
న్యూఢిల్లీ: దేశంలో చమురు ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరంలో 2.67% వరకు తగ్గింది. 2021–22లో ముడి చమురు ఉత్పత్తి 29.69 మిలియన్ టన్నులుగా ఉంది. 33.61 మిలియన్ టన్నుల లక్ష్యానికంటే 12 శాతం తక్కువ. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 30.5 మిలియన్ టన్నుల మేర ఉండడం గమనార్హం. గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో చమురు ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది.
2017–18లో 35.7 మిలియన్ టన్నులు ఉంటే, 2018–19లో 34.2 మిలియన్ టన్నులకు తగ్గింది. 2019–20లో 32.2 మిలియన్ టన్నులు, 2020–21లో 30.5 మిలియన్ టన్నులు, 2021–22లో 29.69 మిలియన్ టన్నులకు పరిమితమైంది. చమురు క్షేత్రాలు ఎన్నో ఏళ్ల నుంచి ఉత్పత్తి చేస్తున్నవే ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఉత్పత్తి తగ్గుతోంది. టెక్నాలజీ సాయంతో ఉత్పత్తిని మరీ పడిపోకుండా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్పత్తి తీవ్రంగా పడిపోని పరిస్థితి ఉంది.
చదవండి: నెలకు 40 బిలియన్ డాలర్లకుపైగా ఎగుమతులు
Comments
Please login to add a commentAdd a comment