
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా నుంచి భారత్ దాదాపు 112.5 బిలియన్ యూరోల (సుమారు రూ. 1.5 లక్షల కోట్లు) ముడి చమురు కొనుగోలు చేసినట్లు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (క్రియా) ఒక నివేదికలో తెలిపింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైన 2022 ఫిబ్రవరి 24 నుంచి శిలాజ ఇంధనాలకు సంబంధించి రష్యాకు లభించిన చెల్లింపుల వివరాలను ఇందులో పొందుపర్చింది. దీని ప్రకారం యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా శిలాజ ఇంధన ఎగుమతుల ద్వారా 835 బిలియన్ యూరోల ఆదాయం ఆర్జించినట్లు వివరించింది.
చైనా అత్యధికంగా 235 బిలియన్ యూరోల (170 బిలియన్ యూరోల చమురు, 34.3 బిలియన్ యూరోల బొగ్గు, 30.5 బిలియన్ యూరోల గ్యాస్) ఇంధనాలు కొనుగోలు చేసింది. భారత్ 205.84 బిలియన్ యూరోల ఇంధనాలను కొనుగోలు చేసింది. ఇందులో 112.5 బిలియన్ యూరో క్రూడాయిల్, 13.25 బిలియన్ డాలర్ల బొగ్గు ఉంది. యుద్ధం వల్ల విధించిన ఆంక్షలతో రష్యా చమురు చౌకగా లభిస్తున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి భారత్ గణనీయంగా కొనుగోళ్లు పెంచుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు బ్యారెల్‌కి 18–20 శాతం వరకు లభించిన డిస్కౌంటు ఇటీవలి కాలంలో 3 డాలర్ల దిగువకు పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment