కర్ణాటకలోని పాడూర్‌లో నిర్మాణం
బిడ్లను ఆహా్వనించిన ఐఎస్‌పీఆర్‌ఎల్
న్యూఢిల్లీ: క్రూడాయిల్ సరఫరాలో ఒడిదుడుకులు ఏవైనా తలెత్తితే సమర్ధంగా ఎదుర్కొనేందుకు దేశీయంగా తొలి వాణిజ్యపరమైన వ్యూహాత్మక ముడిచమురు స్టోరేజీ యూనిట్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. కర్ణాటకలోని పాడూర్‌లో 2.5 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యంతో భూగర్భంలో ముడిచమురు నిల్వ కోసం స్టోరేజీని నిర్మించేందుకు (పాడూర్ 2) ఇండియన్ స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్ (ఐఎస్పీఆర్‌ఎల్) బిడ్లను ఆహా్వనించింది.
బిడ్ల దాఖలుకు ఏప్రిల్ 22 ఆఖరు తేదీ కాగా, జూన్ 27 నాటికి ప్రాజెక్టును కేటాయిస్తారు. దీనికి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్ల ప్రకారం ఇది ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన ఉంటుంది. ప్రైవేట్ పారీ్టలు స్టోరేజీని డిజైన్ చేయడం, నిర్మించడం, ఫైనాన్స్ చేయడం, నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. పాడూర్–2 స్టోరేజీని ఆపరేటరు ఏ ఆయిల్ కంపెనీకైనా లీజుకివ్వచ్చు. అందులో చమురుని నిల్వ చేసుకునే కంపెనీలు దాన్ని దేశీ రిఫైనర్లకు విక్రయించుకోవచ్చు.
అయితే, అత్యవసర పరిస్థితుల్లో మాత్రం నిల్వలను ముందుగా ఉపయోగించుకునేందుకు భారత ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి. ఐఎస్‌పీఆర్‌ఎల్ తొలి దశలో విశాఖపట్నంతో పాటు మంగళూరు, పాడూర్‌లో 5.33 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యంతో వ్యూహాత్మక స్టోరేజీ యూనిట్లను ప్రభుత్వ వ్యయంతో ఏర్పాటు చేసింది. రెండో దశలో భాగంగా అండర్‌గ్రౌండ్‌లో రూ. 5,514 కోట్ల వ్యయంతో వాణిజ్య, వ్యూహాత్మక పెట్రోలియం స్టోరేజీ యూనిట్‌ను ప్రతిపాదిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment