ప్రైవేటుకూ ప్రోత్సాహం
ముంబై: ‘భారత్‌లో వలిక సౌకర్యాల అవసరం భారీగా ఉంది. ప్రభుత్వం ఒక్కటే వాటిని తీర్చలేదు. వలిక సౌకర్యాల లేమి ఆర్థికాభివృద్ధికి అవరోధం కాకూడదనే ఉద్దేశంతో ఈ రంగంలో ప్రైవేటు భాగస్వావ్యూలను ప్రోత్సహిస్తాం...’ అని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (సీఎస్‌ఐఎ)లో రూ.9.800 కోట్లతో నిర్మించిన అత్యాధునిక టెర్మినల్(టీ-2)ను శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా ఆయున ప్రసంగించారు.
ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వావ్యు పద్ధతి(పీపీపీ)లో విజయువంతంగా నిర్మించిన భారీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో ఈ టెర్మినల్ కలికితురారుు వంటిదని అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ద్వితీయు, తృతీయు శ్రేణి నగరాల్లో 50 ఎరుుర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్రం సంకల్పించిందని చెప్పారు. పౌర వివూనయూన రంగంలో వలిక సౌకర్యాల కల్పనలో దేశం గత పదేళ్లలో అద్భుత పురోగతి సాధించిందన్నారు. నవీ వుుంబై ఎరుుర్‌పోర్ట్ ప్రాజెక్టుకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న అన్ని సవుస్యలనూ పరిష్కరించామని ప్రకటించారు. కేంద్రం సహకారంతో మహారాష్ట్ర సర్కారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తుందని తెలిపారు. ఇంధన ధరల పెరుగుదల, వలిక సౌకర్యాల కొరత వంటి సవాళ్లను అధిగమించి పౌర వివూనయూన రంగం శీఘ్రగతిన పురోభివృద్ధి సాధించేలా చేయుడానికి ప్రభుత్వం కృతనిశ్చయుంతో ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వావ్యు పద్ధతిలో టీ-2ను విజయువంతంగా పూర్తిచేయుడం ఇతర ప్రాజెక్టులకు స్ఫూర్తిదాయుకవుని అన్నారు. కేంద్రమంత్రులు శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, జైపాల్ రెడ్డి, అజిత్ సింగ్, వుహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ తదితరులు ఈ కార్యక్రవుంలో పాల్గొన్నారు.
తరతరాలకు గుర్తుంటుంది
టెర్మినల్-2 ప్రారంభోత్సవం మంబైతో పాటు సీఎస్‌ఐఎ చరిత్రలో ఓ మైలురారుు వంటింది. తరతరాలు నిలిచే ఐకాన్లను సృష్టించాలన్నది నా స్వప్నం. క్లిష్టమైన వలిక సౌకర్యాల ప్రాజెక్టుల నిర్మాణంలో మేం నైపుణ్యం సాధించాం. మేం కార్యకలాపాలు సాగించే అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉండడమే వూ లక్ష్యం.
- జీవీకే రెడ్డి, చైర్మన్, జీవీకే గ్రూప్
సౌందర్య స్ఫూర్తికి నిదర్శనం
వుుంబై నగర వాసుల సౌందర్య స్ఫూర్తికి నిదర్శనం టెర్మినల్-2. ఎరుుర్‌పోర్టుల అభివృద్ధి లో ప్రపంచ ప్రవూణాలను పునర్నిర్వచించే వివూనాశ్రయుమిది. కంటికి ఇంపైన వర్ణాలతో కళలు, సంప్రదాయూలను ప్రతిబింబించే ఈ ఎరుుర్‌పోర్టును సందర్శించిన వారికి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.
- జీవీ సంజయ్ రెడ్డి, ఎండీ, జీవీకే వుుంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్