
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తాజాగా ‘ఎక్స్‌టీ’ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదలచేసింది. నూతన సిరీస్‌లో 64 మెగాపిక్సెల్ (ఎంపీ) క్వాడ్–కెమెరా సిస్టమ్ ఉన్నట్లు కంపెనీ ప్రకటించగా, భారత్‌లోనే ఈస్థాయి కెమెరా సామర్థ్యాన్ని కలిగిన స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఇదే కావడం విశేషం. సెల్ఫీ కెమెరా 16 ఎంపీ కాగా.. 6.4–అంగుళాల పూర్తి హెచ్‌డి సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇందులో స్పెసిఫికేషన్లుగా వివరించింది. మొత్తం మూడు వేరియంట్లలో ఎక్స్‌టీ లభిస్తుండగా.. 4జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ. 15,999.. 6జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ. 16,999 వద్ద నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment