Latest Best Smartphones Under Rs 10,000 - Sakshi
Sakshi News home page

లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లు.. ధర రూ.10 వేల లోపే.. ఫీచర్స్‌ అదుర్స్‌!

Published Mon, May 22 2023 11:43 AM | Last Updated on Tue, May 23 2023 11:29 AM

Best smartphones under Rs 10000 latest smartphones - Sakshi

తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ ఫోన్లు కొనాలని చూస్తున్న వారి కోసం మే నెలలో మంచి స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రియల్‌మీ (Realme), రెడ్‌మీ (Redmi) తమ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్లను మే నెలలో లాంచ్‌ చేశాయి. రియల్‌మీ నార్జో ఎన్‌53 (Realme Narzo N53)j, Redmi A2 సిరీస్‌ ఫోన్లు తక్కువ ధరకు లభిస్తున్నాయి. 

భారతదేశంలో Realme Narzo N53 ధర రూ. 8,999 వద్ద ప్రారంభమవుతుంది. Redmi A2 Plus ధర రూ. 8,499. వీటితోపాటు పోకో సీ51 (Poco C51), మోటో జీ13 (Moto G13), శాంసంగ్‌ గెలాక్సీ ఎం13(Samsung Galaxy M13) వంటి ఫోన్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.

రియల్‌మీ నార్జో ఎన్‌53
Narzo N53 6.74 అంగుళాల పెద్ద డిస్‌ప్లే, 50MP మెయిన్‌ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ధర రూ. 8,999. ఇందులో విశేషం ఏంటంటే ఐఫోన్‌ 14ప్రో (iPhone 14 Pro) లాంటి డిజైన్‌ ఉండటం. యాపిల్‌ డైనమిక్ ఐలాండ్ నాచ్ సిస్టమ్‌ ఇందులో ఉంది.

రియల్‌ ఏ2 ప్లస్‌ 
Redmi A2 Plus అద్భుతమైన ఫీచర్లలో ముఖ్యమైనవి దాని డిజైన్, Android 13 Go ఎడిషన్ సాఫ్ట్‌వేర్. అలాగే ఇందులో అతిపెద్ద 5,000mAh బ్యాటరీని ఇస్తుంది. తక్కువ ర్యామ్‌, స్టోరేజ్‌ (2GB/32GB) చాలు, ఫింగర్‌ప్రింట్ రీడర్ అవసరం లేదు అనుకునే వారికి ఈ ఫోన్‌ సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ. 5,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. Redmi A2 స్టాండర్డ్‌ మోడల్‌. ఇందులో 2GB/64GB వేరియంట్‌  రూ.6,499, 4GB/64GB వర్షన్‌ రూ.7,499కి లభిస్తుంది.

మోటరోలా జీ13
Motorola G13 ఫోన్ వేగవంతమైన 90Hz డిస్‌ప్లే, స్టీరియో స్పీకర్‌లతో వస్తుంది.డాల్బీ అట్‌మాస్‌ సౌండ్‌ను ఇది విడుదల చేస్తుంది. కంటెంట్ కోసం వినియోగించేవారికి ఈ ఫోన్‌ అనువుగా ఉంటుంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 4GB/128GB వేరియంట్‌ ధర రూ.9,999.

పోకో సీ51
Poco C51 భారత్‌లో ఏప్రిల్‌లోనే లాంచ్‌ అయింది. 4GB/64GB వేరియంట్‌ ధర ప్రారంభంలో రూ. 8,499 ఉండగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 7,249లకే లభిస్తోంది. ఇది చూడాటానికి Redmi A2 ప్లస్‌ లాగే ఉంటుంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎం13
Samsung Galaxy M13 ఒక సంవత్సరం పాతదే అయినా నేటికీ దీనికి మంచి ఆదరణ ఉంది. ఈ ఫోన్‌ 4GB/64GB వేరియంట్‌ ధర ఇటీవల  రూ. 11,999 నుంచి రూ. 9,699కి తగ్గింది. దీంతో దీన్ని కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. డెడికేటెడ్ అల్ట్రావైడ్ శక్తివంతమైన కెమెరా సెటప్‌, 6,000mAh భారీ  బ్యాటరీ ఈ ఫోన్‌ ప్రత్యేకతలు.

ఇదీ చదవండి: Flipkart Big Bachat Dhamaal Sale: స్మార్ట్‌ఫోన్లపై సూపర్‌ డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement