crude oil
-
చమురుపై ఇక విండ్‌ఫాల్ ట్యాక్స్‌లు ఉండవు
న్యూఢిల్లీ: ఆయిల్‌ఫీల్డ్స్ (నియంత్రణ, అభివృద్ధి) బిల్లు అమల్లోకి వచ్చాక చమురు, గ్యాస్ కంపెనీల అసాధారణ లాభాలపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ల్లాంటి కొత్త పన్ను ల విధింపు బాదరబందీ ఉండదని కేంద్ర పెట్రోలి యం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేయడాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయం చెప్పారు. ఇన్వెస్టర్లకు ఆర్థిక విధానాల స్థిరత్వంపై కొత్త చట్టం భరోసా కల్పిస్తుందని పురి వివరించారు.అంతర్జాతీయంగా పలు ఆయిల్ దిగ్గజాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ ఆయిల్ ఇండియాతో బ్రెజిల్‌కి చెందిన పెట్రోబ్రస్, ఓఎన్జీసీతో ఎక్సాన్‌మొబిల్, ఈక్వినార్ వంటి సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు మంత్రి వివరించారు. ఇతర దేశాల తరహాలోనే, ఇంధన కంపెనీలకు వచ్చే అసాధా రణ లాభాలపై 2022 జూలై 1 నుంచి భారత్ విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యా క్స్లు విధించడం మొదలుపెట్టింది.పెట్రోల్.. ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 6 చొప్పున, డీజిల్‌పై లీటరుకు రూ. 13 చొప్పున ఎగుమతి సుంకాలు విధించింది. దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తిపైనా టన్నుకు రూ. 23,250 చొప్పున విధించింది. పలుమార్లు సవరించిన ఈ ట్యాక్స్‌లను 30 నెలల తర్వాత గతేడాది డిసెంబర్లో నిలిపివేసింది. -
రూ. 1.5 లక్షల కోట్లకు రష్యా చమురు కొనుగోళ్లు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా నుంచి భారత్ దాదాపు 112.5 బిలియన్ యూరోల (సుమారు రూ. 1.5 లక్షల కోట్లు) ముడి చమురు కొనుగోలు చేసినట్లు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (క్రియా) ఒక నివేదికలో తెలిపింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైన 2022 ఫిబ్రవరి 24 నుంచి శిలాజ ఇంధనాలకు సంబంధించి రష్యాకు లభించిన చెల్లింపుల వివరాలను ఇందులో పొందుపర్చింది. దీని ప్రకారం యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా శిలాజ ఇంధన ఎగుమతుల ద్వారా 835 బిలియన్ యూరోల ఆదాయం ఆర్జించినట్లు వివరించింది. చైనా అత్యధికంగా 235 బిలియన్ యూరోల (170 బిలియన్ యూరోల చమురు, 34.3 బిలియన్ యూరోల బొగ్గు, 30.5 బిలియన్ యూరోల గ్యాస్) ఇంధనాలు కొనుగోలు చేసింది. భారత్ 205.84 బిలియన్ యూరోల ఇంధనాలను కొనుగోలు చేసింది. ఇందులో 112.5 బిలియన్ యూరో క్రూడాయిల్, 13.25 బిలియన్ డాలర్ల బొగ్గు ఉంది. యుద్ధం వల్ల విధించిన ఆంక్షలతో రష్యా చమురు చౌకగా లభిస్తున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి భారత్ గణనీయంగా కొనుగోళ్లు పెంచుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు బ్యారెల్‌కి 18–20 శాతం వరకు లభించిన డిస్కౌంటు ఇటీవలి కాలంలో 3 డాలర్ల దిగువకు పడిపోయింది. -
తగ్గిన ఓఎన్జీసీ లాభం
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఓఎన్జీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 17 శాతం క్షీణించి రూ. 8,240 కోట్లకు పరిమితమైంది. ముడిచమురు ధరలు నీరసించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 9,892 కోట్లు ఆర్జించింది. కంపెనీ బోర్డు.. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. గడిచిన నవంబర్‌లో రూ. 6 చెల్లించిన సంగతి తెలిసిందే. కాగా.. మొత్తం ఆదాయం సైతం 3 శాతం వెనకడుగుతో రూ. 33,771 కోట్లకు చేరింది. ఈ కాలంలో బ్యారల్‌కు ముడిచమురు ధర 72.57 డాలర్లు చొప్పున అందుకుంది. గత క్యూ3లో 81.13 డాలర్లు చొప్పున లభించింది. నేచురల్ గ్యాస్ ఒక్కో ఎంబీటీయూ 6.5 డాలర్లు చొప్పున విక్రయించింది. ముడిచమురు ఉత్పత్తి స్వల్పంగా 2 శాతం పెరిగి 4.653 మిలియన్ టన్నులను తాకింది. నేచురల్ గ్యాస్ ఉత్పత్తి నామమాత్ర వృద్ధితో 4.978 బీసీఎంకు చేరింది. -
రష్యాపై యూఎస్ ఆంక్షలు.. చమురుపై ప్రభావం
అమెరికా కొత్తగా ఆంక్షలు విధించినప్పటికీ మరో రెండు నెలల పాటు రష్యా నుంచి చమురు(Crude Oil) సరఫరాకి సమస్యేమీ ఉండదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్చి 12 వరకు అమలయ్యే కాంట్రాక్టులకు వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలిపాయి. ఆ తర్వాత నుండి వర్తించే కాంట్రాక్టులపైన కూడా ప్రభావం పడకుండా రష్యా ఈలోగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉందని వివరించాయి. భారత్ తదితర దేశాలకు చమురును చేరవేస్తున్న రెండు రష్యా సంస్థలపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.ఆంక్షలు ఎదుర్కొంటున్న రెండు సంస్థల్లో ఒకటి మాత్రమే కాస్త చెప్పుకోతగ్గ స్థాయిలో సరఫరా చేస్తుండగా రెండో దాన్నుంచి నామమాత్రంగానే ఉంటోందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. భారత్‌కు సరఫరా చేసే ఇతర రష్యన్ సంస్థలు, ట్రేడర్లపై ఆంక్షలు లేవని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశాన్ని ఆర్థికంగా కట్టడి చేసేందుకు పాశ్చాత్య దేశాలు చమురు సరఫరాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో భారత్ తదితర దేశాలకు రష్యా చమురు సరఫరా చేస్తోంది.ఇదీ చదవండి: డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం అప్గాజ్ ప్రోమ్ నెఫ్ట్, సుర్గుట్నెఫ్టెగాస్తో సహా రష్యా చమురు ఉత్పత్తిదారులపై, రష్యన్ చమురును రవాణా చేసే సుమారు 180 ట్యాంకర్లపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో భవిష్యత్తులో రష్యా ముడిచమురు దిగుమతుల్లో 15 శాతం భారత్‌పై ప్రభావం పడనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా క్రూడ్ సరఫరాకు తక్షణ ముప్పు లేనప్పటికీ, ఆంక్షలు సరుకు రవాణా ఖర్చులను పెంచుతాయని, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే చమురును మరింత ఖరీదవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత రిఫైనరీలు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూఎస్ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. -
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..
పండుగల సందర్భంగా పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ ఏర్పడింది. వరుసగా కొన్ని నెలల పాటు క్షీణించిన అమ్మకాలు నవంబర్‌లో తిరిగి పుంజుకున్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల (ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్) గణాంకాల ప్రకారం పెట్రోల్ విక్రయాలు నవంబర్‌లో 8.3 శాతం పెరిగి 3.1 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 2.86 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ విక్రయాలు సైతం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 5.9 శాతం పెరిగి 7.2 మిలియన్ టన్నులకు చేరాయి.వర్షాల సీజన్లో వాహనాల కదలికలు తగ్గడం వల్ల పెట్రోల్, డీజిల్ డిమాండ్ క్షీణిస్తుంటుంది. అదే కాలంలో వ్యవసాయ రంగం నుంచి డీజిల్ డిమాండ్ తగ్గుతుంది. ఇక అక్టోబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే.. నవంబర్‌లో 4.7 శాతం అధికంగా 2.96 మిలియన్ టన్నులు మేర పెట్రోల్ విక్రయాలు నమోదయ్యాయి. డీజిల్ విక్రయాలు 11 శాతం పెరిగి 6.5 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. పెట్రోలియం ఇంధన విక్రయాల్లో 40 శాతం వాటా డీజిల్ రూపంలోనే ఉంటుంది. వాణిజ్య వాహనాలు, వ్యవసాయ రంగంలో వినియోగించే పనిముట్లకు డీజిల్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా రవాణా రంగమే 70 శాతం డీజిల్‌ను వినియోగిస్తుంటుంది.ఇదీ చదవండి: ఇక ఉబర్‌లో ‘శికారా’ల బుకింగ్!విమానాల ఇంధనంజెట్ ఫ్యూయల్ (విమానాల ఇంధనం/ఏటీఎఫ్) అమ్మకాలు 3.6 శాతం పెరిగి 6,50,900 టన్నులుగా ఉన్నాయి. ఏటీఎఫ్ డిమాండ్ కరోనా పూర్వపు స్థాయిని దాటిపోయింది. వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు 7.3 శాతం పెరిగాయి. 2.76 మిలియన్ టన్నులుగా నమోదైంది. అంతకుముందు నెల అక్టోబర్‌లో 2.76 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం. -
చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ ఎత్తివేత
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు దిగివచి్చన నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి చేసే చమురుపై, విమాన ఇంధనం, డీజిల్, పెట్రోల్ ఎగుమతులపై దాదాపు రెండున్నరేళ్లుగా విధిస్తున్న విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను కేంద్రం తొలగించింది. అలాగే పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై విధిస్తున్న రహదారులు, మౌలిక సదుపాయాల సెస్సును కూడా ఉపసంహరించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం రాజ్యసభ ముందుంచారు.దీనితో దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ), ఆయిల్ ఇండియా వంటి సంస్థలకు, అలాగే ఎగుమతులు చేసే రిలయన్స్, నయారాలాంటి కంపెనీలకు ప్రయోజనం చేకూరనుంది. ఆయిల్ కంపెనీలకు వచ్చే అసాధారణ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తారు. 2022 జూలై 1న దేశీయంగా తొలిసారి దీన్ని విధించారు. ఆయిల్ బ్యారెల్‌ను 75 డాలర్లకు మించి ఎంత రేటుకు విక్రయించినా, వచ్చే ఆ లాభాలపై ప్రభుత్వం ఈ ట్యాక్స్‌ను విధిస్తూ వస్తోంది.2022లో దేశీయంగా ఉత్పత్తి చేసే క్రూడాయిల్‌పై టన్నుకు రూ. 23,250 చొప్పున, ఎగుమతి చేసే పెట్రోల్ .. ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 6 చొప్పున, డీజిల్‌పై లీటరుకు రూ. 13 చొప్పున దీన్ని విధించింది. తద్వారా 2022–23లో రూ. 25,000 కోట్లు, 2023–24లో రూ. 13,000 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం రూ. 6,000 కోట్ల వరకు సమీకరించింది. దీన్ని ఎత్తివేయాలంటూ చాలాకాలంగా పరిశ్రమతో పాటు కేంద్ర పెట్రోలియం..సహజ వాయువు శాఖ లాబీయింగ్ చేస్తున్నాయి. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకునే క్రూడాయిల్ బాస్కెట్ రేటు సగటున 73.02 డాలర్ల స్థాయిలో ఉంది. -
2047 నాటికి ఇంధన డిమాండ్ రెట్టింపు
దేశ ఇంధన డిమాండ్ 2047 నాటికి రెట్టింపు అవుతుందని పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా దేశీయ డిమాండ్ 25 శాతం పెరుగుతుందన్నారు. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్టీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) సంయుక్తంగా బెంగళూరులో నిర్వహించిన ఎనర్జీ టెక్నాలజీ మీట్ (ఈటీఎం)2024ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.‘ఎనర్జీ సెక్యూరిటీ, సుస్థిరత, సాంకేతిక ఆవిష్కరణలకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) గణాంకాల ప్రకారం 2047 నాటికి భారత ఇంధన డిమాండ్ రెట్టింపు అవుతుంది. రాబోయే రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా దేశీయ ఇంధన డిమాండ్ గణనీయంగా 25 శాతం పెరుగుతుంది. నికర-సున్నా ఉద్గారాల లక్ష్యాలను సాధించడంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) మెరుగైన విధానాలు పాటించాలి. ఇథనాల్, హైడ్రోజన్, జీవ ఇంధనాలలో పురోగతి ద్వారా వికసిత్ భారత్ సాధనలో భాగం కావాలి. ఫాజిల్ ప్యూయెల్లో కలిపే జీవ ఇంధనం మిశ్రమం రేటు ప్రస్తుతం 16.9%కి చేరుకుంది. 2030 నాటికి ఇది 20% లక్ష్యాన్ని చేరాలనే లక్ష్యం ఉంది. కానీ షెడ్యూల్ కంటే ఐదేళ్ల ముందే ఈ లక్ష్యాన్ని అధిగమించే దిశగా ముందుకు సాగుతున్నాం’ అని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓ‘భారతదేశం 250 రూపాల్లోని ముడి చమురును ప్రాసెస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశీయ ప్రస్తుత ముడి చమురు శుద్ధి సామర్థ్యం 258 మిలియన్ మెట్రిక్టన్స్ పర్ యానమ్(ఎంఎంటీపీఏ)గా ఉంది. రానున్న రోజుల్లో ఇది 310 ఎంఎంటీపీఏకి పెరుగుతుందని అంచనా’ అన్నారు. డిజిటల్ ఇన్నోవేషన్‌పై స్పందిస్తూ 2027 నాటికి దేశీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ 70 బిలియన్ డాలర్లు(రూ.5.81 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ అండ్ డైరెక్టర్ (మార్కెటింగ్) వి.సతీష్ కుమార్ పాల్గొన్నారు. -
మౌలిక రంగం.. మందగమనం
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక గ్రూప్ సెప్టెంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. వృద్ధి రేటు (2023 ఇదే నెలతో పోల్చి) కేవలం 2 శాతానికి పరిమితమైంది. గత ఏడాది ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి 9.5 శాతం. 2024 ఆగస్టుతో(1.6 శాతం క్షీణత) పోల్చితే మెరుగ్గా నమోదవడం ఊరటనిచ్చే అంశం. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, విద్యుత్ రంగాలు క్షీణ రేటును నమోదుచేసుకున్నాయి. బొగ్గు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్ వృద్ధి రేటు స్వల్పంగా ఉంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య, ఈ గ్రూప్ వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదైంది. -
ముడి చమురుకు కొరత లేదు
చండీగఢ్: అంతర్జాతీయంగా ముడి చమురుకు ఎలాంటి కొరత లేదని.. దేశీయ అవసరాలను తీర్చేందుకు వీలుగా తగినంత రిఫైనరీ సామర్థ్యం ఉందని పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ అవి కుదుటపడతాయన్న స్వీయ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.చండీగఢ్‌లో రోజ్‌గార్ మేళా సందర్భంగా మీడియా ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఈ పరిణామాలకు ముందు ప్రపంచవ్యాప్తంగా 105 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రోజువారీగా ఉత్పత్తయ్యేది. ఓపెక్ కూటమి రోజువారీగా 5 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి కోత నిర్ణయం తీసుకున్నది. అనంతరం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ఫలితంగా చమురు రవాణాకు భిన్న మార్గాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఇన్సూరెన్స్ వ్యయాలు పెరిగిపోయాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చూసినా మన దగ్గరే పెట్రోల్, డీజిల్ ధరలు అతి తక్కువగా ఉన్నాయి.2021 నవంబర్‌లో, 2022 మే నెలలో రెండు విడతలుగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. నేడు చమురుకు కొరత లేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ బ్యారెల్ చమురు ధర 72–73 బ్యారెళ్ల వద్దే ఉంది’’అని మంత్రి వివరించారు.దేశీయంగా 270 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనరీ సామర్థ్యం ఉండగా, దీన్ని 310 మిలియన్ మెట్రిక్ టన్నులకు విస్తరిస్తున్నట్టు తెలిపారు. కొత్తగా 4 లక్షల బ్యారెళ్ల చమురు బ్రెజిల్ నుంచి మార్కెట్లోకి వస్తోందని, యూఎస్ సైతం మరింత పరిమాణాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి పురి చెప్పారు. -
‘ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం’
పశ్చిమాసియాలో పెరుగుతున్న వివాదాల నేపథ్యంలో అంతర్జాతీయంగా అధికమవుతున్న చమురు ధరలను భారత్ గమనిస్తోందని చమురు వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. చమురు ధరలకు సంబంధించి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామన్నారు. ‘ఎగ్జిన్మొబిల్ గ్లోబల్ ఔట్లుక్ 2024’ సమావేశంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. మంత్రి ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయితే, ఆ ప్రభావం దేశంలో ఇంధన లభ్యతపై ఉంటుంది.దేశానికి చమురు సరఫరాల్లో ఎటువంటి అవాంతరాలూ ఉండబోవని భావిస్తున్నాం.ప్రపంచంలోని మూడో అతిపెద్ద చమురు వినియోగ, దిగుమతి దేశమైన భారత్ ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలదనే విశ్వాసంతో ఉన్నాం.దేశంలో చమురు కొరత లేదు. భారతదేశ అవసరాలకు తగిన నిల్వలు, వనరులు ఉన్నాయి. ఇదీ చదవండి: హర్ష్ గోయెంకా ఓలా స్కూటర్‌ను ఎలా వాడుతారో తెలుసా..?మార్చిలో సగటున భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ బ్యారల్‌కు 83 నుంచి 84 డాలర్లు ఉంటే, సెప్టెంబర్‌లో 73.69 డాలర్లకు తగ్గింది. అయితే తాజా పరిస్థితులు మళ్లీ ధరల పెరుగుదలపై ఆందోళనలను లేవనెత్తుతున్నాయి. దేశంలో పెట్రోల్–డీజిల్ ధరలు లీటర్‌కు 2 నుంచి 3 వరకూ తగ్గే వీలుందని గత వారం రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొన్న నేపథ్యంలోనే పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం గమనార్హం. -
చౌకగా లభిస్తోన్న ముడి చమురు
రష్యా ముడిచమురు ఇప్పటికీ తక్కువ ధరకే లభిస్తుందని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. దాంతో రష్యన్ కంపెనీల నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా ముడిచమురు దిగుమతులపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దాంతో రష్యా తక్కువ ధరకు క్రూడాయిల్ విక్రయిస్తోంది.భారత్ తన చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఇంధన వినియోగదారుల్లో భారత్ ఒకటిగా ఉంది. దేశీయంగా వార్షిక ముడిచమురు శుద్ధి సామర్థ్యం సుమారు 252 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. అంటే రోజుకు 50.04 లక్షల బ్యారెల్స్ శుద్ధి చేసే కెపాసిటీ కలిగి ఉంది. భవిష్యత్తులో ఇంధన వినియోగం పెరగనుందని మంత్రి అన్నారు. అందుకు అనుగుణంగా సంవత్సరానికి 300 మిలియన్ మెట్రిక్ టన్నుల (రోజూ 60 లక్షల బ్యారెల్స్) వరకు చమురు శుద్ధి చేసేలా కర్మాగారాల సామర్థ్యాన్ని పెంచే ప్రాజెక్ట్‌లు అమలులో ఉన్నాయని తెలిపారు.ఇదీ చదవండి: ఏటా 2.5 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా సరఫరాఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్-రష్యాల మధ్య నెలకొన్న భౌగోళిక అనిశ్చితుల వల్ల యూరప్ దేశాలు రష్యా క్రూడ్ దిగుమతిపై ఆంక్షలు విధించాయి. దాంతో రష్యా చమురు ధరను తగ్గించడంతోపాటు రూపాయిల్లో ట్రేడ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇతర దేశాల నుంచి పోలిస్తే రష్యా చమురు దిగుమతి భారత్‌కు కలిసివచ్చింది. చైనా కూడా రష్యా చమురు వాడకాన్ని పెంచింది. ఈ పరిణామాల వల్ల ప్రస్తుతం భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఉద్భవించింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు భారత్‌కు చమురు దిగుమతిలో రష్యా వాటా 1 శాతం కంటే తక్కువే ఉండేది. క్రమంగా అది పెరుగుతూ దాదాపు 40 శాతం వాటాకు చేరింది. -
విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దు
కేంద్ర ప్రభుత్వం ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పన్ను తొలగింపు నిర్ణయిం ఈరోజు నుంచే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం టన్ను ముడి చమురుపై రూ.1,850 వరకు విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నారు.కేంద్రం జులై 19, 2022 నుంచి విండ్‌ఫాల్ పన్నును విధించింది. ఈ ట్యాక్స్ అమల్లోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా తొలగించడం ఇది రెండోసారి. చివరిసారి ఏప్రిల్ 4, 2023న ఈ ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రైవేట్ రిఫైనర్లు స్థానికంగా చమురు ఉత్పత్తులను విక్రయించడానికి బదులు అధిక మార్జిన్ల కోసం విదేశాల్లోని రిఫైనరీలకు అమ్ముతుంటారు. దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్ విధిస్తుంది. 2022 నుంచి గ్యాసోలిన్, డీజిల్, విమాన ఇంధనాల ఎగుమతులపై పన్నును పొడిగిస్తూ వచ్చారు. ప్రస్తుతం దాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.ఇదీ చదవండి: నాలుగేళ్లుగా ఉన్న ఆంక్షలు ఎత్తివేత!కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31న దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ.2,100గా ఉండే విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రూ.1,850కి తగ్గించింది. పెట్రోలియం ఉత్పత్తులపై రూ.2,400గా ఉన్న లెవీని రూ.2,100కి చేర్చింది. ప్రభుత్వం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ పన్నుకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తోంది. గ్లోబల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర ఏప్రిల్‌లో బ్యారెల్‌కు 92 యూఎస్ డాలర్లుగా ఉండేది. ప్రస్తుతం అది 75 డాలర్లకు పడిపోయింది. -
పెట్రోల్, డీజిల్ ధరలపై త్వరలో కేంద్రం తీపి కబురు
దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. చమురు ధరలు జనవరి కంటే కనిష్ట స్థాయికి పడిపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మార్కెట్లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన పదేళ్లలో గరిష్ఠంగా జూన్ 2022లో బ్యారెల్ ధర 115 డాలర్లుగా నమోదైంది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర దాదాపు 70 డాలర్లకు చేరింది.అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల వల్ల గతంలో భారీగా పెరిగిన ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల క్రూడాయిల్ ధర 70 డాలర్లకు చేరువలో ఉంది. క్రూడ్ ధరలు గరిష్ఠంగా ఉన్నపుడు చమురుశుద్ధి కంపెనీలకు నష్టాలు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ రేట్లను కొద్దిగా తగ్గించినా దిగివస్తున్న క్రూడ్ ధరలకు అనుగుణంగా మాత్రం రేట్లను తగ్గించలేదు. దాంతో కంపెనీలకు భారీగా లాభాలు చేకూరుతున్నాయి.త్వరలో జరగబోయే హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు అధికారపక్షం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. లీటర్‌కు నాలుగు నుంచి ఆరు రూపాయలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై ఆరోపణలు.. పీఏసీ విచారణ?చమురు ధరలు తగ్గుముఖం పట్టడానికి పలు అంశాలు కారణమవుతున్నాయి. లిబియా తన ముడిచమురు సరఫరాలు పెంచింది. అక్టోబర్ నుంచి ఒపెక్ + దేశాలు ఉత్పత్తి కోతలను నిలిపివేయాలని నిర్ణయించాయి. ఒపెక్ దేశాల కాకుండా ముడిచమురు వెలికితీసే ఇతర దేశాలు వాటి ఉత్పత్తిని పెంచుతున్నాయి. దాంతో సరఫరా పెరిగి ధరలు తగ్గుతున్నాయి. -
రష్యా నుంచి రూ.23,240 కోట్ల చమురు
న్యూఢిల్లీ: రష్యా నుంచి జూలై నెలలో 2.8 బిలియన్ డాలర్ల చమురు భారత్‌కు దిగుమతి అయింది. రష్యా చమురు ఎగుమతులు చైనా తర్వాత భారత్‌కే ఎక్కువగా వచ్చాయి. రష్యా నుంచి చమురు దిగుమతుల్లో చైనా అగ్ర స్థానంలో ఉంది. ఇక గత నెలలో భారత్‌కు అత్యధిక చమురు సరఫరా చేసిన దేశంగా రష్యా మొదటి స్థానంలో ఉంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తర్వాత యూరప్ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు దూరం కావడం తెలిసిందే. దీంతో మార్కెట్ కంటే కొంత తక్కువ ధరకే చమురును రష్యా అందిస్తుండడంతో, భారత్ దిగుమతులకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముందు భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతం లోపే ఉండేది. అది ఇప్పుడు 40 శాతానికి పెగిపోయింది. రష్యా నుంచి చమురు ఎగుమతుల్లో 47 శాతం చైనాకు వెళుతుంటే, 37 శాతం భారత్‌కు, యూరప్‌కు 7 శాతం, టరీ్కకి 6 శాతం చొప్పున సరఫరా అవుతున్నాయి. ఈ వివరాలను సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లియర్ ఎయిర్ (సీఆర్ఈఏ) నివేదిక వెల్లడించింది. బొగ్గుకు సైతం డిమాండ్.. ఇక రష్యా నుంచి బొగ్గు దిగుమతులకు సైతం చైనా, భారత్ ప్రాధాన్యం ఇస్తున్నాయి. 2022 డిసెంబర్ 5 నుంచి 2024 జూలై వరకు రష్యా బొగ్గు ఎగుమతుల్లో 45 శాతం చైనాయే సొంతం చేసుకుంది. ఆ తర్వాత అత్యధికంగా 18 శాతం బొగ్గు భారత్‌కు దిగుమతి అయింది. టరీ్కకి 10 శాతం, దక్షిణ కొరియాకి 10 శాతం, తైవాన్‌కు 5 శాతం చొప్పున రష్యా నుంచి బొగ్గు ఎగమతులు నమోదయ్యాయి. మన దేశ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతుండడం తెలిసిందే. జూలై నెలలో 19.4 మిలియన్ టన్నుల చమురు దిగుమతుల కోసం భారత్ 11.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. సీఆర్ఈఏ నివేదిక ప్రకారం రష్యా సముద్ర చమురు ఎగుమతుల్లో 36 శాతమే ట్యాంకర్ల ద్వారా జరిగింది. పాశ్చాత్య దేశాలు విధించిన ధరల పరిమితి వీటికి వర్తించింది. ఇది కాకుండా మిగిలిన చమురు అంతా షాడో ట్యాంకర్ల ద్వారా రష్యా సరఫరా చేసింది. ఇవి అనధికారికం కనుక ధరల పరిమితి పరిధిలోకి రావు. మరీ ముఖ్యంగా విలువ పరంగా చూస్తే జూలై నెలలో 81 శాతం రష్యా చమురు సరఫరా షాడో ట్యాంకర్ల రూపంలోనే జరిగినట్టు సీఆర్ఈఏ నివేదిక వెల్లడించింది. -
40 శాతం పెరిగిన క్రూడ్ దిగుమతులు.. అయినా భారత్‌కు మేలే!
ప్రపంచంలో యూఎస్, చైనా తర్వాత మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా ఉన్న భారత్ జులైలో రష్యా నుంచి 2.8 బిలియన్ డాలర్ల(రూ.23.5 వేలకోట్లు) క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంది. చైనా తర్వాత రష్యా నుంచి అధికంగా చమురు దిగుమతి చేసుకున్న దేశాల్లో ఇండియా రెండో స్థానంలో నిలిచింది.ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్-రష్యాల మధ్య నెలకొన్న భౌగోళిక అనిశ్చితుల వల్ల యూరప్ దేశాలు రష్యా క్రూడ్ దిగుమతిపై ఆంక్షలు విధించాయి. దాంతో రష్యా చమురు ధరను తగ్గించడంతోపాటు రూపాయిలో ట్రేడ్ చేసుకునేందుకు వీలుకల్పించింది. ఇతర దేశాల నుంచి పోలిస్తే రష్యా చమురు దిగుమతి భారత్‌కు కలిసివచ్చింది. చైనా కూడా రష్యా చమురు వాడకాన్ని పెంచింది. ఈ పరిణామాల వల్ల ప్రస్తుతం భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఉద్భవించింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు భారత్‌కు చమురు దిగుమతిలో రష్యా వాటా 1 శాతం కంటే తక్కువే ఉండేది. క్రమంగా అది పెరుగుతూ దాదాపు 40 శాతం వాటాకు చేరింది.ఇదీ చదవండి: ఖనిజాల వెలికితీతకు ప్రోత్సాహకాలురష్యా క్రూడ్ ఎగుమతుల్లో 47 శాతం చైనా కొనుగోలు చేయగా, భారత్ (37 శాతం), యురోపియన్ యూనియన్ (7 శాతం), టర్కీ (6 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) ఒక నివేదికలో తెలిపింది. చమురుతోపాటు బొగ్గును కూడా అధికంగానే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు సీఆర్ఈఏ తెలిపింది. చైనా సైతం రష్యా బొగ్గును భారీగానే వాడుతోంది. డిసెంబర్ 5, 2022 నుంచి జులై 2024 చివరి వరకు రష్యా మొత్తం బొగ్గు ఎగుమతుల్లో 45 శాతం చైనా కొనుగోలు చేసింది. ఆ తర్వాత భారతదేశం (18 శాతం), టర్కీ (10 శాతం), దక్షిణ కొరియా (10 శాతం), తైవాన్ (5 శాతం) కొనుగోలు చేశాయి. -
దేశీయంగా తొలి వాణిజ్య క్రూడాయిల్ స్టోరేజీ
న్యూఢిల్లీ: క్రూడాయిల్ సరఫరాలో ఒడిదుడుకులు ఏవైనా తలెత్తితే సమర్ధంగా ఎదుర్కొనేందుకు దేశీయంగా తొలి వాణిజ్యపరమైన వ్యూహాత్మక ముడిచమురు స్టోరేజీ యూనిట్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. కర్ణాటకలోని పాడూర్‌లో 2.5 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యంతో భూగర్భంలో ముడిచమురు నిల్వ కోసం స్టోరేజీని నిర్మించేందుకు (పాడూర్ 2) ఇండియన్ స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్ (ఐఎస్పీఆర్ఎల్) బిడ్లను ఆహా్వనించింది. బిడ్ల దాఖలుకు ఏప్రిల్ 22 ఆఖరు తేదీ కాగా, జూన్ 27 నాటికి ప్రాజెక్టును కేటాయిస్తారు. దీనికి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్ల ప్రకారం ఇది ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన ఉంటుంది. ప్రైవేట్ పారీ్టలు స్టోరేజీని డిజైన్ చేయడం, నిర్మించడం, ఫైనాన్స్ చేయడం, నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. పాడూర్–2 స్టోరేజీని ఆపరేటరు ఏ ఆయిల్ కంపెనీకైనా లీజుకివ్వచ్చు. అందులో చమురుని నిల్వ చేసుకునే కంపెనీలు దాన్ని దేశీ రిఫైనర్లకు విక్రయించుకోవచ్చు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో మాత్రం నిల్వలను ముందుగా ఉపయోగించుకునేందుకు భారత ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి. ఐఎస్పీఆర్ఎల్ తొలి దశలో విశాఖపట్నంతో పాటు మంగళూరు, పాడూర్‌లో 5.33 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యంతో వ్యూహాత్మక స్టోరేజీ యూనిట్లను ప్రభుత్వ వ్యయంతో ఏర్పాటు చేసింది. రెండో దశలో భాగంగా అండర్‌గ్రౌండ్‌లో రూ. 5,514 కోట్ల వ్యయంతో వాణిజ్య, వ్యూహాత్మక పెట్రోలియం స్టోరేజీ యూనిట్‌ను ప్రతిపాదిస్తోంది. -
చమురు వినియోగంపై ఈవీల ప్రభావం ఎంత..?
భారతదేశానికి ఎంతోకాలంగా ముడి చమురు సరఫరా చేస్తున్న సౌదీ అరామ్కో దేశంలో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారంలో 20% వాటా కోసం 15 బిలియన్ డాలర్ల బిడ్ వేసి విఫలమైన సంగతి తెలిసిందే. తాజాగా పెట్రోకెమికల్స్ బిజినెస్‌లో ఆసక్తి కనబరుస్తున్నట్లు చెబుతుంది. విద్యుత్ వాహనాలు పెరుగుతున్నా ప్రపంచంలో చమురు వినియోగం తగ్గదని చెబుతుంది. దాంతో ఇండియాలో మరింత వ్యాపారానికి ఆస్కారం ఉన్నట్లు సౌదీ అరామ్కోలో స్ట్రాటజీ అండ్ మార్కెట్ అనాలిసిస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫహద్ అల్ ధుబైబ్ ఓ మీడియాతో తెలిపారు. భారతదేశంలో జనాభా పెరుగుదలతోపాటు పారిశ్రామికీకరణ ప్రణాళికలు అధికమవుతున్నాయిని ధుబైబ్ అన్నారు. ‘గత రెండు దశాబ్దాలుగా భారత్ ఎంతో అభివృద్ధి చెందింది. 2050 వరకు దాదాపు 100 కోట్ల మంది ప్రజలు అధికంగా ఇంధనాన్ని వినియోగించనున్నారు. చమురుతోపాటు రానున్న రోజుల్లో పెట్రోకెమికల్స్‌లోనూ గణనీయమైన వృద్ధికి అవకాశం ఉంది. భారత్‌లో హైడ్రోకార్బన్లు, అవసరమైన రసాయనాలు, పదార్థాలను శుద్ధి చేయడంలో పెట్టుబడులు పెట్టేందుకు అరామ్కో పరిశీలిస్తుంది. భారతదేశానికి అరామ్కో ప్రధాన ఎల్పీజీ సరఫరాదారుగా ఉంది’ అని చెప్పారు. ఇదీ చదవండి: క్రూడాయిల్‌పై పన్ను పెంపు.. ఎంతో తెలుసా.. ‘ఇప్పటికీ చాలామంది బయోమాస్ లేదా కలపను వినియోగించి వంట చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డేటా ప్రకారం ఏటా ఇంట్లో పొగవల్ల ఏర్పడే కాలుష్యం కారణంగా దాదాపు 4 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ఇవి తగ్గాలంటే ప్రతి ఇంట్లో ఎల్పీజీ వినియోగించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ రెన్యువెబుల్ ఎనర్జీకి అయ్యే ఖర్చులను తగ్గించేందుకు కృషి చేయాలని అరామ్కో యోచిస్తోంది’ అని ధుబైబ్ తెలిపారు. -
పెరుగుతున్న భారత్ చమురు డిమాండ్
బెతుల్ (గోవా): ప్రపంచ చమురు డిమాండ్‌లో చైనాను భారత్ 2027లో అధిగమిస్తుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) బుధవారం పేర్కొంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో రవాణా, పరిశ్రమల వినియోగం వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రపంచ చమురు డిమాండ్ విషయంలో చైనాను భారత్ వెనక్కునెట్టనుందని అభిప్రాయపడింది. క్లీన్ ఎనర్జీ, విద్యుదీకరణ వంటి రంగాల పురోగతికి దేశం ప్రణాళికలు వేస్తున్నప్పటికీ చమురు డిమాండ్ కొనసాగుతుందని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐఈఏ పేర్కొంది. ఇక్కడ జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌ను పురస్కరించుకుని ‘ఇండియన్ ఆయిల్ మార్కెట్ అవుట్‌లుక్ 2030’ అనే పేరుతో ఒక ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. నివేదికలోని మరిన్ని అంశాలను పరిశీలిస్తే... ► దేశం చమురు డిమాండ్ 2023లో రోజుకు 5.48 మిలియన్ బ్యారెళ్లు (బీపీడీ). 2030 నాటికి ఈ పరిమాణం 6.64 మిలియన్ బీపీడీకి పెరుగుతుంది. చమురు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం దేశీయ వినియోగం రోజుకు 5 మిలియన్ బ్యారెల్స్ (బీపీడీ). ఐఈఏ నివేదికలో అంకెలు చూస్తే, దేశీయంగా అలాగే ఎగుమతుల కోసం జరుగుతున్న ఇంధన ప్రాసెస్‌ను పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ► గ్రీన్ ఎనర్జీ విషయంలో పురోగతి ఉన్నప్పటికీ 2030 నాటికి భారత్ చమురు డిమాండ్ వేగంగా పెరుగుతుంది. ► ప్రపంచ చమురు డిమాండ్‌లో భారత్‌లో వృద్ధి 2027లో చైనాను అధిగమిస్తుంది కానీ, దేశీయంగా చూస్తే, భారతదేశంలో డిమాండ్ 2030లో కూడా చైనా కంటే వెనుకబడి ఉంటుంది. ► ప్రస్తుతం అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉంది. దేశం తన చమురు అవసరాలలో 85 శాతం దిగుమతి చేసుకుంటోంది. దేశీయ ఉత్పత్తి పడిపోవడంతో ఈ శాతం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ► భారీ చమురు క్షేత్రాలు కనుగొనలేకపోవడం వల్ల 2030 నాటికి దేశీయ ఉత్పత్తి 540,000 బీపీడీకి పడిపోతుంది. 2023లో దిగుమతులు 4.6 మిలియన్ బీపీడీలు ఉండగా, 2030 నాటికి 5.8 మిలియన్ బీపీడీలకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ► భారతదేశం 66 రోజుల అవసరాలను తీర్చడానికి సమానమైన చమురు నిల్వలను కలిగి ఉంది. ఇందులో 7 రోజుల అవసరాలు భూగర్భ వ్యూహాత్మక నిల్వలలో నిల్వ ఉన్నాయి. మిగిలినవి రిఫైనరీలు మరియు ఇతర ప్రదేశాలలో డిపోలు– ట్యాంకులలో నిల్వలో ఉన్నాయి. భారత్ కాకుండా ఐఈఏ ఇతర సభ్య దేశాలు తమ డిమాండ్‌లో 90 రోజులకు సమానమైన నిల్వను నిర్వహిస్తున్నాయి. -
రానున్న రోజుల్లో చమురు సంక్షోభం..!
-
రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు?
ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా సహా సంపన్న దేశాలు ఆంక్షలు విధించాయి. ఆదాయం పెంచుకోవడానికి తన మిత్ర దేశాలకు రష్యా రాయితీపై ముడి చమురు సరఫరా చేసింది. దీన్ని భారత్ అనుకూలంగా మార్చుకుని రష్యా నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకుంది. అయితే క్రమంగా యుద్ధ భయాలు తొలగిపోతుండడంతో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ ఖరీదుగా మారుతోంది. ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్‌ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్‌పై ఇస్తున్న డిస్కౌంట్‌ను రష్యా తగ్గించింది. ప్రస్తుతం బ్యారెల్‌పై 3-4 డాలర్ల వరకు మాత్రమే డిస్కౌంట్ ఇస్తోంది. కానీ, రవాణా ఛార్జీలను మాత్రం తగ్గించలేదని, సాధారణం కంటే ఇంకా ఎక్కువగానే ఉన్నాయని క్రూడ్ విక్రయిస్తున్న కంపెనీలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్‌పై బ్యారెల్‌కు 60 డాలర్ల ప్రైస్ లిమిట్‌ను విధించిన విషయం తెలిసిందే. ఈ ధర కంటే కొద్దిగా తక్కువకు ఇండియన్ కంపెనీలు క్రూడాయిల్ కొంటున్నాయి. అదే ఆయిల్‌ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్‌కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేస్తున్నాయని సమాచారం. దాంతో రష్యా నుంచి వరుసగా క్రూడాయిల్ దిగుమతులు తగ్గుతున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా గత నెలలో సౌదీ అరేబియా నుంచి ముడి చమురు దిగుమతులు పెరిగాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి 22 శాతం నుంచి 16 శాతానికి తగ్గితే, సౌదీ అరేబియా నుంచి నాలుగు శాతం పెరిగింది. చెల్లింపుల సమస్య తలెత్తడంతో రష్యా నుంచి గత నెలలో క్రూడాయిల్ కొనుగోళ్లు 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రష్యాలోని సొకోల్ తదితర ప్రాంతాల నుంచి ఐదు క్రూడాయిల్ చమురు రవాణా నౌకలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయని తెలుస్తుంది. భారత్‌లో టాప్ రిఫైనరీ సంస్థగా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రమే సొకోల్తోపాటు రష్యాలోని రోస్ నెఫ్ట్ ప్రాంతం నుంచి చమురు కొనుగోళ్లకు వార్షిక ఒప్పందం కుదుర్చుకుంది. చెల్లింపు సమస్యను తగ్గించుకోవడానికి గత నెలలో సౌదీ అరేబియా సహా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చమురు కొనుగోలు ప్రారంభించిందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఇదీ చదవండి: రూ.10 వేలకోట్లు అప్పు చేసిన ‘రిచ్‌డాడ్ పూర్‌డాడ్’ పుస్తక రచయిత.. చమురు దిగుమతి చేసుకున్నందుకు రష్యాకు రుబెల్స్, రూపీల్లో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ చెల్లింపులకు చాలా విలువ ఉంటుంది. దాంతో కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు చమురుపై ఇస్తున్న డిస్కౌంట్‌ను తగ్గిస్తూ, రవాణా ఛార్జీలు తగ్గించకపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. -
‘రష్యా నుంచి చమురు దిగుమతి చేయకపోతే..’ కేంద్రం కీలక వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి పశ్చిమ దేశాలు ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. దాంతో చమురు ధరపై పరిమితిని విధించాయి. మరోవైపు రష్యా ముడి చమురును తక్కువ ధరకే విక్రయించడానికి సిద్ధమైంది. డిస్కౌంట్ ధరలో చమురు దొరుకుతుండడంతో భారత్ రష్యా నుంచి తన దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. ఎప్పుడూలేని విధంగా రికార్డు స్థాయిలో చమురును ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఒకప్పుడు మన దేశ చమురు దిగుమతిలో ఒక్క శాతం వాటా కూడా లేని రష్యా.. ఇప్పుడు భారత్‌కు అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా అవతరించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయని, చౌకగా దొరికిన రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేయకపోయి ఉంటే భారత్‌లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగేదని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ ఓ నివేదికలో పేర్కొంది. ‘ఇండియన్ రిఫైనర్లు రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేయకపోయి ఉంటే దేశంలో ఆయిల్ కొరత ఏర్పడేది. రోజుకి 19 లక్షల బ్యారెల్స్ అవసరం అవుతున్నాయి. రష్యా కాకుండా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే ఆయిల్ రేటు బ్యారెల్‌కు అదనంగా 30–40 డాలర్ల మేరకు భారం పడేది’ అని వెల్లడించింది. అంతర్జాతీయంగా రోజుకి 10 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అవసరం అవుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇదీ చదవండి: 2.24 లక్షల మందిని ఇంటికి పంపిన కంపెనీలు ఒకవేళ ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్’ (ఒపెక్) రోజుకి ఒకటి లేదా రెండు మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిస్తే, ధరలు 10 శాతం నుంచి 20 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దాంతో ఆయిల్ ధర బ్యారెల్‌కు 125–130 డాలర్లకు చేరుకుంటుంది. ఇండియాలో రోజుకి అవసరమయ్యే 19.5 లక్షల బ్యారెల్స్‌ను సిద్ధం చేయకపోతే అదనంగా మరింత ధర పెరిగే ప్రమాదం ఉందని పెట్రోలియం మినిస్ట్రీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ వాడకంలో ఇండియా మూడో స్థానంలో ఉందని, అందులో 85 శాతం క్రూడ్ అవసరాలను దిగుమతుల తీర్చుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. దేశంలోని రిఫైనింగ్ కెపాసిటీ రోజుకి 50 లక్షల బ్యారెల్స్‌గా ఉందని తెలిపారు. -
తగ్గిన డీజిల్ అమ్మకాలు.. కారణం ఇదే..
డీజిల్ అమ్మకాలు నవంబర్‌లో 7.5 శాతం మేర క్షీణించాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న 7.33 మిలియన్ టన్నుల నుంచి 6.78 మిలియన్ టన్నుల విక్రయాలకు పరిమితమయ్యాయి. దీపావళి సందర్భంగా కొందరు ట్రక్ డ్రైవర్లు విరామం తీసుకుని, ఇళ్లకు వెళ్లిపోవడం వల్లే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నెలలో విక్రయాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని పేర్కొన్నారు. పెట్రోల్ ఇంధన అమ్మకాల్లో డీజిల్ వాటా 40 శాతం మేర ఉంటుంది. 70 శాతం మేర డీజిల్‌ను రవాణా రంగం వినియోగిస్తుంటుంది. మూడు ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థల ద్వారా పెట్రోల్ అమ్మకాలు నవంబర్ నెలలో 7.5 శాతం పెరిగి 2.86 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. పండుగల సమయంలో వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడం ఇందుకు మద్దతుగా నిలిచింది. డీజిల్ డిమాండ్ నవంబర్ మొదటి 15 రోజుల్లో 12.1 శాతం క్షీణించగా, ఆ తర్వాత తిరిగి కోలుకుంది. అక్టోబర్‌లో మొదటి అర్ధభాగంలో పెట్రోల్ డిమాండ్ 9 శాతం తగ్గగా, అదే కాలంలో డీజిల్ అమ్మకాలు 3.2 శాతం క్షీణించాయి. ఆ తర్వాత దుర్గా పూజ, దసరా నవరాత్రుల సమయంలో డిమాండ్ మళ్లీ పుంజుకోవడం గమనార్హం. ఇక నెలవారీగా చూస్తే, అక్టోబర్ కంటే నవంబర్‌లో డీజిల్ అమ్మకాలు 3.6 శాతం అధికంగా నమోదయ్యాయి. ఏటా వర్షాకాలంలో మూడు నెలల పాటు డీజిల్ అమ్మకాలు క్షీణించడం సాధారణంగా కనిపిస్తుంటుంది. వర్షాకాలం ముగిసిన తర్వాత అమ్మకాలు తిరిగి పుంజుకోవడాన్ని గమనించొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం మేర డీజిల్ అమ్మకాలు పెరిగినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఏటీఎఫ్ అమ్మకాల్లోనూ సానుకూలత ఇక విమానయాన ఇంధన అమ్మకాలు (ఏటీఎఫ్) నవంబర్ నెలలో 6,20,000 టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలతో పోలిస్తే 6.1 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. 2021 నవంబర్ నెల అమ్మకాలతో పోలిస్తే 31.6 శాతం పెరిగాయి. కరోనా ముందు సంవత్సరం 2019 నవంబర్ నెలలో అమ్మకాలు 6,70,000 టన్నులతో పోలిస్తే ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఏటీఎఫ్ అమ్మకాలు 6,11,300 టన్నులుగా ఉన్నాయి. ఎల్పీజీ (వంటగ్యాస్) విక్రయాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 0.9 శాతం తక్కువగా 2.57 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. అక్టోబర్‌లో నమోదైన 2.52 మిలియన్ టన్నులతో పోలిస్తే 2 శాతం పెరిగాయి. -
క్రూడ్ఆయిల్తో ఇవి తయారీ..
అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల వల్ల క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతోంది. కొన్నిసార్లు స్వల్పంగా తగ్గినా మరికొన్ని పరిస్థితుల వల్ల తిరిగి ధరలు పెంచుతున్నారు. దేశంలో వినియోగించే క్రూడ్‌లో అధికభాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకునేదే. అయితే దేశీయంగా ఈ కింది రాష్ట్రాల్లో అధికంగా క్రూడ్‌ఆయిల్ ఉత్పత్తి అవుతోంది. రాజస్థాన్-7667 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంఎంటీ) గుజరాత్-4626 ఎంఎంటీ అసోం-4309 ఎంఎంటీ తమిళనాడు-395 ఎంఎంటీ ఆంధ్రప్రదేశ్-296 ఎంఎంటీ అరుణాచల్‌ప్రదేశ్-43 మిలియన్ మెట్రిక్ టన్నులు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అవుతోంది. మొత్తం ఆన్‌షోర్(భూ అంతరాల్లో నుంచి వెలికితీసే ఆయిల్) ఉత్పత్తిలో 17336 ఎంఎంటీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్లతో ప్రైవేట్ కంపెనీలు జాయింట్ వెంచర్‌గా ఏర్పాటై 9367 ఎంఎంటీ క్రూడ్ ఆయిల్‌ను వెలికి తీస్తున్నాయి. పూర్తి ప్రైవేట్ కంపెనీలు 7969 ఎంఎంటీల క్రూడ్ ఆయిల్‌ను బయటికి తీస్తున్నాయి. పబ్లిక్ సెక్టార్ యూనిట్లతో జాయింట్ వెంచర్ ద్వారా ఆఫ్‌షోర్(సముద్రం అడుగు నుంచి వెలికితేసే ఆయిల్) ప్రొడక్షన్లో భాగంగా 14,969 ఎంఎంటీలు, ప్రైవేట్ జాయింట్ వెంచర్ ద్వారా 1,899 ఎంఎంటీ క్రూడ్ ఆయిల్ వెలికితీస్తున్నారు. ఇదీ చదవండి: టెక్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వారికే.. అయితే క్రూడ్‌ఆయిల్ ఎన్నో రంగాల్లోని ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగపడుతోంది. ఆయా రంగాల్లో క్రూడ్ ఆయిల్ వినియోగించి తయారుచేస్తున్న ఉత్పత్తులు ఈ కింది విధంగా ఉన్నాయి. ఫ్యుయెల్: గ్యాసోలిన్, డీజిల్, జెట్ ఫ్యుయెల్, పెట్రోల్. ప్లాస్టిక్: బాటిళ్లు, కంటైనర్లు, టాయ్స్. కాస్మాటిక్స్: లోషన్లు, ఫెర్ఫ్యూమ్, డీయోడరెంట్లు. మెడిసిన్లు: ఆస్పరిన్, యంటీసెప్టిక్స్, సిరంజీలు. ఎలక్ట్రానిక్స్: ఇన్సులేటర్లు, కంపోనెంట్లు. వస్త్రరంగం: పాలీస్టర్, నైలాన్, ఆక్రిలిక్. గృహోపకరణాలు: డిటర్జెంట్లు, క్యాండిళ్లు. రియల్టీ: ఆస్పాల్ట్, పైపులు, స్విచ్‌లు. వ్యవసాయం: కృత్రిమ ఎరువులు, ఫెస్టిసైడ్స్. ల్యూబ్రికెంట్లు: మోటార్ ఆయిల్, గ్రిజ్ -
రష్యా నుంచి భారీగా దిగుమతులు
న్యూఢిల్లీ: రష్యా నుంచి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 36.27 బిలియన్ డాలర్లు విలువైన (రూ.3.01లక్షల కోట్లు) దిగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దిగుమతుల్లో 65 శాతం వృద్ధి కనిపిస్తోంది. 2022 ఏప్రిల్–అక్టోబర్ మధ్య రష్యా నుంచి దిగుమతులు 22.13 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ముడి చమురు, ఎరువులు ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో భారత్ దిగుమతులకు రష్యా రెండో అతిపెద్ద కేంద్రంగా నిలిచింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముందు మన దేశ దిగుమతుల్లో రష్యా వాటా కేవలం ఒక్కశాతమే. కానీ, ప్రస్తుతం భారత చమురు దిగుమతుల్లో రష్యా 40 శాతం వాటా ఆక్రమించేసింది. ఉక్రెయిన్‌పై దాడికి ప్రతీకారంగా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో భారత్‌కు మార్కెట్ కంటే తక్కువ ధరకే చుమురు సరఫరాకు రష్యా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి భారత్ భారీగా చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. దేశాల వారీగా.. ♦ ఇక ఏప్రిల్–అక్టోబర్ మధ్య చైనా నుంచి దిగుమతులు 60.02 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి రూ.60.26 బిలియన్ డాలర్ల వద్దే ఉన్నాయి. ♦అమెరికా నుంచి దిగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు 16 శాతం తగ్గి 24.89 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ♦యూఏఈ నుంచి దిగుమతులు 21 శాతం తగ్గి 24.91 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ♦అంతేకాదు సౌదీ అరేబియా, ఇరాక్, ఇండోనేషియా, సింగపూర్, కొరియా నుంచి కూడా దిగుమతులు క్షీణించాయి. ♦ స్విట్జర్లాండ్ నుంచి దిగుమతులు క్రితం ఏడాది మొదటి ఏడు నెలల్లో 10.48 బిలియన్ డాలర్లుగా ఉంటే, అవి ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలంలో 13.97 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. ♦మరో వైపు భారత్ ఎగుమతులకు కేంద్రంగా ఉన్న టాప్–10 దేశాలలో, ఆరు దేశాలకు ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఎగుమతులు ప్రతికూలంగా నమోదయ్యాయి. అమెరికా, యూఏఈ, సింగపూర్, జర్మనీ, బంగ్లాదేశ్, సౌదీ అరేబియాకు తగ్గాయి. ♦బ్రిటన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌కు ఎగుమతులు వృద్ధి చెందాయి. ♦చైనాకు ఎగుమతులు 8.92 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది మొదటి ఏడు నెలల్లో ఇవి 8.85 బిలియన్ డాలర్లు. -
ఓఎన్జీసీ రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) రెండు పెట్రోకెమికల్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముడి చమురును నేరుగా అధిక విలువైన రసాయన ఉత్పత్తులుగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు కంపెనీ రెండవ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్ కాల్ సందర్భంగా ఓఎన్జీసీ ఫైనాన్స్ డైరెక్టర్ పోమిలా జస్పాల్ వెల్లడించారు. వేర్వేరు రాష్ట్రాల్లో రెండు ప్రాజెక్టులకుగాను 2028 లేదా 2030 నాటికి రూ.10,000 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ ఈడీ డి.అధికారి తెలిపారు. పెట్రోకెమికల్స్ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4.2 మిలియన్ టన్నుల నుంచి 2030 నాటికి 8.5–9 మిలియన్ టన్నులకు చేర్చాలన్నది ప్రణాళిక అని పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టు సొంతంగా, మరొకటి భాగస్వామ్యంలో నెలకొల్పనున్నట్టు తెలిపారు. -
Israel-Hamas war: ఒకేరోజు చమురుధరల్లో భారీ క్షీణత
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని నియంత్రించేందుకు మిడిల్ఈస్ట్ దేశాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సోమవారం చమురు ధరలు 2% పైగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.33 అమెరికన్ డాలర్లు లేదా 2.5% తగ్గి బ్యారెల్ ధర 89.83 యూఎస్ డాలర్ల వద్ద స్థిరపడింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.59 డాలర్లు లేదా 2.9% తగ్గి బ్యారెల్ 85.49 యూఎస్ డాలర్లకు చేరింది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి వల్ల చమురు సరఫరాపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రాంతీయంగా తరచూ అనేక అనిశ్చితులు ఎదుర్కొనే ఇజ్రాయెల్.. రోజుకి మూడు లక్షల బ్యారెల్ సామర్థ్యం ఉన్న రెండు చమురు శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ఉత్పత్తి, శుద్ధి, సరఫరాపై తక్షణం ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని అంచనా! అయితే, ఉద్రిక్తతలు మరింత ముదిరి, సంక్షోభం సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని నియంత్రించేందుకు మిడిల్ఈస్ట్ దేశాలు చేస్తున్న ఫలిస్తే మాత్రం క్రూడ్ ధర మరింత తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ప్రతినిధులు ఈ వారం ఇజ్రాయెల్‌ను సందర్శించనున్నారు. ఇదిలా ఉండగా..పరిస్థితులను బట్టి చమురు ఉత్పత్తిని సర్దుబాటు చేస్తామని ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలైన బహ్రైన్, ఇరాక్, కువైట్, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా హామీ ఇచ్చాయి. దానివల్ల ప్రపంచ ఆయిల్ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉండవచ్చనే వాదనలు ఉన్నాయి. -
Tax On Crude Oil: ముడిచమురుపై విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు
దేశంలో ఉత్పత్తి చేసే ముడిచమురుపై అదనపు ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని (ఎస్ఏఈడీ లేదా విండ్‌ఫాల్) టన్నుకు రూ.9050కు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబరు 18 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ఇంతకు ముందు సెప్టెంబరు 29న ముడిచమురుపై విండ్‌ఫాల్ పన్ను టన్నుకు రూ.12200గా ఉంది. గతంతో పోలిస్తే రూ.3050కు తగ్గింది. డీజిల్ ఎగుమతులపై లీటర్‌కు రూ.5గా ఉన్న విండ్‌ఫాల్ సుంకాన్ని రూ.4 చేశారు. లీటర్ విమాన ఇంధనంపై సుంకాన్ని రూ.3.5 నుంచి రూ.1కు తగ్గించారు. పెట్రోల్‌పై సున్నా సుంకం కొనసాగుతుంది. డీజిల్ అమ్మకంపై లీటర్‌కు రూ.5.5 నుంచి రూ.5కి, విమాన ఇంధనంపై లీటర్‌కు రూ.3.5 నుంచి రూ.2.5కు పన్ను తగ్గించినట్లు ప్రభుత్వం తెలిపింది. సవరించిన పన్నులు సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తాయి. రష్యా ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో భారత కంపెనీలు రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు దిగుమతి చేసుకున్నాయి. దాంతో దేశీయంగా చమురు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలపై జులై 1, 2022 నుంచి వాటి చమురు అమ్మకాలపై కేంద్రం మొదటగా విండ్‌ఫాల్ పన్నులను విధించింది. -
రూపాయి పతనానికి కారణాలు ఇవేనా..?
రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోతుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారక విలువ 83.2625 వద్ద ట్రేడవుతుంది. అందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని సమాచారం. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం సందర్భంగా మాట్లాడుతూ..ఎకానమీలోని అస్థిరతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంకులు ఎప్పటికప్పుడు కరెన్సీ మార్కెట్లో జోక్యం చేసుకుంటాయన్నారు. రూపాయి మారకపు విలువ కనిష్ఠస్థాయులను చేరుతుంది. దాంతో దేశీయంగా ఉన్న డాలర్ రిజర్వ్‌లను విక్రయించి రూపాయి విలువను స్థిరపరిచేలా చర్యలు తీసుకుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊటరనిచ్చే అంశం. ఎక్స్ఛేంజీ మార్కెట్లో అమెరికా కరెన్సీని విక్రయించి రూపాయికి మద్దతును పలకవచ్చు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ప్రస్తుతం 83.2625 వద్ద ట్రేడవుతుంది. రూపాయి ధర 83.25కు చేరగానే ఆర్బీఐ జోక్యం చేసుకుని.. అంతకు దిగజారకుండా చర్యలు తీసుకుంటుందని అంచనా. బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్లు శుక్రవారం దాదాపు 6శాతం పెరిగాయి. మిడిల్ఈస్ట్ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి వల్ల బ్యారెల్ ముడిచమురు ధర 91 యూఎస్ డాలర్లకు చేరింది. ప్రభావం ఇలా.. రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు (ముఖ్యంగా చమురుకు) పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ కారణంగా నిలవవచ్చు. అయితే ఆర్బీఐ జోక్యం వల్ల రూపాయి ట్రేడింగ్‌లో ఊగిసలాటలు తగ్గుతాయి. అంతే తప్ప విలువను నిర్ణయించలేరని అభిప్రాయం ఉంది. ఇదీ చదవండి: డబ్బు సంపాదనకు ఇన్ని మార్గాలా..! కారణాలివే.. 1. మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు. 2. ముడిచమురు ధర 91 డాలర్ల పైకి చేరింది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ పైపైకి ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది. 3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. 4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని మదుపులను ఉపసంహరించుకొని అమెరికా, ఇతర ఐరోపా బ్యాంకులకు తరలిస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ యుద్ధం, ఇతర కారణాలతో సమీప భవిష్యత్తులో ముడిచమురు ధర, మన దిగుమతి బిల్లు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇండియా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటేనే, రూపాయి పతనం ఆగుతుంది. -
మంగోలియాలో మేఘా భారీ ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) తాజాగా మంగోలియాలో మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా అత్యాధునిక ముడిచమురు శుద్ధి కేంద్రాన్ని నిర్మించనుంది. డీల్ విలువ సుమారు రూ. 5,400 కోట్లు. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 15 లక్షల టన్నుల ముడిచమురు ఉత్పత్తి చేయనుందని కంపెనీ ప్రకటించింది. మేఘా ఇంజనీరింగ్ ఇప్పటికే మంగోలియాలో రూ.6,500 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులను చేపట్టింది. మంగోలియా రాజధాని ఉలాన్బటోర్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎంఈఐఎల్, మంగోల్ రిఫైనరీ స్టేట్ ఓన్డ్ ఎల్ఎల్సీ మధ్య ఒప్పందం జరిగింది. మంగోలియాలో తొలి గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ రిఫైనరీ నిర్మాణంలో భాగస్వా మ్యం అయినందుకు గర్వంగా ఉందని ఎంఈఐఎల్ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. -
సామాన్యులపై మరో పిడుగు: ముడిచమురుపై భారీగా టాక్స్ పెంపు
Windfall Tax on Crude oil భారతదేశంలోని చమురు ఉత్పత్తిదారులకు భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విండ్‌ఫాల్ టాక్స్‌ను భారీగా పెంచింది. టన్నుకు రూ.6,700 నుంచి రూ.10,000కు కేంద్ర ప్రభుత్వం పెంచింది. సవరించిన ధరలు నేటి (సెప్టెంబర్ 16)నుంచే అమల్లో ఉంటాయి. తాజా నిర్ణయంతో ఇప్పటికే పెట్రో భారంతో అతలాకుతమవుతున్న సామాన్యులపై మరింత భారం పెరగనుంది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF)పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (SAED) లీటర్‌కు 4 రూపాయల నుండి 3.50 రూపాయలకు ప్రభుత్వం తగ్గించింది. అలాగే డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటరుకు రూ.6 నుంచి రూ.5.5కు తగ్గిస్తున్నట్లుకేంద్రం ప్రకటించింది. పెట్రోల్ ఎగుమతిపై SAED సున్నాగా కొనసాగుతుంది. గత రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా ప్రతి పక్షం రోజులకు ఒకసారి పన్ను రేట్లు సమీక్ష ఉంటుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న జరిగిన పక్షంవారీ సమీక్షలో ప్రభుత్వం ముడి పెట్రోలియంపై టన్నుకు రూ.7,100 నుంచి రూ.6,700కి తగ్గించింది. భారతదేశంలోని చమురు ఉత్పత్తిదారులపై విండ్‌ఫాల్ పన్నును గత ఏడాది జూలైలో మొదటిసారిగా విధించారు. అలాగే సెప్టెంబర్ 1న ప్రభుత్వం పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను టన్నుకు రూ.7,100 నుంచి రూ.6,700కి తగ్గించిన సంగతి తెలిసిందే.మరోవైపు చమురు ధరలు 10 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. -
నిఫ్టీ 20,000 స్థాయికి..?
ముంబై: నిఫ్టీ సూచీ ఈ వారంలో 20,000 స్థాయికి చేరొచ్చని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సూచీ జీవితకాల గరిష్టం (19,992) స్థాయికి 172 పాయింట్లు, 20వేల స్థాయికి 180 పాయింట్లు దూరంలో ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు కూడా స్వల్ప కాలానికి ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నారు. అంచనాలకు మించి జీడీపీ, పీఎంఐ డేటా నమోదు, ఆర్థిక వ్యవస్థపై బలమైన అవుట్‌లుక్ నేపథ్యంతో గతవారం సూచీలు రెండుశాతం లాభపడ్డాయి. మెటల్, రియలీ్ట, మీడియా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా వారం మొత్తంగా సెన్సెక్స్ 878 పాయింట్లు, నిఫ్టీ 385 పాయింట్లు ఆర్జించాయి. ‘‘అమెరికా బాండ్లపై రాబడులు 4.3 శాతానికి చేరుకున్నాయి. డాలర్ ఇండెక్స్ 105 స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 90 డాలర్లకు చేరింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశీయ మార్కెట్ స్థిరంగా ముందుకు కదలింది. గత వారాంతంలో ఆర్బీఐ అదనపు నగదు నిల్వల నిష్పత్తిని దశల వారీగా రద్దు చేస్తున్నట్లు చేసిన ప్రకటనతో బ్యాంకుల షేర్లు రాణించవచ్చు. ఈ పరిమాణాలు నిఫ్టీని 20,000 స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఒకవేళ లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే దిగువున 19,500–19,650 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల డేటా దేశీయంగా జూలై పారిశ్రామికోత్పత్తి డేటా, వడ్డీరేట్లను ప్రభావితం చేసే ఆగస్టు ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు గణాంకాలు ఈ వారంలో వెల్లడి కానుంది. అలాగే చైనా వాహన అమ్మకాలు, అమెరికా ద్రవ్యల్బోణ, యూరోజోన్ పారిశ్రామికోత్పత్తి డేటా, ఇదే వారంలోనే విడుదల అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, డిపాజిట్ – బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకొనే వీలుంది. నేడు రెండు లిస్టింగులు రత్నవీర్ ప్రెసిíÙన్ ఇంజరీంగ్, రిషిభ్ ఇన్‌్రసూ్టమెంట్ ఐపీఓలు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్టుకానున్నా యి. ఈఎంఎస్ ఐపీఓ మంగళవారం ముగిస్తుంది. ఆర్ఆర్ కేబుల్, షమీ హోటల్స్ పబ్లిక్ ఇష్యూలు బుధ, గురువారాల్లో ప్రారంభం కానున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు వరుస ఆరు నెలల్లో భారత ఈక్విటీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌లో అమ్మకాలను మొదలుపెట్టారు. ఈ నెలలో ఇప్పటివరకు రూ. 4,200 కోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు. అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ పెరగడం, డాలర్ విలువ పుంజుకోవడం, అంతర్జాతీయ ఆర్థికవృద్ధిపై ఆందోళనల నేపథ్యంలో ఎఫ్ఐఐలు నిధుల ఉపసంహరణకు మొగ్గు చూపారని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరో వారం, రెండు వారాల పాటు ఎఫ్ఐల నిధుల ఉపసంహరణ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత నెలలో ఎఫ్ఐఐలు నాలుగు నెలల కనిష్టంతో రూ. 12,262 కోట్ల విలువైన నిధులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు భారత మార్కెట్లలో రూ. 1.74 లక్షల కోట్ల నిధులను పెట్టుబడి పెట్టారు. -
రష్యా నుంచి చమురు దిగుమతులు డౌన్
న్యూఢిల్లీ: వర్షాకాలంలో డిమాండ్ తగ్గిన నేపథ్యంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు గణనీయంగా తగ్గాయి. ఆగస్టులో 7 నెలల కనిష్టానికి పడిపోయాయి. ఇంధనాల కార్గో ట్రాకింగ్ సంస్థ వర్టెక్సా గణాంకాల ప్రకారం రష్యా నుంచి భారత్ గత నెలలో రోజుకు 1.46 మిలియన్ బ్యారెళ్ల (బీపీడీ) క్రూడాయిల్ దిగుమతి చేసుకుంది. ఇది అంతక్రితం నెలలో రోజుకు 1.91 బీపీడీగా నమోదైంది. రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు తగ్గడం ఇది వరుసగా మూడో నెల. ఇతర దేశాల నుంచి కూడా భారత్ చమురు దిగుమతులను తగ్గించుకుంది. ఇరాక్ క్రూడ్‌ను 8,91,000 బీపీడీ నుంచి 8,66,000 బీపీడీకి, యూఏఈ ఆయిల్‌ను 2,90,000 బీపీడీ నుంచి 2,73,000 బీపీడీకి, అమెరికా క్రూడ్‌ను 2,19,000 బీపీడీ నుంచి 1,60,000 బీపీడీకి తగ్గించుకుంది. అయితే, సౌదీ అరేబియా నుంచి మాత్రం పెంచుకుంది. జులైలో సౌదీ అరేబియా నుంచి క్రూడాయిల్ దిగుమతులు జులైలో 4,84,000 బీపీడీగా ఉండగా ఆగస్టులో 8,20,000 బీపీడీకి పెరిగాయి. ‘పలు రిఫైనింగ్ సంస్థలు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ప్లాంట్ల మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నాయి. దీంతో క్రూడాయిల్ దిగుమతులు తగ్గే అవకాశం ఉంది. అయితే క్యూ4లో పండుగ సీజన్ వల్ల దేశీయంగా డిమాండ్ పెరిగితే ముడి చమురు దిగుమతులు పుంజుకోగలవు‘ అని వర్టెక్సా అనాలిసిస్ హెడ్ (ఆసియా పసిఫిక్) సెరెనా హువాంగ్ తెలిపారు. గతేడాది ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, భారత్‌కు మార్కెట్ రేటు కన్నా చౌకగా క్రూడాయిల్‌ను రష్యా ఆఫర్ చేసింది. అప్పటివరకు భారత్ దిగుమతి చేసుకునే మొత్తం క్రూడాయిల్ వాటా 2 శాతం లోపే ఉండేది. ఆ తర్వాత పరిణామాలతో ఇది ఏకంగా 33 శాతానికి ఎగిసింది. -
ముడిచమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపైన, డీజిల్ ఎగుమతులపైన కేంద్రం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచింది. దీనితో క్రూడాయిల్‌పై ట్యాక్స్ టన్నుకు రూ. 7,100 మేర పెరిగింది. అలాగే, డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (ఎస్ఏఈడీ) లీటరుకు రూ. 1 చొప్పున కేంద్రం పెంచింది. దీంతో ఇది లీటరుకు రూ. 5.50కి చేరింది. అటు విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై కూడా లీటరుకు రూ. 2 చొప్పున సుంకం విధించింది. ఇప్పటి వరకు ఏటీఎఫ్‌పై ఎస్ఏఈడీ లేదు. తాజా మార్పులు ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది. క్రూడ్ రేట్ల కారణంగా చమురు కంపెనీలు అసాధారణంగా ఆర్జిస్తున్న లాభాలపై కేంద్రం 2022 జూలై 1 నుంచి విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధిస్తోంది. -
ముడి చమురు, సహజ వాయువు బ్లాక్‌ల వేలం.. ఓన్జీసీ,రిలయన్స్ పోటీ
న్యూఢిల్లీ: తాజా విడత ముడి చమురు, సహజ వాయువు బ్లాక్‌ల వేలంలో ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్సార్షియం, ఆయిల్ ఇండియా, సన్ పెట్రోకెమికల్స్ మొదలైన అయిదు సంస్థలు పాల్గొన్నాయి. 10 బ్లాక్‌లకు సంబంధించి 13 బిడ్లు దాఖలు చేశాయి. అయితే, ఎక్సాన్‌మొబిల్, షెవ్రాన్, టోటల్ఎనర్జీస్ వంటి విదేశీ దిగ్గజాలు మాత్రం వేలానికి దూరంగా ఉన్నాయి. చమురు, గ్యాస్ రంగ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) ఈ వివరాలు వెల్లడించింది. ఓపెన్ ఎక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్‌పీ) ప్రకారం కేంద్రం గతేడాది జూలైలో ఎనిమిదో విడత కింద 10 బ్లాకులను వేలానికి ఉంచింది. డెడ్‌లైన్‌ను పలుమార్లు పొడిగించిన తర్వాత మొత్తానికి గత వారం బిడ్డింగ్ ముగిసింది. డీజీహెచ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఏడు బ్లాకులకు ఒక్కోటి చొప్పున, మిగతా మూడు బ్లాకులకు రెండు చొప్పున బిడ్లు వచ్చాయి. ఆరు బ్లాకుల్లో ఏకైక బిడ్డరుగా నిల్చిన ఓఎన్జీసీ మొత్తం మీద పదింటిలో తొమ్మిది బ్లాకులకు బిడ్ చేసింది. రిలయన్స్–బీపీ బిడ్ చేసిన కేజీ బేసిన్ బ్లాకు కోసం పోటీపడలేదు. మరోవైపు, వేదాంత, ఆయిల్, సన్ పెట్రోకెమికల్స్ తలో బ్లాక్ కోసం బిడ్ చేసి ఓఎన్జీసీకి పోటీదార్లుగా నిల్చాయి. చమురు, గ్యాస్ నిక్షేపాలు మరింతగా అందుబాటులోకి వస్తే 157 బిలియన్ డాలర్ల చమురు దిగుమతుల భారం తగ్గుతుందని కేంద్రం ఆశిస్తోంది. ఇంధన నిల్వలకు అవకాశమున్న ప్రాంతాలను అన్వేషణ కోసం వేలం వేస్తోంది. ఈ క్రమంలోనే 2016లో కేంద్రం ఓఏఎల్‌పీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకూ 144 బ్లాక్‌లను వేలంలో కేటాయించింది. ఇవి 2.44 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్నాయి. -
మళ్లీ ‘విండ్‌ఫాల్’ బాదుడు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను ప్రభుత్వం తిరిగి విధించింది. తాజా ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం... ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ.6,400 విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధించడం జరిగింది. బుధవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఏప్రిల్ 4న జరిగిన గత చివరి సమీక్షలో దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నును పూర్తిగా (జీరో స్థాయి) తొలగించడం జరిగింది. అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్‌కు 75 డాలర్లకంటే తక్కువకు పడిపోవడం దీని నేపథ్యం. అయితే ఉత్పత్తిదారుల ఒపెక్ గ్రూప్, రష్యా వంటి దాని మిత్రపక్షాలు అనూహ్యంగా ప్రకటించిన ఉత్పత్తి ‘కోత’ నిర్ణయంతో చమురు ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. దీనితో తిరిగి విండ్‌ఫాల్ ట్యాక్స్ విధిస్తూ, ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై జీరో.. కాగా, డీజిల్ ఎగుమతిపై విధించే లెవీని మాత్రం పూర్తిగా తొలగించింది. ఇప్పటి వరకూ లీటర్‌కు ఈ పన్ను 0.50గా అమలవుతోంది. విమాన ఇంధనం ఏటీఎఫ్ ఎగుమతులపై కూడా జీరో పన్ను విధానం కొనసాగుతోంది. భారత్ 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. చమురు ఉత్పత్తిదారులు ప్రతి బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే ఎక్కువ ధరను పొందే సందర్భంలో వారు పొందే విండ్‌ఫాల్ లాభాలపై ప్రభుత్వం పన్ను విధింపు దీని లక్ష్యం. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. దేశీయ చమురు అన్వేషణకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఈ పన్నును రద్దు చేయాలని ఫిక్కీ వంటి పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతులపై విధించిన ఈ ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ) వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఖజానాకు దాదాపు రూ.40,000 కోట్ల ఆదాయం లభించింది. దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ ద్వారా 2023–24లో దాదాపు రూ.15,000 కోట్ల ఆదాయం వస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. -
ఆన్‌షోర్..ఆఫ్‌షోర్..ఎనీవేర్‌తో చమురు దోపిడీలకు చెక్
కాకినాడ క్రైం: ఆన్‌షోర్, ఆఫ్‌షోర్, ఎనీవేర్... ఇదీ చమురు దోపిడీలను నిలువరించేందుకు భద్రతా వ్యవస్థలు అనుసరిస్తున్న తాజా విధానం. సముద్ర ఉపరితలంపై కోస్టుగార్డు, తీర ప్రాంతాల్లో పోలీస్, ఎస్పీఎఫ్, మైరెన్ పోలీస్ తమ భద్రతా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. సముద్ర భద్రత అంటే కోస్టుగార్డుకే పరిమితం అన్న స్థితిని దాటి తీర ప్రాంతాన్ని కూడా జల్లెడ పట్టి, జలాల్లో నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ తన అనుబంధ శాఖలతో కలిసి సమాయత్తమైంది. సముద్ర దొంగతనాలంటే సాధారణంగా చమురు కేంద్రంగా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థనే శాసించే ప్రభావం ఉన్న చమురు ఉత్పత్తి నుంచి తరలింపు వరకు ప్రతి దశలోనూ పూర్తి స్థాయి భద్రత కల్పించేందుకు పేర్కొన్న వ్యవస్థలన్నీ ప్రత్యేక ప్రణాళికలతో శ్రమిస్తున్నాయి. ఆ వ్యూహాలను ప్రతిబింబించేలా కీలక సమావేశాలు, కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాయి. ఈ ప్రక్రియలో భాగంగానే గురువారం వరకూ చేపట్టిన మాక్‌డ్రిల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ముగిసిన సముద్ర జలశుద్ధి ప్రక్రియ కాకినాడ తీరంలో అబ్బురపరిచే సముద్ర జల శుద్ది మూడు రోజుల ప్రక్రియ ముగిసింది. ఇండియన్ కోస్టు గార్డు ఆధ్వర్యంలో కాకినాడ స్టేషన్ పరిధిలో యుద్ద ప్రదర్శనను తలపించే రీతిలో రీజినల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ పేరుతో భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. కాకినాడ కోస్టుగార్డు స్టేషన్ కమాండెంట్ ఆఫీసర్ జి.వేణుమాధవ్ సారథ్యంలో భారీ స్థాయిలో చేపట్టిన ఈ మాక్ డ్రిల్ సముద్ర జలాల్లో చమురు తెట్లను తొలగించే ప్రక్రియతో పాటు భద్రతా పరమైన అంశాలకు నిర్వహణకు ఓ ట్రయల్‌గా అధికారులు తెలిపారు. అటు పోలీస్‌శాఖ... కోస్ట్‌గార్డుతో సహా అటు పోలీస్‌శాఖ సముద్ర తీరప్రాంత అనుబంధంగా జరిగే చమురు దోపిడీలపై దృష్టి సారించింది. ఏకంగా రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో సముద్ర తీర ప్రాంతాలు హద్దులుగా ఉన్న అన్ని జిల్లాల ఎస్పీలతో ఇటీవల రాజమహేంద్రవరంలో ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో జిల్లాల వారీగా చమురు చోరీల గణాంకాలపై చర్చించారని కాకినాడ జిల్లా పోలీస్ వర్గాలు తెలిపాయి. దొంగిలించి, తరలించేందుకు దొంగలు అనుసరిస్తున్న విధానాలపై అవగాహన ఏర్పరుచుకున్నారు. పోలీస్ లేదా కోస్ట్‌గార్డు అడ్డుకుంటే ఎదుర్కోవడానికి వారు వినియోగించే ఆయుధాలు, అవి వారికి సమకూరుతున్న పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలో చమురు దొంగతనాలకు పాల్పడ్డ పాత నిందితుల కదలికలపై నిఘా ఉంచాలని డీజీపీ ఎస్పిలను ఆదేశించారు. ఆయన ఆదేశాలమేరకు ఎస్పిలు యంత్రాంగాన్ని సమాయత్తపరిచారు. చమురు లీకై తే... చమురు తరలించే రెండు ఓడలు ప్రమాదవశాత్తు లేదా దాడుల నేపథ్యంలో సముద్రంలో ఢీకొట్టుకుంటే లేదా లీకేజీలు ఏర్పడితే జరిగే నష్టం సముద్ర జీవుల పట్ల ప్రాణసంకటమని కమాండెంట్ వేణుమాధవ్ తెలిపారు. లీకై న చమురు ఆక్సిజన్‌ను నీటిలోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని అన్నారు. తద్వారా జీవాలు ప్రాణాలు కోల్పోతాయని తెలిపారు. చమురు నీటి నుంచి వేరు చేసే ప్రక్రియకు భారీ జల, వాయు మార్గ సంపత్తితో పాటు అధునాతన పరికర సామర్థ్యాన్ని కోస్టుగార్డు వినియోగించింది. 97 మంది అధికారులు సిబ్బంది మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు. వీరిలో 85 మంది సైలర్లు, 12 మంది అధికారులు ఉన్నారు. రెండు విధాలుగా శుద్ది... చోరీలు జరిగినపుడు, ప్రమాదవశాత్తూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు, లేదా మరే కారణం వల్లనైనా భారీ పడవల నుంచి సముద్రంలోకి నేరుగా చమురు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చమురు తెట్లు ఏర్పడ్డ సముద్ర జలాల శుద్ది ప్రక్రియను రెండు విధాలుగా చేపడతారు. ఆ రెండు విధానాలను మాక్ డ్రిల్‌లో ప్రదర్శించారు. చమురు తెట్టుకట్టిన ప్రాంతాన్ని చుట్టుముట్టి టీసీ–3 రసాయనాన్ని చల్లడం, ఈ క్రమంలో జరిగే రసాయనిక చర్య వల్ల ఆ చమురు సముద్రగర్భంలోకి చేరుతుంది. ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఆ వ్యర్థాన్ని తిరిగి సేకరిస్తారు. అంతకుముందు నీటిలో చమురు వ్యాప్తిని నిలువరించేందుకు ‘బూమ్’ను ప్రయోగించారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓడలు భారీ ట్యూబ్ వంటి ప్రత్యేక నిర్మాణంతో రూపొందించబడ్డ ఈ బూమ్‌ను చమురు తెట్టు చుట్టూ వృత్తాకారంగా ఏర్పాటు చేస్తాయి. అది దాటి తెట్టు వ్యాపించే ప్రసక్తే లేదు. ఇది కాక రెండవ విధానం భారీ బ్రష్ ద్వారా తెట్టును సేకరించడం. ఇది తక్కువ మొత్తంలో ఏర్పడ్డ చమురు తెట్లు తొలగించేందుకు అనుకూలం. ఈ రెండు ప్రక్రియలు జరుగుతున్నంత సేపూ నిశిత పరిశీలన, పర్యవేక్షణ కోసం ‘ఏరియల్ రెక్కీ’ నిర్వహించారు. అద్భుత పనితీరు... సముద్ర జలాల్లో అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవడంతో నేర నియంత్రణను సాకారం చేసే క్రమంలో అన్ని వేళల్లోనూ అప్రమత్తంగా ఉంటాం. మాక్‌డ్రిల్ పర్యావరణంపై మా బాధ్యత, చర్యలను ప్రతిబింబించే విధుల సమాహారం. ఈ ప్రదర్శన భారీ స్థాయిలో చేపట్టడంలో భద్రతా అంశాలను ప్రతిబింబించడం కూడా ఓ ఉద్దేశం. ఆ లక్ష్యంతోనే మాక్‌డ్రిల్‌కు గతంలో ఏనాడు వినియోగించని భారీ సంపత్తిని తీసుకొచ్చాం. అత్యంత సమర్థత ఉన్న సాంకేతికతనూ వినియోగించి ఎక్సర్సైజ్ నిర్వహించాం. ముఖ్యంగా చమురు దొంగతనాలను నిలువరించేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్దం చేసి అమలు చేస్తున్నాం– జి.వేణుమాధవ్, కమాండెంట్ ఆఫీసర్, కాకినాడ కోస్టుగార్డు స్టేషన్ చమురు చోరీల నివారణకు కార్యాచరణ చమురు చోరీల నివారణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం. రాష్ట్ర డీజీపీ ఆదేశాలు, డీఐజీ దిశానిర్దేశంలో ఈ చర్యలు కొనసాగుతున్నాయి. తాజా సమావేశంలో చమురు చోరీల నివారణ, భద్రత దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చమురు, గ్యాస్ సంస్థలకు భద్రత కల్పించడం, పైప్లైన్ల నుంచి పెట్రోలు, డీజిల్ దొంగిలిస్తున్న దొంగలను పట్టుకోవడం సంబంధిత దోపిడీలను అరికట్టడం ఇందులో కీలక అంశాలు. మైరెన్, కోస్ట్‌గార్డు పరస్పర సహకారంతో చమురు చోరీల నివారణ చర్యలకు సిద్దమయ్యాం. త్వరలో ప్రత్యేక కార్యాచరణ, బృంద నియామకాన్ని ప్రకటిస్తాం. – ఎస్.సతీష్‌కుమార్, ఎస్పి, కాకినాడ జిల్లా ప్రత్యేక భద్రత ఏర్పాటు సముద్రంలో చోరీలు ముఖ్యంగా చమురు దొంగతనాలు నిలువరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఆ దిశగా తీర ప్రాంత వాసులతో మమేకమవుతూ దొంగల కార్యకలాపాలు నిలువరించే ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. ఓఎన్జీసీ, రిలయన్స్ ఆయిల్ రిగ్‌ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ఫాస్ట్ ఇంటర్సెప్ట్ బోట్లు అందుబాటులో ఉన్నా నిపుపయోగంగా ఉండటం వల్ల మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవడంలో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఇప్పటికే విన్నవించాం. – సుమంత్, మైరెన్ సీఐ -
Imran Khan: మోదీ గ్రేట్! భారత్ లాగానే మాక్కూడా చీప్‌గా కావాలి
పాకిస్తాన్ మాజీ ప్రధాని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారతదేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. తాము కూడా భారత్‌లానే రష్యా నుంచి చౌకగా క్రూడ్ అయిల్ని పొందాలని కోరుకుంటున్నామని చెప్పారు. కానీ తన ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో కూలిపోవడంతో అలా చేయలేకపోయామని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. దురదృష్టవశాత్తు తన ప్రభుత్వం పడిపోవడంతోనే అది జరగలేదన్నారు. అదీగాక పాకిస్తాన్ ఎప్పుడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ తగ్గింపు రేటుతో రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందని, అలా తన దేశం కూడా కొనుగోలు చేయగలదా అంటూ విచారం వ్యక్తం చేశారు. పాశ్చాత్య ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తమ దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసే దిశగా రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్ ముందుకు వచ్చిందంటూ ఖాన్ ప్రశంసించారు. అంతేగాదు యూఎస్ నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయాలన్న భారత్ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్తాన్ పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ముసాదిక్ మాలిక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇస్లామాబాద్ రష్యాతో చౌక చమురు రవాణా ఒప్పందం ఖారారు చేసుకుందని, వచ్చే నెలలో మొదటి షిప్మెంట్ కార్గో ద్వారా పాకిస్తాన్‌కు చేరుకుంటుందని పేర్కొనడం గమనార్హం. We wanted to get cheap Russian crude oil just like India but that could not happen as unfortunately my govt fell due to no confidence motion, says former Pakistani PM Imran Khan pic.twitter.com/MRzYglzAPl — Sidhant Sibal (@sidhant) April 9, 2023 (చదవండి: పాక్ ప్రధాని ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తి..భద్రతపై విమర్శల వెల్లువ) -
2013లో లీటర్ పెట్రోల్ రూ.76.. ఇప్పుడేమో 110.. క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటోందని ఫైర్ అయ్యారు. ఈ దోపిడీకి అంతర్జాతీయ ముడిచమురు ధరలను బూచిగా చూపించి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందన్నారు. ఈమేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. '2013లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం 76 రూపాయలు. కానీ నేడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయినా.. అంటే 66 డాలర్లకు తగ్గినా, ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ కు 110 రూపాయలు ఉండడమే ఇందుకు నిదర్శనం. అందుకే దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోడీ నిర్ణయించిన చమురు ధరలేనని మనం గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. కేవలం ముడి చమురును ఒక బూచిగా చూపించి తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకు మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురులు ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా దేశంలో పెట్రోల్ ధరను అమాంతం పెంచుకుంటూ పోతున్నది. పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల దేశంలోని పేద, సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 45% పైగా పెట్రో ధరల పెంపు వల్ల సరుకు రవాణా భారమై, సామాన్యుడు కొనుగోలు చేసే ప్రతి సరుకు ధర భారీగా పెరిగింది. నిత్యావసర వస్తువులు, కూరగాయల నుంచి మొదలుకొని పప్పు ఉప్పు వరకు అన్ని రకాల ప్రాథమిక అవసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. భారీగా పెరిగిన డీజిల్ ధరల వలన ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచున చేరుతోంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల గత నలభై ఐదు సంవత్సరాలలో ఎప్పుడు లేనంత ద్రవ్యోల్భనం దేశాన్ని పట్టిపీడిస్తోంది. ఇన్నాళ్లు అంతర్జాతీయ ముడి చమురు ధరల ప్రస్తావన లేదా ఉక్రెయిన్- రష్యా యుద్ధం పేరు చెప్పి దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని మోడీ ప్రభుత్వం చేసింది. కానీ ఒకవైపు రష్యా నుంచి అత్యంత తక్కువ ధరకు చమురు దేశానికి భారీగా దిగుమతి చేసుకుంటున్నామని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు తక్కువ ధరకు ముడిచమురు అందుబాటులో ఉన్నా, ప్రజల జేబుల నుంచి పెట్రోల్ ధరల పేరుతో చేస్తున్న దోపిడీకి మాత్రం సమాధానం చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 35 వేల కోట్ల రూపాయల ముడిచమురు పొదుపు ప్రయోజనమంతా కేవలం ఒకటి రెండు ఆయిల్ కంపెనీలకే దక్కిందన్నది వాస్తవం. ఈ ధరల పెరుగుదల అంశం పార్లమెంటులో చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. అయితే దేశ ప్రజలు మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ పెట్రో దోపిడీని గమనిస్తున్నారు. పెరిగిన పెట్రోల ధరల తాలూకు దుష్పరిణామాలను అనుభవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే ఒక దోపిడీదారుగా మారి ప్రజల జేబులో నుంచి దోచుకుంటున్న పెట్రో భారం తగ్గాలంటే, భారతీయ జనతా పార్టీని వదిలించుకోవడమే ఏకైక మార్గం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ దోపిడీని ఆపాలి, లేకుంటే ప్రజల చేతిలో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు.' అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. చదవండి: రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్.. -
రష్యా క్రూడాయిల్‌పై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ముడి చమురు ఎక్కడ చౌకగా లభిస్తే అక్కడే కొనుగోలు చేసేందుకు ఒక సార్వభౌమ దేశంగా భారత్‌కు పూర్తి హక్కులు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. అందుకే రష్యా నుంచి చౌక క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. అదే గల్ఫ్ దేశాల నుంచి మరింతగా కొనుగోలు చేసి ఉంటే ధరలు భారీగా పెరిగిపోయి ఉండేవని మంత్రి చెప్పారు. రష్యా నుంచి భారత్ భారీగా ముడిచమురును కొనుగోలు చేయడంపై పాశ్చాత్య దేశాల్లో ’అసంతృప్తి’ ఏమీ లేదని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. (ఇదీ చదవండి: Techlayoffs: దేశీయ ఐటీ నిపుణులకు భారడిమాండ్) పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లను పక్కనపెట్టి రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘భారీ వినియోగదారుగా భారత్ అన్ని అవకాశాలనూ వినియోగించు కుంటోంది. సమీప భవిష్యత్తులోనూ ఇదే ధోరణి కొనసాగిస్తుంది. మనం రష్యా చమురును కొనుగోలు చేస్తుండటం వల్ల పాశ్చాత్య దేశాలేమీ అసంతృప్తిగా లేవు. ఎందుకంటే మనం రష్యా ఆయిల్‌ను కొనకపోతే గల్ఫ్ దేశాల నుంచి మరింతగా దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అప్పుడు క్రూడాయిల్ రేట్లు మరింతగా పెరిగిపోయేవి‘ అని ఆయన తెలిపారు. గతంలో 27 దేశాల నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయగా, ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో 39 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. (ఫ్లాగ్‌స్టార్ చేతికి సిగ్నేచర్ బ్యాంక్ డీల్ విలువ రూ. 22,300 కోట్లు ) గతేడాది మార్చి వరకూ భారత్‌కు రష్యా నుంచి చమురు దిగుమతులు 0.2 శాతంగానే ఉండేవి. పొరుగునే ఉన్న గల్ఫ్ దేశాలతో పోలిస్తే రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడమే ఇందుకు కారణం. అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో పరిస్థితులు మారి పోయాయి. రష్యా తమ క్రూడాయిల్‌ను మార్కెట్ రేటుకన్నా తక్కువకే భారత్‌కు విక్రయిస్తోంది. దీంతో ఇతర దేశాల ఒత్తిళ్లను పక్కన పెట్టి భారత్.. రష్యన్ ముడిచమురు వైపు మొగ్గు చూపుతోంది. -
రష్యా నుంచి భారీగా చమురు దిగుమతులు: కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రష్యా నుంచి చమురు దిగుమతులు భారీగా పెరిగిపోయాయి. 2022 ఏప్రిల్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు 11 నెలల్లో ఐదు రెట్లు పెరిగి 41.56 బిలియన్ డాలర్లకు (రూ.3.40 లక్షల కోట్లు) చేరినట్టు వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2021 - 2022 ఆర్థిక సంవత్సరంలో మన దేశ చమురు దిగుమతుల్లో రష్యా 18వ స్థానంలో ఉంది. ఆ ఏడాది 9.86 బిలియన్ డాలర్ల చమురు దిగుమతులు నమోదయ్యాయి. ఇప్పుడు చమురు దిగుమతుల్లో నాలుగో పెద్ద దేశంగా రష్యా నిలిచింది. జనవరిలో మన చమురు దిగుమతుల్లో 28 శాతం రష్యా నుంచే వచి్చంది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధానికి ముందు మన చమురు దిగుమతుల్లో 1 శాతం వాటానే కలిగిన రష్యా.. 2023 జనవరిలో 1.27 మిలియన్ బ్యారెళ్లతో (రోజువారీ) 28 శాతం వాటాను సొంతం చేసుకుంది. ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత భారత్ మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశంగా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులు తగ్గించుకున్నాయి. దీంతో మార్కెట్ రేటు కంటే తక్కువకే రష్యా భారత్‌కు చమురు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో రష్యా నుంచి మన దేశం పెద్ద ఎత్తున చమురు దిగుమతికి మొగ్గు చూపించింది. చైనా నుంచి పెరిగిన దిగుమతులు చైనా నుంచి దిగుమతులు 6.2 శాతం పెరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - ఫిబ్రవరి మధ్య 90.72 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. యూఏఈ నుంచి దిగుమతులు 21.5 శాతం పెరిగి 49 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అమెరికా నుంచి 19.5 శాతం అధికంగా 46 బిలియన్ డాలర్ల దిగుమతులు నమోదయ్యాయి. ఎగుమతుల పరంగా చూస్తే అమెరికా 17.5% తో భారత్‌కు అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. అమెరికాకు మన దేశం నుంచి ఈ 11 నెల ల్లో 71 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. యూఏఈకి సైతం ఎగుమతులు 28.63 బిలియన్ డాలర్లకు పెరిగాయి. చైనాకి మన దేశ ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న 19.81 బిలియన్ డాలర్ల ఉంచి 13.64 బిలియన్ డాలర్లకు తగ్గాయి. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ కోసం ఏడ్చేవాళ్లెవరు?
(ఎస్.రాజమహేంద్రారెడ్డి) : సరిగ్గా ఏడాది క్రితం యముని మహిషపు లోహపు గంటల గణగణలు విని ప్రపంచం యావత్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ గణగణలు దిక్కులు పిక్కటిల్లేలా భూగోళమంతా మారుమోగుతాయేమోనని ఆందోళన పడింది. రష్యా సమరనాదం ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేసి అనివార్యంగా ప్రపంచ దేశాలను రెండుగా చీల్చడం ఖాయమని పరిశీలకులూ భయంభయంగానే అంచనా వేశారు. మిత్ర దేశం బెలారస్ భుజం మీద ట్యాంకులను మోహరించి ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగింది. చిరుగాలికే వొణికిపోయే చిగురుటాకులా ఉక్రెయిన్ తలవంచడం ఖాయమనే అనుకున్నారంతా! యుద్ధమంటేనే చావులు కదా. మృతదేహాల ఎర్రటి తివాచీ మీద నుంచే విజయం నడిచో, పరుగెత్తో వస్తుంది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ, ప్రపంచం దృష్టంతా రణక్షేత్రంపైనే నిలిచింది. అయ్యో అన్నవాళ్లున్నారు, రెండు కన్నీటి చుక్కలతో జాలి పడ్డవారూ ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైరి పక్షాల వైపు నిలిచిన దేశాలు మాట సాయమో, మూట సాయమో, ఆయుధ సాయమో చేసి తమ వంతు పాత్రను పోషిస్తూనే ఉన్నాయి. తటస్థంగా ఉన్నవాళ్లూ ఉన్నారు. చమురు కోసమో, తిండిగింజల కోసమో రష్యాపై ఆధారపడ్డ దేశాలు ఇప్పుడెలా అని తల పట్టుకుని ఆలోచనలో పడ్డాయి. ఒకవైపు రష్యా వైఖరిని వ్యతిరేకిస్తూ మరోవైపు దిగుమతులను స్వాగతించడం ఎలాగన్నదే వాటిముందు నిలిచిన మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇండియాకు ఇవేమీ పట్టలేదు. ఉక్రెయిన్‌లో వైద్యవిద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకు రావడాన్నే యుద్ధం తొలినాళ్లలో లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే భారత్ తటస్థ ధోరణికే కట్టుబడింది. నెలలు గడిచి యేడాది పూర్తయ్యేసరికి రెండు దేశాలు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. మిగతా దేశాలు తమ సమస్యలను తమదైన రీతిలో, రష్యా మీద ఆధారపడాల్సిన అవసరం లేనంతగా పరిష్కరించుకున్నాయి. ఇప్పుడు యుద్ధం హాలీవుడ్ వార్ సినిమాయే.. ప్రాణ నష్టం గణాంకాలే! యుద్ధం కూడా రోజువారీ దినచర్యలా రొటీన్‌గా మారిపోయినప్పుడు ఒక్క కన్నీటి బొట్టయినా రాలుతుందా? అయినా ఉక్రెయిన్ కోసం ఏడ్చేవాళ్లెవరు? తండ్రినో, భర్తనో, కొడుకునో కోల్పోయిన అభాగ్యులు తప్ప! పక్కింటి గొడవ స్థాయికి... యుద్ధం తొలినాళ్లలో ఇకపై చమురెలా అన్నదే యూరప్‌ను వేధించిన ప్రశ్న. యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు తమ చమురు అవసరాల్లో దాదాపు 40 శాతం రష్యాపైనే ఆధారపడేవి. సహాయ నిరాకరణలో భాగంగా ఆ దిగుమతులను నిలిపివేయక తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో జర్మనీ నుంచి ఇటలీ దాకా, పోలండ్ దాకా తమ దిగుమతుల పాలసీని మార్చుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. అధిక ధరకు చము రును ఇతర దేశాల నుంచి కొనాల్సి వచ్చినా, పొదుపు మంత్రంవేసి కుదుటపడ్డాయి. ప్రత్యామ్నా య మార్గం దొరికే వరకు యుద్ధం తమ గుమ్మం ముందే కరాళ నృత్యం చేస్తోందన్నంతగా హడలిపోయి ఉక్రెయిన్ పట్ల కాస్త సానుభూతిని, కాసిన్ని కన్నీటి బొట్లను రాల్చిన ఈ దేశాలన్నీ ఒక్కసారిగా కుదుటపడి ఊపిరి పీల్చుకున్నాయి. ఇప్పుడు యుద్ధం ఈ దేశాలకు పక్కింటి గొడవే..! ఇక భారత్ విషయానికొస్తే నాటో దేశాల సహాయ నిరాకర ణతో లాభపడిందనే చెప్పాలి. బ్యారెళ్లలో మూలుగుతున్న చమురును ఏదో ఒక ధరకు అమ్మేయాలన్న వ్యాపార సూత్రాన్ని అనుసరించి రష్యా భారత్‌కు డిస్కౌంట్ ఇస్తానని ప్రతిపాదించింది. ఫలితంగా గత ఏడాది మార్చి 31 దాకా రష్యా చమురు ఎగుమతుల్లో కేవలం 0.2 శాతంగా ఉన్న భారత్ వాటా ఈ ఏడాది ఏకంగా 22 శాతానికి చేరింది! యుద్ధమంటే బాంబుల మోత, నేలకొరిగిన సైనికులు, ఉసురు కోల్పోయిన సామాన్య పౌరులు మాత్రమే కాదు, కొందరికి వ్యాపారం కూడా! భారత్‌కు చమురు లాభమైతే ఆయుధ తయారీ దేశాలకు వ్యాపార లాభం. యుద్ధమంటే ఆయుధ నష్టం కూడా. జర్మనీ, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, పోలండ్ లాంటి దేశాలు సరిగ్గా దీన్నే తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ఆయుధ ఉత్పత్తిని పెంచి, సొమ్ము చేసుకుంటున్నాయి. ఏడాది తిరిగేసరికి యుద్ధం చుట్టూ పరిస్థితులు ఇంతలా మారితే కదనరంగంలో పిట్టల్లా రాలుతున్న వారి గురించి ఎవరాలోచిస్తారు? ప్రాథమ్యాల జాబితాలో యుద్ధం ఇప్పుడు చిట్టచివరి స్థానానికి నెట్టివేతకు గురైంది. రణక్షేత్రంలోని వైరి పక్షాలకు తప్ప మిగతా దేశాలకు ఇప్పుడది కేవలం ఒక వార్త మాత్రమే! బావుకున్నదేమీ లేదు మిత్ర దేశాలు, శత్రు దేశాలు, తటస్థ దేశాలను, వాటి వైఖరులను పక్కన పెడితే వైరి పక్షాలైన రష్యా, ఉక్రెయిన్ కూడా బావుకున్నదేమీ లేదు. ప్రాణనష్టం, ఆయుధ నష్టాల్లో హెచ్చుతగ్గులే తప్ప రెండు దేశాలూ తమ పురోగతిని ఓ నలభై, యాభై ఏళ్ల వెనక్కు నెట్టేసుకున్నట్టే! శ్మశాన వాటికలా మొండి గోడలతో నిలిచిన ఉక్రెయిన్ మునుపటి స్థితికి చేరుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో యుద్ధం ముగిస్తే తప్ప అంచనా వేయలేం. యుద్ధం వల్ల పోగొట్టుకున్న పేరు ప్రతిష్టలను, కోల్పోయిన వీర సైనికులను రష్యా వెనక్కు తెచ్చుకోగలదా? ఏడాదైనా ఉక్రెయిన్‌పై పట్టు బిగించడంలో ఘోరంగా విఫలమైన రష్యా సైనిక శక్తి ప్రపంచం దృష్టిలో ప్రశ్నార్థకం కాలేదా? నియంత పోకడలతో రష్యాను జీవితాంతం ఏలాలన్న అధ్యక్షుడు పుతిన్ పేరు ప్రతిష్టలు యుద్ధంతో పాతాళానికి దిగజారలేదా? ఆయన తన రాజ్యకాంక్షను, తన అహాన్ని మాత్రమే తృప్తి పరచుకోగలిగారే తప్ప... ప్రపంచాన్ని కాదు, తన ప్రజలను కానే కాదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరిస్థితి కూడా పుతిన్‌కు భిన్నంగా ఏమీ లేదు. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినట్టు జెలెన్స్కీ హాస్య నటుడి నుంచి హీరో అయ్యారు. రష్యా క్షిపణి దాడుల్లో దేశం వల్లకాడులా మారుతున్నా జెలెన్స్కీపై మాత్రం పొగడ్తల వర్షం కురుస్తూనే ఉంది. ఆయన ఎక్కడికెళ్లినా రాచ మర్యాదలతో స్వాగతం పలుకుతున్నారు. సాహసివంటూ పొగుడుతున్నారు. దేశం నాశనమవుతోందని బాధ పడాలో, ఎగురుతున్న తన కీర్తిబావుటాను చూసి సంతోషించాలో జెలెన్స్కీకి అర్థం కావడం లేదు. బహుశా ఆయన త్రిశంకుస్వర్గంలో ఉండి ఉంటారు. కొసమెరుపు కదనరంగంలో గెలుపోటములు ఇప్పుడప్పుడే తేలే అవకాశమే లేదు. ఎవరిది పైచేయి అంటే చెప్పడం కూడా కష్టమే. స్థూలంగా చెప్పాలంటే రష్యా ఆక్రమించుకున్న భూభాగంలో 54 శాతాన్ని ఉక్రెయిన్ మళ్లీ తన అధీనంలోకి తెచ్చుకుంది. అన్ని రోజులూ ఒక్కరివి కాదంటారు కదా! ఒకరోజు రష్యాదైతే మరో రోజు ఉక్రెయిన్‌ది..అంతే! ఇప్పుడు ఈ యుద్ధం ప్రపంచానిది ఎంతమాత్రం కాదు, రష్యా–ఉక్రెయిన్లది మాత్రమే. కొనసాగించడంతో పాటు ముగించడం కూడా ఆ రెండు దేశాల చేతుల్లోనే ఉంది. అయినా ఈ యుద్ధాన్ని ఎవరు పట్టించుకుంటున్నారిప్పుడు? -
విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దు చేయండి
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ టాక్స్‌ను 2023–24 వార్షిక బడ్జెట్లో రద్దు చేయాలని కేంద్రానికి పరిశ్రమల వేదిక– ఫిక్కీ తన ప్రీ–బడ్జెట్ కోర్కెల మెమోరాండంలో విజ్ఞప్తి చేసింది. ఈ పన్ను విధింపు చమురు, గ్యాస్ అన్వేషణకు సంబంధించిన పెట్టుబడులకు ప్రతికూలమని తన సిఫారసుల్లో పేర్కొంది. భారతదేశం 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా అంతర్జాతీయంగా ధరల పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. తొలుత దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై టన్నుకు రూ.23,250 (బ్యారెల్‌కు 40 డాలర్లు) విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధింపు జరిగింది. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై కూడా కొత్త పన్ను అమలు జరుగుతోంది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. ఇంధన రంగానికి సంబంధించి ఫిక్కీ తాజా నివేదికలో ముఖ్యాంశాలు.. ► పెట్రోలియం క్రూడ్‌పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ని కూడా రద్దు చేయాలి. లేదా అసాధారణ చర్యగా కొంత కాలం లెవీని కొనసాగించాల్సిన అవసరం ఉన్నట్లయితే, ఆ రేటును యాడ్–వాల్రెమ్ లెవీగా మార్చాలి. ఇది 100 డాలర్లపైన పెరిగే క్రూడ్ ధరలో 20 శాతంగా ఉండాలి. ► రాయల్టీ (ఆన్‌షోర్ ఫీల్డ్‌లకు చమురు ధరలో 20%, ఆఫ్‌షోర్ ప్రాంతాలకు 10%) అలాగే చమురు పరిశ్రమ అభివృద్ధి (ఓఐడీ) సెస్ (చమురు ధరలో 20%) ఇప్పటికే భారం అనుకుంటే, విండ్‌ఫాల్ పన్ను ఈ భారాన్ని మరింత పెంచుతోంది. ► విండ్‌ఫాల్ టాక్స్ వాస్తవ ధరపై కాకుండా, టన్ను ఉత్పత్తిపై మదింపు జరుగుతోంది. దీనివల్ల ధరలు తగ్గినప్పుడు ఉత్పత్తిదారులను దెబ్బతీస్తోంది. ప్రపంచ ప్రమాణాలు పాటించాలి.. ప్రస్తుతం దేశీయ ముడి చమురు ఉత్పత్తిదారులపై దాదాపు 70% పన్ను విధిస్తున్నారు. ప్రపంచ ప్రమాణాల ప్రకారం, 35–40% పన్ను మాత్రమే విధించాలి. ఈ రంగంలో కీలక పెట్టుబడులకు ఇది పన్ను దోహదపడుతుంది. ఇంధన రంగానికి మద్దతు ఇవ్వడానికి, అస్థిర ప్రపంచ ముడి మార్కెట్ల నుండి దేశాన్ని రక్షించడానికి కీలకమైన విధాన సంస్కరణలు తెచ్చేందుకు ఈ బడ్జెట్ మంచి అవకాశం. – సునీల్ దుగ్గల్, వేదాంత గ్రూప్ సీఈఓ -
విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుతోపాటు, ఎగుమతి చేసే డీజిల్, విమానయాన ఇంధనం (ఏటీఎఫ్)పై విండ్‌ఫాల్ ప్రాఫిట్ (గుంపగుత్త లాభాలు) పన్నును కేంద్ర సర్కారు తగ్గించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మరింత దిగిరావడంతో అందుకు అనుగుణంగా పన్నులను తగ్గించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా తదితర సంస్థలు దేశీయంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ.2,100గా ఉన్న విండ్‌ఫాల్ ప్రాఫిట్ పన్ను రూ.1,900కు తగ్గింది. ఎగుమతి చేసే ప్రతి లీటర్ డీజిల్‌పై రూ.6.5గా ఉన్న పన్ను రూ.5కు తగ్గింది. ఏటీఎఫ్ లీటర్‌పై రూ. 4.5 నుంచి రూ.3.5కు తగ్గింది. కొత్త పన్ను రేట్లు ఈ నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో గతేడాది చమురు ధరలు భారీగా పెరిగిపోవడం తెలిసిందే. దీనివల్ల దేశీయంగా చమురు ఉత్పత్తి చేసే కంపెనీలకు అనూహ్య లాభాలు వచ్చిపడ్డాయి. ఇలా గుంపగుత్తగా వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తాన్ని ప్రభుత్వం తీసుకునేందుకు విండ్‌ఫాల్ ప్రాఫిట్ పన్నును 2022 జూలై నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. నిజానికి జనవరి 3నాటి సమీక్షలో విండ్‌ఫాల్ ప్రాఫిట్ పన్నును కేంద్రం పెంచింది. అప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో ఆ మేరకు తాజాగా ఉపశమనం కల్పించింది. అంతర్జాతీయ పరిణామాలు.. అంతర్జాతీయంగా చాలా దేశాలు విండ్‌ఫాల్ లాభా ల పన్నును అమల్లోకి తీసుకురావడం గమనార్హం. ఆరంభంలో కేంద్ర సర్కారు లీటర్ పెట్రోల్, ఏటీఎఫ్ ఎగుమతిపై రూ.6 చొప్పు,. లీటర్ డీజిల్ ఎగుమతిపై రూ.13 చొప్పున పన్ను విధించింది. దేశీయ ంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ. 23,250 పన్నును అమలు చేసింది. తదుపరి మొద టి సమీక్షలోనే పెట్రోల్‌పై ఈ పన్నును ఎత్తివేసింది. -
కేంద్ర మంత్రి జైశంకర్ దౌత్యం.. చమురు దిగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డులు!
గత డిసెంబర్ నెలలో రష్యా నుంచి భారత్ చమరు దిగుమతులు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. అంతేకాదు వరుసగా భారత్‌కు చమురు దిగుమతి చేస్తున్న ప్రధాన తొలి దేశంగా రష్యా నిలిచింది. దేశాల మధ్య జరిగే ఎగుమతులు- దిగుమతుల్ని ట్రాక్ చేసే సంస్థ వోర్టెక్సా ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. తొలిసారి గతేడాది డిసెంబర్ నెలలో రోజుకు 1 మిలియన్ బ్యారెల్స్ రష్యా భారత్‌కు సరఫరా చేయగా.. ఆ మొత్తం 1.19 మిలియన్ బీపీడీ (బ్యారెల్స్ పర్ డే)కి చేరినట్లు తెలుస్తోంది. పెరిగిపోతున్న దిగుమతి రష్యా నుంచి భారత్‌కు క్రూడాయిల్ దిగుమతులు నెలనెలా పెరిగిపోతున్నట్లు వోర్టెక్సా హైలెట్ చేసింది. అక్టోబర్ నెల మొత్తంలో మాస్కో (రష్యా రాజధాని) నుంచి 935,556 క్రూడాయిల్ బ్యారెల్స్ దిగుమతి చేయగా..నవంబర్ నెలలో 909,403 క్రూడాయిల్ బ్యారెల్స్ ఉన్నాయి. కాగా, గతంలో భారత్‌కు రష్యా 2022 జూన్ నెలలో అత్యధికంగా 942,694 బీపీడీలు దిగుమతి చేసింది. టాప్‌లో రష్యా ఇతర దేశాల నుంచి భారత్ సముద్ర మార్గానా ఆయిల్ బ్యారెల్స్‌ను దిగుమతి చేసుకుంటుంది. అయితే రవాణాపై ఈయూ, అమెరికా దేశాలు పరిమితులు విధించాయి. దీంతో భారత్ రష్యా నుంచి భారీ ఎత్తున ఆయిల్ బ్యారెల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆయిల్ దిగుమతుల్లో మూడో స్థానం పెట్రోల్, డీజిల్ వినియోగంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. అవసరాల దృష్ట్యా భారత్ 85 శాతం ఇతర దేశాల నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఆ క్రూడాయిల్‌ను శుద్ది చేసి పెట్రోల్, డీజిల్‌గా మార్చి అమ్మకాలు జరుపుతుంది. ఇతర దేశాల నుంచి బ్యారెల్స్ దిగుమతులు ఇక రష్యాతో పాటు ఇతర దేశాల నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు వోర్టెక్సా పేర్కొంది. గత డిసెంబర్ నెలలో ఇరాక్ నుంచి 803,228 బ్యారెల్స్, సౌదీ అరేబియా నుంచి 718,357 బ్యారెల్స్‌ను దిగుమతి చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (uae) అమెరికాను అధిగమించి భారత్‌కు క్రూడాయిల్‌ను సరఫరా చేసే నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించింది. డిసెంబర్లో 323,811 బ్యారెల్ చమురును భారత్‌కు విక్రయించింది. కానీ యూఎస్ నుంచి భారత్‌కు సరఫరా అయ్యే క్రూడాయిల్ తగ్గుతుంది. నవంబర్‌లో 405,525 బ్యారెల్స్ ఉండగా డిసెంబర్లో 322,015 బ్యారెల్స్‌కు చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఉక్రెయిన్‌పై రష్యా దాడిని పశ్చిమ దేశాలు వ్యతిరేకించాయి. మాస్కోతో వ్యాపార వ్యవహారాలకు దూరంగా ఉన్నాయి. భారత్ మాత్రం రష్యాతో సన్నిహితంగా ఉంటూ.. క్రూడాయిల్ దిగుమతుల్లో రికార్డులు నమోదు చేస్తోంది. ఉక్రెయిన్ దాడికి ముందు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్ మిడిల్ ఈస్ట్రన్ కంట్రీస్ నుంచి 60శాతం కంటే ఎక్కువగా క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోవగా, ఉత్తర అమెరికా నుంచి 14శాతం, పశ్చిమ ఆఫ్రికా నుంచి 12శాతం, లాటిన్ అమెరికా నుంచి 5శాతం, రష్యా నుంచి కేవలం 2శాతం మాత్రమే దిగుమతి చేసుకుంది.ఇప్పుడు రష్యా నుంచి దిగుమతులు చేసుకునే క్రూడాయిల్ బ్యారెళ్ల సంఖ్య రికార్డులు దాటుతున్నాయి. 60 డాలర్లు మాత్రమే జలమార్గాన సరఫరా అవుతున్న రష్యా చమురు ధరపై ఐరోపా సమాఖ్య పరిమితి విధించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కో బ్యారెల్ ధర ఇప్పుడు భారత్‌కు 60 డాలర్ల కంటే తక్కువకే దొరుకుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి భారత్ దిగుమతుల్ని మరింత పెంచిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జైశంకర్ దౌత్యం రష్యాకు భారత్ మద్దతు ఇచ్చే విషయంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ దౌత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఆ దేశంతో వ్యాపారం చేసేందుకు ఇతర దేశాలు వ్యతిరేకిస్తుంటే.. భారత్ మాత్రం గట్టిగా సమర్ధిస్తోంది. చమురు ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో అక్కడ నుంచి సరఫరా చేసుకోవాలని నిర్ణయించుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతుల వస్తున్న విమర్శల్ని జై శంకర్ తిప్పికొట్టారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ‘దయచేసి అర్థం చేసుకోండి. ఇది మనం ఒక దేశం నుండి చమురును కొనుగోలు చేయడం మాత్రమే కాదు. ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తాం. కానీ భారతీయ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మనకు అనువైన దేశాలతో ఒప్పందం చేసుకోవడం సరైన విధానం. ఇప్పుడు మనం అదే చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. -
ఆయిల్ పైప్ లైన్‌ను కట్ చేసిన దుండగులు.. పెట్రోల్ కోసం ఎగబడ్డ జనం
పాట్నా: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌కు చెందిన గువహటి-బరౌనీ పైప్‌లైన్‌ను బిహార్‌లో ధ్వంసం చేశారు దుండగులు. ఖగడియా జిల్లా బకియా గ్రామంలో పైప్‌ను కట్ చేసి ఆయిల్‌ను లీక్ చేశారు. దీంతో వేల లీటర్ల చమురు నేలపాలైంది. ఆయిల్ పైప్ లీకైన విషయం తెలియగానే సమీప గ్రామస్థులు వందల సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. చమురు కోసం ఎగబడ్డారు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.పైప్ లీకైన తర్వాత వేల లీటర్ల చమురు రోడ్డుపై, పొలాలపై పడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను మాత్రం ఇంకా గుర్తించలేదు. ఐఓసీ అధికారులు హుటాహుటిన పైప్ లీకైన ప్రదేశానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి తమ ఇంజనీర్లను పిలిపించి లీకేజీని రిపేర్ చేశారు. అయితే పైప్ ఎలా లీకైందనే విషయం ఐఓసీ ఇంజనీర్లకు మాత్రమే తెలిసి ఉండాలని పోలీసులు పేర్కొన్నారు. పొరపాటున ఇక్కడ ఏమైనా జరిగి ఉంటే పెను విపత్తు సంభవించి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. చివరకు.. -
ముడిచమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు.. జనవరి 3 నుంచి అమలు
దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురు, ఎగుమతి చేసే డీజిల్, ఏటీఎఫ్‌లపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్రం పెంచింది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను టన్నుకు రూ. 1,700 నుంచి రూ. 2,100కి పెంచింది. అలాగే ఎగుమతి చేసే డీజిల్‌పై లీటరుకు పన్నును రూ. 5 నుంచి రూ. 6.5కి, విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై లీటరుకు రూ. 1.5 నుంచి రూ. 4.5కి పెంచింది. కొత్త ట్యాక్స్ రేట్లు జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తదితర సంస్థలు దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఆయిల్ రేట్ల పెరుగుదలతో చమురు కంపెనీలకు ఆకస్మికంగా వచ్చే భారీ లాభాలపై విధిస్తున్న పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల బాటలోనే ఈ ఏడాది జూలై 1 నుంచి భారత్ కూడా దీన్ని అమలు చేయడం ప్రారంభించింది. ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు తగ్గడంతో డిసెంబర్ 16న చివరిసారిగా జరిపిన సమీక్షలో ట్యాక్స్ రేటును కొంత తగ్గించింది. పెట్రోల్ ఎగుమతులకు మాత్రం విండ్‌ఫాల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటోంది. చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి! -
ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాలను ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పరంగా తీవ్ర ఒడిదుడుకులు ఉంటున్నందున ఫ్లెక్స్ ఫ్యుయల్స్ (ఇంధన వినియోగ సౌలభ్యం ఉన్నవి), ఎలక్ట్రిక్ వాహనాలను (ఈ రవాణా/ఈవీ) ప్రోత్సహించాలని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సియామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. అధిక ఇంధన ధరలతో ఏవియేషన్ పరిశ్రమ కూడా సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ‘‘ఏటా చమురు ధరల్లో తీవ్ర అస్థిరతలు సమస్యలకు కారణమవుతున్నాయి. అందుకే నూరు శాతం ఫ్లెక్స్ ఫ్యూయల్స్‌కు మారాలి’’అని పేర్కొన్నారు. ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాలు అన్నవి ఒకటికి మించిన ఇంధనాలు, ఇంధన మిశ్రమాలతో నడిచేవి. పెట్రోల్‌లో ఇతర ఇంధనాలను కలిపినప్పుడు ఈ వాహనాలు ఎటువంటి సమస్యల్లేకుండా సులభంగా నడుస్తుంటాయి. ఇందుకు ఇంజన్ టెక్నాలజీ, ఇతర వ్యవస్థల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. దేశంలో వాయు కాలుష్యంలో 40 శాతం శిలాజ ఇంధనాల వినియోగం వల్లేనని మంత్రి గడ్కరీ చెప్పారు. చెత్త నుంచి సంపద సృష్టించే టెక్నాలజీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇథనాల్ తయారీని ప్రారంభించేందుకు ఎన్నో పరిశ్రమలను తాము ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఉపాధి కల్పనలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆటోమొబైల్ రంగాన్ని మంత్రి ఈ కార్యక్రమం వేదికగా అభినందించారు. ‘‘ఆటోమొబైల్ దేశంలో 4 కోట్ల మందికి ఉపాధినిస్తోంది. ప్రభుత్వానికి అధిక జీఎస్టీ రూపంలో ఆదాయాన్ని సమకూరుస్తోంది’’అని చెప్పారు. ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. చదవండి: లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు! -
బంపర్ ఆఫర్..ఆ క్రెడిట్ కార్డ్ ఉంటే 68 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఫ్రీ!
పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరలు ప్రజలపై భారంగా మారుతోంది. దీనికి తోడు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడంతో సామాన్యులు నెలవారీ బడ్జెట్లో పొదుపు మంత్రం పాటించక తప్పట్లేదు. అందుకే పైసలు ఆదా చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ అయిల్ సిటీ క్రెడిట్ కార్డ్ తన కస్టమర్లకు ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈ కార్డు వాడకం ద్వారా 68 లీటర్ల ఉచిత పెట్రోల్, డీజిల్ పొందవచ్చని తెలిపింది. ఇందుకోసం ఇండియన్ ఆయిల్‌తో ఒప్పందం చేసుకొని.. సిటీ బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డు తీసుకొచ్చింది. కాకపోతే ఈ ఉచిత పెట్రోల్, డీజిల్ పొందేందుకు కొన్ని షరతులు కూడా ఉంటాయని పేర్కొంది. 68 లీటర్ల ఇంధనం ఉచితం ఈ రోజుల్లో బైక్‌లు, కార్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీ నెలా ఇంధన బిల్లుకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే ఈ పైసలను పొదుపు చేయాలంటే ఇలా చేయండి. ఈ సారి ఇంధన బిల్లులకు ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డ్‌తో చెల్లించడం ద్వారా సంవత్సరానికి సుమారు రూ. 7వేల ఆదా చేయవచ్చు. ఎలా అంటే.. ఈ కార్డ్‌ని ఉపయోగించి పేమెంట్ చేయడం ద్వారా కస్టమర్లు దీని నుంచి రివార్డ్ పాయింట్లను (టర్బో పాయింట్లు) పొందగలరు. ఈ పాయింట్లను రీడీమ్ చేయడం ద్వారా కార్డుదారులు సంవత్సరానికి 68 లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్‌ని కొనుగోలు చేయవచ్చు. పాయింట్లు ఎలా వస్తాయ్ ► ఇండియన్ ఆయిల్ పంపుల వద్ద 1 శాతం ఇంధన సర్‌చార్జి మినహాయింపు. ► ఇండియన్ ఆయిల్ పంప్‌లలో ఖర్చు చేసే ప్రతి రూ. 150కి 4 టర్బో పాయింట్లను పొందండి. ► కార్డ్ ద్వారా గ్రోసరీలు, సూపర్ మార్కెట్లలో ఖర్చు చేసే రూ. 150కి 2 టర్బో పాయింట్లను పొందండి. ► కార్డ్ ద్వారా ఇతర కేటగిరీలో రూ.150 ఖర్చు చేస్తే 1 టర్బో పాయింట్‌ని పొందండి. అయితే ఈ టర్బో పాయింట్లకు.. ఇండియన్ ఆయిల్ బంకుల్లో మాత్రం ఎక్కువ ప్రయోజనాలు లభించనున్నాయి. ఎలా అంటారా.. బంకుల్లో ఒక టర్బో పాయింట్.. ఒక రూపాయితో సమానం కాగా, ఇదే విధంగా ఇండిగో, గోఐబిబో వంటి ఇతర వాటిలో ఒక టర్బో పాయింట్‌కు రూ. 25 పైసలు మాత్రమే లభిస్తాయి. బుక్‌మైషో, ఎయిర్టెల్, జియో, వొడాఫోన్, షాపర్స్ స్టాప్ వంటి ప్రదేశాల్లో ఒక టర్బో పాయింట్‌తో 30 పైసలు వస్తాయి. ఇలా ఏడాది మొత్తంలో ఈ కార్డు ఉపయోగించి జరిపే లావాదేవీలపై వచ్చే రివార్డులు, టర్బో పాయింట్లతో 68 లీటర్ల వరకు ఉచితంగా పెట్రోల్ లేదా డిజిల్ కానీ పొందవచ్చని సిటీ బ్యాంక్ వెల్లడించింది. చదవండి: హైదరాబాద్: ఫుల్ డిమాండ్.. అందులో స్టార్టప్‌ల ఏర్పాటు కోసం ఎగబడుతున్న సంస్థలు! -
సామాన్యులకు ఊరట.. ధరలు దిగొచ్చాయ్!
న్యూఢిల్లీ: వినియోగదారునిపై ధరల మంట కొంత తగ్గింది. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) శాంతించాయి. రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ట స్థాయి 6.77 శాతానికి దిగి రాగా, టోకు ద్రవ్యోల్బణం 19 నెలల కనిష్ట స్థాయి అయిన 8.39 శాతానికి అక్టోబర్‌లో క్షీణించింది. ఆహారం, ఇంధనం, వస్తు తయారీ ధరలు తగ్గడం ఇందుకు అనుకూలించింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం వరుసగా ఐదో నెలలోనూ తగ్గినట్టయింది. ముఖ్యంగా ఏడాదిన్నర విరామం తర్వాత ఒక అంకెకు దిగొచ్చింది. మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ఉత్పత్తులు, టెక్స్టైల్స్, తదితర ఉత్పత్తుల ధరలు తగ్గడం టోకు ద్రవ్యోల్బణం ఉపశమించడానికి అనుకూలించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. ఇప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట నియంత్రిత స్థాయి 6 శాతానికి పైనే ఉండడాన్ని గమనించాలి. దీన్ని బట్టి చూస్తుంటే తదుపరి సమీక్షలో రేట్ల పెంపు ఖాయమే అని తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్ నెలకు 7 శాతంలోపునకు దిగొస్తుందన్న ఆశాభావాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ గత శనివారం వ్యక్తం చేయడం గమనార్హం. ముఖ్యంగా గరిష్ట పరిమితి 6 శాతంపైన 9 నెలలపాటు చలిస్తుండడంతో, ఆర్బీఐ తన చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. రిటైల్ ధరలు ఇలా... ► సెప్టెంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 7.41 శాతంగా ఉండగా, అక్టోబర్‌లో 6.77 శాతంగా నమోదైంది. అంతకుముందు ఆగస్ట్ నెలలో 6.71 శాతంగా ఉండడం గమనార్హం. ► ఆర్బీఐ గరిష్ట పరిమితి 6 శాతానికి పైన రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం వరుసగా పదో నెలలోనూ (ఈ ఏడాది జనవరి నుంచి) జరిగింది. ► ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 8.6 శాతంగా ఉంటే, అక్టోబర్‌కు 7.01గా నమోదైంది. ► కూరగాయలకు సంబంధించి 7.7 శాతానికి దిగొచ్చింది. ► ఇంధన ద్రవ్యోల్బణం 9.93 శాతంగా ఉంది. ► డిసెంబర్ త్రైమాసికంలో 6.5 శాతం, మార్చి త్రైమాసికంలో 5.8 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఆర్బీఐ అంచనాగా ఉంది. టోకు ద్రవ్యోల్బణం – 8.39 శాతం ► ఆహారోత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం 11.03 శాతం నుంచి 8.33 శాతానికి తగ్గింది. ► కూరగాయలు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పండ్లు, గుడ్లు, మాంసం, చేపల టోకు ధరలు తగ్గాయి. సెప్టెంబర్‌లో కూరగాయలపై ద్రవ్యోల్బణం 39.66 శాతంగా ఉంటే, అక్టోబర్‌కు 17.61 శాతానికి తగ్గింది. ► వరి, గోధుమ, ఇతర ధాన్యాల ధరలు పెరిగాయి. ► నూనె గింజలకు సంబంధించి ద్రవ్యోల్బణం మైనస్ 5.36 శాతంగా, మినరల్స్‌కు సంబంధించి 3.86 శాతంగా ఉంది. ► ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 23.17 శాతానికి పరిమితం కాగా, తయారీ ఉత్పత్తులపై టోకు ద్రవ్యోల్బణం 4.42 శాతంగా ఉంది. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
కొత్త రికార్డుల దిశగా సాగొచ్చు
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే.., ఈ వారం దేశీయ స్టాక్ సూచీలు తాజా జీవితకాల గరిష్టానికి చేరే వీలుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. దేశీయంగా ద్రవ్యోల్బణ డేటా, అమెరికా మధ్యంతర ఎన్నికలు, విదేశీ పెట్టుబడులు కీలకమని చెబుతున్నారు. చివరి దశకు చేరుకున్న కార్పొరేట్ ఆర్థిక ఫలితాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 1097 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు చొప్పున ర్యాలీ చేశాయి. అమెరికా అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కన్నా తక్కువగా నమోదువడంతో ఇకపై ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. ‘‘గతేడాది(2021) అక్టోబర్ 19న సెన్సెక్స్ 62,245 వద్ద, నిఫ్టీ 18,604 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఈ వారాంతపు రోజున సెన్సెక్స్ జీవితకాల గరిష్టం ముగింపు(61,795) వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో ఏడాది గరిష్టాన్ని(18,362) తాకింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే సూచీలు జీవితకాల గరిష్టాన్ని అందుకోవచ్చు. ట్రేడర్లు మాత్రం అప్రమత్తంగా ఉండటం మంచిది. నిఫ్టీ 18,300 స్థాయిని నిలుపుకోలిగితే 18,600 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగితే డౌన్‌ట్రెండ్‌లో 18,000 –17,800, శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ అన్మోల్ దాస్ తెలిపారు. ► ద్రవ్యోల్బణ డేటా దృష్టి అమెరికా ద్రవ్యోల్బణ డేటా వెల్లడి తర్వాత మార్కెట్ వర్గాలు ఇప్పుడు దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి సారించాయి. డిసెంబర్ ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరికి మార్గదర్శకమైన సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం 7.4%గా నమోదైంది. ఈ అక్టోబర్‌లో ఏడుశాతంలోపే ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. . ► కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల అంకం చివరి దశకు చేరింది. ఈ వారంలో సుమారు 1,400కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ఓఎన్జీసీ, గ్రాసీం ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాల ప్రకటన(నేడు)తో నిఫ్టీ 50 ఇండెక్స్‌లో లిస్టయిన కంపెనీ త్రైమాసిక ఫలితాల వెల్లడి పూర్తి అవుతుంది. వీటితో పాటు బయోకాన్, భారత్ ఫోర్జ్, అపోలో టైర్స్, ఐఆర్సీటీసీ, స్పైస్‌జెట్‌లు, ఆర్తి ఇండస్ట్రీస్, అబాట్ ఇండియా, బాలకృష్ణ ఇండస్ట్రీస్, హుడ్కో, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, జ్యోతి ల్యాబ్స్, లక్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ► ప్రపంచ పరిణామాలు అమెరికా అధ్యక్షుడి రెండేళ్ల పాలనకు రెఫరెండంగా భావించిన మధ్యంతర ఎన్నికల ఫలితాలను ప్రపంచ మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. నేడు యూరో పారిశ్రామికోత్పత్తి డేటా, బ్రిటన్ నిరుద్యోగ రేటు మంగళవారం విడుదల అవుతాయి. అదే రో జున యూరోజోన్, జపాన్ జీడీపీ అంచనాలు వెల్లడికానున్నాయి. ఎల్లుండి(బుధవారం)బ్రిటన్ అక్టోబర్ ద్రవ్యోల్బణ డేటా విడుదల అవుతుంది. ఈ మరుసటి రోజు యూరో జోన్ ద్రవ్యోల్బణం, జపాన్ వా ణిజ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి. ఆర్థి క స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. ఎఫ్ఐఐలు వైఖరి ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధానపరమైన ఆందోళనలు తగ్గుముఖంపట్టడంతో దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. గతవారంలో రూ.6,300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఎఫ్ఐఐలు తమ బుల్లిష్ ధోరణిని కొనసాగిస్తే సూచీలు సులభంగా జీవితకాల గరిష్టాన్ని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. దిద్దుబాటు సమయంలో కొనుగోళ్లు చేపడుతూ మార్కెట్‌కు అండగా నిలిచే సంస్థాగత ఇన్వెస్టర్లు ఇటీవల అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ నవంబర్‌లో నికరంగా రూ.5600 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. -
చమురు సరఫరాలో రష్యా టాప్
న్యూఢిల్లీ: గత నెల(అక్టోబర్)లో భారత్‌కు అత్యధిక స్థాయిలో ముడిచమురును సరఫరా చేసిన దేశంగా రష్యా నిలిచింది. తద్వారా కొన్నేళ్లుగా గరిష్ట స్థాయిలో ముడిచమురు సరఫరా చేస్తున్న సౌదీ అరేబియా, ఇరాక్లను వెనక్కు నెట్టింది. ఇంధన కార్గో పరిశీలక సంస్థ వోర్టెక్సా అందించిన వివరాల ప్రకారం అక్టోబర్‌లో రష్యా చరిత్రలోనే అత్యధికంగా 9,33,556 బ్యారళ్ల చమురును ఇండియాకు రవాణా చేసింది. మార్చితో ముగిసిన గతేడాది(2021–22)లో దేశీ చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2 శాతం మాత్రమేకాగా.. తాజాగా ఈ వాటాను 22 శాతానికి పెంచుకోవడం గమనార్హం! దీంతో మొత్తం దేశీ చమురు దిగుమతుల్లో ఇరాక్ వాటా 20.5 శాతానికి, సౌదీ అరేబియా వాటా 16 శాతానికి పరిమితమయ్యాయి. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం విదితమే. దీంతో డిస్కౌంట్ ధరలో చమురు సరఫరాలకు రష్యా సిద్ధపడింది. ఇది భారత్‌కు రష్యా నుంచి చమురు సరఫరాలు పెరిగేందుకు కారణమైంది. అయితే భారత్ గతంలో అంటే 2021 డిసెంబర్లో రష్యా నుంచి రోజుకి 36,255 బ్యారళ్లను దిగుమతి చేసుకోగా.. ఇరాక్ నుంచి 1.05 మిలియన్ బ్యారళ్లు, సౌదీ అరేబియా నుంచి 9,52,665 బ్యారళ్లు అందుకుంది. ఆపై రష్యా నుంచి నెమ్మదిగా దిగుమతులు పెరుగుతూ వచ్చాయి. -
తగ్గేదేలే! భారత్‌కు చమురు సరఫరాలో రష్యానే టాప్
భారత్‌కు ముడి చమురు సరఫరా చేయటంలో సౌదీ అరేబియా, ఇరాక్లను వెనక్కి నెట్టింది రష్యా. ఈ ఏడాది అక్టోబరులో అత్యధిక చమురు సరఫరా చేసిన దేశంగా నిలిచింది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2 శాతం. అదే ఈ ఏడాది అక్టోబరులో రోజుకు 9,35,556 పీపాల చమురును దిగుమతి చేసుకోవడం గమనార్హం. దీంతో దేశ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 22 శాతానికి చేరింది. మరోవైపు.. ఇరాక్ నుంచి 20.5 శాతం, సౌదీ అరేబియా నుంచి 16 శాతం మాత్రమే ముడి చమురును దిగుమతి చేసుకుంది భారత్. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టిన తర్వాత మాస్కో నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతి గణనీయంగా పెరిగింది. పశ్చిమ దేశాలు రష్యా చమురు ఎగమతులపై ఆంక్షలు విధించడంతో రాయితీ ధరకు విక్రయించేందుకు ముందుకొచ్చింది మాస్కో. అందిపుచ్చుకున్న భారత్ భారీ ఎత్తున దిగమతులను పెంచుకుంది. డిసెంబరు 2021లో రష్యా నుంచి భారత్‌కు రోజుకి 36,255 పీపాల చమురు మాత్రమే వచ్చింది. అదే ఇరాక్ నుంచి 1.05 మిలియన్లు, సౌదీ అరేబియా 9,52,625 బ్యారెళ్ల చమురు దిగుమతి జరిగింది. ఈ ఏడాది మార్చిలో రష్యా నుంచి భారత్‌కు రోజుకు 68,600 పీపాల ముడి చమురు రాగా.. మే నెలలో అది 2,66,617 పీపాలకు పెరిగింది. జూన్ నాటికి గరిష్ఠంగా 9,42,694కు చేరింది. మరోవైపు.. ఆ నెలలో రోజుకు 1.04 మిలియన్ బీపీడీలతో ఇరాక్ అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. రష్యా రెండో స్థానానికి చేరింది. ఇదీ చదవండి: చుక్కలనంటుతున్న అద్దెలు, కట్టలేక ఖాళీ చేస్తున్న జనాలు -
ముడిచమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురు, డీజిల్ .. ఏటీఎఫ్ ఎగుమతులపై కేంద్రం విండ్‌ఫాల్ ట్యాక్స్ ను పెంచింది. క్రూడాయిల్‌పై టన్నుకు రూ. 8,000గా ఉన్న సుంకాన్ని రూ. 11,000కు పెంచింది. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ. 5 నుంచి రూ. 12కు పెంచింది. ఈ నెల ప్రారంభంలో దాదాపు సున్నా స్థాయికి దిగి వచ్చిన ఏటీఎఫ్ (విమాన ఇంధనం)పై తిరిగి సుంకాలు విధించింది. లీటరుకు రూ. 3.50 మేర నిర్ణయించింది. అంతర్జాతీయంగా చమురు రేట్లు భారీగా పెరగడం వల్ల వివిధ ఇంధనాలపై ఆయిల్ కంపెనీలకు వచ్చే అసాధారణ లాభాల మీద విధించే సుంకాలను విండ్‌ఫాల్ ట్యాక్స్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల బాటలో దేశీయంగా జూలై 1న కేంద్రం వీటిని విధించింది. ఆ తర్వాత ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్‌లో రెండు విడతల్లో వాటిని తగ్గించింది. దేశీ క్రూడాయిల్‌పై పన్నులతో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, వేదాంత వంటి సంస్థలపై ప్రభావం పడనుంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ రిఫైనింగ్ కంపెనీలు.. డీజిల్, ఏటీఎఫ్ మొదలైన ఇంధనాలను ఎగుమతి చేస్తున్నాయి. చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో! -
అమెరికా చెప్పినా వినలేదు.. అందుకే రూ.35వేల కోట్లు లాభం వచ్చింది!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ రష్యా వివాదం భారత్‌కు బాగానే కలిసొచ్చింది. యుద్ధ పరిణామాల కారణంగా రష్యా డిస్కౌంట్లతో కూడిన చమురును సరఫరా చేయడంతో భారత్ ఖజానాకు రూ.35వేల కోట్లు లాభం వచ్చింది. దేశీయ క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించడంతో పాటు తగ్గింపుతో ముడి చమురు దిగుమతి చేసుకోవడం వల్ల ఈ మొత్తం సమకూరింది. ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ వివాదం తర్వాత ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం విండ్‌ఫాల్ పన్నును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఎవరు చెప్పినా వినలే.. అందుకే లాభం వచ్చింది! ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా పై అగ్రరాజ్యంతో పాటు యూరోప్ దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ సమస్యకు పరిష్యారంగా రష్యా భారత్‌తో తనకున్న సత్సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ముడి చమురుని భారీ డిస్కౌంట్లతో సరఫరా చేసింది. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా రష్యా నుంచి భారత అధికంగా ముడి చమురు దిగుమతి చేసుకుంది. మరో వైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయద్దని అగ్రరాజ్యంతో పాటు పలు అభివృద్ధి చెందిన దేశాల నుంచి భారత్‌కు విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా ముడి చమురును దిగుమతి చేసుకుంది. తద్వారా భారత్‌కు రూ.35వేల కోట్లు లాభాం చేకూరింది. యుద్ధానికి ముందుగా మన దేశ ఆయిల్ వాటాలో రష్యా వాటా 1 శాతం ఉండగా, ఇప్పుడది 12 శాతానికి చేరడం విశేషం. చదవండి: లక్కీ బాయ్.. 5 నిమిషాల వీడియో పంపి, రూ.38 లక్షల రివార్డ్ అందుకున్నాడు! -
విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌పై సమీక్ష అవసరం
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధింపును సమీక్షించాలని చమురు మంత్రిత్వ శాఖ కోరుతోంది. చమురు అన్వేషణ, గుర్తింపు, ఉత్పత్తికి సంబంధించిన కాంట్రాక్టుల్లో ఆర్థిక స్థిరత్వ సూత్రానికి రెండున్నర నెలల క్రితం ప్రవేశపెట్టిన ఈ పన్ను విధింపు విరుద్ధమని ఆర్థికశాఖకు ఆగస్టు 12న రాసిన ఒక లేఖలో చమురు మంత్రిత్వశాఖ అభిప్రాయపడిన విషయం తాజాగా వెల్లడైంది. చమురు మంత్రిత్వశాఖ లేఖ ప్రకారం.. ► ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్ (పీఎస్సీ), రెవెన్యూ షేరింగ్ కాంట్రాక్ట్ (ఆర్ఎస్సీ) కింద వేలంలో కంపెనీలకు లభించిన ఫీల్డ్‌లు లేదా బ్లాక్‌లకు కొత్త లెవీ నుండి మినహాయింపు ఇవ్వాలి. ► 1990ల నుండి కంపెనీలకు వివిధ కాంట్రాక్టు విధానాలలో చమురు, సహజవాయువు అన్వేషణ, ఉత్పత్తి కోసం బ్లాక్‌లు లేదా ప్రాంతాలను కేటాయించడం జరుగుతోంది. ఇందుకు సంబంధించి రాయల్టీ అలాగే సెస్ విధింపు జరుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన లాభాల శాతాన్ని కూడా పొందుతోంది. ► ఆయా కాంట్రాక్టుల విషయంలో లాభాలు పెరుగుతుంటే, ప్రభుత్వానికి కూడా అధిక లాభాల వాటా బదిలీ అయ్యే విధంగా అంతర్నిర్మిత యంత్రాంగ ప్రక్రియ అమలవుతోంది. ► ఇలాంటి పరిస్థితిలో దేశీయంగా ఉత్పత్తయిన ముడి చమురకు సంబంధించి కంపెనీలు అన్నింటినీ ఒకేగాటన కడుతూ, తిరిగి విండ్‌ఫాల్ ట్యాక్స్ విధింపు ఎంతమాత్రం సరికాదు లభించని శాఖల స్పందన.. కాగా, ఈ లేఖపై స్పందించాల్సిందిగా అటు చమురు మంత్రిత్వశాఖకు ఇటు ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపిన ఈమెయిల్స్‌కు ఎటువంటి స్పందనా రాలేదు. విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ అంటే.. జూలై 1 నుంచి దేశంలో విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధింపు అమల్లోకి వచ్చింది. కంపెనీలు ప్రత్యేకంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల పొందే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు, ఏటీఎఫ్సహా ఇంధనాల ఎగుమతులపై విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రెండు వారాలకో సారి (15 రోజులకు) ప్రభుత్వం సమీక్షిస్తూ, తగిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. విదేశీ మారకం రేట్లు, అంతర్జాతీయంగా చమురు ధరలను బట్టి పక్షం రోజులకు ఒకసారి దీనిపై నిర్ణయం జరుగుతోంది. -
డీజిల్, ఏటీఫ్ ఎగుమతులపై మరోసారి విండ్‌ఫాల్ టాక్స్ షాక్
న్యూఢిల్లీ: డీజిల్, జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించింది. వీటి ఎగుమతులపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం అర్థరాత్రి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. డీజిల్ ఎగుమతిపై విండ్ ఫాల్ టాక్స్‌ను లీటరుకు రూ.7 నుంచి రూ.13.5కు పెంచుతూ సర్కార్ నిర్ణయించింది. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై పన్నును లీటరుకు రూ.2 నుంచి రూ.9 కి పెంచింది. దీంతోపాటు దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్ను టన్నుకు రూ.13,000 నుంచి రూ.13,300కి పెరిగింది. మార్జిన్ల పెరుగుదలకు అనుగుణంగా ఎగుమతులపై పన్నును పెంచారు. అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్‌లలో మార్పులు, ఒపెక్, దాని మిత్రదేశాల అంచనా ఉత్పత్తి తగ్గింపునకు అనుగుణంగా దేశీయంగా ఉత్పత్తయ్యే చమురుపై కూడా లెవీని పెంచింది. (షాకింగ్ రిపోర్ట్: వదల బొమ్మాళీ అంటున్న ఎలాన్ మస్క్) ఇది చదవండి: SC On Check Bounce Case: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు కాగా దేశంలో మొదటిసారిగా జూలై 1న విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌లను విధించిందిప్రభుత్వం. పెట్రోల్, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 6 ఎగుమతి సుంకం విధించి. ఆ తరువాత జూలై 1న డీజిల్ ఎగుమతిపై రూ. 13 పన్ను విధించింది.జూలై 20న జరిగిన మొదటి పక్షంవారీ సమీక్షలో, పెట్రోల్‌పై లీటర్‌కు రూ.6 ఎగుమతి సుంకం రద్దు చేయడంతోపాటు, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతిపై లీటరుకు రూ. 2 చొప్పున టాక్స్ తగ్గించింది. అలాగే దేశీయంగా ఉత్పత్తి అయ్యే క్రూడ్‌పై పన్నును టన్నుకు రూ.17వేలకు తగ్గించింది. మళ్లీ ఆగస్టు 2న డీజిల్, ఎటీఎఫ్ ఎగుమతులపై పన్ను తగ్గించింది. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు స్వల్పంగా పెరగడంతో దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై లెవీని టన్నుకు రూ.17,750కి పెంచింది. తదనంతరం, ఆగస్టు 19న, మూడవ పక్షంవారీ సమీక్షలో, డీజిల్‌పై ఎగుమతి పన్ను రూ. 7కు పెంచి,ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 2ల పన్ను పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. -
ముడిచమురు ధర తగ్గినా పెట్రో ధరలు తగ్గించరా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర వంద డాలర్లకు దిగువన ఉన్నా.. ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ధరలు తగ్గించడం ద్వారా దేశ ప్రజలకు ఉపశమనం కలిగించకుండా, ఎక్సైజ్ సుంకాలు, సెస్సులను కేంద్రం భారీగా పెంచుతోందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. పెట్రో ఉత్పత్తులపై పన్నులు, సెస్సుల రూపంలో జనం నుంచి దోచుకున్న రూ.26 లక్షల కోట్లను కార్పొరేట్ పెద్దల రుణాలు మాఫీ చేసేందుకు మోదీ ప్రభుత్వం ఉపయోగిస్తోందని, కాయకష్టం చేసుకునే దిగువ, మధ్య తరగతి వర్గాలపై మోదీకి ఏమాత్రం ప్రేమ లేదని అన్నారు. ధరల అదుపులో విఫలమైన విషయాన్ని మోదీ ఒప్పుకోవాలన్నారు. 2014లో 110 డాలర్లుగా ఉన్న ముడిచమురు బ్యారెల్ ధర.. 2015 జనవరిలో 50 డాలర్లు, 2016 జనవరిలో 27 డాలర్లకు పడిపోగా, 2020 కరోనా లాక్డౌన్ సమయంలో ఏకంగా 11 డాలర్లకు పడిపోయిందన్నారు. కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏనాడూ పెట్రో ధరలు తగ్గించిన పాపాన పోలేదన్నారు. ముక్కుపిండి వసూలు చేశారు.. పెట్రో ధరలను పెంచడం ద్వారా ప్రజల నుంచి భారీగా ఆదాయాన్ని గుంజిన మోదీ సర్కార్ దానిని మరింత పెంచుకునే చర్యల్లో భాగంగా పెట్రోల్, డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని గరిష్టంగా పెంచుకునేందుకు 2020 మార్చిలో చట్ట సవరణ చేసిందని కేటీఆర్ విమర్శించారు. కోవిడ్ మహమ్మారితో ప్రజలు ఆర్థికంగా చితికి పోయి ఉన్న సమయంలో కనీస కనికరం లేకుండా 2020 నాటికే ఒక్క ఎక్సైజ్ సుంకం రూపంలోనే సుమారు రూ.14 లక్షల కోట్లను మోదీ ప్రభుత్వం ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసిందన్నారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే వ్యూహంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల రూపంలోనే ఎక్కువగా పెట్రో రేట్లను పెంచి కేంద్రం తన ఖజానా నింపుకుంటోందన్నారు. కేంద్రం విధించిన పెట్రో సుంకాలను ఎత్తివేస్తే లీటరు పెట్రోల్‌పై రూ.30 వరకు వినియోగదారులకు ఉపశమనం కలుగు తుందన్నారు. సెస్సులు, సుంకాల పేరుతో ఓ వైపు ప్రజల నుంచి దోపిడీ చేస్తూ ఆ నెపాన్ని తెలంగాణ వంటి రాష్ట్రాలపై నెడుతోందని కేటీఆర్ విమర్శించారు. ప్రజలు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై అన్ని రకాల సెస్సులను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
భారత్‌లో క్షీణిస్తున్న క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: భారత్ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 2022 జూలైలో 3.8 శాతం తగ్గింది. 2021 జూలైలో 2.54 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగితే, తాజా సమీక్షా నెల జూలై ఈ పరిమాణం 2.45 మిలియన్ టన్నులకు పడిపోయింది. ప్రభుత్వ రంగంలోని ఓఎన్జీసీ అలాగే ప్రైవేట్ రంగ సంస్థలు నిర్వహిస్తున్న క్షేత్రాల నుండి తక్కువ ఉత్పత్తి దీనికి ప్రధాన కారణం. దేశ నెలవారీ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి లక్ష్యం 2.59 మిలియన్ టన్నులకన్నా తక్కువ ఉత్పత్తి నమెదయినట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. పశ్చిమ సముద్ర తీరంలో ఓఎన్జీసీ ఉత్పత్తి వార్షికంగా చూస్తే 1.7 శాతం తగ్గి 1.63 మిలియన్ టన్నులకు పడిపోయింది. ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న క్షేత్రాల్లో సైతం ఉత్పత్తి 12.34 శాతం క్షీణించింది. వార్షిక అంచనాలు ఇలా... ఇక ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్ నుంచి జూలై మధ్య నాలుగు నెలల కాలాన్ని పరిశీలిస్తే (2021-22 ఇదే కాలంతో పోల్చి) క్రూడ్ ఉత్పత్తి 9.96 మిలియన్ టన్నుల నుంచి స్వల్పంగా 9.91 మిలియన్ టన్నులకు తగ్గింది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో 29.7 మిలియన్ టన్నుల ఉత్పత్తితో పోల్చితే ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఉత్పత్తి వరుసగా 39.8 మిలియన్ టన్నులు, 34 మిలియన్ టన్నులుగా నమోద వుతుందని అంచనావేస్తున్నట్లు చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవలే పేర్కొన్నారు. దేశం తన మొత్తం క్రూడ్ అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపై ఆధారపడే సంగతి తెలిసిందే. మిగిలిన 15 శాతం క్రూడ్‌ను భారత్ ఉత్పత్తి చేస్తుంది. చమురు శుద్ధికి దేశంలో 22 ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి. అక్కడక్కడే సహజ వాయువు ఉత్పత్తి కాగా, దేశీయ సహజ వాయువు ఉత్పత్తి జూలైలో దాదాపు అక్కడక్కడే 2.88 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా (బీసీఎం) ఉంది. అయితే నాలుగు నెలల కాలంలో మాత్రం ఉత్పత్తి 3.4 శాతం పెరిగి 11.43 బీసీఎంగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ముంబై సముద్రతీరంలోని డామన్ క్షేత్రంలో తక్కువ గ్యాస్ ఉత్పత్తి కారణంగా ఓఎన్జీసీ గ్యాస్ ఉత్పత్తి జూలైలో దాదాపు 4 శాతం క్షీణించింది. -
గుడ్ న్యూస్: డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ కోత
సాక్షి, న్యూఢిల్లీ: విండ్‌ఫాల్ టాక్స్ వడ్డింపుపై కేంద్రం మరోసారి కిలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇటీవల విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌పై తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును సగానికి తగ్గించింది. అలాగే జెట్ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై టాక్స్‌ను రద్దు చేసింది. అయితే దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురుపై పన్నును పెంచింది. (Fortune Global 500: రిలయన్స్ హైజంప్, ర్యాంకు ఎంతంటే?) అధికారిక నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతిపై పన్ను లీటరుకు రూ.11 నుంచి రూ.5కు తగ్గించారు. విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై లీటరుకు రూ.4 పన్నును తొలగించింది. దీంతో డీజిల్ లీటర్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రూ.11 నుంచి రూ.6 కు దిగి వచ్చింది. దేశీయంగా ఉత్పత్తి చేయబడే ముడి చమురుపై పన్ను టన్నుకు రూ. 17,000 నుండి రూ.17,750కి పెంచింది.పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరోగా కొనసాగుతుంది. క్రూడాయిల్‌పై పన్ను పెంపుద్వారా ఓఎన్జీసీ, వేదాంత లాంటి ఉత్పత్తి దారులకు కష్ట కాలమేనని, అలాగే డీజిల్, ఏటీఎఫ్‌లపై పన్నుల కోత రిలయన్స్ కు సానుకూలమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (ఇదీ చదవండి:నెలకు 4వేల జీతంతో మొదలైన‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి!) చమురు ఉత్పాదక సంస్థలు, పెట్రో ఎగుమతి కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జిస్తున్నాయన్న కారణంతో జూలై 1న కేంద్రం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధించిన సంగతి తెలిసిందే. జూన్‌లో 26.18 బిలియన్ల డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు ఎగుమతులు మందగించడంతో జూలై నెలలో 31 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయికి చేరిన నేపథ్యంలో తాజాగా విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ప్రభుత్వం సవరించింది. జూలై 20న ఆ పన్నులను కొంతమేర తగ్గించిన కేంద్రం మరోసారి సారి కోత పెట్టింది. ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం నుండి జూలైలో రికార్డుస్థాయికి చేరిన నేపథ్యంలో రెండోసారి విండ్‌ఫాల్ టాక్స్‌ను తగ్గించింది. కమోడిటీ ధరలు పెరగడం, బలహీనమైన రూపాయి కారణంగా జూలైలో దిగుమతులు 43.59 శాతం పెరగగా, ఎగుమతులు 0.76 శాతం పడిపోయాయి. -
ఉక్రెయిన్ వార్.. భారత్‌కు అలా కలిసొచ్చిందా!
అనూహ్య పరిణామాల మధ్య ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైందన్న సంగతి తెలిసిందే. ప్రపంచదేశాలు ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ మారణహోమాన్ని ఆపలేకపోయాయి. మరో వైపు యుద్ధం కారణంగా పలు దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. దీంతో మొదట్లో రష్యా కాస్త తడబడినా చివరికి ఈ సమస్యకు పరిష్కారంగా భారత్ కనిపించింది. దేశంలో చమురు సంస్థలకు ఈ అంశం కలిసొచ్చిందనే చెప్పాలి. యుద్ధ ప్రభావంతో గతంలో కంటే రష్యా నుంచి భారీగా దిగుమతులు చేసుకుంది భారత్. నివేదికల ప్రకారం.. ఉ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే రష్యా దిగుమతులు 3.7 రెట్లు పెరిగి 5 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా ఈ రెండు నెలల కాలంలోనే జరిగిన దిగుమతులు ఏడాది దిగుమతుల్లో సగం ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాపై వివిధ దేశాల ఆంక్షలు, తక్కువ ధరకే క్రూడ్ అయిల్ వంటి కారణాల వల్ల ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు భారత్ 8.6 బిలియన్ డాలర్ల వస్తువులను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. గత సంవత్సరం ( 2021)లో ఇది 2.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో ముడి చమురు, ఎరువులు, వంటనూనెలు, బొగ్గు, ఉండగా, మరోవైపు ఖరీదైన రాళ్లు, వజ్రాలు వంటి దిగుమతులు మాత్రం తగ్గాయి. చదవండి: SBI Change Rule: ఏటీఎం యూజర్లకు గమనిక, ఆ నిబంధన అందరికీ రానుందా? -
అయ్యయ్యో.. రూపాయి...ఈ పతనం ఎందాకా?
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయికి కష్టాలు తప్పడం లేదు. సోమవారం మరో రికార్డు కనిష్టానికి జారుకుంది. గ్లోబల్ మాంద్యం, ముడిచమురు సరఫరా, మార్కెట్లలో మిశ్రమ సెంటిమెంట్‌పై పెట్టుబడిదారుల ఆందోళన నేపథ్యంలో డాలరు మారకంలో రూపాయి 79.40 వద్ద ఆల్ లైం కనిష్టాన్ని నమోదు చేసింది. శుక్రవారం79.26 వద్ద ముగిసింది. గత రెండు వారాలుగా అత్యంత కనిష్ట స్థాయిలకు చేరుతున్న రూపాయి ప్రస్తుతం 80 మార్క్‌కు చేరువలో ఉండటం ఆందోళన రేపుతోంది. దేశీయ,అంతర్జాతీయ ద్రవ్యోల్బణ డేటాపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థికవృద్ధి ఆందోళన, చమురు మార్కెట్లో అస్థిరత డాలర్‌కు బలాన్నిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు వరుసగా మూడు సెషన్ల లాభాలకు స్వస్తి చెప్పిన స్టాక్‌మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 325 పాయింట్లు క్షీణించి 54156 వద్ద, నిఫ్టీ 87 పాయింట్ల నష్టంతో 16137 వద్ద కొనసాగుతోంది. కాగా రోజుకు మరింత పతనమవుతున్న రూపాయని ఆదుకునేందుకు ఇటీవల ఆర్బీఐ కొన్ని చర్యల్ని ప్రకటించింది. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కొన్ని సవరణలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
రెండు వారాలకోసారి విండ్‌ఫాల్ ట్యాక్స్‌పై సమీక్ష
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు, ఇంధనాల ఎగుమతులపై విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రెండు వారాలకోసారి (15 రోజులకు) ప్రభుత్వం సమీక్షించనుంది. విదేశీ మారకం రేట్లు, అంతర్జాతీయంగా చమురు ధరలను బట్టి నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఈ విషయాలు చెప్పారు. క్రూడాయిల్ బ్యారెల్ రేటు 40 డాలర్ల స్థాయికి పడిపోతే దీన్ని ఉపసంహరించవచ్చన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడప్పుడే ఆ రేటుకు రాకపోవచ్చని పేర్కొన్నారు. ముడిచమురు రేటు ఏ స్థాయిలో ఉంటే విండ్‌ఫాల్ ట్యాక్స్ ఉపసంహరించవచ్చనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సీబీఐసీ చైర్మన్ వివేక్ జోహ్రి చెప్పారు. కంపెనీలు ప్రత్యేకంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల పొందే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ. 6 చొప్పున, డీజిల్‌పై రూ. 13 చొప్పున, అలాగే దేశీయంగా ఉత్పత్తి చేసే క్రూడాయిల్పైన టన్నుకు రూ. 23,250 మేర పన్నులు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. -
దిగుమతుల బిల్లుకు క్రూడ్, పసిడి సెగ!
న్యూఢిల్లీ: ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారత్ ఎకానమీకి ఆందోళన కలిగిస్తోంది. భారత్ ఎగుమతులు జూన్‌లో 17 శాతం పెరిగి 38 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 51 శాతం పెరిగి 64 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో వాణిజ్యలోటు సమీక్షా నెల్లో రికార్డు స్థాయిలో 26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది (2021 జూన్‌లో ఈ విలువ 9.61 బిలియన్ డాలర్లు). దిగుమతుల బిల్లుపై క్రూడ్ ఆయిల్, బంగారం భారం పడుతుండడం గమనార్హం. ఈ పరిమాణం ఫారెక్స్ నిల్వలు తగ్గడంసహా కరెంట్ అకౌంట్ లోటు మరింత తీవ్రతకు (భారత్‌కు వచ్చీ–పోయే నికర విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య వ్యత్యాసం), రూపాయి మరింత బలహీనతకు దారితీసే అంశం కావడం గమనార్హం. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన తొలి గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ఎగుమతుల విభాగం ఇలా... ► నెలవారీ, వార్షికంగా చూసినా ఎగుమతుల వృద్ధి స్పీడ్ (17 శాతం) జూన్‌లో తగ్గడం గమనార్హం. 2022 మేలో ఎగుమతుల వృద్ధి 20.55 శాతం. 2021 జూన్‌లో ఈ రేటు ఏకంగా 48.34 శాతం. ► సమీక్షా నెల్లో ఇంజనీరింగ్, ఫార్మా, ప్లాస్టిక్ ఉత్పత్తులు ప్రతికూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి. హై బేస్ కూడా దీనికి కారణమన్నది విశ్లేషణ. ► కాగా పెట్రోలియం ప్రొడక్టుల విలువ 98% ఎగసి 7.82 బిలియన్ డాలర్లకు చేరింది. ► రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 19.41% ఎగసి 3.37 బిలియన్ డాలర్లకు ఎగసింది. దిగుమతుల తీరిది ► క్రూడ్ దిగుమతుల విలువ జూన్‌లో 94 శాతం పెరిగి 20.73 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► బొగ్గు, కోక్ దిగుమతుల విలువ 1.88 బిలియన్ డాలర్ల నుంచి 6.41 బిలియన్ డాలర్లకు ఎగసింది. ► పసిడి దిగుమతుల విలువ 169.5 శాతం ఎగసి 2.61 బిలియన్ డాలర్లకు చేరింది. బంగారం దిగుమతుల భారీ పెరుగుదల నేపథ్యంలో కేంద్రం వీటిపై తాజాగా సుంకాన్ని పెంచింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 10.75 శాతం నుంచి పసిడి దిగుమతుల సుంకాన్ని 15 శాతానికి చేర్చింది. బంగారం దిగుమతుల కట్టడి దీని లక్ష్యం. మొదటి మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్) ఎగుమతులు 22.22 శాతం పెరిగి 116.77 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతులు 47 శాతం పెరిగి 187.02 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి వాణిజ్యలోటు 70.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ కేవలం 31.42 బిలియన్ డాలర్లు. రెట్టింపు కరెంట్ అకౌంట్ వాణిజ్యలోటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో కరెంట్ అకౌంట్‌లోటు 13 బిలియన్ డాలర్లు. అయితే ఇది జూన్ త్రైమాసికంలో 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని భావిస్తున్నాం. 2022–23లో క్యాడ్ 100 నుంచి 105 బిలియన్ డాలర్లు నమోదుకావచ్చు. 2022లో ప్రతి నెలా 20 డాలర్లపైనే వస్తువులకు సంబంధించి వాణిజ్యలోటు కొనసాగుతుందని భావిస్తున్నాం. అయితే సేవల రంగం నుంచి ఎగుమతుల పురోగమనం కొంత ఊరటనిచ్చే అంశం. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
మేలో మౌలిక రంగం భారీ వృద్ధి
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ మేనెల్లో (2021 మే నెలతో పోల్చి) భారీగా 18.1 శాతం పురోగతి సాధించింది. ఈ స్థాయి ఫలితం నమోదుకావడం 13 నెలల తర్వాత ఇదే తొలిసారి. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్‌లతో కూడిన ఈ గ్రూప్ వెయిటేజ్ మొత్తం పారిశ్రామిక ఉత్పతిసూచీ (ఐఐపీ)లో దాదాపు 44 శాతం. మే నెల్లో బొగ్గు (25.1 శాతం), క్రూడ్ ఆయిల్ (4.6 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (16.7 శాతం), ఎరువులు (22.8 శాతం), సిమెంట్ (26.3 శాతం) విద్యుత్ (22 శాతం) రంగాలు మంచి పురోగతి సాధించాయి. అయితే సహజ వాయువు ఉత్పత్తి 7 శాతం క్షీణించగా, స్టీల్ ఉత్పత్తి 15 శాతం పడింది. కాగా, ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్–మే) ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేటు 13.6 శాతంగా నమోదయ్యింది. -
భారత్‌కు రష్యా క్రూడ్.. 50 రెట్లు అప్
న్యూఢిల్లీ: భారత్‌కు రష్యా నుంచి చమురు దిగుమతులు ఏప్రిల్ నుండి దాదాపు 50 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొత్తం క్రూడాయిల్ పరిమాణంలో 10 శాతానికి చేరాయి. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి దిగడానికి ముందు ఆ దేశం నుంచి భారత్‌కు చమురు దిగుమతులు 0.2 శాతం మాత్రమే ఉండేవి. రష్యా ప్రస్తుతం టాప్ 10 సరఫరా దేశాల్లో ఒకటిగా మారిందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ రిఫైనరీ సంస్థలు దాదాపు 40 శాతం మేర రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. మేలో దేశీ రిఫైనర్లు 2.5 కోట్ల బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాయి. ఇక, ఏప్రిల్ నెలకు చూస్తే సముద్రమార్గంలో భారత్‌కు వచ్చే మొత్తం దిగుమతుల్లో రష్యన్ క్రూడాయిల్ వాటా 10 శాతానికి పెరిగింది. ఇది 2021 ఆసాంతం, 2022 తొలి త్రైమాసికంలో 0.2 శాతమే. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో తమ ముడిచమురును డిస్కౌంటుకే రష్యా విక్రయిస్తోంది. క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల పైనే తిరుగాడుతున్న తరుణంలో 30 డాలర్ల వరకూ డిస్కౌంటు లభిస్తుండటంతో దేశీ రిఫైనర్లు పెద్ద ఎత్తున రష్యా చమురును కొనుగోలు చేస్తున్నాయి. -
భారత్‌కు చమురు సరఫరాలో రెండో స్థానానికి రష్యా..
న్యూఢిల్లీ: భారత్‌కు ముడిచమురు అత్యధికంగా సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో సౌదీ అరేబియాను దాటి రష్యా రెండో స్థానానికి చేరింది. మే నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి 25 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను కొనుగోలు చేసినట్లు గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం చమురు దిగుమతుల్లో ఇది 16 శాతం పైగా ఉంటుంది. సముద్రమార్గంలో భారత్ చేసుకునే మొత్తం దిగుమతుల్లో రష్యా నుంచి వచ్చే ఉత్పత్తుల వాటా ఏప్రిల్‌లో తొలిసారిగా 5 శాతానికి చేరింది. 2021 సంవత్సరం ఆసాంతం, 2022 తొలి త్రైమాసికంలోనూ ఇది 1 శాతం కన్నా తక్కువే నమోదైంది. ప్రస్తుతం భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాక్ అగ్రస్థానంలో ఉంది. ఉక్రెయిన్‌తో యుద్ధ పరిణామాల నేపథ్యంలో భారత్‌కు రష్యా భారీ డిస్కౌంటుపై చమురు సరఫరా చేస్తోంది. గతంలో రవాణా చార్జీల భారం కారణంగా రష్యా చమురును భారత్ అంతగా కొనుగోలు చేయలేదు. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు ఆకాశాన్నంటుతున్న తరుణంలో తక్కువ రేట్లకు కొనుగోలు చేసే అవకాశాన్ని అందిపుచ్చుకుని రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచుకుంటోంది. -
తగ్గిన భారత్ ముడి చమురు ఉత్పత్తి
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగం నిర్వహిస్తున్న క్షేత్రాల నుండి తక్కువ ఉత్పత్తి కారణంగా ఏప్రిల్‌లో భారత్ ముడి చమురు ఉత్పత్తి 1 శాతం పడిపోయిందని అధికారిక డేటా వెల్లడించింది. 2021 ఏప్రిల్‌లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 2.5 మిలియన్ టన్నులుకాగా, 2022 ఏప్రిల్‌లో ఈ పరిమాణం 2.47 మిలియన్ టన్నులకు తగ్గినట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రైవేట్ రంగం నిర్వహిస్తున్న క్షేత్రాల నుంచి వార్షికంగా చూస్తే 7.5 శాతం తక్కువ ముడి చమురు (5,67,570 టన్నులు) ఉత్పత్తి జరిగింది. ప్రభుత్వ రంగం దూకుడు.. కాగా వేర్వేరుగా చూస్తే, ఏప్రిల్‌లో ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తి పెరిగింది. చమురు, సహజ వాయువుల కార్పొరేషన్ (ఓఎన్జీసీ) గత ఏడాది ఏప్రిల్ నెల ఉత్పత్తి 1.63 మిలియన్ టన్నులుకాగా, ఈ పరిమాణం తాజా సమీక్షా నెలలో 1.65 మిలియన్ టన్నులకు చేరింది. పెరుగుదల 0.86 శాతంకాగా, ఓఎన్జీసీ నిర్దేశించుకున్న లక్ష్యంకన్నా ఈ పరిమాణం 5 శాతం అధికం. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) 3.6 శాతం ఎక్కువ ముడి చమురును ఉత్పత్తి చేసింది. పరిమాణంలో ఇది 2,51,460 టన్నులు. సహజ వాయువు ఉత్పత్తి ఇలా... కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్. బీపీ కృష్ణా గోదావరి–డీ 6 బ్లాక్‌కు నిలయమైన తూర్పు ఆఫ్‌షోర్ నుండి అధిక ఉత్పత్తి కారణంగా సహజ వాయువు ఉత్పత్తి 6.6 శాతం పెరిగి 2.82 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం)కు చేరుకుంది. ఓఎన్జీసీ సహజ వాయువు ఉత్పత్తి ఒక శాతం తగ్గి 1.72 బీసీఎంగా నమోదయ్యింది. అయితే తూర్పు ఆఫ్‌షోర్ అవుట్‌పుట్ 43 శాతం పెరిగి 0.6 బీసీఎంలకు చేరినట్లు డేటా పేర్కొంటోంది. క్షేత్రం వారీగా ఉత్పత్తి వివరాలు తెలియరాలేదు. రిఫైనరీల పరిస్థితి ఇలా... డిమాండ్ మెరుగుపడ్డంతో రిఫైనరీలు ఏప్రిల్‌లో 8.5 శాతం ఎక్కువ ముడి చమురును ప్రాసెస్ చేశాయి. ఈ పరిమాణం 21.6 మిలియన్ టన్నులు గా ఉంది. ప్రభుత్వ రంగ రిఫైనరీలు 12.8 శాతం ఎక్కువ ముడి చమురును ఇంధనంగా మార్చాయి. ప్రైవేట్, జాయింట్ సెక్టార్ యూనిట్ల క్రూడ్ ఉత్పత్తి 1.8 శాతం పెరిగింది. రిఫైనరీలు ఏప్రిల్‌లో 22.8 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు జరి పాయి. 2021 ఇదే నెలతో పోల్చితే ఇది 9 శాతం అధికం. ప్రభుత్వ రంగ యూనిట్ల నుండి ఇంధన ఉత్పత్తి దాదాపు 12 శాతం పెరిగి 13 మిలియన్ టన్నులకు చేరుకోగా, ప్రైవేట్ రంగ యూనిట్లు 7 శాతం అధికంగా 9.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేశాయి. ఏప్రిల్‌లో ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి రిఫైనరీలు వాటి స్థాపిత సామర్థ్యంలో 104.5 శాతంతో పనిచేశాయి. కేంద్రం నజర్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికిగాను చమురు, గ్యాస్ దేశీయ ఉత్పత్తిని పెంచడంపై కేంద్రం మరోవైపు దృష్టి సారిస్తోంది. భారతదేశం తన చమురు అవసరాలలో 85 శాతం, సహజ వాయువు అవసరాలలో సగం దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్లీజ్.. భారత్‌ను బతిమాలుతున్నాం, ఆ నిషేధాన్ని ఎత్తేయండి: ఐఎంఎఫ్ చీఫ్ -
రిస్క్ తీసుకుంటున్నాం, కొంచెం తగ్గిస్తే బెటర్.. రష్యాను రిక్వెస్ట్ చేసిన భారత్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత్‌కు ముడి చమురును చౌకగా అందుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం రష్యా నుంచి జరుపుతున్న చమురు దిగుమతుల్లో కాస్త మార్పులు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు రష్యా ఆఫర్ చేసిన ధరకు కాకుండా చమురుపై మరింత రాయితీ ఇవ్వాలని, బ్యారెల్‌కు 70 డాలర్ల కంటే తక్కువకు భారత్ అమ్మాలని రష్యాను కోరింది. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితుల్లో పలు దేశాల ఆంక్షల రష్యా పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒపెక్( ఓపీఈసీ) దేశాల నుంచి రిస్క్‌ను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఈ మేరకు ప్రతిపాదన చేసింది. కాగా, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ఒక బ్యారెల్ ధర సుమారు 108 డాలర్లు ఉంది. ఇప్పటికే భారత ప్రభుత్వ, ప్రైవేట్ ఆయిల్ సంస్థలు రష్యా రాయితీ ప్రకటించడంతో 40 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును కొనుగోలు చేశాయి. 2021లో రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేసిన దాని కంటే ఇది 20 శాతం అదనమని గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యం కారణంగా.. ఆయిల్ వ్యాపారం రష్యాకు మరింత కఠినంగా మారింది. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరో కొనుగోలుదారుడితో తమ వ్యాపార లావాదేవీలు అంత సులువుగా రష్యా జరపలేదు. ఈ సమయంలో రష్యా నుంచి జరుపుతున్న దిగుమతుల కారణంగా భారత్ భవిష్యత్తులో వాణిజ్య పరంగా ఇతర దేశాలతో ఇబ్బందులు ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యారెల్‌కు 70 డాలర్ల కంటే తక్కువకు చమురును అమ్మాలని రష్యాను భారత్ కోరుతోంది. కాగా ఈ ప్రతిపాదనకు రష్యా నుంచి ఎలా స్పందన రాబోతోందో చూడాలి. చదవండి: రెపో రేటు పెంపు.. ఎవరికి మేలు.. ఎవరికి భారం ? -
తగ్గెదేలే.. మా ప్రయోజనాలే మాకు ముఖ్యం?
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే విషయంలో అమెరికా సహా యూరప్ దేశాలు చెబుతున్న సూచనలను భారత్ పక్కన పెట్టింది. రష్యాతో సంబంధాల విషయంలో అమెరికాకు అనుగుణంగా మసలడం కంటే భారత ప్రయోజనాలే పరమావధిగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. రష్యా నుంచి డిస్కౌంట్ ధరకి లభిస్తున్న ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తోంది ఇండియా. రాయిటర్ విశ్లేషణ ప్రకారం 2021లో మొత్తం కొనుగోలు చేసిన ముడి చమురు కంటే రెండింతలు అధికంగా ముడి చమురును ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఇండియా కొనుగోలు చేసింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో 2022 ఫిబ్రవరి 24 నుంచి ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఇండియా రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. 2021 ఏడాది మొత్తంలో ఇండియన్ రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి 16 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేశాయి. కానీ 2022 ఫిబ్రవరి 24న యుద్ధం ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఒక్కసారిగా కొనుగోళ్లు జోరందుకున్నాయి. 2022 జూన్ వరకు కాలానికి ఇండియన్ ఆయిల్ కంపెనీలు ఏకంగా 40 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కావాలంటూ రష్యన్ కంపెనీలకు టెండర్లు దాఖలు చేశాయి. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారుగా ఇండియా ఉంది. ప్రతీ రోజు 5 మిలియన్ డాలర్ల ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. ఇందులో అధిక భాగం సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల నుంచే వస్తోంది. అయితే గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ముడి చమురు బ్యారెల్ ధర భారీగా పెరిగింది. ఇప్పటికే లీటరు , పెట్రోలు డీజిల్ రేట్లు ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. ద్రవ్యోల్బణం రోజురోజుకి పెరుగుతోంది. ఈ అంశాలేమీ పట్టించుకోకుండా రష్యా నుంచి తక్కువ ధరకు వచ్చే ఆయిల్ కొనద్దంటోంది అమెరికా. కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తోంది ఇండియా. చదవండి: ఓఎన్జీసీ కొత్త ప్రాజెక్టులు షురూ -
విశాఖ పోర్టుకు రికార్డు స్థాయిలో క్రూడాయిల్
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖపట్నం పోర్టుకు అతి పెద్ద క్రూడాయిల్ పార్సిల్ ఆదివారం చేరుకుంది. విశాఖ పోర్టు చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి క్రూడాయిల్ తీసుకురావడం ఇదే మొదటిసారని పోర్ట్ ట్రస్ట్ అథారిటీ అధికారులు తెలిపారు. టెక్సాస్ నుంచి పోర్టు అధికారులు 2.72 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడాయిల్‌ను తీసుకొచ్చారు. ఈ క్రూడాయిల్ తీసుకొచ్చిన భారీ షిప్ ఆదివారం సాయంత్రం పోర్టుకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. విశాఖలో పోర్టు ఏర్పడినప్పటి నుంచి ఇంత భారీ మొత్తంలో క్రూడాయిల్ రావడం ఇదే మొదటిసారని తెలిపారు. -
దేశీ చమురు ఉత్పత్తి డౌన్
న్యూఢిల్లీ: దేశంలో చమురు ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరంలో 2.67% వరకు తగ్గింది. 2021–22లో ముడి చమురు ఉత్పత్తి 29.69 మిలియన్ టన్నులుగా ఉంది. 33.61 మిలియన్ టన్నుల లక్ష్యానికంటే 12 శాతం తక్కువ. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 30.5 మిలియన్ టన్నుల మేర ఉండడం గమనార్హం. గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో చమురు ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. 2017–18లో 35.7 మిలియన్ టన్నులు ఉంటే, 2018–19లో 34.2 మిలియన్ టన్నులకు తగ్గింది. 2019–20లో 32.2 మిలియన్ టన్నులు, 2020–21లో 30.5 మిలియన్ టన్నులు, 2021–22లో 29.69 మిలియన్ టన్నులకు పరిమితమైంది. చమురు క్షేత్రాలు ఎన్నో ఏళ్ల నుంచి ఉత్పత్తి చేస్తున్నవే ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఉత్పత్తి తగ్గుతోంది. టెక్నాలజీ సాయంతో ఉత్పత్తిని మరీ పడిపోకుండా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్పత్తి తీవ్రంగా పడిపోని పరిస్థితి ఉంది. చదవండి: నెలకు 40 బిలియన్ డాలర్లకుపైగా ఎగుమతులు -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, క్రూడాయిల్ పరుగే పరుగు..ఆందోళనలో భారత్!
న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా భారత్ ఎకానమీకి తీవ్ర సవాళ్లు తప్పవని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ మంగళవారం తన నివేదికలో పేర్కొంది. ఆయా అంశాల విశ్లేషణల అనంతరం ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే (2022–23) వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 10.3 శాతం నుండి 8.5 శాతానికి (1.8 శాతం) తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను 60 బేసిస్ పాయింట్లు పెంచినట్లు పేర్కొంది. దీనితో ఈ అంచనా 8.1 శాతం నుంచి 8.7 శాతానికి పెరిగింది. అధిక పన్ను వసూళ్లుసహా, ఎకానమీలో పలు హై ఫ్రీక్వెన్సీ ఇండెక్స్‌లు ఊహించినదానికన్నా మెరుగ్గా ఉండడమే దీనికి కారణమని వివరించింది. 2023–24లో ఎకానమీ వృద్ధి రేటు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 7 శాతంగా ఉండే వీలుందని పేర్కొంది. గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్– మార్చి 2022 పేరుతో వెల్లడించిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► కోవిడ్–19 మహమ్మారి అనంతరం చోటుచేసుకుంటున్న రికవరీపై యుద్ధం ప్రభావం పడుతోంది. అంతర్జాతీయంగా సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది వృద్ధిని తగ్గిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. ► ఉక్రెయిన్‌పై యుద్ధం, రష్యాపై ఆర్థిక ఆంక్షలు ప్రపంచ ఇంధన సరఫరాలను ప్రమాదంలో పడేశాయి. ఆంక్షలు ఇప్పుడే రద్దయ్యే అవకాశం లేదు. ► ప్రపంచ ఇంధన సరఫరాల్లో రష్యా వాటా దాదాపు 10 శాతం. సహజ వాయువులో 17 శాతం. చమురు, గ్యాస్ ధరల పెరుగుదల పరిశ్రమ వ్యయాలను పెంచుతుంది. ఇంధన అధిక ధరల వల్ల వినియోగదారుల వాస్తవ ఆదాయాలు తగ్గుతాయి. ► డిసెంబరు త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు చాలా పటిష్టంగా ఉంది. జీడీపీ మహమ్మారి ముందస్తు స్థాయి కంటే 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. అయితే వ్యవస్థలో మహమ్మారి సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. ►2020, 2021లో వచ్చిన కరోనా రెండు వేవ్‌లకు భిన్నంగా 2022లో నెలకొన్న మూడవ వేవ్ పరిస్థితి ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ తక్కువ నష్టంతో ఒమిక్రాన్ వేవ్‌ను అధిగమించిందని మా హై–ఫ్రీక్వెన్సీ డేటా సూచిస్తోంది. ►ద్రవ్యోల్బణం మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోంది. క్రమంగా తగ్గేముందు 2022 డిసెంబరు త్రైమాసికంనాటికి 7 శాతంపైకి ద్రవ్యోల్బణం చేరుతుందని భావిస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న అప్పర్ బ్యాండ్ (2–6%), ఆపైన ద్రవ్యోల్బణం సమీపకాలంలో కొనసాగుతుందని భావిస్తున్నాం. ► గత వారం రోజుల్లో స్థానిక ఇంధన ధరలు దాదాపు ఫ్లాట్‌గానే ఉన్నాయి. అయితే చమురు కంపెనీలు తుదకు అధిక చమురు ధరల భారాన్ని వినియోగదారుకు (ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపు మినహాయింపు) బదిలీ చేస్తాయని భావిస్తున్నాము. ► 2022 క్యాలెండర్ సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను గత వారం మరొక గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 9.5% నుండి 9.1%కి తగ్గించిన సంగతి తెలిసిందే. అధిక ఇంధనం ధర, ఎరువుల దిగుమతి బిల్లు మూలధన వ్యయాన్ని పరిమితం చేస్తుందని మూడీస్ తన అంచనాల్లో పేర్కొంది. ►యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ బ్యారల్ ధర ఈ నెల ప్రారంభంలో పదమూడు సంవత్సరాల గరిష్టం 140 డాలర్లకు చేరింది. భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వృద్ధి రేటు 3.5 శాతానికి పరిమితం ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను క్యాలెండర్ ఇయర్లో 70 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఫిచ్ తెలిపింది. దీనితో ఈ రేటు 4.2 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గింది. -
ఛలో రష్యా ! క్యూ కట్టిన మన కంపెనీలు.. కారణం ఏంటంటే?
న్యూఢిల్లీ: భారీ డిస్కౌంటుతో లభిస్తున్న రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు దేశీ రిఫైనరీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మూడు మిలియన్ బ్యారెళ్లు కొనుగోలు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) బాటలోనే తాజాగా హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) రెండు మిలియన్ బ్యారెళ్లు తీసుకుంది. యూరప్‌కు చెందిన ట్రేడరు విటోల్ ద్వారా రష్యన్ ఉరల్స్ క్రూడాయిల్‌ను హెచ్‌పీసీఎల్ కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళూరు కూడా మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ (ఎంఆర్‌పీఎల్) కూడా అదే తరహాలో ఒక మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ కోసం టెండర్లు ఆహ్వానించింది. ఉక్రెయిన్ మీద దాడుల కారణం గా రష్యాపై పాశ్చాత్య దేశాలు భారీగా ఆంక్షలు విధించడంతో ఆ దేశం ఉత్పత్తి చేసే ముడి చమురు భారీ డిస్కౌంటుకు లభిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, చమురును చౌకగా దక్కించుకునేందుకు భారత రిఫైనింగ్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మే నెలలో డెలివరీ కోసం బ్యారెల్‌కు 20–25 డాలర్ల డిస్కౌంటుతో ఐవోసీ గత వారమే మూడు మిలియన్ బ్యారెళ్లను విటోల్ సంస్థ ద్వారా కొనుగోలు చేసింది. అమెరికాలో భారీగా కార్యకలాపాలు ఉన్నందున, రష్యాపై ఆంక్షల ప్రభావం తమపై కూడా పడే అవకాశం ఉండటంతో ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం రష్యన్ క్రూడాయిల్‌కు దూరం గా ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డాలర్లలో సెటిల్మెంట్.. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థాపరంగా ఇంకా ఆంక్షలేమీ విధించనందున.. రష్యాతో వాణిజ్య లావాదేవీలకు భారత రిఫైనర్లు డాలర్ల మారకంలోనే సెటిల్మెంట్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వివాదాస్పద అణ్వాయుధాల తయారీ కారణంగా ఇరాన్‌పై విధించినట్లుగా రష్యా చమురుపై నిషేధం ఏదీ ప్రస్తుతం లేదు. ఫలితంగా ఏ దేశమైనా లేదా కంపెనీ అయినా రష్యా చమురు లేదా ఇతర ఇంధన కమోడిటీలను కొనుగోలు చే సేందుకు, అంతర్జాతీయ పేమెంట్ సిస్టమ్స్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు ఉంటోంది. 2020 నుంచే ఒప్పందాలు.. దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి అంతంత మాత్రమే కావడంతో.. భారత్ తన అవసరాలకు సంబంధించి 85% క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఎక్కువ వాటా మధ్యప్రాచ్య దేశాలదే. అయితే వాటిపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో రష్యా, అమెరికా తదితర దేశాల నుంచి కూడా భారత్ సరఫరా పెంచుకుంటోంది. సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలో చమురు ఎగుమతులపరంగా రష్యా రెండో స్థానంలో ఉంది. యూరప్‌లోని పలు దేశాలు తమ ఇంధన అవసరాల కోసం రష్యాపైనే ఆధారపడుతున్నాయి. కానీ, రష్యా నుండి భారత్ కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే. 2021లో కేవలం 45,000 బ్యారెళ్లు మాత్రమే దిగుమతి చేసుకుంది. రవాణా రేట్లు భారీగా ఉండటమే ఇందుకు కారణం. వాస్తవానికి.. దాదాపు 2 మిలియన్ టన్నుల ముడిచమురును కొనుగోలు చేసేందుకు రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ ఆయిల్ కంపెనీతో 2020 ఫిబ్రవరిలోనే ఐవోసీ ఒప్పందం కుదుర్చుకుంది. చదవండి: భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం, క్యూ కడుతున్న సరిహద్దు దేశాలు! -
రష్యా చమురు రేసులో దేశీ సంస్థలు
న్యూఢిల్లీ: భారీ డిస్కౌంటుతో లభిస్తున్న రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు దేశీ రిఫైనరీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మూడు మిలియన్ బ్యారెళ్లు కొనుగోలు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) బాటలోనే తాజాగా హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) రెండు మిలియన్ బ్యారెళ్లు తీసుకుంది. యూరప్‌కు చెందిన ట్రేడరు విటోల్ ద్వారా రష్యన్ ఉరల్స్ క్రూడాయిల్‌ను హెచ్‌పీసీఎల్ కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ (ఎంఆర్‌పీఎల్) కూడా అదే తరహాలో ఒక మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ కోసం టెండర్లు ఆహ్వానించింది. ఉక్రెయిన్ మీద దాడుల కారణం గా రష్యాపై పాశ్చాత్య దేశాలు భారీగా ఆంక్షలు విధించడంతో ఆ దేశం ఉత్పత్తి చేసే ముడి చమురు భారీ డిస్కౌంటుకు లభిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, చమురును చౌకగా దక్కించుకునేందుకు భారత రిఫైనింగ్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మే నెలలో డెలివరీ కోసం బ్యారెల్‌కు 20–25 డాలర్ల డిస్కౌంటుతో ఐవోసీ గత వారమే మూడు మిలియన్ బ్యారెళ్లను విటోల్ సంస్థ ద్వారా కొనుగోలు చేసింది. అమెరికాలో భారీగా కార్యకలాపాలు ఉన్నందున, రష్యాపై ఆంక్షల ప్రభావం తమపై కూడా పడే అవకాశం ఉండటంతో ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం రష్యన్ క్రూడాయిల్‌కు దూరం గా ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డాలర్లలో సెటిల్మెంట్.. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థాపరంగా ఇంకా ఆంక్షలేమీ విధించనందున.. రష్యాతో వాణిజ్య లావాదేవీలకు భారత రిఫైనర్లు డాలర్ల మారకంలోనే సెటిల్మెంట్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వివాదాస్పద అణ్వాయుధాల తయారీ కారణంగా ఇరాన్‌పై విధించినట్లుగా రష్యా చమురుపై నిషేధం ఏదీ ప్రస్తుతం లేదు. ఫలితంగా ఏ దేశమైనా లేదా కంపెనీ అయినా రష్యా చమురు లేదా ఇతర ఇంధన కమోడిటీలను కొనుగోలు చే సేందుకు, అంతర్జాతీయ పేమెంట్ సిస్టమ్స్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు ఉంటోంది. 2020 నుంచే ఒప్పందాలు.. దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి అంతంత మాత్రమే కావడంతో.. భారత్ తన అవసరాలకు సంబంధించి 85% క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఎక్కువ వాటా మధ్యప్రాచ్య దేశాలదే. అయితే వాటిపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో రష్యా, అమెరికా తదితర దేశాల నుంచి కూడా భారత్ సరఫరా పెంచుకుంటోంది. సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలో చమురు ఎగుమతులపరంగా రష్యా రెండో స్థానంలో ఉంది. యూరప్‌లోని పలు దేశాలు తమ ఇంధన అవసరాల కోసం రష్యాపైనే ఆధారపడుతున్నాయి. కానీ, రష్యా నుండి భారత్ కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే. 2021లో కేవలం 45,000 బ్యారెళ్లు మాత్రమే దిగుమతి చేసుకుంది. రవాణా రేట్లు భారీగా ఉండటమే ఇందుకు కారణం. వాస్తవానికి.. దాదాపు 2 మిలియన్ టన్నుల ముడిచమురును కొనుగోలు చేసేందుకు రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ ఆయిల్ కంపెనీతో 2020 ఫిబ్రవరిలోనే ఐవోసీ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో చమురుకు డిమాండ్ 8% అప్ ఈ ఏడాది 5.15 మిలియన్ బీపీడీకి చేరొచ్చని ఒపెక్ అంచనా న్యూఢిల్లీ: మహమ్మారి ప్రభావాల నుండి ఎకానమీ నెమ్మదిగా పుంజుకుంటున్న నేపథ్యంలో దేశీయంగా ఈ ఏడాది చమురుకు డిమాండ్ 8.2 శాతం మేర పెరగనుంది. రోజుకు 5.15 మిలియన్ బ్యారెళ్లకు (బీపీడీ) చేరనుంది. ఆయిల్ మార్కెట్ నివేదికలో పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి ఒపెక్ ఈ విషయాలు వెల్లడించింది. భారత్‌లో 2020లో చమురు డిమాండ్ రోజుకు 4.51 మిలియన్ బ్యారెళ్లుగా (బీపీడీ) ఉండగా.. 2021లో 5.61 శాతం పెరిగి 4.76 మిలియన్ బీపీడీకి చేరింది. కరోనా పూర్వం 2018లో ఆయిల్ డిమాండ్ 4.98 మిలియన్ బీపీడీగా, 2019లో 4.99 మిలియన్ బీపీడీగా నమోదైంది. ‘2022లో ఆర్థిక వృద్ధి పటిష్టంగా 7.2 శాతం స్థాయిలో ఉంటుందన్న అంచనాలకు తోడు సమీప భవిష్యత్తులో ఒమిక్రాన్‌ను వేగంగా కట్టడి చేసే అవకాశాలు ఉన్నందున ఆయిల్‌కు డిమాండ్ మెరుగుపడవచ్చని భావిస్తున్నాం‘ అని ఒపెక్ నివేదిక పేర్కొంది. డీజిల్, నాఫ్తాకు పరిశ్రమల తోడ్పాటు.. కోవిడ్–19 కట్టడిపరమైన ఆంక్షలను సడలించడంతో దేశీయంగా ప్రయాణాలు, రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. పారిశ్రామిక రంగం మెరుగుపడుతుండటంతో డీజిల్, ఎల్పీజీ, నాఫ్తాకు డిమాండ్ పెరగగలదని నివేదిక వివరించింది. -
రిలయన్స్ వెనకడుగు..! రష్యా ముడిచమురు మాకొద్దు..! కారణం అదే..!
ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై అమెరికాతో పాటుగా, యూరప్‌దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ కల్గిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాపై ఆంక్షల నేపథ్యంలో తమ ప్లాంట్ల కోసం రష్యా ముడిచమురు కొనుగోలు విషయంలో రిలయన్స్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని కంపెనీకి చెందిన సీనియర్ అధికారి వెల్లడించారు. కొంతమేర ముడిచమురు సరఫరా రష్యా నుంచి వచ్చిన్నప్పటీకి..ఆంక్షల నేపథ్యంతో ఆ దేశ ముడిచమురును తిరస్కరించే అవకాశం ఉందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్ క్రాకర్ రాజేష్ రావత్ బుధవారం రోజున ఒక సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రిలయన్స్ తన రిఫైనరీ కాంప్లెక్స్ కోసం రష్యా యురల్స్ ముడిచమురును నేరుగా కొనుగోలు చేస్తోంది. రిఫైనరీలో సింహాభాగం మిడిల్ ఈస్ట్, అమెరికా నుంచి సేకరిస్తోంది. మార్కెట్ కంటే తక్కువ రేటుకే..! ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలను విధించడంతో...చాలా దేశాలు రష్యా ముడిచమురు దిగుమతులకు స్వస్తి పలికాయి. దీంతో భారత్ లాంటి దేశాలకు రష్యా ముడిచమురుపై బంపరాఫర్‌ను ప్రకటించాయి. మార్కెట్ కంటే తక్కువ ధరకే క్రూడాయిల్ సప్లై చేస్తామని రష్యా వెల్లడించింది.దీంతో భారత ప్రభుత్వ రంగ ముడిచమురు సంస్థలు రష్యా క్రూడాయిల్‌ను కొనేందుకు సిద్దమయ్యాయి. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 3 మిలియన్ బ్యారెల్స్, హిందూస్థాన్ పెట్రోలియం 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను కొనేందుకు ఒప్పందాలను చేసుకున్నాయి. కాగా పలు కారణాల నేపథ్యంలో రిలయన్స్ ముడిచమురు సేకరణలో వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. చదవండి: రష్యా దెబ్బకు ఆ దేశాలు ఉక్కిరిబిక్కిరి..! రంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్...! -
శాంతించిన క్రూడ్.. దిగొచ్చిన బంగారం!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభ దశలో భారీగా పెరిగిన క్రూడ్ సెగలు, బంగారం మెరుపులు క్రమంగా నెమ్మదించాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ంజ్ (నైమెక్స్)లో లైట్ స్వీట్ బ్యారల్ ధర మంగళవారం దాదాపు 7 శాతం (8డాలర్లకుపైగా) నష్టపోయి, 95 డాలర్లను తాకింది. ఇక బ్రెంట్ క్రూడ్ ధర కూడా ఇదే స్థాయిలో నష్టపోయి 99 డాలర్ల వద్దకు చేరింది. వారం క్రితం ఈ రెండు విభాగాల్లో ధరలు 130 డాలర్లు దాటి భారత్ సహా పలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, రష్యాపై ఆంక్షలు ప్రత్యేకించి చమురు దిగుమతులపై అమెరికా విధించిన నిషేధం వంటి అంశాలు దీనికి కారణం. పసిడి ఇలా... ఇక యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు సురక్షిత సాధనంగా బంగారంవైపు చూడ్డంతో అంతర్జాతీయ మార్కెట్లో 2008 నాటి గరిష్ట స్థాయి 2,079 డాలర్లను చూసిన ఔన్స్ (31 గ్రాములు) ధర, క్రితంకంటే 45 డాలర్లు పడిపోయి (2.3 శాతం) 1,920 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌లో రూ. 2,000లకు పైగా డౌన్ దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ ముంబైలో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు సోమవారంతో పోల్చితే మంగళవారం వరుసగా రూ.2,074, రూ.2,065 తగ్గి.. రూ.51,521, రూ.51,315 వద్ద ముగిశాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సేంజీ(ఎంసీఎక్స్)లోనూ దిగువముఖ ధోరణి కొనసాగుతోంది. మంగళవారం రాత్రి 10 గ్రాముల ధర దాదాపు రూ.1000 తగ్గి, రూ.51,250కి దిగివచి్చంది. ఫ్యూచర్స్ మార్కెట్లో ఇదే దిగువ ధోరణి కొనసాగి, డాలర్ మారకంలో రూపాయి విలువ స్థిరంగా ఉంటే (ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం 8పైసలు పడిపోయి 76.62 వద్ద ముగిసింది) బుధవారం స్పాట్ మార్కెట్లో పసిడి ధర మరింతగా రూ.1,000 వరకూ తగ్గే అవకాశం ఉంది. కాగా, వెండి కేజీ ధర ముంబై స్పాట్ మార్కెట్లో సోమవారంతో పోలి్చతే మంగళవారం ఏకంగా రూ.3,380 తగ్గి, రూ.67,200 వద్ద ముగిసింది. కారణాలు ఇవీ... ► రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల వల్ల తమ ఇబ్బందులు, పర్యవసానాలు ప్రభావాలపై ట్రేడర్లు పునఃమదింపు చేసుకోవడం ప్రారంభించారు. ► రెండు దేశాల మధ్య యుద్ధం నెలకొన్నప్పటికీ, కీలక అంశాలపై చర్చలకు అవి ప్రయత్నిస్తుండడం యుద్ధం ఏ క్షణమైనా ముగియవచ్చన్న సానుకూల సంకేతాలను ఇస్తోంది. ఈ పరిస్థితి ఇంధన సరఫరాలపై ఆందోళనలను ఉపశమింపజేస్తోంది. బంగారంపై పెట్టుబడుల గురించి ఇన్వెస్టర్లను పునరాలోచనలో పడేస్తోంది. ► చైనాలో కోవిడ్ కేసుల విషయానికి వస్తే, రోజూ వారీ కొత్త కేస్‌లోడ్ గణాంకాలు మంగళవారం రెండేళ్ల గరిష్టాన్ని తాకాయి. ప్రపంచంలోని అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారుగా ఉన్న చైనా నుంచి ఇంధన డిమాండ్ పడిపోతుందన్న అవుట్‌లుక్ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. ► ప్రస్తుతం చమురు కొరత ఏదీ లేదని ఒపెక్, ఇతర చమురు ఉత్పత్తి దేశాలు ప్రకటిస్తుండడం సరఫరాలపై ఆందోళనను తగ్గిస్తోంది. ► ఇక భారీగా పెరిగిన ధరల నుంచి లాభాల బుకింగ్ కూడా జరుగుతోంది. ► సాంకేతికంగా చూస్తే, క్రూడ్ తిరిగి పుంజుకోవాలంటే 104.50 డాలర్ల (20 రోజూల డీఎంఏ) స్థాయిని తిరిగి అందిపుచ్చుకోవాలి. రోజూవారీ ముగింపు 100 డాలర్ల దిగువున ఉంటే, సమీప కాలంలో బేరిష్ ఒత్తిడే అధికంగా ఉంటుంది. ► రష్యా–ఉక్రెయిన్ల చర్చలపై సానుకూల అవుట్లుక్తోపాటు, రెండు రోజుల సమావేశం అనంతరం బుధవారం (మార్చి 16వతేదీ) అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటును పావుశాతం (ప్రస్తుతం 0 నుంచి 0.25 శాతం) పెంచుతుందన్న అంచనాలు బంగారం తక్షణ బలహీనతకు కారణమవుతున్నాయి. చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా పడిపోతున్న ధరలు..! -
రష్యన్ చమురు కంపెనీలు భారత్ కు భారీ బంపర్ ఆఫర్..!!
-
రష్యా డిస్కౌంట్! పెట్రోల్ ధరలు అదుపులో ?
ప్రస్తుతం రష్యా– ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వివాదాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా ముడిచమురు, పసిడి తదితర కమోడిటీల ధరలు మండుతున్నాయి. దీంతో ఇప్పటికే ద్రవ్యోల్బణ సెగతో సమస్యలు ఎదుర్కొంటున్న భారత్‌సహా పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైనిక దళాలను మోహరించడం ప్రారంభించాక ఊపందుకున్న ముడిచమురు ధరలు నిలకడగా పెరుగుతూ వచ్చాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ ముందురోజు 139 డాలర్లను దాటగా.. ప్రస్తుతం 132 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోపక్క ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి విలువ సైతం చరిత్రలోనే తొలిసారి 77 వద్ద ముగిసింది. దీంతో దేశీ దిగుమతులు బిల్లు తడిసిమోపెడు కానుంది. అయితే రష్యా తాజాగా 25–27 శాతం డిస్కౌంట్ ధరలో భారత్‌కు ముడిచమురు అందించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వివరాలు చూద్దాం.. మూడో ర్యాంకులో ప్రపంచ దేశాలలో భారత్ చమురు దిగుమతులకు మూడో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఒమన్, దుబాయ్, బ్రెంట్ చమురును 75:25 నిష్పత్తిలో కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి నామమాత్ర స్థాయిలోనే (మొత్తం దిగుమతుల్లో దాదాపు ఒక శాతం) చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే బ్రెంట్ ధరలు తాజాగా 14ఏళ్ల గరిష్టానికి చేరడంతో రష్యా 25–27 శాతం డిస్కౌంట్ ధరలో చమురు సరఫరాకు ఆఫర్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది డిసెంబర్లో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ దేశీ పర్యటనకు వచ్చిన సందర్భంలో పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), రష్యా ప్రభుత్వ ఇంధన దిగ్గజం రాస్‌నెఫ్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. అత్యంత భారీ స్థాయిలో ఇండియాకు చమురు సరఫరాలు చేయగల రాస్‌నెఫ్ట్.. 2022 చివరికల్లా 2 మిలియన్ టన్నులమేర సరఫరా చేసేందుకు అంగీకరించింది. స్విఫ్ట్ ఎఫెక్ట్... రష్యా చమురు సరఫరాలకుగాను చెల్లింపుల విషయంలో ఇప్పటికింకా స్పష్టతలేనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో భారత్ ఆచితూచి వ్యవహరించవలసి ఉన్నట్లు తెలియజేశాయి. అయితే రష్యా బ్యారల్‌కు 11.6 డాలర్ల డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పశ్చిమ దేశాలు అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్ నుంచి పలు రష్యన్ బ్యాంకులను నిషేధించిన కారణంగా రిజర్వ్ బ్యాంక్‌సహా బ్యాంకింగ్ వర్గాలు ప్రత్యామ్నాయ చెల్లింపు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రుపీ–రూబుల్ వాణిజ్య ఖాతాను యాక్టివేట్ చేయడం ఒక ఆప్షన్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2020–21లో ఒపెక్ దేశాల నుంచి ఇండియా 196.5 మిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది చివరికల్లా క్రూడ్ ధరలు బ్యారల్‌కు 185 డాలర్లకు చేరవచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తుండటం ప్రస్తావించదగ్గ అంశం. -
సౌదీ యువరాజుకు పుతిన్ సందేశం!
Russian-Saudi partnership:ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణకు అడ్డుకట్టే వేసే నేపథ్యంలో ప్రపంచదేశాలు పలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యన్ కరెన్సీ రూబుల్ రికార్డ స్థాయిలో పతనమైంది. మరోవైపు ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్పుతిన్ సౌదీ యువరాజు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్లో సంభాషించారు. పాశ్చాత్య దేశాలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నందున కీలకమైన బౌగోళిక రాజకీయ కూటమి గురించి నొక్కిచెప్పారు. ఉక్రెయిన్ పై దాడి కారణంగా రష్యాను ఆర్థికంగా ఒంటరి చేశాయి. కీలకమైన రష్యా బ్యాంకులు అంతర్జాతీయ లావాదేవీల నిర్వహించకుండా ఉండేలా తొలగించింది. దీంతో వ్యాపారులు చమురు రవాణాను నిర్వహించడానికి విముఖత చూపుతారు. ఈ మేరకు సౌదీ అరేబియా, రష్యా నేతృత్వంలోని ఓపెక్ ప్లస్ బుధవారం జరిగిన సమావేశంలో తీవ్రతరం అవుతున్న ఈ సంక్షోభాన్ని తాము పెద్దగా పట్టించుకోలేదని పుతిన్ అన్నారు. కార్టెల్ క్రూడ్ ధరలను తగ్గించడానికి ఉత్పత్తిని పెంచే దిశగా కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉందని ఇది మాస్కో, రియాద్ల మధ్య ఉద్రిక్తతలను సృష్టించే అవకాశం ఉందన్నారు . అయినా ప్రపంచ ఇంధన సరఫరా సమస్యలను రాజకీయం చేయడం ఆమోదయోగ్యం కాదని కూడా పుతిన్ నొక్కిచెప్పారు. రష్యా సౌదీ భాగస్వామ్యంలో ఇరు దేశాలు పరస్పర సహకారంతో సమగ్ర అభివృద్ధిపథంలోకి దూసుకుపోవాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: అదే గనుక పేలితే ఐరోపా అంతమే: జెలెన్ స్కీ) -
చమురు బిల్లు తడిసి మోపెడు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021 ఏప్రిల్ – 2022 మార్చి) ముడి చమురు దిగుమతుల బిల్లు 125 బిలియన్ డాలర్లు (రూ.9 లక్షల కోట్లు) దాటిపోనుంది. క్రితం ఆర్థిక సంవత్సరం బిల్లుతో పోలిస్తే ఇది రెట్టింపు పరిమాణం. అంతర్జాతీయంగా చమురు ధరలు ఏడేళ్ల గరిష్టాలకు చేరడంతో దిగుమతులపై మరింత మొత్తం వెచ్చించక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు 11 నెలల్లో చమురు దిగుమతుల కోసం వెచ్చించిన మొత్తం 110 బిలియన్ డాలర్లుగా ఉంది. పెట్రోలియం శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనలైసిస్ సెల్ (పీపీఏసీ) ఈ గణాంకాలను విడుదల చేసింది. ఒక్క జనవరిలోనే ముడి చమురు కోసం 11.6 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టాల్సి వచ్చింది. 2021 జనవరిలో ఈ మొత్తం 7.7 బిలియన్ డాలర్లుగానే ఉంది. చమురు ధరలు పెరిగిపోవడం దీనికి ప్రధాన కారణం. ఉక్రెయిన్–రష్యా సంక్షోభంతో చమరు ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ 110 డాలర్ల వరకు వెళ్లడం తెలిసిందే. మన దేశ చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతులే తీరుస్తున్నాయి. దిగుమతి చేసుకున్న చమురును ఆయిల్ కంపెనీలు రిఫైనింగ్ ప్రక్రియ ద్వారా పెట్రోల్, డీజిల్‌గా మారుస్తాయి. మన దేశానికి సంబంధించి రిఫైనింగ్ సామర్థ్యం మిగులు ఉంది. కొన్ని పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తున్నాం. ఎల్పీజీని సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి ఉంది. పెట్రోలియం ఉత్పత్తులదీ అదే పరిస్థితి ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల కాలంలో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 33.6 మిలియన్ టన్నులుగా ఉంది. వీటి విలువ 19.9 బిలియన్ డాలర్లు. అదే కాలంలో 33.4 బిలియన్ డాలర్ల విలువ చేసే 51.1 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు నమోదయ్యాయి. భారత్ 2020–21 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు కోసం 62.2 బిలియన్ డాలర్లను (196.5 మిలియన్ టన్నులు) ఖర్చు చేసింది. కరోనా కారణంగా చమురు ధరలు స్థిరంగా ఉండడం లాభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు దిగుమతులు జనవరి చివరికి 175.9 మిలియన్ టన్నులు దాటిపోవడం గమనార్హం. కరోనా ముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో 227 మిలియన్ టన్నుల ముడి చమురును నికరంగా దిగుమతి చేసుకున్నాం. ఇందుకోసం చేసిన ఖర్చు 101.4 బిలియన్ డాలర్లుగా ఉంది. దిగుమతుల బిల్లు పెరిగిపోతే అది స్థూల ఆర్థిక అంశాలపై ప్రభావం చూపిస్తుంది. దేశీయంగా తగ్గిన చమురు ఉత్పత్తి దేశీయంగా చమురు ఉత్పత్తి పెరగకపోగా, ఏటా క్షీణిస్తూ వస్తోంది. ఇది కూడా దిగుమతులు పెరిగేందుకు దారితీస్తోంది. 2019–20లో 30.5 మిలియన్ టన్నుల ముడి చమురు ఉత్పత్తి అయింది. 2020–21లో ఇది 29.1 మిలియన్ టన్నులకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకు చేసిన ఉత్పత్తి 23.8 మిలియన్ టన్నులుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో ఉత్పత్తి 24.4 మిలియన్ టన్నులుగా ఉండడం గమనించాలి. ఎల్ఎన్జీ దిగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల్లో 6.2 బిలియన్ డాలర్లుగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి చివరకు 9.9 బిలియన్ డాలర్లకు పెరిగిపోయాయి. స్టోరేజీ నుంచి సరఫరాలు.. ధరలు తగ్గేందుకు కేంద్రం చర్యలు ప్రపంచ ఇంధన మార్కెట్లలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు చమురు శాఖ తాజాగా పేర్కొంది. రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధ భయాల నేపథ్యంలో సరఫరా అవాంతరాలు, తదితర సవాళ్లను పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో అవసరమైతే ధరలు తగ్గేందుకు వీలుగా వ్యూహాత్మక నిల్వల నుంచి చమురును విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ఇటీవల అంతర్జాతీయ చమురు ధరలు బ్యారల్‌కు దాదాపు 110 డాలర్లవరకూ ఎగసిన విషయం విదితమే. ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ దాడుల కారణంగా సరఫరాలకు విఘాతం కలగవచ్చన్న అంచనాలు ప్రభావం చూపాయి. రష్యాపై పశ్చిమ దేశాల తీవ్ర ఆంక్షలతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ప్రపంచ దేశాలలో సరఫరా మార్గాలకు అవాంతరాలు లేకుంటే æచమురు ధరల తీవ్రత నెమ్మదించే వీలుంది. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలను నిరోధించేందుకు భారత్ తగిన చర్యలు సైతం చేపడుతోంది. ఇందుకు అనుగుణంగా అమెరికా, జపాన్ బాటలో గతేడాది నవంబర్‌లో వ్యూహాత్మక నిల్వల నుంచి భారత్ 5 మిలియన్ బ్యారళ్ల చమురును విడుదల చేసేందుకు అంగీకరించింది. తీవ్ర ధరల నేపథ్యంలో ఎన్నికలు పూర్తవడంతోనే ధరలు రూ.10 వరకూ పెంచే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. నిరాటంకంగా రష్యన్ వజ్రాల సరఫరా: జీజేఈపీసీ యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తమ క్లయింట్లు అందరికీ వజ్రాలను నిరాటంకంగా సరఫరా చేస్తామని రష్యాకు చెందిన డైమండ్ మైనింగ్ సంస్థ అల్రోసా భరోసా ఇచ్చింది. రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కొలిన్ షా ఈ విషయం తెలిపారు. అల్రోసా ఉత్పత్తి చేసే మొత్తం రఫ్ డైమండ్‌లో దాదాపు 10 శాతాన్ని భారత్ దిగుమతి చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. తమ వ్యాపారం యథాప్రకారంగానే కొనసాగుతోందని, రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఫిబ్రవరి 28న జీజేఈపీసీకి అల్రోసా నుంచి లేఖ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
పెట్రోలియం, క్రూడాయిల్ దిగుమతుల భారం
న్యూఢిల్లీ: భారత పెట్రోలియం, క్రూడాయిల్ దిగుమతుల విలువ ఫిబ్రవరిలో భారీగా 67 శాతం పెరిగింది. విలువలో 15 బిలియన్ డాలర్లకు చేరింది. సమీప భవిష్యత్‌లో భారత్‌లో ధరల పెరుగుదలకు సంకేతంగా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన ఫిబ్రవరి ఎగుమతులు–దిగుమతుల గణాంకాల్లో ఈ అంశం కీలకాంశంగా ఉంది. గణాంకాల్లో కీలకాంశాలు... ► ఫిబ్రవరిలో మొత్తం ఎగుమతుల విలువ 22.36 శాతం పెరిగి 33.81 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక దిగుమతుల విలువ 35 శాతం పెరిగి 55 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు భారీగా 21.19 డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ కేవలం 13.12 బిలియన్ డాలర్లు. ► ఎగుమతుల్లో ఇంజనీరింగ్ (31.34 శాతం పెరిగి 9.27 బిలియన్ డాలర్లు), పెట్రోలియం (66.29 శాతం పెరిగి 4.1 బిలియన్ డాలర్లు), రసాయన రంగాలు (25 శాతం పెరిగి 2.4 బిలియన్ డాలర్లు) మంచి పనితీరును ప్రదర్శించాయి. కాగా, ఫార్మా ఎగుమతులు 3.13 శాతం క్షీణించి 1.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ► ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతులు 29 శాతం పెరిగి 6.24 బిలియన్ డాలర్లకు చేరింది. 400 బిలియన్ డాలర్ల లక్ష్యం సాకారం! ఇక భారత్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల కాలంలో (2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకూ) 374.05 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 45.80 శాతం అధికం. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 59.21 శాతం పెరిగి 550.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరిసి వాణిజ్యలోటు 176.07 బిలియన్ డాలర్లుగా ఉంది. తాజా గణాంకాల ప్రకారం, భారత్ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్.. కేంద్రానికి లక్ష కోట్ల నష్టం..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో బ్రెంట్ బ్యారెల్ ముడి చమరు ధర $100కు చేరుకుంది. అయితే, ముడి చమురు ధరలు పెరగడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.95,000 కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల నష్టం కలగవచ్చు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) ఆర్థిక విభాగం ఒక నివేదికలో తెలిపింది. రెండు రోజుల నుంచి ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2021 నుంచి పెట్రోల్ & డీజిల్ ధరలలో పెద్దగా మార్చలేదు. "ప్రస్తుతం ధరల ప్రకారం.. ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $95/బిబిఎల్.-$110 బిబిఎల్ మధ్య ఉంది. అయితే, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో ఉన్న ప్రస్తుత డీజిల్ & పెట్రోల్ ధరల కంటే రూ.9-14 ఎక్కువగా ఉండాలి" అని ఎస్బీఐ 'ఎకోర్యాప్' పేర్కొంది. అయితే, ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మార్చిలో పెట్రోల్ & డీజిల్ ధరలు పెరగకుండా ఉండాలంటే పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.7 తగ్గించాల్సి ఉంటుంది అని పేర్కొంది. అప్పుడు నెలకు రూ.8,000 కోట్లకు పైగా ఎక్సైజ్ సుంకం నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. "వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ & డీజిల్ వినియోగం ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం పెరిగితే అప్పుడు ప్రభుత్వం నష్టం సుమారు 95000 కోట్ల నుండి లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుంది" అని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దేశ రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.01 శాతంగా ఉంది. గత ఏడు నెలల కాలంలో ఇదే గరిష్టం. (చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్.. ఆ అవకాశం మరో 3 రోజులే!) -
పోలింగ్ ముగుస్తూనే.. పెట్రో బాంబ్?
(సాక్షి, బిజినెస్/ సాక్షి,అమరావతి): జాతీయ పార్టీల తలరాతలు మార్చే ఉత్తర ప్రదేశ్‌తో సహా నాలుగు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికలు... గడిచిన మూడు నాలుగు నెలలుగా పెట్రో ధరల పెంపు నుంచి సామాన్యులను కాపాడుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. వివిధ దేశాల్లో ఈ మేరకు స్థానికంగా రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరగటంతో ఆ ప్రభావం ఆయా దేశాల ద్రవ్యోల్బణం మీద పడింది. అమెరికా, బ్రిటన్, చైనా వంటి అగ్రరాజ్యాల్లో సైతం ద్రవ్యోల్బణం (ధరల మంట) విపరీతంగా పెరిగింది. ఎన్నికల్లో విజయావకాశాల దృష్ట్యా కొన్నాళ్లుగా ధరల పెంపు జోలికి కేంద్ర ప్రభుత్వం వెళ్లకపోవటంతో దేశంలో ఇంకా ద్రవ్యోల్బణం కాస్త అదుపులోనే ఉంది. కాకపోతే కొన్నాళ్లుగా పెరుగుతున్న అంతర్జాతీయ ధోరణికి తగ్గట్టుగా ఇక్కడా ధరలు పెంచక తప్పదు కనక ఎన్నికలు పూర్తయిన మరు క్షణంలోనే ఆ భారాన్ని జనంపై మోపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనికి రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తోడయింది. ఇది ముడి చమురు ధరలను మరింతగా మండిస్తోంది. ఈ ధరలు ఏ స్థాయికి వెళతాయో కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఈ భారాన్ని కూడా అంతిమంగా జనంపైనే మోపుతారు కనక... ఈ రెండు పరిణామాలూ సామాన్యులపై భరించలేని భారాన్ని మోపే సంకేతాలొస్తున్నాయి. నెల జీతంలో కనీసం 8 నుంచి 15 శాతాన్ని పెట్రోలు, డీజిల్‌పైనే పెట్టే సామాన్యులకిది మింగుడుపడని వ్యవహారమే. బల్క్ ధరలు ఇప్పటికే పెంపు! నిజానికి కొన్నాళ్లుగా రిటైల్ అవుట్లెట్లలో సామాన్యులు కొనే పెట్రోలు, డీజిల్ ధర పెంచకపోయినా రైల్వే, ఆర్టీసీ వంటి సంస్థలు టోకుగా కొనుగోలు చేసే బల్క్ డీజిల్ ధర మాత్రం ఇప్పటికే పెంచేశారు. సహజంగా బల్క్ ధర రిటైల్ ధర కన్నా ఎంతో కొంత తక్కువే ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొన్నాళ్లుగా బంకుల్లో సామాన్యులకు విక్రయించే ధరలు పెంచకుండా... బల్క్‌గా కొనుగోలు చేసేవారికి మాత్రం పెంచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే రిటైల్‌గా కొనుగోలు చేసే లీటర్ డీజిల్ ధర రూ.96 ఉండగా... బల్క్‌గా కొనుగోలు చేస్తున్న వారికి మాత్రం ఈ ధర ఇప్పటికే రూ.100 దాటిపోయింది. అంటే.. రిటైల్‌పై పెంచాల్సిన భారం ఇప్పటికే పెండింగ్‌లో ఉందన్న మాట!!. మరి దీనికి రష్యా–ఉక్రెయిన్ యుద్ధ భయాల కారణంగా అమాంతంగా ఎగసిన ముడిచమురు ధరలు కూడా తోడయితే..? అమ్మో! తలచుకుంటేనే గుండె గుభేల్మనక మానదు. బల్క్‌కు ఎప్పుడూ తక్కువ ధరే! సాధారణంగా బల్క్ డీజిల్ ధరను 15 రోజులకోసారి నిర్ణయిస్తారు. రవాణా ఛార్జీలు, ఇతరత్రా కలిసొస్తాయి కనక రిటైల్ వినియోగదారులకు విక్రయించే ధరకంటే లీటరుకు రూ.6 నుంచి రూ.10 తక్కువకే ఆయిల్ సంస్థలు బల్క్ వినియోగదారులకు సరఫరా చేస్తాయి. గతేడాది నవంబరులో రిటైల్ డీజిల్ ధర కంటే బల్క్ డీజిల్ ధర లీటర్‌కు ఏకంగా రూ.15.36 తక్కువ ఉంది. జనవరి నుంచి బల్క్ డీజిల్ ధర పెరుగుతూ వచ్చింది. జనవరి 16న బల్క్ డీజిల్ ధర లీటరుకు రూ.90.68 ఉండగా.. రిటైల్ ధర లీటరుకు రూ.96.02 ఉంది. ఫిబ్రవరి 1 నాటికి రెండు ధరలూ దాదాపు సమానమయ్యాయి. ఇపుడైతే రిటైల్ డీజిల్ ధర రూ.96.02 ఉండగా బల్క్ ధర రూ.100.41కు చేరింది. అంటే రిటైల్ ధర కంటే బల్క్ డీజిల్ ధర లీటర్‌కు రూ.4.39 ఎక్కువ.!! రిటైల్ నుంచే కొంటున్న ఆర్టీసీ... రాష్ట్రంలో ఆర్టీసీ సగటున నెలకు 2.50 కోట్ల లీటర్ల డీజిల్ కొంటుంది. ఆ ప్రకారం ఆర్టీసీపై నెలకు ఏకంగా రూ.10 కోట్ల భారం అదనంగా పడుతోంది. దీంతో ఆర్టీసీ బస్సులకు పెట్రోల్ బంకుల్లో రిటైల్ డీజిల్ కొనడానికి అనుమతినిచ్చింది. దీనిద్వారా కొంత ఆర్థిక భారం తగ్గుతోంది. రైల్వేలో దేశవ్యాప్తంగా 65 శాతం రైళ్లు విద్యుత్తుతో, 35 శాతం రైళ్లు డీజిల్‌తో నడుస్తున్నాయి. రైల్వే శాఖ నెలకు 22 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తోంది. ఆ ప్రకారం లీటరుకు సగటున రూ.4.39 చొప్పున రైల్వేపై నెలకు దాదాపు 96.58 కోట్ల ఆర్థికభారం అదనంగా పడుతోంది. ఎన్నికల తరువాత ఎంత బాదుడు? బల్క్– రిటైల్ ధరలను పోల్చినపుడు రిటైల్ ధర బల్క్కన్నా 15–20% ఎక్కువుండేది. అంటే లీటరుపై రూ.15 నుంచి 20 వరకూ పెరగొచ్చు. అది కూడా రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం లేనపుడు. మరి యుద్ధంతో ఇప్పటికే ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి కనక రిటైలర్లపై బాదుడు ఏ స్థాయిలో ఉంటుందన్నది ఊహించుకోవాల్సిందే. ఎన్నికలప్పుడు పెంచకపోవటమనేది కేంద్రంలోని ప్రభుత్వాలకు కొత్త కాదు. 2013 చివర్లోనూ ఇలానే జరిగింది. 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు ఉండటంతో రిటైల్ డీజిల్ ధర పెంచలేదు. బల్క్ ధరను మాత్రం 2013 చివరి నుంచి ఆయిల్ కంపెనీలు పెంచుకుంటూపోయాయి. ఇప్పుడూ ఇదే పరిస్థితి. ఏపీలో ప్రస్తుతం రోజుకు 84.02 లక్షల లీటర్ల డీజిల్, 52.90 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తుండటం గమనార్హం. భయపెడుతున్న ద్రవ్యోల్బణం అమెరికా–చైనా నాలుగేళ్ల కిందట ప్రారంభించిన టారిఫ్‌ల యుద్ధం... ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య ఆంక్షలు ఇప్పటికే చాలా దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచేశాయి. ఇక కోవిడ్‌తో వివిధ దేశాల సరళతర ద్రవ్య విధానాలు మరింత ముమ్మరమై ధరల స్పీడ్‌ను తెగ పెంచేశాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమన్న పేరుతో అమెరికా రిజర్వు బ్యాంకు ‘ఫెడ్’.. ఎడాపెడా నిధులు కుమ్మరించింది. ఫలితం...అమెరికాలో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ 2022 జనవరిలో నాలుగు దశాబ్దాల్లోనే గరిష్ట స్థాయి అయిన 7.5 శాతాన్ని తాకింది. 1982 తరవాత ఈ స్థాయి ద్రవ్యోల్బణం ఎప్పుడూ నమోదు కాలేదు మరి. చైనాలోనూ ద్రవ్యోల్బణం 10 శాతం స్థాయిలో కొనసాగుతోంది. భారత్ విషయానికొస్తే జనవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం ఏకంగా ఏడు నెలల గరిష్ట స్థాయి 6.01 శాతంగా (2021 ఇదే నెల ధరలతో పోల్చి) నమోదయింది. పెట్రో ధరలు పెంచకపోవటంతో ఇది ఈ స్థాయిలో ఉందని, అదే జరిగితే మరింత పైకెగసే ప్రమాదం లేకపోలేదని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇక తాజాగా తలెత్తిన యూరోప్ భౌగోళిక ఉద్రిక్తతలు మరో నెలపాటు కొనసాగితే... ఈ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 150 నుంచ 200 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. -
రూపాయికి క్రూడ్ కష్టాలు
ముంబై: రూపాయి అయిదు రోజుల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. డాలర్ మారకంలో 29 పైసలు క్షీణించి 74.84 వద్ద స్థిరపడింది. తూర్పు ఐరోపా దేశాల్లో నెలకొన్న భౌగోళిక, రాజకీయ సంక్షోభంతో సరఫరా సమస్యలు తలెత్తవచ్చనే భయాలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు నాలుగు శాతం ఎగిశాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 98.79 డాలర్లకు చేరింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ అగడం లేదు. ఈ అంశాలు రూపాయి పతనానికి కారణమైనట్లు ట్రేడర్లు తెలిపారు. ఇంట్రాడేలో రూపాయి 31 పైసలు క్షీణించి 74.86 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ‘‘అంతర్జాతీయ అనిశి్చతులతో ఫారెక్స్ ట్రేడర్లు రిస్క్ ఆఫ్ వైఖరి ప్రదర్శించారు. ఫెడ్ సమావేశ నిర్ణయాలు వెలువడేంత వరకు రూపాయి పరిమిత శ్రేణిలో ట్రేడ్ అవుతోంది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దిలీప్ పర్మార్ తెలిపారు. -
కష్టకాలంలో శ్రీలంకకు అండగా భారత్..!
మన పక్కనే ఉన్న శ్రీలంక దేశం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పుడు ఆ దేశాన్ని ఆర్ధిక సంక్షోభం, ఆహార సంక్షోభం కుదిపేస్తుంది. కరోనా మహమ్మారి వల్ల పర్యాటక రంగం దెబ్బతినడంతో ఆ దేశ ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో ఆ దేశంలోని విదేశీ మారక నిల్వలు రోజు రోజుకి తరిగిపోతున్నాయి. దీంతో చమరు, నిత్యావసర సరుకులను దిగుమతి చేసుకోవడానికి కూడా డబ్బులు లేకపోవడంతో శ్రీలంక, భారత్ సహాయాన్ని కోరింది. అత్యవసర చమురు కొనుగోళ్లకు కోసం 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇవ్వాలని శ్రీలంక మనదేశాన్ని ఆశ్రయించింది. ఈ విషయంపై గత రెండు వారాలుగా జరుగుతున్న చర్చల తర్వాత భారత్ ఆ దేశానికి 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఒప్పందంపై కూడా సంతకాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. "భారతీయ సరఫరాదారుల నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి శ్రీలంకకు ఈ 500 మిలియన్ డాలర్లు ఇచ్చినట్లు" ఒక అధికారి తెలిపారు. అలాగే, భారతదేశం నుంచి అత్యవసరమైన ఆహారం, ఔషధ దిగుమతుల కోసం మరో 1 బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ పై చర్చలు జరుగుతున్నాయని ఒక భారతీయ దౌత్యవేత్త తెలిపారు. ఆ దేశంలోని విదేశీ మారక నిల్వలు భారీగా పడిపోవడంతో నిత్యావసర సరుకులైన పప్పులు, పంచదార, గోధుమ పిండి ధరలు ఆ దేశంలో ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆ దేశంలో కరెంట్ కోతలు కూడా ఎక్కువ కావడంతో నిరుద్యోగ రేటు కూడా భారీగా పెరిగిపోతుంది. ఆ దేశంలో ఆహార ద్రవ్యోల్బణం గత నెలలో రికార్డు స్థాయి 25 శాతానికి చేరుకుంది.ఆ దేశం డబ్బును ఆదా చేయడానికి విదేశీ దౌత్య కార్యాలయాలను కూడా మూసివేసింది. గత సంవత్సరం చివరి నుంచి మూడు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు ఆ దేశానికి ఇచ్చే క్రెడిట్ రేటింగ్స్ తగ్గించడంతో కొన్ని దేశాలు ఆ దేశానికి అప్పులు ఇవ్వడానికి కూడా వెనుకడుగు వేస్తున్నాయి. అలాగే, చైనా నుంచి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడానికి మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుంది. (చదవండి: 'మేక్ ఇన్ ఇండియా' కోసం భారీగా కస్టమ్స్ సుంకం మినహాయింపులు!) -
దేశంలో తగ్గిన చమురు ఉత్పత్తులు
న్యూఢిల్లీ: దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి అంతకంతకూ తగ్గుతోంది. నవంబర్‌లో 2 శాతం క్షీణించింది. అధికారిక గణాంకాల ప్రకారం క్రూడాయిల్ ఉత్పత్తి గతేడాది నవంబర్‌లో 2.48 మిలియన్ టన్నులుగా ఉండగా, ఈ ఏడాది నవంబర్‌లో 2.43 టన్నులకు పరిమితమైంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇది 2.5 మిలియన్ టన్నులుగా నమోదైంది. పరికరాలు, యంత్రాలను సమకూర్చుకోవడంలో జాప్యం కారణంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ఉత్పత్తి 3 శాతం తగ్గి 1.6 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ఆయిల్ ఇండియా ఉత్పత్తి 2,43,200 టన్నుల నుంచి 2,41,420 టన్నులకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్–నవంబర్ మధ్య) దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి 2.74 శాతం క్షీణించి 19.86 మిలియన్ టన్నులుగా నమోదైంది. దేశీయంగా ఇంధన అవసరాల కోసం భారత్ ఏటా 85 శాతం మేర క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు, కోవిడ్ దెబ్బతో కుదేలైన ఎకానమీ క్రమంగా పుంజుకుంటూ ఉండటంతో ఇంధన వినియోగం పెరిగి, రిఫైనరీల్లో ప్రాసెసింగ్ సైతం గణనీయంగా మెరుగుపడింది. రిఫైనరీలు .. నవంబర్‌లో 21.48 మిలియన్ టన్నుల క్రూడాయిల్ (గత నవంబర్‌తో పోలిస్తే 3.38 శాతం అధికం) ప్రాసెస్ చేశాయి. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో ఇది 11.7% వృద్ధి చెంది 155.73 మిలియన్ టన్నులుగానమోదైంది. | గ్యాస్ 23 శాతం అప్.. నవంబర్‌లో సహజ వాయువు (నేచురల్ గ్యాస్) ఉత్పత్తి 23 శాతం పెరిగి 2.86 బిలియన్ ఘనపు మీటర్లుగా (బీసీఎం) నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ ఆధ్వర్యంలోని కేజీ–డీ6 బ్లాకులో కొత్త క్షేత్రాలు అందుబాటులోకి రావడం ఇందుకు దోహదపడింది. కేజీ–డీ6 నుంచి ఉత్పత్తి 1,251 శాతం ఎగిసి 581.36 బీసీఎంకి చేరగా, ఓఎన్జీసీ క్షేత్రాల్లో మాత్రం 5.28 శాతం క్షీణించి 1.72 బీసీఎంకి తగ్గింది. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో గ్యాస్ ఉత్పత్తి 21.78 శాతం పెరిగి 22.77 బీసీఎంకి చేరింది. చదవండి: Oil Price: సామాన్యులకు ఊరట.. దిగిరానున్న వంట నూనె ధరలు! -
రూపాయికి క్రూడ్ సెగ
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత కొనసాగుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో వరుసగా రెండవ రోజు 18 పైసలు బలహీనపడి 74.52 వద్ద ముగిసింది. వరుసగా రెండు రోజుల్లో రూపాయి 50 పైసలు నష్టపోయింది. అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలో ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణం భయాలు, సరళతర ద్రవ్య విధానానికి ముగింపు పడుతోందన్న సంకేతాలు, అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలోపేత ధోరణి వంటి అంశాలు తాజాగా రూపాయి సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 74.44 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 74.59 గరిష్ట స్థాయిని కూడా తాకింది. చివరకు బుధవారం ముగింపుతో పోల్చితే 18 పైసలు బలహీనపడి (బుధవారం ముగింపు 74.34) 74.52 వద్ద ముగిసింది. వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం అమెరికాలో 1990 తర్వాత ఎన్నడూ లేనంత పెరగడంతో, వడ్డీరేట్లు పెరుగుదల అంచనాలు అధికమయ్యాయి. దీనితో ప్రపంచవ్యాప్తంగా డాలర్ పెట్టుబడులు వెనక్కు మళ్లడంతో డాలర్ ఇండెక్స్ పెరుగుతోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల బలహీనతకు దారితీస్తోంది. చైనాలో కూడా పారిశ్రామిక రంగానికి సంబంధించి ద్రవ్య్లోల్బణం అంచనాకు మించి (12.03 శాతం) 26 ఏళ్ల గరిష్ట స్థాయి 13.05 %కి పెరగడం గమనార్హం. కాగా, డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 95పైన ట్రేడవుతోంది. ఇక అంతర్జాతీయంగా నైమెక్స్ స్వీట్ క్రూడ్ బేరల్ ధర 82 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ ర్రూడ్ 83 డాలర్ల పైన ఉంది. -
Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు!
ఏ వింత వ్యాధినైనా ముందుగా చైనా నాంది పలుకుతోంది. అది అపోహకాదని ఇటీవల వెలుగుచూసిన కొన్ని షాకింగ్ విషయాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత కాలుష్యం చైనాలో ఉందట. ఈ కింది ఫొటోలు చూస్తే మీకేతెలుస్తుంది. విపరీతమైన కాలుష్యకోరల్లో చిక్కుకున్న ఓ నదిలో తేలియాడుతున్న బారీ చేప కళేబరంఇది. కేవలం చేపలేకాదు సమస్త జీవాలన్నీ ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న చేపలన్నీ కేవలం కాలుష్యం మూలంగానే మరణించాయి. ఈ రైతు ముఖంలో వేదన ఈ ఫొటోలో క్లియర్‌గా చూడొచ్చు. మూడింట రెండు వంతుల చైనాలోని నగరాలు వాయు ఉద్గార ప్రమాణాలను పాటించడం లేదు. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాలు అక్రమంగా జియాన్హే నదిలో విడుదల చేయడం వల్ల పూర్తిగా కాలుష్యమై నీరు ఎర్రగా మారిపోయిన చిత్రమిది. ఝుగావో సిటీ మధ్యలో నుంచి ప్రవహిస్తున్న నది ఇది. గ్రామీణ ప్రాంతాల్లో చెత్త వేయడానికి చోటు ఎక్కడా లేకపోవడంతో ఆచెత్తంతా నదిలో కలుస్తుంది. చైనాలోని 560 మిలియన్ పట్టణ వాసుల్లో కేవలం 1% మంది మాత్రమే యూరోపియన్ యూనియన్ ప్రమాణాల ప్రకారం స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నారు. చాలా సార్లు విపరీతమైన వాయు కాలుష్యంమూలంగా స్కూళ్లు, ఆఫీసులకు సెలవు కూడా ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. చదవండి: టీవీ చూస్తూ.. హాయిగా నిద్రపోతే చాలు.. నెల జీతం రూ.25 లక్షలు!! ఫుయువాన్ నదిలోని కాలుష్య నీటిని తాగుతున్న చిన్నారి. చైనాలో అందుబాటులో ఉన్న నీటి వనరులన్నింటినీ 2030నాటికల్లా అక్కడి ప్రభుత్వ ప్రాజెక్టులు పూర్తిగా నాశనం చేయనున్నాయి. సముద్రంలోకి విడుదలౌతున్న ఉద్ఘారాలను అక్కడి ప్రజలు నిత్యం చూస్తూనే ఉన్నారు. గత జనవరి 12న అక్కడి వాయు నాణ్యతను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా కొలవలేకపోయింది. ప్రతి ఏటా 7 లక్షల 50 వేల మంది కేవలం వాయుకాలుష్యం మూలంగానే మరణిస్తున్నారు. 2010 లో ఒక చమురు నిల్వ కేంద్రంలో సంభవించిన పేలుడు వల్ల దాదాపు 400 మిలియన్ గ్యాలన్ల చమురు లీక్ అయ్యింది. అది మెక్సికోలో సంభవించిన బీజీ ఆయిల్ స్పిల్ కంటే 4 రెట్లు ఎక్కువ. కాలుష్యం వల్ల 2012లో 2,589 మంది బీజింగ్ ప్రజలు మరణించారు. ఇప్పటికే 90% చైనా భూగర్భజలాలు కలుషితమైపోయాయి. ప్రపంచంలోనే 30 అత్యంత కలుషిత నగరాల్లో 20 నగరాలు చైనాకు చెందినవే. ప్రపంచంలోని సగం బొగ్గును చైనానే వినియోగిస్తోంది. 2030 నాటికల్లా చైనా విడుదల చేసే కార్భన్డైఆక్సైడ్ ప్రపంచం మొత్తం కాలుష్యంతో సమానమౌతుందని ఒక అంచనా. చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! -
75 చేరువకు రూ‘పాయె’
ముంబై: భారత్ రూపాయి విలువ డాలర్ మారకంలో బుధవారం భారీగా 54 పైసలు పడిపోయింది. 74.98 వద్ద ముగిసింది. గడచిన ఐదు నెలల్లో (ఏప్రిల్ 23 తర్వాత) రూపాయి ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. రూపాయి ఒకేరోజు ఈ స్థాయిలో పడిపోవడం కూడా ఆరు నెలల్లో ఇదే తొలిసారి. దీనితో వరుసగా గత తొమ్మిది ట్రేడింగ్ షెషన్లలో ఎనిమిది రోజులు రూపాయి నష్టాలను చవిచూసినట్లయ్యింది. దేశీయంగా ఈక్విటీల బలహీనతలకు తోడు అంతర్జాతీయంగా డాలర్ బలోపేత ధోరణి రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, ద్రవ్యోల్బణం భయాలు కూడా రూపాయికి ప్రతికూలం అవుతున్నాయి. ట్రేడింగ్‌లో డాలర్ మారకంలో 74.63 వద్ద ప్రారంభమైన రూపాయి, 74.54 కనిష్ట–74.99 గరిష్ట స్థాయిల్లో కదలాడింది. రూపాయి 75 స్థాయిని కాపాడుకోలేకపోతే మరింత పతనం తప్పకపోవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ విశ్లేíÙంచారు. సమీప కాలానికి 73.95 వద్ద మద్దతు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 74.82 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 94.30 పైన ట్రేడవుతోంది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ) కాగా అంతర్జాతీయంగా నైమెక్స్ స్వీట్ క్రూడ్ బేరల్ ధర 78.64 వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ విషయంలో ఈ ధర 82.50 వద్ద ఉంది. -
కాలిఫోర్నియా బీచ్‌లో ముడిచమురు లీక్.. పర్యావరణానికి తీవ్ర నష్టం!
కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్ సమీపంలో చమురు బావి నుంచి ముడి చమురు శనివారం ఉదయం పైకి ప్రవాహంలా తన్నుకు వచ్చింది. దీంతో అక్కడి ఇసుక తిన్నెల్లో మృతి చెందిన పక్షులు, చేపలతో పరిస్థితి హృదయ విదాకరంగా మారింది. అక్కడి చిత్తడి నేలలు కూడా చమురు పొరతో నిండిపోయాయి. బీచ్‌లన్నీ నిర్మాణుష్యమైపోయాయి. వార్షిక ఎయిర్ షోలు కూడా రద్దయ్యాయి. దాదాపుగా లక్ష 23 వేల గ్యాలన్లు లేదా 3 వేల బ్యారెల్స్ ముడి చమురు పసిఫిక్ మహాసముద్రంలో వచ్చిపడింది. బీచ్ సమీపంలోని దక్షిణ లాస్ ఏంజెల్స్ సిటీలో 40 మైళ్ల వరకు దీని ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. దీంతో దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో గందర గోళ పరిస్థితి నెలకోంది. వాతావరణమంతా పెట్రోల్ దుర్గంధంతో నిండిపోయింది. హంటింగ్టన్ బీచ్ సమీపంలో గల చమురు బావిలో అయిల్ లీకవుతున్న విషయాన్ని గుర్తించిన ఇంజనీరింగ్ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. లీకేజీని అరికట్టే ప్రయత్నం చేశారు. కాగా హంటింగ్టన్ బీచ్ మేయర్ కిమ్ కార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సముద్రం పై భాగంలో దాదాపుగా 13 చదరపు మైళ్ళ మేర చమురు పొర వ్యాపించి ఉండవచ్చని మేయర్ తెలిపారు. ఈ ఉపద్రవం వల్ల పెద్ద సంఖ్యలో సముద్ర జీవరాశి మరణించింది. పర్యావరణం పై తీవ్ర ప్రభావాన్ని చూపిందని పర్యావరణ వేత్తలు పేర్కోన్నారు. దీనిని పెద్ద పర్యావరణ విపత్తుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ లీక్ ఎక్కడ ఎందుకు సంభవించిందో తెలుసుకోవడానికి దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. చదవండి: అబ్బే ఏం లేదు.. నాకు కొంచెం సిగ్గెక్కువ.. అందుకే!! -
సామాన్యుడిని భయపెడుతున్న చమురు, గ్యాస్ ధరలు
-
ఆగస్టులో తగ్గిన క్రూడ్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టులో 2.3 శాతం క్షీణించింది. అదే సమయంలో రిలయన్స్–బీపీకి చెందిన కేజీ–డీ6 క్షేత్రాల ఊతంతో సహజ వాయువు ఉత్పత్తి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆగస్టులో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ క్షేత్రాల్లో ఉత్పత్తి తగ్గడంతో క్రూడాయిల్ ఉత్పత్తి 2.51 మిలియన్ టన్నులకు పరిమితమైంది. మరోవైపు సహజ వాయువు ఉత్పత్తి 20.23 శాతం పెరిగి 2.9 బిలియన్ ఘనపు మీటర్లుగా నమోదైంది. ప్రైవేట్ ఆపరేటర్ల క్షేత్రాల్లో ఉత్పత్తి 186 శాతం పెరగడం ఇందుకు దోహదపడింది. ముడిచమురును పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా మారుస్తారు. భారత్ తన క్రూడాయిల్ అవసరాల్లో 85 శాతం భాగాన్ని దిగుమతి చేసుకుంటోంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. 14 శాతం అధికంగా ప్రాసెసింగ్.. ఇంధనాలకు డిమాండ్ పుంజుకుంటూ ఉండటంతో చమురు రిఫైనరీలు ఆగస్టులో 14.17 శాతం అధికంగా 18.4 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌ను ప్రాసెస్ చేశాయి. ప్రభుత్వ రంగ రిఫైనరీలు 13.6 శాతం, ప్రైవేట్ రంగ రిఫైనరీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 16.4 శాతం అధికంగా ముడిచమురును శుద్ధి చేశాయి. రిఫైనరీలు ఆగస్టులో 19.5 మిలియన్ టన్నుల మేర పెట్రోలియం ఉత్పత్తులను తయారు చేశాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఇది 9 శాతం అధికం. ఇక ఏప్రిల్–ఆగస్టు మధ్య కాలంలో 12 శాతం అధికంగా 100.2 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను ఉత్పత్తి చేశాయి. రిఫైనరీలు గతేడాది ఆగస్టులో స్థాపిత సామర్థ్యంలో 76.1 శాతం స్థాయిలో పనిచేయగా.. ఈ ఏడాది 87 శాతం మేర పనిచేశాయి. చదవండి: కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే! -
రూ.23 లక్షల కోట్లు ఏమయ్యాయి?: రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ రోజూరోజుకి క్షీణిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో గత 70 ఏళ్లుగా నిర్మించినవి మోదీ తన స్నేహితులకు పంచిపెడుతున్నారని దుయ్యబట్టారు. జీడీపీ పెరగడమంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమేనా అని ఆయన ప్రశ్నించారు. వీటి ధరలను పెంచడం ద్వారా గత ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి రూ.23లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. ఈ డబ్బంతా ఎక్కడికి పోయిందని కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదని, అయితే ప్రైవేటీకరణ ప్రణాళికకు ఓ పద్దతి ఉంటుందని ఆయన అన్నారు. రైల్వేలు భారతదేశానికి వెన్నుముక వంటివని, రైల్వేల అమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకిస్తుందన్నారు. చదవండి: వంట గ్యాస్ ధర ఎందుకు పెరుగుతుందో ప్రధాని చెప్పాలి: రాహుల్ 2014 నుంచి అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గుతున్నా భారత్‌లో మాత్రం పెరిగిపోతున్నాయన్నారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం భారతదేశ ఆస్తులు, సంస్థలను అమ్మేస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలతో రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, వేతన జీవులు, చిన్న మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి దిగజారిపోతోందని, మోదీకి చెందిన నలుగురైదుగురు మిత్రులకు మాత్రమే లాభం చేకూరుతోందని దుయ్యబట్టారు. చదవండి: ‘అఫ్గాన్ నుంచి భారతీయుల తరలింపే మొదటి ప్రాధాన్యత’ -
కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే!
ప్రపంచ కుబేరుల జాబితాలో 4వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ తన సంపదను మరింత వృద్ధి చేసుకోనున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రానున్న రోజుల్లో సుమారు రూ.60వేల కోట్లు డాలర్ల పెట్టుబడి పెట్టునున్నారు.ఈ పెట్టుబడులతో రూ.6.04 లక్షల కోట్లుగా ఉన్న ముఖేష్ అంబానీ సంపద మరింత పెరగనుంది. మనీ మేకింగ్ మిషన్ ముఖేష్ అంబానీకి గుజరాత్ జామ్ నగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం ఉంది. ఈ కేంద్రం ద్వారా అరేబియా సముద్రంలో ముడి చమురును వెలికి తీసి ఫ్యూయల్, ప్లాస్టిక్, కెమికల్స్‌ను తయారు చేస్తారు. దీని విస్తీర్ణం సుమారు న్యూయార్క్ సిటీలో మాన్ హాటన్ ప్రాంతం సగం వరకు ఉంటుందని అంచనా. తద్వారా పైప్లైన్ల నెట్వర్క్ ఇక్కడ రోజుకు14 లక్షల బారెల్స్ పెట్రోలియంను ప్రాసెస్ చేస్తున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ తన సొంత కార్యకలాపాల కోసం 45 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను ఉత్పత్తి చేసినట్లు బ్లూమ్ బెర్గ్ లెక్కలు చెబుతున్నాయి. ముఖేష్ ఆస్థి మొత్తంలో 60 శాతం ముడి చమురు ఉత్పత్తుల ద్వారా వచ్చిన సంపదే. కాబట్టే ఆర్ధిక వేత్తలు సైతం జామ్ నగర్ చమురు ఉత్పత్తి కేంద్రం ముఖేష్ అంబానీకి మనీ మేకింగ్ మిషన్ లాంటిదని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. 10శాతం తగ్గుతుందేమో! ప్రపంచం మొత్తం పెట్రో కెమికల్స్ వ్యాపారాన్ని విస్తరించేందుకు ముఖేష్ అంబానీ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో పాటు గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టినా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి వడ్డీ, పన్నులు, తరుగుదల, తీసుకున్న రుణాల్ని తీర్చినా రిలయన్స్ ఆదాయంలో 10% మాత్రమే ఖర్చవుతుందని, ఆయిల్-టు-కెమికల్స్ ప్రాసెస్ తో వచ్చే ఆదాయం 33 శాతం ఉంటుందని శాన్ఫోర్డ్ ఎనలిస్ట్ సి. బెర్న్‌స్టెయిన్ అంచనా వేశారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రమణ మాట్లాడుతూ..జామ్ నగర్ చమురు శుద్ధి కేంద్రాల వల్ల పర్యావరణానికి ప్రమాదమని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడుల కోసం చేపట్టే ఉత్పత్తుల వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సంకేతాలు వెలువడుతున్నా ముఖేష్ అంబానీ పట్టించుకోవడం లేదని అన్నారు. అలా చేస్తే రిలయన్స్ కూకటి వేళ్లు కదిలే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు?! ఈ ఏడాది జూన్‌లో జరిగిన రిలయన్స్ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ మొబైల్ నెట్‌వర్క్‌లో జియో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో, ఏ స్థాయిలో మార్పులు తీసుకువచ్చిందో..రాబోయే రోజుల్లో అదే తరహా పరిస్థితులు గ్రీన్ ఎనర్జీ రంగంలో తెచ్చేందుకు కృషి చేస్తుందన్నారు. అంతేకాదు మూడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చిన శిలాజ ఇంధనాల యుగం ఎక్కువ కాలం కొనసాగదంటూనే.. గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాబట్టే ఈ గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ చమురు ఉత్పత్తులు తగ్గి రిలయన్స్ కూకటివేళ్లు కదిలే పరిస్థితి ఎదురైనా.. ముఖేష్ అంబానీ కుబేరుడి స్థానానికి వచ్చిన ఢోకా ఏం లేదని జోస్యం చెబుతున్నారు. చదవండి : పసిడి మరింత పైపైకి.. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం!! -
జులైలో ముడి చమురు ఉత్పత్తి తగ్గింది
న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి జులైలోనూ క్షీణించింది. గతేడాది(2020) ఇదే నెలతో పోలిస్తే 3.2 శాతం తగ్గి 2.5 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ లక్ష్యాన్ని అందుకోలేకపోవడం ప్రభావం చూపింది. ఈ ఏడాది(2021–22) తొలి 4 నెలల్లో సైతం దేశీ చమురు ఉత్పత్తి 3.4 శాతం నీరసించి 9.9 మిలియన్ టన్నులకు చేరింది. పెట్రోలియం, సహజవాయు శాఖ విడుదల చేసిన గణాంకాలివి. గత నెలలో ఓఎన్జీసీ 4.2 శాతం తక్కువగా 1.6 మిలియన్ టన్నుల చమురును వెలికి తీసింది. ఇక ఏప్రిల్–జులై మధ్య 4.8 శాతం క్షీణించి 6.4 మిలియన్ టన్నులకు పరిమితమైంది. అయితే నేచురల్ గ్యాస్ ఉత్పత్తి పుంజుకుంది. చదవండి : Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ -
డీజిల్ రేట్లలో కోత.. 20 పైసల తగ్గింపు
హైదరాబాద్ : గత కొంత కాలంగా ధరలు పెంచడమే తప్ప తగ్గించడం తెలియదు అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ పోతున్న చమురు కంపెనీలు శాంతించాయి. నెల రోజులగా పెట్రోలు, డీజిల్ ధరలు నిలకడగా ఉండటంతో కొంత తేరుకుంటున్న సామాన్యులకు మరో ఉపశమనం కలిగించాయి. లీటరు డీజిల్‌పై 20 పైసల వంతున ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ మార్పు చోటు చేసుకుంది. అయితే పెట్రోలు ధర తగ్గించకపోవడంపై ప్రజల్లో అంసంతృప్తి నెలకొంది. ధరల తగ్గింపుకు ముందు హైదరాబాద్‌లో లీటరు డీజిల్ ధర రూ.97.96లు ఉండగా తాజా తగ్గింపుతో రూ.97.74లుగా ఉంది. అంతకు ముందు ఆగస్టు 8వ తేదిన సైతం డీజిల్ రేటు 14 పైసలు తగ్గింది. అంతకు ముందు ఈ నెలలో అత్యధిక ధరగా రూ.98.10 డిజిల్ ధర ఉంది. -
India WPI Inflation: టోకు ధరలు... గుభేల్!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2021 ఏప్రిల్‌లో భారీగా 10.49 శాతం పెరిగింది. అంటే సూచీలోని ఉత్పత్తుల ధరలు 2020 ఏప్రిల్‌తో పోల్చితే తాజా సమీక్షా నెలలో 10.49 శాతం పెరిగాయన్నమాట. సూచీలోని ప్రధాన విభాగాలైన ఆహారం, ముడి చమురు, తయారీ రంగాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరగడం మొత్తం సూచీపై ప్రభావం చూపింది. ఇదే పెరుగుదల తీరు మున్ముందూ కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణాల్లో లోబేస్ ఎఫెక్ట్ ఒకటి. గత ఏడాది ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదల లేకపోగా 1.57 శాతం క్షీణించిన విషయం ఇక్కడ గమనార్హం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడం బేస్ ఎఫెక్ట్‌గా పేర్కొంటారు. ఇక్కడ 2020 ఏప్రిల్‌లో అసలు వృద్ధి నమెదుకాకపోగా భారీగా 1.57 శాతం క్షీణత నమోదుకావడం (లో బేస్) ఇక్కడ గమనార్హం. వరుసగా నాలుగు నెలల నుంచీ టోకు ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. 2021 మార్చిలో ఈ రేటు 7.39 శాతంగా ఉంది. వాణిజ్య పరిశ్రమల శాఖ తాజా గణాంకాల్లో ముఖ్యాంశాలు... ► ఫుడ్ ఆర్టికల్స్: ఫుడ్ ఆర్టికల్స్ 4.92 శాతం పెరిగాయి. గుడ్లు, మాంసం, చేపల వంటి ప్రొటీన్ రిచ్ ఉత్పత్తుల ధరలు 10.88 శాతం పెరిగాయి. పప్పు దినుసుల ధరలు 10.74 శాతం ఎగశాయి. పండ్ల ధరలు 27.43 శాతం ఎగశాయి. కాగా కూరగాయల ధరలు మాత్రం 9.03 శాతం తగ్గాయి. ► ఫ్యూయెల్ అండ్ పవర్: ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 20.94 శాతంగా ఉంది. ► తయారీ ఉత్పత్తులు: సమీక్షా నెలలో 9.01 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ► కాగా, ఆర్బీఐ రెపో నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 4.29 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. సరఫరాల సమస్య కనబడుతోంది ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల 4.9 శాతంగా నమోదుకావడం ఆరు నెలల్లో ఇదే తొలిసారి. హోల్‌సేల్ స్థాయిలో సరఫరాల సమస్య తీవ్రంగా ఉందన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. రానున్న నెలల్లో టోకు ద్రవ్యోల్బణం 13 నుంచి 13.5 శాతం శ్రేణికి పెరుగుతుందన్నది మా అంచనా. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం)ను మరింత తగ్గిందన్న మా అభిప్రాయానికి కూడా గణాంకాలు బలాన్ని ఇస్తున్నాయి. అయితే బలహీన ఎకానమీ నేపథ్యంలో యథాతథ సరళతర ద్రవ్య పరపతి విధానాలనే ఆర్బీఐ కొనసాగిస్తుందని భావిస్తున్నాం. – అదితీ నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అంతర్జాతీయంగా పెరిగిన ధరల ప్రభావం కేవలం కొన్ని సీజనల్ కారణాల వల్లే టోకు ద్రవ్యోల్బణం పెరగలేదు. అంతర్జాతీయంగా ధరల పెరుగుదలా టోకు ద్రవ్యోల్బణం అప్‌ట్రెండ్‌కు కారణం. ఖనిజాలు, వంట నూనెలు, ముడి చమురు, బొగ్గు, ఎరువులు, ప్లాస్టిక్, బేసిక్ మెటల్స్‌న, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఆటో తత్సంబంధ విడిభాగాల వెయిటేజ్ మొత్తం సూచీలో 44%. అంతర్జాతీయంగా ఆయా కమోడిటీల ధరలు పెరగడం దేశీయంగా కూడా ప్రభావం చూపింది. ప్రపంచ మార్కెట్లో కమోడిటీల ధరలు మరింత పెరుగుతుండడం ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న అంశం. ద్రవ్యోల్బణం మరింత పెరక్కుండా ప్రభుత్వం సరఫరాల వ్యవస్థ పటిష్టతపై దృషి సారించాలి. – సునీల్ కుమార్ సిన్హా, ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ ఆర్థికవేత్త -
ఆయిల్ మాఫియా ఆగడాలు: మరోసారి ‘వెల్’గులోకి..
సాక్షి, ఉప్పలగుప్తం: కోనసీమలో ఆయిల్మాఫియా ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఒకప్పుడు జోరుగా సాగే వైట్ ఆయిల్ రాకెట్ గుట్టురట్టు కావడంతో కొన్నాళ్లుగా ఆయిల్ చోరీకి బ్రేక్ పడింది. అప్పట్లో ఓఎన్జీసీ పైప్‌లైన్, ఆయిల్ ట్యాంకర్ల నుంచి ఆయిల్ చోరీ జరిగితే.. ఇప్పుడు ఏకంగా చమురు సహజవాయు నిక్షేపాల వెలికితీతకు డ్రిల్ చేసిన ప్రాంతాల్లోని వెల్(టెర్మినేటర్) నుంచి దర్జాగా పైపులైన్ వేసుకుని ఆయిల్ చోరీ చేసే స్థాయికి మాఫియా ఎదిగిపోయింది. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ వాసాలతిప్ప తీరంలో గతేడాది ఓఎన్జీసీ ఏర్పాటు చేసిన డ్రిల్ సైట్ ఈ ఆయిల్ మాఫియాకు అడ్డాగా మారింది. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల లీటర్ల వైట్ ఆయిల్ అక్రమరవాణా అవుతోంది. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిపంచాయతీ వాసాలతిప్ప సముద్ర తీరంలో ఉన్న ఓఎన్జీసీ జీఎస్ 15 డ్రిల్ సైట్ నుంచి వెల్ నుంచి నేరుగా గోపవరం పంచాయతీలో ఉన్న జగ్గరాజుపేట స్టోరేజ్‌కు పైపులైన్ల ద్వారా క్రూడాయిల్, గ్యాస్‌లను తరలిస్తున్నారు. ఏడాదిగా వెల్ నుంచి ముడిచమురు గ్యాస్ పైపులైన్ల ద్వారా రవాణా అవుతుంది. గ్రామానికి దూరంగా ఉన్న ఈ సైట్‌ను కేంద్రంగా చేసుకుని ఆయిల్ మాఫియా ఆరు నెలల నుంచి చోరీకి పాల్పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 20న ఆయిల్ చోరీ జరుగుతుందని అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదై ఉంది. ఓఎన్జీసీ అధికారులు సెక్యూరిటీ ఏర్పాటుకు సదరు సంస్థకు ప్రతిపాదించి చేతులు దులుపుకొన్నారు. అయితే వాసాలతిప్ప గ్రామస్తులు మాత్రం ముఠాపై కన్నేశారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి ఆయిల్ చోరీని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముఠాను పట్టుకునే ప్రయత్నం చేయగా, వారు చోరీకి ఉపయోగించే మోటార్లు, పైపులు, స్టోరేజ్ టిన్నులు, మారుతీ ఓమ్నీ వ్యాను వదిలి పరారయ్యారు. చోరీ ముఠాలో ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్టు తెలిసింది. అయితే గురువారం తెల్లవారు జామున ఎస్సై జి.వెంకటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తమ అదుపులో ఎవరూ లేరని పోలీసులు చెబుతున్నారు. అధికారుల పరిశీలన ఓఎన్జీసీ ఏరియా మేనేజర్ ప్రసాదరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు. అమలాపురం రూరల్ సీఐ జి.సురేష్‌బాబు పరిశీలించి, ఓఎన్జీసీ సెక్యూరిటీ అధికారి తో మాట్లాడారు. ఓఎన్జీసీ ఐఎం జగన్నాథరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. గ్రామస్తుల ఆందోళన వాసాలతిప్ప వచ్చిన ఓఎన్జీసీ అధికారులను స్థానికులు నిలదీశారు. స్థానిక సమస్యలపై మీరిచ్చిన హామీలు ఏం చేశారంటూ ఆందోళనకు దిగారు. స్థానిక నాయకులు పినిపే జయరాజ్, ఇసుకపట్ల రఘుబాబు, గెడ్డం సంపదరావు, పట్టా శ్రీను తదితరులు నచ్చజెప్పి, డిమాండ్ల పరిష్కారానికి హామీ తీసుకున్నారు. రూ.లక్ష విలువైన ఆయిల్ చోరీ... రోజుకు రూ.లక్ష విలువైన ఆయిల్ చోరీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 30 టిన్నులు(ఒక్కొక్కటి 50 లీటర్లు) ఆయిల్ ఇక్కడి నుంచి రవాణా అవుతోంది. ఇక్కడి నుంచి మామిడికుదురు మండలంలో ఓ వ్యాపారి లీటరు ఆయిల్ రూ.50 నుంచి రూ.60కి హోల్‌సేల్ రేటుగా తీసుకుంటున్నట్టు తెలిసింది. ఆయిల్ చోరీ ఆలస్యంగా బయటకు వచ్చినా దీని వెనుక ఇంటి దొంగల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో చోరీ.. ఓఎన్జీసీ డ్రిల్ సైట్ వెల్ నుంచి వెలువడే గ్యాస్, ముడిచమురు, నీరును చాకచక్యంగా విభజించి నేరుగా వైట్ ఆయిల్ టిన్నుల్లోకి నింపడం సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పని. పోలీసులు స్వాధీనం చేసుకున్న సామగ్రిలో (సెపరేటర్)గ్యాస్ విడిగా, వాటర్ విడిగా పోయి ఆయిల్ మాత్రమే నింపేలా తయారైన యంత్ర పరికరాలు లభించడం చోరీలో నైపుణ్యం గల వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ( చదవండి: సైబర్ నేరగాళ్ల చేతి వాటం.. రూ.1.2 లక్షలు స్వాహా ) -
టోకు ధరలు తీవ్ర రూపం!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో తీవ్ర రూపం దాల్చింది. 7.39 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 మార్చితో పోల్చితే 2021 మార్చిలో టోకు బాస్కెట్లోకి ఉత్పత్తుల ధరలు 7.39 శాతం పెరిగాయన్నమాట. గడచిన ఎనిమిది సంవత్సరాల్లో (అక్టోబర్ 2012లో 7.4 శాతం) ఈ స్థాయి ద్రవ్యోల్బణం రేటు ఇదే తొలిసారి. క్రూడ్ ఆయిల్, మెటల్ ధరలు భారీగా పెరగడం మొత్తం బాస్కెట్‌పై ప్రభావం చూపింది. అలాగే గత ఏడాది అతి తక్కువ ధరలు (బేస్ ఎఫెక్ట్) కూడా ‘భారీ పెరుగుదల రేటు’కు కారణంగా ఉంది. 2020 మార్చిలో టోకు ద్రవ్యోల్బనం 0.42 శాతం కావడం గమనార్హం. 2021 ఫిబ్రవరిలో ఈ రేటు 4.17 శాతంగా ఉంది. గడచిన మూడు నెలలుగా టోకు ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. ► ఫుడ్ ఆర్టికల్స్‌లో 3.24% టోకు ద్రవ్యోల్బణం నమోదయ్యింది. పప్పు దినుసుల ధరలు 13.14%, పండ్లు, ధాన్యం విషయంలో ధరాభారం వరుసగా 16.33%, 1.38%గా ఉన్నా యి. కూరగాయల ధరలు 5.19% తగ్గాయి. ► ఫ్యూయెల్ అండ్ పవర్ బాస్కెట్ టోకు ధరలు 10.25 శాతం పెరిగాయి. ► మొత్తం సూచీలో దాదాపు 55 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ద్రవ్యోల్బణం 7.34 శాతంగా నమోదైంది. -
ఎక్కడ తక్కువ ధరో అక్కడే కొంటాం!
న్యూఢిల్లీ: క్రూడ్ ఆయిల్‌ను ఏ దేశం తక్కువ ధరకు సరఫరా చేస్తుందో ఆ దేశం నుంచే భారత్ కొనుగోలు చేస్తుందని ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం స్పష్టం చేశారు. ఉత్పత్తి, సరఫరాల విషయంలో నియంత్రణలు లేకుండా చూస్తూ, తక్కువ ధరకు చమురు సరఫరా చేయాలన్న భారత్ విజ్ఞప్తి పట్ల సౌదీ అరేబియా సమాధానం ‘దౌత్యధోరణి’ కాని రీతిలో ఉందని మంత్రి పేర్కొన్నారు. టైమ్స్ నెట్వర్క్ ఇండియా ఎకనమిక్ సమావేశంలో ఆయన ప్రసంగం, ఈ అంశానికి సంబంధించిన పూర్వాపరాలను పరిశీలిస్తే... ►డిమాండ్ మరింతగా మెరుగుపడే దాకా చమురు ఉత్పత్తిపై నియంత్రణలు కొనసాగించాలని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్, దాని అనుబంధ దేశాలు భావిస్తున్న నేపథ్యంలో ముడి చమురు రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు 14 నెలల గరిష్ట స్థాయిని తాకాయి. ►ఈ నేపథ్యంలో చమురు రేట్లను స్థిరంగా ఉంచుతామన్న హామీకి కట్టుబడి ఉండాలని, ఇందుకు సంబంధించి ఉత్పత్తి, సరఫరాలపై నియంత్రణలను సడలించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ►ఈ విజ్ఞప్తిని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఈ నెల మొదట్లో ఒపెక్, దాని అనుబంధ దేశాలు తోసిపుచ్చాయి. పైగా ఒపెక్ సమావేశం అనంతరం మార్చి 4వ తేదీన సౌదీ అరేబియా భారత్‌కు ఒక ఉచిత సలహా ఇస్తూ, కావాలంటే గతంలో చౌకగా కొనుక్కున్న చమురును ఉపయోగించుకోవాలంటూ సూచించింది. 2020 ఏప్రిల్–మే మధ్యన భారత్ 16.71 మిలియన్ బ్యారళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వైజాగ్‌తో పాటు మంగళూరు, పాదూరు (కర్ణాటక)లోని వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌లలో నిల్వ చేసుకుంది. అప్పట్లో బ్యారల్ క్రూడాయిల్ సగటున 19 డాలర్ల రేటుకే లభించింది. ►ఒపెక్ చేసిన ప్రకటనపై శుక్రవారం టైమ్స్ నెట్వర్క్ ఇండియా ఎకనమిక్ సమావేశంలో చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. చమురు రేట్లు ఎగియడం .. ఆర్థిక రికవరీ, డిమాండ్‌ను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది కరోనా వైరస్‌పరమైన కారణాలతో డిమాండ్ పడిపోయి, ఉత్పత్తి తగ్గించుకోవాలని ఒపెక్ కూటమి నిర్ణయించుకున్నప్పుడు తాము కూడా మద్దతునిచ్చామని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత ఉత్పత్తి పెంచుతామంటూ ఒపెక్ అప్పట్లో హామీ ఇచ్చిందని .. కానీ ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్నా ఉత్పత్తి మాత్రం సాధారణ స్థితికి రావడం లేదని ప్రధాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం పెరిగిపోతే రేట్లు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ►ప్రపంచంలో చమురు దిగుమతులకు సంబంధించి మూడవ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌లో రిఫైనర్స్ ఇప్పటికే తమ చమురు అవసరాలకు పశ్చిమ ఆసియావైపుకాకుండా తక్కువ ధరకు లభించే ఇతర దేశాల వైపూ దృష్టి పెడుతున్నాయి. నిజానికి సౌదీ అరేబియా భారత్‌కు రెండవ అతిపెద్ద చమురు దిగుమతిదారు. ఫిబ్రవరిలో ఈ స్థానాన్ని అమెరికా ఆక్రమించింది. చమురు దిగుమతుల విషయంలో తన ప్రయోజనాలకు భారత్ ప్రాధాన్యత ఇస్తుందని శుక్రవారం ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దేశం ఏదైనా తక్కువ ధరకు లభ్యమైనచోటి నుంచే చమురును కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. భారత్ చమురు వినియోగంపై సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్లాజిజ్ బిన్ సల్మాన్ చేసిన ప్రకటనను ‘‘సన్నిహితమైన స్నేహితుని’’ నుంచి ‘‘దౌత్యరీతిలేని సమాధానం’’ అని ప్రధాన్ అభివర్ణించారు. ఇలాంటి వైఖరిని భారత్ అసలు అంగీకరించబోదని అన్నారు. భారత్ వ్యూహాత్మక చమురు నిల్వలను ఎలా ఎప్పుడు వినియోగించుకోవాలన్నది భారత్ నిర్ణయమని పేర్కొన్నారు. ►సౌదీ అరేబియాకన్నా, అమెరికాకే భారత్ ప్రాధాన్యత ఇస్తుంది అన్న విషయాన్ని ఫిబ్రవరి చమురు దిగుమతి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, ‘‘మేము ఎవరికి దగ్గర అవుతున్నామన్న అంశం ఇక్కడ ప్రధానం కాదు. భారత్ ప్రయోజనాల పరిరక్షణ ఎలా అన్నదే ఇక్కడ ముఖ్యం. మాది బహిరంగ, స్వేచ్ఛాయుత మార్కెట్. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చమురు దిగుమతిచేసుకునే అవకాశం మా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రైవేటు రంగం చమురు ద్గిగజ సంస్థలకు ఉంది. తక్కువ ధరకు చమురు లభ్యత మాకు ముఖ్యం. అది అమెరికానా లేక ఇరాక్, యూఏఈ, సౌదీ అరేబియానా అన్నది ప్రధానం కాదు.’’ అని అన్నారు. ప్రస్తుత ధరలు ఇలా... ఈ వార్త రాస్తున్న శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో అంతర్జాతీయంగా నైమెక్స్ స్వీట్ క్రూడ్ ధర బ్యారల్‌కు 61.16 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ క్రూడ్ ధర 64.64 వద్ద ట్రేడవుతోంది. ఒపెక్, అనుబంధ దేశాలు సరఫరాపై నియంత్రణలు కొనసాగించనున్న నేప థ్యంలో విశ్లేషకులు... ముడిచమురు ధరల అంచనాలను కూడా సవరించడం ప్రారంభించారు. 2020 రెండో త్రైమాసికంలో బ్రెంట్ క్రూడ్ రేటు మరో 5 డాలర్లు పెరిగి 75 డాలర్లకు (బ్యారల్‌కు) చేరవచ్చని, మూడో త్రైమాసికానికి 80 డాలర్లకు చేరొచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రెంట్ రేటు 75 డాలర్లకు (బ్యారల్‌కు), నైమెక్స్ క్రూడ్ 72 డాలర్లకు (బ్యారల్‌కు) చేరొచ్చని యూబీఎస్ అంచనాలను సవరించింది. దేశంలో పెట్రో ధరల మంట... గతేడాది ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు సగటు రేటు బ్యారల్‌కు 50 డాలర్ల కన్నా తక్కువే ఉన్నప్పటికీ దేశీయంగా రిటైల్ రేట్లు గరిష్ట స్థాయిలోనే కొనసాగాయి. పెట్రోల్, డీజిల్ రేట్లపై ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం దఫదఫాలుగా పెంచుకుం టూ వస్తుండటం కూడా ఇందుకు కారణం. ప్రస్తుతం ఢిల్లీలోని రేట్ల ప్రకారం పెట్రోల్ ధరలో మూడో వంతు ఎక్సైజ్ డ్యూటీ ఉంటుండగా, డీజిల్ ధరలో 40 శాతం దాకా ఉంటోంది. దీనికి రాష్ట్రాలు విధించే పన్నులు కూడా తోడవడం రేట్లకు మరింతగా ఆజ్యం పోస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర ఇప్పటికే రూ. 100 దాటిపోయింది. తాజాగా అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు ఇంకా పెరిగిన పక్షంలో దేశీయంగా ఇంధనాల రిటైల్ రేట్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. పెట్రోల్, డిజిల్ ధరలను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తెస్తే, ధర కొంత తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నప్పటికీ అలాంటిది ఇప్పట్లో సాధ్యంకాదని కేంద్రం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. -
పెట్రోల్, డీజిల్ ధరల సెగ- రెండేళ్ల గరిష్టం
న్యూఢిల్లీ, సాక్షి: కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. సగటున పెట్రోల్‌పై 30-33 పైసలు, డీజిల్ లీటర్‌పై రూ. 25-31 పైసల చొప్పున ఎగశాయి. తాజాగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు బలపడి రూ. 83.71కు చేరింది. డీజిల్ ధర సైతం లీటర్‌కు 25 పైసలు అధికమై రూ. 73.87ను తాకింది. వెరసి పెట్రోల్, డీజిల్ ధరలు రెండేళ్ల గరిష్టానికి చేరాయి. కాగా.. ఇదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. 48 రోజుల తదుపరి మళ్లీ నవంబర్ 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. అప్పటినుంచీ విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు బలపడుతుండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మంటపుట్టిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. 17 రోజుల్లో గత 17 రోజుల్లో ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ. 2.65 పెరిగినట్లు ఇంధన రంగ విశ్లేషకులు తెలియజేశారు. ఇదేవిధంగా డీజిల్ లీటర్‌పై మరింత అధికంగా రూ. 3.40 పెంపు అమలైనట్లు తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం ముంబైలో పెట్రోల్ 33 పైసలు బలపడి రూ. 90.34కు చేరింది. కోల్‌కతాలోనూ రూ. 84.86 నుంచి రూ. 85.19కు చేరింది. ఇక చెన్నైలో పెట్రోల్ లీటర్ రూ. 20 పైసలు పెరిగి రూ. 86.51 అయ్యింది. డీజిల్ ధరలు ఇలా ఢిల్లీలో డీజిల్ ధరలు లీటర్‌కు రూ. 25 పైసలు పెరిగి 73.87కు, ముబైలో 31 పైసలు బలపడి 80.51కు, కోల్‌కతాలో 29 పైసలు అధికమై 77.44కు చేరాయి. చెన్నైలోనూ డీజిల్ లీటర్ 28 పైసలు పెరిగి 79.21ను తాకింది. కోతల ఎఫెక్ట్ రష్యాసహా ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోతలను 2021 జనవరి తదుపరి సైతం కొనసాగించేందుకు అంగీకరించడంతో ముడిచమురు ధరలు ర్యాలీ బాటలో సాగుతున్నాయియి.వారాంతాన దాదాపు 10 నెలల గరిష్టాలకు చేరాయి. ప్రస్తుతం లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 0.5 శాతం నీరసించి 49 డాలర్లను తాకింది. న్యూయార్క్ మార్కెట్లోనూ నైమెక్స్ చమురు 0.54 శాతం క్షీణించి 46.01 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒపెక్ తదితర దేశాలు ప్రస్తుతం రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. తాజా ఒప్పందంలో భాగంగా రోజుకి 7 మిలియన్ బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేయనున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు మరోసారి గరిష్టాలను తాకాయి. దేశీయంగా విదేశీ ప్రభావంతో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. -
వ్యాక్సిన్ల ఆశలు- మండుతున్న చమురు
లండన్/ న్యూయార్క్: దాదాపు ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు సిద్ధంకానున్న వార్తలతో ముడిచమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. గత వారం 5 శాతం పురోగమించిన చమురు ధరలు వరుసగా రెండో రోజు బలపడ్డాయి. వెరసి విదేశీ మార్కెట్లో మూడు నెలల గరిష్టాలకు చేరాయి. ఇటీవలి ఎన్నికలలో అమెరికా ప్రెసిడెంట్‌గా జో బైడెన్ విజయం సాధించినట్లు తాజాగా ధృవ పడటంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లకు జతగా ఆస్ట్రాజెనెకా సైతం ఈ ఏడాది చివరికి కరోనా కట్టిడికి వ్యాక్సిన్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొనడంతో ఆర్థిక రికవరీపై అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. ఫలితంగా ముడిచమురు ధరలు మరోసారి ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఒపెక్ ఎఫెక్ట్.. చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో రష్యాసహా ఒపెక్ దేశాలు గత కొద్ది నెలలుగా ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం 2021 జనవరి వరకూ కోతలు అమలుకానున్నాయి. కాగా.. కోతల అంశాన్ని చర్చించేందుకు ఈ నెల 30, డిసెంబర్ 1న ఒపెక్ దేశాలు సమావేశంకానున్నాయి. దీనిలో భాగంగా జనవరి 2021 తదుపరి కూడా చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా కనీసం రోజుకి 2 మిలియన్ బ్యారళ్ల ఉత్పత్తిని తగ్గించేందుకు నిర్ణయించవచ్చని సంబంధితవర్గాలు తెలియజేశాయి. అంటే 5.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలు మరో ఆరు నెలలు కొనసాగే వీలున్నట్లు చెబుతున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్లతో ఆర్థిక రికవరీకి వీలు చిక్కుతుందని, దీంతో చమురుకు డిమాండ్ పుంజుకుంటుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. దీనికితోడు చమురు ఉత్పత్తిలో కోతలు కొనసాగితే ధరలు మరింత బలపడవచ్చని అంచనా వేస్తున్నాయి. ధరల జోరు ప్రస్తుతం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 1 శాతం ఎగసి 46.51 డాలర్లకు చేరింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ సైతం 1.1 శాతం పుంజుకుని 43.53 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం విదితమే. విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా ప్రతీ 15 రోజులకోసారి ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తుంటాయి. వివిధ పన్నులతోపాటు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం ధరల సవరణలో ప్రభావం చూపుతుంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
తక్కువ ధరకు కొన్నాం.. రూ.5,000 కోట్లు పొదుపుచేశాం!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఏప్రిల్–మే నెలల్లో రెండు దశాబ్దాల కనిష్టానికి పడినప్పుడు, ఈ పరిస్థితిని భారత్ తనకు అనుకూలంగా మార్చుకుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. తక్కువ ధర వద్ద భారీగా ముడి చమురును కొనుగోలుచేసి, తన మూడు వ్యూహాత్మక భూగర్భ చమురు నిల్వల క్షేత్రాలనూ నింపుకుందని వెల్లడించారు. తద్వారా రూ.5,000 కోట్లను భారత్ పొదుపుచేయగలిగిందని ఆయన వివరించారు. భారత్ తన మొత్తం క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో మూడవ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదేశంగా భారత్ కొనసాగుతోంది. ఆయా అంశాలపై రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► అంతర్జాతీయంగా భారీగా పడిపోయిన క్రూడ్ ఆయిల్ ధరలను అవకాశంగా తీసుకుని ఏప్రిల్, మే నెలల్లో భారత్ 16.71 మిలియన్ బేరళ్ల (ఎంబీబీఎల్)ను కొనుగోలుచేసింది. విశాఖపట్నం, మంగళూరు, పద్దూర్‌లలో నిర్మించిన వ్యూహాత్మక చమురు నిల్వల క్షేత్రాలను నింపుకుంది. ► సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఇరాక్‌ల నుంచి ఈ కొనుగోళ్లు జరిగాయి. ► 2020 జనవరిలో బేరల్ 60 డాలర్లకు కొంటే, తదుపరి తక్కువ ధరకు కొనుగోళ్ల వల్ల సగటు వ్యయం బేరల్‌కు 19 డాలర్లకు పడిపోయింది. ► మంగళూరు నిల్వల సామర్థ్యం మొత్తం 1.5 మిలియన్ టన్నులు. మూడింటిలో పద్దూర్ నిల్వల సామర్థ్యం 2.6 మిలియన్ టన్నులు. విశాఖ విషయంలో ఈ సామర్థ్యం 1.33 మిలియన్ టన్నులు. ► 5.33 మిలియన్ టన్నుల అత్యవసర నిల్వ భారత్ 9.5 రోజుల అవసరాలకు సరిపోతుంది. భారత్ రిఫైనరీలు 65 రోజులకు సరిపడా క్రూడ్ నిల్వలను నిర్వహిస్తాయి. మూడు నిల్వ క్షేత్రాలనూ కలుపుకుంటే, 87 రోజులకు సరిపడా క్రూడ్ నిల్వలు భారత్ వద్ద ఉంటాయి. ఇంధన భద్రతకు సభ్య దేశాలకు ఐఈఏ నిర్దేశిస్తున్న చమురు నిల్వల స్థాయికి ఈ పరిమాణం దాదాపు చేరువగా ఉంది. -
భారీ నష్టాల నుంచి రికవరీ
ఆర్థిక ప్యాకేజీ ద్రవ్యలోటుపై భారం మోపుతుందనే ఆందోళనతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు స్వల్పంగా క్షీణించాయి. కరోనా కేసులు పెరుగుతుండటం, ముడి చమురు ధరలు 2% మేర పెరగడం, అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 350 పాయింట్ల మేర నష్టపోయినప్పటికీ, సెన్సెక్స్ చివరకు 25 పాయింట్ల నష్టంతో 31,098 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 9,137 పాయింట్ల వద్దకు చేరింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 545 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. 526 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనా, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం తర్వాత లాభ,నష్టాల మధ్య దోబూచులాడి చివరకు స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఒక దశలో 173 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ మరో దశలో 353 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 526 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ట్రేడింగ్ చివర్లో కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో నష్టాలు తగ్గాయి. రియల్టీ, బ్యాంక్, వాహన,ఆర్థిక రంగ షేర్లలో లాభాల స్వీకరణ జరగ్గా, ఇంధన,లోహ,టెలికం షేర్లలో వేల్యూ బయింగ్ జరిగింది. ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 5 శాతం మేర నష్టంతో రూ.381 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► దాదాపు 40కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఇండియా సిమెంట్స్, అజంతా ఫార్మా, అలెంబిక్ ఫార్మా, ఆర్తి డ్రగ్స్, రుచి సోయా తదితర షేర్లు వీటిలో ఉన్నాయి. ► చైనాలో గత నెలలో పారిశ్రామిక వృద్ధి పుంజుకుందన్న వార్తలతో లోహ షేర్లు లాభపడ్డాయి. -
మన దగ్గర పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు చరిత్రలో ఎన్నడు ఎరగనంతగా పడిపోయాయి. ఏప్రిల్ 22వ తేదీ నాటికి ఓ బారెల్ ధర కనిష్ట స్థాయికి 16 డాలర్లకు పడి పోయింది. నెల రోజుల్లో చమురు ధరలు ఏకంగా 39 శాతం పడి పోయాయి. అయినా దేశీయంగా భారత్ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గక పోవడం ఆశ్చర్యకరం. కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు జనవరి నెల నుంచి తగ్గుముఖం పట్టాయి. అయినా ఇప్పటికీ ముంబైలో లీటరు పెట్రోలు ధర 76.31 రూపాయలు, డీజిల్ ధర 66.21 రూపాయలు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ ధరల్లో భారతీయులకు పెద్దగా ప్రయోజనం ఎందుకు కలగలేదు? అందుకు కారణాలేమిటీ? కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా మార్చి 14వ తేదీన పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు మూడు రూపాయల చొప్పున పెంచింది. ఈ కారణంగా కేంద్రానికి సమకూరే సొమ్ము 39 వేల కోట్ల రూపాయలు. ఆ తర్వాత వారానికి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్‌పై అదనంగా మరో ఎనిమిది రూపాయల ఎక్సైజ్ పన్నును పెంచేందుకు వీలుగా దేశ ఆర్థిక బిల్లును సవరించింది. చమురు ధరల హెచ్చింపు, తగ్గింపులపై ఇక తమ ప్రభుత్వానికి ఎలాంటి ఆధిపత్యం ఉండదని చమురు ధరలపై నియంత్రణను ఎత్తివేసిన నాడే నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు భారత్‌లో పెట్రోలు ధరలు తగ్గుతూ, పెరిగినప్పుడు పెరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవడంలో భాగంగా చమురు ధరలపై ఎక్సైజ్ పన్నులను పెంచుతూ వచ్చింది. ఇప్పుడు ఇంతగా పన్నులను పెంచడానికి ఆర్థిక అవసరాలే కనిపిస్తున్నాయి. ఆర్థిక ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోవడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జీడీపీలో ఆదాయం, వినిమయానికి మధ్య వ్యత్యాసం మూడున్నర శాతానికి చేరుకుంది. ఈ వ్యత్యాసం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏడు శాతానికి చేరుకుంటుందని ముంబైకి చెందిన ‘మోతీలాల్ ఓస్వాల్’ బ్రోకరేజ్ సంస్థ ఏప్రిల్ 13న విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది. మరోపక్క డాలర్‌తో రూపాయి మారక విలువ పడి పోతోంది. కరోనా పరిస్థితుల ప్రభావం ఇలాగే కొనసాగినట్లయితే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ఆస్కారం ఉంది. కేంద్రం నిర్ణయం సరైనది కాదు: కేజ్రీవాల్ -
బ్యారల్‌కు రూ. 2,884 వద్ద సెటిల్మెంట్
న్యూఢిల్లీ: ఏప్రిల్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ను మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్) బేరల్‌కు మైనస్ రూ.2,884 వద్ద సెటిల్‌చేసింది. దీని ప్రకారం, క్లియరింగ్ మెంబర్స్‌కు రూ.242.32 కోట్లు డిపాజిట్ చేసినట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్–న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజ్ (నైమెక్స్) డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ కాంట్రాక్టుల సెటిల్మెంట్ ధరను అనుసరించి, భారత రూపాయిల్లో ఎంసీఎక్స్ ‘పే ఇన్ అండ్ పే అవుట్’ నిర్ణయం తీసుకున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ వివరించింది. సోమవారం క్రూడ్ ధర అనూహ్యంగా మైనస్ 40.32కు పతనమై చివరకు మైనస్ 37.63 డాలర్ల వద్ద ముగిసింది. అయితే ఇందుకు సంబంధించి ఏప్రిల్ 20తో ముగిసే కాంట్రాక్ట్ ఎంసీఎక్స్ సెటిల్మెంట్ ధరపై వివాదం నెలకొంది. ఇక యథాతథంగా ట్రేడింగ్ సమయం వ్యవసాయేతర ఉత్పత్తుల ట్రేడింగ్ వేళలను ఏప్రిల్ 23 నుంచీ పొడిగిస్తున్నట్లు ఎంసీఎక్స్ ప్రకటించింది. 23వ తేదీ నుంచీ ట్రేడింగ్ సమయం యథాపూర్వం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11.30 వరకూ కొనసాగుతుంది. -
కరోనా దెబ్బకు క్రూడాయిల్ క్రాష్
-
ఉత్పత్తి కోత ఆశలతో పుంజుకున్న చమురు ధర
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు పుంజుకున్నాయి. కరోనా సంక్షోభం, ప్రపంచ దేశాలు ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో చమురు ఉత్పత్తి కోతకు ఒపెక్ దేశాలు సమ్మతించవచ్చనే అంచనాలమధ్య బుధవారం చమురు ధరలు ఎగిసాయి. ఒపెక్ సభ్య దేశాలు, రష్యా మధ్య ఉత్పత్తి తగింపునకు నిర్ణయించనున్నారనే ఆశలమధ్య ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తిగా చూపిస్తున్నారు. దీంతో ఇవాళ బ్రెంట్ క్రూడ్ 75 సెంట్లు (2.5శాతం) పెరిగి బ్యారెల్ ధర 32.62 డాలర్లకు చేరింది. నైమెక్స్ కూడా 5 శాతం ఎగిసింది. మంగళవారం బ్రెంట్ క్రూడ్ 3.6 శాతం క్షీణించింది. అంతకుముందు సెషన్లో క్రూడాయిల్ ధర దాదాపు తొమ్మిదిన్నర శాతం తగ్గింది. కరోనా మహమ్మారి ప్రభావంతో ముడి చమురు ధరలు గత కొంతకాలంగా భారీగా పడిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఒపెక్ దేశాలు, రష్యాలు రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా గురువారం ఒపెక్ సభ్యులు, రష్యాలు సమావేశం కానున్నాయి. ఆ సమావేశంలో చమురు ఉత్పత్తి తగ్గింపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తాజా సమావేశంలో తీసుకోబోయే నిర్ణయంతో సౌదీ అరేబియా, రష్యాల మధ్య చమురు ధరల యుధ్దానికి తెరపడే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సౌదీ అరేబియా, ఒపెక్ సభ్యదేశాలు, రష్యాలు చమురు ఉత్పత్తిని తగ్గించడానికి అవకాశముందని చెబుతున్నారు. అయితే ఉత్పత్తి కోత నిర్ణయంలో అమెరికా పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అమెరికా ముడి ఉత్పత్తి 4.70 లక్షల బీపీడీ తగ్గిందని, 2020లో మరో 1.3 మిలియన్ బీపీడీ తగ్గుతుందని ఇటీవలే అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. మంగళవారం విడుదల చేసిన అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ (ఏపీఐ) గణాంకాల ప్రకారం అమెరికాలో పెట్టుబడులు ఏప్రిల్ 3 వరకు 11.9 మిలియన్ బారెల్స్ మేర పెరిగి 473.8 మిలియన్ బారెల్స్ కు చేరుకున్నాయి. వైరస్ వ్యాప్తి భయాలతో చమురుకు డిమాండ్ తగ్గడంతో,ఆయిల్ రంగ షేర్లు 9.4 మిలియన్ బారెల్స్ పెరిగాయి. ఇది జనవరి 2017తరువాత ఒక వారంలో అతిపెద్ద లాభంమిదేనని ఏపీఐ తెలిపింది. -
ప్రపంచవ్యాప్తంగా స్టాక్, కరెన్సీ మార్కెట్లలో కల్లోలం
ట్రంప్ ట్రేడ్‌వార్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కుదిపేస్తోంది. ఇక కార్చిచ్చులా ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తున్న కరోనా.. ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తోంది. ఈ రెండింటికీ సౌదీ అరేబియా–రష్యా మధ్య మొదలైన చమురు ధరల యుద్ధం ఆజ్యం పోసింది. ఇక చెప్పేదేముంది! మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు మహా పతనాన్ని చవిచూశాయి. చమురు ఊచకోతకు గురైంది. ఒక్క జపాన్ యెన్ మినహా... ప్రపంచ కరెన్సీలన్నీ ఊహించని విధంగా పతనమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా, ఏ దశలోనూ ఇన్వెస్టర్లకు ఉపశమనం కనిపించలేదు. ♦ ముడిచమురు ఉత్పత్తి తగ్గించుకునే విషయంలో ఒపెక్ కూటమి – రష్యా మధ్య రేగిన విభేదాలతో.. సౌదీ భారీగా రేట్లు తగ్గించేసింది. ఫలితం.. ఒకేరోజు ముడి చమురు ధరలు ఏకంగా 30 శాతానికిపైగా పతనమయ్యాయి. ఒక దశలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 31 డాలర్ల స్థాయికి పడిపోయి, తర్వాత కాస్త కోలుకుంది. 1991 గల్ఫ్ యుద్ధ సమయం తర్వాత ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. ♦ తాజా పరిణామాలతో రూపాయి ఏకంగా 17 నెలల కనిష్టానికి క్షీణించి డాలర్‌తో పోలిస్తే 74.17 వద్ద క్లోజయ్యింది. జపాన్ యెన్ మినహా అమెరికా డాలర్, ఇతర కరెన్సీలూ రూపాయి దార్లోనే వెళ్లాయి. సోమవారం రాత్రి 11 గంటల సమయానికి అమెరికా మార్కెట్ల ప్రామాణిక సూచీ డోజోన్స్ 1,600 పాయింట్లకు పైగా నష్టంతో (6 శాతం) ట్రేడవుతోంది. జపాన్, జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్ మార్కెట్లు సైతం 5 నుంచి 7 శాతం మధ్యలో భారీగా నష్ట పోయాయి. మంగళవారం హోలీ సందర్భంగా మన మార్కెట్లకు సెలవు కావటంతో.. పతనానికి కూడా తాత్కాలికంగానైనా విరామం దొరికినట్లయింది. ఆయిల్ వార్, కరోనా ఫియర్ స్టాక్ మార్కెట్లను కుదిపేయడంతో ఆసియా నుంచి అమెరికా దాకా సోమవారం బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు భారీ నష్టాలతో ముగిశాయి. అదుపులోకి రాని కరోనా వైరస్ పెట్టుబడిదారులను బెంబేలెత్తించడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 30 శాతం కుప్పకూలింది. మరో ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటామేమోననే భయం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దశాబ్దకాలంలో అతిపెద్ద సింగిల్–డే పతనంతో మార్చి 9వతేదీ ,2020 భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండేగా నిలిచిపోయింది.7లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. క్రూడ్(ముడి చమురు) ధరల పతనానికి బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం 1,942 పాయింట్లు కుప్పకూలింది. చరిత్రలో ఇదే అత్యంత భారీ పతనం. కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలానికి ముడి చమురు ధరల పోరు జత కావడంతో స్టాక్ మార్కెట్ కనీవినీ ఎరుగని రీతిలో క్షీణించింది. సెన్సెక్స్ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,500 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ప్రస్తుతం మందగమనంలో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ... కోవిడ్–19 వైరస్, ముడి చమురు ధరల పోరు కారణంగా మాంద్యంలోకి జారిపోతుందనే భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇక దేశీయంగా యస్‌బ్యాంక్ సంక్షోభం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 30 పైసలు తగ్గడం వంటి అంశాలు కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. ఇంట్రాడేలో 2,467 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్ చివరకు 1942 పాయింట్లు క్షీణించి 35,635 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 695 పాయింట్లు పతనమైన నిఫ్టీ చివరకు 538 పాయింట్ల నష్టంతో 10,451 పాయింట్ల వద్దకు చేరింది. శాతాలపరంగా చూస్తే, సెన్సెక్స్ 5.1 శాతం, నిఫ్టీ 4.9 శాతం చొప్పున నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, ఈ రెండు సూచీలు గత ఐదేళ్లలో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఒక్క రోజులోనే ఇన్నేసి పాయింట్లు నష్టపోవడం (ఇంట్రాడే, ముగింపులో కూడా)ఇదే మొదటిసారి. ఆరంభంలోనే భారీ నష్టాలు.... ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ భారీ నష్టాలతోనే ఆరంభమైంది. సెన్సెక్స్ 627 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సమయం Výæడిచే కొద్దీ నష్టాలు పెరిగాయే కానీ తరగలేదు. అన్ని రంగాల షేర్లు పతనమయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ నష్టాలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి చూస్తే, సెన్సెక్స్ 5,088 పాయింట్లు (12.4 శాతం), నిఫ్టీ 1,511 పాయింట్లు(12.6 శాతం) చొప్పున క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు ముప్పిరిగొన్నందున సెంటిమెంట్ బలహీనంగా ఉందని, మన మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిఫ్టీ మద్దతు స్థాయిలు 10,295–10,138 పాయింట్లని, ఒక వేళ పుల్ బ్యాక్ ర్యాలీ చోటు చేసుకుంటే నిరోధ స్థాయిలు 10,637–10,744 పాయింట్లని విశ్లేషకులు పేర్కొన్నారు. పతనానికి పంచ కారణాలు... ♦ చమురు ధరల పతనం... చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఉత్పత్తి కోతకు సంబంధించి చర్చలు విఫలమయ్యాయి. ఒపెక్ దేశాలు ప్రతిపాదించిన ఉత్పత్తి కోతను రష్యా వ్యతిరేకించడం.. నచ్చని సౌదీ అరేబియా ప్రతి చర్యలు ప్రకటించింది. తాము ఉత్పత్తి చేసే క్రూడ్ ధరలను తగ్గించడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఇది అంతర్జాతీయంగా వృద్ధి మరింతగా దెబ్బతీస్తుందన్న భయాలు మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని నిపుణులంటున్నారు. కోవిడ్–19 విలయం భారత్‌లో కోవిడ్–19 (వైరస్) బాధితుల సంఖ్య 43కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య లక్షకు, మరణాల సంఖ్య 3,600కు పెరిగాయి. ఇటలీలో ఒక్క రోజులోనే 130కు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. కోటిన్నరకు పైగా ప్రజలను ఈ దేశం క్వారంటైన్లో ఉంచింది. మరిన్ని దేశాలకు ఈ వైరస్ విస్తరిస్తుండటంతో మరిన్ని కష్టాలు ముందు ముందు ఉంటాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్ మరింత విస్తరిస్తే, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణ కొరియా తదితర అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యంలోకి జారిపోతాయని మూడీస్ సంస్థ హెచ్చరించడం ఆందోళన రేకెత్తించింది. ప్రపంచ మార్కెట్ల పతనం కోవిడ్–19 వైరస్ విస్తరిస్తుండటం, ముడి చమురు ధరల హఠాత్ పతనం కారణంగా ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా క్షీణించాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి సురక్షిత సాధనాలైన పుత్తడి, అమెరికా డాలర్, బాండ్లలోకి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఫలితంగా సోమవారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియా, జపాన్ సూచీలు 5 శాతం మేర క్షీణించాయి. ఆరంభంలోనే 6% మేర నష్టపోయిన యూరప్ మార్కెట్లు అదే స్థాయిలో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు... కరోనా కల్లోలానికి సెంటిమెంట్ దెబ్బతినడంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ నికర కొనుగోలుదారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు కొనసాగుతున్నాయి. సోమవారాన్ని కూడా కలుపుకుంటే వరుసగా 11వ రోజూ విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగానే నిలిచారు. ఈ 11 ట్రేడింగ్ సెషన్లలో రూ.25,000 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. యస్ బ్యాంక్ సంక్షోభం .. భారత బ్యాంకింగ్ రంగం స్థిరత్వంపై ఆందోళనను, సంశయాలను పెంచింది. పలు ఆర్థిక సంస్థలు యస్ బ్యాంక్ బాండ్లలో ఇన్వెస్ట్ చేశాయి. ఈ బాండ్ల రేటింగ్‌ను పలు రేటింగ్ సంస్థలు డౌన్‌గ్రేడ్ చేశాయి. మరోవైపు బాసెల్ టూ, టైర్–1 బాండ్ల వడ్డీ చెల్లింపుల్లో యస్ బ్యాంక్ విఫలమైంది. మొత్తం మీద యస్ బ్యాంక్ ప్రభావం తీవ్రంగానే ఉండగలదన్న భయాలు నెలకొన్నాయి. నేడు మార్కెట్లకు సెలవు నేడు హోలీ పండుగ సందర్భంగా సెలవు. సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడయ్యింది. ఆరంభంలోనే ఏడు శాతం మేర çపతనమై లోయర్ సర్క్యూట్‌ను తాకింది. దీంతో ట్రేడింగ్‌ను నిలిపేశారు. 15 నిమిషాల అనంతరం ఆరంభమైనప్పటికీ నష్టాలు తగ్గలేదు. కరోనా ప్రభావం పెరుగుతుండటం, ముడి చమురు ధరలు తగ్గడం ప్రభావం చూపాయి. రాత్రి గం.11.30 ని. లకు డోజోన్స్ 1,794 పాయింట్లు, నాస్డాక్ 500 పాయింట్ల నష్టాల్లో ట్రేడయ్యాయి. మంగళవారం సెలవు కావడంతో మేలైందని, లేకుంటే అమెరికా, యూరప్ మార్కెట్ల నష్టాల ప్రభావంతో మన మార్కెట్‌కు భారీ నష్టాలు ఉండేవని విశ్లేషకులంటున్నారు. రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ మహా పతనం కారణంగా రూ. 7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.6, 84, 278 కోట్లు హరించుకుపోయి రూ.1,37,46,947 కోట్లకు పడిపోయింది. షేర్లు కకావికలం... ♦ ఓఎన్జీసీ.. 15 ఏళ్ల కనిష్టానికి ముడి చమురు ధరలు 30 శాతం మేర పతనం కావడంతో చమురు అన్వేషణ, తయారీ ప్రభుత్వ రంగ కంపెనీ ఓఎన్జీసీ భారీగా నష్టపోయింది. 16 శాతం నష్టంతో రూ.74.65 వద్ద ముగిసింది. ఇది దాదాపు 15 ఏళ్ల కనిష్ట స్థాయి. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ♦ రెండో స్థానానికి రిలయన్స్ చమురు ఉత్పత్తి రంగంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ కూడా బాగా పతనమైంది. 12 శాతం నష్టంతో రూ.1,113 వద్దకు చేరింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. లక్ష కోట్లు ఆవిరైంది. ఈ నష్టం కారణంగా అత్యధిక మార్కెట్ క్యాప్‌గల భారత కంపెనీ అనే ఘనతను కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. మొదటి స్థానం టీసీఎస్ షేర్‌కు దక్కింది. ♦ యస్ బ్యాంక్ జోరు... ఎస్బీఐ బేజారు.... సంక్షోభంలో చిక్కుకున్న యస్‌బ్యాంక్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేయనున్న ఎస్బీఐ షేర్ 6 శాతం పతనమై రూ.254కు చేరింది. మరోవైపు యస్ బ్యాంక్ షేర్ 31 శాతం లాభపడి రూ.21 వద్ద ముగిసింది. ♦ చమురు షేర్లు రయ్... ముడి చమురు ధరలు 30 శాతం మేర తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌పీసీఎల్ షేర్ 6 శాతం లాభంతో రూ.213కు, బీపీసీఎల్ షేర్ 5.2 శాతం పెరిగి రూ.424కు పెరిగాయి. ♦ ఏడాది కనిష్టానికి 800 షేర్లు... దాదాపు 800కు పైగా షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. బీఎస్ఈ 500 సూచీలో ప్రతి నాలుగు షేర్లలో ఒక షేర్ ఏడాది కనిష్టానికి పడిపోయింది.∙ప్రపంచ పరిణామాలకు యస్ బ్యాంకు సంక్షోభం తోడవటంతో బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ఒక్కరోజే 1,942 (5.1%) పాయింట్లు కుదేలైంది. చరిత్రలో ఇదే అత్యంత దారుణ పతనం. నిఫ్టీ సైతం 538 పాయింట్లు (4.9%) నష్టపోయింది. శాతాల పరంగా గత ఐదేళ్లలో ఇదే భారీ నష్టం కాగా.. పాయింట్ల పరంగా ఇది రికార్డు. ఓఎన్జీసీ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు సైతం 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఫలితంగా ఒక్కరోజే ఏకంగా రూ.7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. -
అమెరికా మార్కెట్లు ఢమాల్ : ట్రేడింగ్ నిలిపివేత
కోవిడ్-19 (కరోనా వైరస్) గ్లోబల్ మార్కెట్లను పట్టి పీడిస్తున్నాయి. తాజాగా అమెరికా మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్, ఎస్ అండ్ పీ 500 7 శాతం, నాస్డాక్ కంపోజిట్ 7.1 శాతం కుప్పకూలింది. బెంచ్ మార్క్ డౌజోన్స్ ఇండస్ట్రీయిల్ యావరేజ్ 2000 పాయింట్లకు పైగా (7.8శాతం) నష్టపోయింది. భారీ నష్టాల నేపథ్యంలో న్యూయార్క్ మార్కెట్ ట్రేడింగ్‌ను నిలిపివేశారు. 2008 ఆర్థిక సంక్షోభం తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఇదే అదిపెద్ద పతనంగా నిపుణులు తెలిపారు.15 నిమిషాలు పాటు ట్రేడింగ్ నిలిపివేయడంమంటేనే అమ్మకాల సెగ ఏ స్థాయిలో వుందో అంచనా వేయవచ్చు. 15 నిమిషాల తరువాత ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైనా భారీ నష్టాలుకొనసాగుతున్నాయి. అటు చమురు ధరలు రికార్డు కనిష్టానికి చేరడంతో సోమవారం ఆసియా మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఇంట్రాడేలో 2450 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరికి 1942 నష్టంతో ముగిసింది. జపాన్ నిక్కీ 225 సూచీ 5శాతం, క్షీణించగా, ఆస్ట్రేలియా మార్కెట్లు 7.3 శాతం కుప్పకూలాయి. చైనాలో, షాంఘై కాంపోజిట్ బెంచ్ మార్క్ 3శాతం, పడిపోగా, హాంగ్ సెంగ్ ఇండెక్స్ 4.2 శాతం క్షీణించింది. దీంతో మహా పతనంగా, బ్లాక్ మండేగా విశ్లేషకులు అభివర్ణించారు. వైరస్ భయాలకు తోడు సౌదీ అరేబియా, రష్యా ట్రేడ్ వార్ కారణంగా చమురు ధర సోమవారం దాదాపు 30 శాతం క్షీణించి 31.14 డాలర్లకు చేరుకుంది. ఇది 1991లో గల్ఫ్ యుద్ధం ప్రారంభం తరువాత ఇదే అతిపెద్ద సింగిల్-డే పతనం. ఇంతటి పతనాన్ని ఇటీవలి కాలంలోచూడలేదని సెవెన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సహ వ్యవస్థాపకుడు జస్టిన్ ఉర్క్హార్ట్-స్టీవర్ట్ వ్యాఖ్యానించారు. చదవండి : రిలయన్స్‌కు చమురు షాక్ కోవిడ్‌కు ‘చమురు’ ఆజ్యం, మార్కెట్ కుదేలు -
రూ.7లక్షల కోట్లు ఎగిరి పోయాయి
సాక్షి,ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, కోవిడ్-19 ఆందోళనలు, రష్యా, సౌదీ అరేబియా ప్రైస్‌వార్ కారణంగా భారీ ఎగిసిన చమురు ధరలతో దేశీయ స్టాక్మార్కెట్లో ప్రకంపనలు రేపింది. చమురు ధరల చారిత్రక పతనం దలాల్ స్ట్రీట్‌ను వణింకించింది. ఇన్వెస్టర్ల ఆందోళనభారీ అమ్మకాలకు తెరతీసింది. దీంతో వరుస నష్టాలతో కుదేలైన దలాల్ స్ట్రీట్ మరింత కనిష్టానికి కుప్పకూలింది. కీలక సూచీలు సెన్సెక్స్,నిఫ్టీ అతి భారీ ఇంట్రాడే నష్టాలను నమోదు చేసింది. నిఫ్టీలోని 50 షేర్లలోదాదాపు అన్ని నష్టాలనే మూట గట్టుకున్నాయి. సెన్సెక్స్‌లో సుమారు 800పైగా షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయంటేనే పతనం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఆటో, మిడ్ క్యాప్, ప్రైవేటు రంగ ఆయిల్ షేర్ల భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. రూ .7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది. కాగా సెన్సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 2450 పాయింట్లు కుప్పకూలింది. బ్యాంకింగ్, ఆటో సహా అన్ని రంగాలు అమ్మకాలతో కుదేలయ్యాయి. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర బీఎస్ఈలో 13.65 శాతం పతనమైంది. అలాగే రూ. 10లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌లోరూ.2.7లక్షల కోట్లు ఆవిరైపోయాయి. అటు డాలరుతో రూపాయి మారకం విలువ కూడా పతనం బాటలోనే పయనించింది. 16 పైసలు దిగజారి ఈ రోజు (మార్చి 9, 2020) ట్రేడింగ్ రూ.74.03 వద్ద కనిష్టానికి పతనమైంది. అనంతరం 74.18 స్థాయిని తాకి చివరకు 74.08 వద్ద ముగిసింది. 2018 అక్టోబరులో 74.48 వద్ద అల్ టైం కనిష్టానికి పడిపోయింది. శుక్రవారం రూపాయి 73.78 వద్ద క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. చదవండి : కోవిడ్‌కు ‘చమురు’ ఆజ్యం, మార్కెట్ కుదేలు రిలయన్స్‌కు చమురు షాక్ -
కోవిడ్‌కు ‘చమురు’ ఆజ్యం, మార్కెట్ కుదేలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలనుమూటగట్టుకున్నాయి. కోవిడ్-19 (కరోనా వైరస్) ఆందోళనకు తోడు, చమురు సంక్షోభం, స్టాక్‌మార్కెట్ల పతనానికి మరింత తోడయ్యాయి.దీంతో స్టాక్‌మార్కెట్ చరిత్రలోనే ఒక రోజులోనే ఇంత భారీ పతనం నమోదుకాలేదు. సెన్సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 2450 పాయింట్లు కుప్పకూలింది. బ్యాంకింగ్, ఆటో సహా అన్ని రంగాలు అమ్మకాలతో కుదేలయ్యాయి. చివరికి సెన్సెక్స్ 1942 పాయింట్లు కుప్పకూలి 35643 వద్ద, నిఫ్టీ 538 పాయింట్ల పతనంతో 10451 వద్ద ముగిసాయి. 10451, తద్వారా సెన్సెక్స్ 36వేల కీలక మద్దతు స్థాయికి దిగువన, నిఫ్టీ 10500 స్థాయికి దిగువన ముగిసింది. యస్ బ్యాంకు, బీపీసీఎల్, భారతి ఇన్ఫ్రాటెల్, ఐషర్ మెటార్స్, ఐవోసీ, యూపీఎల్ మాత్రమే లాభపడ్డాయి. చమురు షాక్‌తో ఓన్జీసీ, వేదాంతా, రిలయన్స్‌టాప్ లూజర్స్‌గా నిలవగా, వీటితోపాటు జీ ఎంటర్టైన్మెంట్, ఇండస్ బ్యాంకు, టాటా స్టీల్, టాటా మోటార్స్, గెయిల్ భారీగా నష్టపోయాయి. -
రిలయన్స్‌కు చమురు షాక్
సాక్షి, ముంబై: కోవిడ్-19 వైరస్ వేగంగా విస్తరిస్తున్న ఆందోళనల కారణంగా స్టాక్‌మార్కెట్ల భారీ పతనానికి తోడు, సౌదీ అరేబియా, రష్యా ట్రేడ్ వార్ షాక్ ఆయిల్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)ను భారీగా తాకింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఆర్ఐఎల్ షేరు 12 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా సోమవారం అత్యంత ఘోరంగా పడిపోయింది. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర బీఎస్ఈలో 13.65 శాతం పతనమై రూ.1,094.95 కు చేరుకుంది. గత నాలుగు రోజుల్లో 18శాతం కోల్పోయింది. తత్ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా భారీగా నష్టపోయి రూ. 7 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ క్యాప్ పరంగా ఐటీ మేజర్ టీసీఎస్ రూ .7.31 లక్షల కోట్లతో టాప్‌లోకి వచ్చింది. మార్కెట్ క్యాప్ పరంగా రూ .10 లక్షల కోట్లను అధిగమించి తొలి కంపెనీగా అవతరించిన ఆయిల్-టు-రిటైల్ దిగ్గజం, 2019 డిసెంబర్లో సాధించిన రికార్డు స్థాయిల నుంచి రూ .2.7 లక్షల కోట్లకు పైగా పడిపోయింది. గత ఏడాది డిసెంబరులో ఆర్ఐఎల్ షేరు రూ .1,617 వద్ద 52 వారాల గరిష్ట స్థాయి తాకింది. అప్పటి నుండి ఇది 522 పాయింట్లు లేదా 32 శాతం కుప్పకూలింది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు చ రిత్రలో ఎన్నడూ లేని విధంగా రోజు నష్టాన్ని నమోదు చేసింది. కీలక సూచీ సెన్సెక్స్ 2,450 పాయింట్లు, నిఫ్టీ 6.15శాతం కుప్పకూలింది. ముడి చమురు ధరలు 29 ఏళ్ల కనిష్టానికి పడిపోవడంతో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రభుత్వ రంగ ఆయిల్ స్టాక్స్ 13 శాతం ఎగియడం గమనార్హం. -
చమురు ధరలు భారీ పతనం..
న్యూఢిల్లీ : కరోనా ప్రభావం స్టాక్‌మార్కెట్ల నుంచి ముడిచమురు సహా కమాడిటీ వరకూ అన్ని మార్కెట్లనూ బెంబేలెత్తిస్తోంది. చమురు ధరలు ఆసియాలో సోమవారం 20 ఏళ్ల కనిష్టస్ధాయిలో ఏకంగా 30 శాతం పడిపోయాయి. డెడ్లీ వైరస్‌తో డిమాండ్ పడిపోవడంతో ఉత్పత్తిలో కోత విధించాలనే ఒప్పందంపై ఒపెక్, భాగస్వామ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలతో సౌదీ అరేబియా ధరలను అమాంతం తగ్గించివేసింది. చమురు ఉత్పత్తిని తగ్గించడంపై ఒపెక్ దేశాలు, రష్యా మధ్య జరిగిన చర్చలు విఫలమైన అనంతరం సౌదీ ఆరాంకో ధరలను భారీగా తగ్గించింది. సౌదీ ప్రైస్ వార్తో ఆసియాలో బ్యాంరెల్ ముడిచమురు ధర ఏకంగా 32 డాలర్లకు పడిపోయింది. కరోనా షాక్‌తో ఆర్థిక వృద్ధి తగ్గుముఖం పట్టే క్రమంలో రానున్న నెలల్లోనూ ముడిచమురు ధరలు దిగివస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : కేజీ బేసిన్లో అడుగంటిన క్రూడాయిల్ -
కేజీ బేసిన్లో అడుగంటిన క్రూడాయిల్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కృష్ణా గోదావరి(కేజీ) బేసిన్లో గత మూడేళ్లుగా ముడిచమురు(క్రూడాయిల్) నిల్వలు పడిపోతుండడంతో ఓఎన్జీసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. క్రూడాయిల్ నిల్వల తగ్గుదలతో ఈ బేసిన్లో ఓఎన్జీసీ సగటున రోజుకు రూ.కోటి వరకూ ఆదాయం కోల్పోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇంతవరకూ కేజీ బేసిన్లో సుమారు 500 బావుల్ని గుర్తించగా.. కేవలం 112 బావుల్లో మాత్రమే ఉత్పత్తి కొనసాగుతోంది. వాటిలో అధికశాతం సహజ వాయువు ఉత్పత్తి చేస్తుండగా.. ఉన్న కొద్దిపాటి బావుల్లో చమురు ఉత్పత్తి మందగించింది. ఈ పరిస్థితుల్లో మరింత లోతుకు బావులు తవ్వాలని ఓఎన్జీసీ యోచిస్తున్నా.. ఖర్చు నాలుగు రెట్లకు పైగా అవుతుందనే అంచనాలతో వెనుకడుగు వేస్తోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పతనమవడంతో.. అంత ఖర్చుచేయడం గిట్టుబాటవుతుందా? అన్న ఆలోచనలోనూ ఉంది. ఒకప్పుడు రికార్డు స్థాయిలో ఉత్పత్తి రాష్ట్రంలోని ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల వరకూ విస్తరించిన కేజీ బేసిన్.. ముంబై హై తర్వాత ఓఎన్జీసీకి తలమానికంగా నిలిచింది. దీని పరిధి సుమారు 50 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించింది. ఈ ప్రాంతంలో నాలుగు దశాబ్దాలుగా ఓఎన్జీసీ చమురు, సహజవాయువును వెలికితీస్తోంది. కేజీ బేసిన్లో కోనసీమలోనే చమురు బావులు ఎక్కువగా ఉన్నాయి. గత ఐదేళ్లుగా సాగిస్తున్న అన్వేషణలో భాగంగా కృష్ణా జిల్లా నాగాయలంక, బంటుమిల్లి, మల్లేశ్వరం తదితర ప్రాంతాలలో ఓఎన్జీసీ చమురు నిల్వల్ని కనుగొంది. దీంతో కొత్త ఆశలు చిగురించాయి. అయితే కోనసీమ స్థాయిలో అక్కడ చమురు ఉత్పత్తి లేకపోవడంతో డీలాపడింది. కొన్నేళ్ల క్రితం వరకూ కేజీ బేసిన్లో క్రూడాయిల్ ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగేది. ఆ సంస్థ మొత్తం ఉత్పత్తిలో ఈ బేసిన్ వాటా 15 శాతంగా ండేది. అయితే 2017 నుంచి 50 శాతం మేర క్రూడాయిల్ ఉత్పత్తి పడిపోయింది. ఈ లెక్కన ఓఎన్జీసీ కొన్నాళ్లుగా సుమారు రూ.1080 కోట్ల వరకూ ఆదాయాన్ని కోల్పోయిందని ప్రాథమిక అంచనా. 4 వేల మీటర్ల దిగువకు డ్రిల్లింగ్ చేస్తేనే.. కేజీ బేసిన్లో ప్రస్తుతం భూ ఉపరితలం నుంచి 3000 మీటర్ల లోతున మాత్రమే ఓఎన్జీసీ చమురు అన్వేషణ, ఉత్పత్తి సాగిస్తోంది. ఆ ప్రాంతంలో 2000 పీఎస్ఐ(పౌండ్ పర్ స్క్వేర్ ఇంచ్)ఒత్తిడి, 80 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఈ బావుల ద్వారా సముద్రంలో 4000 మీటర్ల దిగువన డ్రిల్లింగ్ నిర్వహించి చమురు అన్వేషణ, ఉత్పత్తికి ఓఎన్జీసీ తటపటాయిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతలోతుకు వెళ్తేగానీ కొత్త చమురు నిల్వలు కనుగొనలేని పరిస్థితి. 4000 నుంచి 4200 మీటర్ల లోతున డ్రిల్లింగ్ చేయాలంటే అక్కడ భూమి పొరల్లో 5 వేల పీఎఫ్ఐ(పౌండ్ పర్ స్క్వేర్ ఇంచ్)ఒత్తిడి, 200 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చాలా ఖరీదుతో కూడుకున్నది. ఒక్కో బావిలో ప్రస్తుతం జరుగుతున్న డ్రిల్లింగ్కు రూ.కోటి నుంచి రూ.1.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మరింత లోతుకు వెళ్లి డ్రిల్లింగ్ చేయాలంటే ఒక్కో బావికి సుమారు రూ.5 కోట్ల నుంచి 5.50 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ఓఎన్జీసీ అంచనా వేస్తోంది. ఎక్కువ శాతం బావుల్లో సహజవాయువు ఉత్పత్తే.. తాటిపాక జీజీఎస్(గ్రూప్ గేదరింగ్ స్టేషన్) బావుల్లో క్రూడ్ ఉత్పత్తి తగ్గిపోయింది. ఒక్క కేశనపల్లిలో మాత్రమే కొంత ఆశావహ పరిస్థితి ఉంది. మోరి జీజీఎస్‌లో 58 బావులుంటే 40 బావుల్లో ఎక్కువ శాతం సహజవాయువు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. అడవిపాలెంలోను దాదాపు ఇదే పరిస్థితి. దీంతో కోనసీమ ప్రాంతంలో క్రూడ్ ఉత్పత్తి దాదాపు పడిపోయిందని చెబుతున్నారు. పొన్నమండ, మండపేట, నర్సాపురం జీజీఎస్‌లో కూడా క్రూడ్ ఉత్పత్తి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో విదేశీ చమురు అన్వేషణ సంస్థల సాయం తీసుకునే యోచనలో ఓఎన్జీసీ ఉంది. -
నదిలో చెలరేగిన మంటలు
గువహతి: అసోంలో ఓ నదికి భారీగా మంటలు అంటుకున్నాయి. దిబ్రూగఢ్ జిల్లాలోని బుర్హిదింగ్ నది కింది భాగం నుంచి వెళ్తున్న ఆయిల్ పైప్ పేలడంతో మంటలు ప్రారంభమయ్యాయి. నది అంతర్భాగంలోని పైప్‌లైన్ పేలిపోవడంతో ఉపరితలంపై పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దిబ్రూగఢ్ జిల్లా సహర్కాటియా సమీపంలోని ససోని గ్రామం వద్ద పైప్‌లైన్ నుంచి ఆయిల్ బయటకు వచ్చి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఆయిల్ ఇండియాలిమిటెడ్‌కు చెందిన దులియాజన్ ప్లాంట్ నుంచి ముడిచమురు తీసుకు వెళ్లే పైపు లైనుకు నదీ తీరంలో లీకవటంతో ఆయిల్ నదిలోకి వచ్చింది. ఇది గమనించిన కొందరు నదీ తీరంలో నిప్పు అంటించి ఉంటారని భావిస్తున్నారు. గత 3 రోజులుగా క్రూడాయిల్ నదిలోకి ప్రవహించి మంటలు వ్యాప్తి చెందుతున్నా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని నహర్కటియాలోని సాసోని గ్రామస్థులు వాపోతున్నారు. దీంతో నదిలో మంటలు మరింత విస్తృతంగా వ్యాపించి ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. -
పండగ వేళ తగ్గిన పెట్రో సెగలు..
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం స్వల్పంగా దిగివచ్చాయి. పెట్రోల్ లీటర్‌కు 15 పైసలు, డీజిల్ లీటర్‌కు 14 పైసల మేర చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించడంతో ఆయా నగరాల్లో పెట్రో ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజా ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ హైదరాబాద్‌లో 16 పైసలు తగ్గి రూ 80.33 పలికింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో రూ 75.55కు దిగివచ్చింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ 81.14, కోల్‌కతాలో రూ 78.23, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ 72.83 పలికింది. అంతర్జాతీయ అనిశ్చితి, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గతంలో బ్యారెల్‌కు 70 డాలర్లకు ఎగబాకిన క్రూడ్ ఆయిల్ ధరలు ఇటీవల 64 డాలర్లకు దిగివచ్చాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజువారీ సమీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. -
ఆరో రోజూ పెరిగిన పెట్రోలు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రో ధరలు పెరిగాయి. మంగళవారం వరుసగా ఆరో రోజు కూడా పెరిగాయి. అటు గత సెషన్లుగా స్థిరంగా ఉన్న డీజిల్ ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రేట్లు పెరగడం వల్ల ధరలు ప్రభావితమయ్యాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు పెరిగాయి, చెన్నైలో లీటరుకు 16 పైసలు పెరిగాయి. హైదరాబాద్ : పెట్రోలు ధర రూ. 78.96, డీజిల్ ధర 71.85 విజయవాడ : పెట్రోలు ధర రూ. 78.17 , డీజిల్ ధర 70.81 ఢిల్లీ : పెట్రోలు ధర రూ. 74.20, డీజిల్ ధర 65.84 కోలకతా: పెట్రోలు ధర రూ. 76.89, డీజిల్ ధర 68.25 చెన్నై : పెట్రోలు ధర రూ. 77.13 డీజిల్ ధర 69.59 ముంబై : పెట్రోలు ధర రూ. 79.86, డీజిల్ ధర 69.06 -
భగ్గుమన్న పెట్రోల్ ధరలు
సౌదీ అరేబియాలోని ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో సెప్టెంబర్ డెలివరీ ఒక బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 19.5 శాతం ఎగసి 71.95 డాలర్లను తాకింది. ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి డాలర్ల పరంగా ఒక్క రోజులో ఇంతగా ధర పెరగడం ఇదే మొదటిసారి. ఇక అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటరీ్మడియట్ (డబ్ల్యూటీఐ) ఫ్యూచర్స్ 15.5 శాతం ఎగసి 63.34 డాలర్లకు పెరిగింది. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత ఈ రెండు రకాల ముడి చమురు ధరలు ఈ రేంజ్లో పెరగడం ఇదే మొదటిసారి. ఈ వార్త రాసే సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ నైమెక్స్ క్రూడ్ ధర 12 శాతం ఎగసి 61.38 డాలర్ల వద్ద, బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 12.4 శాతం ఎగసి 67.70 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. మన మార్కెట్లో 9 శాతం అప్... ఇక మన మార్కెట్ విషయానికొస్తే, సోమవారం మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎమ్‌సీఎక్స్)లో సెపె్టంబర్ డెలివరీ క్రూడ్ ధర 9.14 శాతం ఎగసి రూ.4,273 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమనడంతో స్పెక్యులేటర్లు తాజాగా పొజిషన్లు తీసుకోవడంతో ధరలు పెరిగాయి. ట్రేడర్ల స్పెక్యులేటివ్ పొజిషన్ల కారణంగా సమీప భవిష్యత్తులో ధరలు అధిక స్థాయిల్లోనే ట్రేడవుతాయని నిపుణులంటున్నారు. సౌదీ సగం ఉత్పత్తికి గండి... ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ప్రాసెసింగ్ కేంద్రం, సౌదీ అరేబియాలోని సౌదీ ఆరామ్కో ఆయిల్ ప్లాంట్లపై గత శనివారం ద్రోన్లతో దాడి జరిగింది. సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలోని అబ్క్వైక్ నగరంలోని రిఫైనరీపైనా, రియాద్‌కు 150 కిమీ. దూరంలోని ఖురయాస్ చమురు క్షేత్రంపైనా ద్రోన్లతో దాడి జరిగింది. దీంతో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి సగం (ఇది ప్రపంచ రోజువారీ చమురు సరఫరాల్లో ఐదు శాతానికి సమానం) వరకూ తగ్గుతుందని అంచనా. రోజుకు 5.7 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి గండి పడుతుంది. కాగా ఈ దాడులకు కారణం ఇరాన్ అని అమెరికా ఆరోపిస్తుండగా, ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ దాడులు తామే చేశామని యెమెన్‌కు చెందిన హౌతి రెబెల్స్ పేర్కొన్నారు. ఇరాన్‌పై వైమానిక దాడులు చేసే అవకాశాలు మరింతగా పెరిగాయని, ప్రతి దాడికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించారు. సౌదీ ఆరామ్కో ఐపీఓ ఆలస్యం...! ఉగ్రవాద దాడుల కారణంగా సౌదీ ఆరామ్కో భారీ ఐపీఓ (ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్) మరింతగా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. దాడుల నష్టా న్ని మదింపు చేస్తున్నామని, ఐపీఓ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ మార్కెట్లో లిస్టయ్యే ముందు సౌదీ అరేబియా స్టాక్ మార్కెట్లో ఈ ఏడాది నవంబర్‌లో లిస్టింగ్ కావాలని సౌదీ ఆరామ్కో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బ్యాంకర్లనూ నియమించింది. మరింతగా వదలనున్న మన ‘చమురు’... సింగపూర్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచి్చందని సామెత. సామెత అన్వయం సరిగ్గా లేకపోయినప్పటికీ, సౌదీ అరేబియా ఆయిల్ ప్లాంట్లపై దాడుల కారణంగా భారత్‌కు మరింతగా చమురు వదలనున్నది. సౌదీ ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడుల కారణంగా మన దిగుమతి బిల్లు మరింతగా పెరుగుతుందని, ముందుగా రూపాయిపై దెబ్బ పడుతుందని సింగపూర్‌కు చెందిన డీబీఎస్ బ్యాంకింగ్ గ్రూప్ వెల్లడించింది. ముడి చమురు ధరలు 10 శాతం పెరిగితేనే, ద్రవ్యోల్బణం 20 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని, భారత కరంట్ అకౌంట్ లోటు 0.4–05 శాతం మేర పెరుగుతుందని పేర్కొంది. ఒక్కో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కో డాలర్ పెరిగితే, భారత చమురు దిగుమతుల బిల్లు 200 కోట్ల డాలర్ల మేర పెరుగుతుందని వివరించింది. భారత్ తన అవసరాల్లో 83 శాతానికి పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. భారత్ అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునేది ఇరాక్ తర్వాత సౌదీ అరేబియా నుంచే. గత ఆరి్థక సంవత్సరంలో భారత్ మొత్తం 2017.3 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకోగా, దీంట్లో సౌదీ అరేబి యా వాటా 40.33 మిలియన్ టన్నులుగా ఉంది. సరఫరాల్లో కొరత ఉండదు సౌదీ అరేబియా ఆయిల్ ప్లాంట్లపై దాడుల కారణంగా మనకు చమురు సరఫరాల్లో ఎలాంటి అవాంతరాలు ఎదురు కాబోవని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దాడుల అనంతరం సౌదీ ఆరామ్కో కంపెనీ ప్రతినిధులను సంప్రదించామని, సరఫరాల్లో ఎలాంటి కొరత ఉండబోదని వారు భరోసానిచ్చారని వివరించారు. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్‌కంపెనీల వద్ద సెప్టెంబర్ నెలకు సంబంధించిన చమురు నిల్వలపై సమీక్ష జరిపామని, పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నామని, సరఫరాల్లో ఎలాంటి అవాంతరాలు ఉండబోవన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధర రూ.5–6 పైపైకి..! సౌదీ అరేబియాలోని ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడుల కారణంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు మరో రెండు వారాల్లో రూ.5–6 మేర పెరుగుతాయని నిపుణులంటున్నారు. ఈ దాడుల కారణంగా సమీప భవిష్యత్తులో ముడి చమురు ధరలు భగ్గుమంటూనే ఉంటాయని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. సౌదీలో చమురు ఉత్పత్తి సాధారణ స్థాయికి రావడానికి మరికొన్ని వారాలు పడుతుందని తెలిపింది. మరోవైపు సౌదీ అరేబియాలోని ఆయిల్ ప్లాంట్లపై మరిన్ని దాడులు జరిగే అవకాశాలున్నాయి. మరోవైపు సౌదీ అరేబియా అమెరికాతో కలిసి ప్రతీకార దాడులకు దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏతావాతా పశ్చిమాసియాలో సంక్షోభం మరింతగా ముదిరితే ముడి చమురు ధరల ర్యాలీ ఇప్పట్లో ఆగదని విశ్లేషకులు భయపడుతున్నారు. ముడి చమురు, సంబంధిత ఉత్పాదకాలు పలు పరిశ్రమలకు ముడిపదార్ధాలుగా వినియోగమవుతున్నాయని, పెయింట్లు, టైర్లు, ఆయిల్, గ్యాస్, వాహన విడిభాగాల పరిశ్రమలపై పెను ప్రభావం పడుతుందని వారంటున్నారు. ముడి చమురు ధరలు భగ్గుమంటే, అది ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రతికూలమేనని, అమెరికా ఆంక్షల కారణంగా ఇప్పటికే వెనుజులా, ఇరాన్‌ల నుంచి చమురు సరఫరాలు తగ్గాయని కోటక్ ఈక్విటీస్ తెలిపింది. రూపాయి.. ‘క్రూడ్’ సెగ! ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పరుగు భయాలు సోమవారం రూపాయిని వెంటాడాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 68 పైసలు పతనమైంది. 71.60 వద్ద ముగిసింది. వరుసగా ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో లాభాల బాటన పయనించిన రూపాయి సోమవారం మొట్టమొదటిసారి నేలచూపు చూసింది. క్రూడ్ ధరల పెరుగుదల భారత్ కరెంట్ అకౌంట్‌లోటు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి కీలక ఆరి్థక గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. గత వారాంతంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి కేంద్రాలపై డ్రోన్ దాడి నేపథ్యంలో... సోమవారం ట్రేడింగ్‌లో రూపాయి బలహీనంగా 71.54 వద్ద ప్రారంభమైంది. ఒకదశలో 71.63 స్థాయినీ చూసింది. రూపాయి శుక్రవారం ముగింపు 70.92. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు క్రూడ్ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాల వంటి అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. స్టాక్ మార్కెట్లో ‘మంట’... సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై ద్రోన్లతో దాడి కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇంట్రాడేలో 20% వరకూ క్రూడ్ ధరలు ఎగియడంతో మన స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. చమురు సెగతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 67 పైసలు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపించింది. ఇంట్రాడేలో 356 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 262 పాయింట్ల నష్టంతో 37,123 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి 11,004 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆరి్థక వ్యవస్థలో వృద్ధి జోష్‌ను పెంచడానికి ప్రభుత్వం శనివారం ప్రకటించిన రూ.70,000 కోట్ల ఉద్దీపన ప్యాకేజీ(ఎగుమతులు, రియల్టీకి) చమురు దాడుల నష్టాల్లో కొట్టుకుపోయింది. ఆయిల్ షేర్లు విలవిల.... సౌదీ చమురు క్షేత్రాల దాడుల నేపధ్యంలో బీఎస్ఈ ఆయిల్ గ్యాస్ అండ్ ఎనర్జీ ఇండెక్స్ భారీగా నష్టపోయింది. చమురు సంబంధిత షేర్లు బాగా నష్టపోయాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ, క్యా్రస్టాల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 7% వరకూ నష్టపోయాయి. స్పైస్‌జెట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, జెట్ ఎయిర్వేస్ వంటి విమానయాన ఇంధన షేర్లు 4% వరకూ నష్టపోయాయి. ఇప్పటికే అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా కుదేలైన ప్రపంచ మార్కెట్లపై సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై తాజాగా జరిగిన దాడి మరింత ప్రతికూల ప్రభావం చూపించిందని షేర్‌ఖాన్ బీఎన్పీ పారిబా ఎనలిస్ట్ గౌరవ్ దువా వ్యాఖ్యానించారు. పశి్చమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరితే, మన ద్రవ్యోల్బణ గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపగలదని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ రాహుల్ గుప్తా పేర్కొన్నారు. ప్రధాన ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. -
ఎనిమిది రంగాలూ నెమ్మది వృద్ధి
న్యూఢిల్లీ: ఎనిమిది ప్రధాన మౌలిక రంగ పరిశ్రమల వృద్ధి రేటు జూలైలో కేవలం 2.1 శాతంగా నమోదయ్యింది. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు ఉత్పత్తి, రిఫైనరీ ప్రొడక్టుల విభాగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదుకావడం దీనికి ప్రధాన కారణం. గత ఏడాది జూలైలో ఈ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 40.27 శాతం వాటా కలిగిన ఈ ఎనిమిది మౌలిక రంగ పరిశ్రమల పనితీరు జూలైలో వేర్వేరుగా... వృద్ధి అప్...1 ఎరువులు: ఈ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు స్వల్పంగా 1.3 శాతం నుంచి (2018 జూలై) నుంచి 1.5 శాతానికి పెరుగుదల వృద్ధి తగ్గినవి.. 3 ♦ స్టీల్: 6.9 శాతం నుంచి 6.6 శాతానికి డౌన్ ♦ సిమెంట్: 11.2% నుంచి 7.9 శాతానికి పయనం ♦ విద్యుత్: 6.7% నుంచి 4.2%కి తిరోగమనం క్షీణతలో... 4 బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు ఉత్పత్తి, రిఫైనరీ ప్రొడక్టుల విభాగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదయ్యింది. ఏప్రిల్–జూలై మధ్య..: ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో, ఈ ఎనిమిది రంగాల గ్రూప్ వృద్ధి రేటు 5.9 శాతం నుంచి 3 శాతానికి పడింది. ఆగస్టులో ‘తయారీ’ పేలవం: పీఎంఐ ఆగస్టు నెలలో తయారీ రంగం పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. జూలైలో 52.5గా ఉన్న ఈ సూచీ ఆగస్టులో 51.4కు పడింది. గడచిన 15 నెలలుగా ఇంత తక్కువ సూచీ ఇదే తొలిసారి. ఉత్పత్తి, అమ్మకాలు తగ్గాయి. ఉపాధి కల్పనపైనా ఈ ప్రభావం పడింది. ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. -
నౌకలో భారీ పేలుడు
సాక్షి, విశాఖపట్నం, పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం): విశాఖ తీరానికి సుమారు మూడు నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న చిన్న నౌక...టగ్‌లో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో సముద్రంలో దూకి ఒకరు మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. 15మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉన్నారు. వీరిందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముడి చమురు నౌకలను నిలిపి ఉంచే సింగిల్ పాయింట్ మూరింగ్ (ఎస్పీఎం) టెర్మినల్ వద్ద హెచ్‌పీసీఎల్‌కు చెందిన అద్దె నౌక ‘టగ్’ కోస్టల్ జాగ్వార్లో (ఔట్ హార్బర్లో నిలిపి ఉన్న నౌకలను ఇన్నర్ హార్బర్లోకి తీసుకువచ్చే నౌకను టగ్‌గా వ్యవహరిస్తారు) ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. హెచ్‌పీసీఎల్‌కు సంబంధించిన ముడి చమురును నౌకల్లోకి తరలించే భారీ నౌకలో ఆదివారం రాత్రి గాలుల ధాటికి సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. వాటిని సరిచేసేందుకు కోస్టల్ జాగ్వార్ టగ్‌లో సోమవారం ఉదయం సిబ్బంది వెళ్లారు. టగ్‌ను భారీ నౌకకు హోస్ పైపులతో అనుసంధానించే క్రమంలో టగ్ అడుగు భాగం నుంచి ఆయిల్ లీక్ అయి రాపిడికి ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. క్షణాల్లోనే టగ్ 70 శాతం వరకు తగలబడింది. ఆరుగురు సిబ్బంది మంటల్లో చిక్కుకోగా వారి శరీరం చాలావరకు కాలిపోయింది. పేలుడు సమయంలో ప్రాణాలను రక్షించుకునేందుకు ఎనిమిది మంది సముద్రంలోకి దూకేశారు. వీరిలో ఆరుగురు ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఆసీస్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైందని హార్బర్ ఏసీపీ టి.మోహన్‌రావు తెలిపారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇండియన్ కోస్ట్‌గార్డ్, పోర్టుకు చెందిన ఐదు నౌకలు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని రక్షించడంతో పాటు నౌకలోని మంటలను అదుపుచేశాయి. అగ్నిప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ విచారణకు ఆదేశించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నవారు.. వనమాడి అన్నవరం (40)–తూర్పు గోదావరి జిల్లా, అన్సార్ (39)–కోల్‌కతా, తాశారపు భరధ్వాజ్ (23)–విశాఖపట్నం, జస్వీర్ సింగ్ (46)– ఉత్తరప్రదేశ్, జువిన్ జోషి (24)– కేరళ, చింతపల్లి తండేలు (48)– శ్రీకాకుళం, ఎచ్చెర్ల -
పర్షియన్ గల్ఫ్‌లో భారత్ చమురు ట్యాంకర్లకు భద్రత
న్యూఢిల్లీ : ఇరాన్, అమెరికా సైనిక డాడుల నేపథ్యంలో భారత నేవీ.. పర్షియన్ గల్ఫ్‌లోని భారత్‌కు చెందిన ముడి చమురు ట్యాంకర్లకు భద్రత కల్పించనుంది. అమెరికా- ఇరాన్‌ల మధ్య యుద్ధం అనివార్యమైతే తమ చమురు ట్యాంకులకు నష్ట వాటిల్లకుండా చర్యలు చేపట్టింది. చమురు రవాణా నిమిత్తం పర్షియన్ గల్ఫ్‌లో భారత్‌కు చెందిన 5 నుంచి 8 చమురు ట్యాంకర్లు ఉన్నాయి. ఇవి భారత చమురు అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత దేశం సుమారు 63 శాతం ముడి చమురును సౌదీ అరేబియా, ఇరాక్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల భారత దేశానికి ముడి అందించే దేశాల్లో ఇరాన్ కూడా చేరింది. ఈ మేరకు పలు ఒప్పందాలు కూడా చేసుకుంది. కాగా తమ గగనతలంలో ప్రమాదకర అమెరికా డ్రోన్ ప్రవేశించినందుకే దానిని కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘ ఇరాన్ తప్పు చేసింది ’ అని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా గతేడాది తమతో అణు ఒప్పందం విరమించుకున్న నాటి నుంచి ఇరాన్.. అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా దీటుగా సమాధానమిస్తోంది. తాజాగా అగ్రరాజ్య డ్రోన్‌ను కూల్చివేసి సవాలు విసిరింది. ఈ నేపథ్యంలో అక్కడ నిలిపి ఉంచిన చమురు ట్యాంకర్లకు భద్రత పటిష్టపరిచే విషయమై భారత షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో శుక్రవారం చర్చ జరగనుంది. -
ఎగసిన వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ ఉత్పత్తులు, వజ్రాభరణాలు, లెదర్ ఉత్పత్తులు మొదలైన వాటి ఎగుమతులు గత నెల గణనీయంగా తగ్గాయి. దీంతో ఏప్రిల్‌లో ఎగుమతుల వృద్ధి 0.64 శాతానికి పరిమితమైంది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. చివరిసారిగా 2018 డిసెంబర్లో ఎగుమతుల వృద్ధి అత్యల్పంగా 0.34 శాతంగా నమోదైంది. ఫలితంగా వాణిజ్య లోటు అయిదు నెలల గరిష్టానికి ఎగిసింది. బుధవారం విడుదలైన వాణిజ్య గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మరోవైపు దిగుమతులు 4.5 శాతం పెరిగాయి. ఇది గత ఆరు నెలల్లో అత్యధికం. క్రూడాయిల్, బంగారం దిగుమతులు గత నెలలో ఎగియడమే ఇందుకు కారణం. వ్యాపార ఉత్పత్తుల ఎగుమతులు ఏప్రిల్‌లో 26 బిలియన్లు ఉండగా.. దిగుమతుల పరిమాణం 41.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దీంతో వాణిజ్య లోటు 15.33 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2018 నవంబర్ తర్వాత వాణిజ్య లోటు ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. కీలక రంగాల తగ్గుదల..: ఇంజనీరింగ్, వజ్రాభరణాలు, లెదర్, కార్పెట్, ప్లాస్టిక్, మెరైన్ ఉత్పత్తులు, ధాన్యం, కాఫీ తదితర విభాగాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది. దీంతో వ్యాపార ఉత్పత్తుల ఎగుమతులు ఏప్రిల్‌లో తగ్గాయి. చమురు దిగుమతులు 9.26 శాతం పెరిగి 11.38 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురుయేతర దిగుమతులు 2.78 శాతం పెరిగాయి. బంగారం దిగుమతులు 54 శాతం ఎగిసి 3.97 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే, తాజాగా పెట్రోలియం, చేతివృత్తులు, రెడీమేడ్ దుస్తులు, ఫార్మా రంగాల ఎగుమతులు మాత్రం సానుకూల వృద్ధి నమోదు చేశాయి. నిరాశపర్చే గణాంకాలు.. ఏప్రిల్‌లో ఎగుమతుల వృద్ధి అంత ఆశావహంగా లేదని వాణిజ్య ప్రోత్సాహక మండలి (టీపీసీఐ) చైర్మన్ మోహిత్ సింగ్లా చెప్పారు. అయితే, సానుకూల ధోరణి కొనసాగించగలిగామని ఆయన పేర్కొన్నారు. టీ, సుగంధ ద్రవ్యాలు, ఫలాలు, కూరగాయలు వంటి వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో సానుకూలత కనిపించినట్లు చెప్పారు. కార్మిక శక్తి అత్యధికంగా ఉండే అన్ని రంగాలు ప్రతికూల పరిస్థితుల్లోనే ఉండటంతో ఎగుమతుల గణాంకాలు నిరాశపర్చేవిగా ఉన్నాయని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా చెప్పారు. ‘నిధుల కొరతతో పాటు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, రక్షణాత్మక ధోరణులు, ప్రపంచవ్యాప్తంగా బలహీన వ్యాపార పరిస్థితులు, దేశీయంగా అనేక పరిమితులు తదితర అంశాల కారణంగా ఈ రంగాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. ఒక వైపు చమురు ధరలు పెరుగుతుండటం, మరోవైపు ఇరాన్ నుంచి దిగుమతులపై ఆంక్షల నేపథ్యంలో పసిడి, చమురు దిగుమతుల భారం ఎగుస్తుండటంతో వాణిజ్య లోటు మరింత పెరుగుతుండటంపై గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధాల భయాలతో అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితులు మరింతగా దిగజారవచ్చన్నారు. రాబోయే రోజుల్లో భారత ఎగుమతులపై మరింత ఒత్తిడి పెరగవచ్చన్నారు. -
చమురు పతనంతో మార్కెట్‌కు రిలీఫ్
ముడి చమురు ధరలు దిగిరావడం, రూపాయి బలపడటంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. ప్రధాన స్టాక్ సూచీలు మళ్లీ కీలకమైన పాయింట్లపైకి ఎగిశాయి. సెన్సెక్స్ 39వేల పాయింట్లు, ఎన్ఎస్ ఈ నిఫ్టీ 11,750 పాయింట్లపైకి ఎగబాకాయి. విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా పెట్టుబడులు కుమ్మరిస్తుండటం, బ్లూ చిప్ కంపెనీలు ప్రోత్సాహకరమైన ఫలితాలను వెల్లడించడం, మే సిరీస్‌కు రోల్ఓవర్లు జోరుగా జరగడం కూడా సానుకూల ప్రభావం చూపించా యి. సెన్సెక్స్ 336 పాయింట్ల లాభంతో 39,067 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 113 పాయింట్లు పెరిగి 11,755 పాయింట్ల వద్ద ముగిశాయి. వారంలో తీవ్ర ఒడిదుడుకులు.. వారం పరంగా చూస్తే, ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్రమైన హెచుతగ్గులకు గురయ్యాయి. మొత్తం ఐదు ట్రేడింగ్ సెషన్లలో నాలుగు రోజుల పాటు సెన్సెక్స్ 300 పాయింట్ల రేంజ్లో లాభ, నష్టాల మధ్య కదలాడింది. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్ 72 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ మాత్రం 2 పాయింట్లు పెరిగింది. రోజంతా లాభాలే.... ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల ఆర్థిక ఫలితాలు దాదాపు అన్నీ అంచనాలకు అనుగుణంగానే ఉండటం కలసివస్తోంది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఒపెక్ చమురు ఉత్పత్తిని పెంచే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా ముడి చమురు ధరలు పతనమయ్యాయి. బ్యారెల్ బ్రెంట్ చమురు 75 డాలర్ల దిగువకు దిగివచ్చింది. 1.2 శాతం నష్టంతో 73.41 డాలర్లకు పడిపోయింది. ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం 25 పైసలు పుంజుకొని 70 డాలర్లను తాకింది. ఈ అంశాలన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు చూపించింది. చివరి గంటలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 372 పాయింట్లు, నిఫ్టీ 121 పాయింట్ల మేర లాభపడ్డాయి. గురువారం అమెరికా మార్కెట్లు నష్టపోవడంతో శుక్రవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరప్ మార్కెట్లు బలహీనంగా ఆరంభమై, నష్టాల్లో ముగిశాయి. ►గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో మొత్తం ఆదాయం పెరగడంతో టాటా స్టీల్ షేర్ 6.6 శాతం లాభంతో రూ.545 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ►ఫలితాలు బావుండటంతో యాక్సిస్ బ్యాంక్ షేర్ 2.6 శాతం లాభంతో రూ.760 వద్ద ముగిసింది. ►ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో ఎమ్‌సీఎక్స్ షేర్ 5% లాభంతో రూ.839 వద్ద ముగిసింది. ► మారుతీ సుజుకీ షేర్ వరుసగా ఆరో రోజూ నష్టపోయింది. శుక్రవారం ఈ షేర్ 1 శాతం నష్టంతో రూ.6,832 వద్ద ముగిసింది. గత ఆరు రోజుల్లో ఈ షేర్ దాదాపు 9 శాతం నష్టపోయింది. ► బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైని తాకాయి. -
దేశీయంగా ఐవోసీ ట్రేడింగ్ డెస్క్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రియల్ టైమ్ ప్రాతిపదికన ముడిచమురును కొనుగోలు చేసే దిశగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) దేశీయంగా ఢిల్లీలో ట్రేడింగ్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. నాణ్యమైన ముడిచమురును మెరుగైన ధరకే దక్కించుకోవడం ద్వారా దిగుమతి వ్యయాలను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) ఎ.కె.శర్మ తెలిపారు. ఐవోసీ ప్రస్తుతం తమ అవసరాల్లో 30 శాతాన్ని (15 మిలియన్ టన్నుల) స్పాట్ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం 2017లో సింగపూర్‌లో ప్రత్యేక ట్రేడింగ్ ఆఫీస్‌ను ఏర్పాటు చేసింది. తాజాగా కంపెనీ అంతర్గతంగా ట్రేడింగ్ టీమ్‌ను, సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసుకున్న నేపథ్యంలో దేశీయంగానూ డెస్క్‌ను ప్రారంభించింది. గత నెల 25న తొలి ట్రేడ్ కింద నైజీరియాలో ఉత్పత్తయ్యే అగ్బామి రకం క్రూడ్ పది లక్షల బ్యారెల్స్‌ను కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రైవేట్ సంస్థలకు దేశీయంగా ట్రేడింగ్ డెస్క్‌లు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ రంగంలో మాత్రం ఇలాంటిది ఏర్పాటు చేసిన మొదటి సంస్థ ఐవోసీనే. సింగపూర్ డెస్క్‌లో క్రూడ్ కొనుగోలుకు బిడ్స్ రావడం, నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి రెండు గంటల దాకా పట్టేస్తుండగా.. దేశీ డెస్క్ ఏర్పాటుతో ఎప్పటికప్పుడు మారే ధరలపై తక్షణమే బేరసారాలు చేసి, వెంటనే నిర్ణయం కూడా తీసుకునే వెసులుబాటు ఉంటుందని ఐవోసీ పేర్కొంది. -
మెరిసిన డాలర్.. పెరిగిన క్రూడ్!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 44 పైసలు పడింది. దీనితో 69.67కు రూపాయి జారింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్, అంతర్జాతీయంగా అమెరికా కరెన్సీ పటిష్ట ధోరణి, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు తాజాగా రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉండడం కూడా రూపాయిపై ప్రభావం చూపింది. రూపాయి వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్ల నుంచీ కిందకు జారుతోంది. ఈ కాలంలో 126పైసలు పడింది. రూపాయి ట్రేడింగ్ 69.40 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 69.71 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 20 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమయ్యింది. మరింత బలపడి గత నెల రోజులుగా 68–70 శ్రేణిలో తిరుగుతోంది. అయితే క్రూడ్ ధరల కత్తి ఇప్పటికీ రూపాయిపై వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వార్త రాసే సమయం రాత్రి 9.30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో నైమెక్స్ క్రూడ్ ధర 64 వద్ద ట్రేడవుతుండగా, భారత్ దిగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడ్ 71 వద్ద ట్రేడవుతోంది. ఈ రేట్లు 5 నెలల గరిష్ట స్థాయి. డాలర్ ఇండెక్స్ 96.66 వద్ద ట్రేడవుతుండగా, డాలర్ మారకంలో రూపాయి విలువ 69.59 వద్ద ట్రేడవుతోంది. -
మౌలిక రంగం నత్తనడక
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలికరంగం ఫిబ్రవరిలో మందగమనంలో ఉంది. వృద్ధి కేవలం 2.1 శాతంగా నమోదయ్యింది. క్రూడ్ ఆయిల్, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తిలో బలహీన ధోరణి దీనికి కారణం. 2018 ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.4 శాతం. సోమవారం విడుదలైన వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం... ►క్రూడ్ ఆయిల్, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా వరుసగా –6.1 శాతం, –0.8 శాతం చొప్పున క్షీణించాయి. ►ఎరువులు (5.2 శాతం నుంచి 2.5 శాతం), స్టీల్ (5 శాతం నుంచి 4.9 శాతం), సిమెంట్ (23 శాతం నుంచి 8 శాతం) విద్యుత్ (4.6 శాతం నుంచి 0.7 శాతం) రంగాల ఉత్పత్తుల్లో వృద్ధి ఉన్నప్పటికీ ఈ రేటు తగ్గింది. ►అయితే బొగ్గు, సహజ వాయువుల రంగాల్లో మాత్రం వృద్ధి 7.3 శాతం, 3.8 శాతం చొప్పున నమోదయ్యాయి. ►కాగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి నెలల్లో చూస్తే, మౌలిక రంగం వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదయ్యింది. -
పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
సాక్షి ముంబై : ఒకరోజు స్థిరంగా ఉన్న ఇంధన ధరలు నేడు (గురువారం) మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. పెట్రోలుపై లీటరు 15పైసలు, డీజిల్ పై 16పైసలు చొప్పున ధర పెరిగింది. అంతర్జాతీయ చమురు ధరలు మళ్లీ పైపైకి పోతుండటంతో ఈవారంలో సోమ, మంగళవారాల్లో దేశీయంగా పెట్రోలు ధరలు పెరిగినా, బుధవారం స్థిరంగా ఉన్నాయి. కానీ ఇవాళ మళ్లీ పుంజుకున్నాయి. తాజా పెరుగుదలతో దేశంలో వివిధ మెట్రో నగరాల్లో పెట్రోలు , డీజిలు ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ : లీటరు పెట్రోలు ధర రూ. 71.15, డీజిల్ ధర రూ.66.33 ముంబై: లీటరు పెట్రోలు ధర రూ. 76.79 డీజిల్ ధర రూ.69.47 చెన్నై: లీటరు పెట్రోలు ధర రూ. 73.87, డీజిల్ ధర రూ.70. 09 కోలకతా : లీటరు పెట్రోలు ధర రూ. 73.25, డీజిల్ ధర రూ.68.12 హైదరాబాద్ : లీటరు పెట్రోలు ధర రూ. 75.50, డీజిల్ ధర రూ.71.12 అమరావతి : లీటరు పెట్రోలు ధర రూ. 75.28, డీజిల్ ధర రూ.71.49 -
పుల్వామా ప్రకంపనలు
పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడి ప్రకంపనలు స్టాక్ మార్కెట్లో ప్రతిధ్వనించాయి. ఫలితంగా స్టాక్ సూచీలు సోమవారం భారీగా నష్టపోయాయి. స్టాక్ మార్కెట్ నష్టపోవడం ఇది వరుసగా ఎనిమిదో రోజు. పుల్వామా దాడి నేపథ్యంలో భారత, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావారణం నెలకొనడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, ముడి చమురు ధరలు భగ్గుమం టుండటంతో స్టాక్ మార్కెట్లో నష్టాలు కూడా కొనసాగుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 10,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. 83 పాయింట్లు క్షీణించి 10,641 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 311 పాయింట్లు పతనమై 35,498 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్ఎమ్సీజీ, బ్యాంక్, ఐటీ, వాహన, ఫార్మా షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. 2013, ఆగస్టు తర్వాత స్టాక్ సూచీలు వరుసగా ఇన్ని రోజులు నష్టపోవడం ఇదే మొదటిసారి. బ్యాంక్ షేర్లకు రేట్ల దెబ్బ ఆర్బీఐ రెపోరేటును పావు శాతం తగ్గించినప్పటికీ, కొన్ని బ్యాంక్‌లు మాత్రమే వడ్డీరేట్లను తగ్గించాయి. వడ్డీరేట్లను వినియోగదారులకు బదలాయించే విషయమై ఈ వారంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ అధినేతలతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశం కానున్నారు. దీంతో బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. అక్కడ పండగ... ఇక్కడ దండగ ప్రపంచ మార్కెట్లలో పండగ వాతావరణం ఉన్నా మన మార్కెట్లో మాత్రం దండగ వాతావరణం కొనసాగుతోంది. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా– చైనా మధ్య తాజాగా వాషింగ్టన్లో చర్చలు ప్రారంభం కావడంతో ఆసియా మార్కెట్లు సోమవారం మంచి లాభాలు సాధించాయి. హాంగ్‌కాంగ్ సూచీ హాంగ్‌సెంగ్ 1.6 శాతం, జపాన్ నికాయ్ 1.8 శాతం, చైనా షాంగై సూచీ 2.6 శాతం, కొరియా కోస్పి 0.7 శాతం మేర పెరిగాయి. యూరప్ మార్కెట్లు బలహీనంగా ఆరంభమైనా, ఆ తర్వాత లాభాల్లోకి ఎగసి, స్వల్ప లాభాలతో ముగిశాయి. 6 లక్షల కోట్ల సంపద ఆవిరి వరుస ఎనిమిది రోజుల నష్టాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. ఈ నెల 7న రూ.142.74 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్... సోమవారం నాటికి రూ. రూ.136.33 లక్షల కోట్లకు పడిపోవడం గమనార్హం. -
10,900 పాయింట్ల పైకి నిఫ్టీ
అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, షేర్ల వారీ కదలికల కారణంగా గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,900 పాయింట్లపైకి ఎగబాకింది. 15 పాయింట్లు పెరిగి 10,905 పాయింట్లకు చేరింది. 300 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 53 పాయింట్ల లాభంతో 36,374 పాయింట్ల వద్ద ముగిసింది. మరో మూడు వారాల్లో మధ్యంతర బడ్జెట్ రానుండటం, కీలక కంపెనీల క్యూ3 ఫలితాల నేపథ్యంలో అనిశ్చితి నెలకొనడంతో స్టాక్ సూచీలు లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. ఇటీవల పుంజుకున్న ముడి చమురు ధరలు 1% మేర పతనం కావడం, గత ఐదు రోజులుగా పతనమవుతున్న రూపాయి పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపించాయి. ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు నష్టపోగా, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ, వాహన షేర్లు లాభపడ్డాయి. 297 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ లాభాల్లోనే కొనసాగింది. ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతులో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ఒక దశలో 147 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మరొక దశలో 150 పాయింట్లవ వరకూ పతనమైంది. మొత్తం మీద రోజంతా 297 పాయింట్ల రేంజ్లో కదలాడింది. కొరియా సూచీ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ► క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో యాక్సిస్ బ్యాంక్ షేర్ లాభపడింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.679ను తాకిన ఈ షేర్ చివరకు 2 శాతం లాభంతో రూ.676 వద్ద ముగిసింది. గత రెండు వారాల్లో ఈ షేర్ 12 శాతం పెరిగింది. ► సన్ ఫార్మా షేర్ 5.7% నష్టపోయి రూ.427 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలివర్ షేర్లు చెరో 1 శాతం నష్టపోయాయి. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ రెండు కంపెనీల ఫలితాలు వెలువడ్డాయి. -
పండగ వేళ పెట్రో భారాలు
సాక్షి, న్యూఢిల్లీ : పండగ వేళ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రో భారాలు మోపాయి. గత మూడు రోజులుగా స్వల్పంగా పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలు ఆదివారం మరింతగా భారమయ్యాయి. పలు చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ ధరలను లీటర్‌కు 49 నుంచి 60 పైసల మధ్య పెంచగా, డీజిల్ ధరలు లీటర్‌కు 59 నుంచి 75 పైసల వరకూ భారమయ్యాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ రూ 73.47కు ఎగబాకింది. ఇక డీజిల్ ధర లీటర్‌కు రూ 69.24కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ 69.75కు పెరిగింది. డీజిల్ ధర లీటర్‌కు రూ 63.69కు చేరింది. ముంబైల్లో పెట్రోల్ ధర లీటర్ రూ 75.39 పలికితే, డీజిల్ ధర 62 పైసలు పెరిగి రూ 66.66కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో పాటు ముడిచమురు ఉత్పత్తులను రోజుకు ఎనిమిదిలక్షల బారెల్స్‌కు పరిమితం చేయాలన్న సౌదీ అరేబియా నిర్ణయంతో పెట్రో ఉత్పత్తుల ధరలు భారమయ్యాయి. -
స్థూల ఆర్థిక గణాంకాలతోనే దిశా నిర్దేశం..
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాల వెల్లడి ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ముడిచమురు, రూపాయి కదలికల ఆధారంగా నూతన ఏడాది మొదటివారం ట్రెండ్ ఆధారపడి ఉందని చెబుతున్నారు. ‘భూగోళ రాజకీయ అంశాలు, అధిక స్థాయిల వద్ద కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి, వాణిజ్య యుద్ధాలు వంటి ప్రతికూలతల నేపథ్యంలో మార్కెట్లలో నెగటివ్ సెంటిమెంట్ అధికంగా ఉండేందుకు ఆస్కారం ఉంది.’ అని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. మరోవైపు ముడిచమురు ధరల్లో కన్సాలిడేషన్ చోటుచేసుకోవడం, డాలరుతో రూపాయి బలపడడంతో పాటు స్థూల గణాంకాల ఆధారంగా ఇన్వెస్టర్లలో విశ్వాసం నెలకొనవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. వచ్చే ఏడాది రెండవ వారం నుంచి ప్రారంభంకానున్న క్యూ3 (అక్టోబర్–డిసెంబర్) ఫలితాలు మార్కెట్ దిశకు మరింత స్పష్టత ఇవ్వనున్నాయని వివరించారు. నికాయ్ గణాంకాల వెల్లడి.. ఎనిమిది కీలక రంగాల వృద్ధిరేటుకు సంబంధించిన సమాచారం ఈ వారంలోనే వెల్లడికానుండగా.. నవంబర్ నెల దేశీ మౌళిక సదుపాయాల నిర్మాణ సమాచారాన్ని ప్రభుత్వం సోమవారం వెల్లడించనుంది. నికాయ్ ఇండియా మ్యానుఫ్యాక్చరంగ్ పర్చేరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) బుధవారం, నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ శుక్రవారం వెల్లడికానున్నాయి. ఈవారంలోనే ఆటోమొబైల్ కంపెనీలు తమ డిసెంబర్ నెలకు సంబంధించిన అమ్మకాల డేటాను ప్రకటించనున్నాయి. ఎన్బీఎఫ్సీల్లో నెలకొన్న ద్రవ్య లభ్యత కొరత ఈసారి ఆటో డేటాపై ఉత్కంఠ నింపిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఓలా, ఉబెర్ వంటి ఆటో అగ్రిగేటర్ సంస్థల మద్దతుతో వాల్యూమ్స్ నిలబడే అవకాశం ఉందనే ఆశాభావం ఉన్నట్లు వ్యక్తంచేశారు. ఇక అంతర్జాతీయ గణాంకాల పరంగా చూస్తే.. అమెరికా, చైనా దేశాల డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐలు బుధవారం వెల్లడికానున్నాయి. ఈ మొత్తం సమాచారాల ఆధారంగానే మార్కెట్ కదలికలు ఈవారంలో ఉండనున్నట్లు వినోద్ నాయర్ అన్నారు. ఎఫ్‌పీఐల నికర పెట్టుబడి రూ.5,477 కోట్లు ముడి ధరలు తగ్గడం, డాలరుతో రూపాయి మారకం విలువ బలపడిన కారణంగా డిసెంబర్ 3–28 కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ)లు రూ.5,477 కోట్లను దేశీ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల సమాచారం ద్వారా వెల్లడైంది. రూ.1,900 కోట్లను ఈక్విటీలో నికరంగా ఇన్వెస్ట్‌చేసిన వీరు రూ.3,577 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడిపెట్టినట్లు తేలింది. 71–72 శ్రేణిలో రూపాయి.. గడిచిన వారంలో ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 52.20 డాలర్లకు పతనం కాగా, యూఎస్ క్రూడ్ 45.12 డాలర్లకు పడిపోయి.. వరుసగా మూడవ వారంలోనూ పతనాన్ని నమోదుచేశాయి. అక్టోబర్ గరిష్టస్థాయిల నుంచి 39 శాతం, ఏడాది ప్రాతిపదికన 17 శాతం పడిపోయాయి. ఉత్పత్తిలో కోత కారణంగా బ్రెంట్ ధర 50 డాలర్ల సమీపంలో బోటమ్ కావచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు డబ్ల్యూటీఐ ధర మరింత పతనమైతే యూఏఈ, రష్యాలు అత్యవసర సమావేశానికి పిలుపునివ్వగా.. ఇందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆనంద్ రాఠీ కమోడిటీస్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ హెచ్ రవీంద్ర వీ రావు విశ్లేషించారు. ఇక గతవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.93 వద్దకు చేరుకుంది. అమెరికా డాలర్ బలహీనపడటం, ఈక్విటీ మార్కెట్ బలపడటం వంటి సానుకూల అంశాలతో రూపాయి విలువ బలపడింది. దిగుమతిదారులు అన్హెడ్జ్ పొజిషన్లను కవర్చేసుకోవడం కోసం వచ్చే కొద్ది సెషన్లలో క్యూ కట్టవచ్చని ఈకారణంగా రానున్న సెషన్లలో రూపాయి 71–72 స్థాయిలో ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. -
ఇక పెట్రో బాదుడు షురూ?
సాక్షి, ముంబై: గత రెండు నెలలుగా ఊరట చెందిన వినియోగదారుల నెత్తిన పెట్రో భారం మళ్లీ మొదలైంది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరుణంలో మళ్లీ పెట్రో ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఈ వారంలో 2శాతం క్రూడ్ ధర క్షీణించగా, గత రెండు నెలల్లో 30శాతం తగ్గింది. అయినా దేశీయంగా పెట్రో బాదుడు షురూ కావడం గమనార్హం. తాజాగా పెట్రోలు పై 11 పైసలు ధర పెరిగింది. అయితే డీజిల్ ధర స్థిరంగా ఉంది. దీంతో గత రెండు రోజులుగా స్ధిరంగా కొనసాగిన పెట్రోల్ ధరలు దేశ రాజధాని ఢిల్లీలో 9 పైసలు పెరిగి రూ.70.29 కి చేరింది. అటు వరసగా మూడో రోజు కూడా స్థిరంగా ఉన్న డీజిల్ ధర రూ.64.66 వద్ద యథాతథంగా కొనసాగుతోంది. ముంబైలో పెట్రోలు ధర 11 పైసలు పెరిగి రూ.75.91 ఉండగా..డీజిల్ ధర రూ.67.66 గా ఉంది. కోలకతా : పెట్రోలు ధర రూ. 72.38 , డీజిలు ధర రూ. 66.40 చెన్నై: పెట్రోలు ధర రూ. 72.94 డీజిలు ధర రూ. 68.26 హైదరాబాద్: పెట్రోలు ధర రూ.74.55. డీజిల్ ధర రూ70.26 . విజయవాడ: పెట్రోలు ధర రూ. 73.99. డీజిలు ధర రూ. 69.36 కాగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడంతో దేశీయంగా కూడా ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 4న చారిత్రక గరిష్టాలను నమోదు చేశాయి. అయితే ప్రభుత్వం జోక్యంతో అక్టోబర్ 16నుంచి పెట్రో ధరల దూకుడుకు కళ్లెం వేసింది. అటు అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు దిగి రావడంతో రెండు నెలలుగా దేశీయ ఇంధన ధరలు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్కు చమురు సెగ
సాక్షి, ముంబై: అంతర్జాతీయంగా మండుతున్న చమురు ధరలు విమానయాన సంస్థల్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఆర్థికంగా సంక్షోభంలో చిక్కి విలవిల్లాడుతున్న ప్రయివేటురంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ను బాగా ప్రభావితం చేసింది. వరుసగా మూడవ క్వార్టర్లో కూడా భారీ నష్టాలను మూట గట్టుకుంది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసిక ఫలితాల్లో జెట్ ఎయిర్వేస్ భారీ నష్టాలను నమోదు చేసింది. రూ.1298 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం 496.3 మిలియన్ల లాభాలను సాధించింది. ఆదాయం 6161 కోట్లకు పరిమితమైంది. ఏకంగా ఇంధన వ్యయం 58.6 శాతం పెరిగి రూ. 24.20 బిలియన్లకు చేరుకుంది. ఆపరేటింగ్ ఆదాయం 9.5 శాతం పెరిగింది. మరోవైపు విక్రమం మెహతా ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా రాజీనామా చేశారు. కాగా నరేష్ గోయల్ నేతృత్వంలోని జెట్ ఎయిర్వేస్ నిధుల కొరత సమస్యను అధిగమించే వ్యూహంలో నిమగ్నమై ఉన్న సంగతి తెలిసిందే. -
ఒడిదుడుకుల వారం
పలు కీలక కంపెనీలు ఈ వారంలో క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడించనున్నాయని, ఈ కంపెనీల ఫలితాల ప్రభావం ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని నిపుణులంటున్నారు. ఈ ఫలితాలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. అక్టోబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు గురువారం (ఈ నెల 25న) ముగియనున్నందున సూచీలు ఒడిదుడుకులకు గురవుతాయని విశ్లేషకులంటున్నారు. ఫలితాల కారణంగా షేర్ వారీ కదలికలు కీలకమని వారంటున్నారు. కీలక కంపెనీల క్యూ2 ఫలితాలు.. ఈ వారంలో దాదాపు 300కు పైగా కంపెనీలు, వీటిల్లో 15 నిఫ్టీ కంపెనీలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, భారీగా నిరాశ పరచలేదని, అందుకే మార్కెట్‌కు దిగువ స్థాయిల్లో కూడా మద్దతు లభిస్తోందని నిపుణులంటున్నారు. ఇక ఈ వారంలో వెలువడే కంపెనీల ఫలితాలు ఆశాజనకంగానే ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ వారంలో ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, మారుతీ సుజుకీ, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, విప్రో, భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఇన్ఫ్రాటెల్, యస్ బ్యాంక్, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్, టీవీఎస్ మోటార్, బయోకాన్, భెల్ తదితర కంపెనీలు ఫలితాలను వెల్లడిస్తాయి. పరిమిత శ్రేణిలోనే... ఈ వారం మార్కెట్ పరిమిత శ్రేణిలోనే కదలాడుతుందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ అంచనా వేస్తున్నారు. లిక్విడిటీ సమస్యలు, ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతలు, రానున్న ఎన్నికలపై ఆందోళనలు.. స్టాక్ మార్కెట్‌పై భారాన్ని కొనసాగించనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే ఈ అంశాల్లో చాలా భాగాన్ని మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసుకుందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా బాండ్ల రాబడుల్లో నిలకడ నెలకొనడం, అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకు సంబంధించిన పరిణామాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వివరించారు. సాంకేతికంగా చూస్తే, నిఫ్టీ బలహీనంగానే ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని వ్యాఖ్యానించారు. నాన్ బ్యాంకింగ్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల లిక్విడిటీ సమస్యలపై ఈ వారం కూడా మార్కెట్ దృష్టి పెడుతుందని డెల్టా గ్లోబల్ పార్ట్నర్స్ సంస్థ వ్యవస్థాపకుడు దేవేంద్ర నేగీ పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయంగా చూస్తే, ఈ నెల 23(మంగళవారం) జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. బుధవారం(ఈ నెల24న) అమెరికాలో సెప్టెంబర్ ఇళ్ల అమ్మకాల గణాంకాలు వెలువడతాయి. ఈ గురువారం (ఈ నెల 25న)యూరోపియన్ కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్లపై నిర్ణయాన్ని వెల్లడిస్తుంది. రేట్ల విషయంలో యథాతథ స్థితి ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ఈ నెల 26న(శుక్రవారం) అమెరికా క్యూ3 జీడీపీ గణాంకాలు వస్తాయి. ఈ వారంలో ఇటలీ బడ్జెట్ పరిణామాలు కూడా కీలకం కానున్నాయి. 3 వారాల్లో.. రూ.32,000 కోట్లు వెనక్కి... విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఈ నెలలో మొదటి మూడు వారాల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.32,000 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు పెరగడం, అమెరికాలో బాండ్ల రాబడులు ఎగియడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఈ నెల 19వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.19,810 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.12,167 కోట్ల చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా గత నెల మొత్తంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.21,000 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాదిలో 2 నెలలు మినహా విదేశీ నిధులు తరలిపోతూనే ఉన్నాయి. ఈ నెలలో ఈ జోరు మరింతగా పెరగడంతో స్టాక్ మార్కెట్ మరింతగా కుదేలవుతోందని నిపుణులంటున్నారు. కాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.33,000 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.60,000 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ వారం కీలక క్యూ2 ఫలితాలు 22–సోమవారం హిందుస్తాన్ జింక్, కెన్ ఫిన్ హోమ్స్, ఏషియన్ పెయింట్స్, అలెంబిక్ ఫార్మా, ఒబెరాయ్ రియల్టీ 23–మంగళ వారం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఆర్బీఎల్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టీవీఎస్ మోటార్స్, అంబుజా సిమెంట్స్ 24–బుధవారం బజాజ్ ఆటో, విప్రో, కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఇండిగో, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 25–గురువారం భారతీ ఎయిర్టెల్, మారుతీసుజుకీ, యస్‌బ్యాంక్ ,ఓబీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బయోకాన్ 26–శుక్రవారం ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, యూపీఎల్ -
సగటు జీవికి ఊరట..
సాక్షి, న్యూఢిల్లీ : భగ్గుమంటున్న ఇంధన ధరలు ఆదివారం వరుసగా రెండోరోజు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌కు 25 పైసలు తగ్గి రూ 81.74 పలికింది. డీజిల్ ధర లీటర్‌కు 17 పైసలు పతనమై రూ 75.19గా నమోదైంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర స్వల్పంగా దిగివచ్చి రూ 86.90కి తగ్గింది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ లీటర్‌కు 25 పైసలు తగ్గి రూ 87.21గా నమోదైంది. డీజిల్ ధర లీటర్‌కు 18 పైసలు దిగివచ్చి రూ 78.82కు తగ్గింది. కాగా గతవారం అంతర్జాతీయ, దేశీయ దిగ్గజ చమురు కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నేపథ్యంలో ఇంధన ధరలు దిగిరావడం గమనార్హమని ఇంధన నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు మండుతున్న ఇంధన ధరలను నియంత్రించేందుకు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఈనెల 4న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తగ్గించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇంధన ధరలపై పన్ను భారాన్ని తగ్గించాలని ఆయన కోరారు. -
ప్రపంచ ఎకానమీకి చమురు సెగ..
న్యూఢిల్లీ: అంతకంతకూ పెరిగిపోతున్న ముడి చమురు ధరలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల గరిష్టానికి చేరిన రేట్లను కట్టడి చేయకపోతే వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని చమురు ఉత్పత్తి దేశాలను హెచ్చరించారు. చమురు రేట్లను సముచిత స్థాయులకు తెచ్చేందుకు ఉత్పత్తి దేశాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారాయన. ఇండియా ఎనర్జీ ఫోరం వార్షిక సదస్సు సందర్భంగా సోమవారం దిగ్గజ చమురు, గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో భేటీలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. పెరుగుతున్న ముడిచమురు రేట్లు ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయని, భారత్ వంటి వర్ధమాన దేశాల బడ్జెట్లను తల్లకిందులు చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్రం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. సుమారు రెండు గంటలపైగా సాగిన భేటీలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంత్రులు, బ్రిటన్ ఇంధన దిగ్గజం బీపీ సంస్థ సీఈవో బాబ్ డడ్లీ, టోటల్ చీఫ్ ప్యాట్రిక్ ఫోయేన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, వేదాంత చీఫ్ అనిల్ అగర్వాల్, కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తదితరులు పాల్గొన్నారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న దేశీ కరెన్సీకి తాత్కాలికంగానైనా మద్దతు లభించేలా.. చెల్లింపు విధానాలను కూడా సమీక్షించాలని ప్రధాని కోరినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఈ ఏడాది ఇప్పటిదాకా 14.5 శాతం మేర పతనమైన సంగతి తెలిసిందే. సుమారు 83 శాతం చమురు అవసరాల కోసం ప్రధానంగా దిగుమతులపైనే భారత్ ఆధారపడుతున్న నేపథ్యంలో రూపాయి పతనం కారణంగా చెల్లింపులు భారంగా మారుతున్నాయి. పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదు.. గత సదస్సుల్లో కోరినట్లు నిబంధనలను సడలించినప్పటికీ చమురు, గ్యాస్ ఉత్పత్తికి సంబంధించి భారత్‌లో కొత్తగా పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదంటూ కంపెనీల సీఈవోలను ప్రధాని ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చమురు ధరలు, ఉత్పత్తి పరిమాణం మొత్తం అంతా ఉత్పత్తి దేశాలే శాసిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. తగినంత ఉత్పత్తి ఉంటున్నప్పటికీ మార్కెటింగ్ విధానాల కారణంగా చమురు రేట్లు పెరిగిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితంగా తగినన్ని వనరులు లేక వినియోగ దేశాలు తీవ్రమైన ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ నేపథ్యంలో మిగతా ఉత్పత్తుల తరహాలోనే ఉత్పత్తి దేశాలు, వినియోగదేశాల మధ్య భాగస్వామ్యం ఉండాలని మోదీ పేర్కొన్నారు. ‘ఇప్పుడిప్పుడే రికవరీ బాట పడుతున్న ప్రపంచ ఎకానమీ స్థిరపడేందుకు ఇది తోడ్పడగలదు‘ అని ఆయన చెప్పా రు. అలాగే చమురు ఎగుమతి దేశాలు తమ దగ్గర పెట్టుబడులకు ఉపయోగపడే మిగులు నిధులను.. వర్ధమాన దేశాల్లో ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి కార్యకలాపాలపై ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించాలన్నారు. మా వంతు ప్రయత్నాలు: సౌదీ మంత్రి పెరుగుతున్న చమురు ధరలతో భారత్ తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోందని ఇండియా ఎనర్జీ ఫోరంలో పాల్గొన్న కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, అధిక ముడి చమురు ధరల కారణంగా వినియోగ దేశాలు పడుతున్న బాధలను ప్రధాని మోదీ స్పష్టంగా వివరించారని సౌదీ అరేబియా చమురు మంత్రి అల్–ఫలిహ్ చెప్పారు. ‘బంగారు గుడ్లు పెట్టే కోడిని (వినియోగ దేశాలు) ఒక్కసారిగా చంపేయొద్దు అంటూ మాలాంటి ఉత్పత్తి దేశాలను ప్రధాని మోదీ హెచ్చరించారు’ అని ఫలిహ్ పేర్కొన్నారు. సౌదీ ఇప్పటికే తన వంతు చర్యలు తీసుకుంటోందని, లేదంటే ఈ బాధ మరింత తీవ్రంగా ఉండేదని తెలిపారు. దేశీయంగా ఇంధన రంగ అభివృద్ధికి తీసుకోతగిన చర్యలపై సమాలోచనలు జరపడం ఇండియా ఎనర్జీ ఫోరం సదస్సుల ప్రధానోద్దేశం. 2016 ఇండియా ఎనర్జీ ఫోరం సందర్భంగా సహజ వాయువు ధరల సంస్కరణలపై వచ్చిన సూచనలను పరిశీలించిన కేంద్రం ఆ తర్వాత రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
చమురు 'చదరంగం'
నవంబర్ 4... చమురు దిగుమతులపై ప్రపంచ దేశాలకు అమెరికా విధించిన గడువు. ఆ తేదీ నుంచి అన్ని దేశాలు ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతిని పూర్తిగా నిలిపివేయాలి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన వెంటనే ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా, మిత్రదేశాలు వైదొలగాయి. ఇరాన్‌ను ఒంటరి చేయాలనే ఉద్దేశంతో ట్రంప్ ఆ దేశంపై ఆంక్షలు విధించారు. ఇరాన్ నుంచి చమురుతోపాటు మరికొన్ని వస్తువులు దిగుమతి చేసుకోరాదని, అలా చేసిన దేశాలు కూడా అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నవంబర్ 4 తర్వాత ఇరాన్ నుంచి చమురు ఉత్పాదనల దిగుమతిని జీరో స్థాయికి తీసుకురావాలని షరతు విధించారు. దాంతో చవకగా దొరికే ఇరాన్ చమురు ఉత్పాదనలపై ఆధారపడిన దేశాలన్నీ ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడ్డాయి. ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య చమురు ఒక చదరంగం ఆటగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా చమురు నౌకల గమ్యం ఒక్కసారిగా మారిపోతోంది. అమెరికా ఆధిపత్యం... ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగినప్పటి నుంచి అమెరికా చమురు ఉత్పత్తుల ఎగుమతి అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. 2015 వరకు తన చమురు నిల్వలను ఎగుమతి చేసే విషయంలో అమెరికా విపరీతమైన పరిమితులు విధించుకుంది. 2015 చివర్లో అమెరికా ఈ పరిమితులన్నింటినీ సడలించింది. దాంతో నెమ్మదిగా ఎగుమతులు పెరుగుతూ వచ్చాయి. ఒకప్పుడు కొన్ని వందల బ్యారెళ్ల చమురు మాత్రమే ఎగుమతి చేసే అమెరికా... ఇప్పుడు ఆసియా, ఐరోపా, లాటిన్ అమెరికా దేశాలకు రోజుకు 2 లక్షల బ్యారెళ్ల చొప్పున ఎగుమతి చేస్తున్నట్లు యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. బయటకు చెప్పకపోయినా అమెరికాలోని అన్ని రకాల చమురు నిల్వల స్థాయి సౌదీ అరేబియా కంటే ఎక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏడాది కాలంలో దక్షిణ కొరియాకు అమెరికా చమురు ఎగుమతులు 313 శాతం పెరిగి ప్రస్తుతం రోజుకు 2,67,000 బ్యారెళ్లకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ సంస్థ చెబుతోంది. అలాగే జపాన్‌కు 198 శాతం, భారత్‌కు 165 శాతం ఎగుమతులు పెరిగాయి. బ్రిటన్, ఇటలీ, నెదర్లాండ్స్ దేశాలకూ చమురు రవాణా గణనీయంగా పెరిగింది. చైనా దిగుమతులు ఆగిపోవడంతో ఆ మేర అమెరికా చమురు మార్గాలు ఇతర ఆసియా దేశాలు, ఐరోపా వైపు మళ్లినట్లు కనిపిస్తోందని అమెరికా ఆర్థిక నిపుణుడు కరోలినే బెయిన్ అన్నారు. చమురు కోసం ఇరాన్‌పై ఆధారపడ్డ దేశాలకు తాము ప్రత్యామ్నాయం చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇస్తున్న భరోసా వెనుక అంతరార్థం అర్థం చేసుకోవచ్చు. అయోమయంలో ఐరోపా... ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం, ఇరాన్‌పై ఆంక్షలు విధించడాన్ని ప్రధాన ఐరోపా దేశాలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. ఒప్పందం యథాతథంగా కొనసాగాలని ఇప్పటికీ పట్టుబడుతున్నా ఇప్పుడు నవంబర్ 4 గడువును ఎలా అధిగమించాలా అనే సంశయంలో పడ్డాయి. అమెరికాతో ఉన్న సుదీర్ఘ వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకునేందుకు ఈ దేశాలు సిద్ధంగా లేవు. అలాగని ఇరాన్‌తో పూర్తిగా సంబంధాలు తెంచుకునేందుకు అంగీకరించే పరిస్థితులు లేవు. ఇరాన్ చమురు దిగుమతులను పూర్తిగా ఆపేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టి సారించాయి. అంతర్జాతీయ వ్యాపారం.. ముఖ్యంగా చమురు కొనుగోలు విషయంలో డాలర్ స్థానంలో యూరోను ప్రత్యామ్నాయ మారకంగా తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నాయి. అలాగే ఆంక్షల జోలికి పోకుండా చట్టబద్ధంగా ఇరాన్‌తో వాణిజ్యం కొనసాగించేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఐరోపా బ్యాంకులు తెరపైకి తెచ్చాయి. అయితే ఇరాన్‌పై నిషేధాన్ని అమలు చేయడానికి ఐరోపా, భారత్ పూర్తిగా సిద్ధంగా లేవని, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయని తెలుసుకున్న అమెరికా ఆందోళన చెందుతోంది. ఇరాన్ చమురు విషయంపై చర్చించడానికి అత్యవసరంగా యూరప్ వెళ్లనున్న అమెరికా ఉన్నతస్థాయి ప్రతినిధి బ్రెయిన్ హుక్ ఆ తర్వాత భారత్‌తో సంప్రదింపుల కోసం ఆయన ఈ వారంలో ఢిల్లీ రానున్నారు. ఈ సంప్రదింపులు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. మరోవైపు చమురు వ్యాపారంలో తన ప్రత్యర్థి అయినప్పటికీ ఇరాన్‌కు మద్దతివ్వడానికి రష్యా ముందుకొస్తోంది. అమెరికా ఆంక్షలు అమలు కాకుండా ఏ విధమైన వ్యూహం అమలు చేయాలన్న విషయంపై ఇప్పటికే రష్యా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయి. ఖాతరు చేయని చైనా.. అమెరికాతో ఇప్పటికే వాణిజ్యపరమైన యుద్ధం చేస్తున్న చైనా ట్రంప్ విధించిన నిషేధాన్ని ఖాతరు చేయడం లేదు. ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తులను వినియోగించే చైనా తన అవసరాలకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతిని యథావిధిగా కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అంతే కాదు.. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురును పూర్తిగా నిలిపేసింది. అమెరికన్ చమురు పొందే దేశాల్లో చైనాది రెండో స్థానం. 2016 జూలై వరకు చైనా రోజుకు 1.2 కోట్ల బ్యారెళ్ల చమురును అమెరికా నుంచి దిగుమతి చేసుకునేది. అమెరికా సెన్సెక్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2016 ఆగస్టు తర్వాత చైనా చమురు దిగుమతిని పూర్తిగా నిలిపేసింది. ఆ లోటును భర్తీ చేసుకోవడానికి చైనా ఇతర దేశాలపై ఆధారపడుతోంది. కొలంబియా నుంచి వచ్చే చమురు పరిమాణం ఇటీవలి కాలంలో ఐదు రెట్లు పెరిగింది. అలాగే బ్రెజిల్ చమురు కూడా ఈ ఏడాది అత్యధిక స్థాయికి చేరింది. పశ్చిమ ఆఫ్రికా నుంచి చైనా ఇప్పుడు ఎన్నడూ లేనివిధంగా 17.1 కోట్ల బ్యారెళ్ల చమురును నిత్యం పొందుతోంది. అలాగే ఒమన్, కువైట్ నుంచి కూడా చైనాకు చమురు రవాణా విపరీతంగా పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్ టాంకర్ ట్రాకర్ పసిగట్టింది భారత్ దారి ఎటు? ఇరాన్‌పై ఆంక్షల విషయంలో తమకు సడలింపు ఇవ్వాలంటూ అమెరికాతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఒకవైపు రష్యా నుంచి ఎస్–400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడం మరోవైపు ఇరాన్ నుంచి అత్యధిక స్థాయిలో చమురు ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుం టుండటం అమెరికా సహించలేకపోతోంది. అమెరికా షరతులను అంగీకరించని దేశాలపై విధించే తమ చట్టం కాట్సూ పరిధిలోకి భారత్ వైఖరి వస్తుందని అమెరికన్ ప్రభుత్వ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ నుంచి చవకగా లభించే చమురు ఉత్పత్తుల దిగుమతిని పూర్తిగా నిలిపేయడానికి భారత్ సిద్ధంగా లేదు. అదే సమయంలో అమెరికాతో ఉన్న వాణిజ్య, రక్షణ, సాంకేతిక సంబంధాలను దూరం చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. 2017–18లో మొత్తం 22 కోట్ల బ్యారెళ్ల చమురును ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న భారత్ (ఇరాన్ మొత్తం ఎగుమతుల్లో ఇది 9 శాతం) తాజా పరిణామాల నేపథ్యంలో ఆ దేశం నుంచి చమురు దిగుమతులను కొంత తగ్గించుకుని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లోటును భర్తీ చేసుకోవాలని చూస్తోంది. ఆంక్షలకు ముందు (2015) మాదిరిగానే ఇరాన్‌తో చమురు దిగుమతికి రూపాయిని మారకంగా ఒప్పించడానికి కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది. నవంబర్ మాసానికి భారత ప్రభుత్వరంగ చమురు సంస్థ ఐవోసీ, ఎంఆర్‌పీఎల్ 12.5 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతికి ఇరాన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. మరోవైపు చమురు కోసం ఇతర దేశాలతోనూ భారత్ చర్చిస్తోంది. బ్యారెల్ 100 డాలర్లు? ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు, పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్)లో సభ్యత్వంగల వెనిజులాలో సంక్షోభం వంటి అంతర్జాతీయ కారణాల వల్ల చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు చేరుకోవచ్చన్న ఊహాగానాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. 2016 వరకు 50 డాలర్లలోపు ఉన్న ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 70–80 డాలర్ల మధ్య ఊగిసలాడుతుండగా ఇది 100 డాలర్లకు పెరిగే అవకాశాలు న్నాయని నిపుణులు భావిస్తు న్నారు. విమానయాన రంగం భారీగా విస్తరించడం, ఎలక్ట్రిక్ కార్ల వాడకం పెరగకపోవడంతో చమురు వినియోగం పెరిగి దాని డిమాండ్‌ను విపరీతంగా పెంచు తోందని ‘ది గార్డియన్’ పత్రిక అంచనా వేసింది. నవంబర్‌లో ఇరాన్ నుంచి ఎగుమతి అయ్యే చమురు రోజుకు 20 లక్షల బ్యారెళ్లు తగ్గడంతో వచ్చే ఏడాదికి చమురు ధర 100 డాలర్లకు చేరినా ఆశ్చర్యం పోనవసరం లేదని చమురు వ్యాపార నిపుణుడు అలెక్స్ బియార్డ్ ఇటీవల లండన్‌లో జరిగిన ఓ సదస్సులో చెప్పారు. ప్రస్తుతం ముడి చమురు రేటు 78 డాలర్లు ఉండగా భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఢిల్లీలో లీటరుకు వరుసగా రూ. 82.86, రూ. 74.12గా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ ధర ఏకంగా రూ. 90.22కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిపోతుండటంతో ఈ ఏడాది చివరకు లేదా వచ్చే ఏడాది ప్రారంభం కల్లా పెట్రోల్ రేటు రూ. 100కు చేరుతుందని మార్కెట్ వర్గాల అంచనా. ఇప్పటికే ప్రభుత్వరంగ చమురు సంస్థలు పెట్రోల్ బంకుల్లో మిషన్లను మూడంకెల రేటు వచ్చేలా మార్చేందుకు సమాయత్తమవుతున్నాయి. అంతర్జాతీయ చమురు ధర 100 డాలర్లకు పెరిగి, మన దేశంలో రూపాయి విలువ తగ్గిపోతున్న దశలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రేట్లు ఎంతగా పెరుగుతాయన్న అంచనాల్లో నిపుణులు నిమగ్నమయ్యారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆధికార పార్టీ నేతలు ఆయిల్ దోపిడి
-
‘రైతు మద్దతు’ యూపీఏ కంటే తక్కువే
ముంబై: ఖరీఫ్ పంటలకు కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో తొలిసారిగా 2018లో అత్యధికంగా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను ప్రకటించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే ఈ మొత్తం యూపీఏ ప్రభుత్వ హయాంలో 2008–09, 2012–13 ఆర్థిక సంవత్సరాల్లో ప్రకటించిన దానికంటే తక్కువేనని వెల్లడించింది. ఇటీవల విడుదల చేసిన ద్రవ్య విధాన నివేదిక(ఎంపీఆర్)లో రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు పేర్కొంది. రైతుల పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018–19 ఆర్థిక సంవత్సరానికి గానూ క్వింటాల్ వరిపై రూ.200, గోధుమపై రూ.105, మసూర్‌పై రూ.225 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా, మద్దతుధర పెంపు కారణంగా ద్రవ్యోల్బణం 0.29 నుంచి 0.35 శాతం పెరిగే అవకాశముందని ఆర్బీఐ నివేదికలో తెలిపింది. బ్యారెల్ ముడిచమురు విలువ ఇప్పుడు ఒక్క డాలర్ పెరిగినా, భారత కరెంట్ అకౌంట్ లోటు(సీఏడీ) రూ.5,901 కోట్ల మేర పెరుగుతుందని వెల్లడించింది. -
ఇంధన దిగుమతులతోనే సంక్షోభ సెగలు..
సాక్షి, న్యూడిల్లీ : అపరిమిత ముడి చమురు దిగుమతుల వల్లే భారత్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. రూపాయి క్షీణత, వాణిజ్య లోటు పెరగడంపై త్వరలో మంత్రుల బృందంతో భేటీ నేపథ్యంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో 80 శాతం వరకూ విదేశీ మార్కెట్ల నుంచి దిగుమతులపైనే ఆధారపడటంతో పెద్దమొత్తంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖర్చవుతున్నాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం మరింత క్షీణించడంతో ఇంధన దిగుమతులపై అత్యధికంగా చెల్లింపులు అవసరమవుతున్నాయి. ముడిచమురు ధరలు ప్రస్తుతం బ్యారెల్‌కు 85 డాలర్లకు ఎగబాకాయి. ఇక రోజురోజూ భారమవుతున్న పెట్రోల్ ధరలు వరుసగా గురువారం సైతం పలు నగరాల్లో సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతూ పైపైకి ఎగిశాయి. పెరుగుతున్న ఇంధన ధరలకు చెక్ పెట్టేందుకు పెట్రో ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని, ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. -
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర
సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్ ధర మళ్లీ పెరిగింది. గత 6 నెలల నుంచి క్రమంగా పెరుగుతున్న సిలిండర్ ధర.. తాజాగా రూ.58.50 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో సబ్సిడీ లేని వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.936.50కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరుగుతుండటంతో వంట గ్యాస్ ధరపై తీవ్ర ప్రభావం పడుతోంది. తాజా పెంపుతో గత 6మాసాల్లోనే రూ.233.50 మేర గ్యాస్ ధర పెరిగినట్లయింది. అయితే సబ్సిడీ సిలిండర్ ధరలో మాత్రం హైదరాబాద్‌లో మార్పు లేదు. పెరిగిన ధరకు తగట్టుగా సిలిండర్‌పై సబ్సిడీ జమ కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో సబ్సిడీ సిలిండర్ వినియోగదారులపై నయా పైసా కూడా అదనపు భారం లేకుండా పోయింది. అయితే సబ్సిడీ సిలిండర్‌కు నగదు బదిలీ పథకం వర్తింపు కారణంగా మొత్తం ధర ఒకేసారి చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయడం నిరుపేదలకు భారంగా తయారైంది. ప్రస్తుతం పెరిగిన నగదు తిరిగి బ్యాంకు ఖాతాలోకి వస్తుండటంతో కొంత ఉపశమనం కలిగిస్తోంది. -
షాకింగ్ : మెట్రో నగరాల్లో పెట్రో సెగలు
సాక్షి, న్యూఢిల్లీ : ముడిచమురు ధరల భారంతో పెట్రో సెగలు కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ 90.08కి పెరగ్గా, డీజిల్ లీటర్‌కు రూ 78.58కి చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ 82.72కు పెరగ్గా, డీజిల్ ధర లీటర్‌కు రూ 74.02కు ఎగిసింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ రూ 87.58కి పెరిగింది. ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 77 డాలర్లకు పెరగడంతో పాటు పెట్రో ఉత్పత్తులపై పన్నుల భారంతో పెట్రో ధరలు పరుగులు పెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో పెట్రో ధరలు రికార్డు స్ధాయిలకు చేరడంతో ప్రభుత్వం ఇంధన భారాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. పెట్రో ఉత్పత్తులపై పన్నులను భారీగా తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు. -
పెట్రో షాక్ : సెంచరీ దిశగా ఇంధన ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో సెగలు కొనసాగుతున్నాయి. ముడిచమురు ధరల భారంతో పాటు రూపాయి క్షీణించడంతో ఇంధన ధరలు సరికొత్త గరిష్టస్ధాయిలకు చేరాయి. లీటర్ పెట్రోల్ రూ వంద దిశగా పరుగులు పెడుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ 89.29కి చేరగా డీజిల్ ధర లీటర్‌కు రూ 78.26కు పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్‌కు రూ 86.25 పలికింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ 81.91కు పెరగ్గా, డీజిల్ ధరలు లీటర్‌కు రూ 73.32కు చేరాయి. ముంబైలో శనివారం తొలిసారిగా పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ 80కి చేరడంతో ఇంధన ధరల రికార్డు పెరుగుదలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇంధన ధరలకు చెక్ పెట్టేందుకు రూపాయిని బలోపేతం చేసే చర్యలు చేపట్టడంతో పాటు, పెట్రో ఉత్పత్తులపై పన్ను భారాలు తగ్గించాలనే డిమాండ్ ఊపందుకుంది. aasss -
పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలి: భట్టి
సాక్షి, హైదరాబాద్: పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే భారం తగ్గే అవ కాశం ఉంటుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెట్రో భారం వేయడాన్ని ఖండిస్తూ ఈనెల 10న కాంగ్రెస్ తలపెట్టిన భారత్ బంద్‌లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్‌ఆయిల్ ధరలు 120డాలర్లు ఉన్నా..తక్కువ ధరలకే డీజిల్, పెట్రోల్ అందించిన ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తు చేశారు. పెట్రో ధరలు తగ్గించాల్సింది పోయి, ప్రస్తుత ప్రభుత్వాలు వాటిని మరింత పెంచి ఇష్టారాజ్యంగా ప్రజలపై భారం వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి విలువ పతనమవడంతో ఇంధన ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. సోమవారం సవరించిన ధరల ప్రకారం.. పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 39 పైసల ధర పెరిగింది. దీంతో ముంబైలో రికార్డు స్థాయిలో లీటరు పెట్రోల్ ధర రూ.86.56కు చేరుకుంది. డీజిల్ ధర రూ.75.54గా ఉంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.79.15, లీటరు డీజిల్ రూ.71.15గా ఉంది. ఆగస్టు 16 నుంచి ఇప్పటివరకు లీటరు పెట్రోల్‌పై రూ.2, డీజిల్‌పై రూ.2.42 ధర పెరిగింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల వల్ల సరఫరా తగ్గుతుందన్న భయంతో చమురు ధరలు 15 రోజుల్లో 7 డాలర్లు (బ్యారెల్‌కు) పెరిగాయి. రూపాయి పతనం వల్ల సీఎన్జీ, పీఎన్జీ ధరలూ పెరిగాయి. కేజీ సీఎన్జీ 63 పైసలు, పీఎన్జీ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (ఎస్సీఎం)కు రూ.1.11 పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ సీఎన్జీ రూ.42.60గా పీఎన్జీ ధర ఎస్సీఎంకు రూ.28.25కు చేరుకుంది. -
రూపాయి క్షీణించడంతో పెట్రో ధరలకు రెక్కలు..
-
పెట్రో షాక్ : రికార్డు హైలో ఇంధన ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : రూపాయి బలహీనపడటంతో పెట్రో ఉత్పత్తుల ధరలు సోమవారం అత్యంత గరిష్ట స్ధాయికి చేరాయి. డీజిల్ లీటర్‌కు 14 పైసలు పెరగ్గా, పెట్రోల్ లీటర్‌కు 13 పైసలు భారమైందని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి. సవరించిన ధరల ప్రకారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 82.60కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ 85.33కు పెరగ్గా, డీజిల్ ధరలు రూ.77.91కు చేరాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటంతో ఈనెల 16 నుంచి ఇంధన ధరలు భగ్గుముంటున్నాయి. డాలర్‌తో రూపాయి విలువ సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అత్యంత కనిష్టస్ధాయిలో రూ 70.32 వద్ద ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారమవడం, రూపాయి మారకపు విలువతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, లెవీలతో ఇంధన ధరలు మరింత భారమవుతున్నాయి. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకంతో పాటు వివిధ రాష్ట్రాలు వ్యాట్‌ను విధిస్తుండటంతో ఇంధన ధరలు రికార్డు స్ధాయిలకు చేరుతున్నాయి. -
వాణిజ్య లోటు భారం
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు జూన్‌లో 17.57 శాతం పెరిగి 27.7 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే, అదే సమయంలో అధిక ముడి చమురు రేట్ల కారణంగా దిగుమతుల భారం పెరిగి.. వాణిజ్య లోటు మూడున్నరేళ్ల గరిష్ట స్థాయి 16.6 బిలియన్ డాలర్లకు చేరింది. 2014 నవంబర్ తర్వాత వాణిజ్య లోటు ఈ స్థాయికి ఎగియడం ఇదే తొలిసారి. అప్పట్లో ఇది 16.86 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక గతేడాది జూన్‌లో ఇది 12.96 బిలియన్ డాలర్లు. కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్‌లో దిగుమతులు 21.31 శాతం పెరిగాయి. 44.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో చూసుకుంటే ఎగుమతులు 14.21 శాతం, దిగుమతులు 13.49 శాతం పెరిగాయి. ఎగుమతుల విలువ 82.47 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 127.41 బిలియన్ డాలర్లు. దీంతో మొత్తం మీద వాణిజ్య లోటు 44.94 బిలియన్ డాలర్లుగా నమోదైంది. జూన్‌లో అత్యధికంగా పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధాలు, వజ్రాభరణాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. చమురు దిగుమతులు 56.61 శాతం ఎగిసి 12.73 బిలియన్ డాలర్లుగా ఉండగా, పసిడి దిగుమతులు మాత్రం 3 శాతం క్షీణించి 2.38 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కాగా టెక్స్టైల్స్, లెదర్, మెరైన్ ఉత్పత్తులు, పౌల్ట్రీ, జీడిపప్పు, బియ్యం, కాఫీ తదితర ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి మందగించింది. -
రూపాయికి చమురు సెగ
ముంబై: ముడిచమురు ధరల పెరుగుదల, వాణిజ్య యుద్ధ భయాలతో రూపాయి మారకం విలువ మరింత క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే 19 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. బుధవారం 0.54 శాతం క్షీణించి 68.61 వద్ద క్లోజయ్యింది. 2016 నవంబర్ 24 తర్వాత ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. అప్పట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి 68.73 వద్ద క్లోజయ్యింది. ముడిచమురు రేట్ల పెరుగుదలతో దేశ కరెంటు ఖాతా లోటు మరింత పెరుగుతుందని, ద్రవ్యోల్బణమూ ఎగుస్తుందని ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొనడం రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అటు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు సైతం కరెన్సీ ట్రేడర్స్‌ను కలవరపరుస్తున్నాయని వివరించాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఒక దశలో 68.68 కనిష్ట స్థాయిని కూడా తాకింది. ఈ దశలో రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకోవడంతో పతనానికి కాస్త అడ్డుకట్ట పడినట్లు ఫారెక్స్ డీలర్లు తెలిపారు. సెంటిమెంటు బలహీనంగా ఉందని, మద్దతు స్థాయిలను కనుగొనడం మరింత కష్టంగా మారుతోందని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఏడాది నవంబర్ నాటికల్లా ఇరాన్ నుంచి చమురు దిగుమతుల్ని ఆపేయాలంటూ మిత్రదేశాలకు అమెరికా డెడ్‌లైన్ విధించడంతో ముడిచమురు రేట్లు మళ్లీ ఎగిశాయి. అటు లిబియా, కెనడాల నుంచి సరఫరా తగ్గొచ్చన్న ఆందోళన కూడా ధరలను మరింత ఎగదోశాయి. ఇటు దేశీయంగా ఈక్విటీల్లో అమ్మకాలు వెల్లువెత్తుతుండటం రూపాయిపై మరింత ఒత్తిడి పెంచుతోంది. రూపాయి చివరిసారిగా 2016 నవంబర్ 24న చరిత్రాత్మక కనిష్ట స్థాయి 68.86ని తాకింది. ముగింపుపరంగా చూస్తే 2013 ఆగస్టు 28న ఆల్‌టైమ్ కనిష్టమైన 68.80 వద్ద క్లోజయ్యింది.