అసలే మంత్ ఎండింగ్. చేతిలో సరపడా డబ్బులు లేవు. కానీ బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలని ట్రై చేస్తున్నారు. అయితే మీ కోసం మార్కెట్‌లో రూ.10ల లోపు అదిరిపోయే ఫీచర్లతో బ్రాండెంట్ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రియల్ మీ నార్జో 30ఏ
రియల్ మీ నార్జో 30ఏ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,999. రియల్ మీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయొచ్చు. 6.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంట్రన్నల్ స్టోరేజ్‌తో ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్‌తో యూఎస్‌బీ సీ పోర్ట్‌ను వినియోగించుకోవచ్చు. 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000ఎంఏహెచ్ బ్యాటరీని పొందవచ్చు.
మైక్రోమ్యాక్స్ నోట్ 1
'మేడ్ ఇన్ ఇండియా' మైక్రోమ్యాక్స్ నోట్ 1 బడ్జెట్ ధరలతో అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోర్ ఫోన్ ధర రూ. 9,999గా ఉంది. మైక్రోమ్యాక్స్ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు. ఆండ్రాయిడ్ 10,మీడియా టెక్ హాలియా జీ80 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో మరో రెండు సెన్సార్‌లు ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 2ఎస్
ఉత్తర కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ కు చెందిన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 2ఎస్ ఫోన్ అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీప్లస్ ఇన్ఫినిటీ-వీ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ఎస్‌ఓఎస్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరాలు ఉన్నాయి. వెనుక సెటప్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ముందు భాగంలో సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా, 6,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. దీని ధర రూ. 9,499 ఉంది.
మోటరోలా మోటో జీ10 పవర్
మోటో జీ 10..6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ (720×1,600 పిక్సెల్‌లు) మాక్స్ విజన్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ25 ఎస్‌ఓఎస్,13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ రేర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.5,000 ఎంఏహెచ్ బ్యాటరీని పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది.
నోకియా సీ 20 ప్లస్
నోకియా సీ 20ప్లస్ 4,950ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, ఆక్టా కోర్ యూనిసోక్ ఎస్‌ఈ 9863ఏ ఎస్‌ఓఎస్‌తో పాటు 3జీబీ ర్యామ్‌తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, కెమెరా వెనుక డ్యూయల్ సెటప్ ఉంది.
రెడ్‌మీ 9 ప్రైమ్
రెడ్‌మీ 9 ప్రైమ్ ధర రూ. 9,999కే అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ 6.53 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన క్వాడ్ రియర్ కెమెరాతో వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment