economic growth
-
సిబ్బంది సేవలపై జీఎస్టీ తగ్గింపుతో ఆర్థిక వృద్ధి పెంపు
సిబ్బంది సేవలపై జీఎస్టీని తగ్గించడం అధికారిక ఉపాధికి, ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తోందని అభిప్రాయపడుతోంది ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్. మన దేశం తన విస్తారమైన శ్రామికశక్తి సామర్థ్యాన్ని నిజంగా ఉపయోగించుకోవాలంటే, ముఖ్యమైన విధాన సంస్కరణలు చాలా కీలకమైనవి. కాంట్రాక్ట్ సిబ్బంది వంటి మెరిట్ ఆధారిత సేవలపై వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గించడం అటువంటి ఒక సంస్కరణ అని స్పష్టం చేస్తోంది.కాంట్రాక్ట్ సిబ్బంది, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సెక్యూరిటీ సర్వీసెస్ వంటి లేబర్–ఇంటెన్సివ్ సెక్టార్లు ఉపాధిని సృష్టిలో కీలక పాత్ర పోషిస్తాయి, మిలియన్ల మందికి స్థిరమైన ఉద్యోగాలను అందిస్తూ వ్యాపారాలకు ఉపయుక్తంగా ఉండేలా చూసుకుంటాయి. అయితే, ఈ వీటికి ఒక ముఖ్యమైన అడ్డంకిని ఎదుర్కొంటున్నాయి అదే జీఎస్టీ. సిబ్బంది సేవలపై 18% వస్తు సేవల పన్ను (జిఎస్టీ) సంస్థలు ఉద్యోగులను అధికారికంగా నియమించుకోకుండా ఉండేందుకు కారణమవుతోంది. తద్వారాకార్మిక చట్టాలకి కట్టుబడి ఉండకుండా సామాజిక భద్రతా ప్రయోజనాలు అనధికారిక నియామక పద్ధతులను అవి ఎంచుకోవడానికి దారి తీస్తోంది.ఈ జీఎస్టీ రేటును 5 శాతానికికి తగ్గించడం వలన నియామక ఖర్చులు తగ్గుతాయి.. అంతేకాకుండా ఇది అధికారిక ఉపాధిని కూడా ప్రోత్సహిస్తుంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలు(ఎస్‌ఎమ్‌ఇలు) ప్రభావంతంగా పనిచేసేందుకు ఆర్థిక వృద్ధికి దారితీస్తూ మరింత దోహదం చేస్తుంది. ఈ మార్పు ఉద్యోగ కల్పనకు, ఉపాధిని క్రమబద్ధీకరించడానికి కార్మిక చట్టాలను నిజాయితీగా పాటించడానికి శక్తివంతమైన ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. వ్యాపారాలకు తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది, మరింత నిర్మాణాత్మకమైన జవాబుదారీతనం గల లేబర్ మార్కెట్‌ను ప్రోత్సహిస్తుంది.భారత స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా అభిప్రాయం ప్రకారం,. కాంట్రాక్టు సిబ్బంది సేవలపై జీఎస్టీ రేటును తగ్గించడం అనే సంస్కరణ ద్వారా అనధికారిక రంగంలోని కార్మికులు సామాజిక భద్రత, న్యాయమైన వేతనాలు మెరుగైన పని పరిస్థితుల వంటి ప్రయోజనాలు పొందుతారు. ఈ సంస్కరణ భారతదేశంలో విస్తృత దృష్టితో స్థిరమైన సమగ్ర ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తుంది. ఆర్థిక వృద్ధి కార్మికుల హక్కులతో సమతుల్యం అవుతుంది. -
ప్రైవేటు పెట్టుబడులపై ఆర్థిక శాఖ కామెంట్
అంతర్జాతీయ అనిశ్చితుల నుంచి తట్టుకుని, బలమైన వృద్ధితో ముందుకెళ్లేందుకు దేశంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగాల్సిన అవసరాన్ని ఆర్థిక శాఖ ప్రస్తావించింది. బలమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ వల్ల ప్రైవేటు రంగం ప్రయోజనం పొందాలని సూచించింది. తమ పెట్టుబడుల వ్యయాలు–వినియోగ డిమాండ్ మధ్య ఉండే సంబంధాన్ని పరిశ్రమ గుర్తించడం అవసరమని పేర్కొంది. ఈ మేరకు ఫిబ్రవరి నెల ఆర్థిక సమీక్షా నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది.బడ్జెట్లో ఆదాయపన్ను పరంగా కల్పించిన ఉపశమనం, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపుతో వినియోగం పుంజుకుంటుందని అంచనా వేసింది. ఈ సంకేతాలను ప్రైవేటు రంగం గుర్తించి సామర్థ్య విస్తరణపై పెట్టుబడులతో ముందుకు రావాలని పిలుపునిచ్చింది. అప్పుడు 2025–26లో బలమైన ఆర్థిక వృద్ధి సాధ్యపడుతుందని అంచనా వేసింది. ‘వ్యక్తిగత ఆదాయపన్ను నిర్మాణంలో చేసిన మార్పులతో మధ్యతరగతి ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయం మిగులు పెరుగుతుంది. ఇది వినియోగాన్ని పెంచుతుంది. ఫిబ్రవరిలో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం, మెరుగైన లిక్విడిటీ పరిస్థితులు వృద్ధిని ఊతమిస్తాయి’ అని ఆర్థిక శాఖ తన అభిప్రాయాలను పేర్కొంది. దీర్ఘకాల చర్యలు ఫలితమిస్తాయి..దీర్ఘకాల అభివృద్ధికి సంబంధించి చేపట్టిన చర్యలు, సంస్కరణలు, వికసిత్ భారత్ ఆకాంక్ష.. అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం విశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆర్థిక శాఖ నివేదిక పేర్కొంది. ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో ఏడు నెలల కనిష్టానికి తగ్గడాన్ని ప్రస్తావించింది. 2024–25లో రికార్డు స్థాయి పంటల దిగుబడి రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగొచ్చేందుకు సాయపడుతుందని అంచనా వేసింది. ప్రధాన వస్తు ఎగుమతులు 2024–25లో 8.2 శాతం పెరగడాన్ని గుర్తు చేసింది. అదే ఏడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 12.4 శాతం వృద్ధి చెందినట్టు పేర్కొంది. ప్రస్తుతమున్న విదేశీ మారకం నిల్వలు 11 నెలల దిగుమతి అవసరాలకు సరిపోతాయని తెలిపింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య విధానాల్లో మార్పులను (టారిఫ్‌లు) ప్రస్తావిస్తూ.. అలాంటి తరుణంలోనూ 2024–25లో డిసెంబర్ (క్యూ3) త్రైమాసికంలో జీడీపీ వృద్ధి కోలుకోవడాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. ప్రైవేటు వినియోగం పుంజుకోవడం, కీలక వస్తు ఎగుమతులు పెరగడం మేలు చేసినట్టు తెలిపింది. ‘‘బలమైన వ్యవసాయ కార్యకలాపాలు గ్రామీణ డిమాండ్‌కు మద్దతునిస్తాయి. 2024–25 చివరి త్రైమాసికంలోనూ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నట్టు ముఖ్యమైన సంకేతాలు సూచిస్తున్నాయి’’అని వివరించింది.ఇదీ చదవండి: ‘ఆర్థిక సేవలకు నియంత్రణలు అడ్డు కారాదు’ఎగుమతులు మెరుగుపడడం, ప్రభుత్వ మూలధన వ్యయాలను పెంచడం ఇందుకు మద్దతునిస్తాయని అభిప్రాయపడింది. సేవల రంగం పనితీరు సైతం బలంగా ఉన్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా అనిశి్చతులు ఉన్నప్పటికీ 2024–25లో 6.5 శాతం వృద్ధి నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. వృద్ధి రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన 5.6 శాతం నుంచి డిసెంబర్ క్వార్టర్లో 6.2 శాతానికి పెరగడాన్ని గుర్తు చేసింది. ద్రవ్య స్థిరీకరణ, సంక్షేమం, వృద్ధి పరంగా ఆర్థిక వ్యవస్థలో చక్కని సమతుల్యత కొనసాగుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. -
త్వరలో మన ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు
న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు (రూ.435.17 లక్షల కోట్లు) చేరుకోవడం ఇక ఎంతోదూరంలో లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో ఆర్థిక ప్రగతికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై, నవీన ఆవిష్కరణలపై భారీగా పెట్టుబడులు పెట్టాలని భాగస్వామ్యపక్షాలకు పిలుపునిచ్చారు. ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల సృష్టికి పెట్టుబడులు అత్యంత కీలకమని వివరించారు. ‘బడ్జెట్ అనంతరం ఉద్యోగాలు, ఉపాధి కల్పన’పై బుధవారం జరిగిన వెబినార్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. 2014 నుంచి తమ ప్రభుత్వం 3 కోట్ల మంది యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచి్చందని అన్నారు. దేశవ్యాప్తంగా 1,000 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేయాలని, ఐదు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లు నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2015 నుంచి 2025 దాకా ఇండియా ఆర్థిక వ్యవస్థ 66 శాతం వృద్ధి చెందినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐఎంఎఫ్ నివేదిక వెల్లడించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 3.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని హర్షం వ్యక్తంచేశారు. వెబినార్‌లో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... సరైన దిశలో సరైన పెట్టుబడులు ‘‘ప్రపంచంలోని అత్యున్నత ఆర్థిక వ్యవస్థలను మనం అధిగమించాం. ఇండియా త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యం. ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టాలంటే సరైన దిశలో సరైన పెట్టుబడులు పెట్టడం అత్యంత కీలకం. ఇందుకోసం కేంద్ర బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశాం. వాటిని అమలు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. భాగస్వామ్యపక్షాలన్నీ ఇందులో పాలుపంచుకోవాలి. ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తుకు బ్లూప్రింట్‌గా నిలుస్తుంది. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ప్రజలు, ఆర్థికం, నవీన ఆవిష్కరణలపై పెట్టుబడులకు సరిసమాన ప్రాధాన్యం ఇస్తున్నాం. యువతలో ప్రాక్టికల్ స్కిల్స్ పెంచడానికి, నూతన అవకాశాలు కలి్పంచడానికి ‘పీఎం ఇంటర్న్‌షిప్ పథకం’ ప్రవేశపెట్టాం. పరిశ్రమ వర్గాలు సైతం ఈ పథకంలో భాగస్వామిగా మారాలి. ఈ ఏడాది బడ్జెట్లో అదనంగా 10 వేల మెడికల్ సీట్లు ప్రకటించాం. రాబోయే ఐదేళ్లలో కొత్తగా 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.గ్లోబల్ టూరిజం, వెల్నెస్ హబ్గాఇండియా పర్యాటక రంగంలో ఉద్యోగాల కల్పనకు ఎన్నో అవకాశాలున్నాయి. అందుకే ఈ రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ కలి్పంచాలని నిర్ణయం తీసుకున్నాం. దేశ జీడీపీలో 10 శాతం సమకూర్చగల సత్తా పర్యాటక రంగానికి ఉంది. దేశంలో 50 ప్రాంతాలను అద్భుతమైన పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేయబోతున్నాం. అక్కడి హోటళ్లకు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తాం. దీనివల్ల టూరిజం అభివృద్ధి చెందడంతోపాటు స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.అర్బన్ చాలెంజ్ ఫండ్‌కు రూ.లక్ష కోట్లు జనాభా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ చాలా కీలకం. ఇందులో భాగంగా అర్బన్ చాలెంజ్ ఫండ్‌కు రూ.లక్ష కోట్లు కేటాయించాలని నిర్ణయించాం. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ కోసం ప్రైవేట్ రంగం.. ప్రధానంగా రియల్ ఎసేŠట్ట్ చొరవ తీసుకోవాలి. దేశ ఆర్థిక ప్రగతిలో కృత్రిమ మేధ పాత్ర ఎంతో కీలకం. అందుకే ఏఐ ఆధారిత విద్య, పరిశోధనల కోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాం. ఏఐ కెపాసిటీని అభివృద్ధి చేయడానికి నేషనల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను ఏర్పాటు చేయబోతున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. -
ఇంకా కష్టపడితేనే లక్ష్యాలు సాధించగలం
న్యూఢిల్లీ: 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారతీయులు మరింత ఎక్కువగా కష్టపడితేనే సాధ్యమని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందుకోసం అవసరమైతే వారానికి 80 గంటలైనా, 90 గంటలైనా పనిచేయాల్సిందేనన్నారు. ‘‘నేను కష్టించి పని చేయాలని విశ్వసిస్తాను. భారతీయులు ఇంకా కష్టపడి పనిచేయాలి. అది వారానికి 80 గంటలు కావచ్చు లేదా 90 గంటలు కావచ్చు. ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్ల భారీ లక్ష్యానికి చేరుకోవాలనుకున్నప్పుడు, వినోదాలతో గడిపేస్తూనో, లేకపోతే ఏదో కొందరు సినిమా స్టార్ల అభిప్రాయాలను అనుసరిస్తూనో కూర్చుంటే సాధించలేము’’ అని వ్యాఖ్యానించారు. పటిష్టమైన పని విధానాలతోనే జపాన్, దక్షిణ కొరియా, చైనా ఆర్థిక విజయం సాధించాయని, ప్రపంచ స్థాయి ఎకానమీగా ఎదగాలంటే భారత్ కూడా అలాంటి ఆలోచనా ధోరణిని అలవర్చుకోవాలని చెప్పారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. ఎన్ని గంటల పని వేళలు ఉండాలనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొందరు కార్పొరేట్ దిగ్గజాలు వారానికి 70–90 గంటలు పని చేయాలంటే, ఎన్ని గంటలు పని చేశామనేది కాదు ఎంత నాణ్యంగా పని చేశామనేది ముఖ్యమని మరికొందరు దిగ్గజాలు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాషనైపోయింది.. ‘‘ఎక్కువగా కష్టపడకూడదంటూ మాట్లాడటం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. పనుల్లో జాప్యం జరగకుండా, ఖర్చులు పెరిగిపోకుండా, ప్రపంచ స్థాయి నాణ్యతతో, గడువు కన్నా ముందుగా ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే భారత్ కష్టపడి పని చేయాల్సిందే. ఇక పని–కుటుంబ జీవితం మధ్య సమతౌల్యం పాటించాలనే విషయానికొస్తే.. నేను ప్రతి రోజూ వ్యాయామం చేస్తాను. గోల్ఫ్ ఆడతాను. ఇవన్నీ చేస్తూనే నేను ప్రతి రోజూ కష్టపడి పని కూడా చేస్తాను. మీకు వ్యక్తిగతంగా ఒకటిన్నర గంటలు మీకోసమే పక్కన పెట్టుకున్నా మీకు రోజులో ఇంకా 22.5 గంటలు ఉంటాయి. పని–కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించడానికి బోలెడంత సమయం ఉంటుంది. కష్టపడకపోవడమనేదాన్ని ఏదో ఫ్యాషన్‌గా మార్చొద్దు. పెద్దగా శ్రమించకుండానే భారత్ గొప్ప దేశంగా ఎదగగలదంటూ యువతకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. కష్టపడకుండా ఏ దేశమూ ఎదగలేదు’’ అని అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. -
రేట్ల కోత కాదు.. ఏం చేయాలో సూచించిన మిశ్రా
వృద్ధికి ఊతమివ్వాలని భావిస్తే ఆర్బీఐ(RBI) రేట్ల కోతకు బదులు ద్రవ్య లభ్యత పరిస్థితులను సులభతరం (లిక్విడిటీ) చేయడంపై దృష్టి పెట్టాలని యాక్సిస్ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త నీల్కాంత్ మిశ్రా సూచించారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో మిశ్రా పార్ట్ టైమ్ సభ్యుడిగా ఉన్నారు. ఈ నెల మొదట్లో పావు శాతం మేర రెపో రేటును ఆర్బీఐ తగ్గించడం తెలిసిందే. అలాగే, తదుపరి పాలసీ సమీక్షల్లోనూ మరింత రేట్ల కోతతో రుణ వితరణ పెరగదని, ద్రవ్య కొరత రేట్ల కోత బదిలీకి అడ్డుపడుతుందని చెప్పారు.‘రేట్ల కోత ఉద్దేశ్యం మరిన్ని రుణాల జారీ అయితే.. కొత్త రుణాలు తక్కువ రేట్లపై జారీ చేయడం అసాధ్యం. ఎందుకంటే ద్రవ్య నియంత్రణ కట్టడి చర్యల ఫలితంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ మనీ 18 నెలలుగా అధిక స్థాయిలో కొనసాగుతోంది. రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత కూడా ఏడాది కాల సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ల రేటు 7.8 శాతం వద్దే కొనసాగుతోంది’ అని మిశ్రా వివరించారు. ఆర్బీఐ రెగ్యులర్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్‌ను చేపట్టడం ద్వారా తగినంత లిక్విడిటీ ఉండేలా చూడొచ్చన్నారు. లేదంటే నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను తగ్గించడం మరింత ఫలితాన్నిస్తుందన్నారు. లిక్విడిటీ సాధారణ స్థాయికి చేరి, ప్రభుత్వం ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడితే 2025–26 ద్వితీయ త్రైమాసికం నుంచి జీడీపీ వృద్ధి 7 శాతం రేటును చేరుకోవచ్చని అంచనా వేశారు. క్యూ3లో 6.4 శాతం వృద్ధి: ఇక్రాప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ 6.4 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ప్రభుత్వ వ్యయాలు పెరగడం ఇందుకు సాయపడుతుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో జీడీపీ 6.7 శాతం వృద్ధిని నమోదు చేయగా, జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 5.4 శాతానికి పడిపోవడం గమనార్హం. గతేడాది సాధారణ ఎన్నికల ముందు ప్రభుత్వం అంచనాల మేరకు మూలధన వ్యయాలు చేయలేకపోవడం, డిమాండ్ బలహీనత ఇందుకు దారితీశాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మూలధన, రెవెన్యూ వ్యయాలు పెంచడం, సేవల ఎగుమతుల్లో అధిక వృద్ధి, వస్తు ఎగుమతులు పుంజుకోవడం, ప్రధాన ఖరీఫ్ పంటల దిగుబడి మెరుగ్గా ఉండడం డిసెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక పనితీరు బలపడేందుకు దోహదం చేస్తాయని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ వివరించారు.ఇదీ చదవండి: ట్రేడింగ్–డీమ్యాట్ ఖాతా లాగిన్ మరింత భద్రం!మొత్తం మీద క్యూ3లో జీడీపీ, జీవీఏ విస్తరణ కొనసాగుతుందన్నారు. పెట్టుబడులకు సంబంధించి సంకేతాల్లో వృద్ధి కనిపిస్తున్నట్టు ఇక్రా తన నివేదికలో పేర్కొంది. ప్రభుత్వాల మూలధన వ్యయాలు ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయి 47.7 శాతానికి క్యూ3లో పెరిగినట్టు, అంతకుముందు త్రైమాసికంలో ఇది 10.3 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. క్యూ3 జీడీపీ వృద్ధి అంచనాలు ఈ నెల 28న విడుదల కానున్నాయి. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో ముందస్తు జీడీపీ అంచనాలను సైతం ఎన్ఎస్వో ప్రకటించనుంది. జనవరిలో విడుదల చేసిన తొలి అంచనాల ప్రకారం 2024–25లో వృద్ధి నాలుగేళ్ల కనిష్టం 6.4 శాతానికి తగ్గనుంది. కానీ, ఆర్బీఐ మాత్రం 6.6 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. -
పన్ను శ్లాబుల సవరణకు కారణాలు..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025లో మధ్యతరగతికి ఉపశమనం కలిగించడానికి, ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంతో ఆదాయపు పన్ను శ్లాబ్‌ల్లో మార్పులు చేశారు. ఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించాలని ప్రభుత్వం ఎందుకు నిర్ణయించిందో.. ఇది పన్ను చెల్లింపుదారులను ఎలా ప్రభావితం చేస్తుందో కింద తెలుసుకుందాం.డిస్పోజబుల్ ఆదాయాన్ని పెంచడంఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించడానికి ప్రధాన కారణాలలో ఒకటి మధ్య తరగతి వారికి డిస్పోజబుల్ ఆదాయాన్ని(ఖర్చులు అన్ని పోను మిగిలే ఆదాయం) పెంచడం. పన్ను రేట్లను తగ్గించడం ద్వారా, వ్యక్తులు, కుటుంబాలు ఖర్చు చేయడానికి, పొదుపు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ డబ్బును కలిగి ఉంటారు. ఇది ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి దారితీస్తుంది.పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించడంపొదుపును, పెట్టుబడులను ప్రోత్సహించేలా కొత్త పన్ను విధానాన్ని రూపొందించారు. అధిక డిస్పోజబుల్ ఆదాయంతో, వ్యక్తులు దీర్ఘకాలిక వృద్ధికి దోహదపడే ఆర్థిక సాధనాలు, స్థిరాస్తి లేదా వ్యాపారాల్లో పొదుపు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది.పన్ను వ్యవస్థను సరళతరం చేయడంపన్ను వ్యవస్థను సరళతరం చేయడమే లక్ష్యంగా పన్ను శ్లాబులను సవరించారు. పన్ను చెల్లింపుదారులు వారి పన్ను విధానాలను అర్థం చేసుకోవడం, వాటిని పాటించడం సులభతరం అవుతుంది. ఈ సరళీకరణ పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారులపై పరిపాలనా భారాన్ని తగ్గిస్తుంది. ఇది మరింత సమర్థవంతమైన పన్ను సేకరణకు దారితీస్తుంది.మధ్యతరగతికి మద్దతుమధ్యతరగతి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటోంది. వారికి పన్ను ఉపశమనం కల్పించడం, వారి కొనుగోలు శక్తిని పెంచడానికి ఈ నిర్ణయం సాయపడుతుంది. మధ్య తరగతివారిపై పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు, మొత్తం ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.పాత పన్ను విధానం రద్దు చేసేలా..?2020లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం ద్వారా క్రమంగా పాత పన్ను విధానాన్ని పలుచన చేస్తున్నారు. తాజా మార్పులు పాత వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులను కొత్త విధానానికి మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్గృహ వినియోగాన్ని ప్రేరేపించడంపెరిగిన డిస్పోజబుల్ ఆదాయం అధిక గృహ వినియోగానికి దారితీస్తుంది. ఇది ఆర్థిక వృద్ధికి కీలక శక్తిగా మారుతుంది. వినియోగదారుల చేతుల్లో ఎక్కువ డబ్బును ఉంచడం ద్వారా వస్తువులు, సేవలకు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.ద్రవ్యోల్బణంపెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయంతో ఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించడం కుటుంబాలపై కొంత ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. -
పట్టణ వినియోగ పెంపునకు బ్లూప్రింట్
పట్టణ వినియోగం ఆర్థిక వృద్ధికి కీలకం. అయితే కొన్ని కారణాల వల్ల పట్టణ వస్తువినియోగం గతంతో పోలిస్తే తగ్గుతుంది. దీన్ని పెంచితేనే దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. ఇందుకోసం బడ్జెట్లో వ్యూహాత్మక విధానాన్ని పాటిస్తూ, కొన్ని అంశాలపై దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు. పట్టణ వినియోగాన్ని పెంచడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు.మౌలిక సదుపాయాల అభివృద్ధిపట్టణ వినియోగం పెరగాలంటే ఆధునిక మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం చాలా అవసరం. రవాణా నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం, డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడం, యుటిలిటీలను అప్‌గ్రేడ్ చేయడం వంటివాటిపై దృష్టి పెట్టాలి. సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ పట్టణ జీవనాన్ని మరింత సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. ఇది అధికంగా ఖర్చు చేసేందుకు ప్రోత్సహిస్తుంది.రిటైల్ వ్యవస్థపట్టణ వినియోగాన్ని పెంచడానికి శక్తివంతమైన రిటైల్ వ్యవస్థను, వాణిజ్య ప్రదేశాలను ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. నివాస, వాణిజ్య, వినోద ప్రాంతాలను మిళితం చేసేలా సదుపాయాలు సిద్ధం చేయాలి. స్థానిక వ్యాపారాలు, స్టార్టప్‌లను ప్రోత్సహించడం వల్ల సమ్మిళిత ఆర్థిక వాతావరణాన్ని పెంపొందించవచ్చు.చౌకగా గృహాలుడిస్పోజబుల్ ఆదాయం(ఖర్చులు పోను మిగిలే ఆదాయం) వస్తువుల వినియోగాన్ని పెంచడానికి, సరసమైన గృహాలను కొనుగోలు చేయడానికి తోడ్పడుతుంది. తక్కువ ధరకు లభించే గృహాలను ఏర్పాటు చేసే ప్రాజెక్టులు జీవన వ్యయాలను తగ్గిస్తాయి. వస్తువులు, సేవలపై ఎక్కువ ఖర్చు చేసేలా దోహదం చేస్తాయి. ఇది స్థానిక వ్యాపారాలకు ఊతమిస్తుంది.పర్యాటకాన్ని ప్రోత్సహించడంపట్టణ వినియోగానికి పర్యాటక రంగం గణనీయంగా దోహదం చేస్తుంది. పర్యాటక ఆకర్షణ స్థలాలను అభివృద్ధి చేయడం, ఆతిథ్య సేవలను మెరుగుపరచడం, సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలను కాపాడడం వల్ల సందర్శకులను ఆకర్షించవచ్చు. ఖర్చును పెంచవచ్చు. సమర్థవంతమైన మార్కెటింగ్ ప్రచారాలు, ట్రావెల్ ఏజెన్సీలతో భాగస్వామ్యాలు పట్టణ పర్యాటకానికి సహాయపడతాయి.ప్రజా సేవలను మెరుగుపరచడంఅభివృద్ధి చెందుతున్న పట్టణ వాతావరణానికి ఆరోగ్య సంరక్షణ, విద్య, భద్రత వంటి నాణ్యమైన ప్రజా సేవలు చాలా అవసరం. ఈ విభాగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నివాసితుల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. ఇది స్థానికులకు, పెట్టుబడిదారులకు నగరాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.సుస్థిర పద్ధతులుసుస్థిర పద్ధతులను అవలంబించడం వల్ల దీర్ఘకాలిక పర్యావరణ వ్యవస్థను పెంచవచ్చు. గ్రీన్ బిల్డింగ్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, వేస్ట్ మేనేజ్ మెంట్ వంటి కార్యక్రమాలు మరింత సుస్థిరాభివృద్ధికి తోడ్పాటును అందిస్తాయి.ఇదీ చదవండి: సామాన్యుడు కేంద్ర బడ్జెట్ గురించి ఎందుకు తెలుసుకోవాలి..?అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంపట్టణ ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలను అర్థం చేసుకోవాలి. ప్రజా సంప్రదింపులు, ఫీడ్ బ్యాక్ యంత్రాంగాలు, భాగస్వామ్య ప్రణాళికలతో మెరుగైన సేవలందించవచ్చు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తే నిజంగా అవసరమయ్యే ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతుంది. ఇది అధిక వినియోగానికి దారితీస్తుంది.ఆర్థిక ప్రోత్సాహకాలుపన్ను రాయితీలు, సబ్సిడీలు, గ్రాంట్లు వంటి ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడం వల్ల పట్టణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాలను ప్రోత్సహించవచ్చు. ఈ ప్రోత్సాహకాలు ఆర్థిక కార్యకలాపాలను పెంచుతాయి. ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయి.సాంకేతిక పరిజ్ఞానంసాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా లావాదేవీలను మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా జరుపవచ్చు. డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, స్మార్ట్ సిటీ పరిష్కారాలు వినియోగ ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తాయి. -
ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు అప్
ముంబై: వరుసగా రెండేళ్ల పాటు తగ్గిన ప్రైవేట్ ఈక్విటీ(Private equity), వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు గతేడాది మళ్లీ కొంత మెరుగయ్యాయి. 2024లో 5 శాతం పెరిగి 56 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, అనేక అనిశ్చితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది పెట్టుబడులకు సవాళ్లు ఎదురుకావచ్చనే అంచనాలు నెలకొన్నాయి. పరిశ్రమ లాబీ గ్రూప్ ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.‘అమెరికా నూతన ప్రభుత్వం తన పాలసీలను ఇంకా పూర్తిగా వెల్లడించాల్సి ఉంది. ఇవి అంతర్జాతీయంగా వాణిజ్యం, ఎగుమతులు, కరెన్సీ, క్రూడాయిల్ ధరలపై గణనీయంగా ప్రభావం చూపవచ్చు. దీనితో భారత స్థూల ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం పడొచ్చు’ అని ఈవై పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. దేశీయంగా వినియోగం నెమ్మదిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2024లో పీఈ, వీసీ ఫండ్ల ఒప్పందాలు 54 శాతం పెరిగి 1,352గా నమోదయ్యాయి.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌పై ఎస్బీఐ అంచనాలునివేదికలోని మరిన్ని విశేషాలు..మౌలిక సదుపాయాలు, రియల్టీలో గతేడాది పెట్టుబడులు స్వల్పంగా 3 శాతం క్షీణించాయి. 2023లో 21.5 బిలియన్ డాలర్లుగా ఉండగా 2024లో 20.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2023లో 1 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ 6 నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ 9.6 బిలియన్ డాలర్లు. గతేడాది బిలియన్ డాలర్ల ఒప్పందాలు 4 కుదరగా, వీటి మొత్తం విలువ 6.1 బిలియన్ డాలర్లు. ఏటీసీ ఇండియా టవర్ కార్పొరేషన్‌ను బ్రూక్‌ఫీల్డ్‌కి చెందిన డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం.. గతేడాది నమోదైన అతి పెద్ద డీల్.మదుపరుల నిష్క్రమణకు సంబంధించి 26.7 బిలియన్ డాలర్ల విలువ చేసే 282 డీల్స్ నమోదయ్యాయి. 2023లో ఈ పరిమాణం 24.9 బిలియన్ డాలర్లు. 2023లో 95 ఫండ్లు 15.9 బి. డాలర్ల నిధులు సమీకరించగా 2024లో ఇది 34 శాతం తగ్గింది. -
ఉపాధికి చేయూత కావాలి
బలమైన ఆర్థిక వృద్ధికి ఉపాధి కల్పన ఎంతో అవసరం. ఇందుకు వీలుగా మౌలిక రంగం, ఆతిథ్యం, స్టార్టప్‌లు, ఎడ్టెక్, ఎంఎస్ఎంఈ రంగాలకు కావాల్సిన పెట్టుబడులు సమకూర్చడంతోపాటు, ప్రోత్సాహకాలు కల్పించాలని, నైపుణ్యాభివృద్ధి, శిక్షణపై దృష్టి పెట్టాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ మేరకు చర్యలు అవసరమని తెలిపాయి. పర్యాటకం–ఆతిథ్యం ఉపాధి కల్పనలో, ఆర్థిక వ్యవస్థకు చేయూతలో ఆతిథ్య పరిశ్రమ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు నూర్మహల్ గ్రూప్ సీఎండీ మన్బీర్ చౌదరి చెప్పారు. 2047 నాటికి జీడీపీలో 3 ట్రిలియన్ డాలర్ల పర్యాటకం లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా, ఆతిథ్య పరిశ్రమకు బడ్జెట్ 2025లో ప్రోత్సాహకాలకు చోటు కల్పించాలని కోరారు. ఈ రంగానికి పరిశ్రమ హోదా డిమాండ్ ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నట్టు తెలిపారు. ఈ హోదా కల్పిస్తే ఆతిథ్య పరిశ్రమకు రుణ సదుపాయాలు మెరుగుపడతాయన్నారు. ఎడ్టెక్ డేటా సైన్స్, పునరుత్పాదక ఇంధనం, కృత్రిమ మేధ (ఏఐ) నైపుణ్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సిల్వర్‌లైన్ ప్రెస్టీజ్ స్కూల్ వైస్ చైర్మన్, విద్యా రంగ విధానాల నిపుణుడు నమన్ జైన్ సూచించారు. నైపుణ్య అభివృద్ధి, శిక్షణపై మరిన్ని పెట్టుబడులు స్థిరమైన వృద్ధికి కీలకమన్నారు. సరిపడా నైపుణ్యాలు లేకపోవడం వల్లే ప్రస్తుతం నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. భారత్ 7–8 శాతం వృద్ధి రేటును సాధించేందుకు ఉపాధి కల్పనను పెంచాలని ఇటీవలే మెకిన్సే అధ్యయనం సూచించడాన్ని వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ సీఈవో గగన్ అరోరా గుర్తు చేశారు. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్టార్టప్‌లు స్టార్టప్‌లు, వెంచర్ స్టూడియోల అవసరాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని టీ9ఎల్ క్యూబ్ వ్యవస్థాపకుడు గౌరవ్ గగ్గర్ కోరారు. స్టార్టప్‌లకు ఏంజెల్ ట్యాక్స్ తొలగించడాన్ని గొప్ప చర్యగా అభవర్ణించారు. దీనివల్ల పెట్టుబడులు రాక పెరుగుతుందన్నారు. పరిశ్రమకు నిధుల సమస్య ప్రధానంగా ఉందని, బడ్జెట్లో ఈ దిశగా మరిన్ని చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ (వ్యవస్థ)కు వెంచర్ స్టూడియోలు ఊతంగా నిలుస్తున్నట్టు చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళతరం చేయడంతోపాటు, మరింత మెరుగ్గా రుణాలు అందేలా చూడాలని కోరారు. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్టార్టప్‌లకు నిధులు సమకూర్చే వెంచర్ క్యాపిటలిస్టులకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలని గౌరవ్ గగ్గర్ డిమాండ్ చేశారు. దీనివల్ల దేశ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఎంతో ఊతమిచ్చినట్టు అవుతుందన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అమెరికా వృద్ధిలో కీలకంగా భారతీయులు
న్యూఢిల్లీ: హెచ్–1బీ వీసా వర్కర్లంటే అమెరికా ఉద్యోగుల స్థానాన్ని ఆక్రమించే చౌక కార్మికులని, అక్కడి వేతనాల స్థాయిని కుదించేస్తారనేది అపోహ మాత్రమేనని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అమెరికా ఎకానమీ వృద్ధిలో భారతదేశం, భారతీయ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ ఐటీ వృద్ధిపై నిస్పృహకు లోను కావాల్సిన అవసరమేమీ లేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ విధానాలపైన, 250 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమ మీద వాటి ప్రభావాలపైన అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాలో పరిణామాలేమీ భారత ఐటీ పరిశ్రమ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపబోవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్–1బీ వీసాలనేవి నాన్–ఇమిగ్రెంట్ వీసాలే కావడం వల్ల వివాదాస్పద వలసల సమస్యకు, వాటికి సంబంధమేమీ లేదని పేర్కొన్నారు. హెచ్–1బీ వీసాల్లో 70 శాతం వీసాలు భారతీయులకే లభిస్తుండటమనేది మన నైపుణ్యాలకు నెలకొన్న డిమాండ్‌కి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం వృద్ధి సాధనపై దృష్టి పెట్టడమనేది ఇరు దేశాలు కలిసి పని చేసేందుకు మరింతగా అవకాశాలను కల్పించగలదని సింగ్ చెప్పారు. భారతీయ కంపెనీలు అమెరికాలో అక్కడివారికి నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు 1.1 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేశాయని సింగ్ చెప్పారు. -
అమెరికా సుంకాలు ప్రపంచానికే ప్రమాదం
అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచాలనే నిర్ణయం వల్ల ప్రపంచ వృద్ధి ప్రభావం చెందుతుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదిక ప్రకారం, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్య భాగస్వాములు తమ సొంత టారిఫ్‌లను పెంచుతూ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇప్పటికే మందకొడిగా 2.7%గా ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2025లో 0.3 శాతం పడిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.ఇతర దేశాలు అనుసరిస్తే ప్రమాదంఅమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన వివరాల ప్రకారం.. ప్రపంచ దిగుమతులపై 10 శాతం సుంకం, కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనా వస్తువులపై 60 శాతం సుంకాన్ని విధించబోతున్నట్లు సమాచారం. ప్రపంచ స్థూల ఆర్థిక నమూనా ప్రకారం ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రపంచ వృద్ధి 0.3 శాతం తగ్గిపోనుంది. ఇతర దేశాలు కూడా ఇదే పంథాను అనుసరిస్తే మరింత ప్రమాదం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.కుంటుపడనున్న వృద్ధిరేటుఅభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు 2000 సంవత్సరం తర్వాత అత్యంత బలహీనమైన దీర్ఘకాలిక వృద్ధి సమస్యను ఎదుర్కొంటున్నాయని నివేదిక ఎత్తిచూపింది. అధిక రుణ భారాలు, బలహీనమైన పెట్టుబడులు, ఉత్పాదకతలో తగ్గుతున్న వృద్ధి, పెరుగుతున్న వాతావరణ మార్పుల ఖర్చుల కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2025-26 ఏడాదికిగాను వృద్ధి రేటు 4%గా ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: భారత్‌లో టాప్ 5 బ్రాండ్ లిస్ట్‌లోకి యాపిల్వచ్చే 25 ఏళ్లు మరిన్ని సవాళ్లుపెట్టుబడులను ప్రోత్సహించడానికి, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి వివిధ దేశాలు మెరుగైన సంస్కరణలను అవలంబించాలని ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్ ఇందర్మిత్ గిల్ నొక్కి చెప్పారు. గత 25 సంవత్సరాలతో పోలిస్తే వచ్చే 25 ఏళ్లు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు కఠినమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. వీటిని తగ్గించుకునేందుకు క్రియాశీల చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ సైతం ప్రపంచ వాణిజ్యంలో పెరుగుతున్న అనిశ్చితుల గురించి హెచ్చరించింది. -
దిగుమతులపై ఆందోళన అక్కర్లేదు
ఎగుమతుల వాటా పెరుగుతున్నంత వరకూ దిగుమతుల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి ఎలాంటి వాణిజ్య అసమతుల్యత ఏర్పడడం లేదన్నారు. వాణిజ్యానికి, ఉత్పత్తుల రవాణాకు ప్రతిబంధకాలు సృష్టించే ధోరణులను ప్రపంచ దేశాలు నివారించాలని ఆయన పేర్కొన్నారు.‘ప్రపంచమంతా 3–3.5 శాతం వృద్ధి చెందుతోంటే భారత ఎకానమీ 7 శాతం వృద్ధి సాధిస్తోంది. అలాంటప్పుడు భారత్‌లో వినియోగం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దిగుమతులూ పెరుగుతాయి. అయితే, ఎగుమతుల్లో దిగుమతుల పాత్ర కూడా చాలా కీలకం. ఎగుమతుల్లో దిగుమతుల వాటాను (దిగుమతి చేసుకున్న వాటిని మరో రూపంలో ఎగుమతి చేయడం) మెరుగుపర్చుకుంటున్నంత వరకు మనం దిగుమతుల గురించి పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు‘ అని సునీల్ బరత్వాల్ చెప్పారు.ఇదీ చదవండి: సినిమా చూసి భావోద్వేగానికి గురైన సింఘానియాఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఉత్పత్తుల ఎగుమతులు 3.18 శాతం పెరిగి 252.28 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 5.77 శాతం పెరిగి 416.93 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. మరోవైపు, సంపన్న దేశాల్లో వలసలు, మొబిలిటీ విషయంలో గందరగోళం నెలకొందని బరత్వాల్ తెలిపారు. భారతీయులు లేదా భారతీయ కంపెనీలు ఇతర దేశాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయా దేశాలకు ప్రొఫెషనల్స్ రాకపోకలు సాగించాల్సిన (మొబిలిటీ) అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిరాటంకమైన మొబిలిటీకి వెసులుబాటు కల్పించాలని భారత్ అడుగుతోందే తప్ప వలసలను అనుమతించమని కోరడం లేదని బరత్వాల్ స్పష్టం చేశారు. -
మూడేళ్లలో రూ.8.3 లక్షల కోట్లకు క్రీడారంగం!
ఆర్థికాభివృద్ధిలో క్రీడారంగాన్ని కూడా భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వం నిర్దిష్ట మోడల్‌ను రూపొందించాలని ఓ నివేదిక సూచించింది. క్రీడల మౌలిక సదుపాయాలు, ఈవెంట్లు, సంబంధిత ఉత్పత్తులు, సర్వీసుల్లో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించేలా విధానాలను తయారు చేయాలని పేర్కొంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, నాంగియా నెక్ట్స్ కలిసి ఈ నివేదికను రూపొందించాయి.ఈ నివేదిక ప్రకారం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ప్రతిభావంతులైన క్రీడాకారులకు తోడ్పాటు అందించేలా, భారీ స్థాయి క్రీడా కార్యక్రమాలకు నిధులు సమకూర్చే ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం తగు ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చని నివేదిక తెలిపింది. ఇంటర్నేషనల్ కోచ్‌లు, న్యూట్రిషనిస్టులు, మానసిక, శారీర శిక్షణ నిపుణులతో సహా అత్యుత్తమ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సీఎస్ఆర్ నిధులను వినియోగించేలా చూడొచ్చని పేర్కొంది. భారత క్రీడారంగం ప్రస్తుతం గణనీయమైన వృద్ధిని సాధించే దశలో ఉందని నివేదిక తెలిపింది. 2020లో దాదాపు 27 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ రంగం వృద్ధి 2027 నాటికి 100 బిలియన్ డాలర్ల(రూ.8.3 లక్షల కోట్లు)కు చేరుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.నివేదికలోని మరిన్ని విశేషాలు..స్పోర్ట్స్ కోచింగ్, మేనేజ్మెంట్ అంశాల్లో నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు నిర్వహించడం, విధానాలను రూపొందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల ద్వారా ఉపాధికి ఊతమిచ్చేలా క్రీడలకు సంబంధించిన అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటునివ్వాలి.క్రీడారంగం గణనీయంగా పురోగతి సాధించినప్పటికీ, అథ్లెట్లకు ఆర్థిక భద్రత, మౌలిక సదుపాయాల కొరత వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి.ఆర్థిక సహాయాన్నందించే కార్యక్రమాలను విస్తరించడం, కెరియర్‌పరంగా పరివర్తనకు దోహదపడే పటిష్టమైన విధానాలను రూపొందించడం, సమ్మిళిత సంస్కృతిని పెంపొందించడం వంటి చర్యలు ఈ సవాళ్లను పరిష్కరించడంలో ఉపయోగపడగలవు.అంతర్జాతీయ కాంపిటీషన్లు, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, వాటిని నిర్వహించేందుకు ప్రభుత్వం క్రియాశీలకమైన చర్యలు తీసుకోవాలి. దేశీయంగా వివిధ రాష్ట్రాలకు ప్రత్యేకమైన క్రీడలను మరింతగా వెలుగులోకి తెచ్చేందుకు స్పోర్ట్స్ టూరిజంను ప్రోత్సహించవచ్చు.ఇదీ చదవండి: విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా భారత్స్పోర్ట్స్ లీగ్‌లు, సాంకేతిక పురోగతి, వైవిధ్యమైన క్రీడలు మొదలైనవి ఈ రంగం వృద్ధికి తోడ్పడుతున్నాయి.స్పోర్ట్స్ గూడ్స్, దుస్తులు, మీడియా హక్కులు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి.స్పోర్ట్స్ మీడియా మార్కెట్ 2020లో 1 బిలియన్ డాలర్లుగా ఉండగా 2027 నాటికి 13.4 బిలియన్ డాలర్లకు చేరవచ్చనే అంచనాలు ఉన్నాయి.2023 ఏషియన్ గేమ్స్, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సాధించిన విజయాలు, అంతర్జాతీయంగా పోటీపడే సత్తా పెరుగుతోందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. -
తగ్గుతున్న వేతనాలు.. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి!
భారత వృద్ధికి వెన్నెముకగా ఉంటున్న మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం, గృహ ఖర్చులు, రవాణా ఖర్చలు పెరగడం.. వంటి విభిన్న అంశాలు ఇందుకు కారణమని ఎలరా సెక్యూరిటీస్ తెలిపింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం వల్ల లిస్టెడ్ నాన్ ఫైనాన్షియల్ కంపెనీల్లో వేతనాలు 0.5% తగ్గినట్లు ఎలారా పేర్కొంది.ఎలరా సెక్యూరిటీస్ వివరాల ప్రకారం.. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రజల ఆదాయాలు గణనీయంగా ప్రభావితం చెందుతున్నాయి. మధ్యతరగతి, పేద ప్రజలు రోజువారీ నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేట్ ఆదాయాల్లో మందగమనం కనిపిస్తోంది. హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా వంటి కంపెనీలకు చెందిన వస్తువుల పట్టణ డిమాండ్ క్షీణిస్తోంది. ఆయా కంపెనీ త్రైమాసిక వృద్ధికి సంబంధించి ముందుగా అంచనావేసిన దానికంటే బలహీనమైన వృద్ధి నమోదు అవుతోంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో గ్రామీణ విక్రయాలు 8% వృద్ధి చెందగా, పట్టణ విక్రయాలు 2% తగ్గాయి.ఇదీ చదవండి: మస్క్ కొత్తగా గేమింగ్ స్టూడియో!ప్రభుత్వం వస్తువుల డిమాండ్‌ను పెంచేందుకు వడ్డీరేట్ల కోతలు ప్రారంభించాలని యోచిస్తోంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రాధాన్యతనిస్తూ వివిధ మార్గాలు అనుసరిస్తోంది. దాంతో వడ్డీరేట్ల కోత నిర్ణయం వాయిదా పడుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిని 7 శాతం నుంచి 6.5 శాతానికి కట్ చేశారు. అంచనాల కంటే భిన్నంగా జీడీపీ వృద్ధి నమోదవుతుండడం ఆందోళన కలిగించే అంశం. మెట్రో నగరాల్లో ఇంటి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ ధరలు దేశవ్యాప్తంగా 23% పెరిగాయి. ఇంటి అద్దెలు పట్టణ ప్రజల ఆదాయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. -
వృద్ధి ఆశావహమే.. కానీ అప్రమత్తత
భవిష్యత్తులో దేశ ఆర్థిక వృద్ధి పట్ల ఆశావహంగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అయితే అదే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేసింది. సరిపడా వర్షాలు, రిజర్వాయర్లలో మెరుగైన నీటి నిల్వలు, కనీస మద్దతు ధరలను (ఎంఎస్పీ) పెంచడం, ముడి సరుకుల లభ్యత ఇవన్నీ ఆర్థిక వృద్ధికి సానుకూల అంశాలుగా పేర్కొంది.‘ప్రస్తుతం కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, మెరుగైన వ్యవసాయ ఉత్పాదకత వల్ల రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం దిగొస్తుంది. నవంబర్ నెల ప్రారంభ ధోరణులు కీలక ఆహార ధరలు మోస్తరు స్థాయికి చేరుతున్నట్టు సంకేతమిస్తున్నాయి. అయినప్పటికీ భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం దేశీయంగా ద్రవ్యోల్బణం, సరఫరా వ్యవస్థలపై కొనసాగుతుంది’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదిక వెల్లడించింది. ఖరీఫ్ సీజన్లో పెద్ద ఎత్తున పెరిగిన సాగుతో ఆహార ధరలు దిగొస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్థిక కార్యకలాపాలు వర్షాకాలంలో కొంత నిదానించినప్పటికీ, తిరిగి అక్టోబర్‌లో పుంజుకున్నట్టు కొన్ని సంకేతాలు వస్తున్నట్లు తెలిపింది. గ్రామీణ, పట్టణ డిమాండ్‌తోపాటు, పీఎంఐ సూచీ, ఈవే బిల్లుల జారీ తదితర సంకేతాలను ప్రస్తావించింది.ఉపాధి విస్తరణ.. సంఘటిత రంగంలో ఉద్యోగుల సంఖ్య విస్తరిస్తోందని.. తయారీ రంగంలో చెప్పుకోతగ్గ మేర ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నట్టు ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో డిమాండ్ తగ్గడం వల్ల దేశ ఎగుమతులు పుంజుకునే విషయంలో సవాళ్లను ఎదుర్కోవచ్చని అంచనా వేసింది. మరోవైపు సేవల రంగం ఊపందుకుంటున్నట్టు తెలిపింది. ఇక 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐలు) చెప్పుకోతగ్గ వృద్ధి లేదని వెల్లడించింది. విదేశీ మారకం నిల్వలు ఈ ఏడాది ఇప్పటి వరకు 64.8 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్టు, చైనా తర్వాత అధిక వృద్ధి నమోదైనట్టు తెలిపింది. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు, కంపెనీల ఆదాయాల వృద్ధి, విలువలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, ట్రంప్ సర్కారు విధాన నిర్ణయాలు తదుపరి విదేశీ పెట్టుబడుల రాకను ప్రభావితం చేస్తాయని వివరించింది. ఇదీ చదవండి: ఆకాశవీధిలో 1.36 కోట్ల మందిఅంతర్జాతీయ పరిణామాలు..రష్యా–ఉక్రెయిన్ మధ్య తాజా ఉద్రిక్తతలతో ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆందోళనకు దారితీసిందని, దీంతో భద్రత ఎక్కువ ఉండే సాధనాలైన యూఎస్ ట్రెజరీలు, బంగారానికి డిమాండ్ ఏర్పడినట్టు ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. యూరప్, చైనాలో ఆర్థిక మందగమనం ప్రభావం అంతర్జాతీయ వృద్ధిపై కొనసాగుతుందని అంచనా వేసింది. అదే సమయంలో యూఎస్ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి పనితీరు చూపిస్తున్నట్టు పేర్కొంది. -
మెరుగైన మౌలిక సదుపాయాలతో దేశం వృద్ధి
డిజిటల్, సామాజిక మౌలిక సదుపాయాలను మెరుగుపరిస్తే దేశం వృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సమ్మిళిత వృద్ధికి అనువైన చట్టాలను సరళీకరిస్తూ దేశం ఆర్థికంగా దూసుకుపోతోందని తెలిపారు. ఓ ప్రైవేట్ సంస్థలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.‘ఉపాధి కల్పన, ఉత్పత్తి విలువను పెంచే పీఎల్ఐ ప్రోత్సాహకాలు దేశవృద్ధికి ఎంతో ఉపకరిస్తున్నాయి. దేశీయంగా తయారీ రంగం ఊపందుకుంటుంది. మొబైల్, సెమీకండక్టర్లు వంటి తయారీ రంగాల్లో రానున్న రోజుల్లో ఎంతో వృద్ధి నమోదవుతుంది. ప్రభుత్వం భౌతిక, డిజిటల్ ఆస్తులపైనే కాకుండా సామాజిక వనరులపై కూడా పెట్టుబడి పెడుతుంది. గత పదేళ్లలో మెడికల్ కాలేజీలు దాదాపు రెట్టింపు పెరిగి 706కు చేరుకున్నాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సంఖ్య ఏడు నుంచి 22కు చేరింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల ద్వారా కొత్త పరిశ్రమలను సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. దాంతో పెద్ద మొత్తంలో ఉపాధి లభిస్తుంది. ఉత్పాదకత పెంపొందుతుంది. మొబైల్ ఫోన్ తయారీకి సంబంధించిన పీఎల్‌ఐల వల్ల గత దశాబ్దంలో 12 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు నమోదయ్యాయి. దేశంలో తయారయ్యే మొబైల్ ఫోన్ల మొత్తం ఉత్పత్తి విలువ 2014లో 2.3 బిలియన్ డాలర్లు(రూ.19.3 వేలకోట్లు)గా ఉండేది. 2024 నాటికి అది రూ.4.1 లక్షల కోట్లకు పెరిగింది’ అన్నారు.ఇదీ చదవండి: సంపద వృద్ధిలో టాప్ 10 దేశాలు‘ఈ సంవత్సరం యాపిల్ సంస్థ దేశంలో తమ సరికొత్త మోడల్‌ను తయారు చేయనుంది. గత దశాబ్దంలో మొబైల్ ఫోన్ తయారీలో దేశం గణనీయ వృద్ధి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత భారత్ ఈ రంగంలో రెండో స్థానానికి చేరుకుంది. పీఎల్ఐకు సంబంధించి మొబైల్ తయారీ విభాగం విజయవంతం కావడంతో సెమీకండక్టర్ చిప్ తయారీకి కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తోంది. సెమీకండక్టర్ డిజైన్, ఏటీఎంపీ(అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్)లో వృద్ధి నమోదు కానుంది. ఈ రెండు పరిశ్రమలకు అనుబంధంగా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌ను ప్రారంభించనున్నాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.40 వేలకోట్లు కేటాయించనుంది. సమ్మిళిత వృద్దికి అవసరమయ్యే చట్టాలను సరళీకరిస్తూ దేశం ఆర్థికంగా దూసుకుపోతుంది’ అని మంత్రి వివరించారు. -
అస్థిరంగా రుతుపవనాలు.. స్థిరంగానే ఆర్థిక వృద్ధి
న్యూఢిల్లీ: రుతుపవనాలు కొంత అస్థిరంగా ఉన్నప్పటికీ భారతదేశ ఆర్థిక పురోగమనం యథాతథంగా కొనసాగుతోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై నెలవారీ నివేదిక తెలిపింది. ఆర్థిక సర్వే అంచనాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.5 శాతం నుంచి 7 శాతం శ్రేణిలోనే నమోదవుతుందన్న ధీమాను వ్యక్తం చేసింది.ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరం గడచిన నాలుగు నెలల్లో ఎకానమీ పురోగమనం సంతృప్తికరంగా ఉందని పేర్కొంది. ప్రత్యేకించి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు (రూ.7.39 లక్షల కోట్లు) పూర్తి సానుకూల నమోదుకావడం హర్షణీయ పరిణామమని అభిప్రాయపడింది. తయారీ, సేవల రంగాలు సైతం పురోగతి బాటలో ఉన్నాయని వివరించింది. తాజా 2024–25 బడ్జెట్ దేశ ద్రవ్య, ఆర్థిక పటిష్టతకు బాటలు వేస్తుందని భరోసాను ఇచ్చింది.ద్రవ్యోల్బణం కట్టడి (ఐదేళ్ల కనిష్ట స్థాయిలో జూలైలో 3.4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు) సానుకూల అంశంగా వివరించింది. రిజర్వాయర్‌లో నీటి మట్టాలు భారీగా పెరగడం వల్ల ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ పంటల ఉత్పత్తి విషయంలో మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్న నివేదిక, రాబోయే నెలల్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో ఈ పరిణామం మరింత దోహదపడుతుందని విశ్లేషించింది. -
భూ, సాగు, కార్మిక సంస్కరణలు అవసరం: సీఐఐ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధి వేగవంతానికి వీలుగా మోదీ సర్కారు కారి్మక, భూ, సాగు సంస్కరణలు చేపట్టాలని పరిశ్రమల సంఘం సీఐఐ కేంద్రానికి సూచించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8.2 శాతం వృద్ధి సాధించినట్టు కేంద్ర సర్కారు ఇటీవలే అంచనాలు విడుదల చేయడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇది 8 శాతం మేర నమోదవుతుందని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్‌పురి అంచనా వేశారు. సీఐఐ అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడారు. గతంలో చేపట్టిన ఎన్నో విధానపనరమైన చర్యలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను మెరుగైన స్థితిలో నిలబెట్టినట్టు చెప్పారు. ‘‘అసంపూర్ణంగా ఉన్న సంస్కరణల అజెండాను పూర్తి చేయడంపైనే వృద్ధి అంచనాలు ఆధారపడి ఉన్నాయి. మన ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యంలో అవకాశాలను విస్తృతం చేయడం, పెట్టుబడులు, వినియోగం, సాధారణ వర్షపాతంపై అంచనాలు వృద్ధిని ప్రభావితం చేస్తాయి’’అని పురి వివరించారు. ప్రైవేటు పెట్టుబడులు కూడా పుంజుకున్నట్టు చెప్పారు. జీఎస్టీలో మూడు రకాల రేట్లే ఉండాలని, పెట్రోలియం, రియల్ ఎస్టేట్‌ను సైతం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. -
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆర్థిక వృద్ధి
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కూడిన టెక్నాలజీతోనే ఆర్థిక వృద్ధి సాధ్యం. ఇది అత్యధిక మంది భారతీయులు నమ్ముతున్న మాట. సాంప్రదాయకంగా ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్న జనాభాను ఏకీకృతం చేయడంలో 89 శాతం మంది భారతీయులు సాంకేతికతను కీలక అంశంగా భావిస్తున్నారని హెచ్‌పీ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ సంఖ్య ప్రపంచ సగటు 76 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇది సాంకేతికత పరివర్తన శక్తిపై భారత్ బలమైన నమ్మకాన్ని నొక్కిచెబుతోందని హెచ్‌పీ ఒక ప్రకటనలో తెలిపింది.పర్యావరణ, సామాజిక లక్ష్యాల దిశగా తన పురోగతిని తెలియజేస్తూ హెచ్‌పీ తన సుస్థిర ప్రభావ నివేదిక 2023తో పాటు ఈ ఫలితాలను ఆవిష్కరించింది. టెక్నాలజీ అందుబాటును పెంచడానికి, నైపుణ్యాలను పెంపొందించడానికి సానుకూల సామాజిక ప్రభావం కోసం కృత్రిమ మేధను ఉపయోగించడానికి హెచ్‌పీ చేస్తున్న ప్రయత్నాలను నివేదికలో వివరించింది. ఈ అంశంపై స్వతంత్ర పరిశోధనలు జరిపేందుకు హెచ్‌పీ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్‌ను నియమించింది. 2023 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు నిర్వహించిన ఈ సర్వేలో అమెరికా, ఫ్రాన్స్, ఇండియా, యూకే, జర్మనీ, జపాన్, చైనా, మెక్సికో, బ్రెజిల్, కెనడా వంటి 10 దేశాలకు చెందిన 1,036 మంది బిజినెస్ లీడర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.భారత్‌లో ఉచిత ఏఐ శిక్షణ ఇవ్వనున్న హెచ్పీతన లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా తన డిజిటల్ బిజినెస్ స్కిల్స్ ‘హెచ్‌పీ లైఫ్’ ప్రోగ్రామ్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉచిత కృత్రిమ మేధ శిక్షణను మిళితం చేయాలని హెచ్‌పీ యోచిస్తోంది. వర్క్, సృజనాత్మక ప్రక్రియలను పెంచడానికి హెచ్‌పీ భారత్‌లో నెక్ట్స్ జనరేషన్ ఏఐ పీసీలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.అదనంగా 2030 నాటికి హెచ్‌పీ లైఫ్ ఉచిత నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమంలో 27.5 లక్షల మంది వినియోగదారులను నమోదు చేయాలనే తన లక్ష్యాన్ని హెచ్‌పీ విస్తరిస్తోంది. ఈ కార్యక్రమాన్ని హెచ్‌పీ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2016 నుంచి ఇప్పటికే 12 లక్షల మంది యూజర్లు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా భారత్ అత్యధికంగా కొత్త యూజర్లను కలిగి ఉంది.టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉండాలని హెచ్‌పీ గ్లోబల్ హెడ్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్, హెచ్‌పీ ఫౌండేషన్ డైరెక్టర్ మిషెల్ మాలెజ్కీ సూచించారు. డిజిటల్ ఎకానమీలో వృద్ధి చెందడానికి అవసరమైన సాధనాలను యాక్సెస్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. "పురోగతిని నడిపించడానికి సాంకేతికత ఒక గొప్ప శక్తివంతమైన సాధనం" అని మాలెజ్కీ పేర్కొన్నారు. -
మోదీ ప్రధాని అయినా, అవ్వకపోయినా అందులో మార్పులేదు: రాజన్
రానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని అయినా, అవ్వకపోయినా దేశ ఆర్థిక విధాన పథం కొనసాగుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ ప్రొఫెసర్ పనిచేస్తున్న ఆయన హాంకాంగ్‌లో జరుగుతున్న యూబీఎస్ ఆసియా ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు.ఈ సందర్భంగా బ్లూమ్‌బెర్గ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ మాట్లాడుతూ..‘భారతీయ ఆర్థిక విధాన పథం కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మరోసారి ప్రధాని అయినా, అవ్వకపోయినా ఆర్థిక వృద్ధిలో ఎలాంటి మార్పులుండవు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బడ్జెట్‌ను ప్రకటిస్తుంది. ఆ ప్రభుత్వం అందరికీ ఉపయోగపడే విధానాలను కొనసాగిస్తుంది. అధికారంలోకి వచ్చే ప్రభుత్వం భారత్‌లో మౌలిక సదుపాయాల నాణ్యతపై దృష్టి పెట్టాలి. పెట్టుబడి కేవలం ప్రధాన పారిశ్రామిక సంస్థలకు ప్రయోజనం చేకూర్చకుండా చూడాలి’ అని తెలిపారు.ఇదీ చదవండి: నెలకు రూ.4 కోట్లు అద్దె చెల్లించనున్న గూగుల్దేశంలో ఆరు వారాల పాటు జరిగే ఎన్నికలు జూన్ 1న ముగుస్తాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి. మోదీ సారథ్యంలోని భాజపా మూడోసారి అధికారంలోకి వస్తుందని అంచనాలున్నాయి. అయినప్పటికీ ఆశించిన మెజారిటీని సంపాదించగలదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో కొందరు పెట్టుబడిదారులు ప్రభుత్వ విధానాలపై ఆధారపడే ఆర్థిక సంస్కరణల నుంచి తప్పుకునే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆర్థిక విధానాల్లో ఎలాంటి మార్పు ఉండదని, భారత్ తన ఆర్థిక పథాన్ని కొనసాగిస్తుందని రాజన్ చెప్పడం పట్ల కొంత స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ అంచనా ప్రకారం భారత్ 2024-2026 మధ్యకాలంలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ.44.4 ట్రిలియన్లు ఖర్చు చేస్తుంది. ఇది 2030 నాటికి ఆర్థిక వృద్ధిని 9శాతానికి పెంచేందుకు సహకరిస్తుంది. -
2023–24లో 8% వృద్ధి: శక్తికాంతదాస్
న్యూఢిల్లీ: భారత్ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం వరకూ ఆర్థిక వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) చక్కటి వృద్ధి అవకాశాలకు భరోసా ఇస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ ఎకానమీ మూలాలు పటిష్టంగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ధరల కట్టడి ఆర్బీఐ ప్రధాన ప్రాధాన్యతగా పేర్కొన్నారు. భారత్ జీడీపీ అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో అంచనా (దాదాపు 7 శాతం)లను మించి 8.4 శాతంగా నమోదయ్యింది. అంతకుముందు రెండు త్రైమాసికాలకు సంబంధించి (ఏప్రిల్–సెపె్టంబర్) తొలి వృద్ధి అంకెలు వరుసగా 7.8 శాతం (క్యూ1), 7.6 శాతాలుగా (క్యూ2)నమోదయ్యాయి. అయితే ఈ అంకెలను ఎగువముఖంగా 8.2 శాతం, 8.1 శాతాలుగా జాతీయ గణాంకాల కార్యాలయం సవరించింది. దీనితో 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఎకానమీ 8.2 శాతం పురోగమించినట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 7.3 శాతం. -
అతిజాగ్రత్తతో వృద్ధికి ఆటంకం
న్యూఢిల్లీ: నియంత్రణ సంస్థలు జాగ్రత్త చర్యలు అతిగా అమలు చేస్తే ఆర్థిక వృద్ధికి ఆటంకం కలుగుతుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. రెగ్యులేటర్లు మరీ సంప్రదాయకంగా, అతిజాగ్రత్తగా వ్యవహరించకూడదన్నారు. అయితే, ఏ రంగంలోనైనా ‘ప్రమాదాలు’ చోటు చేసుకుంటే సత్వరం స్పందించే విధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కోటక్ ఈ విషయాలు తెలిపారు. ‘భారత్ భవిష్యత్తుపై నేను అత్యంత ఆశావహంగా ఉన్నాను. అదే సమయంలో తగిన జాగ్రత్త లేకుండా కేవలం అవకాశాలపైనే పూర్తిగా దృష్టి పెట్టి ముందుకెళ్లడమనేది రిసు్కతో కూడుకున్న వ్యవహారం. అలాగని, మరీ అతిగా జాగ్రత్త చర్యలు తీసుకుంటే మనం అక్కడికి (సంపన్న దేశం కావాలన్న లక్ష్యానికి) చేరుకోలేం‘ అని ఆయన పేర్కొన్నారు. వచ్చే 20–25 ఏళ్ల పాటు 7.5–8 శాతం జీడీపీ వృద్ధి రేటును కొనసాగించాలంటే సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని కోటక్ చెప్పారు. -
విశాఖ, విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం, విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్ పెడుతున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదరన్ రీజియన్ చైర్మన్ కమల్ బాలి తెలిపారు. ఈ రెండు నగరాలు ఆదర్శ నగరాలుగా, రాష్ట్ర వృద్ధి కేంద్రాలుగా ఎదగడానికి అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2047 నాటికి దక్షిణ భారతదేశాన్ని ఆర్థిక వృద్ధిపరంగా ప్రోత్సహించేందుకు సీఐఐ తొమ్మిది ఫోకస్డ్ ట్రాక్‌లను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రజలు–సంస్కృతి పునరుజ్జీవనం, సంపూర్ణ సుస్థిరత, డిజిటల్, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, టెక్ అడాప్షన్, స్టార్టప్ ఎకో సిస్టమ్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్స్‌లెన్స్, ఇండస్ట్రీ 4.0, ఇంటర్నేషనల్ లింకేజెస్, ఎంఎస్ఎంఈ వంటివి ఇందులో ఉన్నాయని వివరించారు. 2023–24 సంవత్సరానికి వృద్ధి, సుస్థిరత, నమ్మకం, ప్రపంచీకరణ అనే అంశాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. సేవల రంగానికి ప్రపంచవ్యాప్త గమ్యస్థానంగా భారత్ నిలుస్తోందని, అందువల్ల పలు ఫారచ్యన్ 500 కంపెనీలు దేశంలో తమ సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహకరించడానికి సీఐఐ కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ జాయింట్ కన్సల్టేటివ్ ఫోరంలు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను బలోపేతం చేయడం, వ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి నిర్దిష్ట సంస్కరణలు అమలు చేయడం, పారిశ్రామిక వృద్ధికి అనుకూల విధానాలను రూపొందించడానికి ప్రభుత్వ–పరిశ్రమల భాగస్వామ్యాలను సులభతరం చేయడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో తయారీ పెట్టుబడులను పెంచడానికి తమవంతు సహకరిస్తామని, ఎలక్ట్రానిక్ సిస్టం డిజైన్, తయారీ, డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో పెట్టుబడులకు అనుకూలంగా ఉందని వివరించారు. ప్రస్తుతం దేశంలోని మత్స్య ఎగుమతుల్లో ఏపీ అత్యధిక వాటాను కలిగి ఉందని తెలిపారు. సీఐఐ ఏపీ చైర్మన్ ఎం.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సముద్ర ఆహార ఉత్పత్తి, ఎగుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వారివెంట సీఐఐ రీజనల్ డైరెక్టర్ ఎన్ఎంపీ జయేష్ ఉన్నారు. -
India Corporates: Sector Trends 2024: ఆర్థిక వృద్ధితో కార్పొరేట్లకు అవకాశాలు
కోల్‌కతా: భారత బలమైన ఆర్ధిక వృద్ధి కార్పొరేట్ కంపెనీలకు డిమాండ్‌ను పెంచుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ‘ఇండియా కార్పొరేట్స్: సెక్టార్ ట్రెండ్స్ 2024’ పేరుతో నివేదికను విడుదల చేసింది. పెరుగుతున్న డిమాండ్, అదే సమయంలో ముడి సరుకుల ధరల ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టడం అన్నవి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ల మార్జిన్లను పెంచుతాయని తెలిపింది. స్థానికంగా బలమైన డిమాండ్ నేపథ్యంలో 2024–25లో జీడీపీ 6.5 శాతం వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్ధిక వ్యవస్థగా ఉంటుందని పేర్కొంది. అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన వాతావరణం, ఇటీవలి ద్రవ్య పరపతి కఠినతర విధానాలున్నప్పటికీ, భారత ఆర్ధిక వ్యవస్థ బలమైన పనితీరు కొనసాగుతుందని అంచనా వేసింది. సిమెంట్, ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుందని పేర్కొంది. మౌలిక సదుపాయాల మెరుగుదల సైతం స్టీల్ డిమాండ్‌కు ఊతంగా నిలుస్తుందని తెలిపింది. యూఎస్, యూరోజోన్‌లో వృద్ధి తగ్గిపోవడంతో భారత ఐటీ కంపెనీలు మోస్తరు వృద్ధికి పరిమితం కావాల్సి వస్తుందని పేర్కొంది. వాహన విక్రయాలు కంపెనీల ఆదాయాలను పెంచుతాయని తెలిపింది. -
స్టాక్స్.. రాకెట్స్!
ద్రవ్యోల్బణ, వడ్డీ రేట్ల పెంపు, భౌగోళిక– రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ సంవత్ 2079 దేశీ మార్కెట్లకు మొత్తం మీద సానుకూలంగానే ముగిసింది. గతేడాది దీపావళి నుంచి చూస్తే నిఫ్టీ 50 దాదాపు 9.5 శాతం పెరిగింది. పటిష్టమైన దేశ ఆర్థిక వృద్ధి ఊతంతో మార్కెట్లు కొత్త సంవత్ 2080లోనూ రాణిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రిసు్కలూ ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. భౌగోళిక–రాజకీయ అనిశి్చతి, క్రూడాయిల్ రేట్లతో పాటు దేశీయంగా సార్వత్రిక ఎన్నికలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల తీరుతెన్నులూ మొదలైన వాటిని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రాజకీయ అస్థిరతకు దారితీసేలా ఎన్నికల ఫలితాలు ఉన్నా, అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు పెరిగి బ్యారెల్‌కు 120 డాలర్ల స్థాయి దాటినా దేశీ మార్కెట్లకు కొంత రిసు్కలు తప్పవని ఈక్వినామిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు జి. చొక్కలింగం అభిప్రాయపడ్డారు. సెన్సెక్స్ 55,000 పాయింట్ల దిగువకు పడొచ్చని తెలిపారు. ఇలాంటివేమీ జరగని పక్షంలో దేశీ మార్కెట్లు 15 శాతం ఎగిసి సెన్సెక్స్ వచ్చే దీపావళి నాటికి 75,000 పాయింట్లకు చేరొచ్చని చెప్పారు. పసిడి 10 శాతం దాకా అప్ .. అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలతో పసిడి ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగానే పెరిగాయి. గత దీపావళి నుంచి ఇప్పటివరకు బంగారం రేటు దాదాపు 20 శాతం ఎగిశాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర రూ. 11,000 పైగా పెరిగి రూ. 61,000కు చేరింది. ఈ నేపథ్యంలో బంగారానికి ఫండమెంటల్స్ సానుకూలంగానే ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. కొత్త సంవత్‌లో సుమారు 8–10 శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత స్థాయి నుంచి పసిడి రేటు కాస్త కరెక్షన్‌కి లోను కావచ్చని, అయితే క్షీణత పరిమిత స్థాయిలోనే ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సజేజా అభిప్రాయపడ్డారు. రూ. 61,000 దిగువకు తగ్గడమనేది కొనుగోళ్లకు అవకాశంగా ఉంటుందని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరి ఇంక వడ్డీ రేట్లను పెంచకపోవడం వంటి పరిణామాలతో బంగారం రేట్లు వచ్చే దీపావళి నాటికి రూ. 65,000–67,000 స్థాయికి చేరొచ్చని.. రూ. 67,000 స్థాయిని కూడా తాకొచ్చని చెప్పారు. మరోవైపు, వెండి రేట్లు కూడా గతేడాది దీపావళి నుంచి చూస్తే దాదాపు 25 శాతం పెరిగాయి. కొత్త సంవత్‌లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి. వెండి 12–13 శాతం మేర పెరగొచ్చని సజేజా తెలిపారు. వచ్చే దీపావళి నాటికి ఎంసీఎక్స్‌లో వెండి రేటు కేజీకి రూ. 80,000గా ఉండొచ్చని, రూ. 82,000 స్థాయిని కూడా తాకే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోలార్ ప్యానెళ్లు, కొత్త గ్రీన్ టెక్నాలజీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగం కారణంగా పరిశ్రమల నుంచి వెండికి డిమాండ్ గణనీయంగా పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపారు. ఆసక్తికరంగా గ్లోబల్ ఎకానమీ .. సుదీర్ఘకాలం కొనసాగే అధిక వడ్డీ రేట్లు, బాండ్ ఈల్డ్‌లలో తీవ్ర ఒడిదుడుకులు, మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరల్లో హెచ్చుతగ్గులు మొదలైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో కొత్త సంవత్‌లోకి అడుగుపెడుతున్నాం. సంవత్ 2080లో గ్లోబల్ ఎకానమీ ఆసక్తికరంగా ఉండనుంది. దేశీ ఎకానమీకి అవకాశాలు ఆశావహంగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశి్చతిలో వృద్ధిపరంగా భారత్ సానుకూల స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో భారతీయ ఈక్విటీలకు ఇదే చోదకంగా ఉండగలదు. కార్పొరేట్ ఇండియా, బ్యాంకింగ్ వ్యవస్థ మెరుగ్గా ఉండటం సానుకూలాంశం. రెండంకెల స్థాయి ఆదాయాల వృద్ధి ఊతంతో భారతీయ ఈక్విటీలు వచ్చే 2–3 ఏళ్లలో డబుల్ డిజిట్ రాబడులు అందించేందుకు ఇవన్నీ తోడ్పడగలవు. – ప్రణవ్ హరిదాసన్, ఎండీ, యాక్సిస్ సెక్యూరిటీస్ యాక్సిస్ సెక్యూరిటీస్ టీవీఎస్ మోటర్ ప్రస్తుత ధర: 1,633 టార్గెట్ ధర: రూ. 2,100 దేశీయంగా మూడో అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ. వార్షికంగా 30 లక్షల పైచిలుకు టూవీలర్ల విక్రయాలు ఉంటున్నాయి. 60 పైగా దేశాలకు ఎగుమతి చేస్తూ రెండో అతి పెద్ద ఎగుమతిదారుగా కూడా ఉంది. కంపెనీకి దేశీయంగా నాలుగు, ఇండొనేషియాలో ఒక ప్లాంటు ఉంది. కొత్త ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియో, ఎగుమతులు, మార్కెట్ వాటాను పెంచుకునే సామరŠాధ్యలు మొదలైనవి సంస్థకు సానుకూలాంశాలు. భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర: 935.. టార్గెట్ ధర: రూ. 1,155 దేశీయంగా రెండో అతి పెద్ద టెలికం ఆప రేటరు. భారత్‌తో పాటు దక్షిణాసియా, ఆఫ్రికాలోని 18 దేశాలకు కార్యకలాపాలను విస్త రించింది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, మొబైల్ ఫోన్స్ వంటి మెరుగైన డిజిటల్ సరీ్వసుల పోర్ట్‌ఫోలియో ద్వారా దేశీయంగా పటిష్టమైన స్థితిలో ఉంది. పరిశ్రమలోనే అత్యంత మెరుగైన ఏఆర్పీయూ (సగటున ప్రతి యూజరుపై వచ్చే ఆదాయం) కలిగి ఉండటం, హోమ్ సెగ్మెంట్లో మెరుగుపడుతుండటం సానుకూలాంశాలు. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ప్రస్తుత ధర: 1,654 టార్గెట్ ధర: రూ. 1,950 స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్ విభాగంలో దిగ్గజంగా ఉంది. 4 ఉత్పత్తుల కేటగిరీలో 14 బ్రాండ్స్ ఉన్నాయి. 3.6 ఎంటీపీఏ ఉత్పత్తి సామర్ధ్యంతో దేశీయంగా స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్ రంగంలో 60 శాతం మార్కెట్ వాటా ఉంది. దేశవ్యాప్తంగా 800 పైచిలుకు డి్రస్టిబ్యూటర్లతో పటిష్టమైన పంపిణీ నెట్వర్క్ ఉంది. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్‌లు మొదలైన విభాగాల్లో డిమాండ్ నెలకొనడంతో కంపెనీ మరిన్ని ఆర్డర్లు దక్కించుకోగలుగుతోంది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 ఎంటీపీఏకి పెంచుకోవాలన్న లక్ష్యం, దీర్ఘకాలికంగా వృద్ధికి తోడ్పడగలదు. జ్యోతి ల్యాబ్స్ ప్రస్తుత ధర: 414.. టార్గెట్ ధర: రూ. 440 1983లో ఉజాలా ఫ్యాబ్రిక్ వైట్నర్ అనే సింగిల్ ప్రోడక్ట్ కంపెనీగా ఏర్పాటైంది. ఆ తర్వాత మరిన్ని విభాగాల్లోకి విస్తరించింది. 2011–12లో హెంకో, మిస్టర్ వైట్, ప్రిల్, మార్గో వంటి బ్రాండ్స్ ఉన్న హెంకెల్ ఇండియాను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫ్యాబ్రిక్ కేర్, డిష్వాíÙంగ్, వ్యక్తిగత సంరక్షణ, లాండ్రీ సర్వీసులు మొదలైన వివిధ విభాగాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. ప్రీమియం ఉత్పత్తులు, విస్తృతమైన టాయ్‌లెట్ సోప్స్ పోర్ట్‌ఫోలియో ఆవిష్కరణ, వ్యయ నియంత్రణ చర్యల అమలు మొదలైనవి సంస్థకు సానుకూలాంశాలు. స్మాల్, మిడ్‌క్యాప్ కన్జూమర్ ప్రోడక్టుల విభాగంలో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కేపీఐటీ టెక్నాలజీస్ ప్రస్తుత ధర: 1,369 టార్గెట్ ధర: రూ. 1,500 ఇంజినీరింగ్, రీసెర్చ్, డెవలప్మెంట్ (ఈఆర్అండ్డీ) సేవలు అందిస్తోంది. దాదాపు అన్ని దిగ్గజ తయారీ సంస్థలకు డిజైన్, డెవలప్మెంట్ సరీ్వసులు ఇస్తోంది. అలాగే ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహనాల విభాగాల్లో ప్రోడక్ట్ డెవలప్మెంట్ కార్యకలాపాల్లోనూ పాలుపంచుకుంటోంది. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా డిజిటల్ ఇంజినీరింగ్‌పై చేసే వ్యయాలు పెరుగుతుండటం కేపీఐటీ టెక్నాలజీస్‌కి కలిసొచ్చే అంశం. అంతర్జాతీయంగా దిగ్గజ బ్రాండ్ల నుంచి పలు దీర్ఘకాలిక కాంట్రాక్టులు చేతిలో ఉండటం సంస్థకు సానుకూలంగా ఉండగలదు. ఎస్బీఐ సెక్యూరిటీస్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 938 టార్గెట్ ధర రూ. 1,081 దేశీయంగా ప్రైవేట్ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్. 6,248 పైచిలుకు శాఖలు, దాదాపు 16,927 ఏటీఎంలు, సీఆర్ఎం నెట్‌వర్క్‌లు ఉన్నాయి. లోన్ బుక్‌లో సుమారు 55 శాతం రిటైల్ రుణాలు ఉన్నాయి. అనుబంధ సంస్థల ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స, స్టాక్ బ్రోకింగ్, ఏఎంసీ వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహిస్తోంది. మారుతీ సుజుకీ ప్రస్తుత ధర రూ. 10,391 టార్గెట్ ధర రూ. 12,000 దేశీయంగా కార్ల తయారీకి సంబంధించి అతి పెద్ద కంపెనీ. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తోంది. కార్ల మార్కెట్లో సింహభాగం వాటా కలిగి ఉంది. 90 పైగా దేశాలకు ఎగుమతులు కూడా చేస్తోంది. అల్ట్రాటెక్ సిమెంట్ ప్రస్తుత ధర: 8,720 టార్గెట్ ధర: రూ. 9,800 ఇది దేశీయంగా 25 శాతం మార్కెట్ వాటాతో అతి పెద్ద సిమెంటు తయారీ సంస్థ. దేశవ్యాప్తంగా 132.5 మిలియన్ టన్నుల వార్షికోత్పత్తి స్థాపిత సామర్ధ్యం ఉంది. భవన నిర్మాణ మెటీరియల్స్ కూడా విక్రయిస్తోంది. సొంత అవసరాల కోసం సున్నపురాయి, బొగ్గు గనులు ఉన్నాయి. ఉత్పత్తి వ్యయాలు తక్కువ స్థాయిలో ఉండటానికి ఇది దోహదపడుతోంది. పాలీక్యాబ్ ఇండియా ప్రస్తుత ధర: 5,137 టార్గెట్ ధర:5,877 భారత్‌లో అతి పెద్ద కేబుల్, వైర్ల తయారీ సంస్థ. ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, ఎల్ఈడీ లైటింగ్, స్విచ్చులు, స్విచ్‌గేర్, సోలార్ ఉత్పత్తులు, యాక్సెసరీలు వంటి ఎఫ్ఎంఈజీ (ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్) ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది. కళ్యాణ్ జ్యుయలర్స్ ప్రస్తుత ధర: 338 టార్గెట్ ధర:రూ. 364 భారత్‌లో అతి పెద్ద జ్యుయలరీ కంపెనీల్లో ఒకటి. పసిడి, ఇతరత్రా జ్యుయలరీ ఉత్పత్తులను వివిధ ధరల శ్రేణిలో విక్రయిస్తోంది. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు మొదలుకుని రోజువారీ ధరించే ఆభరణాలు మొదలైన వాటిని విక్రయాల్లో గణనీయ వృద్ధి కనపరుస్తోంది. స్టాక్స్‌బాక్స్ అశోకా బిల్డ్‌కాన్ ప్రస్తుత ధర: రూ. 139 టార్గెట్ ధర: రూ. 163 దేశీయంగా 20 రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ కార్యకలాపాలు ఉన్నాయి. రహదారులు, పవర్, రైల్వేస్ వంటి వివిధ రంగాల నుంచి ఆర్డర్లు పొందుతోంది. సెపె్టంబర్ 30 నాటికి ఆర్డర్ బుక్ రూ. 17,566 కోట్ల స్థాయిలో ఉంది. సీజీడీ వ్యాపారం, రోడ్డు ప్రాజెక్ట్ ఎస్వీవీల్లో వాటాల విక్రయం ద్వారా వచ్చే నిధులతో కన్సాలిడేటెడ్ రుణభారం రూ. 5,616 కోట్ల మేర తగ్గనుంది. భారీ ఆర్డర్లు, అధునాతన టెక్నాలజీ, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలిగే సామర్థ్యాల కారణంగా కంపెనీ మెరుగ్గా రాణించగలదనే అంచనాలు ఉన్నాయి. కోల్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 323 టార్గెట్ ధర: రూ. 370 భారత్ ఇంధన భద్రతను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో బొగ్గుకు డిమాండ్ గణనీయంగా పెరగనుంది. దానికి తగ్గట్లుగా 2025–26 లో 1 బిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలని సంస్థ నిర్దేశించుకుంది. ఇందుకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకోవడం సానుకూలాంశం. కోల్గేట్–పామోలివ్ (ఇండియా) ప్రస్తుత ధర: 2,106.. టార్గెట్ ధర: రూ. 2,500 ప్రస్తుతం కంపెనీ ప్రీమియం ఉత్పత్తుల వాటా దంత సంరక్షణలో 14 శాతం, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో 25 శాతంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో వ్యాపార వృద్ధికి, మార్జిన్లు మెరుగుపడటానికి వీటిపై మరింతగా దృష్టి పెట్టాలని కొత్త మేనేజ్మెంట్ భావిస్తోంది. గత త్రైమాసికంలో గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ కూడా కోలుకోవడం సంస్థకు సానుకూలాంశాం. పురవంకర ప్రస్తుత ధర: రూ. 147 టార్గెట్ ధర: రూ. 176 ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో అమ్మకాలు ఏకంగా 109 శాతం ఎగిసి రూ. 2,725 కోట్లకు చేరాయి. రాబోయే త్రైమాసికాల్లో ప్రాజెక్టుల డెలివరీలు పెరిగే కొద్దీ స్థూల లాభాల మార్జిన్లు మరింత మెరుగుపడగలవని సంస్థ అంచనా వేస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం 2047 నాటికి 5.8 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి విస్తరిస్తుందని, జీడీపీలో రియల్టీ వాటా 7.3 శాతం నుంచి 15.5 శాతానికి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధి అవకాశాలూ మెరుగ్గా ఉండనున్నాయి. భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర: 935 టార్గెట్ ధర: రూ. 1,106 పరిశ్రమలోనే అత్యధికంగా ఏఆర్పీయూ (సగటున ప్రతి యూజరుపై ఆదాయం) నమోదు చేస్తోంది. టారిఫ్‌ల పెంపు, యూజర్లు పెరుగుతుండటం మొదలైనవి సానుకూలాంశాలు. 2జీ నుంచి 4జీకి మళ్లే వారు పెరుగుతుండటం, టారిఫ్‌ల పెంపుతో ఏఆర్పీయూ మరింతగా పెరిగే అవకాశాలు ఉండటం తదితర అంశాలు సంస్థ వృద్ధికి తోడ్పడనున్నాయి. కోటక్ సెక్యూరిటీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 2,314 టార్గెట్ ధర రూ. 2,725 కీలక రంగాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. నెట్వర్క్ విస్తరణ దాదాపు పూర్తి కావొస్తుండటంతో అందరి దృష్టి ఇప్పుడు 5జీ వైపు మళ్లనుంది. సబ్‌్రస్కయిబర్స్ పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో టారిఫ్‌లను కూడా పెంచే అవకాశం ఉంది. జూన్ క్వార్టర్‌తో పోలిస్తే నికర రుణం దాదాపు రూ. 9,000 కోట్ల మేర తగ్గింది. కెనరా బ్యాంకు ప్రస్తుత ధర రూ. 387 టార్గెట్ ధర రూ. 425 కెనరా బ్యాంకు అసెట్ క్వాలిటీ మెరుగుపడటం కొనసాగుతోంది. రుణ వృద్ధి ఆరోగ్యకరమైన 12 శాతం స్థాయిలో నమోదైంది. క్రెడిట్ వ్యయాలు తగ్గుతుండటంతో గత కొద్ది త్రైమాసికాలుగా బ్యాంకు ఆర్‌వోఈ కూడా మెరుగుపడింది. అదనంగా, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే డిస్కౌంటు ధరకి ట్రేడవుతోంది. సిప్లా ప్రస్తుత ధర రూ. 1,240 టార్గెట్ ధర రూ. 1,320 సిప్లా వరుసగా మూడో త్రైమాసికంలోనూ పటిష్టమైన పనితీరు కనపర్చింది. నియంత్రణ సంస్థలపరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా 2023–26 మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదికన 20 శాతం ఈపీఎస్ సాధించే అవకాశం ఉంది. దేశీయ, అమెరికా జనరిక్స్ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి పెడుతుండటం సానుకూలాంశాలు. ప్రమోటర్లు వాటాను విక్రయించే అవకాశం పరిశీలించతగిన అంశం. సైయంట్ ప్రస్తుత ధర రూ. 1,659 టార్గెట్ ధర రూ. 2,000 ఏరోస్పేస్, ఆటోమోటివ్, సస్టెయినబిలిటీ విభాగాల్లో భారీగా డిమాండ్ ఉంటుందని సైయంట్ అంచనా వేస్తోంది. వార్షికంగా సెపె్టంబర్ క్వార్టర్లో ఆర్డర్లు 40 శాతం పెరిగాయి. నికర లాభాల్లో 50 శాతాన్ని డివిడెండుగా ఇచ్చే ధోరణిని సైయంట్ కొనసాగించవచ్చు. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ ప్రస్తుత ధర రూ. 210 టార్గెట్ ధర రూ. 276 సెపె్టంబర్ క్వార్టర్లో పీసీబీఎల్ (ఫిలిప్స్ కార్బన్ బ్లాక్) అత్యధిక అమ్మకాలు సాధించింది. స్పెషాలిటీ బ్లాక్ కోసం డిమాండ్ నెలకొనడంతో కొత్త కస్టమర్లు జతవుతున్నారు. కొత్త ప్రోడక్ట్ గ్రేడ్లను ప్రవేశపెడుతోంది. అత్యంత నాణ్యమైన స్పెషాలిటీ బ్లాక్ అమ్మకాలతో మార్జిన్లకు మద్దతు లభించనుంది. చెన్నైలోని 1.47 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ప్లాంటు తుది దశ పనులు పూర్తి చేసింది. -
వృద్ధి బలపడుతుంది...
ముంబై: భారతదేశంలో ఆర్థిక వృద్ధి బలంగా పుంజుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దేశీయంగా ఉన్న అంతర్గత పరిస్థితులు, వివేకవంతమైన పాలసీ విధానాలతో ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోకి వస్తోందని భరోసాను ఇచ్చారు. టోక్యోలో ట్యోక్యో చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భారత్ ఎకానమీపై ఆయన మాట్లాడుతూ ఆర్బీఐ అన్ని సవాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉందని, ద్రవ్య విధానం ద్రవ్యోల్బణం కట్టడికి, వృద్ధికి తోడ్పడుతుందని కూడా చెప్పారు. 2 శాతం ప్లస్ లేదా మైనస్లతో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగేలా చర్యలు ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. సుపరిపాలన, సమర్థవంతమైన పర్యవేక్షణ, నైతిక ప్రవర్తన, రిస్క్ మేనేజ్మెంట్పై దృష్టి సారించడం భారత్ దృష్టి సారించడం జరిగిందన్నారు. సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ (ఎస్ఆర్ఓ) ద్వారా ఫిన్‌టెక్‌లు తమకుతాము స్వీయ–నియంత్రణను పాటించేలా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతోందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ భారత్ ఎకానమీ పటిష్టంగా కొనసాగుతోందన్నారు. -
అధిక రాబడులు ఆశించే వారికి బెస్ట్ ఆప్షన్
భారత ఆర్థిక వ్యవస్థ 6 శాతంపైనే వృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ, రేటింగ్ ఏజెన్సీలతోపాటు ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ అంచనా వేస్తున్నాయి. ఈ దశాబ్దం భారత్‌దే అని ఘంటాపథంగా చెబుతున్నాయి. ఆర్థిక వృద్ధి వేగవంతం అయితే ఎక్కువగా లాభపడేది చిన్న, మధ్య స్థాయి కంపెనీలే. ఎందుకంటే ఇవి పెద్ద మొత్తంలో వ్యాపార అవకాశాలను సొంతం చేసుకుంటాయి. కనుక దీర్ఘకాలానికి అధిక రాబడులు ఆశించే వారు, రిస్క్ భరించే సామర్థ్యం ఉన్నట్టు అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. మిడ్‌క్యాప్ విభాగంలో కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ పథకం మెరుగైన పనితీరు చూపిస్తోంది. రాబడులు ఈ పథకం మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటుంది. దీర్ఘకాలంలో పనితీరును గమనించినట్టయితే రాబడులు మెరుగ్గా కనిపిస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 18 శాతానికి పైగా రాబడులు వచ్చాయి. గడిచిన మూడేళ్లలో 29 శాతం, ఏడేళ్లలో 16 శాతం, పదేళ్లలో 22 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చి.. మిడ్‌క్యాప్ విభాగంలోని మెరుగైన పథకాల్లో ఒకటిగా నిలిచింది. మిడ్‌క్యాప్ విభాగం సగటు రాబడులతో పోల్చి చూసినప్పుడు మూడేళ్లు, ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో ఈ పథకమే అధిక రాబడులను అందించింది. కోటక్ మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తున్న ఏకైక మిడ్‌క్యాప్ పథకం ఇదే. బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ టీఆర్ఐతో పోల్చి చూసినప్పుడు ఏడాది, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో ఈ పథకమే మెరుగైన పనితీరు చూపించింది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో కనీసం 65 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులను మిడ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. ఎంతో వృద్ధికి అవకాశం ఉన్న ఆణిముత్యాల్లాంటి కంపెనీలను ఈ పథకం గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. వ్యాల్యూ స్టాక్స్‌ను సైతం పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవడాన్ని గమనించొచ్చు. మంచి స్టాక్స్‌ను గుర్తించడమే కాదు.. తగిన రాబడులు ఇచ్చే వరకు పోర్ట్‌ఫోలియోలో కొనసాగిస్తుంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం నిర్వహణలో రూ.33,918 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోను గమనించినట్టయితే.. 94.27 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లో 71 శాతం మిడ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 27 శాతం ఇన్వెస్ట్ చేయగా, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 2 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 80 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. ఈ రంగాలకు చెందిన కంపెనీలకు 19 శాతం కేటాయింపులు చేసింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 13 శాతం పెట్టుబడులు ఉన్నాయి. మెటీరియల్స్ కంపెనీల్లో 11 శాతం, కెమికల్స్ కంపెనీల్లో 10 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషనరీ కంపెనీల్లో 10 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. హెల్త్‌కేర్ కంపెనీల్లో 6 శాతం వరకు పెట్టుబడులు ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్ విభాగంలో ఆటుపోట్లు ఎక్కువ. కనుక రిస్క్ భరించే వారే ఈ తరహా పథకాలను పరిగణనలోకి తీసుకోవాలి. -
వృద్ధిలో రత్నాలు–ఆభరణాల రంగం కీలకం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనలో రత్నాలు, ఆభరణాల రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం అన్నారు. అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ రత్నాలు, ఆభరణాల ఎగుమతులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘రత్నాలు– ఆభరణాల రంగం ప్రభుత్వానికి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లిస్తుంది. ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుంది’’ అని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి పేర్కొన్నారు. భారత్ ఆభరణాల తయారీదారులు అంతర్జాతీయ మార్కెట్లలో సమస్యలను ఎదుర్కొంటున్నారని గడ్కరీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే తమ ఆభరణాల రూపకల్పనను మెరుగుపరచడం ద్వారా తయారీదారులు, వ్యాపారులు ప్రపంచ వజ్రాభరణాల వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించగలరన్న విశ్వాసాన్ని గడ్కరీ వ్యక్తం చేశారు. 15–22 తేదీల్లో షాపింగ్ ఫెస్టివల్ కాగా, ఆభరణాల తయారీదారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లు, ఎగుమతిదారుల అత్యున్నత స్థాయి మండలి– జీజేసీ అక్టోబర్ 15 నుంచి 22వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా 300 నగరాల్లో జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. -
యూరప్ ఎకనమిక్ అవుట్‌లుక్ అధ్వాన్నం
ఫ్రాంక్ఫర్ట్: యూరోపియన్ యూనియన్ ఈ సంవత్సరం, వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించింది. తీవ్ర ద్రవ్యోల్బణంతో వినియోగదారులు వ్యయాలకు సుముఖత చూపడం లేదని, అధిక వడ్డీ రేట్లు పెట్టుబడికి అవసరమైన రుణాన్ని పరిమితం చేస్తున్నాయని యూరోపియన్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సంబంధిత వర్గాల కథనం ప్రకారం, ఈయూ ప్రాంతంలో మాంద్యం భయాలు పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలోకి తీసుకురావాలనే లక్ష్యంతో వడ్డీరేట్లు మరింత పెంచాలా? వద్దా? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తాజా ప్రకటన ప్రకారం, 2023లో యూరో కరెన్సీ వినియోగిస్తున్న 20 దేశాల వృద్ధి రేటు క్రితం అంచనా 1.1 శాతం నుంచి 0.8 శాతానికి తగ్గించడం జరిగింది. వచ్చే ఏడాది విషయంలో ఈ రేటు అంచనా 1.6 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గింది. 27 దేశాల ఈయూ విషయంలో ఈ రేటును 2023కు సంబంధించి 1 శాతం నుంచి 0.8 శాతానికి, 2024లో 1.7 శాతం నుంచి 1.4 శాతానికి తగ్గించడం జరిగింది. రష్యా–యుక్రేయిన్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా నుంచి క్రూడ్ దిగుమతులపై ఆంక్షలు యూరోపియన్ యూనియన్‌లో తీవ్ర ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. -
‘2047 నాటికి వికాస్ భారత్’ తథ్యం
న్యూఢిల్లీ/గాంధీనగర్: సమాన, సమ్మిళిత అభివృద్ధిని సాధించే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రగతి విషయంలో భారత్ నూతన శకంలోకి ప్రవేశిస్తోందంటూ వెలువడిన పలు నివేదికలను ఆయన ప్రస్తావించారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందంటూ నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ శుక్రవారం లింక్డ్ఇన్లో పోస్టు చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఎస్బీఐ రీసెర్చ్, జర్నలిస్టు అనిల్ పద్మనాభన్ విడుదల చేసిన నివేదికల గురించి ప్రస్తావించారు. గత తొమ్మిదేళ్లలో ప్రజల ఆదాయం భారీగా పెరిగినట్లు ఈ నివేదికలు చెబుతున్నాయని వెల్లడించారు. ఆదాయపు పన్ను రిటర్న్‌లు(ఐటీఆర్) దాఖలు చేసేవారి సంఖ్య పెరుగుతోందని గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్‌లో 2014 జూన్‌లో 1.65 లక్షల ఐటీఆర్‌లు దాఖలు కాగా, 2023 జూన్‌లో 11.92 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని వివరించారు. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ లాంటి చిన్నరాష్ట్రాల్లోనూ ఐటీఆర్‌ల సంఖ్య తొమ్మిదేళ్లలో 20 శాతం పెరిగిందన్నారు. దేశ ఉమ్మడి ప్రయత్నాలనే కాదు, దేశ శక్తిసామర్థ్యాలను సైతం ఈ నివేదికలు బహిర్గతం చేస్తున్నాయని ప్రధానమంత్రి వివరించారు. ‘2047 నాటికి వికాస్ భారత్’ అనే లక్ష్యాన్ని మనం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరో హెల్త్ ఎమర్జెన్సీకి సిద్ధం కావాలి ప్రజల సంక్షేమం కోసం నవీన ఆవిష్కరణలను, సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని మోదీ సూచించారు. శుక్రవారం గుజరాత్ రాజధాని గాం«దీనగర్‌లో జరిగిన జీ20 దేశాల ఆరోగ్య శాఖ మంత్రుల సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. మరో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధం కావాలని చెప్పారు. గడువు కంటే ముందే భారత్‌లో ప్రజల భాగస్వామ్యంతో క్షయవ్యాధిని(టీబీ) పూర్తిగా అరికట్టబోతున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాలు ఒక ఉమ్మడి వేదికపై రావాలని ఆకాంక్షించారు. డిజిటల్ విధానాలు, నూతన ఆవిష్కరణలతో ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావొచ్చని అభిప్రాయపడ్డారు. కోవిడ్ మహమ్మారి నుంచి పాఠాలు నేర్చుకోవాలని, అలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజా ఉద్యమంగా అభివృద్ధి కార్యక్రమాలు న్యూఢిల్లీ: దేశంలో అభివృద్ధి కార్యక్రమాలను ఒక ప్రజా ఉద్యమంగా నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీకి చెందిన జిల్లా పంచాయతీ సభ్యులకు పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్‌ను సౌభాగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దుకోవాలని, ఇందుకోసం ప్రతి గ్రామంలో, ప్రతి తహసీల్ పరిధిలో, ప్రతి జిల్లాలో అభివృద్ధి దీపం వెలిగించాలని ఉద్బోధించారు. శుక్రవారం గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల బీజేపీ స్థానిక సంస్థల సభ్యులు పాల్గొన్న ‘క్షేత్రీయ పంచాయతీరాజ్ పరిషత్’ శిక్షణా కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ అనేది కేవలం ఒక నినాదం కాదని, ప్రతిక్షణం ప్రగతి కోసం, ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. స్థానిక సంస్థల్లో వేర్వేరు హోదాల్లో ఉన్నవారు గ్రామాలు, జిల్లాల్లో పనులను ప్రాధాన్యతాక్రమంలో చేపట్టాలని అన్నారు. ప్రజల మద్దతుతో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలని వివరించారు. స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు పెరుగుతోందని, వనరుల కొరత లేదని వెల్లడించారు. గ్రాంట్ కింద గతంలో రూ.70,000 కోట్ల కేటాయింపులు జరిగేవని, ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకుపైగానే ఇస్తున్నారని తెలిపారు. దేశంలో తమ ప్రభుత్వం వచ్చాక 30,000కుపైగా జిల్లా పంచాయతీ భవనాలు నిర్మించామని గుర్తుచేశారు. ఉపాధి హామీ నిధులతో పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాల్లో ఆస్తులను సృష్టించాలని కోరారు. ‘పీఎం విశ్వకర్మ’ను విజయవంతం చేయాలి బీజేపీ స్థానిక సంస్థల సభ్యులకు శిక్షణ ఇవ్వడానికి మరిన్ని వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. ఇవి ఎన్నికల్లో గెలవడానికి కాదని, 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవడానికేనని స్పష్టం చేశారు. ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని కోరారు. గ్రామాల్లో సంప్రదాయ వృత్తిదారులను గుర్తించాలని, అర్హులతో జాబితాలు తయారు చేయాలని అన్నారు. సంప్రదాయ వృత్తిదారులు గ్రామాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారని ప్రశంసించారు. వారు తమ పనులను సామాజిక బాధ్యతగా నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. సంప్రదాయ వృత్తిదారుల సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయిస్తున్నామని తెలిపారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని సెపె్టంబర్ 17న ప్రారంభిస్తామని మోదీ పునరుద్ఘాటించారు. -
ట్రాఫిక్‌తో ఏటా బెంగళూరుకు రూ.20 వేల కోట్ల నష్టం
బెంగళూరు: తీవ్రమైన ట్రాఫిక్ సమస్యల కారణంగా బెంగళూరు నగరం ఏటా రూ.20 వేల కోట్ల మేర నష్టపోతోందని ఓ అధ్యయనంలో తేలింది. ‘నగర ఉత్పాదకత, ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఉత్పాదకత గణనీయంగా తగ్గి, చిన్న, మధ్య తరహా సంస్థల రవాణా అవసరాలు ఆలస్యమవుతున్నాయి. ఇందుకు కాలుష్య సమస్య కూడా తోడవుతోంది’అని ఆ అధ్యయనం తెలిపింది.చాలా ఏళ్లుగా బెంగళూరు నగరం తీవ్ర ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతోంది. నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాలు సరిగ్గానే ఉన్నప్పటికీ నష్టాలను చవిచూస్తోందని ట్రాఫిక్ నిపుణుడొకరు చేపట్టిన ఈ అధ్యయనం పేర్కొంది. ట్రాఫిక్ జామ్ సమస్య కారణంగా ఎక్కువగా నష్టపోయేది బెంగళూరుకు ఆర్థిక దన్నుగా నిలుస్తున్న ఐటీ రంగమేనని తేల్చింది. ఉద్యోగులు తమ విలువైన సమయాన్ని ట్రాఫిక్ సమస్యలతోనే గడుపుతున్నారని కూడా వివరించింది. ట్రాఫిక్ సంబంధ కారణంగా ఒక్క ఐటీ రంగమే సుమారు రూ.7 వేల కోట్ల మేర ఏటా నష్టపోతోందని తెలిపింది. పౌరులు కూడా నాణ్యమైన జీవితాన్ని గడపలేకపోతున్నారని పేర్కొంది. అధ్యయనంలో భాగంగా రోడ్ ప్లానింగ్, ఫ్లై ఓవర్లు, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపా యాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు పలు సూచనలు చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, కొన్ని ప్రాంతాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ చార్జీలు వసూలు చేయడం(కంజెషన్ ప్రైసింగ్), కార్‌పూలింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. కెమెరాలు, సెన్సార్ వ్యవస్థలను నెలకొల్పి, ఎక్కువ మంది ట్రాఫిక్ సిబ్బందిని నియమించి నిబంధనలను అమలు చేయడం, మెట్రోలు, ప్రభుత్వ బస్సు సర్వీసులు నడిపేందుకు భూగర్భమార్గాల ఏర్పాటు కూడా ఇందులో ఉన్నాయి. ప్రభుత్వం, పౌర సంస్థలు, పౌరులు కలిసి కట్టుగా పనిచేసి రహదారులపై భారం తగ్గించొచ్చని తెలిపింది. -
కశ్మీర్లో జీ–20 సన్నాహకం షురూ
శ్రీనగర్: పాకిస్తాన్ పెడబొబ్బలను, చైనా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ జమ్మూ కశ్మీర్లో జీ–20 సన్నాహక సదస్సు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం మొదలైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో చైనా మినహా అన్ని సభ్య దేశాల ప్రతినిధులూ పాల్గొన్నారు. పర్యాటక రంగం తదితరాలపై వారంతా లోతుగా చర్చించనున్నారు. వారికి సంప్రదాయ రీతిలో ఘనస్వాగతం లభించింది. తొలి రోజు ‘ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక పరిరక్షణకు సినీ టూరిజం’ అంశంపై చర్చ జరిగింది. అనంతరం ప్రతినిధులంతా చారిత్రక దాల్ సరస్సులో బోట్ షికారు చేస్తూ కశ్మీర్ అందాలను ఆస్వాదించారు. కేంద్రం త్వరలోనే నూతన జాతీయ పర్యాటక విధానాన్ని ప్రకటిస్తుందని కేంద్ర సాంస్కృతి పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గ్లోబల్ టూరిజం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను కూడా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకానికి కశ్మీర్లో అద్భుతమైన అవకాశాలున్నాయని మీడియా తో చెప్పారు. పర్యాటకాభివృద్ధికి వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతిస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ భాగస్వామ్యం లేకుండా ప్రపంచ స్థాయికి చేరుకోలేమన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. హర్తాళ్ పిలుపులు గత చరిత్ర కశ్మీర్ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని, మునుపటి లాగా బంద్ పిలుపులకు స్పందించడం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘గతంలో కశ్మీర్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పాక్ నుంచి వచ్చిన పిలుపుతో దుకాణాలు మూతబడేవి. ఇప్పుడు మాత్రం హర్తాళ్ చేపట్టాలంటూ ఎవరు పిలిపిచ్చినా పట్టించుకోవడం లేదు. ఉగ్రవాదం కారణంగా ఇప్పటికే రెండు తరాలు నష్టపోయిన విషయం ప్రజలు తెలుసుకున్నారు. అభివృద్ధి బాటన ముందుకు సాగాలనుకుంటున్నారు’’ అని అన్నారు. పర్యాటక రంగం ద్వారా ఉపాధికి కశ్మీర్లో ఎన్నో అవకాశాలున్నాయన్నారు. -
5జీకి భారత్ సారథ్యం
న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి సాధనలో ఏ దేశానికైనా పటిష్టమైన డిజిటల్ వ్యవస్థ అత్యంత కీలకంగా ఉంటోందని అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈవోలు తెలిపారు. ఇందుకు ఊతమిచ్చే 5జీ సేవల విస్తరణ విషయంలో మిగతా దేశాలకు భారత్ సారథ్యం వహించగలదని వారు అభిప్రాయపడ్డారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న సందర్భంగా వారు ఈ విషయాలు తెలిపారు. భారత్ ఒక క్రమపద్ధతిలో డిజిటల్ వ్యవస్థను రూపొందించుకుంటోందని నోకియా కార్పొరేషన్ ప్రెసిడెంట్ పెకా లుండ్‌మార్క్ తెలిపారు. భారత్ తమకు ఇప్పుడు రెండో అతి పెద్ద మార్కెట్ అని, ఇక్కడి నుంచి 5జీ బేస్ స్టేషన్లను తాము ఎగుమతి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికా, చైనాలో ఫేస్బుక్, టెన్సెంట్ వంటి డిజిటల్ కంపెనీల అభివృద్ధిలో 4జీ కీలకపాత్ర పోషించిందని ఎరిక్సన్ ప్రెసిడెంట్ బోర్జే ఎకోమ్ తెలిపారు. దేశీయంగా 5జీ సేవల వేగవంతమైన విస్తరణతో భారత్‌లో అత్యంత ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ చౌకగా లభించేలా అంతర్జాతీయ స్థాయిలో నిర్దిష్ట ప్రమాణాలు రూపొందించాల్సిన అవసరం ఉందని నోకియా, ఎరిక్సన్ చీఫ్‌లు అభిప్రాయపడ్డారు. లేకపోతే గ్రామీణ ప్రజానీకం, అంతర్జాతీయ ఎకానమీని డిజిటల్‌గా అనుసంధానం చేయడం కష్టమవుతుందని పేర్కొన్నారు. 100 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు .. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్ దేశాల్లో ఒకటిగా భారత్ ఉంటోందని జనరల్ అట్లాంటిక్ (ఇండియా) ఎండీ సందీప్ నాయక్ తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే పదేళ్లలో భారత్‌లోకి 100 బిలియన్ డాలర్ల పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లోకి వెల్లువెత్తుతున్న ప్రైవేట్ పెట్టుబడులను బట్టి చూస్తే ఇవి ఒక మోస్తరు అంచనాలు మాత్రమేనని నాయక్ వివరించారు. మొబైల్స్ భద్రత కోసం కొత్త నిబంధనలు పరిశ్రమ వర్గాలతో కేంద్రం సంప్రదింపులు యూజర్ల డేటా దుర్వినియోగం, ప్రీ–ఇన్స్టాల్డ్ నిఘా యాప్‌లపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్ల భద్రతా ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చడంపై కేంద్రం దృష్టి సారించింది. దీనికి సంబంధించి కొత్త నిబంధనల రూపకల్పనపై పరిశ్రమవర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఒక ట్వీట్లో ఈ విషయాలు వెల్లడించింది. ‘అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్స్ సరఫరా వ్యవస్థలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్లు, యాప్‌ల భద్రత చాలా కీలకంగా ఉండబోతోంది. అందుకే తగు స్థాయిలో భద్రతా ప్రమాణాలను రూపొందించేందుకు పరిశ్రమ వర్గాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది‘ అని పేర్కొంది. మరోవైపు, డేటా దుర్వినియోగాన్ని అరికట్టే విషయంలో తాము కూడా ప్రభుత్వ పక్షానే ఉన్నామని మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థలు తెలిపాయి. అయితే, ఈ ప్రక్రియకు సుదీర్ఘ సమయం పడితే కొత్త హ్యాండ్‌సెట్స్‌ను ప్రవేశపెట్టడంలో జాప్యం జరుగుతుందని, అలాగే ప్రీ–ఇన్స్టాల్డ్ (ముందుగానే ఇన్స్టాల్ చేసిన) యాప్స్ ద్వారా వచ్చే ఆదాయంపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. -
పొదుపు కాదు ఖర్చు చేసుకో!
సాక్షి, అమరావతి: ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి పొదుపు కంటే ఖర్చులను ప్రోత్సహించే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పొదుపు చేసే వారికంటే ఖర్చు చేసే వారికే పన్ను ప్రయోజనాలను కల్పిస్తూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సెక్షన్ 80సీ, గృహ రుణంపై వడ్డీ చెల్లింపులు, హెచ్ఆర్ఏ వంటి పన్ను మినహాయింపులు కోరని వారికి కనీస ఆదాయ పరిమితి పెంచడంతో పాటు ట్యాక్స్ రిబేట్ పరిమితిని పెంచారు. ఎటువంటి పన్ను మినహాయింపులు కోరకుండా మొత్తం ఆదాయంపై పన్ను చెల్లించే నూతన పన్నుల విధానంలో బేసిక్ లిమిట్‌ను రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. పాత పన్నుల విధానంలో బేసిక్ లిమిట్లో ఎటువంటి మార్పులు చేయలేదు. అదేవిధంగా నూతన పన్నుల విధానంలో సెక్షన్ 87ఏ కింద ఎటువంటి పన్ను చెల్లించాల్సినక్కర్లేని ట్యాక్స్ రిబేట్ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24) నుంచి రూ.7 లక్షల వార్షిక ఆదాయం వరకు ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. పాత పన్నుల విధానంలో ఈ రిబేట్‌ను రూ.5 లక్షలకే పరిమితం చేశారు. ఎటువంటి పన్ను మినహాయింపులు కోరని వారికి తక్కువ పన్ను రేట్లతో ఆరు శ్లాబులతో కొత్త పన్నుల విధానాన్ని 2020–21లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మూడేళ్లు అయినప్పటికీ ఇప్పటికీ చాలామంది పన్ను చెల్లింపుదారులు పాత పన్నుల విధానాన్నే ఎంచుకోవడంతో వీరిని కొత్త పన్నుల విధానంలోకి మా ర్చడానికి ఆర్థిక మంత్రి ఈ నిర్ణ యాలు తీసుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరు ట్యాక్స్ శ్లాబులను కొత్త పన్నుల విధానంలో ఐదుకు పరిమితం చేయడమే కాకుండా వీరికి రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను వర్తింపచేస్తున్ననట్లు తెలిపారు. ఫ్యామిలీ పెన్షన్ తీసు కునే వారికి ఈ స్టాండర్డ్ డిడక్షన్ రూ. 15,000గా నిర్ణయించారు. ఈ స్టాండర్డ్ డిడక్షన్ పరిగణనలోకి తీసుకుంటే రూ. 7.5 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి పన్ను ఉండదు. అలాగే ఫ్యామిలీ పెన్షన్ తీసుకొనేవారికి రూ.7.15 లక్షల ఆదాయం వరకూ పన్ను ఉండదు. డిఫాల్ట్‌గా కొత్త పన్నుల విధానం ఇప్పటివరకు రెండు పన్నుల విధానాల్లో దేన్నీ ఎంచుకోకపోతే డిఫాల్ట్‌గా పాత పన్నుల విధానాన్ని పరిగణనలోకి తీసుకునేవారు. కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్నుల విధానాన్ని డిఫాల్ట్ విధానంగా పరిగణించనున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ పాత పన్నుల విధానంలో రిటర్న్‌లు దాఖలు చేసేవారికి పన్ను మినహాయింపు ప్రయోజనాలు వర్తిస్తాయని తెలిపారు. ఆర్థిక మంత్రి తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల కొత్త పన్ను చెల్లింపుదారుల్లో రూ.7 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి రూ.33,800 వరకు ప్రయోజన కలగనుండగా, రూ.10 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.23,400, రూ.15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.49,400 వరకు ప్రయోజనం చేకూరుతుందని ట్యాక్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనల వల్ల రూ.15.5 లక్షల ఆదాయం దాటిన వారికి కనీసం రూ.52,500 వరకు ప్రయోజనం దక్కనున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని మినహాయింపుల ప్రయోజనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోగలితే రూ.9.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారి వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అధిక ఆదాయం ఉన్నవారిపై కరుణ రూ.కోట్లలో ఆదాయం ఆర్జిస్తున్న వారిపై మోదీ ప్రభుత్వం కరుణ చూపించింది. రూ.2 కోట్ల వార్షికాదాయం దాటిన వారిపై విధించే సర్‌చార్జీని 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల రూ.5.5 కోట్ల వార్షికాదాయం ఉన్న వారికి రూ.20 లక్షల వరకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటివరకు అధికాదాయం ఉన్న వారిపై ప్రపంచంలోనే అత్యధికంగా 42.7 శాతం పన్నురేటు ఉండేదని, సర్‌చార్జీ తగ్గించడం వల్ల ఈ రేటు 39 శాతానికి పరిమితమైనట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అదేవిధంగా ఎర్న్డ్ లీవులను నగదుగా మార్చుకుంటే పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రసుత్తం ఉన్న లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై రూ.3 లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. రూ.5 లక్షలకు పైబడి చెల్లించే అధిక మొత్తం ఉండే బీమా పాలసీలకు వర్తించే పన్ను మినహాయింపులను రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం నుంచి యూనిట్ లింక్డ్ (యులిప్) పాలసీలను మినహాయించారు. -
కరోనా ముందు కంటే తక్కువే
న్యూఢిల్లీ: ఆర్థిక రంగ కార్యకలాపాలు కరోనా మహమ్మారి రావడానికి ముందు నాటి స్థాయి కంటే తక్కువగానే ఉన్నాయని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూనే, ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలిచేందుకు ఆర్బీఐ రేట్ల పెంపును నిదానంగా అనుసరించొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ద్రవ్యోల్బణం 5.8 శాతంగా ఉండొచ్చంటూ ఏడీబీ గతంలో వేసిన అంచనాలను, తాజాగా 6.7 శాతానికి పెంచింది. ఇక తదుపరి ఆర్థిక సంవత్సరం (2023–24)లో ద్రవ్యల్బణం 5 శాతంగా ఉండొచ్చన్న అంచనాలను 5.8 శాతానికి సవరించింది. ఇది ఆర్బీఐ గరిష్ట పరిమితి అయిన 6 శాతానికి కొంచెం తక్కువని పేర్కొంది. ద్రవ్యోల్బణం ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో గరిష్ట స్థాయిల్లోనే చలిస్తుందని ఏడీబీ తన తాజా నివేదికలో అంచనా వేసింది. సరఫరా వైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గుతాయన్న ఏడీబీ.. ఆర్థిక రంగ కార్యకలాపాలు ఊపందుకున్నందున డిమాండ్ వైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతాయని వివరించింది. ఆర్థిక రంగ కార్యకలాపాలు కరోనా మహమ్మారి ముందు కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఆర్బీఐ కీలక రేట్ల పెంపును చేపడుతుందని.. ద్రవ్యోల్బణాన్ని అంతర్జాతీయ అంశాల కంటే స్థానిక సరఫరా సమస్యలే ప్రభావితం చేస్తున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ ప్రభావం ‘‘ఆర్థిక రంగ కార్యకలాపాలు ఇంకా మెరుగుపడాల్సి ఉన్నందున ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపును వచ్చే ఏడాది వరకు నిదానంగా చేపట్టొచ్చు. అదే సమయంలో రూపాయి మారకాన్ని తనంతట అదే స్థిరపడేలా వదిలేయవచ్చు. ఇది బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్‌కు సాయపడుతుంది’’అని ఏడీబీ తన నివేదికలో వివరించింది. అంతర్జాతీయ డిమాండ్ బలహీనంగా ఉన్నందున వచ్చే రెండేళ్లపాటు భారత్ వృద్ధి, ఎగుమతులు గణనీయంగా ప్రభావితమవుతాయని అంచనా వేసింది. ఈ అంశాల ఆధారంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు అంచనాను ఏడీబీఏ 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. -
వృద్ధికి కేంద్రం పెట్టుబడులు కొనసాగుతాయ్
ముంబై: మహమ్మారి కోవిడ్–19 మూడవ వేవ్ తర్వాత తిరిగి ఆర్థిక వృద్ధి ఊపందుకోవడానికి కేంద్ర మూలధన వ్యయాలు కొనసాగుతాయని, ఇందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ శుక్రవారం పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన ఒక బ్యాంకింగ్ కార్యక్రమంలో అన్నారు. పన్నులను తగ్గించడం, ప్రైవేటీకరణ కొనసాగింపు, మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయడం, వాటిని నిర్వహించడం, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను వినియోగంలోకి తేవడం (మానిటైజేషన్ డ్రైవ్) వంటి అనేక చర్యలను ప్రభుత్వం తీసుకుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్యాంకింగ్– నాన్–బ్యాంకింగ్ నుంచి నిధుల సమీకరణ విషయంలో అనిశ్చితి, ప్రైవేట్ రంగ భాగస్వాముల స్పందనలో ఇంకా పురోగతి లేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో వృద్ధి లక్ష్యంగా మరో మార్గంలో కేంద్రం మూలధన వ్యయం కొనసాగుతుందని అన్నారు. 2021–22లో కేంద్ర బడ్జెట్ మూలధన వ్యయాల విలువ రూ.6 లక్షల కోట్లయితే, ప్రభుత్వం రూ.5.92 లక్షల మేర ఖర్చు చేసిందని అనంత నాగేశ్వరన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.7.5 లక్షల కోట్లు ఖర్చుచేయగలిగితే ఇది ఎకానమీ పురోగతికి సంబంధించి పెద్ద విజయమే అవుతుందని ఆయన అన్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురయినా ఎదుర్కొనడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఇతర దేశాలతో పోల్చితే, భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మెరుగైన స్థితిలో ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం కట్టడికి (2–6 శాతం శ్రేణిలో) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో కలిసి ప్రభుత్వం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఎకానమీ పురోగతిలో బ్యాంకింగ్‌ది కీలక పాత్ర అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయంలో బ్యాంకింగ్ తగిన సమర్ధవంతనీయమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. రుణాలు మంజూరీలో బ్యాంకింగ్ కొంత అప్రమత్తత అవసరమేనని కూడా అన్నారు. -
ఎకానమీ పురోగతే ఆర్బీఐ చర్యల లక్ష్యం
ముంబై: రేట్ల పెంపు ద్వారా కఠిన విధానంవైపు మొగ్గుచూపి, వృద్ధి విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెనుకడుగు వేసిందన్న విమర్శల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి తీసుకునే చర్యలు ఎకానమీ పురోగతికి ప్రతికూలం అని భావించడం తగదని ఆయన స్పష్టం చేశారు. ఎకానమీ పురోగతి– ద్రవ్యోల్బణం కట్టడి సమతౌల్యతకు ప్రభుత్వంతో కలిసి సెంట్రల్ బ్యాంక్ తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని గవర్నర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు, ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా మే, జూన్ నెలల్లో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా 0.4 శాతం, 0.5 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 4.9 శాతానికి చేరింది. అయితే దీనిపై పలు విమర్శలు వ్యక్తం అయ్యాయి. మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణ్యం ఇటీవల ఒక వ్యాసంలో ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో ఆర్బీఐ ఆలస్యంగా వ్యవహరించిందని, చివరకు పాలసీలో మార్పుచేసి వృద్ధి విషయంలో వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్బీఐపై వస్తున్న విమర్శలను పరోక్షంగా ప్రస్తావించారు. మా నిర్ణయాలకు కట్టుబడి ఉన్నాం... అభివృద్ధి చెందుతున్న ఆర్థిక పరిణామాలకు అనుగుణంగా సెంట్రల్ బ్యాంక్ వ్యవహరించిందని అన్నారు. విధానం మార్పునకు తగిన కాల వ్యవధిని అనుసరించిందని స్పష్టం చేశారు. ‘‘మహమ్మారి సమయంలో అధిక ద్రవ్యోల్బణాన్ని సహించడం చాలా అవసరం. అప్పటి క్లిష్ట సమయంలో రేట్ల పెంపు ఎంతమాత్రం సమంజసం కాదు. ఆ విధానం పరిణామాలు ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా ఉంటాయి. మేము ఇప్పటికీ మేము అప్పటి మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము’’ అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, లోన్ రికవరీ ఏజెంట్ల విపరీత చర్యలపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన ఈ సందర్భగా హెచ్చరించారు. ఫైనాన్షియల్ రంగంలోకి గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ (మెటా) వంటి బడా సంస్థల ప్రవేశం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయని కూడా కార్యక్రమంలో గవర్నర్ పేర్కొన్నారు. -
యుద్ధంతో మనకు ఇబ్బందే: జయంత్ వర్మ
న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడి వంటి అంశాలకు సవాళ్లను విసురుతాయని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ పేర్కొన్నారు. విధాన నిర్ణేతలు తాజా పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి సిద్ధపడాలని సూచించారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండగా, ఇప్పటికే ఇది ఎగువ స్థాయిలో ఉందన్న విషయం గమనించాల్సిన కీలక అంశమన్నారు. బ్యారల్ క్రూడ్ ధర 75 డాలర్ల అంచనాలతో 2022–23 బడ్జెట్ రూపొందగా, యుద్ధంతో ఇది 110 డాలర్ల స్థాయిలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. మూడేళ్లగా మందగమనంలో ఉన్న ఎకానమీ ఇంకా ఊపందుకోలేదని, ప్రైవేటు పెట్టుబడుల్లో పురోగతి లేదని, ప్రైవేటు వినియోగం కూడా పుంజుకోలేదని అన్నారు. ఆ నేపథ్యంలోనే తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తత ఆందోళనకరమని అన్నారు. అమెరికా వడ్డీరేట్లు పెంచిన పక్షంలో ఈ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో భారత్ 2013కన్నా ఇప్పుడు మెరుగైన స్థానంలో ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే ఇలాంటి పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల పర్భావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. కరెంట్ అకౌంట్ (దేశానికి వచ్చీ పోయే విదేశీ మారకం మధ్య నికర వ్యత్యాసం) లోటును నిర్వహించగలిగిన స్థాయిలో భారత్ ఉందన్నారు. డాలర్–రూపాయి మారకపు విలువల కదలికలపై తక్షణం ఆందోళన పడాల్సింది ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. -
ఆర్థిక వ్యవస్థకు సవాళ్లున్నాయ్...
ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్య విధాన సాధారణీకరణ, వినియోగ డిమాండ్ రూపంలో ఆర్థిక వ్యవస్థకు ఎన్నో సవాళ్లున్నట్టు బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా తెలిపింది. జీడీపీ 8.2 శాతం మేర వృద్ధి చెందొచ్చని, ఇంతకంటే తగ్గే రిస్క్‌లు కూడా ఉన్నట్టు పేర్కొంది. సాగు రంగం స్థిరంగా 4 శాతం మేర వృద్ధి సాధించడం, సేవల రంగం బలంగా ఉండడం వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా తెలిపింది. స్థూల అదనపు విలువ (జీవీఏ) 2021–22లో 8.5 శాతం అంచనా నుంచి 2022–23లో 7 శాతానికి, జీడీపీ వృద్ధి 2021–22లో అంచనా 9.3 శాతం నుంచి 2022–23లో 8.2 శాతానికి తగ్గొచ్చని బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ పేర్కొంది. త్రైమాసికం వారీగా వృద్ధిలో హెచ్చుతగ్గులు ఉంటాయని నివేదికలో వివరించింది. 2022–23 మొదటి క్వార్టర్లో రెండంకెల వృద్ధి నమోదవుతుందని, నాలుగో త్రైమాసికంలో వార్షికంగా చూస్తే తక్కువ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం వ్యవస్థలో లిక్విడిటీ ఎక్కువగా ఉండగా.. దీన్ని సాధారణీకరించే దిశగా, ద్రవ్యోల్బణం నియంత్రణ దిశగా ఆర్బీఐ తీసుకునే చర్యలు, వినియోగ డిమాండ్‌పై పడే ప్రభావం జీడీపీ వృద్ధి అంచనాలను మరింత కిందకు తీసుకెళ్లే అంశాలుగా తెలిపింది. వినియోగంపై వడ్డీ రేట్ల ప్రభావం.. ‘‘బ్యాంకుల రుణ వితరణలో వృద్ధి 6 శాతంగా ఉంటే.. రిటైల్ రుణాలకు డిమాండ్ బలంగా 12 శాతం మేర ఉంది. మానిటరీ పాలసీ సాధారణీకరించినట్టయితే రుణ రేట్లు పెరగొచ్చు. ఇది వినియోగ డిమండ్‌ను దెబ్బతీస్తుంది’’ అని బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా పేర్కొంది. బలహీన రుతుపవనాల రూపంలోనూ మరో రిస్క్ ఉన్నట్టు తెలిపింది. 2022–23 సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.6 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. -
మళ్లీ కోవిడ్ కల్లోలం!
ముంబై: కరోనా వైరస్ కొత్త వేరియంట్ భయాలతో స్టాక్ మార్కెట్ శుక్రవారం కుప్పకూలింది. వైరస్ కట్టడికి పలు దేశాల లాక్డౌన్ విధింపు యోచనలు ఆర్థిక వృద్ధిపై ఆందోళనలను రెకేత్తించాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 37 పైసల పతనమైంది. క్రూడాయిల్ అనూహ్య పతనం, వడ్డీ రేట్ల పెంపు భయాలు వెంటాడాయి. ఈ పరిణామాలతో ట్రేడింగ్ మొదలు.., తుదిదాకా అమ్మకాల సునామీ జరిగింది. ఒక్క ఫార్మా మినహా అన్నిరంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏడాదిలో అతిపెద్ద మూడో పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1688 పాయింట్లు నష్టపోయి 57,107 వద్ద, నిఫ్టీ 510 పాయింట్లు క్షీణించి 17,026 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల పతనం సూచీల భారీ క్షీణతకు కారణమైంది. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో డాక్టర్ రెడ్డీస్, నెస్లే ఇండియా, ఏషియన్ సిమెంట్స్, టీసీఎస్ షేర్లు మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.5786 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీయ ఇన్వెస్టర్లు రూ.2294 కోట్ల షేర్లను కొన్నారు. ఇంట్రాడేలో 17వేల దిగువకు నిఫ్టీ సెన్సెక్స్ ఉదయం 540 పాయింట్ల నష్టంతో 58,255 వద్ద, నిఫ్టీ 17,339 పాయింట్ల పతనంతో 17,339 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 1801 పాయింట్లును కోల్పోయి 56,994 వద్ద, నిఫ్టీ 550 పాయింట్లు పతనమైన 17వేల స్థాయిని కోల్పోయి 16,986 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 2,529 పాయింట్లు, నిఫ్టీ 738 పాయింట్లు నష్టపోయాయి. నిమిషానికి రూ.1962 కోట్ల నష్టం సూచీలు మూడుశాతం పతనంతో ఇన్వెస్టర్లు రూ.7.36 లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ప్రతి నిమిషానికి రూ.1962 కోట్ల నష్టం వాటిల్లింది. వెరసి ఇన్వెస్టర్ల ఇన్వెస్టర్ల సంపదగా బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.258 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. నష్టాలకు నాలుగు కారణాలు కలవరపెట్టిన కొత్త వేరియంట్ ... ఇప్పటికే డెల్టా వేరియంట్ విజృంభణతో యూరప్ దేశాలు విలవిలాడుతుండగా.., తాజాగా దీని కంటే అత్యంత ప్రమాదకారి, అసాధారణ రీతిలో మ్యూటేషన్ల(ఉత్పరివర్తనాలు)కు గురౌతున్న బి.1.1529 వేరియంట్‌ను దక్షిణాఫిక్రాలో గుర్తించారు. ఈ రకం కొత్త కేసులు రోజురోజుకూ శరవేగంగా పెరుగుతుండటంతో భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్ ఒక్కసారిగా దెబ్బతింది. ఆసియాలో జపాన్ 2.53%, హాంగ్‌సెంగ్ 2.67%, జకార్తా 2.06% నష్టపోయాయి. యూరప్‌లోని ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్ మార్కెట్లు 3–4 శాతం వరకు క్షీణించాయి. అమెరికాకు చెందిన ఎస్అండ్పీ, నాస్డాక్ ఫ్యూచర్లు ఫ్యూచర్లు రెండున్నర శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. తెరపైకి లాక్డౌన్ విధింపు ఆందోళనలు... కేసుల కట్టడికి పలు దేశాలు రాత్రి కర్ఫ్యూను విధించాయి. స్లోవేకియా రెండు వారాల సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రకటించింది. జపాన్, బ్రిటన్ దేశాలు ప్రయాణాలపై నిషేధాన్ని విధించాయి. చెక్ రిపబ్లిక్ బార్లు, రెస్టారెంట్లతో సహా జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలను మూసివేసింది. జర్మనీలో కోవిడ్ సంబంధిత మరణాల సంఖ్య లక్ష దాటింది. కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు రానున్న రోజుల్లో మరిన్ని దేశాలు లాక్డౌన్లను ప్రకటించవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశలోకి నెట్టాయి. ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు మూడో వేవ్ మరింత ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉండడంతో సూచీలు కుంగాయి. ఆగని విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు... దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపరం కొనసాగడం ప్రతికూలంగా మారింది. ఈ నవంబర్లోనే ఇప్పటి వరకు(25 తేది) రూ.25 వేల కోట్ల దేశీయ ఈక్విటీలను అమ్మినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారత స్టాక్ సూచీలు అక్టోబరులో జీవితకాల గరిష్టాలకు చేరుకున్న తరువాత షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతున్నాయనే కారణంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఉద్దీపనల ఉపసంహరణలో భాగంగా అమెరికా వడ్డీరేట్లను వేగంగా పెంచవచ్చనే అంచనాలు వారి విక్రయాల ప్రక్రియను మరింత ప్రేరేపింస్తున్నాయి. తొలి దశ కోవిడ్, లెమన్ బ్రదర్స్ సంక్షోభ సమయాల్లోనూ ఒక నెలలో ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇతర భయాలు... ద్రవ్యోల్బణ కట్టడికి అమెరికాతో సహా పలు కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను వేగంగా పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు తెరపైకి వచ్చా యి. వీలైనంత తొందర్లో ఉద్దీపన ఉపసంహరణ చర్యలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫెడ్ రిజర్వ్ తన మినిట్స్‌లో తెలిపింది. ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు వెంటాడుతున్నాయి. ఈ అంశాలన్నీ సూచీల సెంటిమెంటును దెబ్బతీశాయి. లాభాల్లో టార్సన్స్ ప్రోడక్ట్స్ లిస్టింగ్... టార్సన్స్ ప్రోడక్ట్స్ షేర్లు లిస్టింగ్‌లో అదరగొట్టాయి. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.662తో పోలిస్తే ఆరుశాతం లాభంతో రూ.700 వద్ద లిస్టయ్యాయి. స్టాక్ మార్కెట్ భారీ పతనంతోనూ ఈ షేర్లకు డిమాండ్ వెల్లువెత్తింది. ఫలితంగా ఇంట్రాడేలో 27% దూసుకెళ్లి రూ.840 అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ అయ్యాయి. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 26.30 లక్షల షేర్లు చేతులు మారాయి. ఈ ఏడాదిలో టాప్–3 పతనాలు తేది సెన్సెక్స్ నిఫ్టీ ఫిబ్రవరి 26 1,939 568 ఏప్రిల్ 12 1,707 524 నవంబర్ 26 1,687 510 -
ఆర్థిక నేరస్థులను భారత్‌కు తీసుకొస్తాం
న్యూఢిల్లీ: బడా ఆర్థిక నేరస్థులను స్వదేశానికి రప్పించేందుకు దౌత్యపరమైన, అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో భారత్‌కు తిరిగి రావడం మినహా వారికి మరో మార్గం అంటూ ఉండదన్నారు. రుణ వితరణ, ఆర్థిక వృద్ధిపై నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడారు. ‘ఆర్థిక నేరస్థులను తీసుకొచ్చే విషయంలో విధానాలు, చట్టపరంగా నడుచుకుంటున్నాం. మేమిచ్చే సందేశం సుస్పష్టం. మీ దేశానికి తిరిగి రండి. ఇందుకోసం మా చర్యలు కొనసాగుతూనే ఉంటాయి’ అని పేర్కొన్నారు. అయితే, ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రధాని ప్రస్తావించలేదు. విజయ్ మాల్యా, నీరవ్‌మోదీలను తీసుకొచ్చేందుకు భారత్ ఇటీవలి కాలంలో చర్యలను ముమ్మరం చేసిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకులు వినూత్నంగా పనిచేయాలి.. దేశంలో బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు ఎంతో మెరుగుపడినట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంబంధించి తమ సర్కారు గడిచిన ఏడేళ్లలో ఎన్నో సంస్కరణలను అమలు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు గత ఐదేళ్లలోనే కనిష్ట స్థాయిలకు చేరినట్టు చెప్పారు. చురుకైన చర్యల ద్వారా రూ.5 లక్షల కోట్ల మొండి రుణాలను వసూలు చేసినట్టు పేర్కొన్నారు. ‘‘సంపద సృష్టి కర్తలకు, ఉపాధి కల్పించే వారికి మద్దతుగా నిలవాల్సిన సమయం ఇది. వారికి రుణ వితరణ అందేలా చూడాలి. నిజాయితీ నిర్ణయాల్లో మీకు రక్షణగా నేను ఉంటాను’ అంటూ బ్యాంకులకు మార్గదర్శనం చేశారు. 2022 ఆగస్ట్ 15 నాటికి ప్రతీ బ్యాంకు శాఖ.. పూర్తి డిజిటల్‌గా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న కనీసం 100 క్లయింట్లను అయినా కలిగి ఉండాలన్న లక్ష్యాన్ని ప్రధాని నిర్ధేశించారు. సొంతంగా 5జీ, 6జీ సామర్థ్యాలు టెలికం రంగానికి సంబంధించి 5జీ, 6జీ టెక్నాలజీల్లో స్వీయ సామర్థ్యాల అభివృద్ధిపై భారత్ పెట్టుబడులు పెడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనికితోడు సెమీ కండక్టర్ల తయారీపైనా దృష్టి సారించినట్టు చెప్పారు. గురువారం ‘సిడ్నీ డైలాగ్’ వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధాని వర్చువల్(ఆన్లైన్ మాధ్యమంలో)గా మాట్లాడారు. నూతన తరం టెలికం టెక్నాలజీల అభివృద్ధిలో జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలతో కలసి భారత్ పనిచేస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీకి సంబంధించి గొప్ప ఉత్పత్తి డేటాయేనన్నారు. డేటాను కాపాడడం, గోప్యత, భద్రతకు సంబంధించి పటిష్ట కార్యాచరణను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రజా సార్వభౌమాధికారం కోసం డేటాను ఉపయోగించుకుంటామన్నారు. డిజిటల్ డొమైన్లో భారత్ సాధించిన ఘతనను ప్రస్తావించారు. ‘‘క్లౌడ్ ప్లాట్ఫామ్లో సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాం. డిజిటల్ సార్వభౌమాధికారానికి ఇది కీలకం. క్వాంటమ్ కంప్యూటింగ్‌లోనూ ప్రపంచ స్థాయి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్లకు సైబర్ సెక్యూరిటీ పరిష్కారాలు, సేవలను అందించడంలో భారత్ ఇప్పటికే ప్రముఖ కేంద్రంగా ఉంది. సైబర్ సెక్యూరిటీకి సైతం భారత్‌ను కేంద్రంగా మార్చేందుకు పరిశ్రమతో కలసి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాం. సెమీ కండక్టర్ల తయారీకి ప్రోత్సాహకాల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నాం’’ అని ప్రధాని వివరించారు. -
2021–22లో 10 శాతం వృద్ధి: నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 10 శాతం ఉంటుందని విశ్వసిస్తున్నట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏడు సంవత్సరాల మోదీ ప్రభుత్వం దేశంలో పటిష్ట ఆర్థిక వృద్ధికి పునాదులు వేసిందన్నారు. కోవిడ్–19 వల్ల ఎదురయిన సవాళ్లను దేశం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని వివరించారు. వచ్చే ఐదేళ్లూ భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నివేదికను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచ పెట్టుబడిదారులను భారత్ ఆర్థిక వ్యవస్థ ఆకర్షించగలుగుతోందన్నారు. అయితే దేశంలో ఉపాధి కల్పన అనుకున్నంత వేగంగా లేదని ఆయన అంగీకరించారు. మోదీ ప్రభుత్వం ఏడేళ్లలో 485 ప్రభుత్వ పథకాలను ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపు (డీబీటీ) పరిధిలోకి తీసుకుని వచ్చిందన్నారు. డీబీటీ ద్వారా రూ.5.72 లక్షల కోట్లు బదిలీ అయినట్లు కూడా కుమార్ తెలిపారు. -
రుణాలు @ రూ.63,574 కోట్లు
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ ‘క్రెడిట్ అవుట్‌రీచ్’ కార్యక్రమం కింద కేవలం పక్షం రోజుల్లో దాదాపు 13.84 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.63,574 కోట్ల రుణాలను అందజేసిందని ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ ఒక ట్వీట్లో తెలిపారు. దేశ వ్యాప్తంగా అక్టోబర్ 16వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద, బ్యాంకులు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రుణగ్రహీతలకు రుణాలను మంజూరు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 10,580 శిబిరాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనితోపాటు పలు బ్యాంకులు రాయితీ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటి పండుగ ఆఫర్లను ప్రకటించాయి. ‘ఆగస్టులో ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు మద్దతును అందించే క్రమంలో అక్టోబర్‌లో క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలని బ్యాంకులకు సూచించారు. దీనికి అనుగుణంగా, బ్యాంకులు జిల్లాల వారీగా, రంగాల వారీగా రుణ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి‘ అని ఆర్థిక మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. బ్యాంకులు–నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), ఫిన్‌టెక్ సెక్టార్ల మధ్య సహ–రుణ ఏర్పాట్ల ద్వారా కేంద్రం క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంచి స్పందన వివిధ కేంద్ర ప్రభుత్వ రుణ గ్యారెంటీ పథకాల కింద మంజూరు చేసిన, పంపిణీ చేసిన నిధుల పరిమాణంకంటే క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ కింద జారీ అయిన రుణాలు అధికంగా ఉండడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దాదాపు 3.2 లక్షల మంది లబ్ధిదారులకు రూ.21,687.23 కోట్ల వ్యాపార రుణాలు మంజూరు చేయగా, 59,090 మంది రుణగ్రహీతలకు రూ.4,560.39 కోట్ల విలువైన వాహన రుణాలు మంజూరయ్యాయి. 41,226 మంది రుణగ్రహీతలకు రూ.8,994.25 కోట్ల విలువైన గృహ రుణాలు మంజూరయ్యాయి. ఏడు లక్షలకు మందికిపైగా రైతులకు రూ.16,734.62 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరయ్యాయి. గతంలో ఇలా... 2019 అక్టోబర్ – 2021 మార్చి మధ్య ఇలాంటి అవుట్‌రీచ్ కార్యక్రమాలను బ్యాంకులు నిర్వహించాయి. తద్వారా ఆర్ఏఎం సెక్టార్ (రిటైల్, వ్యవసాయం, లఘు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) అన్ని రకాల రుణ అవసరాలను నెరవేర్చాయి. అప్పట్లో ఈ కార్యక్రమం కింద రూ.4.94 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ పండుగ సీజన్లో కూడా చిన్న రుణగ్రహీతలకు సరసమైన వడ్డీ రేట్లలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం కింద రుణాలను అందజేయాలని కేంద్రం నిర్దేశిస్తోంది. బ్యాంకింగ్‌కు ఇందుకు తగిన సూచనలు అందాయి. -
భారత్ ఎకానమీ వృద్ధి 10 శాతమే!
న్యూఢిల్లీ: భారత్ 2021–22 ఆర్థిక సంవత్సరం ఎకానమీ వృద్ధి అంచనాలకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) కోత పెట్టింది. ఏప్రిల్‌నాటి 11 శాతం వృద్ధి పరుగు అంచనాను తాజాగా 10 శాతానికి కుదించింది. కోవిడ్–10 మహమ్మారి ప్రేరిత సవాళ్లు ఆర్థిక క్రియాశీలతకు విఘాతం కలిగిస్తుండడమే తాజా అంచనాలకు కారణమని తన ఆసియా డెవలప్మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ)లో పేర్కొంది. 46 సభ్య దేశాలతో కూడిన ఏడీబీ అవుట్‌లుక్‌లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022–23లో భారత్ వృద్ధి 7.5 శాతానికి పరిమితం అవుతుంది. ► కరోనా సెకండ్‌వేవ్ భారత్ సేవలు, దేశీయ వినియోగం, పట్టణ అసంఘటిత రంగం ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపింది. ► 2020–21తో పోలి్చతే 2021–22లో వినియోగం క్రమంగా మెరుగుపడుతుంది. ప్రభుత్వ వ్యయాలు, ఎగుమతులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చే అంశాలివి. ► మూడవ వేవ్ సవాళ్లు లేకపోతే 2021–22 చివరి మూడు త్రైమాసికాల్లో (2021జూలై–మార్చి 2022 )ఎకానమీ రికవరీ పటిష్టంగా ఉంటుంది. వ్యాక్సినేషన్ వేగవంతం కావడం, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన చర్యలు, మౌలిక రంగం పురోగతి, ఆరోగ్య సంబంధ సేవల పటిష్టత వంటి అంశాలు వృద్ధి రికరవీ వేగవంతానికి దోహదపడతాయి. ► 2021లో ఆసియా ప్రాంత వృద్ధి రేటు 7.3 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించింది. ► చైనా విషయంలో 2021 వృద్ధి రేటు అంచనా 8.1 శాతంగా ఉంది. గృహ డిమాండ్ పటిష్టత దీనికి కారణం.అయితే 2022లో 5.5 శాతానికి తగ్గుతుంది. హైబేస్ దీనికి కారణం. కాగా ఉపాధి కల్పనా మార్కెట్, వినియోగ విశ్వాసం పటిష్టంగా ఉన్నాయి. ► దక్షిణాసియాలోని ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో ఎకానమీల వృద్ధి తీరు వివిధ తీరులుగా ఉంటుంది. ఇంతకుముందు అంచనాలకన్నా వృద్ధి వేగం ఆయా దేశాల్లో మందగిస్తుంది. అయితే 2022లో వృద్ధి వేగం పెరిగే వీలుంది. ► వేగవంతమైన వ్యాక్సినేషన్ వల్ల ఎకానమీల్లో కేసులు, మరణాల తీవ్రత తగ్గుతోంది. ► కాగా అమెరికా, యూరో ప్రాంతం, జపాన్లలో 2022 వృద్ధి సగటును 3.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. ► ఆసియా ఎకానమీల్లో ద్రవ్యోల్బణం పెరగవచ్చు. ఇంధన, ఆహార ధరలు పెరుగుదలతోపాటు, కరెన్సీ విలువలు తగ్గడం కూడా దీనికి కారణం కావచ్చు. అయితే సెంట్రల్ బ్యాంకులకు నిర్దేశిత స్థాయిలకన్నా భారీగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం లేదు. ► ప్రభుత్వాల ద్రవ్య, పరపతి విధానాలు సరళతరంగా కొనసాగుతాయని భావిస్తున్నాం. భారీ వృద్ధి అంచనాకు సెకండ్‌వేవ్ దెబ్బ కరోనా ప్రేరిత సవాళ్లతో గడచిన ఆర్థిక సంవత్సరంలో 7.3 క్షీణతను నమోదుచేసుకున్న ఆర్థిక వ్యవస్థ, 2021–22 మొదటి జూన్ త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధిని సొంతం చేసుకుంది. నిజానికి లోబేస్‌కుతోడు ఎకానమీ ఊపందుకుని 2021–22లో వృద్ధి రేటు 17 శాతం వరకూ నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (2021 ఏప్రిల్, మే) సెకండ్‌వేవ్ సవాళ్లు ప్రారంభమయ్యాయి. దీనితో పలు ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు 2021–22పై తమ వృద్ధి అంచనాలను రెండంకెల లోపునకు కుదించేశాయి. 7.5 శాతం నుంచి 9.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను తాజాగా వెలువరిస్తున్నాయి. ఆర్బీఐ, ఐఎంఎఫ్, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 9.5 శాతం అంచనావేస్తుండగా, మూడీస్ అంచనా 9.3 శాతంగా ఉంది. అయితే ప్రపంచబ్యాంక్ వృద్ధి రేటు అంచనా 8.3 శాతంగా ఉంది. ఫిచ్ రేటింగ్స్ మాత్రం 10 శాతం వృద్దిని అంచనావేస్తోంది. ఇక రెపోను వరుసగా ఏడు ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ పరపతి విధాన కమిటీ యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్బీఐ, తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తోంది. కోవిడ్–19 నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థల పురోగతికి సరళతర విధానాలే అవలంభించాల్సిన అవసరం, ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి మేలో 6.3 శాతంకాగా, జూన్‌లో స్వల్పంగా 6.26 శాతానికి తగ్గింది. అయితే జూలైలో 5.59 శాతం దిగువకు చేరింది. ఆగస్టులో 5.3 శాతానికి దిగివచి్చంది. 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.7 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23లో ద్రవ్యోల్బణం 5.1 శాతం ఉంటుందని ఆర్బీఐ ప్రస్తుతం భావిస్తోంది. -
‘సెకండ్ వేవ్’తో వృద్ధికి సమస్య లేదు!
ముంబై: భారత్‌ను ప్రస్తుతం భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా ‘సెకండ్ వేవ్’ వల్ల ఆర్థిక వృద్ధి రికవరీ బాటకు ఎటువంటి ఢోకా ఉండబోదన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం వ్యక్తంచేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2021–22) భారత్ 10.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆర్బీఐ గత నెల అంచనాలను తగ్గించాల్సి వస్తుందని తాను భావించడం లేదని అన్నారు. కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళనకరమైన అంశమే అయినప్పటికీ, దేశ వ్యాప్త లాక్డౌన్ల పరిస్థితి మళ్లీ తలెత్తుతుందని భావించనక్కర్లేదని అన్నారు. ఒక మీడియా గ్రూప్ ఏర్పాటు చేసిన ఎకనమిక్ సదస్సునుద్దేశించి చేసిన ప్రసంగంలో శక్తికాంతదాస్ బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ నుంచి బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల వరకూ పలు అంశాలపై మాట్లాడారు. ఆయనేమన్నారంటే... బాండ్ ఈల్డ్స్‌పై రుణ సమీకరణ ఎఫెక్ట్ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారీ రుణ సమీకరణ ప్రణాళిక బాండ్ ఈల్డ్స్ (వడ్డీ) పెరుగుదలకు ప్రధాన కారణం. ఈ కారణంగానే 2020–21 ఆర్థిక సంవత్సరం చివరి దఫా రూ.20,000 కోట్ల బెంచ్‌మార్క్ బాండ్ వేలాన్ని ఈ నెల 22వ తేదీన కేంద్రం రద్దు చేసింది. ఆర్బీఐ–బాండ్ మార్కెట్ మధ్య ఎలాంటి ఘర్షణాత్మక పరిస్థితి లేదు. క్రిప్టోకరెన్సీలపై ఆందోళన బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలపై ఆర్బీఐ ఆందోళన చెందుతోంది. ఇదే విషయాన్ని కేంద్రానికీ తెలియజేసింది. క్రిప్టోకరెన్సీలపై ఆర్బీఐ–ప్రభుత్వం మధ్య వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని భావించడంలేదు. ఫైనాన్షియల్ స్థిరత్వ పటిష్టతకు ప్రభుత్వం, ఆర్బీఐ కట్టుబడి ఉన్నాయి. క్రిప్టోకరెన్సీపై ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంక్ త్వరలో ఒక నిర్ణయానికి వస్తాయి. బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్రంతో చర్చలు మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ యత్నాల విషయంలో ఆర్బీఐ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాంకింగ్ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందుకు పటిష్ట మూలధనం అవసరం. నైతిక విలువలతో కూడిన పాలనా వ్యవస్థలు ఉండాలి. నాలుగు కేటగిరీల్లో వచ్చే దశాబ్ద కాలంలో విభిన్న బ్యాంకింగ్‌రంగాన్ని భారత్ చూడబోతోంది. పోటీతత్వం, సామర్థ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. భవిష్యత్ నాలుగు రకాల బ్యాంకులను చూస్తే... మొదటిగా పెద్ద బ్యాంకులు దేశీయంగా, అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తాయి. రెండవది... మధ్య తరహా బ్యాంకులు దేశ వ్యాప్తంగా ఆర్థి క సేవలు అందిస్తాయి. మూడవ బ్యాంకింగ్ విభాగంలో చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు చిన్న రుణ గ్రహీతల అవసరాలను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక నాల్గవ రకం బ్యాంకింగ్‌లో డిజిటల్ ప్లేయర్స్ ఉంటాయి. ప్రత్యక్షంగాకానీ, బ్యాంకుల ద్వారాకానీ, ఏజెంట్లు, సంఘాల ద్వారాకానీ కస్టమర్‌కు ఇవి సేవలను అందిస్తాయి. సామర్థ్యం, పోటీతత్వం ప్రధాన అంశాలుగా బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు పేమెంట్ బ్యాంకులకు లైసెన్సింగ్ విధానం తీసుకురావడం ఒక కీలకమైన అడుగు. -
ఆర్థిక వృద్ధికి చర్యలు కొనసాగుతాయి
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ విషయంలో జాగ్రత్తతో కూడిన ఆశావాదంతోనే ప్రభుత్వం ఉందని, ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు మద్దతు చర్యలు కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్‌బజాజ్ తెలిపారు. ఫిక్కీ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. రెండో త్రైమాసికం జీడీపీ గణాంకాలు (జూలై–సెప్టెంబర్) మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయ భాగంలో (2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి వరకు) మరింత పురోగతి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా.. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ మైనస్ 23.9 శాతం స్థాయిలో ఉంటుందని మార్కెట్లు అంచనా వేయగా.. కేవలం మైనస్ 7.5 శాతంగానే నమోదు కావడం గమనార్హం. ‘‘మేము సానుకూల ధోరణితో ఉన్నాము. అదే సమయంలో ఆర్థిక ప్రగతి విషయంలో అప్రమత్తతతో కూడినా ఆశావాదంతోనే ఉన్నాము. మూడు, నాలుగో త్రైమాసికాల్లో మరింత మెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నాము. మేమే కాదు అంతర్జాతీయ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు సైతం దేశ ఆర్థిక వృద్ధి విషయంలో వాటి అంచనాలను మెరుగుపరిచాయి’’ అని తరుణ్ బజాజ్ వివరించారు. పండుగలు ముగిసిన తర్వాత కూడా డిమాండ్ కొనసాగుతుండడం రెండు, మూడో త్రైమాసికాల్లో వృద్ధికి మద్దతునిస్తుందన్నారు. ఇక్కడి నుంచి ఆర్థిక వ్యవస్థ ప్రగతి కోసం అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల నూతన విధానం త్వరలోనే నూతన ప్రభుత్వరంగ సంస్థల విధానంతో ప్రభుత్వం ముందుకు వస్తుందని తరుణ్ బజాజ్ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద వ్యూహాత్మక రంగాల్లో గరిష్టంగా నాలుగు ప్రభుత్వరంగ సంస్థలే ఉంటాయని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుమించి ఉంటే వాటిని ప్రైవేటీకరించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఈ విధానం ఎంతో ప్రతిష్టాత్మకమైనదన్న తరుణ్ బజాజ్.. త్వరలోనే అమల్లోకి రానుందన్నారు. ప్రభుత్వం పట్ల ఆలోచనలో ఇది ఎంతో మార్పును తెస్తుందన్నారు. -
మరో ఉద్దీపనకు చాన్స్
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత సమస్యల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి మరో ఉద్దీపన ప్రకటన అవకాశం ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఒక సూచనప్రాయ ప్రకటన చేశారు. అధికార బాధ్యతల్లో తన అనుభవాలకు సంబంధించి 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన నిర్మలాసీతారామన్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావాలపై కేంద్రం మదింపు ప్రక్రియను అక్టోబర్ నుంచీ ప్రారంభించినట్లు ఆమె పేర్కొన్నారు. మదింపు ఫలితాలకు సంబంధించి ఆర్థికశాఖ ప్రకటన చేస్తుందనీ తెలిపారు. ‘మరో ఉద్దీపన అవకాశాన్ని తోసిపుచ్చడం లేదు. లోతైన సంప్రదింపుల అనంతరం మేము ఇప్పటివరకూ 2 ఉద్దీపనలను ప్రకటించాము’ అని ఆమె ఈ సందర్భంగా అన్నారు. వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర రంగాలను వర్గీకరించడానికి ఆర్థికశాఖ త్వరలో క్యాబినెట్‌ను సంప్రదిస్తుందని కూడా ఆర్థికమంత్రి తెలిపారు. వ్యయాలపై సీపీఎస్ఈలకు నిర్మలాసీతారామన్ సూచన ఇదిలావుండగా, బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు శాఖల కార్యదర్శులతోపాటు.. 14 భారీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) సీఎండీలతో ఆర్థిక మంత్రి సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీపీఎస్ఈలు 2020–21లో నిర్దేశించుకున్న మూలధన వ్యయ లక్ష్యాల్లో 75% డిసెంబర్‌కి చేరుకోవాలని.. తద్వారా ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలవాలని కోరారు. కరోనా కారణంగా కుంటుపడిన ఆర్థిక వృద్ధిని తేజోవంతం చేసేందుకు గాను ఆర్థిక మంత్రి వివిధ భాగస్వాములతో భేటీ కావడం ఇది నాలుగోది. మూలధన వ్యయాలను 2020–21, 2021–22లో వేగవం తం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 2019–20కి 14 సీపీఎస్ఈలు రూ.1,11,672 కోట్లను మూలధన వ్యయాల రూపంలో ఖర్చు చేయాలని నిర్దేశించుకోగా.. రూ.1,16,323 కోట్లు (104%) ఖర్చు చేసినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1,15,934 కోట్ల వ్యయాలను అవి లక్ష్యంగా పెట్టుకోగా.. తొలి 6 నెలల్లో (సెప్టెంబర్ నాటికి) కేవలం రూ.37,423 కోట్లనే వ్యయం చేశాయి. తయారీపై దృష్టి పెట్టాలి: ముకేశ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, భారత్ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70% వాటా ఉన్న తయారీ రంగంలో పెట్టుబడులపై భారత్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తీసుకుంటున్న చర్యల ఫలితాలు, భవిష్యత్తులో పరిశ్రమలు, సేవా రంగాల పనితీరుపై సమగ్ర మదింపు జరపాలని సూచించారు. దేశ స్వయం సమృద్ధి విషయంలో ఇది కీలకమన్నారు. ‘ఒక పాఠశాల ఉపాధ్యాయుని కుమారుడైన మా తండ్రి 1960లో ముంబైలో అడుగుపెట్టారు. అప్పుడు ఆయన దగ్గర ఉంది కేవలం రూ.1,000. భవిష్యత్ వ్యాపారాలు, ప్రావీణ్యతల్లో పెట్టుబడి పెడితే మనం కలలుగన్న భారతాన్ని మనమే నిర్మించుకోగలమన్న విశ్వాసం ఆయనది. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలను, కంపెనీలను సృష్టించగలమన్న నమ్మకం ఆయన సొంతం’ అని ముకేశ్ పేర్కొన్నారు. -
రెండో ఉద్దీపనతో వృద్ధి అంతంతే: మూడీస్
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో డిమాండ్, ఆర్థిక వృద్ధికి ఊతం ఇవ్వడానికి కేంద్రం ప్రకటించిన రెండవదఫా ఉద్దీపన ఈ దిశలో స్వల్ప ప్రయోజనాలనే అందిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం పేర్కొంది. అక్టోబర్ 12న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎట్‌టీసీ) క్యాష్ వోచర్ స్కీమ్, ప్రత్యేక పండుగల అడ్వాన్స్, రాష్ట్రాలకు వడ్డీరహిత రూ.12,000కోట్ల రుణం, రూ.25,000 కోట్ల అదనపు మూలధన ప్రయోజనాలు కల్పించిన సంగతి తెలిసిందే. రూ.46,700 కోట్ల విలువైన ఈ ఉద్దీపన 2020–21 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.2 శాతం ఉంటుందని అంచనా. రెండు విడతల ఉద్దీపనలనూ కలుపుకుని ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రత్యక్ష వ్యయాలను పరిశీలిస్తే, ఈ మొత్తం జీడీపీలో 1.2 శాతం ఉంటుందని మూడీస్ అంచనావేసింది. బీఏఏ రేటింగ్ ఉన్న ఇతర దేశాల్లో కరోనా సంబంధ ఉద్దీపన జీడీపీలో సగటును 2.5 శాతం ఉందని మూడీస్ తెలిపింది. వ్యయాలకు కఠిన పరిమితులు... వ్యయాల విషయంలో భారత్ కఠిన పరిమితులను ఎదుర్కొంటోందని మూడీస్ పేర్కొంది. జీడీపీలో ప్రభుత్వ రుణ భారం గత ఏడాది 72% ఉంటే, 2020లో దాదాపు 90 శాతానికి పెరగనుందని విశ్లేషించింది. అలాగే ఆదాయాలు తగ్గడం వల్ల ద్రవ్యలోటు జీడీపీలో 12 శాతానికి పెరిగిపోయే పరిస్థితి కనబడుతోందనీ అంచనా వేసింది. -
ఆర్థిక వృద్ధికి ఎయిర్‌పోర్టుల ఊతం
న్యూఢిల్లీ: స్థానిక ఆర్థిక అభివృద్ధికి విమానాశ్రయాలు శక్తిమంతమైన చోదకాలుగా పనిచేస్తాయని అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను పెద్ద నగరాలకు అనుసంధానం చేయడంలో కీలకపాత్ర పోషించగలవని ఆయన చెప్పారు. ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటాల కొనుగోలు అనంతరం తమ ఎయిర్‌పోర్ట్‌ల వ్యాపార విభాగం మరింతగా విస్తరిస్తుందని అదానీ తెలిపారు. గ్రూప్‌లోని ఇతర వ్యాపారాలకు కూడా ఇది వ్యూహాత్మక అవకాశాలు సృష్టించగలదని ఆయన వివరించారు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్)లో జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్‌కు చెందిన 50.50 శాతం వాటాలతో పాటు మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను కూడా కొనుగోలు చేస్తున్నట్లు అదానీ ఎయిర్‌పోర్ట్స్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నిస్సందేహంగా అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టు. దీనితో పాటు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మా ఆరు విమానాశ్రయాల పోర్ట్‌ఫోలియోకు తోడవుతుంది. ఈ పరిణామం మా ఇతర వ్యాపారాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకునేందుకు కూడా ఉపయోగపడగలదు‘ అని అదానీ ఒక ప్రకటనలో వివరించారు. 21 శతాబ్దంలోని టాప్ 5 అంతర్జాతీయ మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటిగా ముంబై మారనున్న నేపథ్యంలో దేశీయంగా ఇది ప్రధాన ఎయిర్‌పోర్ట్‌గా మార్చగలదని ఆయన పేర్కొన్నారు. విమాన ప్రయాణికుల సంఖ్య అయిదు రెట్లు పెరుగుతుందన్న అంచనాలతో దేశీయంగా 200 పైచిలుకు ఎయిర్‌పోర్టులు అదనంగా నిర్మించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. టాప్ 30లోని ఒక్కో నగరానికి రెండు విమానాశ్రయాలు అవసరమవుతాయని అదానీ తెలిపారు. ఇందుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసేందుకు అదానీ ఎయిర్‌పోర్ట్స్ సర్వసన్నద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
‘కరోనా వ్యాప్తిలో భారత్ అగ్రస్థానానికి వెళ్తుంది’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సోమవారం ట్వీట్ చేశారు. భారత ప్రజాస్వామ్యంలోనే సువర్ణాధ్యాయాన్ని తెచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేశారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా శనివారం దేశ పౌరులకు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ‘గత సంవత్సరం ఈ రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక బంగారు అధ్యాయం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల తరువాత దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో పూర్తికాల ప్రభుత్వానికి తిరిగి ఓటు వేశారు’ అంటూ ప్రధాని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. యశ్వంత్ సిన్హా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘శుభాకాంక్షలు ప్రధాని మోదీ గారూ... భారత ప్రజాస్వామ్యంలోకి సువర్ణాధ్యాయం తెచ్చినందుకు. వచ్చే ఏడాది దేశ పరిస్థితి మరింత అద్భుతంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కోవిడ్ కేసుల విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానానికి వెళుతుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది’ అని యశ్వంత్ సిన్హా ట్వీట్ చేశారు. Congratulations to PM Modi for ushering in 'a golden chapter in the history of Indian democracy'. The next year promises to be even better when India will climb to the top in Covid cases and the economy would have collapsed totally. — Yashwant Sinha (@YashwantSinha) June 1, 2020 మోదీ-2.0 మొదటి సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా క్షీణించిందని, ఆ క్షీణత ఈ ప్రభుత్వ తప్పు వల్ల కాదని.. మాజీ ప్రధాని నెహ్రూ వల్లనే అని యశ్వంత్ సిన్హా ఎద్దేవా చేశారు. నెహ్రూ గనక 1947 నుంచి 1964 వరకూ దేశాన్ని పాలించకపోతే దేశం రెండంకెల వృద్ధి రేటును సాధించేదని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. The sharp decline in economic growth rate in the first year of Modi-2 is not because of any fault of this govt but because of Pt Nehru. If he had not ruled India from 1947 to 1964 India today would be growing at double digit. — Yashwant Sinha (@YashwantSinha) May 30, 2020 -
జీడీపీ వృద్ధి 5 శాతానికి పుంజుకుంటుంది
ముంబై: దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) 5 శాతం క్షీణతను చవిచూస్తుందని.. అయితే 2021–22లో తిరిగి 5 శాతం వృద్ధి రేటుకు పుంజుకుంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. తన అంచనాలకు మద్దతునిచ్చే అంశాలను తెలియజేస్తూ.. ‘‘ఇది సహజ విపత్తు కాదు. మన పరిశ్రమలు ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయి. మన మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థలు పనిచేస్తూనే ఉన్నాయి’’ అని సుబ్బారావు వివరించారు. భారత జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ 5 శాతానికి క్షీణిస్తుందంటూ క్రిసిల్, ఫిచ్ రేటింగ్ సంస్థలు అంచనాలు వ్యక్తీకరించిన విషయం తెలిసిందే. సుబ్బారావు అంచనాలు కూడా వీటికి పోలికగానే ఉండడం గమనార్హం. ‘భారత ఆర్థిక వ్యవస్థ.. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడం’ అనే అంశంపై ఓ బిజినెస్ స్కూల్ నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వెబినార్ ద్వారా దువ్వూరి సుబ్బారావు ప్రసంగించారు. వృద్ధి వేగం గా క్షీణించడం అన్నది సర్దుబాటులో భాగమే నన్నారు. మనవంటి పేదదేశానికి ఎంతో ఇబ్బంది కరమన్నారు. అయితే, వ్యవసాయ ఉత్పత్తి భారీగా ఉండడం, విదేశీ వాణిజ్యం స్థిరంగా ఉండడం అన్న వి మన ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేవిగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి ద్రవ్యపరిమితుల నేపథ్యంలో రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విధానం బాగుందన్నారు. అదనంగా రుణాలను తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. 5–6 శాతం వృద్ధి సాధ్యమే: అహ్లువాలియా ప్రణాళికాసంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లువాలియా సైతం 2020–21లో 5–6% వృద్ధి రేటు సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆయన కూడా మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీవ్ర మాంద్యాన్ని చవిచూడనున్నట్టు చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పన్ను సంస్కరణలు వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. -
2020-21లో వృద్ధిరేటు సున్నా శాతం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆర్థిక మందగమనం పరిస్థితుల్లో దేశీయ వృద్ది రేటు గణనీయంగా పతనం కానుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్సీస్ శుక్రవారం ప్రకటించింది. నెగెటివ్ నుంచి భారత్ రేటింగ్ అవుట్‌లుక్‌ను సున్నాకు తగ్గించేసింది. కోవిడ్-19 కల్లోలం, లాక్ డౌన్ కారణంగా 2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎటువంటి వృద్ధిని కనబరచదని వెల్లడించింది. అయితే 2022లో ఇది 6.6 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. ఆర్థిక లోటు జీడీపీ లో 5.5 శాతానికి పెరుగుతుందని మూడీస్ విశ్లేషకులు శుక్రవారం తెలిపారు. బడ్జెట్ అంచనా ప్రకారం 3.5 శాతం మాత్రమే. గత నెల చివరిలో, మూడీస్ తన క్యాలెండర్ సంవత్సరం 2020 జీడీపీ వృద్ధి అంచనాను 0.2 శాతానికి తగ్గించిన సంగతి విదితమే. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న దీర్ఘకాలిక ఆర్థిక ఒత్తిడి, మందగించిన ఉద్యోగ కల్పన, బ్యాంకింగేతర రంగాల్లో నెలకొన్న మూల ధన సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉందని అభిప్రాయపడింది. జీడీపీ తిరిగి అత్యధికస్థాయికి కి పుంజుకోక పోతే బడ్జెట్ లోటును తగ్గించడంలో, రుణ భారం పెరగకుండా నిరోధించడంలో ప్రభుత్వం కీలక సవాళ్లను ఎదుర్కొంటుందని మూడీస్ తెలిపింది. వృద్ధి క్షీణత, ప్రభుత్వ ఆదాయ ఉత్పత్తి, కరోనావైరస్-సంబంధిత ఆర్థిక ఉద్దీపన చర్యలతో ప్రభుత్వ డెట్ రేషియోలకు దారితీస్తుందనీ, రాబోయే కొన్నేళ్లలో జీడీపీలో 81 శాతానికి పెరుగుతుందని భావిస్తు న్నామని పేర్కొంది. కాగా గత నవంబరులో ఆర్థిక వ్యవస్థ అవుట్ లుక్ ను ‘నెగటివ్’కి చేర్చిన సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. (ఎస్బీఐ ఉద్యోగికి కరోనా: కార్యాలయం మూసివేత) -
నూతన అంతర్జాతీయ వ్యవస్థ కావాలి!
న్యూఢిల్లీ: కోవిడ్–19 అనంతర ప్రపంచంలో నూతన అంతర్జాతీయ వ్యవస్థ రూపొందాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ సంస్థల పరిమితులను కరోనా సంక్షోభం ఎత్తి చూపిందన్నారు. అలీనోద్యమ (నామ్) దేశాల నేతలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. నిష్పక్షపాతం, సమానత్వం, మానవత్వం ప్రాతిపదికగా నూతన అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడాల్సి ఉందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించే అంతర్జాతీయ వ్యవస్థలు నేటి అవసరం. కేవలం ఆర్థిక అభివృద్ధినే కాకుండా, మానవాళి సంక్షేమాన్ని కాంక్షించే వ్యవస్థలు అవసరం. ఇలాంటి విషయాల్లో భారత్ ఎప్పుడూ ముందుంది’అన్నారు. అలీనోద్యమం దశాబ్దాల పాటు నైతిక భావనలకు గొంతుకగా నిలిచిందన్నారు. మానవాళి అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రపంచవ్యాప్తంగా ఒక సంఘీభావ ప్రకటన అవసరమని, ఆ దిశగా సమ్మిళిత దృక్పథంతో నామ్ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరోనాపై యుద్ధాన్ని భారత్ ప్రజాస్వామ్యయుతంగా, క్రమశిక్షణ, నిర్ణయాత్మకతలతో నిజమైన ప్రజాయుద్ధంగా మలిచిందన్నారు. -
మారని రేట్లు.. వృద్ధికి చర్యలు
ముంబై: వడ్డీరేట్లను ప్రభావితం చేసే కీలకమైన రెపో రేటు, రివర్స్ రెపో రేట్లను ఎలాంటి మార్పులూ చేయకుండా యథాతథంగా ఉంచుతున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. అయితే 11 ఏళ్ల కనిష్టానికి చేరిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా బ్యాంకింగ్, రియల్టీ, ఎంఎస్ఎంఈ, ఆటో రంగాలకు ప్రోత్సాహక చర్యలతో ముందుకు వచ్చింది. అయితే, తన సర్దుబాటు విధానాన్ని మార్చుకోకపోవటం ద్వారా అవసరమైతే మున్ముందు రేట్ల కోతకు అవకాశం ఉంటుందని ఆర్బీఐ సంకేతమిచ్చింది. రుణ రేట్లను తగ్గించేందుకు వీలుగా బ్యాంకులకు రూ.లక్ష కోట్లను సమకూర్చనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. రుణాలకు మంచి రోజులు ► సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ), ఆటోమొబైల్, గృహ రుణ వితరణ పెంపునకు వీలుగా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) నిబంధనలను ఆర్బీఐ సడలించింది. దీంతో ఈ రంగాలకు అదనంగా ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకులు 4 శాతాన్ని సీఆర్ఆర్ రూపంలో పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది ఈ ఏడాది జూలై వరకు అమల్లో ఉంటుంది. ఇది బ్యాంకులకు సానుకూలం. ఎందుకంటే ఇలా మిగిలిన నిధులను రుణాలివ్వటానికి వినియోగించవచ్చు. ► దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఎంఎస్ఎంఈ రంగానికి మద్దతుగా.. డిఫాల్టయిన రుణాలను 2021 మార్చి 31 వరకు పునరుద్ధరిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. జీఎస్టీ నమోదిత ఎంఎస్ఎంఈలకే ఇది వర్తిస్తుంది. జీడీపీలో ఎంఎస్ఎంఈ రంగం వాటా 28%. ఎగుమతుల్లో వాటా 40 శాతం. అంతేకాదు 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం కూడా. ► వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఉపశమనం కల్పించింది. ప్రమోటర్ల చేతుల్లో లేని అంశాలతో వాణిజ్య రియల్టీ ప్రాజెక్టుల కార్యకలాపాల ఆరంభం ఆలస్యమైతే, వాటి రుణ గడువును ఏడాది పాటు పొడిగించేందుకు అనుమతించింది. అంటే ప్రాజెక్టులు ఆలస్యమైనా ఆయా రుణాలను డౌన్‌గ్రేడ్ చేయరు. ఇన్ఫ్రాయేతర రంగాల రుణాల్లాగే వీటినీ పరిగణిస్తారు. రియల్టీ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఇది అదనపు మద్దతునిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ద్రవ్యోల్బణం భయాలు రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి–మార్చి క్వార్టర్లో 6.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ ఎంపీసీ అంచనా వేసింది. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ట స్థాయిలో 7.35 శాతంగా నమోదు కావటం తెలిసిందే. వచ్చే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌కు ద్రవ్యోల్బణం 3.8–4 శాతం మధ్య ఉంటుందని గతంలో చేసిన అంచనాలను సవరిస్తూ 5–5.4%కి పెంచింది. ప్రధానంగా కూరగాయలు, పప్పుధాన్యాల ధరలు పెరగొచ్చని అభిప్రాయపడింది. వృద్ధి రేటు 5%: 2019–20లో వృద్ధి రేటు 5%గా ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. 2020–21లో 6%గా ఉంటుందని అంచనా వేసింది. 2020–21 తొలి ఆరు నెలల్లో 5.9–6.3% మధ్య ఉంటుందన్న లోగడ అంచనాలను.. 5.5–6%కి తగ్గించింది. ఇతర ముఖ్యాంశాలు ► రేట్ల యథాతథ స్థితికి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలోని ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా (ఆరుగురు సభ్యులు) ఓటు వేసింది. గత భేటీలోనూ (2019 డిసెంబర్) రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ► దీంతో ఆర్బీఐ రెపో రేటు 5.15 శాతం, రివర్స్ రెపో రేటు 4.9 శాతంగానే కొనసాగనున్నాయి. ► ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్లో 3.8 శాతానికి సవరించగా, దీనివల్ల మార్కెట్ నుంచి ప్రభుత్వ రుణ సమీకరణ పెరగదని ఆర్బీఐ పేర్కొంది. ► చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీసీ అభిప్రాయపడింది. దీంతో రానున్న త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి ఆరంభమయ్యే) వడ్డీ రేట్లను కేంద్రం తగ్గించే అవకాశాలున్నాయి. ► హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్ఎఫ్సీ) నియంత్రణకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తారు. అప్పటి వరకు నేషనల్ హౌసింగ్ బ్యాంకు ఆదేశాలు, మార్గదర్శకాలే కొనసాగుతాయి. హెచ్ఎఫ్సీల నియంత్రణ గతేడాది ఆగస్ట్ 9 నుంచి ఆర్బీఐకి బదిలీ కావటం తెలిసిందే. ► బ్యాంకుల్లో డిపాజిట్ బీమాను ఒక డిపాజిట్‌దారునికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం బ్యాంకు బ్యాలన్స్ షీట్లపై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంది. ► బడ్జెట్లో ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో చేసిన మార్పులు డిమాండ్‌కు మద్దతునిస్తాయని అంచనా వేసింది. ► తదుపరి ఆర్బీఐ విధాన ప్రకటన ఏప్రిల్ 3న ఉంటుంది. మా వద్ద ఎన్నో అస్త్రాలు ‘‘సెంట్రల్ బ్యాంకు వద్ద ఎన్నో సాధనాలున్నాయని గుర్తుంచుకోవాలి. వృద్ధి మందగమనం రూపంలో భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైతే వాటిని సంధిస్తాం’’ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. తద్వారా 2008 ఆర్థిక మాంద్యం తర్వాత అమెరికాలో మాదిరే అసాధారణ అస్త్రాలను వినియోగించేందుకు ఆర్బీఐ వెనుకాడదన్న సంకేతం ఇచ్చారు. రేట్లలో మార్పులు చేయకపోవడం అంచనాలకు అనుగుణంగానే ఉందన్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వృద్ధి తగ్గే రిస్క్ పెరిగిందని... అయితే, పూర్తి ప్రభావంపై అనిశ్చితి ఉందని చెప్పారు. బ్యాంకుల్లోకి రూ.లక్ష కోట్లు లాంగ్‌టర్న్ రీపర్చేజ్ అగ్రిమెంట్స్ (రెపోస్/రుణాలు) ఏడాది, మూడేళ్ల కాల వ్యవధిపై రూ.లక్ష కోట్ల మేర రెపో రేటుకు జారీ చేయనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. రెపోస్ అంటే.. బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐకి విక్రయించి నిధులు పొందడం. గడువు తీరిన తర్వాత తిరిగి అవి మళ్లీ కొనుగోలు చేస్తాయి. ఇప్పటి వరకు ఆర్బీఐ గరిష్టంగా 56 రోజులకే రెపోస్‌ను ఇష్యూ చేసింది. అందులోనూఒక రోజు నుంచి 15 రోజుల కాలానికే ఎక్కువగా ఉండేవి. మొదటిసారి ఏడాది, మూడేళ్ల రెపోస్‌ను ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంకుల నిధుల వ్యయాలను తగ్గించడమే ఇందులోని ఉద్దేశం. ‘‘మానిటరీ పాలసీ బదిలీ మరింత మెరుగ్గా ఉండేందుకు తీసుకున్న చర్య ఇది. ఎందుకంటే రెపో రేటుకు నిధులను ఇస్తున్నాం. బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.లక్ష కోట్లను విడుదల చేయాలనుకుంటున్నాం. దాంతో బ్యాంకులు రుణ రేట్లను తగ్గించేందుకు వీలు పడుతుంది’’ అని ఆర్బీఐ గరవ్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఎవరేమన్నారంటే... ఏడాది, మూడేళ్ల లాంగ్‌టర్మ్ రెపోస్ బ్యాంకుల నిధుల వ్యయాలను తగ్గిస్తాయి. దీంతో ఈ ప్రభావాన్ని మరింత మెరుగ్గా రుణగ్రహీతలకు బదిలీ చేయడం వీలు పడుతుంది. రెపో రేట్లను మార్పు చేయకపోవడం ఊహించినదే. అయితే, అభివృద్ధి, నియంత్రణపరమైన చర్యలు ఆర్థిక రంగానికి సానుకూలం. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ ప్రాజెక్టు రుణాలకు అదనంగా ఏడాది గడువు ఇవ్వడం రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఉపశమనం. – అనుజ్‌పురి, అన్‌రాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ ఆటో, హౌసింగ్, ఎంఎస్ఎంఈ రంగాలకు ఇచ్చే ఇంక్రిమెంటల్ రుణాలకు సీఆర్ఆర్ నుంచి బ్యాంకులకు మినహాయింపునివ్వడం.. ఈ రంగాలకు రుణ వితరణను పెంచి, మందగమనానికి మందులా పనిచేస్తుంది. – కృష్ణన్ సీతారామన్, క్రిసిల్ -
సంస్కరణలతోనే భారత్ భారీ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ భారీ ఆర్థిక వృద్ధి సాధనకు వ్యవస్థాగత సంస్కరణల కొనసాగింపు అవసరమని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి శుక్రవారం పేర్కొంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2020 పేరుతో ఐక్యరాజ్యసమితి ఈ నివేదికను ఆవిష్కరించింది. ఒకవైపు సంస్థాగత, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లకు సంబంధించి వ్యవస్థాగత సంస్కరణలు మరోవైపు ప్రభుత్వ వ్యయాల ద్వారా మందగమనంలో ఉన్న ఆర్థిక వృద్ధిని మెరుగుపరచవచ్చని సూచించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... - 2018లో భారత్ వృద్ధి 6.8 శాతం. 2019లో ఇది 5.7 శాతానికి తగ్గింది. ఆయా ప్రతికూల అంశాల నేపథ్యంలో ప్రభుత్వం పలు ద్రవ్యపరమైన సంస్కరణలను చేపట్టింది. ఈ దన్నుతో 2020లో వృద్ధి 6.6 శాతానికి రికవరీ కావచ్చు. అయితే భారీ వృద్ధికి మాత్రం రెగ్యులేol9టరీ, సంస్థాగత సంస్కరణలు కీలకం. ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు, విదేశీ మారకద్రవ్య నిల్వల విషయంలో ఉన్న సానుకూలతలు ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చే అంశం. - భారత్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019–20) జీడీపీ వృద్ధి రేటు 5%, వచ్చే ఆర్థిక సంవత్సరం (2020–21)లో 5.8–5.9% శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉంది. - ప్రతి ఐదు దేశాల్లో ఒకదేశం తలసరి ఆదాయం ఈ ఏడాది స్థిరంగా ఉండడమో లేక తగ్గుతుండడమో జరిగే అవకాశం ఉంది. అయితే తలసరి ఆదాయం 4 శాతం పైగా పెరిగే అవకాశం ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. - ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక బలహీనత సుస్థిరాభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగించే అవకాశం ఉంది. ప్రత్యేకించి పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనలపై ఈ ప్రభావం తీవ్రంగా పడే వీలుంది. - అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితితో యూరోపియన్ యూనియన్‌లో తయారీ రంగం బలహీనత నెలకొంది. తీవ్ర సవాళ్లు ఉన్నా.. వేగంగా వృద్ధి చెందుతున్న ప్రాంతంగా తూర్పు ఆసియా కొనసాగనుంది. ఇక చైనా వృద్ధి 2019లో 6.1%, 2020లో 6%గా ఉండొచ్చు. 29యేళ్ల కనిష్టానికి చైనా వృద్ధి 2019లో చైనా వృద్ధి 29 సంవత్సరాల కనిష్ట స్థాయి 6.1 శాతానికి పడిపోయింది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది. దేశీయ డిమాండ్ మందగమనం, అమెరికాతో 18 నెలల వాణిజ్య యుద్ధం దీనికి ప్రధాన కారణాలని సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. -
పెట్టుబడులకు భారత్ బెస్ట్..!
బ్రెజిలియా: పెట్టుబడులు పెట్టేందుకు భారత్.. ప్రపంచంలోనే అత్యంత అనువైన దేశమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాజకీయ స్థిరత్వం, వ్యాపారాలకు అనువైన సంస్కరణలు ఇందుకు తోడ్పడుతున్నాయని చెప్పారు. ‘2024 నాటికి భారత్ అయిదు లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని లకి‡్ష్యంచుకుంది. ఇందులో భాగంగా ఇన్ఫ్రా రంగానికే 1.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు కావాలి. అందుకని భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి. అపరిమిత అవకాశాలు అందిపుచ్చుకోండి’ అని కార్పొరేట్లను ఆయన ఆహ్వానించారు. బ్రిక్స్ కూటమి బిజినెస్ ఫోరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. అయిదు సభ్య దేశాల బ్రిక్స్ కూటమి మాత్రం ఆర్థిక వృద్ధికి సారథ్యం వహిస్తోందని ఆయన చెప్పారు. ‘ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 50% బ్రిక్స్ దేశాలదే. అంత ర్జాతీయంగా మందగమనం ఉన్నా బ్రిక్స్ దేశాలు వృద్ధి నమోదు చేయడంతో పాటు కోట్ల మందిని పేదరికం నుంచి బైటికి తెచ్చాయి. కొంగొత్త సాంకేతిక ఆవిష్కరణలు చేశాయి’ అని మోదీ చెప్పారు. బ్రెజిల్, భారత్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా కలిసి బ్రిక్స్ కూటమిని ఏర్పాటు చేశాయి. భవిష్యత్ ప్రణాళిక అవసరం... బ్రిక్స్ కూటమి ఏర్పాటై పదేళ్లయిన నేపథ్యంలో భవిష్యత్తు కోసం సరికొత్త ప్రణాళికలను రూపొందించుకోవాలని మోదీ సూచించారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరిగేలా వ్యాపార నిబంధనలు సరళతరం కావాలన్నారు. సభ్య దేశాలు కలిసి పనిచేసేందుకు వీలున్న రంగాలు గుర్తించాలని, పరస్పరం సహకరించుకుని ఎదగాలని ప్రధాని సూచించారు. ‘ఒక దేశానికి టెక్నా లజీ ఉండొచ్చు. మరో దేశం ముడివనరులు సరఫరా చేస్తుండవచ్చు. ఎలక్ట్రిక్ వాహనా లు, డిజిటల్ టెక్నాలజీ, ఎరువులు, వ్యవసాయోత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్.. పరస్పరం సహకరించుకునేందుకు ఇలాంటి అనువైన రంగాలెన్నో ఉన్నాయి. వచ్చే బ్రిక్స్ సదస్సు నాటికి ఇలాంటివి కనీసం 5 రంగాలైనా గు ర్తించి, జాయింట్ వెంచర్స్‌కి అవకాశాలను అధ్యయనం చేయాలి’ అని చెప్పారు. -
పర్సంటేజ్లతో పండగ చేస్కో!
ముంబై: పండుగల వేళ.. రుణ గ్రహీతలకు ఆర్బీఐ మరోసారి శుభవార్త తెచ్చింది. గృహ, వాహన, కార్పొరేట్ రుణాలు చౌకగా లభ్యమయ్యేలా వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటించింది. దేశ వృద్ధికి ఆర్బీఐ విధానం మద్దతుగా నిలుస్తుందన్న మాటను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మరో విడత ఆచరణలో చూపించారు. ఇందుకుగాను కీలక రేట్లకు మరో పావు శాతం కోత పెట్టారు. రెపో, రివర్స్ రెపోలను 25 బేసిస్ పాయింట్ల చొప్పున (0.25 శాతం) తగ్గించారు. తద్వారా రుణాల రేట్లను మరి కాస్త దిగొచ్చేలా చేశారు. ఎందుకంటే గతంలో మాదిరిగా బ్యాంకులు ఆర్బీఐ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించకుండా ఉండేందుకు అవకాశం లేదు. అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ పేర్కొన్న ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లలో (ముఖ్యంగా రేపోరేటు) ఏదో ఒకదాని ఆధారంగా బ్యాంకులు రిటైల్ రుణాలపై రేట్లను అమలు చేయాల్సి ఉంటుంది. నిదానించిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా గడిచిన ఏడాది కాలంలో ఆర్బీఐ రేట్లను తగ్గిస్తూనే వస్తోంది. 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఐదు పర్యాయాలు నికరంగా 135 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించడం జరిగింది. కాకపోతే బ్యాంకులే ఈ ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురాలేదు. ఇప్పటి వరకు రుణాలపై అవి తగ్గించింది 50 బేసిస్ పాయింట్లకు మించలేదు. ఇకపై ఆర్బీఐ విధాన నిర్ణయాలకు అనుగుణంగా బ్యాంకులు కూడా రిటైల్ రుణ రేట్లను వెంటనే సవరించాల్సి వస్తుంది. దీనివల్ల వాహన, గృహ, వ్యక్తిగత, ఇతర రుణాలు చౌకగా మారనున్నాయి. తక్కువ వడ్డీ రేట్లతో కార్పొరేట్ కంపెనీలపైనా భారం తగ్గుతుంది. దీంతో అవి మరింత పెట్టుబడులతో ముందుకు రాగలవు. రుణాల వినియోగం పెరిగితే, అది వ్యవస్థలో డిమాండ్ పెరిగేందుకు దారితీస్తుంది. ముఖ్యంగా పండుగల సమయంలో ఆర్బీఐ రేట్ల తగ్గింపు వినియోగదారులకు ఉత్సాహాన్నిచ్చేదే. వృద్ధి రేటు అంచనాలు భారీగా తగ్గింపు... దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గించి ఆర్బీఐ షాక్‌కు గురిచేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని తాజాగా పేర్కొంది. గత పాలసీ సమావేశంలో వృద్ధి రేటును ఆర్బీఐ 6.9 శాతంగా అంచనా వేయడం గమనార్హం. అయితే, జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుతుందని ఆర్బీఐ కూడా ఊహించలేదు. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ దాస్ ఓ సందర్భంలో పేర్కొన్నారు కూడా. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పుంజుకోకపోవడంతోపాటు, ఎగుమతులు తగ్గడమే తన అంచనాల తగ్గింపునకు కారణాలుగా పేర్కొంది. కాకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్ధభాగం.. అక్టోబర్ నుంచి వృద్ధి రికవరీ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఇక, 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7 శాతానికి పుంజుకుంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. పాలసీ సమీక్ష ముఖ్యాంశాలు... ► ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో ఉన్న ఆరుగురు సభ్యులు కూడా పాలసీ రేట్ల తగ్గింపునకు ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఐదుగురు సభ్యులు పావు శాతం తగ్గింపునకు అనుకూలంగా ఓటు వేయగా, రవీంద్ర ధోలాకియా మాత్రం 0.40 బేసిస్ పాయింట్ల తగ్గింపునకు అనుకూలంగా ఓటేశారు. ► ఆర్బీఐ తన ప్రస్తుత విధానమైన సర్దుబాటు ధోరణిని అలాగే కొనసాగించింది. అంటే పరిస్థితులకు అనుగుణంగా రేట్ల తగ్గింపు నిర్ణయాలకు ఇది వీలు కల్పిస్తుంది. ► తాజా రేట్ల తగ్గింపు తర్వాత రెపో రేటు 5.15 శాతానికి, రివర్స్ రెపో రేటు 4.9 శాతానికి చేరాయి. రెపో రేటు అంటే... బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటు. రివర్స్ రెపో రేటు అంటే బ్యాంకులు తన వద్ద ఉంచిన నిధులపై ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటు. రెపో రేటు 2010 తర్వాత కనిష్ట స్థాయికి చేరింది. 2010 మార్చిలో రెపో రేటు 5 శాతంగా ఉంది. గత ఎంపీసీ సమీక్షలో 35 బేసిస్ పాయింట్ల మేర రెపోను తగ్గించారు. ► క్రితం నాలుగు ఎంపీసీ భేటీల్లో వడ్డీ రేట్లను 110 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ, కస్టమర్లకు రుణాలపై ఈ ప్రయోజన బదలాయింపు అస్థిరంగా, అసంపూర్ణంగా ఉందని ఆర్బీఐ పేర్కొంది. ► అమెరికా–చైనా వాణిజ్య యుద్ధంతో పడిపోతున్న వృద్ధిని నిలు వరించేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు (అమెరికా ఫెడ్ సహా) వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ► 2019–20 రెండో త్రైమాసికానికి ద్రవ్యోల్బణం అంచనాలను 3.4 శాతానికి ఆర్బీఐ ఎంపీసీ సవరించింది. అలాగే, ద్వితీయ ఆరు నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3.5–3.7 శాతం మధ్య ఉంటుందన్న గత అంచనాలనే కొనసాగించింది. ద్రవ్యోల్బణాన్ని మధ్య కాలానికి 4 శాతానికే పరిమితం చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. ► వ్యవసాయ రంగ పరిస్థితులు ఆశాజనకంగా మారాయని ఎంపీసీ పేర్కొంది. తిరిగి ఉపాధి కల్పనకు, ఆదాయానికి, దేశీయ వృద్ధికి సానుకూలించనున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ► తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 3–5 తేదీల్లో జరుగుతుంది. వృద్ధి కోసం రేట్ల కోత అవసరమే: దాస్ నిలిచిన వృద్ధి ఇంజిన్‌ను వెంటనే పరుగెత్తించేలా చేయాల్సిన అవసరమే.. రేట్లను దశాబ్ద కనిష్ట స్థాయికి తగ్గించాల్సి వచ్చినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ‘‘వృద్ధి ధోరణి ఇలాగే ఉన్నంత కాలం... అలాగే, వృద్ధి పుంజుకునేంత వరకు ఆర్బీఐ తన ప్రస్తుత సర్దుబాటు విధానాన్నే కొనసాగిస్తుంది’’ అని దాస్ అభయమిచ్చారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు ద్వారా కేంద్రం రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం కోల్పోనుండడం ద్రవ్యలోటుపై ప్రభావం చూపించే అవకాశాలపై ఎదురైన ఒక ప్రశ్నకు... ‘‘బడ్జెట్లో పేర్కొన్న లక్ష్యానికి (జీడీపీలో 3.3 శాతం) ద్రవ్యలోటును పరిమితం చేస్తామని కేంద్రం చెబుతోంది. కనుక కేంద్ర ప్రభుత్వ అంకితభావాన్ని సందేహించాల్సిన అవసరం లేదు’’ అని దాస్ చెప్పారు. ద్రవ్య ప్రోత్సాహకాలు, కార్పొరేట్ పన్ను తగ్గింపు ఆర్థిక వ్యవస్థకు సానుకూలతలుగా దాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం మధ్యంతర డివిడెండ్ రూపంలో రూ.30 వేల కోట్లను కోరనుందన్న విషయమై తనకు అవగాహన లేదన్నారు. బ్యాంకింగ్ రంగం పటిష్టం దేశ బ్యాంకింగ్ రంగంపై తలెత్తుతున్న సందేహాలు, వదంతులను తోసిపుచ్చుతూ.. బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా, సుస్థిరంగా ఉందని, భయపడేందుకు కారణాలేమీ లేవన్నారు దాస్. ఒక్క కోపరేటివ్ బ్యాంకులో తలెత్తిన సమస్య పునరావృతం కాబోదన్నారు. దీన్ని బ్యాంకింగ్ వ్యవస్థ సాధారణ పరిస్థితికి ముడిపెట్టి చూడడం తగదన్నారు. అక్రమాలు వెలుగు చూడడంతో ఇటీవలే పీఎంసీ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఎవరేమన్నారంటే... 25 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోతతోపాటు అవసరమైతే తదుపరి రేట్ల కోత ఉంటుందని చెప్పడం అన్నది.. వృద్ధి ఆందోళనలకు ముగింపు పలికేందుకు ద్రవ్య, పరపతి విధానాలు కలసి పనిచేస్తాయన్న భరోసాను ఇస్తోంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ 135 బేసిస్ పాయింట్లను ఈ ఏడాది తగ్గించడానికి తోడు ప్రభుత్వం తీసుకున్న పలు ప్రోత్సాహక చర్యలు పలు రంగాల్లో వృద్ధికి దారితీస్తుంది. ఇది ప్రస్తుత స్థాయి నుంచి దేశ వృద్ధి పెరిగేందుకు తోడ్పడుతుంది. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్లను ఆర్బీఐ తగ్గించడం, వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవలీ తీసుకున్న చర్యలకు అదనపు ప్రోత్సాహాన్నిస్తుంది – కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసిన మేరకే రేట్ల కోత ఉంది. అయితే, మార్కెట్లు మరింత రేటు కోతను అంచనా వేయడంతో నిరాశ చెందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 25–40 బేసిస్ పాయింట్ల వరకు రేట్ల తగ్గింపు ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. – అభిషేక్ బారు, వైస్ ప్రెసిడెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎంఎఫ్‌ఐల రుణ పరిమితి పెంపు సూక్ష్మ రుణ సంస్థలకు (మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు/ఎంఎఫ్ఐ) సంబంధించి రుణ పరిమితిని పెంచుతూ ఆర్బీఐ పాలసీ సమీక్ష సందర్భంగా ఓ సానుకూల నిర్ణయాన్ని వెలువరించింది. దీని వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రుణాల లభ్యత పెరుగుతుంది. ఓ రుణ గ్రహీతకు గరిష్టంగా రూ.లక్షగా ఉన్న పరిమితిని రూ.1.25 లక్షలు చేసింది. ఎంఎఫ్ఐ, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీలు) రుణ గ్రహీతలకు సంబంధించి గృహ ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షలకు, పట్టణాల్లో రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఆదాయం, రుణ వితరణ పరిమితులను చివరిసారిగా 2015లో ఆర్బీఐ సవరించింది. -
ప్రభుత్వ పెద్దల హర్షాతిరేకాలు...
కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం పట్ల అటు ప్రభుత్వ వర్గాలు నుంచి ఇటు పారిశ్రామిక వర్గాల వరకూ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాపారాలను తిరిగి గాడిలో పడేందుకు, మరింత ఉపాధి అవకాశాల కల్పనకు, అంతర్జాతీయంగా మందగమనంలోనూ భారత్‌ను తయారీ కేంద్రంగా చేసేందుకు, ఆర్థిక వృద్ధికి ఈ నిర్ణయం సాయపడుతుందని అభిప్రాయడుతున్నాయి. పెట్టుబడులు పెరుగుతాయి అద్భుతమైన నిర్ణయాలను ప్రకటించింది. ఈ నిర్ణయాలు దీర్ఘకాలంగా నిదానించిన ఆర్థిక వృద్ధికి తగిన ప్రేరణనిస్తాయి. మినహాయింపులు కూడా కలిపి చూస్తే మన పన్ను రేటు అమెరికా, దక్షిణాసియా దేశాలకు దీటుగా, పోటీనిచ్చేదిగా ఉంటుంది. మినహాయింపులను కూడా వినియోగించుకుంటే పన్ను రేటు చాలా తక్కువగా 15 శాతమే ఉంటుంది. పెట్టుబడులకు ప్రభుత్వ నిర్ణయాలు ప్రోత్సాహాన్నిస్తాయి. రూ.1.45 లక్షల కోట్లు నేరుగా కంపెనీల ఖజానాకు వెళతాయి. వాటిని తిరిగి పెట్టుబడులకు వినియోగించడం వల్ల వృద్ధికి ఊతం లభిస్తుంది. – పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య మంత్రి కార్పొకు ప్రేరణ ప్రభుత్వ నిర్ణయాలు కార్పొరేట్ రంగానికి తాజా శక్తి, ప్రేరణనిస్తాయి. – ధర్మేంద్ర ప్రదాన్, పెట్రోలియం మంత్రి చరిత్రాత్మక సంస్కరణ ఈ చరిత్రాత్మక సంస్కరణలు భారత్‌లో తయారీకి బలమైన ఊతమిస్తాయి. – స్మృతి ఇరానీ. మహిళా, శిశుఅభివృద్ధి మంత్రి ఇన్వెస్టర్లకు ఉత్సాహం... ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక రంగం అధిక వృద్ధి పథంలోకి అడుగుపెడుతుంది. – రాజీవ్ కుమార్, నీతిఆయోగ్ వైస్ చైర్మన్ సాహసోపేత నిర్ణయం కార్పొరేట్ పన్ను తగ్గింపును సాహసోపేత నిర్ణయం. ఇది ఆర్థి క వ్యవస్థకు ఎంతో సా నుకూలం. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాల ను కచ్చితంగా స్వాగ తించాల్సిందే. మనదగ్గరున్న ప్రతికూలతల్లో అధిక కార్పొరేట్ పన్ను రేట్లు కూడా ఒకటి. ఈ రోజు గణనీయంగా తగ్గించడం వల్ల థాయిలాండ్, ఫిలి ప్పీన్స్ వంటి వర్ధమాన దేశాలకు దగ్గరగా మన దేశాన్ని తీసుకెళుతుంది. దీనికితోడు సరళతర వడ్డీరేట్ల విధానం దేశాభి వృద్ధికి దోహదపడే అంశం. వృద్ధి లక్ష్యంగా ప్రభుత్వంతో ఆర్బీఐ కలిసి పనిచేస్తుంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఆర్థిక రంగానికి ఊతం ఆర్థిక రంగానికి ఊపునిస్తుంది. తయారీకి, మౌలిక సదుపాయాలకు గొప్ప ప్రేరణనిస్తుంది. ఈ అడుగు రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ (జీడీపీ వృద్ధి) వృద్ధి తిరిగి 8–9 శాతానికి చేరుకునేందుకు సాయపడుతుందని బలంగా నమ్ముతున్నాం. భారత్‌లో వేలాది ఉ ద్యోగాల కల్పనకు, 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ మార్క్నుకుచే రుకునే ప్రయాణం ఎంతో ఆశాజనకంగా ఉంది. – అనిల్ అగర్వాల్, వేదాంత రీసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పోటీకి సై... కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అమెరికా వంటి తక్కువ పన్ను రేటున్న దేశాలతో పోటీ పడేందుకు భారత కంపెనీలకు వీలు కల్పిస్తుంది. ఆర్థిక వృద్ధికి, చట్టబద్ధమైన పన్నులను చెల్లించే కంపెనీలకు మద్దతుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సంకేతమిస్తోంది. – ఉదయ్ కోటక్, కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈవో వృద్ధికి దోహదం వృద్ధి తిరిగి కోలుకునేందుకు, పెట్టుబడుల పునరుద్ధరణకు ఇదో గొప్ప అడుగు. సాహసోపేతమైన, అవసరమైన ఈ చర్యను తీసుకున్నందుకు ఆర్థిక మంత్రికి నా హ్యాట్సాఫ్. – కిరణ్ మజుందార్ షా, బయోకాన్ చైర్పర్సన్ తిరుగులేని సంస్కరణ... కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించడం అన్నది గడిచిన 28 ఏళ్లలోనే తిరుగులేని సంస్కరణ. కార్పొరేట్ కంపెనీల లాభాలకు తోడ్పడుతుంది. ఉత్పత్తుల ధరలు తగ్గేందుకు వీలు కల్పిస్తుంది. నూతన తయారీ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహాన్నిస్తుంది. భారత్‌లో తయారీని పెంచుతుంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ అపూర్వం, సాహసోపేతం ఎంతో కాలంగా ఉన్న డిమాండ్. దీన్ని నెరవేర్చడం అపూర్వమైనది, సాహసోపేతమైనది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ప్రేరణనిస్తుంది. తయారీని ప్రోత్సహిస్తుంది. ఆర్థిక రంగంలో ఉత్సాహాన్ని పెంచుతుంది. – విక్రమ్ కిర్లోస్కర్, సీఐఐ ప్రెసిడెంట్ -
పన్ను రేట్ల కోత..?
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మండలి 37వ కీలక సమావేశం శుక్రవారం గోవాలో జరగనుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో... పన్నులు తగ్గించాలని, తద్వారా వ్యవస్థలో డిమాండ్ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని పలు పారిశ్రామిక వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ కీలక జీఎస్టీ సమావేశం జరగనుంది. పన్నుల తగ్గింపుపై ఈ సమావేశం ఒక నిర్ణయం తీసుకోనుందని కూడా సమాచారం. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు సమావేశం కానున్నారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్టస్థాయి 5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో బిస్కెట్ల నుంచి ఆటోమొబైల్ విభాగం వరకూ, ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) నుంచి హోటెల్స్ వరకూ వివిధ రంగాల నుంచి రేట్ల తగ్గింపునకు గట్టి డిమాండ్ వస్తోంది. పన్ను కోతల వల్ల వినియోగం, దేశీయ డిమాండ్ పెరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే పన్నుల తగ్గింపువల్ల అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యవస్థ మరింత ఇబ్బందుల్లో పడుతుందని జీఎస్టీ కౌన్షిల్ ఫిట్మెంట్ కమిటీ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమావేశంలో చర్చించే అవకాశమున్న మరిన్ని అంశాలు... ► జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి 370 అధికరణ రద్దు నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు జీఎస్టీ చట్ట నిబంధనల వర్తింపునకు సవరణలపై చర్చ ►పసిడి, ఇతర విలువైన రాళ్ల రవాణా విషయంలో కేరళ ప్రతిపాదిస్తున్న ఈ–వే బిల్ వ్యవస్థపై దృష్టి ►ఆధార్ నంబర్‌తో జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనుసంధానించాలని∙ప్రతిపాదన. దశలవారీగా వాహనాలపై జీఎస్టీని తగ్గించాలి: హీరో మోటో ఆటోమొబైల్ వాహనాలపై దశలవారీగా అయినా జీఎస్టీ రేటును తగ్గించడాన్ని ప్రభుత్వం పరిశీలించాలని హీరో మోటోకార్ప్ కోరింది. ముందుగా ద్విచక్ర వాహనాలపై వెంటనే రేటును తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తర్వాత దశలో కార్లపై రేట్లను తగ్గించాలని సూచించింది. కీలకమైన జీఎస్టీ భేటీ శుక్రవారం జరగనుండగా, దానికి ఒక్క రోజు ముందు హీరో మోటో కార్ప్ ఈ డిమాండ్ చేయడం గమనార్హం. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం ఒకేసారి ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఉండదని పేర్కొంది. అదే సమయంలో 2 కోట్ల ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు ఇది ఉపశమనం ఇస్తుందని హీరో మోటోకార్ప్ సీఎఫ్‌వో నిరంజన్‌గుప్తా అన్నారు. కాగా, ఆటోమొబైల్ వాహనాలపై జీఎస్టీ తగ్గింపునకు జీఎస్టీ ఫిట్మెంట్ కమిటీ తిరస్కరించిన విషయం గమనార్హం. సానుకూల నిర్ణయం...: టాటా మోటార్స్ వాహన రంగం రంగం పురోగతికి సంబంధించి జీఎస్టీ మండలి నుంచి ఒక కీలక సానుకూల నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నట్లు టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గుంటర్ బషెక్ వ్యాఖ్యానించారు. -
ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ
-
షాకింగ్ : ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ
సాక్షి, న్యూఢిల్లీ: ఒక వైపు ఆర్థికమాంద్య పరిస్థితులనుంచి గట్కెక్కేందుకు కేంద్రం తీవ్రకసరత్తు చేస్తోంది. మరోవైపు అందరూ ఊహించినట్టుగానే మాంద్యం ముప్పు ముంపు కొస్తోంది. తాజాగా గణాంకాల ప్రకారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 5 శాతానికి పడిపోయింది. ఏప్రిల్-జూన్ మాసంలో ఇది 5.8 శాతంగా ఉంది. దీంతో జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి చేరింది. అటు జీవీఏ 4.9 శాతానికి క్షీణించింది. ఇది ఏప్రిల్-జూన్ మాసంలో 5.7 గా ఉంది. జీడీపీ తక్కువగా ఉంటుందని ఊహించినప్పటికీ, ఇంత దారుణ అంచనా వేయలేక పోయామనీ, దీంతో దేశంలో మరోసారి మాంద్యం రిస్థితులు నెలకొన్నాయని ఎనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధనలో భాగంగా పలు కీలక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారంనిర్వహించిన మీడియా సమావేశాన్ని ప్రకటించారు. ప్రధానంగా వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల ఏకీకరణను ప్రకటించారు. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 4 పెద్ద సంస్థలుగా రూపొందిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మోదీ సర్కార్ మెగా సర్వే
దేశ వాస్తవిక ఆర్థిక సమర్థతపై మదింపు వేసేందుకు కేంద్రం తొలిసారిగా భారీ సర్వే నిర్వహించనుంది. ఈ ఆర్థిక సర్వేలో చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారులు సహా అసంఘటిత రంగ కార్మికుల్ని జోడించనుంది. వివిధ అధ్యయనాలు పరిగణనలోకి తీసుకోని ఉద్యోగాలను ఇందులో కలపనుంది. భారీ ఎత్తున ప్రామాణిక ఆర్థిక సర్వే జరపడం వల్ల వ్యవస్థ పరిణామాలను మెరుగ్గా సమీక్షించేందుకు, వివిధ కార్యక్రమాలు, పథకాలు, విధాన సంబంధిత ప్రణాళికలపై సరైన అంచనా వేసే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మాసాంతంలో ఆరంభం పాతిక కోట్లకు పైగా కుటుంబాలు, ఏడు కోట్ల వ్యాపార సంస్థలు ఈ సర్వే పరిధిలోకి రాగలవని అంచనా వేస్తున్నారు. జూన్ మాసాంతానికి ఈ ప్రక్రియ ప్రారంభం కావచ్చునని, ఆరు మాసాల్లో సర్వే నివేదికలు అందవచ్చునని భావిస్తున్నారు. ఉపాధి కల్పనలో, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో మోదీ సర్కారు విఫలమైందంటూ ప్రతిపక్షం ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంలో పదే పదే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీధి వ్యాపారులను స్వయం ఉపాధి పొందుతున్న ఉద్యోగులుగా పేర్కొంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేక పార్టీలు ఎద్దేవా చేశాయి. 2018–19 ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసిక వృద్ధి రేటు 5.8 శాతానికి పడిపోవడం, గత 17 త్రైమాసికాలతో పోల్చుకుంటే అత్యంత కనిష్టానికి చేరుకోవడం వంటి పరిణామాలను తీవ్రంగా పరిగణించిన సర్కారు.. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే దిశగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఆర్థిక వృద్ధిని, పెట్టుబడులను, ఉపాధిని పెంచేందుకు బుధవారం ప్రధాని మోదీ రెండు కేబినెట్ కమిటీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
మోదీ నేతృత్వంలో రెండు క్యాబినేట్ కమిటీలు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా రెండు క్యాబినేట్ కమిటీల ఏర్పాటుకు మోదీ ఆదేశాలు జారీచేశారు. ఈ కమిటీలు ముఖ్యంగా ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధి మీద దృష్టి సారించనున్నాయి. ఈ రెండు కమిటీలకు కూడా మోదీ నేతృత్వం వహించనున్నారు. దేశంలో నిరుద్యోగిత రేటు పెరగడం, జీడీపీ వృద్ది కనిష్ట స్థాయికి పడిపోవడంతోనే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధిపై ఏర్పాటైన క్యాబినేట్ కమిటీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్, రమేశ్ పోక్రియాల్, ధర్మేంద్ర ప్రధాన్, మహేంద్రనాథ్ పాండే, సంతోష్ కుమార్ గంగ్వార్, హర్దీప్ సింగ్ పూరిలు సభ్యులుగా ఉండనున్నారు. పెట్టుబడులు ఆర్థిక వృద్ధిపై ఏర్పాటైన క్యాబినేట్ కమిటీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ సభ్యులుగా ఉంటారు. కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి ఏకంగా అయిదేళ్ల కనిష్ట స్థాయికి తగ్గింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిరుద్యోగిత రేటు 6.1 శాతంగా నమోదైంది. ఇది 45 ఏళ్లలోనే గరిష్టస్థాయి కావడం గమనార్హం. మోదీ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ నివేదికలు వెలువడ్డాయి. -
నిరుద్యోగం,ఆర్థికవృద్ధిపై ఫోకస్ పెట్టిన మోదీ
-
పరిశ్రమ వర్గాలతో 26న ఆర్బీఐ గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ: వచ్చే నెల పరపతి విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ త్వరలో పరిశ్రమవర్గాలతో భేటీ కానున్నారు. ఈ నెల 26న వాణిజ్య సంఘాలు, రేటింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారని, ఇందులో వడ్డీ రేట్లు, ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆలిండియా బ్యాంక్ డిపాజిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులను కూడా దీనికి హాజరుకావాలని ఆహ్వానించినట్లు వివరించాయి. ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కావడానికి సరిగ్గా వారం రోజులు ముందు.. ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక విధానాన్ని ప్రకటించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇదే ఎంపీసీ తొలి సమావేశం కూడా కావడంతో ఈ పరపతి విధాన సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ఎకానమీపై అభిప్రాయాలను, ఆర్బీఐపై అంచనాల గురించి తెలుసుకునేందుకు శక్తికాంత దాస్ ఇప్పటికే బ్యాంకర్లు, ప్రభుత్వ వర్గాలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు మొదలైన వాటితో సమావేశమవుతూనే ఉన్నారు. గతేడాది డిసెంబర్లో ఆర్బీఐ 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టారు. -
2019లో ప్రపంచవృద్ధి 3 శాతమే!
ఐక్యరాజ్యసమితి: ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఐక్యరాజ్యసమితి నిరాశాపూరిత నివేదిక విడుదల చేసింది. 2019లో ఈ వృద్ధి రేటు కేవలం 3 శాతంగా పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంచనాలను 3.7 శాతం (అక్టోబర్ అంచనా) నుంచి 3.5 శాతానికి తగ్గించింది. అయితే అంతకన్నా తక్కువ వృద్ధి రేటును ఐక్యరాజ్యసమితి అంచనావేస్తుండడం గమనార్హం. 2018లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.1 శాతంకన్నా కూడా ఇది తక్కువ కావడం మరో అంశం. వాణిజ్య యుద్ధం తీవ్రతలు, గుత్తాధిపత్య ధోరణులు, పలు దేశాల రుణ భారాలు, పర్యావరణ సమస్యల వంటివి 2019లో ప్రపంచం ముందు ఉన్న సవాళ్లని ఐక్యరాజ్యసమితి నివేదిక వివరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►ఐక్యరాజ్యసమితిలో ఆర్థిక సామాజిక వ్యవహారాల శాఖ, వాణిజ్య అభివృద్ధి వ్యవహారాల శాఖ, ఐదు ప్రాంతీయ ఆర్థిక కమిషన్లు సంయుక్తంగా ఈ 218 పేజీల నివేదికను రూపొందించాయి. ► జరుగుతున్న వృద్ధిలోసైతం అసమానతలు ఉన్నాయి. వృద్ధి ఫలలూ అతి పేద దేశాలకు చేరడం లేదు. ►పర్యావరణ సమతౌల్యం, పేదరిక నిర్మూలనకు నిధుల సమకూర్చుకోవడం, అసమానతలు రూపుమాపడం వంటి కార్యక్రమాలకు ప్రపంచదేశాల ఉమ్మడి కృషి అవసరం. ►ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 2018లో 6.6 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. 1990 తరువాత ఇంత పేలవ స్థాయి వృద్ధిని నమోదుచేసుకోవడం చైనాకు ఇదే తొలిసారి. ఇదే ధోరణి మున్ముందూ కొనసాగే వీలుంది. 2019లో వృద్ధి రేటు 6.3 శాతానికి పడిపోవచ్చు. ఐఎంఎఫ్ లెక్కింపు విధానం వేరు... ప్రపంచ వృద్ధి రేటు విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ఐక్యరాజ్యసమితి మధ్య వ్యత్యాసం ఉంది. విభిన్న విశ్లేషణా విధానాలను రెండు సంస్థలూ అవలంభించడమే దీనికి కారణం. చైనా, భారత్, కొన్ని అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి విషయంలో ఐఎంఎఫ్ వెయిటేజ్ ఐక్యరాజ్యసమితి వెయిటేజ్‌తో పోల్చితే కొంత అధికం. అర శాతం మేర అంచనాల్లో తేడాలు రావడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. – డాన్ హోలెండ్ ఐరాస ప్రపంచ ఆర్థిక పర్యవేక్షణావిభాగం చీఫ్ -
కన్నాట్ ప్లేస్ అత్యంత ఖరీదు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్లో మన దేశం నుంచి రెండు నగరాలకు చోటు దక్కాయి. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ 9వ స్థానంలో నిలవగా.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్ (బీకేసీ) 26వ స్థానంలో నిలిచాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ నివేదిక తెలిపింది. ప్రైమ్ ఆఫీస్ మార్కెట్ వృద్ధికి ప్రధాన కారణంగా సాంకేతికత, ఆర్ధిక వృద్ధి, ఈ–కామర్స్ రంగం అభివృద్ధేనని సీబీఆర్ఈ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా చైర్మన్ అన్షుమన్ మేగజైన్ తెలిపారు. అద్దె చ.అ.కు రూ.10,532.. ప్రైమ్ ఆఫీస్ మార్కెట్లో గతేడాది 10వ స్థానంలో నిలిచిన కన్నాట్ ప్లేస్.. ఈ ఏడాది ఒక స్థానం మెరుగు పరుచుకొని ప్రస్తుతం 9వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఏడాది అద్దె చ.అ.కు రూ.10,532, ముంబైలోని బీకేసీ మార్కెట్లో చ.అ.కు రూ.6,632లుగా ఉంది. అలాగే ముంబైలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ) ఖరీదైన ప్రాంతాల్లో 37వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఏడాదికి అద్దె చ.అ.కు రూ.5,002గా ఉంది. ఆసియా పసిఫిక్ జోరు.. ప్రపంచవ్యాప్తంగా 120 నగరాల్లో ప్రైమ్ ఆఫీస్ మార్కెట్ ఆక్యుపెన్సీ స్థాయి, ధరలపై సర్వే చేసింది. గత ఏడాది కాలంలో తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ ఆఫీస్ మార్కెట్ ఆక్యుపెన్సీ వ్యయ వృద్ధి అన్ని రీజియన్లలోనూ స్థిరంగా ఉందని నివేదికలో తేలింది. అద్దెలు, పన్నులు, సర్వీస్ చార్జీలు ఇతరత్రా ఆఫీస్ వ్యయాలను కలిపిన ప్రైమ్ ఆఫీస్ మార్కెట్ ఏటా 2.4 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని నివేదిక తెలిపింది. ఆర్ధిక వృద్ధి, స్థిరాస్తి లీజింగ్ లావాదేవీలు పెరగడంతో ఈఎంఈఏ, ఆసియా పసిఫిక్ రీజియన్లలో గతేడాది కంటే ఈ ఏడాది వృద్ధి వేగంగా జరిగింది. అమెరికాలో 3.2 శాతం, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా (ఈఎంఈఏ) 2 శాతం, ఆసియా పసిఫిక్ 1.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. తొలి స్థానంలో హాంకాంగ్.. అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్లో హాంకాంగ్, లండన్, బీజింగ్ నగరాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. హాంకాంగ్ సెంట్రల్లో వార్షిక అద్దె చ.అ.కు రూ.21,067, లండన్‌లో రూ.16,149, బీజింగ్‌లోని ఫైనాన్స్ స్ట్రీట్‌లో రూ.13,806గా ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో హాంకాంగ్‌లోని కౌవ్‌లూన్ (రూ.13,026), చైనాలోని సీబీడీ (రూ.13,018), న్యూయార్క్‌లోని మన్హటన్ (రూ.12,629), మిడ్‌టౌన్ (రూ.11,789), టోక్యోలోని మరూంచీ (రూ.11,784) ప్రాంతాలు నిలిచాయి. -
వచ్చే రెండు దశాబ్దాలు అధిక వృద్ధే: జైట్లీ
న్యూఢిల్లీ: వచ్చే రెండు దశాబ్దాల పాటు భారత్ అధిక వృద్ధి బాటలోనే కొనసాగగలదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. అతి పెద్ద సవాలైన పేదరికాన్ని రూపుమాపేందుకు ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. బ్యాంక్స్ బోర్డు బ్యూరో చైర్మన్ వినోద్ రాయ్ సహరచయితగా వ్యవహరించిన ’ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతం– పరిశీలన’ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా జైట్లీ ఈ విషయాలు తెలిపారు. గడిచిన ఏడు దశాబ్దాల్లో భారత్ అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ.. తట్టుకుని నిలబడిందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధి అధికంగా ఉండనున్నప్పటికీ సరిహద్దు భద్రత, చొరబాట్లు .. రెండూ సవాళ్లుగానే ఉండొచ్చని వివరించారు. -
విస్తరిస్తున్న విలాస మార్కెట్
ముంబై: ఖరీదైన బ్రాండెడ్ ఉత్పత్తుల వినియోగం పట్ల మక్కువ చూపే వారి సంఖ్య పెరుగుతోంది. అంతర్జాతీయ బ్రాండెడ్ ఉత్పాదనలు అందుబాటులోకి వస్తుండడంతో ఈ మార్కెట్ 30 శాతం వృద్ధితో డిసెంబర్ నాటికి 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుత దేశీయంగా సంపన్న ఉత్పత్తుల మార్కెట్ విలువ 23.8 బిలియన్ డాలర్ల మేర ఉంది. ‘‘యువతలో అంతర్జాతీయ బ్రాండ్ల వినియోగం పెరుగుతుండటం, చిన్న పట్టణాల్లో ఉన్నత తరగతి ప్రజలు కొనుగోలు శక్తితో లగ్జరీ కార్లు, బైక్‌లు, విదేశీ పర్యటనలు, దూర ప్రాంత వివాహాలు తదితర వాటితో ఈ మార్కెట్ ఈ ఏడాది చివరికి 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది’’ అని అసోచామ్ తన నివేదికలో పేర్కొంది. రానున్న మూడేళ్లలో ఈ మార్కెట్ ఐదు రెట్ల మేర వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. వృద్ధికి కారకాలు... ∙మిలియనీర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో మూడు రెట్లు పెరగనుండటం. ∙ఆర్థిక వృద్ధి పట్టణీకరణకు దారితీయడం, ఆదాయం పెరుగుతుండటం. ∙విలాస ఉత్పత్తుల అందుబాటు, మరిన్ని విలాస బ్రాండ్లు దేశంలోకి ప్రవేశించడం. ∙చిన్న పట్టణాల్లో ఇంటర్నెట్ వ్యాప్తి, ఖర్చు చేసే ఆదాయం పెరగడం వల్ల 2020 నాటి కి ఇంటర్నెట్పై 10 కోట్ల లావాదేవీలు జరుగుతాయి. దీంతో ఖరీదైన ఉత్పత్తుల వినియోగం ఎన్నో రెట్లు పెరగనుంది. ∙వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడం. ∙రిటైల్ పరిశ్రమకు సంబంధించి సానుకూల విధానాల ఫలితంగా అంతర్జాతీయ బ్రాండ్లకు ఆకర్షణీయంగా మారిన భారత్ మార్కెట్. -
వృద్ధి వేగం ఎలా? ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిపై ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. 40 మంది సీనియర్ ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు ఈ భేటీలో పాల్గొన్నారు. దేశాభివృద్ధి నాలుగేళ్ల కనిష్టానికి పడిపోవడం, ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం తాజా సమావేశ నేపథ్యం. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, ఉపాధి, ఆరోగ్యం, విద్య, తయారీ, ఎగుమతులు, పట్టణాభివృద్ధి, మౌలిక వనరుల కల్పన వంటి అంశాలు చర్చల్లో చోటుచేసుకున్నాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
మందగమనానికి మందు.. ఈ 10 అంశాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ద్రవ్య స్థిరీకరణ రోడ్‌మ్యాప్‌నకు కట్టుబడి ఉండాలని, పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాల కోసం దీన్ని పణంగా పెట్టకూడదని కొత్తగా ఏర్పాటైన ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) అభిప్రాయపడింది. గత నెలలో ఏర్పాటైన ఈ మండలి... బుధవారమిక్కడ నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ అధ్యక్షతన తొలిసారి సమావేశమయింది. ఆర్థిక వృద్ధి మందగమనాన్ని పరోక్షంగా అంగీకరిస్తూ... దీన్ని గాడిలో పెట్టడానికి వచ్చే ఆరు నెలల్లో ప్రధానంగా దృష్టి సారించాల్సిన 10 ప్రాధాన్యాంశాలను ఈ సమావేశం గుర్తించింది. వీటిలో ఉద్యోగాల కల్పనను పెంచటంతో పాటు ఆర్థిక వృద్ధిని వేగవంతం చెయ్యటం, అసంఘటిత రంగాల ఏకీకరణ, ఆర్థిక కార్యాచరణ, ద్రవ్య విధానం, ప్రభుత్వ వ్యయం, ఆర్థిక గవర్నెన్స్ వ్యవస్థలు, వ్యవసాయం, పశు సంవర్ధకం, వినియోగ ధోరణులు, ఉత్పత్తి, సామాజిక రంగం వంటివి ఉన్నాయి. ఆయా అంశాల కోసం తగిన వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలని, వీటి ద్వారా చేపట్టే చర్యలు చిట్టచివరి స్థాయి వరకూ వెళ్లేలా ఓ కన్నేసి ఉంచాలని సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పాల్గొని ఆర్థిక వృద్ధికి పెట్టుబడులు, ఎగుమతులు పెంచడం సహా అందుబాటులో ఉన్న పలు మార్గాల గురించి మండలికి వివరించారు. వృద్ధి మందగమనం నేపథ్యంలో పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా కేంద్రం ద్రవ్యలోటు లక్ష్యాన్ని మీరుతుందా? అన్న ప్రశ్నకు దేబ్రాయ్ స్పందిస్తూ... ద్రవ్య స్థిరీకరణ కసరత్తు నుంచి పక్క దారి పట్టకూడదన్న విషయమై మండలి సభ్యుల మధ్య ఏకాభిప్రాయం ఉందన్నారు. వచ్చే నెలలో మండలి మరోసారి అధికారికంగా భేటీ అవుతుందని, ఆ తర్వాత ప్రధానికి సిఫారసులు అందజేస్తామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 3.2%గా, వచ్చే ఏడాదికి 3%గా ప్రభుత్వం లక్ష్యాన్ని విధించుకుంది. -
ఆర్థిక మందగమనం వాస్తవం: ఎస్బీఐ
► సాంకేతికం కాదని స్పష్టీకరణ ► వృద్ధి కోసం ప్రభుత్వ వ్యయం పెరగాలని సూచన ముంబై: దేశ ఆర్థిక వృద్ధి మందగమనం అన్నది వాస్తవమేనని, ఇదేమీ సాంకేతిక అంశం కాదని ఎస్బీఐ స్పష్టం చేసింది. 2016 సెప్టెంబర్ నుంచి ఆర్థిక రంగం కుంగుబాటులో ఉందన్న ఎస్బీఐ దీనికి ముగింపు పలికేందుకు ప్రభుత్వం మరింతగా వ్యయం చేయాలని పిలుపునిచ్చింది. ఈ మందగమనం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనూ కొనసాగిందని, ఇది స్వల్పకాలానికి పరిమితమయ్యే సాంకేతిక అంశం కాదని ఎస్బీఐ పరిశోధన నివేదిక పేర్కొంది. జీడీపీ వృద్ధి వరుసగా ఆరో క్వార్టర్లోనూ తగ్గుముఖం పట్టి, ఏప్రిల్–జూన్‌లో 5.7 శాతానికి తగ్గడం సాంకేతిక కారణాల వల్లేనని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఇటీవలే వ్యాఖ్యానించారు. వృద్ధి రేటు యూపీఏ కాలంలో 2013–14 ఆర్థిక సంవత్సరంలో 4.7 శాతానికి పడిపోగా, అక్కడి నుంచి 7.1 శాతానికి పెరగిందని షా గుర్తు చేశారు. అయితే, ఎస్బీఐ నివేదిక షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉంది. ప్రభుత్వం తన వ్యయాలను పెంచడమే సమస్యకు అందుబాటులో ఉన్న పరిష్కారమని ఎస్బీఐ సూచించింది. ద్రవ్యలోటు, రుణ పరిమితులకు విఘాతం కలగకుండానే ఈ పని చేయాలని భావిస్తున్నట్టు పేర్కొంది. అయితే, గతంలో ఈ విధమైన చర్యలను రేటింగ్ ఏజెన్సీలు ఆర్థిక నైపుణ్యంగా పేర్కొంటూ దేశ రేటింగ్‌ను తగ్గిస్తామని హెచ్చరించిన విషయాన్నీ ఎస్బీఐ తన నివేదికలో ప్రస్తావించింది. -
వ్యాపార వృద్ధిపై సీఈవోల ధీమా
ముంబై: ఆర్థిక వృద్ధిపై అనిశ్చితి, వేగంగా మారిపోతున్న టెక్నాలజీ తదితర సవాళ్లతో కంపెనీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ.. సంస్థల సీఈవోలు మాత్రం వ్యాపార వృద్ధి అవకాశాలపై ధీమాగానే ఉన్నారు. దేశీయంగా 71 శాతం మంది సీఈవోలు రాబోయే పన్నెండు నెలల్లో తమ సంస్థల వృద్ధిపై విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఇది 38 శాతంగాను, చైనాలో 35 శాతం, బ్రెజిల్లో 57 శాతంగాను ఉంది. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ నిర్వహించిన 20వ సీఈవో సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 79 దేశాల్లో 1,379 మంది.. భారత్‌లో 106 మంది సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు. పెరుగుతున్న ఆదాయ స్థాయిలు, పట్టణీకరణ తదితర పటిష్టమైన వృద్ధి మూలాలు.. భారత సీఈవోల్లో ఆశావహ ధోరణికి కారణమని సర్వే నివేదిక పేర్కొంది. రాబోయే రోజుల్లో అమలు చేయబోయే సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పెరుగుదల తదితర అంశాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయని వివరించింది. సుశిక్షితులైన సిబ్బంది, ఆర్థిక వృద్ధిపై అనిశ్చితి, టెక్నాలజీ మార్పుల్లో వేగం, ప్రాథమిక మౌలిక సదుపాయాలు తగు స్థాయిలో లేకపోవడం, అధిక నియంత్రణ మొదలైనవి కంపెనీలకు ప్రధాన సవాళ్లుగా ఉంటున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా చైర్మన్ శ్యామల్ ముఖర్జీ తెలిపారు. సర్వే ప్రకారం భారత సీఈవోలు .. అమెరికా, చైనా, బ్రిటన్ వంటి పెద్ద విదేశీ మార్కెట్లలో అవకాశాలు దక్కించుకోవడంపై దృష్టి పెడుతున్నారు. -
సామాజికాభివృద్ధితోనే బంగారు తెలంగాణ
ఆర్థిక రంగ నిపుణుడు హనుమంతరావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన మూడేళ్లలోనే జాతీయ సగటుకన్నా మెరుగైన ఆర్థిక వృద్ధిరేటును సాధించిందని ఆర్థిక రంగ నిపుణుడు సీహెచ్ హనుమంతరావు అన్నారు. ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ సాకారాం కావాలంటే ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి, మానవాభివృద్ధి ఎంతో ముఖ్యమన్నారు. శనివారం సెస్ ఆడిటోరి యంలో జరిగిన తెలంగాణ ఎకనామిక్ అసోసి యేషన్ (టీఈఏ) వార్షిక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు నెలకొన్న రాజకీయ అనిశ్చితి, విద్యుత్ సమస్యల కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు తగ్గిందని, కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక అనిశ్చితి తొలగి సుస్థిర పాలన కొనసాగుతోందని, విద్యుత్ కష్టాలు లేకపోవడం తో పరిశ్రమలు, పెట్టుబడులు రావడం తదితర కారణాలతో ఆర్థిక వృద్ధి రేటు మెరుగైందని తెలిపా రు. అయితే రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలికవసతులతో పెరిగిన వృద్ధిరేటు సామాజిక, మానవాభివృద్ధి వైపు మళ్లడం లేదని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ చేస్తే నాణ్య మైన సేవలను ప్రజలు అందుకోవడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. అంగన్వా డీలను ప్లే స్కూల్‌గా మార్చడం, ఆరో తరగతి నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ప్రాథమిక విద్యపైనా దృష్టి సారించాలన్నారు. అధిక పన్నుతోనే వెనుకబాటు... మొఘల్ చక్రవర్తుల కాలం నుంచి వ్యవసాయంపై పన్ను వసూలులో నెలకొన్న వ్యత్యాసం వల్లనే ఏపీ, తెలంగాణ ప్రాంతాల మధ్య వైరుధ్యం కనిపించిందని సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ హెడ్ పి.గౌతమ్ అన్నారు. బ్రిటీష్ పాలనలో ఆంధ్రలో 10 శాతం పన్ను ఉంటే, తెలంగాణలో 50శాతం పన్ను వసూలు చేసేవారన్నారు. ఏపీ ఏర్పడిన తర్వాత కూడా పాలకులు పాత పన్ను విధానాన్నే కొనసాగించారని, ఫలితంగా తెలంగాణ నుంచి వచ్చిన రాబడిలోనూ కొంత మొత్తా న్ని ఆంధ్ర అభివృద్ధికి కేటాయించారన్నారు. ఈ విధానాన్ని రద్దు చేసిన కారణంగానే ఎన్టీఆర్‌కు తెలంగాణ ప్రజలు విశేషంగా మద్దతు తెలిపారన్నా రు. గత వందేళ్లలో తెలంగాణలో పన్ను విధానంపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.పి.ఆచార్య, టీఈఏ అధ్యక్షుడు తిప్పారెడ్డి, కార్యదర్శి ముత్యం రెడ్డి, ఉపాధ్యక్షురాలు రేవతి, సెస్ చైర్మన్ రాధాకృష్ణ, డైరెక్టర్ గాలబ్ తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధిరేటును ఎక్కువ చూపించలేదు
-
వృద్ధిరేటును ఎక్కువ చూపించలేదు
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సాక్షి, అమరావతి: వృద్ధి రేటును ఎక్కువగా చూపించలేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. కావాలని ఎక్కువ చూపించామంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. యనమల మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక వృద్ధిలో ఎలాంటి వివాదాలు ఉండవని, ఒక మెథడాలజీ ప్రకారం దీని లెక్కింపు జరుగుతుందన్నారు. 2014–15లో 8.5 శాతం, 2015–16లో 10.95 శాతం, 2016–17 అడ్వాన్స్డ్ అంచనాల ప్రకారం 12.61 శాతం వృద్ధి రేటు సాధించామని తెలిపారు. పర్ క్యాపిటా ఇన్‌కం 2014–15లో రూ.93,699, 2015–16లో రూ.1,08,163, 2016–17 అడ్వాన్స్డ్ అంచనాల ప్రకారం రూ.1,22,376 ఉందని వెల్లడించారు. జీఎస్డీపీ 2014–15లో రూ.5,26,470 కోట్లు, 2015–16లో రూ.6,09,934 కోట్లు, 2016–17లో 6,99,307 కోట్లు ఉందన్నారు. -
అధిక వృద్ధి సామర్థ్యం ఉంది..!
• ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ • ఉపాధి కల్పన ప్రణాళికలు అమలు జరుగుతున్నాయని వెల్లడి లండన్: భారత్‌కు అధిక ఆర్థికవృద్ధి సామర్థ్యం ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం ఇక్కడ పేర్కొన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూళన ప్రణాళికలు అమలు జరుగుతున్నాయని అన్నారు. దేశం తక్షణం ‘నగదు రహిత’ వ్యవస్థగా మారబోతోందన్న వార్తల్లో నిజం లేదనీ స్పష్టం చేశారు. అయిదు రోజుల బ్రిటన్ పర్యటన నిమిత్తం శుక్రవారం ఇక్కడకు వచ్చిన జైట్లీ, ఈ పర్యటనలో భాగంగా విదేశీ ఇన్వెస్టర్లు, బ్రిటీష్ సంస్థల సీఈవోలతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఒక వార్తా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వూ్యలో ముఖ్యాంశాలు... ⇔ పన్నుల ఎగవేత ధోరణిని అరికట్టాలన్నది నోట్ల రద్దు వెనుక ఉన్న పలు కారణాల్లో ఒకటి. అయితే నగదును తక్కువగా వినియోగించే వ్యవస్థను సృష్టించాలని నేను కోరుకుంటున్నాను. ప్రధాన వాణిజ్యాలు, ఆస్తి లావాదేవీలు, వేతన చెల్లింపులు, స్కూల్ ఫీజుల వంటివి నగదు రహితంగా ఉండాలన్నది మా ఉద్దేశం. ⇔ జూలై 1వ తేదీ నుంచీ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు జరుగుతుందని భావిస్తున్నాం. ⇔ గత కాలం వ్యాపారాలకు వర్తించే విధంగా పన్నులు (రిట్రాస్పెక్టివ్ ట్యాక్సేషన్) వేయడం వంటి చర్యలను పునరుద్ధరించాలనుకోవడం లేదు. ప్రస్తుతం ఇలాంటి సమస్యను చర్చల ద్వారాకానీ లేదా న్యాయపరమైన చర్యల ద్వారాగానీ పరిష్కరించుకోవాలన్నది మా అభిప్రాయం. ⇔ బ్రిటన్‌తో భారత్ వాణిజ్య సంబంధాల విషయానికి వస్తే... బ్రెగ్జిట్‌ను రక్షణాత్మక వాణిజ్య విధానంగా పోల్చడం సరికాదని బ్రిటన్ ఆర్థికమంత్రి సంతృప్తికరమైన స్థాయిలో నాకు వివరించారు. ఇక వీసా సరళీకరణల అంశం బ్రిటన్ ప్రభుత్వ పాలసీపై ఆధారపడి ఉంటుంది. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీలో ‘ట్రేడింగ్ గంట’ లండన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లండన్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో ట్రేడింగ్ ప్రారంభ గంటను మోగించారు. అనంతరం భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్లతో చర్చలు జరిపారు. అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల బ్రిటన్ మంత్రి లియామ్ ఫాక్స్సహా పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బడ్జెట్లో ఉద్దీపనలకు అవకాశం
ఇండియా రేటింగ్స్ అంచనా • పెద్దనోట్ల రద్దుతో వృద్ధి పునరుద్ధరణకు సహాయక చర్యలు తప్పవని విశ్లేషణ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వృద్ధి మందగమనం, రికవరీ చర్యలు తీసుకోవాల్సిన తక్షణ అవసరం నేపథ్యంలో ఫిబ్రవరి1 బడ్జెట్లో సహాయక చర్యలు ప్రకటించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ బుధవారంనాడు అంచనావేసింది. ఒకపక్క ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండగా, మరోపక్క పెద్ద నోట్ల రద్దు భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని ఈ ఫిచ్ గ్రూప్ అనుబంధ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. బడ్జెట్లో ఉద్దీపన చర్యలకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. జీడీపీ 6.8 శాతమే! నివేదిక అంచనాల ప్రకారం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 6.8 శాతానికి పడిపోతుంది. ఇంతక్రితం ఈ అంచనా 7.8 శాతం. ప్రస్తుత పరిస్థితి ప్రాతిపదికన చూస్తే– 2017–18 ఆర్థిక సంవత్సరంలో కూడా ఆర్థిక వృద్ధిపై కొంత ప్రతికూల ప్రభావం ఉండే వీలుంది. ముఖ్యంగా అసంఘటత రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంది. ఆర్థిక క్రియాశీలత తగ్గింది. ఉపాధి అవకాశాలపై ఈ ప్రభావం పడింది. కేంద్ర, రాష్ట్రాల వ్యయాలపైన సైతం స్వల్పకాలంలో డీమోనిటైజేషన్ ప్రభావం ఉంది. ఆయా అంశాలు బడ్జెట్లో ఉద్దీపన చర్యలకు దారితీస్తామని భావిస్తున్నాం. అయితే ఈ ఉద్దీపనలు వినియోగంవైపునగానీ లేదా పెట్టుబడుల రూపంలోగానీ ఉండే వీలుంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్యాలపై (2017–18లో జీడీపీలో 3 శాతం) కొంత రాజీపడాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. అక్టోబర్–డిసెంబర్లలో వృద్ధి 6 శాతం: నోమురా కాగా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 6%గా ఉంటుందని జపాన్ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ– నోమురా అంచనావేసింది. తదుపరి త్రైమాసికంలో ఇది మరింతగా 5.7 శాతానికి పడిపోతుందనీ విశ్లేషించింది. నోట్ల రద్దు కీలకమైన వినియోగం, సేవల రంగాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు పేర్కొంది. -
నోట్ల రద్దయితే ఏంటి.. చైనా కంటే భారతే ఫాస్ట్!
సింగపూర్ : పెద్ద నోట్ల రద్దుతో ఆర్థికవ్యవస్థ కొంత మందగించింది. ఇదే అవకాశంగా చైనా ఆర్థికవ్యవస్థ మనకంటే ముందుకు దూసుకుపోతుందా? అంటూ పలువురిలో పలు సందేహాలు నెలకొన్నాయి. కానీ దేశీయంగా పెద్ద నోట్ల ప్రభావం ఉన్నప్పటికీ, చైనా కంటే భారత్ ఆర్థికవృద్ధినే శరవేగంగా దూసుకెళ్తుందని ప్రపంచ ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ దిగ్గజ యూనివర్సిటీలన్నీ కలిపి ఏర్పాటుచేసిన కాన్ఫరెన్స్‌లో మాజీ సింగపూర్ రాయబారి, భారత సంతతికి చెందిన ఓ విద్యావేత్త ఇదే అంశాన్ని ఉద్ఘాటించారు. పెద్ద నోట్ల రద్దు ఆర్థికవ్యవస్థను నెమ్మదించేలా చేసినా... భారత ఆర్థికవృద్ధిలో దీర్ఘకాలికంగా ఎలాంటి మార్పు ఉండదని సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ పబ్లిక్ పాలసీ లీ కౌన్ యూ స్కూల్ డీన్ కిషోర్ మహబూబానీ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు భారత ఎకానమీకి దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుందన్నారు. ఆర్థికవ్యవస్థలో ఉన్న నల్లధనం వెనక్కివచ్చేస్తుందని ఇది ఆర్థికవ్యవస్థకు మంచిదని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ, చైనా కంటే భారత్ ఆర్థికవృద్ధే శరవేగంగా దూసుకెళ్తుందన్నారు. ఏకపక్ష ప్రపంచం(యునిపోలార్ వరల్డ్) నుంచి ఇప్పడు బహుళ ధ్రువ ప్రపంచం(మల్టీ-పోలార్ వరల్డ్)లోకి పయనిస్తున్నామని, ఇది చిన్న దేశాలకు ఎంతో మేలు చేకూరుస్తుందని కిషోర్ చెప్పారు. మల్టీ-పోలార్ వరల్డ్ సింగపూర్‌కు మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని, చైనా, అమెరికా, ఇండియా, యూరప్ దేశాలతో మనకు మంచి సంబంధాలున్నాయని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ ట్రెండ్స్‌పై చర్చ నేపథ్యంలో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటుచేశారు. మూడు రోజుల పాటు ఈ సమావేశం జరిగింది. భౌగోళిక రాజకీయ ఆందోళనలు, సైబర్ అటాక్స్, ఉత్తరకొరియా క్షిపణి ఆవిష్కరణ, బ్రెగ్జిట్ వంటి పలు విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు. -
ఈ ఏడాదే అటో..ఇటో!
• ప్రభుత్వానికి కీలకంగా మారిన సంస్కరణలు • 8 శాతం పైగా వృద్ధికి చర్యలు ముఖ్యం • డీమోనిటైజేషన్ నిధుల సద్వినియోగం ప్రధానం • కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాలి • బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు ప్రక్షాళన చేయాలి • కొత్త ఏడాదిపై విశ్లేషకుల అంచనా న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్ తదితర సంస్కరణల నేపథ్యంలో ప్రభుత్వ మనుగడకు ఈ ఏడాది చాలా ముఖ్యమైనదని, అటో ఇటో తేలిపోగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో అందుబాటులోకి వచ్చే రూ. 2.20 లక్షల కోట్లను 8 శాతం స్థాయి ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించుకుంటుందనేది చాలా కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. సమీప భవిష్యత్‌లో 8 శాతం వృద్ధి సాధించాలంటే.. ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళన చేయడం, మౌలిక సదుపాయాల కల్పనపై మరిన్ని నిధులు వెచ్చించడం తదితర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. ‘2017–18 సంవత్సరం ప్రభుత్వానికి కీలకం. డీమోనిటైజేషన్ విజయంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ బ్లాక్ ఎకానమీని అధికారిక ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి తీసుకురాగలిగిన పక్షంలో దీర్ఘకాలంలో వడ్డీ రేట్లు తగ్గగలవు. తద్వారా భారత్ 8–8.5 శాతం వృద్ధి సాధించేందుకు ఊతం లభించగలదు’ అని కేపీఎంజీ (ఇండియా) పార్ట్నర్ గిరీష్ వన్వారీ వ్యాఖ్యానించారు. ఆర్థిక ప్యాకేజీ అవకాశాలు.. ప్రస్తుతం దేశీయంగా పెట్టుబడులు మందగమన దశలో సాగుతున్నాయని, పెద్ద నోట్ల రద్దు దెబ్బతో వినియోగం కూడా మందగించిందని ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలుసు కనుక వచ్చే ఆర్థిక సంవత్సరం ఏదైనా ఆర్థిక ప్రోత్సాహక ప్యాకేజీల్లాంటివి ప్రతిపాదించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా వచ్చిపడిన అనధికారిక డిపాజిట్లపై పన్నులు, ఇతరత్రా వనరుల ద్వారా ప్రభుత్వానికి రూ. 2.2 లక్షల కోట్ల మేర నిధులు (స్థూల దేశీయోత్పత్తిలో 1.5 శాతం) రావొచ్చని అంచనా వేశారు. వ్యయాలు పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఈ నిధులు సరిపోగలవని శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఉపాధికి ఊతమిచ్చే విధంగా.. రోడ్లు, రైల్వేస్, ఇతరత్రా నిర్మాణ రంగ ప్రాజెక్టులపై వ్యయాల రూపంలో ఆర్థిక ప్యాకేజీ ఉండవచ్చని ఆయన వివరించారు. సవాళ్లు ఇవీ...: ప్రభుత్వం ముందు ప్రస్తుతం మూడు ప్రధాన సవాళ్లున్నాయని, వీటిపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని విశ్లేషకులు తెలిపారు. డీమోనిటైజేషన్ ప్రభావాలు మార్చి ఆఖరు దాకా కొనసాగే అవకాశముందని వివరించారు. అలాగే అంతర్జాతీయ పరిణామాలు; వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు అంశాలపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. సంస్కరణల అజెండాను కొనసాగిస్తూ.. కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించడం, డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించడం, బ్యాం కులు మొండిపద్దులను ప్రక్షాళన చేయడం, వెలికితీసిన నల్లధనాన్ని ఇన్ఫ్రాను మెరుగుపర్చేందుకు వెచ్చిం చడం వంటి చర్యలు తీసుకోవచ్చని వన్వారీ తెలిపారు. ఒకవేళ వెలికి తీసిన నల్లధనం కూడా వ్యవస్థలోకి వచ్చిన పక్షంలో వడ్డీ రేట్లు మరింతగా తగ్గి.. వృద్ధి 8–8.5% స్థాయి వైపుగా వెళ్లగలదని వన్వారీ చెప్పారు. మరోవైపు బ్యాంకుల్లోకి పెద్ద యెత్తున నిధులు వచ్చి పడిన నేపథ్యంలో ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించడంపై దృష్టి పెట్టొచ్చని, అమెరికా.. బ్రిటన్‌లో ఉన్న స్థాయుల్లోకి తీసుకురావొచ్చని శ్రీవాస్తవ తెలిపారు. తద్వారా పెట్టుబడులు తరలిపోకుండా చూడొచ్చన్నారు. ఇక ఖర్చులు చేయగలిగేంత నిధులు ప్రజల చేతుల్లో ఉండే విధంగా రాబోయే బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని రూ. 3 లక్షలకు పెంచాలని సూచించారు. ’భారత ఎకానమీ ఈ ఆర్థిక సంవత్సరంలో 7 శాతం మేర, వచ్చేసారి 7.4 శాతం మేర వృద్ధి చెందగలదని భావిస్తున్నాను. డీమోనిటైజేషన్, జీఎస్టీ అమలు, ఆర్థిక సంవత్సరం లెక్కింపు విధానం మార్పు మొదలైనవన్నీ పూర్తయిపోయి, పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత రెండేళ్ల వ్యవధిలో భారత్ 8 శాతం స్థాయి వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి’ అని శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
ఆర్థిక వృద్ధి రెండేళ్లలో సాధించింది కాదు: ప్రణబ్
గాంధీనగర్: దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతోందనీ, అయితే అది గత రెండేళ్లలో సాధించింది మాత్రమే కాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. గత 15 ఏళ్లుగా భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతం కన్నా ఎక్కువే ఉందనీ, రెండేళ్లు 8.5% వృద్ధిని కూడా సాధించామని గుర్తు చేశారు. గుజరాత్‌లోని గాంధీ నగర్లో ఉన్న ‘బాపూ గుజరాత్ విజ్ఞాన గ్రామం’ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని భిన్నత్వాన్ని ఆస్వాదించాలనీ, దాన్ని కృత్రిమంగా ఏకరూపంలోకి తీసుకురావొద్దని సూచించారు. -
‘లక్ష్మీ’కటాక్షమే!
పాలనురగలు.. సిరుల ముల్లెలు పచ్చని లోగిళ్లు.. హరిత వనాలు మొక్కలకు పుట్టిన రోజు పండుగలు సాధికారత దిశగా లక్ష్మీనగర్ మహిళలు పాపన్నపేట: ఆకాశంలో సగం.. అవనిపై సగం మాత్రమే కాదు కుటుంబ పోషణలో.. పర్యావరణ పరిరక్షణలో.. హరిత ఉద్యమంలో.. సామాజిక చైతన్యంలో.. ఆర్థిక ప్రగతిలో.. పొదుపు మంత్రంలో.. మేము సైతమంటూ సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు.. మెతుకు సీమకే ఆదర్శంగా నిలుస్తున్నారు లక్ష్మీనగర్ మహిళలు. పాలనురగలు ఆపల్లెకు సిరుల ముల్లెగా మారుతున్నాయి. వారి ఆర్థికాభివృద్ధికి మూలాలవుతున్నాయి. పాపన్నపేట మండలంలో మెదక్-బొడ్మట్‌పల్లి రోడ్డుపై ఉంది లక్ష్మీనగర్ గ్రామం.1950లో ఆంధ్రా›పాంతం నుంచి వలస వచ్చిన జనాలు ఈ గ్రామానికి పురుడు పోశారు. మంజీర గలగలల ఒడ్డున.. ఫతేనహర్ కెనాల్ పక్కన వెలసిన ఈ ప్రాంతం పచ్చని పంటలకు నిలయం. మగవారంతా వ్యవసాయం చేస్తుంటే.. పాడి వ్యాపారంతో ఆర్థికాభివృద్ధికి తమ శ్రమను సోపానాలుగా మారుస్తున్నారు ఆ గ్రామ మహిళలు. కుటుంబ పోషణకు మేము సైతమంటు తమ చేయూతనిస్తున్నారు. సుమారు 1200 జనాభా గల ఆ పల్లెలో సగంమందికి పైగా మహిళలే. మగవాళ్ళంతా పొలంపనులకు వెళ్తే మహిళలు పాడి పనులే లోకంగా బతుకుతుంటారు. ఈ పల్లెలో సుమారు 400కు పై గేదెలున్నాయి. కోడికూతతో నిద్ర లేచే మహిళలు మొదట అడుగులు వేసేది పశువుల పాక వైపే. పేడ తీయడం.. గడ్డివేయడం.. పాలు పితకడం..కేంద్రానికి తీసుకెళ్ళడం ప్రధాన దినచర్య. గ్రామంలో నెలకు సుమారు రూ.3 లక్షల ఆదాయం పాల వ్యాపారంపైనే వస్తుంది. ప్రణాళికాబద్ధమైన అడుగులు ప్రభుత్వ సహకారంతో మెరుగైన ప్రణాళికతో ప్రగతివైపు అడుగులు వేస్తున్నారు మహిళలు. గ్రామంలో 21 డ్వాక్రా గ్రూపులున్నాయి. పొడిచన్పల్లి యూకో బ్యాంకు ద్వారా ఒక్కో గ్రూపు రూ.5 లక్షల రూణాలను తీసుకొని ,గేదెలు కొనుగోలు చేశారు. అలాగే ఇటీవల నాబార్డ్ సహకారంతో 16 గ్రూపులకు చెందిన మహిళలొక్కక్కరు రూ.50 వేల చొప్పునపాపన్నపేట సహకార బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని ఒక్కో గేదెను కొనుక్కొచ్చారు. దళారి వ్యవస్థకు స్వస్తి చెప్పి మహిళలంతా గ్రూపుగా ఏర్పడి జనవరి 2015లో పాల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని విజయ డెయిరీ వాళ్ళకు విక్రయిస్తూ గిట్టుబాటు ధర పొందుతున్నారు. చాలా మంది మహిళలు తమ సంపాదనతో పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్ లాంటి కోర్సులు చదివిస్తున్నారు. పచ్చని లోగిళ్లు లక్ష్మీనగరంలో చెట్టు లేని ఇళ్లు లేదంటే అతిశయోక్తి లేదు. పూరిళ్లు అయినా.. ఆర్సీసి మేడ అయినా పచ్చని చెట్లతోనే స్వాగతం పలుకుతాయి. ఇటీవల హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 4 వేల మొక్కలు నాటారు. వాటి పరిరక్షణ కోసం మహిళలతో కూడిన కమిటీలు ఏర్పాటు చేసుకొని, వాటి చుట్టూ కంచెలు నాటి, ఎండా కాలంలో నీళ్లు పోస్తు వాటికి జీవం పోశారు. ప్రతి యేడు జూలై 10 రోజున వినూత్న రీతిలో మొక్కలకు పుట్టిన రోజు వేడుకలు జరుపుతుంటారు. అలాగే దేవస్థాన గోమాతకు శ్రీమంతం జరిపి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక్కడ మరుగుదొడ్డి లేని ఇళ్లు లేదు. బాలవికాస ఆధ్వర్యంలో మినరల్ వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం విలేజి డెవలప్మెంట్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. ఇందులో మహిళల క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామానికి చెందిన కమ్మలపాటి సాంబశివరావు, పద్మ, సాంబశివరావు, శారద అనే రెండు కుటుంబాలకు చెందిన నిరుపేద దంపతులు ప్రతిరోజూ చుట్టుపక్కల గ్రామాల్లో ఇడ్లీలు అమ్ముతున్నాను. సాంస్కృతిక కార్యక్రమాలతో మానసికోల్లాసం మహిళలు కేవలం కష్టపడి పనిచేయడమే గాకుండా సాంస్క ృతిక.. ఆద్యాత్మిక కార్యక్రమాల ద్వారా మానసికోల్లాసాన్ని పొందుతున్నారు. గ్రామంలోని సుమారు 50 మంది మహిళలు కోలాటాన్ని నేర్చుకొని తిరుపతి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, భిక్కనూర్, ఏడుపాయల ఆలయాల్లో ఉత్సవాల సమయాన ప్రదర్శన లిచ్చి అందరి మన్ననలు పొందారు. స్వాధ్యాయ కార్యక్రమం ద్వార ఆధ్యాత్మిక బోధనలతో పాటు శారీరక ఆరోగ్యాన్ని పొందడానికి మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే లక్ష్మీనగర్ మహిళలు శ్రమైక జీవన సౌందర్యాన్ని అనుభవిస్తూ తోటి మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
నేడు సాక్షి మైత్రి ఆధ్వర్యంలో మదుపరులకు అవగాహన
సిటీబ్యూరో: ‘సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ ఆధ్వర్యంలో ఆదివారం కొత్తపేటలో మదుపరుల అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. పెట్టుబడి అవకాశాలు అసంఖ్యాక రీతిలో వెల్లువెత్తుతున్న తరుణంలో సరైన పెట్టుబడి అవకాశాలను ఎంచుకోవడంలో అవసరమైన సూచనలు అందించి ప్రజల ఆర్థిక ప్రగతికి తోడ్పడాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్థిక రంగ నిపుణులు పాల్గొంటారు. ప్రధానంగా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించడం ఎలా? భవిష్యత్ అవసరాలకు అనువైన పెట్టుబడులు ఎలా పెట్టాలి? డీమాట్ గురించిన సమస్త సమాచారం, ఆర్థిక ప్రణాళిక-పెట్టుబడుల నిర్వహణ, మార్కెట్‌కు సంబంధించిన ఇతర సూచనలు, మెలకువలు నేర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో శివప్రసాద్ వెనిశెట్టి (రీజినల్ మేనేజర్, సీడీఎస్ఎల్), విజయ కుమార్ తిమ్ములూరు(స్టేట్ హెడ్, టీఎస్‌అండ్ ఏపీ కోటక్ మ్యూచువల్ ఫండ్), శ్యామ్‌ప్రసాద్ (అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్) పాల్గొంటారు. -
సంస్కరణలతోనే 7.5% వృద్ధి!
భారత్ వృద్ధిపై అమెరికా వ్యాఖ్య వాషింగ్టన్ : భారత్ పేర్కొంటున్న 7.5% వృద్ధి రేటు అంచనాలకు మించి ఉందని అమెరికా వ్యాఖ్యానించింది. ఆ వృద్ధి రేటు సాధ్యమవ్వాలంటే భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన రంగాల్లో ఆర్థిక సంస్కరణల అమలును వేగవంతం చేయాల్సి ఉందని పేర్కొంది. భూ సేకరణ, జీఎస్టీ.. తదితర కీలక బిల్లులపై అవసరమైన మద్దతు కూడగట్టడంలో వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. మోదీ ప్రభుత్వం పేర్కొన్న చాలా సంస్కరణలు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు ఎదురు చూస్తున్నాయని వ్యాఖ్యానించింది. దీనివల్ల గతంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతిచ్చిన పలువురు పెట్టుబడిదారులు వెనకడుగు వేస్తున్నారంది. జీఎస్టీ ఆమోదం పొందితే జీడీపీ వృద్ధికి అది గొప్ప ఊతమవుతుందని వ్యాఖ్యానించింది. అయితే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంపు సహా కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలను యూఎస్ ‘బ్యూరొ ఆఫ్ ఎకనమిక్ అండ్ బిజినెస్ ఎఫైర్స్’ విడుదల చేసిన ‘ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ స్టేట్మెంట్స్ ఫర్ 2016’ నివేదికలో ప్రశంసించారు. వ్యవస్థీకృత లోపాలు, నియంత్రణ వ్యవస్థలో బలహీనతలు, పన్ను, విధాన నిర్ణయాల్లో అనిశ్చితి, మౌలిక వసతుల కల్పనలో అడ్డంకులు, స్థానిక సమస్యలు, విద్యుత్ సరఫరా లోపాలు.. మొదలైనవి భారత ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. -
ఇక అద్భుత ఆర్థిక ప్రగతి
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: అద్భుత ఆర్థిక శక్తికి నిలయంగా ఉన్న తెలంగాణ పురోగతి అత్యంత గొప్పగా ఉండబోతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని, అది మరింతగా పెరగబోతోందని చెప్పారు. ఈ విషయం తాను చెబుతోంది కాదని, 14 వ ఆర్థిక సంఘమే స్పష్టం చేసిందని, ఎఫ్ఆర్బీఎం పరిమితిని 0.5 శాతానికి పెంచటం ద్వారా కేంద్రం కూడా దాన్ని తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. ‘‘రెండుమూడు రోజుల క్రితం నేను కొందరు ఆర్థిక నిపుణులతో మాట్లాడాను. 2019 నాటికి తెలంగాణ వార్షిక బడ్జెట్ కనిష్టంగా రూ.2 లక్షల కోట్లకు చేరుకుంటుందని వారు చెప్పారు. సాధారణంగా ఐదేళ్లలో ఆయా రాష్ట్రాల బడ్జెట్ రెట్టింపవడం సాధారణం. కానీ తెలంగాణ ఆర్థిక పరిపుష్టి నేపథ్యంలో 2024 నాటికి బడ్జెట్ విలువ రూ.5 లక్షల కోట్లకు చేరుకుంటుంది. అదీ తెలంగాణ ఆర్థిక శక్తి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే అది ఆర్థిక శక్తిగా మారుతుందని నేను ముందు నుంచి చెప్తున్న మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి..’’ అని అన్నారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక వాస్తవాలు, లెక్కలకు ఒక ఆర్థిక సంవత్సరం అవసరమైందని, ఇప్పుడు విషయం పూర్తిగా పట్టుబడిందని, ఇక అద్భుత ఆర్థిక ప్రగతి మన సొంతమని అన్నారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఆకుపచ్చ తెలంగాణ చేసి తీరుతాం.. ట్రిబ్యునళ్లు, కోర్టులున్నాయి. వాటిల్లో వాదిస్తున్నాం. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. కేంద్రాన్ని ఒప్పించి, ట్రిబ్యునళ్ల దగ్గర వాదించి 2022 నాటికి కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చి ఆకుపచ్చ తెలంగాణ చేసి తీరుతాం. ఈ సభా వేదిక ద్వారా ఏపీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. మనం తెలుగు మాట్లాడే రాష్ట్రాల వాళ్లం, ఇరుగుపొరుగు వాళ్లం. మన మధ్య విద్వేషాలొద్దు. అలంపూర్ నుంచి భద్రాచలం వరకు సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు మనవి. నీటి తగాదాలొద్దు. రేపు మనం ఉండకపోవచ్చు. కానీ ప్రజలుంటారు.. రాష్ట్రాలుంటాయి. నదుల్లో నీటి లభ్యత ఉన్నందున రైతాంగం శ్రేయస్సు కోసం సామరస్య పూర్వకంగా సాగుదాం. గతంలో సమైక్య రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదు. క ర్ణాటక నుంచి గుక్కెడు నీటిని తేలేకపోయింది. ఇప్పుడు తెలంగాణ మంచి వ్యవహారం కారణంగా అటు మహారాష్ట్రతో ఒప్పందం కుదిరి పనులు మొదలవుతున్నాయి. ఇటీవల సమస్య వస్తే కర్ణాటక జూరాలకు ఒక టీఎంసీ నీటిని ఇచ్చింది. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుందన్న పెద్దల మాట ఇక్కడ నిజమైంది. గవర్నర్ నాకు మార్గనిర్దేశకులు తెలంగాణను ఎలా అభివృద్ధిపథంలో ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు అని అడుగుతూ గవర్నర్ అడుగడుగునా సూచనలు సలహాలు ఇస్తూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు. గవర్నర్ పెద్దన్న తరహాలో నాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. విజ్ఞులు, మేధావులు ఇచ్చే సూచనల్నీ పరిగణనలోకి తీసుకుంటా. చిన్న జిల్లాలు.. యువ కలెక్టర్లు స్వాతంత్య్రానంతరం జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగని రాష్ట్రాలు రెండే. ఒకటి పశ్చిమబెంగాల్, రెండోది ఏపీ. రాష్ట్రాభివృద్ధి కోసం జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టాం. 15 లక్షల జనాభాకు ఒకటి చొప్పున చేసే ఆలోచనలో ఉన్నాం. ఈ ఏడాదే అవి మనుగడలోకి వస్తాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణలో పేదరికం ఉంది. ప్రస్తుతం రూ.36 వేల కోట్లను వివిధ పథకాల కింద పేదల లబ్ధికి ఖర్చు చేస్తున్నాం. ఇది తాత్కాలికమే. చిన్న జిల్లాలకు ఉత్సాహవంతులైన యువ కలెక్టర్లను నియమిస్తాం. వారికి ఆయా జిల్లాల కుటుంబాల పరిస్థితులపై అవగాహన ఉంటుంది. ఒక్కో పేద కుటుంబాన్ని చేరి ‘మీరు పేదగా’ ఉండొద్దు అని వారు చర్యలు తీసుకుంటారు. ఇదే విషయాన్ని నేను గవర్నర్ దృష్టికి తెచ్చా. ఇక 24 గంటల కరెంటు రాష్ట్రంలో ఇక కరెంటు కోతలుండవు. 24 గంటలపాటు త్రీఫేజ్ కరెంటు ఉంటుంది. 2018 తర్వాత నీటి కష్టాలు ఉండవు. 2022 తర్వాత కరువు రక్కసి తెలంగాణ వైపు చూసేందుకు కూడా భయపడుతుంది. రాజకీయ అవినీతి ఉండదు. కిందిస్థాయిలో ఉండే అవినీతిని పారదోలేందుకు పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తాం. అందుకు కొంత సమయం పడుతుంది. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించబోం. దాన్ని పరిపుష్టం చేస్తాం. కరెంటు ఉత్పత్తి టీఎస్ జెన్కో ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ప్రైవేటు ఉత్పత్తికి అనుమతించబోం. అలా అని ప్రైవేటుకు వ్యతిరేకం కాదు. అవసరమైన చోట్ల మాత్రమే ప్రైవేటుకు అవకాశం కల్పించి సమతూకంతో వ్యవహరిస్తాం. మనం కోటి ఎకరాలకు నీళ్లు పారించుకోవద్దా? గోదావరి, కృష్ణా నదుల్లో ప్రతి సంవత్సరం సగటున 4,200 టీఎంసీల పైచిలుకు నీళ్లు అందుబాటులో ఉంటున్నాయి. వీటితో నాలుగు కోట్ల ఎకరాలను పారించొచ్చు. తెలంగాణలో మనం పెట్టుకున్న లక్ష్యమెంత.. కోటి ఎకరాలు. మూడు కోట్ల ఎకరాల నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకుని, కోటి ఎకరాల నీళ్లు తెలంగాణ వాడుకుంటామంటే లొల్లి ఎందుకో నాకు అర్థమైతలేదు. ఇంక గొడవెందుకో తెలుస్తలేదు. నీటి లభ్యతపై లెక్కలు నావి కాదు, 47 సంవత్సరాల కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లెక్కలు చెప్తున్నవే. ఇటీవల ఏపీ సీఎం, అక్కడి నేతలు చేస్తున్న ప్రకటనలు పత్రికల్లో చదివి కలత చెందుతారేమోనన్న ఉద్దేశంతో ప్రజలకు స్పష్టతనిచ్చేందుకు నేనీ లెక్కలు చెప్తున్నా. నేను చండీ యాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు అమరావతిలో ఆయన ఇంటికి వెళ్లినప్పుడే ఈ విషయాలు వివరించా. మీ నీళ్లు మీరు తీసుకోండి.. మా నీళ్లు మేం తీసుకుంటామని చెప్పా. అయినా ఇప్పుడు ఎందుకు గొడవ చేస్తున్నారో అర్థం కావడం లేదు. -
చెట్ల నరికివేత అనుమతులు సులభం
ఉత్తర్వులు జారీ చేసిన అటవీశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహించి, తద్వారా ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాల కల్పనకు ‘వాల్టా’ చట్టాన్ని సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 344 సూత్రాల సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక కింద చెట్ల నరికివేతకు సరళీకృత అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు అటవీ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అటవీశాఖ పరిధిలోని భూముల్ని కేటాయించేప్పుడు వందలాది నిబంధనలు ఉండటంతో పారిశ్రామిక వేత్తలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ రూపొందించిన 344 సూత్రాల సంస్కరణల కార్యాచరణ ప్రణాళికకు సర్కార్ ఆమోదం తెలిపింది.. -
మరింత వృద్ధిని సాధిస్తాం..
న్యూయార్క్: ఆర్థిక వృద్ధి జోరును పెంచడానికి భారత్ పలు కీలకమైన సంస్కరణలను అమల్లోకి తెస్తోందని, వ్యవస్థాగత మార్పులు చేస్తోందని అరుణ్ జైట్లీ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన దానికంటే (7.6 శాతం) ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత మెరుగైన వృద్ధిని సాధిస్తామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సీఐఐ, ఏషియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్లు సోమవారం ఇక్కడ నిర్వహించిన మేక్ ఇన్ ఇండియా, ద న్యూ డీల్ పేరిట జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, భారత్ దీనికి అతీతం కాదని, అయినప్పటికీ భారత్ మంచి వృద్ధినే సాధిస్తోందని వివరించారు. రానున్న వారాల్లో దివాలా కోడ్ పార్లమెంటు ఆమోదం పొందగలదని, మొండిబకాయిల సమస్యకు సంబంధించి చట్ట రూపకల్పన కూడా తుది దశలో ఉందని చెప్పారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు తుది దశలో ఉందని, .. ఇలా చేయగలిగింది చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ పరిస్థితులు ఆందోళనకరం అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. రెండేళ్ల దాకా ఇదే పరిస్థితులు కొనసాగుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఆర్థిక మందగమనం నుంచి రక్షణ కోసం పలు దేశాలు రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నాయని, పరిమితి స్థాయిల్లో వృద్ది చెందేందుకు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఒకటి, లేదా రెండు శాతం వృద్ధి సాధించినా మంచి వృద్ధిగానే పలు దేశాలు సంబరపడుతున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావం భారత్‌పైనా కూడా తీవ్రంగానే ఉందని, ముఖ్యంగా ఎగుమతులు బాగా ప్రభావితమయ్యాయని వివరిం చారు. కమోడిటీ ధరలు, ముడి చమురు ధరలు తక్కువగా ఉండడం వల్ల కొందరికి మోదం, మరికొందరికి ఖేదం కలుగుతోందని చెప్పారు. ఇప్పుడు మరింత బలంగా... విదేశాలతో వాణిజ్యం విషయమై గతంలో అనిశ్చితిగా ఉండే భారత వైఖరి ఇప్పుడు బాగా మారిందని పేర్కొన్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్ ఇతర దేశాలతో నిర్వహించే వాణిజ్య కార్యకలాపాలు మరింతగా పెరుగుతున్నాయని వివరించారు. 1990ల్లో ఉన్న భారత్‌కు, 2016లో ఉన్న భారత్‌లో అసలు పోలికే లేదని తెలిపారు. వడ్డీరేట్లు దిగివస్తాయ్.. ప్రపంచమంతా ఆర్థిక మందగమనంతో అతలాకుతలమవుతుంటే మనం మాత్రం జోరుగా వృద్ధి సాధిస్తున్నామని జైట్లీ చెప్పారు. వర్షాలు బాగా కురిస్తే, సంస్కరణలు అమలైతే మరింత జోరుగా వృద్ధి సాధిస్తామని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముగియనున్న ఆర్బీఐ గవర్నర రాజన్ పదవీకాలాన్ని పొడిగిస్తారా అన్న ప్రశ్నకు సమాధానాన్ని ఆయన దాటవేశారు. ఆర్బీఐ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తోందని కితాబిచ్చారు. ద్రవ్యోల్బణం క్షీణత కొనసాగుతుందని, వడ్డీరేట్లు మరింతగా దిగివస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
భారత్ ఆర్థిక బాట బాగుంది..
న్యూఢిల్లీ: భారత్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు బాగున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టినా లగార్టీ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధికి దోహదపడే రీతిలో భారీ మౌలిక ప్రాజెక్టులకు పెట్టుబడులు అందుతున్నాయని అన్నారు. వృద్ధికి ఈ అంశం కీలకమని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. దీనివల్ల దేశంలో మధ్యకాలికం నుంచి దీర్ఘకాలంలో ఉత్పాదకత మెరుగుపడుతుందన్న అంచనాలను వెలువరించారు. వ్యవసాయం, తయారీ రంగాల్లో సైతం అవరోధాలు తొలగించడానికి తగిన కృషి జరుగుతున్నట్లు తెలిపారు. మూడు రోజుల అడ్వాన్సింగ్ ఆసియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి... * చమురు, గ్యాస్ నికర దిగుమతిదారుగా కొనసాగుతున్న భారత్, ఈ కమోడిటీల తక్కువ ధరల వల్ల అధిక ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతోంది. తద్వారా మౌలిక రంగం ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అవకాశం కలిగింది. * ఒకపక్క జనాభా పెరుగుతున్నా... తగిన పటిష్ట విధానాలు అవలంబించడం వల్ల వృద్ధికి ఎటువంటి అడ్డంకులూ ఏర్పడ్డం లేదు. * ఇక్కడ వృద్ధికి అవకాశం ఉంది. పెరుగుతున్న జనాభా.. ఈ నేపథ్యంలో మార్కెట్ల విస్తృతి, సంస్కరణలకు కట్టుబడి ఉండడం, సాంకేతికంగా పురోగతి, ఆర్థిక వ్యవస్థలో సృజనాత్మకత అన్నీ వృద్ధికి బాటలు వేసే అంశాలే. * చమురు ధరలు దిగువ స్థాయిలో ఉండడం వల్ల... ఈ పరిణామం ద్రవ్యోల్బణం కట్టడి, సరళతర పరపతి విధానాలకు దోహదపడుతుంది. ఈ దిశలో భారత్ ముందుకు వెళుతోందని విశ్వసిస్తున్నా. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చర్య: జయంత్ సిన్హా కాగా అడ్వాన్సింగ్ ఆసియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జయంత్ సిన్హా అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మందగించిన ఆర్థిక ఒడిదుడుకుల వల్ల రుణాలు చెల్లించలేని స్థితిలో ఉన్న కార్పొరేట్లను... ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ఒకే గాటన కట్టడం సరికాదని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం భారత్ పటిష్ట వృద్ధి బాటన నడుస్తోందన్నారు. అమెరికా, చైనా తరహాలోనే దీర్ఘకాలంలో పటిష్ట వృద్ధి బాటన నడవగలిగే సామర్థ్యాన్ని భారత్ ఆర్థిక వ్యవస్థ సముపార్జించుకుందన్నారు. జీడీపీ తలసరి ఇప్పటికీ చాలా తక్కువగా ఉందన్న ఆయన, ఈ విభాగంలో పురోగతికి తగిన అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం సైతం ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలిపారు. కొన్ని పారిశ్రామిక దేశాలు అనుసరిస్తున్న అసాధారణ ద్రవ్య విధానాలను వ్యవస్థ ఎదుర్కొనడంపై మదింపు జరపాలన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ జయంత్ సిన్హా పిలుపును ఆయన సమర్థించారు. కొన్ని దేశాల సంకుచిత విధానాలు మొత్తం ప్రపంచంపై కొంత ప్రతికూలత చూపే అవకాశం ఉందని కూడా అన్నారు. -
వృద్ధి అంచనాలను తగ్గించిన ఫిచ్
న్యూఢిల్లీ: ఫిచ్ రేటింగ్స్ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ 8% వృద్ధిని సాధిస్తుందని డిసెంబర్లో ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ అంచనాలను తాజాగా 7.7%కి తగ్గించింది. అయితే, వృద్ధి విషయంలో ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 7.5% వృద్ధి సాధిస్తుందన్న అంచనాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఫిచ్ తన తాజా గ్లోబల్ ఎకనామిక్ అవుట్‌లుక్(జీఈఓ)లో పేర్కొంది. ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందున ఆర్బీఐ కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించే అవకాశాలున్నాయని పేర్కొంది. -
7,400 దిగువకు నిఫ్టీ
అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిపై తాజాగా ఆందోళనలు చెలరేగడం, ముడి చమురు ధరలు మరింత బలహీనపడడం వంటి కారణాల వల్ల భారత స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలపాలయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,400 పాయింట్ల దిగువకు పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 316 పాయింట్లు క్షీణించి 24,223 పాయింట్ల వద్ద, నిఫ్టీ 94 పాయింట్లు నష్టపోయి 7,362 వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు వారాల కనిష్ట స్థాయి.గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 647 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్‌కు రానున్న బడ్జెట్ కీలకమన్న విశ్లేషణలు ఉన్నాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: తమ విదేశీ భాగస్వామి అయిన బీఎన్పీ పారిబా కార్డిఫ్ మరో 10 శాతం వాటాను కొనుగోలు చేసిన తర్వాత ఐపీఓ అంశాన్ని పరిశీలిస్తామని ఎస్బీఐ లైఫ్ ఎండీ, సీఈఓ అరిజిత్ బసు చెప్పారు. దిలిప్ బిల్డ్‌కాన్: మళ్లీ ఐపీఓ పత్రాలనుసెబీకి సమర్పిం చింది. రూ.430 కోట్ల సమీకరణ లక్ష్యం. -
పాలసీ రేట్లు యథాతథం..
♦ రానున్న బడ్జెట్లో ప్రభుత్వ చర్యలపైనే దృష్టి.. ♦ ఆర్థిక వృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణం రిస్కుల ప్రభావం ♦ రెపో రేటు 6.75 శాతం, ♦ రివర్స్ రెపో 5.75%, సీఆర్ఆర్ 4 శాతంగా కొనసాగింపు ♦ ఈ ఏడాది వృద్ధి రేటు అంచనా 7.4 శాతం ♦ తదుపరి పాలసీ సమీక్ష ఏప్రిల్ 5న... అందరి అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈసారి పాలసీ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. కీలక పాలసీ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయకుండా యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. రేట్ల కోత అంశాన్ని కేంద్ర ప్రభుత్వ కోర్టులోకి నెట్టారు. రానున్న బడ్జెట్లో నిర్మాణాత్మక సంస్కరణలపై ప్రభుత్వం చేపట్టే చర్యలు, స్థూల ఆర్థిక అంశాలకు అనుగుణంగా భవిష్యత్తులో వడ్డీరేట్ల తగ్గింపు ఆధారపడి ఉంటుందని రాజన్ స్పష్టం చేశారు. వృద్ధి మందగమనం ఆందోళనలు, ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్కులు కూడా ఆర్బీఐ తాజా నిర్ణయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముంబై: రిజర్వ్ బ్యాంక్ వరుసగా రెండోసారీ ఎక్కడి రేట్లను అక్కడే వదిలిపెట్టింది. మంగళవారం నిర్వహించిన ఆరో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలకమైన రెపో రేటును ఇప్పుడున్న 6.75 శాతం వద్దే ఉంచుతున్నట్లు ప్రకటించింది. రివర్స్ రెపో రేటు 5.75ు, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)ని 4%గా కొనసాగించింది. తాజా సమీక్షలో ఆర్బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదని అత్యధిక శాతం మంది విశ్లేషకులు, బ్యాంకర్లు అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గడిచిన ఏడాదిలో 4 సార్లు పావు శాతం చొప్పున(1.25%) రెపో రేటును ఆర్బీఐ తగ్గించింది. తదుపరి పాలసీ సమీక్ష ఏప్రిల్ 5న ఉంటుంది. వృద్ధి రేటు అంచనాల్లో మార్పుల్లేవు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటును గతంలో అంచనా వేసిన విధంగా 7.4 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఇతరత్రా సవాళ్ల నేపథ్యంలో ఇది తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదని పేర్కొంది. ప్రపంచ బ్యాంక్ వృద్ధి అంచనా 7.3 శాతం కంటే ఇది అధికమే కావడం గమనార్హం. ఇక వచ్చే 2016-17 ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి రేటు 7.6 శాతానికి పెరగవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. వరుసగా రెండేళ్లపాటు వర్షపాతం కొరత తర్వాత రానున్న సీజన్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయని, దీంతోపాటు కంపెనీల ఉత్పాదక వ్యయాలు తగ్గుముఖం పట్టడం, ప్రజల వాస్తవా ఆదాయాలు మెరుగుపడుతుండటం వంటివి వృద్ధి పుంజుకోవడానికి దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. మొండిబకాయిలపై వెనక్కితగ్గం... బ్యాంకుల్లో భారీగా పేరుకుపోతున్న మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్యను తగ్గించడంపై ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. మొండిబకాయిలుగా మారే అవకాశం ఉన్న 150 కీలక ఖాతాలను గుర్తించిన ఆర్బీఐ.. వీటికి ఎన్పీఏలుగా పరిగణించి తగినవిధంగా కేటాయింపులను(ప్రొవిజనింగ్) చేయాల్సిందిగా బ్యాంకులను ఇప్పటికే ఆదేశించింది. ఈ ప్రభావంతో బ్యాంకులు దాదాపు రూ.70 వేల కోట్లను ప్రొవి జనింగ్ రూపంలో కేటాయించాల్సి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి కల్లా బ్యాంకులు ఎన్పీఏల సమస్యను పరిష్కరించుకోవాలంటూ ఆర్బీఐ ఇప్పటికే డెడ్‌లైన్ విధించింది. కాగా, తాము చేపట్టిన ఈ ప్రక్రియ కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టం కావడంతోపాటు ఆర్థిక వ్యవస్థలో భవిష్యత్తు అవసరాలకు తగిన నిధులను అందించేలా బ్యాంకులు సంసిద్ధమవుతాయని రాజన్ పేర్కొన్నారు. ఇప్పటికీ మాది సరళ విధానమే.. ఆర్థిక వ్యవస్థను మరింత సరళీకరించడం, వృద్ధికి సానుకూల పరిస్థితులను కల్పించడం, పెట్టుబడులకు ప్రోత్సాహం వంటి పలు చర్యలను చేపడతామని ప్రభుత్వం చెబుతూవస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నెల 29 సమర్పించనున్న బడ్జెట్లో వీటిపై ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేదానిపైనే మేం దృష్టిపెట్టాం. నిర్మాణాత్మక సంస్కరణలతో వృద్ధికి ఊతం లభిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ వ్యయాలను అదుపు చేస్తే దీనివల్ల రేట్ల కోతకు అవకాశాలు పెరుగుతాయి. అంతిమంగా ఆర్థిక వృద్ధికి చేదోడుగా నిలుస్తుంది. ఈ ఏడాది జనవరి ద్రవ్యోల్బణం లక్ష్యం 6 శాతాన్ని కచ్చితంగా అందుకుంటాం. వచ్చే ఏడాది మార్చి నాటికి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాం. అంతర్జాతీయంగా భారీగా దిగొచ్చిన ముడిచమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగడం, ఈసారి వర్షాలు సరిగ్గా కురవడం, రూపాయి మారకం విలువ వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. సరళ పాలసీ ధోరణినే ఇప్పటికీ మేం కొనసాగిస్తున్నాం. మా లక్ష్యానికి అనుగుణంగానే ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. అయితే, రానున్న కాలంలో ద్రవ్యోల్బణం ధోరణి ఎలా ఉంటుందనే గణాంకాల కోసం వేచిచూస్తున్నాం. దీన్ని దృష్టిలోపెట్టుకునే ఈసారి పాలసీ నిర్ణయం తీసుకున్నాం. - రఘురామ్ రాజన్, ఆర్బీఐ గవర్నర్ స్టార్టప్‌లకు చేయూత దేశంలో స్టార్టప్ సంస్థలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహానికి ఆర్బీఐ కూడా తన వంతు చేయూతనందించేందుకు ముందుకొచ్చింది. వ్యాపారం ప్రారంభించేందుకు అవసరమైన అనుమతుల కోసం ఎంట్రప్రెన్యూర్లు పలు చోట్లకు తిరగాల్సిన పనిలేకుండా నిబంధనలను సరళతరం చేస్తున్నట్లు రాజన్ ప్రకటించారు. ‘స్టార్టప్‌ల ఏర్పాటు ప్రక్రియను సరళం చేయాలన్నదే మా ఉద్దేశం. దేశీయంగా, విదేశాల నుంచి నిధులను సులువుగా సమీకరించే వీలు కల్పిస్తాం. అన్ని రకాల దరఖాస్తు ఫారాలనూ ఆన్లైన్లో ఉంచుతాం’ అని రాజన్ పేర్కొన్నారు. రెపో రేటు: బ్యాంకులు స్వల్పకాలిక అవసరాల కోసం తీసుకునే నిధులపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు. రివర్స్ రెపో: ఆర్బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై వాటికి లభించే వడ్డీరేటు. సీఆర్ఆర్: బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో కచ్చితంగా ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన పరిమాణం. వచ్చే ఆర్థిక సంవత్సరం 0.75 శాతం కోత: బ్యాంకర్ల అంచనా ♦ మంగళవారం పాలసీ నిర్ణయం ముందుగా ఊహించిందేనని బ్యాంకర్లు పేర్కొన్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం ముప్పావు శాతం (0.75 శాతం) రెపో రేటు కోత ఉంటుందని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ♦ {దవ్యోల్బణం అంచనాలకు అనుగుణంగానే రేటు కోత ఉంటుందని తాము అంచనా వేసినట్లు ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ద్రవ్య లభ్యత కోసం ఆర్బీఐ తగిన ఆర్థిక సాధనాలను వినియోగించాలని కోరారు. ♦ బడ్జెట్, ద్రవ్యోల్బణం అంచనాలు, వృద్ధి ధోరణులకు అనుగుణంగానే ప్రస్తుతం ఆర్బీఐ తగిన నిర్ణయం తీసుకుందని తాను భావిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ పేర్కొన్నారు. ♦ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ అభీక్ బారువా మాట్లాడుతూ, అంతర్జాతీయ ధోరణికి ప్రతికూలంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ద్రవ్య సరళతర విధానంవైపు ఆర్బీఐ వెళ్లే పరిస్థితి లేదన్నారు. అయితే ఈ ఏడాది పావు శాతం నుంచి అరశాతం వరకూ రెపో రేటు కోత ఉండే అవకాశం ఉందని మాత్రం ఆయన అన్నారు. ♦ వృద్ధికి రేటు కోత తప్పదు: పరిశ్రమ: ఆర్బీఐ నిర్ణయం పట్ల పారిశ్రామిక వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. నిధుల సమీకరణ వ్యయం తగ్గడానికి, పెట్టుబడుల పురోభివృద్ధికి తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి రేటు కోత తప్పనిసరని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బడ్జెట్ తరువాత ఈ దిశలో ఆర్బీఐ చర్యలు ఉంటాయన్నది కూడా తమ అభిప్రాయమని అన్నారు. ♦ డిమాండ్ ఇంకా బలహీనంగా ఉందని, నిధుల భారం తగ్గలేదని ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్థన్ నోటియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ♦ {దవ్యోల్బణం, ద్రవ్యలోటులపై ఏడవ వేతన సంఘం సిఫారసుల అమలు ప్రభావం రేటు కోత అవకాశాలను దెబ్బతీస్తుండడం ఆందోళన కలిగిస్తోందని అసోచామ్ ప్రెసిడెంట్ సునీల్ కనోరియా అన్నారు. -
క్షీణతను ఆపలేని గణాంకాలు..!
అవలోకనం మన ఆర్థిక చరిత్రలో ఒక వింత దశ గుండా ప్రయాణిస్తున్నాం. ఈ సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి -జీడీపీ-లో 9 శాతం పెరుగుదల సాధించే అవకాశ ముందని ఆర్థిక మంత్రి ఇటీవలే మాట్లాడారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కీలక ఆర్థిక వ్యవస్థగా ఉంటోందన్న వాస్తవాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విజయ సంకేతంగా తరచుగా ఉదహరిస్తున్నారు. అధికారిక ప్రకటనలను బట్టి చూస్తే, కల్లోల ప్రపంచంలో భారత్ ఒక ప్రశాంత ఆర్థిక ద్వీపంగా కనిపిస్తుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోని అనర్థ ఆర్థిక నిర్వహణలో చాలా భాగం ఇప్పుడు మన వెన్నంటే ఉంది. ఈలోగా 2014లో నరేంద్రమోదీ కేంద్రంలో అధికారాన్ని స్వీకరించిన నాడు ఉన్న స్థాయికి మన స్టాక్ మార్కెట్ పడిపోయింది. రూపాయి పరిస్థితి కూడా అలాగే ఉంది. దానికి తోడుగా ప్రభుత్వ ఆశావాదానికి, మార్కెట్ల నిరాశా వాదానికి మధ్య పొంతన కుదరటం లేదు. మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థలో వర్ధమాన మార్కెట్ల విభాగాధిపతి రుచిర్ శర్మ, ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్‌కి కొన్ని రోజుల క్రితం ఇచ్చిన అద్భుతమైన ఇంటర్వ్యూలో భారత ఆర్థిక పరిస్థితిపై కొన్ని కీలకమైన సూచనలు చేశారు. రుచిర్ శర్మ సూచనల్లో మొదటిది.. ప్రపంచ వాణిజ్య వృద్ధి 2015లో జీరో స్థాయికి పతనమైపోయింది. రెండు.. ప్రపంచ వాణిజ్యంలో జీరో శాతం వృద్ధి నమోదు చారిత్రకంగా ఆర్థిక మాంద్య కాలంలోనే సంభవిం చింది. అంటే మనం ఇప్పటికే మాంద్యంలోకి ప్రవేశించా మని అర్థం. దీనికి మరొక సంకేతం ఏదంటే సగటున ప్రతి ఎనిమిదేళ్లకు ఒకసారి మాంద్యం ఏర్పడేది. ఈ తర్కం బట్టి చూస్తే, అలాంటి మాంద్యం ఇప్పుడు పొంచి ఉంది. మూడు.. భారత ఎగుమతులు 5 శాతం ప్రతికూల స్థాయికి పతనమయ్యాయి. అంటే ఎగుమతులు 5 శాతం ప్రతికూల వృద్ధిలో ఉన్నప్పుడు దేశం 8 శాతం వృద్ధి చెంద డం అసంభవం (భారత్ 8 శాతం వృద్ధి సాధించిన సమ యంలో మన ఎగుమతులు ఏటా 20 శాతం పెరుగుదల సాధించేవి). నాలుగు. ప్రపంచంలోనే అత్యంత రక్షణాత్మక వైఖరిని అవలంబిస్తున్న దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగుతోంది. ఇక నరేంద్రమోదీ పాలనలో జరిగిన సంస్కరణలు చాలా చాలా తక్కువే. ప్రపంచ దేశాలన్నింటితో పోలిస్తే, 2015 సంవత్సరంలో అత్యధిక రక్షణాత్మక చర్యలు చేపట్టిన రెండో దేశంగా భారత్‌కు చోటు దక్కింది. ఇది వ్యక్తిగతంగా నాకు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఎందుకంటే పలు సంస్కరణలను ప్రతిపక్షం అడ్డుకుంటోందన్న వార్తలే మనకు వినపడు తుంటాయి తప్ప, కేంద్ర ప్రభుత్వమే వాస్తవానికి సంస్క రణలను క్రియాశీలకంగా వెనక్కు మరలిస్తున్న విషయాన్ని మనం ఎన్నటికీ వినడం లేదు. అయిదు. 500 భారతీయ అగ్రశ్రేణి సంస్థలు 2015లో జీరో శాతం అమ్మకాల వృద్ధిని చవిచూశాయి. తదను గుణంగా, 2016 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో వీటి లాభ వృద్ధి ప్రతికూలంగానే ముగియనుంది. మన జీడీపీ వృద్ధి ఒత్తిడిలో ఉందనడానికి ఇది రెండో సంకేతం (క్షీణ ఎగుమతి వృద్ధితోపాటు). ఆరు. ప్రభుత్వ జీడీపీ డేటాకు, కార్పొరేట్ వ్యవహా రశైలికి మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. దీనివల్లే భారత ప్రభుత్వ డేటా విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోంది. దీనికి సంబంధించి మరికొన్ని కలవరపర్చే సూచికలూ ఉన్నాయి. రుణాల వృద్ధి (నూతన ఆర్థిక కార్యకలాపాలకు రుణాలు అని అర్థం) పతనమైంది. భారతీయ కార్పొరేట్ సంస్థలు పూర్తిగా రుణవలయంలో ఉన్నాయి. మన ప్రభుత్వ బ్యాంకుల్లో మొండి బకాయిలు అత్యధిక శాతంలో ఉంటున్నాయి. మన ప్రభుత్వం మాత్రం తను ప్రకటించిన డేటాకు కట్టుబడి ఉంది. అంచనా ప్రాతిపదికన వ్యాప్తి చెందే సిద్ధాం తాల కంటే పన్ను వసూళ్లలో పెరుగుదల వంటి నిర్దిష్ట అంశాలకు విశ్వసనీయత అధికంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. దీనికి తోడు విదేశీ పరపతి సంస్థలు 2016లో భారత్ అధిక వృద్ధి రేటును (దాదాపు 7 శాతం) సాధించ గలదన్న అంచనాలను కొనసాగిస్తున్నాయి. ఈ కథనం ప్రారంభంలో నేను ప్రస్తావించినట్లుగా ఇలాంటి పరిస్థితే వింతలను సృష్టిస్తోంది. మన ఆర్థిక వ్యవస్థ నిజంగానే అద్భుతరూపంలో ఉండి 9 శాతం వృద్ధి రేటును చేరనుందా లేక పేలవంగా తయారై మందగిస్తోందా? ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడిందా లేక 2015ను అది సంస్కరణల వెనకడుగు సంవత్సరంగా మలిచిందా? ఈ రెండు విషయాలూ నిజం కాకపోవచ్చు. వీటిలో ఏదో ఒకటి నిజం కావలసి ఉంది. ప్రభుత్వం చెబుతున్న అంకెలకు, రుచిర్ శర్మ చెబుతున్న అంశాలకు మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకుంటోంది? ఆర్థిక మంత్రి ప్రకటిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని మార్కెట్ ఎందుకు ప్రతిబిం బించడం లేదు? దేశీయ కారణాల వల్ల కాకుండా గ్లోబల్ సంకేతాల వల్లే ఇలా జరుగుతోందా? ప్రభుత్వ డేటాను అంగీకరించడంలో నాకు ఎలాంటి సమస్యా లేదు కానీ, ఇది ప్రధానమంత్రి మరింత ప్రత్య క్షంగా జోక్యం చేసుకోవలసిన సమస్య అని నేను భావిస్తున్నాను. నెల తర్వాత నెల గడిచేకొద్దీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నమోదవుతున్న గణాంకాలు ప్రభుత్వ ఆశావా దానికి అనుగుణంగా ఉండ కపోగా అవి మరింత అయో మయాన్ని సృష్టిస్తున్నాయి. ఉదాహరణకు, మన ఎగుమ తులు క్షీణిస్తున్నప్పటికీ, ఆటోమొబైల్ అమ్మకాలు నిరంతరం పెరుగుతున్నాయి. పైగా పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధికి సంబంధించి ఎలాంటి అంచనాలూ కనిపించడం లేదు. చివరకు, చమురు ధరలు కూడా వాస్తవంగా మనం భావిస్తున్న మంచివార్తలను అందివ్వడం లేదు. చమురు ధరలు మరింతగా తగ్గితే (లేదా బ్యారెల్‌కు ప్రస్తుతమున్న 30 డాలర్ల ధర వద్దే నిలిచిపోయినప్పటికీ ) అది వాస్తవానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చెడువార్తే అవుతుంది. సర్వత్రా మాంద్యం అలముకుంటున్నదనటానికి ఇది సంకేతం కూడా. మన్మోహన్సింగ్ హయాంతో పోలిస్తే మోదీ ప్రభు త్వంలో అత్యున్నత స్థానాల్లో అవినీతి చాలా తక్కువగా ఉండటం సంతోషకరమైన విషయమేనని నేను అంగీకరి స్తాను. కానీ ఇది చాలా చిన్న విషయం. భారతీయులకు అతి ముఖ్యమైన సమస్య.. దారిద్య్రం నుంచి వారిని త్వరగా బయటపడవేసే ఏకైక మార్గం ఏదంటే నిలకడైన అధిక వృద్ధి. కేంద్రంలో బలమైన ప్రభుత్వం, దార్శనికత, లక్ష్యంపై స్పష్టత కలిగిన నేత ఉండి కూడా మనం అధిక వృద్ధిని సాధించనట్లయితే మనం నిజంగానే పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నట్లే. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
రూ. 100 కోట్లతో హెచ్ఎస్బీసీ స్కిల్ డెవలప్మెంట్
భారత్‌లో 75 వేల మందికి శిక్షణ లండన్: బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ భారత్ కోసం ‘హెచ్ఎస్బీసీ స్కిల్స్ ఫర్ లైఫ్’ అనే ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. దీని కోసం హెచ్ఎస్బీసీ రూ.100 కోట్లు వెచ్చించనుంది. వచ్చే ఐదేళ్లలో 75,000కు పైగా యువతీ యువకులను, మహిళలను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య లక్ష్యం. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సంయుక్తంగా గురువారం సాయంత్రం ‘హెచ్ఎస్బీసీ స్కిల్స్ ఫర్ లైఫ్’ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించారు. 29 ఏళ్ల సగటు వయసుతో భారత్ 2020 నాటికి ప్రపంచంలోనే యుక్త వయసు జనాభా అధికంగా గల దేశంగా అవతరించనుందని హెచ్ఎస్బీసీ పేర్కొంది. ఒక దేశం స్థిర వృద్ధిని సాధించడంలో స్కిల్ డెవలప్మెంట్ కీలక పాత్ర పోషిస్తుందని, పేదరిక నిర్మూలనకు ఆయుధంగా పనిచేస్తుందని, సమాజంలో అసమానతలను తొలగిం చడంలో ప్రధాన భూమిక పోషిస్తుందని వివరించింది. వెనకబడిన యువతీ యువకుల్లో,మహిళ్లలో నైపుణ్యాలను పెంపొందించి, వారిని ఆర్థిక వృద్ధిలో భాగస్వాములను చేయడంలో ఆర్థిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని హెచ్ఎస్బీసీ ఇండియా గ్రూప్ జనరల్ మేనేజర్, సీఈవో స్టువర్ట్ పి మిల్నే విశ్వసించారు. -
ఉపాధి కల్పనే వృద్ధికి కీలకం: డెల్
బెంగళూరు: అధిక ఆర్థిక వృద్ధి రేటును కొనసాగించాలంటే భారత్ భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుందని డెల్ సంస్థ చైర్మన్ మైఖేల్ ఎస్ డెల్ తెలిపారు. అలాగే విద్యావంతులు, సమర్ధులైన వారి కోసం అన్వేషించే దేశ, విదేశ సంస్థలను ఆకర్షించేలా ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలను తయారు చేయడంలో చాలా దేశాల కన్నా భారత్ ముందు ఉందని, ఈ విషయంలో ఎ లేదా ఏప్లస్ రేటింగ్ ఇవ్వొచ్చని చెప్పారు. పరిశ్రమల సమాఖ్య అసోచాం 200 మంది పైచిలుకు సీఈవోలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. వైద్యం, ఇంధనం, సహజ వనరులు మొదలైన వాటికి సంబంధించిన సమస్యలకు ఐటీ, టెక్నాలజీ పరిష్కారమార్గాలు చూపగలవని డెల్ అభిప్రాయపడ్డారు. -
యులిప్ అమ్మకాలు పెరుగుతున్నాయ్
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరి - నాలుగు వారాల్లో స్టాండర్డ్ లైఫ్ వాటా 49%కి - వచ్చే ఏడాది మార్కెట్లో లిస్టయ్యే అవకాశం - పరిశ్రమ సగటు కంటే అధిక వృద్ధిరేటు నమోదు - ఈ ఏడాది 17వేల ఏజెంట్ల నియామకాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : గత కొంత కాలంగా సంస్కరణలు, ఆర్థిక వృద్ధిరేటు నెమ్మదించడంతో కష్టాలను ఎదుర్కొన్న జీవిత బీమా రంగం క్రమేపీ గాడిలో పడుతోందని ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ హెచ్డీఎఫ్సీ లైఫ్ పేర్కొంది. ఈ ఏడాది పరిశ్రమ రెండంకెల వృద్ధిరేటు నమోదు చేయడంతో పాటు, మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి యులిప్ అమ్మకాలు పెరిగాయంటున్న హెచ్డీఎఫ్సీ లైఫ్ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ చౌదరితో ఇంటర్వ్యూ... ఈ ఏడాది జీవిత బీమా పరిశ్రమ వృద్ధి ఏవిధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు? హెచ్డీఎఫ్సీ లైఫ్ వృద్ధిరేటు ఏ విధంగా ఉండొచ్చు? ఈ ఏడాది జీవిత బీమా వ్యాపారంలో ఆశావాహకమైన పరిస్థితులు కనపడుతున్నాయి. పాలసీ నిబంధనలు, అమ్మకాల్లో జరిగిన మార్పుల్లో ఒక స్పష్టత వచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జీవిత బీమా వ్యాపారంలో 8-10 శాతం వృద్ధి నమోదయ్యింది. ఏడాది మొత్తం మీద ఇంతకంటే ఎక్కువ వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నాం. ఇక మా విషయానికి వస్తే గత ఐదేళ్లు మాదిరిగానే ఈ సారి కూడా పరిశ్రమ సగటు కంటే ఎక్కువ వృద్ధిరేటును నమోదు చేస్తాం. స్టాక్ సూచీలు రికార్డు స్థాయికి చేరిన తర్వాత యులిప్ అమ్మకాలు ఏమైనా పెరిగాయా? మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యులిప్ (యూనిట్ లింక్డ్ పాలసీలు) అమ్మకాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మా అమ్మకాల్లో యులిప్స్ వాటా 60 శాతం దాటింది. మొత్తం పాలసీ అమ్మకాల్లో యులిప్ వాటా 50 నుంచి 60 శాతం లోపు ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. కేంద్రం ప్రవేశపెట్టిన బీమా పథకాల వల్ల టర్మ్ ఇన్సూరెన్స్ వ్యాపారంపై ఏమైనా ప్రతికూల ప్రభావం కనిపించే అవకాశం ఉందా? కేంద్రం ప్రవేశపెట్టిన బీమా పథకాలు అద్భుతమైన విజయం సాధించాయి. వీటి వల్ల బీమా కంపెనీల వ్యాపారం దెబ్బతింటోందన్న వాదనతో నేను ఏకీభవించటం లేదు. వీటి వల్ల ప్రజల్లో బీమాపై మరింత అవగాహన పెరిగింది. మారిన కాలపరిస్థితుల్లో ప్రభుత్వం కల్పిస్తున్న రెండు లక్షల బీమా సరిపోదు. అందుకోసం ప్రజలు అదనపు బీమా రక్షణ కోసం బీమా కంపెనీలను ఆశ్రయిస్తారు. ఈ విధంగా బీమా వ్యాపారం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం. వ్యాపార విస్తరణకు సంబంధించి ఏమైనా మూలధనం సేకరించే అవకాశం ఉందా? హెచ్డీఎఫ్సీ లైఫ్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది? మా వాటాదారుల నుంచి వ్యాపార విస్తరణ కోసం గత నాలుగేళ్లుగా ఎటువంటి మూలధనాన్ని తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఎటువంటి మూలధనం అవసరం లేదు. ఇక ఐపీవో విషయానికి వస్తే ప్రమోటర్ల మాటను బట్టి ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో నమోదయ్యే అవకాశాలు కనిపించడం లేదు. నాలుగు వారాల్లో స్టాండర్డ్ లైఫ్ తన వాటాను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుకోనుంది. ఈ వాటా పెంచుకోవడం తర్వాతనే ఐపీవో ఉండొచ్చు. వచ్చే ఏడాది స్టాక్ మార్కెట్లో నమోదైనా కొత్తగా మూలధనం సేకరించాలని లేదు. వాటాదారులు తమ వాటాలను విక్రయించుకోవచ్చు. వ్యాపార విస్తరణ, ఏజెంట్ల నియామకాల గురించి వివరిస్తారా? ఆర్థిక పథకాల విషయంలో ఆన్లైన్లో పాలసీలు అందుబాటులో ఉన్నా చాలా మంది పాలసీలను తీసుకోవడానికి ఏజెంట్లనే ఆశ్రయిస్తున్నారు. అందుకే ఏజెంట్ల నియామకంపై దృష్టిసారిస్తున్నాం. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీలో 70,000 ఏజెంట్లు ఉంటే ఈ ఏడాది అదనంగా 15 నుంచి 17 వేల మంది ఏజెంట్లను నియమించుకోవాలని నిర్ణయించుకున్నాం. కొత్తగా ప్రవేశపెట్టిన సీఎస్సీ బీమా పథకం ప్రయోజనం ఏమిటి? మరిన్ని పథకాలు ప్రవేశపెట్టే ఆలోచన ఉందా? అల్పాదాయ వర్గాలను దృష్టిలో పెట్టుకొని తక్కువ ప్రీమియంతో కూడిన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ‘సీఎస్సీ సురక్ష’ను ప్రారంభించాం. ఈ-సేవ కేంద్రాల ద్వారా కేవలం రెండు నిమిషాల్లో జారీ చేసే విధంగా దీన్ని రూపొందించాం. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం విజయవంతమయితే మరిన్ని పథకాలను ప్రవేశపెడతాం. -
పరిశ్రమల నిరాశ...
ఆర్బీఐ నిర్ణయంపై పారిశ్రామిక వర్గాలు తీవ్ర నిరాశను వ్యక్తం చేశాయి. బలహీన డిమాండ్ మెరుగుదల, ఆర్థిక వృద్ధి లక్ష్యంగా రుణ రేటు తగ్గిస్తే బాగుండేదని అన్నాయి. ఒక అవకాశాన్ని వదులుకున్నట్లయ్యిందని కూడా వ్యాఖ్యానించాయి. రుణ డిమాండ్ బలహీనంగా ఉంది. కార్పొరేట్లు, బ్యాంకులు రుణ బకాయిల సమస్యలతో సతమతమవుతున్నాయి. మౌలిక రంగంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో రుణ రేటు తగ్గించి ఉంటే... పెట్టుబడుల ప్రక్రియ ఊపందుకునేది. వర్షపాతం, ఫెడ్ నిర్ణయం, ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులన్నింటిపై ఒక సమగ్ర అవగాహనకు వచ్చే అవకాశం ఉన్నందున, తదుపరి సమీక్షలో ఆర్బీఐ పాలసీ రేటు తగ్గిస్తుందని భావిస్తున్నా. -చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్ పరిశ్రమకు ఇది నిరాశకలిగించే అంశమే. పారిశ్రామిక వృద్ధి ఇంకా ఒడిదుడుకులుగానే ఉంది. డిమాండ్ పరిస్థితులు ప్రోత్సాహకరంగా లేవు. ఆయా పరిస్థితుల దృష్ట్యా పాలసీ ప్రోత్సాహకం ఉంటే మంచి ఫలితం ఉండేది. - జోత్స్నా సూరీ, ఫిక్కీ ప్రెసిడెంట్ -
అందరికీ బ్యాంకింగ్‌పై ఆర్బీఐ కమిటీ
ముంబై: దేశంలోని అందరినీ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకువచ్చి (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్), వారిని ఆర్థికవృద్ధిలో భాగస్వాములను చేయాలన్న లక్ష్య సాధనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ఐదేళ్ల కాలంలో అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన కమిటీ ప్రధాన బాధ్యత. 14 మంది సభ్యుల ఈ కమిటీకి ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దీపక్ మహంతీ నేతృత్వం వహిస్తారు. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌కు సంబంధించి అన్ని అంశాలనూ పరిశీలించి, ఈ విషయంలో మరింత పురోగమించడానికి తగిన సూచనలను ఈ కమిటీ చేస్తుందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి సమావేశం నుంచి నాలుగు నెలలలోపు కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
18% పెరిగిన దేశీ విమాన ప్రయాణికుల రద్దీ
న్యూఢిల్లీ : భారత్‌లో దేశీ విమాన ప్రయాణికుల రద్దీ మే నెలలో 18.2 శాతం పెరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) గణాంకాల ప్రకారం.. గతేడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో విమాన ప్రయాణికుల రద్దీ 7.7 శాతం పెరిగింది. ఈ పెరుగుదలకు దేశీ విమాన సంస్థలు మంచి ప్రదర్శన కనబరచడం, ఆర్థిక వృద్ధి పరిస్థితులు మెరుగుపడటం వంటి అంశాలే కారణం. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం చూస్తే దే శీ విమాన ప్రయాణికుల రద్దీ మే నెలలో 18.35 శాతం వృద్ధితో 71.27 లక్షలుగా ఉంది. -
వృద్ధి మినహా.. ఫస్ట్ క్లాస్
మోదీ @ 365 days మోదీ సర్కారు ఏడాది పాలనపై ఆర్థికవేత్తల మాట ⇒ ఆర్థిక వృద్ధిలో జోరు పెరగాల్సి ఉందని సూచన ⇒ స్థూలంగా సరైన దార్లోనే వెళుతున్నారంటూ ప్రశంస ⇒ ఏడాదిలో రూ.10 లక్షల కోట్లు పెరిగిన స్టాక్ మార్కెట్ల సంపద ⇒ అంబానీలకు నష్టాలు... అదానీలకు లాభాలు సాక్షి, బిజినెస్ విభాగం: ఐదేళ్లు అధికారంలో ఉండే రాజకీయ పార్టీలకు ఏడాది సమయం ఏమంత ఎక్కువ కాదు. అయితే ఎప్పటి నుంచో మార్పు కోసం ఎదురుచూస్తూ ఒక ప్రభుత్వాన్ని దించి మరో సర్కారుకు పట్టం గట్టిన జనానికి మాత్రం ఏడాదంటే ఎక్కువే. గంపెడాసలు పెట్టుకున్న ఆ ప్రభుత్వం కొంతైనా చేయాలనేది వారి కోరిక. మరి కేంద్రంలో పగ్గాలు చేపట్టిన నరేంద్రమోదీ సర్కారు ఈ ఏడాది కాలంలో ఏం చేసింది?ఆర్థికంగా ఒక ప్రభుత్వం పనితీరుకు స్టాక్ మార్కెట్లే కొలమానమైతే నరేంద్రమోదీ ప్రభుత్వం డిస్టింక్షన్ కొట్టేసినట్లే. ఎందుకంటే ఈ ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.10 లక్షల కోట్ల మేర పెరిగింది. టాటా, అదానీ, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, సన్ గ్రూపులు భారీగా లాభపడి దీన్ని సాధ్యం చేశాయి. ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్లు బాగా పడ్డప్పటికీ ఏడాదితో పోలిస్తే 12 శాతం మేర పెరిగాయి. బిర్లా, విప్రో, హెచ్‌సీఎల్, ఐసీఐసీఐ, మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్ వంటివీ దీనికి సాయపడ్డాయి. ఈ ఏడాది మొదట్లో సెన్సెక్స్ 30 వేల పాయింట్లు తాకి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది కూడా. అయితే మోదీ ప్రభుత్వం అదానీ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నాయి. అదానీ గ్రూపు మార్కెట్ విలువ కూడా ఇందుకు తగ్గట్టే ఏకంగా రూ.50 వేల కోట్ల మేర పెరిగింది. ఇక అంబానీల పట్ల మోదీ సుముఖంగా వ్యవహరించటం లేదన్న వార్తలూ ఉన్నాయి. రిలయన్స్ గ్యాస్‌కు ముందు నిర్ణయించిన ధరను తగ్గించటం వంటి పరిణామాలతో ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూపు మార్కెట్ విలువ రూ.80 వేల కోట్ల మేర దిగజారగా... ఆయన సోదరుడు అనిల్ అంబానీ గ్రూపు విలువ కూడా రూ.50 వేల కోట్ల మేర పడిపోయింది. సరే! స్టాక్ మార్కెట్లనేవి ఒక కోణం మాత్రమే. నిజానికివి ప్రభుత్వ పనితీరుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొలమానం కావన్నది కూడా నిపుణుల అభిప్రాయం. అయితే ఎఫ్‌డీఐల విషయంలో పాదర్శకత... విదేశీ వ్యవహారాల్లో దృఢంగా వ్యవహరించటం, నిరుపేదలు సహా అందరికీ బ్యాంక్ ఖాతా సౌకర్యం కల్పించటం, అందరికీ సామాజిక బీమా భద్రత... ఇవన్నీ మోదీ సర్కారుకు మార్కులేశాయి. ‘‘డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్మార్ట్ సిటీ అనే దీర్ఘకాలిక లక్ష్యాలను ప్రకటించడమే కాకుండా.. వాటికి అనుగుణంగా ఫ్రేమ్ వర్క్‌ను కూడా సిద్ధం చేశారు. వీటి ఆధారంగా వ్యాపార అవకాశాలు రావాల్సి ఉంది’’ అనేది నాస్కామ్ చైర్మన్ బి.వి.ఆర్.మోహన్ రెడ్డి మాట. ఈ ఏడాది పాలనలో అవినీతి బాగా తగ్గిందంటూనే కార్పొరేట్ సంస్థలు మోదీపై భారీ ఆశలు పెట్టుకోవటంతో వాటిని మోదీ అందుకోలేకపోయారని, మున్ముందు వీటిని అందుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. స్థూలంగా ఆర్థిక మూలాలను మార్చి కార్మిక సంస్కరణల ద్వారా భారతదేశ పోటీతత్వాన్ని పెంచినా ఆర్థిక వృద్ధి నెమ్మదించటం, భారతదేశంలో వ్యాపారం చేయటమనేది ఇప్పటికీ సంక్లిష్టమైన ప్రక్రియలానే ఉండటం ప్రతికూలాంశాలుగా ఉన్నాయి. మునుపటితో పోలిస్తే పర్యావరణ అనుమతులు వేగంగానే వస్తున్నాయి. అయితే పాత తేదీల నుంచి పన్నులు వడ్డించటమనే మోదీ విధానం సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. మోదీ ఇప్పటిదాకా 19 దేశాలు తిరిగి భారతదేశంలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ కల్పించినా సానుకూల ధోరణి కూలిపోవటానికి ఈ ఒక్క కారణం చాలన్నది ఆర్థిక నిపుణుల మనోగతం. ఆర్థిక వృద్ధి అంతంతే... తాను చెప్పేవాడిని కానని, చేసే వాడినని ఎన్నికల్లో మోదీ చేసుకున్న ప్రచారాన్ని సామాన్యులు విశ్వసించారు. ఇప్పటికీ మోదీపై వారిలో అదే అభిప్రాయం ఉండొచ్చు. కానీ వ్యాపార, ఆర్థిక వర్గాల్లో మాత్రం అలాంటిది లేదనేది బ్రోకింగ్ సంస్థ ‘సీఎల్ఎస్ఏ’ సీనియర్ ఎకనమిస్ట్ రాజీవ్ మాలిక్ మాట. ఆర్థిక వృద్ధిలో ప్రభుత్వ పనితీరు మెరుగ్గా లేదంటున్నారాయన. ఇక గోద్రెజ్ గ్రూపు సంస్థల అధిపతి ఆది గోద్రెజ్ ఇటీవల ఫోర్బ్స్ పత్రికలో రాసిన వ్యాసంలో మోదీని చేతల మనిషిగానే అభివర్ణించారు. ‘‘అయితే భారతదేశంలో వ్యాపారం చేయటానికి అనువైన పరిస్థితులింకా రాలేదు. పన్నులు చెల్లించేవారిని వినియోగదారులుగా చూడాలి తప్ప శత్రువులుగా కాదు. పాత తేదీల నుంచి పన్నులు చెల్లించాలనే ఉత్తర్వులు ఇక వద్దు’ అని పేర్కొన్నారు. ‘మోదీ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల్లో అత్యంత ప్రధానమైనది కార్మిక చట్టాల సవరణ. దీనివల్ల కొత్త కంపెనీలు, కొత్త పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే ఆస్కారం ఉంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం తయారీకి బూస్ట్‌నిస్తుంది’ అని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కె.సుధీర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కోటలు దాటిన మాటలు... 2 ట్రిలియన్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 20 ట్రిలియన్లకు తీసుకెళతానన్నది మోదీ చేసిన వాగ్దానం. నిజానికి అంతర్జాతీయంగా తిరుగులేని శక్తిగా మారిన చైనా ఆర్థిక వ్యవస్థే ఇపుడు 10 ట్రిలియన్ డాలర్లు. అందుకని మోదీ వాగ్దానాలపై ఆర్థిక నిపుణులు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. ‘‘కలల కోటలు ఆ క్షణానికి అందంగానే కనిపిస్తాయి. కానీ వాటిని నిజంగా కట్టాలంటే సుదీర్ఘమైన, దృఢమైన మార్గం కావాలి’’ అనేది ఆర్థిక వేత్త ప్రవీణ్ కృష్ణ మాట. నిజానికి అంతర్జాతీయ చమురు ధరలనేవి మోదీకి గాలివాటు మాదిరి కలిసొచ్చాయి. మన దేశ దిగుమతుల్లో 80 శాతానికి పైగా ఆక్రమిస్తున్న చమురు ధరలు భారీగా పతనం కావటం మోదీ సర్కారుకు ఊహించని మేలు చేసింది. ఇక మోదీ పిలుపు విని భారతదేశంలో కర్మాగారాలు పెట్టడానికి ముందుకొచ్చిన సంస్థల్లో కొరియన్ దిగ్గజం శామ్సంగ్, యూరోపియన్ ఎయిర్‌బస్ కూడా ఉన్నాయి. ద్రవ్యోల్బణం 9 శాతం నుంచి 5 శాతానికి తగ్గటం ఆర్థిక వృద్ధి 5 నుంచి 7.5 శాతానికి చేరే అవకాశాలుండటం... ఇవన్నీ భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించే ఘటనలే. కార్పొరేట్లకు దూరం జరిగే ప్రయత్నం... గుజరాత్ ముఖ్యమంత్రిగా దీర్ఘకాలం వ్యవహరించినపుడు కార్పొరేట్లకు వ్యాపార అవకాశాలు కల్పించిన వ్యక్తిగా మోదీ పేరు సంపాదించుకున్నారు. దాంతో ఆయన ప్రధాని కాగానే వ్యాపారుల ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వమంటూ విమర్శలు వెల్లువెత్తాయి. గతేడాది నవంబర్‌లో మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో అదానీ గ్రూప్‌కి బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి ఎస్బీఐ ఒక ఒప్పందం చేసుకుంది. ఆ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మోదీకి సన్నిహితుడిగా ముద్రపడటంతో కార్పొరేట్లకు దగ్గరుండి మరీ పనులు చేస్తున్నారంటూ విపక్షాలు దుమ్మెత్తిపోసాయి. దీంతో మోదీ కార్పొరేట్లకు దూరంగా వుండే ప్రయత్నం చేస్తున్నట్లు ఇటీవలి ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే అదానీ రుణ ఒప్పందం 2014 నవంబర్‌లో జరిగినా, ఇప్పటికీ రుణం మంజూరు కాలేదు. ఆస్ట్రేలియా ప్రాజెక్టుకు సంబంధించి అదానీ ఇచ్చిన సమాచారం సంతృప్తికరంగా లేదంటూ రుణ ప్రతిపాదనను ఎస్బీఐ అటకెక్కించిందని వార్తలొచ్చాయి. అంబానీలూ మోదీకి సన్నిహితులనేది ఆది నుంచీ వస్తున్న మాట. కానీ ముకేశ్ అంబానీకి ఇటీవలి కాలంలో మోదీ అపాయింట్మెంటే ఇవ్వలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంచనాలు ఎక్కువ పెట్టుకున్నాం... మోదీ ప్రభుత్వంపై అంచనాలు ఎక్కువగా పెట్టుకున్నారు. కానీ వీటిని పట్టించుకోకుండా ప్రభుత్వం సరైన మార్గంలోనే వెళుతోంది. ఈ ఏడాది పరిపాలనలో ఇంతవరకు ఎటువంటి తప్పులూ జరగలేదు. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత స్పీడ్ పెరగాల్సి ఉంది. మొత్తం మీద వృద్ధిరేటును గాడిలో పెట్టే విధంగానే చర్యలు తీసుకుంటున్నారు. - సి.పార్థసారధి, చైర్మన్ కార్వీ గ్రూపు అంతర్జాతీయంగా గుర్తింపు.. ఏడాది పరిపాలనపై అప్పుడే ఒక నిర్ణయానికి రాలేం. మరికొంత సమయం ఇవ్వాలి. కానీ అంతర్జాతీయంగా ఇండియాకు గుర్తింపు తేవటానికి ఈ ఏడాది కాలాన్ని చక్కగా వినియోగించుకున్నారు. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యాన్నివ్వటం హర్షించదగ్గ పరిణామం. - నృపేంద్ర రావు, చైర్మన్, పెన్నార్ గ్రూపు కార్పొరేట్లలో భయాలు తొలిగాయి.. కొన్నేళ్లుగా భారతీయ కార్పొరేట్ సంస్థలు ఎదుర్కొంటున్న స్కాంలు, సీబీఐ దాడులు వంటివి ఏమీ లేకుండా ఈ ఏడాది కాలం సజావుగా సాగిపోయింది. దీంతో కార్పొరేట్ సంస్థల్లో నెలకొన్న భయాందోళనలు తొలిగాయి. గత ప్రభుత్వాలు చేసిన తప్పులతో ఇన్ఫ్రా రంగం చాలా దెబ్బతింది. అదంతా ఏడాదిలోనే కోలుకోవాలంటే అత్యాశే. - ఇ.సుధీర్ రెడ్డి, సీఎండీ, ఐవీఆర్సీఎల్ ఇన్ఫ్రా నమ్మకం కుదిరింది.. మోదీ విదేశీ పర్యటనలతో ఇన్వెస్టర్లలో నమ్మకం ఏర్పరిచారు. దేశంలో సంస్కరణలకు తెరతీశారు. వ్యవస్థను క్రమబద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. రానున్న రోజుల్లో పెట్టుబడులు మరింత పెరుగుతాయి. ప్రభుత్వం పట్ల వ్యాపారవేత్తల అంచనాలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రత్యేక హోదా విషయంలో అసంతృప్తి ఉంది. - సురేష్ రాయుడు చిట్టూరి, చైర్మన్, సీఐఐ ఆంధ్రప్రదేశ్ -
‘ప్రైవేట్’ ఉపాధి కాదు పరిష్కారం
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు అనుకున్నదాని కంటే ఎక్కువే అంటుండగా ఉపాధి కల్పన ఇంత అల్పంగా ఉండటం విచిత్ర. 2005-09 మధ్య 14 కోట్ల మంది వ్యవసాయాన్ని వదిలేయగా, 5.3 కోట్ల మంది వస్తుతయారీ రంగంలో ఉపాధిని కోల్పోయారు. వారంతా నగరాల్లో లేదా గ్రామాల్లో రోజు కూలీలుగా మారారనే అర్థం. శ్రామికశక్తికి రోజు కూలీ పనుల్లాంటి ఉద్యోగాలనే ఎక్కువగా చూపుతున్నామంటే వృద్ధి ఫలాలు సామాన్యునికి చేరడం లేదు. శ్రామికులకు ఆర్థిక భద్రతను కల్పించే ఆర్థిక నమూనాకై యోచించాల్సిన తరుణమిది. ఆర్థిక వృద్ధిలో మన ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడ్డ చైనాను అధిగమించి మరీ పరుగులు తీస్తోంది. అయినా ఉపాధి కల్పన విషయంలో మాత్రం చైనాతో సమాన స్థాయిలో నిలవలేకపోతోంది. మన లేబర్ బ్యూరో జరిపిన ఒక సర్వే ప్రకారం 2014-15 మూడో త్రైమాసికంలో మన ఉపాధి రంగ వృద్ధి క్షీణించింది. 2014 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలోని ఎనిమిది కీలక రంగాల్లో 1.17 లక్షల ఉద్యోగావకాశాలను కల్పించగలిగాం. శ్రద్ధగా పరిశీలిస్తే ఆ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో ఉద్యోగావకాశాలు క్షీణిస్తూ వచ్చాయని స్పష్టమౌతుంది. ఏప్రిల్-జూన్ త్రైమా సికంలో 1.82 లక్షల ఉద్యోగావకాశాలు ఏర్పడగా అది జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో 1.58 లక్షలకు పడిపోయింది. ఆ తదుపరి పరిస్థితి మరింతగా దిగజారి, అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో అవి 1.17 లక్షలకు క్షీణించి పోయాయి. అంటే 2014-15 ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు త్రైమాసికాలలో మొత్తం 4.57 లక్షల ఉద్యోగాలను మాత్రమే అదనంగా సృష్టించగలిగాం. జనవరి-మార్చి 2015 నాలుగో త్రైమాసికంలో కూడా ఇదే లెక్కన, అదీ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోని గరిష్ట సంఖ్యనే పరిగ ణనలోకి తీసుకుని లెక్కించినా... మొత్తంగా 2014-15 ఆర్థిక సంవత్సరం ఉద్యోగాల వృద్ధి ఇంచుమించుగా 5.40 లక్షలు. ఏటా పని కోసం వెదుకు లాడుకుంటూ ఉపాధి మార్కెట్లలోకి ప్రవేశించే శ్రామికశక్తి అంతటికీ ఉపాధి అవకాశాలను కల్పించా లంటే మన దేశం ఏడాదికి ఇంచుమించు 1.2 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుంది. వృద్ధి ఊర్ధ్వముఖం...ఉపాధి అధోముఖం 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు అనుకున్నదాని కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్న పరిస్థితుల్లో ఉపాధి కల్పన నిరాశాజన కంగా ఇంత అల్పంగా ఉండటం విచిత్ర మనిపిస్తుంది. ప్రభుత్వం 2014-15 ఆర్థిక సంవత్సరం ఆర్థిక వృద్ధి రేటును 7.4 శాతంగా ప్రస్తుతం నిర్ధారించింది. ఆర్థిక వృద్ధి ఇలా పెరుగుతుండగా ఉపాధి కల్పన రేటు క్షీణిస్తుండటమనే పరిస్థితి... అర్థిక వృద్ధి ఎక్కువగా ఉంటే ఉపాధి కల్పన కూడా అధికంగా ఉంటుందనే ఆర్థిక ప్రమేయానికే విరుద్ధం. 2004లో మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి అయినప్పటి రోజులను ఓసారి జ్ఞప్తి చేసుకోండి. 2004 నుంచి 2009 మధ్య స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)అబ్బురమనిపించేలా 8 శాతం కంటే ఎక్కువగా వృద్ధి చెందింది. గరిష్టంగా అది 9.3 శాతానికి సైతం చేరింది. సాధారణంగా నిరోద్యాగానికి సూచించే ఆర్థిక చికిత్స ప్రకారం ఆ అధిక వృద్ధి రేటు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించి ఉండాల్సింది. కానీ అది జరగ లేదు. తద్విరుద్ధంగా జీడీపీ వృద్ధి రేటు గంతులు వేస్తూ ముందుకు పోతుం డగా మన దేశం ఉద్యోగాలు లేని వృద్ధిని చూడాల్సివచ్చింది. అందరికీ రోజు కూలీ బతుకులే 2005-09 మధ్య 14 కోట్ల మంది ప్రజలు వ్యవసాయ రంగాన్ని వదిలి పెట్టే శారని ప్రణాళికా సంఘం జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఇలా వ్యవ సాయాన్ని వదిలేసే వారంతా వస్తుతయారీ రంగంలోకి ప్రవేశిస్తారని భావిస్తుంటాం. కానీ ఆ వస్తుతయారీ రంగంలోనే 5.3 కోట్ల ఉద్యోగాలు తగి ్గపోయాయి. మరి వ్యవసాయాన్ని వదిలేసిన ఆ 14 కోట్ల మంది, వస్తు తయారీ రంగం నుంచి తరిమేసిన ఈ 5.3 కోట్ల మంది చివరికి ఎక్కడికి పోయినట్టు? వారంతా నగరాల్లో రోజురోజుకీ పెరిగిపోతున్న రోజు కూలీలు గానో లేక గ్రామాల్లోని భూమిలేని వ్యవసాయ కూలీలుగానో మారి ఉండా లనుకోవడమే సమంజసమైన సమాధానమవుతుంది. 2007 నుంచి 3.7 కోట్లకు పైగా భారత రైతులు వ్యవసాయాన్ని వదిలేసి నగరాలకు వలస పోయారని ‘క్రిసిల్’ అనే ప్రపంచస్థాయి విశ్లేషణ సంస్థ జరిపిన తాజా అధ్య యనంలో తేలింది. అయితే ఆర్థిక వృద్ధి మందగించిన గత రెండేళ్లలో (2012- 2014) అలా నగరాలకు వచ్చిన రైతుల్లో 1.5 కోట్ల మంది ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గ్రామాలకు తిరిగిపోయినట్టు ఆ సంస్థ అంచనా కట్టింది. ఈ వాస్తవాలన్నీ రోజురోజుకీ మరింత ఎక్కువ మంది ప్రజలు నగరాల్లోనో లేదా పొలాల్లోనో రోజుకూలీ శ్రామికుల వర్గంలో కలసిపోతున్నారని స్పష్టం చేస్తున్నాయి. లక్షల్లో ఖాళీలున్నా... రోజు కూలీ పనుల్లాంటి ఉద్యోగాలనే రోజు రోజుకూ మరింత ఎక్కువగా శ్రామికశక్తికి చూపుతున్నా మంటేనే ఆర్థికవృద్ధి ఫలాలు సామాన్యునికి చేరడం లేదని స్పష్టమవుతోంది. ఆర్థికపరమైన భద్రతను ఇవ్వగల ఉపాధిని కల్పించ గలిగే వాతావరణాన్ని సృష్టించే ఆర్థిక నమూనాను గురించి పునరాలోచించా ల్సిన తరుణమిది. మొత్తంగా పరిస్థితిని చూస్తే, సంఘటిత రంగంలో లక్షలాదిగా ఉద్యోగాలు ఖాళీగా పడి ఉండటమే గాక నెల నెలా ఆ ఖాళీల సంఖ్య పెరుగుతూ ఉండటం సర్వత్రా కనపడటం చూసి గందరగోళపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు మరణావస్థకు చేరాల్సివస్తోంది. అయినా పదవీ విరమణ చేస్తున్న వారి స్థానంలో నియామ కాలను జరపడం లేదు. దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాలల్లో 40 నుంచి 50 శాతం ఉద్యోగాలు ఖాళీగా పడి ఉంటున్నాయి. ప్రాథమిక, సెకండరీ స్థాయిల పాఠశాలల్లో ఎంత తక్కువగా చూసినా 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అంచనా. ఆసుపత్రులు, పోలీసు, పోస్టల్ సర్వీసులు తదితర ప్రభుత్వ సంస్థలలోని ఖాళీలను కూడా చేర్చితే పదుల లక్షల్లో ఖాళీలున్నాయని తేలుతుంది. ఈ ఖాళీలను భర్తీ చేయ డం జీడీపీని పెంపొందింపజేయడం మాత్రమే కాదు మరణావస్థలోని సంస్థ లను పునరరుజ్జీవింపజేసి, పనిచేసేలా చేస్తాయి. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు ఇలా ఉద్దేశపూర్వకంగా, ఒక క్రమపద్ధతిలో హత్య చేస్తు న్నారో నాకు అర్థం కావడం లేదు. ఇదిలా కొనసాగడానికి వీల్లేదు. ఉపాధి కల్పనను ప్రైవేటు రంగానికే వదిలేయడానికి వీల్లేదు. (వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు) e-mail: hunger55@gmail.com -
భారత్‌కు ఉజ్వల భవిత: ఐఎంఎఫ్
- 2014-15లో వృద్ధి 7.2 శాతం - పలు రంగాల్లో సంస్కరణలు అమలు చేయాలని సూచన వాషింగ్టన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 7.2% ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 7.5%గా ఉంటుందని పేర్కొంది. నిజానికి ప్రభుత్వ అంచనాలకన్నా ఇవి తక్కువ. కేంద్రం అంచనాల ప్రకారం ఈ రేట్లు వరుసగా 7.4%, 8-8.5% శ్రేణిలో ఉన్నాయి. అయితే ఆర్థిక రంగానికి సంబంధించి భారత్‌కు ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉందని ఐఎంఎఫ్ వెల్లడించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువ స్థాయిలో కొనసాగుతుండటం, బంగారం దిగుమతులు తగ్గడం, కరెంట్ అకౌంట్ లోటు కట్టడి, విధాన నిర్ణయాల సానుకూలత వంటి అంశాలు దేశంలో ఆర్థిక పునరుత్తేజానికి దోహదపడతాయని విశ్లేషించింది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా మారిందని ఇండియా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విడుదల చేసే వార్షిక నివేదికలో పేర్కొంది. ముఖ్యాంశాలివీ.. ⇒ వ్యవస్థాగత సంస్కరణలను వేగవంతం చేస్తూ... పెట్టుబడుల ప్రక్రియ పునరుత్తేజానికి భారత్ తగిన చర్యలు తీసుకోవాలి. ⇒ కొత్తగా పెట్టుబడులు పెడుతున్న ప్రాజెక్టుల అమలు ప్రారంభమవుతోంది. ప్రత్యేకించి విద్యుత్, రవాణా రంగాల్లో ఇది కనబడుతోంది. ⇒ ఫైనాన్షియల్ రంగం బలోపేతమవుతోంది. ఆర్థిక వ్యవస్థలో దేశ ప్రజలందరినీ భాగస్వాముల్ని చేయడానికి దోహదపడే మరో అంశమిది. ⇒ అంతర్జాతీయంగా, దేశీయంగా కొన్ని సవాళ్లున్నాయి. అయితే వీటిని తట్టుకునే సామర్థ్యం భారత్‌కుంది. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు అంతర్జాతీయంగా ప్రధాన సవాలు కాగా, దేశీయంగా చూస్తే కార్పొరేట్ రంగం బలహీనత కీలకం. దీనివల్ల మొండిబకాయిలు పెరిగే అవకాశముంది. ⇒ జీడీపీ గణాంకాల సవరణలు తయారీ, సేవల రంగాల నిజ పనితీరుకు దర్పణం పడుతున్నాయి. ⇒ ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వ చర్యలు తగిన విధంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు సంకేతాలు హర్షణీయం. ⇒ వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో యువత ప్రధానపాత్ర పోషించనుంది. ప్రపంచంలో భారత్‌కే లభిస్తున్న ప్రత్యేక అవకాశమిది. 10 కోట్ల మంది జాబ్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశముంది. వీరికి ఉపాధి అవకాశాలు భారీగా కల్పించాల్సి ఉంది. ⇒ ఇంధనం, మైనింగ్, విద్యుత్, మౌలికరంగం, భూసేకరణ, పర్యావరణం, వ్యవసాయ, లేబర్ మార్కెట్, విద్యా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాల్లో సంస్కరణలను అమలు చేయాలి. -
భారత్‌లో ఆర్థిక వృద్ధి పటిష్టం: ఓఈసీడీ
లండన్: భారత్‌లో ఆర్థిక వ్యవస్థ పటిష్ట రీతిలో వృద్ధి చెందుతోందని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక విశ్లేషణా సంస్థ ఓఈసీడీ (ఆర్థిక సహకార అభివృద్ధి సంఘం) సోమవారం పేర్కొంది. అయితే అమెరికా, చైనాసహా పలు పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి మందగమనంలో ఉందని పేర్కొంది. ఈ మేరకు సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. యూరో ప్రాంతంలో వృద్ధి కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ, ఇది ఉద్దీపన ప్రభావంగా కనిపిస్తోందని వివరించింది. కాంపోజిట్ లెండింగ్ ఇండికేటర్స్ (సీఎల్ఐ) ప్రాతిపదికన ఈ విశ్లేషణ విడుదలైంది. భారత్‌కు సంబంధించి ఈ సూచీ నవంబర్‌లో 99.3 వద్ద ఉండగా, డిసెంబర్లో 99.4 వద్ద కు చేరింది. 2014 ఆగస్టు నుంచీ ఈ సూచీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. కాగా ఆర్థిక వృద్ధికి కంపెనీలపై పాలనా, నియంత్రణల పరమైన అవరోధాలను తగ్గించాలని భారత్‌ను ఓఈసీడీ కోరింది. ముఖ్యంగా దేశంలో మౌలిక రంగం వృద్ధికి ఈ చర్యలు అవసరమని సూచించింది. టెలికం, పౌర విమానయానం, రైల్వేలు, రక్షణ, నిర్మాణ, మల్టీ బ్రాండ్ రిటైల్ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) ఉన్న అడ్డంకులను మరింత తగ్గించాలని పేర్కొంది. -
వృద్ధికి ఫేస్బుక్ తోడ్పాటు
న్యూయార్క్: సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ అంతర్జాతీయంగా గతేడాది ఆర్థిక వృద్ధి పరంగా 227 బిలియన్ డాలర్ల మేర, ఉపాధిపరంగా 45 లక్షల ఉద్యోగాల మేర సానుకూల ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఫేస్బుక్ మార్కెటింగ్, ప్లాట్‌ఫాం ఏ మేరకు తోడ్పడ్డాయన్న అంశంపై కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ చేసిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వ్యాపార సంస్థలు పెద్దవైనా, చిన్నవైనా తమ వ్యాపారాల విస్తరణకు నిత్యం ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుంటున్నాయని ఫేస్బుక్ పేర్కొంది. మార్కెటింగ్‌పరంగా అడ్డంకులను కూడా తగ్గించేలా వివిధ వ్యక్తులు, వ్యాపార సంస్థలను అనుసంధానం చేస్తూ కొంగొత్త వ్యాపార అవకాశాలను ఫేస్బుక్ అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ తెలిపారు. తద్వారా ప్రపంచ ఆర్థిక వృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నామని ఆమె వివరించారు. -
బడ్జెట్లో సంస్కరణల మోత!
మలివిడత సంస్కరణలను ఆవిష్కరిస్తాం... ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ వ్యాఖ్యలు... మరిన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడుల పెంపు స్థిరమైన పన్నుల వ్యవస్థతోనే ఇది సాధ్యం... వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు 6 శాతం పైనే... న్యూఢిల్లీ: దేశంలో సంస్కరణలను పరుగులు పెట్టిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. వచ్చే ఏడాది (2015-16) బడ్జెట్లో భారీ స్థాయిలో మలివిడత(రెండోతరం) సంస్కరణలను ఆవిష్కరిస్తామని చెప్పారు. దేశ ప్రజలకు అత్యంత ఉత్తేజభరితమైన రోజులు ముందున్నాయని కూడా ఆయన హామీనిచ్చారు. వార్తా సంస్థ పీటీఐ ప్రధాన కార్యాలయంలో ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పలు అంశాలపై జైట్లీ తన అభిప్రాయాలను వెల్లడించారు. మరిన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉందని.. ఇందుకు స్థిరమైన పన్నుల విధానం, వ్యవస్థతో పాటు పెట్టుబడి నిధులపై సరసమైన వడ్డీరేట్లు కూడా చాలా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, తప్పులను సరిదిద్దడం కూడా తమ ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు. బొగ్గు గనుల కేటాయింపుల విషయంలో తాము తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఇటువంటిదేనన్నారు. సహజ వనరుల కేటాయింపు... స్థిరమైన, హేతుబద్ధ పన్నుల వ్యవస్థ, భూ సేకరణ చట్టంలో అనవసర నిబంధనల తొలగింపు వంటివన్నీ ఈ దిద్దుబాటు చర్యల్లోకే వస్తాయని జైట్లీ పేర్కొన్నారు. ‘సంస్కరణలనేవి 365 రోజులూ కొనసాగుతూనే ఉంటాయి. అయితే, బడ్జెట్‌లాంటి కీలక తరుణంలో ప్రభుత్వం చేపట్టబోయే సంస్కరణలు, చర్యలను ప్రముఖంగా తెలియజేసేందుకు వీలవుతుంది. అదేవిధంగా సర్కారు ఏ దిశలో వెళ్తోందనేది కూడా ఈ సందర్భంగా అందరికీ తెలుస్తుంది. అందుకే బడ్జెట్ అనేది అత్యంత కీలకమైన అవకాశం.’ అని జైట్లీ పేర్కొన్నారు. బీమా సవరణ బిల్లు, బొగ్గు ఆర్డినెన్స్, వస్తు-సేవల పన్ను(జీఎస్టీ) బిల్లులే తమ తక్షణ ప్రాధాన్యాలని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక వృద్ధి జోరందుకుంటుంది... తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలివ్వడం మొదలైతే.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుందని ఆర్థిక మంత్రి చెప్పారు. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6 శాతం పైగానే నమోదుకావచ్చని... ఆ తర్వాత ఇది మరింత పెరగనుందని కూడా ఆయన పేర్కొన్నారు. తమ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆరు నెలల్లో తీసుకున్న చర్యలు, విధాన నిర్ణయాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రజలు, పారిశ్రామికవేత్తల్లో అడుగంటిపోయిన విశ్వాసాన్ని మళ్లీ పునరుద్ధరించగలిగామని జైట్లీ అన్నారు. దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లలో భారత ఆర్థిక వ్యవస్థపై మళ్లీ నమ్మకం పెరిగిందని చెప్పారు. ‘ఫలితాలు కనబడేందుకు కొంత సమయం పట్టొచ్చు. అయితే, సానుకూల సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. భారీస్థాయిలో పెట్టుబడులు భారత్‌కు తరలిరానున్నాయి. దేశీ పెట్టుబడిదారుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే రానున్న రోజులన్నీ మనలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయనేది నా అభిప్రాయం’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. రేట్ల కోతపై ఆశాభావం... వృద్ధికి చేయూతనిచ్చే విధంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వడ్డీరేట్ల కోతతో ఉపశమనం కల్పిస్తుందన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. ద్రవ్య లభ్యత, చౌకగా పెట్టుబడి నిధులను అందుబాటులోకి తీసుకురాకుండా... మరిన్ని రంగాల్లోని పెట్టుబడులకు గేట్లు తెరవడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. వచ్చే వారంలో ఆర్బీఐ పాలసీ సమీక్ష జరపనుంది. బొగ్గు గనుల కేటాయింపులపై... ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూ)కు బొగ్గు గనుల కేటాయింపులు, వేలం ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రైవేటు కంపెనీలకు వాణిజ్యపరంగా బొగ్గు తవ్వకానికి ప్రభుత్వం అనుమతిస్తుందని జైట్లీ పేర్కొన్నారు. బొగ్గు స్కాం కారణంగా సుప్రీం కోర్టు రద్దు చేసిన 204 బొగ్గు బ్లాకుల వేలం కోసం ప్రభుత్వం గత నెలలో ఆర్డినెన్స్‌ను జారీ చేయడం తెలిసిందే. ఇందులో ప్రైవేటు కంపెనీలకు వాణిజ్యపరమైన మైనింగ్ అంశాన్ని కూడా చేర్చారు. కాగా, తొలి విడతలో సొంత అవసరాలకు వినియోగించే కంపెనీల కోసం 74 క్షేత్రాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వేలం నిర్వహించనున్నట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. బొగ్గు ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చే బిల్లును ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. కాగా, మూడో విడత ఎఫ్ఎం రేడియో విస్తరణ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టనున్నట్లు జైట్లీ చెప్పారు. సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖకు కూడా జైట్లీయే నేతృత్వం వహిస్తున్న విషయం విదితమే. తమ శాఖతో పాటు టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్) ఫేజ్-3 ఎఫ్ఎం వేలం విధివిధానాలపై కసరత్తు చేస్తోందన్నారు. మూడో దశ వేలంలో దేశవ్యాప్తంగా 294 నగరాల్లో మరో 800 కొత్త ఎఫ్ఎం చానళ్లకు అనుమతించే అవకాశం ఉంది. ధనికులకు వంటగ్యాస్ సబ్సిడీ కట్...! ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు నిజంగా వాటి అవసరం ఉన్న వర్గాలకే అందేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని జైట్లీ పేర్కొన్నారు. అంతేకాకుండా సంపన్నులకు వంట గ్యాస్ సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన మరోమారు తేల్చిచెప్పారు. ‘సబ్సిడీలనేవి పేదవర్గాలకు అందించాల్సినవి. అంతేకానీ, ధనికులకోసం కాదు. భారత్‌తో ఇంకా చాలా మంది పేదరికంలో ఉన్నారు. వాళ్లకు తప్పకుండా ప్రభుత్వం సబ్సిడీల రూపంలో ఆసరా ఇవ్వాల్సిందే. అయితే, ఈ ప్రయోజనాల దుర్వినియోగం కారణంగా ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. దీనికి అడ్డుకట్టవేయడంపై మేం దృష్టిపెడుతున్నాం’ అని ఆర్థికమంత్రి ఆరుణ్ జైట్లీ పేర్కొన్నారు. -
10 శాతం వృద్ధి సాధ్యమే: దీపక్ పరేఖ్
ముంబై: దేశం 10 శాతం వృద్ధి రేటును సాధించడానికి తగిన పరిస్థితులు ఉన్నాయని హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు, ఫండమెంటల్స్ ఇందుకు అనుకూలంగానే ఉన్నాయని అన్నారు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఎంత సమయం పడుతుందన్న విషయాన్ని తాను చెప్పలేనని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఐఎస్బీ కేపిటల్ మార్కెట్ల సదస్సులో పరేఖ్ మాట్లాడుతూ, స్టాక్ మార్కెట్ల ర్యాలీ, చమురు ధరల పతనం, స్థిరమైన, మెజారిటీ ప్రభుత్వం ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థకు పూర్తి సానుకూలమైనవని వివరించారు. అయితే వీటికితోడు న్యాయ, ఎన్నికలు, పోలీస్, కార్మిక, భూ సంస్కరణలతోపాటు ఫైనాన్షియల్ రంగంలోనూ సంస్కరణలు అవసరమని అన్నారు. అయితే ఇప్పటికిప్పుడు 6.5 నుంచి 7% వృద్ధి సాధనకు మరింత కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. -
అధిక వృద్ధి అందుకోగలం: జైట్లీ
న్యూఢిల్లీ: సుస్థిర, నిర్ణాయక ప్రభుత్వం ఏర్పాటయిన నేపథ్యంలో దేశం తిరిగి 8 నుంచి 9 శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధించగలదన్న విశ్వాసాన్ని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వ్యక్తం చేశారు. కొంత మెరుగైన పరిపాలనతోనే 8-9 శ్రేణి వృద్ధి రేటు సాధ్యమన్నది తన అభిప్రాయమని అన్నారు. పరిపాలన మరింత అత్యుత్తమంగా ఉంటే మనం పెట్టుకున్న వృద్ధి లక్ష్యాన్ని కూడా అధిగమించవచ్చని వివరించారు. ‘భవిష్యత్తు భారత్ ఆకాంక్షలు-అపరిమిత అవకాశాలు’ అన్న శీర్షికన ఆర్థికవేత్త రాజీవ్ కుమార్ రాసిన పుస్తకాన్ని ఆయన సోమవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాలసీ పరమైన నిర్ణయాలను వేగవంతంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఈ ప్రక్రియలో ఇప్పటి వరకూ అనుసరిస్తూ వస్తున్న ధోరణికి స్వస్తి పలకనున్నట్లు జైట్లీ తెలిపారు. పన్నులకు సంబంధించిన అంశాలు, బీమా బిల్లు, రైల్వేలో ఇన్ఫ్రా పెట్టుబడులు వంటి అంశాల్లో సవాళ్లను ఎదుర్కొనడానికి కొత్త ప్రభుత్వం తగిన ప్రయత్నం చేస్తుందన్నారు. బ్రిటన్ డిప్యూటీ ప్రధానితో భేటీ... కాగా ఆర్థికమంత్రి సోమవారం బ్రిటన్ డిప్యూటీ ప్రధానమంత్రి నిక్ క్లెగ్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాలకూ పరస్పర ప్రయోజనకరమైన పలు అంశాలపై వారు చర్చలు జరిపారు. ప్రత్యేకించి వీరిరువురి మధ్య రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్(పాత ఒప్పందాలపై పన్ను విధించడం) సవరణ అంశంపై చర్చ జరిగినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరిని బ్రిటన్ డిప్యూటీ ప్రధానమంత్రికి జైట్లీ వివరించినట్లు సమాచారం. అంతకుముందు క్లెగ్ ప్రధాని నరేంద్రమోడీతోనూ సమావేశమయ్యారు. -
అతిపెద్ద దేశీ బ్యాంక్‌గా ఎదుగుతాం
ముంబై: వ్యాపార పరిమాణం, పనితీరులో కూడా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా ఎదగనున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ విశ్వాసం వ్యక్తం చేశారు. లాభదాయక విధానంలో బ్యాంకును అగ్రస్థానానికి చేర్చాలనేది తమ లక్ష్యమని ఆమె చెప్పారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఐసీఐసీఐ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకుగా కొనసాగుతోంది. మొత్తం దేశీ బ్యాంకింగ్ పరిశ్రమ విషయానికొస్తే.. ప్రభుత్వ రంగ ఎస్బీఐ టాప్ స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో ఐసీఐసీఐ నిలుస్తోంది. 2009లో ఐసీఐసీఐ పగ్గాలు చేపట్టిన కొచర్.. ప్రఖ్యాత ‘4సీ’ వ్యూహాన్ని అమలుచేస్తూ బ్యాంకును ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. ఈ వ్యూహం బాగానే విజయవతంమైందని.. పరిశ్రమ వృద్ధి రేటు కంటే ముందుండేందుకు ఇది తగిన పునాది వేసిందని కూడా కొచర్ పేర్కొన్నారు. అయితే, లాభాలను ఏమాత్రం త్యాగం చేయకుండానే, అదేవిధంగా అధిక రిస్క్‌లు ఉండే వ్యాపార విధానంలో కాకుండా వృద్ధిని పరుగులు పెట్టించేందుకు కృషిచేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కరెంట్, సేవింగ్స్ ఖాతా(కాసా) డిపాజిట్లలో వృద్ధి, వ్యయ నియంత్రణ, మొండిబకాయిల మెరుగుదల, సరైన మూలధన నిర్వహణ.. ఈ నాలుగు అంశాల సమర్థవినియోగమే 4సీ వ్యూహంగా పేరొందింది. దేశీ బ్యాంకింగ్ పరిశ్రమ కంటే 2-3 శాతం అధిక వృద్ధి రేటును సాధించడంపై దృష్టిపెట్టినట్లు కొచర్ చెప్పారు. ఏదో నామమాత్రంగా అగ్రస్థానానికి చేరాలన్నది తన ధ్యేయం కాదని... నిలకడైన లాభాల వృద్ధితో క్రమంగా దేశంలో నంబర్ వన్ ర్యాంక్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తామని ఐసీఐసీఐ చీఫ్ వ్యాఖ్యానించారు. కేవలం బ్యాంకు పరిమాణం ప్రకారం కాకుండా మెరుగైన పనితీరు ఆధారంగా టాప్‌లోకి వెళ్లాలనేదే తమ లక్ష్యమన్నారు. అయితే, కచ్చితంగా ఈ స్థానాన్ని అందుకుంటామన్న నమ్మకం ఉందని ఆమె చెప్పారు. -
పెనం మీంచి పొయ్యిలోకి...
ద్రవ్యలోటు అదుపే పరమ పవిత్ర లక్ష్యంగా పెట్టుకుని ఉపాధి కల్పన, ప్రజా ప్రయోజనకర ప్రభుత్వ వ్యయాలలో కోతలు విధిస్తూ పోతుంటే ఆర్థిక వృద్ధి ఎలా పుంజుకుంటుంది? ఉపాధి అవకాశాలు ఎలా విస్తరిస్తాయి? ప్రజల కొనుగోలు శక్తి పెరగనిదే వ్యవసాయ, తయారీ వస్తు గిరాకీ ఎలా పెరుగుతుంది? ఎనిమిది శాతం వృద్ధి రేటు ఎలా అందుకుంటారు? పదేళ్ల యూపీఏ పాలనలో చితికి పోయిన ప్రజలకు ‘మంచి రోజులు’ తెస్తామనే వాగ్దానాలతో బీజేపీ ప్రభుత్వం అందలమెక్కింది. అది ప్రవేశపెట్టిన తొలి బడ్టెట్ ఆ ‘మంచి రోజుల’ కోసం కనీసం మరో మూడు నాలుగేళ్లు, కనీసం 2016-2017 బడ్జెట్ వరకు పడిగాపులు పడాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం 4.7 శాతంగా ఉన్న స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటును (జీడీపీ) 7 నుంచి 8 శాతానికి చేర్చడానికి మూడు నాలుగేళ్లు పడుతుందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. వృద్ధి రేటు పుంజుకునే వరకు ఉపాధి కల్పన వృద్ధి నత్తనడకన సాగక తప్పదని ఆయన అనలేదు. కానీ ఆయన బడ్జెట్లోని ప్రాధాన్యాలను జాగ్రత్తగా గమనిస్తే అదే దాని అసలు సారాంశమని వెల్లడవుతుంది. ప్రాధాన్యం కోల్పోయిన ఉపాధి భారత్ ఉపాధి రహిత వృద్ధి సమస్యను ఎదుర్కొంటోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్ధిక మందగమనం వలన 2011లో 3.5 శాతంగా ఉన్న దేశ నిరుద్యోగిత వృద్ధి రేటు 2012లో 3.6 శాతానికి, 2013లో 3.7 శాతానికి పెరిగింది. 2014లో 3.8 శాతానికి పెరుగుతుందని అంచనా. 18-59 వయో బృందంలోని యువత నైపుణ్యతలున్నా నిరుద్యోగానికి ఎక్కువగా గురవుతున్నారని ఐఎల్ఓ ఆందోళన వెలిబుచ్చింది. 15-59 వయస్కులైన ఉద్యోగులలో 21.2 శాతానికి (2011-12) మాత్రమే క్రమబద్ధమైన వేతన ఉపాధిని కలిగినవారని ఆ సంస్థ తెలిపింది. దేశంలోని మొత్తం కార్మిక జనాభాలో 94 శాతం అసంఘటిత రంగంలోనే ఉన్నారనేది మరింత ఆందోళనకరమైన వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథ కానికి మరింత ప్రాధాన్యం ఇవ్వడం సముచితం. కానీ ‘మంచి రోజులు’ తెస్తానన్న కొత్త ప్రభుత్వం తాత్కాలిక ఉపాధితో ఊరట కల్పించే ఆ పథకానికి సైతం గండి కొట్టింది. యూపీఏ ప్రభుత్వం 2012-13, 13-14 బడ్జెట్లలో ఎలాంటి మార్పూ లేకుండా రూ. 33,000 కోట్ల రూపాయలను కేటాయించింది. జైట్లీ అతి ఉదారంగా దాన్ని రూ. 34,000 కోట్లకు పెంచామంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలను, జనాభాను దృష్టిలో ఉంచుకుంటే 2012తో పోలిస్తే జైట్లీ వాస్తవంగా ఉపాధి హామీ కేటాయింపులకు భారీ కోత విధించినట్టే అవుతుంది. అరకొర నిధులతో ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తున్నామని అనిపించుకోడానికి విఫలయత్నం చేశారు. ద్రవ్యలోటు తగ్గింపే ప్రధాన లక్ష్యం ఇదంతా జైట్లీ ద్రవ్యలోటు తగ్గింపునకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న ఫలితం. 2011-12లో జీడీపీలో 5.7 శాతంగా ఉన్న ద్రవ్యలోటు 2013-14 నాటికి 4.5 శాతానికి తగ్గింది. ఈ తగ్గుదలంతా ప్రభుత్వ వ్యయాల్లో విధించిన కోతల వల్ల సాధించినదేననీ, ప్రభుత్వ రాబడి పెరుగుదల వల్ల కాదనీ జైట్లీయే చెప్పారు. సరిగ్గా ఈ 2012-14 మధ్య కాలంలోనే ఆందోళనకరమైన స్థాయిలో మన జీడీపీ వృద్ధి మందగించింది. 2010-11లో 9.3 శాతంగా ఉన్న వృద్ధి 2012-13లో 6.2 శాతానికి, 2013-14లో 4.5 శాతానికి పడిపోయింది. కాబట్టి 2012-14 మధ్య కాలంలోనే ప్రభుత్వ వ్యయాల కోతల వల్ల ద్రవ్యలోటు తగ్గడమే అదే కాలంలో వృద్ధి రేటు ఆందోళనకరంగా పడిపోవడానికి ఒక ప్రధాన కారణమని అనిపించడం పొరపాటు కాదు. 2014-15లో ద్రవ్యలోటును 4.1 శాతానికి, 2015-16లో 3.6 శాతానికి పరిమితం చేస్తామని ఆర్థిక మంత్రి అంటున్నారు. అంటే ఆర్థిక మందగమనం నుంచి గట్టెక్కిస్తామంటూ యూపీఏ లాగే దేశాన్ని మరింత మాంద్యంలోకి నెట్టే మార్గాన్ని ఎంచుకున్నారు. ద్రవ్యలోటు అదుపే పరమ పవిత్ర లక్ష్యంగా పెట్టుకుని ఉపాధి కల్పన, ప్రజా ప్రయోజనకర ప్రభుత్వ వ్యయాలలో కోతలు విధిస్తూ పోతుంటే ఆర్థిక వృద్ధి ఎలా పుంజుకుంటుంది? ఉపాధి అవకాశాలు ఎలా విస్తరిస్తాయి? మోడీ మార్కు ‘హరిత విప్లవం’ పాలకుల నిరాదరణతో, వరుస ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర సంక్షోభంలో పడ్డ వ్యవసాయరంగంపై సబ్సిడీల కోతలు పడనున్నాయి. ఈ బడ్జెట్ ప్రకటించిన నూతన యూరియా విధానం ప్రకారం యూరియా సబ్సిడీలకు చరమ గీతం పాడేయనున్నారు. ఈ వార్త వెలువడటంతోనే ఫెర్టిలైజర్ పరి శ్రమ షేర్ల ధరలు ఎగిరి గంతులేశాయి. ఆ పరిశ్రమాధిపతులు దీన్ని స్వాగతించారు. సాగు బరువై రోజురోజుకూ అప్పులతో కుంగిపోతున్న చిన్న, సన్న, సాధారణ రైతాంగానికి ఇది మరో పెద్ద దెబ్బ. సరిగ్గా ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వం మరో హరిత విప్లవాన్ని ప్రకటించింది. ఇది మొత్తంగా రైతాంగాన్ని దివాలా తీయించి, ఆహార ధరలను స్పెక్యులేటర్ల చేతుల్లో పెట్టే కార్పొరేట్ వ్యవసాయమేనని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంత దీనావస్థలో ఉన్నా నేటికీ ప్రధాన ఉపాధి రంగంగా ఉన్నది వ్యవసాయరంగమే. కార్పొరేట్ వ్యవసాయ విస్తరణతో పాటే గ్రామీణ ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం అనివార్యం. మరో హరిత విప్లం కోసం ‘‘వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాల సృష్టి అంటే... వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, ట్రాక్టర్ల రంగ ప్రవేశమే. దీంతో వ్యవసాయ కార్మికుల అవసరం తగ్గిపోతుంది’’ అని ఢిల్లీకి చెందిన ఒక విధాన విభాగ కేంద్రం డెరైక్టర్ యామినీ అయ్యర్ ‘మింట్’ పత్రికలో రాశారు. అదే విషయాన్ని ఆర్థిక మంత్రి ఇలా సెలవిచ్చారు; ‘‘వ్యవసాయ సాంకేతిక వృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను పెంచాల్సిన తక్షణ అవసరం ఉంది. వ్యవసాయ వాణిజ్య రంగంలోని మౌలిక వసతులను ఆధునీకరించాల్సిన అవసరం ఉంది.’’ ప్రభుత్వ వ్యయాల్లో కోతలు విధిస్తూ వ్యవసాయ రంగంలోని ప్రభు త్వ పెట్టుబడుల పెంపుదల గురించి మాట్లాడడం విచిత్రం. అసలు సంగతి ప్రైవేటు పెట్టుబడులకు, కార్పొరేట్ వ్యవసాయానికి ప్రో త్సాహమే. వ్యవసాయ సబ్సిడీల ఉపసంహరణ, ఉపాధి హామీకి తూట్లు వంటి చర్యలు చేపడుతూ 4 శాతం వ్యవసాయ వృద్ధి లక్ష్యం గా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే కార్పొరేట్ వ్యవసాయం ద్వారా ఉపాధి రహిత వృద్ధిని గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేయడమే. కార్పొరేట్ కుబేరులకు, స్పెక్యులేటర్లకు పండుగ దశాబ్దాల తరబడి యావత్ భారత ప్రజల శ్రమ, ధనాదులను వెచ్చించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందిన ప్రభుత్వ రంగ పరిశ్రమల ఆస్తులను కార్పొరేట్ కుబేరులకు కట్టబెట్టే ప్రయత్నం ఈసారి కొనసాగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం ద్వారా సుమారు రూ. 63,425 కోట్ల రాబడిని ఆశిస్తున్నారు. ఇది గత ఏడాది యూపీఏ అమ్ముకున్న వాటాల విలువ (రూ.25,841 కోట్లు) కంటే 145 శాతం ఎక్కువ! పొదుగు కోసి పాలు తాగే విద్యలో యూపీఏ కంటే నాలుగాకులు ఎక్కువే చదివామని ఎన్డీయే బడ్జెట్ చాటి చెప్పింది. జూలై 10న బడ్జెట్ సమర్పిస్తుండగానే షేర్‌మార్కెట్ స్పెక్యులేటర్లు (మాయా జూదర్లు) తొలుత షేర్ల విలువను పడగొట్టి, ఆ తదుపరి ఎగదోసి రెండు చేతులా చేసుకున్న లాభాల పండగే బడ్జెట్ దిశకు సరైన సూచిక కావచ్చు. చివరకు షేర్ల విలువతో గరిష్టంగా లబ్ధిని పొందిన రంగాలను బట్టే ఈ బడ్జెట్ అసలు స్వభావం వెల్లడవుతుంది. రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ రంగాలు భారీగా లాభపడ్డాయి. షేర్ మార్కెట్ జూదంతో ప్రజల కొనుగోలు శక్తిని పెంచలేరు. వ్యవసాయ, వస్తుతయారీ రంగాలలోని వస్తు గిరాకిని పెంచలేరు. అది జరగనిదే నిజమైన పారిశ్రామిక వృద్ధి సాధ్యం కాదు. జైట్లీ దేశ ఆర్థిక రంగం పగ్గాలను షేర్ మార్కెట్ జూదర్లుగా మారిన కార్పొరేట్ అధిపతులకు అప్పగించి... మంచి రోజులు తెస్తారని ఆశించి అధికారం కట్టబెట్టినవారి కోసం అట్టహాసంగా 29 పథకాలు ప్రకటించారు. 120 కోట్ల జనాభా గల దేశంలో ఒక్కో పథకానికి ముచ్చటగా రూ. 100 కోట్లు కేటాయించారు. ఆ మెతుకులు ఏరుకుంటూ మరో నాలుగేళ్లు గడిపేస్తే బొందితోనే స్వర్గానికి చేర్చేస్తాం ఎదురు చూడమని తేల్చి చెప్పారు. (వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు) - డి.పాపారావు -
తాజా సంస్కరణ లకు బాట
బెంగళూరు: దశాబ్దపు కనిష్ట స్థాయిలో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో తాజా సంస్కరణలకు బాట పడుతుందని రాయిటర్స్ సర్వే పేర్కొంది. అయితే ఆదాయపు పన్ను మినహా మిగిలిన పన్నులు, సుంకాల్లో ప్రధాన మార్పులు ఉండకపోవచ్చని తెలిపింది. వస్తు సేవల పన్ను సంస్కరణలను అమలుచేయకపోవొచ్చని, ప్రత్యక్ష పన్నుల కోడ్ అమలుకు టైమ్ టేబుల్ ప్రకటించవచ్చని సర్వేలో పాల్గొన్న ఎకానమిస్టులు అంచనావేశారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి బడ్జెట్‌ను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మోడీ సారథ్యంలోని బీజేపీ సంపూర్ణ విజయం సాధించిన అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులను సృష్టించాయి. వాణిజ్య రంగ మిత్రుడిగా పేరొందిన మోడీ ఆర్థిక ప్రగతి పరుగులు తీసే సంస్కరణలను తెస్తారని పలువురు భావిస్తున్నారు. ఆశలు తీరుస్తుందా? ఈ నేపథ్యంలో ఈ నెల 3-7 తేదీల్లో 24 మంది ఆర్థిక నిపుణులతో రాయిటర్స్ వార్తాసంస్థ సర్వే నిర్వహించింది. మోడీపై దేశ ప్రజలు పెట్టుకున్న ఆశలను బడ్జెట్ సాకారం చేస్తుందని ఆశిస్తున్నట్లు వీరిలో 17 మంది తెలిపారు. ద్రవ్యలోటు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 4.4 శాతానికి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యమైన సంస్కరణలకు తగిన ముందస్తు ఏర్పాట్లు బడ్జెట్లో ఉండవచ్చని మిజుహో బ్యాంక్ (సింగపూర్) సీనియర్ ఎకనామిస్ట్ విష్ణు వర్ధన్ అన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో సహా పన్ను సంస్కరణలను ప్రస్తుతానికి అమలు చేయకపోవచ్చనీ, బహుశా వచ్చే ఏడాది అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ద్రవ్యలోటు పెరగడానికి ప్రధాన కారణం వివిధ రకాల ఇంధనాలపై ఏటా ఇస్తున్న 4 వేల కోట్ల డాలర్ల సబ్సిడీలే. ద్రవ్యలోటు తగ్గించడానికి సబ్సిడీలకు జైట్లీ కోత పెట్టవచ్చని పలువురు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. పెట్రోలు ధరలపై కంట్రోలును ప్రభుత్వం ఇప్పటికే తొలగించగా డీజిలు, వంటగ్యాసు, కిరోసిన్ ధరలపై కంట్రోలు కొనసాగుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు అరకొరగా కురిసే అవకాశం ఉన్నందున ఎరువులు, ఆహారంపై సబ్సిడీలను తగ్గించడం కష్టసాధ్యం. సబ్సిడీలను కుదిస్తే ఆహార ఉత్పత్తుల ధరలు భగ్గుమంటాయని ఎకనామిస్టులు పేర్కొన్నారు. పీఎస్‌యూల్లో ప్రభుత్వ వాటాల విక్రయం జోరు? స్టాక్ మార్కెట్లలో ర్యాలీ నుంచి దేశం లబ్ధి పొందేందుకు జైట్లీ యత్నించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు ఊహిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికీ, వ్యయానికీ మధ్య అగాధాన్ని కొంత పూడ్చేందుకు కొన్ని ప్రభుత్వరంగ సంస్థల్లోని వాటాలను విక్రయించవచ్చని భావిస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని 900 కోట్ల డాలర్ల నుంచి 1,100 కోట్ల డాలర్లకు పెంచాలని ఆర్థిక శాఖ యోచిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. జీఎస్టీ అమలుతో ధరల పెరుగుదలకు కళ్లెం పడుతుందనీ, అయితే ప్రస్తుత బడ్జెట్లో జీఎస్టీ అమలుకు చర్యలు చేపట్టకపోవచ్చనీ ఎకనామిస్టులు తెలిపారు. జీఎస్టీ అమలు ప్రస్తుతానికి లేనట్లే... జీఎస్టీ అమలుకు సంబంధించిన కొంత సమాచారాన్ని కేంద్రం వెల్లడించవచ్చనీ, పన్నుల్లో ప్రధాన సంస్కరణలేవీ ఉండకపోవచ్చనీ 16 మంది ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ‘జీఎస్టీ అమలుపై కేంద్రం, రాష్ట్రాల మధ్య ఇప్పటివరకు ఏకాభిప్రాయం కుదరలేదు. వచ్చే బడ్జెట్లో జీఎస్టీ గురించి కొంత ప్రస్తావన ఉండవచ్చు..’ అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకనామిస్టు జితేందర్ కుమావత్ వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష పన్నుల కోడ్ (డీటీసీ) ప్రవేశపెట్టడానికి సంబంధించిన టైమ్ టేబుల్‌ను బడ్జెట్లో ప్రకటించవచ్చని ఆర్థిక నిపుణులు చెప్పారు. ద్రవ్యలోటు 4.3 శాతం? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.3 శాతంగా అరుణ్ జైట్లీ నిర్ణయించవ్చని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. తాము గతంలో అంచనా వేసిన 4.8% కంటే ఇది తక్కువని ఓ ప్రకటనలో తెలిపింది. పన్నుల ఆదాయం 21% పెరుగుతుందన్న మునుపటి ప్రభుత్వ అంచనా అతి ఆశావాదంతో కూడినదని వ్యాఖ్యానించింది. అధిక ద్రవ్యలోటును కట్టడిచేయడానికి మూడేళ్లు పడుతుందనీ, భారత్ రేటింగ్ తగ్గిస్తామని విదేశీ రేటింగ్ ఏజెన్సీలు చెప్పడానికి ఇదొక కారణమనీ పేర్కొంది. వేతన జీవులకు ఉపశమనం? మోడీ సర్కార్ తొలి బడ్జెట్ వేతన జీవులకు ఉపశమనం కలిగిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. పెట్టుబడులను, ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించే చర్యలు బడ్జెట్లో ఉంటాయని కూడా భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటుండడంతో మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రూ. 2 లక్షలుగా ఉన్న వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ. 3 లక్షలకు పెంచుతారని పలువురు ఊహిస్తున్నారు. పెన్షన్లు, జీవిత బీమాలో చేసే పెట్టుబడులు, కొన్ని రకాల వ్యయాలపై ఇస్తున్న పన్ను మినహాయింపు పరిమితిని పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను, పారిశ్రామిక వృద్ధిని పునరుద్ధరించే విధంగా పన్ను ప్రోత్సాహకాలతో పాటు మరిన్ని చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటిస్తారని వారి అంచనా. ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొన్నట్లు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటును ఈ బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. -
సరైన ప్రణాళికలతోనే ఉత్పాదకతతో కూడిన ఉపాధి
Civils Prelims Paper - I ఆర్థికవృద్ధి, ఉపాధి మనదేశ అభివృద్ధి విధానంలో ఉపాధి ఒక ముఖ్యాంశంగా ఉంది. భారత్ అభివృద్ధి ప్రణాళికలలో ఉపాధి కల్పనకు అనేక విధానాలు, వ్యూహాలు అవలంభిస్తోంది. 1950వ దశకంలో పారిశ్రామిక ఆధారిత అభివృద్ధి వ్యూహంలో భాగంగా ఉపాధికల్పనను ముఖ్యాంశంగా పరిగణించలేదు. పంచవర్ష ప్రణాళికలలో వృద్ధికి అనుగుణంగా ఉపాధి కల్పన ఉంటుందని ప్రణాళికా రచయితలు భావించారు. శాశ్వత, అవసరాలకు తగిన నైపుణ్యం ఉన్న శ్రామికులు లభ్యం కావడమనేది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అత్యవసరం. నాణ్యతతో కూడిన ఉపాధి పెంపునకు ప్రభుత్వ విధానాలు దోహదపడే విధంగా ఉండాలి. స్వాతంత్య్రానంతరం మొద టి నాలుగు దశకాల్లో ప్రభుత్వ రంగం నాణ్యతతో కూడిన ఉపాధి అందించడం ద్వారా ’కౌఛ్ఛీ ఉఝఞౌడ్ఛట’గా నిలిచింది. ప్రభుత్వ శాసనాలకు అనుగుణంగా ప్రైవేట్ రంగం ఉపాధి నియమావళిని పాటిస్తుందని ఆశించారు. 1970వ దశకం మధ్య భాగంలో అభివృద్ధి ప్రణాళికలో ఉపాధి వృద్ధి ప్రధాన అంశంగా నిలిచింది. స్వల్పకాల వేతన ఉపాధి, స్వయం ఉపాధి పథకాలు లాంటి ప్రత్యేక ఉపాధి కార్యక్రమాలను ఈ కాలంలో ప్రవేశపెట్టారు. 1990వ దశకం ప్రారంభంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా స్వదేశీ ఆర్థిక కార్యకలాపాలపై నియంత్రణ తొలగింపు, విదేశీ వాణిజ్యం సరళీకరణ, పెట్టుబడి ప్రోత్సాహక విధానాలను ప్రవేశపెట్టారు. తద్వారా 1990వ దశకం మధ్య భాగం నుంచి ప్రభుత్వ రంగంలో ఉపాధి వృద్ధి తగ్గింది. సరళీకరణ విధానాల నేపథ్యంలో ఆర్థికవృద్ధి ఉపాధి పెరుగుదలకు దారితీయగలదని ఆశించారు. దీనికి విరుద్ధంగా ఆర్థిక వృద్ధి రేటులో పెరుగుదల ఏర్పడినా ఉపాధి వృద్ధి క్షీణించింది. అసంఘటిత రంగంలో తక్కువ వేతనాలు, ఏ విధమైన సాంఘిక భద్రతలేని ఉపాధి సృష్టి జరిగింది. 2009-10లో నేషనల్ శాంపుల్ సర్వే వివరాల ప్రకారం 2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో దేశంలో ఉపాధి స్తంభించింది. ఉపాధి - జీడీపీ వృద్ధి ఉపాధి వృద్ధిలో దీర్ఘకాల క్షీణతను నిర్లక్ష్యపర్చడం ఆర్థిక వ్యవస్థకు శ్రేయస్కరం కాదు. ఆర్థిక వృద్ధిరేటు కొనసాగుతున్నా ఉపాధి వృద్ధిలో తగ్గుదలను గమనించవచ్చు. 1972 - 73 నుంచి 1983 మధ్య కాలంలో జీడీ పీ వృద్ధి సగటున 4.7 శాతంగా నమోదు కాగా, ఉపాధి వృద్ధి సగటు 2.4 శాతం మాత్రమే. 1983 నుంచి 1993-94 మధ్య కాలంలో జీడీపీ వృద్ధి సగటు 5 శాతంగా నమోదైంది. ఈ కాలం లో ఉపాధి వృద్ధి సగటు 2 శాతం మాత్రమే. 1993-94 నుంచి 2004-05 మధ్య కాలంలో జీడీపీ వృద్ధి సగటు 6.3 శాతం కాగా ఉపాధి వృద్ధి సగటు 1.8 శాతం మాత్రమే. 2004-05 నుంచి 2009-10 మధ్యకాలంలో జీడీపీ వృద్ధి సగటు 9 శాతం కాగా, ఉపాధి వృద్ధి రేటు 0.22 శాతంగానే నమోదైంది. దీని ఆధారంగా జీడీపీ వృద్ధికి అనుపాతంగా దేశంలో ఉపాధి వృద్ధి జరగలేదని తెలుస్తోంది. ముఖ్య రంగాల్లో ఉపాధి వృద్ధి 1972-73 నుంచి 2009-10 మధ్య కాలం లో ద్వితీయరంగానికి సంబంధించిన మైనింగ్, తయారీ రంగం, విద్యుత్ శక్తి, వాటర్, గ్యాస్, నిర్మాణరంగంలో ఉపాధి వృద్ధి మిగిలిన ప్రాథమిక, తృతీయ రంగాలతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంది. 2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో దేశంలో ఉపాధి వృద్ధి స్తంభించినప్పటికీ ద్వితీయ రంగంలో ఉపాధి వృద్ధి 3.5 శాతంగా నమోదైంది. సేవల (తృతీయ) రంగంలో ఉపాధివృద్ధి మెరుగైనప్పటికీ 1972-73 తర్వాత ప్రతి పదేళ్ల కాలాన్ని పరిశీలించినప్పుడు తగ్గుదల ధోరణిని గమనించవచ్చు. ప్రాథమిక రంగంలో ఆశించిన విధంగా ఉపాధివృద్ధి లేదు. వ్యవసాయ జీడీపీ వృద్ధిరేటులో తగ్గుదల, ఉపాధి వ్యాకోచత్వంలో తగ్గుదల, ప్రాథమిక రంగంలో ఉపాధి వృద్ధిరేటులో తగ్గుదలకు కారణాలుగా పేర్కొనవచ్చు. ద్వితీయ రంగంలో ఉపాధి వ్యాకోచత్వంలో పెరుగుదల కారణంగా పారిశ్రామిక జీడీపీ వృద్ధిరేటులో ఒడుదుడుకులు ఉన్నప్పటికీ అధిక ఉపాధి వృద్ధి జరిగింది. తృతీయ రంగంలో ఉపాధి వ్యాకోచత్వంలో తగ్గుదల కారణంగా అధిక సేవారంగ జీడీపీ వృద్ధి నమోదైనప్పటికీ ఉపాధి వృద్ధిరేటులో పెరుగుదల లేదు. వివిధ కార్యకలాపాల్లో ఉపాధివృద్ధిని పరిశీలించినప్పుడు ద్వితీయ రంగం లేదా పారిశ్రామిక రంగంలో భాగంగా నిర్మాణ రంగంలో ఉపాధివృద్ధి రేటు అధికంగా నమోదైంది. 1994 నుంచి 2005 మధ్య కాలంలో జీడీపీ వృద్ధిరేటుకు సమానంగా ఈ రంగంలో ఉపాధి వృద్ధి జరిగింది. తయారీ రంగంలోనూ 1983 నుంచి 2005 మధ్య కాలంలో ఉపాధి వృద్ధిరేటు అధికంగా ఉన్నప్పటికీ తర్వాతి కాలంలో తగ్గింది. మొత్తం ఉపాధిలో మైనింగ్ వాటా 0.56 శాతం, విద్యుత్ శక్తి, వాటర్, గ్యాస్‌ల వాటా 0.26 శాతంగా ఉంది. 1994 నుంచి 2005 మధ్య కాలంలో మొత్తం ఉపాధిలో వీటి వాటా తగ్గింది. సేవా రంగంలో 1994-2005 మధ్య కాలం లో ఉపాధి వృద్ధిరేటు 5 శాతం కాగా, ఆ తర్వాతి కాలంలో తగ్గింది. ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఉపాధివృద్ధి 1983-2005 మధ్య కాలంలో అధికంగా ఉన్నప్పటికీ తర్వాతి కాలంలో 6 శాతం వృద్ధినే నమోదు చేసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధి గ్రామీణ ప్రాంతాలతో పోల్చినప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఆర్థికవృద్ధి రేటు అధికంగా ఉన్నప్పటికీ, వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధిలో గ్రామీణ ప్రాంతాలు ముందంజలో ఉన్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ముఖ్య వృత్తిగా ఉండటం వల్ల అధిక ఉపాధి కల్పిస్తున్నా ఉపాధివృద్ధి రేటులో తగ్గుదల కారణంగా మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధివృద్ధితక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. 1972-73 నుంచి 1983 మధ్య కాలంలో వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో 4.58 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో 4.08 శాతం మాత్రమే. 1994 నుంచి 2005 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధి 3.2 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 3.5 శాతంగా నమోదైంది. తర్వాతి కాలంలో ఈ అంశానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి వృద్ధి ఎక్కువ. ముఖ్యంగా నిర్మాణ రంగానికి సంబంధించి రెండు ప్రాంతాల్లోనూ అధిక ఉపాధి వృద్ధి నమోదైంది. 1993-94 నుంచి 2004-05 మధ్య నిర్మాణ రంగంలో ఉపాధి వృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో 8.3 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో 5.6 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధికి సంబంధించి రవాణా రంగం రెండో స్థానాన్ని, వాణిజ్యం మూడో స్థానాన్ని పొందాయి. పట్టణ ప్రాంతా ల్లో రవాణా రంగంతో పోల్చినప్పుడు వాణిజ్యంలో ఉపాధి వృద్ధి ఎక్కువ. ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఉపాధివృద్ధి గ్రామీణ ప్రాంతా ల్లో 6.30 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో 7.54 శాతం. మొత్తం మీద 1972-73 నుంచి 2009-10 మధ్య కాలంలో వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధిరేటు పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు. సంఘటిత రంగంలో ఉపాధి సంఘటిత (ప్రభుత్వ, ప్రైవేటు) రంగం నాణ్యతతో కూడిన ఉపాధిని అందిస్తోంది. మొత్తం ఉపాధిలో ఈ రంగం వాటా 10 శాతం. 1990వ దశకం మధ్య భాగం నుంచి మొత్తం ఉపాధిలో ఈ రంగం వాటా క్రమంగా తగుతోంది. దీంట్లో ఉపాధి తగ్గుదల ప్రభుత్వ రంగంలోనే ఎక్కువగా ఉంది. 2001-04 మధ్య కాలంలో ప్రైవేట్ రంగానికి సంబంధించి సంఘటిత రంగంలో ఉపాధి తగ్గినా తర్వాతి కాలంలో పెరిగింది. 2004 తర్వాత ప్రైవేట్ రంగం సంఘటిత రంగంలో ఉపాధి వృద్ధి 3.8 శాతంగా నమోదైంది. ఈ కాలంలో ప్రభుత్వ రంగ ఉపాధిలో తగ్గుదల ఏర్పడింది. సంఘటిత రంగంలో వివిధ రంగాల్లో ఉపాధివృద్ధిని పరిశీలించినప్పుడు ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఎక్కువగా ఉంది. మొత్తం సంఘటిత రంగ ఉపాధిలో ఫైనాన్షియల్ సర్వీసులే 9 శాతం వాటా కలిగి ఉన్నాయి. వాణిజ్యం వాటా మొత్తం ఉపాధిలో 3 శాతంగా ఉంది. ఇది 1.8 శాతం ఉపాధివృద్ధి పొందింది. మొత్తం సంఘటిత రంగం ఉపాధిలో 22 శాతం వాటాను కలిగి ఉన్న తయారీ రంగానికి ప్రైవేట్ రంగం లో 50 శాతం వాటా ఉంది. 2004-08 మధ్య కాలంలో తయారీ రంగంలో వృద్ధి ప్రైవేట్ రంగంలో 3.8 శాతంగా నమోదైంది. అసంఘటిత రంగంలో ఉత్పాదకత సంఘటిత రంగంలో ఉపాధి వృద్ధి పెంపు ఆవశ్యకత ఉంది. వ్యవసాయ రంగం లాంటి అసంఘటిత రంగాల్లో ఉత్పాదకతలో పెరుగుదల లేనప్పుడు సంఘటిత రంగంలో నాణ్యతతో కూడిన ఉపాధి కల్పన సాధ్యం కాదు. ఉత్పాదకతను పెంచడంతోపాటు చిన్న, సన్నకారు కమతాలలో ఉత్పాదకత పెంపునకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఉత్పాదకతతో కూడిన ఉపాధిని అందించడంలో గ్రామీణ వ్యవసాయేతర రంగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆయా కార్యకలాపాలను పటిష్టపరిచే చర్యలు అవసరం. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారా నిరుద్యోగులతోపాటు అదనంగా శ్రామికశక్తికి తోడ య్యే వారికి ఉపాధి అందించే విధంగా చర్యలు చేపట్టాలి. ఎగుమతులు ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ నేపథ్యంలో ఎగుమతులు ఆర్థికవృద్ధికి యంత్రంగా ఉపయోగపడగలవని అనుభవ పూర్వక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఎగుమతుల వృద్ధి నాణ్యతతో కూడిన ఉపాధి వృద్ధికి దారితీస్తుంది. భారత్ ఎగుమతుల విలువ 1991లో జీడీపీలో 5.8 శాతం కాగా 2009-10లో 15 శాతానికి చేరుకుంది. భారత్ ఎగుమతులు ఎక్కువగా శ్రమ సాంద్రత ఉత్పత్తుల రకానికి చెందినవి. తద్వారా ఉపాధి పరిమాణం పెంపు, నాణ్యతతో కూడిన ఉపాధికి అవకాశాలు భారత్‌లో ఎక్కువ. ప్రపంచ ఆర్థిక సంక్షోభ కాలంలో భారత్‌లో జీడీపీ వృద్ధి కంటే ఉపాధి వృద్ధిలో క్షీణత ఎక్కువగా సంభవించింది. మరోవైపు భారత్ ఎగుమతుల్లో శ్రమసాంద్రత ఉత్పత్తుల వాటా తగ్గడం ఆందోళన కలిగించే పరిణామం. శ్రమ సాంద్రత ఉత్పత్తుల వాటా భారత్ మొత్తం ఎగుమతుల్లో 1995-96లో 65 శాతం కాగా, 2004-05 నాటికి 50 శాతానికి, 2009-10 నాటికి 1/3 వంతుకు తగ్గాయి. భారత్ శ్రామిక ఉత్పాదకత అమెరికా, జపాన్, ఫ్రాన్స, ఇంగ్లండ్ కంటే తక్కువ. ఉత్పాదకత పెంపులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఉపాధి వృద్ధి తగ్గుదలకు దారితీస్తుంది. గత కొంత కాలంగా భారత్ ఎగుమతుల్లో సేవల ఎగుమతుల వాటా క్రమంగా పెరుగుతోంది. మొత్తం ఎగుమతుల విలువలో వీటి వాటా 36 శాతం వరకు ఉంది. ఇటీవల రవాణా, ట్రావెల్ లాంటి ఇతర సర్వీసుల ఎగుమతుల విలువలోనూ పెరుగుదల ఏర్పడింది. సాఫ్ట్వేర్ సర్వీసులు, వ్యాపారం, ఫైనాన్షియల్ సర్వీసుల ఎగుమతుల విలువలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. భారత్‌లో శ్రామిక చట్టాల్లో మార్పుల ద్వారా ఉపాధి పెంపునకు చర్యలు అవసరం. అధిక జీడీపీ వృద్ధితోపాటు తక్కువ ఉపాధి వ్యాకోచత్వం ఉపాధి వృద్ధికి తోడ్పడటం ద్వారా ఉత్పాదకత పెంపునకు దారితీస్తుంది. నాణ్యతతో కూడిన ఉపాధిని అందించే విధానంలో వేగవంతమైన వృద్ధిరేటు సాధించే వ్యూహం అంతర్భాగంగా ఉండాలి. -
వచ్చే పదేళ్లు 15% పైనే రాబడి..
‘సాక్షి’ ఇంటర్వ్యూ ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐవో) అనీష్ శ్రీవాస్తవ 2015 ఆదాయాలతో పోలిస్తే మార్కెట్లు ఖరీదే కాని.. దీర్ఘకాలానికి చౌకే - ఇప్పటికీ దూరంగానే రిటైల్ ఇన్వెస్టర్లు - ఎఫ్ఐఐల పెట్టుబడులతోనే మార్కెట్ పెరుగుతోంది - రుతుపవనాల ప్రభావం మార్కెట్‌పై తక్కువే - ఇన్ఫ్రా, అగ్రి, దేశీయ వినియోగ రంగాల షేర్లకే ఓటు గడిచిన ఐదేళ్ల నుంచి ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు తొలగి దేశఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలోకి పయనిస్తోందని, దీర్ఘకాలిక వృద్ధి అంచనాలను మార్కెట్లు ఇంకా డిస్కౌంట్ చేసుకోలేదంటున్నారు ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐవో) అనీష్ శ్రీవాస్తవ. వచ్చే పదేళ్లు 15 శాతానికిపైగా లాభాలను అందించే శక్తి దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు ఉందంటున్న అనీష్ శ్రీవాస్తవతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. ఇంకా మార్కెట్లపై మోడి ప్రభావం ఉందా లేక ఇది ప్రీ బడ్జెట్ ర్యాలీనా? పెద్ద పతనం లేకుండా కొనసాగుతున్న ర్యాలీని ఏ విధంగా చూస్తున్నారు.? ఇది ప్రీ బడ్జెట్ లేదా షార్ట్ కవరింగ్ ర్యాలీ కాదు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఆర్థిక వృద్ధిరేటును పెంచే విధంగా చర్యలు తీసుకుం టోందన్న నమ్మకంతో మార్కెట్లు పెరుగుతున్నాయి. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటంతో విధానపరమైన కఠిన నిర్ణయాలు సులభంగా తీసుకునే వెసులుబాటు కలిగివుంది. అంతే కాకుండా దేశంలో అత్యధికంగా ఉన్న యువశక్తితో 2040 వరకు ఇండియా చాలా లబ్ధి పొందనుంది. గడిచిన ఐదేళ్లు ఎదుర్కొన్న గడ్డుపరిస్థితులు తొలగి ఆర్థిక వ్యవస్థ వృద్ధిలోకి పయనించనుంది. దీంతో కార్పొరేట్ కంపెనీల లాభాలు పెరగనున్నాయి. ఈ అంశాలతో విదేశీ పెట్టుబడిదారులు ఇండియా పట్ల ఆకర్షితులవుతున్నారు. దీంతో దీర్ఘకాలి కంగా చూస్తే ఈక్విటీలు మంచి లాభాలే అందించనున్నాయి. ప్రస్తు తం బాగా పెరగడంతో ఈ ఏడాది కంపెనీల ఆదాయంతో పోలిస్తే సెన్సెక్స్ వాస్తవ విలువ కంటే అధికంగా ఉన్నప్పటికీ 2015-16 అంచనాలతో పోలిస్తే వాస్తవ విలువ కంటే తక్కువగా ఉంది. ప్రపంచ బ్యాంక్... తాజాగా అంతర్జాతీయ వృద్ధిరేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఇండియాపై ఏమైనా దీని ప్రభావం పడే అవకాశం ఉందా? మోడీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం రావడంతో వృద్ధిరేటు అంచనాలను పెంచాము. గతేడాది 4.6%గా ఉన్న జీడీపీ ఈ ఏడాది 5.6%కి, వచ్చే ఏడాది 6.8%కి పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఒకవేళ అంతర్జాతీయ వృద్ధిరేటు తగ్గినా అది మన ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రభావం చూపకపోవచ్చు. ఎగుమతులపై కొంత ప్రభావం ఉన్నా దిగుమతులపై అధికంగా ఆధారపడే మనం ముడి చమురు ధరలు, ఆహార ధాన్యాల ధరలు తగ్గడం ద్వారా లబ్ధిపొందుతాం. దీర్ఘకాలంలో దేశీ స్టాక్ సూచీలు ఏ స్థాయికి పెరిగే అవకాశం ఉంది? స్టాక్ సూచీల కదలికలు కంపెనీల లాభదాయకతపై ఆధారపడి ఉంటుంది. 2014-15 ఆదాయాలను సూచీలు ఇప్పటికే డిస్కౌంట్ చేసుకున్నాయి. అదే 2015-16 ఆదాయాలతో పోలిస్తే సెన్సెక్స్ 29,500 స్థాయి అనేది వాస్తవ విలువకు దగ్గరగా ఉంటుంది. భవిష్యత్తులో వృద్ధిరేటు పెరిగి కార్పొరేట్ లాభాలు ఏటా 15% పైన పెరిగే అవకాశాలున్నాయి. ఆమేరకు సెన్సెక్స్ కూడా వచ్చే పదేళ్లు సగటున 15-18% లాభాలను అందిస్తుందని అంచనా వేస్తున్నాం. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టే మొట్టమొదటి బడ్జెట్ నుంచి మార్కెట్ ఏమి ఆశిస్తోంది? ప్రణాళికేతర వ్యయం కంటే ప్రణాళిక వ్యయానికి ప్రాధాన్యత ఉండే విధంగా బడ్జెట్ ఉండాలని ఆశిస్తోంది. అలాగే సబ్సిడీ భారం తగ్గించుకుంటూ, పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ఉండాలి. మొదటి ఏడాది నిధుల సమీకరణ కష్టం కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణపై ఎక్కువగా దృష్టిసారించొచ్చు. ఈ విధంగా బడ్జెట్ ఉంటే స్టాక్ మార్కెట్‌కు మరింత శక్తి వస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌కు ఉన్న భయాలు ఏమిటి? కరువు అనేది ప్రధానమైన రిస్క్. ఎలెనినో ప్రభావంతో వర్షాలు తగ్గినందువల్ల ద్రవ్యోల్బణం పెరిగి, వృద్ధిరేటు తగ్గినా, అది మార్కెట్లపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అనుకోవడం లేదు. మధ్య దీర్ఘకాలానికి చూస్తే అమెరికా వడ్డీరేట్లు, డాలరు బలపడటం అనేవి మార్కెట్లు ఎదుర్కొనే భయాలు. ప్రస్తుతం ఏయే రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారు. వేటికి దూరంగా ఉంటున్నారు? ఇన్ఫ్రా, నిర్మాణం, వ్యవసాయ రంగాలతో పాటు దేశీయ వినియోగ శక్తిని ప్రతిబింబించే రంగాల షేర్లు బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ర్యాలీలో వీటిల్లో కొన్ని షేర్లు కనిష్ట స్థాయి నుంచి ఇప్పటికే బాగా పెరిగినప్పటికీ దీర్ఘకాలంగా చూస్తే ఇంకా ఆకర్షణీయంగానే ఉన్నాయి. ఎఫ్ఐఐలు కొంటుంటే, దేశీయ ఫండ్స్ అమ్ముతున్నాయి. ఇంకా రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లకు దూరంగానే ఉన్నారా? ప్రస్తుత ర్యాలీ అంతా ఎఫ్ఐఐల కొనుగోలుతోనే జరిగింది. దీర్ఘకాలంలో ప్రపంచ దేశాలకు ఇండియా ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సూచీలు నూతన గరిష్ట స్థాయిలను దాటినా రిటైల్ ఇన్వెస్టర్లు ఇంకా దూరంగానే ఉన్నారు. దేశీయ ఫండ్స్ ఇంకా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. యులిప్స్ పథకాల ఇన్వెస్ట్మెంట్లో కూడా ఎటువంటి పురోగతి లేదు. రిటైల్ ఇన్వెస్టర్ల ప్రవేశానికి మరికొంత సమయం పడుతుంది. -
సెన్సెక్స్ రయ్ రయ్....
468 పాయింట్లు జూమ్...; 24,685 పాయింట్లకు చేరిక * ఆర్బీఐ పాలసీపై సానుకూల అంచనాల ప్రభావం * విదేశీ మార్కెట్ల పటిష్టత కూడా... * 133 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ, 7,362 పాయింట్ల వద్ద ముగింపు * ఆకర్షణీయమైన ఫలితాలతో 6.4% ఎగసిన ఎల్అండ్టీ షేరు ముంబై: మార్కెట్లలో మరోసారి ‘బుల్’ రంకేసింది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్ల తగ్గింపు ఆశలు... మరోపక్క విదేశీ స్టాక్ మార్కెట్ల జోరుతో దేశీ సూచీలు కదంతొక్కాయి. కన్సూమర్ గూడ్స్, చమురు-గ్యాస్, విద్యుత్, మెటల్స్ రంగాల షేర్లతో పాటు బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మెరుపులు మెరిపించాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 468 పాయింట్లు దూసుకెళ్లి... 24,685 పాయింట్ల వద్ద స్థిరపడింది. గడచిన మూడు వారాల్లో సెన్సెక్స్‌కు ఇదే అతిపెద్ద లాభం, వారం రోజుల గరిష్టస్థాయి కావడం గమనార్హం. కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 133 పాయింట్ల భారీ లాభంతో 7,363 పాయింట్ల వద్ద ముగిసింది. రోజంతా దూకుడే... దేశీ మార్కెట్లు సోమవారం రోజంతా లాభాలతో పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. గత ముగింపు 24,217 పాయింట్లతో పోలిస్తే సెన్సెక్స్ 152 పాయింట్ల లాభంతో 24,369 వద్ద ప్రారంభమైంది. ఆతర్వాత లాభాల జోరును అంతకంతకూ కొనసాగిస్తూ... 24,709 పాయింట్ల గరిష్టాన్ని కూడా తాకింది. చివరకు 1.83 శాతం లాభంతో పటిష్టస్థాయిలో 24,685 వద్ద స్థిరపడింది. జీడీపీ గణాంకాలు నిరాశాజనకంగానే(2013-14లో వృద్ధిరేటు 4.7 శాతం) ఉన్న నేపథ్యంలో.. మార్కెట్లలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వడ్డీరేట్ల తగ్గింపు ఆశలు చిగురించాయి. అయితే, చాలావరకూ బ్యాంకర్లు, నిపుణులు మాత్రం ఆర్బీఐ నేడు చేపట్టనున్న సమీక్షలో పాలసీ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచొచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోపక్క, మే నెలకు సంబంధించి హెచ్ఎస్బీసీ భారత్ తయారీ రంగ సూచీ(పీఎంఐ)లో పరిశ్రమలు కాస్త పుంజుకున్న సంకేతాలు కనబడటం కూడా మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్‌కు దోహదం చేసిందని బ్రోకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం... వృద్ధిని తిరిగి గాడిలోపెట్టగల సమర్థ నిర్ణయాలు తీసుకోగలదన్న విశ్వాసం పెరుగుతుండటం కూడా దేశీయ మార్కెట్లో బుల్లిష్ ధోరణిని పెంచుతోందని కోటక్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే చెప్పారు. ఇక చైనా తయారీ రంగం పుంజుకోవడం ఆసియా మార్కెట్లకు టానిక్‌లా పనిచేసింది. జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక సెలవు కారణంగా చైనా, హాంకాంగ్, తైవాన్ మార్కెట్లు పనిచేయలేదు. రెండు రంగాలు మినహా... బీఎస్ఈలో ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్ రంగాల సూచీల్లో స్వల్ప నష్టాలు మినహా మిగతా అన్ని రంగాల సూచీలూ లాభాల్లోనే నిలిచాయి. ప్రధానంగా కన్సూమర్ గూడ్స్ సూచీ అత్యధికంగా 4.93 శాతం ఎగబాకింది. ఇక బ్యాంకింగ్ 3.28 శాతం, చమురు-గ్యాస్ సూచీ 2.85 శాతం, విద్యుత్ సూచీ 2.38 శాతం, మెటల్స్ 1.86 శాతం, రియల్టీ 1.43 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆర్బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా అంచనాలకంటే ముందే ఆర్బీఐ రేట్ల కోత ఉండొచ్చని, తాజా పాలసీలో ఈ మేరకు నిర్దిష్ట సంకేతాలు ఉంటాయన్న అభిప్రాయంతో బ్యాంకింగ్, రేట్లతో సంబంధం ఉన్న రంగాల షేర్లు పుంజుకున్నాయని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. ఇతర ముఖ్యాంశాలివీ... ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ అంచనాలను మించిన ఫలితాలతో బంపర్ లాభాలను ప్రకటించడంతో కంపెనీ షేరు రివ్వున ఎగసింది. 6.23 శాతం జంప్ చేసి రూ.1,645 వద్ద స్థిరపడింది. ప్రాథమిక గణాంకాల ప్రకారం ఎఫ్ఐఐలు సోమవారం నికరంగా రూ.234 కోట్ల విలువైనస్టాక్స్ను కొనుగోలు చేసినట్లు అంచనా. భారతీ ఎయిర్టెల్ 5.52%, ఓఎన్‌సీజీ 5.17%, టాటా స్టీల్ 4.42%, ఎస్బీఐ 4.23%, యాక్సిస్ బ్యాంక్ 3.59%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.26%, మారుతీ 3.06%, గెయిల్ 2.86%, హెచ్డీఎఫ్సీ 2.31%, ఇన్ఫోసిస్ 1.92%, రిలయన్స్ 1.84%, టాటా మోటార్స్ 1.58% చొప్పున ఎగబాకాయి. బీఎస్ఈ సెన్సెక్స్ జాబితాలోని మొత్తం 30 స్టాక్స్‌లో 24 లాభాలతో ముగిశాయి. బీఎస్ఈలో నగదు విభాగంలో టర్నోవర్ రూ.3,619 కోట్లకు పరిమితమైంది. గత శుక్రవారం ఈ మొత్తం రూ.10,538 కోట్లు కావడం విశేషం. ఇక ఎన్ఎస్ఈ క్యాష్ విభాగంలో రూ.17,718 కోట్లు, డెరివేటివ్స్‌లో రూ.1.33 లక్షల కోట్ల టర్నోవర్ నమోదైంది. -
బీహార్ ప్రగతి ప్రదాత
ప్రస్థానం పేరు : నితీశ్ కుమార్. ముద్దుపేరు మున్నా జననం : 1951 మార్చి 1 చదువు : బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) నియోజకవర్గం : శాసనమండలి సభ్యునిగా కొనసాగుతున్నారు. నమ్మిన సిద్ధాంతం : ‘లౌకిక’వాదం. అభివృద్ధితోనే అన్నీ సాధ్యం ప్రస్తుత వైఖరి : ‘కర’, ‘కమలా’లకు సమదూరం రాజకీయ అరంగేట్రం : 1974లో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం ద్వారా రాజకీయాల్లో ఇమేజ్ : బీహార్ పునరుజ్జీవన ప్రదాత రాజకీయాల్లోకి రాక ముందు : బీహార్ రాష్ట్ర విద్యుత్ మండలిలో ఇంజనీరుగా ఉద్యోగం ఎలక్షన్ సెల్: అరాచకానికి ఆలవాలమైన బీహార్‌ను అభివృద్ధి బాట పట్టించిన ఘనాపాఠీ నితీశ్‌కుమార్. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని శరవేగంగా ఆర్థిక ప్రగతి బాటన పరుగులు తీయించా రు. ‘బీహార్ పునరుజ్జీవన ప్రదాత’గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకనాడు ‘బీమారు’ రాష్ట్రంగా అపఖ్యాతి పాలైన బీహార్, నితీశ్ సారథ్యంలో 2011-12లో 13.1 శాతం ఆర్థిక వృద్ధితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. క్రిమినల్ కేసుల సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, నేరగాళ్లపై ఉక్కుపాదం మోపడం వంటి చర్యలతో శాంతిభద్రతలను చక్కదిద్దారు. జేపీ స్కూలు! జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం స్ఫూర్తి తో సోషలిస్టు రాజకీయాల్లోకి ప్రవేశించిన నితీశ్, అంచెలంచెలుగా ఎదిగారు. జేపీ, రామ్మనోహర్ లోహియా వంటి దిగ్గజాల వద్ద రాజకీయ పాఠాలను నేర్చుకున్నారు. 1977, 1980లలో బీహార్ అసెంబ్లీకి పోటీచేసినా ఓటమి చవిచూశారు. స్వతంత్ర అభ్యర్థిగా 1985 అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విజయం సాధించారు. 1989లో లోక్‌సభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. చాలాకాలం లాలూతో కలసి మెలసి పనిచేసినా, 1994లో సమతా పార్టీ ఆవిర్భావంతో దారులు వేరయ్యాయి. వీపీ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ సర్కారులో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. నితీశ్ రైల్వేమంత్రిగా ఉండగానే 2002లో గుజరాత్లో గోద్రా అల్లర్లు జరిగాయి. 2000లో బీహార్ సీఎం కాగలిగినా మెజారిటీ నిరూపించుకోలేక పోవడంతో వారం రోజుల్లోనే వైదొలగాల్సి వచ్చింది. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత 2005లో ఎన్డీఏలో భాగంగా బీజేపీ పొత్తుతో జేడీ(యూ) విజయం సాధించడంతో నితీశ్ మళ్లీ సీఎం కాగలిగారు. 2010 ఎన్నికల్లోనూ ఆ కూటమి గెలుపొందడంతో రెండోసారి సీఎంగా కొనసాగుతున్నారు. నరేంద్ర మోడీకి ఎన్డీఏ ప్రచార సారథ్యం అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. పునాదులు మరువని తత్వం ఎంత ఎదిగినా పునాదులు మరువని తత్వంతో నితీశ్ ప్రజలకు చేరువ కాగలిగారు. చిన్ననాటి అనుభవాలను గుర్తుంచుకుని మరీ చేపట్టిన పనులు ప్రజల మన్ననలు పొందాయి. మెట్రిక్‌లో గణితం పేపరు రాస్తుండగా, టైమైపోయిందంటూ ఇన్విజిలేటర్ క్షణమైనా ఆగకుండా సమాధాన పత్రం లాగేసుకున్నందుకే వందకు వంద మార్కులు రాలేదంటూ ఇప్పటికీ బాధపడతారు. అందుకే నిర్ణీత వ్యవధి ముగిసినా విద్యార్థులకు మరో 15 నిమిషాల గడువు కల్పిస్తూ తాను సీఎం కాగానే పరీక్షల నిబంధనలను సడలించారు. నితీశ్ చిన్నతనంలో బడికెజళ్లేందుకు తోవలో రైలు పట్టాలు దాటాల్సి వచ్చేది. ఒకసారి ఆగి ఉన్న గూడ్సును కింద నుంచి దాటుతూ అపాయం అంచుల దాకా వెళ్లి బయట పడ్డారు. అది గుర్తు పెట్టుకుని, రైల్వే మంత్రి కాగానే అక్కడ ఓవర్‌బ్రిడ్జి కట్టించారు! -
ప్రస్తుతం నష్టాల్లో పరిశ్రమ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో సిమెంటు రంగం ఆరు నెలల్లో గాడిన పడుతుందని పరిశ్రమ భావిస్తోంది. కొత్త రాష్ట్రాల్లో సాధారణంగా మౌలిక వసతుల పరంగా అభివృద్ధి ఉంటుంది కాబట్టి సిమెంటుకు డిమాండ్ పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇదే జరిగితే పరిశ్రమకు పెద్ద ఊరట లభిస్తుందని ప్రముఖ కంపెనీకి చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణ రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వ సంబంధిత నిర్మాణ పనులవల్ల సాధారణంగా ఎన్నికల ముందు సిమెంటకు డిమాండ్ పెరుగుతుంది. అయితే ఈ దఫా ఆ తరహా పనులేవీ జరగడం లేదు. దాంతో పరిశ్రమ ఇంకా నీరసంగానే నెట్టుకొస్తోంది. సిమెంటు కంపెనీలు పెద్ద ఎత్తున నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. సిమెంటు వినియోగం పెరిగితేనే కంపెనీలు మనగలుగుతాయి. ఈ ఏడాది అక్టోబరు నుంచి నెలకు 20 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడవుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. బస్తాకు రూ.60 దాకా నష్టం..: రాష్ట్రంలో నాలుగేళ్ల క్రితం నెలకు 23-24 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడైంది. ఇప్పుడది నెలకు 15-16 లక్షల టన్నులకు పడిపోయింది. రాజకీయ అనిశ్చితి, బలహీన సెంటిమెంటుతో అమ్మకాలు గణనీయంగా క్షీణించాయి. రాష్ట్రంలో బస్తా సిమెంటు ధర అటూఇటూగా రూ.220-250 పలుకుతోంది. ఉత్తరాదిన ఇది రూ.350 ఉంది. కంపెనీల మధ్య పోటీ కారణంగానే రాష్ట్రంలో ధర తక్కువగా ఉందని ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఒక్కో బస్తాపైన రకాన్నిబట్టి కంపెనీలు రూ.20-60 దాకా నష్టపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మూడు కంపెనీలు మూతపడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని ప్లాంట్లు మూతపడక తప్పదని అన్నారు. అక్టోబరు నుంచి అమ్మకాలు పుంజుకుంటాయన్న సంకేతాలు ఉన్నాయి. బస్తా ధర రూ.300-320 ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. అలా అయితేనే నష్టాల నుంచి గట్టెక్కుతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఖర్చులనుబట్టే ధర..: గిరాకీ-సరఫరాకుతోడు సెంటిమెంటు బాగోలేనప్పుడు సహజంగానే సిమెంటు ధరలు తక్కువగా ఉంటాయి. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఇలాంటిదే. రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగినంత మాత్రాన ధరలు గణనీయంగా పెరుగుతాయని చెప్పలేమని ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. కేంద్రంలో, రాష్ట్రంలో స్థిర ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి ఉంటుంది. దీనికనుగుణంగానే సిమెంటు పరిశ్రమ వృద్ధి ఆధారపడుతుందన్నారు. బొగ్గు, డీజి ల్, విద్యుత్ చార్జీలపై కొత్త సర్కారు పన్నుల విధానం పరిశ్రమకు కీలకమని వెల్లడించారు. వీటి ధరలకుతోడు తయారీ వ్యయం ఆధారంగానే సిమెంటు ధర నిర్ణయమవుతుందని ఆయన చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని సిమెంటు కంపెనీలన్నింటి వార్షిక స్థాపిత సామర్థ్యం సుమారు 70 మిలియన్(7 కోట్లు) టన్నులు. ఉత్పత్తి 45-50 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ఇందులో రాష్ట్ర అవసరాలకుపోను మిగిలినది తమిళనాడు, కర్నాటక, ఒరిస్సాలకు తరలివెళ్తోంది. ప్రోత్సాహమిస్తే మరిన్ని.. రాష్ట్ర కంపెనీలు ఇటీవలి కాలం నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌కు నెలకు సుమారు లక్ష టన్నుల సిమెంటు, క్లింకర్‌ను ఎగుమతి చేస్తున్నాయి. పోర్టు చార్జీల తగ్గింపు, పన్నుల మినహాయింపు వంటి ప్రోత్సాహకాలిస్తే ఎగుమతులు మరింత పెంచేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉంది. కొత్త ప్రభుత్వం గనక చార్జీలు పెంచితే తయారీ వ్యయంతోపాటు సిమెంటు ధరలకూ రెక్కలొస్తాయి. తద్వారా ఎగుమతులు తగ్గుతాయనేది పరిశ్రమ ఆందోళన. -
ప్రస్తుతం వీలుకాదు
దావోస్: బంగారం దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలన్న డిమాండ్‌పై చర్య తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరగా, ఇప్పట్లో అలాంటి ఆలోచనేదీ లేదని ప్రభుత్వం పేర్కొంది. దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనీ, పసిడి దిగుమతులను ఎగుమతులతో ముడిపెడుతున్న నిబంధనను సవరించాలన్న ఆభరణాల ఎగుమతిదారుల విజ్ఞప్తిని పరిశీలించాలని సోనియా గురువారం కేంద్ర వాణిజ్య శాఖకు లేఖ రాశారు. అయితే, కరెంటు అకౌంట్ లోటు(క్యాడ్)పై గట్టి పట్టు సాధించిన తర్వాతే బంగారం దిగుమతులపై ఆంక్షలను ఉపసంహరించుకోగలమని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం తేల్చిచెప్పారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్) సదస్సులో మంత్రి ప్రసంగించారు. పుత్తడి దిగుమతులపై ఆంక్షలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. 8 శాతం వృద్ధి రేటును మళ్లీ అందుకుంటాం... సంస్కరణలు, సత్వర నిర్ణయాలు సత్ఫలితాలిచ్చాయని చిదంబరం అన్నారు. పాత తప్పిదాలు పునరావృతం కాకుంటే భారత్ 8% వృద్ధి రేటును మళ్లీ అందుకుంటుందని ఉద్ఘాటించారు. డబ్ల్యుఈఎఫ్ సదస్సులో భాగంగా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘మేం మరింత నిర్ణయాత్మకంగా ఉండాలని ఏడాదిన్నర క్రితం నిర్ణయించాం. ఆ ఫలితాలు ఇపుడు కళ్లెదుటే కన్పిస్తున్నాయి. వచ్చే మూడేళ్లలో క్రమంగా 8% వృద్ధిరేటును మళ్లీ చేరుకుంటామనడంలో ఎలాంటి సందేహం లేదు..’ అని చిదంబరం ధీమా వ్యక్తంచేశారు. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాదు... ఇండియాతో పాటే దక్షిణాఫ్రికాలోనూ ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా, ‘దక్షిణాఫ్రికా పరిస్థితి సంతోషకరం. అక్కడి పాలక పక్షం మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశముంది. కానీ భారత్‌లో పరిస్థితి అలా లేదు. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం కన్పించడం లేదు’అన్నారు. 10 కోట్ల ఉద్యోగాల కల్పన: ఆనంద్ శర్మ తయారీ రంగంలో 10 కోట్ల మంది నిపుణులకు ఉద్యోగాలు కల్పించాలని భారత్ యోచిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంతి ఆనంద్ శర్మ తెలిపారు. జీడీపీలో ప్రస్తుతం 16%గా ఉన్న తయారీరంగం వాటాను 25%కు పెంచడం ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. దావోస్‌లో తయారీరంగంపై నిర్వహించిన సెషన్లో ఆయన ప్రసంగించారు. ఇదీ 80:20 నిబంధన పసిడి దిగుమతులపై ఆంక్షలను, 80:20 దిగుమతుల నిబంధనను సడలించాలని వజ్రాలు, ఆభరణాల పరిశ్రమ చేస్తున్న డిమాండుపై తగిన చర్య తీసుకోవాలంటూ వాణిజ్య శాఖకు సోనియా గురువారం లేఖ రాశారు. బంగారం దిగుమతిపై 10%గా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 2%కు తగ్గించాలని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వ్యాపార సమాఖ్య సోనియాకు రాసిన లేఖలో కోరింది. 80:20 నిబంధనను సవరించాలని విజ్ఞప్తి చేసిం ది. 80:20 నిబంధన ప్రకారం అంతకుముందు దిగుమతి చేసుకున్న పసిడిలో 20%ను ఎగమతి చేసే వరకూ కొత్త దిగుమతులను అనుమతించరు. -
ముందుంది మంచికాలం
గ్రేటర్ నోయిడా: రాబోయే మూడేళ్లలో భారత్ క్రమంగా మళ్లీ అధిక వృద్ధి బాటలోకి మళ్లగలదని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. 2012-13, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో మందగమనానికి అంతర్జాతీయ పరిణామాలే కారణమని చెప్పారు. పెట్రోటెక్ 2014 సదస్సులో పాల్గొన్న సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తడానికి ముందు భారత్ తొమ్మిది శాతం స్థాయిలో వృద్ధిని సాధించిన విషయాన్ని చిదంబరం ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచ ఎకానమీ కోలుకుంటోందని, కొత్తగా తీసుకుంటున్న చర్యల ప్రభావంతో భారత్ కూడా క్రమంగా అధిక వృద్ధి బాట పట్టగలదని చిదంబరం పేర్కొన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరపు వృద్ధి అంచనాలు (సవరించినవి) మెరుగ్గా ఉండగలవని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 31న ప్రభుత్వం వీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటును (దేశంలోకి వచ్చే, వెళ్లే విదేశీ మారకం) 50 బిలియన్ డాలర్లకు కట్టడి చేయగలమని చిదంబరం చెప్పారు. భారీ స్థాయిలో ఉన్న చమురు దిగుమతులను నియంత్రించడం ఇందుకు తోడ్పడగలదన్నారు. గత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తిలో ఇది రికార్డు స్థాయిలో 88.2 బిలియన్ డాలర్లకు ఎగిసిన సంగతి తెలిసిందే. ఇంధన రంగంలో అపార అవకాశాలు.. అపార అవకాశాలు ఉన్న భారత ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఇన్వెస్టర్లను చిదంబరం ఆహ్వానించారు. వారికి కావాల్సిన సహకారం అందించగమన్నారు. అలాగే, చమురు కంపెనీలు, చమురు ఉత్పత్తి దేశాలతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీతో చమురుకు కూడా డిమాండ్ పెరగగలదని, ఫలితంగా ధరల్లో మళ్లీ భారీ హెచ్చుతగ్గులు తలెత్తవచ్చని చిదంబరం చెప్పారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు అధిక ధరల కారణంగా వర్ధమాన దేశాలు కనీసం 1-2 శాతం దాకా తమ వృద్ధి రేటును నష్టపోయాయన్నారు. చమురు ఉత్పత్తి, వినియోగ దేశాల మధ్య అసమానతలు ఉన్నంత కాలం ఇంధన భద్రతపై ఆందోళన తప్పదని చిదంబరం చెప్పారు. -
ప్రైవేటుకూ ప్రోత్సాహం
ముంబై: ‘భారత్‌లో వలిక సౌకర్యాల అవసరం భారీగా ఉంది. ప్రభుత్వం ఒక్కటే వాటిని తీర్చలేదు. వలిక సౌకర్యాల లేమి ఆర్థికాభివృద్ధికి అవరోధం కాకూడదనే ఉద్దేశంతో ఈ రంగంలో ప్రైవేటు భాగస్వావ్యూలను ప్రోత్సహిస్తాం...’ అని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (సీఎస్ఐఎ)లో రూ.9.800 కోట్లతో నిర్మించిన అత్యాధునిక టెర్మినల్(టీ-2)ను శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా ఆయున ప్రసంగించారు. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వావ్యు పద్ధతి(పీపీపీ)లో విజయువంతంగా నిర్మించిన భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో ఈ టెర్మినల్ కలికితురారుు వంటిదని అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ద్వితీయు, తృతీయు శ్రేణి నగరాల్లో 50 ఎరుుర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్రం సంకల్పించిందని చెప్పారు. పౌర వివూనయూన రంగంలో వలిక సౌకర్యాల కల్పనలో దేశం గత పదేళ్లలో అద్భుత పురోగతి సాధించిందన్నారు. నవీ వుుంబై ఎరుుర్‌పోర్ట్ ప్రాజెక్టుకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న అన్ని సవుస్యలనూ పరిష్కరించామని ప్రకటించారు. కేంద్రం సహకారంతో మహారాష్ట్ర సర్కారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తుందని తెలిపారు. ఇంధన ధరల పెరుగుదల, వలిక సౌకర్యాల కొరత వంటి సవాళ్లను అధిగమించి పౌర వివూనయూన రంగం శీఘ్రగతిన పురోభివృద్ధి సాధించేలా చేయుడానికి ప్రభుత్వం కృతనిశ్చయుంతో ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వావ్యు పద్ధతిలో టీ-2ను విజయువంతంగా పూర్తిచేయుడం ఇతర ప్రాజెక్టులకు స్ఫూర్తిదాయుకవుని అన్నారు. కేంద్రమంత్రులు శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, జైపాల్ రెడ్డి, అజిత్ సింగ్, వుహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ తదితరులు ఈ కార్యక్రవుంలో పాల్గొన్నారు. తరతరాలకు గుర్తుంటుంది టెర్మినల్-2 ప్రారంభోత్సవం మంబైతో పాటు సీఎస్ఐఎ చరిత్రలో ఓ మైలురారుు వంటింది. తరతరాలు నిలిచే ఐకాన్లను సృష్టించాలన్నది నా స్వప్నం. క్లిష్టమైన వలిక సౌకర్యాల ప్రాజెక్టుల నిర్మాణంలో మేం నైపుణ్యం సాధించాం. మేం కార్యకలాపాలు సాగించే అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉండడమే వూ లక్ష్యం. - జీవీకే రెడ్డి, చైర్మన్, జీవీకే గ్రూప్ సౌందర్య స్ఫూర్తికి నిదర్శనం వుుంబై నగర వాసుల సౌందర్య స్ఫూర్తికి నిదర్శనం టెర్మినల్-2. ఎరుుర్‌పోర్టుల అభివృద్ధి లో ప్రపంచ ప్రవూణాలను పునర్నిర్వచించే వివూనాశ్రయుమిది. కంటికి ఇంపైన వర్ణాలతో కళలు, సంప్రదాయూలను ప్రతిబింబించే ఈ ఎరుుర్పోర్టును సందర్శించిన వారికి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. - జీవీ సంజయ్ రెడ్డి, ఎండీ, జీవీకే వుుంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ -
రికవరీ కనబడుతోంది: నోమురా
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నట్లు జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా తన తాజా పరిశోధనా పత్రంలో పేర్కొంది. కొత్త పెట్టుబడుల్లో ఇప్పటివరకూ నెలకొన్న క్షీణత సమస్య సమసిపోతున్నట్లు నోమురా తెలిపింది. అయితే వ్యాపార కార్యకలాపాల్లో సాధారణ పరిస్థితి నెలకొనడానికి ప్రైవేటు రంగంలో పెట్టుబడుల వ్యయం పెరగాల్సిన అవసరం ఉందని విశ్లేషించింది. ఈ సందర్భంగా సీఎంఐఈ (సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ) గణాంకాలను నోమురా ఉటంకించింది. డిసెంబర్ క్వార్టర్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కొత్త ప్రాజెక్టుల పెట్టుబడులు 4.9 శాతంగా నమోదుకానున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 3.6 శాతమేనని వివరించింది. స్థిరత్వానికి సూచన : 2007 నుంచీ కొత్త పెట్టుబడులు పడిపోతూ వస్తున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా నోమురా ప్రస్తావిస్తూ, ఈ విషయంలో డిసెంబర్ క్వార్టర్లో అందుతున్న ఫలితం హర్షణీయమని తెలిపింది. స్థిరత్వానికి ఇది తొలి సంకేతమని పేర్కొంది. అయితే ఒక్క ప్రైవేటు రంగం విషయాన్ని చూసుకుంటే మాత్రం గణాంకాలు నిరుత్సాహంగా ఉన్నాయని వివరించింది. -
5.2 శాతానికి ద్రవ్యలోటు: క్రిసిల్
ముంబై: ప్రభుత్వ ఆదాయానికి, వ్యయానికి మధ్య వ్యత్యాసం(ద్రవ్యలోటు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.2 శాతానికి చేరే అవకాశం ఉందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ సోమవారం పేర్కొంది. ద్రవ్యలోటును తగ్గించడానికి భారీ ప్రభుత్వ రంగ కంపెనీలు అధిక డివిడెండ్‌ను చెల్లించాలన్న ప్రతిపాదన సరైనదేనని క్రిసిల్ అభిప్రాయపడింది. ఇది ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా వినియోగపడుతుందని వివరించింది. ప్రభుత్వం ద్రవ్యలోటును 4.8% వద్ద కట్టడి చేయాలని భావిస్తున్నప్పటికీ రెవెన్యూ వృద్ధిలో మందగమనం వల్ల ఈ లోటు 5.1 శాతానికి పెరిగే అవకాశం ఉందని హెచ్ఎస్బీసీ ఇప్పటికే అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (ఏప్రిల్-అక్టోబర్) రూ.4.57 లక్షల కోట్లకు చేరినట్లు (బడ్జెట్ లక్ష్యంలో 84%) ఇటీవలి గణాంకాలు వెల్లడించాయి. 2013-14 స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటును రూ.5.42 లక్షల కోట్ల వద్ద (4.8%) కట్టడి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2012-13లో ద్రవ్యలోటు 4.9%గా నమోదయ్యింది. -
వృద్ధి అవకాశాలు బలహీనం: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థికాభివృద్ధి అవకాశాలు బలహీనంగానే ఉన్నట్లు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ మంగళవారం పేర్కొంది. అయితే వచ్చే ఏడాది రికవరీకి కొంత అవకాశం ఉందని తన తాజా నివేదికలో తెలిపింది. క్లిష్టంగా ఉన్న పన్నులు, నిబంధనల అంశాలు, బలహీన మౌలికరంగం, బలహీన కేంద్ర ప్రభుత్వం వంటి అంశాలు ఆర్థికరంగానికి సంబంధించి ‘విశ్వాసం, డిమాండ్’పై ప్రస్తుతం ప్రభావితం చూపుతున్నట్లు పేర్కొంది. మే ఎన్నికల తర్వాత పాలనాపరంగా కొంత పురోగతికి అవకాశం ఉందని అభిప్రాయపడింది. అధిక ద్రవ్యోల్బణ నేపథ్యంలో రెపోరేటు సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని కూడా మూడీస్ అంచనావేసింది. -
ఎగుమతులు తగ్గినా... లోటు ఓకే
న్యూఢిల్లీ: భారత ఎగుమతుల వృద్ధి 2013 నవంబర్ నెలలో కొంత నిరాశను మిగిల్చింది. 2012 ఇదే నెలతో పోల్చితే వృద్ధి రేటు కేవలం 5.86 శాతంగా నమోదయ్యింది. విలువ రూపంలో ఇది 24.61 బిలియన్ డాలర్లు. ఎగుమతులు ఇంత తక్కువ స్థాయిలో జరగడం ఐదు నెలల్లో ఇదే తొలిసారి. 2012 నవంబర్‌లో ఈ విలువ 23.25 బిలియన్ డాలర్లు. 2013 అక్టోబర్‌లో 27.27 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతుల విషయానికి వస్తే- 16.3 శాతం తగ్గాయి (2012 నవంబర్‌తో పోల్చితే). విలువ రూపంలో ఈ పరిమాణం 33.83 బిలియన్ డాలర్లు (2011 మార్చి తరువాత ఇంత తక్కువ స్థాయి దిగుమతుల పరిమాణం నమోదు ఇదే తొలిసారి). 2012 ఇదే నెలలో ఈ పరిమాణం 40.54 బిలియన్ డాలర్లు. దీనితో ఎగుమతులు-దిగుమతులు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు నవంబర్‌లో 9.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. సెప్టెంబర్‌లో 6.7 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు, మళ్లీ సింగిల్‌లో ఉండడం 2013-14లో ఇది రెండవసారి. ఎగుమతులు ఎందుకు తగ్గాయ్... పెట్రోలియం ఉత్పత్తులు, రఫ్ డైమండ్స్-ఆభరణాలు-రత్నాలు, ఔషధాల ఎగుమతులు తగ్గడంతో మొత్తంగా వృద్ధి రేటుపై ప్రతికూలత చూపిందని బుధవారం విడుదల చేసిన గణాంకాల సందర్భంగా వాణిజ్య కార్యదర్శి ఎస్ఆర్ రావు వెల్లడించారు. ఆయా అంశాల గురించి రావు వివరిస్తూ, రఫ్ డెమైండ్స్ ధరల్లో పెరుగుదల వల్ల ఈ గ్రూప్ మొత్తం ఎగుమతులపై ప్రభావం చూపినట్లు తెలిపారు. నిర్వాహణా పరమైన సమస్యల కారణంగా రెండు రిఫైనరీలు పనిచేయకపోవడం పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం చూపినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని దేశీయ నియంత్రణల వల్ల ఫార్మా ఎగుమతులు తగ్గాయని రావు తెలిపారు. 8 నెలల్లో ఇలా... కాగా 2013-14 తొలి 8 నెలల కాలంలో (ఏప్రిల్-నవంబర్) ఎగుమతులు 6.27 శాతం వృద్ధిని నమోదుచేసుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ పరిమాణం 191.95 బిలియన్ డాలర్ల నుంచి 203.98 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఇది దిగుమతుల్లో అసలు పెరుగుదల లేకపోగా, ఇవి 5.39 శాతం క్షీణించాయి. అంటే గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ విలువ 321.19 బిలియన్ డాలర్ల నుంచి 303.89 డాలర్లకు తగ్గాయి. దీనితో వాణిజ్యలోటు 100 బిలియన్ డాలర్లుగా ఉంది. 2013-14లో ఈ లోటు191 బిలియన్ డాలర్లు. బంగారం, వెండి ఎఫెక్ట్ బంగారం, వెండి దిగుమతులు తగ్గడం మొత్తం వాణిజ్యలోటుపై సానుకూల ప్రభావం చూపిందని రావు పేర్కొన్నారు. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడి లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా నవంబర్‌లో బంగారం, వెండి దిగుమతులు 80.49శాతం పడిపోయాయి. గత ఏడాది ఇదే నెలలో 5.4 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ విలువ 2013 నవంబర్‌లో 1.05 బిలియన్ డాలర్లకు చేరింది. చమురు దిగుమతులు సైతం 1.1 శాతం పడిపోయి 12.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ విలువ మధ్య వ్యత్యాసాన్ని క్యాడ్‌గా వ్యవహరిస్తాం. రూపాయి క్షీణతకు ప్రధాన కారణాల్లో ఒకటైన ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులను కట్టడి చేసింది. దీనితో ఈ దిగుమతులు జూన్ నుంచీ భారీగా తగ్గుతూ వచ్చాయి. ఫలితం వాణిజ్యలోటు తగ్గుదలపై తద్వారా క్యాడ్ కట్టడిపై ప్రభావం చూపుతూ వచ్చింది. కాగా ఢిల్లీలో జరిగిన ఒక ఆర్థిక సదస్సులో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చీఫ్ సీ రంగరాజన్ మాట్లాడుతూ, ఏడాదికి 30 బిలియన్ డాలర్ల వరకూ బంగారం దిగుమతులు భారత్‌కు తగిన స్థాయని వివరించారు. -
ఇండియాలో వ్యాపారం కష్టమే
న్యూయార్క్: వ్యాపారానికి ఉత్తమమైన దేశాల జాబితాలో భారత్ మొత్తం మీద 98వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ విషయంలో ఐర్లాండ్ అగ్రస్థానంలో ఉంది. 145 దేశాలతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. స్థిరాస్తులపై హక్కులు, నూతన ఆవిష్కరణలు, పన్నులు, అవినీతి తదితర 11 అంశాల ప్రాతిపదికగా ఫోర్బ్స్ ఈ లిస్టు రూపొందించింది. దీని ప్రకారం పేదరికం, అవినీతి తదితర అంశాలు భారత్‌లో వ్యాపార నిర్వహణకు ప్రతికూలంగా ఉంటున్నాయి. వీటితోపాటు హింస, మహిళలపై వివక్ష, విద్యుదుత్పత్తి..పంపిణీ వ్యవస్థలో సమర్ధత కొరవడటం, మేథోహక్కుల చట్టాల అమల్లో వైఫల్యం, రవాణా.. వ్యవసాయ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం, వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండటం వంటివి భారత్‌కి దీర్ఘకాలిక సవాళ్లుగా ఉన్నాయని ఫోర్బ్స్ పేర్కొంది. అయితే, యువత జనాభా ఎక్కువగా ఉండటం, మెరుగైన పొదుపు.. పెట్టుబడుల రేటు వంటి అంశాలను బట్టి చూస్తే మధ్యకాలికంగా భారత్ వృద్ధి అవకాశాలు సానుకూలంగా ఉన్నాయని ఫోర్బ్స్ పేర్కొంది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఐర్లాండ్ అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, హాంకాంగ్, డెన్మార్క్, స్వీడన్ వరుసగా తర్వాత నాలుగు స్థానాల్లో ఉన్నాయి. బ్రిక్ కూటమిలో భారత్ ఆఖరు స్థానంలో ఉంది. బ్రెజిల్ 80వ స్థానంలో, రష్యా (91), చైనా (94)లో ఉన్నాయి. వివిధ అంశాల్లో భారత్‌కి ర్యాంకులు.. వాణిజ్యపరమైన స్వేచ్ఛ అంశానికి సంబంధించి భారత్‌కి 128వ స్థానం, ద్రవ్యపరమైన స్వేచ్ఛలో 132వ ర్యాంకు, ప్రాపర్టీ హక్కుల పరిరక్షణలో 55వ స్థానం, నూతన ఆవిష్కరణల్లో 39వ ర్యాంకు, టెక్నాలజీలో 94వ స్థానం, మదుపరుల ప్రయోజనాల పరిరక్షణలో 32వ స్థానం ద క్కాయి. ఇక రెడ్ టేపిజంలో 139వ ర్యాంకులో, అవినీతిలో (86), వ్యక్తిగత స్వేచ్ఛలో (58), పన్నుల భారంలో (122), మార్కెట్ల పనితీరులో 75వ స్థానంలో ఉంది. -
ఈ ఏడాది భారత్ వృద్ధిరేటు 4.7 శాతమే..
న్యూఢిల్లీ: భారత్ స్థూల ఆర్థికాభివృద్ధి (జీడీపీ) రేటు అంచనాల కోత విషయంలో ఇప్పుడు ఇక ప్రపంచబ్యాంక్ వంతు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) వృద్ధి రేటు కేవలం 4.7 శాతమేనని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. ఇంతక్రితం 6.1 శాతం అంచనాలను తమ తాజా ‘భారత్ వృద్ధి అప్డేట్’ నివేదిక కుదించినట్లు బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ (దక్షిణాసియా వ్యవహారాలు) మార్టిన్ రామ్ ప్రకటించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.2 శాతం ఉంటుందన్నది బ్యాంక్ తాజా అంచనా అని కూడా వెల్లడించారు. ఇంతక్రితం ఈ అంచనా 6.7 శాతం. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనాల్లో అరశాతం కుదింపు జరిగిందన్నమాట. కారణం ఇదీ... 2013 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ 5 శాతం వృద్ధి సాధించింది. గడచిన దశాబ్ద కాలంలో వృద్ధి సగటు 8 శాతం. భారత్ వృద్ధి 2013-14లో బలహీనం కావడానికి మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఆర్థిక వ్యవస్థ (4.4 శాతం వృద్ధి) పేలవ పనితీరు కారణమని ప్రపంచబ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. దీనికితోడు తదుపరి రెండు నెలల్లో అంటే జూలై- ఆగస్టు నెలల్లో బిజినెస్ సెంటిమెంట్‌లో పూర్తి ప్రతికూల ధోరణి నెలకొందని వివరించింది. కొన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, ఆర్థిక సంవత్సరంలో ద్వితీయార్థంలోనూ వృద్ధి రేటుపై అధిక వడ్డీరేట్ల భారం పడే అవకాశం ఉందని వివరించింది. ఇక మొత్తం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం పెరుగుదల, అధిక స్థాయిల్లో కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్), ప్రభుత్వానికి వచ్చే ఆదాయం- చేసే వ్యయాల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు ఒత్తిడులు ఆర్థిక వ్యవస్థ సత్వర రికవరీకి అడ్డంకిగా మారుతున్నట్లు వరల్డ్ బ్యాంక్ సీనియర్ కంట్రీ ఎకనమిస్ట్ డీనిస్ మద్విదేవ్ పేర్కొన్నారు. సానుకూల అంశాలు... ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో భారత్ ఆర్థిక వ్యవస్థకు కొంత కలిసి వచ్చే అంశాలను ప్రపంచబ్యాంక్ నివేదిక వివరించింది. కోర్ గ్రూప్ ద్రవ్యోల్బణం (ఆహార వస్తువులు, ఇంధనం లైట్ విభాగం మినహా మిగిలిన విభాగాల టోకు ధరల సూచీ- ప్రధానంగా తయారీ రంగం) దిగిరావడం, వ్యవసాయ రంగంలో భారీ దిగుబడులు, రూపాయి బలహీనత ద్వారా ఎగుమతుల విభాగంలో లభించే ప్రయోజనాలు, విదేశీ కరెన్సీలలో రూపాయి మారకపు విలువ స్థిరత్వం వంటి అంశాలను ఈ సందర్భంగా నివేదిక ప్రస్తావించింది. సాగు ప్రాంతం 5 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. దీనివల్ల వ్యవసాయ రంగంలో వృద్ధి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2012-13లో ఈ రంగం వృద్ధి 1.9 శాతం అయితే, 2013-14లో ఈ రేటు 3.4 శాతానికి చేరే అవకాశం ఉందని రామ్ వివరించారు. ఈ పరిస్థితి ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం చూపుతుందని విశ్లేషించారు. పారిశ్రామిక రంగం కొంత మెరుగుపడ్డంతోపాటు, ఎగుమతుల పెరుగుదల, కొత్త ప్రాజెక్టుల అమలు వంటి అంశాలు పరిస్థితులను మెరుగుపరచవచ్చని వివరించారు. గడచిన కొన్ని వారాలుగా మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడుతోందని సైతం పేర్కొన్నారు. సంస్కరణల విషయంలోనూ ఇదే సానుకూల ధోరణి ఉందన్నారు. డీబీఎస్ ఇండియా అంచనా 5 శాతంఙఞ్చటకాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటు దాదాపు ఐదు శాతంగా ఉంటుందని డీబీఎస్ ఇండియా తన తాజా నివేదికలో అంచనా వేసింది. 3.8 శాతం-5 శాతం శ్రేణిలో ఈ రేటు ఉంటుందన్నది తమ అంచనా అని సంస్థ జీఎం, సీఈఓ సంజీవ్ భాసిన్ పేర్కొన్నారు. మందగమనం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని పేర్కొంటూ, అందువల్ల వృద్ధిపై తక్కువ శ్రేణిలో ఖచ్చితమైన అంచనాలను చెప్పడం కూడా కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. -
ద్రవ్యోల్బణం-వృద్ధి-ఆర్థిక స్థిరత్వం మూడూ ముఖ్యమే: దువ్వూరి
న్యూఢిల్లీ: ద్రవ్యపరపతి విధానాల సందర్భంగా తాను ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికే అధిక ప్రాధాన్యమిస్తూ, వృద్ధిరేటును విస్మరించానన్న వాదనను రిజర్వు బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తోసిపుచ్చారు. శనివారం ప్రధాని అధికార నివాసంలో జరిగిన ఆర్బీఐ చరిత్ర నాలుగో సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రిజర్వ్ బ్యాంక్ పరపతి విధానానికి ద్రవ్యోల్బణం-వృద్ధి-ఆర్థిక స్థిరత్వం... మూడూ ముఖ్యమైన అంశాలేనని స్పష్టం చేశారు. దిగువస్థాయిలో స్థిరంగా కొనసాగే ద్రవ్యోల్బణం సమగ్రాభివృద్ధికి తగిన వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు.