Xiaomi Redmi 11 5G Specs and Release Date Revealed - Sakshi
Sakshi News home page

Xiaomi Redmi 11 5G: తక్కువ ధరకే, అదిరిపోయే రెడ్‌ మీ 5జీ స్మార్ట్‌ ఫోన్‌!

Published Sun, May 29 2022 6:29 PM | Last Updated on Mon, May 30 2022 11:57 AM

Xiaomi Redmi 11 5G specs and release date revealed - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ షావోమీ సబ్‌ బ్రాండ​ రెడ్‌మీ తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయనుంది. రెడ్‌మీ 11 5జీతో రానున్న ఈ ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో జూన్‌ నెలలో విడుదల కానుండగా..ఈ ఫోన్‌ ధర, ఫీచర్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం

6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్‌, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్,   మెయిన్‌ కెమెరా 50 మెగాపిక్సెల్‌గా ఉంటుందని తెలుస్తోంది.  ఈ ఫోన్‌ వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉండగా 50 మెగాపిక్సెల్ మెయిన్‌ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంటాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను రెడ్‌మీ డిజైన్‌ చేసింది

 భారత్‌ మార్కెట్‌లో జూన్ నెలలో విడుదల కానున్న ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే  4జీబీ ర్యామ్ ప్లస్‌ 64జీబీ స్టోరేజ్ ఉండే వేరియంట్ ధర రూ.13,999 ధరగా ఉండనుంది. అయితే షావోమీ త్వరలోనే ఈ మొబైల్‌ గురించి మరిన్ని విషయాల్ని వెలడించనుంది. టీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement