వృద్ధి అవకాశాలు బలహీనం: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థికాభివృద్ధి అవకాశాలు బలహీనంగానే ఉన్నట్లు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ మంగళవారం పేర్కొంది. అయితే వచ్చే ఏడాది రికవరీకి కొంత అవకాశం ఉందని తన తాజా నివేదికలో తెలిపింది. క్లిష్టంగా ఉన్న పన్నులు, నిబంధనల అంశాలు, బలహీన మౌలికరంగం, బలహీన కేంద్ర ప్రభుత్వం వంటి అంశాలు ఆర్థికరంగానికి సంబంధించి ‘విశ్వాసం, డిమాండ్’పై ప్రస్తుతం ప్రభావితం చూపుతున్నట్లు పేర్కొంది. మే ఎన్నికల తర్వాత పాలనాపరంగా కొంత పురోగతికి అవకాశం ఉందని అభిప్రాయపడింది. అధిక ద్రవ్యోల్బణ నేపథ్యంలో రెపోరేటు సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని కూడా మూడీస్ అంచనావేసింది.