7,400 దిగువకు నిఫ్టీ
అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిపై తాజాగా ఆందోళనలు చెలరేగడం, ముడి చమురు ధరలు మరింత బలహీనపడడం వంటి కారణాల వల్ల భారత స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలపాలయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,400 పాయింట్ల దిగువకు పడిపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 316 పాయింట్లు క్షీణించి 24,223 పాయింట్ల వద్ద, నిఫ్టీ 94 పాయింట్లు నష్టపోయి 7,362 వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు వారాల కనిష్ట స్థాయి.గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 647 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్‌కు రానున్న బడ్జెట్ కీలకమన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: తమ విదేశీ భాగస్వామి అయిన బీఎన్‌పీ పారిబా కార్డిఫ్ మరో 10 శాతం వాటాను కొనుగోలు చేసిన తర్వాత ఐపీఓ అంశాన్ని పరిశీలిస్తామని ఎస్‌బీఐ లైఫ్ ఎండీ, సీఈఓ అరిజిత్ బసు చెప్పారు.
దిలిప్ బిల్డ్‌కాన్: మళ్లీ ఐపీఓ పత్రాలనుసెబీకి సమర్పిం చింది. రూ.430 కోట్ల సమీకరణ లక్ష్యం.