20.7 ఎంపీ కెమెరాతో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ | Samsung officially launches Galaxy K zoom 20.7-megapixel camera-centric smartphone | Sakshi
Sakshi News home page

20.7 ఎంపీ కెమెరాతో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్

Published Wed, Apr 30 2014 1:07 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

Samsung officially launches Galaxy K zoom 20.7-megapixel camera-centric smartphone

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్.. గెలాక్సీ కె జూమ్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను సింగపూర్ వేదికగా ఆవిష్కరించింది. సామాజిక వెబ్‌సైట్లను విరివిగా వాడే వారిని లక్ష్యంగా చేసుకుని దీనిని రూపొందించారు. 20.7 మెగాపిక్సెల్ కెమెరా, 10 ఎక్స్ జూమ్ దీని ప్రత్యేకత. ధర, ఎప్పుడు మార్కెట్లోకి వచ్చేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. సెకనుకు 60 ఫ్రేమ్స్‌తో రికార్డు చేయగలదు. ఫోన్‌కు ముందువైపు 2 ఎంపీ కెమెరా ఉంది.

 4.8 అంగుళాల సూపర్ అమోలెడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఆన్‌డ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్, హెక్సా కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 2430 ఎంఏహెచ్ బ్యాటరీ, వైఫై, బ్లూటూత్ ఇతర సాంకేతిక విశిష్టతలు. ఎల్‌టీఈ, 3జీ వేరియంట్ల లో లభిస్తుంది. 200 గ్రాముల బరువు, 20.2 మిల్లీమీటర్ల మందం ఉంది. గెలాక్సీ ఎస్4 జూమ్ అనే మోడల్ కంపెనీ నుంచి ప్రత్యేక కెమెరాతో కూడిన తొలి స్మార్ట్‌ఫోన్. శాంసంగ్ లెవెల్ పేరుతో హెడ్‌ఫోన్లు, బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్‌ను సైతం ఆవిష్కరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement