామకాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే కొన్ని కమిటీలను ఏర్పాటు చేయగా తాజాగా 17 లోక్‌సభ స్థానాలకు ‘పార్లమెంట్ ప్రభారీలు’ (ఇన్చార్జీలు), 33 జిల్లాలకు ఇన్చార్జీలను నియమించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆయా కమిటీల సభ్యలను నియమించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ప్రభారీలు వీరే... ఆదిలాబాద్–అల్జాపూర్ శ్రీనివాస్, పెద్దపల్లి–విశ్వవర్ధన్రెడ్డి, కరీంనగర్–పి.గంగారెడ్డి, నిజామాబాద్–వెంకటరమణి, జహీరాబాద్–బద్దం మహిపాల్‌రెడ్డి, మెదక్–ఎం.జయశ్రీ, మల్కాజిగిరి–ఎ.పాపారావు, సికింద్రాబాద్–దేవకి వాసుదేవరావు, హైదరాబాద్–గోలి మధుసూదన్‌రెడ్డి, చేవెళ్ల–పి,సుగుణాకరరావు, మహబూబ్‌నగర్–వి.చంద్రశేఖర్, నాగర్‌కర్నూల్– ఎడ్ల ఆశోక్‌రెడ్డి, నల్లగడొండ–చాడ శ్రీనివాసరెడ్డి, భువనగిరి–అట్లూరి రామకృష్ణ, వరంగల్–వి.మురళీథర్గౌడ్, మహబూబాబాద్–ఎన్.వెంకటనారాయణరెడ్డి, ఖమ్మం–కడగంచి రమేశ్. జిల్లా ఇన్చార్జీలు వీరే... ఆదిలాబాద్–బద్దం లింగారెడ్డి, నిర్మల్–ఎం. మల్లారెడ్డి, కొమురం భీమ్–ఎం.మహేశ్‌బాబు, నిజామాబాద్–కళ్లెం బాల్‌రెడ్డి, కామారెడ్డి–ఎర్ర మహేశ్, కరీంనగర్– మీసాల చంద్రయ్య, జగిత్యాల– చంద్రశేఖర్, పెద్దపల్ల–రావుల రాంనాథ్, రాజన్న సిరిసిల్ల–జి.మనోహర్‌రెడ్డి, సంగారెడ్డి–జె.రంగారెడ్డి, మెదక్–డా.ఎస్.మల్లారెడ్డి, రంగారెడ్డి రూరల్–పి.అరుణ్ కుమార్, వికారాబాద్–వి.రాజవర్ధన్‌రెడ్డి, మేడ్చల్ అర్బన్–గిరిమోహనశ్రీనివాస్, మేడ్చల్ రూరల్– వి.నరేందర్‌రావు, నల్లగొండ–ఆర్.ప్రదీప్‌కుమార్, యాదాద్రి– జె.శ్రీకాంత్, మహబూబ్‌నగర్ కేవీఎల్ఎన్ రెడ్డి, వనపర్తి–బోసుపల్లి ప్రతాప్, నాగర్‌కర్నూల్–టి.రవికుమార్, గద్వాల–బి.వెంకటరెడ్డి, నారాయణపేట–కె.జంగయ్య యాదవ్, హనుమకొండ–అడ్లూరి శ్రీనివాస్, వరంగల్– కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, భూపాలపల్లి–ఎస్.ఉదయ్ ప్రతాప్, జనగామ–యాప సీతయ్య, మహబూబాబాద్–బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ములుగు– ఎ.వెంకటరమణ, ఖమ్మం–ఎస్.విద్యాసాగర్‌రెడ్డి, కొత్తగూడెం–ఆర్.రుక్మరాజు, గోల్కొండ–గోషామహల్–ఎస్.నందకుమార్‌యాదవ్, మహంకాళి–సికింద్రాబాద్–నాగూరావు నామాజీ, హైదరాబాద్ సెంట్రల్– టి.అంజన్‌కుమార్‌గౌడ్. -
ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియాలి
జైపూర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు జనాభాగణన పూర్తిచేయకుండా 'ఒకే దేశం ఒకే ఎన్నికలకు పిలుపునివ్వడమంటే ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమే అన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ఇక రాజస్థాన్‌లో అయితే ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారని బీజేపీ ఎవరితో పెట్టుకుంటున్నారన్న విషయం వారికి తెలియాలని అన్నారు. అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగం చిన్నాభిన్నమైందని నేను ఎప్పటి నుంచో చెబుతునే ఉన్నాను. ఈరోజు దేశంలో జరిగేవన్నీ చూస్తుంటే దేశం ఎటువైపు వెళ్తుందో కూడా చెప్పడం కష్టమేనని.. ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్రం ప్రతిపక్షాల అభిప్రాయం కూడా అడిగి ఉంటే బాగుండేదని కానీ వారు ఎవరి అభిప్రాయాన్ని అడగకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఇక మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రస్తావన తీసుకొస్తూ అసలు ఇలాంటి కమిటీలో మాజీ రాష్ట్రపతి భాగస్వామి కావడం నేనింత వరకు ఎప్పుడు వినలేదు, చూడలేదని అన్నారు. ఇందులోకి అనవసరంగా ఆయనను లాగుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చే హక్కు ఉంది కానీ ప్రజలకు కారణం చెప్పాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఇక రాజస్థాన్ ప్రజలైతే మళ్లీ కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చేశారని అసలు వారు ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియాలని ఘాటుగా స్పందించారు. ఇది కూడా చదవండి: ఆర్టికల్ 370 రద్దుపై విచారణ.. తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీం -
విడివిడిగా.. కూలంకషంగా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సమావేశమయ్యారు. గాందీభవన్‌లో సోమవారం ఉదయం 11గంటల నుంచి రాత్రి వరకు ఈ భేటీలు కొనసాగాయి. ప్రతి నాయకుడితో వేర్వేరుగా 10 నిమిషాలకు పైగా మాట్లా డిన మురళీధరన్, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అభిప్రాయ సేకరణ చేశారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మె ల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను, మీ నాన్న ఫ్రెండ్స్: పొన్నాల మురళీధరన్‌ను కలిసిన సందర్భంగా ఆయన తండ్రి, కేరళ మాజీ సీఎం కరుణాకరన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని పొన్నాల గుర్తు చేసుకున్నారు. తాను మత్స్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేరళతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు రుణం తీసుకువచ్చామని, ఆ తర్వాతే రెండు రాష్ట్రాల్లో రొయ్యల పరిశ్రమ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. పార్టీలో పరిస్థితులు, టికెట్ల ఖరారులో పాటించాల్సిన సామాజిక సమతుల్యత గురించి వారు చర్చించినట్టు సమాచారం. బీసీలకు టికెట్ల కేటాయింపులో ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై వీహెచ్ చర్చించినట్టు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న సిద్దిఖీ కూడా సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ భేటీల్లో పాల్గొనగా, మరో సభ్యుడు, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ కోర్టు కేసుల కారణంగా రాలేకపోయారని, మంగళవారం వస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. జగ్గారెడ్డి లేఖ: పీసీసీ మాజీ అధ్యక్షులకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలి్పంచాలని, పార్టీ అనుబంధ సంఘాలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనివ్వాలని మురళీధరన్‌ను జగ్గారెడ్డి కోరారు. టికెట్ల కేటాయింపు విషయంలోనూ పీసీసీ మాజీ అధ్యక్షుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ లేఖ ఇచ్చారు. నేడు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఈనెల 16, 17 తేదీల్లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు మంగళవారం టీïపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పీసీసీ సభ్యులందరూ విధిగా హాజరు కావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నమ్మకం నిలబెట్టుకుంటాం: రేవంత్ ట్వీట్ సీడబ్ల్యూసీ తొలి సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అంగీకరించిన పార్టీ అధిష్టానానికి రేవంత్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, సమావేశాలను విజయవంతం చేస్తామంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. బీసీలు ఎందుకు గెలవడం లేదు? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పాటించాల్సిన సామాజిక సమతుల్యతపై ఈ భేటీల్లో ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలిసింది. 1989 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా తెలంగాణలోని మొత్తం అసెంబ్లీ సీట్లలో 50 శాతం సీట్లు ఎప్పుడూ రాలేదని, ఇందుకు కాంగ్రెస్ పార్టీని వెనుకబడిన వర్గాలు అక్కున చేర్చుకోకపోవడమే కారణమని కొందరు వివరించారు. తొలుత తెలుగుదేశం, ఆ తర్వాత బీఆర్ఎస్ వైపు బీసీలు మొగ్గుచూపుతున్నారని, అత్యధిక సంఖ్యలో ఉండే బీసీల హృదయాల్లో చోటు సాధించని కారణంగానే కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురవుతోందని చెప్పారు. దీంతో ‘బీసీలకు సీట్లు ఇస్తే ఎందుకు గెలవడం లేదు?’అని మురళీధరన్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాగా ఓ ముఖ్య నాయకుడు బదులిస్తూ.. కాంగ్రెస్ పార్టీలోనే అలా జరుగుతోందని, మిగిలిన పార్టీల నుంచి బీసీ నేతలు గెలుస్తున్నారని, ఇందుకు కారణం ఏంటనేది సమీక్షించుకోవాల్సింది పార్టీయేనని చెప్పినట్టు సమాచారం. ఇక రెడ్డి సామాజిక వర్గంలోని గ్రూపు గొడవలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమవుతున్నాయని ఓ నేత వివరించినట్టు సమాచారం. కర్ణాటకలోని లింగాయత్‌లు, గౌడ సామాజిక వర్గ నేతలు ఐక్యంగా ఉండి అక్కడ అధికారాన్ని దక్కించుకోవడాన్ని గుర్తు చేసినట్లు తెలిసింది. అన్ని విషయాలను విన్న మురళీధరన్ ‘ఏం జరుగుతుందో వేచి చూద్దాం.’అంటూ బదులివ్వడం గమనార్హం. -
‘ఇండియా’ కమిటీల్లో నియామకాలు
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలోని వివిధ కమిటీలకు మరికొన్ని నియామకాలు చేపట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కూటమిని సన్నద్ధం చేసే క్రమంలో శుక్రవారం ప్రకటించిన సమన్వయ, ఎన్నికల వ్యూహ కమిటీలోకి వివిధ పార్టీలకు చెందిన 14 మంది సభ్యులను తీసుకున్నారు. తాజాగా, ప్రచార కమిటీలోకి కాంగ్రెస్ నేత గుర్దీప్ సింగ్ సప్పాల్, జేడీయూ నేత సంజయ్ ఝా, శివసేనకు చెందిన అనిల్ దేశాయ్, ఆర్జేడీ సంజయ్ యాదవ్, ఎన్సీపీ నుంచి పీసీ చాకో, జేఎంఎం నేత చంపాయి సోరెన్, ఎస్పీకి చెందిన నందా కిరణ్మయ్, ఆప్ నేత సంజయ్ సింగ్, సీపీఎం నేత అరుణ్ కుమార్, సీపీఐఎంఎల్ నుంచి రవి రాయ్, వీసీకే నుంచి తిరుమావలన్, ఐయూఎంఎల్ నేత కేఎం కాదర్ మొయిదిన్, కేసీ–ఎం నేత జోస్ కె మణి, డీఎంకేకు చెందిన తిరుచి శివ, పీడీపీ నేత మెహబూబ్ బేగ్‌లను నియమించారు. టీఎంసీ నుంచి ప్రాతినిథ్యం కల్పించాల్సి ఉంది. -
ప్రైవేటు స్కూలు ఫీజుల వివరాలు వెబ్‌లో ఉంచాలి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 1994లో వచ్చిన జీవో 1లో ఉన్న నిబంధనలే దాదాపు పొందు పర్చినప్పటికీ, ప్రైవేటు స్కూళ్ళు వసూలు చేసే ఫీజులను సంబంధిత స్కూల్ వెబ్సైట్లో అందిరికీ అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఫీజుల వివరాలను విద్యాశాఖకు పంపించాలని పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల నిర్థారణకు ప్రతి స్కూలులోనూ కమిటీ ఏర్పాటు చేయాలని, ఇందులో విద్యా సంస్థ నిర్వాహకుడు లేదా కరస్పాండెంట్ అధ్యక్షుడుగా ఉండాలని సూచించారు. స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల్లో ఒకరు, పేరెంట్స్ ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలని స్పష్టం చేశారు. ఏడాదిలో మూడుసార్లు కమిటీ సమావేశమవ్వాలి ఈ తరహాలో ఏర్పడిన పాలక మండలి ఏడాదిలో మూడు సార్లు సమావేశమై, పాఠశాల ఆర్థిక వ్యవహారాలను సమీక్షించాలని సూచించారు. ఏడాదిలో స్కూల్ విద్యార్థులు, పాఠశాల అభివృద్ధికి చేసే ఖర్చును ఆడిట్ చేయించి, ఈ వ్యయం ఆధారంగా ఫీజులు వసూలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం ఫీజులో యాజమాన్య ఆదాయం 5 శాతం, స్కూల్ నిర్వహణకు 15 శాతం, పాఠశాల అభివృద్ధికి 15 శాతం, ఉపాద్యాయుల జీతాలకు 50 శాతం, పాఠశాల ఉద్యోగుల గ్రాట్యుటీ, పీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి వాటికి 15 శాతం వసూలు చేసేందుకు వీలు కల్పించారు. పాఠశాల ఆదాయ వ్యయ వివరాలను విధిగా గుర్తింపు కలిగిన ఆడిటర్ చేత ఆడిట్ చేయించి, విద్యాశాఖకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
మణిపూర్ కోసం ముగ్గురు మాజీ మహిళా జడ్జీలతో కమిటీ.. సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: మణిపూర్ ఘటనలపై విచారణ సందర్భంగా ఇవాళ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ హింసపై దర్యాప్తు కోసం ముగ్గురు మాజీ మహిళా హైకోర్టు జడ్జిలతో కమిటీ కూడిన కమిటీని ప్రతిపాదించింది. దర్యాప్తు పరంగానే కాకుండా.. పునరావాసం, ఇతరత్రా అంశాలపైనా ఈ కమిటీ దృష్టిసారిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు వివిధ రాష్ట్రాల నుంచి డీజీఐ ర్యాంక్ అధికారులతో కూడిన 42 సిట్లు... సీబీఐయేతర కేసులు విచారణ చేపడతాయని తెలిపింది. ఒక్కో అధికారి ఆరు సిట్లను పర్యవేక్షిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘‘మా ప్రయత్నాలు చట్ట పాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించడం. మేము ఒక స్థాయిలో ముగ్గురు మాజీ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ దర్యాప్తు మాత్రమే కాకుండా - సహాయక చర్యలను, నివారణ చర్యలు మొదలైనవాటిని కూడా పరిశీలిస్తుంది’’ అని చీఫ్ జస్టిస్ డీవైచంద్రచూడ్ ప్రకటించారు. ► ముగ్గురు సభ్యుల కమిటీలో జమ్ము కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షాలినీ జోషి, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆశా మీనన్ ఉన్నట్లు తెలిపింది. ► సీబీఐ దర్యాప్తు బృందంలో ఐదు రాష్ట్రాల నుంచి డిప్యూటీ సూపరిడెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు ఐదుగురు ఉంటారని, సీబీఐ దర్యాప్తును మాజీ ఐపీఎస్ అధికారి దత్తాత్రేయ పద్సల్గికర్ Dattatray ‘Datta’ Padsalgikar (మహారాష్ట్ర మాజీ డీజీపీ) పర్యవేక్షిస్తారని తెలిపింది. ► సీబీఐకి ట్రాన్స్ఫర్ కాని కేసుల్ని 42 సిట్లు విచారణ చేపడతాయి. ఈ సిట్లను మణిపూర్ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి డీఐజీ ర్యాంక్ అధికారులు నేతృత్వం వహిస్తారు. దర్యాప్తు సక్రమంగా సాగుతుందో లేదో.. ఒక్కో అధికారి ఆరు సిట్లను చూసుకుంటారు అని తెలిపింది. అంతకు ముందు.. మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్ వ్యక్తిగతంగా చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు హాజరయ్యారు. ఎఫ్ఐఆర్ల వ్యవహారం తప్పుల తడకగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఆయన్ని హాజరు కావాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక.. మణిపూర్ హింసపై దర్యాప్తునకు ఆరు జిల్లాల వారీగా ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్) ఏర్పాటు చేసినట్లు కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదించింది. బయట నుంచి కాకుండా.. సిట్లను జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేయించి దర్యాప్తునకు అనుతించాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్‌కు తెలిపారు. అయితే సుప్రీం మాత్రం తమ ప్రతిపాదనకే మొగ్గు చూపించింది. -
జ్ఞానవాపి మసీదు కేసులో కీలక మలుపు
అలహాబాద్: వారణాసి జ్ఞానవాపి మసీదు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేను వెంటనే ప్రారంభించవచ్చని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అనుమతిస్తూ గత నెలలో వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఏఎస్ఐ సర్వే అవసరమని, కొన్ని షరతులలో దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధిస్తూ.. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. కాగా కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదును పురాతన హిందూ దేవాలయంపై నిర్మించారా లేదా అనేది తెలుసుకునేందుకు మసీదు ప్రాంగణాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో శాస్త్రీయ సర్వే చేయించడానికి వారణాసి కోర్టు జూలై 21న అనుమతినిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్నిఆదేశించింది. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని తెలిపింది. దీంతో భారత పురావస్తు విభాగ అధికారుల బృందం జూలై 24న సర్వే చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను సవాలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధిస్తూ.. వారణాసి కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లవచ్చని మసీదు కమిటీకి సూచించింది. సుప్రీం ఆదేశాలతోప్రారంభమైన కొన్ని గంటల్లోనే సర్వే నిలిచిపోయింది. వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జూలై 27న విచారణ చేపట్టగా.. ఆగస్టు 3న తీర్పు వెల్లడించే వరకు సర్వే చేపట్టరాదని స్టే విధించింది. తాజాగా మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తక్షణమే సర్వే ప్రారంభించేందుకు ఏఎస్ఐకి అనుమతినిచ్చింది. చదవండి: ‘100 కుటుంబాల్లో 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం #WATCH | Allahabad HC has said that ASI survey of Gyanvapi mosque complex to start. Sessions court order upheld by HC: Vishnu Shankar Jain, representing the Hindu side in Gyanvapi survey case pic.twitter.com/mnQJrTzS09 — ANI (@ANI) August 3, 2023 -
కొనసాగిన ధార్మిక పరిషత్ కమిటీ విచారణ
తిరుపతి కల్చరల్: హథీరాంజీ మఠాధిపతిగా ఉన్న సమయంలో అర్జున్‌దాస్ పలు అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధార్మిక పరిషత్ కమిటీ సభ్యులు ఏబీ కృష్ణారెడ్డి, జోలా చైతన్య, శ్రీరామమూర్తి, విజయరాజు, రామకృష్ణారెడ్డి రెండో రోజు కూడా విచారణ నిర్వహించారు. అర్జున్‌దాస్ గురువారం కూడా విచారణకు హాజరవ్వలేదు. అయితే విచారణ కమిటీ సభ్యులు మఠంలోని రికార్డులను నిశితంగా పరిశీలించారు. రికార్డుల్లోని లావాదేవీలపై సిబ్బందిని ప్రశ్నించారు. అలాగే పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు, మాజీ పూజారులు అర్జున్‌దాస్ వల్ల తాము పడిన ఇబ్బందులను విచారణ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో మఠం భూముల విషయంలో అర్జున్‌దాస్ చేసిన అక్రమాలను పలువురు కమిటీకి విన్నవించారు. అనంతరం విచారణ కమిటీ సభ్యుడు ఏబీ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విచారణకు అర్జున్‌దాస్ సహకరించట్లేదని చెప్పారు. అర్జున్‌దాస్‌పై పలువురు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించామని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అనంతరం నివేదిక సమరిస్తామని తెలిపారు. -
రేవంత్ చైర్మన్‌గా ప్రదేశ్ ఎన్నికల కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: అధికార సాధనే థీమ్‌గా ఎలక్షన్ టీమ్‌ను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రదేశ్ ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఈ కమిటీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో 25 మంది సభ్యులు, ముగ్గురు ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు. ఈ మేరకు గురు వారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీలో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, మాజీమంత్రులు గీతారెడ్డి, జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామో దర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, ఎమ్మె ల్యేలు జగ్గా రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, బలరాం నాయక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నేతలు రేణుకా చౌదరి, అజారుద్దీన్, మహేశ్‌కుమార్ గౌడ్, ప్రేమ్‌సాగర్ రావు, సునీతా రావులను సభ్యులుగా నియమించారు.యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, సేవాదళ్ రాష్ట్ర ముఖ్య నిర్వాహకుడు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. -
జేపీఎస్‌ల పనితీరు మదింపునకు కమిటీలు
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్విస్ రెగ్యులరైజేషన్ కసరత్తులో భాగంగా వారి పనితీరు మదింపునకు జిల్లా స్థాయి పనితీరు మూల్యాంకన కమిటీ (డిస్ట్రిక్ట్ లెవల్ పెర్ఫార్మన్స్ ఎవాల్యూయేషన్ కమిటీ)లను రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసింది. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఎస్పీ లేదా ఎస్పీ నామినీగా డీఎస్పీ కంటే తక్కువ ర్యాంక్ కాని అధికారి, జిల్లా అటవీ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఈ కమిటీ జేపీఎస్‌ల పనితీరును మదింపు చేస్తుంది. ఈ మేర కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శనివారం ఆదేశాలు జారీ చేశారు. నాలుగేళ్ల సర్విస్ పూర్తి చేసుకున్న జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేసే క్రమంలో ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు పలు మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం 100 పాయింట్లతో మదింపు ♦ జిల్లా కమిటీకి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ♦ కమిటీ గ్రామ పంచాయతీలను సందర్శించి, ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్ల ఆధారంగా 4 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన జేపీఎస్‌ల పనితీరు అంచనా వేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తుంది. ♦ ఈ డేటాను, మదింపునకు సంబంధించిన స్కాన్డ్ కాపీలను పంచాయతీరాజ్ కమిషనర్ (పీఆర్) ఓ మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. ♦ జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు కమిటీలిచ్చే నివేదికలను పరిశీలించి జేపీఎస్‌ల సర్విసు రెగ్యులరైజైన్ ప్రతిపాదనలను పీఆర్ కమిషనర్‌కు సమర్పిస్తారు. ♦ ఈ నివేదికలపై పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ♦ రోడ్లు, మురుగు కాల్వల శుభ్రత, దోమల నివారణ, వైకుంఠధామాల నిర్వహణ, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, ప్రకృతి వనాలు, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ..తదితర అంశాలకు వేర్వేరుగా పాయింట్లు ఇవ్వడం ద్వారా, మొత్తం వంద పాయింట్లుగా మదింపు చేస్తారు. -
మణిపూర్ హింసాకాండపై విచారణకు కమిటీ ఏర్పాటు
ఇంఫాల్: ఇటీవల జరిగిన మణిపూర్ అల్లర్లపై విచారణకు గౌహతి హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అజయ్ లాంబా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించింది కేంద్ర హోంశాఖ. కమిటీలో ఎవరెవరున్నారంటే... మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ఇటీవల ఇక్కడ పర్యటించిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పిన మాట ప్రకారం కేంద్ర హోంశాఖ ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజయ్ లాంబా నేతృత్వం వహిస్తారు. ఈ త్రిసభ్య కమిటీలో మిగిలిన ఇద్దరిలో ఒకరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హిమాంశు శేఖర్ దాస్ కాగా మరొకరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అలోక్ ప్రభాకర్. కమీషన్ల విచారణ చట్టం 1952(60 ఆఫ్ 1952) లోని సెక్షన్-3 ప్రకారం ఈ కమిటీకి అన్ని అధికారాలు ఉంటాయని, విచారణను వీలైనంత తొందరగా పూర్తి చేసి ఆరు నెలల లోపే నివేదిక సమర్పించాలని కోరింది కేంద్ర హోంశాఖ. హైవే మీద అడ్డంకులను తొలగించండి... ఇదిలా ఉండగా నిత్యావసర వస్తువులను చేరవేసేందుకు వీలుగా ఇంఫాల్ దిమాపూర్ జాతీయ రహదారిపై ఉంచిన అడ్డంకులను తొలగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇది కూడా చదవండి: ఒడిశా పోలీస్ సీరియస్ వార్నింగ్.. -
చితికి చేరుతున్న చీతాలు.. ‘ప్రాజెక్ట్ చీతా’పై కొత్త కమిటీ
భోపాల్: భారత్‌లో అంతరించిపోయిన చీతాల సంతతిని పెంచేందుకు నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి చీతాలను తీసుకొచ్చిన కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ వనంలో చీతాలు వరసబెట్టి మృత్యుబాట పడుతున్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి భారత్‌కు చీతాల తరలింపు ప్రాజెక్ట్ చేపట్టిననాటి నుంచి మూడు చీతాలు, మూడు చీతా కూనలు ప్రాణాలు కోల్పోయాయి. కేవలం రెండున్నర నెలల వ్యవధిలోనే మొత్తం మరణాల సంఖ్య ఆరుకు పెరిగింది. చీతాల మరణాలు ఆందోళకరంగా మారడంతో.. ప్రాజెక్ట్ చీతా అమలును పర్యవేక్షించేందుకు జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కూడిన కొత్త స్టీరింగ్ కమిటీని కేంద్రం నియమించింది. 11 మంది సభ్యులతో కూడిన చిరుత ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏర్పాటు చేసింది. దీనికి గ్లోబల్ టైగర్ ఫోరమ్ సెక్రటరీ జనరల్ రాజేష్ గోపాల్ చైర్మన్‌గా ఉన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శితో సమావేశం అనంతరం దీనిని ఏర్పాటు చేశారు. చదవండి: తప్పిపోయిన 'ఆశ'.. ప్రాజెక్టు చీతా బృందంపై గ్రామస్థుల దాడి కొత్తగా ఏర్పడిన కమిటీ మధ్యప్రదేశ్‌ల్లో ప్రవేశ పెట్టిన చీతాల పురోగతిని అంచనా వేసి పర్యవేక్షిస్తుంది. వాటి మనుగడపై ఎన్టీసీఏకు పలు సూచనలు అందించనుంది. అలాగే ఎకో టూరిజం కోసం చిరుత ఆవాసాలను తెరవడంపై కూడా నిర్ణయం తీసుకోనుంది. సంబంధిత నిబంధనలను సిఫారసు చేయనుంది. ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్ ప్రస్తుతం 18 చిరులు, ఒక కూన చిత ఉంది. కాగా నమీబియా నుంచి తీసుకొచ్చేటపుడే మూత్రపిండ సంబంధ వ్యాధితో బాధపడుతున్న సాశా అనే చీతా మార్చి 27న చనిపోయింది. తర్వాత దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్ అనే చీతా ఏప్రిల్ 13న మరణించింది. దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన దక్ష అనే మరో చీతా కలయిక కోసం మరో మగ చీతాతో జరిగిన పోరాటంలో తీవ్ర గాయాలపాలై ఈనెల తొమ్మిదో తేదీన తుదిశ్వాస విడిచింది. డీహైడ్రేషన్.. గత ఏడాది సెప్టెంబర్‌లో నమీబియా నుంచి తీసుకొచ్చిన సియాయా అనే ఆడ చీతాకు జ్వాల అని నామకరణం చేసి కూనో నేషనల్ పార్క్‌లో వదిలిపెట్టారు. అది మార్చి నెలలో నాలుగు కూనలకు జన్మనిచ్చింది. కాగా సూర్యప్రతాపం కారణంగా కూనో వనంలో పగటిపూట వేడి దాదాపు 47 డిగ్రీల సెల్సియస్‌గా ఉండటంతో డీహైడ్రేషన్ కారణంగా మే 23న తొలి కూన మృత్యువాత పడింది. దీంతో వాటిని వేరే చోటుకు తరలించాలని అధికారులు భావించారు. ఆలోపే గురువారం మరో రెండు కూనలు మరణించాయి. వాస్తవానికి ఆ రెండింటినీ ప్రత్యేక సంరక్షణలో ఉంచామని అయినా కాపాడలేకపోయామని, నాలుగో కూనను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నామని పర్యవేక్షక బృందం గురువారం ప్రకటించింది. -
AP: 46,445 మంది రైతులకు ఆక్వా విద్యుత్ సబ్సిడీ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్రీయంగా నిర్వహించిన ఈ ఫిష్ సర్వే వల్ల లక్షలాది మంది అర్హులైన చిన్న ఆక్వారైతులకు ప్రభుత్వ సబ్సిడీ చేరువ అయ్యిందని ఆక్వా సాధికారిత కమిటీ సభ్యులు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు తెలిపారు. విజయవాడలోని మంత్రి పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం 6వ ఆక్వా సాధికారిత కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ ఆక్వా జోన్ పరిధిలో పది ఎకరాలలోపు సాగు చేస్తున్న ప్రతి ఆక్వా రైతుకు ప్రభుత్వం నుంచి విద్యుత్ సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఈ ఫిష్ సర్వే ద్వారా అర్హులైన ఆక్వా రైతులను గుర్తించడం జరిగిందని అన్నారు. సర్వే తరువాత రాష్ట్రంలో 46,445 మంది రైతులను అర్హులుగా నిర్ధారించడం జరిగిందని, దాదాపు 3,27,575 ఎకరాలకు, విద్యుత్ సబ్సిడీగా ఏటా రూ.672.61 కోట్లు అందిస్తున్నామని తెలిపారు. ఈ ఫిష్ సర్వేకు ముందు ఆక్వాజోన్ పరిధిలో పది ఎకరాల లోపు ఆక్వా సాగు చేస్తున్న విస్తీర్ణం కేవలం 1.90 లక్షల ఎకరాలకు మాత్రమే సబ్సిడీ అందితే, సర్వే తరువాత 3.27 లక్షల ఎకరాలకు సబ్సిడీ లబ్ధి చేకూరుతోందని తెలిపారు. ఎక్కువ మంది అర్హులైన చిన్న రైతులు ఆక్వాజోన్ పరిధిలో ఈ పరిమితుల్లోకి రావడం వల్ల వారికి మేలు జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు, వారి సమస్యలను తక్షణం పరిశీలించి, పరిష్కరించేందుకు మంత్రులు, అధికారులతో ఏర్పాటు చేసిన సాధికారిత కమిటీ ఇప్పటి వరకు పలుసార్లు సమావేశమై తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. చదవండి: ఏది నిజం?: ‘ఈనాడు’ దిగజారుడు రాతలు ఆక్వా ఫీడ్, సీడ్ రేట్లను స్థిరీకరించడం, ఆక్వా ఉత్పత్తుల ధరలను పది రోజుల పాటు ఒకేలా కొనసాగేలా చర్యలు తీసుకోవడం, ఈ రేట్లను ఆర్బీకేల్లో ప్రదర్శించడం ద్వారా రైతులు, ప్లాంట్ నిర్వాహకుల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎక్కడికక్కడ రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, సీడ్, ఫీడ్ తయారీదారులతో సమావేశాలు నిర్వహించడం ద్వారా ఆక్వాలో రేట్ల పెరుగుదల, ఆకస్మికంగా ధరల పతనం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు, స్థానికంగా ఆక్వా వినియోగం పెంచేందుకు ప్రభుత్వం బ్యాంకు రుణాలు, సబ్సిడీలతో మొత్తం 4 వేల ఫిష్ ఆంధ్రా ఆక్వా యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని అన్నారు. ఇప్పటికే 1549 యూనిట్లను ఏర్పాటు చేయడం పూర్తయ్యిందని, ఒక్క రాయలసీమ జిల్లాల్లోనే 360 యూనిట్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. మొత్తం 2500 యూనిట్లకు సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాలు అందించే ప్రక్రియ తుది దశలో ఉందని తెలిపారు. నిరుద్యోగ యువత ఉత్సాహంగా ఫిష్ ఆంధ్రా యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందకు వస్తున్నారని, అటు ఆక్వా రంగానికి, ఇటు యువత ఉపాధికి బాటలు వేస్తూ ఫిష్ ఆంధ్రా యూనిట్ల ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. చదవండి: దిగజారుడు పాత్రికేయానికి మరో మచ్చుతునక ఈ సందర్భంగా అప్సడా చైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ఆక్వా ఉత్పత్తుల ధరలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతులకు, ఎగుమతి దారులకు అవసరమైన సమాచారంను అందిస్తున్నామని తెలిపారు. మధ్య దళారీల ప్రమేయంను పూర్తి స్థాయిలో నియంత్రించడం, రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ ల నిర్వాహకులతో ఎప్పటికప్పుడు సమావేశాలను నిర్వహించడం ద్వారా రేట్లు పతనం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సీడ్ రేట్లు పెరుగుదలకు సంబంధించి అప్సడాకు సమాచారం ఇచ్చిన తరువాతే, వాటిని శాస్త్రీయంగా పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకుంటున్నామని, రైతులపై అధిక భారం లేకుండా, అటు సీడ్, ఫీడ్ తయారీ సంస్థలకు ప్రోత్సాహకరంగా ఉండేలా రేట్లను ప్రభుత్వ పరంగా నియంత్రించగలిగామని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీలు నీరబ్ కుమార్ ప్రసాద్, విజయానంద్, గోపాలకృష్ణ ద్వివేది, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, పిసిబి చీఫ్ ఇంజనీర్ శివారెడ్డి పాల్గొన్నారు. -
Centre to Supreme Court: స్వలింగ సమస్యలపై కమిటీ
న్యూఢిల్లీ: స్వలింగ జంటల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సెక్రెటరీ సారథ్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. స్వలింగ జంటలకు జాయింట్ బ్యాంకు ఖాతాలు, పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ పథకాల్లో స్వలింగ భాగస్వామిని నామినీగా చేర్చడం వంటివాటిపై నెలకొన్న సమస్యలను ఏప్రిల్ 27 నాటి విచారణ సందర్భంగా ధర్మాసనం లేవనెత్తింది. వీటి పరిష్కారానికి ఏం చేయొచ్చో ఆలోచించాలని సూచించింది. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. కోర్టు అంగీకరిస్తే కమిటీ వేసి అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలిస్తామని వివరించారు. పిటిషనర్ల సలహాలు, సూచనలను కూడా కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. అందుకు తమకభ్యంతరం లేదని పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్ ఎ.ఎం.సింఘ్వి అన్నారు. అయితే దీనివల్ల పరిష్కారం లభించదన్నారు. ధర్మాసనమే దీనిపై సమగ్రమైన తీర్పు వెలువరించాలని కోరారు. కేంద్రం సూచనను ఓ చక్కని ముందడుగుగా న్యాయమూర్తి జస్టిస్ భట్ అభివర్ణించారు. స్వలింగ జంటలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు కమిటీతో పరిష్కారం లభించగలదని అభిప్రాయపడ్డారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత అంశాన్ని సమగ్రంగా పరిశీలించి తీర్పు వెలువరిస్తామని సీజేఐ పేర్కొన్నారు. సహజీవనం చేస్తున్న స్వలింగ జంటల్లో 99 శాతం మంది పెళ్లి చేసుకోవాలనే కోరుకుంటున్నట్టు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సౌరభ్ కృపాల్, మేనకా గురుస్వామి తదితరులు చెప్పగా సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అవతలి వర్గం కూడా తమ వాదనకు మద్దతుగా బోలెడన్ని గణాంకాలు చూపిస్తారు. అందుకే మేం ఇలాంటి మెజారిటీ నైతికతనో మరోదాన్నో ప్రాతిపదికగా తీసుకుని విచారణ జరపలేం. రాజ్యాంగ నియమ నిబంధనలను బట్టే ముందుకెళ్తాం’’ అని స్పష్టం చేశారు. తదుపరి వాదనలు మే 9న కొనసాగనున్నాయి. ఈడీ డైరెక్టర్‌గా ఇంకెవరూ పనికిరారా? ఈడీ డైరెక్టర్‌గా వరుసగా మూడోసారి సంజయ్ కుమార్ మిశ్రాకు పదవీ కాలం పెంచడంపై సుప్రీం కోర్టు మండిపడింది. డెరైక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ పదవిని చేపట్టడానికి మిశ్రా తప్ప సంస్థలో మరెవరూ లేరా అని ప్రశ్నించింది. మూడోసారి కూడా ఆయనకే పదవీ కాలం పొడిగించాల్సిన ఆవశ్యకత ఏముందని ప్రశ్నించింది. మిశ్రా పదవీకాలాన్ని పొడిగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న వారికి పదవీకాలం ఎక్కువగా పొడగించకూడదని సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేసింది. ‘‘ఈడీ డైరెక్టర్‌గా మిశ్రాకు మించిన వారు మరెవరూ లేరని మీరు భావిస్తున్నట్టున్నారు. ఆయన రిటైరయ్యాక ఎవరిని నియమిస్తారు?’’ అని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్ల బెంచ్ నిలదీసింది. కీలక కేసుల్ని విచారిస్తున్నప్పుడు ఒకరి ఆధ్వర్యంలో అయితే విచారణ సరిగా సాగుతుందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. -
జానారెడ్డి ఎక్కడ?.. ఆ కమిటీ ఉన్నట్లా? లేనట్లా?
తెలంగాణలో ఎన్నికలు తరుముకొస్తున్నాయి. టీ.కాంగ్రెస్ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చిందా? రాలేదా? పార్టీల మధ్య జంపింగ్‌లు భారీగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి టీ.కాంగ్రెస్ చేరికల కమిటీ ఉన్నట్లా? లేనట్లా? చేరికల కమిటీ ఛైర్మన్ జానారెడ్డి ఏం చేస్తున్నారు? కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటున్నవారితో చర్చిస్తున్నారా? కొత్తవారిని పట్టించుకోవడం మానేశారా? ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పార్టీల మధ్య కుండమార్పిళ్ళు సహజమే. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి కప్పగెంతులు భారీగానే జరుగుతుంటాయి. అందుకే ప్రతి పార్టీలోనూ చేరికల కమిటీలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ బాధ్యతను పార్టీలో ఒక సీనియర్‌కు అప్పగిస్తారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా సీనియర్ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. ఎవరైనా కాంగ్రెస్‌లో చేరాలంటే ఈ కమిటీయే తుది నిర్ణయం తీసుకుంటుంది. పార్టీలో చేరదామనుకుంటున్నవారితో చర్చించి ఫైనల్ చేస్తుంది. ఇటువంటి కీలకమైన కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న జానారెడ్డి ఇంతవరకు సమావేశమే ఏర్పాటు చేయలేదు. కమిటీ ఏర్పాటయ్యాక కొత్తవారు ఎవరూ కాంగ్రెస్‌లో చేరింది లేదు. ఎవరితోనూ కమిటీ చర్చించిందీ లేదు. పెద్దలు జానారెడ్డి చేరికల కమిటీ ఉనికినే ప్రశ్నార్థకం చేయడంతో..అసలు ఈ కమిటీ ఉందా లేదా అని గాంధీభవన్‌లో చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌లోకి వద్దామని ఎవరైనా అనుకుంటే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోనో.. లేక సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోనో చర్చిస్తున్నారు గాని.. జానారెడ్డిని ఎవరూ పట్టించుకోవడంలేదు. మరోవైపు చేరికల కమిటీకి పీసీసీ నేతలే విలువ ఇవ్వడంలేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అసలు చేరికల కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఇతర పార్టీ నేతలను ఆకర్షించడంలో ఫెయిలయ్యిందనే విమర్శలు వస్తున్నాయి. ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలతో చర్చించి కాంగ్రెస్‌లోకి తీసుకురావడం చేరికల కమిటీ పని. కానీ జానారెడ్డి ఇప్పటి వరకు అలాంటి ఆలోచనే చేయలేదనే అభిప్రాయాలు కాంగ్రెస్‌లోనే వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు బీజేపీ చేరికల కమిటీ ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరుపుతూ పార్టీలోకి నేతలను ఆహ్వానిస్తుంటే.. టీ కాంగ్రెస్ చేరికల కమిటీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదనే అసహనం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. చదవండి: పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్నుంచి సస్పెండైన సీనియర్ నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కొద్దిరోజులుగా చౌరస్తాలో నిలబడి ఏ పార్టీలో చేరాలనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఇలాంటి సమయంలో వారితో సంప్రదింపులు జరపాల్సిన చేరికల కమిటీ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. పార్టీలో చేరాలనుకునే వారు కావాలంటే తమ దగ్గరకే వస్తారు..తాము ఇంకొకరి దగ్గరికి వెళ్ళేది ఏంటనే ధోరణిలో టీ కాంగ్రెస్ చేరికల కమిటీ వ్యవహరిస్తోంది. గాంధీభవన్ నేతల తీరుతో పార్టీలో చేరాలనుకునే వారు కూడా కాంగ్రెస్ పట్ల విముఖత చూపుతున్నారు. గతంలో ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న సమయంలో కూడా చేరికల కమిటీ సకాలంలో రియాక్ట్ కాకపోవడం వల్లే ఈటల బీజేపీలోకి వెళ్ళారనే విమర్శ ఉంది. చదవండి: ఎమ్మెల్యేగా సీతక్క కొడుకు పోటీ ఇక్కడి నుంచేనా..? వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా చేరికల కమిటీ యాక్టీవ్ గా పనిచేయాలని సూచిస్తున్నారు. పార్టీలో సీనియర్ నేత అయిన జానారెడ్డి చేరికల కమిటీని యాక్టివ్ చేయాలని కోరుతున్నారు. ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలతో వారి ఇళ్లకు వెళ్లి సంప్రదింపులు జరపాలని.. లేదంటే పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రారని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
Hindenburg-Adani: జేపీసీ కంటే కోర్టు కమిటీ అత్యుత్తమం
ముంబై: కుబేరుడు గౌతమ్ అదానీ షేర్ల కొనుగోలు వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాలంటూ కొద్దిరోజులుగా విపక్ష పార్టీలు ఉమ్మడిగా డిమాండ్ చేస్తున్న వేళ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భిన్నమైన వాదన చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘విపక్షాల జేపీసీ డిమాండ్‌తో నేను పూర్తిగా విభేదించడం లేదు. కానీ జేపీసీ కంటే సర్వోన్నత న్యాయస్థానం కమిటీ ఈ వివాదాన్ని మరింత అర్థవంతంగా, ప్రభావవంతంగా పరిష్కరించగలదని భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ‘గతంలో కొన్ని జేపీసీలకు అధ్యక్షత వహించిన అనుభవం నాకుంది. అదానీ–హిండెన్‌బర్గ్ ఉదంతంలో ఒకవేళ జేపీసీ వేస్తే అందులో 21 మంది సభ్యులుంటారు. పార్లమెంట్లో పార్టీల సంఖ్యాబలం ఆధారంగా 15 సభ్యత్వాలు అధికార పార్టీకే దక్కుతాయి. ఇక మిగిలిన ఆరుగురే విపక్షాలకు చెందిన వారు ఉంటారు. ఇది ప్యానెల్ పనితీరుపై అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉంది. జేపీసీ ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించట్లేను. దాని కంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల ప్యానెల్ ప్రభావవంతంగా పనిచేయగలదు. నిర్ణీత కాలావధిలో నివేదించగలదు’ అని పవార్ అభిప్రాయపడ్డారు. కాగా, ఇటీవల ఒక జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ సంస్థకు పవార్ మద్దతిస్తూ హిండెన్‌బర్గ్‌ను విమర్శించడం గమనార్హం. ‘అదానీ గ్రూప్‌పై అమెరికా కేంద్రంగా పనిచేసే చరిత్రలేని ఏదో సంస్థ మాట్లాడితే దానికి ఎంత విలువ ఇవ్వాలో మనం నిర్ణయించుకోవాలి. ఇలాంటి ప్రకటనలు, నివేదికలు గతంలోనూ పలు సందర్భాల్లో వచ్చాయి. ఇలాంటి వాటి కారణంగా తాజాగా పార్లమెంట్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీనికి అనవసర ప్రాధాన్యం ఇచ్చాం. నిరుద్యోగం, పెరిగిన ధరలు, రైతు సమస్యలు ఇలా దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటిని వదిలేసి ఇలా అప్రధాన అంశాలను పట్టించుకుంటే ఇవి దేశ ఆర్థికవ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయి. వీటిని చూస్తుంటే కావాలనే ఏదో లక్ష్యంగా చేసుకుని ఈ తరహా అంశాలను లేవనెత్తుతున్నారు అనిపిస్తోంది ’ అని పవార్ వ్యాఖ్యానించారు. జేపీసీ పట్ల పవార్ విముఖత వ్యక్తంచేయడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ‘ ఈ అంశంలో 19 భావసారూప్య పార్టీలు ఒకే డిమాండ్‌తో ముందుకెళ్తున్నాయి. అయితే ఎన్సీపీకి సొంత అభిప్రాయాలు ఉండొచ్చు’ అని అన్నారు. పవార్ అభిప్రాయం మహారాష్ట్రలో, దేశంలో విపక్షాల ఐక్యతకు బీటలు పడేలా చేయలేదని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పష్టంచేశారు. -
బీజేపీ చేరికల కమిటీకి ఈటల రాజీనామా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్ పదవికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. కీలకమైన ఆ పదవి నుంచి తనను తప్పించాలని ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డా, మరో సీనియర్ నేత అమిత్ షాను కోరినట్లు సమాచారం. ఇటీవల నడ్డా నివాసంలో కీలక భేటీ జరిగింది. ఈ భేటీలోనే ఈటల తనను చేరిక కమిటీ నుంచి తప్పించాలని కోరారు. అంతేకాదు.. చేరికల కమిటీ సమావేశంలోనూ పాల్గొనేందుకు ఆయన ఆసక్తి ప్రదర్శించడం లేదు. పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకులకు టికెట్ భరోసా ఇవ్వకుండా ముందుకు వెళ్లకుండా సాధ్యం కాదని, అది చాలా కష్టమని ఈటల వాళ్ల వద్ద స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే గెలుపు గుర్రాలు వస్తే కాదంటామా ? అని ఈటలకు సర్దిచెప్పే యత్నం చేయగా.. ఆయన రాజీనామా వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ పరిణామం.. తదనంతర ఫలితాలపై పార్టీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల ఓటమి తర్వాత బీజేపీలో చేరికలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో చేరికలు ఆగిపోవడానికి మీరంటే మీరు కారణమంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు రాష్ట్ర నేతలు. -
ప్రభుత్వ కమిటీ లేదు ‘అదానీ దర్యాప్తు’పై లోక్‌సభలో కేంద్రం
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ మీద వచ్చిన ఆరోపణలపై విచారణకు ప్రభుత్వపరంగా ఎలాంటి కమిటీనీ వేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. వాటిపై నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు చేస్తోందని గుర్తు చేసింది. ఈ విషయమై లోక్‌సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘‘ఇండొనేసియా నుంచి బొగ్గు దిగుమతుల విషయమై కూడా అదానీ కంపెనీపై విడిగా జరుగుతున్న దర్యాప్తు ఇంకా తుది దశకు చేరలేదు. విద్యుదుత్పత్తి, సంపిణీ పరికరాల దిగుమతికి సంబంధించి అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల మీద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ దర్యాప్తు పూర్తయింది. నివేదిక కూడా అందింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలుగు చూసిన తర్వాత గత జనవరి 24 నుంచి మార్చి 1 మధ్య అదానీ గ్రూప్‌కు చెందిన 9 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్లో 60 శాతం క్షీణత నమోదైంది’’ అని మంత్రి చెప్పారు. -
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల నివారణకు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ప్రధాన భూమిక పోషిస్తాయని ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. భారత ఉన్నత న్యాయస్థానం మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు ఉత్తర్వుల ప్రకారం అన్ని శాఖాధిపతుల, ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ కమిటీలను తప్పని సరిగా ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు. గురువారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘‘పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం-2013" అమలు తీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ సీఎం జగన్ మహిళల భద్రతకు, సంక్షేమానికి, సాధికారతకు అధిక ప్రాధాన్యతనిస్తూ పలు వినూత్న పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మహిళా సాధికారతకు బడ్జెట్లో కూడా భారీ మొత్తంలో నిధులను మహిళల సంక్షేమం, అభివృద్దికే కేటాయిస్తున్నారన్నారు. ఫలితంగా రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఆరోగ్య పరంగా అభివృద్ది పథంలో ముందుకు వెళ్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఫిర్యాదులు చాలా తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నాయని, ఇందుకు జగనన్న ప్రభుత్వం తీసుకుంటున్న పలు రకాల చర్యలే కారణమని ఆమె పేర్కొన్నారు. అయితే పని చేసే ప్రదేశంలో మహిళా ఉద్యోగినులపై ఎటు వంటి లైంగిక వేధింపులకు ఆస్కారం లేకుండా ఉండేందుకు, మహిళలు వారి సమస్యలను నిర్బయంగా వెల్లడించడానికి ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలు ప్రధాన వేదికలుగా పని చేస్తాయన్నారు. ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలను ఇంత వరకు ఏర్పాటు చేయని శాఖాధిపతులు వెంటనే తమ కార్యాలయాల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకూ పనిచేసే మహిళా ఉద్యోగినుల్లో ఈ కమిటీలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా మహిళలకు ప్రత్యేక టాయిలెట్స్, శిశువులకు పాలిచ్చే ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. మహిళా సాధికారత సాధనలో దేశానికే ఏపీ ఆదర్శం: వాసిరెడ్డి పద్మ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళల భద్రత, సాధికారత సాధనలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి చూపుతున్న ప్రత్యేక శ్రద్దే ఇందుకు ప్రధాన కారణమని ఆమె తెలిపారు. మహిళా సమస్యల పరిష్కారానికి, మహిళల భద్రతకు, రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాలపై మహిళల్లో అవగాహన కల్పించేందుకు గత ఏడాది మార్చి 8న సీఎం జగన్ “సబల” కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ గత ఏడాది నుండి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున అమలు చేస్తూ గుంటూరు, ఏలూరు, కర్నూలు, విశాఖపట్నం జోన్లలో పలు అవగాహనా సదస్సులను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సదస్సుల్లో గుర్తించిన మహిళల సమస్యలను పెద్ద ఎత్తున పరిష్కరించడం కూడా జరిగిందన్నారు. కుటుంబ సలహాలు ఇచ్చేందుకు ప్రతి నెలా ప్రత్యేక డ్రైవ్‌లను కూడా మహిళా కమిషన్ నిర్వహిస్తున్నదని ఆమె తెలిపారు. అయితే ఉద్యోగినులు వారు పనిచేసే ప్రదేశంలో భద్రత కల్పించేందుకు ఇప్పటికే పలు శాఖాధిపతుల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. చదవండి: సీఎం జగన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు: సజ్జల -
అదానీ వ్యవహారంపై జేపీసీ తప్ప మరేదైనా వృథాయే: కాంగ్రెస్
న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యవహారంలో సమగ్ర విచారణ అత్యంత అవసరమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తప్ప మరే కమిటీ వేసినా వృథా ప్రయాసేనని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుపై సుప్రీం కోర్టు దగ్గర ప్రతిపాదనలు చేస్తే , ఈ అంశంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు అవుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదానీ ఆస్తులకు సంబంధించి హిండెన్‌బర్గ్ నివేదికలో వచ్చిన ఆరోపణలపై నిపుణులతో కమిటీ వేయాలని సుప్రీం కోర్టు ఈ నెల 13న జరిపిన విచారణలో అభిప్రాయపడిందని, దీనిపై కేంద్రం 17లోగా స్పందించాల్సి ఉందని జైరామ్ రమేష్ గుర్తు చేశారు. జేపీసీ మినహాయించి ఎలాంటి చట్టబద్ధ కమిటీలు వేసినా ఈ విషయంలో ఉపయోగం ఉండదని అన్నారు. చదవండి: మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీం తీర్పు రిజర్వ్.. -
AP: సీఎస్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలకు ప్రభుత్వపరంగా సమకూర్చాలిన భుములు, వివిధ రాయితీలు, ఇతర ప్రోత్సాహకాల కల్పన అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా పరిశ్రమల శాఖలో ప్రత్యేక ఫ్యాకేజీ ఇన్సెంటివ్‌లకు సంబంధించి ఎనిమిది అజెండా అంశాలతో పాటు విధాన నిర్ణయాలకు చెందిన అంశాలపైన కమిటీ సమీక్షించింది. అదే విధంగా ఐటి అండ్ సి శాఖకు సంబంధించి ఎనిమిది అజెండా అంశాలు, ఇంధన శాఖకు సంబంధించిన అజెండా అంశాలపైన సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆయా పరిశ్రమలు, కంపెనీలకు అందించాల్సిన ప్రోత్సాకాలు తదితర అంశాలపై చర్చించి విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా ఈ సమావేశంలో పలు అంశాలపై కూడా సీఎస్ డా.కెఎస్ జవహర్ రెడ్డి అధికారులతో చర్చించారు. చదవండి: ఏంటి లోకేశా ఇదీ?.. నరాలు కట్ అయిపోతున్నాయ్..! ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కరికల వలవన్, కె.ప్రవీణ్ కుమార్, ఎస్ఎస్ రావత్ పాల్గొనగా దృశ్య మాధ్యమం ద్వారా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పాల్గొన్నారు. అలాగే ఈసమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్, ఎంఏయుడి కమిషనర్ ప్రవీణ్ కుమార్, పరిశ్రమల శాఖ కమిషనర్ సృజన, ఏపీ మారిటైమ్ బోర్డు సీఇవో షన్మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?.. కమిటీల ఏర్పాటు దేనికి సంకేతం!
తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కమిటీల ఏర్పాటుతో ముసలం బయల్దేరింది. కొత్త కూర్పు సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. నాయకుల మధ్య సమన్వయం లోపించడం హై కమాండ్‌ను ఇబ్బంది పెడుతోంది. కమిటీల ఏర్పాటుతో ఓరుగల్లు కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. ఈ అసంతృప్తి నుంచే సీనియర్ నేత కొండా సురేఖ తనకిచ్చిన పదవికి రాజీనామా సమర్పించారు. ఇంతకీ ఓరుగల్లు కేంద్రంగా కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? కొండా రాజీనామా ఎందుకిచ్చారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే కలహాల కాపురం. పార్టీలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిరంతరం అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉంటాయి. కొత్తగా ప్రకటించిన పీసీసీ.. డీసీసీ కమిటీలు కొందరికి ఉత్సాహం కలిగిస్తే.. మరికొందరికి కోపాన్ని తెప్పిస్తున్నాయి. సీనియర్లు అనేక మంది తమకు సరైన పదవి రాలేదనో.. తమవారికి పదవులు దక్కలేదనో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం అసమ్మతి సెగలు రగులుతున్నాయి. తనకిచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొండా సురేఖ ఆ పదవికి రాజీనామా సమర్పించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలోకి తమకంటే జూనియర్లను తీసుకొని సీనియర్లమైన తమకు అవకాశం కల్పించకపోవడంతోపాటు వరంగల్‌కు చెందిన ఏ ఒక్క లీడర్ పేరు ఆ కమిటీలో లేకపోవడం అవమానంగా భావిస్తున్నామని ప్రకటించారు కొండా సురేఖ. వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి తాము సూచించిన వ్యక్తికి ఇవ్వకపోవడంతో పాటు.. తాము కోరుకున్న రెండు నియోజకవర్గాలపై అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడంపైనా కొండా దంపతులను ఆందోళనకు గురి చేస్తోందట. అందుకే కొండా సురేఖ టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారనే ప్రచారం సాగుతుంది. మూడు ముక్కలు, ఆరు చెక్కలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు డిసిసిలు ఉండగా మూడింటికే జిల్లా కమిటీలను ప్రకటించారు. హనుమకొండ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో పాతవారినే కొనసాగించాలని హైకమాండ్ నిర్ణయించింది. మరో మూడు జిల్లాలైన వరంగల్, భూపాలపల్లి, జనగామల్లో మాత్రం ఏకాభిప్రాయం రాక గందరగోళం ఏర్పడటంతో డీసీసీల ప్రకటన వాయిదా పడింది. జనగామ జిల్లాకు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జంగా రాఘవరెడ్డితోపాటు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కూడా పదవి ఆశిస్తున్నారు. ఆ ఇద్దరికి తోడు పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సైతం తాను సూచించిన వ్యక్తికే డిసిసి ఇవ్వాలని పట్టుపడుతున్నారు. వరంగల్ విషయంలో సీనియర్ నేత కొండా మురళీ, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిల మద్య డిసిసి దోబూచులాడుతోందట. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష పదవికి ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు వర్గం నేతగా ఉన్న అయిత ప్రకాష్ రెడ్డిని కొనసాగించాలనే డిమాండ్ వినిపిస్తుండగా, రేవంత్ రెడ్డి అనుచరుడుగా ముద్రపడ్డ గండ్ర సత్యనారాయణకు లేదా ఆయన సూచించిన వ్యక్తికి డీసీసీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ కొనసాగుతోంది. చేయి కాలుతుందా? బలం పెరుగుతుందా? ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా..నేతల మద్య సమన్వయం లేకపోవడం.. ఆధిపత్య పోరు కారణంగా మూడు జిల్లాల అధ్యక్ష పదవులు ఖరారు కాలేదని తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి పాతవారికే అవకాశం ఉంటుందని ప్రచారం జరిగినా.. సీనియారిటీ, పార్టీలో పనిచేసిన అనుభవం, రాజకీయ సమర్థత వంటి అంశాలను బేరీజు వేసుకుని మూడు జిల్లాల విషయంలో పాతవారి పైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. మిగతా మూడు జిల్లాల విషయంలో ఆ దిశగా చర్యలు చేపట్టి సమర్థత, కార్యనిర్వహణ సామర్థ్యం గల నేతలకే అవకాశం ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారం రోజుల్లో నేతల మధ్య ఏకాభిప్రాయం తీసుకువచ్చి మిగిలిన మూడు జిల్లాల అధ్యక్ష పదవులను ఖరారు చేస్తారని..అసంతృప్తితో ఉన్న నేతలను సైతం సముదాయించి సముచిత స్థానం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
నన్ను సంప్రదించకుండానే పీసీసీ కమిటీలను ప్రకటించారు: భట్టి
-
ఆర్‌క్యాప్ లిక్విడేషన్ విలువ రూ.13,000 కోట్లు?
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) లిక్విడేషన్ విలువ రూ.13,000 కోట్ల వరకు ఉంటుందని ఇండిపెండెంట్ వాల్యూయర్లు తేల్చారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దివాలా పక్రియ ప్రారంభించే తేదీ నాటికి ఆస్తిని విక్రయించినప్పుడు ఆ ఆస్తిపై అప్పులుపోను కొనుగోలుదారుకు అందే తుది విలువ అంచనానే లిక్విడేషన్ విలువ. రిలయన్స్ క్యాపిటల్ రుణ దాతల కమిటీ (సీఓసీ) సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో సంస్థకు సంబంధించి ఇండిపెండెంట్ వాల్యూయర్లు– డఫ్ అండ్ ఫెల్ప్సŠ, ఆర్బీఎస్ఏలు ఇచ్చిన లిక్విడేషన్ విలువ వివరాలను రిలయన్స్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటర్ సమర్పించారు. సంబంధిత వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ► ఆర్క్యాప్కు డఫ్ అండ్ ఫెల్పŠస్ రూ.12,500 కోట్ల లిక్విడేషన్ విలువ కడితే, ఆర్బీఎస్ఏ విలువ రూ.13,200 కోట్లుగా ఉంది. ► రిలయన్స్ క్యాపిటల్ కోసం నాలుగు సంస్థలు బిడ్డింగ్ వేశాయి. వీటి బిడ్డింగ్ విలువ తాజా లిక్విడేషన్ అంచనా విలువకంటే 30 నుంచి 40 శాతం తక్కువగా ఉండడం గమనార్హం. ► రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు అందుకున్న అత్యధిక బిడ్ విలువ చూస్తే... కాస్మియా ఫైనాన్షియల్, పిరమల్ గ్రూప్ కన్సార్టియంల ఆఫర్ రూ. 5,231 కోట్లు. ► హిందూజా రూ.5,060 కోట్లకు బిడ్ చేసింది. ► టొరెంట్, ఓక్ట్రీ బిడ్ల పరిమాణం వరుసగా రూ.4,500 కోట్లు, రూ.4,200 కోట్లుగా ఉంది. ► లిక్విడేషన్ విలువ– వాస్తవ బిడ్ విలువల మధ్య ఉన్న భారీ అంతరాన్ని దృష్టిలో ఉంచుకుని, తమ బిడ్లను సవరించమని సీఓసీ బిడ్డర్లను కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలుతెలిపాయి. రిలయన్స్ క్యాప్ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ విలువలు ఇలా... రిలయన్స్ క్యాపిటల్ వ్యాపారం విలువలో దాదాపు 90 శాతం వాటా కలిగిన ఆ సంస్థ– జీవితబీమా, సాధారణ బీమా వ్యాపారాల లిక్విడేషన్ విలువలు చూస్తే.. డఫ్ అండ్ ఫెల్పŠస్ వాల్యుయేషన్ నివేదిక ప్రకారం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ లిక్విడేషన్ విలువ రూ.7,000 కోట్లు. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విలువ రూ.4,000 కోట్లు. ఆర్బీఎస్ఏ విషయంలో ఈ అంచనా వరుసగా రూ.7,500 కోట్లు, రూ.4,300 కోట్లుగా ఉన్నాయి. రిలయన్స్ క్యాపిటల్ రుణ దాతలు.. మొత్తం సంస్థకు అలాగే సంస్థలోని విభిన్న వ్యాపారాలకు వేర్వేరుగా బిడ్డింగ్‌ను పిలవడం జరిగింది. సంస్థ మొత్తం కొనుగోలుకు పైన పేర్కొన్న నాలుగు సంస్థలు బిడ్డింగ్ వేయగా, సెక్యూరిటీస్, రియల్టీ, ఏఆర్సీలకు మూడు బిడ్లు వచ్చాయి. మూడు బిడ్ల విలువ కేవలం రూ.120 కోట్లుగా ఉంది. అయితే డఫ్ అండ్ ఫెల్ప్సŠ, ఆర్బీఎస్ఏలు తాజాగా ఇచ్చిన లిక్విడేషన్ విలువలు వరుసగా రూ.280 కోట్లు, రూ.240 కోట్లుగా ఉన్నాయి. కాగా, జీవితబీమా, సాధారణ బీమా వ్యాపారాలకు మాత్రం వేర్వేరుగా ఎటువంటి బిడ్లు దాఖలు కాలేదు. -
గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ఘటన...మున్సిపల్ ఆఫీసర్‌పై వేటు
అక్టోబర్ 30న మచ్చు నదిపై మోర్బీ తీగల వంతెన కూలి 135 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ సిన్హ్ జలాలను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఘటన జరిగినప్పుడూ సందీప్ జాలా ఛీఫ్ ఆఫీసర్‌గా ఉండటంతో వేటు విధించామని కమిటీ స్పష్టం చేసింది. దర్యాప్తుని నిష్పక్షపాతంగా జరిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐతే ఆయనపై ఇంకా ఎలాంటి నిర్ధిష్ట అభియోగాన్ని మోపలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు కమిటీ దర్యాప్తులో....మున్సిపాలిటీ బోర్డు అనుమతి పొందకుండానే సుమారు 15 ఏళ్ల పాటు ఒరెవా గ్రూపుతో ఒప్పందంపై మున్సిపాలిటీ సంతకం చేసిందని అధికారులు తెలిపారు. అదీగాక 139 ఏళ్ల నాటి బ్రిడ్జిని ప్రైవేట్ కంపెనీ అనుమతి లేకుండానే మళ్లీ తెరిచినప్పుడూ మున్సిపాలిటీ చేతులు దులుపుకుందనే విమర్శలు తలెత్తుతున్నాయి. బ్రిడ్జిని తిరిగి తెరిచేటప్పుడూ కూడా కంపెనీ ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసిందా లేదా అనేది తెలియదని మున్సిపాలిటీ చీఫ్ సందీప్ జాలా అన్నారు. ఈ బ్రిడ్జిని ఒరెవా కంపెనీ మార్చి7 నుంచి మరమత్తుల నిర్వహణ విషయమై ఏడు నెలలపాటు మూసేసింది. న్యూయర్ వేడుకల నేపథ్యంలోనే అక్టోబర్ 26న వంతెనను తిరిగి ప్రారంభించింది. అయితే ఒరేవా మేనేజింగ్ డ్రైరెక్టర్ జయసుఖ్ పటేల్ మోర్బి జిల్లా కలెక్టర్ మధ్య 2008 ఒప్పందం ప్రకారం సుమారు 10 సవంత్సరాల పాటు వంతెనను నిర్వహించడానకి కాంట్రాక్టు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐతే ఒరెవా కాంట్రాక్టుకు ఎలాంటి టెండర్లు నిర్వహించలేదని గుజరాత్ ప్రభుత్వ న్యాయవాది హెచ్ఎస్ పాంచల్ బుధవారం స్థానిక కోర్టుకు తెలిపారు. అంతేగాదు కేవలం బ్రిడ్జి ప్లాట్‌ఫాంని మాత్రమే ఒరెవా గ్రూప్ మార్చిందని, తెగిపడిన కేబుల్ విభాగం బలహీనంగా తుప్పుపట్టి ఉందని పాంచల్ ఆరోపణలు చేశారు. అయితే మరో ప్రభుత్వ అధికారి 2018లోనే ఒప్పందం ముగిసిన ఒరెవాతో అనబంధ సాగించిందని, రాజ్‌కోట్ కలెక్టర్ కార్యాలయం కొత్త ఒప్పందం కుదుర్చుకునే వరకు వంతెనను నిర్వహించడానికి ఒరేవా మేనేజింగ్ డైరెక్టర్ పటేల్‌కు అనుమతి ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆగస్టులో టికెట్ పీజు పెంచాలన్న కంపెనీ ప్రతిపాదనను సైతం మున్సిపల్ బోర్డు తిరస్కరించిందని అధికారి తెలిపారు. ఈ ఏడాది ఒప్పందం ప్రకారం పెద్దలకు రూ.15, 12 సంవత్సారాల కంటే తక్కువ వయసు ఉన్నవారికి రూ. 10గా నిర్ణయించారు. ఈ మేరకు ఒరెవా గ్రూపుకు చెందని నలుగురు అధికారులను, మరమత్తులు కేటాయించిన కాంట్రాక్టర్లు ప్రకాశ్ పర్మార్, దేవాంగ్ పర్మార్‌లతో సహా తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఈ ఘటనపై దర్యాప్తు చేసి నివేదికను సిద్ధం చేసి త్వరతగతిన ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. -
నయన్ సరోగసీ వివాదం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం?
లేడీ సూపర్‌స్టార్ నయనతారకు సరోగసీ వివాదంపై తమిళనాడు ప్రభుత్వం ఆమెకు షాకిచ్చింది. ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన నయనతార-విఘ్నేశ్ శివన్‌లు 5 నెలలు తిరక్కుండానే కవలకు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. దీంతో వారు సరోగసీ(అద్దె గర్భం) ద్వారానే తల్లిదండ్రులు అయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించింది. దీంతో ప్రస్తుతం నయన్ సరోగసీ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు షాకిచ్చింది. చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ! వరుడు అతడేనా? దీనిపై విచారణ జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నయన్ సరోగసీపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కాగా వారు తల్లిదండ్రులు కావడంపై ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సి ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యన్ మీడియాతో పేర్కొన్నారు. అయినప్పటికీ దీనిపై ఇప్పటి వరకు నయన్ దంపతులు స్పందించకపోవడం గమనార్హం. చదవండి: నేనేమి పెద్ద అందగత్తెను కాదు..: జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు -
నిగూఢంగానే మిగిలిన స్పైవేర్
పౌరుల గోప్యతకూ, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకూ పెనుముప్పు కలిగించ గలదని దేశమంతా భావించిన స్పైవేర్ పెగసస్ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదిక నిరాశనే మిగిల్చింది. మన దేశంలో మొత్తం 300 మంది ఫోన్లపై ఈ స్పైవేర్ దాడి చేసిందనీ, అందులో పాత్రికేయులతోపాటు కేంద్రంలోని ఇద్దరు మంత్రులూ, విపక్ష నేతలు ముగ్గురూ, రాజ్యాంగ పదవిలో ఉన్న ఒకరు, వ్యాపారవేత్తలు, పౌరహక్కుల నాయకులు ఉన్నారనీ అప్పట్లో బయటికొచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం నిరుడు అక్టోబర్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిటీ పరిశీలనకు 29 మంది తమ ఫోన్లు అందజేయగా అందులో అయిదు ఫోన్లలో మాల్వేర్ ఉన్నట్టు గుర్తించారు. అది పెగసస్ సాఫ్ట్‌వేరా కాదా అన్నది కమిటీ తేల్చలేకపోయిందని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తెలిపింది. నిపుణుల కమిటీ నివేదిక, పర్యవేక్షించిన మాజీ న్యాయమూర్తి నివేదిక సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో ఉంచబోతోంది. ఆ తర్వాతగానీ ఈ విచారణ లోతుపాతులు తెలియవు. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ రూపొందించిన పెగసస్ గురించి నిరుడు వెల్లడైనప్పుడు ప్రపంచ దేశాల ప్రజానీకమంతా నివ్వెర పోయింది. పలు ప్రభుత్వాలు ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి తమ కంట్లో నలుసుగా మారినవారిపై నిఘా పెట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ స్పైవేర్‌ను మన ప్రభుత్వం 2017లో కొనుగోలు చేసిందని మొన్న జనవరిలో ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక వెల్లడించింది. ఇజ్రాయెల్‌తో రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందంలో భాగంగానే ఇది జరిగినట్టు ఆ పత్రిక కథనం. మరో ఆసక్తికరమైన సంగతేమంటే... ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి చంద్రబాబు సర్కారు ఈ స్పైవేర్‌ను కొన్న దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇలా ఇంటా బయటా అందరూ కోడై కూస్తున్నా కేంద్రం నోరు మెదపలేదు. పార్లమెంటులో అలజడి రేగినా, నిరుడు వర్షాకాల సమావేశాలు ఈ అంశంపైనే తుడిచిపెట్టుకుపోయినా ‘భద్రతా కారణాల రీత్యా’ ఏమీ చెప్పలేమన్న గంభీరమైన ప్రత్యుత్తరంతో సరిపెట్టింది. సర్వోన్నత న్యాయస్థానంలోనూ అదే వైఖరి తీసుకుంది. ఇక చంద్రబాబు సంగతి చెప్పనవసరం లేదు. ఆయన మొదటినుంచీ దబాయింపుతో నెట్టుకొస్తున్నారు. మన స్వాతంత్య్రోద్యమం ప్రజాజీవితంలోకి ఎన్నో కొత్త విలువలను మోసుకొచ్చింది. అట్టడుగు పౌరులకు సైతం ప్రజాస్వామ్య ఫలాలు అందాలన్న ఆకాంక్షతో ఆ విలువల ప్రాతిపదికనే మన రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా, సమస్యలెన్ని ఎదురవుతున్నా అవన్నీ సంపూర్ణ రిపబ్లిక్ ఆవిర్భావానికి దేశం పడుతున్న పురుటి నొప్పులుగా మొదట్లో అందరూ భావించారు. కానీ రాను రాను ప్రజాస్వామ్యాన్ని ఛిద్రం చేస్తున్నవారిదే పైచేయి అవుతున్న వైనం కనబడుతూనే ఉంది. ఈ పరిణామాలే చివరకు పెగసస్ వంటి స్పైవేర్ కొనుగోలుకు దారితీసినట్టు భావించాలి. పెగసస్ గురించి అధికారికంగా ఆధారాలేవీ బయటపడకపోయినా భీమా కోరెగావ్ కేసులో ఇరుక్కున్న ఒకరిద్దరి కార్యకర్తల లు, కంప్యూ టర్లలో అవాంఛనీయమైన సాఫ్ట్వేర్ చొరబడటంలో ఆ సాఫ్ట్వేర్ పాత్ర ఉందన్న సంగతి వెల్లడైంది. తమ స్పైవేర్‌ను ‘బాధ్యతాయుత ప్రభుత్వాలకు’ విక్రయించాం తప్ప ప్రైవేటు వ్యక్తులెవరికీ అంద జేయలేదని ఎన్ఎస్ఓ స్పష్టంగా చెబుతోంది. ఆ ‘బాధ్యతాయుత’ ప్రభుత్వాల జాబితా అది బయట పెట్టకపోయినా, వ్యక్తులెవరికీ ఆ సంస్థ విక్రయించలేదన్న సంగతైతే మీడియా సంస్థల అంతర్జాతీయ కన్సార్షియం దర్యాప్తులో తేటతెల్లమైంది. పైగా ధర రీత్యా ఆ సాఫ్ట్వేర్ బడా కోటీశ్వరులకు తప్ప అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇటు కేంద్రం నడత సందేహాలను నివృత్తి చేయకపోగా మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. గూఢచర్యం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను కేంద్రం ఖండిస్తున్న మాట నిజమే అయినా... రాజ్యాంగ పదవిలో ఉన్నవారిపై, కేంద్రమంత్రులపై నిఘా కొనసాగిందన్న అంశంలో అది నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోవడం వింత కాదా? ప్రభుత్వ సంస్థలేవీ ఆ స్పైవేర్‌ను వినియోగించలేదని ప్రకటిస్తున్న ప్రభుత్వం, తామే కాదు... వేరెవరూ కూడా ఆ పని చేయలేదని నిర్ద్వంద్వంగా ఎందుకు చెప్పలేకపోతోంది? కనీసం ఆ విషయంలో దర్యాప్తు చేశామనీ, ఫలానా అంశాలు వెల్లడయ్యాయనీ ఎందుకు వివరించడం లేదు? బహిరంగ అఫిడ విట్‌లో వివరాలు పొందుపరచడం సాధ్యపడదనీ, నిపుణుల కమిటీ నియామకానికి తనను అను మతిస్తే ఆ కమిటీకి నివేదిస్తాననీ నిరుడు కేంద్రం చేసిన వినతిని సుప్రీంకోర్టు అంగీకరించలేదు. తానే కమిటీ ఏర్పాటుచేసింది. దానికైనా కేంద్రం వివరాలందజేస్తే బాగుండేది. ఆ పని చేయకపోవడం వల్ల కమిటీ నివేదిక కొత్తగా ఏమీ చెప్పలేకపోయింది. దేశం మొత్తాన్ని కుదిపేసిన పెగసస్ వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం ముందు కేంద్ర ప్రభుత్వం నీళ్లు నమలడం, దాటేయడం ఎవరి సలహా పర్యవసానమో గానీ ఈ వైఖరి దాని ప్రతిష్ఠను ఏమాత్రం పెంచదు. దేశ పౌరులనుంచి చట్టబద్ధ ప్రవర్తనను ఆశించే ప్రభుత్వాలూ, చట్ట ఉల్లంఘనకు పాల్పడే పౌరులపై చర్యలు తీసుకునేందుకు సర్వాధికారాలు ఉన్న ప్రభుత్వాలూ రాజ్యాంగ నైతికతకు కట్టుబడి ఉండాలి. ఆదర్శవంతంగా మెలగాలి. రాజ్యమే రాజ్యాంగ ఉల్లంఘ నకు పాల్పడుతుంటే, అది రివాజుగా మారితే ఆ సమాజాన్ని కాపాడటం ఎవరి తరమూ కాదు. -
సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం కొత్త కమిటీ
సాక్షి, అమరావతి: సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్‌తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగ సంఘాలతో కొత్త కమిటీ చర్చలు జరపనుంది. చర్చల తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. చదవండి: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం సమావేశం -
టీఆర్ఎస్ ప్లీనరీ కోసం 7 కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) వేదికగా జరిగే టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల (ప్లీనరీ) ఏర్పాట్లపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం ఇక్కడ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గ్రేటర్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతోపాటు పోలీసు, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి 24 మందితో 7 కమిటీలను కేటీఆర్ ఏర్పాటు చేశారు. ఆహ్వానితులను మొత్తం 22 కేటగిరీలుగా విభజించి వారిని మాత్రమే సభా ప్రాంగణంలోకి అనుమతించాలన్నారు. ఆహ్వానాలు అందుకున్న ప్రతినిధులంతా 27న ఉదయం 10 గంటలకల్లా సభా ప్రాంగణానికి చేరుకొని 11 గంటల్లోగా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ప్లీనరీ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులేవీ కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 27న గ్రామ పంచాయతీలు, వార్డుల్లో పార్టీ జెండాలు ఎగరేయాలని చెప్పారు. ఈ కార్యక్రమాలను నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు సమన్వయం చేయాలని, జంట నగరాల అలంకరణ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు కాదు.. పార్టీయే సుప్రీం పార్టీ నేతలతో భేటీలో మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై మండిపడ్డారు. ప్లీనరీకి తమ అనుమతి లేకుండా ఇతరులు స్వాగత తోరణాలు ఏర్పాటు చేయకుండా నిరోధించాలని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి సూచించగా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘ఎమ్మెల్యేలు తామే సుప్రీం అనుకుంటే కుదరదు. పార్టీయే సుప్రీం అనే విషయం గుర్తించాలి. పార్టీ లేకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు లేరు. ఇది రాచరికం కాదు.. ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి రాజులు కాదు. ఇతరులకు దీటుగా మీరు కూడా ఏర్పాట్లు చేయండి. మరొకరు ఏర్పాట్లు చేయొద్దని చెప్పడం సరికాదు. ఉద్యమకారులం అని చెప్పుకుంటూ క్రమశిక్షణ తప్పితే కుదరదు. పాత, కొత్త నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి’ అని హితవు పలికారు. కమిటీలు ఇవీ... 1. ఆహ్వాన కమిటీ: సబితా ఇంద్రారెడ్డి (మంత్రి), రంజిత్‌రెడ్డి (ఎంపీ), అరికెపూడి గాంధీ (ఎమ్మెల్యే), విజయలక్ష్మి గద్వాల్ (మేయర్), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఎమ్మెల్యే) 2. సభావేదిక ప్రాంగణం అలంకరణ కమిటీ: గోపీనాథ్ (ఎమ్మెల్యే), గ్యాదరి బాలమల్లు (టీఎస్ఐఐసీ చైర్మన్), మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి (పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్) 3. ప్రతినిధుల నమోదు, వలంటీర్ల కమిటీ: శంభీపూర్ రాజు (ఎమ్మెల్సీ), రావుల శ్రీధర్‌రెడ్డి (టీఎస్‌ఈఐడీసీ చైర్మన్), మన్నె క్రిషాంక్ (టీఎస్ఎండీసీ చైర్మన్) 4. పార్కింగ్ కమిటీ: కేపీ వివేక్ (ఎమ్మెల్యే),బండి రమేశ్ (రాష్ట్ర కార్యదర్శి), బొంతు రామ్మోహన్ (మాజీ మేయర్) 5. ప్రతినిధుల భోజన కమిటీ:మాధవరం కృష్ణారావు (ఎమ్మెల్యే), నవీన్‌రావు (ఎమ్మెల్సీ), ఎం. సుధీర్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్యే) 6. తీర్మానాల కమిటీ: మధుసూదనాచారి(ఎమ్మెల్సీ), పర్యాద కృష్ణమూర్తి, శ్రీనివాస్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ) 7. మీడియా కమిటీ: బాల్క సుమన్ (ఎమ్మెల్యే), భానుప్రసాద్ (ఎమ్మెల్సీ), కర్నె ప్రభాకర్(మాజీ ఎమ్మెల్సీ), గువ్వల బాలరాజు (విప్) -
విభజన సమస్యలపై త్రిసభ్య కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన వివాదాలను పరిష్కరించే దిశగా కేంద్రం ఎట్టకేలకు ముందడుగు వేసింది. విభజన వివాదాలపై అధ్యయనం చేసి పరిష్కారాలను సిఫార్సు చేసేందుకు కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఈ నెల 8న త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తరఫున ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్.ఎస్. రావత్, కె. రామకృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. ఈ సబ్ కమిటీ ఈ నెల 17న ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా తొలి సమావేశం నిర్వహించనుంది. వాస్తవానికి 9 అంశాల ఎజెండాతో సమావేశం నిర్వహించనున్నామని రెండు రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ శుక్రవారం లేఖ రాసింది. అయితే ఆ ఎజెండాను 5 అంశాలకు కుదించామంటూ శనివారం సాయంత్రం మరో లేఖను పంపింది. మొదటి లేఖలో త్రిసభ్య కమిటీ పరిష్కారయోగ్యమైన సిఫార్సులు చేయాలని సూచించింది. రెండో సర్క్యులర్‌లో మాత్రం సమావేశం ఎజెండాలో మార్పులు చేసినట్లు పేర్కొంది. కమిటీ ప్రతి నెలా సమావేశమై.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా గత నెల 12న నిర్వహించిన సమావేశంలోనూ విభజన చట్టంలోని అంశాల గురించి చర్చించినా ఏ అంశమూ పరిష్కారం దిశగా ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీ ప్రతి నెలా సమావేశమై విభజన అంశాలను చర్చించి పరిష్కారమయ్యేలా కృషి చేయాల్సి ఉంటుంది. ఎజెండాలోని అంశాలు సవరించిన ఎజెండాలో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)కు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సిన బకాయిలు, పన్నుల వ్యత్యాసాల తొలగింపు, నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల విభజన, ఏపీ/తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థల రుణాల బట్వాడా అంశాలు ఉన్నాయి. ఎజెండా నుంచి తొలగించినవి వనరుల లోటు, రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతంలోని వెనుకబడిన 7 జిల్లాలకు అభివృద్ధి నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు. ఏజెండాలోని అంశాల గురించి.. – తెలంగాణ డిస్కంల నుంచి రూ.3,442 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు రావాల్సి ఉందని ఏపీ జెన్కో చెబుతోంది. ఏపీ విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను సర్దుబాటు చేశాక వాటి నుంచి తమకు రూ.12,111 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ విద్యుత్ సంస్థలు వాదిస్తున్నాయి. బకాయిల కోసం ఏపీ విద్యుత్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. – నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌కు కేటాయించిన 250 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోగా ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించి స్టే పొందింది. కోర్టు కేసును ఉపసంహరించుకుంటేనే షెడ్యూల్–9లోని సంస్థల విభజనలో పురోగతి సాధ్యం కానుందని తెలంగాణ పేర్కొంటోంది. – నగదు నిల్వలు, డిపాజిట్ల విభజన విషయంలో ఏపీ నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన రూ.495 కోట్ల నిధులు రావాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. హైకోర్టు, రాజ్ భవన్ వంటి ఉమ్మడి సంస్థల నిర్వహణకు ఖర్చు చేసిన రూ.315 కోట్లనూ ఏపీ ఇవ్వాల్సి ఉందని వాదిస్తోంది. నిర్మాణంలో ఉన్న భవనాల్లో వాటా, రూ.456 కోట్ల సంక్షేమ నిధి, రూ.208 కోట్ల నికర క్రెడిట్ ఫార్వర్డ్ నిధులు సైతం ఏపీ నుంచి రావాల్సి ఉందంటోంది. – విభజన సమయంలో వాణిజ్య పన్నుల ఆదాయ పంపకాల్లోని వ్యత్యాసాల పరిష్కారంపై చర్చ జరగనుంది. – ఉమ్మడి రాష్ట్రంలో పౌర సరఫరాల సంస్థ తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ఏ రాష్ట్రం ఎంత భరించాలో చర్చించనున్నారు. -
AP: ఉపాధ్యాయ సంఘాల బండారం బయటపెట్టిన పీఆర్సీ స్టీరింగ్ కమిటీ
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ సంఘాల బండారం పీఆర్సీ స్టీరింగ్ కమిటీ బయటపెట్టింది. హెచ్ఆర్ఏ విషయంలో తెలంగాణకు సమానంగా తెచ్చుకున్నామని.. పీఆర్సీ ఐదేళ్లకు ఒకసారి ఇచ్చేలా చూశామని పీఆర్సీ జేఏసీ నేతలు అన్నారు. అదనపు పెన్షన్, సీసీఏ కూడా వచ్చిందన్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్ కోణంలో ఇది చెత్త బడ్జెట్: విజయసాయిరెడ్డి ‘‘ఉపాధ్యాయ సంఘాలు ప్రతి అంశంలో చర్చల్లో పాల్గొన్నాయి. అప్పుడే ఉపాధ్యాయ సంఘాలు చర్చల నుంచి బయటకు రావాల్సింది. ఫిట్‌మెంట్‌పై అప్పుడే బయటకు వచ్చి చెప్పాల్సింది. సమ్మె విరమించుకుందామని కూడా ఉపాధ్యాయ సంఘాలు చెప్పాయి. ఉపాధ్యాయుల ఆందోళనలో వేరే శక్తులు ఉన్నాయని’’ పీఆర్సీ జేఏసీ నేతలు అన్నారు. ఉపాధ్యాయ ముసుగులో దుష్ఫ్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నిర్ణయంలోనూ 20 మంది అభిప్రాయం మేరకే ముందుకెళ్లామన్నారు. మెరుగైన ప్రయోజనం వచ్చింది కాబట్టే సమ్మె విరమించామన్నారు. ఉపాధ్యాయ సంఘాలు మంత్రులు పక్కన కూర్చుని మాట్లాడలేదా? గ్రాట్యుటీ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై చర్చ జరిగినప్పుడు మీకు తెలియదా?. అన్నింటికీ ఒప్పుకుని ఇప్పుడు ఇలా మాట్లాడతారా అంటూ ఉపాధ్యాయ సంఘాలను పీఆర్సీ జేఏసీ నేతలు నిలదీశారు. -
కనీస మద్దతు ధరపై కమిటీ
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై కమిటీని ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. కమిటీ విషయంలో అనుమతి కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశామని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే ఈ కమిటీని తీసుకురావాలని ఎన్నికల సంఘం సూచించిందని అన్నారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన అనుబంధ ప్రశ్నకు తోమర్ సమాధానమిచ్చారు. ఎంఎస్పీకి రూ.2.37 లక్షల కోట్లు గత ఏడేళ్లలో మద్దతు ధరతో పంటల కొనుగోలు రెండింతలు పెరిగిందన్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఇందుకోసం రూ.2.37 లక్షల కోట్లు కేటాయించామన్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తోందని, పీఎం–కిసాన్ పథకంతోపాటు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేస్తోందని వివరించారు. రైతుల నుంచి వరి, గోధుమలను కనీస మద్దతు ధరతో మరింత అధికంగా కొనుగోలు చేస్తామని అన్నారు. తృణధాన్యాలు, నూనె గింజలు సైతం కనీస మద్దతు ధరతో సేకరిస్తామని పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పప్పుగింజలను ప్రజలకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే అందుకు అనుమతి మంజూరు చేస్తామని నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. కనీస మద్దతు ధర విషయంలో ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవడం లేదని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. యూపీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని రైతులకు పిలుపునిచ్చింది. -
భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో జరిగిన భద్రతాలోపంపై విచారణకు కేంద్ర హోంశాఖ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని గురువారం ఏర్పాటు చేసింది. కమిటీకి కేబినెట్ సెక్రటరీ (సెక్యూరిటీ) సుధీర్ కుమార్ సక్సేనా నాయకత్వం వహిస్తారు. ఇందులో ఐబీ జాయింట్ డైరెక్టర్ బల్బీర్ సింగ్, ఎస్పీజీ ఐజీ సురేశ్ సభ్యులు.∙వేగంగా నివేదిక అందించాలని కమిటీని హోంశాఖ కోరింది. అలాగే ఘటనపై తక్షణ నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని హోంశాఖ ఆదేశించింది. మరోవైపు ఇదే ఘటనపై విచారణకు పంజాబ్ ప్రభుత్వం ఇద్దరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి మెహతాబ్ సింగ్ గిల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాగ్ వర్మతో కూడిన ఈ కమిటీ మూడు రోజుల్లో నివేదికనందిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి పంజాబ్‌కు వచ్చిన ప్రధాని తీవ్రమైన భద్రతాలోపం కారణంగా బుధవారం అర్ధాంతరంగా ఢిల్లీకి వెనుదిరిగిన సంగతి తెలిసిందే! గురువారం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ ఫిరోజ్‌పూర్ ఘటనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించారు. భద్రతాలోపంపై రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారని కోవింద్ కార్యదర్శి తెలిపారు. ఈ విషయంపై దృష్టి పెట్టినందుకు రాష్ట్రపతికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం తన ఆందోళనను వెలిబుచ్చారు. గురువారం ఆయన మోదీతో మాట్లాడారు. నేడు సీజేఐ ముందుకు భవిష్యత్‌లో ఇలాంటి భద్రతా లోపాలు జరగకుండా ఫిరోజ్‌పూర్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని బెంచ్ ముందు ఈ పిటిషన్ దాఖలైంది. అత్యవసర అంశం కింద దీన్ని చేపట్టి గురువారమే దీనిపై విచారణ జరపాలని సింగ్ కోరారు. అయితే పిటిషన్ కాపీని పంజాబ్ ప్రభుత్వానికి పంపాలని, దీన్ని శుక్రవారం విచారణకు చేపడతామని బెంచ్ పేర్కొంది. పీఎం పర్యటన సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న అన్ని భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన సాక్ష్యాలను భటిండా జిల్లా న్యాయమూర్తికి స్వాధీ నం చేయాలని ఆదేశించాలని లాయర్స్ వాయిస్ కింద దాఖలు చేసిన పిటిషన్లో సింగ్ కోరారు. ఉద్దేశపూర్వక చర్యల వల్లే భద్రతా వైఫల్యం చోటుచేసుకుందని... ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భద్రతా లోపమా.. రైతు ఆగ్రహమా? తేల్చండి: తికాయత్ నోయిడా: భద్రతా వైఫల్యమా, రైతుల ఆగ్రహామా? ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన అర్ధంతరంగా ముగియడానికి ఈ రెండింటిలో ఏది కారణమో తేల్చడానికి విచారణ జరపాలని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ గురువారం డిమాండ్ చేశారు. ‘భద్రతా కారణాల వల్లే ఫిరోజ్‌పూర్ ర్యాలీ రద్దయిందని బీజేపీ అంటోంది. సభాస్థలిలో కుర్చీలన్నీ ఖాళీగా ఉండటంతోనే ప్రధాని అర్ధంతరంగా వెనుదిరిగారని సీఎం చన్నీ అంటున్నారు. దీంట్లో ఏది నిజమో నిగ్గుతేలాలి’ అని తికాయత్ ట్వీట్ చేశారు. -
ఇంతమంది చనిపోతుంటే ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తోంది?
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 91 శాతం ప్రమాదాలకు అధిక వేగమే కారణమని నివేదికలు చెబుతున్నాయి. అలాంటప్పుడు మితిమీరిన వేగాన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తోంది? రోడ్డు ప్రమాదాల్లో ఒక్కరు కూడా మరణించకుండా కార్యాచరణ మొదలు పెడితే కనీసం పదేళ్లలో మంచి ఫలితాలొస్తాయి. కానీ అలాంటి లక్ష్యాలేవీ పెట్టుకున్నట్టు కనిపించడం లేదు’ అని రోడ్డు భద్రతపై నియమించిన సుప్రీంకోర్డు కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రే అన్నారు. రాష్ట్రంలో రోడ్డు భద్రత చర్యలు బాగా మెరుగుపడాల్సిన అవసరముందని కమిటీ అధ్యయనంలో తేలిందన్నారు. జనవరిలో వారం పాటు రాష్ట్రంలో పర్యటించి ఇక్కడి రోడ్డు భద్రత చర్యలు, ప్రమాదాల్లో గాయపడ్డ వారికి అత్యవసర వైద్యాన్ని అందించే ఆస్పత్రుల పరిస్థితిని తెలుసుకుంటానని చెప్పారు. రోడ్డు భద్రతకు సంబంధించి సమావేశాల్లో పాల్గొనేందుకు తమిళనాడు వెళ్తున్న ఆయన, విమానాల మార్పులో ఉండే విరామ సమయంలో రాష్ట్ర అధికారులతో ప్రత్యేకంగా భేటీఅయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులను కొన్ని అంశాలపై ఆయన సూటిగా నిలదీశారు. నియంత్రణ చర్యలకు సంబంధించి అధికారుల వివరాలకు సంతృప్తి వ్యక్తం చేయలేదు. చదవండి: ములుగు జిల్లాలో కాల్పుల కలకలం.. కానిస్టేబుల్ తూటాలకు ఎస్ఐ బలి ప్రమాదాలు జరగకుండా చూడాలిగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారికి అత్యవసర వైద్యం అందించేందుకు మెరుగైన చర్యలు తీసుకుంటున్నామని, ట్రామా కేర్ సెంటర్లను అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు పేర్కొనడాన్ని జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రే తప్పుబట్టారు. ‘క్షతగాత్రులకు మెరుగైన వైద్యం సరే, అసలు ప్రమాదాలు జరగకుండా చూడాలిగా’ అని అన్నారు. ‘జపాన్, జర్మనీ, చైనాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా మృతుల సంఖ్య వేలల్లోనే ఉంటోందని, మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షన్నర మంది మరణిస్తున్నారని చెప్పారు. 2014లో రాష్ట్రంలో 70 లక్షల వాహనాలుంటే ఇప్పుడు రెట్టింపయ్యాయని, ప్రమాదాల సంఖ్య ఆ స్థాయిలో పెరగలేదని అధికారులు వివరించగా ఆయన స్పందిస్తూ.. ‘ఆ స్థాయిలో పెరగలేదని సంతోషపడొద్దు. తగ్గించలేకపోయామని గుర్తించాలి’ అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం దేశంలో 9వ స్థానంలో ఉందని, దీనిపై యంత్రాంగం దృష్టి సారించాలని సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తే వ్యక్తి గత వాహనాల వాడకం తగ్గుతుందని సూచించారు. చదవండి: చావు తెలివంటే ఇదే.. ట్రిపుల్ రైడింగ్.. హెల్మెట్ లేదు.. మూతికి ఉండాల్సిన మాస్కేమో! రోడ్లు బాగు చేస్తున్నాం.. సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం రోడ్డు భద్రతలో నిట్ వరంగల్ సేవలను తీసుకుంటామని, రోడ్డు భద్రత నిధికి మురిగిపోని విధంగా రూ.25 కోట్లు కేటాయించనున్నామని కమిటీ చైర్మన్‌కు అధికారులు వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.1,839 కోట్లతో సమగ్ర రోడ్డు అభివృద్ధి ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. నగరంలో ఇప్పటికే 6 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మరో 6 లక్షలు ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారులు చెప్పారు. ఈ ఏడాది నిబంధనలు పాటించని 10,728 మంది డ్రైవింగ్ లైసెన్సు లు రద్దు చేశామని అధికారులు తెలిపారు. -
Congress Party: ‘హుజురాబాద్’ ఫలితం.. 60 వేల నుంచి 3 వేలకు..
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ ఫలితం కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘోర పరాజయం నేపథ్యంలో బుధవారం గాంధీభవన్‌లో వాడివేడిగా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం సాగింది. సమావేశానికి కోమటిరెడ్డి, జగ్గారెడ్డి హాజరుకాలేదు. సమావేశం మధ్యలోనే జానారెడ్డి వెళ్లిపోయారు. రేవంత్ వ్యవహారశైలిపై కాంగ్రెస్ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: హుజురాబాద్ :1978 నుంచి కాంగ్రెస్‌కు నో చాన్స్.. హుజూరాబాద్‌లో పడిపోయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు హుజూరాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు ఘోర పరాభవాన్ని చవి చూపించింది. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా దాదాపు 30 శాతం ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీ మంగళవారం దారుణ పరాజయం పాలయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బల్మూరి వెంకట్‌కు కేవలం 3,014 ఓట్లు (1.5 శాతం) మాత్రమే పోలయ్యాయి. కనీసం డిపాజిట్ దక్కించుకునేందుకు దరిదాపుల్లో కూడా లేకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలను నివ్వెర పరిచింది. శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సందర్భంగా సీనియర్లు చేసిన పలు వ్యాఖ్యలు పార్టీలో ఉన్న అసంతృప్తిని మరోసారి బహిర్గతం చేశాయి. చదవండి: కాంగ్రెస్‌లో హుజూరాబాద్ చిచ్చు: ‘బల్మూర్ వెంకట్‌ని బలి పశువు చేశారు’ టీఆర్ఎస్, బీజేపీల నడుమ హోరాహోరీ అన్నట్టుగా సాగిన ఈ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ గెలుస్తుందనే అంచనాలు ఎవరికీ లేకున్నా గత ఎన్నికల్లో 60 వేల పైచిలుకు ఓట్లు వచ్చిన నేపథ్యంలో ఈసారి కనీసం అందులో సగమైనా వస్తాయని భావించారు. కానీ పూర్తి నిరాశాజనకంగా కేవలం 3 వేల ఓట్లకు మాత్రమే పార్టీ పరిమితం అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కాంగ్రెస్ పార్టీకి ఇన్ని తక్కువ ఓట్లు రావడం ఇదే తొలిసారని రాజకీయ వర్గాలంటున్నాయి. దారుణ ఓటమికి కారణాలెన్నో.. ఇంతటి ఘోర పరాజయానికి అనేక బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. అభ్యర్థి ఎంపికలో విపరీత జాప్యం, కేడర్‌కు భరోసా ఇవ్వడంలో వైఫల్యం, మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం, అసలు తాము పోటీలో ఉన్నామనే భావనను అక్కడి ఓటర్లలో కలిగించడంలో విఫలం కావడంతోనే కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ చరిత్రలోనే అతి పెద్ద ఓటమిని పొందిందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఓవైపు టీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల ప్రచారం పేరుతో గ్రామాలను చుట్టి వస్తుంటే పార్టీ నేతలు కనీసం హుజూరాబాద్ వైపు కన్నెత్తి చూడకుండా వేరే ప్రాంతాల్లో బహిరంగసభలు, సమావేశాలు పెట్టి కాలయాపన చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో ఆయన ప్రభావం ఎక్కడా కనిపించలేదు. చిత్తుగా ఓటమిపై రచ్చ ఉప ఎన్నికలో పార్టీ ఘోర వైఫల్యంపై సీనియర్ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. మంగళవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక, సాగర్‌లలో పనిచేసినట్టు హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పనిచేయలేదనిఅన్నారు. ఈ ఎన్నికను రేవంత్ వదిలేశారని విమర్శించారు. ఉప ఎన్నికపై పార్టీ అధిష్టానానికి నివేదిక ఇస్తానని చెప్పారు. ఏదిఏమైనా టీఆర్ఎస్ ఓడిపోయినందుకు పండుగ చేసుకుందామన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో బల్మూరిని బలిపశువుని చేశారని వ్యాఖ్యానించారు. రేవంత్, భట్టిలు కలిసి తీసుకున్న నిర్ణయం వర్కవుట్ కాలేదన్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో దీనిపై సీరియస్‌గా చర్చ ఉంటుందని చెప్పారు. హుజూరాబాద్ తీర్పు ఊహించినట్టుగానే వచ్చిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఓటమిపై కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకోవాల్సి ఉందని చెప్పారు. -
పెగాసస్‌పై కమిటీ.. గొప్ప ముందడుగు: రాహుల్
న్యూఢిల్లీ: పెగాసస్ నిఘా వ్యవహారంపై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్వాగతించారు. ఇదొక పెద్ద ముందడుగు అని అభివర్ణించారు. సైబర్ నిపుణులతో కూడిన త్రిసభ్య కమిటీ దర్యాప్తుతో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పెగాసస్‌ను ఉపయోగించడం అంటే దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నమేనని ఆరోపించారు. పెగాసస్ నిఘా అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో మళ్లీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని రాహుల్ పేర్కొన్నారు. చర్చకు ప్రభుత్వం ఇష్టపడకపోయినప్పటికీ తాము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. -
మరోసారి జీఎస్టీ సమీక్షకు కేంద్రం రెడీ
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థ సమీక్షకు రాష్ట్రాల మంత్రులతో కూడిన రెండు కీలక కమిటీలను కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసింది. ఒక కమిటీకి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నేతృత్వం వహిస్తారు, మరొక కమిటీకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారథ్యం వహిస్తారు. వీటిపైనే దృష్టి రేట్ స్లాబ్‌లు– విలీనం, జీఎస్టీ మినహాయింపు వస్తువుల సమీక్ష, పన్ను ఎగవేతల గుర్తింపు, ఎగవేతలు నివారించడానికి మార్గాల అన్వేషణ, ట్యాక్స్ బేస్ పెంపు తత్సంబంధ అంశాలపై ఈ కమిటీలు సమీక్ష జరపనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. క్లిష్టమైన పరోక్ష పన్ను రేట్ల వ్యవస్థలు అన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకువస్తూ, నాలుగేళ్ల క్రితం (2017 జూలై నుంచి) జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థను మరింత సరళతరం చేయడంపై కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కమిటీలు ఇలా... బసవరాజు బొమ్మై నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ రెండు నెలల్లో తన నివేదికను సమర్పించనుంది. ఈ కమిటీలో పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రి అమిత్ మిశ్రా, కేరళ ఆర్థికమంత్రి కేఎన్ బాలగోపాల్, బిహార్ ఉపముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్ తదితరులు సభ్యులుగా ఉంటారు. మరో ఎనిమిది సభ్యులతో కూడిన కమిటీకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వం వహిస్తారు. వీరిలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగ రాజన్, ఛత్తీస్‌గఢ్ ఆర్థికమంత్రి టీఎస్ సింగ్ డియో ఉన్నారు. ఈ నెల 17న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ ఈ కమిటీల ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత రేట్ల వ్యవస్థ ఇదీ... ప్రస్తుతం ప్రధానంగా నాలుగు జీఎస్టీ రేట్ల వ్యవస్థ అమలవుతోంది. నిత్యావసరాలపై కనిష్టంగా 5 శాతం పన్ను అమలవుతుండగా, కార్లపై అత్యధికంగా 28 శాతం పన్ను విధింపు ఉంది. 12 శాతం, 18 శాతం పన్ను స్లాబ్స్ కూడా ఉన్నాయి. లగ్జరీ, పొగాకు వంటి డీమెరిట్, సిన్ గూడ్స్‌పై ఉన్న అత్యధిక 28 శాతంపై సెస్ విధింపు కూడా అమలు జరుగుతోంది. 12 శాతం 18 శాతం శ్లాబ్‌లను ఒకటిగా చేయాలన్న డిమాండ్ గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తోంది. మినహాయింపుల కేటగిరీ నుంచి కొన్ని ఉత్పత్తులను తొలగించి, స్లాబ్‌ల హేతుబద్ధీకరణ వల్ల జరిగే రెవెన్యూ నష్టాలను పూడ్చుకోవాలని కూడా కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక తుది వస్తువులపై దాని ఇన్పుట్లపై విధించే పన్ను కంటే తక్కువ రేటును విధింపు (ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్) విషయంలో పన్ను వ్యత్యాసాలను ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్ తొలగించింది. మొబైల్ హ్యాండ్సెట్, పాదరక్షలు, వస్త్రాల విషయంలో ఈ రేటు వ్యత్యాసాలను సరిచేస్తూ సవరణలు జరిగాయి. పెట్రోలు విషయంలో.. జీఎస్టీ వ్యవస్థ అమల్లోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, సహజ వాయువు, క్రూడ్ ఆయిల్‌ను ఈ విధానం నుంచి మినహాయించారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కొనసాగించడానికి ఈ విధానం దోహదపడుతోంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోనికి తీసుకుని రావాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన అత్యున్నత స్థాయి విధాయక మండలి అసలు ఆ అంశంపైనే చర్చించకూడదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనివల్ల ఇటు రాష్ట్రాలు, అటు కేంద్రం ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండడమే కౌన్సిల్ నిర్ణయానికి కారణం. చదవండి : సెప్టెంబర్ వరకూ కేంద్ర రుణం రూ.7.02 లక్షల కోట్లు -
పెగాసెస్ విచారణకు నిపుణుల కమిటీ ఏర్పాటు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: దేశరాజకీయాలను కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణకు నిపుణుల కమిటీకి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కాగా ఈ కమిటీ ఏర్పాటు కోసం కొంత మంది నిపుణులను తాము ఎంపిక చేయాలని భావించగా, కొందరు మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల విముఖత చూపుతున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. ఈ కారణంగానే కమిటీ ఏర్పాటు ఆలస్యమైందని తెలుపుతూ.. కమిటీ సభ్యుల నియామకంపై తుది నిర్ణయం తీసుకొని వచ్చే వారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సీజేఐ తెలిపారు. ఇజ్రాయెల్ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసెస్ సాఫ్ట్వేర్ ద్వారా భారత్‌లోని పలువురు ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్‌పై నిఘా పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పౌరుల వ్యక్తిగత గోప్యతను ఈ చర్య భంగం కలిగించిందని ప్రతిపక్షాలు మండిపడుతూ పెగాసెస్ నిఘాపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ కూడా చేశాయి. అయితే, ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. చదవండి: రాహుల్, ప్రియాంకలకు అనుభవం లేదు: అమరీందర్ -
ఏపీ పాఠశాలల్లోని ముగిసిన పేరెంట్స్ కమిటీ ఎన్నికలు
-
మల్లన్నసాగర్‌ను పరిశీలించిన నిపుణుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను నిపుణుల కమిటీ శనివారం పరిశీలించింది. ప్రాజెక్టులో నీటిని నింపడంపై పలు సూచనలు చేసింది. రిజర్వాయర్ నిర్మాణ డిజైన్స్, డ్రాయింగ్స్, జియాలజిస్టులు ఇచ్చిన టెస్టు రిపోర్టులు, వివిధ ల్యాబ్‌ల నుంచి వచ్చిన రిపోర్టులు, నిర్మాణంలో అనుసరించిన టెక్నికల్ ప్రొసీజర్స్‌ను అధ్యయనం చేసి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. దీనిలో ఈఎన్సీ (జనరల్) మురళీధర్, ఈఎన్సీ (గజ్వేల్) హరిరాం, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ శ్రీధర్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు ఉమాశంకర్, శశిధర్ సభ్యులుగా ఉన్నారు. వీరు రిజర్వాయర్ నిర్మాణ పద్ధతులు, సీవోటీ కట్టింగ్, ప్రాజెక్టు నింపే టైంలో చేయాల్సిన టెస్టులు తదితర అంశాలను పరిశీలించారు. ఇప్పటికే రిజర్వాయర్‌లో 4.90 టీఎంసీలను నింపారు. ప్రాజెక్టు మినిమం డ్రా లెవల్ వరకు నెమ్మదిగా నీటిని నింపాలని వారు సూచించారు. కమిటీ వెంట ప్రాజెక్టు సీఈ చంద్రశేఖర్, ఎస్ఈ వేణు, ఇంజనీర్లు ఉన్నారు. -
ఒకే వేదికపై ఆనంద్ మహీంద్రా, మహేంద్ర సింగ్ ధోనీ..!
న్యూఢిల్లీ: భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ ఒకే వేదికను పంచుకొనున్నారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భారీ మార్పులను తేవాలని రక్షణశాఖ భావిస్తోంది. అందుకుగాను బైజయంత్ పాండా నేతృత్వంలో ఎన్సీసీపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకుగాను అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీని రక్షణశాఖ ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీతో, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాలకు కూడా చోటు కల్పించారు. చదవండి: ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు కేంద్రం గ్యారంటీ ఈ కమీటీలో వారితో పాటుగా ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఎంపీ వినయ్ సహస్ర బుద్ధే, ఆర్థికశాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్, జామియా మిలియా ఇస్లామియా వీసీ నజ్మా అక్తర్, ఎస్ఎన్డీటీ వుమెన్స్ యూనివర్సిటీ మాజీ వీసీ వసుధా కామత్ ఈ కమిటీలో భాగస్వామ్యులుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎన్సీసీలో చేయదల్చుకున్న మార్పులపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. జాతి నిర్మాణంలో ఎన్సీసీ క్యాడెట్లు మరింత ప్రభావవంతంగా పాల్గొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సిఫార్సులు చేయనుంది. గతంలోని ఎన్సీసీలో ఉన్నవారి సేవలను ఎలా వినియోగించుకోవాలనే విషయంపై కూడా ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది. చదవండి: Gaganyaan Mission: గగన్‌యాన్ మిషన్ లాంచ్‌పై స్పష్టత..! -
సీడబ్ల్యూసీ ప్రతినిధిని నియమించాక రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం క్షేత్రస్థాయి పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీలో కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ప్రతినిధి సీఈ దేవేందర్‌రావు స్థానంలో మరొకరిని నియమించాక, కమిటీ ఏర్పాటు చేస్తామని కృష్ణా బోర్డు తెలిపింది. ఆ తర్వాత రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించి, నివేదిక ఇస్తామని వివరించింది. ఈ మేరకు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చెన్నై బెంచ్‌కు నివేదించింది. తుది నివేదిక సమర్పించేందుకు 3 వారాల గడువు ఇవ్వాలని శుక్రవారం ఎన్జీటీకి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే మధ్యంతర నివేదిక ఇచ్చారు. రాయలసీమ పథకం క్షేత్రస్థాయి పరిశీలనకు కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించామని నివేదికలో పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ తరఫున కృష్ణా–గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ (కేజీబీవో)లో సీఈగా పనిచేస్తున్న పి.దేవేందర్‌రావుతో పాటు కృష్ణా బోర్డు అధికారులతో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఈనెల 5న ఆ ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తెలంగాణకి చెందిన దేవేందర్‌రావు ను కమిటీలో నియమించడంపై ఈ నెల 3న ఎన్జీటీ వద్ద ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిందని వివరిం చారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలతో సంబం ధం లేని అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఈనెల 4న ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో దేవేందర్‌రావు స్థానంలో అదేస్థాయి అధికారిని నియమించాలంటూ సీడబ్ల్యూసీని కోరినట్లు నివేదించారు. సీడబ్ల్యూసీ ప్రతినిధిని నియమించిన వెంటనే కమిటీ ఏర్పాటు చేసి, సీమ ఎత్తిపోతలను పరిశీలించి నివేదిక సమర్పిస్తామని కృష్ణాబోర్డు పేర్కొంది. -
శబ్ద కాలుష్యానికి పాల్పడితే తప్పదు భారీమూల్యం..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పుడు రణగొణ ధ్వనులతో రద్దీగా ఉండే పట్టణ, నగర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అనేక సమస్యలు వస్తాయి. ప్రధానంగా శబ్ద కాలుష్యం బారిన పడేవారికే గుండెపోటు వచ్చే అవకాశాలున్నట్లు పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. నగరాల్లో జీవించేవారు శబ్దకాలుష్యం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఢిల్లీ వంటి నగరాల్లో శబ్ద కాలుష్యం మరీ అధికంగా ఉంటుంది. కాగా, ఢిల్లీలో శబ్ద కాలుష్య నియంత్రణకు.. కాలుష్య నియంత్రణ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. శబ్ధ కాలుష్యానికి పాల్పడితే భారీ జరిమానా చెల్లించుకోవాల్సిందే. శబ్ధ కాలుష్యాని పాల్పడే వారిపై సుమారు రూ.లక్ష వరకు జరిమానా వేయాలని కమిటీ సూచించింది. వేడుకలు, ర్యాలీల్లో బాణాసంచా కాలిస్తే రూ.10వేలు జరిమానా విధించనున్నారు. సైలెంట్ జోన్లలో బాణాసంచా పేలిస్తే రూ.20వేల జరిమానా విధించాలని కమిటీ సూచించింది. నిబంధనలను మళ్లీ మళ్లీ ఉల్లంఘిస్తే రూ.లక్ష వరకు జరిమానా వేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. Delhi Pollution Control Committee revises penalty for violation of noise rules: Rs 10,000 for noise through loudspeakers/public address systems, Rs 1 Lakh for Diesel Generator sets of over 1000 KVA; Rs 50,000 for sound-emitting construction equipment. The equipment will be seized pic.twitter.com/YvY2PxK3jT — ANI (@ANI) July 10, 2021 -
అక్రిడిటేషన్ల కమిటీల్లో మార్పులు సబబే
సాక్షి, అమరావతి: రాష్ట్ర, జిల్లా మీడియా అక్రిడిటేషన్ల కమిటీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ మీడియా ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థించే వారికే అక్రిడిటేషన్లు ఇస్తున్నారంటూ పిటిషనర్ చేసిన ఆరోపణలను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు నిరాధారమని తేల్చి చెప్పింది. తమకు మీడియా అక్రిడిటేషన్ కమిటీలో స్థానం కల్పించాలని కోరే చట్టబద్ధమైన, రాజ్యాంగ పరమైన హక్కు పిటిషనర్‌కు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. మీడియా అక్రిడిటేషన్ల కమిటీల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ మీడియా ఫెడరేషన్ గతేడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి విచారణ జరిపారు. ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆరోపణలకు తావివ్వకూడదన్న ఉద్దేశంతో.. అక్రిడిటేషన్ల జారీలో మరింత పారదర్శకత కోసమే వివిధ ప్రభుత్వాధికారులతో కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. వివక్షకు తావు లేకుండా ఈ కమిటీలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని వివరించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. కమిటీల్లో జర్నలిస్ట్ సంఘాలకు స్థానం కల్పిస్తే వారి మధ్య విబేధాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఏకపక్ష చర్యగా చెప్పలేమన్నారు. చట్టాలు చేసే విషయంలో ప్రభుత్వ యోగ్యతను పిటిషనర్ ప్రశ్నించలేరని తీర్పులో పేర్కొన్నారు. చదవండి: వైద్య విద్యార్థులకు మరో శుభవార్త.. ఏపీ: ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు -
కరోనా కట్టడికి ఐదుగురు మంత్రులతో కమిటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ నివారణ, పర్యవేక్షణ, పటిష్టంగా వ్యాక్సినేషన్ అమలు, కమాండ్ కంట్రోల్‌ను పర్యవేక్షణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో ఒక కమిటీని నియమించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 22వ తేది గురువారం ఉదయం 11గంటలకు మంగళగిరిలోని ఏపీఐసీసీ బిల్డింగ్‌లో మంత్రులు కమిటీ సమావేశం జరుగనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. ఈ కమిటీకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్‌గా.. సభ్యులుగా రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత, మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఉంటారని తెలిపింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకోవలసిన చర్యలు, హాస్పిటల్స్‌లో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలు, కమాండ్ కంట్రోల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు పలువురు ఉన్నతాదికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని పత్రికలో వెల్లడించారు. చదవండి: మానవ తప్పిదంతో కరోనా వేగంగా వ్యాప్తి -
శాసన రాజధానిలో మౌలిక వసతుల ఏర్పాటుపై కమిటీ
సాక్షి, అమరావతి: శాసన రాజధానిలో ఎటువంటి మౌలిక వసతులు, భవనాలు, గృహ సముదాయాలు ఉండాలనే దానిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి సీఎస్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో శాసన సభ కార్యదర్శి, సంబంధిత శాఖల అధికారులను సభ్యులుగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు. (చదవండి: ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం!) ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం -
మత విద్వేషాలకు భారీ కుట్ర
సాక్షి, అమరావతి: అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవిస్తున్న రాష్ట్ర ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో వైషమ్యాలను రగిల్చేందుకు భారీ కుట్ర జరుగుతోందని, ఇలాంటి సంఘ విద్రోహ చర్యల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మత సామరస్యానికి విఘాతం కలిగించేందుకు ఇటీవల భారీ కుట్ర జరుగుతోందన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీయడం ద్వారా సమాజాన్ని విచ్ఛిన్నం చేసి అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పథకం ప్రకారం కుట్రలకు పాల్పడుతున్నాయని, ఇటీవల దేవాలయాలపై జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి విధ్వంసకర శక్తులను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గురువారం విజయవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే దుశ్చర్యలు.. దేశవ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో దూసుకెళుతున్న ఆంధ్రప్రదేశ్‌లో మతకల్లోలాలను సృష్టించడం ద్వారా శాంతి భద్రతలను దెబ్బతీసి అభివృద్ధిని నిరోధించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నాయని సీఎస్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలపై దాడులు చేస్తూ దేవతామూర్తుల విధ్వంసాలకు పాల్పడుతున్నారన్నారు. పథకం ప్రకారం విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడంతో పాటు సమాజాన్ని విడదీసి ప్రజల దృష్టి మరల్చానే కుట్ర జరుగుతోందన్నారు. దుశ్చర్యలకు పాల్పడేవారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలను, శక్తులను సమాజం అంతా కలిసి అడ్డుకుంటుందని, ఇందులో భాగంగానే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మతసామరస్య కమిటీలను ఏర్పాటు చేస్తూ జీవో 6 జారీ చేసినట్లు వివరించారు. కమిటీల్లో అన్ని మతాలకు స్థానం.. మతసామరస్యాన్ని కాపాడేందుకు ఏర్పాటైన కమిటీలు తరచూ సమావేశమై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కృషి చేయడంతోపాటు శాంతియుత వాతావరణం వెల్లివిరిసేలా దోహదం చేస్తాయని సీఎస్ వివరించారు. అన్ని వర్గాల్లో విశ్వాసం, మనోధైర్యాన్ని పెంపొందిస్తూ మత సామరస్యాన్ని పరిరక్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మత సామరస్య కమిటీలు దోహదం చేస్తామని సీఎస్ తెలిపారు. కమిటీల్లో అన్ని మతాలకు చెందిన వారు ఉంటారని, ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే కమిటీలు సందర్శిస్తాయని చెప్పారు. కొన్ని ఘటనలకు సంబంధించి వెంటనే కేసులు నమోదు చేశామని, నిందితులను గుర్తించడంతో పాటు వీటి వెనక ఎవరున్నారో కూడా బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వ అధికారులకు కులమతాలను ఆపాదించడం హేయమైన చర్య అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీఎస్, కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతోపాటు విధివిధానాలను నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉండే రాష్ట్ర స్థాయి కమిటీకి డీజీపీ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా హిందు, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధులు, జైన్‌లతో పాటు ఇతర మతాలకు చెందిన ఒక మత పెద్ద ప్రతినిధిగా ఉంటారు. హోం, దేవదాయ, మైనార్టీ వెల్ఫేర్, సాధారణ పరిపాలన (రాజకీయ) ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా, ఇతర భాగస్వామ్యులు సభ్యులుగా ఉంటారని ఉత్తర్వులో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వైస్ చైర్మన్‌గా జిల్లా ఎస్పీ ఉంటారు. జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా, రెవిన్యూ) కన్వీనర్ సభ్యులుగా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయి కమిటీ విధివిధానాలు.. ►మతవిద్వేషాలను రగిల్చేలా సందేశాలను ప్రచారం చేయడం, మతసామరస్యాన్ని దెబ్బతీసే ఘటనలపై రాష్ట్ర స్థాయి కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై చర్చించాలి. ►స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్, ప్రార్థన మందిరాల వద్ద భద్రతా చర్యలకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలి. మత సామరస్యం పెంపొందించేలా కార్యక్రమాలతో పాటు కార్యాచరణ సిద్ధం చేయాలి. ►జిల్లా స్థాయి మతసామరస్య కమిటీలతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలి ►మతవిద్వేషాలు రెచ్చగొట్టిన వారిపై ఐపీసీ కింద నమోదైన క్రిమినల్ చర్యలన్నింటినీ పరిశీలించాలి. ►మతసామరస్యం వెల్లివిరిసేలా పాఠశాల, కళాశాల స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలి జిల్లా స్థాయి కమిటీ విధివిధానాలు ►జిల్లా స్థాయిలో ఏదైన సంఘటన వల్ల మతసామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉంటే తక్షణం బాధ్యులపై చర్యలు తీసుకోవడం ద్వారా గట్టి సంకేతాన్ని పంపాలి. క్రమం తప్పకుండా కమిటీ సమావేశాలు నిర్వహించాలి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సామాజిక, మతపరమైన సమతుల్యతను కాపాడే విధంగా జిల్లాస్థాయి కమిటీ సభ్యులు కృషి చేయాలి. ►గతంలో జరిగిన సంఘటనలను పరిగణలోకి తీసుకుంటూ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. ►సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు సమీక్షించాలి ►భూములు, లేదా ఇతర సంఘటనల వల్ల హింస చెలరేగే అవకాశం ఉన్నచోట్ల పరిష్కారం కోసం ప్రణాళిక సిద్ధం చేయాలి. ►ప్రార్థనా మందిరాలు, ప్రముఖ భవనాలు, చారిత్రక కట్టడాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలి. ► ప్రజల్లో మతసామరస్యం పెంపొందించేలా జిల్లా స్థాయి కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి ►మతవిద్వేషాలు రెచ్చగొట్టిన వారిపై ఐపీసీ వివిధ సెక్షన్ల కింద నమోదైన క్రిమినల్ కేసుల విచారణ పురోగతిపై సమీక్షించాలి. కరెంట్ రంపం వాడిన దుండగులు రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం విధ్వంసానికి వినియోగించిన ఎలక్ట్రికల్ రంపాన్నే రాజమహేంద్రవరం, కృష్ణా జిల్లాలో విగ్రహాల ధ్వంసానికి ఉపయోగించినట్లు ఆధారాలు సేకరించామని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. ఒక ప్రణాళిక ప్రకారం దేవాలయాలపై దాడులు చేస్తూ మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేసినట్లు అనుమానిస్తున్నామన్నారు. కేసుల దర్యాప్తులో ఆధారాలను సాంకేతికంగా, ఇతర రూపాల్లో సేకరిస్తున్నామని వాటిని క్రోడీకరించి నిందితులను పట్టుకుంటామని, వారి వెనుక ఉన్న వారిని అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసుల విచారణ బాధ్యతను సీఐడీ విభాగానికి అప్పగించామన్నారు. ముందే ఒక అభిప్రాయానికి వచ్చి దర్యాప్తు చేయడం లేదని, సీసీ కెమెరాలు, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో గతంలోనూ దేవాలయాలపై దాడులు జరిగాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేవతా విగ్రహమూర్తులపై 2017లో రెండు, 2018లో మూడు, 2019లో ఒకటి, 2020లో 29, ఈ ఏడాది మూడు చోట్ల విగ్రహాలను ధ్వంసం చేశారని చెప్పారు. 2019లో నమోదైన కేసులకు సంబంధించి ఆరు చోట్ల గతంలో దెబ్బతిన్న విగ్రహాలను ఇప్పుడు దెబ్బతిన్నట్లుగా చిత్రీకరించారని తెలిపారు. సమావేశంలో సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజీత్, దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్, కమిషనర్ అర్జునరావు, మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ పాల్గొన్నారు. -
ఏపీ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ కమిటీ ఏర్పాటు
సాక్షి, అమరావతి: ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా శ్రీవెంకటేశ్వర వెటర్నరీ సైన్స్ విశ్వవిద్యాలయం డీన్. 13 మంది సభ్యులతో కమిటీని నియమించింది. రాష్ట్రస్థాయి ఆక్వా కల్చర్ సీడ్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఎంపెడా, ఆక్వారైతులు సహా ఇతర విభాగాల అధికారులతో కమిటీ నియమించింది. జిల్లాస్థాయిలో కలెక్టర్ ఛైర్మన్‌గా ఆక్వాకల్చర్ సీడ్ కమిటీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: చేపకు ఇక నాణ్యమైన ఫీడ్) -
క్లిక్స్ గ్రూప్‌తో విలీనానికి తొలి ప్రతిపాదన
-
ఏపీ: బీజేపీ పదాధికారుల కమిటీ ప్రకటన
సాక్షి, అమరావతి: బీజేపీ రాష్ట్ర కొత్త పదాధికారుల కమిటీ ఏర్పాటైంది. 40 మందితో కూడిన నూతన కమిటీని బీజేపీ ప్రకటించింది. 10 మంది ఉపాధ్యక్షులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు,10 మంది కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, ట్రెజరర్, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శితో జాబితా విడుదలయ్యింది. కమిటీలో అధ్యక్షుడు సోము వీర్రాజు తన మార్కు చూపించారు. పార్టీకి విధేయులుగా ఉన్నవారికే కమిటీలో చోటు లభించింది. జంబో కమిటీకి సోము వీర్రాజు స్వస్తి పలికారు. గత కమిటీలో 30 మంది అధికార ప్రతినిధులు ఉండగా, ఆ జాబితాను 6కు కుదించారు.(చదవండి: హిందుత్వం అప్పుడు గుర్తుకురాలేదా..?) -
అంబేడ్కర్ ప్రాజెక్టు నిర్వహణకు కమిటీ
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్‌మైదాన్‌లో.. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు, సూచనలు ఇచ్చేందుకు నిర్వహణ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. (125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం) ఇప్పటి వరకు స్వరాజ్ మైదానానికి ఉన్న పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్గా మార్చారు. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రాంజీ అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ కింద ఉన్న 20 ఎకరాల మైదానాన్ని సాంఘిక సంక్షేమ శాఖకు కేటాయించాల్సిందిగా ఆదేశించారు. మొత్తం ప్రాంతాన్ని మరింత బాగా అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటారు. అందులో పార్కు, గార్డెన్, తోట పనులు ఉంటాయి. ఇప్పుడు స్వరాజ్ మైదానంలో జరుగుతున్న అన్ని సాంప్రదాయ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఏపీఐఐసీ ఈ ప్రాజెక్టుకోసం ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అవుతుంది. కమిటీ వివరాలు.. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్‌గా, కమిషనర్ మెంబరు కన్వీనర్‌గా, ఎడ్యుకేషన్ మినిస్టర్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ కార్యదర్శి, ఫైనాన్స్ కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, ప్రణాళిక శాఖ కార్యదర్శి, కృష్ణా జిల్లా కలెక్టర్ సభ్యులుగా ఉంటారు. (అంబేడ్కర్‌కి ఆంధ్రలో ‘పరీక్ష’?!) -
అగ్నిప్రమాదం: జేసీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
సాక్షి, విజయవాడ: ఏలూరు రోడ్డులోని స్వర్ణప్యాలెస్‌లో రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో ఆదివారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంపై విచారణకు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) నేతృత్వంలో కమిటీని నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. 10 మంది మరణానికి, 18 మంది క్షతగాత్రులైన సంఘటనకు దారితీసిన పరిస్థితులు, ప్రమాదానికి గల కారణాలను విచారణ చేసేందుకు జేసీ ఎల్ శివశంకర్ నేతృత్వంలో విజయవాడ సబ్‌కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర, వీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. జి.గీతాబాయ్, వీఎంసీకి చెందిన ఆర్ఎఫ్వో టి ఉదయకుమార్, సీపీడీసీఎల్ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్తో కూడిన కమిటీని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలు, పరిస్థితులతో పాటు భద్రతా నిబంధనలు, ఆసుపత్రి నిర్వహణ లోపాలు, వసూలు చేసిన అధిక ఫీజుల ఆరోపణలపై దృష్టి సారించాలని కమిటీని ఆదేశించారు. విచారణ పూర్తి చేసి కమిటీ తన నివేదికను రెండు రోజుల్లో సమర్పించాలని కలెక్టర్ ఇంతియాజ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
దూబే ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిటీ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే, అతని అనుచరుల ఎన్కౌంటర్లతో పాటు 8 మంది పోలీసుల హత్యపై విచారణ జరిపించడానికి కమిటీ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చునని వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే ఆధ్వర్యంలో సుప్రీం బెంచ్ ఎదుట మంగళవారం యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది జూలై 16లోగా స్టేటస్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పిస్తామని వెల్లడించారు. దీనిపై స్పందించిన సుప్రీం బెంచ్.. తెలంగాణలో వెటర్నరీ వైద్యురాలి గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుల ఎన్కౌంటర్ కేసుపై సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టుగానే ఈ కేసులో కూడా కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించే అవకాశాలున్నాయని పేర్కొంది. కాగా, ఎన్కౌంటర్లో హతమైన వికాస్ దూబే నెల సంపాదన రూ.కోటి వరకు ఉంటుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వెల్లడించినట్టుగా కథనాలు వెలువడ్డాయి. ‘దూబే సాదాసీదా జీవితాన్నే గడిపేవాడు. అతని బ్యాంకు అకౌంట్లలో పెద్ద మొత్తంలో సొమ్ము లేదు. మరి ఆ డబ్బంతా ఏం చేశాడో విచారిస్తున్నాం’అని ఈడీ అధికారి ఒకరు వెల్లడించారు. -
ఫార్మా కంపెనీ ప్రమాదంపై కమిటీ విచారణ
-
దుర్గమ్మ చీరలపై కమిటీ వేసిన ఈఓ
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో శనివారం చీరలపై రేట్ల పరిశీలనకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఈఓ సురేష్ బాబు ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు అమ్మవారి చీర అసలు ధర అంచనా వేసి.. రేటు మార్చి మళ్లీ అమ్మకానికి పెట్టనున్నారు. దీంతో భక్తులు సమర్పించేటప్పుడు చీర ధర ఎంత చెబితే అంత రేటుకే అమ్మకానికి పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఏడాది నుంచి సుమారు 2 వేలకు పైగా చీరలు మూలనపడి ఉన్నాయి. రూ.1000 చీరను రూ.5000కు ధర నిర్ణయించడంతో కొనుగోలు చేయడానికి భక్తులు వెనుకాడుతున్నారు. దుర్గమ్మ చీరల కొనుగోలుకు భక్తులు ఆసక్తి చూపకపోవడంతో.. గుట్టలుగా పేరుకుపోయాయి. చీరల కౌంటర్లని, భద్రపరిచిన స్టోర్ రూమ్‌ను పరిశీలించిన దేవాదాయశాఖ కమిషనర్ పద్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దసరా సమయంలో కూడా చీరలు అమ్ముడుపోలేదు. భక్తులు సమర్పించే చీరలను.. అమ్మవారి ప్రసాదంగా తిరిగి భక్తులకే దుర్గగుడి అధికారులు అమ్ముతున్నారు. -
రాజధాని సహా రాష్ట్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ
-
రాజధాని సహా రాష్ట్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని సహా రాష్ట్ర అభివృద్ధిపై నిపుణుల కమిటీ ఏర్పాటైంది. రాజధానితో పాటు ఇతర జిల్లాల్లో జరుగుతున్న పనులు, ప్రణాళికలను ఈ కమిటీ సమీక్షించనుంది. కమిటీ కన్వీనర్‌గా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జీఎన్ రావు నియమితులయ్యారు. అయిదుగురు సభ్యులతో ఏర్పాటు అయిన ఈ కమిటీలో మహావీర్, అంజలీ మోహన్, కేటీ రవీంద్రన్, శివానందస్వామి, డాక్టర్ అరుణాచలం ఉన్నారు. ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
ఏపీఎస్ఆర్టీసీ విలీనంపై నివేదిక సిద్దం
-
కిడ్నీ రాకెట్ పై త్రిసభ్య కమిటీ విచారణ ముమ్మరం
-
‘నా కల నిజమైంది.. ప్రపంచానికి నేనే హీరోయిన్’
తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బాధితుల పోరాటానికి తెలంగాణా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఉద్యమానికి కీలకమైన నటి శ్రీరెడ్డి ఫేస్బుక్లో స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన కల సాకారమైందనీ, ఇందుకు ఒక హైదరాబాదీగా తనకు చాలా గర్వంగా ఉందంటూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ప్రపంచానికి తనను హీరోయిన్ చేశారంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నా పోటారానికి అద్భుతమైన ఫలితాలొచ్చాయంటూ ఉద్యమానికి గుండె లాంటి అపూర్వ(నటి)కు, ఇంకా ఈ ఉద్యమంలో సాయపడిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున శ్రీరెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. తెలుగు సినిమా రంగంలో మహిళా నటులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై తొలిసారిగా గొంతెత్తిన నటి శ్రీరెడ్డి. అనంతరం మీటూ అంటూ చాలామంది బాధితులు బహిరంగంగా తన బాధల గాథలను ప్రపంచానికి చెబుతూ ఈ ఉద్యమంలో జత కలవడంతో ఇది దావానలంలా రాజుకుంది. అటు వివిధ ప్రజా, మహిళా సంఘాలు ఈ ఉద్యమానికి బాసటగా నిలిచాయి. ప్రతిఫలంగా తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్లో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకునేలా ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం జీవో నంబర్ 984 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కొర్పొరేషన్ ఛైర్మన్ రాంమోహన్ రావు ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో టాలీవుడ్ ప్రతినిధులు నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలతో పాటు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మి సభ్యులుగా ఉంటారు. ఇంకా సినిమా ప్రముఖులు రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాత కె.ఎల్ నారాయణ, నటి ప్రీతి నిగమ్, నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి, దర్శకులు శంకర్, తమ్మారెడ్డి భరద్వాజతోపాటు, మహిళా సంక్షేమ, తెలంగాణా అభివృద్ధి సంస్థ లాంటి వివిధ ప్రభుత్వ శాఖల అధ్యక్షులు, కమిషనర్లు, డైరెక్టర్లు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. చదవండి : లైంగిక వేధింపులు; ప్యానెల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం -
పసలేని ఎన్నికల పండుగ
అచ్చంపేట: ఎన్నికలంటే ఓ పండగ లెక్క! దాదాపు ఇరవై రోజులపాటు నిత్యం నాయకుల మాటల పోరు.. ర్యాలీలూ.. సమావేశాల హోరుతో రంజుగా సాగుతుంది. మొన్నటి శాసనసభా ఎన్నికల్లోనూ ఇదే ధూంధాం కనిపించింది. అంతెందుకు నిన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదేజోరు సాగింది. కానీ, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రచార హోరు కనిపించకపోగా.. మైకులు కూడా అక్కడక్కడే మోగుతున్నాయి. ఇక ర్యాలీల జాడే లేదు. పట్టణాల్లో అంతో ఇంతో ఈ హుషారు కనిపిస్తున్నా.. ఊళ్లో మాత్ర పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చప్పుడే లేకుండాపోయింది. కొన్నిచోట్ల మాత్రం అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు ప్రధాన అనుచరులు మరీ రాలేదనకుండా గ్రాయిల్లో ప్రచారం చేసి వస్తున్నారు. కనిపించని ఉత్సాహం గ్రామాల్లోనే కాదు.. స్థానిక నేతల్లో కూడా పెద్దగా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. ప్రధానంగా పోటీ పడుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లోనూ ఇదే స్తబ్ధత నెలకొంది. ఏ ఎన్నికలు వచ్చినా.. అభ్యర్థులు లేదా ప్రజాప్రతినిధులు మండలాలు, గ్రామాల వారీగా తమ నాయక గణానికి బాధ్యతలు అప్పగిస్తుంటారు. ప్రచార బాధ్యతలు వారే చూసుకోవాల్సి ఉంటుంది. వారిపై మరికొందరు సమన్వయం చేస్తుంటారు. కానీ ఎంపీ ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ప్రచార బాధ్యతలను ఇప్పటికీ నాయకులకు అప్పగించలేదు. అభ్యర్థులకు వెన్నుదన్నుగా ఉండే అనుచరులతోపాటు ఆయా పార్టీల సర్పంచ్‌లు కూడా గ్రామాల్లో సందడి చేయడం లేదు. బయటకు వెళ్తే ఎక్కడ ఖర్చుల భారం మీద పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ వెళ్లినా మైకుల హోరు.. ర్యాలీలు నిర్వహించడం లేదు. సాదాసీదాగా వెళ్లి గ్రామస్తులతో సమావేశం మాత్రమే నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ప్రచారం ‘మమ’ అనిపిస్తున్నారన్నమాట. అప్పుడే మస్తుగుండే.. ‘ఎంపీ ఎన్నికలంటున్నరు.. మరీ మందూ లేదు.. విందూ లేదా..’ అని చాలామంది నాయకులకు మందుబాబుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పల్లెల్లో నాయకులు ప్రచారం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఇది కూడా కారణంగా మారుతోంది. శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లో మద్యం జోరుగా సరఫరా కావడంతో.. మందుబాబులందరికీ ప్రచారం జరిగినన్ని రోజుల పండగలా సాగింది. స్థానికంగా బాధ్యతలు తీసుకున్న నాయకులు ఇంటికొచ్చి మరీ.. మద్యం సీసాలను మందుబాబులకు అప్పగించి వెళ్లారని సమాచారం.! ఇప్పడేమె అంతా స్తబ్ధుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు ఊళ్లలో ప్రచారం చేయాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ప్రచారం చేసేందుకు వెళ్లకున్నా.. పైనుంచి డబ్బులు వచ్చినా ఖర్చు పెడతలేడు.. అన్న అపవాదూ వస్తోందని వాపోతున్నారు. ఐదు రోజులే మిగిలింది.. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా ఐదురోజులే మిగిలింది. ఈ నెల 11న జరగనున్న ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రచారాన్ని ఈ నెల 9 వరకు మాత్రమే చేయాల్సి ఉంది. ఇప్పటి దాకా పల్లెల్లోకి అభ్యర్థులే ప్రచారానికి రాలేదు. కేవలం పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాలు, మేజర్ మండల కేంద్రాల వరకే తమ ప్రచారాన్ని పరిమితం చేస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రమే మేజర్ ఓట్లు ఉన్న గ్రామాల్లో కార్యకర్తలు, గ్రామస్తులు నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నా.. అందాల్సినవి అందకపోవడం వల్లే ప్రచారం మాగబోయిందనే చర్చ గ్రామాల్లో వినిపిస్తోంది. సంఘాల వారీగా.. అభ్యర్థులు శాసనసభా ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే లోక్‌సభ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీల నాయకులు గ్రామాల్లో కుల సంఘాల వారీగా కలుస్తున్నారు. కులం ఓట్లు గంపగుత్తగా తమకే వేసేలా వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కుల సంఘాల నాయకులకు వారు కోరిన కోర్కెలకు హామీలు ఇస్తున్నారు. తాము గెలవగానే మీ హామీలను పూర్తి చేస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. పార్లమెంట్ స్థానం పరిధి పెద్దగా ఉండటంతో అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. ఇక అభ్యర్థులు, పార్టీలు ఆర్థికంగా తోడ్పాటునందిస్తేనే స్థానిక నాయకులు ప్రచారానికి ముందడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. -
నిజామాబాద్‌లో.. కుల రాజకీయం !
మోర్తాడ్(బాల్కొండ): పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న రాజకీయ పార్టీల నాయకులు కుల సంఘాల్లో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని వివిధ గ్రామాలలో కుల సంఘాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించే సత్తా కులసంఘాలపై ఉండడంతో కులాలకు గాలం వేసే పనిలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు నిమగ్నమయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బోధన్, నిజామాబాద్ అర్బన్, కోరుట్ల, జగిత్యాల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అన్ని నియోజకవర్గాల పరిధిలో కుల సంఘాల ప్రభావం అధికంగా ఉంది. అయితే పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధర కోసం జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తడం కోసం రైతులు 175 మంది పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన రైతుల్లో ఎక్కువ మంది రెండు సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. అయితే రైతులు పోటీలో ఉండడంతో వారి సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు తమకు రావనే ఉద్దేశ్యంతో ఇతర సామాజిక వర్గాల ఓట్ల కోసం నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే వాటిలో గురడి కాపు, మున్నూర్‌కాపు, గౌడ, దళితులు, ముదిరాజ్, పద్మశాలి, ముస్లిం, యాదవ, గిరిజనులు తదితర కుల సంఘాలు ఉన్నాయి. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల్ పట్టణ ప్రాంతాల్లో అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసేంత మెజారిటీ ఓటర్లు వైశ్యులలో ఉన్నారు. ఈ కుల సంఘాల పెద్దమనుషులతో చర్చలను సాగిస్తున్న నాయకులు కుల సంఘాల మద్దతును కూడగట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కుల సంఘాల మద్దతును కూడగట్టుకుంటే ఎక్కువ ఓట్లను రాబట్టుకోవచ్చని భావిస్తున్నారు. కుల సంఘాలకు తాయిలాలను ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానాలను చేయిస్తున్నారు. ముందస్తు శాసనసభ ఎన్నికల్లో కుల సంఘాల మద్దతును కూడగట్టుకోవడానికి అన్ని పార్టీల నాయకులు ఎవరి ప్రయత్నం వారు చేశారు. కుల సంఘాలను తమవైపు తిప్పుకుంటే సభలు, సమావేశాలకు జన సమీకరణ సులభంగా ఉండడమే కాకుండా ఎన్నికల్లో గెలుపు సునాయసం అవుతుందని నాయకులు భావిస్తున్నారు. అయితే ఏ పార్టీ అభ్యర్థి వచ్చినా అందరికి కులసంఘాలు జై కొడుతున్నాయి. దీంతో ఫలితాలు ఎలా ఉంటాయో అని ఉత్కంఠ నెలకొంది. -
ముగిసిన భేటీ: కీలక అంశాలపై కమిటీలు
సాక్షి, ముంబై: ఎంతో ఉత్కంఠగా సాగిన ముంబైలో ఆర్బీఐ బోర్డు సమావేశం సుదీర్ఘ చర్చల అనంతరం ముగిసింది. దాదాపు 9 గంటలపాటు జరిగిన చర్చల్లో కొన్ నికీలక అంశాలపై ఆర్బీఐ బోర్డు ఒక కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. దీంతో కేంద్రం, ఆర్బీఐ మధ్య నెలకొన్నవివాదానికి తాత్కాలికంగా తెరపడనుంది. ఈ సమావేశం పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ముఖ్యంగా ఎన్బీఎఫ్సీ, నిధుల తరలింపు, పీసీఏ నిబంధనలు సరళీకరణ అంశాలపై నిపుణులతో వివిధ కమిటీల ద్వారా సమీక్షించి, చర్చించి నిర్ణయం తీసుకునేందుకు బోర్డు మొగ్గు చూపింది. ఎవరికి వారు వారి అంశాలపై స్థిరంగా ఉన్నప్పటికీ పరస్పరం ఆమోదయోగ్య పరిష్కారంపై దృష్టిపెడతాయి. మరోవైపు ఈ పరిణామంపై ఆర్థికనిపుణులు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్బీఐ, ప్రభుత్వం పరస్పరం చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలనుకోవడం ఆహ్వానించదగిన పరిణామమని అభిప్రాయ పడ్డారు. ఇది ఇరు సంస్థలకు మంచిదని పేర్కొన్నారు. ముఖ్యంగా వేగంగా వృద్ధి చెందుతున్నఆర్థికవ్యవస్థగా ఉన్న దేశంలో కేంద్రం, కేంద్రబ్యాంకు పరస్పర అవగాహతో పనిచేయాలని అభిప్రాయపడ్డారు. -
రేపు అక్రమ క్వారీంగ్ కేసు వైఎస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ
-
ఏపీ బీజేపీ కమిటీ ఏర్పాటులో గందరగోళం
-
మా బడి.. మా ఇష్టం.!
ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్థిక, విద్యా సంబంధ విషయాల్లో యాజమాన్యాలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసే బడి కమిటీలు ప్రస్తుతం ఎక్కడా కానరావడం లేదు. జిల్లాలో దాదాపు 1,200 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నప్పటికి పట్టుపని పది స్కూళ్లలో కూడా కమిటీలు లేవు. సాక్షి, అమరావతి బ్యూరో: ప్రైవేట్ స్కూళ్లలో అసలు ఫీజులు ఎవరు నిర్ణయించాలి అనే అంశం పై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చిం ది. దీని ప్రకారం ప్రతి పాఠశాలకు కచ్చితంగా గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయాలి. వారే ఏ తరగతికి ఎంత ఫీజులు తీసుకోవాలో నిర్ణయిస్తారు. దాంతో పాటు అక్కడ పనిచేసే టీచర్లకు, సిబ్బందికి ఎంత మేరకు జీతాలు ఇవ్వాలో కూడా స్పష్టం చేస్తుంది. కానీ ఈ కమిటీ ఏర్పాటును ఏ పాఠశాల కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క పాఠశాలలోనూ అమలైన ఆనవాళ్లు లేవు. జిల్లా విద్యాశాఖ దగ్గర కూడా ఎటువంటి సమాచారం లేదు. జిల్లాలో దాదాపు 1,200 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నప్పటికి పట్టుపని పది స్కూళ్లలో కూడా కమిటీ ఏర్పడలేదు. ఉన్న వాటిలో కూడా సొంత వాళ్లనే నియమించుకొని నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు. కమిటీ స్వరూపం ఇది.. పాఠశాల కమిటీకి ఒక అధ్యక్షుడు, కార్యదర్శి, నలుగురైదుగురు సభ్యులుంటారు. అధ్యక్షుడిగా సంబంధిత విద్యాసంస్థ చైర్మన్ వ్యవహరిస్తారు. కార్యదర్శిగా ఆ పాఠశాల కరస్పాండెంట్ లేదా మేనేజర్ ఉంటారు. మిగిలిన సభ్యులుగా పాఠశాల ప్రిన్సిపల్ లేదా హెడ్మాస్టర్, పాఠశాల బోధనా సిబ్బంది నుంచి ఒకరు, పేరెంట్–టీచర్స్ అసోసియేషన్ నుంచి ఒకరు, డీఈవో ఎంపిక చేసిన ఒక విద్యార్థి తల్లి(ఉన్నత విద్యావంతురాలు) ఉంటారు. ఈ పాలకమండలి జిల్లా విద్యాశాఖాధికారి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే ఇలా ఆమోదం పొందిన ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడా లేవు. ఎందుకు ఏర్పడలేదని అడిగే నాథుడూ లేడు. కమిటీ నిర్ణయాలే ఫైనల్.. పాఠశాలలో విధానపరమైన నిర్ణయాలు ఏవి తీసుకోవవాలన్నా ఈ కమిటీ నిర్ణయం తీసుకోవవాల్సిందే. పాఠశాలలో ఎంతమంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలి, టీచర్ల నియామకం, సిబ్బంది ఎంతమంది ఉండాలి వంటి వాటిని కమిటీ పరిశీలిస్తుంది. ముఖ్యంగా టీచర్ల నియామకంలో నాణ్యమైన వారిని ఎంపిక చేసే అధికారం ఉండటం వల్ల పిల్లలకు మంచి విద్యను అందించగలుగుతాం. కానీ వీటి నియామకం జరగకపోవడంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా అర్హత లేని వారిని ఎంపిక చేసి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. కమిటీ చేసే మరో పని పాఠశాల నిర్వహణకయ్యే ఖర్చులను లెక్కించడం, జీతాలు ఎంతివ్వాలో నిర్ణయించడం. నిబంధనల ప్రకారం పాఠశాలలకు వచ్చే మొత్తం ఆదాయంలో 50 శాతం టీచర్లకు, ఇతర సిబ్బందికి జీతాల రూపంలో ఇచ్చేలా చూడాలి. 15 శాతం తగ్గకుండా నిర్వహణ ఖర్చులకు వెచ్చించాలి. కమిటీ లేకపోవడంతో యాజమాన్యాలు సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వకుండా వారి శ్రమను దోచుకుంటున్నాయి. ఫీ‘జులుం’ ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ కమిటీ సమావేశమై ఫీజుల్లో మార్పులపై చర్చించాలి. ఫీజుల పెంపు తప్పనిసరిగా కమిటీ ఆమోదం పొందాలి. కానీ ఇవేమి లేకుండానే యాజమాన్యాలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయి. ఏటా 30 నుంచి 50 శాతం దాకా పెంచేస్తూ దోచుకుంటున్నాయి. పట్టించుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. విద్యార్థి సంఘాలకు చోటివ్వాలి దాదాపు జిల్లాలోని ఏ పాఠశాలలోను కమిటీలను ఏర్పాటు చేయలేదు. ఉన్నవాటిలో సొంత వారిని నియమించి పబ్బం గడుపుతున్నారు. ఏటా 50 శాతం దాకా ఫీజులు పెంచుతున్నారు. ఈ కమిటీల్లో విద్యార్థి సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల వారి దోపిడిని అడ్డుకోగలగుతాం. కలెక్టర్ ఆదేశించినప్పటికి అధికారులు వాటిని పాటించడం లేదు. – కోటిబాబు, కృష్ణా జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు -
ఎగవేతదారులు పారిపోకుండా అడ్డుకట్ట ఎలా?
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ బడా రుణ ఎగవేతదారులు, ప్రమోటర్లు దేశం వదిలి పారిపోకుండా నిరోధించడం ఎలా అన్న అంశంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి ప్రస్తుత చట్టాల్లో సవరణలు, సూచనలు ఇవ్వడానికి ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ నేతృత్వం వహిస్తారు. దేశీయ కంపెనీలకు సంబంధించి ప్రమోటర్ల విషయంలో భారత్ కాకుండా ఏ ఇతర దేశంలో పౌరసత్వం ఉంది? ఆ కంపెనీ రుణాల పరిస్థితి ఏమిటి? చెల్లింపులు ఎలా ఉన్నాయి? లాభనష్టాల పరిస్థితి ఏమిటి? ఇలాంటి అన్ని అంశాలపై ముందే దృష్టి సారించాలని పలువురు భావిస్తున్నారు. తద్వారా విజయ్ మాల్యా, మెహుల్ చోక్సి, నీరవ్‌మోదీ తరహా వ్యక్తుల ఉదంతాల పరిస్థితిని నివారించవచ్చన్నది వీరి అభిప్రాయం. ఇదే విషయంపై ఉన్నత స్థాయి కమిటీ దృష్టి సారించే అవకాశం ఉందని సమాచారం. ఈ కమిటీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ప్రతినిధులు కూడా ఉంటారు. అలాగే హోమ్, విదేశీ వ్యవహారాల శాఖల అధికారులూ సభ్యులుగా ఉంటారు. -
వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ నియామకం
శ్రీకాకుళం సిటీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ నూతన కమిటీ నియామకమైంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షునితో పాటు మరో 169 మందితో నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. నూతన కమిటీ ఇదే.. శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షునిగా తమ్మినేని సీతారాం, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా మోతీలాల్ తిలక్, మద్దు రాజారావు(ఇచ్ఛాపురం), పాలిన శ్రీనివాసరావు, బత్తిన హేమేశ్వరరావు(పలాస), తిర్లంగి జానకిరామయ్య, సత్తారు సత్యం( టెక్కలి), శింతు రామారావు, బంకి రమణమూర్తి(నరసన్నపేట), ఎం.వి.పద్మావతి, కె.ఎల్.ప్రసాద్, చల్లా రవికుమార్ (శ్రీకాకుళం), గంట్యాడ రమేష్, శిల్లా ప్రశాంతలక్ష్మి(ఆమదాలవలస), రేజేటి కన్నయ్యస్వామి, బమ్మిడి ఖగేశ్వరరావు(పాతపట్నం)లు నియమితులయ్యారు. జిల్లా కార్యదర్శులు.. కారంగా మోహనరావు, ప్రకాశ్ పట్నాయక్, ఆసి ధర్మరాజురెడ్డి, దేవరాజుసాహు(ఇచ్ఛాపురం), మెట్టకుమార స్వామి, డోకారి దానయ్య, ఉంగశ్రీకృష్ణయాదవ్, దువ్వాడ హేమబాబుచౌదరి, బాళ్ల గిరిబాబు(పలాస), పోలాకి సోమేశ్వరరావు, నడుమూరి శ్రీరామమూర్తి, మోడి భాస్కరరెడ్డి, ముద్దారపు రమణ(టెక్కలి), లుకలాపు రవికుమార్, బచ్చు ఆదినారాయణరెడ్డి, వాన గోపి, కనుసు సీతారాం(నరసన్నపేట), గుమ్మా నగేష్, పీస గోపి, సుంకరికృష్ణ, బోర చిన్నంనాయుడు(శ్రీకాకుళం), కిల్లి లక్ష్మణరావు, కొరికాల వెంకట్రావు, మెట్ట శ్యామలరావు, బోరల సీతారాం(ఆమదాలవలస), అలికాన మాధవరావు, గొర్ల మోహనరావు, కొల్ల కృష్ణారావు, సవర సుభాష్(పాతపట్నం) సంయుక్త కార్యదర్శులు.. దుర్గాసి ధర్మారావు, మద్దిలి ఈశ్వరరావు, ఎర్ర త్రినాథ్, పొడుగు కామేశ్వరరావు, గుమ్మాడి రామదాసు(ఇచ్ఛాపురం), దువ్వాడ శ్రీకాంత్, దున్న వీరస్వామి, గున్న శ్రీనివాసులు, తెలగాన శ్రీరాములు, మల్ల సురేష్(పలాస), దుంగ శిమ్మన్న, బెండి కర్మవీరుడు, బొడ్డు వెంకటరమణ, మదపాల సంజీవరావు, కరాడ చిన్నయ్య, బూరి మోహనరావునాయుడు, నేతింటి నాగేశ్వరరావు(టెక్కలి), గుంటు లక్ష్మయ్య, గొండు బరికివాడు, అంధవరపు రమా, ఆరవెల్లి చిన్నబాబు(శ్రీకాకుళం), సురవరపు నాగేశ్వరరావు, బొడ్డేపల్లి నారాయణరావు, ఇసాయ్ అప్పారావు, బెండి గోవిందరావు, బి.రఘురామ్‌రెడ్డి, గార వెంకటరమణ,(ఆమదాలవలస), కోరాడ అర్జునరావు, వమరవల్లి శ్రీనివాసరావు, లోచర్ల మల్లేశ్వరరావు, బొడ్డేపల్లి బాస్కరరావు(పాతపట్నం), యుంగటి రాజు, బెవర నూకరాజు, నక్క తులసీదాస్, కెల్ల సింహాచలం(నరసన్నపేట). అధికార ప్రతినిధులు.. శిమ్మ రాజశేఖర్(శ్రీకాకుళం పట్టణం), రొక్కం సూర్యప్రకాశ్(టెక్కలి), జేజే మోహనరావు(ఆమదాలవలస). కార్యవర్గ సభ్యులు.. రౌతు విశ్వనాథం, దక్కత లోకనాథ రెడ్డి, బతకల మోహనదాసు, దుబ్బ రాఘవులు (ఇచ్ఛాపురం), మరడ భాస్కరరెడ్డి, మీసాల సురేష్‌బాబు, లండ రామలింగం, పైల చిట్టిబాబు, గుజ్జు మోహనరెడ్డి, కర్రి తిరుపతిరావు, గుంట జగన్నాథం, బైనపల్లి ఎర్రయ్య, కొండ జోగారావు, కరడ గిరి, మద్దిల బాలకృష్ణ, ఎం.రామకృష్ణ, ఎ.దేవేంద్ర, ఎం.జనార్దన, దాసరి వెంకట్రావు, డి.ఈశ్వరరావు, గర్తం తులసీరావు, గనియా తేజేశ్వరరావు, నవీన్మిశ్రా, సంకరి విశ్వనాథం, బడకల తుంబేష్, దిక్కల లక్ష్మణమూర్తి, రోణంకి శ్రీను, కొర్ల ఢిల్లీరావు, హేమసుందర్ పట్నాయక్(పలాస), కెల్లి గోవిందరావు, శ్రీరంగం వీరస్వామి, పరపతి మీనకేతనరెడ్డి, పిలకా రవికుమార్, తర్రా భాస్కరరావు(టెక్కలి), శివాల చిన్నయ్య, అన్నెపు అప్పలనాయుడు, పెనుమజ్జి విష్ణుమూర్తి, లండ ఆనందరావు, లుకలాపు సుధీర్(పాతపట్నం) నీలవేణి దేబరికి, గొర్ల దుర్గారాణి, సైలాడ అనసూయమ్మ, రైతు శ్రీనివాసరావు, గురుగుబెల్లి ప్రభాకరరావు, సనపల పద్మావతి, చిగురుపల్లి నారాయణరావు, బెండి వెంకటరమణమూర్తి, మీసాల రామినాయుడు, గున్నా లక్ష్మి, వెంకట సాయికుమార్, అనకాపల్లి జ్యోతి, గంగిరెడ్ల ఉమాదేవి, బలగ నారాయణమ్మ, వండాన వెంకట్రావు, పోతురాజు సూర్యారావు, వెంకటలక్ష్మి తమ్మినేని, రాకోటి కన్నయ్య, లోలుగు ధనలక్ష్మి, గంట్యాడ లక్ష్మి, కిల్లారి సువర్ణ, పప్పల అప్పలనాయుడు, బొమ్మాలి విశ్వనాథం, పిన్నింటి మంగమ్మ, బొడ్డేపల్లి లక్ష్మీనారాయణ, వీరగట్టాపు జయలక్ష్మి, రావడ రవి, లింగంనాయుడు సీపాన, పీవీ రమణమ్మ, కరణం మాణిక్యమ్మ, లావేటి భవానీ, చల్లా పద్మావతి, వియ్యపు కృష్ణవేణి, జడ్డు దివ్య, ఖండాపు నవీన, తొత్తడి సురేష్, గుమ్మడి రాంబాబు, సూరా భాగ్యలక్ష్మి, బూరి శ్రీరామూర్తి, మామిడి రమణమ్మ, సీపాన వేదవతి, జరజాపు వెంకట్రావు, దాసిరెడ్డి వెంకునాయుడు, మానుకొండ వెంకటరమణ, బోర చిన్నంనాయుడు, ఎస్కే పీర్సాహేబ్, వ్యాపార లక్ష్మీనారాయణ(ఆమదాలవలస). శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా యువజన విభాగం.. శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా యవజన విభాగం ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ అబ్దుల్ సిరాజుద్దీన్(శ్రీకాకుళం)లు నియమితులయ్యారు. -
సెజ్ పాలసీ కమిటీలో ఏపీ, తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ : స్పెషల్ ఎకనమిక్ జోన్స్ (సెజ్) పాలసీని అధ్యయనం చేసేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి భారత్ ఫోర్జ్ సంస్థ చైర్మన్ బాబా కల్యాణీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరో 9 మంది ప్రముఖులు, అధికారులను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. శ్రీ సిటీ సెజ్ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, హైదరాబాద్ ఫీనిక్స్ డెవలపర్ డైరెక్టర్ శ్రీకాంత్ బాడిగ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న సెజ్ విధివిధానాలను సమీక్షించి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రపంచ వాణిజ్య సంస్థ విధానాలకు అనుకూలంగా నూతన సెజ్ పాలసీని రూపొందించేందుకు ఈ కమిటీ మూడు నెలల్లో సిఫార్సులు సమర్పించాల్సి ఉంటుంది. -
గీతన్నల నాడి ఎలా పడదాం!
సాక్షి, హైదరాబాద్ : మత్స్య, గొల్లకుర్మల తరహాలోనే గీత కార్మికులను ప్రసన్నం చేసుకోడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాజ్యాధికారంలో గీత కార్మిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినా టీఆర్ఎస్కు ఆ వర్గం దూరంగానే ఉండటంతో వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కోరుతున్నారో క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, జోగు రామన్న, పద్మారావుగౌడ్‌లతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారు. గౌడ కుటుంబాలు, కుల సంఘం నాయకులు, ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి గీత సామాజిక వర్గం సమస్యలు, పరిష్కార మార్గాలతో సమగ్ర నివేదిక రూపొందించాని ఆదేశించారు. అందులో భాగంగానే మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో గౌడ సామాజిక వర్గ ప్రజా ప్రతినిధులు ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో ఉపసంఘం తొలి విడత సమావేశమై గంటన్నరపాటు చర్చించింది. గీత కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు తాటి చెట్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తూ 2017లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ జీవోను సవరించి 2014 జూన్ 2 తరవాత మరణించిన వారి కుటుంబాలకూ ఎక్స్‌గ్రేషియా వర్తింపజేయాలని ప్రజా ప్రతినిధులు ఉపసంఘం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం గ్రామాల్లో ప్రతి చెట్టుకు రూ. 25, మున్సిపాలిటీల్లో రూ. 50 చొప్పున గీత పన్ను విధానం అమల్లో ఉందని, దాన్ని రద్దు చేయాలని గౌడ ప్రజాపతినిధులు సూచించారు. గీత కార్మిక కార్పొరేషన్‌కు రూ. 500 కోట్ల నిధులిచ్చి గీత వృత్తిని ఆధునీకరించటంతో పాటు నీరా ఉత్పత్తులను ప్రోత్సహించటానికి పరిశ్రమలు నెలకొల్పాలని కోరారు. గీత భవన్ కోసం 10 ఎకరాల స్థలం, నిర్మాణానికి రూ. 25 కోట్లు కేటాయించాలన్నారు. త్వరలోనే క్షేత్ర స్థాయిలో గీత కార్మిక సంఘం నేతలు, కుటుంబాలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై అభిప్రాయాలు సేకరించనుంది. 3, 4 వారాల్లో పూర్తి సమాచారంతో నివేదిక రూపొందించి సీఎంకు అందజేయనుంది. తర్వాత గీత కార్మిక సంక్షేమంపై కేసీఆర్ కార్యాచరణ ప్రకటించనున్నారు. -
సమస్య పరిష్కారానికి ఏడుగురు సభ్యుల కమిటీ
సాక్షి, ఢిల్లీ: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశం ముగిసింది. జడ్జీలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించేందుకు ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎంఓపిని త్వరగా ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. అయితే ఇది ప్రజల ముందు పెట్టేంత పెద్ద సమస్య కాదన్నారు. రాహుల్ గాంధీ సహా రాజకీయ పార్టీలకు న్యాయవ్యవస్థపై మాట్లాడే అవకాశం ఇవ్వడం బాధాకరమని అంటూ ఈ అంశాన్ని పార్టీలు రాజకీయం చేయొద్దని సూచించారు. సుప్రీంకోర్టు అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోమన్న ప్రధాని, న్యాయశాఖ మంత్రి వైఖరిని స్వాగతిస్తున్నామన్నారు. -
అసలు ‘పద్మావతి’ లో ఏముందో తేలుస్తాం
రాజస్థాన్: వివాదాలతో నిత్యం వార్తల్లో నలుగుతున్న పద్మావతి మూవీపై రాజస్థాన్ ప్రభుత్వం కమిటీని నియమించనుంది. సంజయ్‌లీలా భన్సాలి నిర్మించిన పద్మావతి చిత్రంపై మొదటి నుంచి వివాదాలు ముసురుకున్నాయి. దీంతో వివాదాల నేపధ్యంలో సినిమాపై కమిటీ వేయాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే నిర్ణయం తీసుకున్నారు. రాజ్పుట్లు, ఇతర సంఘాలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తాయి. దర్శకుడు భన్సాలీ చరిత్రను వక్రీకరించారంటూ దీనిపై నిషేధం విధించాలని డిమాండ్లు కూడా చేస్తున్నాయి. దీంతో కమిటీ నియమించాలని.. ఆ విషయంపై అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం మంత్రి గులాబ్‌చంద్ కటారియా తెలిపారు. కమిటీ పద్మావతి సినిమాను చూస్తుందని, మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు చిత్రంలో ఉన్నాయో లేదో చూస్తామని తెలిపారు. ఆ తర్వాత చిత్ర దర్శక నిర్మాతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కమిటీ చరిత్రకారులతో ఉండే అవకాశం ఉందన్నారు. కాగా పద్మావతి మూవీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. -
ఏలూరులో ysrcp అనుబంధ సంస్థల కమిటీలు
-
నిగ్గు తేల్చండి
⇒ దిగుమతి మందుల నాణ్యతపై హైకోర్టులో పిటిషన్ ⇒ ఎయిర్‌పోర్టు, హార్బర్లలో ల్యాబ్‌ల ఏర్పాటుకు వినతి ⇒ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయమూర్తి ఆదేశాలు చైనా నుంచి తమిళనాడుకు దిగుమతయ్యే ఫార్మసీ మందుల నాణ్యతను పరిశీలించేందుకు అన్ని విమానాశ్రయాలు, హార్బర్లలో నిపుణుల కమిటీని నియమించాల్సిందిగా కోరుతూ మద్రాసు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి నివారణకు అధికశాతం మందులు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇలా విదేశాల మందుల్లో అధికశాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. 1991లో చైనా నుంచి భారత్‌కు దిగుమతైన మందుల్లో చైనా వాటా 0.3 శాతం మాత్రమే. అయితే ప్రస్తుతం చైనా నుంచి భారత్‌కు దిగుమతయ్యే మందుల్లో యాక్టివ్ ఫార్మాసూటికల్స్ ఇంగ్రీడియన్స్ (ఏబీఐ) అనే మందుల ముడిసరుకు సరఫరా మాత్రమే 92 శాతంగా ఉంది. భారతదేశ మందుల తయారీని గత పాతికేళ్లలో చైనా కొంచెం కొంచెంగా మింగేసింది. చైనా నుంచి దిగుమతయ్యే మందులపై పరిశోధనలు లేదా నాణ్యత పరిశీలనలు సాగడం లేదు. చైనా దిగుమతుల కారణంగా భారతదేశంలోని మందుల తయారీ కంపెనీలు మూతపడే స్థితికి చేరుకోవడంతో చైనా మందుల నాణ్యత పరిశీలనకు నిపుణులతో కూడిన కమిటీని కేంద్రం నియమించింది. చైనా నుంచి దిగుమతి అవుతున్న నాసిరకం మందులు ప్రజాబాహుళ్యంలోకి ప్రవేశించేలోగానే అన్ని విమానాశ్రయాలు, హార్బర్లలో నాణ్యతపై పరిశోధన కేంద్రాలు, స్వదేశీ మందులను ప్రోత్సహించేందుకు మెడికల్ హబ్‌ల ఏర్పాటుపై నిపుణుల కమిటీ కేంద్రానికి సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సులను యుద్ధప్రాతిపదికన అమలు చేస్తామని 2015లో హమీ ఇచ్చిన కేంద్రం ‘మందుల తయారీ ముడిసరుకుల ఏడాది–2015’ అనే ప్రకటనతో సరిపెట్టుకుంది. హైకోర్టులో పిటిషన్ ఈ దశలో కేంద్ర ప్రభుత్వం మందుల ముడిసరుకుల సేకరణ లక్ష్యాన్ని నిరసిస్తూ వినకెమ్ లేబ్స్ అనే మందుల పరిశోధన కేంద్రం బుధవారం కోర్టులో పిటిషన్ వేసింది. భారతదేశంలోని వ్యాధిగ్రస్తుల మేలు, దేశీయ విజ్ఞాన సంపద, తమిళనాడు రైతులు ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ముడిసరుకుల సేకరణ లక్ష్యంలోని నిబంధనల్లో మార్పుతెచ్చేలా ఆదేశించాలని ఆ సంస్థ కోరింది. అలాగే దేశంలోని అన్ని హార్బర్లు, విమానాశ్రయాల్లో మందుల పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎన్ కృపాకరన్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నాబార్డు బ్యాంకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పిటిషన్ దారుకు బదులివ్వాల్సిందిగా ఆదేశించారు. -
గరగపర్రులో వైఎస్ఆర్సీపీ బృందం పర్యటన
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం మంగళవారం పర్యటించింది. ఈ సందర్భంగా గరగపర్రు బాధితులతో బృందం సభ్యులు భేటీ అయ్యారు. పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్లనాని, మేరుగ నాగార్జున తదితరులు దళితవాడలో బాధితులతో సమావేశమై గ్రామంలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ గరగపర్రు ఘటనపై బాధితులు మాట్లాడుతూ...‘ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ ఏర్పాట్లకు సన్నాహాలు చేశాం. ఏప్రిల్ 23న విగ్రహాన్ని చెరువుగట్టు సెంటర్లో పెట్టాం. రాత్రికి రాత్రే అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు. కోర్టు వివాదం ఉన్న నేపథ్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదని చెప్పారు. అన్ని విగ్రహాలను తొలగించే సమయంలో మేం కూడా అక్కడ నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పినా వినిపించుకోలేదు. గ్రామంలోని అన్ని కులాలు శివాలయంలో సమావేశం అయ్యారు. మే 5వ తేదీ లోపు విగ్రహం తొలగించాలని డెడ్‌లైన్ పెట్టారు. ఆ తర్వాత నుంచి మమ్మల్ని సాంఘీక బహిష్కరణ చేశారు. పాలు, కూరగాయలు, మందులు కూడా అందకుండా చేశారు.’ అని తమ ఆవేదన వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ గరగపర్రు గ్రామంలో సామాజిక బహిష్కరణ కేసు విచారణ రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు గరగపర్రు సందర్శించి సంఘటనకు సంబంధించి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని పూర్వాపరాలను విచారించారని చెప్పారు. కాగా గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై రెండు వర్గాల మధ్య రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. -
గరగపర్రు వివాదంపై వైఎస్ఆర్ సీపీ కమిటీ
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు వివాదంపై ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మేరుగ నాగార్జున తదితరులు సభ్యులుగా ఉంటారు. వైఎస్ఆర్ సీపీ కమిటీ సభ్యులు మంగళవారం గరగపర్రులో పర్యటించి, వాస్తవాలను తెలుసుకోనున్నారు. కాగా గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై రెండు వర్గాల మధ్య రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు తమను సాంఘిక బహిష్కరణ చేశారంటూ దళితులు .....కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు వచ్చిన పలువురు దళిత సంఘం నేతలను అరెస్ట్ చేశారు. అయితే ఒకరిని రాజమండ్రిలో విడిచిపెట్టగా...మిగిలిన నాయకులను పెదవేగి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. ఈ విషయం తెలియగానే దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. లోపలికి ఎవరూ వెళ్లకుండా భీమవరం-తాడేపల్లిగూడెం రహదారిపై పోలీసులు మోహరించారు. దళితులకు మద్దతుగా వస్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రతోపులాట జరిగింది. వాగ్వాదం చోటుచేసుకుంది. -
నర్సింగ్ కాలేజీల సమస్యల పరిష్కారానికి కమిటీ
► నివేదికను సమర్పించేందుకు 15 రోజుల గడువు.. హైదరాబాద్: నర్సింగ్ కళాశాలల్లోని సమ స్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసి, దాని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని వైద్యా రోగ్యశాఖ నిర్ణయించింది. 15 రోజుల్లో కమిటీ నివే దిక ఇచ్చేలా గడువు విధించాలని ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి నిర్ణయించారు. గురువారం వెంగళరావు నగర్‌లోని కుటుంబ సంక్షేమశాఖ కార్యాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి అధికారులతో సమీక్షించారు. డిగ్రీ, జీఎన్ఎం వంటి చదువుల ద్వారా నర్సుల నియామకాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో రకరకాల సమస్యలు నెలకొన్నాయి. వాటితో పాటు మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, అకడ మిక్ వ్యవహారాల వంటి వాటి మీద అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీని ఆదేశించారు. పాలమూరు వైద్యకళాశాలకు ఎల్ఓపీ.. పాలమూరు వైద్య కళాశాలకు రెండో ఏడాది కూడా లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ) లభించింది. సమావేశంలో దీనిపై మంత్రి సమీక్షించారు. జిల్లా కలె క్టర్లు, డీఎం,హెచ్ఓ సంబంధిత శాఖల ఉన్నతా ధికారులు సమన్వ యంతో సమస్యలను అధిగమిం చాలని సూచించారు. ఈ సమావేశంలో పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్, డీఎం ఈ రమణి, డీహెచ్ లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ వైద్యులకు శిక్షణ... గ్రామీణ వైద్యులకు గతంలో ప్రారంభించిన శిక్షణ వివిధ స్థాయిల్లో ఆగిపోయింది. దీంతో మళ్లీ శిక్షణ షెడ్యూల్ సిద్ధం చేయాలని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 17 శిక్షణ కేంద్రాలున్నాయి. వాటికి అదనంగా మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయా లని, పది రోజుల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని ఆదేశించారు. -
కావేరిపై నిపుణుల కమిటీ !
► రాష్ట్ర న్యాయవాది నారిమన్‌తో చర్చించాకే తుది నిర్ణయం ► అఖిలపక్ష భేటీలో తీర్మానం సాక్షి, బెంగళూరు: ‘కావేరి నదీ జలాల పంపకం విషయమై కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలా, వద్దా అన్న విషయంలో సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్. నారిమన్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని రాష్ట్ర అఖిలపక్షం నిర్ణయించింది. కావేరి నదీ జలాల పంపకంపై తరచుగా తమిళనాడు, కర్ణాకట, కేరళ, పుదుచ్చేరీల మధ్య భిన్నాభిప్రాయాలు వస్తుండడం తెలిసిందే. తమిళనాడు, కర్ణాటకలు కావేరి విషయంలో ప్రతి ఏడాది కోర్టు లేదా కావేరి ట్రైబ్యునల్‌కు వెళ్లడంతో సమస్య జఠిలమవుతోంది. వర్షాభావం ఏర్పడినప్పుడు కావేరి నదీజలాల పంపకాలపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో నదీజలాల పంపకానికి సంబంధించి నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ విషయమై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను అడిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన అన్ని పార్టీలకు చెందిన నాయకులు విధానసౌధలో సమావేశమమయ్యి నిపుణుల కమిటీ ఏర్పాటు వల్ల కలిగే లాభనష్టాల పై చర్చించారు. వారంలోపు నారిమన్‌తో భేటీ జులైలో సుప్రీం కోర్టులో కావేరి నదీజలాలల పంపకంపై తీర్పు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ తరుణంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తే కలిగే ఇబ్బందులపై చర్చించారు. ఈ విషయంలో కావేరిపై కర్ణాటక తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తున్న నారిమన్ సలహా తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. భేటీ అనంతరం ఎం.బీ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ... మరో వారంలోపు ఉన్నతాధికారులో చర్చించి, నారిమన్‌తో భేటీ అయ్యి నిపుణుల కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కావేరి విషయంలో రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రికి మద్దతునిస్తామని సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేత జగదీష్ శెట్టర్ తెలిపారు. మండలిలో బీజేపీ పక్ష నాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప, శాసనసభలో జేడీఎస్పక్షనేత కుమారస్వామి గైర్హాజరయ్యారు. -
మేలో కృష్ణా త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటిని ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసే విషయమై మే మొదటి వారంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. ఇరు రాష్ట్రాలు తమ నీటి అవసరాలను ఇప్పటికే బోర్డు ముందుంచడం, రెండు ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది. మే, జూన్, జూలై వరకు ప్రస్తుతం ఉన్న నీటి పంపిణీపై కమిటీ ఓ నిర్ణయానికి రానుంది. దీంతో పాటు టెలీమెట్రీ పరికరాలు అమర్చడంపైనా చర్చించనుంది. -
కమిటీల సూచనలను డిజైన్ల సంస్ధకు అందజేస్తాం
-
12న రజకుల వివాహ పరిచయ వేదిక
కడప రూరల్ : ఈనెల 12వ తేదిన రాజంపేట పట్టణం రెడ్డివారివీధి శ్రీ చౌడేశ్వరిదేవి దేవస్థానంలో వివాహ పరిచయ వేదిక కమిటీ ఆధ్వర్యంలో రజక కులస్థుల ఉచిత వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసినట్లు వేదిక నాయకులు యు.యానాదయ్య, చేలో రవి శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలనే రజక సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వేదికకు హాజరయ్యే వారు వధూవరుల ఫుల్ఫోటో, పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. వివరాలకు 96427 10496 నెంబరులో సంప్రదించాలన్నారు. -
సర్వీసు క్రమబద్ధీకరణకు కమిటీ
⇒ కాంట్రాక్టు లెక్చరర్లకు ⇒ ఉప ముఖ్యమంత్రి కడియం హామీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైమ్ అధ్యాపకుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వెంటనే ధర్నాలు, ఆందోళనలు విరమించుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. వర్సిటీల కాంట్రాక్టు, పార్ట్ టైమ్ లెక్చరర్లు ఆదివారం కడియం శ్రీహరిని ఆయన నివాసంలో కలసి వారి సమస్యలను వివరించారు. ప్రస్తు తం పరీక్షలు సమీపిస్తున్నాయని, పైగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో సమ్మె చేయడం సరైంది కాదని కడియం అధ్యాపకులకు సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సమ్మె తక్షణమే విరమించాలన్నారు. జీతాల పెంపు, సర్వీసు క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం కమిటీ వేసి అధ్యయనం చేయించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఉస్మానియా వర్సిటీ శతాబ్ది ఉత్సవాలు కూడా త్వరలో జరగనున్న నేపథ్యంలో వర్సిటీలో చక్కని వాతావరణం నెలకొల్పేలా, వర్సిటీ అభివృద్ధికి దోహదపడేలా అధ్యాపకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కడియంను కలిసిన వారిలో యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (కాంట్రాక్టు), తెలంగాణ యూని వర్సిటీస్ అసోసియేషన్ (కాంట్రాక్టు), ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నేతలు పరశురామ్, నిరంజన్, ధర్మతేజ, భాగ్యమ్మ, వి.కుమార్, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
సబ్‌ప్లాన్‌పై అధ్యయన కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ ఉప ప్రణాళికలో సవరణల కోసం గిరిజనసంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న బడ్జెట్ కేటాయింపుల్లో మార్పు లను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై దృష్టి సారించేందుకు ఈ కమిటీని నియమించారు. ఎస్టీల సంక్షేమం, అభివృద్ధికి కొత్త పథకాలను సిఫార్సు చేయాలని ఈ కమిటీకి ప్రభుత్వం నిర్దేశించింది. కమిటీ సభ్యులుగా ఎంపీలు సీతారాం నాయక్, జి.నగేశ్, ఎమ్మెల్సీ రాములునాయక్, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, కోవా లక్ష్మి, సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు నియమితుల య్యారు. ఈ మేరకు ఎస్టీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. -
ఎంతో చెప్పుకోవాలని వస్తే..
అంతా పది నిమిషాల్లో ముగించేశారు ఓడలరేవులో పార్లమెంట్ పెట్రోలియం స్టాండింగ్ కమిటీ పర్యటన ఓఎన్జీసీ అధికారులపై వివిధ వర్గాలవారు మండిపాటు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డంకులు... రాకపోకలపై ఆంక్షలు ఓడలరేవు ప్లాంట్ ముందు ఆందోళన అమలాపురం/అల్లవరం : చమురు సంస్థల కార్యకలాపాల వల్ల తమకు జరుగుతున్న అన్యాయాన్ని.. నష్టాలను పార్లమెంటరీ పెట్రోలియం స్టాండింగ్ కమిటీకి చెప్పుకోవాలని, తాము ఎదుర్కొంటున్న సమస్యలపై స్పష్టమైన హామీలు పొందాలని ఆశించిన వివిధ వర్గాల ప్రజలకు నిరాశే ఎదురయింది. మత్స్యకార గ్రామల నుంచి వెల్లువెత్తుతున్న వినతుల నేపథ్యంలో పార్లమెంట్ పెట్రోలియం స్టాండింగ్ కమిటీ మంగళవారం ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్‌ను సందర్శించింది. కమిటీ చైర్మ¯ŒS ప్రహ్లాద్ వెంకటేష్ జోషి, సభ్యులు వి.విజయసాయిరెడ్డి, పండుల రవీంద్రబాబుతోపాటు ఏడుగురు ఎంపీలు వచ్చారు. కమిటీ వస్తుందని తెలిసి కోనసీమ నలుమూలల నుంచి రైతులు, మత్స్యకారులు, మహిళలు, నిరుద్యోగ యువత ఓడలరేవు ప్లాంట్ వద్దకు చేరుకుంది. తమ కష్టాలను చెప్పుకోవాలని ఆయా వర్గాలవారు ఎంతో ఆశపడ్డారు. ఉదయం పదకొండు గంటలకు వచ్చిన కమిటీ మధ్యాహ్నం మూడున్నర వరకు సుమారు నాలుగున్నర గంటలు ఓడలరేవులో గడిపినా ప్రజల సమస్యలు వినేందుకు మాత్రం కేవలం పది నిమిషాలు మాత్రమే కేటాయించడంతో పెదవివిరిచారు. తమ సమస్యలను వివరిస్తున్న సమయంలో ఓఎన్జీసీ అధికారులు కమిటీ సభ్యులను ప్లాంట్‌లోకి తీసుకుపోవడంతో స్థానికులను విస్మయానికి గురిచేసింది. దీంతో వారు ప్లాంట్ మెయి¯ŒS గేట్ వద్ద ఆందోళనకు దిగారు. బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు... కోనసీమ నలుమూలల నుంచి వచ్చినవారిని ప్లాంట్‌కు సమీపంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ప్లాంట్ వద్దకు వెళ్లేవారినే కాకుండా బీచ్‌కు, సమీపంలో రిసార్్ట్సకు వచ్చినవారిని సైతం వెళ్లనివ్వకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. చివరకు స్థానిక గ్రామస్తులను కూడా ప్లాంట్ వద్దకు వెళ్లనివ్వలేదు. ఈ సమయంలో పోలీసులకు, ప్రజలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో వెనుకడుగు వేసిన పోలీసులు ఆయా వర్గాలకు చెందిన ప్రతినిధులు చాలా తక్కువమందిని మాత్రమే ప్లాంట్ వద్దకు వెళ్లేందుకు అనుమతిచ్చారు. టెర్మినల్ నుంచి బయటకు వచ్చిన స్టాండింగ్ కమిటీ సభ్యులు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు వివరిస్తున్న సమయంలో కొంతమంది బీజేపీ నాయకులు తమ పార్టీకి చెందిన ఎంపీలతో ఫోటోలకు దిగడం ఆయా వర్గాలవారికి ఆగ్రహం తెప్పించింది. కోనసీమను ముంచేయవద్దు... ‘మా సమస్యలు ఈ రోజువి కావు. ఓఎన్జీసీ కార్యకలాపాలు ఆరంభమైనప్పటి నుంచి ఇవే సమస్యలు. భూమి కుంగిపోతోందని మేము చెబుతున్న విషయం కాదు. జియాలజిస్టులు, శాస్త్రవేత్తల నివేదికలున్నాయి. వరి, కొబ్బరితోపాటు అన్ని పంటలు దెబ్బతింటున్నాయి’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ కిసా¯ŒS సంఘ్, కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రతినిధులు రైతులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. ‘సిస్మిక్ సర్వే వల్ల మత్స్యసంపద నశించి జీవనోపాధి కోల్పోతున్నాం. ఆ సమయంలో నష్టపరిహారం ఇవ్వడం లేదు. జీఎస్పీఎస్ ఇచ్చినట్టుగా ఓఎన్జీసీ కూడా మత్స్యకారులకు పరిహారం ఇవ్వాలి’ అని మత్స్యకారులు డిమాండ్ చేశారు. ఈ సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి జోక్యం చేసుకుని ‘అసలు మీ ప్రాంతంలో ఎంతమందికి ఓఎన్జీసీ ఉద్యోగాలు ఇచ్చింది?’ అని ప్రశ్నించారు. దీనికి కోనసీమ ఓఎన్జీసీ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు స్పందిస్తూ ఒక్కరంటే ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. సంస్థల వల్ల కోనసీమ మునిగిపోయి 15 లక్షల మంది పొట్ట చేతబట్టుకుని వలసపోయే ప్రమాదం ముంచుకొస్తోంద ని ఆగ్రహంగా మాట్లాడారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం లేదని, ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడుతున్నా సరైన భద్రతా చర్యలు చేపట్టడం లేదని సూర్యనారాయణరావు ఆరోపించారు. అందరి సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు తాము కృషి చేస్తామని, విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకు వెళతామని కమిటీ చైర్మ¯ŒS ప్రహ్లాద్ వెకంటేష్ జోషి, సభ్యులు హామీ ఇచ్చారు. టెర్మినల్‌లో ఓఎన్జీసీ, ఇతర పెట్రోలియం శాఖకు చెందిన అధికారులతో రెండున్నర గంటలపాటు చర్చించారు.అమలాపురం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు, మాజీ ఎమ్మెల్యేలు మానేపల్లి అయ్యాజీవేమా, రాపాక వరప్రసాద్, ఆల్డా చైర్మ¯ŒS యాళ్ల దొరబాబు, మెట్ల రమణబాబు, రైతు సంఘం ప్రతినిధులు ముత్యాల జిమ్మీ, వాసంశెట్టి సత్యం, జున్నూరి బాబి, కుడుపూడి బాబు, యాళ్ల వెంకటానందం, ఎం.ఎం.ప్రభాకర్, రంబాల బోస్, మత్స్యకార సంఘం ప్రతినిధులు మల్లాడి హనుమంతరావు, కొల్లు సత్యవతి, బీజేపీ నాయకులు ఆర్.వి.నాయుడు, మోకా వెంకట సుబ్బారావు, యల్లమిల్లి కొండలు పాల్గొన్నారు. -
సమాజహిత సాధకమే ఆధ్యాత్మికత
‘మనగుడి–మనసేవ’ కార్యవర్గ ప్రమాణ స్వీకారం రాజమహేంద్రవరం కల్చరల్ : ‘ఆధ్యాత్మికత అంటే మతం కాదు.. అత్యున్నతమైన నాగరికత, సమాజకల్యాణానికి ఉపకరించే దివ్యసాధన’మని కవి, గాయకుడు ఎర్రాప్రగడ రామకృష్ణ పేర్కొన్నారు. శ్రీమహాలక్షీ్మసమేత చిన్న వేంకన్నబాబు స్వామివారి పీఠం, సర్వేజనాస్సుఖినోభవంతు ఛారిటబుల్ ట్రస్టుల అనుబంధ సంస్థ ‘మన గుడి–మన సేవ’ నూతన రాష్ట్ర కార్యవర్గసభ్యులతో ఎర్రాప్రగడ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలికే ప్రతి పలుకూ ప్రార్థన, వేసే ప్రతి అడుగూ తీర్థయాత్ర కావాలన్నారు. పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కార్యవర్గసభ్యులు అంకితభావంతో సేవలందించాలని కోరారు. పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు మాట్లాడుతూ పీఠం ద్వారా వచ్చిన పదవులను బరువుబాధ్యతలుగా కాక భగవంతునితో బంధంగా భావించాలని పిలుపునిచ్చారు. సమాజంలో అశాంతిని దూరం చేసే శక్తి ఆధ్యాత్మికానికే ఉందన్నారు. ఈ ఏడాది దశావతార గోవింద దీక్షలు, గోవిందమాలధారణలు, ద్వారకాతిరుమలకు పాదయాత్రలు, అఖండ నారాయణహరి ఓం మంత్రపారాయణలు భారీస్ధాయిలో నిర్వహిస్తామన్నారు. సామాన్యుని ముంగిటకు ఆధ్యాత్మికవేత్తలు తరలిరావాలని కోరారు. వివిధ జిల్లాలనుంచి తరలి వచ్చిన 20 మంది కార్యవర్గసభ్యులు, అయిదుగురు గౌరవ సలహాదారులు, ఎనిమిదిమంది మహిళావిభాగం సభ్యులు, 11 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. చైర్పర్స¯ŒSగా ప్రమాణస్వీకారం చేసిన దుర్గావేంకట హేమావతి మాట్లాడుతూ ఆధ్యాత్మికత ఇంటి నుంచే ప్రారంభం కావాలని కోరారు. నూతన ఆంగ్ల సంవత్సరాన్ని కాలపురుషుడు చూపుతున్న మేలి మలుపుగా భావించాలన్నారు. -
నగదు రహిత లావాదేవీలపై కమిటీ
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీల ప్రోత్సహానికి కేంద్ర ప్రభుత్వం 13 మందితో కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, సిక్కిం సీఎం పవన్ కుమార్ చామ్లింగ్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సభ్యులుగా ఉంటారు. ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఇందులో ఉంటారు. డిజిటల్ నగదు లావాదేవీలకు సంబంధించిన అంశాలపై కమిటీ సూచనలు, సలహాలు ఇస్తుంది. అంతర్జాతీయంగా అమలవుతున్న నగదు రహిత లావాదేవీలను పరిశీలించిన మన దేశానికి అనువైన విధానాలను సూచించనుంది. -
కార్పొరేషన్ అవినీతిపై కమిటీ వేయాలి
– రోడ్డు విస్తరణ పేరుతో ఎంపీ, ఎమ్మెల్యే నాటకాలు – మేయర్ అవినీతి గురించి కార్పొరేటర్లే చెబుతున్నారు – వైఎస్సార్సీపీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి అనంతపురం న్యూసిటీ : ‘రోడ్డు విస్తరణ చేయడానికి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని సీఎం చంద్రబాబు నాయుడు వేశారు. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా నగరపాలక సంస్థలో అవినీతి జరిగింది. అధికార పార్టీ దెబ్బకు ఎంత మంది కమిషనర్లు వెళ్లిపోయారో అందరికీ తెలుసు. వీరి అవినీతిపై కమిటీ వేస్తే మేయర్ స్వరూప, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఢొంక బయటపడుతుంది' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి అన్నారు. మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఎంపీ నిధుల కింద గతంలోనే భవనాన్ని ఏర్పాటు చేస్తే, వాటికి తిరిగి రూ.4.5 లక్షలు బిల్లు చేసిన ఘనత పాలకవర్గానికే దక్కుతుందన్నారు. దొంగ బిల్లులు చేసిన అధికారులు, ప్రగల్భాలు పలికే మేయర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. సీఎం వచ్చారని, స్వాతంత్య్ర వేడుకలంటూ రూ.లక్షల్లో దోచుకుంటున్నారని ఆరోపించారు. కాసింత మట్టి తొలగించడం, లైట్లు వేయడం, మొక్కలు నాటడమే అభివృద్ధి అని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి గురించి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి తెలియదా? అని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్యే రోడ్డు విస్తరణ పేరుతో నాటకాలాడుతున్నారన్నారు. ఇంతటి దౌర్భాగ్యమైన నగరపాలక సంస్థ రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు. ఇక మేయర్ తమపై మాట్లాడడం అర్థరహితమన్నారు. మేయర్ అవినీతిని బయటపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే, మేయర్ ఎక్కడకు వెళ్లిన మిస్సమ్మ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారన్నారు. మిస్సమ్మ స్థలం బీఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కు చెందిందని కోర్టు చెప్పినా ఎవరిని మభ్యపెట్టేందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీల చుట్టూ తిరిగి అదే ఆలోచనలతో వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆలోచనలతో ముందుకెళ్తున్నామని మా నిజాయితీ ఏంటో మీ పార్టీ ముఖ్యనేతలకే తెలుసన్నారు. కార్పొరేటర్లే తిరగబడుతున్నారు : మేయర్ స్వరూపపై అధికార పార్టీకు చెందిన కార్పొరేటర్లే తిరుగుబాటు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్ రెడ్డి ఆరోపించారు. సాక్షాత్తు మంత్రి నారాయణకు మేయర్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయని, అభివృద్ధి పనుల కేటాయింపులో వివక్ష చూపుతోందని ఆరోపించారన్నారు. రోడ్డు విస్తరణ పేరుతో సొంత పార్టీకు చెందిన ఎంపీనే నగరపాలక సంస్థ ముందు ధర్నా చేశారన్నారు. ఎమ్మెల్యే, మేయర్ రాజకీయాలు ఏపాటివో అర్థం చేసుకోవాలన్నారు. ఆధిపత్య పేరుతో నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. -
సీఎం చెంతకు ససేమిరా
భీమవరం : అవసరమైతే ప్రాణత్యాగాలకు సిద్ధపడతామే తప్ప.. ఎట్టిపరిస్థితుల్లో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణానికి అంగీకరించేది లేదని పోరాట కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆక్వా పార్క్ నిర్మి ంచడం తమకూ ఇష్టం లేదని భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు స్వరం మార్చగా.. పనులను తాత్కాలికంగా నిలిపివేయిస్తామని ఆచంట ఎమ్మెల్యే ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, ఉద్యమ నాయకులు కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళదామని ప్రతిపాదించగా.. సీఎం చెంతకు వచ్చేది లేదంటూ పోరాట కమిటీ నాయకులు తెగేసి చెప్పారు. రాజ్యసభ సభ్యురాలు, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి గృహంలో ఆక్వా పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులతో ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), బండారు మాధవనాయుడు, నరసాపురం సబ్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ సోమవారం భేటీ అయి చర్చలు జరిపారు. తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు గ్రామాల నుంచి పోరాట కమిటీ ప్రతినిధులు సుమారు 100 మంది హాజరయ్యారు. సీతారామలక్ష్మి ఇంటిచుట్టూ మోహరించిన పోలీసులు పోరాట కమిటీకి చెందిన కొందరు నాయకులతో మాత్రమే ఎమ్మెల్యేలు మాట్లాడతారని, వారు మాత్రమే లోపలికి రావాలని చెప్పారు. దీనిని ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎవరేం మాట్లాడినా అందరి సమక్షంలో మాట్లాడాలని, లేకుంటే తాము చర్చలకు వచ్చేది లేదని భీష్మించారు. దీంతో చేసేదిలేక వచ్చిన వారందరినీ పిలిచి చర్చించారు. మా శవాలపై కట్టుకోండి ముందుగా వివిధ గ్రామాలకు చెందిన 12 మంది పోరాట కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ శవాలపై కట్టుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల ఎటువంటి కాలుష్యం ఉండదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికే కొన్ని పరిశ్రమల వల్ల యనమదుర్రు డ్రెయి¯ŒS పూర్తిగా కలుషితమై అనేక గ్రామాల ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, రావులపాలెం మండలం ఈతకోట, నెల్లూరు జిల్లాలో గల రొయ్యల ఫ్యాక్టరీల్లో అమోనియా గ్యాస్ లీకై వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఉద్యమకారులు వివరించారు. వాస్తవాలు కళ్లెదుటే కనిపిస్తున్నా ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రెండున్నరేళ్లుగా ఉద్యమం చేస్తుంటే.. మొదట్లో తమకు మద్దతు పలికిన ఎమ్మెల్యేలు అంజిబాబు, మాధవనాయుడు ఆ తరువాత ఎందుకు మాట మార్చారని నిలదీర్చారు. స్వరం మార్చిన ఎమ్మెల్యేలు ఉద్యమకారులతో భేటీలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, నరసాపురం ఎమ్మెల్యే మాధవనాయుడు స్వరం మార్చారు. నిన్నటివరకు ఫుడ్‌పార్క్ నిర్మాణం కొనసాగుతుందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన వారిద్దరూ.. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నడుచుకోబోమని ఉద్యమకారులతో భేటీలో స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఫ్యాక్టరీ కావాలని తాను కూడా కోరుకోవడం లేదన్నారు. ఆక్వాపార్క్ యాజమాన్యం ఫ్యాక్టరీ నిర్మాణం విషయాన్ని తమ దృష్టికి తీసుకురాలేదని, పంచాయతీ తీర్మానం అవసరమైనప్పుడు మాత్రమే తాము గుర్తొచ్చామని చెప్పారు. ప్రజలందరి అభిప్రాయమే తన అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. ‘నేనూ వ్యతిరేకించా’ గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం వల్ల తామంతా నష్టపోతామని నరసాపురం నియోజకవర్గంలోని ఎక్కువ గ్రామాల ప్రజలు తనకు చెప్పారని ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని అప్పటికప్పుడు ఆదేశించారన్నారు. ఇప్పటికే యనమదుర్రు డ్రెయిన్, కొన్ని పంట కాలువలు కలుషిత కావడం వల్ల తన నియోజకవర్గ ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని మాధవనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దృష్ట్యా ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల నష్టం కలుగుతుందని తేలితే దానిని తాను కూడా వ్యతిరేకిస్తానని స్వష్టం చేశారు. పనులను తాత్కాలికంగా నిలిపివేయిస్తాం ఆక్వా పార్క్ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేయిస్తామని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఉద్యమకారులతో జరిపిన భేటీలో ప్రకటించారు. గ్రామాల్లో విధించిన 144 సెక్ష¯ŒS ఎత్తివేతకు కృషిచేస్తామన్నారు. ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల వచ్చే ఇబ్బందులను ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు ఒక కమిటీగా వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరిద్దామని ప్రతిపాదించగా, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. తాము ఎట్టి పరిస్థితిల్లో చంద్రబాబు వద్దకు వచ్చేది లేదని, ప్రజాప్రతినిధులే ఆయనతో మాట్లాడి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయించాలని కోరారు. ‘హైదరాబాద్ నుంచి వైఎస్ జగ¯ŒS వచ్చారు.. మీరు మాత్రం రాలేదు ఆక్వాపార్క్ ఉద్యమకారులపై అక్రమంగా పెట్టిన కేసులు, అరెస్ట్‌లతో భయాందోళనలకు గురైన ప్రజలను ఓదార్చేందుకు, వారిపక్షాన నిలబడేందుకు హైదరాబాద్ నుంచి వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి వచ్చారని, జిల్లాలోనే ఉన్న మీరెందుకు రాలేకపోయారని ఉద్యమకారులు ఎమ్మెల్యేలను నిలదీశారు. తమ గ్రామాలకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే అంజిబాబు, మాధవనాయుడుకు తీరిక దొరకలేదా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం ఇంటింటికీ తిరిగిన మీరు ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోరా అని ధ్వజమెత్తారు. అభివృద్ధి పనులకు, పరిశ్రమల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కానే కాదని స్పష్టం చేశారు. అయితే, ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఆక్వా పార్క్‌ను ఎట్టిపరిస్థితుల్లో జనావాసాలకు దూరంగా తరలించాలని కోరారు. -
శ్రీశైలం డ్యాం తనిఖీ
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల నీలం సంజీవరెడ్డిసాగర్ డ్యాంను నిపుణుల కమిటీ గురువారం తనిఖీ చేసింది. డ్యాం పటిష్టత, గేట్ల ఆపరేషన్, గ్యాలరీ నిర్వహణ, ప్లంజ్ఫుల్, స్టాఫ్లాక్, ఎలిమెంట్లను పరిశీలించింది. వార్షిక మరమ్మతు పనులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసింది. భవిష్యత్తులో వరదలు వచ్చినప్పటికి కూడా శ్రీశైలం డ్యాంకు ఎటువంటి ముప్పు లేదని, పటిష్టమైన కాంక్రీట్ తదితర పనులు ఇంకా చేయాల్సి ఉందని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. కమిటీలో అడ్వైజర్ రిటైర్డు చీఫ్ ఇంజనీర్ అబ్దుల్ బషీర్, రిటైర్డు ఎస్ఈ సత్యనారాయణ, పరిశీలనాధికారి కృష్ణారావు, ఎస్ఈ మల్లికార్జునరెడ్డి, క్వాలీటీ కంట్రోల్ డీఈ శంకరరెడ్డి, నీటిపారుదలశాఖ ఈఈలు మాణిక్యాలరావు, వరహాలరావు, డీఈఈలు గన్యానాయక్, సేనానంద్ ఉన్నారు. -
సాగునీటి వనరుల కల్పనతోనే.. రైతు ఆత్మహత్యల నివారణ
బతికేందుకు తలకు మించిన భారం మోస్తున్నారు సాగునీరిస్తే సబ్సిడీలు కూడా అడగరు ‘సాక్షి’తో రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ సభ్యులు అనంతపురం అగ్రికల్చర్ : సాగునీటి వనరుల కల్పన, వ్యవసాయోత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం లాంటివి కల్పిస్తే అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వ రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన ఆగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ (ఏఈఆర్‌ఎస్) రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ ఎం.నాగేశ్వరరావు, రీసెర్చ్ అసోసియేట్స్ డాక్టర్ కె.రాంబాబు, డాక్టర్ పి.రాముతో కూడిన బృందం మూడు రోజుల జిల్లా పర్యటనను సోమవారం ముగించుకుంది. ఈ సందర్భంగా సాయంత్రం వారు నగరంలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో ‘సాక్షి’తో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రైతు ఆత్మహత్యలకు దారితీసిన కారణాలు, కుటుంబాల స్థితిగతులు, భవిష్యత్తులో వారికి ఎలాంటి సహకారం అవసరం, ఆత్మహత్యల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై తెలంగాణలోని వరంగల్, మెదక్ జిల్లాలలో 50 కుటుంబాలు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, గుంటూరు జిల్లాల్లో 15 కుటుంబాలను కలిసి అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇప్పటికే తెలంగాణ జిల్లాలు, రాష్ట్రంలోని గుంటూరులో పూర్తి చేయగా.. ఇప్పుడు ఇక్కడ ముగిసిందన్నారు. డిసెంబర్ ఆఖరులోగా కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామన్నారు. జిల్లా రైతులకు నీళ్లిస్తే చాలు గత మూడు రోజులుగా వ్యవసాయశాఖ అధికారుల సహకారంతో జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 15 బాధిత కుటుంబాలను, మరికొందరు రైతులను కలిసి వివిధ అంశాలపై అధ్యయనం చేశామన్నారు. బుక్కపట్నం, ఓడీచెరువు, కదిరి, అనంతపురం రూరల్, గార్లదిన్నె, శింగనమల, బుక్కరాయసముద్రం, నార్పల, గుత్తి మండలాల పరిధిలోని 14 గ్రామాల్లో పర్యటించామన్నారు. ‘రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారి ఇంట అప్పులు కుప్పలుగా ఉన్నాయి. పంటలు పండించడానికి తలకు మించిన భారం మోస్తున్నారు. కొందరు ఎక్కువ భూమిని కౌలుకు తీసుకుని తీవ్రంగా నష్టపోయారు. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు కష్టంగా కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితులు కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. పంటలు పండించేందుకు నీటి కొరత వేధిస్తోంది. నీళ్ల కోసం అప్పులు చేసి బోర్లు వేయిస్తున్నారు. అందులో 90 శాతం ఫెయిల్ అవుతున్నాయి. గుత్తి మండలం కొత్తపేటలో కె.నారాయణస్వామి అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో ఏకంగా 9 బోర్లు వేయించినా ఒక్కదాంట్లో కూడా నీరు రాలేదు. అప్పులు రూ.4 లక్షలకు పైబడి కావడంతో తీర్చే స్తోమత లేక ఆత్మహత్యకు తెగించాడు. ఒక్కోసారి టమాట, ఉల్లి, ఇతరత్రా ఉద్యాన ఉత్పత్తులకు కూడా సరైన గిట్టుబాటు కాక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యల వల్ల జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగానే కనిపిస్తోంద’ని అన్నారు. ‘ఆత్మహత్యలు తగ్గించాలంటే రైతులకు సాగునీళ్లు ఇవ్వాలి. సమృద్ధిగా నీళ్లుంటే అన్ని రకాల పంటలు పండించే సత్తా వీరికి ఉంది. నీళ్లు, మార్కెటింగ్ ఉంటే ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్, ఇతరత్రా రాయితీలు కూడా అడిగే పరిస్థితి కనిపించడం లేదు. రైతులు కూడా అవసరం లేకున్నా పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా భూముల్లో ఉప్పుశాతం ఎక్కువగా ఉన్నందున ఆశించిన దిగుబడలు రావడం లేదు. వేరుశనగ, కంది పంటల సాగు ఇక్కడ శరణ్యం. పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు, ఎరువుల యాజమాన్యం, హెల్ప్‌లైన్, కౌన్సెలింగ్ సెంటర్ల ద్వారా రైతుల్లో చైతన్యం తీసుకువస్తే ఆత్మహత్యలను బాగా తగ్గించడానికి అవకాశం ఉంద’ని వివరించారు. -
ఇంజినీర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ శాఖ ఆంధ్రప్రదేశ్ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసొసియేషన్ జిల్లా కమిటీని స్థానిక సంపత్ నగర్‌లోని అతిథి గృహంలో శనివారం ఎన్నుకున్నారు. రెండేళ్ల కాలపరిమితి గల కమిటీకి మదన్ మోహన్ (నందికొట్కూరు ఏఈ) నూతన అధ్యక్షుడిగా ఎన్. గోవిందు (జోనల్ కార్యాలయ ఏఈ) కార్యదర్శిగా, పి. శ్రీనివాసరెడ్డి (గూడూరు ఏఈ) కోశాధికారిగా, బి.ఎం. ఎస్. రంగరాజు (నంద్యాల సబ్ ఇంజనీర్) ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏపీ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యదర్శి సాయి సుధాకర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. -
రేపు వైఎస్సార్సీపీ యువజన సమావేశం
పల్లెపల్లెకూ చంద్రబాబు మోసాలు క్షేత్రస్థాయిలో యువజన విభాగం పటిష్టం అ«ధ్యక్షుడు అనంతబాబు సాక్షిప్రతినిధి, కాకినాడ: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలను వాడవాడలా వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఎండగట్టనున్నట్టు ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) చెప్పారు. శనివారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇందుకు కార్యచరణ రూపొందించేందుకు ఈ నెల 26న పిఠాపురంలో యువజన విభాగం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పిఠాపురం రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాలులో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశానికి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, స్థానిక కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారని అనంతబాబు చెప్పారు. ఈ సమావేశానికి యువజన విభాగం మండల కన్వీనర్లు, జిల్లా కమిటీ సభ్యులు విధిగా హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
బలిజ సంఘం అడ్‌హక్ కమిటీ ఎంపిక
కర్నూలు(అర్బన్): జిల్లా బలిజ సంఘానికి నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడంలో భాగంగా యర్రంశెట్టి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ముందుగా అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేశారు. శనివారం నగరంలోని ఓ హోటల్ల్లో జిల్లా బలిజ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కాపు,తెలగ, బలిజ సంక్షేమ సమాఖ్య సభ్యులు ఎంహెచ్ రావు, రిటైర్డు ఐఏఎస్ అధికారి కేవీ రావు, పీవీఎన్ మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘాన్ని పటిష్టపరిచేందుకు గ్రామ, మండల కమిటీల నియామకం పూర్తి అయిన అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు. అంతవరకు నల్లగట్ట బాలుడు, భీమలింగప్ప, నంద్యాల గిరిబాబు అడ్‌హక్ కమిటీ సభ్యులుగా విధులు నిర్వహిస్తారని చెప్పారు. 24కేఎన్ఎల్42– సమావేశం నిర్వహిస్తున్న బలిజ సంఘం నేతలు -
రాష్ట్రంలోనూ భూసేకరణ చట్టం
ముసాయిదా రూపకల్పనకు కమిటీ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి ప్రాజెక్టులకు భూములు సమీకరించేందుకు రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముసాయిదా రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌ను కమిటీ చైర్మన్‌గా, ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్, న్యాయశాఖ కార్యదర్శిని సభ్యులుగా, అడ్వకేట్ జనరల్‌ను ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించింది. గోవా, కేరళ, రాజస్థాన్‌ల్లోని కొత్త చట్టాలను పరిశీలన, అవసరమైతే ఆయా రాష్ట్రాల అధికారులను ఆహ్వానించేందుకు కమిటీకి ప్రభుత్వం అధికారం కల్పించింది. -
ఉమ్మడి పరీక్ష విధానం మార్గదర్శకాల కోసం కమిటీ
ఎస్కేయూ(అనంతపురం): రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఉమ్మడి పరీక్ష విధానం మార్గదర్శకాలు రూపొందించడం కోసం రెండు రోజుల్లో కమిటీని నియమించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. మొదట ఉమ్మడి పరీక్ష నిర్వహించి.. అనంతరం ఇంటర్వ్యూలను ఆయా వర్సిటీలు చేపట్టేలా నిర్ణయించామన్నారు. ఉమ్మడి పరీక్ష ఎవరు నిర్వహించాలనే అంశంపై కసరత్తు మొదలైందన్నారు. ఇంజనీరింగ్, హ్యూమనిటీస్, సైన్సెస్.. ఇలా ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి ఒక్కో వర్సిటీకి ఉమ్మడి పరీక్ష నిర్వహణ బాధ్యత అప్పగించే విషయంపై అధ్యయనం చేస్తున్నట్లు సూత్రప్రాయంగా తెలిపారు. -
వేతన సవరణ సంఘం ఏర్పాటుకు అంగీకారం
మురళీనగర్: దేశ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకుల వేతనాల సవరణకు కమిటీ నియామకానికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ అంగీకరించినట్లు ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (ఏఐఎఫ్‌పీటీఓ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సవరణ సంఘం సూచనల మేరకు నూతన జీతభత్యాలను అమలు చేస్తున్న నేపథ్యంలో యూజీసీ పరిధిలో పనిచేసే అధ్యాపకుల వేతాల సవరణకు యూజీసీ 7వ వేతన సవరణ సంఘాన్ని నియమించింది. దీంతో పాలిటెక్నిక్ అధ్యాపకుల వేతనాల సవరణకు 7వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ ఏఐసీటీఈ చైర్మన్‌కు ఇటీవల ఒక విజ్ఞాపన పత్రాన్ని అందించినట్లు చంద్రశేఖర్ చెప్పారు. దీనికి స్పందించిన ఏఐసీటీఈ చైర్మన్ వేతన సవరణ సంఘం నియామకానికి సానుకూలంగా ఉన్నట్లు లేఖ పంపినట్టు చంద్రశేఖర్ చెప్పారు. వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసి నివేదిక ఇస్తే దేశంలోని 40వేలమంది పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకులకు లాభం చేకూరుతుందని ఆయన వివరించారు. తమ జీతభత్యాల సవరణకు వేతన సవరణ సంఘం ఏర్పాటుకు అంగీకరించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఏఐసీటీఈ చైర్మన్‌కు సంఘం తరపున చంద్రశేఖర్ కతజ్ఞతలు తెలిపారు. -
ఎన్ కౌంటర్ పై ఐరాస హక్కుల కమిటీకి ఫిర్యాదు
-తమిళ కూలీలపై కాల్పుల ఘటనపై నిరసన - కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఐక్యరాజ్యసమతి మానవహక్కుల కమిషన్‌కు వినతి - 'మే 17 మానవ హక్కుల సంఘం' వెల్లడి సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరుపతి, శేషాచలం అడవుల్లో 20 మంది తమిళ కూలీలను ఎన్కౌంటర్ చేసి చంపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చర్యలు తీసుకునేలా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్‌కు 'మే 17 మానవ హక్కుల సంఘం'(తమిళనాడు) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం చెన్నైలో ఒక ప్రకటన విడుదల చేసింది. అందులోని వివరాలు.. ప్రస్తుతం జరుగుతున్న ఐరాస మానవ హక్కుల కమిషన్ సమావేశాలకు 'మే 17 మానవ హక్కుల సంఘం' సమన్వయకర్త తిరుమురుగన్ గాంధీ హాజరై తమిళనాడు సమస్యలను ప్రస్తావించారు. తమిళనాడుకు చెందిన 20 మంది కూలీ కార్మికులు తిరుపతి సమీపం శేషాచలం అడవుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు, అటవీశాఖ అధికారుల చేతుల్లో హత్యకు గురయ్యారని ఆరోపించారు. ఎన్కౌంటర్లో మూడు ప్రభుత్వ శాఖల పాత్ర ఉందని సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి హెచ్ సురేష్ నాయకత్వంలో ఏర్పడిన నిజ నిర్ధారణ కమిటీ ఆరోపించిందని పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా ఆయన ఐరాస దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. మృతుల శరీరాల్లో గొంతు, ఆ పైభాగాల్లో తూటాలు ఉన్నందున వారిని దగ్గర నుంచే కాల్చి చంపినట్లుగా రుజువైందని, ఇంకా ఎంతో మంది తమిళ కూలీలు పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లి మాయం అయిపోతున్నారని పేర్కొన్నారు.జాతీయ మానవ హక్కుల కమిషన్ సిఫారసు చేసినా ఏపీ ప్రభుత్వంపై విచారణ చేపట్టేందుకు కేంద్రం సిద్ధంగాలేదని విమర్శించారు. -
కడియం నర్సరీల అభివృద్ధికి కమిటీ ఏర్పాటు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం): కడియం నర్సరీల అభివృద్ధికి ప్రభుత్వం అభివృద్ధి కమిటీని నియమించిందని రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక సిటిఆర్ఐ సెమినార్ హాల్లో కడియం నర్సరీ అభివృద్ధి కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిషనర్ చిరంజీవి చౌద రి మాట్లాడుతూ కడియం నర్సరీ అభివృద్ధి కమిటి చైర్మన్‌గా ఉద్యానవనశాఖ రాష్ట్ర కమిషనర్, జిల్లా కలెక్టర్ కో-చైర్మన్‌గా, సభ్యులుగా హార్చికల్చర్ డిప్యూటి డెరైక్టర్ , అర్బన్ గ్రీన్ డెవలప్మెంట్ అధారిటీ ఎండి, ఉద్యానవనశాఖ డెరైక్టర్ ఆఫ్ రీసెర్చ్, సర్ ఆర్ధర్ కాటన్ నర్సరీ మెన్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉద్యానవనశాఖ అసిస్టెంట్ డెరైక్టర్లుంటారన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. సమావేశంలో నర్సరీ రైతుల సమస్యలు తెలుసుకుని ప్రణాళికను తయారుచేసుకుని నిర్ణీత గడువులోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కడియం నర్సరీ ఉత్పత్తులలను వివిధ మార్కెట్‌తో టయప్ చేయడానికి, పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో చర్చించారన్నారు. కడియం ప్రాంతంలో సుమారు 1700 నర్సరీలు ఉన్నాయని, నర్సరీ రైతులు మట్టితోపాటు కొబ్బరిపొట్టు కలిపి వినియోగించుకుంటే మంచి దిగుబడులు వస్తాయన్నారు. ఉద్యానవనశాఖ ద్వారా రాష్ట్రంలో 130 పార్టబుల్ రైపనింగ్సెంటర్లు, ఉద్యానవన శాఖ సబ్సిడీపై రైతులు 222 రైపనింగ్ సెంటర్లు, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 23 రైపనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. సర్ ఆర్ధర్‌కాటన్ నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లా ఆంజనేయులు, నర్సరీ రైతులు మార్గాని సత్యనారాయణ, మార్గానిగోవిందు, పుల్లా రామకృష్ణ, పులా ్లవీర్రాజులు మాట్లాడుతూ నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్తుతోపాటు, ఎక్స్‌పోర్టు, ఇంపోర్టు టాక్స్లేకుండా చూడాలని, విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేయాలని, నష్టాల సమయంలో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అర్బన్ గ్రీన్ డెవలప్మెంట్ అధారిటీ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.చంద్రమోహనరెడ్డి, ఉద్యానవనశాఖ డెరైక్టర్ ఆఫ్రీసెర్చ్ దిలీప్‌బాబు, ఆల్ ఇండియా నర్సరీమెన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లా వీరవెంకట్రావు, మైక్రోఇరిగేషన్ పీడీ సుబ్బారావు, ఉద్యానవనశాఖ సహాయ సంచాలకుడు నర్సరీ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
సనిమా అవార్డులకు కమిటీ...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సినిమా అవార్డులకు పేరును ఖరారు చేయటంతో పాటు అందుకు సంబంధించిన మార్గదర్శకాల తయారీకి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి.రామ్మోహన్రావు, కార్యదర్శి కె.మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, వి.వెంకటరమణారెడ్డి(దిల్ రాజు), ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి, ఎన్.శంకర్, సురేశ్ కొండేటిని ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. జీఏడీ(ఐ అండ్ పీఆర్) కార్యదర్శి నవీన్ మిట్టల్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. -
విద్యుత్ ఉద్యోగుల విభజనపై కమిటీ
* సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఏర్పాటుకు హైకోర్టు ప్రతిపాదన * సభ్యుల పేర్లు సిఫారసు చేయాలని రెండు రాష్ట్రాలకు సూచన విచారణ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా మరొకరి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ఉమ్మడి హైకోర్టు గురువారం ప్రతిపాదించింది. ఈ కమిటీలో సభ్యులుగా నియమించేందుకు నలుగురు లేదా ఐదుగురి పేర్లను సిఫారసు చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందరి వాదనలు విన్న తర్వాత ఈ కమిటీ ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలను రూపొందిస్తుందని, వాటి ఆధారంగా తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనపై స్పందన తెలియజేసేందుకు వీలుగా విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేస్తూ తెలంగాణ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను, దీనికి అనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితాను సవాలు చేస్తూ పలువురు ఉద్యోగులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ సందర్భంగా కమిటీ ఏర్పాటు విషయాన్ని ధర్మాసనం ప్రతిపాదించింది. దీనిపై ప్రభుత్వాలతో చర్చించి ఏ విషయం చెప్పాలని ఉభయ రాష్ట్రాల అడ్వొకేట్ జనరల్(ఏజీ)లను ఆదేశిస్తూ విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అసెంబ్లీ నేపథ్యంలో అధికారులు అందుబాటులోకి రాలేదని ఇరు రాష్ట్రాల ఏజీలు భోజన విరామం అనంతరం ధర్మాసనానికి తెలిపారు. దీంతో కమిటీ ఏర్పాటుపై అభిప్రాయం చెప్పాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ధర్మాసనం కోరింది. దీనికి పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సి.వి.మోహన్‌రెడ్డి, వేదుల వెంకటరమణ స్పందిస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో పిటిషనర్లందరూ గతంలో ఉన్న చోటనే కొనసాగుతున్నారని చెప్పారు. అయితే వారికి ఎటువంటి పని చెప్పకపోగా.. కనీసం కూర్చొనేందుకు కుర్చీలు కూడా ఇవ్వడంలేదన్నారు. ఇప్పుడు కమిటీ అంటే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కమిటీ ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరిస్తే ఈ నెలాఖరులోపు మార్గదర్శకాలు రూపొందించేలా తగిన మార్గనిర్దేశం చేస్తామని తెలిపింది. సభ్యులను త్వరగా సిఫారసు చేస్తే.. అంతే వేగంగా సమస్య పరిష్కారమవుతుందని వ్యాఖ్యానించింది. కమిటీ సభ్యులు తేలిన తర్వాత దానికి చైర్మన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పేరును కూడా సూచించాలని కోరుతామంది. ఒక కమిటీ ఏర్పాటుకు అంగీకరించకుంటే తుది విచారణ జరిపి తీర్పును వెలువరిస్తామని స్పష్టం చేసింది. దీనిపై మళ్లీ ఎవరో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని, దీంతో పరిష్కారం ఆలస్యమవుతుందని పేర్కొంది. ఇలా జరగకూడదనే కమిటీ ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్న ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
రోహ్తక్ సందర్శించనున్న ప్రకాష్ సింగ్ కమిటి
ప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలోని జాట్ కమిటి శుక్రవారం రోహ్తక్ సందర్శించనుంది. జాట్ రిజర్వేషన్ల ఆందోళన ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కమిటి జిల్లాలోని వివిధ విభాగాల అధికారులను కలిసి సమాచారాన్ని సేకరించనుంది. ఆందోళన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారి వివరాలను కూడ ఈ సందర్భంగా తెలుసుకోనుంది. అదే సమయంలో సమాజంలోని వివిధ విభాగాల ప్రజలను కూడ కమిటి సభ్యులు కలసి అధికారుల పాత్రపై ఆరా తీయనున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆందోళన ప్రభావితన ప్రాంతాల్లో ఉదయం పది గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకూ పర్యటించనున్న కమిటి... మధ్యాహ్నం మూడు గంటలనుంచీ, సాయంత్రం ఐదు గంటల వరకూ పోలీసు, సివిల్ అధికారులతో సమావేశమవ్వనుంది. అనంతరం 5వ తేదీ కూడ పలువురు ప్రజలను కలసి సమాచారం సేకరించిన సభ్యులు సాయంత్రం నాలుగ్గంటల సమయంలో మీడియాకు వివరాలను సంక్షిప్తంగా వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. జాట్ల రిజర్వేషన్ ఆందోళనపై.. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రకాష్ సింగ్ అధ్యక్షతన హర్యానా ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
‘ఆక్వా పార్క్’పై కమిటీ
నరసాపురం అర్బన్ : భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్ పార్క్ నిర్మాణంపై ప్రజల నుం చి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక కమిటీని నియమించనున్నట్టు నరసాపురం సబ్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ చెప్పారు. పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వేలాదిమంది ప్రజలు ఆక్వా పార్క్ నిర్మాణ ప్రాంతంలో ఆందోళనకు దిగటం, వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడం వంటి పరి ణామాల నేపథ్యంలో పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు, పార్క్ యాజ మాన్య ప్రతినిధులతో శనివారం సబ్ కలెక్టర్ వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆక్వా పార్క్ విషయంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోరాట కమిటీ తరఫున సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, భీమవరం డివిజన్ కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, నాయకులు కవురు పెద్దిరాజు, ఎం.త్రిమూర్తులు, తుందుర్రు, కంసాల బేతపూడి గ్రామాల పెద్దలు కొత్తపల్లి విశ్వనాథం, ఎస్.వెంకటేశ్వరరావు, చీడే మధు తదితరులు చర్చలకు హాజరయ్యారు. తుందుర్రులో శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలు, ఉద్రిక్తతకు దారితీసిన కారణాలను సబ్ కలెక్టర్ వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సీపీఎం కార్యదర్శి బలరామ్ మాట్లాడుతూ ఆక్వాపార్క్ యాజ మాన్యం దుందుడుకు చర్య కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఆక్వా పార్క్ నిర్మిస్తే పంట పొలాలు నాశనమవుతాయని, మత్స్యకారులు జీవనోఫాది కోల్పోతారని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా పార్క్ నిర్మాణం సాగుతోందన్నారు. యాజమాన్యం చెబుతున్న విషయాల్లో ఏ మాత్రం వాస్తవం లేదని వివరించారు. అక్కడ ఆక్వా పార్క్ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. నాలుగు మండలాల ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇంతకుమించి రెండో మాట లేదని తెగేసి చెప్పారు. సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ దీనిపై ఓ కమిటీని నియమించి సమస్యను పరిష్కరిద్దామని ప్రతిపాదించగా, ఆలోచించి తమ నిర్ణయం చెబుతామన్న పోరాట కమిటీ ప్రతినిధులు చర్చలు ముగించి రాత్రి 9.30 గంటలకు బయటకు వచ్చారు. ఇదిలావుండగా, ఆక్వాపార్క్ యాజమాన్యం తరఫున ముగ్గురు ప్రతినిధులు ఉదయం సబ్ కలెక్టర్‌ను కలిశారు. అన్ని అనుమతులతో, నిబంధనలకు లోబడి తాము ఆక్వాపార్క్ నిర్మిస్తున్నామన్నారు. పనులకు ఆటం కం లేకుండా చూడాలని కోరారు. ఇరువర్గాలతో చర్చిం చిన అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ నియమిస్తామని చెప్పారు. అందులో ఇద్దరు గ్రామస్తులు, ముగ్గురు నిపుణులు ఉండేలా చూస్తామన్నారు. వారిచ్చే నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. -
టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికకు కమిటీ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీచేసే కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఎంపీ కె.కేశవరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో డి.శ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. ఇటీవల పార్టీ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై నిర్వహించిన సర్వే ఫలితాలను క్రోడీకరించడంతోపాటు, అభ్యర్థుల ఎంపికను నిష్పాక్షికంగా జరిపేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సర్వే రిపోర్టుల పరిశీలనతోపాటు ఆశావహులు, ఇన్చార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపిన తరవాతనే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. -
గ్రేటర్లో కలిసొచ్చేదెవరు?
-
అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి కమిటీ
హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు బాధితులందరికీ డబ్బు చెల్లించేలా ఉమ్మడి హైకోర్టు ముందడుగు వేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలని హైకోర్టు నిర్ణయించింది. సభ్యుల పేర్లు సూచించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. కేసు విచారణ రేపటికి వాయిదా వేసింది. డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు విధివిధానాలను కమిటీ రూపొందిస్తుందని న్యాయస్థానం వెల్లడించింది. అలాగే ఈ కేసులో తమకు సూచనలు, సలహాలు కూడా ఇస్తుందని తెలిపింది. హైకోర్టు నిర్ణయంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. -
ఎంపీ ఎస్పీవై రెడ్డి అనర్హతపై విచారణ
-
'నారాయణ అయినా మరొకరైనా శిక్ష తప్పదు'
తిరుపతి: 'ప్రభుత్వానికి ఎవరూ చుట్టం కాదు..తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు..నారాయణ అయినా మరొకరైనా చట్టానికి అందరూ సమానమే' అని విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లా కడపలోని నారాయణ కాలేజ్ వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినుల మృతి పై ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ ముగిసింది. దీంతో నివేదికను సోమవారం కమిటీ చైర్మన్ విజయలక్ష్మీ తిరుపతిలో గంటాకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మృతిపై త్రిసభ్య కమిటీ నివేదిక అందజేసిందని, ఇంకా పరిశీలించలేదన్నారు. నివేదికను ప్రిన్సిపల్ సెక్రటరీకి అందజేయమని అధికారులకు సూచించినట్టు ఆయన తెలిపారు. ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా పలు చర్యలు తీసుకుంటామని తెలిపారు. న్యాయం చేయాలని మృతుల తల్లిదండ్రులు అడిగినమాట వాస్తవమేనని ఆయన సాక్షికి తెలిపారు. ఆత్మహత్యల ఘటనపై కమిటీ నివేదిక ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. పవన్ వ్యాఖ్యల్ని తాము పాజిటివ్‌గా తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొని, పరోక్షంగా పవన్ తమకు సహకరించారని ఆయన అన్నారు. -
'మాట తప్పిన కేసీఆర్ తల తీసేసుకోవాలి'
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిఎస్సీ వేసి వెంటనే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించి మాట తప్పిన కేసీఆర్ తలనరుక్కోవాలని డిఎస్సీ సాధనకమిటి అధ్యక్ష, కార్యదర్శులు శివుడు, మల్లేష్లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగిన 15 నెలల నుంచి ప్రతి నెలా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పదవి విరమణ పొందుతున్న తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులు లేవనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖలో 24,861 పోస్టులు ఉన్నాయని లెక్కలు తేల్చిన ప్రభుత్వం హేతు బద్దీకరణతో 15వేల పోస్టులను మాయం చేసిందని విమర్శించారు. ఇప్పట్లో డిఎస్సీ లేదని విద్యాశాఖమంత్రి ప్రకటించడం నిరుద్యోగులను నిరాశకు గురి చేయడమేనని అన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ లేనప్పుడు 9,800 ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఎందుకని ప్రశ్నించారు. -
ఇక విధుల్లోకి పారిశుద్ధ్య కార్మికులు
హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ముగిసింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించాయి. గురువారం మంత్రి కేటీఆర్‌తో కార్మికులు సచివాలయంలో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రెండు నెలల్లో కార్మికుల సమస్యల పరిష్కారానికి అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపట్ల ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉందని అన్నారు. గ్రామజ్యోతి పథకంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు భాగస్వామ్యం కావాలని కోరారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో సంస్కరణలు
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో సంస్కరణలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆరుగురు అధికారులతో కమిటీ వేసినట్టు మంత్రి రావెల కిశోర్‌బాబు చెప్పారు. కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్టు మంత్రి తెలిపారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో సంస్కరణలు
-
'కీలక సమాచారం సేకరించాం'
గుంటూరు: ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో సమాచారం సేకరిస్తోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ బుధవారం యూనివర్సిటీ లో విచారణ ప్రారంభించింది. ఈ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం విద్యార్థులు, అధ్యాపకులు, యూనివర్సిటీకి సంబంధించిన ఇతర సభ్యులతో సమావేశం అయింది. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విచారణను అవసరమైతే మరో 2 రెండు రోజులు పొడిగించే విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు.బుధవారం అధికారులతో మాట్లాడినపుడు కొంత కీలక సమాచారం సేకరించామన్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి రిషతేశ్వరి తల్లిదండ్రులతో మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే తమను నేరుగా సంప్రదించవచ్చన్నారు. కాగా రెండోరోజు జరుగుతున్న విచారణకు పీడీఎస్‌యూ, ఎంఎస్ఎఫ్ ప్రతినిధులు హాజరయ్యారు. యూనివర్సిటీకి సెలవులు ప్రకటించి...విద్యార్థులు ఎవరూ లేకుండానే విచారణ పేరుతో అధికారులు కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కొన్ని విద్యార్థి సంఘాలు విచారణను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. -
ఆయన అవసరం లేదు
- చీఫ్ కోచ్ పాల్ వాన్ యాస్‌ను తొలగించాలి - హాకీ ఇండియాకు కమిటీ సూచన న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్ పాల్ వాన్ యాస్ (నెదర్లాండ్స్)ను సాగనంపేందుకు రంగం సిద్ధమైంది. యాస్‌ను కోచ్ పదవిలో ఎంత మాత్రం కొనసాగించొద్దని తొమ్మిది మంది సభ్యుల కమిటీ శుక్రవారం ప్రతిపాదించింది. హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రాతో జరిగిన గొడవ నేపథ్యంలో యాస్ భవితవ్యాన్ని తేల్చేందుకు సమావేశమైన హర్బీందర్ సింగ్ నేతృత్వంలోని ఈ కమిటీ అన్ని రకాలుగా చర్చించిన తర్వాత ఈ ప్రతిపాదన చేసింది. అయితే దీనిపై హాకీ ఇండియా (హెచ్ఐ), భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తన పనిలో జోక్యం చేసుకోకపోతే తిరిగి పదవి చేపట్టేందుకు సిద్ధమని యాస్ చెబుతున్నట్లు వస్తున్న కథనాలకు కూడా కమిటీ నిర్ణయంతో తెరపడింది. నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో హర్బీందర్, బీపీ గోవింద, ఏబీ సుబ్బయ్య, భాస్కరన్, తోయిబా సింగ్, ఆర్పీ సింగ్, అసుంతా లక్రా, జస్జీత్ కౌర్, హెచ్ఐ సీఈఓ ఎలెనా నోమన్‌లు పాల్గొన్నారు. ‘మా ప్రతిపాదనలను హాకీ ఇండియాకు ఇచ్చాం. హెచ్ఐ, సాయ్‌లు కలిసి ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటాయి. హాకీ వరల్డ్ లీగ్‌కు సంబంధించి యాస్ ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. మా ఫోన్ కాల్స్‌కు, ఈ మెయిల్స్‌కు ఆయన స్పందించడం లేదు. తిరిగి వచ్చేందుకు టిక్కెట్లు కూడా పంపాం. కానీ టికెట్లు తనకు అందలేదని అబద్ధం చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి చేయి దాటిపోయింది. అతను తిరిగి వచ్చినా కొనసాగించే అవకాశం లేదు’ అని హర్బీందర్ పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్‌కు ఎలా? కోచ్ పదవి చేపట్టి ఆరు నెలలు కూడా గడవకముందే యాస్ వెళ్లిపోవడంతో మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న రియో ఒలింపిక్స్‌కు జట్టు సన్నద్ధతపై అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రోలెంట్ ఆల్ట్‌మన్స్‌కు కోచ్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆల్ట్‌మన్స్ సరైన వ్యక్తి అని కమిటీ కూడా భావిస్తున్నట్లు సమాచారం. గత మూడేళ్లుగా భారత హాకీతో కలిసి పని చేస్తున్న ఆల్ట్‌మన్స్‌కు జట్టుకు ఏం కావాలో పూర్తిగా తెలుసు. అలాగే కొంతకాలం ఆటగాళ్లతో కూడా కలిసి పని చేశారు. చాలా మంది ఆటగాళ్లు కూడా ఆల్ట్‌మన్స్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోవైపు బాత్రా శనివారం ఆల్ట్మన్స్తో సమావేశం కానున్నారు. తర్వాత క్రీడాశాఖ అధికారులతోనూ మాట్లాడనున్నారు. ‘కమిటీ నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురి చేయలేదు. ఇలాంటి నిర్ణయం వస్తుందని ముందే తెలుసు. పూర్తి నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్న బాత్రా అనవసరంగా నోరు పారేసుకున్నారు. నన్ను పదవి నుంచి తొలగించడానికి దారులు వెతికారు. అందులో సఫలమయ్యారు. నా ప్రతిష్టను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పాలి. ఓవరాల్‌గా భారత వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయి. నన్ను తొలగిస్తున్నట్లు ఆల్ట్‌మన్స్ నుంచి మెయిల్ వచ్చాక నేను నివేదిక ఇవ్వాల్సిన అవసరం లేదు.’ -పాల్ వాన్ యాస్ -
అందరికీ బ్యాంకింగ్‌పై ఆర్బీఐ కమిటీ
ముంబై: దేశంలోని అందరినీ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకువచ్చి (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్), వారిని ఆర్థికవృద్ధిలో భాగస్వాములను చేయాలన్న లక్ష్య సాధనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ఐదేళ్ల కాలంలో అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన కమిటీ ప్రధాన బాధ్యత. 14 మంది సభ్యుల ఈ కమిటీకి ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దీపక్ మహంతీ నేతృత్వం వహిస్తారు. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌కు సంబంధించి అన్ని అంశాలనూ పరిశీలించి, ఈ విషయంలో మరింత పురోగమించడానికి తగిన సూచనలను ఈ కమిటీ చేస్తుందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి సమావేశం నుంచి నాలుగు నెలలలోపు కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
సమాచారం త్వరగా ఇప్పించండి!
శాఖాధిపతుల నుంచి స్పందన ఉండడం లేదు ఫలితంగా ఉద్యోగుల పంపిణీ జాప్యమవుతోంది ఏపీ, తెలంగాణ సీఎస్‌లకు కమలనాథన్ లేఖ హైదరాబాద్: ఏపీ, తెలంగాణల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సమాచారం ఆయా రాష్ట్రాల శాఖాధిపతుల నుంచి అందకపోవడంపై కమలనాథన్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగుల స్థానికత, ప్రత్యేక కేసుల్లో ఆప్షన్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను, సీనియారిటీ సర్టిఫికెట్లను ఇరు రాష్ట్రాల శాఖాధిపతులు ఆన్లైన్లో నమోదు చేయడంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఉద్యోగుల పంపిణీ వ్యవహారం మరింత ఆలస్యమవుతోంది. శాఖాధిపతులు ఉద్యోగుల సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంది. అనంతరం ఆయా పత్రాలను విభజన విభాగం వెబ్సైట్లో ఉంచుతుంది. కమలనాథన్ కమిటీ ఇప్పటికే 10 విభాగాలకు చెందిన ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకూ పంపిణీ చేసిం ది. మిగిలిన విభాగాల ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సమాచారం ఆయా శాఖాధిపతుల నుంచి ఆన్లైన్లో రావడం లేదు. ఈ నేపథ్యంలో కమలనాథన్.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావులకు లేఖ రాశారు. శాఖాధిపతులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని త్వరగా ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని విభాగాలకు సంబంధించి స్థానికత, ఇతర అంశాల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అలాంటి సమాచారాన్ని సరి చేయాల్సిన బాధ్యత శాఖాధిపతులపై ఉందని, ఈ క్రమంలో ఆలస్యం జరగకుండా సమాచారం అందించాలని సూచించారు. వాటిపై ఏకాభిప్రాయానికి రావాలి ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, డెంటల్ కాలేజీ ఆస్ప త్రి, నర్సింగ్ కాలేజీలను రాష్ట్ర యూ నిట్లుగా పరిగణించి ఇరు రాష్ట్రాలకు ఉద్యోగులను పంపిణీ చేయాలని ఏపీ ప్ర భుత్వం కోరుతోంది. దీనిపై కమలనాథన్ స్పందిస్తూ ఇరు రాష్ట్రాల శాఖాధిపతులు ఒక అభిప్రాయానికి వస్తే అందుకు అనుగుణంగా పంపిణీ చేస్తామని పేర్కొంది. భార్య, భర్తల విషయంలో కేంద్ర ఉద్యోగి ఒక రాష్ట్రంలోను మరో ఉద్యోగి మరో రాష్ట్రంలో ఉన్నా ఇద్దరినీ ఒకే రాష్ట్రానికి పంపిణీ చేసేందుకు కమిటీ అంగీకరించింది. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం కావాల్సి ఉందని కమిటీ పేర్కొంది. సచివాలయంలో నాలుగో తరగతి ఉద్యోగులు 637 మంది ఉండగా అందులో ఏపీ స్థానికత గలవారు కేవలం 45 మంది మాత్రమే ఉన్నారు. మిగతా 592 మంది తెలంగాణ వారేనని కమిటీ గుర్తించింది. నాలుగో తరగతి ఉద్యోగులను వారిచ్చే ఆప్షన్ల ఆధారంగా పంపిణీ చేయాలని మార్గదర్శక సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల ఈ విషయంలో ఏ ఇబ్బందీ ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
మొక్కజొన్న అమ్మకాల పర్యవేక్షణకు కమిటీ
హైదరాబాద్: 2014- 15 ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న అమ్మకాలను పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం శని వారం ఉత్తర్వులిచ్చింది. పౌర సరఫరాల కమిషనర్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, ఆర్థికశాఖ, ఎఫ్‌సీఐ, పౌర సరఫరాల శాఖ నుంచి పలు అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మొక్కజొన్న నిల్వల నాణ్య త, ధరలు, అమ్మకాలను పర్యవేక్షిస్తుంది. -
పాత్రికేయులకు హెల్త్‌కార్డులపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమ నిధికి టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. ఈ మొత్తాన్ని సోమవారం ప్రెస్ అకాడమీకి బదిలీ చేసి జర్నలిస్టుల సంక్షేమ నిధి పేరిట ఖాతా ప్రారంభించి బ్యాంకులో డిపాజిట్ చేయనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనూ ఈ నిధి కింద కొంత మొత్తాన్ని కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రెస్ అకాడమీలో సీనియర్ జర్నలిస్టులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు రమణాచారి, సమాచారశాఖ కమిషనర్ చంద్రవదన్ పాల్గొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హెల్త్ కార్డుల సమస్యను పరిష్కరించేందుకు సీఎం అక్కడికక్కడే తొమ్మిది మంది సీనియర్ జర్నలిస్టులతో కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ హెల్త్‌కార్డులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రిపోర్టర్లకు ఇచ్చే అక్రెడిటేషన్ కార్డుల జారీకి అవసరమైన విధి విధానాలను రూపొందిస్తుంది. దీనిపై వారం రోజుల్లోగా ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ మేరకు సమావేశ వివరాలను అల్లం నారాయణ మీడియాకు వెల్లడించారు. కాగా, సచివాలయంలో మీడియాకు సంబంధించిన ఆంక్షల ప్రతిపాదనలపై ఈ భేటీలో ప్రత్యేకంగా చర్చ జరగలేదు. కమిటీ సభ్యులు వీరే... కె. రామచంద్రమూర్తి (సాక్షి, ఎడిటోరియల్ డెరైక్టర్), జహీరుద్దీన్ (సియాసత్ ఎడిటర్), కె.శ్రీనివాస్‌రెడ్డి (మన తెలంగాణ ఎడిటర్), కట్టా శేఖర్‌రెడ్డి (నమస్తే తెలంగాణ ఎడిటర్), శైలేష్‌రెడ్డి (6 టీవీ సీఈవో), వెంకటకృష్ణ (హెచ్ఎం టీవీ సీఈవో), గౌరీశంకర్ (దక్కన్ క్రానికల్, పొలిటికల్ ఎడిటర్), క్రాంతి (టీయూడబ్ల్యూజే నేత) సి.వనజ ఈ కమిటీలో ఉన్నారు. కేసీఆర్‌కు ప్రెస్ అకాడమీ చైర్మన్ కృతజ్ఞతలు రాష్ట్ర ప్రెస్ అకాడమీని తొలిసారి సందర్శించడంతోపాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన సీఎం కే సీఆర్‌కు తెలంగాణ జర్నలిస్టుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టు సంక్షేమ నిధికి రూ. 10 కోట్లను సోమవారం విడుదల చేస్తామని పేర్కొనడం, ‘కార్పస్ ఫండ్’ను రూ.100 కోట్లకు పెంచుతామని హామీ ఇవ్వడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాగా, జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియూడబ్ల్యూజే) సంఘం నేతలు పల్లె రవికుమార్, సిహెచ్ కాంత్రి కిరణ్, ఎం.వి.రమణ మరో ప్రకటనలో పేర్కొన్నారు. -
లైంగిక వేధింపుల నిరోధానికి కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు పరిధిలో లింగ వివక్షపై అవగాహన కల్పించడంతోపాటు మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి హైకోర్టు నిబంధనలను రూపొందించింది. మేధా కొత్వాల్ లేలా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుననుసరించి ఈ చర్యలు చేపట్టింది. హైకోర్టు పరిధిలో లింగ వివక్ష, లైంగిక వేధింపులపై ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రధాన న్యాయమూర్తి అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో కనీసం 7గురు, గరిష్టంగా 13 మంది సభ్యులుంటారు. ఒకరు లేదా ఇద్దరు న్యాయమూర్తులు ఈ కమిటీలో ఉంటారు. వీరిలో ఒకరిని కమిటీకి చైర్‌పర్సన్‌గా ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేస్తారు. న్యాయవాదుల నుంచి ఒకరిని లేదా ఇద్దరిని ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేస్తారు. వీరిలో ఒకరు మహిళ ఉంటారు. న్యాయవాదిగా వీరికి కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడి సిఫారసు మేరకు సంఘం ప్రతినిధులిద్దరికీ ఈ కమిటీలో స్థానం కల్పించారు. వారిలో ఒకరు మహిళ ఉంటారు. న్యాయవాదిగా కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరిని లేదా ఇద్దరిని ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేస్తారు. వారిలో ఒకరు తప్పనిసరిగా మహిళ ఉంటారు. డిప్యూటీ రిజిస్ట్రార్ స్థాయికి తగ్గని మహిళా అధికారికి కూడా ఈ కమిటీలో స్థానం కల్పించారు. ఈ కమిటీకి ఆమె సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. మరొకరిని కూడా ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేస్తారు. మొత్తంగా ఈ కమిటీలో మహిళలే అత్యధిక సంఖ్యలో ఉంటారు. కమిటీలో ప్రతి సభ్యుడి కాల పరిమితి రెండేళ్లు. ఓ సభ్యుడిని గరిష్టంగా రెండుసార్లు నామినేట్ చేస్తారు. -
తనిఖీ బృందాలొస్తున్నాయ్!
సాక్షి, మంచిర్యాల : ‘అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా సుప్రీంకోర్టు జడ్జీలతో కూడిన కమిటీ ఈ నెల 29 నుంచి 31 వరకు జిల్లాలో పర్యటించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు.. తాగునీటి వసతులను పరిశీలించనుంది. పరిశుభ్రంగా ఉంచండి.. టాయిలెట్లు వెంటనే వినియోగంలో తీసుకురండి. నీటి వసతి లేకుంటే నీటి సదుపాయం ఏర్పాటు చేయండి. మరుగుదొడ్లలో ఓ బకెట్, మగ్గు ఉంచండి. ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌ను బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేయించండి. తాగునీటి వసతి లేని చోట కనీసం ఓ కుండలో నీరు అందుబాటులో ఉంచండి. దీన్ని అత్యంత ప్రాధాన్యంశంగా గుర్తించండి. అలసత్వం వద్దు.’ - ఇదీ డీఈవో నుంచి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందిన సెల్ మెసేజ్ సారాంశం. సాక్షి, మంచిర్యాల : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పనపై సుప్రీం కోర్టు జడ్జీలు ఈ నెల 29 నుంచి 31 వరకు జిల్లాలో పర్యటించనున్నారు. వీరి పర్యటన ఖరారు కావడంతో జిల్లా విద్యాశాఖ హల్‘సెల్’ చేస్తోంది. పాఠశాలల్లో మరుగుదొడ్లు.. తాగునీటి సదుపాయాలు కల్పించాలని సుప్రీం కోర్టు ఎన్నోమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినా పాలకులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించారు. తాజాగా.. క్షేత్రస్థాయిలో వసతులపై ఆరా తీసేందుకు ఏకంగా సుప్రీం కోర్టే రంగంలోకి దిగింది. ముగ్గురు జడ్జీలతో కూడిన కమిటీ జిల్లాల్లో పర్యటించి.. గతంలో సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు ఏ మేరకు అమలయ్యాయో తెలుసుకోనుంది. సుప్రీం కోర్టు జడ్జీలతోపాటు జిల్లా, స్థానిక జడ్జీలు, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులూ ఈ తనిఖీల్లో పాల్గొననున్నారు. అయితే.. బృంద సభ్యులు ఏ ప్రాంతంలోని ఏ పాఠశాలలను తనిఖీ చేస్తారో తెలియకపోవడంతో అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వసతుల కల్పనలో సుప్రీం జడ్జీలు సంతృప్తి చెందుతారా..? అసంతృప్తి వ్యక్తం చేస్తే.. ఎలాంటి చర్యలు ఉంటాయోననే ఆందోళన ఉద్యోగవర్గాలకు పట్టుకుంది. మరుగుదొడ్లు.. తాగునీటి వసతి లేనిచోట వెంటనే సదుపాయాలు సమకూర్చుకోవాలని ఇప్పటికే మండల విద్యాధికారులూ తమ పరిధిలోని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్పందిస్తూ.. తమ పాఠశాలలో టాయిలెట్ల కొరత ఉందని.. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని.. గతంలో ఎన్నిమార్లు విన్నవించినా పట్టించుకోని అధికారులు ఇప్పుడు వెంటనే వసతులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించడం విడ్డూరంగా ఉందన్నారు. తాత్కాలిక ఏర్పాట్లు చేసుకున్నా.. తనిఖీ బృందాలు గుర్తించలేవా..? అని ప్రశ్నిస్తున్నారు. నాలుగేళ్ల క్రితమే...! ‘పాఠశాలల్లో కనీస వసతుల్లాంటి టాయిలెట్లు కూడా లేకపోతే తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపడం మానేస్తారు. ప్రతి స్కూళ్లో కనీస వసతులు తప్పనిసరి. 31, డిసెంబర్ 2011లోగా ప్రతి సర్కారు బడిలో టాయిలెట్లు నిర్మించండి.. ఈ ఏడాది నవంబర్ ఆఖరులోగా బాలికల కోసం తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయండి.’ ఇదీ అక్టోబర్ 18, 2010లో సుప్రీం కోర్టు అప్పటి న్యాయమూర్తి జైన్ జారీ చేసిన ఆదేశాలు. ఈ ఆదేశాలు జారీ అయి నాలుగేళ్లు గడుస్తున్నా జిల్లాలో శాశ్వత మరుగుదొడ్ల మాటేమో గానీ.. తాత్కాలిక టాయిలెట్లు కూడా లేవు. సర్కారు బళ్లలో వసతులు కరువవడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం.. కేంద్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా.. ఆశించిన ప్రయోజనం కానరావడం లేదు. జిల్లాలో ఉన్న 3 వేల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సుమారు 3 లక్షల మంది చదువుతున్నారు. 7,769 టాయిలెట్లు అవసరముండగా.. 3,534 మాత్రమే ఉన్నాయి. సగానికి పైగా స్కూళ్లలో విద్యార్థులు బహిర్భూమికి ఇప్పటికీ బయటకు వెళ్తుంటే.. ఇల్లు దగ్గరున్న వాళ్లు తమ ఇళ్లకు పోతున్నారు. కొన్ని చోట్ల మరుగుదొడ్ల నిర్మాణాలే జరగకపోగా.. చాలా పాఠశాలల్లో ఉన్న మరుగుదొడ్లు నీరులేక నిరుపయోగంగా ఉన్నాయి. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు జంకుతున్నారు. -
నగదు విత్‌డ్రా పైనా పన్ను!
రోజుకు రూ. 50,000 మించితే విధించాలని కమిటీ సిఫార్సు న్యూఢిల్లీ: వ్యక్తిగత ఖాతాదారులు బ్యాంకుల నుంచి రోజుకి రూ. 50,000కు మించి నగదు ఉపసంహరించుకుంటే పన్ను విధించాలంటూ పార్థసారథి షోమ్ కమిటీ సిఫార్సు చేసింది. తద్వారా బ్లాక్‌మనీకి చెక్ పెట్టవచ్చునని అభిప్రాయపడింది. గత యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ రూపొందించిన నివేదికను మంగళవారం విడుదల చేశారు. బ్యాంకు ఖాతాల నుంచి జరిగే నగదు విత్‌డ్రాయల్స్ వివరాల్ని సమీకరించే సాధనమేదీ ప్రస్తుతం లేదని, ఈ సాధనం వల్ల నల్లధనం వినియోగానికి సంబంధించిన సమాచారం ఆదాయపన్ను శాఖకు తెలుస్తుందని కమిటీ అభిప్రాయపడింది. అలాగే సంపన్న రైతులను పన్ను పరిధిలోకి తీసుకురావాలని కమిటీ ప్రతిపాదించింది. పన్ను ఎగవేతదారులకు సెటిల్మెంట్ అవకాశాలను కల్పించే ఆమ్నెస్టీ పథకాలపట్ల కమిటీ వ్యతిరేకతను వ్యక్తం చేసింది. బ్యాంకు ఖాతాల నుంచి నగదు ఉపసంహరణలకు సంబంధించిన వివరాలను అందించేందుకు ప్రస్తుతం సరైన వ్యవస్థ లేదని, ఇలాంటివి ఏర్పాటు చేస్తే ఆదాయపన్ను శాఖకు ప్రయోజనకారిగా ఉంటుందని వ్యాఖ్యానించింది. వ్యవసాయ ఆదాయానికి సంబంధించి రూ. 5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉన్నదని, ఇంతకు మించి భారీగా ఆదాయం పొందుతున్న రైతులను పన్ను పరిధిలోకి తీసుకురావలసి ఉందని పేర్కొంది. ఇది పన్ను చెల్లింపుదారుల పరిధిని పెంచుతుందని తెలిపింది.