
మార్కెట్లో ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. జాబితాలో ఇన్ఫినిక్స్ కూడా ఉంది. ఈ కంపెనీ నవంబర్ 2024లో తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పుడు ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ సరికొత్త ఫోన్ మార్చి 3 నుంచి 6 వరకు జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2025 కంటే ముందే కనిపించింది. అయితే సంస్థ ఈ ఫోన్ లాంచ్ డేట్, హార్డ్‌వేర్ వివరాలను వెల్లడించలేదు.
ఇన్ఫినిక్స్ జీరో సిరీస్ మినీ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్.. డ్యూయల్ హింజెస్, ట్రిపుల్-ఫోల్డింగ్ మెకానిజం పొందుతుంది. ప్రత్యేకమైన డిజైన్ కలిగిన ఈ ఫోన్‌ను ఫోల్డ్ చేసినప్పుడు డ్యూయెల్ ఫోల్డ్ మొబైల్ మాదిరిగానే కనిపిస్తుంది. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీలు తీసుకోవడానికి పంచ్-హోల్ కెమెరా ఉన్నాయి.
కంపెనీ లాంచ్ చేయనున్న మినీ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్.. జిమ్ పరికరాలు, సైకిల్ హ్యాండిల్‌బార్లు, కార్ డాష్‌బోర్డ్ వంటి వాటికి ఫిక్స్ చేయవచ్చు. దీనికోసం ఇందులో ఒక పట్టీ కూడా ఉంది. సంస్థ ఈ ఫోన్ గురించి చాలా వివరాలను వెల్లడించలేదు. ఇవన్నీ త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
మార్కెట్లో ఇప్పటి వారు ఉన్న ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్స్
గ్లోబల్ మార్కెట్లో.. ప్రస్తుతానికి హువావే మాత్రమే ట్రిపుల్-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కాగా 'గెలాక్సీ జీ ఫోల్డ్' పేరుతో శామ్‌సంగ్ ఓ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనిని కంపెనీ ఏప్రిల్ 2025లో లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది శామ్‌సంగ్ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7లతో పాటు గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో లాంచ్ అవుతుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: రోజుకో రేటు వద్ద బంగారం: ఎందుకో తెలుసా?
కొత్త శామ్‌సంగ్ గెలాక్సీ జి ఫోల్డ్ మొబైల్.. హువావే మేట్ XT కంటే భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.49 ఇంచెస్ కవర్ డిస్‌ప్లే, 9.96 ఇంచెస్ మెయిన్ ఫోల్డబుల్ డిస్‌ప్లే ఉండవచ్చు. ఈ కొలతలు మేట్ ఎక్స్‌టి కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇది పరిమాణంలో కొంచెం పెద్దది. లాంచ్ అయినప్పటికీ, గెలాక్సీ జి ఫోల్డ్ లాంచ్ అయిన వెంటనే అమ్మకానికి రాకపోవచ్చు. గెలాక్సీ ఫోల్డ్ స్పెషల్ ఎడిషన్‌గా మాత్రమే పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే అవకాశం ఉంది.