
అందరికీ బ్యాంకింగ్‌పై ఆర్‌బీఐ కమిటీ
దేశంలోని అందరినీ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకువచ్చి (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్), వారిని ఆర్థికవృద్ధిలో భాగస్వాములను చేయాలన్న లక్ష్య సాధనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒక కమిటీని ఏర్పాటు చేసింది...
ముంబై: దేశంలోని అందరినీ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకువచ్చి (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్), వారిని ఆర్థికవృద్ధిలో భాగస్వాములను చేయాలన్న లక్ష్య సాధనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ఐదేళ్ల కాలంలో అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన కమిటీ ప్రధాన బాధ్యత. 14 మంది సభ్యుల ఈ కమిటీకి ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దీపక్ మహంతీ నేతృత్వం వహిస్తారు. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌కు సంబంధించి అన్ని అంశాలనూ పరిశీలించి, ఈ విషయంలో మరింత పురోగమించడానికి తగిన సూచనలను ఈ కమిటీ చేస్తుందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి సమావేశం నుంచి నాలుగు నెలలలోపు కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.