న్యూఢిల్లీ: భారత్ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం వరకూ ఆర్థిక వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) చక్కటి వృద్ధి అవకాశాలకు భరోసా ఇస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ ఎకానమీ మూలాలు పటిష్టంగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ధరల కట్టడి ఆర్‌బీఐ ప్రధాన ప్రాధాన్యతగా పేర్కొన్నారు. భారత్ జీడీపీ అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో అంచనా (దాదాపు 7 శాతం)లను మించి 8.4 శాతంగా నమోదయ్యింది. అంతకుముందు రెండు త్రైమాసికాలకు సంబంధించి (ఏప్రిల్–సెపె్టంబర్) తొలి వృద్ధి అంకెలు వరుసగా 7.8 శాతం (క్యూ1), 7.6 శాతాలుగా (క్యూ2)నమోదయ్యాయి. అయితే ఈ అంకెలను ఎగువముఖంగా 8.2 శాతం, 8.1 శాతాలుగా జాతీయ గణాంకాల కార్యాలయం సవరించింది. దీనితో 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఎకానమీ 8.2 శాతం పురోగమించినట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 7.3 శాతం.
Comments
Please login to add a commentAdd a comment