
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ (Samsung) తన గెలాక్సీ ఎ-సిరీస్ లైనప్‌లో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. అవి శాంసంగ్ గెలాక్సీ ఎ56, గెలాక్సీ ఎ36, గెలాక్సీ ఎ26. ఆకట్టుకునే ఫీచర్లు, ఆకర్షణీయ ధరలో విస్తృత శ్రేణి వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ డివైజ్ లను రూపొందించారు. వీటిలో ఏయే స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.. ధరలెంత అన్న విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గెలాక్సీ ఎ56
గెలాక్సీ ఎ56 కొత్త లైనప్ లో ఫ్లాగ్ షిప్ మోడల్. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎక్సినోస్ 1580 చిప్ సెట్ తో నడిచే ఏ56 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లను అందిస్తుంది.. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ డ్యూయల్ 5జీ సిమ్ కార్డులకు సపోర్ట్ చేస్తుంది.
కెమెరా సామర్థ్యాల విషయానికి వస్తే, గెలాక్సీ ఎ56లో విభిన్న ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ కూడా ఉంది.
గెలాక్సీ ఎ56 మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి ఆసమ్ ఆలివ్, ఆసమ్ లైట్‌గ్రే, ఆసమ్ గ్రాఫైట్. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.41,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.44,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.47,999గానూ కంపెనీ నిర్ణయించింది.
గెలాక్సీ ఏ36
గెలాక్సీ ఎ36 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో సహా అనేక ఫీచర్లను ఎ56లో మోడల్‌లో ఉన్నట్లుగానే ఉంటాయి. అయితే ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ను అందించారు. ఏ36లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇచ్చారు.
గెలాక్సీ ఏ36లో కెమెరా సెటప్ విషయానికి వస్తే ఓఐఎస్‌తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఇక ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్. ఎ56 మాదిరిగానే ఎ36 కూడా 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ కూడా ఉంది.
గెలాక్సీ ఎ36 లావెండర్, బ్లాక్, వైట్ రంగులలో లభిస్తుంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.32,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.35,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.38,999గానూ నిర్ణయించారు.
గెలాక్సీ ఏ26
గెలాక్సీ ఎ26 కొత్త లైనప్ లో అత్యంత చవక మోడల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + సూపర్ అమోలెడ్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ పై పనిచేసే ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు.
గెలాక్సీ ఏ26లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ ఉంది.
గెలాక్సీ ఏ26 ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. బ్లాక్, వైట్, మింట్, పీచ్ పింక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment