storage
-
ఎక్కువ స్టోరేజ్.. ఉత్తమ ఫీచర్స్: బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..
ఇండియన్ మార్కెట్లో.. తక్కువ ధర, ఎక్కువ రేంజ్, మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న స్కూటర్లను మాత్రమే కాకుండా, అండర్ సీట్ స్టోరేజ్ ఎక్కువ ఉన్న స్కూటర్లను కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో ఎక్కువ స్టోరేజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.ఏథర్ రిజ్టా (Ather Rizta)ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఏథర్ రిజ్టా ఒకటి. దీని ధర రూ. 1.11 లక్షల నుంచి రూ. 1.47 లక్షల మధ్య ఉంది. ఈ స్కూటర్ అండర్ సీట్ స్టోరేజ్ 34 లీటర్లు. ఇందులో ఒక ఫుల్ హెల్మెట్, ఇతర వస్తువులను ఉంచవచ్చు. మంచి డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది.రివర్ ఇండీ (River Indie)ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర స్కూటర్ల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఈ స్కూటర్ అండర్ సీట్ స్టోరేజ్ ఏకంగా 43 లీటర్లు. కాబట్టి రెండు హెల్మెట్స్ సులభంగా ఉంచవచ్చు. ఇది కాకుండా అదనపు బాక్సులను అటాచ్ చేయడానికి రెండు వైపులా అల్లాయ్ పన్నీర్ మౌంట్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ. 1.43 లక్షలు.బజాజ్ చేతక్ (Bajaj Chetak)35 లీటర్ల అండర్ సీట్ కలిగిన ఈ బజాజ్ చేతక్ కూడా.. ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఎక్కువ స్టోరేజ్ కోసం కంపెనీ బ్యాటరీని ఫ్లోర్‌బోర్డ్‌లో ఫిక్స్ చేసింది. సరికొత్త డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. ఉత్తమ ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 1.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.ఓలా ఎస్1 ప్రో ప్లస్ జెన్ 3 (Ola S1 Pro Plus Gen 3)ఓలా ఎస్1 ప్రో ప్లస్ జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. స్టోరేజ్ కెపాసిటీ ఇతర ఓలా స్కూటర్ల కంటే ఎక్కువ అందిస్తుంది. దీని ధర రూ. 1.55 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఒక సింగిల్ ఛార్జితో 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది.టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 32 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.26 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఒక సింగిల్ ఛార్జితో గరిష్టంగా 150 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. -
చిన్న ప్యాకెట్ : 30 రోజులైనా పండ్లు, కూరగాయలు పాడుకావు!
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్న, సన్నకారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పండ్లు, కూరగాయలు వినియోగదారుల నోటికి చేరే లోగా దాదాపు 30–40 శాతం వరకు కుళ్లిపోతున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) అంచనా. దుంపలైతే ఏకంగా 40–50% పాడవుతున్నాయి. కోత అనంతర రవాణా వ్యవస్థ, శీతల సదుపాయాలు లేకపోవటం పెద్ద సమస్య. ఈ సమస్యను సమర్థవంతంగా అధిగమించడానికి ఉపయోగపడే గొప్ప ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఉగాండాకు చెందిన ఫ్రెజా నానోటెక్ లిమిటెడ్ అనే స్టార్టప్ సంస్థ సేంద్రియ పదార్థాలతో రూపొంచిన ఇన్స్టంట్ టీ బ్యాగ్ అంత సైజు ఉండే పౌడర్ ప్యాకెట్ కూరగాయలు, పండ్లను కుళ్లిపోకుండా నెల రోజుల వరకు రక్షించగలుగుతుంది. ఎటువంటి రిఫ్రిజిరేషన్ అవసరం లేకుండా, రసాయన రహితంగానే షెల్ఫ్ లైఫ్‌ను గణనీయంగా పెంచే ఈ ఆవిష్కరణ ‘ఎఫ్ఎఓ ఇన్నోవేషన్ అవార్డు–2024’ను ఇటీవల దక్కించుకుంది. శీతల గదుల్లో పెట్టని పండ్లు, కూరగాయలు మగ్గిపోయి కొద్ది రోజుల్లోనే కుళ్లియే ప్రక్రియ ‘ఫాస్ఫోలిపేస్ డి’ అనే ఎంజైమ్ కారణంగానే జరుగుతుంటుంది. ఫ్రెజా నానోటెక్ సంస్థ రూపొదించిన పౌడర్ ఈ ప్రక్రియను నెమ్మదింపజేయటం ద్వారా కూరగాయలు, పండ్లను దీర్ఘకాలం పాటు తాజాగా ఉంచుతుంది.టీ బ్యాగ్ అంతటి చిన్న ప్యాకెట్ (దీని ధర రూ. 20)ను 5 కిలోల పండ్లు, కూరగాయల మధ్య ఉంచితే చాలు.. నెల రోజులైనా అవి కుళ్లిపోకుండా ఉంటాయని ఎఫ్ఎఓ తెలిపింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి మెరుగవుతుంది, పోషకాలలభ్యత పెరుగుతుంది, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, జీవనోపాధులు మెరుదలపై ఈ ఆవిష్కరణ సానుకూల ప్రభావం చూపుతుందంటూ ఎఫ్ఎఓ డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు ప్రశంసించారు. కోత అనంతర దశలో రైతులకు ఎదురయ్యే నష్టాలను ఇది తగ్గిస్తుంది. త్వరగా పాడుకావు కాబట్టి రిటైల్ వ్యవస్థలో జరిగే నష్టాల భారం తగ్గుతుంది. ఆవిధంగా వినియోగదారులపై కూడా భారం తగ్గుతుందని ఆయన అన్నారు. -
బ్యాక్ ప్యాక్ కూలర్ బ్యాగు
కూల్‌డ్రింక్స్ వంటివి చల్లగా ఉండాలనే అందరూ కోరుకుంటారు. ఆరుబ యట పిక్నిక్లకు వెళ్లేటప్పుడు ఇవన్నీ చల్లగా దొరకాలంటే కుదిరే పని కాదు. వాటి కోసం పోర్టబుల్ రిఫ్రిజిరేటర్లను లేదా ఐస్‌మేకర్లను తీసుకుపోవాల్సి ఉంటుంది. అయితే, పిక్నిక్ లకు వెళ్లేటప్పుడు ఈ సంచి వెంట ఉంటే చాలు. పోర్టబుల్ రిఫ్రిజిరేటర్లను, ఐస్మేక ర్లను మోసుకుపోనవసరం ఉండదు. ముందుగానే ఇంట్లోని ఫ్రిజ్‌లో చల్లబరచిన పానీయాల సీసాలు,క్యాన్లను ఇందులో పడేసుకుని తీసుకుపోతే చాలు. ఇందులో భద్రపరచిన సీసాలు, క్యాన్లు ఇరవైనాలుగు గంటలసేపు ఏమాత్రం చల్లదనం కోల్పోకుండా, అప్పుడే ఫ్రిజ్‌లోంచి బయటకు తీసిన ట్లుగా ఉంటాయి. కట్టుదిట్టమైన ఇన్సులేష న్‌తో రూపొందించిన ఈ బ్యాగ్ లోపల ఎంత చల్లని వస్తువులను ఉంచినా, బయటకు ఏమాత్రం నీరు చిమ్మదు. కెనడియన్ స్టార్టప్ కంపెనీ ‘కూలీ’ పేరుతో ఈ బ్యాక్‌ప్యాక్ కూలర్ బ్యాగును ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఇదీ చదవండి: వోయేజర్–1 పునరుత్థానం! 43 ఏళ్ల తర్వాత నాసాకు సందేశం -
గూగుల్ 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..
ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు చాలామంది కొంతకాలంగా ‘గూగుల్ క్లౌడ్ స్టోరేజ్’తో ఇబ్బందులు పడుతున్నారు. గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్, వీడియోలు, బ్యాకప్ ఫైళ్లు ఎక్కువగా ఉన్నవారికి తమ క్లౌడ్ స్లోరేజ్ నిండిపోయినట్లు పాప్అప్ మెసేజ్‌లు వస్తుండడం గమనిస్తున్నాం. అయితే ఇప్పటివరకు గూగుల్ 15జీబీ స్టోరేజీను ఉచితంగా అందించింది. ఇకపై స్టోరేజీ కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందనేలా పాప్అప్ కనిపిస్తుంది. అయితే కాసేపు స్టోరేజీలోని డేటాపై సమయం వెచ్చిస్తే ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఉచితంగా గూగుల్ సేవలు పొందే వీలుంది. అది ఎలాగో తెలుసుకుందాం.గూగుల్ ఆండ్రాయిడ్ 1.0 వర్షన్‌ను 2008లో లాంచ్ చేసింది. దాంతో స్మార్ట్ఫోన్లకు భారీగా గిరాకీ ఏర్పడింది. అయితే ఈ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేయాలంటే జీమెయిల్ లాగిన్ అవసరం అవుతుంది. దాంతో చాలామంది గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. గూగుల్ తర్వాతి కాలంలో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర బ్యాకప్ ఫైళ్ల కోసం ఉచితంగా 15 జీబీ క్లౌడ్స్టోరేజీ అందించింది. ఈ తరుణంలో చాలాఏళ్లుగా ఒకే గూగుల్ అకౌంట్ వాడుతున్న వారికి చెందిన క్లౌడ్ స్టోరేజీ ఇటీవల కాలంలో ఫుల్ అయింది. దాంతో కంపెనీ కొంత డబ్బు చెల్లిస్తే మరింత ఎక్కువ ఆన్లైన్ స్టోరేజీని ఇస్తామన్నట్లు ఆఫర్లు పెడుతోంది. ఒకవేళ స్టోరేజీ పూర్తయితే గూగుల్ వన్ అకౌంట్ తీసుకుని నెలకు రూ.30(మొదటి మూడు నెలలు మాత్రమే రూ.30. తర్వాత ధరలో మార్పు ఉంటుంది) చెల్లిస్తే 100 జీబీ స్పేస్ లభిస్తుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించి తిరిగి గూగుల్ స్టోరేజీను ఉచితంగా పొందవచ్చు.ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ దూసుకెళ్లాలంటే ఇవి పాటించాల్సిందే..గూగుల్ స్టోరేజీలోని క్లీనప్ స్పేస్ ఆప్షన్ ఉపయోగించి గూగుల్ డ్రైవ్, ఫొటోస్, జీమెయిల్ వంటి వివిధ సర్వీసుల్లో ఉన్న అనవసర డేటాను తొలగించాలి.ఎప్పుడో మీరు మొదటగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నప్పుడు ఓపెన్ చేసిన గూగుల్ అకౌంట్ కాబట్టి ఒకసారి అనవసర డేటా ఏదైనా ఉందో చూసుకోండి. వాటి అవసరం లేదంటే డేటా డిలీట్ చేయండి.కొన్ని ఫైళ్ల సైజ్(ఎంబీ, జీబీ) ఎక్కువగా ఉంటుంది. వాటిని తొలగించవచ్చు.ఈ పని త్వరగా, సులువుగా పూర్తవ్వాలంటే మొబైల్ కంటే కూడా డెస్క్‌టాప్/ ల్యాప్‌టాప్ వినియోగించడం మంచిది. ఇందుకోసం ముందుగా గూగుల్ వన్ స్టోరేజీ మేనేజర్‌కి వెళితే దేనికంత స్టోరేజీ అవుతుందో చూపిస్తుంది. ఏయే సర్వీసుల్లో పెద్ద ఫైల్స్ ఉన్నాయో రివ్యూ చేయొచ్చు. ఆయా సర్వీసులపై క్లిక్ చేస్తే డిలీట్ చేయదగ్గ పెద్ద సైజు ఫైల్స్ దర్శనమిస్తాయి. వాటిని సులువుగా డిలీట్ చేయొచ్చు.నిత్యం ఎన్నో వెబ్సైట్లను సందర్శిస్తుంటాం. అవి ఎప్పటికప్పుడు వాటి ప్రమోషనల్ మెయిల్స్ పంపిస్తుంటాయి. దాంతో జీమెయిల్ ఇన్‌బాక్స్ నిండిపోతూ ఉంటుంది. ఈ తరహా మెయిల్స్‌ను తొలగించడం ద్వారా కొంత స్పేస్‌ను పొందవచ్చు. ఇందుకోసం జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో చెక్‌బాక్స్ పక్కనే ఉన్న డ్రాప్‌డౌన్ మెనూపై క్లిక్ చేసి అన్‌రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కామన్ బాక్స్ ఎంచుకుంటే అన్ని అన్‌రీడ్ మెసేజ్‌లు సెలక్ట్ అవుతాయి. పక్కనే ఉన్న డిలీట్ బటన్‌పై క్లిక్ చేయాలి.మెయిల్లోని ప్రైమరీ విభాగం కాకుండా పక్కనే ఉన్న ప్రమోషన్స్, సోషల్ విభాగంలోని మెయిళ్లును తొలగించవచ్చు.పాత మెయిల్స్‌ను తొలగించడానికి జీమెయిల్ సెర్చ్‌లో ఉదాహరణకు before:2018 అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. 2018 కంటే ముందున్న మెయిళ్లన్ని దర్శనమిస్తాయి. వాటిని డిలీట్ చేయవచ్చు.లార్జ్ మెయిళ్లను డిలీట్ చేయాలంటే సెర్చ్ బార్లో క్లిక్ చేసిన వెంటనే కింద has attachment అని వస్తుంది. దానిపై క్లిక్ చేసి సెర్చ్‌లో 4m అని టైప్ చేయాలి. దాంతో 4 ఎంబీ సైజ్ ఉన్న అన్ని ఫైళ్లకు సంబంధించిన మెయిళ్లు డిస్ప్లే అవుతాయి. అనవసరమైతే వాటిని డిలీట్ చేసుకోవచ్చు.గూగుల్ ఫొటోస్, వీడియోల్లో లార్జ్ ఫైళ్లు ఉంటాయి. కాబట్టి వేరే తాత్కాలిక అకౌంట్ క్రియేట్ చేసుకుని అందులో కొన్ని ఫైళ్లను కొత్త అకౌంట్లోకి మార్చుకోవచ్చు. లేదంటే వాటిలో కొన్నింటిని పూర్తిగా డిలీట్ చేసుకోవచ్చు. -
3,000 అడుగుల ఎత్తయిన విద్యుత్ భవనం!
అత్యంత ఎత్తయిన ఆకాశ హర్మ్యాల నిర్మాణం కొత్తేమీ కాదు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, విల్లీస్ టవర్, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వంటివి ఎత్తయిన భవనాలుగా గుర్తింపు పొందాయి. అయితే ఇవన్నీ నివాసాలు, కార్యాలయాలే. వాటిని తలదన్నేలా 3,000 అడుగుల (914.4 మీటర్లు) ఎత్తయిన భవనాన్ని నిర్మించనున్నట్టు స్కిడ్మోర్, ఒవింగ్స్ అండ్ మెరిల్ (ఎస్ఓఎం) కంపెనీ ప్రకటించింది. నివాసానికే గాక విద్యుత్ నిల్వకు కూడా వీలు కల్పించడం దీని ప్రత్యేకత. ఇందుకోసం విద్యుత్ స్టోరేజీ కంపెనీ ‘ఎనర్జీ వాల్ట్’తో ఒప్పందం చేసుకుంది. విద్యుత్‌ను నిల్వచేసే బ్యాటరీలాగా ఇది పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. భవనం వెలుపలి భాగంలో అమర్చే ఫలకాల్లో విద్యుత్‌ను నిల్వ చేస్తారు. దాన్ని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారు. ఈ భవనాన్ని ఎక్కడ నిర్మించాలన్నది ఇంకా ఖరారు చేయలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వర్షాకాలంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ : చిట్కాలు
కూరల్లో రుచి కావాలంటే దానికి కావాలసిన అన్ని పదార్థాలు సమపాళ్లలో పడాలి. ముఖ్యంగా ఉప్పు,కారం, నూనె, అల్లం వెల్లుల్లి, మసాలా. అయితే వంట తొందరగా అయిపోతుందనో, సమయాభావం వల్లనో చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ముందే రెడీ చేసి పెట్టుకుంటారు. మరి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి? తెలుసుకుందామా?మార్కెట్లో ఇన్స్టెంట్గా చాలా రకాల మసాలాలు, పొడులు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రస్తుతం కాలంలో వాటిని ఎంతవరకు నమ్మాలి అనేది ప్రధాన సమస్య. ముఖ్యంగా అల్లం , వెల్లుల్లి పేస్ట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుళ్లిపోయిన బంగాళాదుంపలు, పేపర్ ముక్కలు తదితర వస్తువులతో అనారోగ్య వాతావరణంలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారవుతుందున్న వార్తల మధ్య అల్లం, వెల్లుల్లి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి రెండూ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పొట్టు తీసిన శుభ్రంగా కడిగిన అల్లం, పొట్టువలిచిన వెల్లుల్లికలిపి మెత్తగా మిక్సీలో నూరుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు కలుపుకుంటే పాడు గాకుండా ఉంటుంది. ఈ పేస్ట్‌ను గాలి చొరబడని గాజు సీసాలో పుంచి, ఫ్రిజ్‌లో భద్రపరచాలి.ఒకరోజు వాడిన స్పూను మరో రోజు వాడకుండా, తడి తగలకుండా జాగ్రత్త పడాలి. ఉప్పు లేదా నూనె, లేదా పసుపు కలపడం వల్ల కనీసం రెండు వారాలు నిల్వ ఉంటుంది. అలాగే వెనిగర్‌ను కూడా కలుపుతారు.ఇలాంటి చిట్కాలు పాటిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడైపోదు. పైగా కలర్ మారకుండా, మంచివాసనతో ఉంటుంది. -
దేశీయంగా తొలి వాణిజ్య క్రూడాయిల్ స్టోరేజీ
న్యూఢిల్లీ: క్రూడాయిల్ సరఫరాలో ఒడిదుడుకులు ఏవైనా తలెత్తితే సమర్ధంగా ఎదుర్కొనేందుకు దేశీయంగా తొలి వాణిజ్యపరమైన వ్యూహాత్మక ముడిచమురు స్టోరేజీ యూనిట్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. కర్ణాటకలోని పాడూర్‌లో 2.5 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యంతో భూగర్భంలో ముడిచమురు నిల్వ కోసం స్టోరేజీని నిర్మించేందుకు (పాడూర్ 2) ఇండియన్ స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్ (ఐఎస్పీఆర్ఎల్) బిడ్లను ఆహా్వనించింది. బిడ్ల దాఖలుకు ఏప్రిల్ 22 ఆఖరు తేదీ కాగా, జూన్ 27 నాటికి ప్రాజెక్టును కేటాయిస్తారు. దీనికి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్ల ప్రకారం ఇది ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన ఉంటుంది. ప్రైవేట్ పారీ్టలు స్టోరేజీని డిజైన్ చేయడం, నిర్మించడం, ఫైనాన్స్ చేయడం, నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. పాడూర్–2 స్టోరేజీని ఆపరేటరు ఏ ఆయిల్ కంపెనీకైనా లీజుకివ్వచ్చు. అందులో చమురుని నిల్వ చేసుకునే కంపెనీలు దాన్ని దేశీ రిఫైనర్లకు విక్రయించుకోవచ్చు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో మాత్రం నిల్వలను ముందుగా ఉపయోగించుకునేందుకు భారత ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి. ఐఎస్పీఆర్ఎల్ తొలి దశలో విశాఖపట్నంతో పాటు మంగళూరు, పాడూర్‌లో 5.33 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యంతో వ్యూహాత్మక స్టోరేజీ యూనిట్లను ప్రభుత్వ వ్యయంతో ఏర్పాటు చేసింది. రెండో దశలో భాగంగా అండర్‌గ్రౌండ్‌లో రూ. 5,514 కోట్ల వ్యయంతో వాణిజ్య, వ్యూహాత్మక పెట్రోలియం స్టోరేజీ యూనిట్‌ను ప్రతిపాదిస్తోంది. -
పెరుగు తొందరగా పాడైపోతుందా? ఈ చిట్కాలు పాటించండి!
వేసవికాలంలో పాలు పెరుగు తొందరగా పాడ పోతూ ఉంటాయి. ముఖ్యంగా పెరుగు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫ్రిజ్‌లో పెట్టినా రెండురోజుల్లో పెరుగు పులిసి పోతుంది. మరిపెరుగు ఎక్కువ రోజులు రుచి మారకుండా తాజాగా నిల్వ చేసుకోవాలో చూద్దాం. పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. పులావ్, ఖిచ్డీ, పరాటా, ఉప్మా ,ఇలాంటి అనేక వంటకాల తయారీలో దీన్ని ఉపయోగిస్తాం. ఇక వేసవిలో అయితే లస్సీకున్న ప్రాధాన్యతే వేరు. ♦ మట్టిపాత్రలో పాలు తోడుపెడితే పెరుగు కమ్మగా ఉంటుంది. నిల్వ ఉంటుంది కూడా. ♦ చక్కటి , చిక్కటి పాలను బాగా మరిగించి, కొద్దిగా వేడిగా ఉన్నపుడే తోడు పెట్టాలి. తోడు పెట్టే పెరుగు రుచిగా ఉండేలా చూసుకోవాలి. ♦ తోడు పెట్టిన పాలలో ఒక పచ్చిమిరప కాయగానీ, ఒక ఎండుమిర్చిగానీ వేస్తే గట్టిగా తోడు కోవడమే కాదు, పెరుగు రుచిగా కూడా ఉంటుంది. ♦ గాలి చొరబడని కంటైనర్లలో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అలాగే పెరుగును కూడా ఇలా కంటైనర్లలో నిల్వ చేయాలి. మూత తీసినప్రతీసారి టైట్‌గా పెట్టడం మాత్రం మర్చిపోకూడదు. ♦ పెరుగు తోడు పెట్టిన గిన్నెలోనుంచే నేరుగా తీసుకొని, మళ్లీ అదే గిన్నిని ఫ్రిజ్‌లో పెట్టడం కాకుండా, కావాల్సినంత వేరే గిన్నెలోకి తీసుకొని వాడుకోవాలి ( దోసెలు, ఇడ్లీ పిండిలాగా) ఉపయోగించే స్పూన్ కూడా శుభ్రంగా, తడి లేకుండా ఉండేలా చూసుకోవాలి. ♦ ఫ్రిజ్ డోర్లో నిల్వ ఉంచ కూడదు. ప్రిజ్‌ను తెరచిన ప్రతిసారి డోర్ మొదట వేడెక్కుతుంది. సో.. పెరుగు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిజ్‌లోపల ఉంచితే పెరుగు తాజగా ఉంటుంది. -
చార్జింగ్‌తో పాటు డేటా స్టోరేజ్
చార్జింగ్‌తో పాటు డేటా స్టోరేజ్ చేతిలో ఇమిడిపోయే ఈ పరికరం ఒకేసారి రెండుపనులు చేస్తుంది. రీచార్జబుల్ బ్యాటరీతో ఈ పరికరం పోర్టబుల్ చార్జర్‌లా పనిచేస్తుంది. దీని ద్వారా స్మార్ట్ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి వాటిని చార్జింగ్ చేసుకోవచ్చు. పరికరాలను చార్జింగ్ చేస్తున్న సమయంలోనే, వాటిలోని ముఖ్యమైన డేటాను కూడా ఇందులో భద్రపరచుకోవచ్చు. ఇది సైనిక అవసరాల కోసం ఉపయోగించే ‘ఏఈఎస్–256’ ఎన్క్రిప్షన్ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇది ఏకకాలంలో రెండు పరికరాలకు 65 వాట్ల విద్యుత్తును సరఫరా చేస్తూ చార్జింగ్ చేయగలదు. అలాగే, 1000 ఎంబీపీఎస్ వేగంతో డేటాను స్టోర్ చేసుకోగలదు. డేటా స్టోరేజ్ సామర్థ్యం ప్రకారం ‘మెమ్కీపర్’ పేరుతో చైనాకు చెందిన మెమ్కీపర్ టెక్ కంపెనీ రూపొందించిన ఈ పరికరం మూడు మోడల్స్‌లో– 256 జీబీ, 512 జీబీ, 1టీబీ మోడల్స్‌లో దొరుకుతుంది. మోడల్‌ను బట్టి ఈ పరికరం ధర 99 డాలర్ల నుంచి 132 డాలర్ల (రూ.8,214 నుంచి రూ.10,957)వరకు ఉంటుంది. -
ఫుడ్ ప్యాకేజింగ్.. వంటింట్లో ఈ సీలర్ ఉండాల్సిందే
ఈ రోజుల్లో పిండి, నూక దగ్గర నుంచి నట్స్, స్నాక్స్ వరకు అన్నీ ప్యాకెట్స్‌లోనే దొరుకుతున్నాయి. ఒకసారి కట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత.. మరోసారి వాడేలోపు పాడవకుండా, పురుగు పట్టకుండా.. మెత్తబడకుండా ఈ సీలర్ను ఇంట్లో పెట్టుకోవాల్సిందే. ఇది చార్జింగ్‌తో నడుస్తుంది. అల్యూమినియం ఫాయిల్ హీట్ సీలింగ్ బ్యాగ్‌లు, ప్లాస్టిక్ స్నాక్ బ్యాగ్‌లు, వాక్యూమ్ ఫుడ్ స్టోరేజ్ బ్యాగ్‌లు, ఫుడ్ ప్యాకేజింగ్ బ్యాగ్‌లు ఇలా చాలా వాటికి ఇది చక్కగా పనిచేస్తుంది. ఇందులో మినీ చాకు కూడా ఉంటుంది. దాని సాయంతో కవర్ని కట్ చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని అందుబాటులో ఉంచుకోవడానికి వెనుక మ్యాగ్నెటిక్తో పాటు ఒకవైపు చిన్న హ్యాంగర్ బెల్ట్ కూడా ఉంటుంది. దాంతో ఇనుప వస్తువుకు అటాచ్ చేసుకోవచ్చు లేదా హ్యాంగర్‌కి తగిలించుకోవచ్చు. ధర కూడా తక్కువే. ఈ సీలర్ ధర12 డాలర్లు (రూ.997) . -
వెజి‘ట్రబుల్’కు విరుగుడు.. టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్‌తో దీర్ఘకాలం నిల్వ
-పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్ నిన్నటిదాకా వినియోగదారులను ఏడిపించిన టమాటా నేడు రైతన్నలతో కన్నీళ్లు పెట్టిస్తోంది! టమాటాతో పోటీగా ఎగబాకిన పచ్చి మిర్చి ధరలు సగానికిపైగా పతనమయ్యాయి! ఈదఫా ‘ఉల్లిపాయ’ బాంబు పేలటానికి సిద్ధమైంది!! సామాన్యుడిని ఠారెత్తించిన కూరగాయల ధరలు ఇప్పుడు దిగి వచ్చినా కొద్ది నెలలు దేశ ప్రజలకు చుక్కలు చూపించాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా టమాటాలే. ఐదారు రోజులకు మించి నిల్వ ఉంటే పాడవుతాయి. అకాల వర్షాలకు ఉల్లిపాయలు కుళ్లిపోతాయి. చాలాసార్లు కనీస ఖర్చులు కూడా దక్కకపోవడంతో టమాటాలను రోడ్లపై పారబోసి నిరసన తెలిపిన ఘటనలున్నాయి. అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి..! మరి ఏం చేయాలి? సీజన్లో సద్వినియోగం.. వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడం నిజమే అసలు కారణం సరైన నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు లేకపోవడమే. వరద వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలి! టమాటా, ఉల్లి లాంటివి కూడా సీజన్లో విరివిగా, చౌకగా లభ్యమవుతాయి. మరి సమృద్ధిగా దొరికినప్పుడు సేకరించుకుని ప్రాసెస్ చేసి వాడుకుంటే? రాష్ట్రంలో ఇప్పుడు అదే ప్రక్రియ మొదలైంది. సరైన పద్ధతిలో నిల్వ చేయడం, నాణ్యతను సంరక్షించడం కీలకం. అందుకే ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామ స్థాయిలో పొదుపు మహిళల ద్వారా వీటిని ఏర్పాటు చేయడంతోపాటు భారీ ప్లాంట్లపై కూడా దృష్టి పెట్టింది. ఒకవైపు ధరలు పతనమైనప్పుడు మార్కెట్ జోక్యంతో అన్నదాతలను ఆదుకుంటూనే మరోవైపు వీటిని అందుబాటులోకి తెస్తోంది. దీనివల్ల ధరల మంటకు, దళారుల దందాకు తెర పడుతుంది! ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు షేక్‌జుబేదా బీ. పొదుపు సంఘంలో సభ్యురాలు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లెకు చెందిన ఈమె ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సహకారంతో టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్, డ్రయ్యింగ్ ద్వారా నెలకు రూ.18,000 వరకు ఆదాయాన్ని పొందుతోంది. బ్యాంకు లోన్‌తో యంత్రాలు, షెడ్‌ను సమకూర్చుకోగా సబ్సిడీగా రూ.70,000 అందాయి. తన వాటాగా రూ.20 వేలు జత చేసింది. సోలార్ డ్రయ్యర్లు, డీ హైడ్రేషన్ యూనిట్లతో రోజూ 200 కిలోల కూరగాయలను ఇంట్లోనే ప్రాసెసింగ్ చేస్తోంది. వీటిని సరఫరా చేస్తూన్న ‘ఎస్4 ఎస్’ అనే కంపెనీ ప్రాసెసింగ్ అనంతరం తిరిగి ఆమె వద్ద నుంచి సేకరిస్తోంది. 50 కిలోలు ప్రాసెసింగ్ చేసినందుకు రూ.125 చెల్లిస్తుండగా కరెంట్ చార్జీల కింద మరో రూ.20 చొప్పున కంపెనీ ఇస్తోంది. ప్రతి నెలా రూ.4,000 బ్యాంకు కిస్తీ పోనూ నికరంగా నెలకు రూ.14,000 వరకు ఆదాయం లభిస్తోంది. డ్రయ్యర్లతో డీ హైడ్రేషన్ యూనిట్లు.. ఉద్యాన రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా సోలార్ డ్రయ్యర్లతో కూడిన డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లా తడకనపల్లిలో గతేడాది ఆగస్టులో 35 శాతం సబ్సిడీతో పది యూనిట్లు ఏర్పాటు కాగా కొద్ది రోజుల్లోనే మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఇప్పటి వరకు 1,200 టన్నుల టమాటా, ఉల్లిని ప్రాసెస్ చేశారు. ఈ ఏడాది జూలైలో మరో వంద యూనిట్లను ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్లతో 5 వేల యూనిట్ల ఏర్పాటుకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అవగాహన ఒప్పందం చేసుకుంది. వీటిలో 3,500 యూనిట్లను రాయలసీమ జిల్లాల్లోనే నెలకొల్పుతున్నారు. ప్రతి 100 సోలార్ యూనిట్లను ఒక క్లసర్ కిందకు తెచ్చి రైతుల నుంచి రోజూ 20 టన్నులు టమాటా, ఉల్లిని సేకరించి రెండు టన్నుల ఫ్లేక్స్ తయారు చేయనున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో ఇప్పటికే 900 మంది లబ్ధిదారులను గుర్తించారు. సెప్టెంబరు నాటికి 500 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం, సత్యసాయి జిల్లా తనకల్లు ప్రాంతాల్లోనూ లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కర్నూలు జిల్లా పత్తికొండలో రూ.10 కోట్లతో భారీ స్థాయిలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులకు త్వరలో భూమి పూజ జరగనుంది. ఈ యూనిట్లో స్టోరేజీ, సార్టింగ్, గ్రేడింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. పల్పింగ్ లైన్, డీ హైడ్రేషన్ లైన్ ఉంటాయి. కెచప్, జామ్, గ్రేవీ లాంటి అదనపు విలువతో కూడిన ఉత్పత్తులు తయారవుతాయి. రాజంపేటలో రూ.294.92 కోట్లతో, నంద్యాలలో రూ.165.32 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గుజ్జు, ఐక్యూఎఫ్ (టమాటా) పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. రైతన్నకు ‘మద్దతు’.. మహిళలకు ఉపాధి ఉల్లి, టమాటా రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధరలతో పాటు పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద నెలకొల్పిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈమేరకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఒక్కో యూనిట్ రూ.1.68 లక్షల అంచనాతో ఏర్పాటు చేస్తున్నాం. లబ్ధిదారుల గుర్తింపు చురుగ్గా సాగుతోంది. – ఎల్.శ్రీధర్‌రెడ్డి, సీఈవో, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ -
రియల్‌మి ఏ2+ కొత్త వేరియంట్: ధర చూస్తే ఇంప్రెస్ అవుతారు!
Redmi A2+ 128GB Storage చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రెడ్మీ సరికొత్త స్మార్ట్‌ఫోన్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. రెడ్మి ఏ2+లో కొత్త ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది ఈ ఏడాది మార్చిలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా ఇపుడు 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్కాన్ఫిగరేషన్లో తీసుకొచ్చింది. MediaTek Helio G36 SoC , 5,000mAH బ్యాటరీ,మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీతో లాంచ్అయింది. ఇది గరిష్టంగా 32 రోజుల స్టాండ్‌బై సమయాన్ని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ధర, ఆఫర్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్రెడ్మి ఏ2+ వేరియంట్ ధర ఎంఐడాట్‌కామ్‌లో రూ.8,499గా ఉంది. అయితే ప్రస్తుతం పరిచయ ఆఫర్‌గా ప్రస్తుతం రూ. 7,999గా కొనుగోలు చేయవచ్చు. ఇది క్లాసిక్ బ్లాక్, సీ గ్రీన్ , ఆక్వా బ్లూ రంగులలో లభ్యం. రెడ్మి ఏ2+ స్పెసిఫికేషన్స్ 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.52-అంగుళాల HD+ LCD డిస్ప్లే 1600 x 720 పిక్సెల్స్‌రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 13 8మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ , QVGA కెమెరాతో AI-బ్యాక్డ్ డ్యూయల్ రియర్ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ 5,000mAh బ్యాటరీ -
పచ్చళ్లు పెట్టే వనితల ఊరు ఉసులుమర్రు
గోదావరి జిల్లా వాసులంటే తిండితో చంపేస్తారురా బాబు అంటుంటారు. గోదావరి తీరాన వంటకాలకు ప్రసిద్ధి చెందిన పల్లెలు చాలానే ఉంటాయి. కండ్రిగ పాలకోవా, నగరం గరాజీలు, ఆత్రేయపురం పూతరేకులు, అంబాజీపేట ΄పొట్టిక్కలు... ఉసులుమర్రు పచ్చళ్లు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వశిష్ట గోదావరి గట్టుకు ఆనుకుని తణుకుకు అరగంట ప్రయాణ దూరంలో ఉండే ఆ గ్రామం ఎప్పుడూ సముద్రంలో ఉప్పునూ చెట్టు మీద కాయను కలిపి పచ్చళ్లు పెట్టడంలో నిమగ్నమై ఉంటుంది. వ్యక్తిగతంగా కావచ్చు, యజమాని కింద కావచ్చు ఆ గ్రామంలోని స్త్రీలలో ముప్పై, నలభై శాతం పచ్చళ్లు పెట్టడంలో ఉపా ధి ΄పొందుతూ ఉంటారు. వీరితో పా టు ఇరవై శాతం మగవారు ఈ పనిలో ఉంటారు. ఇక్కడి స్త్రీల చేతికి రుచి ఎక్కువ. అందుకే ఉసులుమర్రు పచ్చళ్లకు గిరాకీ ఎక్కువ. 40 సంవత్సరాల క్రితం నుంచి ఉసులుమర్రి జనాభా 2500 మాత్రమే. వీరిలో ఐదు వందల మంది స్త్రీలకు పైగా, మూడు వందల మంది పురుషులకు పైగా అందరూ కలిసి దాదాపు 1000 మంది వరకు సీజన్లో పచ్చళ్లు పెట్టడంలో బిజీగా ఉంటారని అంచనా. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చిన్న, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్షణం తీరిక లేకుండా రేయింబవళ్లు అనేక రకాల పచ్చళ్లు పెడుతుంటారు. ఊరు ఊరంతా ఏ కంపెనీ కోసం, ఏ యజమాని కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపా ధిని కల్పించుకున్నారు. 40 సంవత్సరాల క్రితం పిళ్లా పెదకాపు కుటుంబం వారు మొదటిసారిగా పచ్చళ్లను తయారు చేయడం మొదలుపెట్టారు. మంచి లాభాలు, మిగులు ఉండడంతో వారిని చూసి వారి బంధువులు మొదలుపెట్టారు. అలా ఒకరిని చూసి మరొకరు అదే పనిని నేర్చుకుని స్వంతంగా తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. 200 కుటుంబాలకు పైగానే ఈ చిరు వ్యాపా రాన్ని చేస్తున్నారు. ఇప్పుడు తయారీలో మూడోతరం నిమగ్నమైంది. ఇవీ ప్రత్యేకం టమాటా, ఉసిరి, అల్లం, మాగాయి, ఆవకాయ, గోంగూర, కాలీఫ్లవర్, పండుమిరప, నిమ్మ తదితర పచ్చళ్ళకు ఉసులుమర్రు ప్రత్యేకం. పచ్చళ్ల తయారీలో మహిళలకు కనీసం 300 రోజు కూలీ దక్కుతోంది. అన్ని రకాల పచ్చళ్ళు పెట్టాలంటే రూ.5 లక్షలు పెట్టుబడి అవుతుంది. ఖర్చులు పొ గా మిగిలే లాభంతో తమకెంతో సంతోషంగా ఉంటుందంటున్నారు. ఈ ఒక్క పల్లెలో అన్ని రకాల పచ్చళ్లూ కలిసి ఏడాదికి 500 టన్నులు పచ్చళ్లు పడుతుంటారని అంచనా. టన్ను పచ్చడి రూ.2.50 లక్షలు వంతున విక్రయిస్తుంటారు. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే రూ.10 నుంచి రూ.12 కోట్లు. మహిళలు ఇళ్లవద్ద పచ్చళ్లు పెడితే పురుషులు మాత్రం ఏడెనిమిది నెలలపా టు ఊళ్లు తిరుగుతూ చివరిడబ్బా అమ్మేశాక మాత్రమే ఇంటికి తిరిగొస్తారు. కుటుంబాన్ని వదిలి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, వరంగల్, నల్గొండ, బోధన్, హైదరాబాద్, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, ఖమ్మం, మిరియాలగూడ, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఏడాది ΄పొడవునా నిల్వ ఉసులుమర్రు ఆవకాయ అంటే ఏడాది ΄పొ డవునా నిల్వకు తిరుగుండదంటారు. ముదురు మామిడికాయలను ముక్కలుగా కోసి ఆరబెట్టి ఆవపిండి, మెంతులు, ఎర్రపచ్చడి కారం, వేరుశెనగ లేదా నువ్వుల నూనె కలిపి మూడు రోజుల తరువాత జాడీలో పెడతారు. ఉప్పు, కారం, ఆవపిండి కలిపిన ముక్కలను డ్రమ్ములో వేసుకుని ఎక్కడ అవసరమైతే అక్కడే వారి కళ్లెదుటే అన్నీ కలిపి ఇవ్వడంతో నమ్మకం రెట్టింపు అయ్యిందంటారు. వేసవిలో పండుమిరప, ఉసిరి, ఆవకాయ, గోంగూర, కాకరకాయ పెడతారు. వానాకాలం బ్రేక్ ఇచ్చి మళ్లీ ఆగస్టు నుంచి అల్లం, వెల్లుల్లి, టొమాటో, కాలీఫ్లవర్, కొత్తిమీరలాంటివి పెడతారు. మిక్స్డ్ వెజిటబుల్ అడిగితే పెట్టి ఇస్తారు. నిమ్మకు నిల్వ తక్కువ కాబట్టి తక్కువగా పెడతారు. చికెన్, రొయ్యలతో నాన్‌వెజ్ పచ్చళ్లు కూడా చేసి ఇస్తారు. సరుకును బట్టి లాభం. ఉదాహరణకు డ్రమ్ (200 కిలోలు) పండు మిరప పచ్చడి పట్టడానికి 20 వేలు అవుతుంటే మార్కెట్లో కిలో రూ.250కు అమ్ముతుంటారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు సాక్షి, కాకినాడ ,ఫొటోలు: పంతం వెంకటేశ్వర్లు, పెరవలి అందరూ ఆవకాయ పెట్టుకోరు. బయటి నుంచి తెచ్చుకునేవారు. ఎప్పుడూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఆ ఊరి స్త్రీలు ఆవకాయ పెడతారు. మే నుంచి జూన్ వరకూ ఉమ్మడి తూ.గో.జిల్లాలోని ఉసులుమర్రు స్త్రీలు ఆవకాయతో పా టు రకరకాల పచ్చళ్లు పెడుతుంటారు. వాటిని తీసుకుని మగవారు జిల్లాలకు బయలుదేరి నెలల తరబడి అమ్ముతారు. రోజూ ఏదో ఒక పచ్చడి తయారు చేసే ఆ ఊరి స్త్రీలు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతినిధులు. -
అప్పుడు అమ్మక.. ఇప్పుడు అమ్ముకోలేక
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు తుమ్మిడే వెంకన్న. కుము రం భీం జిల్లా దహేగంకు చెందిన ఈయన పత్తి సాగు చేశాడు. ధర పెరుగుతుందనే ఆశతో ఇంట్లో 50 క్వింటాళ్ళ వరకు నిల్వ చేశాడు. ఆరు నెలల పాటు ఎదురుచూసినా పెరగకపోవడంతో క్వింటాల్ రూ.7,500 చొప్పున 20 క్వింటాళ్లు అమ్మేశాడు. మరో 30 క్వింటాళ్ళు ఇంట్లోనే నిల్వ ఉంది. అయితే ఎక్కువ రోజులు కావడంతో పురుగులు వస్తున్నాయని, పత్తి పాడైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తక్కువ ధరకు అమ్మలేక, ఇంట్లో నిల్వ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: గత ఏడాది పత్తికి పలికిన ధర రైతుల్ని ఊరించింది. దీంతో ఈ ఏడాది పండించిన పంటను చాలామంది రైతులు అమ్మకుండా రాబోయే రోజుల్లో మంచి ధర పలుకుతుందనే ఆశతో వివిధ రకాలుగా నిల్వ చేశారు. కొందరు దళారుల మాట నమ్మి అమ్మలేదు. మరికొందరు సొంతంగానే వేచి చూడాలని నిర్ణయించుకున్నారు. కొందరు క్వింటాళ్ల కొద్దీ పత్తి ని ఇళ్లలోనే దాచుకున్నారు. ఎలుకలు, పురుగులు, దుర్వాసన సమస్యను ఎదుర్కొంటూ నెలల తరబడి ఎదురుచూశారు. కానీ ధర పెరగలేదు సరికదా.. సీజన్ మొదట్లో ఉన్న ధర కూడా క్రమంగా తగ్గిపోయింది. దీంతో పత్తిని నిల్వ చేసిన రైతులు పంటను మరింత కాలం నిల్వ చేయలేక, అలాగని అమ్ముకోలేక లబోదిబోమంటున్నారు. చెడిపోయిన 20 శాతం పత్తి రాష్ట్రంలో గత ఏడాది 46 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తే.. ఈ ఏడాది 50 లక్షల ఎకరాల్లో పండించారు. మొత్తం 28.41 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో ప్రైవేటు సంస్థలు 9.86 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, కొంతమంది పత్తి రైతులు మహారాష్ట్రలో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అమ్ముకున్నారు. దాదాపు సగం పత్తిని రైతులు భవిష్యత్తులో మంచి ధర వస్తుందనే ఆశతో దాచిపెట్టారు. అయితే వారి ఆశ అడియాసే అయ్యింది. ప్రస్తుతం అమ్మకుండా నిల్వ ఉన్న 14 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల పత్తిలో 20 శాతం మేర నల్లబడి, చెడిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తెలుపు నుంచి నలుపులోకి.. పత్తిని నిల్వ చేసేందుకు కొందరు గోడౌన్లు అద్దెకు తీసుకుంటే మరికొందరు సొంత ఇళ్లల్లో దాచారు. కొందరు ఆరు బయటే కల్లాల్లో టార్పాలిన్ కవర్ల కింద కప్పిపెట్టారు. అయితే అమ్మకుండా ఎక్కువరోజులు కావడంతో పత్తి నుంచి వివిధ రకాల పురుగులు బయటకొస్తున్నాయి. ఎలుకల బెడదా పెరిగింది. ముఖ్యంగా ఇళ్లల్లో దాచినవారికి ఇబ్బందులెదురవుతున్నాయి. ఇల్లంతా ఒక రకమైన దుర్వాసన కూడా వ్యాపిస్తోందని రైతులు చెబుతున్నారు. మరోవైపు ఆరుబయట వర్షాలు, ఎండల తాకిడితో పత్తి రంగు నల్లగా మారుతోంది. పత్తికి సరైన ఉష్ణోగ్రత ఉండాలి. అప్పుడే తెలుపు రంగు దెబ్బతినకుండా ఉంటుంది. అలాంటి పత్తికే మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. కానీ దిగుబడి వచ్చిన తర్వాత మూడు నెలలుగా నిల్వ చేయడంతో సరైన ఉష్ణోగ్రత లేక నల్లగా మారిపోతోంది. పత్తి గింజల నుంచి బంక లాంటిది బయటకొస్తోంది. ఈ పరిస్థితుల్లో కొందరు పొరుగు రాష్ట్రాల్లో అమ్ముకునేందుకు ప్రయత్ని స్తున్నారు. కానీ అక్కడికి రవాణా, దళారులకు కమీషన్, ఇతరత్రా ఖర్చులు కలిపితే క్వింటాల్‌కు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వ్యయమయ్యే పరిస్థితి ఉంది. అయినా రాష్ట్ర సరిహద్దులో ఉన్న రైతులు అక్కడే అమ్మేందుకు ఇష్టపడుతున్నారు. మరొకొందరు మాత్రం ప్రస్తుతం ఉన్న ధరకే అమ్ముకుంటున్నారు. పెరుగుతున్న వడ్డీ భారం ఒక్కో రైతు ఎకరానికి రూ.25 వేల వరకు పత్తి సాగు కోసం ఖర్చు చేశాడు. కొందరు అప్పులు చేసి మరీ పంట వేశారు. సకాలంలో అమ్ముకుంటే అప్పు తీరిపోయేది. మిత్తి డబ్బులు కూడా మిగిలేవి. కానీ ప్రస్తుతం వడ్డీ భారం రోజురోజుకూ పెరిగిపోతోంది. కొందరు వడ్డీ వ్యాపారులు అప్పు తీర్చాలంటూ తీవ్రంగా వత్తిడి చేస్తున్నారు. దీంతో కొందరు కొత్త అప్పులు చేసి పాత అప్పులు తీరుస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు ఇంట్లో ఉన్న బంగారం అమ్మి లేదా తాకట్టు పెట్టి అప్పులు తీరుస్తున్నట్లు సమాచారం. -
ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్..
ఆండ్రాయిడ్ పరికరాల కోసం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఫోన్లలో స్టోరేజ్ సమస్యకు పరిష్కారంగా ‘ఆటో ఆర్కైవ్’ అనే ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తన బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ పేర్కొంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లకు సంబంధించిన ఎలాంటి డేటా తొలగిపోదు. ఇది కేవలం తక్కువగా వాడిన యాప్‌ల డేటాను మాత్రమే ఆర్కైవ్ చేస్తుంది. ఆ యాప్‌లకు సంబంధించిన క్లౌడ్ ఐకాన్ ఫోన్లలో అలాగే ఉంటుంది. ఆటో ఆర్కైవ్ అంటే ఏమిటి? ఆటో ఆర్కైవ్ అనేది యాప్‌ను పూర్తిగా అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లు, ఇతర పరికరాల్లో స్టోరేజ్ స్పేస్‌ను ఖాళీ చేయడానికి రూపొందించిన కొత్త ఫీచర్ . ఈ ఫీచర్‌ను యూజర్లు ఎంచుకుంటే వారి ఫోన్లు, ఇతర ఆండ్రాయిడ్ పరికరాల్లో తక్కువగా వినియోగించే యాప్‌లు పాక్షికంగా తొలగిపోతాయి. దీంతో ఆ మేరకు స్టోరేజ్ స్పేస్ ఖాళీ అవుతుంది. అయితే తమకు సంబంధించిన ముఖ్యమైన డేటా తొలగిపోతుందని యూజర్లు కంగారు పడాల్సిన పని లేదు. యూజర్ల డేటా, పాక్షికంగా తొలగించిన యాప్ ఐకాన్లు కూడా ఫోన్లో అలాగే ఉంటాయి. కాబట్టి ఒకవేళ యూజర్లు తొలగించిన యాప్‌ను మళ్లీ ఉపయోగించాలనుకున్నప్పుడు దాన్ని మరో సారి డౌన్లోడ్ చేసుకుని ఎక్కడి నుంచి యాప్ డేటా తొలగిపోయిందో తిరిగి అక్కడి నుంచి కొనసాగించవచ్చు. అయితే ఆ యాప్ గూగుల్ ప్లేస్టోర్ అందుబాటులో ఉన్నంతవరకే. ఎలా పనిచేస్తుంది? ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏదైనా యాప్‌ను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒకవేళ వారి ఫోన్లు, ఇతర పరికరాల్లో స్టోరేజ్ స్పేస్ తక్కువగా ఉన్నట్లయితే ఆటో ఆర్కైవింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలని వారికి సూచన అందుతుంది. ఆ ఫీచర్‌ను ఎంచుకున్న వెంటనే తక్కువ వినియోగంలో ఉన్న యాప్‌లను గుర్తించి ఆటోమేటిక్‌గా ఆర్కైవ్ చేస్తుంది. ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ వల్ల దాదాపు 60 శాతం వరకు స్టోరేజీ స్పేస్ ఆదా అవుతుంది. గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. యాప్ బండిల్ని ఉపయోగించి రూపొందించిన యాప్‌లకు మాత్రమే ఈ ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ పనిచేస్తుంది. యాప్ బండిల్ అనేది యాప్‌ల రూపకల్పన కోసం 2021 నుంచి తప్పనిసరి చేసిన ఫార్మాట్. -
ఇంతకు మించి బంగారం ఇంట్లో ఉంటే చిక్కులు తప్పవు
-
గూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక ఆ బెడద ఉండదు
న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ యూజర్లకు భారీ ఊరట కల్పించింది. ఇప్పటివరకూ ఉన్న 15జీబీ స్టోరేజీ సామర్థ్యాన్ని ఏకంగా 1టీబీ సామర్థ్యానికి పెంచనుంది. ఈ మేరకు ప్రతి గూగుల్ వర్క్‌స్పేస్ వ్యక్తిగత ఖాతాలో ఆటోమేటిగ్గా 1 టీబీ నిల్వ సామర్థ్యం ఉండేలా అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ విషయాన్ని గూగుల్ తన తాజా బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. దీంతో గూగుల్ స్టోరేజ్, జీమెయిల్ లాంటి వాటిల్లో స్టోరేజ్ బాధ లేకుండా అపరిమితంగా ఫైల్స్‌ను దాచుకోవచ్చు. ప్రతి Google Workspace వ్యక్తిగత ఖాతా 1 టీబీ సురక్షిత క్లౌడ్ స్టోరేజ్‌తో వస్తుందని కంపెనీ ప్రకటించింది. వినియోగదారులు అడగాల్సిన అవసరం లేకుండానే ప్రతి ఖాతాలో 1 టీబీ స్టోరేజ్ స్వయంచాలకంగా స్టోరేజ్ అప్‌గ్రేడ్ చేస్తామని బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. తాజా చర్య గూగుల్ డ్రైవ్ దాదాపు 100 రకాల ఫైల్స్ స్టోరేజ్‌కు, పీడీఎఫ్, సీఏడీ, జేపీజీ తదితర రకాల ఫైల్స్ స్టోర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. వీటిని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫైల్స్‌లా కన్వర్ట్ చేసుకోకుండానే ఎడిట్ చేసేలా ఆప్షన్స్ ఎనేబుల్ చేయనుంది. దీనికి తోడు గూగుల్ డ్రైవ్ ఇప్పుడు మాల్వేర్, స్పామ్, రాన్సమ్వేర్ నుంచి రక్షణగా బిల్ట్ ఇన్ ప్రొటెక్షన్ ఫీచర్లను అందించనుంది. -
ఆదిలాబాద్ రిమ్స్‌లో శిథిలావస్థకు చేరిన డ్రగ్ స్టోరేజీ భవనం
-
అలా చేయడం శుద్ధ దండుగ పని - ఈలాన్‌మస్క్
ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్ని ఉపయోగించుకోవాలనే ఐడియా శుద్ధ దండుగ వ్యవహామని టెస్లా కార్ల అధినేత, ప్రపంచ కుబేరుడు ఈలాన్ మస్క్ అన్నారు. ఫైనాన్షియల్ టైమ్ష్ నిర్వహించిన ఫ్యూచర్ ఆఫ్ కార్ అనే సమ్మిట్‌లో మాట్లాడుతూ ఈలాన్ మస్క్ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. పెట్రోల్,డీజిల్‌కు ప్రత్యామ్నయంగా సంప్రదాయేతర ఇంధన వనరులు ఉపయోగించాలనే ప్రచారం గత కొంత కాలంగా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్‌ను ఉపయోగించాలంటూ కొందరు చెబుతున్న విషయం మస్క్ దగ్గర ప్రస్తావించగా... ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్ బ్యాడ్ ఛాయిస్, ఎనర్జీని ద్రవ రూపంలో నిల్వ చేయాలన్నా అతి భారీ ట్యాంకులను నిర్మించాల్సి ఉంటుంది. ఇక అది వాయురూపమైతే నిల్వ చేసే పరిమాణం ఎంత పెద్దగా ఉండాలనేది చెప్పడమే కష్టం. కాబట్టి ఎనర్జీ స్టోరేజికి హైడ్రోజన్ వాడాలనుకోవడం శుద్ధ దండగ అంటూ తెలిపాడు మస్క్. మరోవైపు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ మాత్రం ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్ ఎంతో చక్కగా పనికొస్తుందని చెబుతోంది. ఇలా చేయడం వల్ల ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ సెక్టార్‌కి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయానికి కట్టుబడి ఉంటోంది. చదవండి: ట్విటర్ అలా చేయకుండా ఉండాల్సింది - ఈలాన్ మస్క్ -
ఫొటోలు, వీడియోలతో ఫోన్ స్టోరేజ్ నిండిందా?
Full Phone storage Here's create more space: పండుగ టైంలో సరదాగా ఫొటోలు, వీడియోలు తీసుకోవాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే స్టోరేజ్ సమస్య చాలామందికి ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు. ఈ తరుణంలో ఫోన్లో ఫ్రీ స్పేస్ కోసం ఏం చేయొచ్చో తెలుసుకుందాం. ఫోన్ స్పేస్ ఫ్రీ చేయడం అంటే ఉన్న ఫొటోల్ని, వీడియోల్ని డిలీట్ చేయడం అనుకుంటారు చాలామంది. ఇందుకోసం వాటిని సెలక్ట్ చేసుకుంటూ.. టైం తీసుకుంటూ కుస్తీ పడుతుంటారు. కానీ, కింద చెప్పిన పద్ధతుల్లో వెళ్తే.. డివైజ్‌లో స్పేస్ కోసం అంత టైం పట్టదు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. చాలామంది వాడే స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఫోన్లే. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి.. అక్కడ ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. మేనేజ్ యాప్స్ అండ్ డివైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ స్టోరేజ్ సెక్షన్లోకి వెళ్తే.. ఏ యాప్ ఎక్కువ రోజుల నుంచి నిరుపయోగంగా ఉందో.. ఏ యాప్‌వల్ల ఎక్కువ స్పేస్ పోతుందో స్పష్టంగా కనిపిస్తుంది. వాటిని అన్ఇన్స్టాల్ చేయడం ద్వారా స్పేస్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఫైల్ మేనేజర్ & గూగుల్ ఫైల్స్ యాప్.. దాదాపు ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంటోంది. అది ఓపెన్ చేయగానే అందులో .. ఇమేజెస్(ఫొటోలు), ఆడియో, వీడియోలు ఇతరాలు కనిపిస్తాయి. అక్కడ లార్జ్ ఫైల్స్‌లో అనవసరమైనవి ఎంపిక చేసుకుని డిలీట్ చేయొచ్చు. వాట్సాప్‌లో.. దాదాపు స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లందరి ఫోన్లలో ఉంటున్న యాప్. ఈ యాప్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే డాటాను కొంతమంది క్లియర్ చేసినా.. స్టోరేజ్‌లో అలాగే ఉండిపోతాయని తెలుసా? అందుకే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాటిని క్లియర్ చేస్తూ ఉండాలి. సెట్టింగ్స్‌లో స్టోరేజ్ అండ్ డాటా ఆప్షన్‌ను క్లిక్ చేయగానే ‘మేనేజ్ స్టోరేజ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే ఎంత స్పేస్ అవసరం అనేది చూపిస్తుంది. అంతేకాదు అవసరం అనుకున్న ఫైల్స్‌ను అక్కడి నుంచి కూడా డిలీట్ చేసుకోవచ్చు. అక్కడ 5 ఎంబీ కంటే ఎక్కువ ఫైల్స్కనిపిస్తాయి కాబట్టి సులువుగా క్లియర్ చేసుకోవచ్చు కూడా. క్లౌడ్ సర్వీస్.. ఫొటోల్ని, వీడియోల్ని బ్యాక్అప్ చేసుకోవడం ద్వారా ఫోన్ స్పేస్ ఫ్రీ చేసుకోవచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా గూగుల్ ఫోటోస్‌లో బ్యాకప్ అండ్ సింక్రనైజ్ ఫీచర్‌ని ఆన్‌లో పెట్టుకోవడమే. గూగుల్ ఫొటోస్ యాప్‌పై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లో బ్యాకప్ అండ్ సింక్రనైజ్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. హైక్వాలిటీ రెజల్యూషన్ ఎంచుకుంటే గూగుల్ ఫొటోస్ అన్లిమిటెడ్ స్టోరేజ్‌ను అందిస్తుంది. గూగుల్ ఫొటోస్‌తో పాటు గూగుల్ డ్రైవ్ లాంటి వాటిలో సేవ్ చేసుకుంటే సరి. ఇవికాగా.. యాప్స్ క్యాచెని తొలగించడం ద్వారా స్టోరేజ్ స్పేస్ వస్తుంది. అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే.. డాటానే పోయే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. యాప్స్ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. ఆవెంటనే ఏదైనా యాప్ మీద క్లిక్ చేసి, స్టోరేజ్ ఆపై క్లియర్ క్యాచెను క్లిక్ చేయాలి. డౌన్‌లోడ్స్‌పై లుక్. చాలావరకు మీకు అవసరం లేని ఫైల్స్ ఉంటాయి. అలాంటి వాటిని చూసి తొలగించండి. అలాగే పీడీఎఫ్ ఫైల్స్, హైడ్‌లో దాచిన ఫైల్స్ ఉంటే కూడా డిలీట్ చేయడం ద్వారా స్పేస్ దొరుకుతుంది. -
చైనాలో ఏం జరుగుతోంది.. ఆ ప్రకటన ఉద్దేశం ఏంటి?
బీజింగ్: చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేసిన అరుదైన హెచ్చరిక, అక్కడి ప్రజలను ఆందోళనకు, అయోమయానికి గురిచేస్తుండగా అంతర్జాతీయంగా పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకుగాను నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం సూచించింది. దీంతో ఆ దేశంలో ఆహార కొరత రానుందా? లేక కోవిడ్ మళ్లీ ప్రబలే అవకాశాలున్నాయా? తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా ఆర్మీ ప్రయత్నిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా వాణిజ్యశాఖ సోమవారం ప్రజలకు పలు సూచనలు చేసింది. వచ్చే శీతాకాలంలో ప్రజలందరికీ కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను డిమాండ్ తగినట్లు అందుబాటు ధరల్లో సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే, అత్యవసర వినియోగ నిమిత్తం కొద్దిపాటి నిత్యావసరాలను నిల్వ ఉంచుకోవాలంటూ ఆ ప్రకటన చివర్లో పేర్కొనడం ప్రజల్లో అనుమానాలకు కారణమయింది. (చదవండి: అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!) -
World Heart Day: గుండెను గడ్డ కట్టించి, నిల్వచేశారు!
World Heart Day: గుండె మార్పిడి అంటేనే, కఠినమైన, క్లిష్టమైన ప్రక్రియ. దాత శరీరం నుంచి గుండెను వేరు చేసిన తరువాత నిర్దిష్ట సమయంలోగా దాన్ని దాతకు అమర్చాల్సి ఉంటుంది. గుండెను ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోవడమే దీనికి కారణం. ఫ్రిడ్జ్‌లో పెడితే కణజాలం పై మంచు స్ఫటికాలేర్పడి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుండెతోపాటు ఇతర అవయవాలను కూడా కొంచెం ఎక్కువకాలం నిల్వచేసే పద్ధతులపై ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిల్లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్త బోరిస్ రుబిన్ స్కీ విజయం సాధించారు. గుండె కణజాలాన్ని అతిశీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరచడమే కాకుండా, ఆ తరువాత అది మళ్లీ కొట్టుకునేలా కూడా చేయగలిగారు ఈయన. చదవండి: చనిపోయినా.. మరో ఎనిమిది మందిని బతికించొచ్చు! ఎప్పుడో 16 ఏళ్ల క్రితం రుబిన్స్కీ ‘‘ఐసోకోరిక్ సూపర్ కూలింగ్’’పేరుతో అభివృద్ధి చేసిన ఓ టెక్నిక్కు మరింత పదును పెట్టి అవయవ కణజాలంపై మంచు స్ఫటికాలు ఏర్పడకుండానే నిల్వ చేయగలిగారు. ఒక ద్రవంలో అవయవాన్ని లేదా భద్రపరచాల్సిన పదార్థాన్ని ఉంచి అందులోకి గాలి చొరబడకుండా చేయడం దీంట్లోని ప్రత్యేకత. మూలకణాల సాయంతో అభివృద్ధి చేసిన గుండె కణజాలాన్ని తాము ఈ పద్ధతి ద్వారా –3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయగలిగామని, ఒకరోజు నుంచి మూడు రోజులపాటు దీన్ని నిల్వ చేసి చూడగా ప్రతిసారి అది మళ్లీ కొట్టుకుందని రూబిన్స్కీ తెలిపారు. చదవండి: భరించలేని నెలసరి సమస్యలా? ఈ 10 చిట్కాలు ట్రై చేయండి.. -
ఐఫోన్లలో కొత్త సమస్యలా?.. ఇలా చేయండి
iphone iOS 15 Update Bugs: ఐఫోన్ యూజర్లకు కొత్త సమస్య వచ్చిపడింది. ఐవోఎస్ 15 అప్డేట్తో గుడ్‌న్యూస్ అందించిన యాపిల్.. ఆ తర్వాత ఎదురవుతున్న ‘స్టోరేజ్ ఫుల్’ బగ్ విషయంలో మాత్రం త్వరగతిన పరిష్కారం చూపించడం లేదు. యాపిల్ తన ఐఫోన్ యాజర్ల (ఐఫోన్ 6ఎస్ మోడల్ మొదలు తర్వాతి వెర్షన్లు) కోసం ఈ మధ్యే ఐవోఎస్ 15 అప్డేట్ తీసుకొచ్చింది. 2021 సెప్టెంబరు 20 నుంచి ఈ అప్డేట్ని యూజర్లకు అందిస్తోంది. అయితే ఈ అప్డేట్ చేసుకున్న వెంటనే యూజర్లకు ‘ఫోన్ మొమరీ ఫుల్’ అనే పాప్-అప్ చూపిస్తోందట. దీంతో వేల మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక ఈ సమస్యపై కంగారుపడాల్సిన అవసరం లేదని యాపిల్ చెబుతోంది. iPhone storage almost full బగ్ పరిష్కారం కోసం సింపుల్‌గా ఫోన్‌ను రీస్టార్ట్ చేయమని సూచిస్తోంది. కానీ, అలా చేసినా కూడా చాలామందికి సమస్య తీరడం లేదంట. పైగా కొందరికి ఫోన్లో ఉన్న స్పేస్ కంటే.. ఎక్కువ స్టోరేజ్ చూపిస్తోందని చెప్తున్నారు. ఇక ఐఫోన్లతో పాటు ఐప్యాడ్‌లలోనూ ఇదే తరహా సమస్య ఎదురవుతోందట. సమస్య గురించి ప్రస్తావిస్తున్న వాళ్లందరికీ ఓపికగా రిప్లైలు ఇస్తున్న యాపిల్.. సమస్య ఏంటన్నది మాత్రం చెప్పడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ.. ఐవోఎస్ 15 వెర్షన్ అప్డేట్ చేసుకున్న ఐఫోన్లలో ఇన్స్టాగ్రామ్ యాప్ సరిగా పని చేయడం లేదని తెలుస్తోంది. వీడియోలు, స్టోరీల విషయంలో సౌండ్ పని చేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు కొందరు. అయితే ఇన్స్టాగ్రామ్ 206.1 వెర్షన్ మాత్రం ఈ బగ్‌ను ఆటోమేటిక్‌గా ఫిక్స్ చేసుకోవడం విశేషం. యాపిల్ సపోర్ట్ కమ్యూనిటీ ఫోరమ్‌లోనూ స్టోరేజ్ బగ్ ఇష్యూ తలెత్తడం కొసమెరుపు. ఇక యాపిల్ యూజర్ల కోసం 14.8 నుంచి ఐవోఎస్ 15 అప్డేట్కి చేరింది. తద్వారా ఫోన్ పనితీరులో మరింత మెరుగు అవుతుందని యాపిల్ పేర్కొంది. ముఖ్యంగా కనెక్టివిటీ, ఫోకస్, ఎక్స్ప్లోర్ విభాగంలో అప్డేట్ బాగా పని చేస్తుందని చెబుతోంది. ప్రస్తుతం బగ్ ఫిక్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు యాపిల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ, ఎంత టైం పడుతుందనేది చెప్పలేదు. చదవండి: యాపిల్ అదిరిపోయే ఆఫర్, ఐఫోన్ 13పై రూ.46వేల వరకు.. -
‘గాంగినా’తో ఫ్రెష్‌గా.. వాళ్లకు ఫ్రిజ్‌తో పనిలేదు
పండ్లు, కూరగాయలు వంటివి తాజాగా ఉండేలా నిల్వ చేసుకోవడానికి తప్పనిసరిగా ఫ్రిజ్ వాడుతుంటాం. అఫ్ఘానిస్తాన్‌లోని చాలా ప్రాంతాల్లో పండ్లు నిల్వ చేసుకోవడానికి ఫ్రిజ్‌లపై ఏమాత్రం ఆధారపడరు. ద్రాక్ష వంటి పండ్లను ఆరునెలల పాటు చెక్కుచెదరకుండా నిల్వ చేసుకోవడానికి వారు పురాతనమైన సంప్రదాయ పద్ధతినే నేటికీ నమ్ముకుంటున్నారు. ఎలాంటి పండ్లనైనా ఆరునెలల పాటు తాజాదనం చెక్కుచెదరకుండా నిల్వచేసే ఈ ప్రక్రియ పేరు ‘గాంగినా’. ఈ పద్ధతిలో తడి బంకమట్టితో బుట్టల్లాంటివి తయారు చేసి, వాటిలో తాజా పండ్లు ఉంచి, గాలి చొరబడే అవకాశం లేకుండా వాటిని మూసివేస్తారు. అవి పూర్తిగా ఎండిపోయే వరకు ఎండలో ఆరబెడతారు. ఎండిన బుట్టలను చీకటి గదుల్లో నిల్వ ఉంచుతారు. పండ్ల దిగుబడి లేని రుతువులో ఈ ‘గాంగినా‘ బుట్టలను తెరిచి, ఇందులోని పండ్లను వాడుకుంటారు. ‘గాంగినా’ బుట్టలను తయారు చేసేటప్పుడు వీటి అడుగు భాగాన్ని, పైమూతను రెండేసి పొరలుగా మట్టితో తయారు చేయడం వల్ల వీటిలో భద్రపరచిన పండ్లు చిరకాలం తాజాగా ఉంటాయి. వీటిలో పండ్లను నిల్వ చేసేటప్పుడు, ముందుగా అతిగా ముగ్గిన వాటిని, కుళ్లిన వాటిని వేరు చేసేస్తామని, లేకుంటే మొత్తం పండ్లు పాడైపోతాయని అబ్దుల్ మానన్ అనే రైతు చెప్పారు. -
మీ డాక్యుమెంట్లు భద్రమేనా...
ఒకప్పటితో పోలిస్తే నేటి జీవనంలో ఆర్థిక లావాదేవీల పాత్ర మరింత ఎక్కువైందనే చెప్పుకోవాలి. వ్యక్తుల ఆర్జనా శక్తి పెరిగినందున.. అవసరాలు, ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. ప్రాపర్టీలు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు, బీమా పాలసీలు, బ్యాంకు ఖాతాలు.. లిస్ట్ పెద్దగానే ఉంటుంది. కానీ, వీటికి సంబంధించి డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకుంటున్నామా? తప్పకుండా ఉంచుకోవాలి. వీటికి సంబంధించిన డిజిటల్ ఆధారాలను ఎక్కడ నిల్వ చేస్తున్నారు? సాధారణంగా ఈ డిజిటల్ డాక్యుమెంట్లు మెయిల్ బాక్స్‌లకు వస్తుంటాయి. స్టాక్స్‌లో లావాదేవీలకు సంబంధించిన కాంట్రాక్టులు కూడా ఏ రోజుకారోజు మెయిల్ బాక్స్‌కు వస్తుంటాయి. బీమా కంపెనీలు అయితే ప్రస్తుతం ఈ పాలసీ పత్రాలను రిజిస్టర్డ్ ఈ మెయిల్ అడ్రస్‌లకు పంపిస్తున్నాయి. పాలసీ ప్రీమియం సర్టిఫికెట్లను కూడా మెయిల్‌కు పంపిస్తున్నాయి. ఇలా భారీగా వచ్చే డిజిటల్ డాక్యుమెంట్లను ‘డిలీట్’ కొట్టేసేవారూ ఉన్నారు. కానీ, వేటి అవసరం ఎంత మేరకు అన్నది తెలుసుకోకుండా డిలీట్ చేయవద్దు. ప్రతీ డాక్యుమెంట్‌ను ఎంత కాలం పాటు ఉంచుకోవాలన్నది తెలిస్తే.. అప్పుడు వాటి నిర్వహణ సులువవుతుంది. ఐటీ... ఏటా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడంతో పని అయిపోయిందని భావిస్తే అది తప్పే అవుతుంది. ఆదాయపన్ను రిటర్నుల్లో పేర్కొన్న ఆదాయం, పెట్టుబడులు, ఇతరత్రా వనరుల సమాచారానికి సంబంధించిన ఆధారాలు కూడా మీ వద్ద భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ‘‘పన్ను చెల్లింపుదారు తన పన్ను వివరాలను, ఇందుకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్లు, ఆధారాలను కనీసం ఏడేళ్లపాటు ఉంచుకోవాలి. ఏడేళ్ల వరకు ఏదేనీ ఆసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను తిరిగి విచారించే అధికారం ఆదాయపన్ను శాఖా అధికారులకు ఉంటుంది’’అని ఎన్ఏ షా అసోసియేట్స్ పార్ట్నర్ గోపాల్ బోహ్రా తెలిపారు. ఒకవేళ గత కాలానికి సంబంధించి రిటర్నుల విషయమై ఏదైనా వివాదం ఆదాయపన్ను శాఖతో నెలకొని ఉంటే.. అది పరిష్కారం అయ్యే వరకు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను తప్పకుండా ఉంచుకోవాలని సూచించారు. ‘‘పన్ను చెల్లింపుదారుల ప్రాంగణాల్లో ఆదాయపన్ను శాఖా సోదాలు నిర్వహించినట్టయితే.. ఆ సందర్భంగా రూ.50 లక్షలకు మించి ఆస్తి లేదా ఆదాయాన్ని అసెసింగ్ అధికారి గుర్తించితే, అప్పుడు 10 ఏళ్ల నాటి పాత రికార్డులను కూడా తిరిగి విచారించే అధికారం కలిగి ఉంటారు’’ అని బోహ్రా వివరించారు. విదేశీ మార్గంలో ఆదాయాన్ని కలిగి ఉంటే లేదా విదేశీ ఆస్తి కలిగి ఉంటే సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటి నుంచి 17 ఏళ్ల పాటు ఆయా ఆధారాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆదాయాన్ని దాచిపెట్టినట్టు పన్ను అధికారులు భావిస్తే.. సంబంధిత అసెస్మెంట్ను తిరిగి తెరిచేందుకు చట్ట ప్రకారం వారికి 17 ఏళ్ల పాటు అధికారం ఉంటుంది. ► బ్యాంకు పత్రాలు రుణాలు తీసుకుని, చెల్లింపులు పూర్తయిన తర్వాత అందుకు సంబంధించిన ఆధారాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. ‘‘రుణాన్ని పూర్తిగా చెల్లించేసినప్పటి నుంచి కనీసం ఎనిమిదేళ్ల పాటు డాక్యుమెంట్లను అలాగే ఉంచుకోవాలి. ఏవైనా వివాదాలు తలెత్తితే పరిష్కరించుకునేందుకు ఆధారంగా ఇంతకాలం పాటు వాటిని భద్రపరుచుకుంటే సరిపోతుంది’’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి సూచించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కూడా బ్యాంకులు ఐదు నుంచి ఎనిమిదేళ్ల పాటు పత్రాలను నిల్వ చేయాల్సి ఉంటుంది. కనుక ఇంత కాలం పాటు రుణాన్ని తీర్చివేసిన ఆధారాలను ఉంచుకుంటే సరిపోతుంది. భద్రత ఎక్కడ..? డాక్యుమెంట్లను నిల్వ చేసుకునేందుకు పలు మార్గాలున్నాయి. మీ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో పదిలపరుచుకోవచ్చు. లేదంటే పెన్‌డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్‌లు కూడా ఉన్నాయి. ఆన్లైన్లో క్లౌడ్ స్టోరేజీ సదుపాయాలు కూడా విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ముఖ్యమైన పత్రాలను తమ ఈ మెయిల్ బాక్స్‌లోనే ఉంచేస్తుంటారు. ‘‘ఈ మెయిల్లో నిల్వ చేయడం అన్నది భద్రతా పరంగా సురక్షితమైనది కాదు. ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవడంతోపాటు పాస్‌వర్డ్‌తో వాటికి రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. బిట్లాకర్ను ఇందుకు వినియోగించుకోవచ్చు’’ అని ఇన్ఫ్రాసాఫ్ట్ టెక్ ప్రొడక్ట్, ఇన్నోవేషన్ హెడ్ మనోజ్ చోప్రా తెలిపారు. బిట్లాకర్లో ఎన్క్రిప్షన్ సదుపాయం ఉంటుంది. దీంతో ఇందులో నిల్వ చేసుకునే డాక్యుమెంట్లకు రక్షణ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా క్లౌడ్ రూపంలోనూ డాక్యుమెంట్లను భద్రపరచుకునే అవకాశం ఉంది. గూగుల్ డాక్యుమెంట్స్, ఐక్లౌడ్, డ్రాప్‌బాక్స్ ఇటువంటివే. స్కాన్ చేసిన డాక్యుమెంట్లను వీటిల్లో స్టోర్ చేసుకుని ఎక్కడి నుంచి అయినా తిరిగి పొందొచ్చు. ముఖ్యమైన, అవసరమైన డాక్యుమెంట్లను లోకల్‌గా (కంప్యూటర్లు, డిస్క్‌లు) స్టోర్ చేసుకోవడంతోపాటు.. వాటి బ్యాకప్ తీసుకుని కనీసం రెండు క్లౌడ్ వేదికల్లో అయినా పదిలం చేసుకోవాలని చోప్రా సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజీ లాకర్ కూడా ఇందుకు చక్కని వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ బీమా పాలసీ డాక్యుమెంట్‌తోపాటు, కట్టిన ప్రీమియం రసీదులను కూడా భద్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. దీనివల్ల భవిష్యత్తులో క్లెయిమ్ పరంగా ఎటువంటి సమస్యలు ఎదురైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ‘‘పన్ను మినహాయింపులు పొందాలని భావిస్తే అందుకు ప్రీమియం చెల్లింపుల రసీదులను సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతో అవసరమైతే రిటర్నులతోపాటు జత చేయడానికి వీలుంటుంది’’ అని పాలసీఎక్స్ డాట్ కామ్ సీఈవో నావల్ గోయల్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరి, అందుకు అయ్యే చికిత్సా ఖర్చులను తిరిగి పొందినట్టయితే అందుకు సంబంధించిన పత్రాలను, కారు మరమ్మతులకు చేసుకునే బీమా క్లెయిమ్ ఆధారాలను కూడా దీర్ఘకాలం పాటు భద్రంగా ఉంచుకోవడం అవసరమని గోయల్ సూచించారు. పోర్టబిలిటీ సమయంలో ఇవి ఉపయోగపడతాయన్నారు. బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్న ఈ ఇన్సూరెన్స్ అకౌంట్‌ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ‘‘మీ కుటుంబం, మీకు సంబంధించిన బీమా పత్రాలను ఇందులో భద్రంగా నిల్వ చేసుకోవచ్చు’’ అని చెప్పారు. ► మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీస్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్లలో మీకున్న పెట్టుబడుల వివరాలన్నింటినీ ఒకే నివేదిక రూపంలో క్రోడీకరించి ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ సంస్థలు కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ (సీఏఎస్) పేరుతో ప్రతీ త్రైమాసికానికి ఇస్తుంటాయి. వీటిని కుటుంబ సభ్యుల్లో ఒకరితో పంచుకునేందుకు గాను ఆటో ఫార్వార్డ్‌ను ఎంచుకోవాలి. ఒక్క మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి అయితే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (క్యామ్స్) నుంచి ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ను తీసుకుంటే చాలు. వేతన జీవులు అయితే తమ స్టాక్, మ్యూచువల్ ఫండ్ ఖాతాల స్టేట్మెంట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్వయం ఉపాధిలో ఉన్న వారు అయితే వీటిని కనీసం ఆరేళ్ల వరకు పదిలంగా ఉంచుకోవడం అవసరం. ► ఇవి చాలా కీలకం ఆస్తుల కొనుగోలు, అమ్మకాల పత్రాలను లావాదేవీ జరిగిన నాటి నుంచి కనీసం ఏడేళ్ల వరకు అయినా ఉంచుకోవడమే మంచిది. ఎందుకంటే ఆదాయపన్ను శాఖ ఏడేళ్లలోపు ఎప్పుడైనా తిరిగి పరిశీలించే చర్య తీసుకోవచ్చు. ‘‘పన్ను చెల్లింపుదారులు తప్పకుండా డాక్యుమెంట్లను అట్టిపెట్టుకోవాల్సిందే. ఆభరణాల కొనుగోళ్ల రసీదులు, అలాగే పెయింటింగ్, ఇళ్ల మరమ్మతులు, నవీకరణకు చేసే ఖర్చులకు సంబంధించిన ఆధారాలను కూడా ఉంచుకోవాలి. దీంతో ఆయా ఆస్తుల విక్రయం తర్వాత పన్ను తగ్గింపులను ఆదాయపన్ను శాఖ తిరస్కరించదు’’ అని బోహ్రా తెలియజేశారు. ► డిజీలాకర్ ఉచితంగా మీ డాక్యుమెంట్లను స్టోర్ చేసుకునే వేదిక ఇది. దీంతో భౌతికంగా పత్రాలను ఉంచుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. ఇందులో స్టోర్ చేసే డేటా, డాక్యుమెంట్లు అంతా క్లౌడ్ రూపంలోనే ఉంటాయి కనుక ఎక్కుడి నుంచి అయిన వాటిని పొందే వెసులుబాటు ఉంటుంది. పీడీఎఫ్, జేపీఈజీ, పీఎన్జీ రూపాల్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లపై ఈసైన్(ఎలక్ట్రానిక్ రూపంలో సంతకం) చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఇవి సెల్ఫ్ అటెస్టేషన్ కాపీలుగా పనికి వస్తాయి. డిజిలాకర్‌లో అకౌంట్ కోసం మొబైల్ నంబర్ అవసరం ఉంటుంది. ఆధార్ డేటా బేస్‌లో నమోదైన మొబైల్ నంబర్‌ను కూడా వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాలను జ్టి్టpట://ఛీజీజజీ ౌఛిజ్ఛుట.జౌఠి.జీn/ వెబ్ సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. -
వాట్సాప్ సరికొత్త ఫీచర్..
ముంబై: కొత్త ఫీచర్లను అందిస్తూ వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్న వాట్సాప్ తాజాగా సరికొత్త ఫీచర్లను అందించనున్నట్లు పేర్కొంది. మెరుగైన స్టోరేజీ కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చామని, బీటా యూజర్ల కోసం న్యూ స్టోరేజ్ యూఐ ఫీచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. స్టోరేజీ మేనేజ్ మెంట్ కోసం స్టోరేజీ సెక్షన్ ను వాట్సాప్ అప్ డేట్ చేసింది. కాగా సరికొత్త స్టోరేజీ ఆప్షన్ ద్వారా వినియోగదారులకు మోడ్రాన్ స్టోరేజీ బార్ కనిపిస్తుంది. అంతే కాకుండా వాట్సాప్‌లో మీడియా ఫైల్స్, ఇతర ఫైల్స్ సైజు కూడా చూడవచ్చు. మరోవైపు ఫైల్స్ పాతవా, కొత్తవా అని రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో వినియోగదారులు అనవసర ఫైల్స్‌ను డిలీట్ చేయవచ్చు. మరోవైపు సరికొత్త వాట్సాప్ బీటా అప్ డేట్ వెర్షన్ 2.20.201.9 ఫీచర్ అందుబాటులోకి రానుంది. కాగా అప్డేట్ వర్షన్ వల్ల ఫోటోలు, వీడియోలు, ఫైల్‌లను షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు సరికొత్త వర్షన్ అందుబాటులోకి రాగా, ఐఓఎస్ యూజర్లకు ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందో, వాట్సాప్ ఇంకా ప్రకటించలేదు. (చదవండి: వాట్సాప్ చాట్ హ్యాక్.. ఆరా తీస్తున్న పోలీసులు) -
యూసీ బ్రౌజర్ నుంచి ఉచిత క్లౌడ్ స్టోరేజ్
న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద థర్డ్ పార్టీ వెబ్ బ్రౌజర్ అయిన ‘యూసీ బ్రౌజర్’ భారత మార్కెట్లో తన కార్యకలాపాలను పెంచుకునే దిశగా వ్యూహాన్ని మార్చుకుంటోంది. భారత వినియోగదారులకు ఇన్‌యాప్ క్లౌడ్ స్టోరేజీ సేవలను ‘యూసీ డ్రైవ్’ రూపంలో ఆఫర్ చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. భారీ క్లౌడ్ స్టోరేజీ సదుపాయంతో ఉచితంగా దీన్ని అందిస్తున్నట్టు తెలిపింది. -
శీతాకాలంలో పశువులకు నిల్వ నీళ్లివ్వవద్దు
వేసవిలోలాగానే, శీతాకాలంలో కూడా పశువులు కొంత ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటాయి. సాధారణంగా పశువులు తమ శరీర ఉష్ణోగ్రతను 101 డిగ్రీల ఫారెన్ హీట్‌గా సరిచేసుకుంటూ జీర్ణప్రక్రియను కొనసాగిస్తూ ఉంటాయి. మెటబాలిజమ్ ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని వేసవిలో చెమటద్వారా, శీతాకాలంలో మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. ఈ వేడిని బయటకు పంపే ప్రక్రియ పశువు పరిసర వాతావరణాన్ని బట్టి ఉంటుంది. వేసవిలో ఎక్కువ వేడి శరీరంలో ఉన్న పక్షంలో వడదెబ్బ తగలడం, అలానే శరీరంలో శీతాకాలంలో సరిౖయెన వేడి శరీరంలో లేనప్పుడు పశువు శీతలపు వత్తిడిని చవిచూస్తుంది. దీనినే ‘కోల్డ్ స్ట్రెస్’ అంటారు. దీని నివారణకు కొన్ని సూచనలు: 1 బాగా చల్లగా ఉన్న నీటిని పశువులకు అందించరాదు. దీనికి నివారణగా నిల్వ ఉన్న వాటిని కాకుండా, తాజా బోర్వెల్ నుంచి వచ్చిన నీటిని పశువులకు అందించాలి. నిల్వ ఉన్న నీరు ఎక్కువ చల్లగా ఉంటుంది. 2 బయట వాతావరణం చల్లగా ఉంటే, ఎక్కువ వేడి శరీరం నుంచి బయటకు పశువు వదులుకోవాల్సి వస్తుంది. అందుచేత ఎక్కువగా వేడిని ఉత్పత్తి చేసే మేపు పదార్ధాలను పశువులకు అందించాలి. ఎండుమేత వంటి వాటిని పశువుకు ఎక్కువగా అందించాలి. దాణా పదార్థాలకంటే ఇవి మేలు. 3 పశువుల షెడ్లకు ఉన్న అన్ని ద్వారాలు మూయకూడదు. గాలి, వెలుతురు తగ్గిపోయి, షెడ్లలో తేమ వాతావరణం ఏర్పడుతుంది. 4 చల్లగాలుల నుంచి పశువులను కాపాడాలి. షెడ్లలో సూర్యరశ్మి పడేటట్లు చూడాలి. 5 వీలయితే పశువులకు వరిగడ్డితో వెచ్చదనం కోసం ఒక బెడ్డును ఏర్పాటు చేయాలి. వీటిని పొడిగా ఉంచడం అవసరం. 6 సాధ్యమయినంత వరకు పశువులకు గోరువెచ్చటి నీటిని అందించగలిగితే మంచిది. శీతాకాలంలో నీటిని పశువు తక్కువగా తాగినట్లయితే, మేత ద్వారా లభ్యమయ్యే ఘన పదార్ధాన్ని తక్కువగా మేయడం, తద్వారా పాల దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. 7 వయస్సు మళ్లిన పశువులు, దూడలు, వ్యాధి బారిన పడిన పశువులు ఎక్కువగా ఈ కోల్డ్ స్ట్రెస్ బారిన పడుతుంటాయి. వీటిని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. 8 పాలు తీసిన తర్వాత పశువుల చనులను శుభ్రంగా తుడిచి, ఆరబెట్టి మందలోకి వదలాలి. లేకపోతే ‘ఫ్రాస్ట్ బైట్’ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా శీతాకాలంలో కొన్ని సూచనలు పాటించవలసిన అవసరముంది. – డా. ఎం.వి.ఎ.యన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్–అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్‌స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
అడుగుఅడుగునా కష్టాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న నాగార్జునసాగర్‌లో నీటి మట్టం గణనీయంగా పడిపోతోంది. పూర్తిస్థాయిలో ఎం డలు తీవ్రతరమవడంతో.. రిజర్వాయర్‌లో నీటి మట్టాలు అడుగంటుతున్నాయి. మరో అడుగు దాటితే సాగర్‌లో నిల్వల కనీస నీటి మట్టానికి చేరనుంది. సాగర్ కనీస నీటిమట్టం 510 అడుగులు కాగా.. ప్రస్తుత మట్టం 511.40 అడుగులు గా ఉంది. మరో 3, 4 రోజుల్లో ఇది 510 అడుగులకు చేరనుంది. 505 అడుగుల వరకే ఓకే! సాగర్ ప్రాజెక్టు నుంచే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 516 ఫ్లోరైడ్ గ్రామాలతోపాటు ఇతర 300 గ్రామా లకు, జంట నగరాల తాగునీటి అవసరాలకు కృష్ణా నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ఏడాది అనుకున్న స్థాయిలో ప్రవాహాలు లేక, సాగు అవసరాలకు సాగర్ నీటిని వినియోగించడంతో నిల్వలు తగ్గాయి. దీంతో సాగర్‌లో ప్రస్తు తం 590 అడుగులకు గానూ 511.40 అడుగులకు చేరాయి. ఈ మట్టంలో లభ్యత జలాలు 134 టీఎంసీ ఉన్నప్పటికీ ఇందులో కనీస నీటి మట్టాలకు ఎగువన వినియోగార్హమైన నీరు కేవలం 4 టీఎంసీలు మాత్రమే. దీనికి తోడు ఎగువన ఉన్న శ్రీశైలంలోనూ నీటి మట్టాలు పడిపోయాయి. 885 అడుగులకు గానూ 808.60 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో అక్కడి నుంచి సాగర్‌కు నీటి విడుదల చేయడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో లభ్యత నీటితో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృష్ణా బోర్డు సాగర్‌లో 505 అడుగుల వరకు, శ్రీశైలంలో 800 అడుగుల వరకు నీటిని వాడుకునే అవకాశం కల్పించింది. గరిష్టంగా 14 టీఎంసీలే రెండు ప్రాజెక్టుల పరిధిలో గరిష్టంగా 14 టీఎంసీల మేర మాత్రమే నీటిని వాడుకునే అవకాశం ఉంది. ఇందులో తెలంగాణకు 9 టీఎంసీ, ఏపీకి 5 టీఎంసీల నీటివాటా ఉంది. ఈ నీటినే ఇరు రాష్ట్రాలు ఆగస్టు వరకు వినియోగించుకోవాలి. అయితే గతంలో రాష్ట్ర తాగునీటికై తీవ్ర ఎద్దడి నెలకొన్నప్పుడు సాగర్‌లో 500 అడుగుల వరకు వెళ్లి నీటిని తీసుకున్నారు. ఇందుకు సాగర్ ఫోర్‌షోర్‌లో అత్యవసర మోటర్ల వ్యవస్థను జలమండలి ఏర్పాటు చేసి పంపింగ్ చేసింది. ఈమారు తాగునీటికి కొరత ఏర్పడితే ఇదే పద్ధతిలో నీటిని తీసుకునే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల సకాలంలో వర్షాలు కురిసినా ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండి.. శ్రీశైలం రిజర్వాయర్‌ను దాటి సాగర్ వరక వరద జలాలు చేరాలంటే ఆగస్టు, సెప్టెంబర్ వరకూ వేచిచూడాల్సిందే. ఎగువ నుంచి వరద జలాలు వచ్చే వరకూ అంటే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఈ సమయంలో గోదావరి జలాలపై ఆధారపడ్డ ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి జంట నగరాల తాగునీటి అవసరాలు తీర్చక తప్పదు. నల్లగొండ జిల్లాకు మాత్రం ఈసారి తాగునీటికి మాత్రం ఇబ్బందులు తప్పేలా లేదు. -
ఇక డేటా పక్కా లోకల్!
సాక్షి, హైదరాబాద్: డేటా లోకలైజేషన్.. వినియోగదారుల సమాచారమంతా దేశీయంగా నిల్వ చేసే ప్రక్రియ.. ఇందుకు పేమెంట్ కంపెనీలకు ఆర్బీఐ విధించిన గడువు సోమవారంతో పూర్తయింది. ఈ గడువును డిసెంబర్ వరకు పొడిగించాలని బహుళ జాతి సంస్థలు కోరినా కేంద్రం మాత్రం తిరస్కరించింది. దీంతో అంతర్జాతీయ కంపెనీల్లో గుబులు పెరిగిపోయింది. ఇక మీదట దేశ పౌరులకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా భారత్ భూభాగంలోని సర్వర్లలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల భారత్‌లోని అమెరికా వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళన పెరిగిపోతోంది. గతంలో కొన్ని టెక్ సంస్థలు డేటా లోకలైజేషన్ నిబంధనలు సరికావని, వాటిని సడలించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఇప్పుడు అమెరికా సెనేటర్లు జాన్ కార్నిన్, మార్క్ వార్నర్ కూడా దీనికి వ్యతిరేకంగా గళమెత్తారు. ‘డేటాను స్థానికంగా నిల్వ చేయాలన్న నిబంధనల వల్ల భారత్‌లో వ్యాపారాలు చేయడం కష్టమవుతుంది. పౌరుల సమాచారం గోప్యంగా ఉంచేందుకు కంపెనీలన్నీ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నపుడు డేటాను నిల్వచేసే సర్వర్లు ఎక్కడున్నా నష్టమేంటి?’అంటూ ఆ సెనేటర్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపిస్తుందని వారు హెచ్చరించారు. డేటా లోకలైజేషన్ అంటే వివిధ రకాలైన ఆర్థిక సంస్థలు, చెల్లింపు సంస్థలు, వినియోగదారులతో వ్యవహారాలు ముడిపడే ఇతర సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నా వినియోగదారుల సమాచారం వేరే దేశంలోని సర్వర్లలోనే నిక్షిప్తమై ఉంటుంది. దీంతో వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రత గాల్లో దీపంలా మారింది. సమాచార భద్రత ముసాయిదా బిల్లులో భాగంగా డేటాను దేశీయంగా ఉండే సర్వర్లలోనే నిక్షిప్తం చేయాలన్న సూచనలు ఉన్నాయి. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫారసులకు అనుగుణంగా రూపొందించిన వ్యక్తిగత సమాచార భద్రత బిల్లులో అంశాలపై ప్రజాభిప్రాయం సేకరించే పనిలో కేంద్రం ఉంది. అది చట్టరూపం దాల్చేలోగానే డేటాను లోకలైజ్ చేయాలన్న ఉద్దేశంతో 6 నెలల కింద ఆర్బీఐ మార్గదర్శకాలను రూపొందించింది. గ్లోబల్ డిజిటల్ పేమెంట్ కంపెనీలన్నీ దేశీయంగా సమాచారాన్ని నిల్వ చేయాలంటూ అక్టోబర్ 15వరకు గడువు విధించింది. కంపెనీల దారెటు ? అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపు కంపెనీలైన వీసా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఫేస్బుక్, పేపాల్, మాస్టర్‌కార్డు, గూగుల్ వంటి సంస్థలపై ఈ లోకలైజేషన్ ప్రభావం పడుతుంది. అయితే ఆర్బీఐ నిబంధనల్ని పాటిస్తూ స్థానికంగా వినియోగదారుల సమాచారాన్ని నిల్వ చేసే ప్రక్రియ వాట్సాప్ పూర్తి చేయగా, గూగుల్ అంగీకరించింది. దేశంలోని మొత్తం 80 పేమెంట్స్ సర్వీసుల్లో 64 కంపెనీలు డేటా లోకల్‌గా నిల్వ చేయడానికి సిద్ధమని ప్రకటించాయి. మరో 16 సంస్థలు గడువు కోరాయి. అమెజాన్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు మాత్రం డేటా లోకలైజేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అంతర్జాతీయ కంపెనీలపై భారం ఎలా? డేటా నిల్వ చేసేందుకు అంతర్జాతీయ కంపెనీలన్నీ భారత్‌లో కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మౌలిక సదుపాయాల కల్పనకే భారీగా ఖర్చు అవుతుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్రాలు ఉండటం వల్ల అదే పని తిరిగి చేయాల్సి వస్తుంది. మానవ వనరుల్ని భారత్‌లో వినియోగించాల్సి రావడం కూడా ఆ కంపెనీలకు అదనపు భారమే. చెల్లింపు సంస్థలు మాత్రమే కాకుండా, అన్ని రకాల కంపెనీలు వినియోగదారుల సమాచారాన్ని స్థానికంగా నిల్వ చేయడం వల్ల మార్కెటింగ్ వ్యూహాలను రచించేందుకు వినియోగదారుల సమాచార సేకరణ సంక్లిష్టంగా మారుతుంది. దేశీయంగా వరం ఎలా? అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్థిక మోసాలు, అక్రమాలు జరిగినప్పుడు భద్రతా సంస్థలకి సమాచార సేకరణ సులభమవుతుంది. డేటా అనలిస్టులు,సైంటిస్టుల వంటి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. భారత్‌లో పేమెంట్ స్టార్టప్ కంపెనీలకు ఇదో పెద్ద వరం. వ్యాపారాల నిర్వహణలో ఇతర అంతర్జాతీయ సంస్థలతో సమాన అవకాశాలు లభిస్తాయి. ఆర్బీఐ వేచి చూసే ధోరణి డేటా లోకలైజేషన్ అంశంలో పలు గ్లోబల్ పేమెంట్ కంపెనీలు గడువు పెంచాలని కోరినా ఆర్బీఐ నిరాకరించింది. 6 నెలల సమయం ఇచ్చామని, ఇక ఇచ్చే పని లేదని తేల్చి చెప్పింది. భారత్‌లో ఇప్పటికీ సెంటర్లు ఏర్పాటు చేయని కంపెనీలు క్లౌడ్ విధానం ద్వారా సమాచారాన్ని నిల్వ చేసి, అతి త్వరలోనే భారత్ సెంటర్లకి మార్చాలని సూచించింది. అంతవరకు కంపెనీలపై వేచి చూసే ధోరణి అవలంబించాలని నిర్ణయించింది. -
512జీబీ స్టోరేజ్‌తో ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్
స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమదైన ఫీచర్లతో కస్టమర్లను మరింత ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా చైనాకు చెందిన హువావే కంపెనీ పి20 పేరుతో ఓ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎత్తున్న అంచనాలు వెలువడుతున్నాయి. ట్రిపుల్ రియర్ కెమెరాతో రాబోతుందని ఇప్పటికే కొన్ని రిపోర్టులు పేర్కొనగా.. తాజాగా మరో ఆసక్తికర వార్త ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 512 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉంటుందని తెలుస్తోంది. ఈ స్థాయి స్టోరేజీతో వస్తున్న తొలి ఫోన్ ఇదే. ఇంత వరకు ఈ కంపెనీ గరిష్టంగా 250 జీబీ సామర్థ్యంతోనే స్మార్ట్ఫోన్లు లాంచ్ అవుతూ ఉన్నాయి. 512 జీబీ సామర్థ్యం అంటే కంప్యూటర్ తో సమానం. 6జీబీ ర్యామ్ ఇందులో ఉంటుందని టీనా లిస్టింగ్ రివీల్ చేసింది. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఒకవేళ ఈ స్థాయి స్టోరేజీ సామర్థ్యం, ఫీచర్లతో పి20ని కంపెనీ మార్కెట్లోకి తీసుకొస్తే.. మిగిలిన ప్రధాన కంపెనీలు సైతం ఈ తరహా ఫోన్లను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 512జీబీ స్టోరేజ్‌తో యూజర్లు 4కే వీడియోలను, మూవీలను, బుక్స్‌ను, మ్యూజిక్‌ను రికార్డు చేసుకోవచ్చు. -
ముక్కిపోతున్నాయ్!
రాజాం:ప్రభుత్వ బియ్యానికి పురుగులు పడుతున్నాయి. ఒకటి కాదు రెండు ఏకంగా లక్షల బియ్యం ముక్కిమూలుగుతోంది. అటు అధికారులు, ఇటు పాలకులకు కూడా పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రంగా మారుతోంది. తమ వద్ద ఉన్న బియ్యాన్ని అధికారులు తీసుకెళ్లకపోవడంతో బియ్యం పాడవుతుండగా, ఆడాల్సిన ధాన్యం కూడా మిల్లర్ల వద్ద ఆరుబయట ఉండిపోయి పాడయ్యే దుస్థితి. ప్రభుత్వ లెక్కలు ఇవే వాస్తవంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ 2.35 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్ల వద్ద నుంచి సేకరించినట్లు రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన వాటిలో కేవలం 2.95 లక్షల టన్నుల బియ్యం మాత్రమే నిల్వ ఉందని అంచనాలు చెబుతున్నాయి. వాస్తవంగా ఇవి 4.50 లక్షలు టన్నులు దాటి ఉంది. అయితే ఇవి గోదాంలు లేక, కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేక నిల్వఉండిపోయాయి. వీటిని అటు అధికారులతో పాటు ఇటు పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయం. భద్రపరిచే బాధ్యత మిల్లర్లదే జిల్లావ్యాప్తంగా పలు చోట్ల ధాన్యం మిల్లుల వద్ద బియ్యం నిల్వలు ఉన్న విషయం వాస్తవమే. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్ర ప్రభుత్వ విభాగంలో 2.35 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మరో 2.95 లక్షలు టన్నుల బియ్యాన్ని తీసుకోవా లి. ఇవి తీసుకునే వరకూ వీటిని జాగ్రత్త పరిచే బాధ్యత మిల్లర్లదే. –ఎస్.వెంకటేశ్వరరావు,సివిల్ సప్లయ్ డీఎం, శ్రీకాకుళం జిల్లాలో 4.50 లక్షల టన్నులు జిల్లావ్యాప్తంగా గత ఏడాది నవంబర్‌లో 302కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీటికి సంబంధించి 300 రైస్ మిల్లులో ధాన్యాన్ని సేకరించే కేంద్రాలు ఏర్పాటు చేశారు. సివిల్ సప్లయ్ కస్టమ్స్ మిల్లులుగా కేటాయించి కేవలం ధాన్యం తీసుకుని బియ్యాన్ని అందించే పని అప్పగించారు. ఒక క్వింటా ధాన్యానికి 65 కిలోల బియ్యాన్ని అందించాల్సి ఉంది. ఇలా అందించేందుకు ఒక్కో క్వింటాకు రూ.15 ప్రభుత్వం మిల్లరుకు అందిస్తుంది. ఇందులో రూ.2.50 జీఎస్టీ రూపంలో కట్ చేస్తారు. ఇప్పుడు ఈ మిల్లర్లుకు కొత్త సమస్య వచ్చింది. మిల్లులకు ధాన్యాన్ని అప్పగించిన ప్రభుత్వం.. బియ్యాన్ని తీసుకోవడంలేదు. మూడు నెలలుగా జిల్లా వ్యాప్తంగా 4.50 లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్ద ఉండిపోయింది. పురుగులు పడుతున్న బియ్యం మూడు నెలలుగా మిల్లర్ల వద్ద బియ్యం ఉండిపోవడంతో వీటికి పురుగులు పడుతోంది. ఎక్కడికక్కడే బియ్యం నిల్వలు మిల్లర్లు వద్ద పేరుకుపోయాయి. మిల్లర్ల వద్ద నుంచి ప్రభుత్వం బియ్యాన్ని తీసుకోకపోవడంతో పాటు మిల్లర్ల వద్ద భద్రపరిచేందుకు టార్పాలిన్లు కూడా ఇవ్వలేదు. ఫలితంగా బియ్యం పాడవుతోంది. తెల్లని నులిపురుగులతో పాటు నల్లని సుంకు పురుగులు పడుతున్నాయి. పలు మిల్లర్ల వద్ద 6 నుంచి పది వేల క్వింటాళ్ల వరకూ ధాన్యం నిల్వలు ఉండిపోయాయి. వీటిని నిల్వచేసేందుకు మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా అనుకున్న లెక్క ప్రకారం ప్రభుత్వానికి ఇవి ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో మిల్లరు నష్టపోయే పరిస్థితి దాపురించింది. -
మాంసం కొంటున్నారా?
పశ్చిమగోదావరి, నిడదవోలు: మాంసం వినియోగం ఇటీవలకాలంలో బాగా పెరుగుతోంది. ఇందులో అధికంగా మాంసకృత్తులు, విటమిన్లు, కొవ్వు పదార్థాలు లభిస్తాయి. దీంతో దాదాపుగా ప్రతి ఇంట్లో మాంసం తప్పనిసరిగా వాడుతున్నారు. ఇక ఆదివారాలైతే సరేసరి. ముక్కలేనిదే ముద్ద దిగని వారు చాలామందే ఉంటారు. అయితే మాంసం ప్రియులు కొనుగోలు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వ మాంసం తింటే వ్యాధుల బారినపడే అవకాశం ఉందని నిడదవోలు పశు సంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామకోటేశ్వరరావు హెచ్చరిస్తున్నారు. మాంసం నాణ్యతను, మాంసం నిల్వ అయితే కలిగే మార్పులను గమనించి కొనుగోలు చేయాలంటున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... రంగు, రుచి, మెత్తదనం, వాసన, నీటిని పీల్చే గుణాన్ని బట్టి మాంసం నాణ్యతను నిర్ధారించవచ్చును. సాధారణంగా మాంసం ఎరుపు రంగులో ఉంటుంది. గొడ్డు మాంసం ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. గొర్రె, మేక మాంసం మధ్యస్థ ఎరుపులోను, పంది మాంసం తెలుపు రంగులో ఉంటుంది. చిన్న వయసు ఉన్న పశుపు మాంసంతో పోలిస్తే పెద్ద వయసు ఉన్న పసుపు మాంసం ఎక్కువ ఎరుపు రంగులో ఉంటుంది. నిల్వ ఉంచిన మాంసానికి నీటిని పీల్చుకునే గుణం తక్కువ. మెత్తదనం అనేది కండరాలను కలిపే కణజాలం వల్ల కలుగుతుంది. చిన్న వయసు పశువులతో పోలిస్తే పెద్ద వయసు ఉన్న పశువుల్లో ఈ కణజాలం తక్కువగా ఉండి మాంసం గట్టిగా ఉంటుంది. ప్రతి జంతువు మాంసానికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. దానిని బట్టి మాంసాన్ని గుర్తించవచ్చు. మాంసం నిల్వ ఉంటే కలిగే మార్పులు ♦ మాంసాన్ని సక్రమంగా నిల్వ చేయకుంటే కొన్ని మార్పులు జరిగి పాడైపోతుంది. సూక్ష్మజీవులు, శిలీంధ్రాల మూలంగా మాంసంలోని కొవ్వులు, మాంసకృత్తులు విచ్ఛిన్నమై కొన్ని మార్పులు జరుగుతాయి. ♦ సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు జరిపే చర్య వల్ల బ్యుటరిక్, ప్రొపియోనిక్ ఏర్పడి మాంసానికి చెడు వాసన కలుగుతుంది. ♦ నిల్వ మూలంగా సూక్ష్మజీవులు స్రవించే రంగుల వల్ల మాంసం ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోకి మారుతుంది. ♦ పూడోమోనాస్, స్టెఫ్టోకోకస్, లాక్టో బాసిల్లస్ వంటి బ్యాక్టీరియాల వల్ల మాంసంపై పలుచని జిగురు వంటి పొర ఏర్పడుతుంది. ♦ మాంసంపైన శిలీంధ్రాల వల్ల నలుపు, తెలపు, ఆకుపచ్చని రంగుమచ్చలు ఏర్పడతాయి. ♦ మాంసంలో సల్ఫర్ పదార్థాలు ♦ విచ్ఛినమవడం వల్ల హైడ్రోజన్ సల్ఫేట్, ఇతర మార్పుల వల్ల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ♦ మాంసం పాడైనప్పుడు ఉత్పత్తి అయిన ఆమ్లాల వల్ల పుల్లగా తయారవుతుంది. ♦ నిల్వ మాంసంలో కొవ్వు పదార్థాలు విచ్ఛినం జరిగి ఒక రకమైన వాసన వస్తుంది. దీనిలే రేన్సీడ్ వాసన అంటారు. ♦ ప్రొటీన్లు విచ్ఛినం జరిగితే చేదు రుచి, చెడు వాసన కలుగుతుంది. ♦ నిల్వ మాంసం ఉపరితలంపై మెరుపు కనిపిస్తుంది. దీనినే ఫాస్ఫోరిసాన్నే అంటారు. ♦ కొన్నిసార్లు ఎముక దగ్గరి మాంసం పాడైపోతుంది. -
కిరోసిన్ ఆవిరవుతోంది
♦ పంపిణీ కాకుండా డీలర్ల వద్ద 3 లక్షల లీటర్ల నిల్వ ♦ జూన్ నెల నుంచి ఇదే పరిస్థితి ♦ ప్రమాద భయంతో రేషన్ డీలర్లు ప్రభుత్వ అర్ధంతర ఉత్తర్వులతో డీలర్ల వద్ద మూడు నెలలుగా కిరోసిన్ నిల్వ అలాగే ఉంటోంది. జూన్ నుంచి పొగ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికే డీలర్లకు సరఫరా అయిన కిరోసిన్ పంపిణీని ఆపేసింది. ఇది పక్క దారి పడుతున్నట్లు సమాచారం. మదనపల్లె రూరల్ : జూన్ నెలలో జిల్లా వ్యాప్తంగా చౌక దుకాణ డీలర్లకు కిరో సిన్ సరఫరా చేశారు. అంతలోనే పొగ రహిత రాష్ట్రంగా ప్రభుత్వం ప్రకటిం చింది. దీంతో కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ ఆగిపోయింది. ప్రభుత్వం పంపిణీ చేసిన కిరోసిన్‌ను ఏం చేయా లో తెలియక డీలర్లు సతమతమవుతున్నారు. డీలర్ల వద్ద నిల్వ ఉన్న కిరోసిన్ ఇటు లబ్ధి్దదారులకు అందక, అటు ప్రభుత్వం వెనక్కు తీసుకోకపోవడంతో డీలర్లకు దిక్కుతోచడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల్లో బియ్యం, కిరోసిన్, పంచదార, గోధు మ, కంది పప్పు, ఉప్పు, చింతపండు పంపిణీని ప్రారంభించారు. కిరణ్‌కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కిలో బియ్యం రూపాయికి ఇస్తూ పంచదార, కిరోసిన్‌తో పాటు తొమ్మిదిరకాల వస్తువులను పంపిణీ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మొదట్లో వీటిని కొనసాగించినా, అక్రమాలు జరుగుతున్నాయంటూ ఈ–పోస్ విధా నం అమలులోకి తెచ్చి రేషన్ దుకా ణాల్లో ఒక్కొక్క సరుకుకు కోత విధిం చింది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం చక్కెరపై ఇస్తున్న రాయితీని ఎత్తేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా ఇస్తున్న చక్కెర పంపిణీని నిలి పేసింది. ప్రస్తుతం చౌక దుకాణాల్లో బియ్యం, గోధుమపిండి మాత్రమే సరఫరా చేస్తున్నారు. జూన్ వరకు తెలుపు రంగు రేషన్‌కార్డులు ఉన్న గ్యాస్ కనెక్షన్ లేని వారికి 2లీటర్లు, ఉన్న వారికి లీట ర్లు పంపిణీ చేసే వారు. ఉన్నట్లుండి కిరోసిన్ పంపిణీ నిలిపేసిన ప్రభుత్వం డీలర్ల వద్ద ఉన్న కిరోసిన్‌ను ఏంచేయాలనే దానిపై మార్గదర్శకాలు ఇవ్వలేదు. లక్షలాది లీటర్లు డీలర్ల వద్దే నిల్వ ఉండిపోయాయి. కొన్నిచోట్ల ప్రభుత్వం తిరి గి తీసుకోదన్న ధీమాతో కొందరు బ్లాక్‌మార్కెట్‌కు తరలించినట్లు సమాచా రం. కిరోసిన్‌ను తమకే పంపిణీ చేయా లని లబ్ధిదారులు కోరుతున్నారు. -
ఇసుక మస్కా...
మూతపడిన ర్యాంపులు గడువుకు ముందే జాగ్రత్తపడిన ఇసుకాసురులు భారీగా పోగేసుకున్న ఇసుక నిల్వలు వదరలతో స్తంభించిన తవ్వకాలు నిల్వచేసి పదిరెట్ల హెచ్చు ధరలకు విక్రయాలు ఉచిత ఇసుక విధానం అభాసుపాలు అమలాపురం : ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం మరోసారి అభాసుపాలైంది. గోదావరికి వరద పోటు తగిలిందో లేదో, అక్రమార్కులు చెలిరేగిపోతున్నారు. ఒకవైపు ప్రధాన ర్యాంపుల గడువు పూర్తికావడం.. వరద వల్ల తవ్వకాలు సాగకపోవడంతో...అడ్డదారిలో నిల్వ చేసిన ఇసుక ధరను ఏకంగా పదిరెట్లు పెంచి సామాన్యులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. గోదావరికి వరదలను ఎదుర్కొనేందుకు కేవలం నెల రోజుల ముందు ఇరిగేషన్ అధికారులు సన్నహాలు చేస్తుంటారు. కాని ఇసుక అక్రమార్కులు మాత్రం ఇందుకు రెండు, మూడు నెలల ముందునుంచే వరద సమయంలో ఇసుక విక్రయాలకు భారీగా నిల్వలు చేయడం సర్వసాధారణం. ప్రభుత్వం ఉచిత ఇసుక అమలులోకి తెచ్చిన తరువాత కూడా నిల్వలు చేయడం మానలేదు. ప్రభుత్వ ఆధీనంలో ఇసుక విక్రయాలు జరగడం లేదని, అధికార టీడీపీకి ప్రజాప్రతినిధుల అండదండలతో వారి అనుచరులే ర్యాంపుల్లో పాగా వేసి విక్రయాలు చేస్తున్నారనడానికి ఈ నిల్వలు చూస్తేనే అర్థమవుతోంది. గోదావరికి వరద పోటు తగలకముందే ర్యాంపుల సమీపంలోని రహస్య ప్రాంతాల్లోను, ఆయా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకన్నట్టుగా ఇసుకను భారీ ఎత్తున నిల్వచేశారు. ఎప్పుడైతే తవ్వకాలు దాదాపుగా నిలిచిపోయాయో.. అక్రమార్కులు ఇసుక ధరలను ఇష్టానుసారం పెంచేశారు. ఉచిత ఇసుక వల్ల ర్యాంపుల నిర్వహణ, తవ్వకాలకు యూనిట్‌కు రూ.125 చొప్పున ధర నిర్ణయించారు. ర్యాంపుల్లో యూనిట్‌కు రూ.500 చొప్పున అనధికారికంగా వసూళ్లు జరిగేవి. ఎప్పుడైతే తవ్వకాలు నిలిచిపోయాయో అనధికార నిల్వల వద్ద యూనిట్ ధర రూ.2 వేలు చేసి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశారు. పనిలో పనిగా లారీ రవాణా చార్జీలను సైతం పెంచేశారు. ఆత్రేయపురం నుంచి అమలాపురం ఒకప్పుడు మూడు యూనిట్ల ఇసుక రవాణాకు రూ.4 వేలు వరకు అవగా, ఇప్పుడది రూ.9 వేలు పలుకుతోంది. జిల్లాలో సీతానగరం మండలం ముగ్గుళ్ల, వంగలపూడి, కపిలేశ్వరపురం, వేమగిరి, జొన్నాడ వంటి ర్యాంపులు గడువు ముగియడంతో తవ్వకాలు నిలిపివేశారు. మిగిలిన ర్యాంపుల్లో వరదల వల్ల తవ్వకాలు ఆగాయి. జొన్నాడకు తిరిగి అనుమతి వచ్చినా వరదల వల్ల తవ్వకాలు చేసే అవకాశం లేదు. ఇవన్నీ ముందే ఊహించిన అక్రమార్కులు పలు ప్రాంతాల్లో ఇసుక నిల్వలు చేశారు. నిర్మాణాల కోసమంటూ 20 నుంచి 50 యూనిట్ల చొప్పున ఇసుక నిల్వ చేశారు. కొత్తపేట, పి.గన్నవరం, రాజమహేంద్రవరం నగరం, రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇసుక నిల్వలున్నాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఎక్కువుగా ఇసుక నిల్వలున్నాయి. అధికారులు దాడులు చేసినా ఇళ్ల నిర్మాణాల కోసమంటూ అక్రమార్కులు చెప్పుకునేందుకు వీలుచిక్కుతోంది. ఇటీవల ఆత్రేయపురం మండలం అంకంపాలెం, రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు, రావులపాలెం శివారు గౌతమీ ఏటిగట్టు వద్ద ఇసుక నిల్వలను అధికారులు సీజ్ చేశారు. అయితే రెండు మండలాల్లో ఇంతకు పదిరెట్లు ఇసుక నిల్వలున్నట్టు అంచనా. ఇప్పటికైనా అధికారులు అక్రమ ఇసుక నిల్వలపై దాడులు చేసి వాటిని తమకు తక్కువ ధరకు అందించాలని సామాన్యులు కోరుతున్నారు. -
చలచల్లగా మోసం
– కోట్ల రుణం ఎగవేతతో కదిలిన బ్యాంకు అధికారులు - కోల్డ్ స్టోరేజీలో పని చేస్తున్న కూలీల పేరుతో రుణాలు మంజూరు - పరిశీలనలో వేరుశెనగ తొక్కలు, చెక్కపొట్టు ప్రత్యక్షం - వాటినే వ్యవసాయ ఉత్పత్తులుగా నమ్మించి రుణం ప్రత్తిపాడు : రైతుల పాలిట కల్ప వృక్షాలుగా ఉండాల్సిన కోల్డ్ స్టోరేజీలు సంబంధిత యజమానులకు కాసులు కురిపించే కేంద్రాలుగా మారుతున్నాయి. అక్కడ పని చేసే కూలీలనే రైతులుగా మార్చేసి ... వారే తమ స్టోరేజీల్లో పంటలు భద్ర పరుచుకున్నారని వస్తోత్పత్తులను చూపించి బ్యాంకులకు బురిడీ కొట్టి కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. ఇందుకు కొంతమంది బ్యాంకు సిబ్బంది కూడా సహకరించడంతో మోసం మరింత సులవవుతోంది. ఈ తరహాలోని కోల్డ్ స్టోరేజీ మోసం మరొకటి జిల్లాలో బయటపడింది. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి కోట్ల రూపాయల రుణం పొంది ఎగనామం పెట్టిన ప్రత్తిపాడు జాతీయ రహదారి పక్కన ఉన్న ధర్మవరం సాయిభ్య అగ్రి కోల్డ్ స్టోరేజీ ఆస్తులను శుక్రవారం సాయంత్రం కాకినాడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ధర్మవరం జాతీయ రహదారి సమీపాన రెండు దశాబ్దాల క్రితం కంచుస్తభం వెంకట సత్య ప్రసాద్ సాయిభ్య ఆగ్రి కోల్డు స్టోరేజీని నెలకొల్పారు. కాకినాడ దేనా బ్యాంకు నుంచి రూ. 28 కోట్లు బినామీ రుణాలు పొంది, ఎగవేయడంతో దేనా బ్యాంక్ అధికారులు కంచుస్తంభం వెంకట సత్య ప్రసాద్‌తోపాటు మరో 111 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్టోరేజీలో రైతులు అందజేసే చింతపండు, ఎర్ర మిరప, మామిడి తాండ్ర, పత్తి విత్తనాలు తదితర వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయాలి. కానీ అవేవీ నిల్వ చేయకుండానే ఉన్నట్టుగా లెక్కలు చూపించి భారీగా రుణాలు తీసుకోవడంతో అసలుకే ఎసరు వచ్చింది. రైతుల పేరుతో తీసుకున్న రుణాలకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులను బ్యాంకు అధికారలు పరిశీలించగా ఖాళీ పెట్టెల్లో వేరుశెనగ తొక్కలు, చెక్క పొట్టుతో ఉన్నాయి. రుణం పొందిన బినామీ రైతులంతా కోల్డు స్టోరేజీలో పనిచేస్తున్న కూలీలే. దీనిపై మహబూబ్ నగర్ జిల్లా కొత్త వనపర్తి మండలానికి చెందిన దేనా బ్యాంకు కాకినాడ బ్రాంచి మేనేజర్ గత ఫిబ్రవరి నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్తిపాడు సీఐ అద్దంకి శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్టోరేజీ యజమాని సత్య ప్రసాద్ పరారీలోనే ఉన్నారు. -
కోర్టు కేసుతో నిలిచిన కోల్డ్ స్టోరేజీ స్వాధీనం
ప్రత్తిపాడు : కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ధర్మవరంలోని హైవేపై ఉన్న సాయిభ్య అగ్రి కోల్డ్ స్టోరేజీని స్వాధీనం చేసుకునేందుకు కాకినాడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులు మంగళవారం తరలివచ్చారు. అయితే బినామీ రుణాలపై కేసు నడుస్తున్నందున న్యాయ సలహా తీసుకున్న తరువాత అప్పగిస్తామని తహసీల్దార్ కె.నాగమల్లేశ్వరరావు చెప్పడంతో బ్యాంకు అధికారులు కోల్డ్ స్టోరేజీని పరిశీలించి వెళ్లారు. ధర్మవరం సాయిభ్య అగ్రి కోల్డ్ స్టోరేజీ యజమాని కంచుస్తంభం వెంకట సత్యప్రసాద్.. స్టోరేజీలోని కార్మికులను రైతులుగా చూపించి ఈ బ్యాంకు నుంచి రూ.27.58 కోట్లు స్వాహా చేసిన విషయం విదితమే. దేనా బ్యాంకుకు రుణాల చెల్లింపులు నిలిచిపోవడంతో బ్యాంకు అధికారులు స్టోరేజీని పరిశీలించినపుడు రైతుల వ్యవసాయ ఉత్పత్తులు లేకపోవడంతో ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో 111 మంది రైతులపై (బినామీలపై) కేసు నమోదైంది. దీంతో కోల్డ్ స్టోరేజీని సీజ్ చేశారు కాకినాడ సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి పది మంది పేర్లతో రూ.పది లక్షల రుణం పొందిన కంచుస్థంబం వెంకట సత్యప్రసాద్ ఐదుగురు రుణాల చెల్లించి మరో ఐదుగురి రుణాలు చెల్లించలేదని బ్యాంకు సీనియర్ మేనేజర్ రాజేశ్వరరావు తెలిపారు. ఇదిలాఉండగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, కాకినాడ సూర్యారావు పేట బ్రాంచి నుంచి కూడా ఈ సంస్థల పేరుతో రుణం పొందారు. ఈ బ్యాంకుకు సుమారు రూ.22.38 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2014 జనవరిలో బ్యాంకు డిమాండ్ నోటీస్ జారీజేసింది. సంస్థ స్పందించకపోవడంతో బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయించారు. స్టోరేజి ఆస్తులతో పాటు తాళ్లరేవులోని ఐస్ ప్యాక్టరీని ఐఓబీకి అప్పగించాలంటూ కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, స్టోరేజీని స్వాధీనం చేయమంటూ ఐఓబీ విశాఖ రీజియన్ చీఫ్ మేనేజర్ బి.హన్సాద, కాకినాడ బ్రాంచ్ మేనేజర్ బి.అప్పలరాజు, రికవరీ ఆఫీసర్ రామాంజనేయులు తదితరులు తహసీల్దార్‌ను కలిశారు. -
ఇంటిప్స్
పప్పులకు పురుగు పట్టకుండా ఉండాలంటే... పప్పులు, తృణ ధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో కొన్ని వేపాకులను పెడితే చాలు. వంట చేసేటప్పుడు స్టవ్ మీద పడిన మరకలు అంత సులువుగా పోవు. అలాంటప్పుడు పెద్ద సైజు టొమాటో ముక్కను తీసుకొని దాన్ని ఉప్పులో ముంచి మరకలపై రుద్దాలి. ఇలా చేస్తే ఎలాంటి మరకలైనా త్వరగా పోతాయి. అంతే కాకుండా ఎన్నేళ్ల స్టవ్ అయినా కొత్తదానిలా మిలమిలా మెరుస్తుంది. కాఫీ మరింత రుచిగా ఉండాలంటే, డికాషిన్‌లో కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. -
మరో మూడు ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు
అమెజాన్ డెరైక్టర్ నూర్ పటేల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ ఏడాది చివరి నాటికి మరో మూడు ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను (ఎఫ్ సీ) భారత్‌లో ఏర్పాటు చేస్తోంది. దీంతో ఎఫ్సీల సంఖ్య 27కు పెరగనుంది. ప్రస్తుతం తెలంగాణతోసహా 10 రాష్ట్రాల్లో ఎఫ్‌సీలను కంపెనీ నిర్వహిస్తోంది. ఉత్పత్తులను నిల్వ, డెలివరీని ఈ కేంద్రాల నుంచి చేపడుతోంది. కొత్త సెంటర్లతో కలిపి నిల్వ సామర్థ్యం 7.5 మిలియన్ క్యూబిక్ అడుగులకు చేరుతుందని అమెజాన్ కేటగిరీ మేనేజ్మెంట్ డెరైక్టర్ నూర్ పటేల్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. అమెజాన్ పాంట్రీ సర్వీసులను దేశంలో తొలుతగా హైదరాబాద్‌లో ప్రారంభించామన్నారు. నిత్యావసర సరుకులను ఇక నుంచి కస్టమర్లు ఆర్డరు ఇవ్వొచ్చని చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి 65 శాతం ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు. 1.2 లక్షల మంది విక్రేతలు 8 కోట్లకుపైగా ఉత్పత్తులను అమెజాన్ ద్వారా అమ్ముతున్నారని వెల్లడించారు. హైదరాబాద్‌లో 5 వేల మంది విక్రేతలు ఉన్నారు. 29 వేల మంది సెల్లర్లు కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. -
సమగ్ర సోమశిల.. కలేనా!
సోమశిల: సోమశిల జలాశయంలో 78 టీఎంసీల పూర్తి సామర్థ్యం మేరకు నీటి నిల్వ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. సోమశిల జలాశయాన్ని 1982 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో 1975లో అప్పటి ప్రభుత్వం పనులను ప్రారంభించింది. పనుల్లో అలసత్వం కారణంగా 1988లో జలాశయం తొలి దశ (స్పిల్‌వే విభాగం) పనులు పూర్తయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ జలాశయాన్ని జాతికి అంకితం చేశారు. అప్పట్లో జలాశయం సామర్థ్యం 37 టీఎంసీలకు పరిమితం చేశారు. ఇందులో డెల్టా పరిధిలో 1.75 లక్షల ఎకరాలు, నాన్ డెల్టా పరిధిలోని ఉత్తర, దక్షిణ కాలువల పరిధిలో 10 వేల లోపు ఎకరాలకు సాగునీరు పంపిణీ జరిగేది. అప్పటి నుంచి 2000 సంవత్సరం వరకు ఒక్క టీఎంసీ కెపాసిటీ కూడా పెరగలేదు. పెంచే విధంగా అప్పటి ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. అప్పట్లో అనూహ్యంగా భారీ వరదలు రావడంతో జలాశయం 37 టీఎంసీలకు దాటింది. జలాశయం లోతట్టు ప్రాంతాల్లోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. బాధితులకు పరిహారం చెల్లించకుండానే జలాశయం సామర్థ్యం 42 టీఎంసీలకు పెంచారు. అనంతరం ఆయా గ్రామాలకు అప్పటి ప్రభుత్వం కొంత మేర పరిహారం చెల్లించి ఖాళీ చేయించారు. పరిహాసంగా పరిహారం పంపిణీ సమగ్ర సోమశిలకు అప్పటి సర్వే ప్రకారం వైఎస్సార్ జిల్లాలో 330 కాంటూర్ పరిధిలో 105 గ్రామాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ 105 గ్రామాలకు పరిహారం చెల్లించి తొలిసారిగా రికార్డు స్థాయిలో జలాశయంలో 71 టీఎంసీల నీటి నిల్వ చేశారు. దీంతో 330 కాంటూర్‌లో గుర్తించిన గ్రామాల కంటే అదనంగా మరిన్ని గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ఊహించని పరిణామంతో బెంగళూరు సర్వే కంపెనీతో మళ్లీ కాంటూరు సర్వే చేయించారు. ఈ సర్వేలో అట్లూరు మండలంలోని చంతువారి పల్లి, వరికుంట, వరి కుంట దళితవాడ ముంపునకు గురవుతున్నట్లు అధికారులు గర్తించారు. వీటికి పరి హారం చెల్లించేందుకు ప్రభుత్వం తీర్మానిం చింది. గతంలో మాదిరిగా ఈ ప్రాంతాల్లో కూడా వందలాది అక్రమ నిర్మాణాలు వెలి శాయి. ముంపు వాసుల పరిస్థితి ముందే గమనించిన ప్రభుత్వం ఆయా గ్రామాల్లో అప్పటి వరకు ఉన్న పరిస్థితిని వీడియో ద్వారా చిత్రీకరణ చేసింది. నాటికి నేటికి ఇళ్ల నిర్మాణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోవడంతో అధికారులు, గ్రామస్తుల మధ్య పరి హారం పంపిణీ వివాదాస్పదమైంది. అన్ని ఇళ్లకు పరిహారం చెల్లించలేదని వారు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అధికారులు మిన్నకుండిపోయారు. కోర్టు తీర్పు ఆధారంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కోర్టు తీర్పు వెలువడే వరకు సోమశిల పూర్తి సామర్థం నెరవేరదన్నది అక్షర సత్యం. వైఎస్సార్ హయాంలోనే 73 టీఎంసీలకు పెంపు 2004లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జల ప్రాజెక్ట్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో రాష్ట్రంలో పలు ప్రాజెక్ట్‌లు, జలాశయాల రూపురేఖలు మారిపోయాయి. అందులో సోమశిల దశ తిరిగింది. వైఎస్సార్ సీఎం అయిన ఏడాది లోపే 2005 నాటికి ముంపు బాధితులకు పరిహారం అందించి జలాశయాన్ని 50 టీఎంసీల సార్థ్యానికి పెంచారు. అనంతరం అంచెలంచెలుగా జలాశయం నీటి నిల్వ సామర్థ్యాన్ని 2009 నాటికి 70 టీఎంసీలకు పెరిగింది. 2010లో 73 టీఎంసీల నీరు నిల్వ చేయగలిగారు. అనంతరం పాలకులు ప్రాజెక్టు నిల్వ సామర్థ్యాన్ని పెంపునకు నిధులు కేటాయింపునకు చర్యలు తీసుకోకపోవడంతో సమగ్ర సోమశిల పగటి కలగానే మిగలనుందని రైతాంగం ఆందోళన చెందుతుంది. కోర్టు పరిశీలనలో ఉంది సోమశిల జలాశయం ముంపు గ్రామాల్లో పరిహారం విషయమై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. బాధితులు హైకోర్టుకు వెళ్లడంతో సమస్య జఠిలమైంది. కోర్టులో నడుస్తున్న ఈ వ్యవహారం పరిష్కారమైతే గానీ సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యం (78 టీఎంసీల) నీటి నిల్వకు అవకాశం లేదు. – దేశ్ నాయక్, ఈఈ, సోమశిల -
శ్రీశైలం డ్యామ్‌లో 29 టీఎంసీల నీరు నిల్వ
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం నీలం సాగర్ డ్యామ్‌లో సోమవారం సాయంత్రానికి 29.2457 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. జూరాల నుంచి విద్యుత్ ఉత్పాదన అనంతరం నీరు విడుదలవుతుండడంతో వరద నీరు వచ్చి చేరుతోంది. గడిచిన 24 గంటల్లో 31,692 క్యూసెక్కుల నీరు చేరుకుంది. సోమవారం ఒక జనరేటర్ ద్వారా జూరాల నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. డ్యాం నీటిమట్టం 800.50 అడుగులకు చేరుకుంది. -
నెయ్యి ట్యాంకర్లపై నిర్లక్ష్యం
ఆరు నెలల క్రితం తిరుమలకు తీసుకొచ్చిన అధునాతన ట్యాంకులు వినియోగంలోకి తేవడంలో తీవ్ర జాప్యం ట్యాంకులు ఏర్పాటైతే నాణ్యమైన నెయ్యి నిల్వకు అవకాశం తిరుమల: నెయ్యి నిల్వకోసం కొత్తగా తెప్పించిన ట్యాంకుల వినియోగంపై టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నెయ్యి నిల్వ కోసం ఆరు నెలల క్రితం అధునాతన ట్యాంకర్లు తిరుమలకు వచ్చాయి. వాటిని వినియోగంలోకి తేవడంలో టీటీడీ తీవ్ర జాప్యం చేస్తోంది. దీనిప్రభావం లడ్డూల తయారీ సంఖ్య, నాణ్యతపై పడుతున్నా సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొండకు ట్యాంకర్లతోనే నెయ్యి సరఫరా తిరుమలేశునికి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ప్రతిరోజూ మూడు లక్షల లడ్డూలు తయారుచేస్తోంది. లడ్డూతోపాటు ఆలయ అవసరాల కోసం సుమారు 10 నుంచి 12 వేల కిలోల నెయ్యి వాడుతోంది. ఈ మొత్తం నెయ్యి నిల్వ కోసం 8 భారీ స్థాయి ట్యాంకులు తెప్పించి శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో లడ్డూ కౌంటర్ పక్కనే ఉంచారు. ఇందులో 4 ట్యాంకుల్లో ఒక్కో దానిలో 5వేల కిలోలు, మరో నాలుగింటిలో ఒక్కోదానిలో 4,500 కిలోల నెయ్యి నిల్వచేసుకోవచ్చు. ప్రస్తుతం టెండరుదారు నుంచి తిరుపతి మార్కెటింగ్ గోడౌన్‌కు ట్యాంకర్ల ద్వారా చేరిన నెయ్యిని తిరుమలకు తరలిస్తారు. రెండు రోజులకోసారి సుమారు 12 నుంచి 15వేల కిలోల సామర్థ్యం గల వాహన ట్యాంకుల ద్వారా నెయ్యిని లడ్డూ కేంద్రంలోని ట్యాంకులకు చేరవేసి నిల్వ చేస్తున్నారు. పెరుగుతున్న ఫిర్యాదులు భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా స్వీకరించే శ్రీవారి లడ్డూ విషయంలో పదేళ్లుగా ఫిర్యాదులు పెరిగాయి. మరోవైపు 3 లక్షల లడ్డూలు తయారు చేసినా సరిపోవటం లేదు. అయినప్పటికీ టీటీడీ లడ్డూ తయారి సంఖ్య కంటే వాటి నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. పాత ట్యాంకుల్లో ఎక్కువ రోజులు నెయ్యి నిల్వ ఉండడం వల్ల కూడా లడ్డూ నాణ్యతలో వ్యత్యాసం ఉందని నిపుణులు టీటీడీకి సూచించారు. పాత ట్యాంకులు అడ్డంగా (హారిజాంటల్) అమర్చి ఉండడం వల్ల నెయ్యి వాడిన తర్వాత వేడినీళ్లతో శుద్ధి చేసేందుకు ఇబ్బందులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. తిరుమల వాతావరణ పరిస్థితుల వల్ల శీతాకాలంలో నెయ్యి ట్యాంకుల్లోనే గడ్డక ట్టడం, వాటివల్ల వృథా ఎక్కువగా జరగడాన్ని వారు గుర్తించారు. దీన్ని టీటీడీ ఉన్నతాధికారులు సీనియస్‌గా పరిగణించారు. అధునాతన ట్యాంకులు ఏర్పాటు చేయాలని మూడేళ్లకు ముందు నిర్ణయించారు. ఇందులో భాగంగా ట్యాంకులు అడ్డంగా (హారిజాంటల్) కాకుండా నిలువుగా (వర్టికల్‌గా ఏర్పాటు..ట్యాంకులోని ప్రతి బొట్టినెయ్యిని వినియోగించుకోవటంతోపాటు వేడినీళ్లతో శుద్ధి చేయటానికి సులభంగా ఉండేలా) డిజైన్లు రూపొందించారు. ఆరు నెలల ముందు 12వేల కిలోల నెయ్యి నిల్వ ఉండేలా నాలుగు ట్యాంకులు తెప్పించారు. ఆ ట్యాంకులకే అదనంగా వేడినీళ్లతో శుద్ధి చేసే యంత్రాలు అమర్చారు. సివిల్ పనులతో కొత్త ట్యాంకుల ఏర్పాటులో జాప్యం కొత్త ట్యాంకులు ఏర్పాటు చేస్తేనే అవసరమైన లడ్డూల తయారీతోపాటు నాణ్యమైన నెయ్యి, ట్యాంకుల శుద్ధి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. అయితే, ఈ ట్యాంకులు అమర్చడంలో జాప్యం జరుగుతోంది. సివిల్ పనులు ఆలస్యం కావటం వల్లే ట్యాంకులు ఏర్పాటు చేయలేదనే వాదన వస్తోంది. పనుల విషయంలో జాప్యం ఉండకూడదని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు పదేపదే చెబుతున్నా సంబంధిత అధికారుల చెవికి ఎక్కడం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు కొత్త ట్యాంకుల ఏర్పాటును పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సివిల్ పనులతో కొత్త ట్యాంకుల ఏర్పాటులో జాప్యం కొత్త ట్యాంకులు ఏర్పాటు చేస్తేనే అవసరమైన లడ్డూల తయారీతోపాటు నాణ్యమైన నెయ్యి, ట్యాంకుల శుద్ధి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. అయితే, ఈ ట్యాంకులు అమర్చడంలో జాప్యం జరుగుతోంది. సివిల్ పనులు ఆలస్యం కావడం వల్లే ట్యాంకులు ఏర్పాటు చేయలేదనే వాదన వస్తోంది. పనుల విషయంలో జాప్యం ఉండకూడదని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు పదేపదే చెబుతున్నా సంబంధిత అధికారుల చెవికి ఎక్కడం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు కొత్త ట్యాంకుల ఏర్పాటును పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. -
పప్పులకు పురుగు పట్టకుండా ఉండాలంటే...
పప్పులు, తృణ ధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో కొన్ని వేపాకులను పెడితే చాలు. వంట చేసేటప్పుడు స్టవ్ మీద పడిన మరకలు అంత సులువుగా పోవు. అలాంటప్పుడు పెద్ద సైజు టొమాటో ముక్కను తీసుకొని దాన్ని ఉప్పులో ముంచి మరకలపై రుద్దాలి. ఇలా చేస్తే ఎలాంటి మరకలైనా త్వరగా పోతాయి. అంతే కాకుండా ఎన్నేళ్ల స్టవ్ అయినా కొత్తదానిలా మిలమిలా మెరుస్తుంది. పచ్చి బటానీలు ఉడికిస్తున్నప్పుడు వాటి రంగు మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఆ నీళ్లలో కొద్దిగా పంచదార వేస్తే చాలు.కాఫీ మరింత రుచిగా ఉండాలంటే, డికాషిన్‌లో కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. ఇంటిప్స్ -
అల్లం వెల్లుల్లి నిల్వ ఉండాలంటే..!
కిచెన్ కిటుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే... రుబ్బే ముందు వాటిని కాస్త దోరగా వేయించాలి. అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే... తరిగిన తర్వాత నీటిలో కాకుండా మజ్జిగలో వేయాలి. అలా చేయడం వల్ల కూర కూడా రుచిగా ఉంటుంది. బియ్యం, పప్పులు పురుగు పట్టకుండా ఉండాలంటే... కొన్ని పసుపు కొమ్ములు వేస్తే సరి. ఉల్లిపాయను సగం వాడాక, రెండో సగం నల్లగా అయి పాడవుతుంది. అలా కాకుండా ఉండాలంటే... ఆ బద్దకు వెన్న రాసి ఉంచాలి. పాలు ఎక్కువ మీగడ కట్టాలంటే... పాలు పోసిన గిన్నెను ముందు కాసేపు చల్లని నీటిలో ఉంచి, అప్పుడు కాచాలి. -
బియ్యం నిల్వల స్వాధీనం
సోమల: సోమల మండలం కందూరులోని ఒక రైస్ మిల్లులో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన 500 బస్తాల బియ్యాన్ని తహశీల్దార్ నరసింహులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తి ఉద యం తొమ్మిది గంటల సమయంలో కందూరులోని ఓ రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వ ఉంచుతున్నట్లు ఎస్ఐ చిన్నరెడ్డెప్పకు సమాచారం అందింది. వివరాలు సేకరించిన ఆయన తహశీల్దార్ నరసింహులు, సివిల్ సప్లై డీటీ పద్మావతి, డీటీ కోటిరెడ్డి, ఆర్ఐ కోదండరామయ్యను అక్కడికి పంపారు. తనిఖీలు నిర్వహించగా అనుమతి లేకుండా ఉంచిన 500 (25 కేజీలు బరువుగల) బస్తాలు బియ్యం, 50 బస్తాల వడ్లు స్వాధీ నం చేసుకున్నారు. రికార్డులు పరిశీలించగా రైస్ మిల్లుకు 2011వరకే బియ్యం విక్రయానికి అనుమతులున్నాయని, ఆపై రెన్యువల్ చేసుకోలేదని తేలింది. రైస్ మిల్లు యజమానిపై చర్యలకు సిఫారసు చేస్తూ తహశీల్దార్ నివేదిక పంపారు. స్వాధీ నం చేసుకున్న బియ్యాన్ని ప్రభుత్వ గోడౌన్‌కు తరలించారు. మూడు నెలల క్రితం కందూరు గ్రామ సమీపంలో 245 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. నిమ్మనపల్లె, కలికిరి, కలకడ, రాయచోటి, వాల్మీకిపురం, పీలేరు మండలాల నుంచి వ్యాపారులు రేషన్ బియ్యం కొనుగోలు చేసి, కందూరు, సోమల, పెద్ద ఉప్పరపల్లె ప్రాంతాల్లో పాలిష్ చేసి అమ్ముతున్నట్లు సమాచారం. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని అన్నారు. -
ఎర్రచందనం నిల్వకు.. అధునాతన గోదాములు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుం గలను నిల్వ చేసేందుకు తిరుపతిలో అధునాతన గోదాములు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఎర్రచందనం నాణ్యతను పరిరక్షించడంతో పాటు ఇంటిదొంగల బారిన పడకుండా చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆరు గోదాములు నిర్మించనున్నా రు. ఇందుకు రూ.21 కోట్లను మంజూరు చేస్తూ అటవీశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 351) జారీ చేశారు. శేషాచలం అడవుల నుంచి స్మగ్లర్లు ఎర్రచందనాన్ని కొల్లగొట్టి సరిహద్దులు దాటిస్తున్న విషయం విదితమే. పోలీసులు, అటవీశాఖ అధికారులు నిఘా వేసి, తనిఖీలు చేసి అడపాదడపా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న దుంగలను అటవీశాఖ కార్యాల యాల ఆవరణలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఎండకు ఎండి.. వానకు నానడం వల్ల ఎర్రచందనం దుంగల నాణ్యత తగ్గిపోతూ వస్తోంది. ఏ-గ్రేడ్ ఎర్రచందనం దుంగల నాణ్యత కూడా సీ-గ్రేడ్‌కు తగ్గిపోతోంది. అటవీశాఖలో ఇంటిదొంగలు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు అధునాతన గోదాములు నిర్మించి.. ఎర్రచందనాన్ని నిల్వ చేయాలని నిర్ణయించారు. 8 వేల టన్నుల ఎర్రచందనం నిల్వ సామర్థ్యంతో ఆరు గోదాములు నిర్మించాలని ప్రతిపాదించారు. ఆ గోదాముల ఆవరణలోనే సెంట్రల్ యాక్షన్ హాల్, అడ్మినిస్ట్రేటివ్, సర్వీసు, సెక్యూరిటీ బ్లాక్‌లు, సీసీ కెమెరాలతో కూడిన సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థ, సోలార్ లైటింగ్ సిస్టమ్, వేబ్రిడ్జి, అంతర్గత రహదారులు ఏర్పాటుచేయాలని సూచించారు. దీని వల్ల ఎర్రచందనం దుంగల నాణ్యతను కాపాడటంతో పాటు భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని ప్రతిపాదించారు. వీటిపై అటవీశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆమోదముద్ర వేశారు. తొలి దశలో 4,500 టన్నుల ఎర్రచందనం నిల్వ సామర్థ్యంతో గోదాముల నిర్మాణానికి రూ.పది కోట్లను.. రెండో దశలో 3,500 టన్నుల నిల్వ సామర్థ్యం, అధునాతన సదుపాయాలు కల్పించడానికి మరో రూ.11 కోట్లను విడుదల చేసేలా ఉత్తర్వులు జారీచేశారు. ఈ అధునాతన గోదాము నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించడంతో నెలాఖరులోగా టెండర్ నోటిఫికేషన్ జారీచేసేందుకు అటవీశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
దీపావళి సామగ్రి నిల్వ ఉంచిన వ్యాపారి అరెస్టు
గుంటూరు రూరల్: మిర్చియార్డు సమీపంలోని రెండు గోడౌన్లలో సుమారు రూ.4.88 కోట్ల విలువ చేసే దీపావళి మందుగుండు సామగ్రిని అనధికారికంగా నిల్వ చేసిన వ్యక్తిని రూరల్ ఎస్ఐ కృష్ణానందం మంగళవారం అరెస్ట్ చేశారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కన్నావారితోట నాలుగో లైను ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త మల్లిశెట్టి సుబ్బారావు దీపావళి మందుగుండు సామగ్రిని ఆదివారం మిర్చియార్డు సమీపంలోని శివరామకృష్ణ గోడౌన్లో నిల్వ ఉంచినట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. విజిలెన్స్ అధికారుల దాడుల్లో గోడౌన్లో అనధికారికంగా నిల్వ ఉంచిన రూ.2 కోట్లు విలువ చేసే దీపావళి సామగ్రిని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్ఐ కృష్ణానందానికి వచ్చిన సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి సౌత్ జోన్ డీఎస్పీ కె.నరసింహా నేతృత్వంలో మిర్చి యార్డు సమీపంలోని ఓ గోడౌన్లో అనధికారికంగా నిల్వ ఉంచిన రూ.2.88 కోట్లు విలువ చేసే దీపావళి సామగ్రిని సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన మల్లిశెట్టి సుబ్బారావును పోలీసులు అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విచారణానంతరం మంగళవాకం కేసు నమోదు చేసి సుబ్బారావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రూ.9.4 లక్షల బాణసంచా సీజ్ చెరుకుపల్లి: అనుమతులు లేకుండా గోడౌన్లో నిల్వ ఉంచిన రూ. 9.4 లక్షల విలువ చేసే దీపావళి మందుగుండు సామగ్రిని ఎస్ఐ పి.కిరణ్ మంగళవారం సీజ్ చేశారు. చెరుకుపల్లిలో దీపావళి మందుగుండు సామాన్ల విక్రయాలకు ఒక షాపునకు లెసైన్సు ఉండగా, అక్కడ విక్రయించకుండా వేరొక గోడౌన్లో స్టాకు నిల్వ చేసి విక్రయిస్తుండటంతో మంగళవారం తనిఖీలు నిర్వహించి షాపును సీజ్ చేశారు. షాపులో సుమారు రూ.9.4 లక్షలు విలువ చేసే మందుగుండు సామగ్రి నిల్వలు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో తాతా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఇలాగైతే ఎలా?
అనంతపురం అగ్రికల్చర్ : నేతల మద్య నీటి జగడాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేసి తమ ప్రాంతాలకు నీటిని తీసుకుపోవడానికి యత్నాలు చేస్తున్నారు. అయితే జిల్లా అవసరాలకు సరిపడా నీటిని తీసుకురావడం మానేసి జిల్లాకు వచ్చిన వాటిలో ముందు తమకంటే తమకంటూ పోటీ పడుతున్నారు. పీఏబీఆర్ కుడికాల్వ కింద ఉన్న 49 చెరువులు, చాగల్లు రిజర్వాయర్‌ను నింపాలంటే దాదాపు 9 టీఎంసీల నీరు అవసరం. ప్రస్తుతం పీఏబీఆర్‌లో 2.1 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. అయినప్పటికీ సోమవారం నుంచి పీఏబీఆర్ కుడి కాల్వకు నీటిని విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో చివరి చెరువులు నీటితో నింపడం సాధ్యమేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీఏబీఆర్ కుడికాల్వ ద్వారా రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లోని 49 చెరువులను నింపడానికి సోమవారం నుంచి నీటి విడుదల చేస్తున్నారు. 1.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ చెరువులను పూర్తిగా నింపాలంటే ప్రవాహ నష్టాలు కలుపుకుంటే దాదాపు 3.5 టీఎంసీలు అవసరం ఏర్పడుతాయని హెచ్చెల్సీ అధికారులు భావిస్తున్నారు. అయితే ముందున్న రైతులు సహకరిస్తేనే.. ఈ నీరు సరిపోతుంది. కాలువకు ఏమాత్రం అంతరాయాలు కల్పించినా ఈ నీటితో అన్ని చెరువులను నింపడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు పీఏబీఆర్ జలాశయంలో నీటి నిల్వ హెచ్చెల్సీ అధికారులను కలవరపెడుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 2.1 టీఎంసీలు మాత్రమే నీరు ఉంది. గతంలో 4 టీఎంసీలు నీరు నిల్వ ఉంచుకున్న తర్వాత కుడికాల్వకు నీటిని విడుదల చేయడం ఆనవాయితీగా ఉంది. దీని వలన చెరువులకు ఒకేసారి నీటిని విడుదల చేస్తే త్వరగా నింపడానికి సాధ్యమవుతుంది. అయితే ఈ ఏడాది నేతల మధ్య అభిప్రాయ బేధాలతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ముందుగానే నీటిని తీసుకుపోతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో హెచ్చెల్సీ కింద ఆయకట్టు పూర్తయిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విడుదల చేసిన జీవో ప్రకారం రివర్స్డైవర్షన్ పద్దతిలో పీఏబీఆర్‌కు వచ్చే అదనపు జలాలను రిజర్వాయర్‌లో నింపుకున్న తర్వాతనే చెరువులకు వదిలేవారు. కానీ అనవాయితీలను తలదన్ని ఈ ఏడాది నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 28వ తేదీన ముఖ్యమంత్రి తాడిపత్రి పర్యటన ఖరారైంది. ఆయన చేతుల మీదుగా చాగ ల్లు రిజర్వాయర్‌ను ప్రారంభించాలని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి భావిస్తున్నారు. ఆలోగా రిజర్వాయర్ నింపాలని హెచ్చెల్సీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకే సమయంలో అటు పంటలు, ఇటు కుడికాల్వ చెరువులకు నీటి విడుదల జరుగుతున్న సమయంలో చాగల్లు రిజర్వాయర్‌కు నీటి విడుదల ఎలా సాధ్యపడుతుందని హెచ్చెల్సీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 1.5 టీఎంసీల సామర్థ్యంతో పెన్నానదిపై చాగల్లు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తైఏళ్లు గడుస్తున్నా ఒక సారి కూడా ఆశించిన స్థాయిలో నీరు రాలేదు. ఈ ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తుండడంతో హెచ్చెల్సీ నార్త్ కెనాల్ 55వ కిలోమీటర్ నుంచి కాలువ తవ్వి.. దాని గుండా నీటిని వదలాలని భావిస్తున్నారు. అయితే కొత్త రిజార్వాయర్ కావడంతో ఇసుకలోకి ఎంత నీరు ఇంకుతుందో అర్థం కావడం లేదు. దీనికి తోడు సమయం కూడా దగ్గర పడుతుండడంతో హెచ్చెల్సీ అధికారులకు కత్తిమీద సాములా మారుతోంది. హంద్రీనీవాపైనే ఆశలు పీఏబీఆర్ చెరువులు, హెచ్చెల్సీ కింద ఆయకట్టు పంటలు గట్టెక్కాలంటే ఇప్పుడు అందరికీ హంద్రీ-నీవానే శరణ్యంగా మారుతోంది. ఎలాంటి కేటాయింపులు లేకుండా బ్యాక్ వాటర్‌ను మాత్రమే హంద్రీ-నీవా ద్వారా తీసుకుంటున్నాం. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గుముఖం పడితే జిల్లాలో అంతే సంగతులు. ఇప్పటికే రిజర్వాయర్‌లోకి వరద నీరు తగ్గుముఖం పట్టడడంతో రాయలసీమ అవసరాలను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తి అనంతరం నాగార్జున సాగర్‌కు వదులుతున్న నీటిని నిలుపుదల చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. ఒకవేళ నీటిని తీసుకోవడానికి ఇబ్బందులు కలిగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందనే ఆందోళనను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హంద్రీ-నీవా ద్వారా 800 క్యూసెక్కులు పీఏబీఆర్‌లోకి వస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా కుడికాల్వ చెరువులకు వదలాలని నిర్ణయించారు. చాగల్లు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయడానికి అటు పీఏబీఆర్లోనూ, మిడ్‌పెన్నార్ రిజర్వాయర్‌లోనూ అవసరమైనంత నీరు అందుబాటులో లేదు. పీఏబీఆర్ కుడికాల్వ ద్వారా చెరువులకు లేదాచాగల్లు రిజర్వాయర్ ఏదో ఒకదానికైతేనే నీటి విడుదల సాధ్యపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అన్ని ఒకేసారి అంటే రిజర్వాయర్లను ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో హంద్రీ-నీవాకు ఇబ్బందులు తలెత్తితే హెచ్చెల్సీ ఆయకట్టు కింద పంటల సాగుకు పెట్టుబడి రూపంలో రూ.కోట్లు ఖర్చు పెట్టిన అన్నదాతలు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవాంతరాలను తొలగిస్తున్నాం : మురళీనాథ్‌రెడ్డి, ఎస్ఈ, హెచ్చెల్సీ కుడికాల్వ ద్వారా 49 చెరువులను నింపడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. కాలువలో నీటి సరఫరాకు సమస్యగా మారిన నాలుగు కల్వర్టులను తొలగించాం. సోమవారం నుంచి 45 రోజుల పాటు చెరువులకు వదులుతాం. తొలి విడతలో 25 శాతం నింపుకుంటూ వెళ్లి రెండోవిడతలో పూర్తిగా నింపాలని ప్రణాళికలు తయారు చేశాం. చాగల్లు రిజర్వాయర్ నింపే యోచన కూడా ఉంది. -
అమ్మో నొప్పి!
సాక్షి, గుంటూరు: జిల్లాలో జీర్ణకోశ వ్యాధుల విజృంభణతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో 39 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు నిల్వ నీటిని ఉపయోగించడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నట్టు వైద్యులు నిర్ధారిస్తున్నారు. గుంటూరు నగరంతోపాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలు ఈ వ్యాధుల బారినపడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అధికశాతం మందిలో హెపటైటిస్-ఎ, ఈ,తోపాటు జియార్డియా ఫొటో జోవా ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే హెలికో బ్యాక్టర్ పైలోరీ అధికంగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికంటే అత్యంత ప్రమాదకరమైన ఎక్యూట్ గ్యాస్ట్రో ఎంటిరైటిస్ అనే పేరుతో పిలవబడే నోటిఫైడ్ డిసీజ్ కేసులు కూడా అక్కడక్కడా వస్తున్నట్లు తెలుస్తుంది. నోటిఫైడ్ డిసీజ్ కావడంతో బయటకు పొక్కితే వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల ద్వారా తలనొప్పులు వస్తాయనే ఉద్దేశంతో ప్రైవేట్ వైద్యశాలల వైద్యులు గప్‌చుప్‌గా చికిత్స చేసి పంపివేస్తున్నారు. అంతేకాకుండా యాంటీబయోటిక్ అసోసియేటెడ్ డయేరియా బాధితులు అధికమ య్యారు. యాంటీబయోటిక్స్ అధికంగా వాడటం వల్ల అనారోగ్యం పాలై దీని బారిన పడతారు. ఇది అధికంగా ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందిన రోగులకు వస్తుంది. కలుషిత నీరు, నూనెల వల్లే వ్యాధులు : వీధి బళ్లపై దొరికే పానీపూరి, పండ్ల రసాల్లో ఉపయోగించే ఐస్, హోటళ్లలో సాంబా ర్, రసం వంటి వాటిలో కలుషితమైన నీరు వాడుతున్నారనీ, వీటిని తాగడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నట్టు వైద్యాధికారులు గుర్తించారు. అంతేకాకుండా బిర్యాని తయారీలో కల్తీ నూనెలు వాడటంతో ఆ తరహా బిర్యానీలు తిని అనేక మంది వ్యాధుల బారిన పడుతున్నారు. కాచి చల్లార్చిన నీటిని వినియోగించడం, భోజనానికి ముందు చేతులు శుభ్ర పర్చు కోవడం చేస్తే రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు, నివారణా చర్యలు : పొట్టలో కుడిపక్క పైభాగాన నొప్పి రావడం, ఆకలి తగ్గిపోవడం, వాంతులు వంటి లక్ష ణాలు కనిపిస్తే హెపటైటిస్-ఎ, హెపటైటిస్-ఈ వ్యాధిగా భావించాలి. హెపటై టిస్-ఎ రాకుండా పిల్లలు, పెద్దలు నెలరోజుల్లో రెండు డోసుల వ్యాక్సిన్ వాడితే సరిపోతుంది. హెపటైటిస్-ఈకి మాత్రం వ్యాక్సిన్ లేదు. ముందు జాగ్రత్తగా నివారణ చర్యలు చేపట్టడమే. చివరకు ఇది అధికమై కామెర్లు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. జియార్డియా ఫొటోజోవా ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులకు కడుపులో ఉబ్బరం, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడతారు. కలుషిత నీటిని తాగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కాచి చల్లార్చిన నీటిని తాగితే నివారించవచ్చు. ఎక్యూట్ గ్యాస్ట్రో ఎంటిరైటిస్ అనే పేరుతో పిలవబడే నోటిఫైడ్ డిసీజ్ వస్తే కడుపు పైభాగాన నొప్పి, వాంతులు, రోజుకు 10 నుంచి 12 సార్లు నీళ్ల విరేచనాలతో బాధప డతారు. 3 సార్లు విరేచనాలకు ఒక లీటరు చొప్పున ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం ఇవ్వాల్సి ఉంటుంది. విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా ద్వారా ఇది వ్యాపిస్తుంది. హెలికో బ్యాక్టర్ పైలోరీ అనే వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. కడు పులో పేగుపూత వస్తుంది. డాక్టర్‌ను సంప్రదించి 14 రోజులపాటు మందులు వాడితే తగ్గిపోతుంది. జిల్లాలో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం... కలుషిత నీటిని తాగి ప్రజలు వ్యాధుల బారిన పడుతుంటే నివారణా చర్యలు చేపట్టాల్సిన వైద్య, ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీ శాఖల అధికారులు సమన్వయ లోపంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. \u3149?ట్చఛగ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుందని, నిల్వ ఉన్న నీటిని తాగాల్సి వస్తుందని ప్రజలు మండిపడుతున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఆశించిన స్థాయిలో అది జరగడం లేదు. వీధి బళ్లు, హోటళ్లలో ఉపయోగించే కల్తీలపై కూడా అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూడాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. -
ముక్కిపోయిన రేషన్ బియ్యం
తిరువూరు : తిరువూరు రాజుపేటలోని ఒక రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వచేసిన రేషన్‌బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పౌరసరఫరాల అధికారులు తదుపరి వాటి గురించి పట్టించుకోకపోవడంతో ముక్కిపోయి పనికిరాకుండా పోయాయి. 2012 జనవరిలో తిరువూరు ఎంఎల్ఎస్ పాయింటుకు చేరాల్సిన రేషన్‌బియ్యం బస్తాల లోడును నల్లబజారుకు తరలించడంలో భాగంగా రాజుపేట మిల్లులో నిల్వచేశారు. రేషన్‌బియ్యంతోపాటు స్వాధీనం చేసుకున్న మిల్లులో అనధికారికంగా ఉంచిన సాంబమసూరి బియ్యం మాత్రం పౌరసరఫరాల అధికారులు వేలం వేసి పాడుకున్న వ్యక్తికి అప్పగించారు. రేషన్‌బియ్యాన్ని కనీసం ఎంఎల్ఎస్ పాయింటుకు తరలించకపోవడం, గత ఏడాదిన్నర కాలంగా మిల్లులో ఉన్న బియ్యం పరిస్థితిని పట్టించుకోకపోవడంతో పురుగులుపట్టి ముక్కిపోయి, దుర్వాసన వెదజల్లుతున్నాయి. శుక్రవారం పౌరసరఫరాల విభాగం అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఎకౌంట్స్ అసిస్టెంట్ మేనేజర్ భరద్వాజ ఈ బియ్యాన్ని పరిశీలించారు. రైస్‌మిల్లు యజమాని హరి తమ మిల్లునుంచి ఈ బియ్యం బస్తాలను తొలగించాలని పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో తిరువూరు తహశీల్దారు బాలకృష్ణారెడ్డిని పీడీఎస్ అధికారులు సంప్రదించారు. నిబంధనల పేరుతో కాలయాపన చేసిన అధికారులు రేషన్‌బియ్యాన్ని వృథా చేశారని పలువురు విమర్శిస్తున్నారు.