అత్యాధునిక టెర్మినల్
సాక్షి, ముంబై: అంధేరిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ (సహార్) విమానాశ్రయం పక్కనే అత్యాధునిక హంగులతో నిర్మించిన టెర్మినల్-2ను శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముంబై మేయర్ సునీల్‌ప్రభును ఆహ్వానించకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఈ కొత్త టెర్మినల్ భద్రత పూర్తిగా సీఐఎస్‌ఎఫ్ చేతిలో ఉంటుంది. కొన్ని సాంకేతిక కారణాలవల్ల భద్రత దళాలకు ఆయుధాలు అందజేయడానికి మరో పక్షం రోజులు పట్టవచ్చు. ప్రస్తుతం ఈ టెర్మినల్‌ను ప్రారంభించినప్పటికీ ఇది పూర్తిగా పనిచేయాలంటే మరో 10-15 రోజుల సమయం పడుతుంది. డొమెస్టిక్ విమానాశ్రయం కార్యకలాపాలన్నీ 2015 వరకు టెర్మినల్-2లోకి మారుతాయి. ఆ తరువాత ఆ డొమెస్టిక్ విమానాశ్రయాన్ని కార్గో కోసం వినియోగించే అవకాశాలున్నాయి.
ఇక ఈ కొత్త టెర్మినల్ ప్రత్యేకతలివి..
- 3,000 సీసీ టీవీ కెమరాలు.
- గంటకు 42 విమానాలు ల్యాండింగ్, టేకాఫ్
- 21 వేల చదరపు మీటర్ల స్థలం వివిధ దుకాణాలకు కేటాయింపు. (ప్రస్తుతం ఐదు వేల చదరపు మీటర్లు ఉంది. తరువాత విస్తరిస్తారు.)
- ఆరో శతాబ్దం మొదలుకుని 18వ శతాబ్దం నాటి చరిత్రాత్మక సామగ్రి భద్రపరిచే మ్యూజియం ఏర్పాటు చేస్తారు. ఇందులో ఆరువేల వస్తువులు భద్రపర్చవచ్చు.
- 140 ఇమిగ్రేషన్ కౌంటర్లు.
- 60 డిపార్చర్ ఇమిగ్రేషన్ కౌంటర్లు.
- 72 అరైవల్ ఇమిగ్రేషన్ కౌంటర్లు.
- 188 చెకిన్ కౌంటర్లు.
- 124 తనిఖీ మార్గాలు
- 52 ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జిలు
- 44 లగేజీ బెల్టులు
- 101 టాయిలెట్లు
- 4,100 ఎనౌన్స్‌మెంట్ స్పీకర్లు