కంప్యూటర్‌లోని సమాచారాన్ని భద్రపరచుకోవడానికి ఇదివరకు ఫ్లాపీ డిస్క్‌లు, కాంపాక్ట్ డిస్క్‌లు, డిజిటల్ వీడియో డిస్క్‌లు ఉపయోగించేవారు. ఇప్పుడు వాటికి కాలం చెల్లింది. ఇటీవలి కాలంలో సమాచారాన్ని భద్రపరచుకోవడానికి పెన్‌డ్రైవ్‌లు విరివిగా వాడుకలోకి వచ్చాయి.
పెన్‌డ్రైవ్‌ల సామర్థ్యానికి మించిన సమాచారాన్ని భద్రపరచుకోవడానికైతే ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్‌లు ఉన్నాయి. ఇప్పటి వరకు వాడుకలో ఉన్న ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్‌లు కొంచెం భారీగా ఉంటాయి. వీటిని తేలికగా జేబులో వేసుకుని వెళ్లడం సాధ్యమయ్యే పనికాదు. అయితే, కొరియన్ డిజైనర్ జున్హో హాన్ అచ్చంగా కంప్యూటర్ డెస్క్‌టాప్‌పై కనిపించే ఫోల్డర్ ఆకారంలోని ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్‌ను రూపొందించాడు.
పాతకాలం ఫ్లాపీ డిస్క్ కంటే చిన్నగా కనిపించే ఈ ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్‌ను జేబులో వేసుకుని ఎక్కడికైనా సులువుగా తీసుకుపోవచ్చు. అలాగని దీని సామర్థ్యం తక్కువేమీ కాదు. ఏకంగా 1 టీబీ డేటాను ఇందులో నిక్షిప్తం చేసుకోవచ్చు. యూఎస్‌బీ-సీ పోర్ట్ ద్వారా దీన్ని వాడుకోవచ్చు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment