ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు చాలామంది కొంతకాలంగా ‘గూగుల్ క్లౌడ్ స్టోరేజ్’తో ఇబ్బందులు పడుతున్నారు. గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్, వీడియోలు, బ్యాకప్ ఫైళ్లు ఎక్కువగా ఉన్నవారికి తమ క్లౌడ్ స్లోరేజ్ నిండిపోయినట్లు పాప్‌అప్ మెసేజ్‌లు వస్తుండడం గమనిస్తున్నాం. అయితే ఇప్పటివరకు గూగుల్ 15జీబీ స్టోరేజీను ఉచితంగా అందించింది. ఇకపై స్టోరేజీ కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందనేలా పాప్‌అప్ కనిపిస్తుంది. అయితే కాసేపు స్టోరేజీలోని డేటాపై సమయం వెచ్చిస్తే ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఉచితంగా గూగుల్ సేవలు పొందే వీలుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
గూగుల్ ఆండ్రాయిడ్ 1.0 వర్షన్‌ను 2008లో లాంచ్ చేసింది. దాంతో స్మార్ట్‌ఫోన్లకు భారీగా గిరాకీ ఏర్పడింది. అయితే ఈ ఫోన్లో యాప్ ఇన్‌స్టాల్ చేయాలంటే జీమెయిల్ లాగిన్ అవసరం అవుతుంది. దాంతో చాలామంది గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. గూగుల్ తర్వాతి కాలంలో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర బ్యాకప్ ఫైళ్ల కోసం ఉచితంగా 15 జీబీ క్లౌడ్‌స్టోరేజీ అందించింది. ఈ తరుణంలో చాలాఏళ్లుగా ఒకే గూగుల్ అకౌంట్ వాడుతున్న వారికి చెందిన క్లౌడ్ స్టోరేజీ ఇటీవల కాలంలో ఫుల్ అయింది. దాంతో కంపెనీ కొంత డబ్బు చెల్లిస్తే మరింత ఎక్కువ ఆన్‌లైన్ స్టోరేజీని ఇస్తామన్నట్లు ఆఫర్లు పెడుతోంది. ఒకవేళ స్టోరేజీ పూర్తయితే గూగుల్ వన్ అకౌంట్ తీసుకుని నెలకు రూ.30(మొదటి మూడు నెలలు మాత్రమే రూ.30. తర్వాత ధరలో మార్పు ఉంటుంది) చెల్లిస్తే 100 జీబీ స్పేస్ లభిస్తుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించి తిరిగి గూగుల్ స్టోరేజీను ఉచితంగా పొందవచ్చు.
ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ దూసుకెళ్లాలంటే ఇవి పాటించాల్సిందే..
గూగుల్ స్టోరేజీలోని క్లీనప్ స్పేస్ ఆప్షన్ ఉపయోగించి గూగుల్ డ్రైవ్, ఫొటోస్, జీమెయిల్ వంటి వివిధ సర్వీసుల్లో ఉన్న అనవసర డేటాను తొలగించాలి.
ఎప్పుడో మీరు మొదటగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నప్పుడు ఓపెన్ చేసిన గూగుల్ అకౌంట్ కాబట్టి ఒకసారి అనవసర డేటా ఏదైనా ఉందో చూసుకోండి. వాటి అవసరం లేదంటే డేటా డిలీట్ చేయండి.
కొన్ని ఫైళ్ల సైజ్(ఎంబీ, జీబీ) ఎక్కువగా ఉంటుంది. వాటిని తొలగించవచ్చు.
ఈ పని త్వరగా, సులువుగా పూర్తవ్వాలంటే మొబైల్ కంటే కూడా డెస్క్‌టాప్/ ల్యాప్‌టాప్ వినియోగించడం మంచిది. ఇందుకోసం ముందుగా గూగుల్ వన్ స్టోరేజీ మేనేజర్‌కి వెళితే దేనికంత స్టోరేజీ అవుతుందో చూపిస్తుంది. ఏయే సర్వీసుల్లో పెద్ద ఫైల్స్ ఉన్నాయో రివ్యూ చేయొచ్చు. ఆయా సర్వీసులపై క్లిక్ చేస్తే డిలీట్ చేయదగ్గ పెద్ద సైజు ఫైల్స్ దర్శనమిస్తాయి. వాటిని సులువుగా డిలీట్ చేయొచ్చు.
నిత్యం ఎన్నో వెబ్‌సైట్లను సందర్శిస్తుంటాం. అవి ఎప్పటికప్పుడు వాటి ప్రమోషనల్ మెయిల్స్ పంపిస్తుంటాయి. దాంతో జీమెయిల్ ఇన్‌బాక్స్ నిండిపోతూ ఉంటుంది. ఈ తరహా మెయిల్స్‌ను తొలగించడం ద్వారా కొంత స్పేస్‌ను పొందవచ్చు. ఇందుకోసం జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో చెక్‌బాక్స్ పక్కనే ఉన్న డ్రాప్‌డౌన్ మెనూపై క్లిక్ చేసి అన్‌రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కామన్ బాక్స్ ఎంచుకుంటే అన్ని అన్‌రీడ్ మెసేజ్‌లు సెలక్ట్ అవుతాయి. పక్కనే ఉన్న డిలీట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
మెయిల్‌లోని ప్రైమరీ విభాగం కాకుండా పక్కనే ఉన్న ప్రమోషన్స్, సోషల్ విభాగంలోని మెయిళ్లును తొలగించవచ్చు.
పాత మెయిల్స్‌ను తొలగించడానికి జీమెయిల్ సెర్చ్‌లో ఉదాహరణకు before:2018 అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. 2018 కంటే ముందున్న మెయిళ్లన్ని దర్శనమిస్తాయి. వాటిని డిలీట్ చేయవచ్చు.
లార్జ్ మెయిళ్లను డిలీట్ చేయాలంటే సెర్చ్ బార్లో క్లిక్ చేసిన వెంటనే కింద has attachment అని వస్తుంది. దానిపై క్లిక్ చేసి సెర్చ్‌లో 4m అని టైప్ చేయాలి. దాంతో 4 ఎంబీ సైజ్ ఉన్న అన్ని ఫైళ్లకు సంబంధించిన మెయిళ్లు డిస్‌ప్లే అవుతాయి. అనవసరమైతే వాటిని డిలీట్ చేసుకోవచ్చు.
గూగుల్ ఫొటోస్, వీడియోల్లో లార్జ్ ఫైళ్లు ఉంటాయి. కాబట్టి వేరే తాత్కాలిక అకౌంట్ క్రియేట్ చేసుకుని అందులో కొన్ని ఫైళ్లను కొత్త అకౌంట్‌లోకి మార్చుకోవచ్చు. లేదంటే వాటిలో కొన్నింటిని పూర్తిగా డిలీట్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment