నేడు సాక్షి మైత్రి ఆధ్వర్యంలో మదుపరులకు అవగాహన | Today, under the witness of reconciliation to investors in understanding | Sakshi
Sakshi News home page

నేడు సాక్షి మైత్రి ఆధ్వర్యంలో మదుపరులకు అవగాహన

Published Sun, Jul 17 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

నేడు సాక్షి మైత్రి ఆధ్వర్యంలో మదుపరులకు అవగాహన

నేడు సాక్షి మైత్రి ఆధ్వర్యంలో మదుపరులకు అవగాహన

సిటీబ్యూరో: ‘సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ ఆధ్వర్యంలో ఆదివారం కొత్తపేటలో మదుపరుల అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. పెట్టుబడి అవకాశాలు అసంఖ్యాక రీతిలో వెల్లువెత్తుతున్న తరుణంలో సరైన పెట్టుబడి అవకాశాలను ఎంచుకోవడంలో అవసరమైన సూచనలు అందించి ప్రజల ఆర్థిక ప్రగతికి తోడ్పడాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


ఈ కార్యక్రమంలో పలువురు ఆర్థిక రంగ నిపుణులు పాల్గొంటారు. ప్రధానంగా స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించడం ఎలా? భవిష్యత్ అవసరాలకు అనువైన పెట్టుబడులు ఎలా పెట్టాలి? డీమాట్ గురించిన సమస్త సమాచారం, ఆర్థిక ప్రణాళిక-పెట్టుబడుల నిర్వహణ, మార్కెట్‌కు సంబంధించిన ఇతర సూచనలు, మెలకువలు నేర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో శివప్రసాద్ వెనిశెట్టి (రీజినల్ మేనేజర్, సీడీఎస్‌ఎల్), విజయ కుమార్ తిమ్ములూరు(స్టేట్ హెడ్, టీఎస్‌అండ్ ఏపీ కోటక్ మ్యూచువల్ ఫండ్), శ్యామ్‌ప్రసాద్ (అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్) పాల్గొంటారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement