భారత్‌లో స్మార్ట్‌ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేకాకుండా 2022లో 5జీ సేవలు దేశంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో 5జీ టెక్నాలజీకి అనుగుణంగా వివిధ కంపెనీలు తన స్మార్ట్‌ఫోన్లను లేటెస్ట్ ఫీచర్లుతో తయారు చేయడం మొదలుపెట్టాయి.
ఇక ప్రస్తుతం కొత్త సంవత్సరం కావడంతో పలు బ్రాండెడ్ కంపెనీలు తమ ఫోన్లను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. వివిధ సెగ్మెంట్లలో అద్భుతమైన ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్లను తీసుకురానున్నాయి. ఈ జనవరిలో లాంచ్ కానున్న బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు వాటి ప్రత్యేకతలని తెలుసుకుందాం!
Tecno Phantom X2
►టెక్నో ఫాంటమ్ ఎక్స్2 (Tecno phantom X2) జనవరి 2న భారత్‌లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇటీవలే ఫాంటమ్ X2 ప్రోతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
► ఫాంటమ్ X2 6.8 ఇంచెస్ FHD+ AMOLED డిస్‌ప్లే
►ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
► ఇందులో 64MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్
► 5,160mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Poco C50
►పోకో సీ 50 (Poco C50) ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌లో నడుస్తుంది కాబట్టి Poco ఇండియా ఇంటి నుండి సరసమైన స్మార్ట్‌ఫోన్‌గా కనిపిస్తోంది.
►ఈ స్మార్ట్‌ఫోన్ 6.52-అంగుళాల HD+ డిస్‌ప్లే
► 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
► వెనుకవైపు 8MP డ్యూయల్ కెమెరాలు, 5MP సెల్ఫీ కెమెరా
► ఇది ఫింగర్‌ప్రింట్ రీడర్, 5,000mAh బ్యాటరీ సపోర్ట్ కూడా ఉంది.
Samsung Galaxy F04
►సాంసంగ్ నుంచి మరో సరసమైన ఫోన్, గెలాక్సీ ఎఫ్ 04 (Galaxy F04 )జనవరి 4న భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది.
► 6.5-అంగుళాల HD+ రిజల్యూషన్ డిస్‌ప్లే
► 8GB RAM వరకు MediaTek Helio P35 చిప్‌సెట్ ద్వారా ఎనర్జీని పొందుతుంది.
► 5,000mAh బ్యాటరీ సపోర్ట్
Redmi Note 12 series
►రెడ్‌మీ నోట్ 12 (Redmi Note 12) సిరీస్ భారతదేశంలో జనవరి 5 న మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 12 5జీ (Redmi Note 12 5G), రెడ్‌మీ నోట్ 12 ప్రో (Redmi Note 12 Pro), రెడ్‌మీ నోట్ 12 ప్రో+ ( Redmi Note 12 Pro+) ఫోన్‌లు ఉన్నాయి.
►రెడ్‌మీ నోట్ 12 ఈ సంవత్సరం బేస్ Redmi నోట్ ఫోన్‌కు 5G కనెక్టివిటీని తీసుకువస్తుంది. అయితే రెడ్‌మీ నోట్ 12 ప్రో + అత్యధికంగా 200MP ప్రధాన కెమెరా సిస్టమ్, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రానుంది.
iQOO 11
►ఐక్యూ 11 సిరీస్‌లో రెండు ప్రీమియం మోడల్స్ జనవరి 10న భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్ కానున్నాయి. ఇందులో ఒకటి ఐక్యూ 11 కాగా , మరొకటి ఐక్యూ 11 ప్రో.
►144 Hz రిఫ్రెష్ రిఫ్రెష్ రేట్,
►2K రెజల్యూషన్‌తో 6.78 ఇంచెస్ E6 అమోలెడ్ డిస్‍ప్లే
►పవర్‌ఫుల్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్
► ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది.
► 5,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment