Upcoming Smartphones: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మనం ఆగష్టు నెలలో విడుదలకానున్న కార్లను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతున్న స్మార్ట్‌ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
షావోమి మిక్స్ ఫోల్డ్ 3 (Xiaomi Mix Fold 3)
ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న షావోమి త్వరలో మిక్స్ ఫోల్డ్ 3 మొబైల్ లాంచ్ చేయనుంది. ఇది చైనా మార్కెట్లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం, భారతదేశంలో తరువాత కాలంలో విడుదలయ్యే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జాజ్ ఫోల్డ్ 5కి ప్రత్యర్థిగా ఉండనుంది.
వివో వీ29 సిరీస్ (Vivo V29 Series)
వివో కంపెనీకి చెందిన వీ29 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో వీ29 అండ్ వీ29 ప్రో ఉండనున్నాయి. ఇది కూడా చైనా మార్కెట్లో విడుదలైన తరువాత భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
రియల్‌మీ జీటీ 5 (Realme GT 5)
2023 ఆగష్టు నెలలో రియల్‌మీ తన జీటీ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్ ఉంటుంది, అదే సమయంలో 144 Hz ఓఎల్ఈడీ డిస్ప్లే పొందుతుంది. అద్భుతమైన కెమెరా సెటప్ తప్పకుండా కొనుగోలుదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రం ఈయన సొంతం - వెహికల్స్ ఫ్యూయెల్‌కే వందల కోట్లు..
ఇన్‌ఫినిక్స్ జీటీ 10 ప్రో (Infinix GT 10 Pro)
ఇన్‌ఫినిక్స్ తన జీటీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆగష్టు 03న ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. ఈ మొబైల్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్‌సెట్ ఉంటుందని తెలుస్తోంది. ధరలు & ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్
రెడ్‌మీ 12 5జీ (Redmi 12 5G)
రెడ్‌మీ కంపెనీ ఆగష్టు 01న మరో కొత్త 5జీ మొబైల్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో గట్టిపోటీనిచ్చే విధంగా కంపెనీ దీనిని రూపొందించింది. ఇందులో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్, 90Hz FHD+ డిస్ప్లేతో 5000 mAh బ్యాటరీ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment