camera phone
-
Best Camera Phones: ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ కెమెరా మొబైల్ ఫోన్స్
-
కొత్త కెమెరా ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ల సందడి
ముంబై, సాక్షి: కమ్యూనికేషన్ కోసం ప్రారంభమైన స్మార్ట్ ఫోన్లు తదుపరి కాలంలో ఎన్నెన్నో కొంత ఆవిష్కరణలకు దారి చూపుతున్నాయి. సరికొత్త ఫీచర్స్‌తో యూజర్ల జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయాయి. ఇటీవల కాలంలో ప్రధానంగా కెమెరాల విషయంలో అత్యంత ఆధునికతను సంతరించుకోవడం ద్వారా డిజిటల్ కెమెరాల విక్రయాలకే గండి కొడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇటీవల రూ. 15,000లోపు ధర కలిగిన స్మార్ట్ ఫోన్లు సైతం ఆధునిక కెమెరాలు, ఫీచర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం.. మెగా పిక్సెల్స్ గతంలో రెండు కెమెరాలతో వచ్చిన స్మార్ట్ ఫోన్లు లగ్జరీ విభాగంలో వెలువడేవి. ప్రస్తుతం ప్రస్తుతం 3-4 కెమెరాలు కలిగిన ఫోన్లు సాధారణమైపోయాయి. గత కొన్నేళ్లలో కెమెరాకు ప్రాధాన్యత భారీగా పెరిగింది. దీంతో ఫోన్లకు వెనుకవైపు కనీసం 3 కెమెరాలుంటేనే ప్రస్తుతం నియోగదారులను ఆకట్టుకోగలుగుతున్నాయి. కొద్ది రోజులుగా నైట్ మోడ్స్ వంటివి సాధారణ అంశాలైపోయినట్లు టెక్ నిపుణులు తెలియజేశారు. ఈ బాటలో క్వాడ్‌కామ్ మాడ్యూల్స్ సైతం అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. లెన్స్‌ల సంఖ్య, మెగాపిక్సెల్స్ సామర్థ్యం, కెమెరా సాంకేతికత వంటి అంశాలకు ప్రాధాన్యత పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. (ఇకపై రియల్మీ 5జీ స్మార్ట్ ఫోన్లు) 8కే వీడియోలు గతేడాది(2020)లో 4కే వీడియో చిత్రీకరణకు ఆకర్షణ పెరిగింది. దీంతో ఈ ఏడాది(2021) స్మార్ట్ ఫోన్ కంపెనీలు 8కే వీడియోలపై దృష్టిసారించినట్లు టెక్ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. గతేడాది చివర్లోనే ఇందుకు బీజం పడినప్పటికీ ఇవి ఏడాది, రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు భావిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా 8కే వీడియోలను సపోర్ట్ చేయగల స్ర్కీన్లను సైతం అమర్చవలసి ఉన్నట్లు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ లేదా టీవీ సెట్లలో వీటిని ప్లే చేసేందుకు వీలైన తెరలను ఏర్పాటు చేయవలసి ఉంటుందని వివరించారు. వెరసి 2022కల్లా 8కే వీడియో చిత్రీకరణ చేయగల స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. (2021లో రియల్మీ కీలక ఫోన్- కేవోఐ) గింబల్ సపోర్ట్ కొన్నేళ్లుగా డిజిటల్ కెమెరాల స్థానంలో స్మార్ట్ ఫోన్ కెమెరాల వినియోగం అధికమైంది. అన్నివేళలా ఫోన్లు అందుబాటులో ఉండటంతోపాటు.. చిత్రీకరణ అత్యంత సులభంకావడంతో వినియోగదారులు కెమెరా ఫీచర్స్పై దృష్టి సారించడం ఎక్కువైంది. దీంతో ఇటీవలి కాలంవరకూ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను స్మార్ట్ ఫోన్ కంపెనీలు సాధారణ ఫీచర్‌గా జత చేస్తూ వచ్చాయి. అయితే సెల్ఫీ ట్రెండ్ ప్రవేశించాక కెమెరాలు, వీటి ఫీచర్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వీడియో కంటెంట్లకు డిమాండ్ పెరగడంతో వీడియో సాంకేతికతకూ ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఫొటోలు లేదా వీడియోల స్టెబిలైజేషన్పై దృష్టితో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కొత్తగా గింబల్ సాంకేతికతను ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. వివో కంపెనీ ఎక్స్50 ప్రోలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. సెన్సర్లకూ ప్రాధాన్యం నిజానికి స్మార్ట్ ఫోన్లలో అత్యధిక మెగా పిక్సెల్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ, సెన్సర్లకే ప్రాధాన్యం ఉన్నట్లు టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ఉదాహరణకు 4కే వీడియోలను చిత్రీకరించాలంటే కనీసం 8 మెగాపిక్సెల్ కెమెరాలు తప్పనిసరని వెల్లడించారు. వెరసి వీడియోల నాణ్యతకు వీలుగా భారీ సెన్సర్లను వినియోగించవలసి ఉంటుందని తెలియజేశారు. ఇక 8కే వీడియోలను చిత్రీకరించాలంటే 33 మెగాపిక్సెల్ కెమెరాలను ఏర్పాటు చేయవలసి ఉంటుందని చెబుతున్నారు. కొంతకాలంగా యాపిల్, గూగుల్ తదితర దిగ్గజాలు 12 ఎంపీ కెమెరాలకే కట్టుబడుతూ వస్తున్నాయి. వీటికి జతగా ఇటీవల మరో 12 ఎంపీ కెమెరాలకు సైతం తెరతీశాయి. ఈ కంపెనీలతోపాటు నాణ్యమైన సెన్సర్లను వినియోగించడం ద్వారా పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం కెమెరా ఫీచర్స్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నట్లు నిపుణులు ప్రస్తావించారు. డిస్ప్లేలో కెమెరా సెల్ఫీ ట్రెండ్‌కు వీలుగా పలు కంపెనీలు డిస్ప్లేలో అంతర్భాగంగా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ముందు భాగంలో పాపప్ కెమెరాలు సైతం ఏర్పాటు చేశాయి. దీనిలో భాగంగానే నాచ్ స్టైల్ సెల్ఫీకెమెరాలు, పంచ్ హోల్ కెమెరాల ట్రెండ్‌కు తెరలేచింది. గతేడాది ఇన్‌డిస్‌ప్లే కెమెరాలకూ ఒప్పో, షియోమీ శ్రీకారం చుట్టాయి. ఇవి కొనసాగేదీ లేనిదీ వేచిచూడవలసి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. మూడు విభిన్న కెమెరాల ద్వారా చిత్రీకరించే ఫొటోలు లేదా వీడియోలకు చిప్ సెట్ సైతం సపోర్ట్ చేయవలసి ఉంటుందని, ఈ బాటలోనే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ఎస్వోసీకి కొత్త ఏడాదిలో స్మార్ట్ ఫోన్ కెమెరాలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
అదిరిపోయే ఫోటోలకు ‘రియల్‌మి ఎక్స్‌టీ'
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తాజాగా ‘ఎక్స్‌టీ’ సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదలచేసింది. నూతన సిరీస్‌లో 64 మెగాపిక్సెల్ (ఎంపీ) క్వాడ్–కెమెరా సిస్టమ్ ఉన్నట్లు కంపెనీ ప్రకటించగా, భారత్‌లోనే ఈస్థాయి కెమెరా సామర్థ్యాన్ని కలిగిన స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఇదే కావడం విశేషం. సెల్ఫీ కెమెరా 16 ఎంపీ కాగా.. 6.4–అంగుళాల పూర్తి హెచ్డి సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇందులో స్పెసిఫికేషన్లుగా వివరించింది. మొత్తం మూడు వేరియంట్లలో ఎక్స్‌టీ లభిస్తుండగా.. 4జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ. 15,999.. 6జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ. 16,999 వద్ద నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. -
48 ఎంపీ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్!
పదేళ్ల క్రితం నోకియా తన మొబైల్స్‌లో కెమెరాలను అప్డేట్ చేస్తూ మొబైల్ మార్కెట్‌ను శాసించిన పరిస్థితులను చూశాము. గత కొద్ది నెలలుగా రిలీజవుతున్న మొబైల్స్‌ను గమనిస్తే ఈ ట్రెండ్ మళ్లీ ప్రారంభమైనట్లు అనిపిస్తోంది. ప్రతీ మొబైల్ కంపెనీ తమ ఫ్లాగ్షిప్ ఫోన్లలో కెమెరాలను అప్డేట్ చేస్తున్నాయి. గతవారం హువావే 40 ఎంపీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా ఫోన్ రిలీజ్ చేసింది. ఇదే క్రమంలో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తూ ఇండియాలో భారీ మార్కెట్‌ను సాధించిన చైనా మొబైల్ దిగ్గజం షావోమీ జనవరిలో బెస్ట్ కెమెరాతో దుమ్మురేపే మొబైల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. 48 మెగాపిక్సెల్ భారీ కెమెరాతో ఈ ఫోన్‌ను తయారు చేయనున్నట్లు షావోమీ ప్రెసిడెంట్ లిన్ బిన్ తెలిపారు. ప్రముఖ చైనా టెక్నాలజీ వెబ్సైట్ వీబోలో ఈ మేరకు వార్త వెలువడింది. తాను కొద్దివారాల పాటు ఈ మొబైల్‌ను ఉపయోగించినట్లు లిన్ వెల్లడించారు. 48 ఎంపీ సెన్సార్‌గా సోనీ ఐఎయ్‌ఎక్స్ 586ని గానీ శాంసంగ్ ఐసోసెల్ బ్రైట్ జీఎం1ని గానీ అమర్చే అవకాశముందని తెలిపారు. సోనీ సెన్సార్ సూపర్ స్లో మోషన్‌ను సపోర్ట్ చేయడం లేదని, అయితే ఏదో ఒకటి చేసి దానినే అమర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ కెమెరాలు రెండూ నాలుగు రెట్ల వరకూ దూరాన్ని జూమ్ ద్వారా స్పష్టంగా తీయగలవు. ఇప్పటివరకూ షావోమీ ఈ స్థాయి కెమెరా కలిగిన ఫోన్ తయారు చేయలేదు. ఇది ఎంతవరకు విజయం సాధించగలదో చూడాలంటే జనవరి వరకూ ఆగక తప్పదు. -
20.7 ఎంపీ కెమెరాతో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్.. గెలాక్సీ కె జూమ్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను సింగపూర్ వేదికగా ఆవిష్కరించింది. సామాజిక వెబ్సైట్లను విరివిగా వాడే వారిని లక్ష్యంగా చేసుకుని దీనిని రూపొందించారు. 20.7 మెగాపిక్సెల్ కెమెరా, 10 ఎక్స్ జూమ్ దీని ప్రత్యేకత. ధర, ఎప్పుడు మార్కెట్లోకి వచ్చేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. సెకనుకు 60 ఫ్రేమ్స్‌తో రికార్డు చేయగలదు. ఫోన్‌కు ముందువైపు 2 ఎంపీ కెమెరా ఉంది. 4.8 అంగుళాల సూపర్ అమోలెడ్ హెచ్డీ డిస్ప్లే, ఆన్‌డ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్, హెక్సా కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 2430 ఎంఏహెచ్ బ్యాటరీ, వైఫై, బ్లూటూత్ ఇతర సాంకేతిక విశిష్టతలు. ఎల్టీఈ, 3జీ వేరియంట్ల లో లభిస్తుంది. 200 గ్రాముల బరువు, 20.2 మిల్లీమీటర్ల మందం ఉంది. గెలాక్సీ ఎస్4 జూమ్ అనే మోడల్ కంపెనీ నుంచి ప్రత్యేక కెమెరాతో కూడిన తొలి స్మార్ట్‌ఫోన్. శాంసంగ్ లెవెల్ పేరుతో హెడ్ఫోన్లు, బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్‌ను సైతం ఆవిష్కరించింది. -
భారత్‌లోకి 41 ఎంపి నోకియా లూమియా 1020
న్యూఢిల్లీ: ఫొటోగ్రఫీ ప్రియుల కోసం నోకియా కంపెనీ 41 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్, లూమియా 1020ను త్వరలో మార్కెట్లోకి తేనున్నది. వచ్చే నెల 11 నుంచి వీటి విక్రయాలు ప్రారంభిస్తామని, ధరను వచ్చే నెల 10న ప్రకటిస్తామని నోకియా కంపెనీ పేర్కొంది. అయితే ఈ ఫోన్ ధర రూ.47,000-48,000 ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. విదేశాల్లో ఈ ఫోన్‌ను నోకియా కంపెనీ 800 డాలర్లకు విక్రయిస్తోంది. తమ లూమియా ఫోన్లకు మంచి స్పందన లభిస్తోందని, ఈ లూమియా 1020కు కూడా అదే స్థాయి ఆదరణ లభించగలదని నోకియా ఇండియా ఎండీ పి.బాలాజీ చెప్పారు. డ్యుయల్ కాప్చర్ ఫీచర్ ఉన్న ఈ ఫోన్లో ఉన్న నోకియా ప్రో కెమెరా యాప్‌తో ఎవరైనా ప్రొఫెషనల్ క్వాలిటీ ఫొటోలు తీయవచ్చని పేర్కొన్నారు. విండోస్ 8 ఓఎస్‌పై పనిచేసే లూమియా 1020లో 2 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 11.43 సెం.మీ. డిస్ప్లే, క్వాల్కామ్ స్పాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్, సూపర్ సెన్సిటివ్ టచ్‌స్క్రీన్ వంటి ప్రత్యేకతలున్నాయి. లూమియా రేంజ్లో లూమియా 520 చౌక ఫోన్ అని, ఆన్లైన్ అమ్మకాల్లో ఈ ఫోన్ల హవా అధికంగా ఉందని నోకియా ఇండియా డెరైక్టర్ విపుల్ మెహరోత్రా చెప్పారు. ఈ కంపెనీ లూమియా రేంజ్లో మొత్తం 13 మొబైల్ ఫోన్లను విక్రయిస్తోంది. మరికాస్త పుంజుకున్న రూపీ ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో వరుసగా రెండవ రోజూ బలపడింది. బుధవారం ముగింపుతో పోల్చితే 37 పైసలు లాభపడి 62.07 వద్ద ముగిసింది. ఇది వారం గరిష్టస్థాయి. ఎగుమతిదారుల అమెరికా కరెన్సీ అమ్మకాలు, ఈక్విటీ మార్కెట్ల లాభాలు రూపాయి ట్రేడింగ్‌పై సానుకూల ప్రభావం చూపాయి. పండుగల సీజన్ నేపథ్యంలో వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) ఇబ్బందులు లేకుండా రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుందన్న వార్తలు సైతం రూపాయి బలోపేతానికి కారణమని ట్రేడర్లు పేర్కొన్నారు.