![Best Phones Like Apple iPhone Camera](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/cemera-phones.jpg.webp?itok=R0zLbrp9)
కొందరు ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్స్ ఇష్టపడతారు, మరికొందరు ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉన్న మొబైల్స్ కొనడానికి ఆసక్తి చూపుతారు. ఇంకొందరు హై క్వాలిటీ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్స్ కోసం ఎగబడతారు. ఈ కథనంలో ఐఫోన్ లాంటి కెమెరా కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం.
ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో (Oppo Find X8 Pro)
అద్భుతమైన కెమెరా కలిగిన ఫోన్ల జాబితాలో.. ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ఒకటి. క్వాడ్-కెమెరా సెటప్ కలిగిన ఈ ఫోన్‌లో 1 ఇంచ్ సోనీ LYT-900 ప్రైమరీ సెన్సార్, 6x ఆప్టికల్ జూమ్‌తో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, మాక్రో కెపాసిటీతో అల్ట్రా-వైడ్ షూటర్ ఉన్నాయి. ఈ ఫోన్ 6.82 ఇంచెస్ ProXDR OLED డిస్‌ప్లే పొందుతుంది. దీని ధర ఎక్కువే అయినప్పటికీ.. మంచి కెమెరా కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్స్ అనే చెప్పాలి.
నథింగ్ ఫోన్ 3ఏ (Nothing Phone 3a)
ఈ ఫోన్ ఇంకా మార్కెట్లో లాంచ్ కాలేదు. కానీ టీజర్‌లోనే కెమెరా క్వాలిటీ ఎలా ఉందో తెలిసిపోయింది. ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సిస్టమ్, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్, 6.7 ఇంచెస్ AMOLED డిస్‌ప్లే ఉండనున్నాయి. ఇతర స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే.. దీని ధర కొంత తక్కువగానే ఉంటుందని సమాచారం.
నుబియా జెడ్70 అల్ట్రా (Nubia Z70 Ultra)
అత్యుత్తమ కెమెరా సెటప్ కలిగిన స్మార్ట్‌ఫోన్ల జాబితాలో.. నుబియా జెడ్70 అల్ట్రా ఒకటి. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 35 మీమీ సమానమైన లెన్స్‌తో వస్తుంది. కాబట్టి యూజర్లకు మంచి కెమెరా ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. విభిన్న ఫోటోగ్రఫీ అవసరాలను తీర్చడానికి ఈ మొబైల్ పనికొస్తుంది. దీని ధర కూడా కొంత ఎక్కువే.
లావా అగ్ని 3 (Lava Agni 3)
లావా అగ్ని 3 మొబైల్ కూడా.. మంచి కెమెరా సెటప్ పొందుతుంది. ఇది OISతో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 32 మెగా పిక్సెల్ సెల్ఫీ షూటర్ వంటివి పొందుతుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ కలిగి మంచి పనితీరును అందిస్తుంది. 6.78 ఇంచెస్ 120 Hz డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్ 5000 యాంపియర్ బ్యాటరీ పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment