
మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కథనంలో రూ.20,000 కంటే తక్కువ ధరలో లభించే ఐదు బెస్ట్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం..
నథింగ్ సీఎమ్ఎఫ్ ఫోన్ 1
మార్కెట్లో తక్కువ ధరకు లభించే ఫోన్లలో 'నథింగ్ సీఎమ్ఎఫ్ ఫోన్ 1' ఒకటి. ఇది రంగు రంగుల బ్యాక్ ప్యానెల్‌లను కలిగి ఉండటం వల్ల, మీకు నచ్చిన కలర్ మార్చుకోవచ్చు. దీనిని మరింత అందంగా డిజైన్ చేసుకోవడానికి కంపెనీ కొన్ని యాక్సెసరీస్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 15499 మాత్రమే. కెమెరా సెటప్, డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి.
రియల్‌మీ నార్జో 70 టర్బో
సాధారణ ఉపయోగం కోసం మాత్రమే కాకుండా.. గేమింగ్ కోసం కూడా ఉపయోగపడే ఫోన్ 'రియల్‌మీ నార్జో 70 టర్బో'. దీని ధర రూ. 14,999. ఇది డ్యూయెల్ టోన్ బ్లాక్ ప్యానెల్.. ప్రీమియం అండ్ స్పోర్టీ అప్పీల్ ఇస్తుంది. చదరంగం ఆకారంలో ఉండే కెమెరా సెటప్ కూడా అకార్షణీయంగా ఉంటుంది. ఇందులో డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ ఉంటుంది.

టెక్నో పోవా 6 ప్రో
రూ. 20వేలు కంటే తక్కువ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్లలో.. టెక్నో పోవా 6 ప్రో ఒకటి. దీని ధర రూ. 19999. ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్స్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ గొప్ప గేమింగ్ ఫోన్ కాదు, కానీ ఇందులోని డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ కొంతవరకు గేమ్‌లకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా పొందుతుంది.
ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా
లావా బ్లేజ్ డుయో
రూ.16,999 ధర వద్ద లభించే ఈ స్మార్ట్‌ఫోన్.. సెకండరీ డిస్‌ప్లేతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఫీచర్ కలిగి సరసమైన ధరకు లభించే ఫోన్‌లలో ఇది బెస్ట్ మోడల్. ముందు నుంచి చూస్తే.. లావా బ్లేజ్ డుయో ఏ హై-ఎండ్ మాదిరిగా కనిపిస్తుంది. ఇది స్లిమ్ బెజెల్స్‌తో కూడిన 3D కర్వ్డ్ డిస్‌ప్లే పొందుతుంది. ఇది కూడా అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో
ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో అనేది రూ. 20వేల కంటే కొంత ఎక్కువ ధర వద్ద లభిస్తుంది. ఇది డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్, 8GB/12GB RAM, 256GB స్టోరేజ్ వంటి ఆప్షన్స్ పొందుతుంది. దీని ఫ్లాట్ డిస్‌ప్లే గేమర్‌లకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇది 5000 mAh బ్యాటరీ పొందుతుంది. ఈ ఫోన్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో సహా వివిధ యాక్సెసరీలకు కూడా సపోర్ట్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment