Storage capacity
-
గూగుల్ 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..
ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు చాలామంది కొంతకాలంగా ‘గూగుల్ క్లౌడ్ స్టోరేజ్’తో ఇబ్బందులు పడుతున్నారు. గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్, వీడియోలు, బ్యాకప్ ఫైళ్లు ఎక్కువగా ఉన్నవారికి తమ క్లౌడ్ స్లోరేజ్ నిండిపోయినట్లు పాప్అప్ మెసేజ్‌లు వస్తుండడం గమనిస్తున్నాం. అయితే ఇప్పటివరకు గూగుల్ 15జీబీ స్టోరేజీను ఉచితంగా అందించింది. ఇకపై స్టోరేజీ కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందనేలా పాప్అప్ కనిపిస్తుంది. అయితే కాసేపు స్టోరేజీలోని డేటాపై సమయం వెచ్చిస్తే ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఉచితంగా గూగుల్ సేవలు పొందే వీలుంది. అది ఎలాగో తెలుసుకుందాం.గూగుల్ ఆండ్రాయిడ్ 1.0 వర్షన్‌ను 2008లో లాంచ్ చేసింది. దాంతో స్మార్ట్ఫోన్లకు భారీగా గిరాకీ ఏర్పడింది. అయితే ఈ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేయాలంటే జీమెయిల్ లాగిన్ అవసరం అవుతుంది. దాంతో చాలామంది గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. గూగుల్ తర్వాతి కాలంలో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర బ్యాకప్ ఫైళ్ల కోసం ఉచితంగా 15 జీబీ క్లౌడ్స్టోరేజీ అందించింది. ఈ తరుణంలో చాలాఏళ్లుగా ఒకే గూగుల్ అకౌంట్ వాడుతున్న వారికి చెందిన క్లౌడ్ స్టోరేజీ ఇటీవల కాలంలో ఫుల్ అయింది. దాంతో కంపెనీ కొంత డబ్బు చెల్లిస్తే మరింత ఎక్కువ ఆన్లైన్ స్టోరేజీని ఇస్తామన్నట్లు ఆఫర్లు పెడుతోంది. ఒకవేళ స్టోరేజీ పూర్తయితే గూగుల్ వన్ అకౌంట్ తీసుకుని నెలకు రూ.30(మొదటి మూడు నెలలు మాత్రమే రూ.30. తర్వాత ధరలో మార్పు ఉంటుంది) చెల్లిస్తే 100 జీబీ స్పేస్ లభిస్తుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించి తిరిగి గూగుల్ స్టోరేజీను ఉచితంగా పొందవచ్చు.ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ దూసుకెళ్లాలంటే ఇవి పాటించాల్సిందే..గూగుల్ స్టోరేజీలోని క్లీనప్ స్పేస్ ఆప్షన్ ఉపయోగించి గూగుల్ డ్రైవ్, ఫొటోస్, జీమెయిల్ వంటి వివిధ సర్వీసుల్లో ఉన్న అనవసర డేటాను తొలగించాలి.ఎప్పుడో మీరు మొదటగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నప్పుడు ఓపెన్ చేసిన గూగుల్ అకౌంట్ కాబట్టి ఒకసారి అనవసర డేటా ఏదైనా ఉందో చూసుకోండి. వాటి అవసరం లేదంటే డేటా డిలీట్ చేయండి.కొన్ని ఫైళ్ల సైజ్(ఎంబీ, జీబీ) ఎక్కువగా ఉంటుంది. వాటిని తొలగించవచ్చు.ఈ పని త్వరగా, సులువుగా పూర్తవ్వాలంటే మొబైల్ కంటే కూడా డెస్క్‌టాప్/ ల్యాప్‌టాప్ వినియోగించడం మంచిది. ఇందుకోసం ముందుగా గూగుల్ వన్ స్టోరేజీ మేనేజర్‌కి వెళితే దేనికంత స్టోరేజీ అవుతుందో చూపిస్తుంది. ఏయే సర్వీసుల్లో పెద్ద ఫైల్స్ ఉన్నాయో రివ్యూ చేయొచ్చు. ఆయా సర్వీసులపై క్లిక్ చేస్తే డిలీట్ చేయదగ్గ పెద్ద సైజు ఫైల్స్ దర్శనమిస్తాయి. వాటిని సులువుగా డిలీట్ చేయొచ్చు.నిత్యం ఎన్నో వెబ్సైట్లను సందర్శిస్తుంటాం. అవి ఎప్పటికప్పుడు వాటి ప్రమోషనల్ మెయిల్స్ పంపిస్తుంటాయి. దాంతో జీమెయిల్ ఇన్‌బాక్స్ నిండిపోతూ ఉంటుంది. ఈ తరహా మెయిల్స్‌ను తొలగించడం ద్వారా కొంత స్పేస్‌ను పొందవచ్చు. ఇందుకోసం జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో చెక్‌బాక్స్ పక్కనే ఉన్న డ్రాప్‌డౌన్ మెనూపై క్లిక్ చేసి అన్‌రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కామన్ బాక్స్ ఎంచుకుంటే అన్ని అన్‌రీడ్ మెసేజ్‌లు సెలక్ట్ అవుతాయి. పక్కనే ఉన్న డిలీట్ బటన్‌పై క్లిక్ చేయాలి.మెయిల్లోని ప్రైమరీ విభాగం కాకుండా పక్కనే ఉన్న ప్రమోషన్స్, సోషల్ విభాగంలోని మెయిళ్లును తొలగించవచ్చు.పాత మెయిల్స్‌ను తొలగించడానికి జీమెయిల్ సెర్చ్‌లో ఉదాహరణకు before:2018 అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. 2018 కంటే ముందున్న మెయిళ్లన్ని దర్శనమిస్తాయి. వాటిని డిలీట్ చేయవచ్చు.లార్జ్ మెయిళ్లను డిలీట్ చేయాలంటే సెర్చ్ బార్లో క్లిక్ చేసిన వెంటనే కింద has attachment అని వస్తుంది. దానిపై క్లిక్ చేసి సెర్చ్‌లో 4m అని టైప్ చేయాలి. దాంతో 4 ఎంబీ సైజ్ ఉన్న అన్ని ఫైళ్లకు సంబంధించిన మెయిళ్లు డిస్ప్లే అవుతాయి. అనవసరమైతే వాటిని డిలీట్ చేసుకోవచ్చు.గూగుల్ ఫొటోస్, వీడియోల్లో లార్జ్ ఫైళ్లు ఉంటాయి. కాబట్టి వేరే తాత్కాలిక అకౌంట్ క్రియేట్ చేసుకుని అందులో కొన్ని ఫైళ్లను కొత్త అకౌంట్లోకి మార్చుకోవచ్చు. లేదంటే వాటిలో కొన్నింటిని పూర్తిగా డిలీట్ చేసుకోవచ్చు. -
జేబులో పట్టే హార్డ్‌డిస్క్: 1 టీబీ డేటా..
కంప్యూటర్లోని సమాచారాన్ని భద్రపరచుకోవడానికి ఇదివరకు ఫ్లాపీ డిస్క్‌లు, కాంపాక్ట్ డిస్క్‌లు, డిజిటల్ వీడియో డిస్క్‌లు ఉపయోగించేవారు. ఇప్పుడు వాటికి కాలం చెల్లింది. ఇటీవలి కాలంలో సమాచారాన్ని భద్రపరచుకోవడానికి పెన్‌డ్రైవ్‌లు విరివిగా వాడుకలోకి వచ్చాయి.పెన్‌డ్రైవ్‌ల సామర్థ్యానికి మించిన సమాచారాన్ని భద్రపరచుకోవడానికైతే ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్‌లు ఉన్నాయి. ఇప్పటి వరకు వాడుకలో ఉన్న ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్‌లు కొంచెం భారీగా ఉంటాయి. వీటిని తేలికగా జేబులో వేసుకుని వెళ్లడం సాధ్యమయ్యే పనికాదు. అయితే, కొరియన్ డిజైనర్ జున్హో హాన్ అచ్చంగా కంప్యూటర్ డెస్క్టాప్పై కనిపించే ఫోల్డర్ ఆకారంలోని ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్‌ను రూపొందించాడు.పాతకాలం ఫ్లాపీ డిస్క్ కంటే చిన్నగా కనిపించే ఈ ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్‌ను జేబులో వేసుకుని ఎక్కడికైనా సులువుగా తీసుకుపోవచ్చు. అలాగని దీని సామర్థ్యం తక్కువేమీ కాదు. ఏకంగా 1 టీబీ డేటాను ఇందులో నిక్షిప్తం చేసుకోవచ్చు. యూఎస్బీ-సీ పోర్ట్ ద్వారా దీన్ని వాడుకోవచ్చు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
బ్యాచ్‌లర్స్‌కి బెస్ట్ ఛాయిస్ ఇది.. 5కేజీల సరుకులు స్టోర్ చేసుకోవచ్చు
తక్కువ ప్లేస్‌లో ఎక్కువ సరకులు.. అనే కాన్సెప్ట్‌ను కోరుకునే వారికి ఈ ఫుడ్ స్టోరేజ్ కంటైనర్ భలే యూజ్ అవుతుంది. ఇందులో 5 కేజీల వరకు సరకులను సర్దిపెట్టుకోవచ్చు. ఈ కంటైనర్‌లో చాలా రకాల ధాన్యాలు, పొడి ఆహారం, బీన్స్, గింజలు, చక్కెర, కాఫీ గింజలు వంటివి స్టోర్ చేసుకోవచ్చు. దీనికి మూత కూడా ఉండటంతో ఇందులో నిల్వ ఉన్న పదార్థాలు తాజాగా ఉంటాయి. ఎలుకలు, కీటకాలు వంటి సమస్యలు తలెత్తవు. ఇలాంటి కంటైనర్స్‌ని సులభంగా క్యాంపింగ్స్కి, లాంగ్ డ్రైవ్స్‌కి తీసుకెళ్లొచ్చు. దీని మూతపైన కూడా చిన్న స్టోరేజ్ ప్లేస్, దానికీ చిన్న మూత ఉంటాయి. అందులో మసాలా ప్యాకెట్స్, పోపు దినుసులను వంటివి పెట్టుకోవచ్చు. ఈ డివైస్‌తో స్థలం ఆదా అవడమే కాకుండా వంటిల్లూ శుభ్రంగా కనిపిస్తుంది. ధర 15 డాలర్లు (రూ.1,249) -
ప్రపంచంలోనే అతిపెద్ద గోదాంల ఏర్పాటు.. కేంద్రం కీలక నిర్ణయం..
ఆహార భద్రతను పటిష్ఠం చేయడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద గోదాంల ఏర్పాటుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల నిల్వ కోసం గోదాంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం రూ.లక్ష కోట్లను వెచ్చించనున్నట్లు పేర్కొంది. దీంతో రైతుల ధాన్యం పాడవకుండా, కొనుగోళ్లలో రైతుల ఇబ్బందుల తప్పించడానికి సులభమవుతుందని ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గోదాంల ఏర్పాటుకు పలు మంత్రిత్వ శాఖల భాగస్వామ్యం కోసం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దేశంలో ఎంపిక చేసిన పది జిల్లాలలో ప్రయోగాత్మకంగా గోదాంల ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో గోదాంల ఏర్పాటు జరగనుందని తెలిపింది. దీంతో రానున్న ఐదేళ్లలో 700 లక్షల టన్నుల ధాన్యం నిలువ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెంపొందుతాయని పేర్కొంది. ప్రతి మండలంలో 2 వేల టన్నుల ధాన్యం నిలువచేసుకునేలా గోదాంలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో ప్రస్తుతం 3,100 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నట్లు ఠాకూర్ తెలిపారు. కానీ 1,450 లక్షల టన్నుల ధాన్యం నిలువ చేసుకునే వెసులుబాటు మాత్రమే ప్రస్తుతం ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం గోదాంల ఏర్పాటుతో ధాన్యం నిలువచేసుకునే సామర్థ్యం 2,150 లక్షల టన్నులకు చేరుతుందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని మించి ధాన్యం నిలువ చేసుకునే సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. ఇదీ చదవండి:Wrestlers Protest: విచారణ ముగిసే వరకు వేచి ఉండండి! -
రెట్టింపు ఆదాయంపై ఎన్టీటీ ఇండియా దృష్టి
ముంబై: జపాన్‌కు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఎన్టీటీ గ్రూప్ భారత్‌లో తమ స్టోరేజీ సామర్థ్యాన్ని, కార్యకలాపాల ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. వచ్చే రెండేళ్లలో ఈ లక్ష్యాలను సాధించాలని భావిస్తున్నట్లు ఎన్టీటీ డేటా ఇండియా ఎండీ అభిజిత్ దూబే తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్లలో దేశీయంగా 2.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. మరిన్ని డేటా సెంటర్లు, హరిత శక్తి, సబ్‌మెరైన్ కేబుల్ ల్యాండింగ్ సదుపాయాలు మొదలైన వాటిపై ఈ నిధులను వెచ్చించనున్నట్లు దూబే తెలిపారు. 2018లో ప్రకటించిన 2 బిలియన్ డాలర్లకు అదనంగా ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు ఆయన వివరించారు. జపాన్ వెలుపల తమకు ఇదే అతి పెద్ద మార్కెట్ అని దూబే తెలిపారు. వివిధ దేశాల్లో తమకు మొత్తం 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉండగా .. భారత్‌లో ఏకంగా 37,000 మంది పైగా ఉన్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం తమ గ్రూప్ ఆదాయం 20 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా.. భారత విభాగం వాటా 700 మిలియన్ డాలర్లుగా ఉందని దూబే చెప్పారు. రాబోయే రెండేళ్లలో దీన్ని రెట్టింపు చేసుకుని సుమారు 2 బిలియన్ డాలర్లకు పెంచుకోగలమని ఆయన ధీమా వ్య క్తం చేశారు. నెట్‌మ్యాజిక్ సంస్థ కొనుగోలు ద్వారా ఎన్టీటీ గ్రూప్.. భారత మార్కెట్లో ప్రవేశించింది. -
అన్నదాతలకు వరాలు: భారీ రుణాలు, కొత్త స్కీములు, కీలక ప్రకటనలు
న్యూఢిల్లీ: 2023-24 వార్షిక బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయానికి భారీ ప్రోత్సాహాకాలు ప్రకటించారు. అమృత కాలంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌గా అభివర్ణించిన ఈ బడ్జెట్లో దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోన్న వ్యవసాయ రంగానికి, రైతులకు కొన్ని శుభవార్తలు చెప్పారు ఆర్థికమంత్రి. అలాగే భారత దేశాన్ని చిరుధాన్యాల (మిల్లెట్ క్యాపిటల్) కేంద్రంగా మారుస్తామని ప్రకటించడం గమనార్హం. ముఖ్యంగా రైతులకు అందించే రుణ లక్ష్యాన్ని గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే 11 శాతానికి పైగా పెంచారు. వ్యవసాయం కోసం డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, రుణ సదుపాయం, మార్కెటింగ్ సదుపాయం వ్యవసాయ స్టార్ట్ప్స్కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు లాంటి చర్యలతోపాటు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. అలాగే చిరుధాన్యాల ప్రోత్సాహానికి శ్రీఅన్న పథకం, మత్స్య శాఖలోని వివిధ వర్గాల ప్రోత్సాహాకానికి పెట్టుబడులు, ఇతర కేటాయింపులను కూడా ప్రకటించారు. రూ.18 లక్షల కోట్లనుంచి రూ.20 లక్షల కోట్లకు పెంపు వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గత ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.18 లక్షల కోట్లుగా ఉండగా ప్రస్తుతం 11 శాతం మేర పెంచినట్లు ఆమె ప్రకటించారు. వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి డైరీ, పశు పోషణ, మత్స్య సాగు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే సేంద్రీయ వ్యవసాయానికి ఊతమిచ్చేలా కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. అగ్రికల్చర్ స్టార్టప్‌లకు బడ్జెట్లో వరాలు ప్రకటించారు ప్రస్తుతం రైతులు వాడుతోన్న రసాయన, ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించింది. పీఎం ప్రణామ్ కింద పది వేల బయో ఇన్పుట్ రీసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. అలాగే కనీసం కోటి మంది సేంద్రీయ సాగు చేసేలా ప్రోత్సహిస్తారు. ♦రూ.6వేల కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా MSME పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తారు. మత్స్య సాగు రైతులను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో కొత్త సబ్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి. మత్స్యకారులు, చేపలు అమ్ముకునేవారితో పాటు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి, మార్కెట్ విస్తరణకోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ♦ యువ పారిశ్రామికేత్తల ద్వారా అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అగ్రికల్చర్ యాక్సిలేటర్ ఫండ్ కింద అగ్రి స్టార్టప్‌లకు ప్రోత్సహాన్ని అందిస్తారు. రైతులకు మేలు చేసే ఏ సృజనాత్మకతనైనా ప్రోత్సహిస్తారు. కొత్త టెక్నాలజీ అన్నదాతలకు అందుబాటులోకి తెస్తారు. ♦ అన్ని అగ్రీ సొసైటీల వివరాలను డిజిటలైజ్ చేస్తారు. దీని వల్ల రైతుల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. భవిష్యత్తులో రైతులకు చేసే ఎలాంటి ప్రయోజనమైనా దీని ద్వారా జరగనుంది. ♦ రైతులు తమ ఉత్పత్తుల నిల్వ కోసం మరిన్ని గిడ్డంగులు నిర్మించేందుకు చర్యలు ♦ పత్తి సాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు. పత్తి కోసం ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం ♦ చిరుధాన్యాల పంటలకు సహకార కోసం శ్రీ అన్న పథకం. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రోత్సాహం ♦ మిలెట్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు పోషకాహారం అందేలా చేయడమే కాదు.. ఆహార భద్రతకూ భరోసా ఇస్తున్నామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి. హైదరాబాద్‌లోని మిలెట్ ఇన్స్టిట్యూట్ను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు. త్వరలోనే భారత్ తృణ ధాన్యాలకు గ్లోబల్ హబ్‌గా మారుతుందన్నారు నిర్మలా సీతారామన్. ♦ హార్టికల్చర్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి సుమారు రూ.2,200 కోట్లతో ఆత్మ నిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ♦ కర్ణాటకలోని కరువు ప్రాంతాలకు రూ.5,300 కోట్ల సాయాన్ని ప్రకటించారు. దీని వల్ల ఆ ప్రాంతంలోని రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది -
తెలంగాణలో మరో అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్...!
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఫుల్‌ఫిల్ సెంటర్ల విస్తరణలో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ రాష్ట్రంలో మరో ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేయనుంది. ఈ కేంద్రాన్ని హైదరాబాద్ సరిహద్దు ప్రాంతంలోని సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే మేడ్చల్‌లో ఉన్న ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను అదనంగా ఒక లక్ష చదరపు అడుగులతో మొత్తంగా నాలుగు లక్షల చదరపు అడుగులతో స్టోరేజ్ కెపాసిటీపి పెంచింది. తాజాగా అమెజాన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో కంపెనీ ఐదు ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను కలిగి ఉండనుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఒక మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉన్న సంస్థగా అమెజాన్ అవతరించనుంది. రాష్ట్రంలో అమెజాన్ మొత్తం నిల్వ సామర్థ్యం 5 మిలియన్ క్యూబిక్ అడుగులకు చేరనుంది. ఈ సందర్బంగా అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీస్ డైరక్టర్ అభినవ్ సింగ్ మాట్లాడుతూ..తాజా విస్తరణతో అమెజాన్ తన కస్టమర్లకు లార్జ్ అప్లయేన్సస్, ఫర్నిచర్ విభాగంలో సరికొత్త అనుభూతిని అందిస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని చిన్న, మధ్య తరగతి వ్యాపారాలకు సాధికారిత వస్తోందని తెలిపారు. ప్రస్తుత విస్తరణతో రాష్ట్రంలో అమెజాన్ ఫ్లోర్ ఏరియా 35 శాతం మేర, ఒవరాల్ స్టోరేజీ కెపాసిటీ 25 శాతానికి పెరుగుతుందని వెల్లడించారు. -
పెట్రోలు పంపులు ఫుల్.. నిల్వ ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు ధరలు కరోనా వైరస్ సంక్షోభంతో రికార్డు స్థాయికి పతనమయ్యాయి. కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో పెట్రోలు డిమాండ్ పాతాళానికి పడిపోయింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా దాచడానికి వీల్లేనంతగా పెట్రోలు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ క్రమంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దేశంలోని పెట్రోలు బంకులు దాదాపు నిండిపోయాయనీ, పెట్రోలు నిల్వ చేసుకునే సామర్థ్యం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా 66,000 పంప్ స్టేషన్లతో సహా, ప్రతి కంటైనర్‌లో ఇంధనం నిల్వ చేసుకునేందుకు స్థలం లేకుండా పోయింది. దేశంలోని రిఫైనర్లు 85 మిలియన్ బారెల్స్ ఇంధన నిల్వ సామర్థ్యంలో 95 శాతం నిండిపోయాయని రిఫైనరీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 10శుద్ధి కర్మాగారాలలో కార్యకలాపాలను దాదాపు సగానికి తగ్గించగా, మిగిలినవి 35 శాతం పనిచేస్తున్నాయని ఎఫ్జీఈ కన్సల్టెంట్ సెంథిల్ కుమారన్ తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రాసెసర్లను పక్కన పెడితే, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రిఫైనర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశం వెలుపల లీజుకు తీసుకున్న కార్గోల్లో నిల్వ చేస్తూ వుండొవచ్చని పేర్కొన్నారు. భారతదేశం మొత్తం చమురు ఉత్పత్తి డిమాండ్ ఈ త్రైమాసికంలో రోజుకు 1.4 మిలియన్ బ్యారెళ్ల చొప్పున పడిపోతుందని అంచనా వేశారు. డిమాండ్ తిరిగి పుంజుకునే అవకాశం సమీపంలో కనిపించడం లేదని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీల డైరెక్టర్ ఆర్ రామచంద్రన్ అన్నారు. పెరుగుతున్న కరోనా మహమ్మారి కేసులతో ముంబై, ఢిల్లీ, కలకత్తా వంటి ప్రధాన వినియోగ కేంద్రాలు ఇప్పుటికే ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. అటు విస్తరిస్తున్న కరోనా కారణంగా చమురు ధరలను చరిత్రలో మొదటిసారి కనీవిని ఎరుగని కనిష్టానికి చేరాయని, ముడి, శుద్ధి చేసిన ఇంధనాలను నిల్వ చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని స్థలాలను లీజుకు తీసుకున్నట్లు అతిపెద్ద స్వతంత్ర చమురు నిల్వ సంస్థ, రాయల్ వోపాక్ ఎన్వి తెలిపింది. అయితే ఈ వార్తలపై బీపీసీఎల్‌తో పాటు, హిందుస్తాన్ పెట్రోలియం కార్ప్ , ఇండియన్ ఆయిల్ కార్ప్ ఇంకా స్పందించలేదు. (టెకీలకు క్యాప్ జెమిని శుభవార్త) కాగా రిటైల్ స్టేషన్లతో పాటు, భారతీయ రిఫైనర్లు 300 కి పైగా డిపోలు, టెర్మినల్స్, అలాగే 250 ఏవియేషన్ ఇంధన స్టేషన్లలో పెట్రోలియం ఇంధనాలను నిల్వ చేస్తాయి. మొత్తం సామర్థ్యంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ డీజిల్ నిల్వ చేయడానికి, మరో 20 శాతం గ్యాసోలిన్ నిల్వ కోసం ఉపయోగిస్తారు. లాక్‌డౌన్‌తో విమానాల రాకపోకలు, సహా అన్ని రవాణా సేవలు రద్దు చేయడంతో భారతదేశంలోని వివిధ పెట్రోల్ బంకులలో 50 శాతం కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఏప్రిల్‌లో ఇంధన డిమాండ్ రికార్డు స్థాయిలో పడిపోయింది. భారతదేశ చమురు డిమాండ్‌లో సగానికి పైగా, డీజిల్, గ్యాసోలిన్ వినియోగం ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో 60శాతం కంటే ఎక్కువ పడిపోయింది. మరోవైపు కరోనా కట్టడికి మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాకివ్వనున్న జియో మార్ట్) -
అడ్డగోలు ఆక్రమణ
పంట భూములుగా మారిన చెరువు గర్భం కోల్పోయిన నీటి నిల్వ సామర్థ్యం ఆయకట్టు రైతులకు ఇక్కట్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం బుచ్చెయ్యపేట : అది దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉన్న చెరువు. దాదాపు ఏడెకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ చెరువు కింద వందెకరాల ఆయకట్టు భూమి ఉంది. అంతటి ప్రాధాన్యం ఉన్న చెరువు ప్రస్తుతం అక్రమార్కుల బారిన పడింది. ఇంత జరిగినా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండడం విశేషం. మండలంలోని శింగవరం సాంబన్న చెరువు కథ ఇది. వివరాల్లోకి వెళితే... సాంబన్న చెరువు ఆధారంగా శింగవరం, లోపూడి, లూలూరు రెవెన్యూ పరి ధిలోని వందల మంది రైతులు పంటలు పం డించుకుంటున్నారు. ఏడెకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువులో దాదాపు మూడున్నర ఎకరాల భూమిని కొందరు రైతులే ఆక్రమించి చెరకు, సరుగుడు తోటలు వేసేశారు. ఈ భూమి విలు వ దాదాపు కోటిన్నర ఉంటుందని అంచ నా. ఆక్రమణలతో ఆయకట్టుకు నీరందక పోవడంతో గత సర్పంచ్ గుడాల అప్పన్నదొర, ప్రస్తుత సర్పంచ్ రేణం అప్పారావు, గ్రామ నాయకులు, యువకులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణలు తొలగించి సాగునీరందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కానీ రెవెన్యూ అధికారులు ఇసుమంత కూడా స్పందించలేదు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారి నుంచి స్పందన లేకపోవడంతో అధికారుల తీరుకు నిరసనగా మరికొందరు రైతులు మిగిలిన మూడున్నర ఎకరాల చెరువు గర్భాన్ని ఆక్రమించి సాగుయుక్తం చేసేశారు. ఇందులో యూకలిప్టస్, సరుగుడు, టేకు మొక్కలు వేసి కంచెవేశారు. ప్రస్తుతం ఏడెకరాల చెరువు గర్భం ఆక్రమణకు గురై నీటినిల్వ సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో వందెకరాల ఆయకట్టుకు నీటి పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. విషయాన్ని బుచ్చెయ్యపేట తహశీల్దార్ ఎస్.సిద్ధయ్య వద్ద ప్రస్తావించగా ఆక్రమణలపై ఫిర్యాదు అందిందని చెప్పారు. చెరువు కొలతలు చేపట్టి ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ఒకవేళ ఎవరైనా తొలగేందుకు నిరాకరిస్తే కేసులు నమోదు తప్పదని హెచ్చరించారు. ఫిర్యాదులు పట్టించుకోలేదు చెరువు ఆక్రమణలు తొలగించాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. చెరువు పూర్తిగా ఆక్రమించేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మా ఆయకట్టుకు నీరెలా అందుతుంది. పంటలు ఎలా పండిస్తాం. - కొమర అప్పారావు, సాగురైతు ఒకరిని చూసి ఒకరు తొలుతు సగం చెరువుగర్భాన్ని కొందరు రైతులు ఆక్రమించా రు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టిం చుకోలేదు. అధికారుల తీరుకు నిరసనగా మరికొందరు మిగిలిన చెరువు గర్భాన్ని ఆక్రమించేశారు. - రేణం నాయుడు, రైతు